
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కోపమొచ్చింది. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు కూడా అసెంబ్లీ హాల్‌కు వచ్చారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే..
అంతటితో ఆయన ఆగలేదు. అనుచరులను తీసుకొని రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్‌లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది.