irritation
-
Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే?
ఓ పక్క దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ మరోసారి విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కేరళ రాష్ట్రంలో పిల్లలను ‘టొమాటో ఫీవర్’ వణికిస్తోంది. నిజానికి పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా వచ్చే ఈ జ్వరంతో మరింతగా ఆందోళనపడుతున్నారు. నాలుగైదు వారాలుగా వ్యాధి విస్తృతంగా ఉన్న కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలను బెంబేలెత్తిస్తున్న ‘టొమాటో ఫీవర్’పై అవగాహన కోసం ఈ కథనం. కొద్దిగా ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఈ జ్వరం డెంగీ లేదా చికన్‌గున్యా తరహాకు చెందిదా లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్సా (ఆర్ఎస్వీ) లేక అడినో వైరస్సా లేదా రైనోవైరసా అనే అంశం మీద నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. లక్షణాలు : ► తీవ్రమైన జ్వరం (హైఫీవర్) ► ఎర్రటి టొమాటోపండు రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్) / ర్యాష్ ► ఒళ్లంతా దురద. ► చర్మం ఎండిపోయినట్లుగా ఉండటం (డీహైడ్రేషన్) ► అలసట ► కీళ్లనొప్పులు ► కడుపులో కండరాలు పట్టేయడం ► వికారం / వాంతులు ► నీళ్లవిరేచనాలు ► దగ్గు ► ముక్కుకారుతుండటం ► కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లో ఒంటిపై మచ్చలతో పోలిస్తే... కాళ్లూ–చేతులపై ఉండే మచ్చల రంగు ఒకింత మారి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. చికిత్స: ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) అందిస్తారు. పిల్లలకు ఉపశమనం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తుండాలి. బాగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. కంటినిండా నిద్రపోయేలా చూడాలి. సూచన : పేరుకు మాత్రమే దీన్ని టొమాటో ఫ్లూ / టొమాటో ఫీవర్ అంటారు. నిజానికి దీనికీ టొమాటోలకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది సాధారణ ప్రజలూ గుర్తుపెట్టుకోడానికి వీలుగా పెట్టిన పేరు మాత్రమే. ఇది టొమాటోల వల్ల ఎంతమాత్రమూ రాదు. కాబట్టి ఇది సోకినవారు, ఇతరులూ టొమాటోలను నిరభ్యంతరంగా తినవచ్చు. వాటిలోని పోషకాలు, విటమిన్లతో మంచి వ్యాధినిరోధక శక్తి చేకూరుతుందనీ, ఫలితంగా టోమాటోఫీవర్తో పాటు అనేక జబ్బులను నివారించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చదవండి: Health Tips: తరచూ చింత చిగురును తింటే.. నివారణ ► ఇది అంటువ్యాధి కావడం వల్ల సోకిన పిల్లల నుంచి ఇతరులను దూరంగా ఉంచాలి. ► పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో చాలావరకు నివారణ సాధ్యం. ► వ్యాధి సోకిన పిల్లల దుస్తులు, వస్తువులు, ఆటబొమ్మలు... ఇతరులు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ పేరెలా వచ్చిందంటే... ఇది సోకిన పిల్లల ఒంటి మీద టొమాటో రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్), ర్యాష్ ఏర్పడతాయి. దాంతో ఈ రుగ్మతను టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిపించే ఇది... అంతకంటే పెద్దపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ చాలా చాలా అరుదుగా మాత్రమే సోకుతుంది. -
ఇలా చేస్తే చికాకు దానంతట అదే దూరమవుతుంది..!
పగలు జరిగిన విషయాలను మెదడులో నిల్వ చేసుకోవడం మంచిదా? కాగితం మీద పెట్టడం మంచిదా? తీపి జ్ఞాపకాలైతే మెదడు సంతోషంగానే నిక్షిప్తం చేసుకుంటుంది. మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ మది మురిసిపోతుంటుంది. అలా కాకుండా ఆ రోజు చేసిన పనులు, చికాకులు చిరాకు పెడుతుంటే మాత్రం వాటిని మెదడులో మోయాల్సిన పని లేదు. బుర్ర మీద అంత బరువు పెట్టవద్దు, ఏ రోజుకారోజు తేలిక పరుచుకోవాలి. కందిరీగల్లా తిరుగుతున్న విషయాలన్నింటినీ బుర్రలో నుంచి ఒక కాగితం మీదకు బదలాయించండి. బ్రెయిన్ డంప్ చేయడం అన్నమాట. చికాకు దానంతట అదే దూరమవుతుంది. మెదుడు హాయిగా విశ్రాంతిలోకి వెళ్తుంది. మనమూ మంచి నిద్రలోకి జారుకుంటాం. ఉదయం తాజాగా రోజును మొదలుపెట్టవచ్చు. అలా చేయనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మంచి–చెడుల పట్టిక రోజంతా పని చేసిన తర్వాత దేహం అలసిపోయి ఉంటుంది. కంప్యూటర్ స్క్రీన్ మీద పని చేసిన వాళ్లకు ఆ పని ఆపేసిన తర్వాత కనీసం రెండు గంటల సేపు నిద్రరాదు. పదకొండుకో, పన్నెండుకో నిద్రలోకి జారుకున్న తర్వాత ఆ నిద్రలో మెదడు విశ్రాంతి దశకు చేరదు. పగలు జరిగిన పనుల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ లోగా తెల్లవారు జామున మూడింటికి మెలకువ వచ్చేస్తుంది. ఇక మెదడు ఆ రోజు చేయాల్సిన పనులను గుర్తు చేస్తుంటుంది. ఎలా చేయాలో సూచనలు చేస్తుంటుంది. మెదడు అప్పటికి రిలాక్స్ అయి తెల్లవారు జామున విశ్రాంతికి సిద్ధమవుతుంటుంది. ముంచుకు వచ్చే నిద్రను వదిలించుకుని బలవంతంగా రోజు మొదలు పెట్టినా సరే... ఆఫీస్‌లో పనిగంటల్లో మెదడు మొరాయిస్తుంటుంది. ఇన్ని అసౌకర్యాలను సున్నితంగా తుడిచివేసే పరిష్కారమే బ్రెయిన్ డంప్. వెల్బీయింగ్ గురించి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నిర్వహించిన ఓ సదస్సులో ఒక సైంటిస్ట్ ఈ అంశం మీదనే పేపర్ ప్రెజెంట్ చేశారు. బ్రెయిన్ డంప్ అనే పదం కూడా సైంటిస్ట్ సూచించినదే. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక పేపర్ మీద ఆ రోజు జరిగిన మంచి పనులు, సంతోషాన్నిచ్చిన విషయాలు రాసుకోవాలి. అలాగే బాధ కలిగించిన విషయాలను ఒక కేటగిరీలో, ఒత్తిడి, చికాకు కలిగించిన వాటిని ఒక కేటగిరీగానూ, వాటికి పరిష్కారాలను మరో కాలమ్‌లోనూ రాసుకోవాలి. వాటన్నింటినీ ఒకసారి చూసుకుని రేపటి రోజున చేయాల్సిన పనులను కూడా నోట్ చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే... డైరీ రాసుకున్నట్లేనన్నమాట. ఇలా రాయడం వల్ల మెదడు తేలికపడుతుంది. స్మార్ట్ ఫోన్లో వచ్చి పడిన మంచి–చెడు, అవసరం ఉన్న– అవసరం లేని మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలను వర్గీకరించుకుని డిలీట్ చేస్తూ ఫోన్ మెమరీ బరువు తగ్గించుకున్నట్లే ఇది కూడా. -
'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో'
-
'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో'
మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ప్రయాణికులు వారి చేష్టలతో విసుగు తెప్పింస్తుంటారు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా చికాకు కలగడం సహజం. తాజాగా అమెరికన్ ఎయిర్ప్లైట్లో ఒక వ్యక్తి తన చేష్టలతో ముందు సీటులో కూర్చున్న మహిళకు ఇబ్బంది కలిగించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 1.45 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఒక వ్యక్తి మహిళ కూర్చున్న ముందు సీటును అదేపనిగా తన చేతులతో పంచ్‌లు కొడుతూ చికాకు కలిగించాడు. అయితే మహిళ మాత్రం అతని చేష్టలతో ఏమాత్రం విసుగు చెందకుండా కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా అతన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయింది. అయితే ఇదంతా మహిళ పక్కనే కూర్చున్న అమైకా అలీ అనే యువతి వీడియో తీసి తన ట్విటర్లో షేర్ చేసింది. 'అతని చేష్టలు చిన్నపిల్లాడిని గుర్తుచేస్తున్నాయి. వేరేవాళ్ల సంగతేమో కానీ నాకు మాత్రం అతని చేసిన పని న్యూసెన్స్‌గా అనిపించింది. అయితే నా పక్కనున్న మహిళ మాత్రం అతన్ని ఏమనకుండా అలాగే ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది' అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..'ఇలాంటి వారిని ఫ్లైట్ ఎందుకు ఎక్కనిస్తారు... అతని చేష్టలు చిన్నపిల్లాడిని తీరును తలపిస్తుంది... ఆ వ్యక్తి అంతగా చికాకు పెడుతున్నా మహిళ ఏమనకపోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం' అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. A little concerned that @AmericanAir didn’t feel this was a problem. Not sure about the rest of you, but I would surely consider someone continually tapping on the back of my seat to be a nuisance. https://t.co/DmRKUpA36O pic.twitter.com/Xts7hfQAcw — Amica Ali 💙 (@AmicaAli) February 8, 2020 -
నిద్రలేదు... అంతా చికాకు... ఏం చేయాలి?
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. తగిన సలహా ఇవ్వగలరు. - కమలాకర్, బెంగళూరు మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
స్మార్ట్ ఫోన్లతో జర జాగ్రత్త!
స్మార్ట ఫోన్లతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. స్మార్ట్ ఫోన్లకు అపరిమితమైన ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుండటంతో జనం ప్రయాణాల్లో కూడా వాటిని వదలట్లేదు. దీంతో చికాకు, ఆత్రుత పెరుగే అవకాశం ఉందని తాజా అధ్యయనాల ద్వారా కనుగొన్నారు. స్మార్ట్ ఫోన్లలో అత్యంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడటం 'వెబ్ డిపెండెన్స్ యాంగ్జయిటీ'కి దారితీస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల మనుషుల్లో తెలియని చికాకు, ఆత్రుత పెరుగుతుందని, విషయాలను సునిశితంగా ఆలోచించే శక్తి కోల్పోయి, ఆగ్రహావేశాలకు లోనయ్యే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. యువకులు, విద్యావంతుల్లో ఎక్కువగా ఈ వెబ్ డిపెండెన్స్ సమస్య వస్తోందని తైవాన్ లోని టైచుంగ్ నేషనల్ చిన్-యి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు హుయి జెన్ యాంగ్ తెలిపారు. సాంకేతికత వాడకాన్ని బట్టి మన మనస్తత్వం మారే అవకాశం ఉంటుందని ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో వివరించారు. ఒక వ్యక్తి తన భద్రత కోసం మరొకరితో సన్నిహితంగా ఉండటంవల్ల పొందే మానసిక పరివర్తన సిద్ధాంతాన్ని పోలుస్తూ ఈ కొత్త పరిశోధనలకు ఉదాహరణగా జోడించారు. సదరు వ్యక్తి దగ్గరగా ఉన్నపుడు ప్రశాంతంగా ఉండటం, లేకపోతే ఆత్రుతకు లోనవ్వడం వంటి మానసిక పరివర్తనను పరిశోధకులు తమ అధ్యయనాల్లో వినియోగించారు. ఒకరికి ఒకరు దూరమైనప్పుడు కలిగే ఆత్రుత..స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ల కు దూరమైనప్పుడు కూడా కలిగే అవకాశం ఉందని పరిశోధనకులు కనుగొన్నారు.