AP Assembly Budget Session 2024
-
మహిళలకు మంత్రి సవిత క్షమాపణలు చెప్పాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ..‘సభలో మంత్రి సవిత తీవ్ర అభ్యంతరమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సవిత తక్షణమే రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి. మంత్రి పదే పదే సభలో కాపుల గురించి ప్రస్తావించారు. కాపులు ఓటేశారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఆరు నెలల్లో కాపులకు ఏం చేశారో మీరు సమాధానం చెప్పాలి. పది వేల కోట్లు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు. దేశంలో ఎవరూ చేయనంత సంక్షేమం కాపులకు వైఎస్ జగన్ చేశారు. బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారనడం దుర్మార్గం అని మండిపడ్డారుఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ..‘సభలో బాధ్యత గల మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచితమైన వ్యాఖ్యలతో కించపరిచేలా మాట్లాడుతున్నారు. మంత్రి సవిత మహిళలను అవమానించేలా మాట్లాడారు. సంక్షేమాన్ని అద్భుతంగా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్. మహిళలు గంజాయి, మద్యానికి బానిసలైపోయారనడం దారుణం. సభ్య సమాజం తలదించుకునేలా మంత్రి సవిత వ్యాఖ్యానించారుఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనార్టీలను అవమానించేలా కూటమి నేతల వైఖరి ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్..హోంమంత్రిని చులకన చేసి మాట్లాడారు. దళిత హోంమంత్రి పదవిలో ఉండటం వల్లే చులకనగా మాట్లాడారని మేం భావిస్తున్నాం. మంత్రి సత్యకుమార్ ముస్లిం, మైనార్టీలను కించపరిచేలా మాట్లాడారు. ఈరోజు మంత్రి సవిత.. మహిళలు గంజాయి, మద్యానికి అలవాటైపోయారంటున్నారు. మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్దలు ఉన్నారని మేం భావిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో 25 శాతం పేదలకు సీట్లు కేటాయించాలని చట్టం చెబుతోంది. వైఎస్ జగన్ అమ్మఒడి ద్వారా పేదలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్ధుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవి. ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలి.ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. అమాయకులను స్టేషన్లకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, పవన్, హోంమంత్రి చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన పెట్టిన తప్పుడు పోస్టులపై ఎందుకు మాట్లాడరు. మంత్రులను చెప్పులతో కొడతానని పవన్ మాట్లాడలేదా?. వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్లు పవన్ మాట్లాడలేదా?. పవన్ కళ్యాణ్ చేసింది నేరం కాదా?. మేం మాట్లాడితేనే నేరమా?. ప్రజా గొంతుకై మాట్లాడితే మాగొంతు నొక్కేస్తారా. కేసులకు మేం భయపడం.. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం అని అన్నారు. -
AP: అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు పదో రోజు లైవ్ అప్డేట్స్.. -
బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ: కన్నబాబు
సాక్షి ,గుంటూరు: అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. 30 వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారని పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని.. మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలే ఒప్పుకున్నారన్నారు.‘‘పచ్చిఅబద్ధాలు ప్రచారం చేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రుషికొండ భవనాలపై రాష్ట్ర ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ లేదని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు మాటలు నమ్మి వాలంటీర్లు మోసపోయారు. వాలంటీర్లను మోసం చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే ఒప్పుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.’’ అని కన్నబాబు నిలదీశారు.‘‘టీడీపీ అబద్దాల పునాదుల మీద బతుకుతోంది. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పులు అని, రాష్ట్రం శ్రీలంకగా మారుతోందని ప్రచారం చేశారు. చివరికి రూ.6 లక్షల కోట్లేనని తేలింది. 30 వేల మంది మహిళలు అక్రమ రవాణా జరిగిందని పవన్ కళ్యాణ్ విషప్రచారం చేశారు. 46 మంది మాత్రమే అని అసెంబ్లీ సాక్షిగా నిగ్గు తేలింది. రూ.3 వేల కోట్లు రంగుల కోసం ఖర్చు చేశారని పవన్, చంద్రబాబు ఆరోపణలు చేశారు. కానీ అదే పవన్ కల్యాణ్ అసెంబ్లీలో రంగులు వేయటానికి, తొలగించటానికి రూ.101 కోట్లేనని చెప్పారు..రిషికొండ మీద ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాలు కట్టారని నిసిగ్గుగా ఆరోపణలు చేశారు. కానీ ఇవాళ అన్ని అనుమతులు ఉన్నాయని అసెంబ్లీలో చెప్పారు. వాలంటీర్లకు రూ.10 వేల జీతం ఇస్తానని చెప్పి, ఇప్పుడు అసలు వాలంటీర్ల వ్యవస్థ లేదని అబద్దాలు చెప్తున్నారు. ఇంత మాట్లాడటానికి ఏమాత్రం సిగ్గు అనిపించటం లేదా?. గత అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు. ఈ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థేలేదన్నారు. 2023 ఆగస్టు నుంచి ఆ వ్యవస్థే లేదని చెప్తూ మరి మే నెల వరకు ఎలా జీతాలు ఇచ్చారు?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘వాలంటీర్లు న్యూస్ పేపర్ కొనేందుకు ఇస్తున్న రూ.200 లను కట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు. మరి వాలంటీర్లు లేకపోతే ఆ జీవో ఎలా ఇచ్చారు?. ఉచిత ఇసుక పేరుతో ట్రక్కు రూ.26 వేల చొప్పున అమ్ముతున్నారు. రాష్ట్రమంతటా నిర్మాణాలు ఆగిపోయాయి. గ్రామాల్లో బహిరంగంగా మద్యం బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలే బెల్టుషాపులు తెరిచారు. మద్యం ధరలను తగ్గించకుండా మోసం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు 30 నుండి 50 శాతం వరకు పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు పన్నులు వేయటమే సంపదను సృష్టించటం అంటారా?’’ అని కన్నబాబు ప్రశ్నించారు.బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారింది. చంద్రబాబు సీఎం అయ్యాక తొలిసంతకం పెట్టిన మెగా డీఎస్సీకి ఇప్పటికీ దిక్కూమొక్కులేదు. ఉచిత గ్యాస్ సిలెండర్లకు నిధుల కేటాయింపే చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక హత్యలు, దోపిడీలు, అరాచకాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారులు టీడీపీ నేతలు చెప్పిందే చేస్తూ కాలం గడుపుతున్నారు. సామాన్యుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ గడప ఎక్కే పరిస్థితే లేదు. మా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీద 8 అక్రమ కేసులు నమోదు చేశారు..స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టమని లోకేష్ చెప్పాడు. మరి ఇప్పుడు స్మార్ట్ మీటర్లను ఎలా పెడుతున్నారు?. అప్పుడు ఉరితాడులు అన్న స్మార్ట్ మీటర్లు ఇప్పుడు పసుపు తాడులుగా మారాయా?. గీత కార్మికులకు ఒక్క మద్యం షాపు కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టు అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పారు. గతంలో కుల కార్పొరేషన్లను తప్పుపట్టున చంద్రబాబు ఇప్పుడు అవే కార్పొరేషన్లను ఎలా కొనసాగిస్తున్నారు?. అప్పుల గురించి చంద్రబాబు, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడు వేర్వేరుగా లెక్కలు చెప్పారు. కాగ్ చెప్పిన లెక్కలు నిజమా? లేక ఈనాడు పత్రిక, టీడీపీ నేతలు చెప్పిన లెక్కలు నిజమా?..రాష్ట్ర పరపతిని దెబ్బతీసే కథనాలు పత్రికలో వస్తే ఆర్థిక శాఖ ఎందుకు ఖండించటం లేదు?. అసలు కాగ్ లెక్కలు కరెక్టా? మీ కాకి లెక్కలు కరెక్టా?. ఈ ఐదు నెలల్లోనే రూ.50 వేల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుది. గతంలో మాపై చేసినవి పచ్చి అబద్దాలని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. పబ్లిసిటీ స్టంటు, మీడియా మేనేజ్మెంట్తో ఎక్కువ కాలం ఏ ప్రభుత్వమూ నిలపడలేదు’’ అని కురసాల కన్నబాబు చెప్పారు. -
అక్రమ అరెస్టులపై బుట్టా రేణుక ఫైర్
-
కర్నూలులోనే హైకోర్టు.. వైఎస్సార్సీపీ డిమాండ్
సాక్షి, కర్నూలు: కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటుకు మంత్రి ఫరూక్ తీర్మానం ప్రవేశం పెట్టారు. ఈ సందర్భంగా హైకోర్టు ఏర్పాటుపై శాసన మండలిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాట్లాడుతూ, శ్రీబాగ్ ఒప్పందంలో ఏముందో మంత్రి భరత్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కర్నూలులో హైకోర్టు బెంచ్ కాకుండా హైకోర్టు ఏర్పాటు చేయాలని.. గతంలో బీజేపీ కూడా డిక్లరేషన్ చేసిందని ఆయన గుర్తు చేశారు.హైకోర్టును కర్నూలులో పెట్టాలని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో పెట్టిందని.. ఇప్పుడు హైకోర్టు కాకుండా హైకోర్టు బెంచ్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కర్నూలులో న్యాయ రాజధాని రాకుండా గతంలో కూటమి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. కర్నూల్లో హైకోర్టు పెట్టాలని బీజేపీ గతంలో డిక్లరేషన్ చేసిందన్నారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించిందని ఆయన తెలిపారు. -
‘మీ మద్దతే కదా ఉంది.. ప్రధాని మోదీని ఒప్పించలేరా?’
అమరావతి, సాక్షి: విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో.. కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కల్యాణి మీడియాతో మాట్లాడారు.‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యుటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంత మందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు.. చంద్రబాబు,పవన్ పై కేంద్రం ఆధాపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు. ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు,పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి... స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ పై ఉంది. ఎన్నికల్లో చంద్రబాబు,పవన్ చెప్పిన మాటల వల్లే ఉత్తరాంధ్ర ప్రజలు ఓటేశారు. అలాంటిది.. కార్మికులను మోసం చేయడం చాలా దారుణం... ఇద్దరు ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్లెందుకు చేయలేరు?. చత్తీస్ ఘడ్ లోని నాగర్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటను వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వల్లే 2024 వరకూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్నిరకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు.. కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి అని కల్యాణి డిమాండ్ చేశారు. -
‘స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ: మేం పోరాడతాం.. మీరు ఆపలేరా?’
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్.. స్టీల్ ప్లాంట్ నడపటం చాలా కష్టం, దానికి మైన్స్ కావాలి.. లాభాల్లోకి రావాలంటూ కామెంట్స్ చేశారు. తాము ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పేశారు.ఏపీలో అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల సందర్బంగా నేడు శాసన మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు అడుగులు పడుతున్నాయి మూడు బ్లాస్ట్ ఫర్నేష్లలో రెండు మూత పడ్డాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేస్తారా లేదా?. ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వం అని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రైవేటీకరణ వేగంగా జరుగుతుంటే ఆపే ప్రయత్నం చేశారా?. ఇద్దరు ఎంపీలు ఉన్న కర్ణాటకలో ఉక్కు మంత్రి ఆ రాష్ట్రంలో భద్రావతి స్టీల్ ప్లాంట్‌కు 30వేల కోట్లు ఆర్థిక సహాయం తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రధాన మంత్రిని ఆడిగారా? అని ప్రశ్నించారు.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘మాకు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే అఖిలపక్ష సమావేశం మేము వేయలేదు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వలేదు. స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంట్‌తో కూడిన అంశం. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. మంత్రులు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సమంజసం కాదు. ఈ ఆరు నెలల్లో స్టీల్ ప్లాంట్ భూములను రెండు దఫాలుగా వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు. మా నాయకుడు ప్రధానమంత్రి దగ్గరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మేము పోరాడుతాం. పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ సమాధానం ఇస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా భావోద్వేగమైన అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమే కానీ.. దానిని నడపడానికి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి మైన్స్ కావాలి, లాభాల్లోకి రావాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక, చివరగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్‌పై తీర్మానం అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.అనంతరం, కూటమి సర్కార్ తీరుపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రుల వ్యాఖ్యలపై నిరసన చేపట్టారు. అలాగే, తీర్మానం చేయాలని కోరారు. దీంతో, చెర్మన్ మండలిని వాయిదా వేశారు. -
AP Assembly: వాడీవేడిగా మండలి సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఊహించినట్లుగానే.. ఏకపక్షంగా సాగుతోంది. హామీలను ఎగవేసే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. -
ఏపీ అసెంబ్లీలో తప్పుడు లెక్కలు.. అనవసర ప్రసంగాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తప్పుడు లెక్కలతో, అసత్య ఆరోపణలతో, అనవసరమైన ప్రసంగాలతో ఎనిమిదో రోజుకి చేరింది. ఓవైపు వైఎస్సార్సీపీ బహిష్కరణతో శాసనసభ ఏకపక్షంగా నడుస్తుండగా.. శాసనమండలిలోనైనా కనీసం వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు పొంతన లేని వివరణలతో నెట్టుకొస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా.. ఇవాళ.. అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయగా.. దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. అటు శాసనసభలోనూ చంద్రబాబు సైతం వ్యక్తిగత గొప్పలతో సభలో కాలయాపన చేశారు.ఏపీ అప్పులపై మండలిలో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2024 జూన్ నాటికి 4,91,734 కోట్లు బడ్జెట్ అప్పులు ఉన్నాయని, కార్పొరేషన్ ల ద్వారా 1,54,797 కోట్లు అప్పులయ్యాయని అన్నారాయన. అదే టైంలో.. గత ప్రభుత్వం 9 లక్షల 74 వేల కోట్లు చేసిందంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఆ వెంటనే..ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘ ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ, మంత్రి సభలో ఆవు కథ చెప్తున్నారు. అప్పుల పై అన్ని పార్టీల తో కమిటీ వెయ్యండి. అప్పుడు.. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుస్తాం. అంతే కానీ ఈ ఆరోపణలు సమంజసం కాదు. వాస్తవాలు చెబితే అభ్యంతరం లేదు. మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. మంత్రులు ఏం చెప్తే అది చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?’’ బొత్స మండిపడ్డారు.నేను బుడమేరు బాధితుడ్నే: ఎమ్మెల్సీ రుహుళ్లశాసన మండలి బుడమేరు వరదల పై మండలి లో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ.. బుడమేరు కి 4 సార్లు వరద వస్తే 3 సార్లు చంద్రబాబు హయాంలో నే వచ్చింది. బుడమేరు ఆధునికీకరణ కోసం 2014 నుండి 2019 వరకు ఏమైనా ఖర్చు చేశారా?. బుడమేరు వరదల పై కేంద్ర బృందాలు ఎంత నష్టం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, ఎంత ఖర్చు చేశారు..?ఆపరేషన్ బుడమేరు నెల రోజుల్లో ప్రారంభిస్తాం అన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలి?. నష్టపరిహారం సక్రమంగా చేస్తే బాధితులు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రాహుళ్ల ప్రసంగిస్తూ.. నేను కూడా వరద బాధితుడిని. వరద వచ్చేముందు ప్రజలు కనీసం ప్రజలను అప్రమత్తం చెయ్యలేదు. అధికారులు ఏం చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రజలను ముంచేశారు. మజీద్ వెళ్లి వచ్చే లోపే మా ప్రాంత ప్రజలంతా ముంపుకి గురయ్యారు అని అన్నారు.అయితే బుడమేరు పరిధిలో ఆంధ్ర జ్యోతి రాధ కృష్ణ పవర్ ప్లాంట్ ఉందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గుర్తు చేశారు.ప్రభుత్వ ఉద్యోగాల లెక్క ఏది?శాసన మండలి.. ప్రభుత్వ ఉద్యోగ ల భర్తీ పై మండలి లో చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. ‘‘గత ప్రభుత్వం లో లక్ష 34 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం.2014 నుండి 2019 మధ్య లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలి’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రంలో అన్ని శాఖల ఖాళీల పై.మదింపు చేస్తున్నాం. ఇంకా ఖాళీల వివరాలు రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ వాకౌట్శాసన మండలి ట్రూ అప్ చార్జీల భారంపై వాడీవేడీ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం వేయం అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ట్రూ అప్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారు? అని ఎమ్మెల్సీ రవిబాబు ప్రశ్నించారు. దానికి మంత్రి మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిస్తూ.. ఈఆర్సీ ఆమోదించిన మేరకు ట్రూ అప్ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. అయితే..ప్రజలకు చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఈఆర్సీలో అఫిడవిట్ వెయ్యొచ్చు కదా అని ప్రశ్నించిన బొత్స.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు. ప్రజల పై విద్యుత్ చార్జీలు మోపినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది.హామీలపై సమీక్షలు జరుపుతున్నాం: చంద్రబాబుగత ప్రభుత్వం అప్పులు.. ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఇచ్చిన హామీలపై అనునిత్యం సమీక్షలు జరుపుతున్నాం. ఏదీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు’’ అని అన్నారాయన. అలాగే.. అధికారం తనకేం కొత్త కాదని.. సీఎం పదవి అంతకంటే కొత్త కాదని చెబుతూ.. నాలుగోసారి సీఎం కావడం అరుదైన అనుభవమని చెప్పారు. గత ప్రభుత్వమే రోడ్లకు గుంతలు పెట్టి వెళ్లిపోయిందని, దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం గేమ్ ఛేంజర్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. బాబు పాలనపై సంతృప్తి: పవన్విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ముందు.. ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. చంద్రబాబు 150 రోజుల పాలన సంతృప్తిగా ఉంది. చంద్రబాబు పాలనపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. -
అసెంబ్లీలో మళ్లీ కూన వర్సెస్ అచ్చెన్న!
అమరావతి, సాక్షి: ఉమ్మడి శ్రీకాకుళం ముఖ్య నేతల విబేధాలు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈసారి సొంత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయగా, మంత్రి అచ్చెన్నాయుడు కాస్త గట్టిగానే స్పందించారు.ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ ల కొనుగోలు లో అక్రమాలు జరిగాయంటూ కూన రవికుమార్ ఇవాళ అసెంబ్లీలో ఆరోపణలు గుప్పించారు. ‘‘లక్షా 30 వేలకు పక్క స్టేట్‌లో కొంటే.. మన రాష్ట్రం లో 2 లక్షల 4 వేలకు ఎందుకు కొనుగోలు చేశారు?. గోద్రెజ్ లాంటి కంపెనీలను పక్కన పెట్టి కోల్డ్ చైన్ లాంటి కంపెనీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు?’’ అని కూన ప్రశ్నించారు.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ.. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయ్. హారిజాంటల్ ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లను మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం కోరింది. ఫార్చ్యూన్ అనే కంపెనీ L1 కోట్ చేయడం తో వారికి టెండర్ వచ్చింది. మహారాష్ట్ర లో లక్షా 84 వేలు, కర్నాటక లో 2.27 లక్షలకు కొన్నారు... గోద్రెజ్ కంపెనీ వాళ్లకు టెండర్ రాలేదని రాద్ధాంతం చేసారు. విశాఖ లో ఒక గోద్రెజ్ డీలర్ దీన్ని వివాదం చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై మేము గోద్రెజ్ కంపెనీ కి లెటర్ రాసాం, మాకేం సంబంధం లేదని చెప్పారు. అయినా సభ్యులకు అనుమానాలు ఉన్నాయ్ కాబట్టి మరోసారి విచారణ చేయిస్తాం ’’ అని మంత్రి అచ్చెన్న అన్నారు. ఇక..ఈ సమావేశాల్లో మొన్నీమధ్యే ఇద్దరి మధ్య ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు.. ‘‘‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అని బదులిచ్చారు. అయితే ఇద్దరి మధ్య మాటలయుద్ధ తీవ్రతను తగ్గించేందుకు.. మధ్యలో స్పీకర్ అయ్యన్న జోక్యం చేసుకుని ఏదో జోక్ వేసే ప్రయత్నం చేశారు. -
‘‘వలంటీర్ వ్యవస్థే లేదు’’.. భగ్గుమన్న శాసనమండలి
సాక్షి, అమరావతి: వలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంటలు చేగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే సమాధానం వచ్చింది. ‘‘రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేనివ్యవస్థ ను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతాం అన్నాం. అసలు కొనసాగించలేదు.. కాబట్టి జీతాలు పెంచం’’ అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయులు బదులిచ్చారు. దీంతో మండలిలో మంటలు చెలరేగాయి. మంత్రి సమాధానంపై వైఎస్సార్సీపీ భగ్గుమంది. ‘‘ఎన్నికల్లో మీరు వలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.‘‘వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 5 వేలు వేతనాన్ని 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయ్యాక వాలంటీర్ల ను మోసం చేశారు’’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు.వలంటీర్ వ్యవస్థ విషయంలో వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది. -
‘పాలన చేతకాదా చంద్రబాబూ?’.. మీడియా ముందు నిలదీయనున్న వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: నిత్య అబద్ధాలు.. పాలనలోనూ గారడీ చేస్తున్న కూటమి సర్కార్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నిలదీయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ద్వారా మాట్లాడనున్నారుఏపీలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలన మొదలుపెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒకవైపు వైఎస్సార్సీపీపై ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తూనే.. మరోవైపు కీలక హామీల విషయంలో ప్రజలను మోసం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐదు నెలలు గడిచినప్పటికీ ఎన్నికల హామీల్లోని ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా.. జగన్ పాలనలో సమర్థవంతంగా సాగిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోతోంది.రైతులు, విద్యార్థులు, ఆడపడుచులు.. ఇలా అన్నివర్గాలు బాబు సర్కార్ చేతిలో మోసపోతున్నారు. జగన్ హయాంలోని సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తూ వస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. గత వైఎస్సార్సీపీ పాలనపై అడ్డగోలుగా ఆరోపణలు గుప్పిస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటిని తోడు.. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కూటమి ప్రభుత్వ కుట్రల పర్వం కొనసాగుతోంది.కనీసం అసెంబ్లీలో అయినా గళం వినిపించే అవకాశం లేకపోవడంతో మీడియా చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తున్నారు వైఎస్ జగన్. గత సమావేశంలో బడ్జెట్ లెక్కలను తీసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి.. చంద్రబాబు సర్కార్‌కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. 🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference tomorrow.📍Central Office, Tadepalli 🕒3:00 PM#StayTuned ❗ pic.twitter.com/OifvvJLAP5— YSR Congress Party (@YSRCParty) November 19, 2024 ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామంఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలే -
మహిళల భద్రత పట్టించుకోరా?: కూటమి సర్కార్‌పై వరుదు కల్యాణి ఫైర్
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ, 108, 104, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని.. వారి సమస్యలన్నింటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఉద్యోగుల సమస్యలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న వరుదు కల్యాణి.. నిన్న హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న నేరాలపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉన్న విశాఖలోనే మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్నారు. ఈ రోజు విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. నిన్న బాపట్లలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హోంమంత్రి ఉన్న విశాఖలో కొద్దీ రోజుల కిందట హత్యాయత్నం చేశారు. ఈ రోజుకి హత్యాయత్నం చేసిన నిందితుడిని పట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఇసుక కోసం, మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప.. మహిళల భద్రత కోసం కనీసం పట్టించుకోవడం లేదు.’’ కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.మండలిలో మంత్రులు అబద్దాలు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డిఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ, మండలిలో మంత్రులు, టీడీపీ శాసన మండలి సభ్యులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. రుషి కొండ భవనాలను వైఎస్ జగన్ జగన్ వ్యక్తిగత భవనాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రుషి కొండ భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రే మండలిలో ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పరిశీలనలో కూడా అత్యుద్భుతం గా ఉన్నాయని చెప్పారు. రుషి కొండ భవనం ప్రభుత్వ భవనంగా ఉంటుందే తప్ప వైఎస్ జగన్ భవనం కాదు...రుషి కొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. 2017లో నిర్మించిన అసెంబ్లీ ఎస్ఎఫ్టీ 14000తో నిర్మించారు. కనీసం మంత్రుల రూమ్‌లో వాష్ రూమ్ కూడా లేదు.. వర్షం వస్తే కారిపోయే పరిస్థితి. అబద్దాలతో కాలక్షేపం చేయడం కాకుండా వాస్తవాలపై చర్చకు రండి.. చర్చిద్దాం’’ అంటూ అప్పిరెడ్డి సవాల్ విసిరారు. -
రుషికొండ భవనాలకు అనుమతులున్నాయి: మంత్రి దుర్గేష్
సాక్షి, గుంటూరు: రుషికొండ భవనాలకు అనుమతులున్నాయని స్పష్టమైంది. శాసన మండలిలో ఈ విషయాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రకటించారు. రుషికొండ పర్యాటక భవనాలకు సీఆర్‌జెడ్, జీవీఎంసీ అనుమతులు ఉన్నాయన్నారు.కాగా, సభలో మంత్రుల మాటలు దారుణంగా ఉన్నాయని.. రండిచూసుకుందాం.. సిగ్గుందా అంటూ మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రిషికొండ భవనాలు ప్రభుత్వ భవనాలుగా కట్టాం. సీఎం, డిప్యూటీ సీఎం అందరూ చూసి వచ్చారు కదా? తత్కాలిక భవనాలకు అమరావతిలో ఫర్నిచర్‌తో కలిపి ఎస్ఎఫ్టీ 14 వేలు ఖర్చు చేశారన్నారు.రుషికొండలో కట్టినవన్నీ ప్రభుత్వ భవనాలు. ఆ భవనాలన్ని బాగా కట్టారని సీఎం, డిప్యూటీ సీఎం లే చెప్పారు కదా.. అందులో ఏదైనా లోపం జరిగితే విచారించుకోండి. అవి ప్రభుత్వ భవనాలు, వైఎస్ జగన్ సొంత భవనాలు కాదు కదా అని బొత్స ప్రశ్నించారు.మంత్రి మనోహర్ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బొత్సకు ఎందుకు మాట్లాడేందుకు అనుమతిచ్చారంటూ మంత్రి మనోహర్ ప్రశ్నించారు. మంత్రి మనోహర్ మీరు ఒక వైపే చూస్తున్నారు.. రెండో వైపు చూడండంటూ ఛైర్మన్ వ్యాఖ్యానించారు. -
మండలి: పంట నష్టపరిహారం ఇచ్చేదెప్పుడు?: వైఎస్సార్సీపీ నిలదీత
సాక్షి, గుంటూరు: శానస మండలిలో పంట నష్టపరిహారంపై కూటమి సర్కార్‌ను శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీశారు. గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేదని.. కూటమి ప్రభుత్వం వచ్చిన రైతులకు సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు.52 లక్షల మంది రైతులకు 10,500 కోట్లకు పైగా ఇవ్వాలని.. కానీ బడ్జెట్ లో 4500 కోట్లు పెట్టారన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. రైతులకు ఎప్పుడు నుంచి పెట్టుబడి సాయం అందిస్తారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.ఎమ్మెల్సీ రామససుబ్బారెడ్డి మాట్లాడుతూ, రైతులకు రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ కేంద్రంతో కలిపి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్, రబీ పోయింది కానీ, ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. -
AP Assembly: మండలిలో వైఎస్సార్సీపీ ఆందోళన
ఇవాళ 7వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసన సభ ప్రారంభం కానున్నాయి. -
అసెంబ్లీలో మంత్రి అనిత అనుచిత వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
AP Assembly : అసెంబ్లీలో కూటమి సర్కార్ సెల్ఫ్ గోల్
గత జగన్ ప్రభుత్వంపై చేసినవన్నీ అసత్య ప్రచారాలన్నీ.. కూటమి ప్రభుత్వ ప్రకటనలతోనే తేటతెల్లమైపోతోంది. మరోవైపు చర్చకు వైఎస్సార్సీ ఎమ్మెల్సీలకు సహకరించకుండా.. -
పవన్ ఆత్మవిమర్శ చేసుకో.. ఇది అసలు నిజం: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు జిల్లా: కూటమి సర్కార్ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల దుష్ప్రచారం బట్టబయలైందంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్సింగ్ కేసుల్లో 99.5 శాతానికిపైగా మహిళలను గత ప్రభుత్వంలోనే గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్లో స్పష్టం చేసింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు @JaiTDP, @JanaSenaParty చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైంది.గత @YSRCParty ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం.ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి… pic.twitter.com/vTBGvDWsKN— Roja Selvamani (@RojaSelvamaniRK) November 16, 2024 -
ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్‌గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..! -
AP Assembly Session: పేద ప్రజల కలలు నీరు కార్చిన కూటమి సర్కార్
సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై శాసనమండలిలో వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు నిలదీశారు. లెక్కలతో సహా అన్ని శాఖలపై.. -
AP: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా
AP Assembly Budget Session Day 3 Update అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడింది.అసెంబ్లీ మీడియా పాయింట్వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుబడ్జెట్పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారుపవర్ సెక్టార్ పై చర్చ జరగకుండా చేశారుఅనేక మీటింగ్ లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారుఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారుతమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారులోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారుబడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారుగతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.అరకొర బడ్జెట్ పెట్టి...నిధులు కేటాయించారు.ఈ బడ్జెట్‌తో తమ తలరాతలు మారిపోతాయని ప్రజలు ఆశపడ్డారు.దీపం పథకం కోసం కేటాయింపులు ఎంతమంది ఇస్తారనేది మేం ప్రశ్నించాం.రాష్ట్రంలో 2.7 కోట్ల మంది మహిళలున్నారు.ఒక్కొక్కరికి ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కలేవి.హోంమంత్రి గారు ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదు.దమ్ముంటే మీరు కేటాయించిన 3200 కోట్ల లెక్క చూపించండి.టీచర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయల్సభలో బడ్జెట్‌పై చర్చకు అడుగడుగా అడ్డుపడ్డారు.కావాలనే సభను పక్కదారి పట్టించారు.మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు.మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేం ప్రతిపక్ష హోదా ఉందని కోరాం.ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా... సభలో మైకు ఇవ్వకుండా అవమానించడం పద్దతేనా?చంద్రబాబు సభకు ఎందుకు రాలేదంటే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.ఎమ్మెల్సీ,వంకా రవీంద్రనాథ్నేను తొలిసారి బడ్జెట్ చర్చలో పాల్గొన్నాసభ చాలా హుందాగా సాగుతుందని భావించాప్రతిపక్ష పార్టీ సభ్యులను అధికారపార్టీ సభ్యులు మాట్లాడకుంటా చేశారుచర్చ జరగకుండా గతంలో ఎప్పుడో జరిగిన అంశాలు లేవనెత్తి నానా గొడవ చేశారురేపైనా ప్రతిపక్ష పార్టీకి అడ్డుకోకుండా అధికారపార్టీ సభ్యులు సంయమనం పాటించాలిసభ సజావుగా సాగేలా సహకరించాలి.మండలి రేపటికి వాయిదామండలిలో బడ్జెట్ లో వైస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడి..సంబంధం లేని అంశాల్ని ప్రస్తావన చేస్తూ సభలో గందరగోళం..అడుగడుగునా వరుదు కల్యాణి ని సభలో మాట్లాడకుండా అడ్డుకున్న టీడీపీ సభ్యులు..వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలుసభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ సూచించిన బొత్స..గందరగోళం నడుమ సభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ మంత్రులుబడ్జెట్పై వరుదు కల్యాణి ప్రసంగంవరుదు కల్యాణి మాట్లాడుతుండగా అడ్డు తగిలిన మహిళా మంత్రులుఅనిత, సవితలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన బొత్స, ఇతర ఎమ్మెల్సీలు బాబు సర్కార్‌ను ప్రశ్నించిన YSRC ఎమ్మెల్సీలుమండలిలో బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న వైస్సార్సీపీ MLC లు..2014 నుండి 2019 వరకు ప్రభుత్వంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్స్ నిర్వహించారుఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?ఇప్పుడు సంపద సృష్టిస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు..తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే 12 వేల కోట్లు కావాలి..అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకు 20వేల కింద ఇస్తే 10716 కోట్లు కావాలిమహిళలకు 18 వేల చెప్పునిస్తే 32400 కోట్లు కావాలిఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదు..కుంభ రవిబాబు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది..సూపర్ సిక్స్ కి 74,287 కోట్లు కావాలి..ఎన్నికల ముందు కొట్టిన డప్పు.. బడ్జెట్లో మొగ లేదు..మేనిఫెస్టో కి బడ్జెట్ కి మధ్య తేడా చూస్తే మైండ్ బ్లాంక్ అయింది..ప్రజాగలం ప్రజా గరాళమైందిబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల గారడీ అయింది..వరుదు కళ్యాణి, ఏపీ శాసనసభ డిప్యూటి స్పీకర్ ఎన్నికఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుఎన్నికైనట్టు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు స్వల్ప వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన మండలిశాసన మండలి వాయిదావైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన శాసన మండలిసోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌పై చర్చకు YSRCP పట్టుఅరగంటపాటు నినాదాలతో హెరెత్తిన మండలిఅయినా చర్చకు మండలి చైర్మన్ నిరాకరణపొడియం చుట్టు ముట్టి సేవ్ డెమోక్రసీ.. వీ వాంట్ జస్టిస్ నినాదాలు చేసిన YSRCP ఎమ్మెల్సీలుఈ ఆందోళనలతో శాసన మండలిని వాయిదా వేసిన చైర్మన్ వీ వాంట్ జస్టిస్.. మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టిన YSRCP ఎమ్మెల్సీలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలుఎమ్మెల్సీలు నిరసన మధ్యలోనే మాట్లాడిన ఇతర పార్టీల సభ్యులుమండలిలో వైఎస్సార్సీపీ నిరసనప్రారంభమైన శాసన మండలిసోషల్ మీడియా అరెస్టు లపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండీఎస్సీ పై పీడీఎఫ్ వాయిదా తీర్మానంరెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుమూడో రోజు మొదలైన ప్రశ్నోత్తరాలు అనంతరం బడ్జెట్ పై చర్చ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంసోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసుల బనాయింపు పై సభలో చర్చించాలని కోరుతూ తీర్మానంశాసన మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ స్పీకర్ ఎంపిక నేడు!మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు నామినేషన్ ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్న శాసన సభ స్పీకర్ అయ్యన పాత్రుడు... నేడు అసెంబ్లీ లో 5 బిల్లులుఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - 2024...ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ సిటీ డ్యూటీ బిల్లు - 2024.ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు - 2024..ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు - 2024..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు - 2024.నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలను సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రులు...ఆంధ్రప్రదేశ్ MSME డవలప్మెంట్ పాలసీ 2024 - 29. పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి కొoడపల్లి శ్రీనివాస్..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.. పై సభ లో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టి జీ భరత్.... -
YS Jagan: ప్రవేశ పెట్టిన పత్రాలే చెప్తున్నాయి
-
ఏపీ బడ్జెట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
ఏపీ బడ్జెట్ సమావేశాలు: మండలిలో సత్యకుమార్ వ్యాఖ్యలపై దుమారం
AP Assembly Budget Session Live Updates విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీఅసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు10 ప్రశ్నల్లో 7ప్రశ్నలపై జరిగిన చర్చ..3 ప్రశ్నలు వాయిదా..జీరో అవర్ లో వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగిన సభ్యులు..సత్యకుమార్ వ్యాఖ్యలు.. మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు పై ఎమ్మెల్సీ ల నిరసనడయేరియా మరణాల బాధితులకు పరిహారం ప్రకటించాలని మండలిలో ఎమ్మెల్సీ ల ఆందోళనశాసన మండలి నుండి వాకౌట్ చేసిన ఎమ్మెల్సీ లుమంత్రి సత్య కుమార్ వ్యాఖ్యలకు నిరసన డయేరియా మరణాల పై చర్చ లో మంత్రి సత్య కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలుప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యలు ని అవహేళన గా మాట్లాడిన మంత్రి సత్యకుమార్డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయని నవ్వుతూ మాట్లాడిన మంత్రి సత్య కుమార్మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు పై బొత్స ఆగ్రహంమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదుఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చుకానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలిప్రతిపక్ష నాయకుడు బొత్స ఆగ్రహం శాసన మండలి గుర్ల డయేరియా మరణాల పై శాసన మండలి లో తీవ్ర చర్చమంత్రి డయేరియా తో మరణాలు సంభవించలేదని ఎలా చెప్తారుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పలేదా..?ప్రభుత్వం ఎందుకు డయేరియా మరణాలను తగ్గించడం లో విఫలం చెందారుమరణించిన వారికి గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారుప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదు?శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసేంత వరకు డయేరియా పై ముఖ్యమంత్రి స్పందించలేదువై ఎస్ జగన్ గుర్ల వెళ్లేంత వరకు హోంమంత్రి అనిత, వైద్య ఆరోగ్య మంత్రి వెళ్లలేదుస్కూల్ బెంచిల మీద పెట్టి వైద్యం అందించడం సిగ్గు చేటుఎమ్మెల్సీ వరుదు కల్యాణిసెప్టెంబర్ లో తొలి డయేరియా మరణం సంభవించిన ప్రభుత్వం స్పందించలేదుఅందుకే డయేరియా మరణాలు పెరిగాయిగుర్ల పరిసర గ్రామాల్లో మరణాలకు వేరేవేరే మరణాలని అబద్దాలు చెప్తున్నారుతక్షణం ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించాలిఎమ్మెల్సీ సురేష్ బాబుభూబదలాయింపు చట్టంపై వాడీవేడి చర్చభూబదలాయింపు చట్టంలో కొన్ని లోపాలున్నాయి.. వాటిని సరి చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడుచట్ట వ్యతిరేకంగా వెళ్లినవారిపై చర్యలు తీసుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడుచట్ట సవరణ లోపభూయిష్టంగా ఉందన్న మంత్రి అనగానిసభలో మంత్రి అనగాని ప్రకటనపై ఎమ్మెల్సీ బొత్స అభ్యంతరంప్రభుత్వ విధానంపై వివరణ ఇవ్వాలి: ఎమ్మెల్సీ బొత్సతప్పు జరిగినట్లు ప్రభుత్వం చర్యలు తీసుకొవచ్చు: ఎమ్మెల్సీ బొత్సఈ చట్టాన్ని కొనసాగిస్తారా? లేదా రద్దు చేస్తారా? స్పష్టత ఇవ్వాలి: ఎమ్మెల్సీ బొత్స మహిళా పోలీస్ జాబ్ చార్ట్ పై అసెంబ్లీ లో చర్చసచివాలయాలలో మహిళా పోలీస్ జాబ్ చార్ట్ పై అసెంబ్లీ లో చర్చమహిళా పోలీసు అసలు పోలీసు శాఖతో సంబంధం ఉందా? పనిచేసేది ఎం పీ డీ ఓ పరిధిలో కానీ సెలవు ఇవ్వాల్సింది లోకల్ సీ ఐ ఈ గందరగోళాన్ని నివారించాలి :::కూన రవి కుమార్సరైన శిక్షణ కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న మహిళా పోలీసులను ఉమెన్ వెల్ఫేర్ శాఖలో కొనసాగించాలి :::నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యగ్రామ మహిళా పోలీసుల ను మహిళా సంరక్షణా కార్యదర్శులుగా 13,815 ని నియమించారుదీనిపై కోర్టు లో కూడా 7 రిట్ పిటిషన్ లు ఉన్నాయిగ్రామ మహిళా పోలీసు లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ల దాకా ప్రమోషన్ లు కూడా ఇచ్చే అవకాశం కల్పించారుసభ సూచనలను తీసుకుని, పోలీసు శాఖతో చర్చించి మహిళా పోలీసుల కొత్త జాబ్ చార్ట్ ఇస్తాం:::హోం మంత్రి అనిత విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వ వివరణఅసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలుసమాధానం ఇచ్చిన మున్సిపల్ & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణవిశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి) సిద్దం చేసాం: మంత్రి నారాయణఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి పంపించాం: మంత్రి నారాయణకేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం: మంత్రి నారాయణకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో ప్రాజెక్ట్ పై స్వయంగా కేంద్రమంత్రిని కలిసాను: మంత్రి నారాయణసీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాసారు: మంత్రి నారాయణవిశాఖపట్నంలో మొత్తం 76.90 కిమీ మేర రెండు ఫేజ్ లలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపడతాం : మంత్రి నారాయణ చంద్రబాబు పరిశ్రమలు తెచ్చారు: మంత్రి లోకేష్గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు: మంత్రి లోకేష్అనంతకు కియా పరిశ్రమ తీసుకొచ్చారు: మంత్రి లోకేష్పరిశ్రమల కోసం ప్రతీ నెల రివ్యూలు జరిపేవారు: మంత్రి లోకేష్YSRCP వాయిదా తీర్మానంఏపీ మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంవిద్యుత్ ఛార్జీలపై చర్చ కోసం తీర్మానంప్రజలపై మోపిన భారంపై చర్చించాలంటున్న వైఎస్సార్సీపీతీర్మానం ఇచ్చిన తోట త్రిమూర్తులు, భరత్, తుమాటి మాధవరావు శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రెండో రోజు సెషన్ ప్రారంభంమూడు బిల్లులపై చర్చ నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు- 2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నమంత్రి నారాయణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్ -
నేడు బడ్జెట్‌పై వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024–25కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
నయవంచనకు నకలు పత్రం!
దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి. 53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.రైతులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట! పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు. ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు. రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్‌లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్‌లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్‌లోకి పోయింది. మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది. ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ. -
ఇది ప్రజలను ముంచే బడ్జెట్: రాచమల్లు
-
ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోతే!
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల ఉన్నత విద్యకు టీడీపీ కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటనెన్స్ చార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. దీంతో సుమారు ఏటా 12 లక్షల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఏటా పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఫీజు రీయింబర్స్మెంట్) కోసం సుమారు రూ.2,700 కోట్ల నుంచి రూ.2,800 కోట్లు వ్యయమవుతుంది. ఇందులో హాస్టల్ విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీల కింద సుమారు రూ.1,100 కోట్లు వెచ్చించాలి. కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన ఐదునెలల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యార్థులకు తీవ్ర నిరాశను మిగిలి్చంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,766.77 కోట్లు, పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్ (మెయింటెనెన్స్–ఎంటీఎఫ్) కింద రూ.776.18 కోట్లు కలిపి మొత్తం రూ.2,542.95 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటానే 75 శాతంగా ఉంటోంది. దీనితో పాటు ప్రధానమంత్రి యశస్వీ పథకం కింద మరో రూ.356 కోట్లను కూడా పోస్టు మెట్రిక్ స్కాలర్íÙప్స్ కేటాయింపుల్లో కలిపేసింది. ఇక ఆ చెల్లింపులు ప్రశ్నార్థకమే.. ఇక గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపివేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు ఆపేసింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ చార్జీలు కలుపుకుని రూ.2,500 కోట్లు ఉంటే.. ప్రస్తుత బడ్జెట్ అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం! -
వలంటీర్ల వ్యవస్థకు మంగళం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావులేకుండా సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసినట్టే. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనాల చెల్లింపుల కోసం నిధులే కేటాయించలేదు.గ్రామ వలంటీర్ల వేతనాలకే 2022–23 ఆరి్థక ఏడాదిలో రూ.1,183.80 కోట్లు, 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,201.79 కోట్లను అప్పటి వైఎస్ జగన్ సర్కారు బడ్జెట్లో కేటాయించి వారికి చెల్లించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వలంటీర్లకు రూ.194.69 కోట్లు, వార్డు వలంటీర్లకు రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మొత్తం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో పొందుపర్చి ఏప్రిల్, మే నెలల్లో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనాల నిమిత్తమే ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపుల కింద చూపించారు.ఆ రెండు నెలల కోసం వ్యయం చేసిన మొత్తం తప్ప.. తదనంతర 10 నెలల నిమిత్తం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. వలంటీర్లకు ఇప్పటికే ప్రభుత్వం 5 నెలల వేతనాలు బకాయి పడింది. ఆ మొత్తంతోపాటు వచ్చే 5 నెలల వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. పట్టణాల్లో వార్డు వలంటీర్ల పరిస్థితీ అంతే..పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వార్డు వలంటీర్ల వేతనాలకు సైతం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2022–23 ఆర్థిక ఏడాదిలో వార్డు వలంటీర్ల కోసం రూ.409.12 కోట్లు, 2023–24 ఆరి్థక ఏడాదిలో రూ.412.37 కోట్లను ప్రతిపాదించిన వైఎస్ జగన్ సర్కారు వారికి చెల్లింపులు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో వార్డు వలంటీర్ల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇప్పటికే వార్డు వలంటీర్లకు చెల్లించిన ఏప్రిల్, మే నెలల వేతనాలకు ఖర్చు చేసిన మొత్తం తప్ప.. 5 నెలల పెండింగ్ వేతనాలు, వచ్చే 5 నెలల్లో చెల్లించాల్సిన వేతనాలకు పైసా కూడా కేటాయించలేదు. -
కేటాయింపులకు నీళ్లొదిలారు
సాక్షి, అమరావతి: భారీ నీటిపారుదల శాఖలో పోలవరం మినహాయిస్తే ఇతర ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపుతూ పోలవరం ప్రాజెక్టుకు రూ.4,873 కోట్లు కేటాయించింది. వంశధార స్టేజ్–2, చింతలపూడి ఎత్తిపోతలు, వెలిగొండ, హంద్రీ–నీవాకు అరకొరగా నిధులే విదిల్చింది. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2024–25 బడ్జెట్లో భారీ నీటిపారుదల రంగానికి (మేజర్ ఇరిగేషన్) రూ.15,483.35 కోట్లు, చిన్న నీటిపారుదల (మైనర్ ఇరిగేషన్) రంగానికి రూ.1,221.97 కోట్లు కలిపి మొత్తంగా జలవనరుల శాఖకు ప్రభుత్వం రూ.16,705.32 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పోలవరానికి రూ.2,807.68 కోట్లిచ్చిన కేంద్రంపోలవరం ప్రాజెక్టుకు 2024–25లో రూ.7,218.68 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రూ.4,841.93 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ.. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని చూపి రూ.4,873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం ఇప్పటికే అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు, రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.68 కోట్లు వెరసి మొత్తం రూ.2,807.68 కోట్లను అక్టోబర్ 9న విడుదల చేసింది. ఇందులో 75 శాతం ఖర్చు చేసి, వినియోగ ధ్రువీకరణ పత్రాలు పంపితేనే నిధులు విడుదల చేస్తామని షరతు విధించింది. వీటికి అరకొర కేటాయింపులే⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువకు లైనింగ్ పనులకు రూ.2,516 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.867.75 కోట్లను కేటాయించింది. ⇒ జల్లేరు రిజర్వాయర్ నిర్మించకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలంటే రూ.3,782 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదలు పంపారు. ప్రభుత్వం రూ.150 కోట్లనే కేటాయించింది.⇒ గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి చేసి.. సాగర్ కుడి కాలువ ఆయకట్టును స్థిరీకరించాలంటే రూ.4,966.09 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ⇒ వెలిగొండ తొలి దశ పనులకు రూ.1,458 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. రూ.393.49 కోట్లు కేటాయించింది. ⇒ వంశధార స్టేజ్–2లో మిగిలిన పనుల పూర్తికి రూ.134.32 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో రూ.92.12 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం రూ.63.50 కోట్లు కేటాయించడం గమనార్హం.ఉత్తరాంధ్ర, సీమకు తీవ్ర అన్యాయంవెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. పోలవరం ఎడమ కాలువను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పూర్తికాకముందే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలను తెస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. దీనికి కేవలం రూ.63 కోట్లే కేటాయించారు. ఇక రాయలసీమలో తుంగభద్ర హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ఆధునికీకరణతోపాటు తెలుగుగంగ, హంద్రీ–నీవా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
AP: ఈ బడ్జెట్ అగమ్యగోచరం: బుగ్గన
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకుండా, రూ.41 వేల కోట్లు పెంచుతూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రనౌట్ అయ్యిందని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. తాము 2019 మే 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలన్నరలోనే జూలై 12న ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. కోవిడ్ వంటి ఇబ్బందులున్నప్పటికీ వరుసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్నారు. కానీ.. అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఐదు నెలల సమయం తీసుకున్నారంటూ దెప్పి పొడిచారు.బడ్జెట్ ప్రసంగంలో 21 సార్లు గత ప్రభుత్వమంటూ ప్రస్తావించారని ఎత్తిచూపారు. తీరా బడ్జెట్ చూస్తే అగమ్యగోచరం అని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోపాలు, లొసుగులను ఎత్తిచూపారు. ‘ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని రీతిలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రచారం చేశారు. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు అంటూ ప్రచారం చేసి ప్రజలకు ఆశ కల్పించారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాటి ఊసే లేదు’ అని కడిగి పారేశారు. ఈ సందర్భంగా బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? ⇒ 2024–25 వార్షిక బడ్జెట్ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన అంచనాల మేరకు బడ్జెట్ రూ.2,53,500 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.41 వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యం? అందులోనూ ఒక్క దీపం పథకంలో ఒక సిలిండర్ మినహా, సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూపలేదు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15 వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకం. ⇒ పన్ను రాబడి రూ.24 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు. వాస్తవానికి ఆదాయం తగ్గింది. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్నుల ఆదాయంలో దాదాపు 11 శాతం పెరుగుదల నమోదు కాగా, మేలో –2.8 శాతం, జూన్ లో –8.9 శాతం, జూలైలో –5.3 శాతం, ఆగస్టులో –1.9 శాతం, సెప్టెంబర్ లో –4.5 శాతం.. అలా మొత్తం మీద మైనస్ 2 శాతం ఆదాయం నమోదైంది. ఈ నేపథ్యంలో పన్ను రాబడి ఏకంగా రూ.24 వేల కోట్లు ఎలా పెరుగుతుంది? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ⇒ జీఎస్టీ ఆదాయంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.21,500 కోట్ల పెరుగుదల ఎలా సా««ధ్యం? స్టాంప్స్–రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.4 వేల కోట్ల నుంచి రూ.9,500 కోట్లు, సేల్స్ ట్యాక్స్ పన్ను రూ.8,500 కోట్ల నుంచి రూ.16 వేల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.8 వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు, ఇతర పన్నులు రూ.2400 కోట్ల నుంచి రూ.5700 కోట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తున్నారు? ⇒ తొలి ఆరు నెలల్లో రాబడి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78 వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యం? నెట్ పబ్లిక్ అకౌంట్.. అంటే ప్రభుత్వం వద్ద ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బును రూ.16 వేల కోట్ల నుంచి రూ.1,800 కోట్లకు తగ్గిస్తాం అంటున్నారు. ఆ ప్రకారం ఉద్యోగులకు పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి అన్నీ కట్టేయాలి. మరి ఈ ఐదు నెలల్లో ఆ పని చేశారా? సూపర్ సిక్స్ పేరుతో మోసం ⇒ యువగళం కింద యువతకు ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ⇒తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో స్పష్టంగా కేటాయింపులు లేవు. బీసీ సంక్షేమంలో రూ.2,400 కోట్లు, ఎకనమిక్ వీకర్ సెక్షన్లో రూ.1160 కోట్లు.. ఇలా అన్ని కలిపి చూపినా తల్లికి వందనం పథకానికి రూ.5,300 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుంది? ⇒ అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి చెప్పిన ప్రకారం ఆ పథకానికి రూ.4,500 కోట్లు కేటాయించారు. మిగతా రూ.3500 కోట్లు పీఎం కిసాన్ నుంచి వచ్చేది. నిజానికి ఈ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మందికి ఇవ్వాలంటే రూ.10,706 కోట్లు కావాలి. ⇒ దీపం పథకానికి రూ.895 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంతో 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుంది. రాష్ట్రంలో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ లెక్కన మిగతా వారందరికీ ఇవ్వరా? వాస్తవాలు ఇలా ఉంటే.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి అన్ని పథకాలు అమలు చేసినట్లు ఎలా చెబుతారు? ⇒ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలి. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున 2,07,30,000 మందికి ఇవ్వాలి. దీని ఊసే లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రస్తావనే లేదు. ⇒ 2014 ఎన్నికల్లో కూడా వ్యవసాయ రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, కాపులు, చేనేతలకు సాయం, నిరుద్యోగ భృతి.. ఇలా అన్ని హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. బాబు తీరు మొదటి నుంచీ ఇంతే. (బాబు తీరుపై వైఎస్సార్, రోశయ్యలు మాట్లాడిన వీడియో ప్రదర్శించి చూపారు).మంచి చేస్తే అభాండాలా? ⇒ విద్యుత్ రంగానికి మా హయాంలో 2019–20లో రూ.11,600 కోట్లు, 2020–21లో కోవిడ్ ఇబ్బందుల్లో కూడా రూ.6,110 కోట్లు, 2021–22లో రూ.11,500 కోట్లు, 2022–23లో రూ.18,250 కోట్లు, 2023–24లో ఇంచుమించు రూ.15,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రూ.8,100 కోట్లు మాత్రమే ఇచ్చింది. ⇒ 2014–15 నుంచి 2018–19 వరకు ప్రభుత్వం డిస్కంలకు రూ.31,800 కోట్లకు గాను కేవలం రూ.20,165 కోట్లే కట్టింది. 2019–20 నుంచి 2023–24 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.68 వేల కోట్లకుగాను రూ.62 వేల కోట్లు కట్టింది. ఈ లెక్కన ఎవరికి చిత్తశుద్ధి లేదు? ⇒ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు. పథకాల అమలుపై క్యాలెండర్ ప్రకటించి, పక్కాగా అమలు చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారు. గత 5 ఏళ్లలో ఒక్క జగనన్న అమ్మ ఒడికి రూ.26,067 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు, చేయూతకు రూ.19,189 కోట్లు, వైఎస్సార్ ఆసరాకు రూ.25,570 కోట్లు అందించాం. ఇలా ప్రతిదీ పక్కాగా అమలు చేశాం.బడ్జెట్ సాక్షిగా అప్పులపై దు్రష్పచారం బట్టబయలు ⇒ 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై అదే పనిగా తీవ్ర దుష్ప్రచారం చేశాయి. రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లని, రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధాలు అచ్చేస్తే.. వాటిని పట్టుకుని శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమోనని చంద్రబాబు దు్రష్ఫచారం చేశారు. అప్పులు అడుక్కోవడానికేనా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు అని 2023 అక్టోబర్ 25న చెప్పిన పురంధేశ్వరి.. 2024 ఏప్రిల్ 7న రాష్ట్ర అప్పులు రూ.12,50,000 కోట్లని ప్రకటించారు. అంటే 5 నెలల్లోనే లక్షన్నర కోట్లు పెంచుతారా? ⇒ అయితే వాస్తవం ఏమిటన్నది బడ్జెట్లో బయట పడింది. రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. 2024 మార్చి 31 నాటికి రూ.4.91 లక్షల కోట్లు, గ్యారంటీ కింద తెచ్చిన అప్పు రూ.1,54,797 కోట్లు.. రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. మరి ఆనాడు ప్రచారం చేసినట్లు రూ.14 లక్షల కోట్ల అప్పు ఏది? అంత బాధ్యతా రాహిత్యంగా మాట్లాడతారా? కార్పొరేషన్ల అప్పులతో ప్రభుత్వానికి ఏం సంబంధం? డిస్కంల అప్పులతో ప్రభుత్వానికి ఎలా సంబంధం? పౌర సరఫరాలు, విద్యుత్ రంగం.. రూ.34 వేల కోట్లు డబుల్ ఎంట్రీ చేశారు. ఔట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్స్, స్కీమ్స్.. ఎవరికో కట్టవలసినవి రూ.1,13,000 కోట్లు. మరి ఇవన్నీ బడ్జెట్లో ఎందుకు చూపలేదు? అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు? చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ⇒ 2023–24 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.4,83,000 కోట్లుగా మేం చూపాం. ఇప్పడు కూటమి ప్రభుత్వ బడ్జెట్లో ఆ అప్పును రూ.4,91,000 కోట్లుగా చూపారు. మరి అలాంటప్పుడు ఏకంగా రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఎలా దు్రష్పచారం చేశారు? వారం కింద కూడా బడ్జెట్ ప్రిపేర్ అవుతుందని తెలిసీ.. చంద్రబాబు ఏపీ అప్పుల గురించి దారుణంగా అబద్ధాలు చెప్పారు. ఇందుకు చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ⇒ 2019–2024 వరకు మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా, కష్టపడి తిరిగి ఎన్నో సాధించాం. చంద్రబాబు కేంద్రంలో భాగస్వాములై ఏం సాధించారు? అసలు అప్పులు పెంచింది 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే. 2014లో రూ.1,32,000 కోట్లుగా ఉన్న అప్పు.. 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయేటప్పటికి రూ.3,31,000 కోట్లు అయింది. అంటే ఐదేళ్లలో ఏటా సగటున 20 శాతం పెరిగింది. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు రూ.3,31,000 కోట్లు కాగా, మేము 2024లో దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు 14.9 శాతమే. అంటే చంద్రబాబు హయాంలో కంటే మా హయాంలోనే తక్కువ అప్పులు చేశాం. -
ఇచ్చేది కొంత.. వడ్డింపు కొండంత
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యుత్ శాఖకు అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులు, వివిధ వర్గాలకు అందించిన ఉచిత, రాయితీ విద్యుత్ పథకాలను కూటమి సర్కారు తమవిగా చెప్పుకుంది. ఈ ఏడాది నుంచే రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.17 వేల కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ రంగానికి, ప్రజలకు ఇచ్చే రాయితీలు, సబ్సిడీల కోసం కేవలం రూ.8,207.64 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇచ్చే దానికంటే రెట్టింపు వసూలు చేయనుంది.జగన్ పథకాలే తమవిగా..ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇప్పుడు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల భారం మోపాల్సి వచ్చిందంటూ నిందలు మోపారు. నిజానికి గతంలో టీడీపీ హయాంలో జరిగిన అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వాస్తవాన్ని ఆర్థిక మంత్రి దాచిపెట్టారు. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకువచ్చింది. దానినే కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది.తమ ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తూ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి కాలనీల్లో ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ధోబీ ఘాట్లకు, దారిద్య రేఖకు దిగువనున్న రజకులు నిర్వహిస్తున్న లాండ్రీలకు, నాయీబ్రాహ్మణుల క్షౌ రశాలలకు, స్వర్ణకారుల దుకాణాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు, చేనేత కార్మికులకు ఉచితంగా, రాయితీపై విద్యుత్ అందిస్తున్నామన్నారు.అయితే.. ఈ పథకాలన్నీ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసినవే. ఎన్నికల ముందు రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదు. భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. డిస్కంలకు కూడా ఒక్క పైసా సాయం ప్రకటించలేదు. సభను హుందాగా నడిపేలా సహకరించండిసాక్షి, అమరావతి: సభను హుందాగా నడిపేలా సహకరించాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభ్యులకు హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన సభలో తొలుత కొద్దిసేపు మాట్లాడిన మోషేన్‌రాజు సభ్యులకు పలు సూచనలు చేశారు. పెద్దల సభ గౌరవాన్ని, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునేలా సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సాధారణ బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి పి.నారాయణ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నాయకుడు బొత్సా సత్యనారాయణ వైఎస్సార్సీపీ, టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ లెక్కలు⇒ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి రూ.4.25 కోట్లు⇒ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి రూ.0⇒ ఏపీ ట్రాన్స్‌కోకి రూ.742.56 కోట్లు⇒ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.0⇒ ఆక్వా రాయితీ విద్యుత్‌కు రూ.738 కోట్లు⇒ విద్యుత్ రంగ సంస్కరణలు, నష్టాలకు రూ.0⇒ వ్యవసాయ ఉచిత, అనుబంధ రంగాల రాయితీ విద్యుత్‌కు రూ.5,760.74⇒ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ బ్యాంకుల రుణాలకు రూ.611.76 కోట్లు⇒ డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం రూ.10.16 కోట్లు⇒ ఏపీ జెన్కో హెడ్‌వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ కోసం రూ.37.69 కోట్లు⇒ ఇంధన శాఖ ఆర్థిక కార్యకలాపాలకు రూ.302.46 కోట్లు -
వైఎస్సార్సీపీ హయాంలోనే ‘మహోన్నత’ మహిళ!
సాక్షి, అమరావతి: రాష్టంలో మహిళా సాధికారత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం భేష్ అని పరోక్షంగా ప్రస్తావించక తప్పలేదు. కూటమి సర్కారు సోమవారం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్ ఉపోద్ఘాతంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వం సాధించిన ఫలితాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో మహిళలను విద్య, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో సాధికారత వైపు అడుగులు వేయించేలా ఐదేళ్ల (2021–25) పటిష్ట కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర బడ్జెట్లో కొంతభాగాన్ని జెండర్ బడ్జెట్ పేరుతో మహిళాభివృద్ధికి ప్రభుత్వం 2021–22 నుంచి కేటాయింపులు చేస్తోంది. 2021–22లో మొదలైన జెండర్ బడ్జెట్ 2022–23 నాటికి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మొదలైంది.విద్య, ఉపాధి, భూమి కేటాయింపు వంటి అనేక కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. దీంతో మహిళలు ఇంటి యాజమాన్యంతోపాటు రాజకీయంగానూ, సామాజికంగానూ ముందడుగు వేశారు. ఫలితంగా మహిళా సాధికారతలో జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ రూపొందించిన ర్యాంకింగ్‌లో 4 నుంచి మూడో ర్యాంకును సాధించింది. 18 మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, వన్‌స్టాఫ్ సెంటర్లు, హెల్ప్‌డెస్‌్కల ఏర్పాటు వంటి అనేక చర్యలు చేపట్టింది. ఇలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్లోని ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం విశేషం.జెండర్ బడ్జెట్ కేటాయింపులు ఇలాప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం ఉద్ధేశించిన జెండర్ బడ్జెట్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ప్రధాన కేటాయింపులు తగ్గించింది. ⇒ కూటమి ప్రభుత్వం(2024–25) బడ్జెట్లో 100శాతం కేటాయింపులు (పార్ట్–ఏ ప్రోగ్రామ్)లో రూ.20,935.56కోట్లు కేటాయించింది. 30 నుంచి 99శాతం లబ్ధి కలిగే పథకాలు (పార్ట్–బి ప్రోగామ్)లో రూ.58,355.44కోట్లు కేటాయించింది. మొత్తం రూ.79,291కోట్లు మాత్రమే కేటాయించింది. చిన్నారుల సంక్షేమానికి ఇలా.. ⇒ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి మొత్తం రూ.21,910.75కోట్లు కేటాయించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్–ఎ)లో రూ.13,793.51కోట్లు, పార్ట్–బిలో రూ.8,117.24కోట్లు మాత్రమే కేటాయించింది. -
Jagan Petition: అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాం
-
‘సూపర్ సిక్స్.. సూపర్ చీట్స్‌గా మారిపోయింది’
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం బయటపడిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ చీట్స్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు రోజా. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రోజా ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు.‘చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారు. తొలి బడ్జెట్లోనే చంద్రబాబు మోసం బయటపడింది. 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తాం అని.. బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా..?, ఎన్నికల్లో గెలవగానే ప్రతి నిరుద్యోగ యువతి, యువకులకు నెలకి 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఒక్క రూపాయి కేటాయించకపోవడం దగా కాదా..?, ఎన్నికల్లో గెలవగానే మహిళలకి ఉచిత బస్ పథకం అమలు చేస్తామన్నారు.. ఇప్పుడు ఆ పథకానికి నిధులే ఇవ్వలేదు..! మోసం కాదా..?, తల్లికి వందనం పథకానికి నిధులు సగానికిపైగా కోత పెట్టడం..దగా కాదా..?ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని....ఈ ఏడాది 2 సిలిండర్లను ఎగనామం పెట్టడం..మోసం కాదా..?,50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తాం అన్నారు.. ఏది ఈ బడ్జెట్ లో ఆ ప్రస్తావన?, రైతులకు రూ. 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తాం అన్నారు... 10 వేల కోట్లు ఇవ్వాల్సింది 4,500 కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా...?, ఎన్నికల్లో ఓట్లెయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం @PawanKalyan ఇంటింటికి మీరిచ్చిన బాబు ష్యురిటీ.. భవిష్యత్‌కి గ్యారంటీ..బాండ్ల ను ఇప్పుడు ఏం చేసుకోవాలి.. ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలా..?, సమాధానం చెప్పాలి!! అంటూ ఆర్కే రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారు...ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్..సూపర్ చీట్స్.. గా మారిపోయింది!తొలి బడ్జెట్ లోనే.. @ncbn మోసం బయటపడింది.19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తాం అని.. బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా..?ఎన్నికల్లో…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 11, 2024 -
‘ఆ సత్తా మీకు లేదా..? దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా?’
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఇప్పటివరకూ నెరవేర్చలేదని, ఇక ఆ హామీలను అమలు చేసే యోచన కూడా వారికి లేదని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. ఈరోజు (సోమవారం) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు.అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదనే నిబంధనలు ఉంటే చూపించాలి. 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే సత్తా మీకు లేదా?.. మీరు చేసే దుర్మార్గాలు బయటపడతాయని భయపడుతున్నారా?, మాకు సమయం ఇవ్వకపోతే ఏ విధంగా ప్రశ్నిస్తాం?. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారు. కూటమి ప్రభుత్వం రూ. 57 వేల కోట్లు ఎందుకు అప్పు చేసింది.సూపర్‌సిక్స్ పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయి అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ చూసినా బెల్టుషాపులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు’ అని ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శించారు.అందుకే బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ దూరంశాసన సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగా బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. శాసన సభలో కూటమి తర్వాత అత్యధిక ఓట్ షేరింగ్ ఉన్న వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సభలో కూటమి తర్వాత తమదే అత్యధిక ఓటు షేరింగ్ ఉన్న పార్టీ అని స్పీకర్‌కు లేఖ రాసినప్పటికీ ప్రతిపక్షంగా గుర్తించలేదు. గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసింది వైఎస్సార్సీపీ. ఇది కూడా చదవండి: AP Budget 2024: కోతల బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్ -
కూటమి ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న అసహనం
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కోపమొచ్చింది. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు కూడా అసెంబ్లీ హాల్‌కు వచ్చారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే..అంతటితో ఆయన ఆగలేదు. అనుచరులను తీసుకొని రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది. -
వ్యవసాయ బడ్జెట్: రైతుల్ని దారుణంగా మోసం చేసిన చంద్రబాబు!
అమరావతి, సాక్షి: వ్యవసాయ బడ్జెట్లో రైతన్నలకు కూటమి ప్రభుత్వం పెద్ద షాకేచ్చింది. రైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం అంతరిక్ష పల్టీలు కొట్టింది. ఇవాళ్టి బడ్జెట్ ప్రసంగ సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన లెక్కలు ఈ విషయాన్ని తెలియజేశాయి. తన మేనిఫెస్టోలో రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది కూటమి. అయితే.. తీరా ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6 వేలుతో కలిపి అన్నదాత సుఖీభ కింద ఇస్తామంటూ చెబుతోంది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అన్నదాత సుఖీభవకి కేవలం రూ. 4,500 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించింది. వాస్తవానికి.. ఏపీలో వాళ్లు ఇచ్చిన హామీ ప్రకారం పెట్టుబడి సహాయం కింద.. 52 లక్షల మంది రూ. 10 వేల కోట్లకు పైగా అవసరం. కానీ, సగం కంటే తక్కువ కేటాయింపులతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టబోతున్న సంకేతాలను పంపించింది. 👉 ఏపీ వ్యవసాయ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒకవైపు సమావేశాలు జరుగుతుండగానే.. ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు.సభలో కూటమి తర్వాత ఎక్కువ ఓటు షేరింగ్ ఉన్న వైఎస్సార్సీపీని లేఖ రాసినప్పటికీ స్పీకర్ ప్రతిపక్షంగా గుర్తించకపోవడం, గత సమావేశాల్లో మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బాయ్‌కాట్ చేసింది వైఎస్సార్సీపీ. ఇక నుంచి మీడియా ఎదుటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ఎమ్మెల్యేలతో జగన్ చర్చించారు. -
AP Budget 2024: కోతల బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి సర్కార్
AP Assembly Budget Sessions 2024మోసం.. దారుణ మోసంసూపర్ 6 తొలి హామీ కి నిధులు కేటాయించని చంద్రబాబు ప్రభుత్వంనిరుద్యోగులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వంబడ్జెట్ లో ప్రస్తావన లేని రూ. 3 వేలు నిరుద్యోగ భృతి20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతీ నిరుద్యోగికి 3 వేలు భృతి ఇస్తానని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన చంద్రబాబుబడ్జెట్ లో కానరాని మహిళలకు ఉచిత బస్ హామీఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఉచిత బస్ హామీ అమలు చేస్తామన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్ఇటు వార్షిక, అటు వ్యవసాయ బడ్జెట్లో అన్నీ కోతలేవైఎస్ జగన్ హయాంలో అన్ని రంగాలకు ప్రోత్సాహం ఇప్పుడు.. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మోసంబడ్జెట్ ప్రసంగాల్లోనూ వైఎస్సార్సీపీ పాలనపై అక్కసు వెల్లగక్కిన మంత్రులుఎన్నికల హామీల అమలు పేరుతో భారీగా లబ్ధిదారులకు కోత పెట్టే ప్రయత్నంఅందుకే పలు రంగాలకు సగం కంటే తక్కువ కేటాయింపులు!బడ్జెట్లో రైతులు, ఆడపడుచులను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా తల్లికి వందనం పథకానికి షాక్బడ్జెట్ లో తల్లికి వందనం కి కేవలం 2,491 కోట్లు కేటాయింపుసూపర్ సిక్స్ హామీల్లో స్కూల్ కి వెళ్లిన ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తాం అన్న చంద్రబాబు10 వేల కోట్లకు పైగా అవసరం ఉన్న..2,491 కోట్లు మాత్రమే కేటాయింపుఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం లేనట్టే!గతంలో వై ఎస్ జగన్ ప్రభుత్వం లో ఇంటర్ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి అమలుప్రతి ఏటా 6,400 కోట్లుకి పైగా అమ్మ ఒడి నిధులు జమ చేసిన వై ఎస్ జగన్ ప్రభుత్వంఅమ్మ ఒడి ఈ ఏడాది ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా స్పష్టత ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం మహిళకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంబడ్జెట్ లో కానరాని మహాశక్తి పథకం19 నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబుబడ్జెట్ లో మహిళల కు ఏడాదికి 18,000 ఆర్థిక సాయం ఉసేత్తని ప్రభుత్వంఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలాప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ..ఉద్యానశాఖకు రూ.3469.47 కోట్లు..అన్నదాత సుఖీభవకు రూ.4,500 కోట్లు.వ్యవసాయ మార్కెటింగ్‌కు రూ.314.88 కోట్లు..పంటల బీమాకు రూ.1023 కోట్లు. -మంత్రి అచ్చెన్నాయుడు.ఏపీ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులిలారాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లుభూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు. ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లురైతులకు బడ్జెట్ లో షాక్ ఇచ్చిన ప్రభుత్వంరైతుల పెట్టుబడి సహాయం హామిపై చంద్రబాబు ప్రభుత్వం పల్టీలుకేంద్రం ఇచ్చే 6 వేలు తో కలిపి ఇస్తామంటూ మెలికటీడీపీ మేనిఫెస్టోలో రైతులకు 20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటనకేవలం 4,500 కోట్లు మాత్రమే అన్నదాత సుఖీభవ కి కేటాయించిన ప్రభుత్వంఏపీలో పెట్టుబడి సహాయం కి 52 లక్షల మంది 10 వేల కోట్లకు పైగా అవసరంకేవలం 4,500 కోట్లు మాత్రమే కేటాయించి షాక్ ఇచ్చిన ప్రభుత్వంభారీగా లబ్ధిదారులకు కోత పెట్టనున్న ప్రభుత్వం👉 వ్యవసాయ బడ్జెట్ పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండిఅచ్చెన్న నోట అబద్ధాలువ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడురూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్జగన్ హయాంలో సాఫీగా సాగిన రైతు బీమాబడ్జెట్ టైంలో అచ్చెన్న నోట అబద్ధాలుగత ప్రభుత్వం రైతుల పంటలకు బీమా అందించలేదు: అచ్చెన్నవడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తాం: అచ్చెన్నమిగతా వాటిల్లో..ఏపీ రహదారులు రంగానికి రూ.9,554 కోట్ల కేటాయింపుపర్యాటక రంగానికి 322 కోట్ల కేటాయింపుపవన్ శాఖలకు భారీగా..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులుపంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ 16.739 కోట్లుఅటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు👉: ఏపీ బడ్జెట్ 2024 పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండిబడ్జెట్లో అప్పు ఇలా..ఈ ఏడాది 91,443 కోట్లు ప్రజా అప్పులు చెయ్యాలని నిర్ణయంబడ్జెట్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం2 లక్షల 1 వెయ్యి కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా24,498 కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నట్టు పేర్కొన్న ప్రభుత్వంఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లుజలవనరులు రూ.16,705 కోట్లు..ఉన్నత విద్య రూ.2326 కోట్లు..పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..ఇంధన రంగం రూ.8,207 కోట్లు..పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.ఊహించినట్లే సాగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలువార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్2, 94, 427 కోట్ల తో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్రెవెన్యూ లోటు 34,743 కోట్లుద్రవ్య లోటు 68,742 కోట్లుగత ప్రభుత్వంపై ఆరోపణలతోనే ప్రసంగం మొదలుపెట్టిన పయ్యావులపతనం అంచున ఆర్థిక వ్యవస్థ : మంత్రి పయ్యావులవిభజన నాటి విషయాల ప్రస్తావన కూడాసమాచార విప్లవాన్ని వినియోగించుకోవాలి : మంత్రి పయ్యావులశాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగింది : మంత్రి పయ్యావులరాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది : మంత్రి పయ్యావులగత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది.. గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు : మంత్రి పయ్యావులగత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది.. తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగింది: మంత్రి పయ్యావులరాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది : మంత్రి పయ్యావుల93 శాతం ప్రజల ఆమోదాన్ని కూటమి ప్రభుత్వం పొందగలిగింది : మంత్రి పయ్యావుల 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్ప్రారంభం అయిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు10 నుంచి 15 రోజులపాటు సమావేశాలు సాగించే యోచనలో కూటమి ప్రభుత్వంసమావేశాలకు దూరంగా వైఎస్సార్సీపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టేది ఎక్సైజ్ అండ్ మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రఅసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుమండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టేది మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ -
అసెంబ్లీ సమావేశాల్లోనూ డైవర్షన్ రాజకీయాలేనా?!
గుంటూరు, సాక్షి: ఏపీలో నేటి(నవంబర్ 11) నుంచి జరగనున్న అసెంబ్లీ ఫుల్ బడ్జెట్ సమావేశాలను వైఎస్సార్సీపీ బహిష్కరించింది. ఏకపక్షంగా సభను నిర్వహించుకుంటున్న కూటమి ప్రభుత్వం.. తమకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీకి 40% ఓటు షేర్ వచ్చింది. శాసనసభలో అధికార కూటమి, వైఎస్సార్సీపీ మాత్రమే ఉంది. అయినా కూడా ప్రతిపక్షంగా గుర్తించి స్పీకర్ మైకు ఇవ్వడం లేదు. గత సమావేశాల్లోనూ ఇది జరిగింది. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు? అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అన్నారు. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రశ్నలు సంధించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులే తనకు స్పీకర్ లంటూ ఆయన వ్యాఖ్యానించారు కూడా.రెండుసార్లు ఓటాన్!ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.గత సమావేశాల్లో జరిగింది అదేగా..సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించే లక్ష్యంతో కనిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల వంకతో డైవర్షన్ రాజకీయాన్ని కొనసాగించాలనుకుంటోంది. గత సమావేశాల్లోనూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలతో కాలయాపన చేసింది. శ్వేత పత్రాల పేరుతో హడావిడి చేసింది. ఇక ఇప్పుడు బడ్జెట్లోనూ కోతలు, కీలక హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డ్రామాను ప్రదర్శించే అవకాశం లేకపోలేదని అంచనా. బడ్జెట్ ఇలా.. నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. బడ్జెట్ అనంతరం శాసనసభ, మండలి వాయిదా పడనున్నాయి.ఇదీ చదవండి: ఏపీలోనూ ‘కోటా’ తరహా ఘటనలు!! -
రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
సాక్షి, అమరావతి: రేపటి(సోమవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నవంబర్ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ వాయిదా పడనుంది.రేపటి నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఈనెల ఆఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సమావేశాల్లో కూటమి ప్రభుత్వం కేవలం నాలుగు నెలల కాలానికే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సభల్లో బడ్జెట్ అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ వాయిదా పడనుంది. -
ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
-
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా గుర్తింపు పొందిన, ఆ పార్టీ అనధికార ప్రతినిధిగా పేరొందిన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాలపై గజిబిజి ఉందట. ఆంధ్ర ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో అర్ధం కావడం లేదట. అంటే తెలుగు దేశం గెలవడం లేదన్న సంకేతం అందుతున్నట్లే కదా!అందుకు భిన్నంగా ఉంటే ఈయన ఎగిరి గంతేసి రచ్చ,రచ్చ చేసేవారు కదా! అంతేకాదు. ఆయన జర్నలిస్టులకు సుద్దులు, పత్తిత్తు కబుర్లు కూడా చెప్పారు. కొత్త పలుకు పేరుతో వ్యాసాలు రాసే ఆయన పచ్చి అబద్దాలను ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చారు. తెలుగుదేశం గెలుపు తన గెలుపు అని భావించి , ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంట్లో మనిషి మాదిరిగా వ్యవహరించే ఈయన తాజాగా చెప్పిన నీతులు వింటే ఆశ్చర్యం చెందాల్సిందే. అదే టైమ్ లో ఆయన యధాప్రకారం వైఎస్సార్సీపీపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన విషం కక్కారు. అయినా జర్నలిజం గురించి మాట్లాడగలరు. తను తప్ప మిగిలినవారంతా ఎర్నలిస్టులు అని రాయగలరు. అసలు తానేమిటో, తన మూలాలేమిటో మర్చిపోయి, ఒక ఆగర్భ శ్రీమంతుడు మాదిరి, సత్య సంధుడు మాదిరి. హరిశ్చంద్రుని తమ్ముడి మాదిరి ,అత్యంత నీతిమంతుడు మాదిరి ఆయన రాసే పలుకులు చూస్తే ఔరా అనుకోవల్సిందే. ఏపీ ప్రజలలో ఈ శాసనసభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నదానిపై ఎవరి అభిప్రాయం వారికి ఉండవచ్చు. కొందరు వైఎస్సార్సీపీకి, మరి కొందరు టీడీపీకి అనుకూలంగా ఆలోచించవచ్చు. కాని చంద్రబాబుకు నమ్మిన బంటు తరహాలో ఉండే ఆంధ్రజ్యోతి యజమానికి టీడీపీ గెలుపుపై ఎందుకు సందేహం వచ్చిందో తెలియదు. అందుకే గెలుపు అంచనాలలో గజిబిజి అని హెడింగ్ పెట్టుకున్నట్లు ఉన్నారు. ఎన్నికల వరకు ఉన్నవి, లేనివి పచ్చి అబద్దాలు రాసి ప్రజలను మోసం చేసే యత్నం చేసిన రాధాకృష్ణ ఇప్పుడు జర్నలిజం ఎలా ఉండాలో నీతులు వల్లెవేస్తున్నారు. దీనిని బట్టే అర్దం అవుతోంది. ఆయనకు టీడీపీ అధికారంలోకి రావడం లేదన్న సమాచారం వచ్చి ఉండాలి. పైకి ఏవో కబుర్లు చెప్పినా, అంతర్లీనంగా చదివితే రాధాకృష్ణ ఎంత భయపడుతున్నది తెలుస్తుంది. వైఎస్సార్సీపీ గెలుస్తుందని అనేవారికి శాపనార్ధాలు పెడుతున్న తీరే ఆయన బలహీనతను తెలియపరుస్తుంది. ప్రతి పత్రికకు సొంత నెట్ వర్క్ ఉంటుంది. ఆంధ్రజ్యోతి కి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నెట్ వర్క్ ఉంది కదా!. ఆ నెట్ వర్క్ లో పనిచేసే ప్రతినిధులుఉంటారు కదా!వారితో పోలింగ్ కు ముందు, పోలింగ్ జరిగే రోజున, అవసరమైతే పోలింగ్ తర్వాత కూడా అభిప్రాయ సేకరణ అనండి, ఎగ్జిట్ పోల్ అనండి..పేరేదైనా పెట్టండి ..ప్రజల నాడి ఎలా ఉందో పసికట్టడానికి ప్రయత్నించి ఉంటారు కదా!. ఒక వేళ అది టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలలో కదనాలు ఇచ్చే వారే కదా?. అలా చేయలేకపోగా, గజిబిజి గా పరిస్తితి ఉందని రాసుకున్నారంటే తెలుగుదేశంలో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి రాసిందంటే టీడీపీ రాసినట్లే కదా!. రాధాకృష్ణ రాసిన కొన్ని అంశాలు చూద్దాం. అనుభవం ఉన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం అనేక సందర్భాలలో లెక్క తప్పాయని ఆయన అన్నారు. అందులో కొన్నిసార్లు నిజం ఉండవచ్చు. కాని ఎక్కువసార్లు వాస్తవమే అయ్యాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా కాంగ్రెస్ కు పట్టం కట్టారట. ఇది కూడా అసత్యమే. తెలంగాణలో అత్యధిక ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కనీస అవగాహన లేనివారు, జనం నాడి తెలియని వారు అంచనాలు రూపొందించడం రాధాకృష్ణకు ఆశ్చర్యం కలిగించిందట. చంద్రబాబుకు, జగన్ కు లేని టెన్షన్ ను ఈ తరహా ఎర్నలిస్టులు ప్రదర్శిస్తుండడం విశేషం అని రాశారు. తాను ఎలా సంపాదించి పైకి వచ్చింది. తను రిపోర్టర్‌గా పనిచేసిన పత్రికకే తాను ఎలా యజమాని అయింది రాధాకృష్ణకు తెలియదా! మళ్లీ ప్రత్యేకంగా ఎర్నలిస్టులు అంటూ ఎవరినో అనడం దేనికి? ప్రభుత్వ పని తీరుతో సంబంధం లేకుండా సోషల్ మీడియా సైన్యం మాత్రమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయజాలదని రాధాకృష్ణ రాసుకొచ్చారు. సోషల్ మీడియా వరకు దేనికి!. మిమ్మల్ని మీరు మెయిన్ మీడియా అనుకుంటారుగా? ఇంతకీ మీరు రాసిన పచ్చి అబద్దాలను జనం నమ్మారనుకుంటున్నారా? నమ్మ లేదని అనుకుంటున్నారా?ఉదాహరణకు లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, స్టాంప్ రిజిస్ట్రేషన్ గురించి ఆంధ్రజ్యోతితో పాటు ఈనాడు రాసిన దారుణమైన అబద్దాలను ప్రజలు నమ్మలేదన్న సంగతి మీకు తెలిసిందా? అనే అనుమానం వస్తుంది. పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్ గురించి కూడా తెగ వాపోయారు. ముందు మీరు మీ యూట్యూబ్ చానల్ లో నిజాలు చెప్పడం అలవాటు చేసుకుని అప్పుడు ఎదుటివారి గురించి మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ ఐటిడిపి పేరుతో ఎంత నీచమైన ఆరోపణలతో వైఎస్సార్సీపీపైన, జగన్ పైన ప్రచారం చేస్తే సమర్దించిన రాధాకృష్ణ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. యూట్యూబ్ ఛానెల్స్‌ను రాజకీయ పార్టీలు స్పాన్సర్ చేస్తున్నాయట. ఈనాడు, ఆంద్రజ్యోతివంటి ఎల్లో మీడియాను తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేసిన విషయాన్ని తొలుత రాసి ఆ తర్వాత మిగిలినవారి గురించి మాట్లాడితే బాగుండేది. సోషల్ మీడియాలో వ్యూస్ ను బట్టి కూడా ఎవరికి మద్దతు ఉందో చెప్పవచ్చని మళ్లీ ఇదే కొత్త పలుకు లో ఈయన చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్ కు అనుకూలంగా ఉండే వార్తలు, కధనాలకు రెండే క్రితం వరకు అధికంగా వ్యూస్ ఉండేవని, రాను..రాను అవి తగ్గిపోయాయని మరో అబద్దం రాసుకొచ్చారు.ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఇంటర్వ్యూని టీవీ9లోను, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటర్వ్యూని ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోనూ ఒకే రోజు, ఒకే సమయంలో ప్రసారం చేశారు. చంద్రబాబును ఇదే రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. జగన్ చేసిన ఇంటర్వ్యూకు టీవీ9 యూట్యూబ్ ఛానల్లో 11లక్షల వ్యూస్ వస్తే, చంద్రబాబు ఇంటర్వ్యూకు నాలుగైదు లక్షల వ్యూసే వచ్చాయి. ఇది ఎవరయినా గమనించవచ్చు. లైవ్ జరుగుతున్నప్పుడు కూడా ఎబిఎన్ కంటే టీవీ9 కంటెంట్‌ను ఎన్నోరెట్ల మంది యుట్యూబ్లో చూసినట్లు లెక్కలు చెబుతున్నాయి కదా! ఈయన థియరీ ప్రకారం చూసుకున్నా జగన్ గెలుస్తున్నట్లే కదా!. తెలంగాణను మించిన నిర్భంధం ఏపీలో ఉందట. నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంత అరాచకంగా, జర్నలిజానికి తలవంపులు తెచ్చేరీతిలో వార్తలు,కధనాలు ఇచ్చి ఉండేవారా?. ఎందుకు వీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు!. ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌కు అనుకూలమైనా ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని అంటున్నారు. పాపం ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే,వారిని పనిపాట లేనివారని, వారికి ఊరికే వందల కోట్ల జీతాలు కూర్చోబెట్టి ఇస్తున్నారన్నట్లుగా చంద్రబాబుతో మాట్లాడింది రాధాకృష్ణే కదా! 2019 లో ఎన్నికలలో తాను మళ్లీ అధికారంలోకి వస్తానని ప్రకటించి బోల్తా కొట్టిన చంద్రబాబు ఈ పర్యాయం మాత్రం ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పలేదని ఈయన అంటున్నారు. నిజానికి అప్పుడు చంద్రబాబే కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు తదతితర ఎల్లో మీడియా అంతా ఇదే మాట ఊదరగొట్టాయి. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ తో మహిళలంతా టీడీపీ కి ఓటు వేశారని ఈయన పత్రికలోరాశారో లేదో ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి కానీ, 2019లో జగన్ చెప్పినట్లు వైసిపి భారీ మెజార్టీతో గెలుపొందిందన్న ఒక్క సత్యాన్ని ఒప్పుకున్న ఈయన అక్కడ కూడా వక్రీకరించారు. జగన్ అండ్ కో అప్పుడు అసత్య ప్రచారం మీద నమ్మకం పెట్టుకుందని ఈ సత్యసంధుడు రాస్తున్నాడు. చంద్రబాబు అండ్ కో లో భాగస్వామి అయిన రాధాకృష్ణ అబద్దాల సృష్టికర్తలలో ఒకడన్న సంగతి ప్రజలందరికి తెలుసు. 2024 ఎన్నికల ప్రచారంలో జగన్ అసత్యాలు చెప్పారో, చంద్రబాబు అబద్దాలు చె్ప్పారో, ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఒక సర్వే చేయించుకుంటే తెలుస్తుంది. రాధాకృష్ణ ఎంతసేపు ఆత్మ వంచన చేసుకుంటూ ప్రజలను కూడా అలాగే మోసం చేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికలలో జగన్ ఆశ్రిత పక్షపాతం, భావోద్వేగాలు ప్రేరేపించడం, విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నశింప చేయడం.. వంటివాటివల్ల గెలిచారట.ఎంత అక్కసో చూడండి. జగన్ గెలిస్తే ఆలోచన సరిగా లేనట్లట. చంద్రబాబు గెలిస్తే మేధావితనం అట. ఈయనకు వందల కోట్ల ప్రయోజనం చేకూర్చుతారు కాబట్టి చంద్రబాబు పాలన గొప్పదిగా కనిపించవచ్చు. కాని జగన్ ప్రజలకు లక్షల కోట్ల మేర మేలు చేశారు. కాబట్టి ఆయన తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పారు. ఆ మాట చంద్రబాబుతో ఎందుకు చెప్పించలేకపోయారు.? మళ్లీ జన్మభూమి కమిటీల పాలన తెస్తానని, వలంటీర్లను రద్దు చేస్తానని, గ్రామ, వార్డు సచివాలయాలను ఎత్తివేస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు. రాధాకృష్ణ ఎందుకు చెప్పించలేకపోయారు? అమ్మ ఒడి ఇస్తుంటే బటన్ నొక్కడం తప్ప జగన్ ఏమి చేస్తున్నారని ఆ రోజుల్లో రాధాకృష్ణ తెగ బాధపడ్డారు. అదే చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? ఇంటిలో ఒకరికి కాదు.. ఎంత మంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తానని చంద్రబాబు చెబితే రాధాకృష్ణ మాత్రం వైఎస్సార్సీపీపైన రోధిస్తున్నారు. జగన్ స్కీములతో రాష్ట్రం నాశనం అయితే, వాటన్నిటిని కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ లతో ఎందుకు చెప్పించారు.? ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలకపల్లి రవి వంటి వారి పేర్లు రాయకుండా సిపిఎం సంబంధాలు కలిగిన వారు జగన్‌కు అనుకూలంగా విశ్లేషణలు వదలుతున్నారట. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు ఇస్తున్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని అమాయకంగా ప్రశ్నించారు.2019 లో రాధాకృష్ణ ఎక్కడ మొహం పెట్టుకున్నారు? 2024లో జగన్ కు అనుకూల ఫలితం వస్తే ఈయన ఎక్కడ మొహం పెట్టుకుంటారు! ప్రశాంత కిషోర్ లో రాధాకృష్ణకు ఇప్పుడు విశ్వసనీయత కనిపిస్తోంది. అంత గొప్ప ప్రశాంత కిషోర్ తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎలా చెప్పారో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ఎలా చెప్పారో కూడా ఈయన వివరించాలి. చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలకు పదివేల రూపాయలు చొప్పున ఇచ్చినా ఓడిపోయారని, జగన్ పధకాల పేరుతోడబ్బు పంచితే ఓట్లు వేస్తారా అని రెంటిని సమం చేసే దిక్కుమాలిన ఆలోచన చేశారు. చంద్రబాబు ఎన్నికల కోసం పదివేల రూపాయలు ఇచ్చారు. జగన్ తను ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లపాటు స్కీముల ద్వారా లబ్ది చేకూర్చారు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా రాధాకృష్ణ వ్యాసాలు రాసిపడేసి, చేతిలో పత్రిక ఉందని అచ్చేసి, టీవీ ఛానెల్ ఉంది కదా అని ఊదరగొట్టేస్తే జనం నమ్ముతారా? ఎన్నికలకు ముందు ఆ సర్వే అని,ఈ సర్వే అని తెలుగుదేశంకు డప్పు వాయించిన రాధాకృష్ణ తినబోతూ రుచులు అడగకూడదని అంటున్నారు. ఆయన రాసిన చివరిమాటలోని అంగుళీమాలుడు అనే దొంగ పాత్ర అమరావతి పేరుతో మూడు పంటలు పండే వేలాది ఎకరాలను ధ్వంసం చేసిన చంద్రబాబు అవుతారు లేదా ఆయన సేవలో తరించే రాధాకృష్ణ అవుతారు తప్ప ఇంకొకరు కారు. జగన్ ను దూషించడం తప్ప, ఈయన చెత్తపలుకులో చేసిన విశ్లేషణ ఏముంది? ఏపీ ఫలితాలపై ఈయనకు గజిబిజి ఉందేమో కాని, ప్రజలకు మాత్రం కాదని చెప్పవచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎన్టీఆర్ షర్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. హీరో ఎన్టీఆర్ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో ఓబుల్‌రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి షాలిని కలిసి వెళ్లి, సామాన్యుడిలా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. దీనికి కారణంగా పోలింగ్‌కి ఆయన వేసుకొచ్చి చొక్కానే. ఆయన బ్లూ షర్ట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పరోక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకు మద్దతుగానే ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫోటోని వైరల్ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ తన కుటుంబ పార్టీ అయిన టీడీపీతో పాటు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకొనే ఎన్టీఆర్ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. లోకేష్ కోసమే చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ సభ్యులను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ స్నేహితులు కొడాలి నాని, వంశీ వైఎస్సార్సీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా.. వైఎస్సార్సీపీకి అనుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Superstar Jr NTR (@tarak9999) came out wearing BLUE Shirt to Vote Big Signal to his Fan. #VoteForFan pic.twitter.com/GJgmO5nlg7— Avesh Kumar Singh (@AveshKumarSingh) May 13, 2024 -
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన సినీ స్టార్స్
లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే ఏపీలో 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ మొదలైంది. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా పలువురు సీనీ సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఉదయం 7 గంటలకే భార్య ప్రణతి, తల్లితో కలిసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్‌కు ఉదయం 7.30 గంటలకే వచ్చిన బన్నీ.. అందరితో పాటు క్యూలో నిలబడి తన వంతు రాగానే ఓటు వేశాడు. అనంతరం మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. #WATCH | Telangana: Actor Jr NTR arrives at a polling booth in Jubilee Hills, Hyderabad to cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/irFIjHVGVq— ANI (@ANI) May 13, 2024 #WATCH | Telangana: Actor Allu Arjun casts his vote at a polling booth in Jubilee Hills, Hyderabad. #LokSabhaElections2024 pic.twitter.com/M0yhR7XLeP— ANI (@ANI) May 13, 2024 మెగాస్టార్ చిరంజీవి కూడా తన భార్య సురేఖ, కూతురితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. Actor and former Union Minister K Chiranjeevi along with his wife surekha and daughter stand in the queue to cast their vote at Jubilee hills club in Hyderabad #Chiranjeevi @TOIHyderabad #ElectionDay #Hyderabad pic.twitter.com/V0tSJd4wu3— Sudhakar Udumula (@sudhakarudumula) May 13, 2024 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' సినిమాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, భార్య రమా రాజమౌళి, కొడుకు కార్తికేయతో కలిసి హైదరాబాద్ లోని షేక్ పేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటేసిన మహేశ్‌బాబు, రామ్‌చరణ్.Flew from Dubai… Rushed to the polling booth directly from the airport, hence the tired looks..🙂Done! YOU? pic.twitter.com/kQUwa1ADG6— rajamouli ss (@ssrajamouli) May 13, 2024 ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఎఫ్ ఎన్ సిసి లో ఓటు వేసిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు, కుటుంబ సభ్యులు.. #KRaghavendraRao #ElectionDay pic.twitter.com/OydpOtOBmj— Vamsi Kaka (@vamsikaka) May 13, 2024 హైదరాబాద్ లోని ఎఫ్ఎన్ సీసీలో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వయసు సమస్యల కారణంగా మరో వ్యక్తి సాయంతో పోలింగ్ బూత్ లోకి వచ్చారు.Senior Versatile actor #KotaSrinivasaRao garu to cast his vote at FNCC pic.twitter.com/VOTzqZJg7W— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024టాలీవుడ్ నటులు మోహన్ బాబు, అతడి కొడుకు మంచు విష్ణు.. తిరుపతి జిల్లాలోని ఏ. రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.Actor @chay_akkineni cast their vote 🗳️ #Elections2024 #NagaChaitanya pic.twitter.com/wS51UCYnGr— Suresh PRO (@SureshPRO_) May 13, 2024#ManchuManoj exercised his right to vote @HeroManoj1#Elections2024 #LokSabhaElections2024 pic.twitter.com/gX0ciNPiB6— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 13, 2024పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల pic.twitter.com/hgI4v69IhW— Telugu Film Producers Council (@tfpcin) May 13, 2024 -
Watch Live: ఏపీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్
-
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
-
సీఎం జగన్‌పై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురికొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్‌నగర్‌లో బస్సుయాత్ర చేస్తున్న జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్‌ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నారంటే జగన్‌పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్‌ను దీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్‌పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్‌లో ఆందోళన..అలాగే.. జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విసరండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విషయాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్‌సీఎం జగన్ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజానీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్రపడిన చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభావం, అవకాశవాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తటస్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీలేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేకపోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. -
మంచి చేయడమే.. మాట తప్పకపోవడమే.. 'మన కల్చర్': సీఎం జగన్
పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్.. అంటూ మనపై వేలెత్తి చూపించే కార్యక్రమం నిత్యం జరుగుతోంది. యస్.. మన కల్చర్ మంచి చేయటం.. మన కల్చర్ మంచి మనసు..మన కల్చర్ మాట తప్పకపోవటం.. మన కల్చర్ బెదిరింపులకు లొంగకపోవడం.. అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. నమ్మకం.. ధైర్యం.. అభివృద్ధి.. సక్సెస్ స్టోరీపులివెందుల అంటే నమ్మకం. పులివెందుల అంటే ధైర్యం. పులివెందుల అంటే అభివృద్ధి. పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందులలో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెత్తుతోందంటే ఈ అభివృద్ధి, ఆ మార్పులకు మూలం నా తండ్రి, మనందరి ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ అయితే.. ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని సవినయంగా తెలియజేస్తున్నా. పులివెందులలో ఏముంది? అని ఒకప్పుడు అడిగిన పరిస్థితుల నుంచి పులివెందులలో ఏం లేదో చెప్పాలని అడిగే స్థాయికి మన పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మార్చుకుంటూ అడుగులు వేశాం. రాబోయే రోజుల్లో కూడా వేస్తాం.నమ్మకాన్ని నింపింది పులివెందుల బిడ్డలేఒక్కటి గమనించండి. మనందరి పులివెందుల మనకే కాదు... రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ప్రసాదించింది. మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని తెలుగు నేలపై అణువణువునా నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా.కాబట్టే ఆ చంద్రబాబుకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ, ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తుంటారు. పులివెందులను తెలుగుసీమ అభిమానించింది. నమ్మింది, కలిసి నడిచింది. పులివెందుల, కడప, రాయలసీమ మంచితనం, మాటపై నిలబడే గుండెధైర్యం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికీ అర్థమైంది కాబట్టే ఓ వైఎస్సార్, ఓ జగన్‌ను మారుమూల ప్రాంతాల్లో కూడా అభిమానించే కోట్ల మంది ఈరోజు కనిపిస్తున్నారు.కొత్తగా వైఎస్సార్ వారసులం అంటూ..వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, ఓ వదినమ్మ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు. వీరికి తోడు, వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్సార్ వారసులం.. అంటూ మీ ముందుకు వస్తున్నారు. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నా. ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలు, వైఎస్సార్‌ను ప్రేమించేవారు కాదా? ఒక్క విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.ఆ దివంగత మహానేత, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా, ఆయన చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జిషీట్లో పెట్టింది ఎవరు? ఒక వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? వైఎస్సార్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ పులివెందుల ప్రజలకు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్సార్ పోరాడిన వారితో కుమ్మక్కు!రాజకీయంగా అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితోనే కలిసిపోయి.. కాంగ్రెస్, టీడీపీతో చేయి కలిపి, వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్లందరితోనూ కలిసిపోయి, ఆ కుట్రలను అమలు చేస్తున్న శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా... వైఎస్సార్ వారసులు? వైఎస్సార్‌గారు బతికున్నంతకాలం ఎవరితో పోరాటం చేశారు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ను అభిమానించే అభిమానులు, కార్యకర్తలు ఎవరితో యుద్ధం చేశారు? అని ఆలోచన చేయమని కోరుతున్నా. కుట్రలో భాగస్వాములు వారసులా?వైఎస్సార్ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి, వారికి మోకరిల్లి, వారి స్క్రిప్టులను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ, వారి కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు? వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను, ఏకంగా ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్సార్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ ఉండకూడదని, ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెక్కలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు? ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్సార్ లెగసీకి ఓటు వేసినట్లా? లేక వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలకు ఓటు వేసినట్టా? రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా.వారి వెనుక ఎవరున్నారో కనిపిస్తూనే ఉందిఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంత మంది కలిసి ఏకమవుతున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతున్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా మీ అందరికి కనిపిస్తూనే ఉంది.ఆశ్చర్యం ఏమిటంటే.. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. ఔను నేనే చంపానని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరే చూస్తున్నారు కదా! నాడు చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలు, అధికార బలంతో ఓడించిన వారితో ఈరోజు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి? చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా? కాదా? ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లాడు? అవినాష్ పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో అడిగిన ప్రశ్నలు సహేతుకమే కదా! ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారిపై కూడా అడ్డగోలు ఆరోపణలతో కుట్ర రాజకీయాలు చేయడం ధర్మమేనా? చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా?కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబు, బీజేపీకి లాభంఅసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లెన్ని వచ్చాయి? నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన ఆ కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ గారి పేరును, ఆయన చనిపోయిన తర్వాత కూడా చార్జ్ షీట్లో చేర్చిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తంగా వైఎస్సార్ పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటం అంటే దానివల్ల ఎవరికి లాభమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అసలు ఎవరికి వైఎస్సార్ గారి మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. పులివెందుల, కడప గడ్డపై ఎవరికి ప్రేమ ఉందో ఆలోచన చేయండి. వైఎస్సార్, పులివెందుల, వైఎస్సార్ జిల్లా పేర్లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ఆలోచన చేయండి. మరోపక్క ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు కుట్రలు చేస్తున్నారో గమనించమని కోరుతున్నా. పేదలకు మంచి చేసేందుకే అధికారంపులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నామీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చుకున్నా. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న నా బంధువులకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. మరొక్క విషయం కూడా నిండుమనసుతో చెబుతున్నా.వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చా. అవినాశ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా అవినాశ్‌ను దూషించడం, అతడిని తెరమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. మా అందరికన్నా అవినాష్ చాలా చిన్నోడు. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా? మన పాలనలో మనసు, మానవత్వం..ఈరోజు పులివెందులలోగానీ, కడపలోగానీ మొత్తం తెలుగు నేలమీద గానీ ఒక జలయజ్ఞం, ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ.. వీటన్నింటితోపాటు మీ జగన్ తెచ్చిన అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, చేయూత, వైఎస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ,, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్, రైతు భరోసా, ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు, డీబీటీతో బటన్ నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయడం.. ఇవన్నీ మన మనసు, మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? నాన్న మరణం తర్వాత పట్టించుకున్నారా?నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా, ఎవరైనా మన పులివెందులను పట్టించుకున్నారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మళ్లీ పులివెందుల దశ మారింది ఎప్పుడంటే? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, ఈ 58 నెలల్లోనే కాదా? పులివెందులను, వైఎస్సార్ జిల్లాను ఇంకా అభివృద్ధి చేయాలి. వచ్చే ఐదేళ్లలో మీ అందరి అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా మన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్సార్, వైఎస్ జగన్.. ఇవన్నీ మనసున్న పేర్లు కాదా? ఈ పేర్లను చెరిపివేయాలనుకునే వారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులేనని గమనించాలని కోరుతున్నా. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్లు మన పులివెందుల అభివృద్ధి ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. మీ బిడ్డకు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అవినాశ్‌ను కూడా అంతే ఆప్యాయతతో, గొప్ప మెజార్టీతో దీవించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా. ► ఈ కార్యక్రమంలోఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి చేయడంలో మీ జగన్‌ను కొట్టలేరు!జగన్‌ను పథకాలలో కొట్టలేరు. పాలనలో, పనితీరులో జగన్‌ను కొట్టలేరు. పల్లెకు మంచి చేయడంలో జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు. జగన్‌ను రైతులకు అందించిన రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల్లో కొట్టలేరు. జగన్‌ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు. జగన్‌ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు.వారి ఆత్మగౌరవం కాపాడటంలో కూడా జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. తమ 14 ఏళ్ల పాలనలో జగన్ కంటే మంచి చేశాం అని వాళ్లు చెప్పలేరు. అందుకే ఆలోచన చేయమని అడుగుతున్నా. మన బ్రాండ్ జగన్, మన బ్రాండ్ వైఎస్సార్, మన బ్రాండ్ కడప, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సీఎం జగన్ నామినేషన్ దాఖలుపులివెందుల: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం సీఎస్ఐ చర్చి మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం 11.10 గంటలకు అంబకపల్లె రోడ్డు మినీ సెక్రటేరియట్లో ఉన్న ఆర్వో కార్యాలయానికి సీఎం రోడ్డు మార్గాన చేరుకున్నారు. 11.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో వెంకటేశులుకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప ఉన్నారు.అనంతరం సీఎం జగన్ భాకరాపురంలోని స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కాసేపు గడిపారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కడప బయలుదేరి వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద పులివెందుల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రుక్మిణి, కౌన్సిలర్ శైలజ, పలువురు మహిళలు గుమ్మడికాయతో ముఖ్యమంత్రికి దిష్టి తీశారు. కాగా, సీఎం జగన్ తరఫున పులివెందులలో వైఎస్ మనోహర్‌రెడ్డి గత సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. నా ప్రాణానికి ప్రాణం.. నా పులివెందుల పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. నన్ను నిరంతరం ప్రేమిస్తూ ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే పులివెందుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ జగన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. పులివెందుల అభివృద్ధికి మూలం వైఎస్సార్.పులివెందులను ఆదర్శంగా తీర్చిదిద్దాంపులివెందుల అభివృద్ధికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక.. ఆ కనిపిస్తున్న మెడికల్ కాలేజీ. నాన్న కలలుగన్న ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ఈమధ్యనే పులివెందుల ప్రజలకు అంకితం చేశాం. ఈ జూలై, ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానంలో భాగంగా రూ.900 కోట్లతో కాలేటివాగు సామర్థ్యాన్ని 1.02 టీఎంసీలకు పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గతంలో మూడు, నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితిని మారుస్తూ ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపు రూ.250 కోట్లు చెల్లించాం. 2020 నుంచి క్రమంతప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని ఏటా నింపుతూ వస్తున్నాం. పైడిపాలెం రిజర్వాయర్‌ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు తీసుకున్నాం.యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఏకంగా రూ.1,000 కోట్లతో ఎరబ్రల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు వేగంగా జరగడం మన కళ్లెదుటే కనిపిస్తోంది. వాటర్ గ్రిడ్ ద్వారా రూ.480 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీటి సరఫరా దాదాపుగా పూర్తయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ క్యాంపస్‌ను ప్రారంభించాం. ఏపీ కార్ల్‌లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతోపాటు వైఎస్సార్ వ్యవసాయ కళాశాల, ఉద్యాన కళాశాలలను నెలకొల్పాం. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమను పులివెందులకు తెచ్చాం. కేంద్రంతో పలుదఫాలు చర్చించి హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు సాధించాం. ఇవన్నీ మీ బిడ్డ సీఎం కాబట్టే కదా..పులివెందులలో కొత్త బస్టాండ్, క్రికెట్ స్టేడియం, పార్కులు లాంటివి మీరంతా చూస్తున్నారు. మొత్తంగా దాదాపు రూ.5,900 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరగడం కళ్లెదుటే కనిపిస్తోంది. ఇవన్నీ కాకుండా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము మరో రూ.2,069 కోట్లు ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పులివెందులలో నవరత్నాలు పథకాల ద్వారా 94.4 శాతం గడపలకు లబ్ధి చేకూరింది. చీనీ అమ్మకాలకు అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పులివెందులలోనే విక్రయించే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేశామంటే కారణం మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. – సాక్షి ప్రతినిధి, కడప -
28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈనెల 28న (ఆదివారం) ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు అంటే 27న (శనివారం) వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.కదన కవాతు..వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి. ఒకదానిని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచిపోయాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీ. మేర సాగిన బస్సు యాత్ర పొడవునా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకూ సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 బహిరంగ సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం తరలి వచ్చారు. దేశ రాజకీయ చరిత్రలో సీఎం జగన్ బస్సు యాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు జనసేన, బీజేపీలతో జతకట్టినా ప్రజల స్పందన కరువైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన సీఎం జగన్ బస్సు యాత్రతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో దూసుకెళ్తుంటే కూటమి శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురవుతున్నాయి.మంచిని వివరిస్తూ.. మోసాలను ఎండగడుతూఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఈ స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూర్చిన దాఖలాల్లేవు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిపథాన నిలిపారు. ఇదే అంశాన్ని సిద్ధం సభల్లో, బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలకు వివరించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టు కట్టి 650కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను వంచించటాన్ని, నాటి అరాచకాలను ప్రజలకు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తాజాగా విడుదల చేయనున్న మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్‌కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్‌కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్‌కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్‌కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్‌కి గిఫ్ట్‌గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు లోకేశ్‌తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్‌గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్‌లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్‌లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొడుకు దేవాన్ష్‌తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన
ముదిగుబ్బ నుంచి కదిరికి వెళ్లే మార్గం మధ్యలో నడిమిపల్లి వద్ద బస్సు దిగిన సీఎం.. ఓ వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడారు. ‘మీకు వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటి దగ్గరకు పెన్షన్ పంపిణీ నిలిపివేయించాడు’ అని చెప్పారు. ఈ క్రమంలో వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘చంద్రబాబుతో మాకు పనిలేదు. ఎన్నాళ్లు ఆపుతాడు? మాకు నువ్వే కావాలి. నువ్వుంటే మాకు ఏ కష్టం ఉండదు’ అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం విజయవంతంగా కొనసాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా బస్సు వెనుక యువత పరుగులు తీయడం గ్రామ గ్రామాన కనిపించింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలోని బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర మొదలైంది. అయితే ఉదయం 6 గంటల నుంచే బస కేంద్రం వద్దకు జనం భారీగా తరలివచ్చారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు చేరుకోవడంతో పండుగ వాతావరణం తలపించింది. రోడ్‌షో బత్తలపల్లి మండల కేంద్రానికి చేరుకునేలోపే రోడ్డుపై ఇసుకేస్తే రాలనంత మంది సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. బత్తలపల్లి జంక్షన్, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా భారీ గజమాలలతో ప్రజలు సీఎంను సత్కరించారు. అంజినమ్మ అనే మహిళ తన పొలంలో పండిన వేరుశనగ పంటను సీఎంకు అందించింది. ఈ క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా ఇతర పథకాలు అందాయా.. అని ఆమె కుటుంబ యోగ క్షేమాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అప్పస్వామి అనే వ్యక్తి సీఎం జగన్‌కు గొంగడి (కంబడి), గొర్రె పిల్లను బహూకరించారు. జన సముద్రాన్ని తలపించిన బత్తలపల్లి జంక్షన్లో సీఎం కాన్వాయ్ ఎంతో కష్టంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సీఎం రోడ్‌షో ఆ ఊరిలోనే కొనసాగిందంటే ఎంతగా అభిమాన జనం అడ్డుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పెత్తందారులతో పోరుకు మీ వెంటే అంటూ జనం నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం అంటూ గర్జించారు. కాన్వాయ్‌తో సమాంతరంగా పరుగులుపెట్టారు. మురిసిన ముదిగుబ్బ బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ మధ్య రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం సహా పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. రామాపురంలో బస్సు దిగి సీఎం జగన్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ముదిగుబ్బకు చేరుకునేలోపే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై బారులు తీరారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న చేదోడు తదితర పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడానికి, గౌరవ ప్రదమైన జీవనం కొనసాగించడానికి దోహదపడ్డ నాయకుడిని ఒక్కసారైనా చూడాలనే పట్టుదలతో ఆ ప్రాంత ప్రజలు పోటీపడ్డారు. మధ్యాహ్నం 2.50 గంటలకు ముదిగుబ్బ చేరుకున్న సీఎంకు గజమాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఎత్తున కదలివచ్చిన జనానికి బస్సుపై నుంచి సీఎం అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాలు సీఎం జగన్ ముదిగుబ్బ జనంతో మమేకమయ్యారు. అక్కడి నుంచి కదిరికి బయలుదేరిన సీఎం జగన్‌ను గ్రామగ్రామాన ప్రజాభిమానం అడ్డుకుంది. నాగారెడ్డిపల్లి గ్రామస్తులు భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం కదం తొక్కిన కదిరి కదిరి పట్టణంలోకి వస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో నేల ఈనిందా అన్నట్టు జనంతో కదిరి రోడ్లు కిటకిటలాడాయి. జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలు కదం తొక్కారు. సీఎం వస్తున్నారని ఉదయం నుంచే కదిరి పట్టణంలో పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ప్రజాభిమానం అడ్డు పడటం వల్ల నిర్దేశించిన షెడ్యూల్ కంటే మూడు గంటలు పైనే ఆలస్యం అయినప్పటికీ, తమ అభిమాన నేతను చూడాలన్న ఆశతో ప్రజలు ఓపికతో వేచి చూశారు. సాయంత్రం 5:45 గంటలకు కదిరిలోకి ప్రవేశించిన సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ సెల్ఫోన్లలోని టార్చ్లైట్లను ఆన్ చేసి ప్రజలు సీఎం జగన్ యాత్రకు సంఘీభావం తెలిపారు. ఇలా రాత్రి 7.55 గంటల వరకు సీఎం జగన్ రోడ్‌షో రెండు గంటల పాటు కదిరిలోనే కొనసాగింది. అనంతరం బస్సుపై నుంచి రోడ్‌షో నిర్వహించిన సీఎం జగన్.. పీవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ‘సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలానా మేలు చేస్తాం.. మాకు ఓటు వేయండి’ అని ప్రజలకు నాయకులు హామీ ఇవ్వడాన్ని చూస్తుంటాం. అయితే బస్సు యాత్రలో సీఎం జగన్‌ను కలిసిన పలువురు ‘మీ పాలనలో ఏదో ఒక రూపంలో మా ఇంటికి మేలు జరిగింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అని హామీ ఇస్తున్నారు. అటువైపు బీజేపీ, టీడీపీ, జనసేన, ఇలా ఎన్ని పార్టీలు, ఎంత మంది వ్యక్తులు కలిసి వచ్చినా మీ వెంట మేమంతా ఉన్నామంటూ ప్రజలు సీఎంకు భరోసానిచ్చారు. కదిరి నుంచి నల్లచెరువు, తనకల్లు మండల కేంద్రాల మీదుగా రాత్రి 10 గంటలకు చీకటివానిపల్లె విడిది కేంద్రానికి సీఎం జగన్ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యమైనా ప్రజలు, మహిళలు దారి పొడవునా వేచి చూశారు. ఇదే మా హామీ వితంతు మహిళనైన నాకు ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అండగా నిలిచారు. వితంతు పెన్షన్‌ను నెలనెలా ఒకటో తేదీనే ఇంటికి పంపారు. ఇంత మేలు చేసిన ఆయన్ను గెలిపించుకోకుంటే ఇంకెవరిని గెలిపించుకుంటాం? ఇది జగనన్నకు మా హామీ. – వెంకటలక్ష్మి, బత్తలపల్లి మళ్లీ జగన్‌ను గెలిపించుకుంటాం నాకు 60 ఏళ్లు పైనే ఉన్నాయి. కర్రసాయం లేనిదే నడవలేని పరిస్థితి. నా కొడుకు చనిపోయాడు. ఈ క్రమంలో నెలనెలా రూ.3 వేల పెన్షన్‌ను ఇంటికి పంపి పెద్ద కొడుకులా సీఎం జగన్ నన్ను సాదుకొచ్చాడు. ఆ టీడీపీ వాళ్లు వలంటీర్లతో పెన్షన్ పంచకుండా అడ్డుపడ్డారట. ఏం పర్లేదు. ఒకటి రెండు నెలలేగా.. మళ్లీ నా పెద్ద కొడుకు జగన్ ఇంటి దగ్గరకే పెన్షన్ పంపుతాడు. ఆయన్ను మేం గెలిపించుకుంటాం. – సాకలి చెన్నప్ప, కదిరి శివారు గ్రామం కుటగుళ్ల ఏమ్మా.. తల్లీ ఎలా ఉన్నారు? ‘ఏమ్మా తల్లీ.. ఎలా ఉన్నారు? ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా’ అంటూ మహిళా కూలీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముచ్చటించారు. బస్సు యాత్ర బత్తలపల్లి సమీపంలోకి వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డిని చూడాలన్న తపనతో పొలంలో వేరుశనగ తొలగిస్తున్న కూలీలు పరుగు పరుగున రోడ్డుపైకి చేరుకున్నారు. వారిని గమనించిన సీఎం వైఎస్ జగన్... బస్సు ఆపించి వారితో మాట్లాడారు. ‘ఆసరా డబ్బులు చేతికి అందాయా తల్లీ.. పొదుపు సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. అమ్మఒడి వస్తోందా...’ అని ఆరా తీశారు. తమను అంత ఆప్యాయంగా పలకరించే సరికి సంబరపడిన కూలీలు..‘మన ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయి సార్..’ అని బదులిచ్చారు. -
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్‌ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్‌ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్‌ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్‌తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్‌కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్‌కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్‌కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్‌కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్‌కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్‌గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్‌ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్‌కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్‌గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్‌రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్‌గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్‌గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్‌ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్‌కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్‌డీని అడ్డుపెట్టుకుని డాక్టర్‌గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్‌గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్‌కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్‌గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్‌పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్‌పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్‌పోర్టులో వీ.ఎం.థామస్‌గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్‌పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
March 30th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 30th Telugu Updates 9:50 PM, March 30th 2024 కాకినాడ: వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారు: కురసాల కన్నబాబు ఈ ఐదేళ్ళ కాలంలో వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది. ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు. తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు. దీని వల్ల నష్టం ఎవరికీ? రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు. ప్రజలకు అందే సేవలను నియంత్రించారు. ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది. మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు. వాలంటీర్లను నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం. చంద్రబాబు తీరు పూర్వం కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది 9:25 PM, March 30th 2024 కాకినాడ: చేబ్రోలులో పవన్ సభ అట్టర్ ప్లాప్ పవన్ సభకు జనం కరువు పవన్ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం 9:00 PM, March 30th 2024 ప. గో. జిల్లా: చంద్రబాబుని మాయల ఫకీరు, జిత్తులమారి నక్కగా అభివర్ణించిన మంత్రి కారుమూరి నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయించి వాలంటరీల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు ఎండలు మండుతున్నాయి . పెన్షన్ ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంట్రీలు అంటే ఇష్టం లేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంట్రీల పై పిర్యాదు చేయించాడు. వాలంట్రీల పై చంద్రబాబు నీచ బుద్ది కపట ప్రేమ ఈ రోజు బయట పడింది 8:50 PM, March 30th 2024 విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఫైర్ సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధమిది పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణం పెన్షన్ల పంపిణీ అంశం పై ఈసీ పునరాలోచించుకోవాలి పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం -ఎంపీ,కేశినేని నాని మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు నిమ్మగడ్డ రమేష్‌తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా... తొత్తులుగా మారారు చంద్రబాబు డైరెక్షన్ లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారు దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే -ఎమ్మెల్యే , మల్లాది విష్ణు నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు సమయంలో మూడురోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదు ఈ కుట్రకు కారణం చంద్రబాబే వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్లు ఇస్తున్న ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారు -ఎమ్మెల్యే ,వెలంపల్లి శ్రీనివాసరావు 7:40 PM, March 30th 2024 పల్నాడు జిల్లా: వాలంటర్లీపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమైంది: అంబటి రాంబాబు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు సీఎం జగన్‌పైన కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటరీ పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్‌కి ఫిర్యాదు చేయించాడు ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి పెన్షన్లు తీసుకునే వారి పైన కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు కాని బలవుతుంది వాలంటీర్లు కాదు... అవ్వ తాతలు వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు 6:00 PM, March 30th 2024 పాడేరు: మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు. రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు.. పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి. లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని ఓడించి తీరుతాం... గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా... ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా 5:34 PM, March 30th 2024 నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు అదే మాట మీద ఉండు రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు ఈ ఎలక్షన్‌తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు. అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు. అదే మాట మీద ఉండు. రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును. ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2024 5:06 PM, March 30th 2024 విశాఖ: చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నాడు: గుడివాడ అమర్నాథ్ పేదవాడికి - పెత్తందారుడికి మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ ముందే చెప్పారు అందుకే పేదవారికి టికెట్లు ఇస్తున్నారు టిప్పర్ డ్రైవర్, ఉపాధి హామీ కూలి, సామాన్య కార్యకర్త వీరందరికి సీఎం జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు ఇవన్నీ చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు చంద్రబాబు పెత్తందారీ పోకడలను ప్రజలకు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు 3:40 PM, March 30th 2024 కర్నూలు జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద సీఎం శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్సీలో చేరిన ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు 3:06 PM, March 30th 2024 నెల్లూరు జిల్లా: కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి నాకు గురువు తో సమానం: విజయసాయిరెడ్డి మహీధర్ రెడ్డి చేసిన మేలు నా జీవితంలో మరిచిపోలేను కందుకూరు లో పిలిస్తే పలికే దేవుడిగా మహీధర్ రెడ్డి అన్న ను ప్రజలు కొలుస్తారు కందుకూరు లో మహీధర్ రెడ్డి అన్న పోటీచేయలని కోరుకున్నా కానీ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా బీసీ అభ్యర్థికి కేటాయించారు భవిష్యత్‌లో మహీధర్‌రెడ్డి ఆలోచనల మేరకే కందుకూరులో పరిపాలన ఉంటుంది మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రజా సేవలోనే ఉండాలని కోరుకుంటున్నా మహీధర్ రెడ్డి అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుంది 2:57 PM, March 30th 2024 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : బాలినేని సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి బాబు అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు మరోసారి బాబుకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం 2:55 PM, March 30th 2024 ప్లీజ్.. నన్ను సపోర్ట్ చేయు గొల్లప్రోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో పవన్ సమావేశం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ స్థానిక పరిస్థితులు, సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని కోరిన పవన్ ఇండిపెండెంట్‌గా దిగితే ఇద్దరూ ఓడిపోతామని హెచ్చరిక 2:30 PM, March 30th 2024 విశాఖ: గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా శ్రీనివాసరావు పాల్పడ్డారు గంటా శ్రీనివాసరావు ఒక అవినీతిపరుడు గంట భూ అక్రమాలకు పాల్పడ్డాడని సైట్ కు ఫిర్యాదులు అందాయి జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు 4 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు 2:20 PM, March 30th 2024 నెల్లూరు జిల్లా: సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా: కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో కులాలకు అతీతంగా పనిచేశా నాకు టికెట్ రాలేదన్నా..బాధ లేదు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూధన్ యాదవ్‌ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం కార్యకర్తలు ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేసి కందుకూరులో వైస్సార్సీపీ జెండా ఎగరేయాలి 2:10 PM, March 30th 2024 చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్.. డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలవారిని అసెంబ్లీకి పంపాలనే ఆలోచన సీఎం జగన్‌ది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. 1:40 PM, March 30th 2024 చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్: ప్రతాప్ కుమార్ రెడ్డి చంద్రబాబు సభపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్. కావలిలో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్ అయ్యింది. జనాలు లేక గంటసేపు బస్సులో ఉండి ఆ తర్వాత 2000 మందితో సభ పెట్టుకొన్నారు. చంద్రబాబు హయాంలో కావలికి చేసింది ఏమీ లేదు.. శిలాఫలకాలు తప్ప. రామాయపట్నం, పోర్ట్ ఫిషింగ్ హార్బర్, రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సీఎం జగన్ ఆధ్వర్యంలోనే. గ్రావెల్ మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బోగోలు మండలం బిట్రగుంట వద్ద నేను భూములు ఆక్రమించానని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. 1:19 PM, March 30th 2024 ఏలూరు ఎంపీ సీటుపై కూటమిలో రగడ ఏలూరు పార్లమెంట్ సీటుపై బీజేపీలో అసమ్మతి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కామినేని ఆత్మీయ సమావేశానికి దూరంగా బీజేపీ నేతలు టీడీపీ పుట్టా మహేష్ కుమార్‌కి కేటాయించడంపై అభ్యంతరాలు గారాపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గారాపాటిపై అనుచరుల ఒత్తిడి రెండు మూడు రోజుల్లో గారాపాటి ప్రకటన? 1:16 PM, March 30th 2024 వర్మ ఇంట్లో పవన్ భోజనం గొల్లప్రోలు చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పవన్ వర్మ ఇంట్లోనే పవన్ భోజనం సాయంత్రం చేబ్రోలు రామాలయం వీధిలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ 1:12 PM, March 30th 2024 బండారుకు చంద్రబాబు పిలుపు బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు పిలుపు పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ బండారు తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిపాలైన వైనం మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ బుజ్జగించి చంద్రబాబు ఏ హామీ ఇస్తారో అనే చర్చ 1:09 PM, March 30th 2024 ఎచ్చెర్లలో బీజేపీ బీసీ నేతల ఆందోళన శ్రీకాకుళం ఎచ్చెర్లలో నడికుర్తి ఈశ్వర్ రావుకు టికెట్ ఇవ్వడంపై బీజేపీ బీసీ నేతల అభ్యంతరాలు కళా వెంకట్రావ్‌ను చీపురుపల్లికి పంపంచి మరీ.. బీజేపీకి టికెట్ ఇప్పించిన చంద్రబాబు బీసీలు అధికంగా ఉన్న చోట.. ఓసీకీ ఇవ్వడంపై బీజేపీ నేతల అభ్యంతరం అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు 1:05 PM, March 30th 2024 ఏప్రిల్ 1న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్ నేత రఘువీరారెడ్డి 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి 12:55 PM, March 30th 2024 గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు: వల్లభనేని వంశీ పేదవర్గాలన్నీ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉంది ప్రజలతో పాటు నాకు ఈ ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంది అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసింది నేను ఆ ప్రభుత్వంలోనూ పనిచేశా.. ఈ ప్రభుత్వంలోనూ పనిచేశా గత ప్రభుత్వాల్లో ఒకరు చనిపోతేనే మరొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వమే ఉత్తమమైనది అని నేను భావిస్తున్నా నన్ను ఓడిస్తానని నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు చెబితే సరిపోదు గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడున్న ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు గెలుస్తారు నిత్యం వార్తల్లో ఉండటానికి కొత్తగా వచ్చిన వారు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నేను 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 12:45 PM, March 30th 2024 జనసేసలో వీడని గందరగోళం.. జనసేన అభ్యర్థుల ప్రకటనలో వీడని గందరగోళం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరీ అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులను ప్రకటించని పవన్ కళ్యాణ్ పాలకొండకి అభ్యర్థి లేక వెతుకుతున్న జనసేన అవనిగడ్డలో అభ్యర్థిని ఇంకా ప్రకటించని జనసేన ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి వదిలేసిన జనసేన విశాఖ సౌత్ సీటుపై సందిగ్ధత విశాఖ సౌత్ సీటు కూడా టీడీపీకి వదిలేస్తారంటూ ప్రచారం విశాఖ సౌత్ సీటు వంశీ కృష్ణకి ఇస్తామని గతంలో పార్టీలో చేర్చుకున్న పవన్ విశాఖ సౌత్ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని జనసేన 12:25 PM, March 30th 2024 మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరీ మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థిగా బాలశౌరీ ఈ మేరకు అధికార ప్రకటన చేసిన పవన్ కల్యాణ్ కాకినాడ జనసేన లోక్‌సభ అభ్యర్థిగా ఉదయ్ ఇంకా పెండింగ్‌లో మూడు అసెంబ్లీ స్థానాలు 11:50 AM, March 30th 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి మనుగడ ఉండదు : విజయసాయిరెడ్డి చంద్రబాబు అమలు చేయలేని హామీలను ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోతాయి టీడీపీకి సిద్ధాంతాలు, విధివిధానాలు లేవు రాజకీయమే పరమావధిగా టీడీపీ నడుచుకుంటోంది ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండదు ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ, జనసేన కలిసిపోతాయి చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నిక అందుకే అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు ధనవంతులను పార్టీలోకి చేర్చుకుంటూ ధనంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు దేశ రాజకీయాల్లో ఇది దురదృష్టకరం 11:30 AM, March 30th 2024 గంటాకు వ్యతిరేకంగా సమావేశం.. భీమిలి నియోజకవర్గంలో మాజీమంత్రి గంటాకు వ్యతిరేకంగా సమావేశం. సమావేశాన్ని ఏర్పాటు చేసిన నియోజకవర్గం ఇన్చార్జ్ కోరాడ రాజబాబు. హాజరైన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు. గంటా శ్రీనివాస్‌కు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు. పార్టీ కోసం కష్టపడిన కోరాడ రాజబాబుకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టిన నేతలు. భీమీలి అసెంబ్లీ సీటు రాజబాబుకి ఇవ్వాలని తీర్మానం. పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేయకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం. 11:12 AM, March 30th 2024 సీపీఎం అరకు ఎంపీ అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స లోక్‌సభ ఎన్నికల బరిలో సీపీఎం ఒంటరిపోరు తొలి జాబితా విడుదల చేసిన జాతీయ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ఎస్టి) సీటుకు సీపీఎం పోటీ సీపీఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స 10:49 AM, March 30th 2024 మైసూర్ బోండాకు అంత సీన్ లేదు: వెల్లంపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను.. మైసూర్ బోండాంగా అభివర్ణిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా గతంలో మైసూర్ బోండా నియోజకవర్గంలో 32 డివిజన్లలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. బోండా ఉమా కు చిత్తశుద్ధి లేదు.. అందుకే ప్రజల నుంచి మద్దతు లేదు రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వైపే ఉన్నారు బోండా ఉమా కుల, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే వ్యక్తి రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలనందిస్తున్నారు బోండా ఉమా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడినంత మాత్రాన ఏమి జరిగిపోదు విజయవాడ సెంట్రల్ ప్రజలు బోండా ఉమను తరిమి కొడతారు. 10:29 AM, March 30th 2024 గంటాకు సీటు.. రెబల్‌గా జనసేన అభ్యర్థి పోటీ? భీమిలి సీటు గంటాకు కేటాయించడంపై భగ్గుమన్న జనసేన.. తీవ్ర అసంతృప్తి ఇండిపెండెంట్ గా పంచకర్ల సందీప్ పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి భీమిలిలో చందాలు వేసుకొని జనసేన పార్టీని గెలిపించుకుంటాం 10 సంవత్సరాల కష్టపడిన వారిని పవన్ కల్యాణ్ మోసం చేశారు పవన్ కళ్యాణ్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నాం భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి సహకరించేది లేదు పొత్తులో భాగంగా 21 స్థానాలు తీసుకోవడంపై అసంతృప్తి కష్టపడి కాకుండా కొత్తగా పార్టీ లోకి వచ్చినవారికి సీట్లు ఇస్తున్నారు నియోజకవర్గాల మారే గంటా శ్రీనివాసరావు సంగతి మాకు తెలుసంటున్న జనసేన శ్రేణులు 10:17 AM, March 30th 2024 నంద్యాల టీడీపీ సెక్రటరీపై కోడ్ ఉల్లంఘన కేసు నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేత నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు... నంద్యాల సాయి బాబా నగర్ లోని 24 వ వార్డులు ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా టీడీపీ శంఖారావం కిట్లను పంపిణీ చేసిన టీడీపీ నాయకుడు ఫిరోజ్ పై ఫిర్యాదు స్థానికంగా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో ఆధారంగా ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు 188 ఐపిసి సెక్షన్ క్రింద నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు... 10:15 AM, March 30th 2024 నాలుగో రోజు ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్న వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర కర్నూలు జిల్లా పత్తిపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర తగ్గలి ప్రజలతో నేడు ముఖాముఖి కార్యక్రమం మధ్యాహ్నాం అనంతపురంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ యాత్ర రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో బస 10:02 AM, March 30th 2024 విశాఖ YSRCPలోకి భారీగా చేరికలు గాజువాకలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పార్టీ కార్యాలయం ప్రారంభించిన రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన, టీడీపీ సీనియర్లకు YSRCP కండువా కప్పిన వైవీ సుబ్బారెడ్డి గాజువాకలో అమర్నాథ్ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపు మళ్లీ జగన్ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని ప్రజల్ని కోరిన సుబ్బారెడ్డి 9:30 AM, March 30th 2024 టీడీపీకి భార్ షాక్.. ఆత్మకూరులో టీడీపీకీ భారీ షాక్.. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటున్న అనంతసాగరం మండల అధ్యక్షుడు రవీంద్ర, మైనార్టీ నాయకుడు ఖాజావలి సహా మరో 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక జిల్లా పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన విజయ సాయిరెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అడ్డా.. మరోసారి పార్టీ జెండా ఎగరడం ఖాయమన్న విక్రమ్ రెడ్డి 9:00 AM, March 30th 2024 టీడీపీలో భగ్గుమంటున్న అసంతృప్త జ్వాలలు.. కడప జిల్లా రాజంపేట టీడీపీ అసంతృప్తి నిన్న అర్ధరాత్రి తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు. టీడీపీలో పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం అనుచరులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయం ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయం 8:40 AM, March 30th 2024 ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు.. చివరి జాబితా సీట్లు ప్రకటనపై అసంతృప్తి జ్వాలలు. పాడేరులో టీడీపీ ఫ్లెక్సీలు, ఇదేం ఖర్మ పాంప్లెట్స్ తగలబెట్టిన గిడ్డి ఈశ్వరి అనుచరులు. పాడేరు సీటు రమేష్ నాయుడుకు ఇవ్వడంపై గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తి. భీమిలి సీటు గంటాకు ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్న కోరాడ రాజబాబు. భీమిలిలో గంటాకు సహకరించేది లేదన్న జనసేన నేతలు. చీపురుపల్లి సీటు కళా వెంకట్రావు ఇవ్వడంపై కిమిడి నాగార్జున ఆగ్రహం. పార్టీకి రాజీనామా చేసిన కిమిడి నాగార్జున చంద్రబాబు ఫోటోతో ఉన్న కరపత్రాలు దహనం జనసేనకు నెలుమర్ల సీటు కేటాయించడంపై బంగార్రాజు అసంతృప్తి. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన బంగార్రాజు. పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి. నేడు అనుచరులతో సమావేశమవుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. 8:20 AM, March 30th 2024 గిరిజన నేతలను నట్టేట ముంచిన బాబు.. నమ్ముకున్న గిరిజన నేతలను నట్టేట ముంచిన చంద్రబాబు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థి దున్ను దొరే అంటూ రా కదలిరా సభలో ప్రకటించిన చంద్రబాబు. ప్లేట్ ఫిరాయించి ఆ సీటును బీజేపీకి అప్పగించిన బాబు. మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కు కూడా టికెట్ ఇస్తానని మోసం చేసిన బాబు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హ్యాండిచ్చి వేరొకరికి టికెట్ కేటాయించిన టీడీపీ హైకమాండ్ రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరిని కూడా వంచించిన టీడీపీ అధినాయకత్వం. చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ గిరిజన నేతలు. బాబు నమ్మించి మోసం చేశాడంటూ నేరుగా చంద్రబాబు ఇంటి వద్ద కొద్దిరోజులు క్రితం నిరసనకు దిగిన వంతల రాజేశ్వరి. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన దొన్ను దొర 8:00 AM, March 30th 2024 టీడీపీ అభ్యర్థికి నోటీసులు.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖత్కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసులు ఈనెల 25వ తేదీన సద్దాం హుస్సేన్‌పై చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు చీల్చి ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా కామెంట్స్ ఈ క్రమంలో తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు. దీంతో, చంద్రశేఖర్‌కు నోటీసులు జారీ చేసిన రిటర్నింగ్ అధికారి 7:45 AM, March 30th 2024 అనపర్తి టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి తూర్పు గోదావరిలో అనపర్తి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి అనుచరుల ఆగ్రహం.. టీడీపీ జెండాలు, సైకిల్ దహనం అనుచరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి కంటతడి పెట్టిన నల్లమిల్లి బుజ్జిగించేందుకు యత్నించిన అధినేత చంద్రబాబుతో ఫోన్లోనూ అసహనం ప్రదర్శించిన నల్లమిల్లి ఇవాళ రెండోరోజు ప్రజల ముందుకు నల్లమిల్లి బిక్కవోలులో నల్లమిల్లి కుటుంబ సభ్యుల పర్యటన నల్లమిల్లి తన సింపథీ డ్రామాలు ఆపి.. చంద్రబాబునే నిలదీయాలంటున్న వైఎస్సార్సీపీ 7:35 AM, March 30th 2024 అనంత టీడీపీలో అసమ్మతి జ్వాలలు టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి దక్కని టిక్కెట్ అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన టీడీపీ నేతలు అనంతపురం ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ వస్తుందని ఆశించిన జేసీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్నకు గుంతకల్లు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరామ్నకు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గుంతకల్లులో టీడీపీ నేతల నిరసన చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలు చించేసి దహనం చేసిన టీడీపీ నేతలు 7:30 AM, March 30th 2024 మేమంతా సిద్ధం@డే-4 నేడు కర్నూలు, అనంత జిల్లాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం(మార్చి 30) ఉదయం పత్తికొండ బస నుంచి ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం యాత్ర రాతన, తుగ్గలి, జోన్నగిరి మీదుగా సాగనున ఎన్నికల ప్రచార యాత్ర కర్నూలు జిల్లా తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి కానున్న సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశించనున్న ప్రచార రథం గుత్తి శివారులో భోజన విరామం గుత్తి, పామిడి, గార్లదిన్నె, అనంతపురం, రాప్తాడు మీదుగా సాగనున్న సీఎం జగన్ రోడ్ షో ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం శివారులో రాత్రి బస 7:25 AM, March 30th 2024 నేడు మూడు జిల్లాలో చంద్రబాబు పర్యటన నెల్లూరు, తిరుపతి, కడపలో ప్రతిపక్ష నేత ఎన్నికల ప్రచారం సూళ్లురుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరులో టీడీపీ బహిరంగ సభలు ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు 7:20 AM, March 30th 2024 పిఠాపురం ప్రచారం.. నేడు వర్మ ఇంటికి పవన్ నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం పిఠాపురంలో నాలుగు రోజుల పాటు ప్రచారం శక్తిపీఠం అమ్మవారి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి పవన్ వర్మ ఇంట్లో కేడర్, వివిధ వర్గాలతో సమావేశం సాయంత్రం బహిరంగ సభ 7:15 AM, March 30th 2024 ప్రచారంలోకి ఏపీ మాజీ సీఎం నేడు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ శనివారం మదనపల్లెలో రోడ్‌షోలో పాల్గొననున్న నల్లారి కిరణ్ 7:10 AM, March 30th 2024 పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి టీడీపీ తుదిజాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు అనంతపురంలో పార్టీ కార్యాలయానికి నిప్పు గుంతకల్లు కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు గుమ్మనూరు జయరాం టికెట్‌పై చెలరేగిన నిరసనలు సత్యవేడులో ఆదిమూలం మాకొద్దంటూ ర్యాలీ చీపురుపల్లి టీడీపీలో ‘కళ’కలం అనపర్తిపై ఫలించని ‘దేశం’ రాయబారం తంబళ్లపల్లెలో ఆవిర్భావ దినోత్సవానికి వర్గపోరు రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు బద్వేలు టీడీపీ అభ్యర్థికే బీజేపీ సీటంటూ ఆగ్రహం ‘గంటా’కు రూ. కోట్లున్నాయని టికెట్ ఇచ్చారంటూ ధ్వజం 7:00 AM, March 30th 2024 టీడీపీ అభ్యర్థి కొలికిపూడికి షాక్.. తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్‌కు షాకిచ్చిన మహిళలు గంపలగూడెం మండలం దుందిరాల పాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొలికపూడి సైకిల్‌కు ఓటేయాలని కోరిన కొలికపూడి తమకు సైకిల్ వద్దు.. ఫ్యానే కావాలన్న మహిళలు సైకిల్ రాదు.. ఫ్యాన్‌కే ఓటేస్తామన్న మహిళలు మహిళలు తిరగబడటంతో అక్కడ్నుంచి జారుకున్న కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు 6:50 AM, March 30th 2024 ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\ నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా 6:40 AM, March 30th 2024 కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు 6:30 AM, March 30th 2024 టీడీపీ, జనసేనలకు షాక్.. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు తాడేపల్లిగూడెంలో ఈలి నాని టీడీపీకి గుడ్‌బై ఆయన దారిలోనే నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ఇటీవలే టీడీపీని వీడిన ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణలు జనసేనకు రాం రాం.. తాజాగా జనసేనకు రాజీనామా చేసిన ముమ్మిడివరం నేత పితాని -
చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్ మారిందా?
సాక్షి, చిత్తూరు: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహంలా సింగిల్‌గా వస్తుంటే.. చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు. మరోవైపు.. చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం వెడుతోంది. వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టిసారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లను ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారు. ఇక, గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల హాడావుడి మొదలవగానే మొదటగా కుప్పంపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు. ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లలో మార్పు కనిపించింది. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మోజార్టీ భారీగా తగ్గింది. దీంతో బాబు సైతం షాకయ్యాడు. ఇక, తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లను తొలగించడంతో అటు చంద్రబాబు, ఇటు టీడీపీలో వణుకు మొదలైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతుండటంతో ఓటర్లు సైతం మార్పును కోరుకుంటున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుతో భయం మొదలైంది. -
Bus Yatra: 'మేమంతా సిద్ధం'.. YSRCPలో నయా జోష్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైసీపి అధినేత మరో 48 గంటలే.. కాగా, వైఎస్సార్సీపీ బస్సుయాత్ర మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈనెల 27న ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజీవ్ సర్కిల్, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర జరగనుంది. ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఫుల్ జోష్‌లో పార్టీ శ్రేణులు బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. -
Check Vote : ఓటు వివరాలు ఇలా తెలుసుకోండి
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో ప్రతి పౌరుడూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఓటరు జాబితాలో తన పేరు ఉన్నదో? లేదో? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న భారత ఎన్నికల కమిషన్... జాబితాలో ఓటు వివరాలు తెలుసుకునే సదవకాశాన్ని కల్పించింది. జాబితాలో ఓటు లేదని గుర్తిస్తే వెంటనే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్తగా ఓటరు నమోదుకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసే ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అనుబంధ జాబితాలో చేరుస్తారు. అందుబాటులో ఓటర్ హెల్ప్‌లైన్.. ● ఓటరు జాబితాలను పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ), తహసీల్దారు కార్యాలయంలో ఇప్పటికే అధికారులు అందుబాటులో ఉంచారు. ఆయా అధికారిక కార్యాలయాలకు వెళ్లి జాబితాను పరిశీలించి ఓటు హక్కు ఉందో... లేదో నిర్ధారించుకోవచ్చు. అలా కాకపోతే ఆన్లైన్లో చూసుకునే అవకాశాన్ని కూడా భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ● స్మార్ట్ఫోన్లలో ‘ఓటర్ హెల్ప్‌లైన్ యాప్’ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ఆప్షన్లు వస్తాయి. ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై’ కింద వచ్చిన ఆప్షన్లలో ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. ● కంప్యూటర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే వారు https:// electoralsearch.eci. gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, ఓటర్ ఐడీ నంబర్, స్టేట్ అనే చోట ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్‌ను క్లికి చేయగానే ఓటు వివరాలు కనిపిస్తాయి. ● ఓటు వివరాలు తెలుసుకునేందుకు 1950 టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి ఓటర్ ఐడీ నంబర్ చెబితే... అక్కడి సిబ్బంది ఆన్లైన్లో పరిశీలించి ఓటు ఉందా లేదా అనే విషయం చెబుతారు. ఓటు లేకపోతే నమోదు చేసుకోవాలి.. ఓటు లేదని తెలిస్తే వెంటనే ఓటరుగా నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్ఓ, తహసీల్దారు కార్యాలయంలో మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఫోన్ నంబర్‌తో అనుసంధానం ఇలా... ఓటును మీ మొబైల్ ఫోన్ నంబర్‌కు అనుసంధానం చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైనా మీ ఓటును సవరించాలనో, తొలగించాలనో చూస్తే వెంటనే అనుసంధానం చేసుకున్న నంబర్‌కు సంక్షిప్త సమాచారం అందుతుంది. ఈ సౌలభ్యం పొందేందుకు వెబ్‌లింక్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. http:// ceoaperms.ap.gov.in/ AP&MobileNoRegistration/MobileNo Registration.aspx లింక్‌ను తెరిచి, ఇందులో ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. దాని కిందనే ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. వెంటనే ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడీకి ఫోన్ నంబర్ అనుసంధానమవుతుంది. -
కోడ్‌లో ఏం చేయవచ్చు? ఏం చేయొద్దు?
కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ – ఎంసీసీ) అమలులోకి వచ్చింది. ప్రజాస్వామ్య పాలనలో అత్యంత కీలకమైన ఎన్నికలను ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా.. పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించే లక్ష్యంతో.. వివిధ రాజకీయ పార్టీల ఆమోదంతో కేంద్ర ఎన్నికల సంఘం చాలా దశాబ్దాల కిందటే కోడ్‌ను రూపొందించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందులో అనేక అంశాలను నూతనంగా చేరుస్తూ వచ్చారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు, ప్రజలు ఎన్నికల సమయంలో ఏవిధంగా నడచుకోవాలో కోడ్ వివరిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే ఇబ్బందులను కూడా పేర్కొంటుంది. తద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ కోడ్.. కొండంత అండగా నిలుస్తుంది. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్యను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా నియమించారు. కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేసేదే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కోడ్ అమలులో ఉంటుంది. ఏం చేయవచ్చంటే.. ● ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు. ● వరదలు, కరువు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లోని ప్రజలకు ఉపశమనం, పునరావాస చర్యలు ప్రారంభించవచ్చు. కొనసాగించవచ్చు. ● ఎన్నికల సమావేశాల నిర్వహణకు మైదానాల వంటి బహిరంగ స్థలాలు, హెలిప్యాడ్లు అన్ని పార్టీలకు, అభ్యర్థులకు అందుబాటులో ఉండాలి. ● సభలు, సమావేశాలు, రోడ్లపై ర్యాలీల నిర్వహణకు స్థానిక పోలీసు అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఏదైనా సమావేశం జరిగే ప్రదేశంలో నిర్బంధ లేదా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటే, వాటిని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, తగిన మినహాయింపులు, అనుమతులు పొందాలి. ● అభ్యర్థుల సభలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, ఇతర సౌకర్యాల వినియోగానికి పోలీసు లేదా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలి. ● సమావేశాలకు భంగం కలిగించే లేదా అశాంతి సృష్టించే వారితో వ్యవహరించేటప్పుడు పోలీసుల సహాయం పొందాలి. ● ఊరేగింపు, ర్యాలీ జరిగే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండాలి. ● ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ● పోలింగ్ శాంతియుతంగా, క్రమబద్ధంగా జరిగేందుకు అన్ని సమయాల్లోనూ ఎన్నికల అధికారులందరికీ సహకరించాలి. ● ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా బ్యాడ్జిలు లేదా గుర్తింపు కార్డులు ధరించాలి. ● ఓటర్లకు జారీ చేసిన గుర్తింపు స్లిప్పులు తెల్ల కాగితం పైనే ఉండాలి. సంబంధిత పార్టీ గుర్తు, అభ్యర్థి లేదా పార్టీ పేరు ఉండరాదు. ● ప్రచార సమయంలో, పోలింగ్ రోజున వాహనాల రాకపోకలపై నిబంధనల మేరకు పరిమితులు పాటించాలి. ●ఓటర్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల, పోలింగ్ ఏజెంట్లు మినహా ఇతరులు పోలింగ్ బూత్లోనికి వెళ్లరాదు. సంబంధిత అధికారి సిఫారసు లేఖ ఉన్నవారిని మాత్రం అనుమతిస్తారు. ఈ షరతుల నుంచి ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ లేదా ఎమ్మెల్యే వంటి ఉన్నత స్థానంలో ఉన్న వారికి సైతం మినహాయింపు లేదు. చేయకూడనివి ● కోడ్ అమలులోకి రాక ముందే వర్క్ ఆర్డర్లు జారీ చేసిన వాటికి సంబంధించి ఏ పనీ ప్రారంభించకూడదు. ● రోడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం వంటి పనులకు మంత్రులు, ఇతర అధికారులు ఎటువంటి ఆర్థిక గ్రాంట్లు లేదా వాగ్దానాలు ప్రకటించకూడదు. ● మంత్రులు, ఇతర అధికారులు (సివిల్ సర్వెంట్లు తప్ప) కొత్త ప్రాజెక్టులు, పథకాలకు పునాది రాళ్లు వేయకూడదు. ● అధికార పార్టీ సాధించిన విజయాల గురించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రకటనలు ఇవ్వరాదు. ● మంత్రులు, అభ్యర్థులు ఓటు వేయడానికి తప్ప, ఏ పోలింగ్ స్టేషన్ లేదా కౌంటింగ్ ప్రదేశంలోకి ప్రవేశించకూడదు. ● ఎలాంటి అధికారిక పనిని ఎన్నికల ప్రచారంతో కలపకూడదు. ● ఓటర్లను ఎటువంటి ఆర్థికపరమైన ప్రలోభాలకు గురి చేయరాదు. ● వివిధ కులాలు, వర్గాలు, మత, భాషా సమూహాల మధ్య పరస్పర ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఎటువంటి కార్యాచరణకూ ప్రయత్నించకూడదు. ● ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితంలోని ఏ అంశంపై విమర్శించరాదు. ● ఆలయాలు, ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు. ఈ ప్రదేశాల్లో ప్రచార పోస్టర్లు అతికించడం, సంగీతం ప్లే చేయడం నిషేధం. ● పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ఓటర్లను మభ్యపెట్టే చర్యలకు పాల్పడటం, బెదిరించడం, ప్రచారం చేయడం నిషేధించారు. ● పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహించరాదు. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లో తిరగరాదు. ● అభ్యర్థులు, ఓటర్ల అభిప్రాయానికి, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరి ఇంటి ముందు ప్రదర్శనలు లేదా పికెటింగ్ చేయరాదు. ● ఆయా యజమానుల అనుమతి లేకుండా వారి భూమి, భవనం, ప్రహరీ, వాహనాలను ఎవరూ ఉపయోగించరాదు. వారి ఇళ్లపై జెండా కర్రలు కట్టడం, బ్యానర్లు పెట్టడం, నోటీసులు అతికించడం, నినాదాలు రాయడం వంటివి చేయరాదు. ● మరో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రదేశాల వెంట ఊరేగింపులు చేపట్టకూడదు. ● ఊరేగింపుల్లో ఎటువంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండరాదు. ● పోలింగ్ రోజున ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసే స్థలం లేదా పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల పరిధిలో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ● సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా రాత పూర్వక అనుమతి లేకుండా వాహనాలపై అమర్చిన లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 10 గంటల తర్వాత ఉపయోగించకూడదు. ● రాత్రి 10 గంటలు దాటాక బహిరంగ సభలు, ఊరేగింపులు కొనసాగించడానికి అనుమతి ఉండదు. ● ఎన్నికల కోడ్ అమలు సమయంలో ఎక్కడా మద్యం పంపిణీ చేయరాదు. ● పోలింగ్ రోజున అధికారిక భద్రత కల్పించిన ఏ ఒక్కరూ తన భద్రతా సిబ్బందితో పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలోకి ప్రవేశించరాదు. -
కండువా కప్పుతాం.. పచ్చ కుట్ర మీరే చూడండి
అచ్చంపేట: నిన్నా మొన్నటి వరకు నియోజకవర్గం ఎటో కూడా తెలియని టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎలాగైనా వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులను వశపరుచుకునే కుటిల యత్నాలు మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్న వారిని సైతం ఇప్పుడే వెళుదువుగానంటూ తీసుకెళ్లి డబ్బు ఎరచూపి బలవంతంగా మెడలో పచ్చ కండువా కప్పి ఫొటోలు తీసి మా పార్టీలో వచ్చాడంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ఆనందపడి పోతున్నాడు. వివరాల్లోకి వెళితే... అచ్చంపేట–1 ఎంపీటీసీ షేక్ మహిద్దీన్ను ఇంటికి బుధవారం సాయంత్రం కొంతమంది టీడీపీ నాయకులు వచ్చారు. ‘నీతో పనుంది.. వెంటనే వద్దువు రమ్మనమని’ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన తమ పార్టీలోకి రమ్మంటూ ప్రలోభ పెట్టారు. అయినా వినకపోయే సరికి బలవంతంగా టీడీపీ కండువా కప్పి, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. అది చూసుకుని అవాక్కైన సదరు ఎంపీటీసీ మొహిద్దీన్ గురువారం ఉదయాన్నే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వద్దకు వెళ్లి తాను వైఎస్సార్ సీపీలోనే ఉన్నానన్నారు. ప్రాణం పోయినా వైఎస్సార్ సీపీని వీడేది లేదని, టీడీపీ వారు తమ పార్టీలోకి రావాలంటూ బలవంతంగా పచ్చ కండవా వేసి ఫొటోలు తీశారంటూ ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే చేత వైఎస్సార్ సీపీ కండువా కప్పించుకున్నారు. టీడీపీవి చీఫ్ పాలిటిక్స్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ టీడీపీవారు అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఏంచేశారో, ఇకపై ఏంచేస్తారో చెప్పుకునే ధైర్యంలేక ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో అలజడులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కానీ ప్రజలెవ్వరూ టీడీపీ మాటలు నమ్మే పరిస్థితులలో లేరని, గత 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరెవరికి ఎన్ని సంక్షేమ ఫలాలు అందాయో అందరికీ తెలుసునన్నారు. మంచి చేసే వారిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, మళ్లీ వైఎస్సార్ సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగసాని బాబు, అచ్చంపేట సర్పంచ్ షేక్ జాని, మాజీ సర్పంచ్ కంబాల వీరబాబు, వ్యవసాయ యూనివర్శిటి మాజీ డైరెక్టర్ నెల్లూరి చంద్రబాబు, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, రవి, ఈపూరి శ్రీనివాసరెడ్డి, విప్పర్ల వాసు తదితరులు పాల్గొన్నారు. తప్పు తెలుసుకుని తిరిగొచ్చాం అమరావతి: ప్రలోభాలకు లోనై గురువారం ఉదయం టీడీపీలో చేరిన అమరావతి గాజులపాలెం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సాయంత్రానికి తమ తప్పు తెలుసుకుని మళ్లీ సొంత గూటికి చేరారు. గురువారం సాయంత్రం క్రోసూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఓర్సు రవి, దేవాళ్ళ పవన్, పల్లపు రాజు, బండారు కోటేశ్వరరావులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈసందర్భంగా ఓర్సు రవి మాట్లాడుతూ మా కాలనీకి చెందిన ఓ వ్యక్తి మభ్యపెట్టి మీటింగ్ ఉందని తీసుకువెళ్లి టీడీపీ కండువాలు కప్పించారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలమైన తమను ఇష్టం లేకుండానే టీడీపీలో చేర్చారన్నారు. నిజం తెలుసుకొని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చామన్నారు. టీడీపీ నేతలు ఇలాగే మరికొంత మందిని ప్రలోభాలకు గురిచేయడానికి చూస్తున్నారని ఎవరూ నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తన్నీరు శ్రీనివాసరావు, కోవూరి వెంకటేశ్వరరావు, నండూరు కరుణకుమార్ పాల్గొన్నారు. -
యువతా మేలుకో... ఓటరుగా దరఖాస్తు చేసుకో
సాక్షి, నంద్యాల: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసి మీకు ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చు. ఎన్నికల రోజు ఓటు వేయాలి అంటే ముందుగా మీరు ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నా తుది ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు వేసేందుకు అనర్హులు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. తుది ఓటరు జాబితాలో పేరు లేని వారు.. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన వారు ఏప్రిల్ 15వ తేదీలోపు ఓటరుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే తుది ఓటరు జాబితాలో పేరును చేరుస్తారు. ఆన్లైన్లో... ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్వీఎస్పీ.ఇన్ వెబ్సైట్లో మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ‘రిజిస్టర్ యూజ్ ఏ న్యూ ఓటర్’ పై క్లిక్ చేస్తే ఫాం–6 దరఖాస్తు వస్తుంది. అక్కడే దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్‌కు రెఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా అదే వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ అడ్రస్‌కు వచ్చి మీ వివరాలను పరిశీలించి, నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు. అలాగే హెచ్‌టీటీపీఎస్//ఓటర్ పోర్టల్.ఈసీఐ.జీఓవీ.ఇన్ వైబ్సైట్లోకి వెళ్లి మీ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక వెబ్సైట్లో న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్‌లోకి వెళ్లి వివరాలు పొందుపరిస్తే నిర్ధారించుకున్నాక మీ పేరు ఓటరు జాబితాలో చేరుస్తారు. మొబైల్లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
Bus Yatra: జనంలోకి సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ( ఫైల్ ఫోటో ) ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇదీ చదవండి: ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో!? -
ఆదిలోనే హంసపాదు
కొవ్వూరు: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరులో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి బీజేపీ, జనసేన నేతలతో పాటు మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ వర్గీయులు, టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. తద్వారా రానున్న ఎన్నికల్లో ముప్పిడికి సహకరించేది లేదని చెప్పకనే చెప్పారు. మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొవ్వూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న వెంకటేశ్వరరావు నిర్వహించిన మొదటి సభలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి టీవీ రామారావుతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఇతర ముఖ్య నాయకులు, టీడీపీ ఆశావహులు పత్తా లేకపోవడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో మూడు పార్టీలు అంటూ పదేపదే ప్రస్తావించినప్పటికీ ఈ సభకు టీడీపీలోని కొంత మంది నాయకులు మాత్రమే హాజరు కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే తాను పోటీలో ఉంటానని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించడం, ఆయనకు పార్టీ ఆశావహులు జత కలవడం టీడీపీని కలవరపరుస్తోంది. ఈ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తలారి వెంకట్రావు ప్రస్తుతం గోపాలపురం ఎమ్మెల్యే కూడా. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ముప్పిడి 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అటువంటి అభ్యర్థిని తిరిగి కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా అది కూడా తలారి వెంకట్రావు పైనే పోటీకి దింపడమేమిటంటూ టీడీపీ శ్రేణులు తల పట్టుకుంటున్నాయి. తాజా పరిణామాలతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వెన్నుపోటు నేతలకు భంగపాటు
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్చంద్రబాబు అని తెలిసి కూడా..నాయకులుగా మలిచి.. చట్టసభలకు పంపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి మరీ.. ఆయన పంచన చేరారు. తీరా.. వారి అవసరం లేదని అనుకున్న చంద్రబాబు.. కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. విజ్ఞత కలిగిన పార్టీకి దూరమై.. విలువల్లేని పార్టీలో చేరి.. ఇప్పుడు వంచనకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు నేతలు వైఎస్సార్సీపీని వంచించి.. టీడీపీలో చేరి.. పాపాలు మూటకట్టుకున్నామంటూ అనుచరగణం ఎదుట బోరుమంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తూ.. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని.. ఆదరించిన పార్టీ విశ్వాసాన్ని అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు.. ఇప్పుడు బేల చూపులు చూస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొనేశారు. ఒడ్డు దాటే వరకే ఓడ మల్లన్న.. ఆ తర్వాత బోడి మల్లన్న అనే సూత్రాన్ని ప్రతిసారీ తూచ తప్పకుండా పాటించే నాయకుడు చంద్రబాబే అన్న విషయం జగమెరిగిన సత్యం. అది తెలిసి కూడా.. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తల్లిలా ఆదరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడా టీడీపీ.. టికెట్ ఇవ్వకుండా బలిపశువుల్ని చేయడంతో రోడ్డున పడ్డారు. ఫిరాయింపుదారుల రాజకీయ పరిస్థితి గాల్లో దీపాల్లా మారిపోయాయి. ‘కిడారి’ సీటుకు కిరికిరి..! రూ.కోట్లు.. మైనింగ్ లైసెన్సుల ఆశ చూపి.. మరో గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రవేసేశారు చంద్రబాబు. 2014లో వైఎస్ జగన్ నమ్మి అరకు టికెట్‌ని ఇస్తే.. వైఎస్సార్సీపీ దయతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. బాకై ్సట్ మైనింగ్ లైసెన్సుల కోసం ఆశపడుతున్నట్లు గ్రహించిన టీడీపీ.. కిడారికి.. అదే ఎర వేసేసింది. రూ.12 కోట్లు.. మైనింగ్ లైసెన్స్ ఇస్తామని లోకేష్ చెప్పడంతో.. జంప్ అయ్యారు. ఈ విషయాలన్నీ.. మావోయిస్టుల ఎదురుగా.. స్వయంగా కిడారి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు అప్పట్లో చెప్పడం కలకలం రేపాయి. మావోయిస్టుల చేతిలో కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురైన తర్వాత.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌ని ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా కనీసం అవకాశం ఇవ్వకుండానే ఆగమేఘాలపై చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత లోకేష్ కోసం మంత్రి పదవుల సర్దుబాటులో భాగంగా కిడారి శ్రావణ్‌తో మంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయించేశారు. ఆ తర్వాత 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా, పార్లమెంటరీ పార్టీ ఇన్‌చార్జీగా ఐదేళ్లుగా టీడీపీని అరకులో నిలబెట్టారు. అలాంటి కిడారిని కూడా కరివేపాకులా తీసిపారేయడంతో ఈ యువనాయకుడికి దిక్కుతోచని పరిస్థితి. అధినేతతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో భవిష్యత్తు కార్యచరణపై అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నైరాశ్యంలో ‘వంతల’ గిడ్డి, కిడారి బాటలో చంద్రబాబుని నమ్మి మోసపోయిన జాబితాలో వంతల రాజేశ్వరి కూడా చేరారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. టీడీపీ ఆకర్ష్‌లో భాగంగా.. తాను పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ 2016 మార్చిలో సంచలన వ్యాఖ్యలను బహిరంగంగా చేసిన వంతల.. ఏడాది కాలంలోనే వైఎస్సార్సీపీని వీడి.. డబ్బు ఆశ చూపిన పచ్చ కండువానే కప్పుకున్నారు. చట్టసభలకు పంపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే చివరి వరకూ నా రాజకీయ ప్రయాణమని చెప్పి.. ప్రలోభాల ఎరలో చిక్కుకొని టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వంతలను ఇంటిలోనే కూర్చోబెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గంలో టీడీపీని బతికించేందుకు వ్యయప్రయాసలతో ఐదేళ్లు పనిచేసినా.. చంద్రబాబు గుర్తించకుండా.. వంతల సేవలకు స్వస్తి చెప్పారు. టికెట్ రాకపోవడంతో రాజేశ్వరి నైరాశ్యంలో కూరుకుపోయారు. పార్టీ కోసం సేవచేసినా.. మిరియాల శిరీషకు టికెట్ రావడంతో చంద్రబాబు తనకు కూడా వెన్నుపోటు పొడిచేశారంటూ సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోకుంటే.. ముగ్గురు ఫిరాయింపుదారులకూ టీడీపీ చెక్ పెట్టింది. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన వారందరికీ.. చంద్రబాబు మళ్లీ వెన్నుపోటు పొడిచారంటూ ప్రజలే మాట్లాడుకోవడం విశేషం. రాజకీయాల్లో ఉన్న వారు.. పదవులు కోల్పోయినా.. ఇప్పుడు కాకపోతే మరోసారైనా విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. సానుభూతిని.. ప్రజలలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మాత్రం వైఎస్సార్సీపీని కాదని టీడీపీకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు చంద్రబాబుని నమ్మి పూర్తిగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే వీరి రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడినట్లే అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాలుపోని ఈశ్వరి.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి.. తర్వాత చంద్రబాబు మాయమాటలతో పార్టీ ఫిరాయించేశారు. రూ.5 కోట్ల డీల్ తోపాటు మంత్రి పదవి ఇస్తానని చెప్పి.. చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించడంతో.. అన్నలా ఆదరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాదని.. నయవంచకుడి పంచన చేరి.. 2018లో పచ్చ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి గిడ్డికి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. టీడీపీలో సరైన ప్రాధాన్యమివ్వడం తగ్గించేశారు. 2019 టీడీపీ నుంచి కష్టపడి టికెట్ సాధించి పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీకి అన్యాయం చేసిన గిడ్డి ఈశ్వరిపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు.. ఆమెని ఇంటికే పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈశ్వరిని పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నాలు చేస్తూ.. పొత్తుల్లో భాగంగా టికెట్‌ని బీజేపీకి కట్టబెట్టేశారు. దీంతో.. గిడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తన గోడు వినిపించేందుకు వెళ్దామని అనుకున్నా.. చంద్రబాబు రానివ్వడం లేదని తెలుస్తోంది. దీంతో.. గిడ్డి అనుచరులు మండిపడుతున్నారు. రెబల్‌గా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు చెబుతున్నా.. ఏం చెయ్యాలో పాలుపోక నడిసంద్రంలో నిలిచిపోయినట్లు తన పరిస్థితి ఉందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. -
కూటమికి ఓటమి తప్పదు!
రెండో ప్రపంచ యుద్ధం గొప్ప సైన్యాధ్యక్షుడైన జనరల్ మెకార్థర్ ఒక సందర్భంలో ‘‘నిజమైన నాయకుడు ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా నిలబడ తాడు, కఠిన నిర్ణయాలకు వెనుకాడడు, ప్రజా సంక్షేమమే తన కర్తవ్యంగా భావిస్తాడు’’ అంటారు. మార్చి పదో తేదీ మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ ప్రసంగం విన్న వారు, 58 నెలల పాలన చూసిన వారు జనరల్ మెకార్థర్ చెప్పిన ధీరోధాత్తుడి లక్షణాలు ఆయనలో చూస్తారు. మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి కట్టుగా వచ్చినా ప్రజా బలం ఉన్న తనను ఏమీ చేయలేరన్న ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపించింది. తన స్టార్ క్యాంపైనర్లు ప్రజలే నంటూ ఒంటరిగానే 175 సీట్లు గెలుస్తామన్న ధీమాను ఆయన మరోసారి వ్యక్తం చేశారు. కూటమిలోని పార్టీల గత ఎన్నికల ఫలితాలు, తాజా పరిణామాలు, సంక్షేమాభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి పరిశీలిస్తే మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.కూటమిలోని ప్రధాన పార్టీ తెలుగుదేశం క్రమంగా ప్రజాదరణ కోల్పోతోంది. ఎన్టీ రామారావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి సగటున 43.22 శాతం వోట్లు పొందగా చంద్రబాబు హయాంలో ఐదు సార్లు దేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళి 36.20 శాతం వోట్లు పొందింది. చంద్రబాబు హయాంలో సుమారు 7.02 శాతం ఓట్ బ్యాంక్ కోల్పోయిన ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ గతంలో కన్నా తక్కువ ఓట్లు పొందడం విశేషం. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్దినెలలకే చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చి వేశారు. ఆ ఏడాదితో పోల్చితే 1999 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ సుమారు ఒక శాతం, 2004 ఎన్నికల్లో 6.55 శాతం, 2009 ఎన్నికల్లో 9.47 శాతం, 2014 ఎన్నికలో 15.41 శాతం, 2019 నాటికి 3.54 శాతం ఓట్లు కోల్పోయింది. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు ఎన్నిక లకు వెళితే రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. అంతేకాక గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ 40 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సారి కూడా గెలవలేకపోయింది. పొత్తు వల్ల తాను తిరిగి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వెళతాననే భావనతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఆయనకు మద్దతునిస్తున్న మిత్రుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగినా ఆశ్చర్యపోనక్కర లేదు. కాపుల చిరకాల వాంఛ రాజ్యాధికారం. గతంలో చిరంజీవిని నమ్ముకున్న కాపులు నట్టేట మునిగారు. పవన్‌ను తమ ఆశయ సాధకుడిగా సామాన్య కాపులతో పాటు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్లు కూడా ఆశించారు. అయితే పవవ్ కమ్మ పాలకవర్గ ప్రతినిధైన చంద్రబాబుతో చేతులు కలిపి ఆయననే ముఖ్యమంత్రి చేయాలనే కృతనిశ్చయంతో ఉండడంతో కాపు సామాజిక వర్గం మరో సారి నిరాశకు గురయింది. అంతే కాక పవన్ గత ప్రసంగాల్లో పట్టుమని పదివేల ఓట్లు తెచ్చుకోలేని వారు కూడా టికెట్లు కావాలంటున్నారని నాయకులను ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని కాపుల కోసం మాత్రమే పెట్టలేదంటూ ఆ వర్గాన్ని దూరం చేసుకునే విధంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కులాల ప్రభావం అతిగానే ఉంది. కాపులు– కమ్మల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రంగా హత్యానంతరం ప్రారంభమైంది. చంద్రబాబుతో పవన్ చేతులు కల పడం, టికెట్ల విషయంలో దిగజారుడు తనాన్ని ప్రదర్శించడం; పవన్‌కు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులపై లోకేష్ చేసిన ప్రకటన తదితరాలను చాలామంది కాపులు జీర్ణించు కోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు 20 లక్షల వోట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి ‘నోటా’ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీతో పొత్తుకు చంద్రబాబు తహ తహలాడారు. ఆయన తన లక్ష్యమైతే నెరవేర్చుకున్నారుగానీ ఆ పార్టీ వల్ల సంభవించబోయే నష్టాన్ని అంచనా వేయలేక పోయారనిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పట్ల అనుమానంతో, అభద్రతా భావంతో ఉన్నారు. ఈ అభ ద్రతా భావమే వారిని ఏకం చేస్తోంది. కర్ణాటకలో హిజాబ్ వివాదం తర్వాత ముస్లిం పెద్దలందరూ ఏకమై బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌కు మద్దతునిచ్చి ఆ పార్టీ విజయానికి దోహద పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి తలెత్తినా ఆశ్చర్య పోనక్కర లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల్లో ముస్లిమ్‌లకు మూడు నుంచి 17 శాతం ఓట్లు ఉన్నాయి. 40 అసెంబ్లీ స్థానాల్లో, ముఖ్యంగా కర్నూలు (17 శాతం), కడప (16 శాతం), గుంటూరు (12 శాతం), అనంతపురం (11 శాతం), నెల్లూరు (10 శాతం), చిత్తూరు (10 శాతం) కృష్ణా (7 శాతం), ప్రకాశం (7 శాతం) జిల్లాల్లో జయాప జయాలపై వీరి ప్రభావం ఉంటుంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ముస్లిమ్ కుటుంబాల్లో 90 శాతం మంది లబ్ధిపొందారు. అందువల్ల వారిలో ఎక్కువ మంది వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికే మద్దతునిచ్చే అవకాశం ఉంటుంది. జగన్ ప్రభుత్వం కాలం మహిళలు, పేదలకు స్వర్ణయుగంగా మారింది. రాష్ట్రంలోని 90 శాతం గృహాలకు సంక్షేమ ఫలాలు అందాయి. గత 58 నెలలుగా ఈ ప్రభుత్వం వీరికి రూ. 12.75 లక్షల కోట్ల సంపద సమకూర్చింది. వీరికి నగదు బదిలీ, సంక్షేమ పథకాల రూపంలో సుమారు రూ. 4 లక్షల కోట్ల రూపాయలు,గృహాల రూపంలో లక్ష కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చింది. అంతేకాక మహిళలకు 31 లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా అందజేసింది. ఒక్కో ఇంటి స్థలం కనీస విలువ రెండున్నర లక్షల రూపాయలు అనుకుంటే ఆ 31 లక్షల ఇళ్ళ స్థలాల విలువ సుమారు రూ. 7.75 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సంక్షేమ పథకాల విలువ రూ. 12.75 లక్షల కోట్లుగా భావించాలి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్ కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. దేశంలోని మరే రాష్ట్రం పేదలకు, మహిళలకు ఇంత పెద్ద మొత్తంలో సంపద సమ కూర్చలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి వారే నిర్ణయా త్మక శక్తిగా మారే అవకాశం ఉంది. వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొబైల్: 89859 41411 -
Pawan Babu : బద్రీ.. దాన్నే వెన్నుపోటు అంటారు..!
-
Pawan - Babu : బద్రీ.. దాన్నే వెన్నుపోటు అంటారు..!
పొత్తు కుదిరిందట.. అసలు దాన్ని పొత్తు అంటారా.? ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం కానీ.. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగిందంటే.. కలిసి పోటీచేయాలని మూడు పార్టీలు.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిర్ణయించుకున్నాయని కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. పార్టీల బలబలాలను బట్టి స్థానాల నిర్ణయం ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని, అధికారం కోసం కాదని ప్రకటించారు. మూడు పార్టీల పొత్తులో రాష్ట్ర భవిష్యత్తు ప్రస్తావన ఏంటో .. ఆయనే చెప్పాలి కానీ చెప్పలేదు. ఈ పొత్తును జాగ్రత్తగా పరిశీలిస్తే.. పాపం పవన్ కళ్యాణ్ అని చిన్నపిల్లలైనా అంటారు. ఈ ఫోటో స్టోరీని కాస్తా సమయం పెట్టి చదవండి. మీరు కూడా అంటారా లేదా అప్పుడు చూద్దాం. వెనకాటికి ఒకడు.. నాది, మా రాజు గారిది కలిపి వంద ఎకరాలు అన్నాట్ట. అలా కాదురా అబ్బి.. నీ కెంత భూమి ఉందని అడిగితే.. మళ్లీ అదే సమాధానం చెప్పాడట. అలా కాదని నీ భూమి ఏది చూపించమంటే.. గట్టు చూపించాడట. అలా ఉంది చంద్రబాబు స్కెచ్. అధికారంలో వాటా ఇస్తాం.. సీట్లలో వాటా ఇస్తాం.. బాబ్బాబు.. కాస్తా రాగలరు అంటూ జైలుకు రప్పించుకుని మరీ పొత్తు ప్రకటన చేయించాడు. నీకు కావాల్సినవన్నీ ఇస్తాం.. కాపులంతా మనకే ఓటేసేలా చూడాలంటూ అదరగొట్టాడు. అప్పటికీ చంద్రబాబు గురించి తెలిసిన కొందరు "అబ్బీ.. ఈ వ్యవహారం షానా డేంజర్" అని పవన్‌ను హెచ్చరించారు. "గెలిస్తే.. నీకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా? కనీసం ఓ నెల పాటయినా నిన్ను కుర్చీలో కూర్చోబెడతారా? అసలు నీకు "అత్తారింటికి దారేది" టైపులో అసెంబ్లీకి దారుందా? " అంటూ జాగ్రత్తగా అడిగితే .. "గుడుంబా శంకర్" గయ్యిమన్నాడు. ఇప్పుడు ఎల్లో మీడియాకు చంద్రబాబు ఇచ్చిన లీకులేంటంటే.. "బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు అలాగే టిడిపికి 145 అసెంబ్లీ స్థానాలు, జనసేన, బీజేపీకి 30 స్థానాలు". ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతా.. ముఖ్యమంత్రి అవుతా.. అని ప్రకటించుకున్న నోటితోనే.. నేను రాజీ పడతా, రాజీ పడతా అని చెప్పుకోవాల్సిన దుస్థితిని చాలా అందంగా క్రియేట్ చేశాడు చంద్రాలు. ఎంతయినా బాబు గారి స్క్రీన్ ప్లే.. అబ్బో.. అదో అంతు లేని కథ. 50,60 సీట్లన్న పవన్ కళ్యాణ్‌ను 2 డజన్లకు తెచ్చాడు. అప్పటికీ పవన్ ఏమన్నాడు.. 24 అంటే 24 మాత్రమే కాదు, వాటి పక్కన మూడు పార్లమెంటు సీట్లున్నాయి.. అంటే ఓ 40 చోట్ల పోటీ చేస్తున్నట్టు లెక్క.. అని పాతకాలం మార్వాడీ కథ ఒకటి వినిపించాడు. ఇప్పుడు ఆ సీట్లలోనూ కోత.. కాదు కాదు ఊచకోత. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకోవాలన్న ఐడియా చంద్రబాబుది. ఆ ఐడియాను అమలు చేయాల్సిన బాధ్యత "అజ్ఞాతవాసి"ది. అందుకే నన్ను నానా మాటలు అంటున్నా.. చీవాట్లు పెడుతున్నా.. కాళ్లు పట్టుకుని పొత్తుకు ఒప్పిస్తున్నానంటూ "గబ్బర్ సింగ్" పలుకులు పలికాడు. ఇక్కడ బాబు మంత్రాంగం ఇప్పుడిప్పుడే సంపూర్ణంగా తెలిసివస్తోంది. గంజి వంచే సమయంలో అన్నం గిన్నెను దించినట్టు.. బీజేపీ అడిగిన సీట్ల మేరకు జనసేన సీట్లలో కత్తెర పడుతుందట. పైగా దీనికి త్యాగం అని పేరు పెడుతున్నారు. సింగిల్‌గా పోటీ చేయు నాయనా అంటూ "కాటమరాయుడికి" అప్పుడు అర్థం కాలేదు, బాబు వెంట తిరిగితే.. "తీన్మార్" అన్న విషయం కాస్తా ఆలస్యంగా "పంజా" పడిన తర్వాత గానీ అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా ఉన్న "ఖుషి" కాస్తా.. ఇప్పుడిప్పుడే ఆవిరవుతోంది. "జల్సా" చేద్దామనుకుని జనం ముందుకు రావాలనుకుంటే.. నిజాయతీగా రావాలి గానీ.. వెన్నుపోటులో పీహెచ్డీ చేసిన వాడెనక వస్తే.. కొట్టాల్సింది "శంకర్ దాదా జిందాబాదే". అన్నట్టు లక్ష పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ లిస్టులో "చివరికి మిగిలేది" పుస్తకం ఉందా? లేదా? జన సైనిక్స్.. కాస్తా చెప్పండి ప్లీజ్. -
Vasantha vs Devineni: బల ప్రదర్శనలో ఆంతర్యమేంటి?
జి.కొండూరు: మైలవరం నియోజకవర్గం టీడీపీ నుంచి గత పదిహేనేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావుకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం కోసం బల ప్రదర్శన చేసే స్థాయికి దిగజారాల్సిన వచ్చింది. నాడు దేవినేని ఉమా అన్న దేవినేని వెంకటరమణకు నందిగామ సీటు నిరాకరించి వేరే వ్యక్తికి కేటాయించినప్పుడు రమణ బలప్రదర్శన చేసి సీటు సాధించిన ఘటనలు నేడు మైలవరం నియోజకవర్గంలో రిపీట్ కావడంతో కేడర్ గందరగోళంలో పడింది. ఒక వైపు వసంత వెంకటకృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిని నేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు తన అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. మరో వైపు సీటు నాదేనంటూ దేవినేని ఉమా సైతం తన అనుచరులతో గొల్లపూడిలో శుక్రవారం సాయంత్రం శంఖారావం సభ నిర్వహించారు. నాడు దేవినేని వెంకటరమణ, మరో వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో రమణ విజయం సాధించినట్లే నేడు వసంత వెంకటకృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య జరుగుతున్న సీటు ఫైట్‌లో ఉమానే పంతం నెగ్గించుకుంటారని ఆయన అనుచరులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవినేని ఉమా శంఖారావం సభలో మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో టీడీపీ కేడర్ తమ నిర్ణయాన్ని ప్రకటించారని, మరో రెండు మూడు పర్యాయాలు మైలవరం సీటు తనదేనన్న భావనను అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. అంతే కాకుండా వసంత కృష్ణప్రసాద్‌కు ఎట్టి పరిస్థితులలో సహకరించవద్దని, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయాలని అనుచరులకు సూచించినట్లు సమాచారం. దేవినేని ఉమా, వసంత మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్న క్రమంలో బొమ్మసాని సైతం తగ్గేదేలేదన్నట్లు మైలవరం టీడీపీ సీటు తనకే కేటాయించాలని కోరుతూ తన అనుచరులను బుధవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్టుకు పంపి నేరుగా చంద్రబాబుకే వినతిపత్రం అందించేలా చేశారు. ఈ క్రమంలో మైలవరం టీడీపీ సీటు కోసం జరుగుతున్న త్రిముఖపోరులో అంతిమంగా నెగ్గేదవెవరో కానీ కేడర్‌లో ఏర్పడిన గందరగోళానికి మాత్రం ఇప్పటిలో తెరపడేలా లేదు. అధిష్టానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన దేవినేని ఉమా శంఖారావం పేరుతో అనుచరులతో సమావేశం మరోవైపు టీడీపీలో చేరేందుకు హైదరాబాద్ వెళ్లిన వసంత -
హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది...
అనకాపల్లి: హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది. పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండగా అసలే టీడీపీ పరిస్థితి దీనంగా ఉంది. దానికి తోడు జనసేనతో పొత్తు బెడిసికొట్టి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా గోడ దూకేస్తున్న దుస్థితి. అందుకే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘కొత్త’ నాటకానికి తెర తీశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. (పాత సీసాలో కొత్త సారా అనాలేమో) ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి కండువాలు కప్పి కొత్తగా చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారు. బుధవారం నాటి నాటకంలో పాత్రధారులు పాత కాపులే అన్న సంగతి తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో అయ్యన్నపాత్రుడి సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి 10 మంది టీడీపీలో చేరినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే టీడీపీ కండువాలు కప్పుకున్న వారంతా గతంలో తమ పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక వేస్తున్న ఎత్తులతో నవ్వువులపాలయ్యామని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్లీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో పార్టీలో చేరడం చాలా సిగ్గుచేటుగా ఉందని నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎద్దేవా చేశారు. ఆయన గురువారం విలేకర్లుతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఉప్పులూరి రంగా, కులం రాము, కంకిపూడి మంగరాజు, చంటిబాబు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరితో పాటు మరో నలుగురు 2019లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులేనని తెలిపారు. వీరికే మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ సుబ్రమణ్యం తదితర్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు. ‘‘నాతో వైఎస్సార్సీపీ నేతలు టచ్‌లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు’’ అని సతీష్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా’’ అని సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అందుకేనా లోకేష్ రాలేదు...
ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు టీడీపీ యువనేత లోకేష్ డుమ్మా కొట్టాడు పార్టీకి, కూటమిని సంబంధించిన కీలక సభలు, సమావేశాలకు లోకేష్ రాకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. మొన్న జరిగిన ఇరుపార్టీల సీట్ల పంపకం సభకు కూడా లోకేష్ రాలేదు... నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు సైతం లోకేష్ రాలేదు..? ఎందుకని ఏమి జరిగింది.. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు కానీ నేడు తాడేపల్లిగూడెం సభకు లోకేష్ ఎందుకు రాలేదు..? ఏమైనా బిజీగా ఉన్నారా ? ఎంత బిజీగా ఉంటేమాత్రం ఈ కార్యక్రమానికన్నా ముఖ్యమైనది ఏముంది... కానీ లోకేష్ రాకపోవడం మాత్రం అక్కడ చర్చకు దారితీసింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కాస్త ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేష్ అంగీకరించడం లేదని, అసలు పవన్ తో పొత్తే లోకేష్ కు ఇష్టం లేదని, అంటున్నారు. పవన్ కు కాస్త సినిమా క్రేజ్ ఉండడం.. అయన సభలకు జనం రావడం.. అయన కోసం చంద్రబాబు వెళ్లి కలవడం వంటివి తనకు అవమానంగా భావించిన లోకేష్ సాధ్యమైనంతవరకు పవన్ తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్నామధ్య టీవీఛానెల్ ఇంటర్వ్యలో కూడా లోకేష్ మాట్లాడుతూ పవన్‌ను పూచికపుల్ల మాదిరి తీసి పారేసారు. అధికారంలో పావనుకు వాటా ఇస్తారా అని ప్రశ్నించగా అస్సలు అలాంటి ప్రసక్తే లేదని, మొత్తం ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉంటారని, అసలు పవన్ ను ఆ దృష్టితో చూడడం లేదన్నట్లు చెబుతూ ఆయన్ను చాలా లైట్ అన్నట్లుగా మాట్లాడారు. ఇది జనసైనికుల్లో కాస్త ఆగ్రహాన్ని రేకెత్తించిన అయన మాత్రం తగ్గలేదు.. ఆంటే లోకేష్ దృష్టిలో పవన్ ఒక రాజకీయ నాయకుడు కాదు...కేవలం సినిమా హీరో మాత్రమే కాబట్టి ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదనేది అయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.. దీనికితోడు ఆ సభలో పవన్ కు క్రేజ్ ఉంటుంది.. క్యాడర్.. జనాలు కూడా పవన్‌ను చూసి కేకలు, అరుపులు ఉంటాయి తప్ప అక్కడ లోకేష్ ను ఎవరూ పట్టించుకోరు... అది కూడా లోకేష్ ఆబ్సెంట్ కు ఒక కారణం అని చెబుతున్నారు. పవన్ తో పొత్తులేకుండా సింగిల్ గా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచన అయితే దీన్ని చంద్రబాబు కాదని జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా అంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది . సిమ్మాదిరప్పన్న -
వసంత వర్సెస్ దేవినేని.. మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మైలవరం టీడీపీ రాజకీయాలు గందరగోళంగా మారాయి. టిక్కెట్టు లేదని దేవినేని ఉమాకు చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఆయనకు మైలవరం నియోజక వర్గం టిక్కెట్టుపై ఆశలు మాత్రం చావలేదు. ఏదో పని కలి్పంచుకొని మైలవరం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏదో అనారోగ్యంతో సాధారణంగా చనిపోయిన, దేవినేని ఉమాకు టిక్కెట్ రాకపోవడంతో బాధతో గుండె ఆగిపోయిందని ప్రచారం చేసుకొనే స్థాయికి ఆయన దిగజారారు. మొదటి నుంచి శవ రాజకీయాలు చేయడంలో స్పెషలిస్టుగా పేరున్న దేవినేని ఉమా చివరి యత్నంగా శవరాజకీయ అ్రస్తాన్ని బయటికి తీశారు. ఇది నియోజక వర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దేవినేని ఉమా చీప్ ట్రిక్స్ చూసి, నియోజక వర్గ ప్రజలు సైతం నవ్వుకొంటున్నారు. వసంత వర్గంలో కల్లోలం.... అధిష్టానం పిలిచి మాట్లాడినప్పటికీ దేవినేని ఉమా పోకడలో ఎటువంటి మార్పు లేకపోవడంతో వసంత వెంకటకృష్ణప్రసాద్ కోటరీలో కల్లోలం మొదలైంది. దేవినేనికి మైలవరం ఎమ్మెల్యే సీటు లేదంటూ గత ఆదివారం న్యూస్ వైరల్ అయిన రోజున మైలవరం మండలం, చండ్రగూడెంకు చెందిన టీడీపీ కార్యకర్త పుల్లారావు, సోమవారం ఇబ్రహీంపట్నంకు చెందిన నూతక్కి సురేష్‌లు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఈ ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దేవినేని ఉమాకి సీటు రానందుకే మృతి చెందారని చిత్రీకరించి వీరిద్దరి కుటుంబాలను దేవినేని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమా అనుచరులు వసంత డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన వైరల్ కావడంతో కల్లోలానికి గురైన వసంత వెంకటకృష్ణప్రసాద్ తన అనుచరుల చేత ఉమా శవరాజకీయాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. చండ్రగూడెంకు చెందిన పుల్లారావు అనారోగ్యంతోనే మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న ఆడియోలను సైతం వైరల్ చేశారు. అంతటితో ఆగకుండా ఉమ కుటుంబ చరిత్రను సైతం టచ్ చేసి ఆయన సోదరుడు రమణ మరణానంతరం వదిన ప్రణీతను చంపింది దేవినేని ఉమానేనంటూ, ఇటీవల మృతి చెందిన ఉమా సోదరుడు చంద్రశేఖర్ మృతికి సైతం పరోక్ష కారణం ఉమానే అంటూ సోషల్ మీడియాలో వసంత వర్గీయులు పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఆది నుంచి రాజకీయ శత్రువులే.. మెలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమానుకాదని, వసంత కృష్ణ ప్రసాద్‌కు సీటు కేటాయించడం అక్కడ టీడీపీ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా, దేవినేని ఉమా మాత్రం సహకరించేందుకు సిద్ధంగా లేడన్న భావన టీడీపీ క్యాడర్లో నెలకొంది. వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరకముందే. సోషల్‌మీడియా వేదికగా వస్తున్న పోస్టులు, వారి మధ్య సాగుతున్న మాటల యుద్ధం చూస్తుంటే టీడీపీ పుట్టి మునగడం ఖాయమని భావిస్తున్నారు. నోటా ఓటు వేయాలని.... వసంత వెంకటకృష్ణప్రసాద్పై టీడీపీ అధిష్టానం సోమ, మంగళవారాల్లో సర్వే జరిపింది. వసంతకు నో చెబుతూ నోటాకే తమ ఓటు అనేలా టీడీపీ కేడర్‌ను దేవినేని ఉమా వర్గీయులు సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
బడ్జెట్ పై ప్రతిపక్షం, విపక్షాల కామెంట్స్ పై బుగ్గన చురకలు
-
హామీలు నెరవేర్చని బాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు
-
బడ్జెట్ ఆమోదం తెలిపిన ఏపీ అసెంబ్లీ
-
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ
-
ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్ మెంట్ బిల్లుకు ఆమోదం