ఏపీ బడ్జెట్‌ సమావేశాలు: మండలిలో సత్యకుమార్‌ వ్యాఖ్యలపై దుమారం | AP Assembly Budget Session 2024 Day 2 Live Updates | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు.. అప్‌డేట్స్‌

Published Wed, Nov 13 2024 9:13 AM | Last Updated on Wed, Nov 13 2024 12:25 PM

AP Assembly Budget Session 2024 Day 2 Live Updates

AP Assembly Budget Session Live Updates 

విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు

  • 10 ప్రశ్నల్లో 7ప్రశ్నలపై జరిగిన చర్చ..
  • 3 ప్రశ్నలు వాయిదా..
  • జీరో అవర్ లో వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగిన సభ్యులు..

సత్యకుమార్‌ వ్యాఖ్యలు.. మండలి నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్‌

  • మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు పై ఎమ్మెల్సీ ల నిరసన
  • డయేరియా మరణాల బాధితులకు పరిహారం ప్రకటించాలని మండలిలో ఎమ్మెల్సీ ల ఆందోళన
  • శాసన మండలి నుండి వాకౌట్ చేసిన ఎమ్మెల్సీ లు
  • మంత్రి సత్య కుమార్ వ్యాఖ్యలకు నిరసన

 

డయేరియా మరణాల పై చర్చ లో మంత్రి సత్య కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • ప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యలు ని అవహేళన గా మాట్లాడిన మంత్రి సత్యకుమార్
  • డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది
  • 15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయని నవ్వుతూ మాట్లాడిన మంత్రి సత్య కుమార్
  • మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు పై బొత్స ఆగ్రహం
  • మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదు
  • ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు
  • కానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలి
  • ప్రతిపక్ష నాయకుడు బొత్స ఆగ్రహం

 

శాసన మండలి గుర్ల డయేరియా మరణాల పై శాసన మండలి లో తీవ్ర చర్చ

  • మంత్రి డయేరియా తో మరణాలు సంభవించలేదని ఎలా చెప్తారు
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పలేదా..?
  • ప్రభుత్వం ఎందుకు డయేరియా మరణాలను తగ్గించడం లో విఫలం చెందారు
  • మరణించిన వారికి గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు
  • ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదు?

శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

 

  • వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసేంత వరకు డయేరియా పై ముఖ్యమంత్రి స్పందించలేదు
  • వై ఎస్ జగన్ గుర్ల వెళ్లేంత వరకు హోంమంత్రి అనిత, వైద్య ఆరోగ్య మంత్రి వెళ్లలేదు
  • స్కూల్ బెంచిల  మీద పెట్టి వైద్యం అందించడం సిగ్గు చేటు

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

  • సెప్టెంబర్ లో తొలి డయేరియా మరణం సంభవించిన ప్రభుత్వం స్పందించలేదు
  • అందుకే డయేరియా మరణాలు పెరిగాయి
  • గుర్ల పరిసర గ్రామాల్లో మరణాలకు వేరేవేరే మరణాలని అబద్దాలు చెప్తున్నారు
  • తక్షణం ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించాలి

ఎమ్మెల్సీ సురేష్ బాబు

భూబదలాయింపు చట్టంపై వాడీవేడి చర్చ

  • భూబదలాయింపు చట్టంలో కొన్ని లోపాలున్నాయి.. వాటిని సరి చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
  • చట్ట వ్యతిరేకంగా వెళ్లినవారిపై చర్యలు తీసుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడు
  • చట్ట సవరణ లోపభూయిష్టంగా ఉందన్న మంత్రి అనగాని
  • సభలో మంత్రి అనగాని ప్రకటనపై ఎమ్మెల్సీ బొత్స అభ్యంతరం
  • ప్రభుత్వ విధానంపై వివరణ ఇవ్వాలి: ఎమ్మెల్సీ బొత్స
  • తప్పు జరిగినట్లు ప్రభుత్వం చర్యలు తీసుకొవచ్చు: ఎమ్మెల్సీ బొత్స
  • ఈ చట్టాన్ని కొనసాగిస్తారా? లేదా రద్దు చేస్తారా? స్పష్టత ఇవ్వాలి: ఎమ్మెల్సీ బొత్స

 

మహిళా పోలీస్ జాబ్ చార్ట్ పై అసెంబ్లీ లో చర్చ

సచివాలయాలలో మహిళా పోలీస్ జాబ్ చార్ట్ పై అసెంబ్లీ లో చర్చ
మహిళా పోలీసు అసలు పోలీసు శాఖతో సంబంధం ఉందా? పనిచేసేది ఎం పీ డీ ఓ పరిధిలో 
కానీ సెలవు ఇవ్వాల్సింది  లోకల్ సీ ఐ  
ఈ గందరగోళాన్ని నివారించాలి 
:::కూన రవి కుమార్

సరైన శిక్షణ కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న మహిళా పోలీసులను ఉమెన్ వెల్ఫేర్ శాఖలో కొనసాగించాలి 
:::నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

  • గ్రామ మహిళా పోలీసుల ను మహిళా సంరక్షణా కార్యదర్శులుగా 13,815 ని నియమించారు
  • దీనిపై కోర్టు లో కూడా 7 రిట్ పిటిషన్ లు ఉన్నాయి
  • గ్రామ మహిళా పోలీసు లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ల దాకా ప్రమోషన్ లు కూడా ఇచ్చే అవకాశం కల్పించారు
  • సభ సూచనలను తీసుకుని, పోలీసు శాఖతో చర్చించి మహిళా పోలీసుల కొత్త జాబ్ చార్ట్ ఇస్తాం

:::హోం మంత్రి అనిత

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వ వివరణ

  • అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలు
  • స‌మాధానం ఇచ్చిన మున్సిప‌ల్ & ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌
  • విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి) సిద్దం చేసాం: మంత్రి నారాయణ
  • ఈ ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర‌ప్ర‌భుత్వానికి పంపించాం: మంత్రి నారాయణ
  • కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ ప‌నులు ప్రారంభిస్తాం: మంత్రి నారాయణ
  • కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మెట్రో ప్రాజెక్ట్ పై స్వ‌యంగా కేంద్రమంత్రిని క‌లిసాను: మంత్రి నారాయణ
  • సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌ధాని మోడీకి లేఖ రాసారు: మంత్రి నారాయణ
  • విశాఖ‌ప‌ట్నంలో మొత్తం 76.90 కిమీ మేర రెండు ఫేజ్ ల‌లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో నిర్మాణం చేప‌డ‌తాం : మంత్రి నారాయణ
     

చంద్రబాబు పరిశ్రమలు తెచ్చారు: మంత్రి లోకేష్‌

  • గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు: మంత్రి లోకేష్‌
  • అనంతకు కియా పరిశ్రమ తీసుకొచ్చారు: మంత్రి లోకేష్‌
  • పరిశ్రమల కోసం ప్రతీ నెల రివ్యూలు జరిపేవారు: మంత్రి లోకేష్‌


YSRCP వాయిదా తీర్మానం

  • ఏపీ మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
  • విద్యుత్‌ ఛార్జీలపై చర్చ కోసం తీర్మానం
  • ప్రజలపై మోపిన భారంపై చర్చించాలంటున్న వైఎస్సార్‌సీపీ
  • తీర్మానం ఇచ్చిన తోట త్రిమూర్తులు, భరత్‌, తుమాటి మాధవరావు

 

  • శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

 

  • ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. రెండో రోజు సెషన్‌ ప్రారంభం

మూడు బిల్లులపై చర్చ
 

  • నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప్ర‌భుత్వం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • ఆంధ్ర ప్ర‌దేశ్ మున్సిప‌ల్ బిల్లు- 2024 ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నమంత్రి నారాయ‌ణ‌
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల బిల్లు-2024 ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న మంత్రి ప‌య్యావుల కేశ‌వ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement