Ayyanapatrudu
-
ఏపీ బడ్జెట్ సమావేశాలు: మండలిలో సత్యకుమార్ వ్యాఖ్యలపై దుమారం
AP Assembly Budget Session Live Updates విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన అసెంబ్లీఅసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు10 ప్రశ్నల్లో 7ప్రశ్నలపై జరిగిన చర్చ..3 ప్రశ్నలు వాయిదా..జీరో అవర్ లో వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగిన సభ్యులు..సత్యకుమార్ వ్యాఖ్యలు.. మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు పై ఎమ్మెల్సీ ల నిరసనడయేరియా మరణాల బాధితులకు పరిహారం ప్రకటించాలని మండలిలో ఎమ్మెల్సీ ల ఆందోళనశాసన మండలి నుండి వాకౌట్ చేసిన ఎమ్మెల్సీ లుమంత్రి సత్య కుమార్ వ్యాఖ్యలకు నిరసన డయేరియా మరణాల పై చర్చ లో మంత్రి సత్య కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలుప్రతిపక్ష నేత బొత్స వ్యాఖ్యలు ని అవహేళన గా మాట్లాడిన మంత్రి సత్యకుమార్డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోంది15 ఏళ్లలో ఎప్పుడు లేని మరణాలు వచ్చాయని నవ్వుతూ మాట్లాడిన మంత్రి సత్య కుమార్మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలు పై బొత్స ఆగ్రహంమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదుఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చుకానీ ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యత గా వ్యవహరించాలిప్రతిపక్ష నాయకుడు బొత్స ఆగ్రహం శాసన మండలి గుర్ల డయేరియా మరణాల పై శాసన మండలి లో తీవ్ర చర్చమంత్రి డయేరియా తో మరణాలు సంభవించలేదని ఎలా చెప్తారుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పలేదా..?ప్రభుత్వం ఎందుకు డయేరియా మరణాలను తగ్గించడం లో విఫలం చెందారుమరణించిన వారికి గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారుప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదు?శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసేంత వరకు డయేరియా పై ముఖ్యమంత్రి స్పందించలేదువై ఎస్ జగన్ గుర్ల వెళ్లేంత వరకు హోంమంత్రి అనిత, వైద్య ఆరోగ్య మంత్రి వెళ్లలేదుస్కూల్ బెంచిల మీద పెట్టి వైద్యం అందించడం సిగ్గు చేటుఎమ్మెల్సీ వరుదు కల్యాణిసెప్టెంబర్ లో తొలి డయేరియా మరణం సంభవించిన ప్రభుత్వం స్పందించలేదుఅందుకే డయేరియా మరణాలు పెరిగాయిగుర్ల పరిసర గ్రామాల్లో మరణాలకు వేరేవేరే మరణాలని అబద్దాలు చెప్తున్నారుతక్షణం ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించాలిఎమ్మెల్సీ సురేష్ బాబుభూబదలాయింపు చట్టంపై వాడీవేడి చర్చభూబదలాయింపు చట్టంలో కొన్ని లోపాలున్నాయి.. వాటిని సరి చేస్తాం: మంత్రి అచ్చెన్నాయుడుచట్ట వ్యతిరేకంగా వెళ్లినవారిపై చర్యలు తీసుకుంటాం : మంత్రి అచ్చెన్నాయుడుచట్ట సవరణ లోపభూయిష్టంగా ఉందన్న మంత్రి అనగానిసభలో మంత్రి అనగాని ప్రకటనపై ఎమ్మెల్సీ బొత్స అభ్యంతరంప్రభుత్వ విధానంపై వివరణ ఇవ్వాలి: ఎమ్మెల్సీ బొత్సతప్పు జరిగినట్లు ప్రభుత్వం చర్యలు తీసుకొవచ్చు: ఎమ్మెల్సీ బొత్సఈ చట్టాన్ని కొనసాగిస్తారా? లేదా రద్దు చేస్తారా? స్పష్టత ఇవ్వాలి: ఎమ్మెల్సీ బొత్స మహిళా పోలీస్ జాబ్ చార్ట్ పై అసెంబ్లీ లో చర్చసచివాలయాలలో మహిళా పోలీస్ జాబ్ చార్ట్ పై అసెంబ్లీ లో చర్చమహిళా పోలీసు అసలు పోలీసు శాఖతో సంబంధం ఉందా? పనిచేసేది ఎం పీ డీ ఓ పరిధిలో కానీ సెలవు ఇవ్వాల్సింది లోకల్ సీ ఐ ఈ గందరగోళాన్ని నివారించాలి :::కూన రవి కుమార్సరైన శిక్షణ కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న మహిళా పోలీసులను ఉమెన్ వెల్ఫేర్ శాఖలో కొనసాగించాలి :::నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యగ్రామ మహిళా పోలీసుల ను మహిళా సంరక్షణా కార్యదర్శులుగా 13,815 ని నియమించారుదీనిపై కోర్టు లో కూడా 7 రిట్ పిటిషన్ లు ఉన్నాయిగ్రామ మహిళా పోలీసు లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ల దాకా ప్రమోషన్ లు కూడా ఇచ్చే అవకాశం కల్పించారుసభ సూచనలను తీసుకుని, పోలీసు శాఖతో చర్చించి మహిళా పోలీసుల కొత్త జాబ్ చార్ట్ ఇస్తాం:::హోం మంత్రి అనిత విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వ వివరణఅసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలుసమాధానం ఇచ్చిన మున్సిపల్ & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణవిశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక(సీఎంపి) సిద్దం చేసాం: మంత్రి నారాయణఈ ప్రణాళికను ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి పంపించాం: మంత్రి నారాయణకేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం: మంత్రి నారాయణకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో ప్రాజెక్ట్ పై స్వయంగా కేంద్రమంత్రిని కలిసాను: మంత్రి నారాయణసీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాసారు: మంత్రి నారాయణవిశాఖపట్నంలో మొత్తం 76.90 కిమీ మేర రెండు ఫేజ్ లలో నాలుగు కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపడతాం : మంత్రి నారాయణ చంద్రబాబు పరిశ్రమలు తెచ్చారు: మంత్రి లోకేష్గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు: మంత్రి లోకేష్అనంతకు కియా పరిశ్రమ తీసుకొచ్చారు: మంత్రి లోకేష్పరిశ్రమల కోసం ప్రతీ నెల రివ్యూలు జరిపేవారు: మంత్రి లోకేష్YSRCP వాయిదా తీర్మానంఏపీ మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంవిద్యుత్ ఛార్జీలపై చర్చ కోసం తీర్మానంప్రజలపై మోపిన భారంపై చర్చించాలంటున్న వైఎస్సార్సీపీతీర్మానం ఇచ్చిన తోట త్రిమూర్తులు, భరత్, తుమాటి మాధవరావు శాసనసభలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రెండో రోజు సెషన్ ప్రారంభంమూడు బిల్లులపై చర్చ నేడు అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు - 2024 ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ బిల్లు- 2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నమంత్రి నారాయణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024 ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్ -
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
సాక్షి,అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ నేత కర్రి శ్రీనివాసరావుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు పప్పల అప్పలనాయుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాసరావు తప్పించుకోగా.. ఆయన సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడితో అప్రమత్తమైన బాధితుడి కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అయ్యన్నపాత్రుడి అనుచరుల దాడిపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ బాధితుడిని పరామర్శించారు. సర్కార్ గూండాగిరీ.. కి డ్నాపులు.. అక్రమ కేసులు.. దాడులు -
ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక.. వైఎస్ఆర్ సీపీ మద్దత్తుపై ఉత్కంఠ
-
అధికారులపై నోరు జారిన అయ్యన్న పాత్రుడు
-
చంద్రబాబు తీరుపై మాజీ మంత్రి అయ్యన్న ఆగ్రహం
-
టీడీపీ పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై కారుమూరి ఫైర్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకట్‌రెడ్డి. రాజకీయాల కోసం టీడీపీ నేతలు దిగజారిపోయారి ఎద్దేవా చేశారు. తన పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పమంటున్నామని ప్రశ్నించారు. కాగా, కారుమూరి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం మాట్లాడటం లేదు. ఇలాంటి నీచ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు?. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో చెప్పాలి. మా ప్రభుత్వ పాలనలో మేం చేశామో మేం చెబుతాం. మీ నైతిక పొత్తుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదు. పట్టాభి, అయ్యన్నపాత్రుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బూతులు తిట్టించడం చంద్రబాబు అలవాటే. నోరు అదుపులో పెట్టుకొండి.. మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను. ఒళ్లు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొండి. మీ మాదిరిగా మేము మాట్లాడితే, ఒక్కరోజు కూడా మీరుండ లేరు. మాకు సంస్కారం ఉంది. అదే మాకు మా నాయకుడు నేర్పారు. మేము రాజకీయాల్లో ఫెయిర్‌గా ఉన్నాం. ఓడినా వెనక్కు తగ్గలేదు. ప్రజల్లో ఉన్నాం. అఖండ మెజారిటీతో గెల్చాం. మళ్లీ 2024లో కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కచ్చితంగా మళ్లీ ఘన విజయం సాధిస్తాం. ప్రజలే బుద్ధి చెబుతారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విలువలు, విశ్వసనీయత, ప్రజలను నమ్ముకున్నారు. మీ మాదిరిగా పొత్తులు, అనైతిక రాజకీయాలు చేయబోం. మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఏం చేసినా, ఎన్ని బూతులు తిట్టించినా మీ సంస్కారానికి వదిలేస్తున్నాం. మళ్లీ మా విజయాన్ని ఆపలేరు. అంతేకానీ, ఈ తరహాలో విమర్శలు, మీ అనుకూల పత్రికల్లో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటే, ప్రజలే మీకు బుద్ధి చెబుతారు. పాలిటిక్స్‌లో క్లియర్‌గా ఉండండి. ఓపెన్‌గా రండి అంటూ సవాల్ విసిరారు. -
ఇక మారరా అయ్యన్నా మీరు ?
-
‘పవన్ మీద రెక్కీ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసినది తప్పని చంద్రబాబు అంగీకరించారు. కానీ, అంతమాత్రానికే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయటం తప్పుకాదా?. కోర్టును తప్పుదారి పట్టించటం తప్పుకాదా? అంటూ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. కాగా, జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ కేసులోనూ అరెస్టు చేయకూడదని చంద్రబాబు అంటున్నారు. నారా వారి రాజ్యాంగాన్ని అమలు చేయాలా?. పోలీసులు, అధికారులు, కోర్టులు అందరినీ బెదిరిస్తారా?. మీకంటూ ఒక సిద్దాంతం లేదా?. అయ్యన్నపాత్రుడు 420 పనిచేస్తే మా బీసీలకు ఏం సంబంధం?. ఒక బీసీగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవచ్చా?. చంద్రబాబు గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టటం తప్ప ఏం మాట్లాడారు?. ఎన్ని వేషాలు వేసినా, జాకీలతో లేపినా టీడీపీ లేవలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో బీసీలంతా బలమైన నాయకులుగా ఎదిగారు. అయ్యన్న తప్పు చేసినందు వల్లే అరెస్టు అయ్యాడు. దానికీ మా బీసీలకు ముడి పెట్టవద్దు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు కూడా మాట్లాడటం సిగ్గుచేటు. చంద్రబాబుకు అసలు విలువలు, సభ్యత, సంస్కారం ఉందా?. చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా మా బీసీలు ఆయనవెంట నడవరు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతమంది బీసీలకు పదవులు ఇవ్వలేదు. కుప్పంలో కూడా చంద్రబాబు ఓటమి తప్పదు. ఆయన చేయించుకున్న సర్వేలో కూడా అదే తేలింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వారంతా చంద్రబాబు మనుషులే. ఏదైనా చేసి మా మీద బురద చల్లాలని చూస్తున్నారేమో. చంద్రబాబులా కుట్రలు పన్నే అవసరం మాకులేదు. దీనిపై తెలంగాణ పోలీసులు విచారణ జరపాలి’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు -
అయ్యన్న పాత్రుడు తప్పును ఒప్పుకోవడం మంచిది: తానేటి వనిత
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్థలం కబ్జాపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి తానేటి వనిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. దాన్ని గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు 15 రోజులకు ముందే నోటీసులు ఇచ్చారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు వచ్చారు. మహిళలను, దళితులను తన భర్త కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణం. దీన్ని రాజకీయ కుట్ర అనడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకువస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి మా అధినేతపై కేసులు పెట్టడాన్ని రాజకీయ కుట్ర అంటారు. మా నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఎయిర్‌పోర్టులో నిర్బంధించడం రాజకీయ కుట్ర అంటారు. మేము ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ రకంగా చేయటం సరికాదని చెబుతున్నాము. తప్పును ఒప్పుకోవడం మంచిది. మా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’’ అని హితవు పలికారు. ఇది కూడా చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు -
అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యన్న కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారంటూ సర్వేయర్‌ను అయ్యన్న అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో అయ్యన్న అనుచరులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన వారు ఆవేశంతో ఊగిపోయారు. అనంతరం.. పోలీసులతో అయ్యన్న అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇది కూడా చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు -
వెన్నుపొటు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్
-
టీడీపీ నేత అయ్యన్నపై విశాఖ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ నాయకులు
-
జోగి రమేష్‌పై టీడీపీ దాడి
తాడేపల్లి రూరల్/మంగళగిరి : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులపై చంద్రబాబు ఇంటి ఎదుట టీడీపీ నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న తీసుకువచ్చిన మరికొందరు రౌడీలు రమేష్‌ను తోసివేసి.. కర్రలు, రాళ్లతో వీరంగం సృష్టించారు. టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు సీఎం జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించడమే తప్పన్నట్లుగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వారి అరాచకంతో శుక్రవారం ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఎంను బండబూతులు తిట్టిన అయ్యన్నపాత్రుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ జోగి రమేష్ తన అనుచరులతో కలసి కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న టీడీపీ నేతలు.. రాళ్లు, కర్రలు సిద్ధం చేసుకుని కిరాయి రౌడీలు, పార్టీ కార్యకర్తలతో అక్కడ మోహరించారు. చంద్రబాబు నివాసం వద్దకు జోగి రమేష్ కారు రాగానే మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్దా వెంకన్న, కొందరు కార్యకర్తలు, రౌడీషీటర్లు రెచ్చిపోయి ఆయన కారుపై దాడి చేశారు. వెంటనే జోగి రమేష్ కిందకు దిగి తాను శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తే, ఇదేం పని.. అని ప్రశ్నిస్తుండగా బుద్దా వెంకన్న జోగి రమేష్‌ను వెనక్కు నెట్టేశారు. ‘ఏంట్రా నా కొ.. మీరు మాట్లాడేది? మీ ముఖ్యమంత్రికి, మీకు చెమడాలు తీస్తాం. ఇక నుంచి మిమ్మల్ని రోడ్ల మీద తిరగనీయం. ఏం చేస్తారో చేసుకోండి’ అంటూ జెండా కర్రలతో దాడి చేశారు. వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు మీదకు వచ్చి రాళ్లు విసిరారు. బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూ.. దాడి సమయంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు సీఎం జగన్‌ను రాయలేని భాషలో బూతులు తిడుతూ కర్రలతో చెలరేగిపోయారు. తమ అనుకూల మీడియాలోనే బూతులు తిడుతూ కొందరు నేతలు లైవ్‌లో మాట్లాడడం గమనార్హం. దాడి చేస్తున్న టీడీపీ నేతల్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీసులను సైతం వారు ఇష్టానుసారం దుర్భాషలాడారు. ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి.. ఎమ్మెల్యే జోగి రమేష్‌ను పోలీసులు తమ వాహనంలో రెండు కిలోమీటర్లు తీసుకెళ్లాక, టీడీపీ రాష్ట్ర నాయకుడు, టీఎన్ఎస్ఎఫ్ మాజీ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం మళ్లీ దాడి చేశాడు. కాన్వాయ్‌ను ఆపి కారు డ్రైవర్‌ను కిందకు దిగరా అంటూ విచక్షణా రహితంగా కారు అద్దంపై చెప్పుతో కొట్టాడు. ఆ తర్వాత బండ రాయి తీసుకుని కారు అద్దాలను పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి యత్నించాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నించగా బండిపై పరారయ్యాడు. ఇంట్లో నుంచి చంద్రబాబు డైరెక్షన్ టీడీపీ నేతలు జోగి రమేష్‌పై దాడి చేస్తున్న సమయంలో చంద్రబాబు ఇంట్లోనే ఉండి ఏం చేయాలో సూచించారు. దాడి విషయం టీవీల్లో వస్తుండడంతో తమపైనే దాడి జరిగిందని చిత్రీకరించేందుకు ఉన్నట్టుండి బుద్దా వెంకన్నను పక్కకు పంపి కింద పడిపోవాలని సూచించారు. దీంతో అప్పటి వరకు గొడవ చేస్తున్న ఆయన.. ఉన్నట్లుండి రోడ్డు పక్కన పడిపోయారు. ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే మళ్లీ లేచి మీడియాతో ఉత్సాహంగా మాట్లాడారు. గొడవ తర్వాత దాడి చేసిన వారంతా చంద్రబాబు నివాసం లోకి వెళ్లగా, ఆయన బయటకొచ్చి గట్టిగా బదులిచ్చారని అభినందించారు. చంద్రబాబు పెద్ద గూండా చంద్రబాబు ఒక పెద్ద గూండా అని ఎమ్మెల్యే జోగి రమేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి పోలీస్‌స్టేషన్, డీజీపీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజల దృష్టిలో దేవుడిగా మారిన వైఎస్ జగన్‌ను ఇష్టానుసారం మాట్లాడితే సహించే ప్రసక్తే లేదన్నారు. తిక్కతిక్క వేషాలు వేసినా, సీఎం జగన్‌పై తిక్కతిక్కగా మాట్లాడినా తాట తీస్తామని చెప్పారు. అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు చంద్రబాబును రాష్ట్రంలో తిరగనీయమని హెచ్చరించారు. దాడిచేసిన వారిపై పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్ద తమపై దాడి చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మరికొందరు శుక్రవారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జోగి రమేష్‌తో పాటు సీఎం, డీజీపీలపై కూడా కేసులు నమోదు చేయాలని కోరినట్టు బుద్దా వెంకన్న తెలిపారు. టీడీపీ నేత అయ్యన్నపై ఫిర్యాదు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడిపై విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కొండా రమాదేవి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తలారి రాజేంద్ర కూడా తిరుపతి ఈస్టు పోలీస్ స్టేషన్లో అయ్యన్నపై ఫిర్యాదు చేశారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ గ్రంథాలయం వద్ద విద్యార్థులు అయ్యన్నపాత్రుడు దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి.. కోడిగుడ్లు, టమాటాలతో కొట్టారు. అయ్యన్నను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. -
అధికారులపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోటిదురుసు
-
నిందితుల్ని కలిసిన మాజీ మంత్రి తనయుడు
విశాఖ : విగ్రహాల ధ్వంసం దుష్ర్పచారంపై తప్పుడు ప్రచారం చేసిన నిందితులను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కలవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఉన్న ఆయన.. నిందితులను కలవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాగా గొలుగొండ ఏటిగైరమ్మపేటలో గణేష్ విగ్రహం ధ్వంసమయ్యిందని కొందరు టీడీపీ నేతలు దుష్ర్పచారం చేశారు. ఏడాది క్రితం విరిగిన విగ్రహం.. ఇప్పుడు ధ్వంసమైనట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసిన చేసిన నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో కిలాడి నరేష్, పోలిశెట్టి సంతోషం, పోలిశెట్టి కనకరాజు, కల్యాణరావులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని గొలుగొండ పీఎస్‌లో పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిని ఉపేక్షించకూడదు: సచ్చిదానంద స్వామి దైవ ద్రోహానికి పాల్పడితే భగవంతుడు క్షమించడని గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. -
'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది'
సాక్షి, అమరావతి : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాం.(చదవండి : ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయితే తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లోనే బెంజ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బెంజ్ కారును సీజ్ చేసింది. 2020 జూన్‌లో ఈఎస్ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ను కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాలి. టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింది.నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా,, ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదు. 'అంటూ చురకలంటించారు. -
అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు తెలిపారు. బట్టలూడదీసే పరిస్థితి వస్తుందంటూ... మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తాత లత్సాపాత్రుడు చిత్రపటాన్ని అధికారులు ఇటీవల చైర్మన్ గదిలోకి మార్చారు. అయితే తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలంటూ అయ్యన్నపాత్రుడు ఈనెల 15న మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో నిరసనకు దిగారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫోటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేకు ఆమె తొత్తుగా మారారంటూ నోరు పారేసుకున్నారు. పోలీసులు, పెద్దల సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారం చిత్రపటాన్ని నెల రోజుల్లో యథా«స్థానంలో పెట్టకపోతే కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ‘కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయింది.. అదే మగవాడైతే వేరే విధంగా ట్రీట్మెంట్ ఉండేది...’ అంటూ బెదిరించారు. అయ్యన్నపాత్రుడి దుర్భాషలతో మనస్తాపం చెందిన కమిషనర్ పట్టణ పోలీసు స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేయడంతో నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. -
‘అయ్యన్న పాత్రుడుపై పరువు నష్టం కేసు వేస్తా’
సాక్షి, తూర్పు గోదావరి: కరోనా విపత్కర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణలు ఎంతో కష్టపడి పనిచేన్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలకు సాయం అందిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు లేనిపోని ఆరోపణలు చేశారని, అందుకు ఆయనపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా కేసు వేస్తానని ఎంపీ అన్నారు. ఇక ఆధారాలు లేకుండా టీడీపీ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మార్గాని భరత్ హెచ్చరించారు. -
సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని..
సాక్షి, విశాఖపట్నం : దళితుడైన అనస్థీషియా డాక్టర్ సుధాకర్‌కు పాయకరావుపేట ఎమ్మెల్యే సీటు ఇస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మోసం చేశారని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. సుధాకర్ మాటలపై అయ్యన్న సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడు తనను కుక్కలా వాడుకున్నాడని సుధాకర్ చెబుతుంటే.. అయ్యన్న మాత్రం ఆయనతో పెద్దగా పరిచయం లేదని చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సోమవారం ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి డాక్టర్ సుధాకర్‌కు ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆశ చూపి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. దళితుడైన సుధాకర్‌ను తమ రాజకీయం కోసం చంద్రబాబు, అయ్యన్నలు బలి చేశారని అన్నారు. ( ‘అయ్యన్న పాత్రుడి ఇంట్లోనే ఆయనకు తర్ఫీదు ఇచ్చారు’ ) చంద్రబాబు, అయ్యన్న కలిసి శాడిస్టుల్లా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైజాగ్ టీడీపీ కార్యాలయం వేదికగా ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌తో కలిసి అయ్యన్నపాత్రుడు కుట్ర చేశారని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందచేస్తున్న మొనగాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రజలు తమను మర్చిపోతారేమోనన్న భయంతో చంద్రబాబు, అయ్యన్నలు దళితులతో డ్రామాలాడించడం దళితులను మోసం చేయడమేనని అన్నారు. ( ‘బాబు చేతిలో ఆ డాక్టర్ కీలు బొమ్మ’ ) కాగా, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు, డాక్టర్ సుధాకర్ల మధ్య బంధాన్ని బైట పెట్టారు. అయ్యన్న పాత్రుడు గురించి డాక్టర్ సుధాకర్ మాట్లాడిన వీడియోను ఆయన వెలుగులోకి తెచ్చారు. ‘‘ నన్ను అయ్యన్నపాత్రుడు కుక్కలా వాడుకున్నాడు’’ అని సుధాకర్ మాట్లాడిన వీడియో అది. -
అయ్యన్నా.. చౌకబారు విమర్శలు మానుకో
సాక్షి, నర్సీపట్నం : ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తే మాజీ మత్రి అయ్యన్నపాత్రుడుకు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనాపై అయ్యన్నపాత్రుడు రాజకీయం చేయడం సిగ్గు చేటు అన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు అండగా నిలవాల్సిన అయ్యన్నపాత్రుడు తీరు పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ఇప్పుడు రాష్ట్ర రాజధాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు కరోనా కేసులు దాచిపెడుతున్నారని, పరిపాలన రాజధాన్ని విశాఖకు తరలిస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు రాజకీయం చేస్తున్నారన్నారు. కరోనా కేసులు దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న ఆయన గుర్తించుకోవాలన్నారు.కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్మోహన్రెడ్డిని జాతీయ మీడియా ప్రశంసించిన విషయాన్ని గుర్తించుకోవాలని హితువు పలికారు. ప్రజలకు సహాయపడకుండా టీడీపీ నాయకుడు చంద్రబాబు హైదరాబాద్, అయ్యన్నపాత్రుడు విశాఖలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు తీర్పు తెలుగు వారి విజయంగా పేర్కొన్న అయ్యన్నపాత్రుడు తన పిల్లలను ఏ మీడియంలో చదివించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు మనవుడిని ఎక్కడ చదివిస్తున్నాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ నాయకులు, పెద్దలను అగౌరవ పరిచే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
సొంతపార్టీ నేతలపై మండిపడ్డ కరణం, అయ్యన్న
సాక్షి, విజయవాడ : విజయవాడలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో భాగంగా ఈ పార్టీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, కరణం బలరాంలు పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యాలయం నుంచి నేతలకు సమన్వయం సరిగా లేదని అయ్యన్న, కరణంలు మండిపడ్డారు. రేపు నిర్వహించాల్సిన కార్యక్రమంపై ఈరోజు రాత్రి సమాచారం ఇవ్వడం ఏంటని నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే నాయకులు షో వర్క్ చేయడం మానేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుంటుదని పేర్కొన్నారు. అంతేగాక పార్టీ నేతలు ప్రెస్మీట్లు తగ్గించి పని మీద దృష్టి సారించి ప్రజలకు అందుబాటులో ఉంటే మంచిదని అయ్యన్న, కరణంలు హితభోద చేశారు. -
బాబు ఏం చేశాడో ఆయనకు తెలియదా..?
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘విశాఖలో మహానేత వైఎస్సార్ చేసిన అభివృద్ధి నీకు కనబడలేదా..? చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని అయ్యన్నకు తెలియదా.. విమ్స్‌ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బాబు ఏం చేశారో అయ్యన్నకు తెలియదా.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే..ఈ ప్రాంత వ్యక్తిగా వ్యతిరేకించడం అన్యాయం కాదా.. కమర్షియల్ శాఖ ట్రిబ్యునల్ కోర్టును వైఎస్సార్ విశాఖలో ఏర్పాటు చేస్తే విజయవాడ తరలించినప్పుడు అయ్యన్న ఎందుకు అడ్డుపడలేదు’ అంటూ వీరభద్రరావు నిప్పులు చెరిగారు. విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రిపై అయ్యన్న ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
పోలీసులపై నోరుపారేసుకున్న అయ్యన్నపాత్రుడు
-
చిన్న చూపేల బాబూ!
సాక్షి, అవనిగడ్డ : ‘‘అంతన్నాడు.. ఇంతన్నాడే.. చిన్నబాబు.. నన్నొగేసెలిపోయినాడే చిన్నబాబు..’’ అంటూ దీనంగా రోదిస్తోందీ చల్లపల్లి. స్వచ్ఛ చల్లపల్లిగా ఖ్యాతి పొందిన గ్రామంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉంది. గ్రామంలోని డ్రైనేజీ అధ్వానంగా దర్శనమిస్తోంది. 2016 నవంబర్ 11న గ్రామాన్ని సందర్శించిన అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బైపాస్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ బైపాస్ రోడ్డుతో పాటు, మండల పరిషత్ కార్యాలయం నుంచి 6వ నంబరు కాలువ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణానికి రూ.2.2 కోట్లు మంజూరు చేశారు. కొంతకాలానికే గ్రామం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మిస్తామని ప్రకటించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయమని పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రూ.11.50 కోట్లతో భారీ ప్రణాళిక రూపొందించారు. అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం బైపాస్ రోడ్డు డ్రైనేజీ అయినా అభివృద్ధి చేసి ఉంటే, గ్రామంలో కొంతమేర అయినా సమస్య పరిష్కారం జరిగుండేది. లక్ష్మీపురం కేంద్రంగా వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పి లక్ష్మీపురంలో యుద్ధప్రాతిపదికన హెవీ బోర్లు వేయించారు. పనులు, కార్యాచరణ కానరాలేదు. దీంతో అభివృద్ధి మాటలకే పరిమితమైందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
కాంగ్రెస్ అంటే.. చచ్చేంత ప్రేమ!