సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్థలం కబ్జాపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. మంత్రి తానేటి వనిత ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. దాన్ని గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆయనకు 15 రోజులకు ముందే నోటీసులు ఇచ్చారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే పోలీసులు వచ్చారు.
మహిళలను, దళితులను తన భర్త కించపరిచినట్టు మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి రాజకీయ కుట్ర అని ఆరోపించడం దారుణం. దీన్ని రాజకీయ కుట్ర అనడం సరికాదు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు కుల ప్రస్తావన తీసుకువస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నాయకులు కలిసి మా అధినేతపై కేసులు పెట్టడాన్ని రాజకీయ కుట్ర అంటారు. మా నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా విశాఖ ఎయిర్‌పోర్టులో నిర్బంధించడం రాజకీయ కుట్ర అంటారు. మేము ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ రకంగా చేయటం సరికాదని చెబుతున్నాము. తప్పును ఒప్పుకోవడం మంచిది. మా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు’’ అని హితవు పలికారు.
ఇది కూడా చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment