Taneti Vanita
-
రఘురామ.. ఫ్లెక్సీ చింపి అంబేద్కర్‌ను అవమానిస్తారా?: తానేటి వనిత
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్‌కు అవమానమే జరుగుతోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి నేతలు అంబేద్కర్‌కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా aమీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్‌పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. -
‘కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు’
గోపాలపురం(ప.గో.జిల్లా): గోపాలపురం మండలం హుకుంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై టీడీపీ కార్యకర్త అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమెను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితురాలని మాజీ హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. అనంతరం తానేటి వనిత మాట్లాడుతూ.. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కేసును నీరుగార్చాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులకే కొమ్ము కాస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత.. సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని వనిత డిమాండ్ చేశారు. -
ఉత్సవ విగ్రహాలలా పోలీసులు.. పవన్ కళ్యాణ్ ఇవి నీకు కనపడటం లేదా..?
-
నీ మాటలకు మహిళలు తల దించుకుంటున్నారు.. హోం మంత్రి అనితపై ఫైర్
-
వంగలపూడి అనిత మాటలు హాస్యాస్పదం: తానేటి వనిత ఫైర్
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులను స్వేచ్చగా పనిచేసుకోవానివ్వాలని కామెంట్స్ చేశారు.కాగా, తానేటి వనిత ఆదివారం తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ..‘మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హోంమంత్రి అనిత లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అనిత మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆమె మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతుంటే అనిత ఎందుకు స్పందించడం లేదు. అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచాకే మంత్రి అయ్యారు. ఇంతకుముందు కూడా చంద్రబాబు కుప్పానికి ఎమ్మెల్యేనే.హోంమంత్రి అనిత మాట్లాడే మాటలకు మహిళలు తలదించుకుంటున్నారు. పోలీసులను స్వేచ్చను ఇచ్చి.. వారిని సక్రమంగా పనిచేసుకోనివ్వాలి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తుంటే మా పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
-
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు.ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు. -
మళ్ళీ గెలిచేది జగనే.. ఓటు హక్కు వినియోగించుకున్న తానేటి వనిత
-
టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..
-
బాబు దుష్టపన్నాగమే ఇది.. ఏపీలో ఈసీ ఉండి ఏం లాభం?: వాసిరెడ్డి పద్మ
గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు. ‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?. .. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు... ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు. -
నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
-
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
-
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
పవన్, చంద్రబాబుపై తానేటి వనిత సెటైర్లు
-
దళిత మహిళకు రాజ్యాధికారం ఇచ్చింది జగనన్న ఒక్కడే
-
జగనన్నను అడిగే అక్కడికి వెళ్ళాను
-
తానేటి వనిత స్ట్రెయిట్ టాక్
-
సోషల్ మీడియా సైకోలు.. గీతాంజలి చేసిన తప్పేంటి?
టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకల టార్గెట్‌తో గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జగనన్న తన పేరిట ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో సంతోష పడిన గీతాంజలిని.. ప్రతిపక్షాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేసి వేధించారు. గీతాంజలి మృతిపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి, తాడేపల్లి: గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని అన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరిచామని తెలిపారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని..సీఎం జగన్ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని తెలిపారు. అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు. మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. పచ్చపార్టీలను తరిమికొట్టాలి టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు పలికారు. మహిళలు ఘాటుగా స్పందించి పచ్చపార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల తీరును ఖండిస్తున్నా గీతాంజలి మరణం చాలా బాధాకరమని బొత్స ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ప్రతిపక్షాలు వేధించడం దుర్మార్గ చర్చ అని మండిపడ్డారు. ఆమె మరణానికి టీడీపీ, జనసేన వేధింపులే కారణమని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గీతాంజలి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. గీతాంజలి మృతి చాలా దురదృష్టకరమని అన్నారు మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. గీతాంజలి ఘటనను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా అని అన్నారు. గీతాంజలి మృతికి ప్రధాన కారణమైన అజయ్ సజ్జాను విడిచిపెట్టకూడదని అన్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి. అజయ్ సజ్జాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చనిపోయేలా చేశారని మండిపడ్డారు. మహిళలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. -
సీఎం వైఎస్ జగన్ గురించి హోంమంత్రి తానేటి వనిత గొప్ప మాటలు
-
మాజీ సీఎం చంద్రబాబుకు హోంమంత్రి తానేటి వనిత ఓపెన్ ఛాలెంజ్
-
చంద్రబాబుకు ఇదే నా ఓపెన్ ఛాలెంజ్
సాక్షి, ఏలూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ సీఎం చేయని రీతిలో దళారి వ్యవస్థ లేకుండా ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేశారని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. వాలంటరీ సచివాలయ వ్యవస్థ ద్వారా వారింటికి సంక్షేమం చేరటంతో ప్రజలు సంతోషిస్తున్నారని తెలిపారు. ద్వారకాతిరుమల మండలంలో కార్యకర్తలు, నాయకుల ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడారు. జగనన్నకు ఓటు వేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంతమందితో కలిసి వచ్చినా భయపడేది లేదని అన్నారు. ప్రజలు జగనన్నను ముఖ్యమంత్రిగా చేసేందుకు డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు. ‘చంద్రబాబుది విజన్ అయితే.. 2019లో ఎందుకు అది పాయిజన్ అయిందో చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు. అమ్మ ఒడి పథకాన్ని గతంలో ఎందుకు పెట్టలేదు. రెండువేల పైచిలుకు వ్యాధులకు ఆరోగ్య శ్రీలో చికిత్స ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు విజన్ అంటే దోచుకోవడం దాచుకోవడమేనా?. నేను చంద్రబాబుకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. కొవ్వూరు నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపు నుంచైనా నాకు నెలకు, సంవత్సరానికి గాని ఎవరైనా ఒక్క రూపాయి అయినా నాకు ఇచ్చారనీ నిరూపిస్తే రాజకీయాల నుంచి నేను వైదొలుగుతా’ అని తానేటి వనిత తెలిపారు. అలాగే.. గోపాలపురం నియోజవర్గం అనేది తన స్వస్థలమని తెలిపారు. తన తండ్రి బాబాజీ రావు ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రజలకు తాను సుపరిచితురాలనేనని.. తనకు పుట్టింటికి వచ్చినట్లుందని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
సోషల్ జస్టిస్ కి రోల్ మోడల్ సీఎం జగన్..
-
ఆవిష్కరణకు సిద్ధమైన సామాజిక న్యాయ మహాశిల్పం
-
ఎల్లో మీడియాపై హోంమంత్రి తానేటి వనిత మండిపాటు
-
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్‌గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.