సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య చాలా బాధాకరమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని మనం ఎన్ని చట్టాలు చేసినా, కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పడడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ఇటీవల సత్ఫలితాలనిస్తోందని చెప్పారు.
ఈ ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దీనికి కారణమైన టీడీపీ కార్పొరేటర్ విజయ జైన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ నేతలు గతంలోనూ, ఇప్పుడు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదుని మండిపడ్డారు. మొన్న లోకేష్ అనుచరుడు, నేడు కేశినేని నాని అనుచరుడు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. స్త్రీని ఆట బొమ్మగా ఆడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం జగన్‌ని వేలెత్తి అర్హత లేదని సూచించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్రెడ్డి స్త్రీల పట్ల అనేక చట్టాలు చేస్తూ మహిళా సంక్షేమం కోసం 1800 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment