young girl
-
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి.. ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువతి
తిరువనంతపురం: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నం చేసిన యువతి.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో పడిపోయారు. ఈ ప్రమాదం కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రమదంలో 19 ఏళ్ల యువతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. పుదుచ్చేరి-మంగళూరు వీక్లీ రైలులో ఇరిట్టికి చెందిన యువతి.. తలస్సేరి నుంచి మంగళూరుకు వెళుతోంది. అయితే.. మధ్యలో కన్నూర్ రైల్వే స్టేషన్లో రైలు కాసేపు ఆగటంతో.. సదరు యువతి స్టేషన్లో ఉన్న షాప్‌లో స్నాక్స్ కొనుగోలు చేయడానికి దిగారు. కొనుగోలు చేస్తున్న సమయంలోనే రైలు కదటం గమనించిన యువతి.. పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా రైలు, ప్లాట్ఫారం మధ్య పడిపోయారు. ప్రయాణికులు, రైల్వే పోలీసులు, క్యాటరింగ్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే డ్రైవర్‌కు సమాచారం అందించడంతో ఆమెను రక్షించేందుకు రైలును నిలిపివేశారు. ఆ యువతికి స్వల్ప గాయాలకు అవ్వటంతో.. చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం రైల్వే అధికారులు.. ఆమె మరోక రైలులో ఎక్కించి మంగళూరుకు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.கேரளா, கண்ணூர் ரயில் நிலையத்தில் ஓடும் ரயிலில் ஏற முயன்றபோது தடுமாறி நடைமேடைக்கும் ரயிலுக்கும் இடையில் விழுந்த இளம் பெண். உடனடியாக ரயில் நிறுத்தப்பட்டு பத்திரமாக மீட்டனர். Platform க்கும் train க்கும் இடைவெளி அதிகமா இருந்ததால் சிறு காயங்களுடன் அந்த பெண் உயிர் தப்பினார் pic.twitter.com/Qb7bVUHOBb— admin media (@adminmedia1) November 4, 2024 -
‘బ్రిటిష్ హైకమిషనర్’గా 19 ఏళ్ల అమ్మాయి..!
19 సంవత్సరాల గౌతమ్ నిధి బ్రిటిష్ హైకమిషనర్ హోదాలో గంభీరంగా ఉపన్యసించింది. పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. శాస్త్రవేత్తల నుంచి నవీన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఇది సరే, 19 సంవత్సరాల అమ్మాయి ‘బ్రిటిష్ హైకమిషనర్’ ఏమిటి! అని ఆశ్చర్య΄ోతున్నారా... అవును... ఇది అక్షరాల నిజం... అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ‘హై కమిషనర్ ఫర్ ఏ డే’ పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీ కోసం దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన అమ్మాయిల నుంచి 140 అప్లికేషన్లు వచ్చాయి. ఈ సంవత్సరం కర్ణాటకకు చెందిన గౌతమ్ నిధి(19) ‘భారత్‌లో ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్’గా ఎంపికైంది. గౌతమ్ నిధి ఢిల్లీలోని మిరాండ హౌజ్ కాలేజీలో హిస్టరీ, జాగ్రఫీలలో బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది. స్కెచ్చింగ్, పద సంపద, సాంస్కృతిక దౌత్యం, విదేశాంగ విధానాలపై గౌతమ్‌కు ఆసక్తి. బ్రిటిష్ హైకమిషనర్‌గా గౌతమ్ నిధి ఒకరోజంతా తీరికలేనంత కార్యక్రమాలతో గడిపింది.యూకే–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఆమె తొలి కార్యక్రమం మొదలైంది. దిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ని, సందర్శించిన గౌతమ్ దివ్యాంగులకు ఉపకరించే కొత్త సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంది. ఆ తరువాత ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ’కి వెళ్లి మన దేశంలో వ్యాక్సిన్ల అభివృద్ధికి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుంది. ప్రభుత్వ అధికారులు, పరిశ్రమలకు చెందిన వ్యక్తులతో రోజాంతా అనేక సమావేశాలు నిర్వహించింది.‘బ్రిటిష్ హైకమిషనర్ ఫర్ ఏ డే’గా ఉండడం మరచిపోలేని అద్భుతమైన జ్ఞాపకం. సోలార్ ఎనర్జీ నుంచి బయోటెక్నాలజీ వరకు సాంకేతిక పరిజ్ఞానం గురించి అవగాహన చేసుకునే అదృష్టం దక్కింది. సామాజిక ప్రయోజనాలకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అంటుంది గౌతమ్ నిధి. ‘ఈరోజు నిధి నుండి నేర్చుకోవడం అద్భుతంగా ఉంది. యూకే–ఇండియాలలోని నవీన సాంకేతిక పరిజ్ఞానం నుంచి గ్లోబల్ చాలెంజ్‌లను స్వీకరించి దూసుకెళుతున్న యువతుల వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం’ అంటుంది మన దేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరూన్.(చదవండి: తండ్రి హత్యను ఛేదించేందుకు పోలీసుగా మారిన కూతురు..! చివరికి 25 ఏళ్ల తర్వాత..) -
పారిస్ ఒలింపిక్స్‌లో.. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్టు! ఎంతంటే?
పారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన స్కేట్ బోర్డర్ జెంగ్ హావోహావో అత్యంత పిన్న వయస్కురాలైన ఒలింపియన్‌గా చరిత్ర సృష్టించింది. జెంగ్ వయసు పదకొండు సంవత్సరాలు. ఏడు సంవత్సరాల వయసులో స్కేట్ బోర్డింగ్ మొదలు పెట్టింది. 2022లో గ్వాంగ్డాంగ్ ్రపావిన్షియల్ గేమ్స్‌లో పార్క్ స్కేట్ బోర్డింగ్ ఈవెంట్లో జెంగ్ విజేతగా నిలిచింది. ‘వేగంగా నేర్చుకొని తనదైన శైలిలో ప్రతిభ ప్రదర్శించడం జెంగ్ సొంతం’ అంటున్నాడు జెంగ్ కోచ్. సరదాగా మొదలు పెట్టిన స్కేట్బోర్డింగ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జెంగ్‌కు పేరు తీసుకువచ్చింది. -
తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని, స్నేహితులు అల్లరి చేశారని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్లో స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా స్నాప్‌చాట్‌ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...!
పాన్‌గల్: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వేణు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం చెందిన గడ్డం బాలపీరు(29) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారి మాదిరిగానే గురువారం ఇంటి నుంచి విధుల నిమిత్తం బైక్‌పై వనపర్తికి బయలుదేరాడు. అన్నారంతండా సమీపంలో శివారెడ్డి వ్యవసాయ పొలం వద్ద వనపర్తి నుంచి పాన్‌గల్ వైపు వస్తున్నా వనపర్తి డిపో ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై నుంచి బాలపీరు రోడ్డు పక్కన ఉన్న పెద్ద రాతిపై పడటంతో తలకు బలమైన గాయంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అతివేగంగా, అజాగ్రత్తగా బస్సు నడిపి మృతికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరిగెల కృష్ణయ్యపై తగు చర్యలు తీసుకొవాలని మృతుని భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మందలించారనివిద్యార్థిని ఆత్మహత్య అమరచింత: స్నేహితుల ఎదుట మందలించారని మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రణవి(14) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన నరేష్ కుతూరు ప్రణవి 8వ తరగతి చదువుతుంది. గురువారం ప్రణవిని అవ్వ స్నేహితుల ఎదుట తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com. ఇది చదవండి: షాక్‌కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.! -
‘థాంక్యూ మోదీజీ’.. కశ్మీర్ యువతి బైక్ రైడ్ వీడియో వైరల్
శ్రీనగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక, కశ్మీర్లో ఆర్టికల్ 370, 35A రద్దు తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35A రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది. ఇక, ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Today I proudly wanna to say that my #Kashmir has changed a lot not only for the boys but also for Us. It was not possible before abrogation of 370 & 35A. Thank you GOI. pic.twitter.com/5zU9vgUAoL — Nusrat Fatima (@knusrata) August 4, 2023 మరోవైపు.. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. Action taken under relevant sections of MV Act. Violator also counseled not to repeat such acts. pic.twitter.com/To30U8FaiB — Traffic City Srinagar. (@SSPTFCSGR) August 4, 2023 ఇది కూడా చదవండి: నోర్మూయ్, ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు.. మెట్రోలో లేడీస్ లొళ్లి -
ప్లీజ్ మోదీజీ మా బాధ వినండి.. కథువా బాలిక ఆవేదన
ప్లీజ్ మోదీ జీ.. మా కోసం ఒక మంచి స్కూల్ భవనం కట్టించండి.. అంటూ ఓ చిన్నారి ప్రధానిని కోరింది. తాను చదువుతోన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల సరిగా లేవని ఆవేదక వ్యక్తం చేసింది. తాము సరిగా చదువుకోలేకపోతున్నామని ఫేస్బుక్ ద్వారా తన విన్నపాన్ని ప్రధాని మోదీకి వినిపించింది. తన స్కూల్ దుస్థితిని వీడియోలో పంపించింది. వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా లొహయ్-మల్హర్ గ్రామానికి చెందిన సీరత్ నాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టు వీడియోలో తెలిపింది. ఆ తర్వాత తాను చదువుతున్న స్కూల్ కాంపౌండ్‌లో నడుస్తూ పాఠశాల పరిస్థితిని వివరించింది. ‘ప్లీజ్ మోదీ జీ’ మా కోసం కొత్త భవన్నాని నిర్మించండి అని వేడుకుంది. తన పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి చర్యలు తీసుకోండి అని కోరింది. అనంతరం, ఫోన్ కెమెరాను తలుపులు మూసివున్న ఓ గది ముందు ఉంచి..‘ప్రిన్సిపాల్ ఆఫీస్, స్టాఫ్ రూమ్’ అని వివరించింది. ఇదే సమయంలో స్కూల్లోని ఫ్లోర్లింగ్ చూపిస్తూ చూడండి మోదీజీ.. ఎంత మురికిగా ఉందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిపైనే మమ్మల్ని కూర్చోబెడతారు అంటూ తరగతి గదులను చూపించింది. మురికిగా ఉన్న ఫ్లోర్‌పై కూర్చోవడంతో మా యూనిఫామ్స్ మాసిపోతున్నాయి. మా డ్రెస్సులు మురికిగా ఉన్నాయని మా అమ్మలు తరచూ మమ్మల్ని తిడతారు. మాకు కూర్చోవడానికి బెంచీలు కూడా లేవు అంటూ ఆవేదన చెందింది. ఇదే సమయంలో మా పాఠశాల భవవాన్ని చూపిస్తాను అంటూ ముందుకు సాగింది. గత ఐదేళ్లుగా భవనం ఎంత అపరిశుభ్రంగా ఉందో చూడండి అని కోరింది. మొదటి అంతస్తులోకి వెళ్లిన ఆ చిన్నారి.. అక్కడ పరిస్థితి వివరిస్తూ ప్లీజ్ మోదీజీ.. మా పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి అని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నా కోరిక తీర్చండి అని కోరింది. అనంతరం కిందకు దిగి.. కాంపౌండ్ వాల్ వద్దకు వెళ్లి విరిగిపోయి ఉన్న టాయ్‌లెట్‌ను చూపించింది. అలాగే, పాఠశాలలో సౌకర్యాలను ప్రత్యక్షంగా చూపించింది. బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులు ఏ విధంగా ఉపశమనం పొందుతున్నారో తెలిపింది. ఇక చివరగా మోదీజీ మీరు దేశం మొత్తం చెప్పేది వినండి.. దయచేసి నా మాట కూడా వినండి.. మాకు మంచి పాఠశాలను నిర్మించండి.. నేలపై కూర్చోవాల్సిన అవసరం లేని విధంగా పాఠశాల ఉండాలి. దీంతో, మేమంతా బాగా చదువుకుంటాం. దయచేసి మా కోసం ఒక చక్కని పాఠశాలను నిర్మించండి అని కోరింది. ఇక, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
దోస్తులతో ఆడిపాడి.. అమ్మ చేతి గోరుముద్దలు తిని.. నిద్రలోకి వెళ్లి..
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందింది. బోడతండాకు చెందిన బోడ లక్పతి–వసంత దంపతుల రెండోకూతురు స్రవంతి(13) మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. శ్రీ రామనవమి సెలవు ఉండటంతో గురువారం సాయంత్రం వరకు ఇంటివద్ద తోటిపిల్లలతో కలిసి ఆటలాడుకుంది. తండాకు కొంతదూరంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి వద్ద రాత్రి నిద్రించేందుకు తల్లిదండ్రులు వెళ్లగా బాలిక తన నానమ్మతో కలిసి పాత ఇంటి వద్ద నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో నిద్రలేచి ఛాతీలో నొప్పి గా ఉందని నానమ్మకు చెప్పింది. తర్వాత మూత్రవిసర్జనకు బయటికి వెళ్లి వచ్చి పడుకుంది. కొంతసేపటికి బాలిక బాగా ఆయాస పడుతున్నట్లుగా నానమ్మ గుర్తించింది. బాలిక బాబాయి వచ్చి సీపీఆర్ చేసి వెంటనే మరిపెడ మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే బాలిక మృతిచెందినట్లు చెప్పారు. కూతురు బతుకుతుందన్న ఆశతో తల్లిదండ్రులు ఖమ్మంలోని మరో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చనిపోయిందని నిర్ధారించారు. స్రవంతి అకాలమృతితో బోడతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’
తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. -
నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్లో జరిమానా!
ఇటీవల కొంతమంది సోషల్‌మీడియా వినియోగదారులు మంచి మంచి వీడియోలతో రాత్రికి రాత్రి మంచి స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్లు చేసే పిచ్చి స్టంట్లు వారిని ఇబ్బందిపాలు చేయడం లేక కటకటాల పాలుచేయడమో! జరుగుతోంది. అచ్చం అలాంటి పనే ఇక్కడొక యువతి చేసి భారీ జరిమానాను ఎదుర్కొంటోంది. ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫేమ్ ఉన్న ఆ యువతి ఒక వీడియో కోసం అని ఒక పిచ్చి స్టంట్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియోని చూసిన పోలీసులు ఆమెకు భారీగా జరిమాన విధించడమే గాక లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఆమె కారుని హైవే మధ్యలో ఆపి హిరోయిన్ రేంజ్లో ఫోజులు కొడుతున్న ఓ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ చేసింది. ఐతే నెట్టింట వైరల్ అవుతున్న ఆవీడియోని చూసి ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పోలీసలు సదరు మహిళను ఇన్‌స్టాగ్రాంలో మంచి ఫాలోవర్స్ ఉన్న వైశాలి చౌదరి ఖుటైల్గా గుర్తించారు. అంతేగాదు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏకంగా రూ. 17 వేలు జరిమానా విధిస్తూ గట్టి షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఈ మేరకు సాహిబాద్ ఏసీపీ ట్విట్టర్ వేదికగా ఠాణా సాహిబాద్ ప్రాంతంలో ఒక యువతి కారుని నడిరోడ్డుపై ఆపి ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకుగానూ రూ.17 వేలు జరిమాన విధిస్తున్నట్లు చలానా పంపినట్లు తెలిపారు. అంతేగాదు ఇందుకు గాను ఆ యువతిపై తాము న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ఏసిపీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Vish ♥️ (@vaishali_chaudhary_khutail) (చదవండి: ఆ స్కూల్లో ఒకే ఒక్కడు స్టూడెంట్!) -
ఆదిభట్ల పీఎస్ పరిధిలో యువతి కిడ్నాప్ కలకలం
-
పెళ్ళి విషయమై ప్రేమికుల మధ్య ఘర్షణ.. యువకుడిపై బ్లేడుతో యువతి దాడి
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకోమని అడిగిన యువకుడిపై పదునైన బ్లేడుతో ఓ యువతి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన నాదెండ్ల అశోక్ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగ యత్నాలు చేస్తున్నాడు. రాజమండ్రికి చెందిన లక్ష్మీసౌమ్య కూడా అదే రోడ్డులోని ఓ మహిళా హాస్టల్లో ఉంటూ ఉద్యోగ వేటలోనే ఉంది. వీరిద్దరికీ స్థానికంగా ఉన్న టీ స్టాల్ వద్ద మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఇక ఈమధ్యనే తాను ప్రేమిస్తున్నాను, వివాహం కూడా చేసుకుంటాను అని చెప్పిన అశోక్ ఆమె ఖర్చులు కూడా భరిస్తూ వస్తున్నాడు. కాగా ఈ నెల 5వ తేదీన టీస్టాల్ వద్ద ఇద్దరూ కలిసిన సమయంలో అశోక్ పెళ్లి ప్రస్తావన తేగా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న బేడు (మినీ కట్టర్)తో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో అశోక్ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్రగాయమైంది. పోలీసులు నిందితురాలిపై హత్యాయత్నం కేసు కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదునైన బ్లేడ్ (మినీ కట్టర్)తో బలంగా దాడి చేయడంతో అశోక్ చెంపపై భాగంలో లోతైన గాయమైంది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంతమేరకు పెరాలసిస్ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. చదవండి: (కోరిక తీర్చకుంటే మార్ఫింగ్ ఫోటోలను అప్లోడ్ చేస్తా.. యాంకర్‌కు వేధింపులు) -
హైదరాబాద్‌లో దారుణం.. రెచ్చిపోయిన మృగాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో దారుణం జరిగింది. కొందరు దుండగులు లెనిన్‌నగర్‌లో బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణ ఘటన నవంబర్ 5వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. మీర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడియత్నం చేశారు. కాగా, లెనిన్‌నగర్‌కు చెందిన బాధితురాలు.. తన రాత్రి సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం, బైక్‌పై ఎక్కించుకుని బడంగ్‌పేట్‌లోని ప్రభుత్వ పాఠశాల వెనుకకు తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడియత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల రాకను గమినించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, లైంగికయత్నంలో నిందితులు.. బాధితురాలిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది. తమ గురించి ఎవరికైని చెబితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఛీ ఏం మనుషులు! చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతుంటే ఫోటోలా!
లక్నో: ఒక యువతి తీవ్రగాయలపాలై నిస్సహాయ స్థితిలో ఉంటే స్థానికులు సాయం అందించకపోగా చుట్టూ చేరి మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజ్‌లో చోటు చేసుకుంది. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన కొద్ది గంటల్లోనే తీవ్ర గాయాలపాలై కనిపించింది. ఆ 13 ఏళ్ల బాధిత యువతికి తలతో సహ ఒంటిపై పలుచోట్ల తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఒకవైపు నుంచి సాయంచేయమంటూ అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుంది. కానీ అక్కడ ఉన్న స్థానికులంతా ఆమె చుట్టూ చేరి సెల్‌ఫోన్‌తో ఫోటోలు తీసే బిజీలో ఉన్నారు. ఒక్కరూ కూడా పోలీసులు వచ్చేదాకా ఆమెకు ఎలాంటి సాయం అందించలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సదరు బాధిత యువతిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కున్వార్ అనుపమ్ సింగ్ తెలిపారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఐతే ఆమెపై లైంగికదాడి జరిగిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదని, అలాగే ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. (చదవండి: వాతావరణ కార్యకర్తకు షాక్..! ఫేస్బుక్ లైవ్ రికార్డు చేస్తుండగా మొబైల్ కొట్టేసిన స్నాచర్) -
యూనివర్సిటీలో యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక ప్రైవేట్ యునివర్సిటీ కార్యక్రమంలో యువతీ చేసిన నృత్యం వివాదాస్పదమైంది. దీంతో సదరు యూనివర్సిటీకి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాక్‌లో పెషావర్‌లోని ఎన్ఎస్ యూనివర్సిటీలో హునార్ మేళ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు 13 కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఒక యువతి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటి కార్యక్రమాలకు దేశానికి అవసరమా అంటూ మండిపడతూ ట్వీట్ చేశారు. సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్ ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ(కేఎంయూ) ఈ విషయమై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో సదరు యువతి బిగుతుగా ఉండే డ్రస్ వేసుకుని వేదికపై డ్యాన్స్‌లు చేయడం వల్లే వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ఖైబర్ మెడికల్ యూనిర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అనేతికం, అసాంఘీకం అంటూ మండిపడుతూ చివాట్లు పెట్టింది. అంతేగాదు ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు యూనివర్సిటి ఎన్ఎస్సీ డైరెక్టర్‌కి నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాలను కేఎంయూ లోగో పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలని మందలించింది. అవసరమనుకుంటే సదరు ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. pic.twitter.com/FhjROmiJbW — Sami (@Pediatric__OT) October 20, 2022 Pakistan: Khyber Medical University issues notice to NCS University System, Peshawar, warns of de-affiliation after this dance video from NCS goes viral 🤩 pic.twitter.com/MYd5P57gyN — Sonam Mahajan (@AsYouNotWish) October 21, 2022 (చదవండి: చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో) -
అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి.. ఫొటోలు, వీడియోలు తీసి..
కడప అర్బన్: బాలికపై సామూహిక అత్యాచారం చేసి వీడియో తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గోపవరం మండలం రాచాయపేటకు చెందిన ఓ బాలిక మూడు నెలల క్రితం నేరేడుపళ్ల కోసం కొండ ప్రాంతానికి వెళ్లింది. అయితే అదే సమయంలో అక్కడున్న బాలురు ఆమెపై అత్యాచారం చేశారు. ఫొటోలు, వీడియో కూడా తీశారు. కాగా, మూడు రోజుల క్రితం ఈ ఫొటోలు, వీడియోలు బహిర్గతమయ్యాయి. దీంతో, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నలుగురు మైనర్లపై పోక్సో, అత్యాచారం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసును బద్వేల్ రూరల్ పోలీసులు నమోదు చేశారు. 14వ తేదీన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కడపలోని జువైనల్ కోర్టులో హాజరు పరిచారు. బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరించారు. ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఎవరైనా గుర్తిస్తే డయల్ 100 లేదా తన ఫోన్ నంబర్ 94407 96900 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సాక్షి, అమరావతి: మగపిల్లల నడవడికపై తల్లిదండ్రుల నిఘా లోపిస్తే విద్యార్థి దశలో నేరాలకు పాల్పడే ప్రమాదముందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. గోపవరం మండలం రాచాయపేటలో వెలుగుచూసిన మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై ఆమె శనివారం స్పందించారు. కడప జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటనలో మైనర్లు నేరానికి పాల్పడటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం, అశ్లీల వీడియోలు బయట పెట్టడం తదితర అంశాలు తీవ్రంగా మనసును కలచివేశాయన్నారు. క్రమశిక్షణ కొరవడటం, సెల్ ఫోన్ల వినియోగంతో ఇష్టారీతిగా ప్రవర్తించడం జీవితాలపై ప్రభావం చూపుతుందని వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు, ఇంటి వాతావరణంలో పిల్లలకు మంచి అలవాట్లు, సంస్కారాన్ని నేర్పే కౌన్సెలింగ్ అవసరమన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : మైనర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడటం విచారకరమని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి అన్నారు. బాధితురాలి ఆరోగ్యంపై స్థానిక ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. బాలిక మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. -
Viral Video: భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి
-
భావోద్వేగ దృశ్యం.. రాహుల్‌ను చూడటంతో వెక్కి వెక్కి ఏడ్చిన యువతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 18వ రోజు బుధవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ వందలాది పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేరళలో పర్యటిస్తున్నారు. ఆయన పాదయాత్ర కేరళలోని పండిక్కాడ్ స్కూల్ పాడి నుంచి ప్రారంభమైంది. ఉదయం 10.30 గంటలకు వండూరు జంక్షన్లో విరామం కోసం ఆగారు. సరిగ్గా ఆ పాదయాత్రలోని ఒక యువతి రాహుల్‌ని కలిసి ఆనందంతో చిన్నపిల్ల మాదిరిగా గెంతులేసింది. ఆమెకు రాహుల్‌ని కలిశానన్నా అవధులు లేని ఆనందం తోపాటు ఏడుపు కూడా వచ్చేసింది. ఆమె రాహుల్‌ని చూసి భావోద్వేగంతో ఏడుపుని ఆపుకోలేకపోయింది. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్లంతా ఆ యవతిని చర్యలను చూసి ఆశ్చర్యంతో నవ్వుతుండగా..రాహుల్ ఆ యువతని ఎగ్జాయిట్‌మెంట్‌ని కంట్రోల్ చేస్తూ.. దగ్గరకు తీసుకుని సముదాయించారు. వాస్తవానికి ఇలా పాప్ సింగర్స్ లేదా హిరో/ హిరోయిన్లు వచ్చినప్పుడూ అభిమానులు ఇలా ప్రవర్తిస్తుంటారు. కానీ అలాంటి క్రేజీ ఫీలింగ్ రాహుల్‌గాంధీకి ఈ పాదయాత్రలో ఎదురవ్వడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఆయన కేరళ పాదయాత్ర ఈ రోజు సాయంత్రాని కల్లా వాయనాడ్ నియోజకవర్గంలోకి ఎంట్రీ అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ తెలిపారు. దాదాపు 3.750 కి.మీల సుదీర్ఘ 150 రోజుల పాదయాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్ము కాశ్మీర్‌తో ముగియనుంది. అలాగే సెప్టంబర్ 10కి కేరళలో ప్రవేశించిన కాంగ్రెస్ జోడో పాదయాత్ర 450 కి.మీ దూరం సాగించి...సుమారు ఏడు రాష్ట్రాలను చుట్టి... అక్టోబర్ 1 కల్లా కర్ణాటకలోకి ఎంట్రీ ఇవ్వనుందని జై రాం రమేష్ తెలిపారు. (చదవండి: కాంగ్రెస్‌కు విజన్ లేదు.. గెలిచేంత సీన్ లేదు.. ‘హస్తం’ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్) -
రెచ్చగొడితే ఇలాగే ఉంటంది.. పట్టపగలే చుక్కలు చూపించింది
కొన్నిసార్లు మనుషులు చేసే చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో జంతువులను కవ్విస్తే అవి దాడి చేసిన వీడియోలు చూసే ఉంటాము. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా జూకు వెళ్తే.. కొన్ని జంతువులను దూరం నుంచి చూడాలని హెచ్చరిస్తుంటారు. అయినా కొంత మంది వినిపించుకోకుండా అతి చేస్తారు. దీంతో జంతువులు తిరగబడి గాయపరుస్తాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడటం లేదా ప్రాణాలు సైతం పోయే పరిస్థితి రావచ్చు. తాజాగా ఓ యువతి.. బోనులో ఉన్న కోతిని రెచ్చిగొట్టింది. దీంతో తగిన మూల్యం చెల్లించుకుంది. వీడియోలో.. యువతి బోనులో ఉన్న కోతిని ఓ యువతి డిస్టర్బ్ చేస్తుంది. దీంతో, కోతి తీవ్ర ఆగ్రహంతో వెంటనే బోనులో జాలీ నుంచి తన చేతితో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మోత్తుకున్న జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి ఎంతో శ్రమించింది. చివరకు పక్కనే ఉన్న కొంతమంది వచ్చి కోతిని భయపెట్టడంతో జట్టుని వదిలేసింది. దీంతో, ఆమె అక్కడి నుంచి జారుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
అనంతపురంలో యువతి కిడ్నాప్.. గంటలోనే ఛేదించిన పోలీసులు
-
మిస్టర్ క్రూయెల్.. 10 నుంచి 15 ఏళ్ల అమ్మాయిలు మాత్రమే టార్గెట్
ఉన్మాదపు కోరల్లో చిక్కి, అన్యాయంగా ముగిసిన జీవితాలను చదివినప్పుడు.. అప్రయత్నంగానే కళ్లు చెమరుస్తాయి. ఏళ్లు గడిచినా.. నాటి ఆక్రందనలు నేటికీ.. నిస్సహాయస్వరంతో స్పష్టంగా వినిపిస్తాయి. కొన్ని ఛాయాచిత్రాలు వాటిని కళ్లకు కడుతుంటాయి. ఆస్ట్రేలియన్ విషాదగాథల్లో ఒకటైన కార్మీన్ చాన్ అనే 13 ఏళ్ల అమ్మాయి కథ అలాంటిదే. అది 1991 ఏప్రిల్ 13. అర్ధరాత్రి కావస్తోంది.. రాత్రి అయితే చాలు.. పది నుంచి పదిహేనేళ్లలోపు ఆడపిల్లలున్న కుటుంబానికి నిద్ర కరువయ్యే రోజులవి. ఆస్ట్రేలియా, టెంపుల్స్టోవ్లోని ఓ ఇంట్లో అలికిడి మొదలైంది. ముఖానికి నల్లటి ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ నుంచి లోపలికి చొరబడ్డాడు. ఆ రోజు ఆ ఇంట్లో జాన్ చాన్, ఫిలిస్ చాన్ దంపతులు.. వారి ముగ్గురు ఆడపిల్లలు నిద్రిస్తున్నారు. నిశబ్దంగా బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన ఆ ఆగంతుకుడు.. కావాలనే అలికిడి చేశాడు. ఉలిక్కిపడి లేచిన వాళ్లపై తుపాకీ గురిపెట్టాడు. క్షణాల్లో అందరినీ రాగి తీగలతో కట్టి బంధించాడు. ముగ్గురిలో ఒక బాలికను ఎత్తుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. ఆ అమ్మాయి పేరే కార్మీన్ చాన్. కార్మీన్ తల్లి, సోదరీమణులు రోజులు గడుస్తున్నాయి. కార్మీన్ చాన్ ఆచూకీ మాత్రం దొరకలేదు. కార్మీన్ ఫొటోలతో పోస్టర్లు, రివార్డులు అంటూ గాలింపు తీవ్రమైంది. బాలికని ఎత్తుకుని వెళ్లినవాడు మీడియాకి, పోలీసులకి ముసుగు వ్యక్తిగా, ఆస్ట్రేలియన్ బూగీమ్యాన్ (boogeyman)గా సుపరిచితుడే. అప్పటికే అతడిపై ఎన్నో కేసులు ఉన్నాయి. పత్రికల్లో, టీవీల్లో.. అప్పటికే అతడిపై ఎన్నో కథనాలు వచ్చాయి. దాంతో ‘నా బిడ్డను దయచేసి విడిచిపెట్టు’ అంటూ మీడియా సమక్షంలో కార్మీన్ తల్లి ఫిలిస్ చాన్.. బూగీమ్యాన్ని ప్రాధేయపడింది. ఆ రోజు ఆ తల్లి ఏడ్చిన ఏడుపు చూస్తే ప్రతి హృదయం ద్రవిస్తుంది. అప్పుడు ఆమెకు చాలా మంది ఒకే మాట చెప్పారు.. ‘బూగీమ్యాన్ తప్పకుండా నీ బిడ్డను విడిచిపెట్టేస్తాడు.. ఎందుకంటే గతంలో ఎంతో మంది పిల్లల్ని అలానే వదిలిపెట్టాడు కదా’ అంటూ జరిగిన కథలను గుర్తుచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత.. 1992 ఏప్రిల్ 9న.. థామస్టౌన్, పల్లపు ప్రాంతంలోని డంపింగ్ యార్డులో కుళ్లిన దేహాన్ని కుక్కలు పీకుతుంటే.. కొందరు గుర్తించారు. అది కార్మీన్ మృతదేహమని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులు తేల్చాయి. ఫిలిస్ చాన్ రోదనలు మిన్నంటాయి. ఏ ఒక్కరూ ఆమెని ఓదార్చలేకపోయారు. కార్మీన్ సమాధి వద్ద మిగిలిన ఇద్దరు ఆడపిల్లలతో.. కూలబడి ఏడ్చే ఫొటో నాటి విషాదాన్ని కళ్లకు కడుతుంది. కార్మిన్ తలపై మూడుసార్లు కాల్చినట్లు తేలింది. కానీ ఆ క్రూరుడు మాత్రం దొరకలేదు. నాటి నుంచి ఆ ఆగంతుకుడికి మిస్టర్ క్రూయెల్ అని పేరు పెట్టింది మీడియా. మిస్టర్ క్రూయెల్పైన 1987 ఆగస్ట్ 22న మెల్బోర్న్ ఈశాన్య శివార్లలోని లోయర్ ప్లెంటీలోని ఒక ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లి, లైంగికదాడి చేసినట్లు తొలిసారి కేసు నమోదైంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాలికను విడిచిపెట్టేశాడు. అయితే అతడి చేతిలో కత్తితో పాటు, ముఖానికి నల్ల ముసుగు ఉందని ఆ బాధితురాలు చెప్పింది. దాంతో అప్పట్లో పోలీసులు అతడ్ని పట్టుకోలేకపోయారు. గతంలో అతడు వృద్ధ సన్యాసినులపై లైంగికదాడులకు పాల్పడినట్లూ పలు కేసులున్నాయి. కార్మీన్ తల్లిదండ్రులు 1988, డిసెంబర్లో ఈస్ట్ రింగ్వుడ్లో నివసిస్తున్న 10 ఏళ్ల బాలికను మిస్టర్ క్రూయెల్ అపహరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్కూల్‌కు వెళ్లిన చిన్నారి చీకటిపడినా ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 18 గంటల తర్వాత ఆ చిన్నారి ఆచూకీ లభించింది. అయితే, నిందితుడు అప్పటికే జారుకున్నాడు. ఈ ఘటన చోటుచేసుకున్న కొద్ది రోజుల్లోనే మిస్టర్ క్రూయెల్ మరో బాలికను అపహరించాడు. క్యాంట్బ్యరీలో నివసిస్తున్న 13 ఏళ్ల బాలికను ఎత్తుకెళ్లిన మిస్టర్ క్రూయెల్.. రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. సుమారు 50 గంటల తర్వాత ఆమెను ప్రాణాలతో విడిచిపెట్టాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అందరినీ ప్రాణాలతో వదిలిపెట్టిన మిస్టర్ క్రూయెల్.. కార్మీన్ని చంపడానికి కారణం ఏమై ఉంటుందని ఆలోచించి ఆ దిశగా విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బహుశా కార్మీన్ అతడి ముఖం చూసి ఉంటుంది.. గుర్తు పడుతుందనే భయంతోనే కార్మీన్ని చంపేసి ఉంటాడు అనే అంచనాకు వచ్చారు చాలామంది. మొత్తానికి ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన మిస్టర్ క్రూయెల్ ఎవరు అన్నది నేటికీ తేలలేదు. ఎందరో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు కానీ ఫలితం లేదు. అసలు ఈ మిస్టర్ క్రూయెల్ ఎవరు? అంత ధైర్యంగా ఇళ్లల్లోకి జొరబడి పిల్లల్ని ఎత్తుకుని వెళ్లే సాహసం ఎలా చేయగలిగాడు? అతడి వెనుక ఎవరైనా ఉన్నారా? అసలు ఆ ముసుగు మనిషి ఒక్కడేనా? లేక ఒక ముఠాసభ్యులంతా ఇలా ముసుగులేసుకుని నేరాలకు పాల్పడేవారా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
యువతి అదృశ్యం.. కుబుంబసభ్యుల ఆందోళన
సాక్షి, చిత్తూరు అర్బన్: యువతి అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు టూటౌన్ సీఐ యుగంధర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేటకు చెందిన హర్షిణి(19) బంగారుపాళ్యం వద్ద ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ చిత్తూరు గాంధీరోడ్డులోని ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటోంది. అయితే బుధవారం ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుబుంబసభ్యులు ఆందోళన చెందారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. యువతి ఆచూకీ తెలిస్తే డయల్ –100, 9491074517 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. చదవండి: (ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం) -
వాష్ రూమ్‌కని వెళ్లి బాలిక, యువతి పరార్
సాక్షి, వరంగల్: వరంగల్ కాశిబుగ్గలోని స్వధార్ హోం నుంచి వేర్వేరుగా ఒక బాలిక, ఒక యువతి పరారయ్యారు. ఈ ఘటనపై హోం నిర్వహకులు వనం బాలరాజు ఆదివారం ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలం గొల్లకొండకు చెందిన భూక్య భానుశ్రీ(15), హనుమకొండ జిల్లా హసనపర్తి మండలం వంగపహడ్‌కు చెందిన ముస్కు మీనా(22) గత కొద్ది రోజులుగా కాశిబుగ్గలోని స్వధార్ హోంలో ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం భాను శ్రీ వాష్ రూమ్‌కు వెళ్లి వస్తానని చెప్పి హోంలోని పై రూమ్‌కి వెళ్లింది. చదవండి: కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక! చాలా సేపయ్యినా కిందకు రాకపోవడంతో హోం వాచ్ ఉమెన్ పైకి వెళ్లి చూసినా కనిపించలేదు. అలాగే శనివారం రాత్రి ముస్కు మీనా కూడా వాష్ రూమ్‌కి వెళ్తున్నాని చెప్పి పైకి వెళ్లింది. తను కూడా తిరిగి రాకపోవడంతో వాచ్ ఉమెన్ వెళ్లి పరిశీలించగా.. ఆమె కనపడలేదు. హోమ్ నిర్వహకులు పరిసర ప్రాంతాలు వెతికినా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హోమ్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. చదవండి: మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను -
టీడీపీ నేత వినోద్ జైన్ అఘాయిత్యానికి నిరసనగా ర్యాలీలు
సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అఘాయిత్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది.టీడీపీ నేత వినోద్ జైన్ అఘాయిత్యానికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మేయర్ భాగ్యలక్ష్మీ, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కొందరు.. బాలికలు, మహిళలపై టీడీపీ నాయకులు అరాచకాలు నశించాలని ప్లకార్డు పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు. -
‘టీడీపీ నేతలు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదు’
సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య చాలా బాధాకరమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఇలాంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని మనం ఎన్ని చట్టాలు చేసినా, కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పడడం లేదని అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ఇటీవల సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దీనికి కారణమైన టీడీపీ కార్పొరేటర్ విజయ జైన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలుగుదేశం పార్టీ నేతలు గతంలోనూ, ఇప్పుడు మహిళలపై అకృత్యాలు చేయడం మానలేదుని మండిపడ్డారు. మొన్న లోకేష్ అనుచరుడు, నేడు కేశినేని నాని అనుచరుడు మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. స్త్రీని ఆట బొమ్మగా ఆడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం జగన్‌ని వేలెత్తి అర్హత లేదని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్త్రీల పట్ల అనేక చట్టాలు చేస్తూ మహిళా సంక్షేమం కోసం 1800 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.