పటాన్‌చెరు టౌన్: విదేశాలకు వెళ్లేందుకు పరీక్ష రాసి డిస్‌క్వాలిఫై అయ్యింది. దీంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలసి అమీన్‌పూర్ పరిధిలోని పీఎన్‌ఆర్ కాలనీలో ఉంటోంది.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన
క్లినికల్ అనాలసిస్ట్‌గా పని చేసే ఆమె కరోనా కారణంగా ఉండడంతో ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు మూడుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించలేక పోయింది. అప్పటి నుంచి తన స్నేహితులు విదేశాలకు వెళ్లారని, తాను వెళ్లలేకపోయానని సోదరుడికి చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే సింధు బుధవారం తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సోదరుడు తేజ బెడ్‌పై నురగలు కక్కుకుంటూ సింధు పడి ఉండడాన్ని గమనించి వెంటనే చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్‌పూర్ పోలీసులు తెలిపారు.
చదవండి: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్
Young Girl ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
Published Fri, Sep 24 2021 10:00 AM | Last Updated on Fri, Sep 24 2021 3:30 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment