commits sucide
-
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామానికి చెందిన దంపతులు విజయ్, పల్లవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు..మహారాష్ట్రకు చెందిన పల్లవికి కొల్హారి గ్రామానికి విజయ్‌కు గత మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళి వచ్చిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.. దీంతో తనపై అపవాదు వస్తుందన్న భయంతో ఆమె భర్త విజయ్ శ్మశాన వాటికకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమె నాలుగో అంతస్తులోని గదిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ను పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో ఉన్న మానసను పక్క గదుల్లోని విద్యార్థినులు గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి 80 శాతం కాలిన గాయాలతో మానస ప్రాణాలు కోల్పోయి కన్పించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పెట్రోల్ కొనుక్కుని.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన మానస కుటుంబం వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో నివాసం ఉంటోంది. కాగా ఇరవై రోజుల క్రితం వరకు కళాశాల సమీపంలోని వసతి గృహంలో ఉన్న ఆమె ఇటీవలే కళాశాల గేటు పక్కనే ఉన్న వసతి గృహంలోకి మారింది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ఆమె సీసాలో పెట్రోల్ పోయించుకుని వచ్చింది. ఆ కాసేపటికే గదిలోంచి మంటలు వస్తుండగా పక్క గదుల్లోని విద్యార్థులు గమనించారు. మానసిక ఒత్తిళ్లు.. కుటుంబ పరిస్థితులే కారణమా? మానస బలవన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీడీఎస్ నాలుగో సంవత్సరంలో ఉన్న ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చునని ఆమె స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ గది తలుపులకు లోపల గడి పెట్టుకొని ఆమె నిప్పంటించుకోగా.. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో మిగతా గదుల్లోని విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే ఖమ్మం సమీప ప్రాంత విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరిపై విమర్శలు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టాల్సిన పోలీసులు అదేమీ పట్టించుకోకుండా ఆగమేఘాలపై మృతదేహాన్ని మార్చురీకి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన బడా ఖానా(సాంస్కృతిక కార్యక్రమాలు) కార్యక్రమంలో పాల్గొనేందుకే వారు హడావుడిగా వెళ్లిపోయినట్లు తెలిసింది. వారు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్ నిర్వాహకులు గేటు బయటే ఆపేశారు. వారు కూడా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఖమ్మం అర్బన్ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు. చదవండి: నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే -
మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్ ట్విస్ట్
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని ఐదో రోడ్డులో నివాసముంటున్న శ్రావణి (26)ని అదే రోడ్డులో ఉంటున్న మేనమామ దుర్గాప్రసాద్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంది. దంపతులిద్దరి మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు తలెత్తి గొడవపడేవారు. ఇద్దరికీ కుటుంబ పెద్దలు సర్దిచెప్పేవారు. అయితే దుర్గాప్రసాద్ తీరు సరిగా లేదంటూ పలుమార్లు తన తల్లిదండ్రులకు శ్రావణి చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఇద్దరూ గొడవపడ్డారు. అనంతరం శ్రావణి గదిలోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చి గది తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి వేలాడుతున్న శ్రావణి మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి అక్కమ్మ, సోదరుడు రాధాకృష్ణ అక్కడకు చేరుకుని శ్రావణి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చదవండి: స్వప్పతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా.. -
JNTU విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
-
గతేడాదే కూతురు పెళ్లి.. అప్పు తీర్చలేక
సాక్షి, బల్మూర్(మహబూబ్‌నగర్): వ్యవసాయంతో పాటు కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌కు చెందిన ఏడుపుల లక్ష్మయ్య (45) శివారులో పదెకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. రెండేళ్లుగా సరైన దిగుబడి లేదు. గతేడాదే కూతురు పెళ్లి చేశాడు. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయగా ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి -
ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి
పటాన్చెరు టౌన్: విదేశాలకు వెళ్లేందుకు పరీక్ష రాసి డిస్క్వాలిఫై అయ్యింది. దీంతో మనస్తాపానికి లోనైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన గార్లపాటి సింధు (23) తన సోదరుడు తేజతో కలసి అమీన్పూర్ పరిధిలోని పీఎన్ఆర్ కాలనీలో ఉంటోంది. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన క్లినికల్ అనాలసిస్ట్‌గా పని చేసే ఆమె కరోనా కారణంగా ఉండడంతో ఇంటివద్ద నుంచే విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే విదేశాలకు వెళ్లేందుకు మూడుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించలేక పోయింది. అప్పటి నుంచి తన స్నేహితులు విదేశాలకు వెళ్లారని, తాను వెళ్లలేకపోయానని సోదరుడికి చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే సింధు బుధవారం తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సోదరుడు తేజ బెడ్‌పై నురగలు కక్కుకుంటూ సింధు పడి ఉండడాన్ని గమనించి వెంటనే చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కాగా తన సోదరి మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజ ఫిర్యాదు చేశాడని అమీన్పూర్ పోలీసులు తెలిపారు. చదవండి: కూతురు పుడితే రూ.5,116 డిపాజిట్ -
దారుణం: అంబులెన్స్‌లో ఎస్సై ఆత్మహత్య
న్యూఢిల్లీ: అనారోగ్యంతో వచ్చిన ఎస్సైను కొన్ని ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరించాయి. మూడు ఆస్పత్రులు తిరిగినా చేర్చుకోకపోవడంతో ఆయన క్షణికావేశంలో అంబులెన్స్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు ఆస్పత్రిలో ఆయనను ఎందుకు చేర్చుకోలేదు అనేది దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలో రాజ్వీర్ సింగ్ (39) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ద్వారకలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన ఐదు రోజులుగా సెలవులో ఉన్నారు. ఇక శుక్రవారం అనారోగ్యం చెందడంతో అంబులెన్స్‌ను ఇంటికి పిలిపించారు. ఆ వెంటనే అంబులెన్స్ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా ఆయనను చేర్చుకునేందుకు నిరాకరించింది. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లగా అదే సమాధానం వచ్చింది. చివరకు మూడో ఆస్పత్రికి కూడా వెళ్లగా వాళ్లు ‘చేర్చుకోం’ అనడంతో అనారోగ్యంతో బాధలో ఉన్న రాజ్వీర్ సింగ్ అంబులెన్స్‌లో ఉన్న ఓ వస్త్రంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ మీనా తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రులు ఆయనను ఎందుకు చేర్చుకునేందుకు నిరాకరించాయనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ మీడియాతో చెప్పారు. అయితే కరోనా భయంతోనే ఆస్పత్రులు అతడిని చేర్చుకునేందుకు నిరాకరించాయని తెలుస్తోంది. సకాలంలో చేర్చుకుని ఉంటే ఆయన ప్రాణం దక్కేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
కనకదుర్గ వారధి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, విజయవాడ : పూజ చేసుకుంటానని వచ్చి కనకదుర్గ వారధి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తిని తాడిగడపకి చెందిన మన్నేదుర్గాప్రసాద్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కనకదుర్గ వారధి వద్ద పూజ చేసుకుంటానని వెళ్లాడు. తమ్ముడి కొడుకు సుజిత్‌ని పూజ్ జరుగుతున్నంత సేపు వీడియో రికార్డ్ చేయమన్నాడు. దీంతో సుజిత్ ఫోన్లో రికార్డు చేస్తుండగా ఇక్కసారిగా దుర్గాప్రసాద్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో చనిపోతున్నానని దుర్గాప్రసాద్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులు సొంతం చేసుకున్నారు. అయితే కళ్ళ ముందే పెద్దనాన్న చనిపోవతంతో సుజిత్ షాక్‌కి గురయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గల్లంతైన దుర్గాప్రసాద్ కోసం గాలిస్తున్నారు. -
శ్రీవైష్ణవి ఆస్పత్రి ఎండీ ఆత్మహత్య
నాగోలు: భవనం ఖాళీ చేయాలని యజమానితోపాటు మరికొందరు వేధించడంతో మనస్తాపం చెందిన ఓ ఆస్పత్రి ఎండీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన అజయ్‌కుమార్(38).. భార్య శ్వేత, కుమారులు వర్షిత్, హర్షిత్‌తో కలసి బీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. సాగర్ రింగ్ రోడ్డు సరస్వతి నగర్ కాలనీలో ఉండే కరుణరెడ్డి ఓ బిల్డింగ్ నిర్మిస్తోన్న క్రమంలో అందులో ఆస్పత్రి ఏర్పాటుకు అజయ్ రూ.10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అయినా నిర్మాణం పూర్తి చేయకపోవడంతో అజయ్ మరికొంత డబ్బుతో పూర్తిచేసి శ్రీవైష్ణవి హాస్పిటల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. తను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూ డాక్టర్లతో ఆస్పత్రిని నడిపిస్తున్నాడు. కొంతకాలంగా ఆస్పత్రి సరిగా నడవక అద్దె ఆలస్యం కావడంతో బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి చెప్పాడు. కొంత సమయం ఇవ్వాలని కోరినా కరుణరెడ్డి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు. తాడుతో ఉరి వేసుకుని..: కొద్దిరోజులు ఆస్పత్రిని మూసివేసి మూడ్రోజుల క్రితమే అజయ్ మళ్లీ ప్రారంభించాడు. బిల్డింగ్ ఖాళీ చేయాలని కరుణరెడ్డి, అతని బావమరిది కొండల్‌రెడ్డితోపాటు మరికొందరు అజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చారు. వేధింపులు ఎక్కువ కావడంతో అజయ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం రాత్రి 2 గంటల వరకు ఆస్పత్రిలో ఉన్న అజయ్‌కుమార్ సెల్లార్లో ఉన్న తన గదికి వెళ్లి తా డుతో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఆస్పత్రిలో పనిచేసే స్వా మి వచ్చి.. అజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు కరుణరెడ్డి, కొండల్‌రెడ్డి, తుర్కయంజాల్‌కు చెందిన మాజీ సర్పంచ్ కొత్తకురుమ్మ శివకుమార్, సరస్వతినగర్ కాలనీ అధ్యక్షుడు మేఘారెడ్డి, యాదగిరిరెడ్డి, శివారెడ్డితో పాటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ రమేష్ కారణమని అందులో ఉంది. పిల్లలను మంచిగా చూసుకోవాలని భార్యకు రాసిన మరో లేఖ లభించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య
ముంబై : ముంబైలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన 'దిల్ తో హ్యాపీ హై జీ'లో సెజల్ శర్మ సిమ్మీ ఖోస్లా పాత్రను ధరించి మంచి గుర్తింపు పొందారు. ముంబైలోని మీరా రోడ్లో రాయల్ నెస్ట్ సొసైటీలో ఉన్న తన స్నేహితురాలి నివాసంలో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తన స్నేహితురాలు రూం తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రూం తలుపు బద్దలు కొట్టి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సెజల్ మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా సెజల్ ఆత్మహత్య చేసుకున్న స్థలంలో సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తన ఆత్యహత్యకు ఎవరు కారణం కాదని, వ్యక్తిగత కారణాలతోనే సూసైడ్‌కు పాల్పడినట్లు నోట్లో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన సెజల్ శర్మ.. నటి కావాలని బలమైన కోరికతో 2017లో ముంబైకి వచ్చారు. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమయ్యే 'దిల్ తో హ్యాపీ హై జీ'అనే టీవీ షోలో ఆమె తొలిసారి నటించారు. సెజల్ శర్మ సహ నటుడు అరు కే వర్మ మాట్లాడుతూ.. సెజల్ ఆత్మహత్య వార్త విని తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. పది రోజుల క్రితమే తాను ఆమెను కలిశానని, గత ఆదివారం వాట్సాప్ చాట్ చేసినట్లు చెప్పారు. పది రోజుల క్రితం ఆమెను కలిసినప్పుడు ఆమె అప్పుడు బాగానే ఉందని తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినడం బాధాకరమని అన్నారు. సెజల్ శర్మ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు ఉదయ్ పూర్ తీసుకెళ్తున్నారని, అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు. -
మత్తు ఇంజక్షన్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య
హయత్‌నగర్: రోగులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ఓ డాక్టర్ తానే మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెక్చరర్స్ కాలనీలో నివసించే మంతటి మురళీధర్‌రావు కొడుకు రమేష్ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ (అనస్తీషియన్)గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్వప్న కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మద్య తగాదా నడుస్తోంది. గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ లెక్చరర్స్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా.. స్వప్న బీహెచ్ఈఎల్లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమేష్ సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రపోయాక డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్ తీసుకున్నాడు, ఉదయం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీని వాస్‌రావు కుమారుడు నాగసాయి రామ్ (21) మీర్‌పేట టీకేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకం డియర్ చదువుతున్నాడు. అతడు కళాశాల దగ్గరలోనే ఓ హాస్టల్లో ఉండేవాడు. గురువారం సాగర్రోడ్డులోని అలేఖ్య రెసిడెన్సీ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం సిబ్బం ది రూమ్ సర్వీస్ కోసం అతని గది తలుపు తట్టి పిలిచినా స్పందన రాలేదు. దీంతో కిటికీ నుంచి చూస్తే అతడు ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని గదిని తెరిచి పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన నంబర్ ద్వారా అతడి తండ్రికి సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నాగసాయి ఓ సైకియాట్రిస్టును కలిసినట్లు పోలీసులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే హాస్ట్టల్ నుంచి బెడ్‌షీట్ తెచ్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమూ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
సాక్షి, బద్వేలు: కట్టుకున్న భార్య ప్రవర్తన సరిగా లేదని, నలుగురిలో అవమానంపాలు చేస్తుందన్న కారణంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని నూర్‌బాషాకాలనీకి చెందిన అబ్దుల్‌గఫూర్, లక్ష్మిదేవిలకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రెండవ వాడైన బీగాల మస్తాన్‌వలి (34) ఓ రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈయనకు 13 ఏళ్ల కిందట ఆళ్లగడ్డకు చెందిన షమీనాతో వివాహమైంది. వీరికి అబ్దుల్‌గఫూర్, రియాజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే సంవత్సరం నుంచి షమీనా ఇంటికి సమీపంలోని గౌస్‌పీర్ అలియాస్ మున్నా అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. విషయం మస్తాన్‌వలికి తెలియడంతో పద్ధతి మార్చుకోమని తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో నాలుగైదు సార్లు పంచాయితీ జరిపినప్పటికీ షమీనా ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం బక్రీదు పండుగ కావడంతో షమీనా ఇంటి పట్టున లేకుండా గౌస్‌పీర్ ఇంటికి వెళ్లి ఉండటంతో అప్పుడే ఇంటికి వచ్చిన మస్తాన్‌వలి తిరిగి షమీనాతో గొడవకు దిగాడు. ఈ సమయంలో షమీనా, గౌస్‌పీర్‌లు నీవు చనిపోతే మేమిద్దరం కలిసి ఉంటామని మస్తాన్‌వలికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొడవను చుట్టుపక్కల వారందరూ గమనించడంతో పాటు కట్టుకున్న భార్య అవమానకరంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి బయటకు రాలేదు. మంగళవారం ఉదయాన్నే ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కనే ఉంటున్న అన్న మహమ్మద్‌రఫీ ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి మరదలు షమీనా, గౌస్‌పీర్‌లే కారణమని మహమ్మద్‌రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భార్య తలవంపులు తెస్తోందని..
సాక్షి, మదనపల్లె క్రైం : భార్య చెడు తిరుగుళ్లతో తలవంపులు తెస్తోందని ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సీటీఎం పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన పీట్ల శ్రీనివాసులు(32) మార్బల్ పనులు చేస్తూ భార్యా ఇద్దరు కుమార్తెలను పోషించు కుంటున్నాడు. అయితే ఇంటిపట్టునే ఉంటున్న భార్య జ్యోతి గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తితో చనువుగా ఉంటూ భర్తను పట్టింకుకోక పోవడంతో మందలించాడు. దీంతో ఆమె అలిగి భర్తను వదిలి ఎనిమిది నెలల క్రితం అదే ఊరులో ఉన్న పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి తనకు పరిచయం ఉన్న వ్యక్తితో మరింతగా చనువుగా ఉంటోంది. జ్యోతి తీరుకు గ్రామంలో భర్త తలెత్తుకు తిరగలేక అవమానానికి గురయ్యాడు. అంతే కాకుండా ప్రియుడి మాటలు విని ఆమె స్థానిక రూరల్ పోలీసులకు అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాసులును స్టేషన్‌కు పిలిపించడంతో తీవ్ర మనస్థాపం చెందాడు. జీవితంపై విరక్తి చెందిన అతను సోమవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు శ్రీనివాసులును ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. -
అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదేమోనని..
గుంటూరు : అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటే, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదేమోన్న బెంగతో రిటైర్డ్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో అప్పుల బాధ తట్టుకోలేక నాగేశ్వరరావు అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, అప్పు ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణకు ఈ విషయం తెలియడంతో గుండెపోటుతో మృతి చెందారు. సూర్యనారాయణ రూ. 8 లక్షలు నాగేశ్వరరావుకు అప్పుగా ఇచ్చారు. -
దారుణం.. దయనీయం..!
మెడకు చుట్టుకున్న అప్పులు అతడిలోని విచక్షణ జ్ఞానాన్ని అణిచివేశాయి. భార్యపిల్లలపై అవాజ్య మైన ప్రేమ అతడిలోని సహజ నైజాన్ని రూపుమాపి హంతకుడిగా మార్చివేసింది. కుటుంబంలో ఎవరూ మిగలకూడదని చేసిన హత్యలతో తల్లి, భార్య, పిల్లలను కోల్పోయాడు. తనవారంటూ ఎవరూ లేని ఈలోకంలో ఒక కిరాతక హంతకుడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. చెన్నైలో మంగళవారం విషాదాంతమైన ఒక వస్త్రవ్యాపారి జీవితం, నలుగురు దారుణ హత్యకు దారితీసింది. సాక్షి, చెన్నై: వస్త్ర వ్యాపారంలో నష్టం వచ్చిందన్న విరక్తితో తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఉదంతం చెన్నైలో మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై పల్లవరం సమీపం పంబల్‌కు చెందిన దామోదరన్ అలియాస్ ప్రకాష్ (42) తన ఇంటి సమీపంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య దీప (36), కుమారుడు రోషన్ (7), కుమార్తె మీనాక్షి (5) ఉన్నారు. వీరితోపాటూ దామోదరన్ తల్లి సరస్వతి కూడా ఉంటున్నారు. పిల్లలిద్దరూ సమీపంలోని స్కూలులో చదువుకుంటున్నారు. రుణదాతల నుంచి ఓత్తిళ్లు దామోదరన్ తన వ్యాపారాభివృద్ధి కోసం పలువురి వద్ద అప్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. అందరితోనూ ఎంతో మంచిగా మెలిగే స్వభావం కావడంతో పలువురు అప్పులు ధారాళంగా ఇచ్చారు. అయితే ఆశించిన రీతిలో ఆయన వ్యాపారం అభివృద్ధి చెందలేదు. దీనికి తోడు అప్పుల భారం పెరిగి కనీసం వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ సహా అసలు సైతం ఇచ్చేయాలని రుణదాతల నుంచి ఒత్తిళ్లు మొదలైనాయి. తీవ్రంగా కుంగుబాటుకు గురై.. దీంతో తీవ్రంగా కుంగుబాటుకు గురై గత నెలరోజులుగా ఎవరితో సరిగా మాట్లాడకుండా ఉండడాన్ని గమనించిన భార్య దీప భర్తను ప్రశ్నించగా, వ్యాపారం సరిగా జరగడం లేదు, అప్పులవారి ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నా, ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోయాడు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన దామోదరన్ భార్య, పిల్లలను దగ్గర కూర్చునపెట్టుకుని సంతోషంగా గడిపాడు. ఆ తరువాత భార్యపిల్లలు నిద్రించగా ఆత్యహత్య చేసుకోవాలని భావించాడు. అయితే తాను చనిపోతే అప్పుల వారు వారిని వేధిస్తారని, వారంతా అనాథలుగా మారిపోతారని ఆందోళన చెందాడు. ఆత్యహత్య అంటూ చేసుకుంటే కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తన బావమరిది రాజాకు ఫోన్ చేసి...‘‘నేను చేసిన అప్పులు తీర్చలేక పోతున్నాను, నేను ఏమి చేస్తానో నాకే తెలియడం లేదు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా’’ అంటూ ఫోన్ కట్ చేశాడు. గొంతులు కోసేశాడు.. ఆ తరువాత వంటగదిలోకి వెళ్లి ఒక కత్తి తీసుకు వచ్చి భార్య నోటిని చేతితో అదుముతూ గొంతుకోశాడు. ఆ తరువాత తల్లి గదిలోకి వెళ్లి అదే తీరులో హతమార్చాడు. అలాగే కుమారుడు, కుమార్తె గొంతుకోశాడు. ఆ తరువాత తాను అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ స్థితిలో దామోదరన్ బావమరిది ఫోన్‌చేస్తే ఎవరూ తీయకపోవడంతో అనుమానంతో హడావిడిగా అక్కడికి చేరుకున్నాడు. ఇల్లంతా రక్తపుమడుగులతో నిండిపోగా ఒక గదిలో అతని తల్లి, భార్య ప్రాణాలు విడిచిన స్థితిలో పడి ఉండగా, దామోదరన్, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో గిలగిల కొట్టుకుంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న ముగ్గురిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా పిల్లలిద్దరూ మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. దామోదరన్ చెన్నై జీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రాసిన 5 పేజీల సూసైడ్ నోటు పోలీసుల చేతికి చిక్కింది. అందులో జీఎస్టీ కారణంగా అప్పుల పాలైనట్టు పేర్కొన్నాడు. ఎంతో ఓదార్చా.. ఏం లాభం.. బావను ఫోన్లో ఎంతో ఓదార్చినా.. లాభం లేకపోయింద ని దామోదరన్ బావమరిది రాజా కన్నీరుమున్నీరయ్యా డు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తనకు దామోదరన్ ఫోన్ చేశాడని చెప్పారు. తాను ఇచ్చిన అప్పులు తీర్చకున్నా పర్వాలేదని, చెల్లి, పిల్లలు, మీరంతా బాగుంటే అంతేచాలు అని ఫోన్లోనే ఓదార్చానని తెలిపాడు. అయినా వినకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడని ఆవేదన చెందారు. -
భార్య, అత్తమామలే కారణం..
► ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య ► తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ సూసైడ్ నోట్ ► నలుగురిపై కేసు నమోదు వారిద్దరూ నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వులేకనేను లేనని బాసలు చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఏడాది క్రితం విడిపోయారు. పుట్టినింటికి చేరుకున్న భార్య తల్లిదండ్రులు, ప్రియుడితో కలిసి భర్తపై ప్రతీకార చర్యలకు పాల్పడింది. దీంతో జీవితంపై విరక్తిచెందిన అతను తన చావుకు భార్య, ఆమె ప్రియుడు, అత్తామామలు, బావమరిది కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. మదనపల్లె క్రైం: కొత్తవారిపల్లె పంచాయతీ యనమలవారిపల్లెలో నివాసముంటున్న డేనియల్ కుమారుడు కె.స్వరాజ్‌కుమార్ (26) మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో పట్టణంలోని ఇందిరానగర్‌లోని షేక్ హుస్సేన్, బషీరున్నీషా దంపతుల కుమార్తె యాస్మిన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిది. నాలుగేళ్ల తర్వాత పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. వీరి కాపురం మూడేళ్లుసజావుగా సాగింది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ భార్యను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భర్త అంగీకారంతో యాస్మిన్ మదనపల్లెలోని ఓ నర్సింగ్ హోమ్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే శ్రీనివాసులుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు పడేవారు. ఆమె పుట్టినింటికి చేరుకుని తల్లిదండ్రులు, ప్రియుడి సాయంతో భర్త స్వరాజ్‌కుమార్‌పై స్థానిక టూటౌన్లో కేసులు పెట్టింది. వీరి వేధింపులు తాళలేక స్వరాజ్‌కుమార్ జీవితంపై విరక్తి చెంది సూసైడ్ నోట్ రాసి నివాసం ఉంటున్న ఇంటి పైకప్పుకు సర్వీస్ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వరాజ్‌కుమార్ మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. -
పారాణి ఆరకముందే ప్రాణాలు తీసుకుంది
- పెళ్లైన 17 రోజులకే ఉరేసుకుని మెడికో ఆత్మహత్య - కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో చదువుతున్న సౌమ్య - తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ - గతనెల 27నే డాక్టర్‌తో వివాహం - పెళ్లయ్యాక కాలేజీ హాస్టల్‌కు వచ్చిన రోజే బలవన్మరణం - కూతురి అంత్యక్రియలు నిర్వహించిన కన్నతల్లి సాక్షి, ఖమ్మం క్రైం/కరీంనగర్ రూరల్: ఒక్కగానొక్క కూతురు. మెడిసిన్ చదువుతోంది. వైద్యుడైన కుర్రాడితో పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. వివాహం జరిగి సరిగ్గా 17 రోజులు! ఏమైందోగానీ కాళ్ల పారాణైనా ఆరకముందే తన నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడేనికి చెందిన మెడికో సూదమళ్ల సౌమ్య కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. భోజనానికి పిలిచినా వెళ్లకుండా.. మామిళ్లగూడేనికి చెందిన డాక్టర్ కొమరయ్య, మాలతి దంపతుల ఏకైక కుమార్తె సౌమ్య(25) ఖమ్మంలో ఇంటర్మీడియట్(బైపీసీ) పూర్తి చేసింది. మెడిసిన్ సీటు రావటంతో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. సౌమ్యకు గతనెల 27న నల్లగొండ జిల్లా మోతెకు చెందిన డాక్టర్ పవన్‌కుమార్‌తో వివాహమైంది. సౌమ్యను తీసుకుని మంగళవారం కళాశాలకు వచ్చిన పవన్ ఆమెను హాస్టల్లో వదిలిపెట్టి వె ళ్లాడు. మంగళవారం రాత్రి 9 గంటలకు స్నేహితురాలు భోజనానికి పిలిచినా సౌమ్య వెళ్లకుండా భర్తతో సెల్ఫోన్లో మాట్లాడింది. స్నేహితురాలు తిరిగి గదిలోకి వచ్చేసరికే సౌమ్య ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న కరీంనగర్ డీఎస్పీ రామారావు, రూరల్ సీఐ కృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదంటూ సౌమ్య రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సౌమ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కట్నం వేధింపులే కారణమా? సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్యకు ముందు సౌమ్య రెండు గంటలపాటు భర్తతో మాట్లాడినట్లు సెల్‌ఫోన్ కాల్‌డేటా ద్వారా తెలుస్తోంది. సౌమ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఏవో బలమైన కారణాలుంటాయని ఆమె స్నేహితులు అభిప్రాయపడుతున్నారు. సౌమ్య సమీప బంధువు సందీప్ మాత్రం ఆత్మహత్యకు అత్తింటివారి కట్న వేధింపులే కారణమని ఆరోపించాడు. రూ.16 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశామని, పెళ్లిరోజున ఆడబిడ్డ కట్నం రూ.10 లక్షలు కావాలని గొడవ చేసి అలిగి అత్తింటివాళ్లు వెళ్లిపోయారని చెప్పాడు. భర్తతో కలిసి హాస్టల్‌కు వచ్చిన రోజునే ఆత్యహత్య చేసుకోవడానికి అత్తింటి వేధింపులే కారణమని ఆరోపించాడు. ఆ ఇంట ఏడాది నుంచి విషాదాలే... గతేడాది కొమరయ్య కొడుకు ప్రియతమ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే సౌమ్య ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అటు కొడుకు.. ఇటు కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో ‘మాకెవరు దిక్కు.. మేమెందుకు బతకాలి..’ అంటూ ఆ దంపతులు విలపించడం అందరినీ కలచివేసింది. తండ్రి అనారోగ్యంతో బాధ పడుతుండటంతో తల్లి మాలతి కూతురుకు అంత్యక్రియలు నిర్వహించింది. సౌమ్య, పవన్‌కుమార్‌రెడ్డిల పెళ్లినాటి ఫొటో (ఫైల్)