
లక్ష్మయ్య (ఫైల్)
సాక్షి, బల్మూర్(మహబూబ్‌నగర్): వ్యవసాయంతో పాటు కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్‌కు చెందిన ఏడుపుల లక్ష్మయ్య (45) శివారులో పదెకరాలు కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు.
రెండేళ్లుగా సరైన దిగుబడి లేదు. గతేడాదే కూతురు పెళ్లి చేశాడు. సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేయగా ఎలా తీర్చాలోనని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: అర్జంటుగా దుస్తులు మార్చుకుంటానని స్నేహితురాలి గదికి వెళ్లి
Comments
Please login to add a commentAdd a comment