Thief Robbed Alone House Looted Money Warangal- Sakshi
Sakshi News home page

ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి.. కారం చల్లి..

Published Thu, Dec 23 2021 11:24 AM | Last Updated on Thu, Dec 23 2021 12:21 PM

Thief Robbed Alone House Looted Money Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,మహబూబాబాద్‌ రూరల్‌: మానుకోట జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీకి చెందిన జేరిపోతుల రోహిత్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ.6 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, సాంకేతిక పరికరాలు చోరీకి గురయ్యాయి. రోహిత్‌ భార్యతో కలిసి ఈనెల 19న హైదరాబాద్‌లోని బంధువుల పెళ్లికి వెళ్లాడు. 21న రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి తలుపు తాళం పగులగొట్టి ఉంది. బీరువా, డ్రెస్సింగ్‌ టేబుల్‌ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో సమానులన్నీ చిందరవందరగా ఉన్నాయి.

నాలుగు తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలు, ఎల్‌ఈడీ టీవీ, సీపీయూ, మానిటర్, మూడు కెమెరాలు చోరీకి గురయ్యాయి. కాగా రోహిత్‌ ఫొటోగ్రాఫర్‌ కావడంతో విలువైన ఫొటో కెమెరాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఇంట్లోని కారంపొడి చల్లి వెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ జూపల్లి వెంకటరత్నం తెలిపారు. ఘటనా స్థలాన్ని టౌన్‌ ఎస్సై ఎం.రమాదేవి, క్లూస్‌ టీం పరిశీలించారు. 

చదవండి: చెల్లెలికి చిత్రహింసలు.. అత్తింటి కుటుంబాన్నే మట్టుబెట్టాలని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement