thief
-
అపార్ట్ మెంట్ లో బరితెగించిన దొంగలు..
-
పాపం పూల కుండీల దొంగ
-
బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?
దోమలగూడ: దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరవింద్ నగర్ కాలనీలో గురువారం జరిగిన బంగారం చోరీ ఘటన ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు రంజిత్ గౌరాయ్ సోదరుడు ఇంద్రజిత్ గౌరాయ్ను పోలీసులు విచారించినట్లు సమాచారం. రంజిత్ గౌరాయ్ వద్ద పనిచేసే 40 మంది కారి్మకుల వివరాలతో పాటు కాల్ డేటాను పోలీసులు సేకరించారు. బంగారం దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ -
Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ
కవాడిగూడ: దొంగలు బరితెగించారు. దోమలగూడ పరిధిలోని అరవింద్‌నగర్ కాలనీలో గురువారం తెల్లవారుజామున నగల వ్యాపారిని మారణాయుధాలతో బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కోల్‌కతాకు చెందిన రంజిత్ గౌరాయ్ కొన్నేళ్లుగా అరవింద్‌నగర్ కాలనీలో నివసిస్తున్నారు. నగరంలోని వివిధ జ్యువెలరీ షాపుల నుంచి ఆర్డర్లు తీసుకుని నగలు తయారు చేసి సప్లయ్ చేస్తుంటారు. రంజిత్ వద్ద దాదాపు సుమారు 50 మంది కారి్మకులు పని చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3– 4 గంటల మధ్య దాదాపు ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రంజిత్ ఇంటి తలుపులు కొట్టి కత్తులతో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడ్డారు. రంజిత్ కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోని 2 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు రంజిత్ గౌరాయ్ దోమలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్‌టీం, డాగ్‌స్కా్వడ్‌లతో తనిఖీలు చేపట్టారు. బంగారం దోపిడీకి పాల్పడింది ఇంట్లో పని చేస్తున్న సిబ్బందికి తెలిసినవారా? గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌లో దారుణం -
దొంగల పరువుతీసిన చీప్ దొంగ
-
మెదక్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగ
-
దొంగల టార్గెట్.. ప్రచార సభలు, పాదయాత్రలు..
-
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్‌లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అష్టధాతువులతో తయారు చేసిన 100 ఏళ్ల రాధాకృష్ణుల విగ్రహాన్ని చోరీ చేశారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ దొంగ వారం రోజుల తరువాత ఆలయానికి కొద్దిదూరంలో రోడ్డుపై రాధాకృష్ణుల విగ్రహాలను, ఒక లేఖను ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆ విగ్రహాల గురించి ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సదరు దొంగ క్షమాపణలు చెబుతూ.. రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించాక తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని, పీడకలలతో బాధపడుతున్నాడని’ రాశాడు. తాను అప్పగించిన విగ్రహాలను ఆలయంలో తిరిగి అదోచోట ఉంచాలని ఆ దొంగ వినయపూర్వకంగా కోరాడు.ఇది కూడా చదవండి: ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్‌కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్‌లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్‌ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
గణేష్ మండపంలో దొంగ
-
బండిని ఇంత సింపుల్ గా ఎత్తుకెళ్లాడు ఏంటి..!
-
దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!
దొంగతనానికి వచ్చి కొందరు దొంగలు అక్కడ ఏమి లేకపోవడంతో లెటర్ రాసి పెట్టి వెళ్లిన ఘటనలు చూశాం. ఒక దొంగ చోరికి వచ్చి చక్కగా ఏసీ కింద పడుకున్న ఉదంతాన్ని కూడా చూశాం. ఇవన్నీ ఒక ఎత్తైతే పాపం ఈ దొంగను ఓ బుక్ అడ్డంగా బుక్‌చేసింది. తప్పించుకునేందుకు వీల్లేకుండా పోలీసులకు పట్టుబడేలా చేసింది. ఈ విచిత్ర ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇటలీ రాజధాని రోమ్‌లోని ఒక ఇంటిలో చోరి చేసేందుకు ఒక దొంగ వచ్చాడు. రాత్రిపూట ఆ ఇంటి బాల్కనీ గుండా లోనికి ప్రవేశించి దొంగతనం చేసేందుకు యత్నిస్తుండగా..అక్కడే ఉన్న పుస్తకం దొంగగారిని తెగ ఆకర్షించింది. చదవకుండా ఉండలేకపోయాడు. ఇక అంతే ఆ పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించాడు. ఎంతలా అంటే అందులో నిమగ్నమైపోయాడు. ఇంతలో తెల్లారిపోయింది. మెలుకువ వచ్చి యజమాని చూడగా..అపరిచిత వ్యక్తి పుస్తకం చదువుతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమై పోలీసులకు కాల్ చేశాడు. అతడిని సమీపించి ఎవరు నువ్వు అని తట్టి అడిగేంత వరకు దొంగ ఈ లోకంలో లేనేలేడు. మనోడుకి దొరికిపోయానని అర్థమై.. తప్పించుకునేందుకు వీలుపడలేదు. ఇంతలో పోలీసులు రావడం దొంగని అరెస్టు చేయడం చకచక జరిగిపోయాయి. అయితే ఈ దొంగను ఆకర్షించిన పుస్తకం ఏంటంటే..గ్రీకు పురాణాలకి సంబంధించిన హుమర్స్ ఇలియాడ్ పుస్తకం. అది ఈ దొంగను తెగ ఆకర్షించింది. దీంతో దొంగ ఆ పుస్తక చదవడంలో మునిగిపోయి చోరీ విషయం మర్చిపోయి పట్టుబడ్డాడు. అయితే ఆ ఇంటి యజమాని మాత్రం పాపం అతడు చదవకుండా మధ్య వదిలేయాల్సి వచ్చిన ఆ పుస్తకం కాపీని ఆ దొంగకు పంపిస్తానని అన్నాడు. ఎందుకంటే ఆ పుస్తకమే కదా దొంగతనాన్ని నిరోధించింది. అలాగే ఇది అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతుందని నమ్మకంగా చెబుతున్నాడు సదరు యజమాని. (చదవండి: చప్పన్ భోగ్ థాలీ అంటే..? ఏం ఉంటాయంటే..) -
దండం పెట్టాడు - దొంగతనం చేశాడు
-
Hyderabad: అపార్టుమెంట్లో భారీ చోరీ
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్టుమెంట్లో దొంగలు పడ్డారు. సుమారు 40 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన ఘటన గాందీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ భోలక్‌పూర్ కృష్ణానగర్ కాలనీలోని భవానీ శ్రీ షీలా ఎవెన్యూ అపార్టుమెంట్ 3వ అంతస్తులోని 303 ఫ్లాట్‌లో మాదాపూర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగి శ్రీనివాస్, ఆయన భార్య సబిత, ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె అనుష్కతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం ఇంటికి తాళం వేసి సబిత బయటకు వెళ్లారు. కుమార్తె కాలేజీకి, శ్రీనివాస్ బ్యాంక్‌కు వెళ్లారు. మధ్యాహ్నం వేళ గుర్తు తెలియని దొంగలు అపార్టుమెంట్ మూడో అంతస్తులోకి ప్రవేశించారు. తాళం వేసిన గడియ కింది భాగాన్ని తొలగించి ఇంట్లోకి వెళ్లారు. అల్మరా, ఇతరత్రా ప్రదేశాల్లో దాచి ఉంచిన 14 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించారు. శ్రీనివాస్ కుమార్తె అనుష్క సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా గాంధీనగర్ డివిజన్ ఏసీపీ మొగులయ్య, ఇన్స్పెక్టర్ డి.రాజు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రూపాయి కూడా ఉంచలే.. మీకో దండం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఆశతో చోరీకి వస్తే ఏమీ దొరక్కపోవడంతో ఓ చోరుడు తెగ ఫీలయ్యాడు! ‘ఎంత వెతికినా కనీసం ఒక్క రూపాయి కూడా లేదు... మీకో దండం’ అంటూ యజమానులను ఉద్దేశించి అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ హావభావాలు ప్రదర్శించాడు. చివరకు ఓ వాటర్ బాటిల్ చోరీ చేసి తిరిగి వెళదామనుకున్నప్పటికీ వెనక్కు వచ్చి టేబుల్‌పై రూ. 20 నోటు పెట్టి మరీ వెళ్లాడు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న వినాయక మెస్‌లో గత బుధవారం జరిగిన ఈ విచిత్ర చోరీ యత్నం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆస్తి నష్టం లేకపోవడంతో మెస్ నిర్వాహ కులు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ ఇందుకు సంబంధించిన సీసీటీవీ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సన్నివేశం ప్రపంచాన్ని చుట్టేసింది.మండల కేంద్రం కావడంతో..మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న మెస్ కావడంతో క్యాష్ కౌంటర్లో దండిగా కాసులు ఉంటాయనుకున్న దొంగ.. తలకు టోపీ, ముఖానికి టవల్‌తో ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. తొలుత క్యాష్ కౌంటర్ వద్ద, ఆ తర్వాత కిచెన్‌లో ఆరు నిమిషాలకుపైగా వెతికినా ఏమీ దొరక్కపోవడంతో నిరాశ చెందాడు. తన ఆవేదనను హావభావాల ద్వారా అక్కడి సీసీ కెమెరాల వైపు చూస్తూ ప్రదర్శించాడు.అనంతరం క్యాష్ కౌంటర్ వెనుక ఉన్న రెండు ఫ్రిజ్‌లలో వెతుకుతూ ఒక దాంట్లోంచి వాటర్ బాటిల్ తీసుకొని రెండు అడుగులు ముందుకు వేశాడు. కానీ ఒక్క రూపాయి కూడా దొరకని మెస్లోంచి వాటర్ బాటిల్ చోరీ చేయడానికి మనస్కరించకలేదో ఏమో.. తన ప్యాంటు బ్యాక్ పాకెట్ నుంచి పర్సు బయటకు తీసి అందులో నుంచి రూ. 20 తీసి వాటర్ బాటిల్‌ను కొట్టేయలేదు కొనుక్కొని వెళ్తున్నా అన్నట్లుగా చూపుతూ అక్కడి నుంచి వెనుతిరిగాడు. -
భలే మంచి దొంగ
-
సంగారెడ్డి జిల్లా నందిగామలో దొంగల బీభత్సం
-
యాంటీ డెకాయిట్ ఆపరేషన్.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ డెకాయిట్ ఆపరేషన్‌లో దొంగలకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ధార్ భావరియా గ్యాంగ్‌లే లక్ష్యంగా నగరంలో పలు పప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై పోలీసులు కన్నేశారు. పలు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ తరుణంలో హైదరాబాద్ అసిఫ్ నగర్, చిలకలగూడా, సికింద్రాబాద్‌లో చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమయంలో కళ్లుగప్పి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసుల ఫైరింగ్ చేశారు. ఇక యాంటీ డెకాయిట్ ఆపరేషన్‌లో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు చైనా స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మేడ్చల్‌లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్‌లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
హై క్లాస్ దొంగ
-
రైల్వే సిగ్నల్స్ ట్యాంపర్..రెండు రైళ్లలో దోపిడీ
బిట్రగుంట: విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని కావలి– శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే సిగ్నల్స్‌ను ట్యాంపర్ చేయడం ద్వారా రెడ్ సిగ్నల్ వేసి రైళ్లను నిలిపి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. రైల్వే జీఆర్పీ అధికారుల సమాచారం మేరకు.. కావలి–శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్య నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి రెడ్ సిగ్నల్ పడేలా చేశారు. ఆ సమయంలో నరసాపురం నుంచి ధర్మవరం వెళుతున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్ (నంబరు 17247)ను నిలిపివేసి ఎస్–11, ఎస్–13 బోగీల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు గొలుసులు, బ్యాగులు చోరీ చేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత అదే మార్గంలో వచి్చన షిర్డిసాయినగర్ నుంచి తిరుపతికి వెళ్తున్న తిరుపతి స్పెషల్ (07638) ట్రైన్‌ను ఇదే తరహాలో నిలిపి ఎస్–3, ఎస్–5 కోచ్‌ల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల మెడల్లోని 38 గ్రాముల బంగారు గొలుసులు, బ్యాగులు అపహరించారు. ఈ క్రమంలో దోపిడీని అడ్డుకునేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అనంతరం పక్కనే ఉన్న కొండబిట్రగుంట అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. రైల్వే పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఒంటెనే చోరీ చేశారు
కురబలకోట : ఇన్నాళ్లు పర్సులు కొట్టేసే దొంగలను చూశాం.. ఇంట్లో చొరబడి బంగారో..నగదో చోరీ చేసిన వాళ్లనూ చూశాం.. కానీ ఏకంగా పెద్ద జంతువులలో ఒకటైన ఒంటెనే ఎత్తుకెళ్లే ఘనులుంటారని ఇప్పుడే చూస్తున్నాం. అవును.. అన్నమయ్య జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో ఒంటెను ఎత్తుకెళ్లిన ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు..త్వరలో జరగబోయే బక్రీద్‌కు అంగళ్లుకు చెందిన మిత్రులు కొందరు 13 రోజుల క్రితం రూ.1.25 లక్షలతో ఒంటెను కొన్నారు. పరిసర ప్రాంతాల్లో మేపుతూ రాత్రి వేళ ఇంటి వద్ద కట్టేసేవారు. ఆదివారం వేకువ జామున లేచి చూస్తే ఒంటె కాస్తా కన్పించలేదు. తాడు తెంపుకుని బయటకు వెళ్లిందోమోనని తొలుత భావించారు. స్థానికంగా వెతికినా కన్పించలేదు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకే కాకుండా రాత్రి పొద్దుపోయే వరకు కూడా స్నేహితులు కలసి అంతటా గాలించారు. పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టినంత పనిచేశారు. సమీపంలోని గుట్టలు, వాగులు, వంకలతో పాటు పరివాహక ప్రాంతాల్లో కూడా వెతికారు. ఎక్కడా ఆచూకీ కన్పించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జాడ మాత్రం కన్పించలేదు. అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలుకెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కన్పించినట్లు చెబుతున్నారు. సాధారణంగా ఏనుగులు, ఒంటెలు లాంటి భారీ సైజు వాటిని చోరీ చేయడం ఆషామాషీ కాదు. కష్టంతో పాటు సాహసంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద ఒంటెనే అంగళ్లులో ఏకంగా చోరీ చేశారంటే వారెంత ఘనులో అర్థం చేసుకోవచ్చు. ఆచూకీ తెలిస్తే 8978126623 మొబైల్ నెంబరుకు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు తెలిపారు. -
జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగ..పాపం..! ఇలా వర్క్ట్లు..
ఓ దొంగ జిమ్‌లో చోరీ చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు. ఏదో పట్టుకుపోదామనుకుని వచ్చి ఇలా దొరికిపోతానని ఊహించని దొంగను యజమాని ఏం చేశాడో వింటే షాకవ్వుతారు. పట్టుబడిన ఆ దొంగకు జిమ్ యజమాని ఎవ్వరూ ఊహించని ఓ శిక్ష వేసి మరీ పోలీసులకు అప్పగించాడు. ఇంతకీ ఆ జిమ్ యజమాని ఏం చేశాడంటే..ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ దొంగ జిమ్ సెంటర్లోకి వెళ్లి చోరీ చేయాలని అనుకున్నాడు. అక్కడ ఉన్న షట్టర్‌ని ఏదో విధంగా ఓపెన్ చేసి లోపలకి వెళ్లి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఇంట్లో ఉన్న జిమ్ యజమానికి అర్థరాత్రి హఠాత్తుగా మెలుకువ వచ్చి ఫోన్ చెక్ చేసుకుంటాడు. జిమ్ సెంటర్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా..అక్కడ ఓ దొంగ పచార్లు కొడుతున్నట్లు కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా జిమ్‌కి వెళ్లి ఆ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు యజమాని. దీంతో భయాందోళనకు గురైన దొంగ ఏం చేయాలో తోచక బిత్తరచూపులు చూశాడు. అయితే ఆ జిమ యజమాని దొంగని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తమంటూ శిక్ష విధించి మరీ పోలీసులకు అప్పగించాడు. పాపం దొంగలించడానికి వచ్చి ఇలా వర్క్ట్లు చేసి మరీ జైలుకి వెళ్తానని ఊహించి ఉండడు కదా..!. ఇలాంటి ఫన్నీ ఘటనే గతవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది. ఓ దొంగ దొంగతనం చేయడానికి చవ్చి ఏసీ ఆన్ చేసుకుని మరీ నేలపై ప్రశాంతగా నిద్రపోయాడు. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ పోలీసులు ఉండటంతో కంగుతిన్నాడు. అతడు మద్యం మత్తులో ఉండటంతో ఇలా నిద్రపోయాడని పోలీసులు చెప్పారు. (చదవండి: ద్రౌపది ముర్ము మోదీకి దహీ-చీనీని తినిపించడానికి రీజన్! ఏంటీ స్వీట్ ప్రాముఖ్యత) -
‘పాపం..దొంగ గారు.. ఏసీ చూడగానే ఫ్లాట్!’ కట్ చేస్తే..!
దేశంలోఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయి. ఏసీ, ఫ్యాన్లు లేనిదే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. చోరీకి వచ్చిన ప్రబుద్ధుడు, ఎంచక్కా ఏసి వేసుకొని ఆదమరిచి నిద్ర పోయిన ఘటన, ఫోటో వైరల్‌గా మారింది.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉన్న ఇంట్లోకి చోరీకి చొరడ్డాడో వ్యక్తి. అసలే పగలూ రాత్రి తేడా లేకుండా మండే ఎండలు పైగా పూర్తిగా మద్యం మత్తులో ఉన్న అతగాడు, ఏసీ చూడగానే మైమరిచిపోయాడు. ఏసీ ఆన్ చేసుకొని, నేలమీదే ఒక దిండు వేసుకుని హాయిగా గుర్రు కొట్టి నిద్ర పోయాడు. తెల్లవారేక ఇంటి ముందు గేటు తెరిచి ఉండడంతో వారణాసిలో విధులు నిర్వహిస్తున్న సదరు ఇంటి యజమాని డాక్టర్ సునీల్ పాండేకు సమాచారం అందించారు పొరుగువారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి చ్చింది. సంఘటనా చేరుకున్న పోలీసులు కూడా విస్తుపోయారు. చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని అలాగే గాఢనిద్రలోకి జారుకున్నాడు. చిత్రం వైరల్‌గా మారింది. దొంగ తనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి నిద్రపోయాడని డీసీపీ నార్త్ జోన్ ఆర్ విజయ్ శంకర్ తెలిపారు. అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. -
ఓరి ‘దొంగ’.. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు..
లక్నో: నడుస్తున్న సమయంలో, పక్కన కూర్చున్నప్పుడు జర్నీలో దొంగతనాలు చేయడం సాధారణమే.. అయితే ఇటీవల దొంగలు విచిత్రంగా పడుకొని చోరీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దొంగిలిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి రైల్వేస్టేషన్లో నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలో ఓ దొంగ ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడ్డాడు. తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ‘The Sleeping Thief’: A Person has been arrested from UP’s Mathura for stealing from passengers sleeping on railway stations. The CCTV Footage shows the cunning modus operandi of the thief where he pretends to sleep beside a traveller & swiftly pick pockets the mobile phone. pic.twitter.com/6OVSYydwaZ — Tanishq Punjabi (@tanishqq9) April 10, 2024