Guntur: Robbers Loot Cash Worth 10 Lakhs Near HDFC Bank In Lakshmipuram, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: ఏం తెలివిరా నాయనా.. సినీ ఫక్కీలో 10లక్షలు చోరీ

Published Sat, Jul 15 2023 7:38 PM | Last Updated on Sat, Jul 15 2023 7:57 PM

Thieves Ten Lacks Money Robbery At Guntur Lakshmipuram - Sakshi

సాక్షి, గుంటూరు: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దొంగలు ఎప్పటికప్పుడు అప్‌గేట్‌ అవుతూ ట్రిక్కులతో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 కోసం కక్కుర్తిపడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో పట్టపగలే దొంగలు చేతివాటం చూపించారు. రూ. 20నోటును ఎరగవేసి రూ.10లక్షల నగదును ఎత్తికెళ్లారు. బాలాజీ నగర్‌కు చెందిన కోసూరి హరిబాబు ఎం.ఎన్‌ ఎక్స్‌పోర్టు కంపెనీలో మూడేళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన లక్ష్మీపురంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.10 లక్షలు డ్రా చేశారు. కాగా, బ్యాంకు నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగును బైక్ హ్యాండిల్‌కు తగిలించారు. తర్వాత బైక్‌ స్టార్ట్‌ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. 

దీంతో, ఆ రూ.20లను తీసుకునేందుకు హరిబాబు.. బైకి దిగి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్‌కు ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్‌ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో షాకైన హరిబాబు.. తేరుకుని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా.. బ్యాంకులోకి కూడా ఒక దొంగ ముందుగా వచ్చి ఎంత నగదు డ్రా చేసింది రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని బ్యాంక్ దగ్గర రెక్కీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్‌, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement