Ten Lakh
-
సహన కుటుంబానికి అండగా ఉంటాం: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరుజిల్లా: సహన తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని, ఆయన ప్రకటించిన పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును సహన కుటుంబులు సభ్యులకు అందించామని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటిరాంబాబు తెలిపారు. తెనాలిలో టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో మృతి చెందిన సహన కుటుంబ సభ్యులకు అంబటి రాంబాబు స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శనివారం(నవంబర్ 2) పది లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘సహన ఘటన చాలా దారుణమైనది. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్యం కూడా సకాలంలో అందించలేకపోయారు. సహన హత్య కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెనాలిలో జనసేన పార్టీకు సంబంధించిన మంత్రి ఉన్నారు. ఇప్పటివరకు సహన ఘటనపై ఆయన స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలను దారుణంగా మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. సహన హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సహన కుటుంబానికి వైఎస్సార్సీపీ తరపున అండగా ఉంటాం’అని తెలిపారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కే రోజా -
సువర్ణావకాశం.. ఒక ఐడియా రూ.10 లక్షలు - ట్రై చేయండిలా!
ఆధునిక కాలంలో సృజనాత్మకత పెరిగిపోతోంది. కేవలం చదువుకున్న వారు మాత్రమే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా తమదైన రీతిలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఏవియేషన్ కంపెనీ బోయింగ్ ఇండియా కొత్త ఆలోచనల కోసం ఒక కార్యక్రమం ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బోయింగ్ ఇండియా తన ప్రతిష్టాత్మక బోయింగ్ యూనివర్శిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) ప్రోగ్రామ్ కోసం విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఇతర వర్ధమాన వ్యవస్థాపకులను ఆహ్వానించింది. ఇక్కడ వినూత్న ఆలోచలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉత్తమ 7మందికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల బహుమతి లభిస్తుంది. ఏరోస్పేస్, రక్షణ, టెక్నాలజీ, సామాజిక ప్రభావం వంటి విషయాలపైన ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ ద్వారా బిల్డ్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచనలను 2023 నవంబర్ 10 వరకు పంపవచ్చు. గత ఏడాది ఇదే ప్రోగ్రామ్ కోసం టైర్ 1, టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందిన విద్యార్థుల నుంచి 1600 కంటే ఎక్కువ, స్టార్టప్ ఔత్సాహికుల నుంచి 800 కంటే ఎక్కువ ఆలోచనలు వెల్లువెత్తాయి. కాగా ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: 12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి.. ఈ సంవత్సరం బోయింగ్ బిల్డ్ ప్రోగ్రామ్ కోసం ఏడు ప్రసిద్ధ ఇంక్యుబేటర్లతో జతకట్టింది. అవి సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ - ఐఐటీ ముంబై, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ - ఐఐటీ ఢిల్లీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ - ఐఐటీ గాంధీనగర్, ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్, సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ డెవలప్మెంట్ - ఐఐఎస్సీ బెంగళూరు, టీ-హబ్ హైదరాబాద్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ - కేఐఐటీ భువనేశ్వర్. -
వీడియో: ఏం తెలివిరా నాయనా.. సినీ ఫక్కీలో 10లక్షలు చోరీ
సాక్షి, గుంటూరు: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. దొంగలు ఎప్పటికప్పుడు అప్‌గేట్ అవుతూ ట్రిక్కులతో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.20 కోసం కక్కుర్తిపడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడో వ్యక్తి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో పట్టపగలే దొంగలు చేతివాటం చూపించారు. రూ. 20నోటును ఎరగవేసి రూ.10లక్షల నగదును ఎత్తికెళ్లారు. బాలాజీ నగర్‌కు చెందిన కోసూరి హరిబాబు ఎం.ఎన్ ఎక్స్‌పోర్టు కంపెనీలో మూడేళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన లక్ష్మీపురంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.10 లక్షలు డ్రా చేశారు. కాగా, బ్యాంకు నుంచి బయటకు వచ్చి డబ్బులు ఉన్న బ్యాగును బైక్ హ్యాండిల్‌కు తగిలించారు. తర్వాత బైక్ స్టార్ట్ చేస్తుండగా.. ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి మీ డబ్బులు కిందపడిపోయాయని చెప్పాడు. దీంతో, ఆ రూ.20లను తీసుకునేందుకు హరిబాబు.. బైకి దిగి కిందకు వంగాడు. ఇంతలో మరో వ్యక్తి బైక్ హ్యాండిల్‌కు ఉంచిన డబ్బుల సంచిని ఎత్తుకెళ్లాడు. అప్పటికే మరొక వ్యక్తి వాహనం స్టార్ట్ చేసి సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు కలిసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ క్రమంలో షాకైన హరిబాబు.. తేరుకుని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా.. బ్యాంకులోకి కూడా ఒక దొంగ ముందుగా వచ్చి ఎంత నగదు డ్రా చేసింది రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు ముందుగానే ప్లాన్ చేసుకుని బ్యాంక్ దగ్గర రెక్కీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
బ్యాగులో లక్ష్మీ కటాక్షం: అమ్మ తోడు సార్.. ఆ పదిలక్షల బ్యాగ్ నాదే!
యశవంతపుర: వైన్‌షాపులో మద్యం తాగి బయటకు వచ్చిన శివరాజ్ అనే వ్యక్తికి రోడ్డుపై రూ. 10 లక్షల డబ్బు దొరికింది. తన జతలో ఉన్న కూలీకి కొంత డబ్బు ఇచ్చి మిగతాది తీసుకెళ్లాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాగులో లక్ష్మీ కటాక్షం నవంబర్ 27న మంగళూరులో పంప్‌వెల్ వద్ద కూలీలు శివరాజ్, తుకారామ్‌లు కలిసి ఓ బ్రాందీషాపులో మద్యం తాగి రోడ్డు పక్కలో నిలబడి ఉండగా ఓ బ్యాగ్ రోడ్డు పైన పడి ఉంది. శివరాజ్ దానిని తీసుకుని ఉత్కంఠగా తెరిచి చూడగా అందులో ఐదువందలు, రెండు వేల నోట్లు ఉన్న బండిళ్లు కనిపించాయి. అమ్మో ఎంత డబ్బో అని ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. నాకెంత అని తుకారామ్ అడగడంతో రెండు వేల రూపాయల నోట్ల కట్టను ఇచ్చాడు. అందులో రెండు నోట్లు తీసి ఇద్దరు కలిసి మళ్లీ మద్యం తాగి ఎవరి దారిలో వారు వెళ్లిపోయ్యారు. ఆనందం పట్టలేని శివరాజ్ ఒక్కడే మళ్లీ వైన్‌షాపుకు వెళ్లి తాగాడు. కంకనాడి పోలీసులు అతని ప్రవర్తన చూసి బ్యాగ్‌లో ఏముందో చూపాలని అడిగారు. డబ్బులు కనిపించటంతో వెంటనే జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు. తుకారామ్‌కు ఇచ్చిన డబ్బులను తీసుకురావాలని చెప్పి మూడు రోజుల పాటు స్టేషన్లోనే పెట్టుకున్నారు. తుకారామ్ జాడ తెలియని కారణంగా శివరాజ్‌ను వదిలిపెట్టలేదు. రూ. 3.50 లక్షలు ఉన్నాయి: కమిషనర్ ఈ విషయం అనోటా ఈ నోటా మంగళూరు నగరమంతా పాకింది. ఈ డబ్బులు వక్క వ్యాపారులదిగా తెలిసింది. ఓ వ్యాపారి వెళ్లి డబ్బులు తనవేనని పోలీసులను కలిశాడు. కానీ ఇది నీ డబ్బులు కాదంటూ వ్యాపారిని మందలించి పంపారు. చివరకు తమకు దొరికిన బ్యాగులో 10 లక్షలు లేవు. రూ.49 వేలు ఉన్నట్లు పోలీసులు వాదించారు. ఇంతవరకూ తమ డబ్బులు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాగుబోతు వద్ద రూ. మూడున్నర లక్షలు మాత్రమే లభించిన్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు పోగొట్టుకున్నారో గుర్తిస్తామని చెప్పారు. -
CM YS Jagan: మరోసారి గొప్పమనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, గుంతకల్లు టౌన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సంకల్పయాత్రలో తన వెంట నడుస్తూ ఓ అభిమాని ప్రాణాలు కోల్పోగా, ఆదుకుంటానని ఆ కుటుంబానికి ఆయన మాట ఇచ్చారు. చెప్పినట్లుగానే సాయమందించి భరోసా ఇచ్చారు. వివరాలు.. గుత్తి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రంగారెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని. ఇతనికి భార్య రమణమ్మ, కుమార్తెలు భారతి, భాగ్యలక్ష్మి ఉన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో ఇడుపులపాయ నుంచి రంగారెడ్డి ఆయన వెంట నడిచారు. నెల్లూరు జిల్లా కాండ్ర గ్రామంలో అభిమాన నేతతో కరచాలనం చేసి ఫొటో కూడా దిగారు. అదే రోజు మధ్యాహ్నం రంగారెడ్డికి గుండెపోటు రావడంతో గూడూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చదవండి: (బాబుది కుట్రపూరిత మనస్తత్వం) రూ.10 లక్షల చెక్కును రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేస్తున్న ఎమ్మెల్యే వైవీఆర్ కుటుంబాన్ని ఆదుకుంటానని జగన్ హామీ రంగారెడ్డి మృతి వార్త తెలుసుకున్న వైఎస్ జగన్ కాండ్ర గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటానని మాట ఇచ్చారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి సీఎం జగన్‌కు గుర్తు చేయగా, వెంటనే స్పందించిన ఆయన రూ.10 లక్షల చెక్కు పంపారు. ఈ చెక్కును ఎమ్మెల్యే వైవీఆర్ శనివారం పెద్దొడ్డి గ్రామపెద్దల సమక్షంలో రంగారెడ్డి కుటుంబసభ్యులకు అందజేశారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం
సాక్షి, చెన్నై : శ్రీలంక సేనల వీరంగానికి బలైన జాలరి రాజ్ కిరణ్ మృతదేహం శనివారం పుదుకోట్టై జిల్లా కోటై పట్నానికి చేరింది. బాధిత కుటుంబానికి సీఎం ఎంకే స్టాలిన్ రూ. పది లక్షలు సాయం ప్రకటించారు. తమిళ జాలర్లపై సముద్రంలో శ్రీలంక సేనల వీరంగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత వారం పుదుకోట్టై జిల్లా కోటై పట్నంకు చెందిన జాలర్ల పడవపై శ్రీలంక నావికాదళం తమ ప్రతాపం చూపించింది. తమ నౌకతో ఆ పడవను ఢీకొట్టి మరీ.. సముద్రంలో ముంచేశారు. ఇందులోని రాజ్ కిరణ్ గల్లంతయ్యాడు. సుగందన్, సేవియర్‌ను రక్షించి తమ దేశ చెరలో బంధించారు. రాజ్‌కిరణ్ మృతదేహం కోసం శ్రీలంక సేనులు, భారత కోస్టు గార్డు తీవ్రంగానే గాలించింది. ఎట్టకేలకు నెడుం దీవుల్లో ఆ మృతదేహం తేలింది. ఈ మృత దేహానికి శ్రీలంకలో పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. దీంతో ఉదయాన్నే శ్రీలంకకు చెందిన నౌకలో ఆ మృతదేహాన్ని భారత సరిహద్దుల వరకు తీసుకొచ్చారు. భారత కోస్టుగార్డు వర్గాలకు అప్పగించారు. అక్కడ నుంచి కోటైపట్నంకు తరలించారు. చదవండి: (సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ..) మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో జాలర్లు, అతడి కుటుంబీకులు కన్నీటి సంద్రంలో మునిగారు. శ్రీలంక చెరలో ఉన్న తమ వాళ్లను విడిపించే వరకు వేటకు వెళ్లమని జాలర్ల ప్రకటించారు. ఇక, రాజ్‌కిరణ్ మరణ సమాచారంతో దిగ్బ్రాంతిని , సంతాపాన్ని వ్యక్తం చేసిన సీఎం ఎంకే స్టాలిన్, అతడి కుటుంబానికి రూ. 10 లక్షలు సాయంప్రకటించారు. -
వారికి కేంద్రం భరోసా.. 18 ఏళ్లలోపు బాలలకు రూ.10 లక్షలు డిపాజిట్
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మరో భరోసా దక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాథ బాలలను ఆదుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ స్కీం ద్వారా ఆదుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన పిల్లల సమగ్ర సంరక్షణ, విద్య, ఉపాధి, వసతి వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టగా కేంద్ర ప్రభుత్వం మరో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి సంరక్షణ చర్యలు తీసుకోనుంది. పీఎం కేర్ స్కీమ్ పథకానికి కలెక్టర్ల ద్వారా నిర్వహించిన ఎంపికలో 237 మంది అర్హులని గుర్తించారు. గతేడాది మార్చి 11 నుంచి కూడా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన 18 ఏళ్లలోపు బాలలు ఈ పథకానికి అర్హులు. ఈ ఏడాది మే 29 నుంచి లబ్ధిదారుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. డిసెంబర్ 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులకు రూ.10 లక్షల వంతున పోస్టాఫీసులో డిపాజిట్ చేసి, వారికి 18 సంవత్సరాలు దాటిన తరువాత 23 ఏళ్ల వరకు ఆ డిపాజిట్‌పై ప్రతినెల స్టైఫండ్ ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని వారికి అప్పగిస్తారు. అనాథ బాలల సమగ్ర సంరక్షణతోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తారు. వారికి ఆరోగ్య బీమాతోపాటు ప్రమాద బీమా రూ.5 లక్షలు వర్తించేలా చేస్తారు. అనాథ బాలలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వారికి పిల్లల సంరక్షణ కేంద్రాల్లో (ఛైల్డ్ కేర్ సెంటర్లలో) వసతి, విద్య, వైద్యం వంటి ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల డిపాజిట్ వారికి 18 ఏళ్లు నిండగానే తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.10 లక్షల డిపాజిట్ 23 ఏళ్ల వయసు నిండాకే తీసుకునేలా మార్గదర్శకాలు ఇచ్చారు. అనాథ బాలలకు అవసరమైన తోడ్పాటు అందించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తాం. – కృతికాశుక్లా, మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకులు -
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్‌ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. -
జర్నలిస్ట్ ఫ్యామిలీకి 10 లక్షల పరిహారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో నడిరోడ్డుపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్ట్ విక్రమ్ జోషి బుధవారం ఉదయం మరణించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే విధంగా జర్నలిస్ట్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. జోషి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యను అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. (చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి) తన మేనకోడలిని వేధించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ వద్ద ఇద్దరు కుమార్తెల ఎదుటే జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై నిందితులు దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న విక్రమ్ జోషి సోమవారం రాత్రి తన కుమార్తెలతో ఇంటికి తిరిగి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేశారు. జోషి తలపై బుల్లెట్ గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు పోలీసులను సస్సెండ్ చేసినట్లు పేర్కొన్నారు. -
సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు
చెన్నై: దేశంలోని 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈనెల 29 నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జెనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలమ్ తెలిపారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. తొమ్మిది యూనియన్ల లో సభ్యత్వం కలిగిన దాదాపు 10 లక్షల మంది ఇందులో పాల్గొననున్నారు.