సాక్షి, ప్రకాశం: చీరాల ఎస్సై విజయకుమార్ దాడి చేసిన ఘటనలో కిరణ్ అనే దళిత యువకుడు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 19న బైకుపై వస్తూ మాస్క్ ధరించలేదని ఆగ్రహించిన ఎస్సై విజయకుమార్ లాఠీతో కిరణ్‌ను చితకబాదాడు. దీంతో అతడిని ఎస్సై సిబ్బందితో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పూర్తి వివరాలను సేకరించాని జిల్లా ఎస్పీని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ ఘటనపై స్పందించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరణించిన కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులుతో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.
కిరణ్ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం
Published Wed, Jul 22 2020 1:22 PM | Last Updated on Wed, Jul 22 2020 1:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment