సాక్షి,గుంటూరుజిల్లా: సహన తల్లిదండ్రులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారని, ఆయన ప్రకటించిన పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును సహన కుటుంబులు సభ్యులకు అందించామని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటిరాంబాబు తెలిపారు. తెనాలిలో టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో మృతి చెందిన సహన కుటుంబ సభ్యులకు అంబటి రాంబాబు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి శనివారం(నవంబర్ 2) పది లక్షల రూపాయల చెక్కును అందించారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘సహన ఘటన చాలా దారుణమైనది. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్యం కూడా సకాలంలో అందించలేకపోయారు. సహన హత్య కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెనాలిలో జనసేన పార్టీకు సంబంధించిన మంత్రి ఉన్నారు. ఇప్పటివరకు సహన ఘటనపై ఆయన స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలను దారుణంగా మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. సహన హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సహన కుటుంబానికి వైఎస్సార్‌సీపీ తరపున అండగా ఉంటాం’అని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కే రోజా
Comments
Please login to add a commentAdd a comment