sahana
-
సహన కుటుంబానికి అండగా ఉంటాం: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరుజిల్లా: సహన తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని, ఆయన ప్రకటించిన పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును సహన కుటుంబులు సభ్యులకు అందించామని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటిరాంబాబు తెలిపారు. తెనాలిలో టీడీపీ రౌడీ షీటర్ నవీన్ దాడిలో మృతి చెందిన సహన కుటుంబ సభ్యులకు అంబటి రాంబాబు స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శనివారం(నవంబర్ 2) పది లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ‘సహన ఘటన చాలా దారుణమైనది. దళిత మహిళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆస్పత్రిలో సరైన వైద్యం కూడా సకాలంలో అందించలేకపోయారు. సహన హత్య కేసులో ముగ్గురు నిందితులు ఉన్నట్లు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం ఒక్కరినే అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెనాలిలో జనసేన పార్టీకు సంబంధించిన మంత్రి ఉన్నారు. ఇప్పటివరకు సహన ఘటనపై ఆయన స్పందించలేదు. రాష్ట్రంలో మహిళలను దారుణంగా మానభంగాలు చేస్తూ హత్యలు చేస్తున్నా ఎవరూ మాట్లాడటం లేదు. సహన హత్య కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సహన కుటుంబానికి వైఎస్సార్సీపీ తరపున అండగా ఉంటాం’అని తెలిపారు. ఇదీ చదవండి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది: ఆర్కే రోజా -
సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడైన రౌడీషీటర్ నవీన్ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయలేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దళితుడైన కిరణ్‌కుమార్ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. అసలు కారణం ఇదీ..రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
జీజీహెచ్ మార్చురీ వద్ద సహానా కుటుంబసభ్యుల ఆందోళన
గుంటూరు మెడికల్/తెనాలిరూరల్: తెనాలికి చెందిన సహానా మృతికి కారకులైన నిందితుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి తక్షణమే శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, దళితసంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారు బుధవారం సహానా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా గుంటూరు జీజీహెచ్ మార్చురీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు తాము ఆందోళన చేస్తామని చెప్పారు. దళిత యువతిపై దాడి జరిగినా ఎందుకు తక్షణమే స్పందించలేదని ప్రశి్నంచారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. దళిత యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది. ఈ ఆందోళనలో పలు దళితసంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. వీరి ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీకి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా అంత్యక్రియలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మృతదేహాన్ని హయ్యరుపేటలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సహానా మృతదేహానికి మంత్రి నాదెండ్ల మనోహర్, సబ్‌కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చెక్కును సహానా తల్లి అరుణకుమారికి మంత్రి మనోహర్ అందజేశారు. అనంతరం ఐతానగర్ సమాధుల తోటలో సహానా అంత్యక్రియలను నిర్వహించారు. -
మధిర సహాన మృతిపై వైఎస్సార్సీపీ నేతల తీవ్ర విచారం
సాక్షి,గుంటూరు: టీడీపీ రౌడీషీటర్ నవీన్ దాడిలో గాయపడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన మధిర సహాన చివరకు ఓడిపోయింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాన మరణంపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీకి మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు యువతి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. సహన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారో అందరూ చూస్తున్నారు. అక్కడి మంత్రి ఏమైపోయారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. దిశ యాప్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సహాన మరణ వార్తపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. రేపు (బుధవారం)సహన కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు’ అని అన్నారు. సహానా మరణంపై మాజీ మంత్రి విడదల రజిని విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇందుకు సహానలాంటి ఘటనలే నిదర్శనం. సహాన శరీరంపై గాయాలున్నాయి. బయటకు చెప్పుకోలేని అభద్రతాభావంలో సహన తల్లిదండ్రులు ఉన్నారు. మహిళలకు రక్షణ లేదన్న భావన వ్యక్తం అవుతోంది. దిశ లాంటి చట్టాలను వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చారు. దిశ లాంటి చట్టాల అవసరం ఉంది. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘ఓల్డ్ బట్ గోల్డ్’ యూట్యూబ్ చానల్‌తో.. షోమ్ మ్యూజికల్ జర్నీ..
'షహన షోమ్' మ్యూజికల్ జర్నీ తన అధికార యూట్యూబ్ చానల్ ‘వోల్డ్ బట్ గోల్డ్’తో మొదలైంది. దీని ద్వారా బాలీవుడ్ టైమ్‌లెస్ మెలోడిస్‌ను వినిపించి ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘మొహబ్బత్ కర్నే వాలే’ లాంటి క్లాసిక్‌తో పాటు ‘సేవ్ ది గర్ల్‌చైల్డ్’ ‘ఎడ్యుకేషన్ ఫర్ ది అండర్ప్రివిలేజ్డ్’ లాంటి సామాజిక స్పృహతో కూడిన ఇతివృత్తాలతో పాటలు పాడుతుంది. చిన్నప్పుడు సినిమా పాటలే కాదు క్లాసిక్ గజల్స్, కీర్తనలు పాడేది. ప్రముఖ సంగీతకారుల వర్థంతిని దృష్టిలో పెట్టుకొని వారికి నివాళిగా యూట్యూబ్‌లో చేసే పాటల కార్యక్రమాలు సూపర్‌హిట్ అయ్యాయి.పాత పాటలు పాడుతుంటే కాలమే తెలియదు. 'టైమ్మెషిన్లో గతంలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది’ అంటున్న షహనకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన పాటల ద్వారా వివిధ సామాజిక సేవాకార్యక్రమాలకు నిధులను సేకరించడంలో కూడా ముందు ఉంటుంది. 'పాటల ద్వారా సామాజిక సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం నా లక్ష్యాలలో ఒకటి’ అని చెబుతుంది షహన. ఇవి చదవండి: ముగ్గురు మిత్రుల ముచ్చటైన విజయం -
బర్త్‌డే రోజే బాత్రూమ్లో విగతజీవిగా మోడల్, భర్తే చంపాడా?
పుట్టినరోజే ఆమెకు ఆఖరి రోజయ్యింది. బర్త్‌డే రోజు తన కుటుంబాన్ని కలవాలన్న కోరిక కూడా తీరకుండానే ఆమె కన్నుమూసింది. కేరళ మోడల్ షహానా బర్త్‌డే నాడే మరణించింది. అయితే ఆమెది సాధారణ మరణమో, ఆత్మహత్యో కాదని, తన భర్తే చంపేసి ఉంటాడని సహానా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మోడల్, నటి షహానా మే 12న 21వ పుట్టినరోజు జరుపుకుంది. కానీ అదే ఆమె జీవితంలో ఆఖరి రోజుగా మారింది. అర్ధరాత్రి ఒంటిగంటకు షహానా చనిపోయిందంటూ కేసర్గాడ్లో నివసిస్తున్న తన కుటుంబీకులకు ఫోన్ వచ్చింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆమె కుటుంబీకులు షహానా చావుకు ఆమె భర్తే కారణమని ఆరోపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి ఏసీపీ కె సుదర్శన్ మాట్లాడుతూ.. 'షహానా తమిళ ప్రాజెక్టులో నటించినందుకు ఆమెకు పారితోషికం ఇచ్చారు. దీనికోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్ ఆలస్యంగా రావడంతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది విచారిస్తున్నాం' అని పేర్కొన్నాడు. షహానా తల్లి మాట్లాడుతూ.. 'నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను చంపేశారు. అత్తారింట్లో తనను టార్చర్ పెడుతున్నారని నా కూతురు ఎప్పుడూ విలపించేది. ఆమె భర్త సజ్జద్ తాగొచ్చి నానా గొడవ చేసేవాడు. దీనికి తోడు అతడి తల్లిదండ్రులు, సోదరి కూడా నా కూతురికి నరకం చూపించేవారు. తన బాధ చూడలేక వేరు కాపురం పెట్టమని సూచించాను. కానీ సజ్జద్ డబ్బు కోసం పోరు పెడుతున్నాడని, దారుణంగా ప్రవర్తిస్తున్నాడని షహానా నా దగ్గర చెప్పుకుని వాపోయేది. ఆమె దగ్గరున్న 25 సవర్ల బంగారాన్ని అంతా వాడుకున్నారు. తన బర్త్‌డే రోజు మమ్మల్ని కలవాలనుకున్నా అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది' అంటూ బోరున ఏడ్చేసింది. కాగా షహానా పలు ఆభరణాల సంస్థల యాడ్స్‌లో నటించింది. ఏడాదిన్నర క్రితం సజ్జద్‌ను పెళ్లాడింది. అత్తింట్లో టార్చర్ భరించలేక కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చేసి భర్తతో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన వర్మ, ఏమన్నాడంటే.. ముంబైలో కళ్లు చెదిరే ఫ్లాట్ కొన్న బుల్లితెర నటుడు -
పేద విద్యార్థి కల నెరవేర్చిన శివకార్తికేయన్
తమిళ సినిమా: పేద విద్యార్థి డాక్టర్ కలను నటుడు శివకార్తికేయన్ సాకారం చేశారు. తంజావూర్ జిల్లా, పేరావురణి సమీపంలోని పూకొల్లై ప్రాంతానికి చెందిన దంపతులు గణేషన్, చిత్ర కార్మికులు. ఈ దంపతులకు కూతురు సహానా పేరావురణి ప్రభుత్వ బాలల ఉన్నత విద్యాలయంలో ప్లస్‌టూ చదువుకుంది. వీధిలైట్ల కాంతిలో చదువుకున్న సహానా పరీక్షల్లో 600లకు 524 మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందింది. గజ తుపాన్ కారణంగా ఇల్లు కూలిపోవడంతో వీధి లైట్ల వెలుతురులో చదువుకొని ప్లస్‌టూలో అత్యధిక మార్కులు సాధించింది. దీంతో సహానా డాక్టర్ అవ్వాలని కలలు కంది. ఈమె గురించి గత ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ఒక తమిళ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. అది చూసిన తంజావూర్ కలెక్టర్ అన్నాదురై ఆమె ఇంటికి వెళ్లి రెండు సోలార్ లైట్లను కొనిఇచ్చి, ఇతర ఖర్చులు రూ.10 వేలు సాయం చేశారు. ఈ విషయం శివకార్తికేయన్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే తంజావూరులోని ప్రైవేట్ నీట్ కళాశాలలో శిక్షణ పొందడానికి సహానాకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో సహానా 273 మార్కులను తెచ్చుకొని తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరింది. (శశికళ ఆశలు అడియాశలు..!) ఈ సందర్భంగా వైద్య విద్యార్థి సహానా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ కావాలన్న తన కల కు పలువురు ప్రాణం పోశారని పేర్కొంది. ముఖ్యంగా నటుడు శివకార్తికేయన్ సాయంతోనే తన డాక్టర్ కల నెరవేరిందని చెప్పింది. ఆయన తన వైద్యవిద్యకు అయ్యే ఖర్చు అంతా భరిస్తానని చెప్పారని తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ముఖ్యమంత్రి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించడం కూడా తన డాక్టర్ కల సాకారానికి కారణమని సహానా పేర్కొంది. -
పప్పన్నం వెడ్స్ కోడికూర
మన దగ్గర పెళ్లి ఇద్దరు వ్యక్తులకు కాక రెండు కుటుంబాల మధ్య ఎలా ఉంటుందో.. ఆ రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులకు ఎంత అండగా ఉంటాయో.. సామరస్యాన్ని ఎలా పెంపొందిస్తాయో చూపించే సిరీస్. అయితే పెళ్లికి కావల్సింది అట్టహాసం కాదు అండర్స్టాండింగ్ అని, ఇద్దరు వ్యక్తులకైనా రెండు కుటుంబాలకైనా అని చెప్తుంది బ్యాంగ్ బాజా బారాత్. పాత చింతకాయ విషయం ఒకటి అనుకుందాం. పెళ్లిళ్లు రెండు కుటుంబాల మధ్య జరుగుతాయి. కానీ ఈ కథ అక్కడ ఆగదు. అసలు మొదలవడమే ఇంకో రకంగా మొదలౌతుంది.మోడర్న్ బట్టలు వేసుకుంటే లుక్కు మారొచ్చు. కానీ అవుట్‌లుక్ మారదుగా! అంటే.. కనబడటానికి మోడర్న్‌గా ఉన్నా.. కొత్తదనాన్ని ఆహ్వానించే పరిపక్వతా ఉండాలి. ఇది మనందరికీ పనికొచ్చే కథే. నిజానికి మన పిల్లలకంటే మనమే చాలా మోడర్న్ అని చెప్పే కథ.‘‘స్టార్ హోటల్లో షెఫ్‌ని. కాంటినెంటల్ ఫుడ్ వండుతా. ఇంటికెళ్లి పప్పు అన్నం తిని తృప్తి పడ్తా. చిన్నటౌన్లో పెరిగిన వాడిని షాహనా..! ప్రొగ్రెసివ్‌గా ఉండాలని ఆశ. కాని సంప్రదాయాన్నే రెస్పెక్ట్ చేస్తున్నా. సారీ షాహనా!’’ పవన్ మల్హోత్రా అపరాధ భావం. ‘‘తప్పు నాదే పవన్. నువ్వన్నట్టుగా పెళ్లికి కొన్నాళ్లు ఆగాల్సిందేమో. నేనే తొందరపడ్డా. నాకు మూడేళ్లున్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. అప్పటి నుంచీ అమ్మే అన్నీ. ఆమెకు నేనే సర్వస్వం. బిజినెస్ టూర్స్ వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పీ చెప్పీ అదే అబద్ధంతో నాన్న పట్టుబట్టాడు.నాన్నను చూసే చస్తే అబద్ధాలు చెప్పకూడదని డిసైడ్ చేసుకున్నా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిజమే చెప్తూ వచ్చా. నిజం నీకు నచ్చలేదు. ఎనీవే.. ఇట్స్ ఓవర్’’ అంటూ పవన్ వైపు తిరిగిందిషాహనా. ‘‘నిజంగా ఇట్స్ ఓవరా..?’’ బేలగా అడిగాడు మౌనంగా ఆమె. అదే సమయానికి హోటల్ స్వీట్లో..‘‘వాళ్లనుకున్నట్టుగా కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఈ గొడవ ఉండేదే కాదుకదా! హ్యాపీగా ఈపాటికి హానీమూన్‌కి కూడా బయలుదేరేవారు. ఈ సిట్యుయేషన్‌కి మీరే కారణం’’అన్న, కాబోయే వదిన పెళ్లిపీటల మీద నుంచి చెప్పకుండా ఎటో వెళ్లిపోయారనే బాధ, పెద్దవాళ్ల మీద కోపంతో పెళ్లికొడుకు చెల్లి బర్ఖా. ‘‘నువ్వూరుకోమ్మా.. పదిమంది ముందు నా కూతురు పరువు తీసిందని అని నేను ఫీలవుతుంటే’’ అసహనంగా రంజిత్ అరోరా.. పెళ్లికూతురు తండ్రి. ‘‘అబ్బో.. అక్కడికి మీరేదో ప్రెసిడెంట్.. ప్రైమ్‌మినిస్టర్ అయినట్టు.. పరువట పరువు’’బర్ఖా వెటకారాలాడుతుంటేసహించలేకపోయింది ఆమె తల్లి రోలీ శర్మ. ‘‘ఏయ్.. చిన్నాపెద్దా లేకుండా ఏం మాటలవి’’ అంటూ కూతురిని బెదిరించే ప్రయత్నం చేసింది. ‘‘అసలు దీనికంతటికీ కారణం నువ్వే’’ అంటూ భార్య సుష్మిత ఘోష్ మీద విరుచుకు పడ్డాడు రంజిత్ అరోరా. ‘‘ఫ్రీడమ్ అంటూ అడ్డూఅదుపు, ఓ పద్ధతి, పాడూ లేకుండా పిల్లను పెంచావ్’’ కంటిన్యూ అయ్యాడు. ‘‘సారీ వదిన గారు.. ’’ అంటూ అపాలజీ చెప్పబోయింది సుష్మిత. ‘‘మీరు ఊరుకోండి వదినగారు.. ’’ అని ఆమెను ఆపి రంజిత్ అరోరాను చూస్తూ ‘‘అసలు తప్పు మీది. కూతురి వయసున్న అమ్మాయిలను మగవాళ్లు పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకున్నాక ఆడవాళ్లు ఇంకో బంధంలోకి వెళితే పిల్లల బాధ్యత మరిచిపోయినట్టు. ఏం న్యాయం ఇది?’’ వేలెత్తుతుంది రోలీ. వీళ్లు ఈ వాదోపవాదాల్లో ఉంటుండగానే నెమ్మదిగా స్వీట్‌లోకి అడుగుపెడ్తారు పవన్, షాహనా!వాళ్లను చూడగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు అక్కడున్న వాళ్లంతా. వెంటనే సుష్మితా లేచి కూతురిని తీసుకొని తమ స్వీట్‌లోకి వెళ్లిపోతుంది. పవన్ బెడ్రూమ్లోకి వెళ్లి సోఫా మీద వాలిపోయాడు. అతని తండ్రి మురళీ ప్రసాద్ శర్మ వచ్చి కొడుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. తండ్రి రాకతో అలర్ట్ అయ్యి సరిగ్గా కూర్చున్నాడు పవన్. ‘‘కాలేజ్‌లో ఉన్నప్పుడు నేనూ ఓ అమ్మాయిని ప్రేమించా. వాళ్లు బాగా ఉన్నవాళ్లు. ఆమె మేనమామా ఎమ్మెల్యే. ఒకరోజు రాత్రి విపరీతంగా వర్షం పడ్తోంది. ఆ అమ్మాయి మా హాస్టల్ దగ్గరకు వచ్చి లెటర్ పంపించింది. బయటకు రమ్మని. వచ్చా. వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంది. భయపడి నేను వెళ్లలేదు. చిన్నప్పుడు అందరికీ గాంధీ హీరో ఉంటాడు. తర్వాత తండ్రి హీరోగా మారుతాడు. మనకు పిల్లలు పుట్టివాళ్లు ఎదిగాక పిల్లలకు హీరోలుగా కనిపిస్తుంటారు. నేనెప్పుడూ అనుకునే వాడిని నా కొడుక్కి నేనెందుకు హీరో కాలేకపోయాను? బహుశా కట్టుబాట్లను కాదనలేని పిరికితనం వల్లేమో అని అనుకునే వాడిని. అనుకున్నవన్నీ సాధిస్తున్న నీ తెగువ, ధైర్యానికి ముచ్చటపడ్డాను. నాకు నువ్వు హీరోగా కనపడ్డం మొదలెట్టావ్. కాని ఈరోజు నువ్వు చేసిన పని హీరోయిజం కాదురా! షాహనా మంచి అమ్మాయి.ఆ పిల్ల పెంపకం అలాంటిది. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్తున్నావంటే ఆ అమ్మాయి బలహీనతలనూ అంతే ఇష్టంగా రిసీవ్ చేసుకోవాలి. ఆమె అలవాట్లనూ అంతే ఇదిగా గౌరవించాలి. నా మాట విను.. షాహనాను పెళ్లి చేసుకో. ఆ అమ్మాయే నీకు సరిజోడు’’ చివరి మాట.. కొడుకు తల నిమురుతూ చెప్పాడు మురళీ ప్రసాద్. ‘‘నాన్నా..’’ అన్నాడు పవన్. అవునన్నట్టుగా కళ్లతోనే జవాబిచ్చాడు తండ్రి. సరిగ్గా ఇదే సమయానికి షాహనా వాళ్ల హోటల్ స్వీట్లో.. ‘‘సారంగ్‌ని ఇప్పటికీ ప్రేమిస్తున్నావా?’’ కూతురిని అడిగింది సుష్మిత. సమాధానం చెప్పలేదు షాహనా. ‘‘నాకంటూ అయిన వాళ్లు ఎవరూ లేరు.దాంతో కుటుంబం, ఆ రిలేషన్స్, ఈ వ్యవహారాలు అన్నీ పెద్దగా పట్టలేదు నాకు. నిన్నూ నా లోకంలోనే ఉంచా. సంప్రదాయం అంతా తప్పు కాదు. దేనికైనా మన విజ్ఞతను అప్లయ్ చేయాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. పవన్ చాలా మంచివాడు. వాళ్ల ఫ్యామిలీ కూడా. అంత సంప్రదాయ బద్ధమైన ఫ్యామిలీ కూడా మన విషయాలన్నీ తెలిసీ పెళ్లికి ఒప్పుకుంది. పవన్‌తో ఓ మంచి కుటుంబం దొరుకుతోంది నీకు.నిజం చెప్పనా షాహనా.. ఈ విషయంలో నువ్వంటే జెలస్ ఫీలవుతున్నాను తెలుసా’’ అంది సుష్మిత కూతురి భుజమ్మీద చేయివేస్తూ! ‘‘అయినా... ఎందుకో ఈ పెళ్లి వద్దనిపిస్తోంది అమ్మా.. ’’ షాహనా. ఈలోపే పవన్ వచ్చాడు ఆ స్వీట్‌లోకి. ‘‘షాహనా.. ఐ లవ్ యూ.. విల్ యూ మ్యారీ మీ.. ప్లీజ్’’అంటూ అభ్యర్థించాడు పవన్. అచేతనంగా ఉంది షాహనా. తల్లి వంక చూసింది. ఒప్పుకో అన్నట్టుగాకళ్లల్లోభావం.పవన్‌ను చూసింది.. ‘‘విల్ యూ’’ అడిగాడు మళ్లీ. సరే అంది. ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు. అమ్మ కూతురిని వాటేసుకుంది. కూతురు గట్టిగా అమ్మను పొదివి పట్టుకుంది. తర్వాత గంటకు ఆ ఇద్దరికీ అదే హోటల్లో ఇంతకు ముందు వేసిన వేదిక మీదే పెళ్లి అయింది. రిజిష్ట్రార్ ఆధ్వర్యంలో సంతకాల పెళ్లి. అంతకుముందు ఈ ఇద్దరి పెళ్లే ఎందుకు ఆగిపోయింది? ఇప్పటికే అర్థమై ఉంటుంది షాహనా, పవన్‌ల నేపథ్యమే కాదు పెంపకాలు కూడా పూర్తిగా విరుద్ధమని. నాన్‌వెజ్ అనే మాటను కూడా నోట పలకని శుద్ధ శాకాహార కుటుంబం పవన్ వాళ్లది. నాన్‌వెజ్ లేకపోతే ముద్ద దిగని ఫ్యామిలీ షాహనా వాళ్లది. మెట్రో సిటీలో పుట్టిపెరుగుతుంది షాహనా. ఓ మోస్తరు టౌన్ పవన్‌ది. షెఫ్‌గా మెట్రో సిటీకి వచ్చాక.. ఆ ఆధునికత, హంగులకు ముచ్చటపడ్తాడు. పెళ్లికి ముందే సెక్స్‌ను ప్రొగ్రెసివ్ అనుకుంటాడు. అలాంటి పార్టనరే దొరికినందుకు సంతోషపడ్తాడు. షాహనా విషయానికి వస్తే.. సంప్రదాయాలు, సంస్కృతి వ్యక్తి స్వేచ్ఛకు అడ్డంపడే ఆటంకాలు. కంపార్టబులిటీ లేకపోతే విడిపోవడం చాలా కామన్ థింగ్ ఆమెకు. ఈ ఇద్దరూ ఆర్భాటాలు లేని రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. కాని పవన్ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ‘‘నీకు నచ్చిన పిల్లను మేము ఓకే అన్నప్పుడు మాకు నచ్చినట్టే పెళ్లి’’ అని షరతు పెట్టి మరీ స్టార్ హోటల్లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. ఆ పెళ్లి ఏర్పాట్లప్పుడే షాహనా కుటుంబం గురించి పూర్తిగా తెలుస్తుంది పవన్ కుటుంబానికి. అదంతా వాళ్లకు కాస్త మింగుడు పడని వ్యవహారంగానే ఉన్నా కొడుకు కోసం కాంప్రమైజ్ అవుతుంటారు. పవన్‌కు షాహనాకు సంబంధించి కొత్త విషయం తెలుస్తుంది. ఆమెకు అంతకుముందే ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నట్టు. అతను పెళ్లికి రావడం ద్వారా. బ్రేకప్ అయిందని సమాధాన పడ్తాడు. కాని అతను పెళ్లిలో ఉండొద్దనే షరతు పెడ్తాడు. అక్కడే ఇద్దరికీ మాటామాటా పెరిగి.. నమ్మకం, నమ్మకపోవడం దాకా సాగి పెళ్లి పీటల మీదనుంచి వెళ్లిపోతారు.ఆవేశం, కోపం, పంతం, పట్టుదల అంతా తగ్గాక అలా మళ్లీ కలుస్తారు. ఇది బ్యాంగ్ బాజా బారాత్ కథ. ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. పవన్‌గా అలీ ఫజల్, షాహనాగా అంగిరా ధార్, మురళీ ప్రసాద్‌గా గజ్రాజ్ రావు, రంజిత్ అరోరాగా రజిత్ కపూర్, సుష్మితాగా షెర్నాజ్ పటేల్, రోలీగా అయేషా రజా నటించి మెప్పించారు. – సరస్వతి రమ -
జీవనాధారం కోసం చెన్నై వస్తే..
తమిళసినిమా: గ్రామాల నుంచి రకరకాల కారణాలతో ప్రజలు చెన్నై వస్తుంటారు. అందులో చాలావరకు జీవనాధారం వెతుక్కుంటూ వచ్చే వారే అధికం. అలా పల్లెటూరు నుంచి వచ్చిన ముగ్గురు యువకులు బతువుదెరువు కోసం చెన్నై వచ్చి డబ్బు కోసం ఎలాంటి పనికైనా సిద్ధపడే ఒక ముఠా చేతుల్లో చిక్కుకుంటారు. ఆ ముఠా అసలు రూపం తెలిసిన తరువాత ఈ ముగ్గురు ఏం చేశారన్నదే ఉన్నాల్ ఎన్నాల్ చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్.జయకృష్ణ పేర్కొన్నారు. శ్రీశ్రీ గణేశ్ క్రియేషన్ పతాకంపై రాజేంద్రన్సుబ్బయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఏఆర్.జయకృష్ణ, జగా, ఉమేశ్ కథానాయకులుగా నటిస్తున్నారు. వారికి జంటగా లుబ్నా, నిహారిక, సహానా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాజేశ్, రామచంద్రన్, రవిమరియ, ఢిల్లీ గణేశ్, ఆర్.సుందరరాజన్, నెల్లైశివ తదితరులు నటిస్తున్నారు. కాగా ఒక కీలక పాత్రలో నటి సోనియాఅగర్వాల్ నటిస్తున్నారు. మహ్మద్ రిశ్వాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యుల్ షూటింగ్ జరుపుకుంటోందని దర్శకుడు వెల్లడించారు. -
సహన కుటుంబానికి షర్మిల భరోసా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల రెండోరోజు పరామర్శ యాత్ర కొనసాగుతోంది. పరామర్శ యాత్రలో భాగంగా మాణికేశ్వర్ నగర్‌కు చేరుకున్న ఆమె.. వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన బొంత సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సహన కుటుంబ సభ్యులు బుధవారం షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబానికి అండగా ఉంటానని ఆమె భరోసా ఇచ్చారు. నిరుపేద చిన్నారి సహన ఆరోగ్య పరిస్థితిపై 'సాక్షి' వెలువరించిన కథనాలకు పలు స్వచ్ఛంద సంస్థలు స్పందించిన విషయం తెలిసిందే. -
పెద్ద చదువులు చదువుతా
స్కూల్కెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఉంది. యాక్టర్ మహేష్‌బాబును కలవాలని ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే పడుకుని ఉండటం చాలా కష్టంగా ఉంది. అమ్మ కూడా లేదు. ఈ వయసులో నానమ్మను చాలా బాధ పెడుతున్నాను. - సహన