న్యాయం చేయాలని డిమాండ్ చేసిన దళిత, ప్రజాసంఘాల నేతలు
తెనాలిలో ముగిసిన సహానా అంత్యక్రియలు
గుంటూరు మెడికల్/తెనాలిరూరల్: తెనాలికి చెందిన సహానా మృతికి కారకులైన నిందితుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి తక్షణమే శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, దళితసంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారు బుధవారం సహానా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా గుంటూరు జీజీహెచ్ మార్చురీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు తాము ఆందోళన చేస్తామని చెప్పారు.
దళిత యువతిపై దాడి జరిగినా ఎందుకు తక్షణమే స్పందించలేదని ప్రశి్నంచారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. దళిత యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది. ఈ ఆందోళనలో పలు దళితసంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. వీరి ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది.
టీడీపీకి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా అంత్యక్రియలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మృతదేహాన్ని హయ్యరుపేటలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సహానా మృతదేహానికి మంత్రి నాదెండ్ల మనోహర్, సబ్‌కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నివాళులర్పించారు.
ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చెక్కును సహానా తల్లి అరుణకుమారికి మంత్రి మనోహర్ అందజేశారు. అనంతరం ఐతానగర్ సమాధుల తోటలో సహానా అంత్యక్రియలను నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment