GGH
-
గుంటూరు జీజీహెచ్‌లో మరో జీబీఎస్ మరణం
సాక్షి, గుంటూరు: ఏపీలో జీబీఎస్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడి మరో మహిళ మృతి చెందింది. గుంటూరు జీజీహెచ్‌లో బుధవారం షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మృతిచెందింది. గులియన్ బార్ సిండ్రోమ్ లక్షణాలతో ఈనెల 2న ఆసుపత్రిలో చేరిన గౌహర్.. వ్యాధి తీవ్రత పెరిగి ఇవాళ సాయంత్రం మరణించింది. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్‌తో చనిపోగా.. ఇపుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జీబీఎస్ బాధితులు ఆందోళన చెందుతున్నారు.భయపెడుతున్న జీబీ సిండ్రోమ్గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు.ఇవీ లక్షణాలుమెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు.⇒జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.⇒శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది.ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. -
జీబీ సిండ్రోమ్ భయపెడుతోంది
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్/సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ : లక్ష మందిలో ఒకరికో, ఇద్దరికో అరుదుగా వచ్చే గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ వ్యాధి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో యువంత్ (10) అనే బాలుడు మృతి చెందాడు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడుగురు బాధితులు ఈ సమస్యతో చేరగా, ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో గుంటూరు జిల్లా అలసనపల్లికి చెందిన బి.కమలమ్మ ఐసీయూలో, నరసరావుపేటకు చెందిన ఎస్.కె.రవీుజాన్ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మిగతా ముగ్గురు.. గుంటూరు ఐపీడీకాలనీలోని వి.ఆశీర్వాదం, నెహ్రూనగర్‌కు చెందిన షేక్ గౌహర్జాన్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన వి.నాగవేణి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో 5, విశాఖలో 6, కాకినాడలో 4, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున మొత్తంగా 18 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖ జీజీహెచ్‌లలో నెలకు 10–15 చొప్పున కొత్త కేసులు నమోదు అవుతున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. నెల్లూరులో ఇటీవల లోకల్ టీవీ రిపోర్టర్ ఒకరు ఈ వ్యాధి బారినపడి కోలుకున్నారు. గుంటూరులో ఏకంగా ఏడుగురు ఈ వ్యాధి బారిన పడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్.వి.సుందరాచారితో మాట్లాడారు.మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీబీ సిండ్రోమ్ కేసుల గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాధారణంగా వచ్చే వైరసేనని, గతంలో కూడా చాలా మంది చికిత్స పొంది రికవరీ అయ్యారని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. ఇవీ లక్షణాలు» మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.» ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. » జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. » శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.ఎందుకిలా? ఎవరికి వస్తుంది?ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకాక పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. బాధితులు అచేతనం కావడం ఎందుకంటే.. మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.వందలో 95 మందికి ప్రాణాపాయం ఉండదుజీబీఎస్ వ్యాధి చాలా ఏళ్లుగా ఉంటోంది. దీని అసలు పేరు ల్యాండ్రీ గులియన్ బ్యారీ సిండ్రోమ్. ప్రపంచ వ్యాప్తంగా లక్ష జనాభాలో ఒకరిద్దరు వ్యాధి బారిన పడుతుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో నెలకు 10–15 కొత్త కేసులు మేం చూస్తుంటాం. సాధారణంగా వ్యాధి బారిన పడిన వందలో 75 మందికి ఆస్పత్రుల్లో చికిత్స కూడా అవసరం ఉండదు. 95 శాతం మంది రికవరీ అవుతారు. 5 శాతం మందికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.బాధితులకు రూ.5 లక్షల ఖరీదైన ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసీయూ, వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తుంటాం. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కాదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కాళ్లు, చేతులు చచ్చుబడటం, కండరాల బలహీన పడటం, స్వతహాగా నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది వంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది. – డాక్టర్ ఎన్.వి. సుందరాచారి, సీనియర్ న్యూరాలజిస్ట్, ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాలతక్కువ ఖర్చుతో ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్సఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే రోగి శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ షీత్‌ను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్దతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో ఐదు విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్‌ను తొలగించడం జరుగుతుంది. ఇందులో ఇమ్యూనో గ్లోబ్యులిన్ చికిత్స ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. యువత, టీనేజీ పిల్లలు వేగంగా కోలుకుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం అన్ని విధాలా మేలు.– డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ -
ఏపీని వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. తాజాగా
సాక్షి,గుంటూరు : ఇటీవల మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) (జీబీఎస్) నెమ్మదిగా దక్షిణాదికీ వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లోని గుంటూరు జీజీహెచ్ (guntur ggh)లో వెలుగులోకి వచ్చాయి. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఇటీవల,పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు. ఐదుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాధిగ్రస్తులకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ సమాచారం మేరకు నాలుగు రోజుల్లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఎస్వీ రమణ మాట్లాడుతూ.. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.కలుషిత నీటి వాడకంతో మొదలు..గతంలో జీబీఎస్ వ్యాధి చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే ఈ వ్యాధి వచ్చేది. ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. అయితే పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. సాధారణంగా పోస్ట్ వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. ఆ వైరస్, బ్యాక్టీరియాల ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది.బాధితులు అచేతనం కావడం ఎందుకంటే... మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. సొంత వ్యాధినిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందకపోవడంతో అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.ఇవీ లక్షణాలు..⇒ మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి.⇒ అచేతనం కావడం కింది నుంచి ప్రారంభమై పైకి పాకుతుంది. దాంతో వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది.⇒ గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.⇒ అచేతనమయ్యే ఈ ప్రక్రియ ఛాతీ, కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. ఈ జబ్బును పూర్తిగా ప్రమాదకరంగా మార్చే అంశమిదే.వేర్వేరుగా తీవ్రత స్థాయికండరాలు అచేతనం కావడంలోని ఈ తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే మరికొందరిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. చాలా మందిలో తమ ప్రమేయం లేకుండా జరిగిపోయే కీలకమైన జీవక్రియలు చాలా అరుదుగా మాత్రమే ప్రభావితమవుతాయి. కొందరిలో అవి కూడా ప్రభావితమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు.ఎప్పుడు ప్రమాదకరమంటే...వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకో వడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమ న్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.జీబీ సిండ్రోమ్ లక్షణాలే కనిపించే మరికొన్ని జబ్బులు శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపి స్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి.నిర్ధారణ ఇలా..గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి లక్షణాలతోనే మరికొన్ని ఇతర సమస్యలు వ్యక్తం కావడంతోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్థారణ చాలా స్పష్టంగా జరగాలి. అందుకే రోగుల్లో తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియం, కాల్షియం పాళ్లను, క్రియాటినిన్ మోతాదులను పరిశీలిస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్షతో వ్యాధి తీవ్రత తెలియదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసే ‘సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్’(సీఎస్ఎఫ్) పరీక్ష కూడా అవసరం కావచ్చు. జీబీఎస్ అనేది శరీరంలోని నాడీవ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన, తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ.. తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంటుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు. -
సెల్‌ఫోన్ మింగి మహిళ మృతి
కాకినాడ క్రైం: సెల్‌ఫోన్ మింగిన ఓ మహిళ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి (35) మానసిక అనారోగ్యంతో బాధ పడుతోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చేరింది. అక్కడ తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. వెంటనే వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈసోఫాగస్ (అన్నవాహిక) పూర్తిగా దెబ్బ తింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. రమ్య స్మృతిని శఽనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. సెల్‌ఫోన్ తొలగింపు ప్రక్రియలో రాజమహేంద్రవరం జీజీహెచ్ వైద్యులు చేసిన పొరపాటు వల్లే తమ కుమార్తె చనిపోయిందని తండ్రి విలపించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడయ్యే వరకూ అక్కడే ఉంచాలని కోరినా రాజమహేంద్రవరం జీజీహెచ్ అధికారులు బలవంతంగా కాకినాడకు తరలించారని ఆరోపించాడు. అక్కడి నుంచి కాకినాడ చేరేందుకు రెండు గంటల సమయం పట్టిందని, ఆ వ్యవధిలో రమ్య ఆరోగ్య స్థితి మరింత క్షీణించి మరణానికి దారి తీసిందని వాపోయాడు.భర్తను వదిలేసి.. మరో వ్యక్తితో సహజీవనం! -
మాట వినకుంటే ఉద్యోగం ఫట్
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టుల పేరుతో పాతుకుపోయిన వ్యక్తులు రాజకీయ నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పిందే వేదంగా పనిచేస్తేనే ఉద్యోగంలో ఉంటారంటూ హుకుం జారీ చేస్తూ.. ఏ ప్రజాప్రతినిధి, అధికారీ తమను ఏం చేయలేరంటూ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో దారుణాలు జరుగుతున్నాయని, తమ కుటుంబాల పోషణ, ఉపాధి కోసం భరించాల్సి వస్తోందంటూ మహిళా సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ కోసం కాంట్రాక్ట్ సిబ్బందిగా చేరితే శారీరక, మానసిక వేధింపులు భరించలేకపోతున్నామంటూ ఘొల్లుమంటున్నారు. సిబ్బంది అంతా కాంట్రాక్టర్ చేతుల్లో ఉంటారనీ.. తమ పరిధిలోకి రారంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల్లో పురోగతి కరువు ఏలూరు నగరానికి చెందిన ఓ దళిత మహిళ ఏలూరు జీజీహెచ్‌లో శానిటేషన్ సిబ్బందిగా చేరింది. కొన్నిరోజులు సాఫీగానే ఉండగా.. కాంట్రాక్ట్ విభాగంలోని కీలక వ్యక్తి, మరికొందరు కన్ను ఆమెపై పడింది. ఆమెను వేధింపులకు గురిచేయటం ప్రా రంభించారు. తమ మాట వినకుంటే రాత్రి డ్యూ టీలు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పిలిస్తే రావాల్సిందేనంటూ వేధించటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసును పురోగతి లేకుండా వదిలేశారు. ఇదే తరహాలో మరో ఇద్దరు మహిళలు కేసులు పెట్టేందుకు సిద్ధపడగా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనీ, కేసులు పెట్టినా తమను టచ్ చేసేవారు లేరంటూ సదరు వ్యక్తులు బెదిరించారు. కుటుంబ పోషణకు ఈ పనిలో చేరామని, బయట తెలిస్తే పరువుపోతుందంటూ బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహస్య విచారణ చేయించాలిఏలూరు జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే ఒక దళిత మహిళపై ఆస్పత్రిలో కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ఇదే తరహాలో మరో మహిళను వేధించటంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇది జరిగి ఏడాదిన్నర గడిచినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు లేవని బాధితులు ఆరోపిస్తున్నారు. జీజీ హెచ్లో చాలా కాలంగా పనిచేస్తున్న దళిత సి బ్బందిని సైతం వేధింపులకు గురిచేస్తూ వారిపై తప్పుడు ఆరోపణలు చేయించి ఉద్యోగాల్లో లే కుండా చేస్తున్నారని, అతడిపై రహస్య పోలీస్ వి చారణ చేయిస్తేనే మరిన్ని కీచక పర్వాలు వెలుగులోకి వస్తాయని బాధితులు అంటున్నారు. మాట వినకుంటే ఉద్యోగం ఫట్ జీజీహెచ్‌లో శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల్లో పలువురు పేద మహిళలు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఈ బాధ్యతను అప్పగించింది. శానిటేషన్‌లో 120 మంది వరకు మహిళలు ఉన్నారు. సెక్యూరిటీ విభాగంలో 56 మంది సిబ్బంది పనిచేస్తుండగా, వారిలో 30 మంది వరకు మహిళలు ఉన్నారు. ఒక్కో సిబ్బందికి వేతనం రూ.16 వేల వరకూ ఉండగా కటింగ్‌లు పోను రూ.13 వేల వరకు చేతికి అందుతుంది. రెండు, మూడు రోజులు అనారోగ్యంతో విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నిలుపుకునేందుకు వేలల్లో సమరి్పంచుకోవాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తరఫున పర్యవేక్షణ చేస్తున్న వ్యక్తులకు నచ్చితే రాత్రి డ్యూటీలు ఉండవని, టైమ్‌కు డ్యూటీకి రాకున్నా పర్వాలేదని, లేకుంటే జీతం కట్.. ఉద్యోగం ఊడటం ఖాయమని పలువురు ఆవేదన చెందుతున్నారు. -
గుంటూరు జీజీహెచ్ సూపరిటెండెంట్ ఓవరాక్షన్.. సీనియర్ డాక్టర్ల ఆగ్రహం
సాక్షి,గుంటూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ ఓవరాక్షన్ చేశారు. కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించకపోయినా తానే సూపరింటెండెంట్ అంటూ ఎస్ఎస్వీ రమణ హడావిడి చేశారు. అయితే ఎస్ఎస్వీ రమణ వ్యవహారంపై సీనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు.వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ రౌడీ షీటర్ నవీన్ చేతిలో హ త్యకు గురైన మృదుల సహానా కేసు విషయంలో ప్రభుత్వం చెప్పింది చేయలేదని కక్షగట్టి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ కిరణ్ కుమార్‌ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. కిరణ్ కుమార్ స్థానంలో ఎస్ఎస్వీ రమణను జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమిస్తూ సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. కొత్త సూపరింటెండెంట్ నియామకంపై డీఎంఈ.. జీజీహెచ్కీ సమాచారం ఇవ్వలేదు.రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు.ఆమెకు మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
జీజీహెచ్ మార్చురీ వద్ద సహానా కుటుంబసభ్యుల ఆందోళన
గుంటూరు మెడికల్/తెనాలిరూరల్: తెనాలికి చెందిన సహానా మృతికి కారకులైన నిందితుల్లో ఒకరిని మాత్రమే అరెస్టు చేశారని, మిగతా ఇద్దరిని కూడా అరెస్టు చేసి తక్షణమే శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు, దళితసంఘాల నేతలు డిమాండ్ చేశారు. వారు బుధవారం సహానా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా గుంటూరు జీజీహెచ్ మార్చురీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు తాము ఆందోళన చేస్తామని చెప్పారు. దళిత యువతిపై దాడి జరిగినా ఎందుకు తక్షణమే స్పందించలేదని ప్రశి్నంచారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని కోరారు. దళిత యువతికి న్యాయం చేయాలంటూ నినాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగింది. ఈ ఆందోళనలో పలు దళితసంఘాల నేతలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. వీరి ఆందోళనతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీకి చెందిన రౌడీషీటర్ రాగి నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన తెనాలి ఐతానగర్‌కు చెందిన సహానా అంత్యక్రియలు బుధవారం రాత్రి ముగిశాయి. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో మృతదేహాన్ని హయ్యరుపేటలోని స్వగృహానికి తీసుకొచ్చారు. సహానా మృతదేహానికి మంత్రి నాదెండ్ల మనోహర్, సబ్‌కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న నివాళులర్పించారు. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల చెక్కును సహానా తల్లి అరుణకుమారికి మంత్రి మనోహర్ అందజేశారు. అనంతరం ఐతానగర్ సమాధుల తోటలో సహానా అంత్యక్రియలను నిర్వహించారు. -
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు
విజయవాడ, సాక్షి: ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు ఇచ్చారు. రెండ్రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్‌లో వైద్యులపై దాడి జరిగింది. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూడాలు..వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు జారీ చేశారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారుచర్చలు విఫలంవైద్యులపై దాడికి నిరసనగా గత రెండ్రోజులుగా విజయవాడ జీజీహెచ్‌లో జూడాలు సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలు బహిష్కరించి నిరసనను కొనసాగిస్తున్నారు.మరోవైపు జూడాల నిరసనలు, సమ్మె నోటీసుపై వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్, జూడా ప్రతినిధులతో డీఎంఈ నరసింహం వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని జూడాల డిమాండ్ చేశారు.హామీలపై అసంతృప్తివిజయవాడలో దాడికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపిన డీఎంఈ తెలిపారు. డ్యూటీ రూములో తగిన సదుపాయాలని కల్పించడానికి ఆదేశాలిచ్చామని చెప్పారు. అయితే డీఎంఈ నరసింహం హామీలపై సంతృప్తి చెందని జూడాలు.. సమ్మెపై ఆదివారం నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
నాకు న్యాయం చేయాలి
ఏలూరు టౌన్: ఏలూరు జీజీహెచ్‌లో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న తనను అకారణంగా తొలగించారని అటెండర్ దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని.. లేకుంటే కుటుంబంతో సహా పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు తన భార్య, పిల్లలతో ఏలూరు సర్వజన ఆస్పత్రి వద్ద దుర్గారావు బుధవారం నిరసన తెలిపాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ఉద్యోగాలు ఎలా తీసేస్తారంటూ అధికారులను నిలదీశాడు. తనతోపాటు మరికొందరిని కూడా తొలగిస్తామని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో దుర్గారావు ఔట్సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా విధుల్లో చేరాడు. అప్పటి నుంచి ఏలూరు జీజీహెచ్ ఆరోగ్యశ్రీ విభాగంలోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే దుర్గారావును విధుల్లోంచి తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి వద్ద నిరసనకు దిగాడు. ఐదు నెలలుగా జీతాలు సైతం ఇవ్వలేదని, అప్పులు తెచ్చుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. ఇప్పుడు తనకు ఉద్యోగం కూడా లేకుంటే అప్పుల వాళ్లు తనను బతకనివ్వరని వాపోయాడు. తనకు ఉద్యోగం కావాలని, జీతం కూడా వెంటనే ఇప్పించాలంటూ పురుగుల మందు, పెట్రోల్‌తో ఆందోళనకు దిగాడు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే తనకు సరైన సమాధానం చెప్పడం లేదన్నాడు. ఈ విషయమై ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంవో ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా.. దుర్గారావుతో మాట్లాడి భరోసా ఇచ్చామన్నారు. రెండు, మూడు రోజుల్లోనే జీతాలు చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
ఆలయ కార్యదర్శిపై అమానుష దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు. దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు. సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు. ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో.. రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు. -
‘నాట్కో’ ట్రస్ట్‌తో ప్రభుత్వం ఎంవోయూ
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: క్యాన్సర్ రోగులకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో సెంటర్‌ను లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీన్లో భాగంగా నాట్కో సెంటర్లో ప్రస్తుతం ఉన్న 100 పడకలకు అదనంగా మరో 100 పడకలతో బ్లాక్ నిర్మాణానికి ‘నాట్కో’ ఫార్మా సంస్థ వైద్య, ఆరోగ్య శాఖతో ఎంవోయూ కుదుర్చుకుంది. మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ నరసింహం, నాట్కో ఫార్మా వ్యవస్థాపకుడు, నాట్కో ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ వి.సి.నన్నపనేని మంగళవారం ఎంవోయూ చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ.. ఈ సెంటర్లో రేడియేషన్, మెడికల్, సర్జికల్ వంటి అన్ని రకాల విభాగాల్ని ఏర్పాటు చేయడం ద్వారా క్యాన్సర్ రోగులకు సమగ్ర చికిత్స అందుతుందని వివరించారు. క్యాన్సర్ చికిత్స నిర్ధారణ కోసం అవసరమైన పెట్, సిటి మెషిన్ కొనుగోలుకు కూడా టెండర్లు పిలిచామని తెలిపారు. ఈ సెంటర్లో శిక్షణ పొందిన నర్సులు మాత్రమే పని చేసే విధంగా 30 ప్రత్యేక పోస్టులతో కలిపి మొత్తం 120 పోస్టుల్ని మంజూరు చేశామన్నారు. వి.సి. నన్నపనేని మాట్లాడుతూ సుమారు 35 వేల చదరపు అడుగుల్లో అదనంగా 100 పడకల క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. నాట్కో క్యాన్సర్ సెంటర్లోని రోగులకు ఉచిత మందుల పంపిణీలో భాగంగా ఈ త్రైమాసికానికి రూ.60 లక్షల విలువైన మందుల్ని కృష్ణబాబుకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో నాట్కో ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు, క్యాన్సర్ సెంటర్ సమన్వయకర్త యడ్లపాటి అశోక్‌కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరుదైన శస్త్ర చికిత్సలు
గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. బాలిక ఛాతీలో కణితి తొలగింపు కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది. ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. -
జీజీహెచ్‌లో ‘వోకల్ పెరాలసిస్’కు అరుదైన శస్త్రచికిత్స
లబ్బీపేట (విజయవాడ తూర్పు): వోకల్ కార్డు (స్వరతంత్రి) కుడి వైపు పెరాలసిస్(పక్షవాతం)కు గురై సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగికి ఈఎన్టీ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసి మరలా మాట్లాడేలా చేయగలిగారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించిన ఈ శస్త్ర చికిత్స గురించి ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి శుక్రవారం మీడియాకు వివరించారు. ఒంగోలుకు చెందిన డ్రైవర్ అప్పయ్య స్వర సమస్యతో చికిత్స కోసం తమ విభాగానికి రాగా, అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి వోకల్కార్డు కుడివైపు పెరాలసిస్ వచ్చినట్లు నిర్ధారించామని చెప్పారు. ఈ నెల 17న వీడియో ఎండోస్కోపీ ద్వారా స్వరాన్ని విశ్లేషిస్తూ థైరోప్లాస్టీ–1 అనే అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి మామూలుగా మాట్లాడగలుగుతున్నారని చెప్పారు. ఈ శస్త్ర చికిత్సలో ఈఎన్టీ వైద్యులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లీలాప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రత్నబాబు, శ్రీనివాస్, ఆదిత్య, స్పందన, వర్థిని, పీటర్లతో పాటు పీజీ విద్యార్థులు, స్పీచ్ థెరపిస్ట్ జి గాయత్రి, మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ లవకుమార్ పాల్గొన్నారు. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్ అభినందించారు. -
అరుదైన వ్యాధికి అద్భుత చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): అరుదైన గిలియన్ బ్యారీ సిండ్రోమ్(జీబీ సిండ్రోమ్) వ్యాధి సోకిన 12 ఏళ్ల బాలుడికి విజయవాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్) వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఖరీదైన వైద్యాన్ని రూపాయి ఖర్చు లేకుండా అందించి బాలుడికి స్వస్థత చేకూర్చడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్ కథనం మేరకు.. ఏలూరు జిల్లా నూజివీడు కొత్తపేటకు చెందిన నాగభూషణం, మౌనిక దంపతులు రోడ్డు పక్కన టిఫిన్ బండి నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి 12 ఏళ్ల కుమారుడు సాయిలోకేశ్ స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల ఆరో తేదీన జ్వరం, విరేచనాలు, ఆ తర్వాత కాళ్లు చచ్చుబడి పోవడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఇది అరుదైన వ్యాధి అని, చికిత్సకు రూ.8 లక్షలు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. అంత ఖర్చుచేసి వైద్యం చేయించే స్థోమత లేక వారు ఇంటికి వెళ్లిపోయాÆý‡ు. ఇదిలా ఉండగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మంచి వైద్యం అందుతుందని తెలుసుకుని ఈ నెల 9న పాత ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో సాయిలోకేశ్ను చేర్చారు. అక్కడి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.సునీత బాలుడిని పరీక్షించి వెంటనే ఇమ్యునోగ్లోబలిన్ ఇంజక్షన్ల కోసం ఇండెంట్ పెట్టి తెప్పించారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.18 వేల వరకూ ఉంది. బాలుడికి 20 ఇంజక్షన్స్ ఇచ్చారు. అంటే దాదాపు రూ.3.60 లక్షల ఖరీదైన ఇంజక్షన్లు చేశారన్నమాట. దీంతో క్రమేపీ నరాల పట్టు రావడంతో పాటు, మూడు రోజులకు బాలుడు నడవడం ప్రారంభించాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా, ప్రభుత్వాస్పత్రిలో ఇంత బాగా చూస్తారని అనుకోలేదని బాలుడి తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. -
కాంతమ్మా... ఇదేం పనమ్మా...!
గుంటూరు మెడికల్: జీజీహెచ్ ఆర్థోపెడిక్ ఓపీలో రోగులకు డ్రస్సింగ్ చేస్తున్న నకిలీ ఉద్యోగి కాంతమ్మను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శనివారం ఆర్థోపెడిక్ ఓపీలో ఆయన తనిఖీ చేస్తున్న సమయంలో కాంతమ్మ నకిలీ ఉద్యోగిగా చలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి నకిలీ ఉద్యోగుల వల్ల ఆస్పత్రికి చెడ్డ పేరు వస్తుందని, నకిలీ ఉద్యోగులు రోగుల నుంచి డబ్బులు సైతం వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆర్ధోపెడిక్ వైద్య విభాగాధిపతి చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగికి డ్రస్సింగ్ చేసేందుకు నకిలీ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు రోగి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
‘స్టెమీ’తో గుండె సేఫ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గుండె జబ్బులు, కేన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది. రెండో దశ పైలెట్ ప్రాజెక్టును వచ్చే నెల 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ (సీటీవీఎస్) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్లాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్లాబ్స్ను సమకూర్చింది. గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాణాపాయం నుంచి కాపాడతారిలా.. స్టెమీ అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు. దీనికి గురైన బాధితుడికి వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్)ను ఇవ్వగలిగితే ప్రాణాల ను కాపాడవచ్చు. నగరాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చికిత్స అందుబాటులో ఉండదు. సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి ప్రభుత్వం స్టెమీ పేరుతోనే కార్యక్రమాన్ని చేపట్టింది. వచ్చే నెలలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లలోని హబ్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్డియాలజిస్టులు, క్యాథ్లాబ్ సౌకర్యం ఉన్న ఈ మూడు ఆస్పత్రులను హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఆ జిల్లాల పరిధిలోని 48 స్పోక్స్ (ఏపీవీవీపీ ఆస్పత్రులు)ను అనుసంధానం చేసి సామాన్యులు, గ్రామీణులకు హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఛాతీనొప్పి, గుండెపోటు లక్షణాలతో స్పోక్స్‌కు వచ్చిన వారికి వెంటనే టెలీ–ఈసీజీ తీస్తారు. ఆ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. గుండె రక్తనాళం ఎంతశాతం పూడిపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా అనేది కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. వెంటనే స్పోక్ వైద్యుడికి తగిన సూచనలు చేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తదుపరి చికిత్స కోసం హబ్‌కు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు. ప్రజలకు అవగాహన కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. గుండెపోటుకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లభిస్తుంది. తద్వారా మరణాలు కట్టడి అవుతాయి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ కమిషనర్ మందులు, పరికరాలు సమకూరుస్తున్నాం మూడు జిల్లాల్లో స్పోక్స్ ఆస్పత్రులను గుర్తించాం. వాటిలో స్టెమీ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా అవసరమైన మందులు, వైద్య పరికరాలను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సమకూరుస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్స్‌పై శిక్షణ ఇచ్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్, ఏపీవీవీపీ కమిషనర్ -
లెవల్–1 క్యాన్సర్ సెంటర్‌గా గుంటూరు
సాక్షి, అమరావతి : ప్రభుత్వరంగ ఆస్పత్రుల్లోనే క్యాన్సర్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ముమ్మరం చేసింది. వ్యాధి నియంత్రణ, నివారణకు సీఎం వైఎస్ జగన్ ఆధునిక వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ వైద్యం కోసం బాధితులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అన్ని ప్రాంతాల్లో 50 కి.మీ పరిధిలోనే వైద్య సదుపాయాలను కల్పించేలా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రోడ్ మ్యాప్‌ను రాష్ట్ర వైద్యశాఖ రూపొందించింది. తొలిదశ కింద.. గుంటూరు జీజీహెచ్‌లోని క్యాన్సర్ విభాగాన్ని లెవల్–1 సెంటర్‌గా, కర్నూలు, విశాఖపట్నంలో లెవల్–2 క్యాన్సర్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. రెండో దశలో కాకినాడ, అనంతపురం జీజీహెచ్‌లలోని విభాగాలను లెవెల్–2 క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధిచేస్తుంది. ఇందుకుగాను రూ.119.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అధునాతన పరికరాల ఏర్పాటు గుంటూరు, కర్నూలు, విశాఖ క్యాన్సర్ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వైద్య పరికరాలను సమకూరుస్తోంది. నాట్కో సహకారంతో గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ సెంటర్‌ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ఆధునిక వైద్య పరికరాల్లో ఒకటైన లీనియర్ యాక్సిలేటర్ (లినాక్) ఇక్కడ అందుబాటులో ఉంది. దీనిని లెవెల్–1 సెంటర్‌గా అభివృద్ధి చేపట్టడానికి వీలుగా పెట్ స్కాన్ మిషన్‌ను సర్కార్ సమకూరుస్తోంది. మరోవైపు.. రూ.120 కోట్లతో కర్నూలులో కొత్తగా ఏర్పాటుచేస్తున్న స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ భవన నిర్మాణ పనులు వచ్చేనెలలో పూర్తవుతాయి. విశాఖపట్నంలో ఇప్పటికే భవనం అందుబాటులో ఉంది. ఈ రెండు చోట్లకు లినాక్, హెచ్డీఆర్ బ్రాకీ, సీటీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలుకు అధికారులు పర్చేజింగ్ ఆర్డర్లు(పీఓ) ఇచ్చారు. అదే విధంగా.. సర్జికల్, మెడికల్, రేడియేషన్ అంకాలజీ పరికరాల కొనుగోలు ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా పరికరాలను సమకూర్చే ప్రక్రియ పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అనంతపురం, కాకినాడల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా అండగా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు.. టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా.. క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే మెజారిటీ శాతం ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాల కల్పన, ఆయా ఆస్పత్రుల బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అలాగే, క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితులకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. గత ఏడాది క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం పథకం కింద ఏటా రూ.600 కోట్లు ఖర్చుచేశారు. ప్రణాళికాబద్ధంగా క్యాన్సర్‌కు కళ్లెం క్యాన్సర్‌కు వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యల విషయంలో ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వ రంగంలోనే ఇందుకు మెరుగైన వైద్యం అందాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించాం. ఈ ఏడాది ఆఖరుకు లెవల్–1 సెంటర్‌గా గుంటూరు.. లెవల్–2 కేంద్రాలుగా కర్నూలు, విశాఖపట్నం క్యాన్సర్ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తాం. మరోవైపు.. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్‌ను ప్రారంభించాం. దీని పరిధిలోకి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులను తీసుకొచ్చి చికిత్స విషయంలో నిర్దేశిత ప్రొటోకాల్స్‌ను పాటించేలా చూస్తున్నాం. క్యాన్సర్ రిజిస్ట్రీని కూడా ప్రారంభించాం. – ఎం.టి. కృష్ణబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ -
అత్యంత అరుదైన గ్యాస్ట్రిక్ టెరటోమా కణితి తొలగింపు
గుంటూరుమెడికల్ : గుంటూరు జీజీహెచ్ చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య నిపుణులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి పది నెలల చిన్నారి ప్రాణాలు కాపాడారు. అత్యంత అరుదైన కణితిని చిన్నారి కడుపు నుంచి తొలగించి రికార్డు సృష్టించారు. పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగాధిపతి(పీడియాట్రిక్ సర్జరీ) డాక్టర్ చందా భాస్కరరావు శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం జాలాదికి చెందిన గోగులమూడి నాగార్జున, లావణ్య దంపతుల పది నెలల రియాన్స్ ఈ నెల ఒకటో తేదీ నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించినా ప్రయోజనం లేకపోగా సమస్య మరింత పెరగసాగింది. తల్లిదండ్రులు 6న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. పీడియాట్రిక్ వైద్యులు రెండు రోజుల పాటు చిన్నారికి చికిత్స అందించి ఈ నెల 8న పీడియాట్రిక్ సర్జరీ వైద్య విభాగానికి రిఫర్ చేశారు. అన్ని రకాల పరీక్షలు చేసి ఉదర కోశ రాక్షస కణితి(గ్యాస్ట్రిక్ టెరటోమా) ఉన్నట్లు నిర్ధారించారు. 20 సెంటీ మీటర్ల పొడవు, 18 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతుతో, చిన్నారి పొట్టను చాలా వరకు ఆక్రమించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి ట్యూమర్లు కేవలం 112 మాత్రమే నమోదయ్యాయి. ఈ నెల 15న ఐదున్నరగంటల సేపు ఆపరేషన్ చేసి కణితిని పూర్తిగా తొలగించారు. సుమారు రూ.10 లక్షలు ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్టు వివరించారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు డాక్టర్ జయపాల్, డాక్టర్ సుమన్, డాక్టర్ మౌనిక, డాక్టర్ బారిష్, డాక్టర్ పరశురామ్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ నాగభూషణం, డాక్టర్ వహిద పాల్గొన్నట్లు వెల్లడించారు. -
సామాన్యులకు ఊపిరి పోస్తున్న జీజీహెచ్ ‘సూపర్’
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. సామాన్యులకు ఊపిరి పోస్తున్న జిల్లా సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా జీజీహెచ్ అభివృద్ధికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా న్యూరో, పీడియాట్రిక్, ప్లాస్టిక్, యూరాలజీలకు సంబంధించి సర్జరీ విభాగాలు, నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్ సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు అర్బన్: కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన ఒంగోలు జీజీహెచ్‌కు నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. అత్యవసర సేవల కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. దీంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చొరవతో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను సైతం పూర్తి చేసి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా దీనిని తీర్చిదిద్దేందుకు ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తాను ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని బాలినేని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. దీంతో సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ చైతన్యవర్మ, ఇతర అధికారులు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. జీజీహెచ్ భవనంలోని 112 గదిలో సూపర్ స్పెషాలిటీ ఓపీని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 120లో అత్యాధునిక పరికరాలతో 40 పడకల సూపర్ స్పెషాలిటీ వార్డును సిద్ధం చేయనున్నారు. ఆమేరకు పనులను వడివడిగా నిర్వహిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో న్యూరో, పీడియాట్రిక్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సంబంధించిన విభాగాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. అలాగే నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీజీహెచ్‌లో అభివృద్ధి చేసిన పనుల్లో కొన్ని రూ.2 కోట్లతో 100 పడకల ఐసీయూ కాంప్లెక్స్, రూ.2 కోట్లతో 100 ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ ప్రత్యేక గదులు, టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఆడిటోరియం రూ.3.5 కోట్లతో పూర్తి చేశారు. అంతేకాకుండా రూ.7.5 కోట్లతో ఎంఆర్ఐ, రూ.2.5 కోట్లతో సిటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేసి రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తున్నారు. అలాగే రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ప్రజలకు అన్నీ వైద్య సేవలు జీజీహెచ్‌లో అందాలి జీజీహెచ్‌లో ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ విభాగాల్లో సర్జరీలు నిర్వహించేలా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించాల్సిన సేవలను పూర్తి స్థాయిలో నాణ్యంగా అందించేందుకు అన్నీ విధాలుగా సిద్ధం చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ వార్డు ఏర్పాటుతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. జీజీహెచ్‌లో వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు మంచి వైద్య సేవలందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. – దినేష్ కుమార్, కలెక్టర్ జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఆలోచించి ఆ దిశగా చర్యలు చేపట్టాం. త్వరలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. నిరంతరం సాధారణ ఓపీలను పర్యవేక్షిస్తూ రోగులకు వైద్య సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించేలా చూస్తున్నాం. – భగవాన్ నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
ఒంగోలు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో మెరుగైన వైద్య సేవలందిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వైఎస్సార్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధిసొసైటీ (హెచ్‌డీసీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ జీజీహెచ్‌లో కోవిడ్ అనంతరం ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి మందుల కొరత లేదని తెలిపారు. అయితే కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఇది సరికాదని హితవు పలికారు. జీజీహెచ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. పేదలకు వైద్యం అందించే జీజీహెచ్‌పై అసత్య ప్రచారాలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఆసుపత్రిపై నమ్మకం కలిగేలా ఉన్నవి ఉన్నట్లు తెలియపచాలన్నారు. కోవిడ్ సమయంలో జీజీహెచ్ అందించిన వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. కోవిడ్ సేవలు అభినందనీయమన్నారు. ఈ నెల 30వ తేదీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీతో ఒంగోలులో ప్రత్యేకంగా వైద్య శాఖపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డిమాండ్ తగినట్లుగా వైద్య సేవలు: కలెక్టర్ జీజీహెచ్‌లో డిమాండ్‌కు తగినట్లుగా మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే బాలినేనితో కలిసి హెచ్‌డీఎస్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రోగుల నమోదు నుంచి మందుల లభ్యత, రక్త నిల్వలు, వైద్య సిబ్బంది ఇతర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ ఉధృతి తగ్గినందున ఓపీలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. నెలకు రూ.12వేల నుంచి రూ.20వేల వరకు పెరిగాయన్నారు. నెలలో సుమారు 2 వేల మైనర్ ఆపరేషన్లు, 350 వరకు మేజర్ ఆపరేషన్లు జరగుతున్నాయన్నారు. హైరిస్క్ కేసులు మాత్రమే గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో మందుల కొరత లేదని, అవసరమైన మందులు 48 గంటల్లో సెంట్రల్ డ్రగ్‌స్టోర్ నుండి జీజీహెచ్‌కు అందుతున్నాయన్నారు. ఏవైనా కొన్ని మందులు అందుబాటులో లేకుంటే వాటిని హెచ్‌డీఎస్ నిధులతో ప్రైవేట్ కొనుగోలు చేసి రోగులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మందులు కాని రక్తం కాని రోగులకు భారం కాకుండా ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తి స్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వైద్యులను అనుమతి లేకుండా గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సుధాకర్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ రవి, ఓఎంసీ కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మానవత్వాన్ని చాటుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో.. విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఓ రివ్యూ సమావేశం కోసం సెక్రెటేరియట్‌కు వెళ్తున్న మంత్రి విడదల రజిని.. ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. అంబులెన్స్ వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బందితో బాధితులను గుంటూరు ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను మంత్రి విడదల రజిని ఆదేశించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్‌రావు -
క్యాన్సర్ వైద్య కిరణాలు.. రాష్ట్రంలోనే తొలిసారిగా
సాక్షి, గుంటూరు: క్యాన్సర్ సోకితే ప్రాణాలు పోవటమే అనే అపోహ చాలా మందిలో ఉంది. ఇది ఏ మాత్రం నిజం కాదని, ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. వైద్య రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతో వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని పేర్కొంటున్నారు. ప్యాలెటివ్ కేర్ ప్రత్యేక వార్డు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నిరకాల క్యాన్సర్లను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ సెంటర్లను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికీ ఉపశమన చికిత్స అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జీజీహెచ్‌లో ప్యాలేటివ్ కేర్ ట్రీట్మెంట్ ప్రత్యేక వార్డును ఇటీవలే అందుబాటులోకి తీసుకొచ్చారు. చదవండి: (రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి) ఉచితంగా శస్త్రచికిత్సలు గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అన్నిరకాల క్యాన్సర్లకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ వైద్య సేవలు ప్రస్తుతం ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి సేవలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడూ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్ సంయుక్త భాగస్వామ్యంతో సుమారు రూ.50 కోట్లతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశాయి. ఇక్కడ సుమారు రూ.70 లక్షలతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌ను నిర్మించి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. చివరి దశపైనా ప్రత్యేక దృష్టి క్యాన్సర్‌ను చివరి దశలో గుర్తిస్తే చికిత్స అందించటం కష్టంతో కూడిన పని. ఇలాంటి రోగులకు ఉపశమన చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుంది. అందుకే రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు నాట్కోసెంటర్‌లో ప్యాలేటివ్ కేర్(ఉపశమన చికిత్స) వార్డు ఏర్పాటు చేశారు. దీనికోసం గుంటూరు బొంగరాలబీడులోని రెండు ఎకరాల స్థలంలో శాశ్వత భవనం నిర్మించేందుకూ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్ ఈ విషయాన్ని గతనెలలో వెల్లడించారు. తాత్కాలికంగా నాట్కో సెంటర్లో ఉపశమన చికిత్స అందుతోంది. క్యాన్సర్ రోగులకు సహాయకులుగా వచ్చే వారికీ ఉచితంగా అత్యాధునిక పరీక్షలు చేస్తున్నారు. కార్పొరేట్ వైద్యసేవలు క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తున్నాం. ఇక్కడ పీజీ సీట్లు మంజూరు చేయడంతోపాటు స్పెషాలిటీ క్యాన్సర్ వైద్యులను ప్రభుత్వం నియమించింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి ఉపశమన చికిత్స కోసం ప్రత్యేక వార్డును అందుబాటులోకి తీసుకొచ్చాం. శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నాం. మందులూ ఉచితంగా ఇస్తున్నాం. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ వైస్ చైర్మన్ -
ఎనలేని సేవకు ప్రతిరూపం
దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని అంటారు.. అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ కన్నా మిన్నగా చూసే నర్సునూ సృష్టించాడంటే అతిశయోక్తి కాదు.. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు పునర్జన్మనిచ్చిన ఆ అమృతమూర్తులకు నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వందనం.. అభివందనం. గుంటూరు మెడికల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరి చేరని రోజులివీ.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ.. ఆస్పత్రి బెడ్‌పై కాలిన, కుళ్లిన గాయాలతో, దుర్గంధం వెదజల్లే శరీరభాగాలతో ఉన్న స్థితిలో ఎవరైనా ఆ రోగివైపు కన్నెత్తి చూస్తారా? కానీ ఆ స్థితిలోనూ అతనితో ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో సకల సేవలూ చేసే నర్సులు దేవతలతో సమానం. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. జీవితాంతం కృతజ్ఞత చూపించడం తప్ప. ఈ రోజే ఎందుకంటే.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు మే 12న. అందుకే ఏటా ఆ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు. నర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం ప్రాధాన్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని టీచింగ్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఏఎన్ఎంలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో జీఎన్ఎం నర్సులను నియమించారు. గ్రామాల్లోనూ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా నియమించారు. 200 మందికి ఇన్ సర్వీస్ కోటాలో జీఎన్ఎం కోర్సును అభ్యసించే అవకాశం కల్పించారు. గుంటూరు జీజీహెచ్‌లో ఒకే సారి 250 స్టాఫ్‌నర్సు పోస్టులను మంజూరు చేశారు. అమ్మ కూడా నర్సే అమ్మ సముద్రాదేవి స్టాఫ్‌నర్సుగా గుంటూరు జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించారు. ఆమెతోపాటు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చేదానిని. ఆమె స్ఫూర్తితో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. హైదరాబాద్‌లో 2000లో జీఎన్ఎం కోర్సును పూర్తి చేశా. ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ డిచ్‌పల్లిలో. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. రోగులకు సేవలందించడం సంతృప్తినిస్తోంది. – చిలువూరి కిరణ్మయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కావాలనుకున్నా.. డాక్టర్ కావాలనుకున్నా.. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకే నర్సునయ్యా. 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు ఉన్నతాధికారులు వచ్చి అభినందించడం మరిచిపోలేని అనుభూతి. – పొట్లూరు మంజు, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) అమ్మ కోరిక మేరకు.. అమ్మ కోరిక మేరకు నర్సింగ్ వృత్తిలోకి ప్రవేశించాను. 39 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఎక్కువగా పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూలో పనిచేశాను. చికిత్స అనంతరం పిల్లలు వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు చేతులు జోడించి చూపే కృతజ్ఞతతో పడిన కష్టమంతా మరిచిపోతాను. – షేక్ సమీనా, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) -
గుంటూరు జీజీహెచ్ వద్ద టీడీపీ హైడ్రామా
-
జైల్లోకి వెళుతున్న రఘురామకృష్ణంరాజు
-
గుంటూరు జైలుకు ఎంపీ రఘురామకృష్ణరాజు
-
రఘురామ.. ఖైదీ నంబర్ 3468
సాక్షి, గుంటూరు, అమరావతి : నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు ఆదివారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు 3468 నంబర్‌ను కేటాయించారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడు అయిన ఎంపీకి గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలించారు. జైలులోని పాత బ్యారక్‌లో గల ఓ సెల్లో ఆయన్ను ఉంచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ పోలీసులు శనివారం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరు పరచగా తనపై పోలీసులు దాడి చేశారని జడ్జికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గుంటూరు జీజీహెచ్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి రఘురామకృష్ణరాజును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ డాక్టర్ సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన మెడికల్ బోర్డు ఎంపీకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్, చర్మ వ్యాధులకు సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అనంతరం నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్ భవనంలోని రెండో అంతస్తులోని గదిలోకి ఆయన్ను తరలించారు. ఆదివారం కూడా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో డాక్టర్ ప్రభావతి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెసెంజర్ ద్వారా మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు ధర్మాసనానికి పంపించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎంపీని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామ కాల్ డేటాపై సీఐడీ కన్ను నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు చెందిన కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌లపై సీఐడీ దృష్టి పెట్టింది. ఎంపీకి టీడీపీ పెద్దలు, టీడీపీ అనుకూల మీడియా కీలక వ్యక్తులు ఫోన్ల ద్వారా టచ్‌లో ఉన్నట్టు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వారు పలు కీలక విషయాలపై డైరెక్షన్ ఇచ్చినట్టు గుర్తించింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. కోర్టు ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. -
‘కరోనా అంత ప్రమాదకరమేం కాదు.. ఉదాహరణ నేనే’
-
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో న్యూరాలజీ రికార్డు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి దక్కని రికార్డు గుంటూరు జీజీహెచ్‌కు సొంతమైంది. న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు కల్గిన ఏకైక ప్రభుత్వ ఆస్పత్రిగా గుర్తింపు పొందింది. ఈ విభాగంలో ఉన్న సౌకర్యాలు, పేదలకు అందుతున్న వైద్యసేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. డీఎం న్యూరాలజీ పీజీ సీట్లను రెండు నుంచి నాలుగుకు పెంచుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అరుదైన అవకాశం వరించింది. సాక్షి, గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో న్యూరాలజీ రోగులకు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలను అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందిస్తున్న ఉచిత కార్పొరేట్ వైద్యసేవలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) గుర్తించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలలో లేని విధంగా డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు రెండు నుంచి నాలుగుకు పెంచుతూ గురువారం ఎంసీఐ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు నాలుగు కల్గిన ఏకైక, మొదటి వైద్య విభాగంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ విభాగం సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 డిసెంబర్ 2న గుంటూరు జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి న్యూరాలజీ రోగి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్న ఆ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి (ఫైల్) పేదరోగులకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి పేదలకు కార్పొరేట్ వైద్యసేవలను అందించేందుకు దాతల సాయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని వైద్యసౌకర్యాలను గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ఏర్పాటు చేయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల కోసం 20 పడకలతో స్ట్రోక్ యూనిట్‌ను, దాతల సాయంతో కోటి రూపాయలతో 2015 అక్టోబర్‌లో ఏర్పాటు చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి అందిస్తున్న వైద్యసేవలకు జీజీహెచ్ స్ట్రోక్ యూనిట్‌కు 2017 జూలైలో జాతీయస్థాయిలో ఇండియన్ స్ట్రోక్ క్లినికల్ ట్రయల్ నెట్‌వర్క్‌లో చోటు లభించింది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు 23 ఉండగా అందులో జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగం ఒకటి. గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా నాట్కో ట్రస్ట్ సాయంతో 2017 జూలైలో న్యూరాలజీ వైద్య విభాగంలో స్లీప్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారు. న్యూరాలజీ వైద్య విభాగంలో కార్పొరేట్‌కు మించి వైద్యసౌకర్యాలు ఉండటంతోపాటుగా నాణ్యమైన వైద్యసేవలను అందిస్తున్నందుకు 2018 జూన్‌లో ఐఎస్ఓ 9001–2015 గుర్తింపు లభించింది. నాణ్యమైన వైద్యసేవలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ గల ఏకైక ప్రభు త్వాస్పత్రిగా న్యూరాలజీ విభాగం గుర్తింపు పొందింది. ఎలాంటి మొండి రోగమై, అరుదైన వ్యాధైనా న్యూరాలజీ వైద్యులు ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేసి నయం చేస్తున్నారనే నమ్మకం రోగుల్లో కలిగించేలా ఇక్కడి వైద్యసేవలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. వైద్యుల అభినందనలు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో పీజీ సీట్లు కల్గిన విభాగంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి గుర్తింపు రావటంతో శుక్రవారం పలువురు వైద్యులు, వైద్యాధికారులు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావుకు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సబిన్కర్ బాబాలాల్‌కు, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సుందరాచారికి అభినందలు తెలిపారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేని విధంగా గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో నాలుగు డీఎం న్యూరాలజీ పీజీ సీట్లు రావటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చొరవ చూపించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలపై దృష్టిసారించి నివేదిక అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డిని పంపించారు. జవహర్‌రెడ్డికి పీజీ సీట్లు పెంచాలని వినతి పత్రం అందజేశాం. ఆయన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నెలరోజుల వ్యవధిలోనే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇవ్వటంతో పీజీ సీట్లు పెంపుకోసం దరఖాస్తు చేశాం. దరఖాస్తు చేసిన నెల రోజుల్లోనే పీజీ సీట్లు పెంచుతూ ఉత్తర్వులు రావటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. దీని వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో కోటి రూపాయలకు పైగా ఖరీదుచేసే డీఎం న్యూరాలజీ పీజీ కోర్సులో ఏడాదికి ఇద్దరు ప్రతిభ ఉన్న పేద వైద్యులు ఉచితంగా పీజీ చదివే అవకాశం లభించటంతోపాటుగా పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతుంది. ప్రస్తుతం న్యూరాలజీ వైద్య విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో వారంలో మూడు రోజులు న్యూరాలజీ ఓపీ వైద్యసేవలను అందిస్తున్నాం. ప్రభుత్వం పెద్దమనస్సు చేసుకుని ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా మంజూరు చేస్తే న్యూరాలజీ వైద్య విభాగంలో రోజూ వైద్యసేవలను అందించేం అవకాశం కలుగుతుంది. – డాక్టర్ నాగార్జున కొండవెంకటసుందరాచారి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం
-
జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం
సాక్షి, కాకినాడ: జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదుర్కోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటల జరిగాయి. తొలుత పలువురు జనసేన కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. జనసేన కార్యకర్తల దాడిలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇద్దరు నర్సులు, ఓ మహిళా రిపోర్టర్ గాయపడ్డారు. జనసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకులు జీజీహెచ్‌కు వచ్చి ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఈ వీరంగాన్ని సెల్లో చిత్రీకరిస్తున్న ఓ పత్రిక రిపోర్టర్ జుత్తుక జ్యోతిపై విరుచుకుపడి ఆమెను గొడకేసికొట్టారు. దీంతో స్పృహతప్పి పడిపోయింది. జ్యోతిపై దాడిని అడ్డుకున్న ఇద్దరు నర్సులను కూడా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు జీజీహెచ్‌కు వచ్చి జనసేన కార్యకర్తల వీరంగాన్ని అడ్డుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పవన్ టీడీపీ సొత్తు.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా? కాకినాడలో జనసేన కార్యకర్తలు వీరంగం -
రోగి మృతితో బంధువుల ఆందోళన
సాక్షి, కాకినాడ సిటీ: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వచ్చే రోగులు నరకం చూస్తున్నారని, వచ్చిన రోగిని పట్టించుకునే వైద్యులు లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి చేతులారా చంపుకునే పరిస్థితి వస్తోందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంకు చెందిన ఓ వ్యక్తిని స్టెచ్చర్‌పై తీసుకొచ్చి డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా మధ్యలో వదిలివేయడంతో చనిపోయిన సంఘటన మరువకముందే తీవ్రమైన గుండె నొప్పితో వచ్చిన ఓ మహిళను ఆసుపత్రిలో వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆమె చనిపోయింది. దీంతో ఆసుపత్రి వద్ద బంధువులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురానికి చెందిన మల్లాడి శారద(33)కు ఆరు నెలల క్రితం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేశారు. మళ్లీ బుధవారం ఉదయం ఒక్కసారిగా నీరసంగా ఉండి వాంతి చేసుకోవడంతో ఆమెను రాజానగరంలోని జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శారదను పరీక్షించి సీరియస్‌గా ఉందని, కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వెంటనే అంబులెన్స్‌లో ఉదయం 11 గంటలకు కాకినాడ జీజీహెచ్‌కి తీసుకొచ్చి క్యాజువాల్టీలో జాయిన్ చేశారు. అంబులెన్స్‌లో వచ్చిన వారే శారదకు ఆక్సిజెన్ పెట్టి డాక్టర్లకు విషయం చెప్పి వెళ్లారు. అయినా సాయంత్రం 6 గంటల వరకు ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. బంధువులు ఎన్ని సార్లు అడిగినా వేరే డాక్టర్లు వచ్చి చూస్తారని చెబుతూ వచ్చారు. ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. దీంతో డాక్టర్లు కంగారుపడి చనిపోయిన తరువాత బంధువులను పిలిచి ఎక్స్‌రే తీయించుకురమ్మన్నారు. తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో వైద్యులు మరో గంటసేపు ఆమెను వదిలేశారు. తరువాత చూసేసరికి ఆమె మరణించి ఉండడంతో బంధువులు ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం వల్లే శారద చనిపోయిందంటూ ఆందోళనకు దిగారు. వన్‌టౌన్ పోలీసులు వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఫలితం లేదు. రోగిని చూడకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించడంపై డ్యూటీలో ఉన్న డాక్టర్లపై కేసులు పెట్టాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన చేశారు. మృతురాలు శారదకు భర్త మల్లాడి రాంబాబు, 13 ఏళ్ల పాప, 10 ఏళ్ల బాబు ఉన్నారు. -
తాడేపల్లిలో పేలుడు కలకలం!
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ నివాసంలో పేలుడు జరగడంతో ఆ నివాసం రేకులు లేచి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లమీద పడ్డాయి. ఒక్కసారిగా బాంబు పేలిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... బ్రహ్మానందపురంలోని బొగ్గిళ్లల్లో బాపట్ల శివశంకర్ భార్య, ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. శివశంకర్ తాపీ పని చేస్తుండగా, ఇంట్లో కుటుంబసభ్యులు నేల టపాకాయలు తయారు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బాపట్ల శివశంకర్, భార్య మణికుమారికి మధ్య గొడవలు జరగడంతో ఆమె చిన్న కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి నేలటపాకాయలను చుట్టే బాధ్యతను రెండో కుమార్తె బాపట్ల ఎస్తేరురాణి తీసుకుంది. తండ్రి తాపీ పనికి వెళ్లిన తర్వాత నేల టపాకాయలు తయారు చేయడానికి అవసరమైన పేలుడు పదార్థం, రాళ్లు, మిగతా సామగ్రిని దగ్గరపెట్టుకొని నేలటపాకాయలు చుడుతుండగా, ఒత్తిడి ఎక్కువై పేలుడు సంభవించింది. దీంతో ఎస్తేరురాణి ఒళ్లంతా రక్తంతో రోడ్డు మీదకు వచ్చి, ఏడుస్తుండడంతో స్థానికులు ఆమెను వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట బంధువులు గ్యాస్ సిలిండర్ పేలి ఎస్తేరురాణికి గాయలైనట్లు తెలియజేశారు. పేలుడు విషయం ఆనోటా ఈనోటా తాడేపల్లి పోలీసుల చెవిన పడడంతో సీఐ అంకమరావు నేతృత్వంలో ఎస్సై వినోద్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, బాంబు కాదు... నేల టపాకాయలు ఎటువంటి అనుమతులు లేకుండా తయారు చేయడం వల్లనే ఈ సంఘటన జరిగిందని నిర్ధారించారు. పోలీసులు అక్కడ ఉండగానే స్థానికంగా ఉండే ఓ వ్యక్తి రెండు ప్లాస్టిక్ గోనె సంచుల్లో నేలటపాకాయలు తీసుకొని పారిపోతుండగా ఎస్సై వినోద్‌కుమార్ వెంటపడ్డారు. ఆ వ్యక్తి నేల టపాకాయలను అక్కడ పడేసి పరారయ్యాడు. జరిగిన సంఘటనపై గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, పోలీసులు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన ఎస్తేరురాణి గాయపడిన ఎస్తేరురాణికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది నేలటపాకాయలు చుడుతున్న ఎస్తేరురాణి తీవ్రంగా గాయపడింది. కళ్ల నరాలు దెబ్బతినడంతో పాటు ముఖంమీద, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యులు రెండు, మూడు రోజులు గడిస్తే చూపు వచ్చే అవకాశం ఉందని, మోకాలుకు మాత్రం శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. -
ధర్మవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రత్తిపాడు రూరల్ (తూర్పు గోదావరి): రెప్పతీస్తే జననం.. రెప్ప మూస్తే మరణం అన్నాడో కవి. నిద్ర మరణానికి మరో రూపం అంటారు. అదే వారి కొంపముంచింది. కొత్తగా టాటా ఏస్ కొనుక్కున్న సంబరంతో మిత్రులతో కలసి తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళుతుండగా దాన్ని నడుపుతున్న చెల్లుబోయిన మరిడియ్యకు నిద్రమత్తుతో రెప్ప పడగా రోడ్డుపక్కన ఆటోను ఢీకొన్నాడు. దాంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన బొంతు సత్యశ్రీనివాస్ టాటా ఏస్ కొనుక్కొన్నాడు. అదే గ్రామానికి చెందిన పదకొండుమంది బంధు మిత్రులతో శనివారం రాత్రి తలుపులమ్మవారి దర్శనానికి బయల్దేరాడు. అమ్మవారిని దర్శించుకొని ఆదివారం వారు తిరుగుప్రయాణమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రత్తిపాడు మండలం ధర్మవరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న ఆటో ఢీకొంది. దాంతో అందులో ప్రయాణిస్తున్న మట్టపర్రు గ్రామానికి చెంది న చెల్లుబోయిన మరిడియ్య (ఆటో డ్రైవర్) (36), చెల్లుబోయిన సత్యనారాయణ (46), మట్టపల్లి ఏడుకొండలు (42) మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారికి ప్రత్తిపాడులో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై ఎ.రవికుమార్ పరిశీలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీజీహెచ్‌లో క్షతగాత్రులు కాకినాడ: ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిని ఆదివారం సాయంత్రం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. యాండ్ర హరికృష్ణ, యాంత్ర పరమేష్, చెల్లుబోయిన వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన శివప్రసాద్, బొంతు సత్య శ్రీనివాసరావుతో పాటు వ్యాన్ డ్రైవర్ రాపాక శ్యామ్బాబులను జీజీహెచ్‌కు తీసుకురాగా యాంత్ర పరమేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉం దని వైద్యులు చెబుతున్నారు. వీరందరినీ అత్యవసరవిభాగంలో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. గాజులగుంటలో విషాదం పి.గన్నవరం: ధర్మవరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పి.గన్నవరం మండలం ముంగండపాలెం శివారు గాజులగుంట గ్రామానికి చెందిన మట్టపర్తి ఏడుకొండలు (చిన్న) (52) మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తాపీ పని చేసుకొనే ఏడుకొండలుకు భార్య పద్మావతి, కుమార్తెలు వర్ణిక, మౌనిక ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఏడుకొండలు గ్రామంలో అం దరితో కలివిడిగా ఉంటూ మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్నాడు. అతడి మరణ వార్తను గ్రామస్తులు, బంధువులు జీర్ణించుకోలేక పోతున్నారు. మట్టపర్రు శోకసంద్రం మలికిపురం(రాజోలు): ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు, గ్రామానికి చెందినవారి అల్లుడు మరణించడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం వార్త ఆదివారం రాత్రి గ్రామస్తులకు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన చెల్లుబోయిన వీర వెంకట సత్యనారాయణ కొబ్బరి ఒలుపు కార్మికుడు. అతని భార్య, కుమారుడు ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉంటున్నారు. మరొక మృతుడు చెల్లుబోయిన మరిడియ్య ఆటో తోలుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య అరుణ ఉపాధికోసం విదేశాల్లో ఉంటోంది. మరిడియ్య కుమార్తె బాలదుర్గకు వివాహం కాగా కుమారుడు శ్రీరామ కృష్ణ చదువుకుంటున్నాడు. గ్రామానికి చెందిన బొక్క సత్యనారాయణ, వెంకట రమణలకు మరిడియ్య అల్లుడు. వెంకట రమణకు స్వయానా సోదరుడు. చిన్నప్పటి నుంచి అక్కే అతనిని పెంచి పెద్ద చేసి కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసింది. మరిడియ్య మరణంతో వెంకట రమణ– సత్యనారాయణ దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరొక మృతుడు మట్టపల్లి ఏడుకొండలు మట్టపర్తికి చెందిన యాండ్ర సత్యనారాయణకు అల్లుడు. అతను శనివారం రాత్రి అత్తవారింటికి వచ్చాడు. ఏడుకొండలు బావ మరిది హరి కృష్ణ, బంధువులతో కలిసి లోవ వెళ్లాడు. ఏడుకొండలు స్వగ్రామం పి. గన్నవరం మండలం గాజుల గుంట. అల్లుడి మృతి వార్త తెలిసి అత్తింటి వారు తల్లడిల్లుతున్నారు. ఈ ప్రమాదంలో ఏడుకొండలు బావమరిది హరి కృష్ణకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామం అంతా రోదనలతో నిండి పోయింది. ఆదివారం అర్ధ రాత్రి వరకూ బంధువులకు మృతి వివరాలు తెలియ లేదు. -
అన్నింటా తామేనంటూ.. అందనంత దూరంగా..
సాక్షి, గుంటూరు: దేనికైనా సరే.. మేము రెడీ అనే మగాళ్లు కుటుంబ నియంత్రణ కోసం చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు మాత్రం దూరం... దూరం అంటున్నారు. అన్నింటా తామేనంటూ ఆధిపత్యం చాటుకునే మగ మహారాజులు కు.ని. ఆపరేషన్ దగ్గరికి వచ్చే సరికి ‘వేసెక్టమా.. వామ్మో’ అంటూ తప్పించుకుంటున్నారు. జనాభా నియంత్రణలో కీలకంగా ఉండే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. శస్త్రచికిత్సల కోసం పురుషులకు ఎంతో సులువైన పద్ధతులు వచ్చినా వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలో గుంటూరు జిల్లాలో జరిగిన ఆపరేషన్ల గణాంకాలే అందుకు నిదర్శనం. జిల్లాలో ఐదేళ్లలో 1,23,907 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయి. వీటిల్లో మహిళలు 1,23,713 మంది ఆపరేషన్లు చేయించుకోగా పురుషులు కేవలం 194 మంది మాత్రమే కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఏడాది మొత్తంలో ఆపరేషన్లు చేయించుకుంటున్న పురుషులు కనీసం 50 మంది కూడా ఉండటం లేదు. ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వేసెక్టమీ ఆపరేషన్ల విషయంలో మగవారికి అవగాహన కల్పించే విషయంలో అధికార యంత్రాంగం సరైన చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. సిజేరియన్తో కలిపి చేస్తున్నారు.. నేడు చాలా మంది సంతానం విషయంలో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటున్నారు. కాన్పు కోసం వెళ్లిన సమయంలో ఇక పిల్లలు వద్దను కోగానే సిజేరియన్ చేసి దాంతో పాటుగా కు.ని. ఆపరేషన్ చేస్తున్నారు. ఎక్కువ మంది వైద్యులు సాధారణ కాన్పుల కోసం వేచి చూడకుండా సిజేరియన్ డెలివరీలు చేస్తుండటంతో పనిలో పనిగా ఆడవారికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. కొంత మంది సాధారణ కాన్పు జరిగినా కూడా మహిళలనే కు.ని. ఆపరేషన్లు చేయించుకోమని చెబుతున్నారే తప్పా పురుషులు చేయించుకోవడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు. ఆడవారి పని అనే ధోరణి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆడవారే చేయించుకోవాలనే భావన నేటి ఆధునిక సమాజంలోనూ కొనసాగుతోంది. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సంపాదనలో మగవారితో పోటీ పడుతున్నారు. ఇంటి ఎదుగుదలకు తమవంతు కృషి చేస్తున్నారు. అక్కడ మహిళను గొప్పగా చూసే మగవారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల దగ్గరికి వచ్చే సరికి అది వాళ్ల బాధ్యతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మగవారికి చేసే శస్త్రచికిత్సలు సులువుగా ఉంటాయని తెలిసినా ఎవరూ ముందుకు రావడం లేదని వైద్యులు అంటున్నారు. చదువుకున్న పురుషులు సైతం వేసెక్టమీ శస్త్రచికిత్స కోసం ఆసక్తి చూపించడం లేదు. మగవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే రకరకాల సమస్యలు వస్తాయనే మూఢత్వం ఇంకా జనాల్లో పేరుకుపోయి ఉంది. ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా వేసెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించడంలో వైద్యాధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులభం కుటుంబ నియంత్రణ కోసం మహిళలు చేయించుకునే ట్యూబెక్టమీ శస్త్రచికిత్స కంటే పురుషులు చేయించుకునే వేసెక్టమీ శస్త్రచికిత్స చాలా సులువుగా చేయవచ్చు. కేవలం మూడు నుంచి ఐదు నిమిషాల వ్యవధిలో ఆపరేషన్ చేస్తారు. కు.ని. శస్త్రచికిత్స చేయించుకునే పురుషులు కేవలం ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవాలి. స్త్రీలు ఆపరేషన్ చేయించుకుంటే వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి. పురుషులు వారం రోజులు బరువులు ఎత్తకూడదు. వారం రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఎలాంటి భయాలు లేకుండా పురుషులు వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకునేందుకు ముందుకు రావాలి. ప్రభుత్వం కు.ని. ఆపరేషన్ చేయించుకునే స్త్రీలకు రూ.600లు, పురుషులకు రూ. 1,100 పారితోషికంగా ఇస్తోంది. – డాక్టర్ మండవ శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్, గుంటూరు జీజీహెచ్ -
చచ్చినా పట్టించుకోరు..
అర్ధరాత్రి వేళ.. గుంటూరు జీజీహెచ్ బయట ప్రాంగణంలో నా శరీరం నిర్జీవంగా పడి ఉంది. పది రోజుల క్రితం రోగంతో మూలుగుతూ వచ్చి ఆస్పత్రిలో పడిన నా శరీరానికి ఆయువు తీరింది. కుటుంబ సభ్యులు నన్ను పట్టుకుని కదిలిస్తూ గుండెలు బాదుకుంటున్నారు. నా శవాన్ని మార్చురీలో పెట్టాలా ? వద్దా ? అంటూ అక్కడ సిబ్బంది నిద్దుర కళ్లతో విసుక్కుంటున్నారు. అప్పటికే నా చుట్టూ ఈగలు రొద చేస్తున్నాయి. బయట అంబులెన్స్‌ల నిర్వాహకులు నా శవాన్ని తీసుకెళ్లడానికి బేరమాడుతున్నారు. పూట గడవని బతుకుల్లో నా చావు కూడా అప్పుల దరువేయిస్తోంది. నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి నా కుటుంబ సభ్యుల వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఇది చూసిన నా బంధువుల్లో ఒకరు.. ‘ఈడి చావు మన చావుకొచ్చిందిరా’ అని విసుక్కుంటుంటే మూతబడిన నా కళ్లలో నీటి చెమ్మ సుడులు తిరిగింది. ప్రభుత్వాస్పత్రిలో ఉచిత అంబులెన్స్ ఉంటదంట.. అని ఎవరో అంటుంటే.. పక్కనే ఉన్న ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ వెకిలిగా నవ్వాడు. ఆ బళ్లు పగలే సరిగా తిరగవు.. ఇక రాత్రి పూట చెప్పే పనే లేదు.. ఈ శవాన్ని మీ దగ్గరే ఉంచుకోండంటూ విసురుగా వెళ్లిపోయాడు. నా నిర్జీవ శరీరం వైపు నా బంధువులు జాలిగా చూశారు. వారి కళ్లలో ఆందోళనతోకూడిన ఆవేదన ఆగిన నా గుండెను బాధతో మెలిపెట్టింది. చివరకు ఓ ప్రైవేటు అంబులెన్స్ డ్రైవరొచ్చి బేరం కుదిర్చాడు.. అంతా చందాలు వేసుకుని అంబులెన్స్లొ ఆయిల్ పోయించి.. నా శరీరాన్ని చాపలో చుట్టి మార్చురీ గేటు దాటించారు. నా ఆత్మ ఒక్కసారి ఘోషించింది.. ఆస్పత్రి అధికారులారా.. బతికున్నప్పుడు పట్టించుకోకపోయినా.. కనీసం చచ్చాకైనా నిరుపేదలమైన మమ్మల్ని మనుషులుగా గుర్తించండయ్యా అంటూ..– జీజీహెచ్‌లో మృతుని ఆత్మఘోష సాక్షి, గుంటూరు మెడికల్: కృష్ణా జిల్లా వెలగలేరుకు చెందిన కోటయ్య( 50) జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం( జూన్ 29న) రాత్రి చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఉచితంగా అంబులెన్స్‌లో తరలించాల్సి ఉంది. కానీ రాత్రి వేళల్లో తరలించబోమని అంబులెన్స్ సిబ్బంది చెప్పటంతో మృతుడి బంధువులు రూ.5 వేలుకు ప్రైవేటు అంబులెన్స్ మాట్లాడుకుని కోటయ్య భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. డబ్బులు వసూలు చేస్తున్నారు.... గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఉచితంగా ఇళ్లకు తీసుకెళ్ళేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత అంబులెన్స్‌ల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. మేలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కలకలూరుకు చెందిన దావులూరి శారా( 55)కు తీవ్ర అనారోగ్యంతో జీజీహెచ్‌లో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్ రూ.2 వేలు డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సీనియర్ వైద్యుడికి మృతురాలి బంధులు ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆయన వచ్చే వరకు మూడు గంటలపాటు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి శవాలను వారి ఇళ్లకు ఉచితంగా ఏసీ అంబులెన్స్‌లో తరలించేలా గత ప్రభుత్వం మహాప్రస్థానం అనే రాష్ట్రంలో మెదటిసారిగా జీజీహెచ్‌లో 2017 జూన్ 20న ప్రారంభించారు. అంబులెన్స్ డ్రైవర్స్ మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకెళ్లన పిదప ఎంతో కొంత ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్లు పలువురు ఆస్పత్రి ఉద్యోగులే వాపోయారు. అంబులెన్స్‌ల సేవలు రాత్రి 9 గంటల తరువాత లేకపోవటంతో మృతుల కుటుంబ సభ్యులకు అనేక ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. టీడీపీ నేతలకు కాంట్రాక్ట్... మహా ప్రస్థానం వాహనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఒక్కో కిలోమీటర్‌కు వాహనానికి ఎంత చెల్లించాలి, టీడీపీ ప్రభుత్వం మహాప్రస్థానం నిర్వాహకులతో ఎలాంటి ఒప్పందం చేసుకుందనే విషయాలను ఆస్పత్రి అధికారులు ఇప్పటి వరకు బయట పెట్టలేదు. టీడీపీ నేతలకు మహా ప్రస్థానం కాంట్రాక్ట్‌ను టీడీపీ ప్రభుత్వం అప్పగించింది. దీంతో మృతదేహాల తరలింపు వ్యవహారం కాంట్రాక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తుంది. గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన వారిని ఉచితంగా అంబులెన్స్‌లో తరలించేవారు. సుమారు ఐదేళ్లపాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించారు. కిలోమీటర్‌కు ఎనిమిది రూపాయల చొప్పున ప్రైవేటు అంబులెన్స్ వారికి జీజీహెచ్ అధికారులు చెల్లించేవారు. టెండర్ లేకుండా టీడీపీ నాయకులకు సంబంధించిన సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. వీరికి ఆస్పత్రి అధికారులు ఎంత చెల్లిస్తున్నారో కూడా ఎవ్వరికీ చెప్పటం లేదు. వాహనాల్లో మృతదేహాలను తరలించేందకు ఆర్ఎంవో సంతకం పెట్టి పంపిస్తారే తప్పా ఆయనకు కాంట్రాక్టర్‌తో ఉన్న ఒప్పందం గురించి ఏ ఒక్క విషయం తెలియదు. జిల్లాకే పరిమితం చేశారు... తొలుత రాష్ట్ర వ్యాప్తంగా మృతదేహాలను తరిస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి కేవలం గుంటూరు జిల్లాకే వాహనాలను పరిమితం చేశారు. ఇతర జిల్లాలకు మృతదేహాలను తరలించే సమయంలో డ్రైవర్స్ డబ్బులు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌కు పలు జిల్లాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడు మహాప్రస్థానం అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ వాటి సేవలన్నీ కేవలం పగలు వరకే పరిమితమవుతున్నాయి. రాత్రి వేళల్లో ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు ఆస్పత్రిలోనే తిష్టవేసి మృతదేహాల తరలింపునకు అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ ఈ సమస్యపై స్పందించి ఉచిత అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. -
జీజీహెచ్ వైద్య సిబ్బంది నిరసన
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గోతరగతి ఉద్యోగులు గురువారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రిలో మూడేళ్లుగా నాల్గో తరగతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ఆస్పత్రి అధి కారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు వినతిపత్రాలు అందజేసి, సమ్మె నోటీసులు ఇచ్చినా తమ సమస్యలపై ఏ మాత్రం చిత్తశుద్ధి చూపించటం లేదన్నారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులు స్పందించని పక్షంలో ఈనెల 12 నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తామని వెల్లడిం చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ పనితీరుపై జి ల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రిగా ఫిర్యాదు చేస్తామ ని యూనియన్ నేతలు తెలిపారు. శుక్రవారం కూ డా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిరసన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉద్యోగుల డిమాండ్లు... ఉద్యోగులకు ప్రత్యేక క్లినిక్‌లో మందులు సరిపడా ఇవ్వటంలేదు. నెలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించి మందులు అందజేయాలి. చనిపోయిన, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల్లో పలువురికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు త్వరగా అందించాలి. నాల్గో తరగతి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాలి. సీనియారిటీ లిస్ట్‌లు ఇవ్వాలి. ఉద్యోగుల మెడికల్ లీవ్, ఎరన్డ్ లీవ్, ఇంక్రిమెంట్ల బిల్లులు ట్రెజరీకి పంపినప్పుడు ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలి. యూనియన్ ఆఫీకు మరమ్మతులు చేయిం చాలి. ఉద్యోగుల సెలవుల మంజూరు విషయంలో జాప్యం లేకుం డా చూడాలి. ఏడాదికి ఒకసారి ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ జిరాక్స్ కాపీలను అందజేయాలి. నిరసనలో పాల్గొన్న నేతలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐటీయూసీ) జీజీహెచ్‌శాఖ కార్యదర్శి వడ్డే బా లయ్య, అధ్యక్షుడు సీహెచ్ వీరరాఘవులు, కోశాధికారి కె. వెంకటకృష్ణ, గౌరవ అధ్యక్షుడు కోట మాల్యాద్రి, జిల్లా మహిళా కార్యదర్శి కోలా స్వాతి, రావుల అంజిబాబు, కె. రమేష్‌బాబు, కె. దుర్గాప్రసాద్, పి. నాగరాజు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో పారితోషికాలుఇవ్వకపోతే ఎలా? గుంటూరు మెడికల్:గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది గురువారం ఆస్పత్రి అసిస్టెంట్ డైరక్టర్ మాజేటి రత్నరాజును కలిసి తమకు ఏడు నెలలుగా ఆరోగ్యశ్రీ పారితోషికాలు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. పారితోషికాలు నిలిపివేయటానికి గల కారణాలు తమకు తెలియజేయాలని కోరారు. పారితోషికాలు నిలిపివేయటం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. గతంలో పారితోషికాల కోసం ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేస్తే ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు పారితోషికాలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి తమకు పారితోషికాలు నిలిపివేయటంపై ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కార్యాలయ ఉద్యోగుల పనితీరు వల్లే తమకు పారితోషికాలు రావటం లేదని తక్షణమే ఏడునెలల బకాయిలు ఇప్పించాలని అసిస్టెంట్ డైరక్టర్‌ను కోరారు. నిధుల కొరత వల్లే పారితోషికాలు ఇవ్వటం లేదని రత్నరాజు చెప్పి నిధులు రాగానే పారితోషికాలు చెల్లిస్తామని వైద్య సిబ్బందికి హామీ ఇచ్చారు. -
మూడు హామీలు..ముక్కచెక్కలు
సాక్షి, గుంటూరు : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు సార్లు వచ్చి ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మారాయి. 2–10–2015న ఆస్పత్రికి వచ్చిన సీఎం మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు(ఎంసీహెచ్ వార్డు) నిర్మాణానికి శిలాఫలకం వేశారు. మూడేళ్లపాటు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. మళ్లీ 2018 డిసెంబర్ 19న చంద్రబాబు రెండోసారి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడు కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. భవనాల కోసం తవ్విన గోతులు మాత్రం పెద్ద అగాధంలా ప్రభుత్వ అసమర్థతను వెక్కిరిస్తున్నారు. మరో వైపు సీఎం ప్రారంభించిన శిలాఫలకాలు సైతం అదృశ్యమయ్యాయి. ఎంసీహెచ్ వార్డు నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాలింతలు, గర్భిణులు నాలుగేళ్లుగా ఆస్పత్రిలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇలా సీఎం చేతుల మీదుగా రెండుసార్లు శంకుస్థాపనలు అయిన భవన నిర్మాణాలే నేటికీ ప్రారంభం కాకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు, గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో రూ.30 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం ఇచ్చారు. సుమారు రూ.65 కోట్లు ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి సమకూరాయి. కానీ వార్డు పనుల్లో మాత్రం పురోగతి లేదు. పెద్దాస్పత్రికి కాన్పు కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు మాత్రం మంచాలు చాలక అల్లాడిపోతున్నారు. మూడు హామీలు.. ఒక్కటీ నెరవేరలేదు... గుంటూరులోని జీజీహెచ్‌లో మాతాశిశు వార్డు నిర్మాణానికి 2015లో సీఎం చంద్రబాబు తొలిసారి శంకుస్థాపన చేశారు. వార్డు నిర్మాణం కోసం అప్పుడు తీసిన అగాధాలు.. మూడేళ్లపాటు సీఎం సారూ.. ఎక్కడ నిర్మాణమంటూ ప్రశ్నిస్తూనే ఉన్నాయి. మళ్లీ 2018లో శంకుస్థాపన చేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాదిలోపు భవనాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నడిబొడ్డున ఖాళీ స్థలంలో పెద్ద పెద్ద అగాధాలు చేశారు. అనంతరం నిర్మాణ పనులను మాత్రం అలాగే వదిలేశారు. వార్డు నిర్మాణానికి దాతలు ముందుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం దాటి ఎంసీహెచ్ వార్డు నిర్మాణానికి ఒక్క ఇటుకా పడలేదు. మాతా శిశు వార్డు కథ మారలేదు. గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లను జీజీహెచ్‌లో నిర్వహించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఆస్పత్రికి వచ్చి గుండె మార్పిడి ఆపరేషన్లను ఎన్టీఆర్ వైద్యసేవలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇది నమ్మిన గుండె జబ్బుల రోగులు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం మాత్రం గుండె మార్పిడి ఆపరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో సహృదయ ట్రస్ట్‌కు కూడా తాము ఆపరేషన్లు చేయలేమని ప్రకటించింది. ఆపరేషన్లకు బ్రేక్ పడింది. జీజీహెచ్‌లో పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా నూతన భవన నిర్మాణాల కోసం గుంటూరులోని బొంగరాల బీడులో స్థలం కేటాయిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తీరా చూస్తే ఆ స్థలాన్ని కార్మిక శాఖకు కేటాయిస్తున్నట్లు జీవో ఇచ్చారు. దీంతో నూతన వార్డుల నిర్మాణం అటకెక్కింది. ఇలా సవాలక్ష మెలికలు పెట్టి.. ఈ హామీకీ ఘోరీ కట్టారు. పేదల ఆస్పత్రి అభివృద్ధికి చంద్రబాబు ఇచ్చిన మూడు హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. రోగుల కష్టాలు ఒక్కటీ తీరలేదు. సీఎం తీరుపై జిల్లా వాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బొంగరాలబీడులో జీజీహెచ్ వార్డుల నిర్మాణానికి సీఎం ప్రకటించిన స్థలం గుండె మార్పిడి ఆపరేషన్లకు నిధులు లేవు గుంటూరు జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు నిధులు ఇస్తామని చంద్రబాబు 2015లో హామీ ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చి గుండె జబ్బు రోగులను పరామర్శించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గుండె మార్పిడి ఆపరేషన్లు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నారని, ప్రజలు వినియోగించుకోవాలని చెప్పారు. ఆయన మాటలు నమ్మి సుమారు 25 మంది గుండె జబ్బు రోగులు ఆపరేషన్ల కోసం గుంటూరు జీజీహెచ్‌లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. సహృదయ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినా 2016 నుంచి 2018 వరకు నలుగురికి గుండె మార్పిడి ఆపరేషన్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఆయన ఆపరేషన్లను నిలిపివేశారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్న వారు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు రూ.15 లక్షలు ఇస్తున్నామని పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసుకుంటున్నారు. జీజీహెచ్‌కు ప్రతి రోజూ ఓపీ : 4 వేలు ప్రస్తుతం ఉన్న పడకలు : 1177 కావాల్సిన పడకలు :560 జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు : 4 గుండె మార్పిడికి ఎదురు చూస్తున్న వారు : 25 మంది -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్)లో దారుణం చోటుచేసుకుంది. మహిళకు కాన్పు చేయించటంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడం వల్ల శిశువు మృతి చెందింది. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శిశువు మృతదేహన్ని త్వరగా తీసుకెళ్లాలని వైద్యులు ఆదేశించారు. అంతటితో ఆగకుండా రూ. 500 ఇస్తేనే మృత దేహాన్ని అప్పగిస్తామని బాధితులను సిబ్బంది బెదిరించారు. బాధితులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్‌కు తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రి ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డ శరీరంపై గాయాలయ్యాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోంచారు. -
గుంటూరు జిజిహెచ్‌లో విధులు బహిష్కరించిన వైద్యులు
-
తప్పొకరిది.శిక్ష మరొకరికి !
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లకు తగినట్లుగా కళాశాలతోపాటు జీజీహెచ్ (బోధనాస్పత్రి)లో వసతులు, వైద్య పరికరాలను కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) పలు మార్లు తనిఖీలు జరిపి ఎంబీబీఎస్ సీట్లను తగ్గించడం, పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారికిసైతం గుర్తింపు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎంసీఐ తనిఖీలు జరిపిన సమయంలో వసతులు, వైద్య పరికరాల కొరతను గుర్తించింది. వాటిని నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసుకోని పక్షంలో ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించింది. వైద్య పరికరాలు, సౌకర్యాలపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గొప్ప డాక్టర్లను దేశ, విదేశాలకు అందించిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వసతులు, సరైన భవనాలు, వైద్య పరికరాలు, బోధనా సిబ్బంది లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో సైతం 40 ఏళ్ల క్రితం ఉన్న వసతులు మినహా కొత్తగా ఏమీ సమకూరకపోవడంతో భారత వైద్య మండలి (ఎంసీఐ) బృందం తని ఖీలకు వచ్చిన ప్రతిసారీ ఇతర బోధనా ఆస్పత్రుల నుంచి నర్సులు, వైద్య సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకుని కష్టం నుంచి గట్టెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గుంటూరులో రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆరు జిల్లాలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న జీజీహెచ్‌పై ప్రభుత్వం శ్రద్ధ కనబర్చడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ ఏర్పడిన కొత్తలో 1,170 పడకలు అధికారికంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య సుమారుగా రెండు వేలకు చేరింది. అయితే నర్సులు, బోధనా సిబ్బంది, వైద్య సిబ్బంది మాత్రం గతంలో మాదిరిగానే ఉన్నారు. కొత్తగా ఈ పోస్టులను భర్తీ చేసిన దాఖలాలు లేవు. గుంటూరు వైద్య కళాశాలలో 2013వ సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లను 200లకు పెంచుతూ భారత వైద్య మండలి నిర్ణయించింది. అయితే అందుకు తగ్గట్లుగా వసతులు, సౌకర్యాలు కల్పించలేకపోయారంటూ 2014లో 50 సీట్లను తొలగించింది. అప్పట్లో వైద్య విద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వం వసతుల కల్పనపై ఎంసీఐకి హామీలు ఇచ్చి 50 సీట్లను మళ్లీ తెచ్చుకున్నారు. అయితే నాలుగేళ్లు దాటుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఎంసీఐ త్వరలో గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తనిఖీలకు రానున్న నేపథ్యంలో వసతులు సక్రమంగా లేవని గుర్తిస్తే తమకు గుర్తింపు ఇవ్వరేమోననే ఆందోళనలో వైద్య విద్యార్థులు ఉన్నారు. గతంలో యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులు గుర్తింపు లేక మూడేళ్లపాటు రోడ్లపై తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కూడా వైద్య కళాశాలలోని చర్మవ్యాధుల విభాగం, రేడియాలజీ విభాగాలతోపాటు మరికొన్ని విభాగాల్లో కొన్ని సీట్లకు ఇప్పటికి గుర్తింపు లేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంసీఐ తనిఖీల నేపథ్యంలో హడావుడిగా తూతూ మంత్రపు చర్యలు చేపట్టి కంటితుడుపుగా వ్యవహరించకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొని వైద్య విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వసతులు, సౌకర్యాలు మెరుగు పర్చాం త్వరలో ఎంసీఐ తనిఖీలు జరుగనున్న నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిబంధనలకు తగినట్లుగా సౌకర్యాలు, వసతులు కల్పించాం. బోధనాస్పత్రి జీజీహెచ్‌లో సైతం వసతులు, వైద్య పరికరాల కొరత తీర్చాం. పీజీ సీట్లకు ఇబ్బంది కలగకుండా జీజీహెచ్‌లో ఎంఆర్ఐ స్కాన్ మిషన్ ఏర్పాటు చేసి త్వరలో ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నాం. బోధనా సిబ్బంది కొరత కూడా కొంత మేరకు తీరింది. రెండు, మూడు పీజీ కోర్సుల్లో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. ఈసారి ఎంసీఐ తనిఖీల్లో ఇబ్బందులన్ని తొలగిపోతాయని ఆశిస్తున్నాం. విద్యార్థులు ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. – డాక్టర్ సుబ్బారావు, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
పోలీసులు కొట్టిన దెబ్బలకే రిమాండ్ ఖైదీ మృతి
గుంటూరు ఈస్ట్: రిమాండ్ ఖైదీ మృతికి కారణమయిన పోలీసులపై చర్యలు తీసుకుని కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జీజీహెచ్ మార్చురి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యానాది సమాఖ్య నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. దీంతో మృతుడి పోస్టుమార్టం గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీరాములు మాట్లాడుతూ ప్రకాశం జిల్లా చీమకుర్తి సిద్ధార్థనగర్‌లో నివసించే ఎనిమిది మంది ఎస్సీ,ఎస్టీలను దారి దోపిడీ అనుమానంపై పోలీసులు మార్చి 30వ తేదీ అదుపులోకి తీసుకున్నారన్నారు. విచారణ సమయంలో వారిని తీవ్రంగా కొట్టడంతో రిమాండుకు తరలించిన అనంతరం మన్నెం చిన గంగయ్య (20) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని చెప్పారు. ఏప్రిల్ 30వ తేదీ జీజీహెచ్‌కు తరలించారన్నారు. చికిత్స పొందుతూ చిన గంగయ్య అదే రోజు రాత్రి మృతి చెందాడని వివరించారు. దీనిపై సిట్టింగ్ జడ్జి, వైద్యుల బృందం పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పక్షపాతం లేకుండా విచారణ జరిపి చిన గంగయ్య మృతికి కారణమయిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడి కుటుంబానికి రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. రిమాండులో ఉన్న మిగిలిన వారందిరికీ వెంటనే వైద్య పరీక్షలు చేయించి చికిత్స జరిపించాలని కోరారు. చిన గంగయ్య సోదరుడు అంకమ్మరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, అతనికి ప్రత్యేక వైద్యం చేయించి ప్రాణాలు పోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. నిరసనలో సమాఖ్య నాయకులు మేకల ఏడుకొండలు, అద్దంకి అంకారావు, కె.ఏడుకొండలు , ఖాజారావు, ఖాజావలీ, జి.శ్రీను పాల్గొన్నారు. ఒంగోలు ఆర్డీవో శ్రీనివాసరావు మార్చురీ వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో చిన గంగయ్య మృతదేహానికి గురువారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
రాజధానిలో మహిళలకు రక్షణ లేదా?
సాక్షి, గుంటూరు/కారంపూడి: రాజధాని ప్రాంతంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో అత్యాచారానికి గురై గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను బుధవారం వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి ఆమె పరామర్శించారు. గైనకాలజీ వార్డులోని వైద్యులతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి సూపరింటెండెంట్ రాజునాయడును కలిసి మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. తర్వాత జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట, ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లాలో వరుస అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. ఈ సంఘటన విన్న వెంటనే చలించిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత మహిళలకు ధైర్యం చెప్పి అండగా నిలవాలని తమను పంపించారని చెప్పారు. నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పిల్లలు, మహిళలపై 15 అత్యాచార ఘటనలు జరిగినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. దారుణ అత్యాచార ఘటన వెలుగు చూసి 24 గంటలు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకపోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వం బాధితురాలికి న్యాయం చేస్తుందనే నమ్మకం కలగడం లేదన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడు అధికార పార్టీ సానుభూతిపరుడు కాబట్టే ఇంకా అతన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నాయకులు రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా కమిషన్ చైర్పర్సన్, మంత్రులు ఈ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ కనీసం బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామనే ధైర్యం ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మహిళలపై జరుగుతున్న దాడుల ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రాజీనామా చేయాలి రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రి ప్రజలే తనకు వలయంగా ఏర్పడి రక్షణ కల్పించాలని అడుగుతున్నారని, అలాంటి వ్యక్తి మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు సీఎం పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్న సంకేతం ఇవ్వకపోతే పరిస్థితులు ఎలా బాగుపడతాయన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక అమరావతి కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ బయట పడితే అందులో అధికార పార్టీకి చెందిన ప్రముఖులుండడంతో ప్రభుత్వం ఆ కేసు నీరుగార్చిందని ఆరోపించారు. ఇసుక, మట్టి దోచుకునేవారికి ఈ ప్రభుత్వంలో కొమ్ములొస్తున్నాయని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున, జగన్మోహన్రెడ్డి తరఫున బాధితురాలికి ధైర్యాన్ని కల్పించడంతోపాటు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, మహిళ విభాగం నేతలు గనిక ఝాన్సీరాణి, మేరిగ విజయలక్ష్మి, నిమ్మరాజు శారదా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా పాశవికంగా అత్యాచారం చేసిన ఒప్పిచర్లకు చెందిన మైనర్ బాలుడు ఎస్కే సైదులుపై అత్యాచారం కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని కారంపూడి ఎస్ఐ మురళి తెలిపారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శిస్తున్న వాసిరెడ్డి పద్మ, అప్పిరెడ్డి తదితరులు -
డయేరియా మరణాలపై రాజకీయమా?
ఆమె ఏడు నెలల గర్భిణి.. కడపులో బిడ్డ కాళ్లతో తన్నుతున్నాడంటూ భర్తకు చెప్పి మురిసిపోయేది.. ఇప్పటికే బాబు ఉన్నందున పాప పుట్టాలని ఆ దంపతులు ఇద్దరూ కలలుకనేవారు. ఆ కలలను డయేరియా మహమ్మారి కల్లలు చేస్తూ భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఆ గర్భిణికి తీరని కష్టాన్ని మిగిల్చింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని మూడేళ్ల కుమారుడు అమ్మా.. నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడంటూ వచ్చీ్చరాని మాట లతో పదే పదే ప్రశ్నిస్తుంటే ఏమని సమాధానం చెప్పాలో తెలియక గుండెలుఅవిసేలా రోదిస్తోంది. గుంటూరు ఈస్ట్: నగరంలోని ఆర్‌అగ్రహారం నిమ్మలపేటకు చెందిన పల్లపు రత్తయ్య (38) తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుని జీవనం సాగిస్తుంటాడు. రత్తయ్య గురువారం వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతిచెందాడు. రత్తయ్య భార్య లక్ష్మి ఏడు నెలల గర్భిణి. ఆ దంపతులకు మూడేళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. రత్తయ్యకు సరైన వైద్యం చేయని కారణంగానే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. డయేరియాకు గురడవానికి ముందు వరకు రత్తయ్య ఆరోగ్యంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పండ్లు విక్రయించి వచ్చే రోజువారీ సంపాదనతోనే కుటుంబాన్నిపోషించే రత్తయ్య మృతితో భార్య లక్ష్మి భవిష్యత్తు అంధకారంలో పడింది. తండ్రి చనిపోయిన విషయం తెలియని కుమారుడు అమాయకంగా నాన్న ఎప్పుడు నిద్రలేస్తాడు అంటూ అడగడంతో ఏ సమాధానం చెప్పాలో లక్ష్మి పొగిలిపొగిలి ఏడుస్తోంది. లక్ష్మి విలపిస్తున్న తీరుతో కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. రత్తయ్య మృతితో తమకు దిక్కెవరంటూ అతని తల్లి తిరుపతమ్మ కన్నీరుమున్నీరైంది. ఆనందపేట 8వ లైన్‌కు చెందిన పఠాన్ ఫాతిమూన్ (67) డయేరియాతో గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
గుంటూరులో విజృంభిస్తున్న అతిసారం..8మంది మృతి
-
గుంటూరులో ఘోరకలి ; ఇప్పటికి 8మంది మృతి
సాక్షి, గుంటూరు : పాలకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసిన కలుషిత నీటితో గుంటూరు నగరంలో అతిసారం ప్రబలింది. వ్యాధి బారినపడి ఇప్పటిదాకా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికిపైగా ఆస్పత్రుల్లో చేరారు. చికిత్స పొందుతున్నవారిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అతిసార విజృంభణతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ : అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల వల్లే మంచినీరు కలుషితమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో బుధ, గురువారాల్లో నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో మెడికల్ ఎమర్జన్సీ ప్రకటించినట్లు ఆస్పత్రి సూపరింటెం డెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. చనిపోయినవారి పేర్లను ఫాతిమూన్, బీబీజాన్, సబీనా, గోపీ, వెంకట్రావు, పద్మావతి, బాలకోటిరెడ్డి, సామ్రాజ్యంలుగా అధికారులు పేర్కొన్నారు. మంత్రుల నిలదీత : అతిసార బాధితులను పరామర్శించేందుకు జీజీహెచ్‌కు వచ్చిన మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మేకా ఆనందబాబులకు చుక్కెదురైంది. జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడంలేదంటూ మంత్రులపై మండిపడ్డ జనం.. ఆస్పత్రి ప్రధాన ధ్వారం వద్ద బైఠాయింపునకు దిగారు. వైఎస్సార్సీపీ నేతలు అప్పిరెడ్డి, గులామ్, రసైల్‌లు ఆందోళనకు నేతృత్వం వహించారు. మంత్రుల రాక సందర్భంగా జీజీహెచ్ వద్ద భారీగా పోలీసులను మోహరించడం గమనార్హం. -
సీఎం సారూ... ప్రాణాలు పోతున్నాయ్..!
అమ్మ ఒడిలోకి రాకుండానే మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. పేగు తెంచుకోగానే తనువు చాలిస్తున్నారు. బయట ప్రపంచం చూడకుండానే కన్ను మూస్తున్నారు. గర్భ శోకానికి ప్రభుత్వాసుపత్రులు వేదికగా మారిపోయాయి.కాకినాడ జీజీహెచ్‌లోనైతే శిశు మరణ ఘోష నిత్యం వినిపిస్తూనే ఉంది.శిశు మరణాలు ఏటా పెరిగిపోతున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చినాసంబంధితాధికారుల్లో కనీస స్పందన కరువవుతోంది. జిల్లా పర్యటనలసందర్భంగా స్వయంగా సీఎం ఇచ్చిన హామీలూ ఆచరణకు నోచుకోవడం లేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: చిన్నారుల్లో తలెత్తే లోపాలను సత్వరమే గుర్తించి, తగు చికిత్సలు అందించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాలకుకారణమైన రోగాలను గుర్తించి, తగు మందులు వాడేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెబుతున్నారు. చిత్తశుద్ధితో అమలు చేస్తే మంచిదే కానీ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి ఆచరణల్లో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తించిన రోగానికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన రోగాలకు వైద్యమెలా అందిస్తారో ప్రశ్నార్థకంగా మారింది. ఎంతసేపూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మెప్మా కార్యకర్తలపై ఆధారపడితే సరిపోదని, వారితో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమంలో ఆరోగ్య పరిస్థితులను గుర్తించినంత మాత్రాన ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా ‘సీఎం సారూ... ఓ సారి ఇటు చూడండ’ంటూ జిల్లాలో మాతా, శిశు మరణాల దయనీయ దుస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. పురిటినొప్పులు వస్తే భయమే... పురిటినొప్పులు వస్తే చాలు గర్బిణీలు, వారి కుటుం బీకులు భయాందోళనకు గురవుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా వస్తారా లేరా అని భయపడుతున్నారు. సుఖ ప్రసవం సాగేవరకు, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేవరకు ఆందోళన వీడటం లేదు. గిరిజనం, మైదానం అనే తేడా లేకుండా కలవరపడుతున్నారు. గత నాలుగేళ్లలో శిశు మరణాలు ఎక్కువగా సంభవించడమే దీనికి కారణం. శాస్త్ర సాంకేతికత విశ్వం అంచులకు చేరిన కాలంలోనూ...వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాక శిశు మరణాల సంఖ్య పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచిత్రమేమిటంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక శిశు మరణాలతోపాటు మాతృ మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పైన పేర్కొన్న పట్టికలో 2014–15 నుంచి అంకెలు చూస్తే పరిస్థితేంటో స్పష్టమవుతోంది. గత నాలుగేళ్ల కాలంలో ఏడాదిలోపు శిశువులు 2,922 మంది చనిపోగా, ఐదేళ్లలోపు చిన్నారులు 261 మంది మరణించారు. ఇక తల్లుల మరణాలైతే ఈ నాలుగేళ్ల కాలంలో 220 వరకూ ఉన్నాయి. మనకే ఎందుకీ పరిస్థితి... సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటిగా ఐక్య రాజ్యసమితి నిర్ణయించిన శిశు మరణాల నియంత్రణ విషయంలో మన దేశం చెప్పుకోదగ్గ విజయం సాధించిందని అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ వెల్లడించిన గణాంకాలు ఊరటనిచ్చాయి. ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2000–15 మ«ధ్య పది లక్షల మంది మృత్యుపాశం నుంచి తప్పించుకోగలిగారని ఆ నివేదికలో పేర్కొంది. భారత రిజిస్ట్రార్ జనరల్ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా శిశు మరణాల రేటు తగ్గిందని వివరించింది. కానీ ఈ జిల్లాలో నాలుగేళ్లుగా శిశు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. లోపమెక్కడ... సాధారణంగా గర్భం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్ నెంబర్, చిరునామాలాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణీకి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యే వరకూ నిరంతరం ఏఎన్ఎం, వైద్యులు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు పరిశీలించాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ ప్లానింగ్ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండే కాకినాడ సర్వ జన ప్రభుత్వాసుపత్రికి ప్రసవానికి వచ్చిన తల్లుల్లో మెజార్టీ కేసుల్లో పిల్లలు దక్కని దుస్థితి నెలకొంది. గిరిజనులకైతే నరకమే... గిరిజన మహిళలు గర్భం దాలిస్తే చాలు నరకం చూస్తున్నారు. రహదారి సౌకర్యమే లేదంటే మిగతా సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గిరిజనులను ప్రధానంగా రక్తహీనత పట్టిపీడిస్తోంది. పోషకాహారం అందిస్తేనే రక్త హీనతను నియంత్రించగలం. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గిరిజన గ్రామాల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. పౌష్టికాహారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రికార్డుల్లో కనిపించడమే తప్ప గిరిజనులకు మాత్రం అందడం లేదు. వైద్యుల కొరత... ఏజెన్సీలో వైద్యసేవలందించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లోనే అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. చింతూరు ఏరియా ఆసుపత్రికి 31 పోస్టులు మంజూరు చేస్తూ సెప్టెంబర్ 9న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ 24 గంటలూ పని చేయించాలని కేబినెట్ నిర్ణయించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం అప్‌గ్రేడైన చింతూరు ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు ప్రతిబంధకంగా మారింది. కాకినాడ జిల్లా ఆసుపత్రిలోనూ అవస్థలే... కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయలేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా, శిశు ప్రసూతి విభాగంలో సుమారు 300 పడకలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకు వస్తుంటారు. రోజుకి 50 వరకు ప్రసవాలు జరుగుతుండగా, 20–25 వరకు సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్ విభాగంలో ఒక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో 24 మంది వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ ఆ స్థాయిలో వైద్యుల్లేరు. చిన్నారుల మరణాలునియంత్రించేందుకే... ఐదేళ్లలోపు సంభవిస్తున్న మరణాలు నియంత్రించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మెప్మా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటారు. వారిచ్చే నివేదిక ఆధారంగా సదరు చిన్నారులకు వైద్యులు సేవలందిస్తారు. మందులు ఎలా వాడాలో తల్లులకు తెలియజేస్తారు. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. – చెంచయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాకినాడ -
క్షణ క్షణం..క్షోభ
గుండె మార్పిడికి వచ్చిన దరఖాస్తులు 25 ఒక్కోఆపరేషన్కు ఖర్చు రూ.25 లక్షలు సీఎం ఒక్కో ఆపరేషన్‌కు ఇస్తానన్న నిధులు రూ.15 లక్షలు సృహృదయ ట్రస్ట్ ద్వారా జరిగిన ఆపరేషన్లు 450 ‘గుండె జబ్బు.. ప్రాణాంతకమైన రుగ్మత.. గుండె మార్పిడి తప్పనిసరి.. దిన దిన గండం.. ఇప్పుడా? అప్పుడా? అన్నట్లు ఆపరేషన్.. కనికరించని ప్రభుత్వం..’ ఇదీ బాధితుల క్షోభ..! చెప్పలేనంత బాధ ‘గుండె’ల్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు దీనులు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆపరేషన్‌కు సాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ నీటి మూటగా మిగలడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధులిస్తే ఆపరేషన్ చేస్తామని ముందుకు వచ్చిన ‘సహృదయ’ ట్రస్ట్‌కు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దీంతో ఏడాది నుంచి 25 మంది బాధితులు గుండెను గుప్పెట్లో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఉన్న గుండె వైద్య విభాగంలో గతంలో గుండె రోగులకు కేవలం యాంజియోగ్రామ్, స్టంట్లు మాత్రం వేసేవారు. ఒక్క బైపాస్ సర్జరీ కూడా చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే చదువుకున్న ఊరుకు సేవ చేయాలనే లక్ష్యంతో సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం 2015 మార్చిలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2015 మార్చి 18న మొట్టమొదటి బైపాస్ సర్జరీ చేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు సుమారు 450 ఓపెన్ హార్ట్ సర్జరీలు నిరుపేదలకు ఉచితంగా నిర్వహించారు. అంతటితో ఆగకుండా 2016 మే 20న గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు గుండె మార్పిడి ఆపరేషన్ చేసి జాతీయ స్థాయిలో జీజీహెచ్ ప్రతిష్ట పెంచారు. జాతీయ స్థాయిలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసిన ఐదో ప్రభుత్వ ఆసుపత్రిగా జీజీహెచ్ రికార్డు సృష్టించేలా చేశారు. 2017 జనవరి 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 50 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్‌ను నిలిపారు. నీటి మూటగా హామీ.. ఏడాది నుంచి జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తే ఆపరేషన్లు నిర్వహించేందుకు సహృదయ ట్రస్టు ముందుకు వచ్చింది. అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రెండేళ్ల క్రితం ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కానీ.. హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. జీజీహెచ్‌లో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి మంజూరు కాలేదు.. జీజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్స విభాగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండె మార్పిడి ఆపరేషన్, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ గోఖలే బృందాన్ని అభినందించిన సందర్భంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ. 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు మరిన్ని జరుగుతాయని అంతా ఆశించారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం సుమారు 25 మంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకుని ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఆపరేషన్లు జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క రూపాయి మంజూరు కాలేదు. మార్చి 18వ తేదీతో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ముగుస్తున్న నేపథ్యంలో సహృదయ ట్రస్టు తిరిగి తన సేవలను కొనసాగిస్తుందా? లేక ప్రభుత్వ, వైద్య విద్యాధికారుల సహకారం కొరవడిందని విరమించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వ ప్రచార ఆర్భాటం ఇదీ..! ఆపరేషన్ చేయించుకున్న ఏడుకొండలు(ఫైల్ ఫోటో) సీఎం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయనప్పటికీ మొట్టమొదట గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఉప్పు ఏడుకొండలు కేస్ స్టడీని ఎన్టీఆర్ వైద్య సేవ అధికారిక వెబ్సైట్లో పెట్టి కేవలం ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తనకు ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసిందని, కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఏడుకొండలు మాట్లాడిన విషయాలను ఇందులో పేర్కొనడం విశేషం. డబ్బులు మంజూరు చేయకుండా, ప్రచార ఆర్భాటాలకు మాత్రం వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అధికారిక వెబ్సైట్లో ఏడుకొండలుకు జరిగిన ఆపరేషన్ వివరాలు నమోదు చేసిన దృశ్యం -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం!
సాక్షి, గుంటూరు/ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఎం.జోషిబాబుకు ఈ నెల 12న జరిగిన ఓ ప్రమాదంలో కుడిచేయి నుజ్జునుజ్జయింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేతి వేళ్లు పూర్తిగా దెబ్బతినడంతో బుధవారం సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే ఆపరేషన్ మధ్యలో ఉండగా హ్యాండ్ డ్రిల్ మిషన్ పనిచేయలేదు. దీంతో వెంటనే అతడిని ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. సరిగ్గా గత బుధవారం కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. పల్నాడు ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన వెంకమ్మకు రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నెల 7న ఎస్ఓటీలో శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ మధ్యలో ఉన్న సమయంలో ఓటీ లైట్లు ఆరిపోయాయి. దీంతో వైద్యులు సెల్‌ఫోన్ లైట్ల మధ్య ఆపరేషన్ పూర్తి చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని ఎస్ఓటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలు రోగులను, వారి కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం జీజీహెచ్‌లోని చిన్న పిల్లల శస్త్రచికిత్స వైద్య విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న ఓ పసికందును ఎలుకలు కొరికి చంపిన సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జీజీహెచ్‌ను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు హడావుడి చేశారు. ఆ తర్వాత షరామామూలే. జీజీహెచ్‌లో జరిగే ఆపరేషన్ల వల్ల ఆరోగ్యశ్రీ ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తున్నా ఆపరేషన్ థియేటర్లలో వైద్య పరికరాలు, వసతుల కల్పనను మాత్రం ఆస్పత్రి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకవేళ నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్లు నాణ్యత లేని వైద్య పరికరాలు సరఫరా చేస్తుండడంతో అవి ఆపరేషన్ల మధ్యలో మొరాయిస్తున్నాయి. థియేటర్లు లేక నిలిచిన ఆపరేషన్లు జీజీహెచ్‌లోని ఎస్ఓటీలలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయంటూ వైద్యులు ఆస్పత్రి అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేసి ఆపరేషన్లు నిలిపివేశారు. మూడు పర్యాయాలు ఆపరేషన్లు నిలిపివేయడంతో అధికారులు మరమ్మతుల కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. మరమ్మతులు పూర్తయినా సరిపడా వైద్య పరికరాలు లేకపోవడంతో తాజాగా బుధవారం శస్త్రచికిత్స నిలిచిపోయింది. ఎస్ఓటీలో ముఖ్యమైన వైద్య పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోందంటూ వైద్య సిబ్బంది వాపోతున్నారు. న్యూరోసర్జరీ వైద్య విభాగంలో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారికి తగ్గట్టుగా ఆపరేషన్ థియేటర్లు లేక పలుమార్లు ఆపరేషన్లు వాయిదా పడుతున్నాయి. ఆర్థోపెడిక్ వైద్య విభాగానికి ప్రత్యేకంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు థియేటర్ కేటాయించకపోవడం వల్ల ఏడాది పాటు ఆపరేషన్లు నిలిచిపోయాయి. అత్యంత ఖరీదైన కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకూ ప్రత్యేకంగా థియేటర్ కేటాయించకపోవడంతో ఆర్నెల్లుగా ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక ఎంతోమంది పేదలు జీజీహెచ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జీజీహెచ్ ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం వల్లే జీజీహెచ్‌లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన మండిపడ్డారు. గతంలో ఆస్పత్రిలో ఎలుకలు చిన్నారిపై దాడి చేశాయని, పాములు కూడా వచ్చాయని ఆయన మండిపడ్డారు. సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ముస్తఫా బైఠాయించిన నిరసన తెలిపారు. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు టార్చ్‌లైట్ వెలుగులో ఆపరేషన్లు చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మరోవైపు వీడియో ఎలా బయటకు వచ్చింది, ఎవరు తీశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా గత మూడు నెలలుగా సెల్‌ఫోన్, టార్చ్లైట్ల వెలుగులోనే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. -
స్వచ్ఛ ఆసుపత్రి దిశగా... జీజీహెచ్
పరిసరాల పరిశుభ్రత కోసం డస్ట్ బిన్నులు, ఉమ్మి తొట్టెల ఏర్పాటు కాకినాడ వైద్యం: పరిసరాల పరిశుభ్రత ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న జాతిపిత మహ్మత్మాగాంధీ ఆశయ సాధన కోసం జీజీహెచ్ సూపరింటెండెంట్ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆసుపత్రికి వచ్చే రోగులు, సహాయకులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకున్నారు. . పరిసరాల పరిశుభ్రత కోసం చర్యలు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందేందుకు జిల్లా నలుమూలల నుంచే కాక ఉభయ గోదావరి జిల్లాల నుంచి తరలి వస్తూంటారు. నిత్యం ఇక్కడ వైద్యసేవల కోసం సుమారు 3 వేలు దాకా రోగులు వస్తూంటారు. ఆసుపత్రిలో అధికారికంగా ఉన్న 1065 బెడ్లకు 1,800 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఉపయోగించే మందులు, మాస్క్‌లు, గ్లౌజులు, క్లాత్, ఐవీలు,టాబ్లెట్ల స్టిప్పులు, ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్న రోగులు వాడి పారేసిన చెత్త, వ్యర్థాలు కలిపి రోజుకి సుమారు 3 టన్నుల వరకూ చేరుతున్నట్టు శానిటేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి నిల్వ కోసం ఆసుపత్రి డంపింగ్ యార్డు ఆవరణలో కాకినాడ నగరపాలక సంస్థ రెండు డంపర్లను ఏర్పాటు చేసింది. ఆసుపత్రి పరిసరాల్లో రోజురోజుకీ పెరిగిపోతుండడంతో రోగులు మరింత అనారోగ్యాలకు గురవుతారనే ఉద్దేశంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు పలు ప్రధానమైన వార్డుల బయట డస్ట్ బిన్నులు, ఉమ్మి తొట్టెలను ఏర్పాటు చేయించారు. రోగులతోపాట వస్తున్న రోగుల సహాయకులు చెత్త బుట్టల్లోనే వ్యర్థాలు వేయాలని, ఎక్కడపడితే అక్కడ ఉమ్మి ఉమ్మరాదని, అలా చేయడం వల్ల గాలి ద్వారా వైరస్ సోకి మరింత మంది అనారోగ్యాలకు గురవుతారని అవగాహన కల్పిస్తున్నారు. . పరిసరాల పరిశుభ్రతకు దోహదం ఆసుపత్రి ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేసిన తొట్టెలు పరిసరాల పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడుతుంది. ఆసుపత్రికొచ్చే రోగులు, సహాయకులు చెత్తా, వ్యర్థాలను బయట వేయకూడదు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ సామాజిక బాధ్యతతో సహకరించాలి. - పలివెల వీరబాబు, సీపీఎం నగర కార్యదర్శి,కాకినాడ . అందుబాటులో ఏర్పాటు చేశారు చెత్తా, వ్యర్థాలు వేసేందుకు అందుబాటులో డస్ట్ బిన్నులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉమ్మితొట్టెల ఏర్పాటు చేయడం మంచి పరిణామం. - జి.దుర్గాప్రసాద్ ,ప్రతాప్‌నగర్ . స్వచ్ఛాసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు కాకినాడ ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ సహకారంతో స్వచ్ఛాసుపత్రిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు, అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలపై రోగులు, సహాయకులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నా. - డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్ . -
జీజీహెచ్‌లో మెరుగైన వైద్యం
కోమాలో ఉన్న మహిళకు స్వస్థత కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : హైబీపీ, తీవ్ర జ్వరంతో అస్వçస్థతకు గురై కోమాలో ఉన్న ఒక వివాహితకు స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యులు సకాలంలో వైద్యం చేసి ఆమె ప్రాణదానం చేశారు. విషమ పరిస్థితిలో అత్యవసర చికిత్స కోసం రూ.3 లక్షల వరకూ ఖర్చవుతుందని ప్రైవేటు వైద్యులు చెప్పడంతో.. ఆర్థికస్తోమతు లేక జీజీహెచ్‌లో భార్యను చేర్చిన భర్త ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. పిఠాపురానికి చెందిన 40 ఏళ్ల దాశెట్టి లక్ష్మి ఈ నెల 21న హైబీపీ, తీవ్రమైన జ్వరంతో కోమాలోకి వెళ్లిపోయింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఏమీ చెప్పలేమని, రూ.3 లక్షల దాకా ఖర్చు అవుతుందని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యులు భర్త సత్యనారాయణకు చెప్పారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించే తాను అంత ఖర్చు భరించలేనంటూ ఆమెను ఈ నెల 23న కాకినాడ జీజీహెచ్‌లోని మెడికల్ విభాగంలోకి చేర్చాడు. ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్న రోగికి మెడికల్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీవీ సత్యనారాయణ వెంటిలేటర్‌పై తక్షణ చికిత్స ప్రారంభించారు. ఆదివారం ఆయన ఆస్పత్రిలోనే ఉండి ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ చేశారు. 72 గంటల తర్వాత ఆమె యథాస్థితికి చేరుకుంది. ఈ వివరాలను గురువారం ఆయన విలేకరులకు వివరించారు. జీజీహెచ్‌లో నాణ్యమైన వైద్యులు అందుబాటులో ఉన్నారని, వెంటిలేటర్లు మరిన్ని అందుబాటులో ఉంటే ప్రాణపాయంలో ఉన్న నిరుపేదలకు పునర్జన్మను ప్రసాదించవచ్చన్నారు. మెడిసి¯ŒS హెచ్ఓడీ డాక్టర్ తిరుమలరావు పర్యవేక్షణలో రోగికి వైద్యసేవలు అందించినట్టు చెప్పారు. భార్యకు ప్రాణదానం చేసిన వైద్యులకు ఆమె భర్త కృతజ్ఞతలు తెలిపారు. -
జీజీహెచ్‌లో వైద్యుల బాహాబాహీ
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ) : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య సాగుతోన్న ఆధిపత్య పోరు సోమవారం బాహాబాహీకి దారితీసింది. తొండంగి మండలం నుంచి పాముకాటుకు గురైన యనమల తాతారావును ఈ నెల7న జీజీహెచ్‌కు బంధువులు తీసుకొచ్చారు. మెడికల్ వార్డులోని ఏఎంసీలో వెంటిలేటర్లో ఉంచి ఇతడిని వైద్యం ఆర్ఎంఓ డాక్టర్ సుధీర్ అందించారు. తనకు చెప్పకుండా రోగిని ఈ వార్డులోకి చేర్చడంపై ఆర్ఎంఓ సుధీర్‌ను ఆ యూనిట్ విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణ నిలదీశారు. దీంతో సోమవారం ఉదయం సూపరింటెండెంట్ చాంబర్లో పంచాయితీ పెట్టారు. వివరణ ఇస్తున్న క్రమంలో ఆర్ఎంఓతో డాక్టర్ సత్యనారాయణ వాగ్వాదానికి దిగారు. ఆర్‌ఎంఓపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ బాహాబాహీకి దిగారు. పరుష పదజాలంతో దూషించి దాడికి యత్నించినట్టు డాక్టర్ సత్యనారాయణపై స్థానిక వ¯ŒS టౌ¯ŒS పోలీస్‌స్టేష¯ŒS సీఐ ఏఎస్ రావుకి ఫిర్యాదు చేసినట్టు ఆర్ఎంఓ తెలిపారు. ఆర్ఎంఓగా బాధ్యతలు తీసుకునే ముందు తన గదికి తాళం వేసినట్టు ఆయన తెలిపారు. ఈ విషయమంపై కలెక్టర్, ఆస్పత్రి చైర్మ¯ŒS అరుణ్‌కుమార్‌కి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
అత్యవసర వేళల్లో సత్వరసేవలకు చర్యలు
-పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం -జీజీహెచ్ కొత్త సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు కాకినాడ వైద్యం : ప్రాణాపాయస్థితిలో అత్యవసర విభాగంలోకి వచ్చే క్షతగాత్రులు, రోగులకు సత్వర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు తెలిపారు. బుధవారం ఆయన జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వై.నాగేశ్వరరావు నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర విభాగంలో ఎమ్మెల్సీ, నాన్ ఎమ్మెల్సీ వార్డుల్లో షిఫ్టుకి ప్రస్తుతమున్న ఒక్క సీఎంవోలకు బదులు ఇద్దరు సీఎంవోలను నియమించనున్నట్లు తెలిపారు. జీజీహెచ్‌లో వైద్యసేవలు పొందేందుకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖజిల్లా సరిహద్దు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. ఇక్కడకు నూటికి 80 మంది నిరుపేదలే వస్తారని, వీరికి కాలయాపన లేకుండా, సకాలంలో నాణ్యమైన వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటున్నటు తెలిపారు. రోగ నిర్ధారణ పరీక్షల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామని, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించకపోయినా, సకాలంలో రిపోర్టులు ఇవ్వకపోయినా సిబ్బందిని ఎంత మాత్రం ఉపేక్షించబోమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం, సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది, విభాగాధిపతులతో సమన్వయం చేసుకుంటూ ఆసుపత్రి అభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్‌లో వైద్యసేవలు అందించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటానన్నారు. పారిశుద్ధ్య సక్రమ నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, పలువురు వైద్య విభాగాధిపతులు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీలు, హౌస్ సర్జన్లు డాక్టర్ రాఘవేంద్రరావును కలసి, పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. పలు వార్డుల తనిఖీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రాఘవేంద్రరావు నేరుగా ఈఎన్టీ వార్డు, ఆప్తాల్మాలజీ పైన ఏర్పాటు చేసిన స్వైన్‌ప్లూ వార్డును సందర్శించారు. వెంటిలేటర్లు, మాస్క్‌లు, మందులు, పరికరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం అత్యవసర విభాగాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడిసిన్, సర్జికల్, టీబీ వార్డులను, మాతా,శిశు విభాగంలోని లేబర్ రూమ్‌లను సందర్శించారు. చిన్నారుల సంరక్షణపై సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సక్రమ పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. -
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
ఎండోస్కోపిక్ సర్జరీతో నాలుగు నెలల చిన్నారికి మెదడులోని నీరు తొలగింపు కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ): పుట్టుకతో మెదడులో సంభవించిన జన్యుపరలోపంతో బాధపడుతున్న నాలుగు నెలల చిన్నారికి గంట స్వల్ప వ్యవధిలో కాకినాడ జీజీహెచ్ న్యూరోసర్జన్లు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. మెదడుకు నీరు పట్టడంతో తల సైజు పెరిగిపోవడం, తలను నిలబెట్టలేకపోవడం వంటి రుగ్మతలతో సతమతమవుతున్న చిన్నారికి ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమి (ఈటీవీ) విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స చేశారు. మెదడులోని నీరు తొలగించారు. ఈ వివరాలను కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఎం.ప్రేమ్‌జిత్ రే మంగళవారం విలేకరులకు వెల్లడించారు. మలికిపురం గ్రామానికి చెందిన రాపాక నాగరాజు, కనకదుర్గ దంపతులకు తొలి కాన్పులో నాలుగు నెలల కిందట పాప జన్మించింది. ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ చేశారు. పాప పుట్టినప్పటి నుంచి తల సైజు పెరగటం, తల నిలబెట్టలేకపోవడం, ఆకలి మందగించడం, తలతిరగటం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గుర్తించి పలువురు వైద్యులకు చూపించారు. చిన్నారికి మైక్రోస్కోపిక్ స్టంట్స్ ద్వారా పైపులు వేయాలని, రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్ అని, ఇందుకు చాలా ఖర్చవుతుందని చెప్పడంతో ఆర్థిక స్తోమత లేని వీరు తమ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి 2వ తేదీన చేర్పించారు. చిన్నారిని పరీక్షించిన న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌జిత్ రే ఎండో స్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులాస్టమీ (ఈటీవీ) ఆధునిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స నిర్వహించారు. మార్చి 18న మైక్రోస్కోపిక్ స్టంట్స్ ద్వారా తలకు ఎటువంటి పైపులు వేయకుండా, ఎండోస్కోపిక్ సర్జరీతో కేవలం గంట వ్యవధిలో నీటిని తొలగించారు. ఎండోస్కోపిక్ సర్జరీని చిన్నారికి జీజీహెచ్‌లో నిర్వహించడం ఇదే తొలిసారని విభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌జిత్ రే తెలిపారు. పదిరోజుల తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారిని డిశ్చార్జి చేసినట్టు తెలిపారు. శస్త్రచికిత్సలో తనతో పాటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరి, మత్తు వైద్యులతో పాటూ పీజీ వైద్యులు పాల్గొన్నట్టు తెలిపారు. ఆపరేషన్‌కు రూ.2 లక్షలు ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు తెలపడంతో నిరుపేదలమైన తాము చిన్నారి జీవితంపై ఆశ వదులుకున్నామన్నారు. అలాంటి దశలో జీజీహెచ్ వైద్యులు ఉచితంగా వైద్యం చేశారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
జీజీహెచ్‌కు, డాక్టర్‌కు ఫోరం వడ్డింపు
చికిత్స సరిగా చేయలేదని ఆశ్రయించిన ఫిర్యాదుదారుకు రూ.4 లక్షల 7వేలు చెల్లించాలని తీర్పు గుంటూరు లీగల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, వైద్యుడు కలసి ఫిర్యాదుదారుకు రూ. 4లక్షల 7వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం బుధవారం తీర్పు చెప్పింది. వివరాలు.... గుంటూరు నగరంలోని కొరిటెపాడుకు చెందిన తులసి శివనాగేశ్వరరావు పత్తి వ్యాపారం చేస్తుంటారు. శివనాగేశ్వరరావు 2010 సెప్టెంబర్ 2న గుడివాడలో రాత్రి 10గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన కాలు ఎముకలు విరగటంతో బంధువులు 3వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అదే నెల 14న డాక్టర్ ఎం. ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి రాడ్లు అమర్చారు. చికిత్స అనంతరం నవంబర్ 14న శివనాగేశ్వరరావును డిశ్చార్జి చేశారు. ఆరు నెలలు గడచినప్పటికీ నొప్పి తగ్గక పోవడం, కాలు వాపు వస్తుండటంతో తిరిగి ప్రభుత్వ సమగ్ర అస్పత్రికి రాగా 2011 మే 26న తిరిగి ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేసి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చి జూన్ 9న డిశ్చార్జి చేశారు. అయినా సమస్య తగ్గక పోగా ఆయన పక్షవాతానికి గురయ్యారు. దీంతో 2011అక్టోబర్ 24న ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యుడు పరిశీలించి రాడ్స్ సరిగా అమర్చలేదని, అందుకే సమస్య వచ్చిందని ఆపరేషన్ చేసి అవి సరిచేయాలని చెప్పి మరలా ఆపరేషన్ నిర్వహించారు. ఎన్ఆర్ఐలో ఆపరేషన్ చేసినా ఫలితం లేక పోవడంతో మరో ఎముకల డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన కూడా రాడ్స్ సరిగా అమర్చనందున సమస్య ఏర్పడిందని మరలా ఆపరేషన్ చేయాలని తెలిపారు. అప్పటికే శివనాగేశ్వరరావుకు సుమారు రూ.90వేలు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కాలు సరికాలేదని ఆరోపిస్తూ, ఈ కాలంలో తాను ఆదాయం కూడా కోల్పోయానని పేర్కొంటూ జిల్లా వినియోగ దారుల ఫోరంను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించి...ఫిర్యాదు దారు ఆదాయం నష్టపోయినందుకు రూ. 3లక్షలు, మానసిక వేదనకు రూ. లక్ష, వివిధ ఖర్చుల కింద మరో రూ. 7వేలు ఆరువారాలలో చెల్లించాలని ఫోరం అధ్యక్షుడు బి. రామారావు, సభ్యులు ఎ. ప్రభాకర గుప్త, టి. సునీతలతో కూడిన బెంచి తీర్పు చెప్పింది. -
గుంటూరు జీజీహెచ్‌లో నూతన అధ్యాయం
* బుధవారం ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు * రాష్ట్రంలో తొలి ఆస్పత్రిగా రికార్డు గుంటూరు మెడికల్ : కొత్త సంవత్సరంలో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర రాజధాని ఆస్పత్రిగా అవతరించిన జీజీహెచ్‌లో ఈ నెల మూడో తేదీ బుధవారం నాడు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నారు. సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు నిర్వాహకుడు, గుండె మార్పిడి ఆపరేషన్ వైద్య నిపుణుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నారు. ఈ చిన్నారులకే... పొన్నూరు మండలం నండూరుకు చెందిన వాసుబాబు, లావణ్య మూడున్నరేళ్ల కుమారుడు రాచూరి చరణాదిత్య, గుంటూరు జన్మభూమినగర్‌కు చెందిన ముత్యంశెట్టి దుర్గారావు, శ్రీదేవి దంపతుల మూడున్నరేళ్ల కుమార్తె భావనకు బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఈ ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఒక్కో ఆపరేషన్ చేసేందుకు నాలుగు గంటలు సమయం పడుతుంది. సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో మొట్టమొదటిసారిగా 2015 మార్చిలో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు (బైపాస్ సర్జరీలు) ప్రారంభమయ్యాయి. 2016 మేలో ఇద్దరికి గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. తాజాగా 2017లో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు ప్రారంభమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోనే గుండె ఆపరేషన్లు నిర్వహించే మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర సృష్టించనుంది. ఏడాదికి సరిపడా నిధులు సమకూర్చాం : గోఖలే చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేసేందుకు ఏడాదికి సరిపడా నిధులు సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూర్చినట్లు ట్రస్టు నిర్వాహకుడు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గత ఏడాది పెద్దవాళ్లకు ఆపరేషన్ చేసే సమయంలో రూ.12 లక్షలు విరాళాలు సేకరించి తమకు అందజేశారని, నేడు పిల్లలకు సైతం రూ.12 లక్షలు విరాళం అందించారని చెప్పారు. వసుధ ఫౌండేషన్, నాట్కో ఫార్మా సంస్థ, తన సోదరి అరుణ, ఇతర దాతలు పెద్ద మనస్సుతో ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందజేశారని వివరించారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు సహాయం చేసిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల గుండె ఆపరేషన్ల ప్రక్రియలో 11 మంది పాల్గొంటున్నారని, వారిలో ఐదుగురు మత్తు వైద్యులు, ఆరుగురు సర్జన్లు ఉన్నారని వెల్లడించారు. తనతోపాటు హైదరాబాద్‌లో పనిచేసిన పిల్లల గుండె ఆపరేషన్ల వైద్య నిపుణుడు డాక్టర్ దమరసింగ్ వెంకటరమణ సేవాభావంతో ముందుకు వచ్చి జీజీహెచ్‌లో ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన తక్కువగా ఉందని, పిల్లలు పుట్టిన వెంటనే ఎకో పరీక్ష చేయించడం ద్వారా గుండె జబ్బులను త్వరతిగతిన నిర్ధారించవచ్చని చెప్పారు. -
జీజీహెచ్‌లో చిన్నారులకు గుండె ఆపరేషన్లు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో వచ్చే నెల నుంచి చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో 300 మందికి గుండె ఆపరేషన్లు, రెండు గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా చేశామన్నారు. కొత్త సంవత్సరంలో డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృంద సభ్యులు ఆపరేషన్లు చేస్తారన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల్లో భాగంగా ఉచితంగా ఆపరేషన్లు చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులకు పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు, రక్తనాళాల అమరికలో మార్పులకు ఆపరేషన్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసే సౌకర్యం లేదని, తామే మొట్టమొదటి సారిగా ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వంతో పాటు, వసుధ ఫౌండేషన్, నాట్కో సంస్థలు వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు విరాళం అందించాయన్నారు. వాటి సహకారం మరువలేనిదన్నారు. ఈ నెల 31న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆపరేషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. -
బాలుడి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్
* అరుదైన వ్యాధికి మెరుగైన చికిత్స * జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ యశోధర గుంటూరు మెడికల్: చాలా అరుదుగా సంభవించే వ్యాధికి గురైన పిల్లవాడికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడినట్లు జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్, పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెనుగొండ యశోధర చెప్పారు. పిల్లవాడి ఆరోగ్యం కుదుట పడటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు మంగళవారం మీడియాకు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఎనిదేళ్ల దోసూరి బాలవెంకటేష్ గత నెలలో జ్వరం సోకి స్థానిక ఆస్పత్రిలో చేరాడు. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న తర్వాత జ్వరం తగ్గడంతో బాలవెంకటేష్‌ను ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన కొద్ది రోజులకే జ్వరం వచ్చి కాళ్లు, చేతులు పక్షవాతం వచ్చిన వారికి మాదిరిగా తయారై మాట తబడుతుండటంతో తల్లిదండ్రులు నాగమణి, చంద్రయ్య స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, తామేం చేయలేమని అక్కడి వైద్యులు చేతులెత్తేసినట్లు చెప్పారు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని తీసుకుని నవంబర్ 23వ తేదీన గుంటూరు జీజీహెచ్‌కు వచ్చినట్లు తెలిపారు. పిల్లల వైద్యులు పరీక్షలు చేసి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వ్యాధి ఉన్నట్లుగా నిర్థారించారు. పదివేల మంది చిన్నారుల్లో ఒక్కరికి ఇలాంటి వ్యాధి సోకుతుందని డాక్టర్ యశోధర చెప్పారు. వ్యాధితో పాటుగా పిల్లవాడు శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స అందించి దాంతో పాటు ఇమ్యూనోగ్లోబిన్ ఇవ్వడం ద్వారా పిల్లవాడి ప్రాణాలు నిలిచినట్లు తెలిపారు. సుమారు రూ.మూడు లక్షల ఖరీదుచేసే వైద్య సేవలను ఆస్పత్రిలో ఉచితంగా అందించినట్లు తెలిపారు. జీజీహెచ్‌లో కార్పొరేట్ ఆస్పత్రులకు తగ్గట్టుగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె వివరించారు. -
బోధన అంటే బాధ ఎందుకో?
‘ అన్ని వైద్య విభాగాల్లో మధ్యాహ్నం రెండు గంటలపాటు పీజీ వైద్యులకు బోధన జరిగేలా చూడాలి’ – ఇటీవల జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బోధనతీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) చేసిన హెచ్చరిక ఇది. అయితే ఈ హెచ్చరికను జీజీహెచ్ బోధనా సిబ్బంది బేఖాతరు చేస్తూ మా ‘పని’ మాదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో వైద్య విద్యార్థులకు బోధన చేయాల్సిన బోధనా సిబ్బంది తమ తీరు మార్చుకోవడం లేదు. క్రమం తప్పకుండా క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత వీరిపై ఉన్నప్పటికీ తమ సొంత ఆస్పత్రుల్లో ప్రైవేటు ప్రాక్టీస్‌లకు ఇస్తున్న ప్రాధాన్యత బోధనకు ఇవ్వడం లేదు. మధ్యాహ్నానికే ఇళ్లకు.. జీజీహెచ్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నానికే ఆస్పత్రి నుంచి వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ, రోగులకు వైద్య సేవలు అందించి మధ్యాహ్నం గంట సేపు భోజన విరామం తరువాత 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య విద్యార్థులకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జీజీహెచ్‌లో మాత్రం ఒకటి, రెండు వైద్య విభాగాల్లో తప్ప మిగతా విభాగాల్లో ఎక్కడా బోధన చేస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రొఫెసర్ వేధింపుల వల్ల పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈకేసులో నిందితురాలిగా ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి ప్రస్తుతం రిమాండ్‌లోనే ఉన్నారు. ఇంత జరిగినా జీజీహెచ్‌లో పనిచేసే వైద్యులకు చీమ కుట్టినట్లయినా లేదనే విమర్శలు వస్తున్నాయి. జీజీహెచ్‌లోని వివిధ వైద్య విభాగాల్లో జరుగుతున్న బోధన, ఇతర అంశాలపై దృష్టి సారించాల్సిన వైద్య అధికారులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో బోధనా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జీజీహెచ్‌లో కొద్దిమంది ప్రొఫెసర్లు మినహా మిగతా వారంతా సొంత క్లీనిక్‌లు నడుపుతూ ప్రైవేటు ప్రాక్టీస్‌లు చేసుకుంటున్నారు. దీనిపై గతంలో విజిలె¯Œ్స నివేదిక ఆధారంగా 19 మందికి ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ వీరి తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాకపోవడం శోచనీయం. డీఎంఈ తనిఖీల్లో బయటపడ్డ నిర్వాకం.. ఇటీవల గుంటూరు జీజీహెచ్‌లోని పలు వైద్య విభాగాలలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో డీఎంఈ డాక్టర్ సుబ్బారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. ఆ సమయంలో ప్రతి వైద్య విభాగంలో వైద్య బోధన జరగాల్సి ఉండగా రెండు, మూడు విభాగాల్లో మినహా మిగతా విభాగాల్లో జరగడం లేదన్న విషయాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కనీసం జీజీహెచ్‌లో కూడా లేకుండా బయటకు వెళ్ళి ప్రైవేటు ప్రాక్టీసులు చేసుకుంటున్నట్లు గుర్తించారు. దీనిపై డీఎమ్ఈ ఇలాగైతే వైద్య విద్యార్థులతో సత్సంబంధాలు ఎలా మెరుగుపడతాయంటూ సిబ్బందిపై మండిపడ్డారు. బాధ్యతగా ఉండాలని అధికారులను ఆదేశించారు. డీఎమ్ఈ తనిఖీకి వచ్చిన మరుసటి రోజు నుంచి షరా మామూలుగానే వైద్యులంతా మధ్యాహ్నానికే ఇంటిబాట పడుతుండటం కనిపించింది. జీజీహెచ్ ఉన్నతాధికారులు ఇప్పటిౖకెనా దృష్టి సారించి సాయంత్రం 4 గంటల వరకూ వైద్యులు జీజీహెచ్‌లో ఉండేలా చూస్తే అటు వైద్య విద్యార్థులకు, రోగులకు మేలు జరుగుతుందని పలువురు అంటున్నారు. -
నకిలీ ఉద్యోగులు దొరికిపోయారు..!
* బుధవారం దొరికిన ఇద్దరు మహిళలు * బయోమెట్రిక్ ఉన్నా ఈ పరిస్థితేంటో.. * ఉద్యోగం చేయకపోయినా జీతాలు ఇస్తున్న వైనం గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోజురోజుకు నకిలీ ఉద్యోగుల లీలలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులు ప్రతి నెలా వేల రూపాయల జీతాలు తీసుకుంటూ విధులకు హాజరు కావడం లేదు. తమ బదులుగా మరొకరిని ఉద్యోగంలో పెట్టి సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. నకిలీ ఉద్యోగులు విధుల్లో ఉంటున్నా సంబంధిత అధికారులు తనిఖీలు చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 11న ఓ ఉద్యోగి తనకు బదులుగా మరొకరితో ఉద్యోగం చేయిస్తూ పట్టుబడగా తాజాగా బుధవారం ఇద్దరు మహిళా ఉద్యోగినులు తమ బదులుగా మరొకరితో ఉద్యోగం చేయిస్తూ ఆస్పత్రి అధికారులకు దొరికిపోయారు. ఏటీఅగ్రహారానికి చెందిన రాములమ్మ జీజీహెచ్‌లో నాల్గో తరగతి ఉద్యోగినిగా (స్వీపర్)గా పనిచేస్తోంది. ఆమె పది నెలలుగా విధులకు హాజరు కాకుండా తన బదులుగా శారద కాలనీ పదో లైనుకు చెందిన అన్నపూర్ణకు నెలకు రూ.5 వేలు ఇచ్చి తన ఉద్యోగాన్ని చేయిస్తోంది. రామిశెట్టి దుర్గాదేవి జీజీహెచ్‌లో నాల్గో తరగతి ఉద్యోగిగా (ఎఫ్ఎన్ఓ)గా పనిచేస్తూ విధులకు హాజరు కాకుండా తనకు బదులుగా పసుపులేటి ప్రశాంతితో ఉద్యోగం చేయిస్తోంది. ఈ నెల 11న దుర్గం శివయ్య తనకు బదులుగా మరొకరితో ఉద్యోగం చేయిస్తూ పట్టుబడడంతో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్ నకిలీ ఉద్యోగులపై దృష్టి సారించారు. బుధవారం విధులకు హాజరవుతున్న ఉద్యోగులను ఆరా తీయగా పసుపులేటి ప్రశాంతి, అన్నపూర్ణ నకిలీ ఉద్యోగులుగా విచారణలో తేలింది. దీంతో తక్షణమే వారిపై పోలీసులకు సమాచారం అందజేసి వారితో ఉద్యోగం చేయిస్తున్న రామిశెట్టి దుర్గాదేవి, రాములమ్మ గురించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. అధికారులకు తెలిసే జరుగుతోందా?.. జీజీహెచ్‌లో శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మొదులుకొని, కార్యాలయ ఉద్యోగులు, నర్సులు, నాల్గో తరగతి ఉద్యోగులు పారామెడికల్ ఉద్యోగులు, అధికారులు అందరికి కూడా బయోమెట్రిక్ విధానాన్ని రెండేళ్లుగా అమలు చేస్తున్నారు. అయితే బయోమెట్రిక్ ఉన్నా నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలో ఎలా పనిచేస్తున్నారన్నది విమర్శలకు తావిస్తోంది. అధికారులకు తెలిసే ఈ తంతు జరుగుతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రి ఉద్యోగా? బయటి వ్యక్తా? అనే విషయం ప్రతి రోజూ సంబంధిత అధికారుల వద్ద హాజరు పట్టీలో సంతకం పెట్టే సమయంలో లేదా బయోమెట్రిక్ వేసే సమయంలో అధికారులకు తెలుస్తుంది. ఏళ్ల తరబడి నకిలీ ఉద్యోగులు విధుల్లో ఉంటున్నా అసలు ఉద్యోగులు విధులకు రాకపోయినా వారికి జీతాలు ఎలా ఇస్తున్నారో అర్థం కావడం లేదు. అధికారుల అండదండలు ఉండటం వల్లే ఇలాంటి నకిలీ ఉద్యోగులు ఆస్పత్రిలో నిర్భయంగా పనిచేస్తున్నారంటూ పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే తరహాలో పలు వార్డుల్లో నకిలీ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు పలువురు ఆస్పత్రి ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఆస్పత్రి అధికారులు ఇప్పటికైనా స్పందించి నకిలీల భరతం పట్టి పరువు బజారున పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
కాకినాడ ప్రభుత్వాస్పత్రి రూటే సప‘రేట్’
బాబు పుడితే రూ.1200, పాప పుడితే రూ.800 సిబ్బంది అక్రమ వసూళ్లు ఆవేదన చెందుతున్న బాలింతల బంధువులు చోద్యం చూస్తున్న వైద్యాధికారులు కాకినాడ వైద్యం: ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు చెల్లించే స్తోమత లేక ప్రభుత్వాస్పత్రికి వస్తుంటే... ఇక్కడా దోపిడీ దందా సాగుతోందని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి ఇంటికెళ్లే దాకా ప్రతీ పనికి రోగుల నుంచి ముక్కుపిండి మరీ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందులో మాతా, శిశు విభాగంలో ప్రసవాల కోసం వచ్చిన వారికి బిడ్డకో రేటు పెట్టేశారు. మగబిడ్డకు రూ.1,200లు, ఆడబిడ్డకు రూ.700–800లు వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా, శిశు విభాగంలో పోస్ట్ గైనిక్, ప్రీ గైనిక్, లేబర్, ఎస్ఎల్ఆర్, జీఐసీ యూ వార్డులు ఉన్నాయి. ఇందులో ప్రసవాల కోసం సుమారు 180 దాకా పడకలు కేటాయించారు. వీటితో పాటూ ఎస్ఆర్ఎంటీ బ్లాక్‌లో అదనంగా మరో 60 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ గైనకాలజిస్ట్‌ల పర్యవేక్షణలో నెలకు 850–900 దాకా ప్రసవాలు జరుగుతుంటే ఇందులో 200 నుంచి 250 దాకా ఆపరేష¯ŒS లేకుండా నార్మల్ ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆధునిక వైద్య పరికరాలు, మెరుగైన వైద్య నిపుణులు ఉండటంతో ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల కోసం ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా విశాఖ జిల్లా నుంచి కూడా గర్భిణులు ఇక్కడికి వస్తుంటారు. ఫిక్సిడ్ రేట్లు ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి ఆపరేష¯ŒS థియేటర్లోకి వెళ్లి, ప్రస వం అయిన తర్వాత బెడ్ మీదకు తీసుకువచ్చే దాకా ప్రతీ పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. బెడ్ మీద నుంచి ఆపరేష¯ŒS థియేటర్‌కు తీసుకెళ్లేందుకు స్ట్రక్చర్‌కు రూ.100, చీర మార్చేందుకు రూ.200, వార్డు గదిని శుభ్రం చేసేందుకు రూ.50 వసూలు చేస్తున్నారని బాధితులు తెలిపారు. మగబిడ్డ పుడితే రూ.1,200, ఆడబిడ్డ జన్మిస్తే రూ.800 ఇవ్వాలని పట్టుబడుతున్నారని, పేదవాళ్లం అంత డబ్బు ఇచ్చుకోలేమని ప్రాథేయపడినా అంగీకరించడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ వసూళ్ల దందాపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.1200 వసూలు చేశారు నా భార్య ప్రసవం కోసం ఈ నెల 2న ఆస్పత్రిలో చేరింది. 3న మగబిడ్డ పుట్టాడు. ఆపరేష¯ŒS థియేటర్ సిబ్బంది మీకు బాబు పుట్టాడు, ఖర్చుల కోసం రూ.1,200 ఇవ్వాలని పట్టుబట్టారు. దూరప్రాంతం నుంచి వచ్చాం, అంత ఇచ్చుకోలేమని చెప్పినా వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సొమ్ము ఇచ్చాను. – ఆర్.రాఘవ, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా సిబ్బందిపై చర్యలు తప్పవు ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. రోగుల నుంచి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు. డబ్బుల కోసం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలి. ఈ విషయమై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటాం. – టి.ఎస్.ఆర్.మూర్తి, సీఎస్ఆర్ఎంఓ, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి -
కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్చల్
∙నిందితుడ్ని పట్టుకున్న హౌస్ సర్జ¯ŒS ∙పోలీసులకు అప్పగింత కాకినాడ వైద్యం : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ, వైద్యుల మధ్య సమన్వయం లోపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితు లు నెలకొన్నాయి. ముఖ్యంగా పిడియాట్రిక్ వార్డులో కొంత కాలంగా నకిలీ పీజీ వైద్యుడు తిరుగుతుంటే గుర్తు పట్టలేని మొద్దునిద్రలో ఆస్పత్రి పరిపాలనా విభాగం ఉంది. ఇదే వార్డులో అక్టోబర్ 27న రాజవొమ్మంగి మండలం కిండ్ర గామానికి చెందిన రెండు రోజుల పసికందు అపహరణకు గురవ్వడంతో అంతా ఉలిక్కిపడ్డారు. సీసీ కెమెరా పుటేజీతో నిందితురాలిని పోలీసులు పట్టుకుని పసిపాపను తల్లి ఒడికి చేర్చడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరణంలో శుక్రవారం ఆస్పత్రిలో నకిలీ పీజీ వైద్యుడి పట్టివేతతో మరోసారి ఆస్పత్రి వార్తల్లోకెక్కింది. గొప్ప కోసం నకిలీ పీజీ డాక్టర్‌గా అవతారం... తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం గంగవరం మండలం రాములదేవుపురం గ్రామానికి చెందిన ఇరవై ఆరేళ్ల ఎ¯ŒS.శివగోవింద్ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. చదువు అబ్బకపోవడంతో రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేసేవాడు. సొంత గ్రామంలో ఇతడిని అందరూ డాక్టర్ అని పిలవడంతో నిజంగా డాక్టర్‌లాగా మారాలనుకున్నాడు. తన గ్రామ పరిసరాల ప్రజలకు వైద్యుడిలా కనిపించేందుకు రూ.150లతో రాజమండ్రిలో ఓ స్టెతస్కోప్ కొన్నాడు. రోగులకు సహాయకుడిగా కాకినాడ ఆస్పత్రికి రావడం, వెళ్లడం చేస్తున్నాడు. పిడియాట్రిక్ విభాగంలో వైద్యులు, హౌస్ సర్జన్లు, పీజీ డాక్టర్లు లేని సమయాన్ని గుర్తించి, మెడలో స్టెతస్కోప్ వేసుకుని వార్డులో సంచరించేవాడు. రోగుల వద్దకెళ్లి రిపోర్టులు పరిశీలించి, అచ్చం వైద్యునిలాగా ప్రవర్తించేవాడు. ఇలా చాలా కాలం నుంచి కాకినాడ ఆస్పత్రిలో సంచరిస్తున్న శివగోవింద్ను పిడియాట్రిక్ వార్డులో హౌస్‌సర్జ¯ŒSగా పనిచేస్తున్న డాక్టర్ డి.శ్రీహరి గుర్తించారు. ఆస్పత్రిలోని సైకిల్‌స్టాండ్ వద్ద అతడ్ని పట్టుకుని నీవు ఏ వైద్య కళాశాల్లో ఎంబీబీఎస్ చేశావు, ఎక్కడ పీజీ చేస్తున్నావు, ఏ బ్యాచ్‌కు చెందినవాడంటూ నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే నిందితుడ్ని ఆస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవో మూర్తి వద్దకు తీసుకెళ్లి అప్పగించారు. అతడ్ని ప్రశ్నించగా తాను ఎవరికి వైద్యం చేయలేదని బదులిచ్చాడు. విచారణ అనంతరం నిందితుడ్ని కాకినాడ ఒకటో పట్టణ పోలీస్‌స్టేçÙ¯ŒSకి తరలించారు. తన గ్రామ పరిసర ప్రాంతాల్లో గిరిజనులందరూ తనను డాక్టరని పిలవడంతో, వారికి ఆస్పత్రిలో వైద్య సహాయం చేసేందుకే గొప్పకి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరుగుతున్నట్టు నిందితుడు విచారణలో చెప్పినట్టు సీఐ ఎ.ఎస్.రావు తెలిపారు. -
జీజీహెచ్‌లో జూడాల ఆందోళన ఉధృతం
ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసే వరకు ఆందోళన ఆపేది లేదన్న జూడాలు సాక్షి, గుంటూరు: పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారకురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. శుక్రవారం నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించి జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాని నినాదాలు చేశారు. మరోవైపు ప్రొఫెసర్ లక్ష్మి జాడ వారం నుంచి తెలియకపోవడంతో పోలీసులపై ఉన్నతాధికారుల ఒత్తిడి పెరుగుతోంది. జూడాలు అత్యవసర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు కూడా గంటపాటు వీరికి మద్దతుగా నిలవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం నుంచి పారా మెడికల్ సిబ్బంది కూడా జూడాలకు మద్దతు తెలియజేస్తామనడంతో జీజీహెచ్ ఉన్నతాధికారులు అప్రమత్తమై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ ఎస్పీ చర్చలు: గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు వేర్వేరుగా జూడాలతో సమావేశమై చర్చలు జరిపారు. అయినా జూడాలు సమ్మె విరమించేది లేదని, అత్యవసర వైద్య సేవలకు సైతం హాజరుకాబోమని తేల్చి చెప్పారు. వారి ఆందోళనకు వైఎస్సార్సీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మద్దతు తెలిపారు. -
'ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలి'
- జీజీహెచ్ లో డాక్టర్ల ధర్నా గుంటూరు మెడికల్: గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు జీజీహెచ్‌లో సూపరిండెంట్ చాంబర్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ప్రొఫెసర్ వేధింపుల వల్లే పీజీ సెకండియర్ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జూనియర్ డాక్టర్లను సముదాయిస్తున్నారు. కాగా గైనకాలజీ విభాగంలో పీజీ సెకండియర్ చదువుతున్న సంధ్యారాణి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందింది. -
వేధింపులతో చంపేస్తున్నారు..!
* మానసికంగా, లైంగికంగా కూడా.. * ఈటెల్లాంటి మాటలంటున్న ఫ్రొఫెసర్లు * మనోవేదనతో ఉసురు తీసుకుంటున్న వైద్య విద్యార్థినులు * జీఎంసీ, జీజీహెచ్‌లో కొరవడుతున్న వైద్యాధికారుల పర్యవేక్షణ ‘గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః’ అనే సూక్తికి విరుద్ధంగా గుంటూరు వైద్య కళాశాలలోని కొందరు బోధనసిబ్బంది వ్యవహరిస్తున్నారు. కన్నవారిని, ఉన్న ఊరును విడిచి వైద్య విద్యను అభ్యసించేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన గురువులే సూటిపోటి మాటలతో తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థులు వేధించకుండా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చూడాల్సిన ప్రొఫెసర్లే వేధింపులకు పాల్పడుతుండడం దారుణం. వైద్య విద్యార్థినులపై ర్యాగింగ్, లైంగిక వేధింపులు జరగకుండా ప్రొఫెసర్ల నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ పనిచేయాల్సిఉంది. కాగా గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో కొందరు బోధన సిబ్బంది వైద్య విద్యార్థినులపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. కొందరు ప్రొఫెసర్ల విపరీత పోకడల వల్ల ప్రసిద్ధిగాంచిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాలల్లో కొందరు ప్రొఫెసర్లు వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ బాల సంధ్యారాణి వేధింపులకు బలైంది. ఆమె స్థానిక కన్నావారితోటలో ఓ రూమ్ అద్దెకు తీసుకునిఉంటూ గుంటూరు వైద్య కళాశాలలో గైనకాలజీ (డీజీఓ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఏడాది డిసెంబర్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ చిట్టిప్రోలు రవితో వివాహమైంది. పెళ్లికి 20 రోజులు సెలవు పెట్టగా.. అన్ని రోజులెందుకంటూ సంబంధిత యూనిట్ ఇన్చార్జిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎ.వి.వి.లక్ష్మి దుర్భాషలాడారని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. తాను ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సంధ్యారాణి చనిపోయే ముందు తన డైరీలో రాసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంధ్యారాణి మృత్యువుతో పోరాడుతూ సోమవారం మృతి చెందింది. ఈ ఏడాది ఆగస్టు 11న రాచమళ్ల విజయలక్ష్మి (24) అనే విద్యార్థిని సైతం ఇంజక్షన్ చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. హెచ్ఐవీ సోకిన రోగికి ఆపరేషన్ చేస్తుండగా విజయలక్ష్మి చేతికి రోగికి వాడిన సూది గుచ్చుకుంది. దీంతో తనకు ఆ వ్యాధి వస్తుందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సూది గుచ్చుకున్నప్పుడు అక్కడే ఉన్న ప్రొఫెసర్లు సదరు విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇవ్వకుండా వదిలేయడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. గత ఏడాది జీజీహెచ్ చర్మ వ్యాధుల విభాగంలో ఓ ప్రొఫెసర్ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై వైద్యాధికారులు విచారణ జరిపి లైంగిక వేధింపులు నిజమేనని తేల్చినా కేవలం బదిలీతో సరిపెట్టారు. గుంటూరు జీజీహెచ్, ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టుకుని పనిభారం మొత్తం పీజీలపై నెడుతున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మాత్రం తప్పు వీరిపైకి నెట్టేస్తున్నారు. వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడం వల్లే భావి వైద్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
జీజీహెచ్‌లో విద్యార్థిని మృతిపై విచారణ
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 14వ తేదీన చికిత్స పొందుతూ కూరపాటి ప్రణతి (16) అనే విద్యార్థిని మతిచెందిన వైనంపై ఫిర్యాదులు రావటంతో మంగళవారం ఐదు గంటలపాటు విచారణ జరిగింది. జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్, విచారణ కమిటీ అధికారి డాక్టర్ పెనుగొండ యశోధర వైద్యులు, వైద్య సిబ్బందిని విచారించారు. జ్వరంతో వచ్చిన విద్యార్థినిని వైద్యులు పట్టించుకోకపోవటం వల్లే ప్రణతి మృతి చెందిందని తల్లిదండ్రులు నాగరాజు, సుజాతలు ఆస్పత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన రోజు∙ కుటుంబ సభ్యులు సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయటంతో సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడుడాక్టర్ విద్యార్థిని మృతిపై విచారణ చేయాల్సిందిగా యశోధరను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు మంగళవారం విచారణ జరిగింది. -
జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
కాకినాడ సిటీ : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో న్యూరోసర్జరీ విభాగం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. మెడ భాగం దెబ్బతిని కదలలేని స్థితిలో వచ్చిన రోగికి న్యూరోసర్జరీ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ప్రేమ్‌జిత్ రే నేతృత్వంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరి, ఎనస్ధీసియా ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమ్‌సాగర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రామారావు బృందం కోలుకునేలా వైద్యసేవలు అందించారు. వైద్యబృందం శనివారం ఆ వివరాలను విలేకరులకు తెలియజేశారు. అయినవిల్లి మండలం నేదునూరుకు చెందిన గోడి వీరభద్రుడు ఇంటి అరుగు మీద నుంచి కిందకు పడడంతో ఎటూ కదలలేని పరిస్థితికి చేరుకున్నాడు. అతనిని గతనెల 14వ తేదీన జీజీహెచ్‌కు తీసుకువచ్చారు. అతనికి స్కానింగ్, ఎక్స్‌రేలు తీయగా మెడ వద్ద వెన్నుపూస విరిగి పోవడంతో పాటు, నరాలు నలిగిపోయినట్టు వైద్యులు గుర్తించారు. సెప్టెంబర్ 24న మెడ వెనుక, ముందు భాగాల్లో శస్త్ర చికిత్స చేసి విరిగి ఒకదానిపైకి ఒకటి చేరిన వెన్ను పూసలను సరిచేసి మెటల్ ప్లేట్‌ను అమర్చి స్క్రూలు వేశారు. ఈమేజర్ సర్జరీకి ఆరుగంటల సమయం పట్టిందని, జీజీహెచ్‌లో ఇటువంటి శస్త్ర చికిత్స చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. కాళ్లు, చేతులు కదపలేకుండా అంతంత మాత్రం స్పర్శతో ఉన్న వీరభద్రుడు ఆపరేషన్ అన ంతరం కోలుకుని ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండా తిరగగలుగుతున్నాడన్నారు. -
జీజీహెచ్‌లో విద్యార్థిని మృతి
గుంటూరు ఈస్ట్: జ్వరంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పైగా మతిచెందిన తర్వాత కూడా ఐసీయూలోకి తీసుకువెళ్లి ప్రత్యేక వైద్యం అందించినట్టు వైద్యులు నాటకాలాడారని బంధువులు ఆరోపించడం జీజీహెచ్‌లో కలకలం రేపింది. మృతురాలి మేనమామ గోరంట్ల సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తాడికొండ మండలం బైజోత్పురంలో నివసించే కూరపాటి నాగరాజు,సుజాతకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రణతి (16) తెనాలిలోని జేఎమ్‌జే కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు గుంటూరు స్వర్ణభారతి నగర్‌లోని తన అమ్మమ్మ గోరంట్ల మేరీ ఇంటికి వచ్చింది. గురువారం ఉదయం నుంచి జ్వరంగా ఉండడంతో పాటు సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం 103 వార్డుకు తరలించారు. అర్ధరాత్రిలో ప్రణతి కడుపునొప్పితో మెలికలు తిరిగి వాంతి చేసుకుంది. ఆరోగ్యం క్షీణించిన విషయాన్ని డ్యూటీలో ఉన్న డాక్టర్లకు తెలియచేసినా వారు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. డ్యూటీలో లేని మరో వైద్యుడు ప్రణతి మృతి చెందిన విషయాన్ని బంధువుల చెవిలో చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న వైద్యులు హడావుడిగా విద్యార్థినిని ఐసీయూకి తరలించారు. కొంతసేపు ప్రత్యేక వైద్యం చేసి ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం ఫలితంగానే ప్రణతి మృతి చెందిందని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. లిఖిత పూర్వకంగా బాధితులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతామని ఆర్ఎమ్వో డాక్టర్ రమేష్ హామీ ఇచ్చినా బంధువులు ఆందోళన కొన సాగించారు. -
జీజీహెచ్‌లో.. మరో అద్భుతం
-
జీజీహెచ్‌లో.. మరో అద్భుతం
* రెండోసారి గుండె మార్పిడి ఆపరేషన్ * చరిత్ర సృష్టించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం * జాతీయస్థాయిలో ఇనుమడించిన ఆస్పత్రి ప్రతిష్ట * సహకరించని ప్రభుత్వం.. సహృదయంతో ముందుకొస్తున్న దాతలు అరవయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర గల గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ప్రతిష్ట మరోసారి ఆకాశమంత ఎత్తుకు వెళ్లింది. ఈ ఆస్పత్రిలో రెండోసారిగా మంగళవారం నిర్వహించిన గుండె మార్పిడి శస్త్రచికిత్స సర్వత్రా చర్చనీయాంశమైంది. రూ.20 లక్షల వ్యయం అయ్యే శస్త్రచికిత్సను పేద మహిళకు ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం కృషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సత్కార్యానికి ప్రభుత్వం వీసమెత్తు సహకారం అందించకపోయినా.. దాతలు ముందుకొచ్చి సాయమందించారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మంగళవారం జరిగిన గుండెమార్పిడి ఆపరేషన్‌తో గుంటూరు జీజీహెచ్ మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే బృందం మరోసారి ఈ అద్భుతం సష్టించింది. ఒక్కపైసా ఖర్చు లేకుండా సుమారు రూ.20 లక్షలు ఖరీదు చేసే గుండె మార్పిడి ఆపరేషన్ రెండోసారి నిర్వహించింది. దేశంలోనే ఐదో ఆస్పత్రిగా ఖ్యాతి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. దేశంలో నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఐదో ఆస్పత్రిగా గుంటూరు ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరగడంతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 60 ఏళ్ల సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రికి 2015 మార్చికి ముందు గుండె ఆపరేషన్లు జరగడమే గగనంగా ఉండేది. ఈ తరుణంలో తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో నిరుపేద రోగులకు సేవ చేయాలనే స‘హృదయం’తో ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఏడాది కాలంలో 250 వరకు నిరుపేద గుండెలకు ఊపిరిలూదారు. ప్రభుత్వం ఎలాంటి నిధులూ మంజూరు చేయకపోయినా దాతల సహకారం, సొంత ఖర్చులతో మే 20న గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. సన్మానాలకే పరిమితం.. నిధుల మంజూరు శూన్యం.. గుండెమార్పిడి ఆపరేషన్‌తో డాక్టర్ గోఖలేకు సన్మానాలు చేసిన సీఎం, మంత్రులు ప్రభుత్వం తరఫున గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. అయినా దాతలు ముందుకు రావడంతో ఎవ్వరూ ఊహించని విధంగా రెండో గుండె మార్పిడి ఆపరేషన్ సైతం చేపట్టారు. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న రోగికి నెల్లూరులో గుండెను సేకరించి ఏకంగా హెలికాప్టర్లో తీసుకొచ్చి మరీ ఆపరేషన్ నిర్వహించడం గొప్ప విషయం. జీజీహెచ్‌లో డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఉచితంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు, డాక్టర్ గొంది శివరామకృష్ణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎన్వీ సుందరాచారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్ట్రోక్ యూనిట్‌ను ఏర్పాటు చేసి నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. దాతల సహకారం... ఐ డొనేట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నవీన్ ఈ మహాయజ్ఞంలో తామూ భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో రెండు గుండె మార్పిడి ఆపరేషన్లకూ 15 మందితో రక్తదానం చేయించారు. హెలీప్యాడ్ నుంచి జీజీహెచ్‌కు గుండెను చేర్చేందుకు వేదాంత హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ ప్రత్యేక అంబులెన్స్‌ను సమకూర్చారు. దాతలు చేస్తున్న సహాయాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో గుండెమార్పిడి ఆపరేషన్లను చేర్చడమో లేదా, దీనికి సరిపడా నిధులను ప్రత్యేకంగా విడుదల చేయడమో చేయాలని వైద్య నిపుణులు, ప్రజలు కోరుతున్నారు. -
జీజీహెచ్‌లో ‘జనన’ పత్రాలకు తంటా
* జనన ధ్రువపత్రాల జారీలో నిర్లక్ష్య ధోరణి * ప్రచారం ఘనం.. అమలు శూన్యం * జీజీహెచ్ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ బిడ్డ పుట్టిన 24 గంటల్లో ఆధార్ ఎన్రోల్మెంట్, జనన సర్టిఫికెట్ జారీ అంటూ ఒక పక్క ప్రచారాలతో ఊదరగొడుతున్నా.. అమలు విషయంలో మాత్రం లబ్ధిదారులకు వీటి కోసం నెలల తరబడి పడిగాపులు తప్పుడం లేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని అమరావతిరోడ్డుకు చెందిన ముక్కా రాజేశ్వరి సెప్టెంబర్ 21న జీజీహెచ్‌లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లను ఆసుపత్రి అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం ఆమె సోదరుడు కల్లవరపు రాజేంద్ర సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలోని జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించగా.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ అందజేసి, ఆధార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్‌ను బయట చేయించుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అదే విధంగా రాజేంద్రనగర్‌కు చెందిన కట్టమూరి కృష్ణమూర్తి సెప్టెంబర్ 1న జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని మరణ ధృవీకరణ పత్రాన్ని తక్షణమే ఇవ్వాల్సి ఉండగా, సంబంధిత సిబ్బంది, అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం కృష్ణమూర్తి కుటుంబసభ్యులు సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చారు. నెలరోజులు అయినప్పటికీ మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధం చేయలేదు. పైగా దరఖాస్తు చేసుకుని నెలరోజుల తరువాత వస్తే అందిస్తామని చెప్పడంతో సిబ్బంది తీరును విమర్శిస్తూ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. ఇలా ప్రతిరోజూ గుంటూరు జీజీహెచ్‌లో జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. రోల్ మోడల్ ఆస్పత్రిలోనే... రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జీజీహెచ్‌ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మే 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని జీజీహెచ్‌లో లాంచనంగా ప్రారంభించింది. ఆసుపత్రిలో పుట్టిన 24 గంటల వ్యవధిలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరును కూడా లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. కానీ జీజీహెచ్‌లో కాన్పు జరిగి ఇంటికి వెళ్లిన తరువాత వారంరోజులు ఆగి వస్తే సర్టిఫికెట్ ఇస్తామంటూ బాలింతలను, వారి కుటుంబ సభ్యులను సంబంధిత సిబ్బంది అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆధార్ ఎన్రోల్మెంట్ బయటేనంటా..! పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో ఆధార్ ఎన్రోల్మెంట్ ఇవ్వకుండా బయట చేయించుకోవాల్సిందేనంటూ పంపించి వేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రాల మంజూరు కూడా ఆలస్యంగానే జరుగుతోంది. గత నెలలో మరణిస్తే, ధృవీకరణ పత్రం నెలరోజులు గడిచినా ఇవ్వడం లేదని కొందరు ఆందోళన కూడా చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది 24 గంటల్లో మంజూరు చేయాల్సిన సర్టిఫికెట్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సకాలంలో సర్టిఫికెట్లు మంజూరు అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
తల్లడిల్లుతున్న తల్లులు
* గుంటూరు జీజీహెచ్‌లో ఇదీ పరిస్థితి * ఎంసీహెచ్‌కు సీఎం శంకుస్థాపన రాయి వేసి ఏడాది * పునాదులు కూడా తీయని వైనం * అష్టకష్టాలు పడుతున్న బాలింతలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ చందాన ఉంది గుంటూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వార్డు పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు (ఎంసీహెచ్) నిర్మాణానికి శిలాఫలకం వేసి ఆదివారంతో ఏడాది పూర్తయింది. సంవత్సరంలోగా భవన నిర్మాణం పూర్తిచేసి మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆరోజు ముఖ్యమంత్రి వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయినా నేటికి పునాదులు కూడా తీయలేదు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు, చిన్నారులకు సరిపడా పడకలు లేక ప్రతిరోజూ వారు పడుతున్న కష్టాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వారి కష్టాలను తీర్చి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. తల్లి, బిడ్డకు స్పెషాలిటీ వైద్యసేవలు.. జీజీహెచ్‌లో గర్భిణీలు, చిన్నారులు వైద్యం పొందేందుకు సరిపడా మంచాలు లేకపోవడంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు వైద్యం పొందాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. సాధారణ కాన్పు, ఆపరేషన్ అనంతరం పడకలు లేక కొన్నిసార్లు కటిక నేలపైనే బాలింతలు ఉండాల్సి వస్తోంది. చిన్నపిల్లలది కూడా అదే పరిస్థితి. ఈ దీనావస్థపై ‘సాక్షి’లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 200 పడకలతో తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు నిర్మించేందుకు నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కుటుంబ నియంత్రణ విభాగం, గైనకాలజీ వైద్య విభాగం తొలగించి ఆ ప్రదేశంలో ఎంసీహెచ్ వార్డు నిర్మించాలని నిర్ణయించారు. పోస్టు ఆపరేటివ్ వార్డు, ప్రీ ఆపరేటివ్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎన్ఐసీయూ, ల్యాబ్, డిస్పెన్సరీ, డెలివరీ సూట్స్, తల్లులు వేచి ఉండే గది అన్నీ కూడా ఒకే భవనంలో నిర్మాణం పూర్తయితే అందుబాటులోకి వస్తాయి. ఒకేచోట అన్ని వైద్యసౌకర్యాలు ఉండడం ద్వారా తల్లికి, బిడ్డకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. భవన తొలగింపునకే ఏడాది.. ఆస్పత్రిలో ఎంసీహెచ్ వార్డును నిర్మించేందుకు ప్రస్తుతం ఉన్న పాత భవనాలను తొలగించేందుకు ఆస్పత్రి అధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు ఏడాది సమయం పట్టింది. నిధులు విడుదల చేసి మూడేళ్లవుతున్నా సంబంధిత అధికారులు సకాలంలో భవన నిర్మాణం చేసేందుకు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదో అర్ధంకావడం లేదు. మరోవైపు రెండేళ్లుగా ఆస్పత్రికి కాన్పుల కోసం వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నెలకు వెయ్యి వరకు డెలివరీలు జరుగుతుండడంతో ఒక్కో పడకపై ఇద్దరు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. ఒకవైపు ఆపరేషన్ కాన్పు నొప్పులు, మరోవైపు కనీసం మంచం కూడా సరిపడక అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో ఎంసీహెచ్ వార్డు భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
అంపశయ్యపై అంబులెన్స్‌లు
* మొరాయించిన సీఎం కాన్వాయ్‌కు కేటాయించిన అంబులెన్స్ * జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి * అల్లాడుతున్న రోగులు గుంటూరు మెడికల్: సీఎం చంద్రబాబు నివాసం వద్దకు శుక్రవారం రాత్రి కాన్వాయ్ డ్యూటీలు నిర్వహించేందుకు గుంటూరు జీజీహెచ్ నుంచి వైద్యులు, వైద్య సిబ్బంది అంబులెన్సులో వెళ్లారు. విధులు ముగించుకుని శనివారం ఉదయం 9 గంటల సమయంలో తాడేపల్లి నుంచి గుంటూరు వస్తుండగా, అంబులెన్సు ఇంజన్ ఆయిల్ కారిపోతూ వడ్డేశ్వరం వద్ద ఆగిపోయింది. దీంతో అంబులెన్సులో ఉన్న ముగ్గురు వైద్యులు, ఇద్దరు టెక్నీషియన్లు, ఒక నాల్గో తరగతి ఉద్యోగి బస్సులో గుంటూరు వచ్చారు. ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్ ఆగిపోయిన విషయం తెలియజేయడంతో వారు మరో ఇద్దరు డ్రైవర్లను పంపారు. వారు మరమ్మతులు చేసినా కదలకపోవడంతో ఆస్పత్రికి తాడు కట్టుకుని తీసుకొచ్చారు. మళ్లీ శనివారం రాత్రి కాన్వాయ్ విధులకు ఇబ్బంది లేకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్సును తీసుకొచ్చి జీజీహెచ్ సిబ్బందిని, వైద్యులను సీఎం నివాసం వద్దకు పంపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాడేపల్లిలో నివాసం ఉంటున్నప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, రాత్రి వేళల్లో గుంటూరు జీజీహెచ్ వైద్యులు కాన్వాయ్ విధులకు వెళుతున్నారు. అంబులెన్స్‌లు సక్రమంగా లేకపోవడంతో వీరికి ఇబ్బందులు తప్పడం లేదు. ఏడు వాహనాలున్నా నిరుపయోగమే.. ఆసుపత్రిలో అంబులెన్సులు ఏడు ఉన్నప్పటికీ ఒక్కటీ పని చేయడం లేదు. శనివారం ఆగిపోయిన అంబులెన్సును ఏడేళ్ల క్రితం జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి జీజీహెచ్‌కు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపించింది. రాజధాని ఆసుపత్రి గుంటూరులో అంబులెన్సులు లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు తీసుకెళ్లేందుకు రోగులు ప్రైవేటు వాహనాదారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆసుపత్రి అధికారులు ఇప్పటికైనా అంబులెన్సులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సమ్మె విరమించిన హౌస్సర్జన్లు
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఈనెల 20వ తేదీ నుంచి సమ్మె చేస్తున్న హౌస్సర్జన్లు శుక్రవారం సమ్మె విరమించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. శనివారం నుంచి హౌస్‌సర్జను విధుల్లో ఉంటారన్నారు. గత పదిరోజులు హౌస్సర్జన్లు ఇంజెక్షన్లు చేయకుండా సమ్మె చేయటంతో నర్సులు, నర్సింగ్ విద్యార్థులతో ఇంజెక్షన్లు చేయిస్తున్నారు. గతంలో ఇలా నర్సింగ్ విద్యార్థిని ఇంజెక్షన్ చేయటంతో ఆస్పత్రి పిల్లల విభాగంలో బాలుడు చనిపోయాడు. ఇంజెక్షన్లు వైద్యులు చేయాల్సి ఉన్నా వారు చేయకుండా మిన్నకుండి పోవటంతో మరలా నర్సులు చేస్తున్న దష్ట్యా ఏదైనా చెడు సంఘటన చోటు చేసుకుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని విమర్శనాత్మకంగా ‘రోగుల ప్రాణాలతో చెలగాటం! శీర్షికతో శుక్రవారం సాక్షి జిల్లా ఎడిషన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి హౌస్సర్జన్ల సంఘం నేతలతో చర్చించి ఇంజెక్షన్లు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. హౌస్సర్జన్లు ఇంజెక్షన్లు చేసే సమయంలో నర్శింగ్ విద్యార్ధులు సహాయం చేస్తారని తెలిపారు. -
రోగుల ప్రాణాలతో చెలగాటం!
పదిరోజులుగా కొనసాగుతున్న సూదిమందు వివాదం ససేమిరా అంటున్న హౌస్ సర్జన్లు, నర్సులు ఆందోళనలో రోగులు సాక్షి, గుంటూరు : పలువురు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతున్న గుంటూరు జీజీహెచ్‌లో తాజాగా సూదిమందు వివాదం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా జీజీహెచ్‌లో సూది మందు ఎవరు వేయాలనే అంశంపై హౌస్ సర్జన్లు, స్టాఫ్ నర్సుల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పది రోజులుగా హౌస్ సర్జన్లు సమ్మె చేస్తున్నారు. దీంతో జీజీహెచ్ అధికారులు నర్సింగ్ విద్యార్థులతో రోగులకు సూది మందు వేయిస్తున్నారు. గతంలో సైతం ఇదే వివాదం నెలకొనడంతో నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్లే రోగులకు సూది మందు వేయాలంటూ అప్పట్లో వైద్య అధికారులు స్పష్టం చేశారు. రెండు నెలల క్రితం జ్వరంతో బాధపడుతూ జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సోదరికి సైతం సూది మందు వేయకుండా రెండురోజుల పాటు వదిలేయడం, తరువాత అధికారులు సర్దిచెప్పి సూది మందు ఇప్పించడం జరిగాయి. ఇలా ప్రతిసారీ సూది మందు ఎవరు వేయాలనే అంశంపై జీజీహెచ్‌లో వివాదం నడుస్తూనే ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో జీజీహెచ్ అధికారులు పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు. చర్యలు తీసుకోవడంలో విఫలం... జీజీహెచ్‌లో నిబంధనల ప్రకారం రోగులకు హౌస్ సర్జన్లు సూది మందు వేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, అధికారులు, అన్ని వైద్య విభాగాల హెచ్వోడీలు ముక్తకంఠంతో చెబుతున్నప్పటికీ హౌస్ సర్జన్లు సమ్మెను విరమించడం లేదు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన సూపరింటెండెంట్ మెతక వైఖరి అవలంబిస్తుండటంతో వివాదం ముదిరి పాకాన పడుతోంది. చర్చల పేరుతో హౌస్ సర్జన్లు, స్టాఫ్ నర్సులతో సమావేశాలు నిర్వహించడం మినహా కఠినంగా వ్యవహరించడంలో ఆయన పూర్తిగా విఫలం చెందారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాబ్ చార్ట్ ప్రకారం ఎవరు సూది మందు వేయాలో నిర్ణయించి అందుకనుగుణంగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సూపరింటెండెంట్ సమస్యను సాగదీస్తుండటం రోగులకు ఇబ్బందిగా మారింది. వికటిస్తే బాధ్యులెవరు? వివాదం తేలేవరకు రోగులకు సూది మందు వేయాలంటూ నర్సింగ్ విద్యార్థులకు బాధ్యత అప్పగించడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారికి అవగాహన లేని నేపథ్యంలో ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. 2013లో జీజీహెచ్‌లోని పిల్లల వైద్య విభాగంలో నర్సింగ్ విద్యార్థిని సూది మందు వేయడంతో అదికాస్తా వికటించి ఓ బాలుడు మృతి చెందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. నర్సులు సూది మందు ఎందుకు వేస్తారంటూ అప్పట్లో ఉన్నతాధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడికి సరిపడా సూదిమందు వేయకపోవడం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. గత అనుభవాన్ని దష్టిలో ఉంచుకునైనా జీజీహెచ్ ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల హౌస్ సర్జన్లను చర్చలకు పిలిచిన సమయంలో ఆయా వైద్య విభాగాల హెచ్వోడీలు సైతం జాబ్‌చార్ట్ ప్రకారం హౌస్ సర్జన్లే సూది మందు వేయాలని, తాము సైతం సూది మందు వేసే వైద్యులమయ్యామని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోపక్క హౌస్ సర్జన్లు గురువారం కూడా సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సులు కూడా తాము సూది మందు వేసే ప్రసక్తే లేదని, జాబ్‌చార్ట్ ప్రకారం ఎవరు వేయాల్సి ఉంటే వారికి అప్పగించాలని తేల్చి చెబుతున్నారు. అలాగాక తమపై బాధ్యత మోపాలని చూస్తే తాము సమ్మెకు సిద్ధమంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జీజీహెచ్ ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించాలని వైద్యులు, రోగులు కోరుతున్నారు. -
జీజీహెచ్‌లో లైంగిక వేధింపులు
గుంటూరు మెడికల్: తమను ఓ అధికారి వేధిస్తున్నారంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిపాలన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడుకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారి చెప్పినట్లు నడుచుకోకపోతే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. సాయంత్రం రెండు గంటలకు పైగా ఈవిషయంపై కార్యాలయంలో విస్తృతంగా చర్చ జరిగింది. మినిస్టీరియల్ సంఘ నాయకులు మహిళా ఉద్యోగినులతో సంప్రదింపులు జరిపి, వారి సమస్య గురించి చర్చించారు. కాగా, ఈవిషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడును ‘సాక్షి’ వివరణ కోరగా, అధికారిమీద లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, కేవలం నోటిమాట ద్వారా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందకపోతే విచారణ చేసేందుకు వీలుపడదని, ఇవ్వాలని చెప్పామన్నారు. -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో హౌస్సర్జన్ల సమ్మె
పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న హౌస్సర్జన్లు మంగళవారం ఉదయం నుంచి సమ్మె చేస్తున్నారు. తమకు వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని, కనీస వసతులు కల్పించాలని వారు డిమాండం చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా సాధారణ వైద్య సేవలకు హౌస్సర్జన్లు హాజరుకావడంలేదు. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకే తాము పనిచేస్తామని వారు స్పష్టంచేశారు. -
యువకుడి ఛాతీలో రెండు కిలోల గడ్డ
* జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్ గుంటూరు మెడికల్: ఛాతిలో నొప్పితో గుంటూరు జనరల్ ఆస్పత్రికివచ్చిన యువకుడికి కార్డియోథొరాసిక్సర్జరీ వైద్యులు సకాలంలో ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. అరుదుగా జరిగే ఈ ఆపరేషన్ వివరాలను శుక్రవారం సీటీఎస్ వైద్య విభాగం ఇన్‌ఛార్జి డాక్టర్ మెగావత్ మోతీలాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు నెహ్రూనగర్ 10వలైన్‌కు చెందిన బత్తుల హనుమంతురావు, రాణిల రెండో కుమారుడు బత్తుల ధనరాజు డిగ్రీ చదువుతున్నాడు. ఇతను మూడు నెలలుగా ఛాతీలో నొప్పితో బాధపడుతూ ప్రై వేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 15న వైద్యంకోసం జీజీహెచ్‌కు రాగా సీటీఎస్ వైద్యులు పరీక్షలు చేసి ఛాతీలో కుడివైపు సుమారు రెండు కిలోల బరువు ఉన్న గడ్డ(హిమరేజిక్ సిస్ట్) ఉన్నట్లు నిర్ధారణ చేశారు. వెంటనే మూడు గంటలసేపు ఆపరేషన్ చేసి యువకుడిని ప్రాణాపాయ స్థితినుంచి రక్షించినట్లు డాక్టర్ మోతీలాల్ చెప్పారు. సాధారణంగా ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బతగిలితే ఇలాంటి గడ్డలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. గడ్డ ఖచ్చితమైన నిర్ధారణ కోసం గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ విభాగానికి పరీక్ష కోసం పంపించామని తెలిపారు. సుమారు లక్ష రూపాయల ఖరీదు చేసే ఆపరేషన్‌ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామన్నారు. వారం రోజుల్లో ధనరాజును ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని వెల్లడించారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతోపాటుగా మత్తు వైద్యులు సీతారామయ్య, భవాని, పీజీ ౖÐð ద్యులు లక్ష్మీప్రసన్న, వేణు, నవీన్ పాల్గొన్నట్లు డాక్టర్ మోతీలాల్ తెలిపారు. -
జీజీహెచ్ లో వైద్యుల ధర్నా
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు గురువారం ధర్నాకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఓ పసిబిడ్డ మృతిచెందాడని ఆరోపణలు రావడంతో నలుగురు డాక్టర్లపై మంత్రి కామినేని శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎలాంటి తప్పు లేకపోయినా సస్పెన్షన్ చేశారంటూ గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులంతా సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరిండెంట్ వారితో చర్చలు జరుపుతున్నారు. డాక్టర్ల ఆందోళనతో వైద్య సేవలు నిలిచిపోయాయి. -
జీజీహెచ్‌లో శిశువు మృతి
-
జీజీహెచ్‌లో శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యంవల్లేనని బంధువుల ఆందోళన గుంటూరు మెడికల్/సాక్షి, హైదరాబాద్: ‘‘పుట్టగానే సక్రమంగా పరీక్షించకుండా మా బిడ్డ చనిపోయాడని నిర్ధారించి మూటగట్టి ఇచ్చారు. పైగా మరణ ధ్రువీకరణ పత్రం కూడా చేతిలో పెట్టారు. ఇంటికి తీసుకెళుతుండగా మా అదృష్టంకొద్దీ బాబులో చలనం రావడంతో తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఇంత జరిగినా వైద్యులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. సరైన వైద్యం అందించకుండా ఈసారి మా బిడ్డను నిజంగానే చంపేశారు..’’ అంటూ గుంటూరుకు చెందిన జగన్నాథం నాగబాబు, భవాని దంపతులు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్) వైద్యుల ఎదుట బుధవారం ఆవేదన వెలిబుచ్చారు. జీజీహెచ్‌లో మంగళవారం కాన్పు జరిగిన భవానికి పుట్టిన బిడ్డను బతికుండగానే చనిపోయినట్లు నిర్ధారించి అందజేయడం.. తర్వాత శిశువులో కదలికలను గమనించిన తల్లిదండ్రులు తిరిగి ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు వెంటనే ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స చేపట్టడం తెలిసిందే. అయితే ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆ శిశువు మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటలకు చనిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. కాగా ఈ ఘటనపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్యవిద్యా సంచాలకులు డా.ఎన్.సుబ్బారావు వెల్లడించారు.చివరికి శిశువు మృతికి జూనియర్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థినే కారణమని విచారణ కమిటీ తేల్చింది. -
బతికున్న శిశువును చనిపోయిందన్నారు
- డెత్ సర్టిఫికెట్ సైతం ఇచ్చేశారు.. - పూడ్చిపెట్టేందుకు వెళుతుండగా మార్గమధ్యలో శిశువులో కదలిక - ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందు - గుంటూరు జీజీహెచ్‌లో మరో దారుణం గుంటూరు మెడికల్: బతికున్న శిశువును చనిపోయిందంటూ చెప్పడమే కాదు.. ఆ మేరకు ధ్రువీకరణ పత్రం సైతం ఇచ్చేశారా వైద్యులు. పుట్టిన బిడ్డ పోయాడన్న పుట్టెడు శోకంతో ఆటోలో ఇంటికి మరలిన ఆ కుటుంబ సభ్యులకు మార్గమధ్యలో శిశువులో కదలికలు కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో నాలుక్కరుచుకున్న వైద్యులు హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఇదంతా ఎక్కడో కాదు.. పసికందును ఎలుకలు కొరికిన దుర్ఘటనతో మాయనిమచ్చ పడిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల(జీజీహెచ్)లోనే చోటు చేసుకుంది. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలేనికి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం ఆరు గంటలకు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు. దీంతో కుటుంబసభ్యులు సంబరాలు చేసుకున్నారు. అయితే అరగంట వ్యవధిలోనే వైద్యులు బిడ్డ చనిపోయాడని చెప్పారు. ఆస్పత్రిలో బిడ్డను పడేయకుండా ఇంటికి తీసుకెళ్లమంటూ వస్త్రాల్లో చుట్టి తండ్రికి అప్పగించారు. డెత్ సర్టిఫికెట్ ఇచ్చి మరీ అప్పగించడంతో పసికందును పూడ్చేందుకు గుంత తవ్వించాలని బంధువులకు నాగబాబు ఫోన్ చేశాడు. అయితే వారు ఆటోలో తమ గ్రామానికి వెళుతుండగా శిశువులో కదలికలు వచ్చాయి. దీంతో తక్షణమే ఆటోను వెనుకకు తిప్పుకుని ఆస్పత్రికి వచ్చారు. జరిగిన తప్పిదాన్ని గ్రహించిన ఆస్పత్రి సిబ్బంది హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. కాగా బతికున్న బిడ్డను చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పసికందు కుటుంబ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ ముందు మూడుగంటలకుపైగా ధర్నా చేశారు. ఆర్ఎంఓ డాక్టర్ యనమల రమేశ్ వచ్చి.. వైద్యులపై విచారణ కమిటీవేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో వారు ధర్నా విరమించారు. నాగబాబు మాట్లాడుతూ.. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల తాము తీరని వేదనను అనుభవించాల్సి వచ్చిందన్నారు. -
జీజీహెచ్‌లో దళారి పట్టివేత
* రక్త పరీక్షలు బయటకు తరలిస్తున్న వైనం * ఆస్పత్రి వైద్యులే పిలిచారంటూ రోగుల ఫిర్యాదు గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శనివారం రైలుపేటలోని ఓ ప్రైవేటు బ్లడ్‌బ్యాంక్‌లో పనిచేసే దళారి రక్తపు శాంపిళ్ళు తీసుకెళ్ళాడు. సదరు పరీక్ష చేసేందుకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో రోగుల బంధువులకు విషయం తెలిసి ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రి అధికారులు విచారణ చేసి కొత్తపేట పోలీసులకు దళారిని అప్పగించారు. పొన్నూరు మండలం జూపూడికి చెందిన ఎం. బాలకోటేశ్వరమ్మ లివర్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో చేరింది. వ్యాధి నిర్ధారణ కోసం ఆమెకు రక్తపరీక్షలు చేసేందుకు ఇద్దరు హౌస్సర్జన్లు రైలుపేట ల్యాబ్‌కు చెందిన దళారి నాగరాజును ఆస్పత్రికి పిలిపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తపరీక్షకు అధిక మొత్తంలో డబ్బులు తీసుకోవటంతో రోగి బంధువులకు విషయం చెప్పటంతో వారు అంతమొత్తంలో ఫీజు ఉండదని తెలుసుకుని ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి ఆస్పత్రి సిబ్బందిలాగా వార్డులోకి వచ్చి రోగులతో మాట్లాడి రక్తపు శాంపిళ్ళు బయట ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు తెలిపారు. గత నెలలో కూడా ఇదే తరహాలో ఓ దళారిని రక్తపు శాంపిళ్ళు తీసుకెళ్తున్న సమయంలో సెక్యూరిటి సిబ్బంది పట్టుకోగా వైద్యులు పిలవటం వల్లే తాను వచ్చినట్లు వెల్లడించాడు. దళారీ వ్యవస్థను నిలురించేందుకు ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి గట్టి చర్యలు తీసుకోకపోతే ఇలాంటి సంఘనలు తరచుగా జరగటంతోపాటుగా ఆస్పత్రి పరువు బజారున పడే ప్రమాదం ఉంది. -
కాళ్లు పట్టుకుని బతిమాలినా..
వైద్యం చేయడానికి నిరాకరించిన మాచర్ల వైద్యులు వారి నిర్లక్ష్యంపై సాగరమ్మ బంధువుల ఆగ్రహం కాన్పు చేసినందుకు జీజీహెచ్ వైద్యులకు కృతజ్ఞతలు గుంటూరు మెడికల్ : ‘కాళ్లు పట్టుకుని బతిమాలినా మాచర్ల వైద్యులు కాన్పు చేయలేదు.. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మాకు అప్పటికప్పుడు మాచర్ల నుంచి గుంటూరుకు జీపు బాడుగకు మాట్లాడుకుని వెళ్లటం కష్టసాధ్యమైంది. తప్పనిసరై రూ.5 వేలు వడ్డీకి తీసుకుని జీపు బాడుగకు తీసుకుని రూ.3 వేలు చెల్లించాం..’ అని గర్భిణి చాట్ల సాగరమ్మ తల్లి మిరియమ్మ వాపోయింది. గుంటూరు జీజీహెచ్‌లో వైద్యులు పెద్ద మనసుతో చికిత్స అందించటంతో తన కుమార్తె, మనవరాలు క్షేమంగా ఉన్నారని ఆమె శనివారం తనను కలిసిన ‘సాక్షి’కి తెలిపింది. అప్పటికప్పుడు జీపు బాడుగకు తీసుకొని కుమార్తెను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకురాగా స్థానిక వైద్యులు చికిత్స అందించారు. శనివారం ఉదయం సాగరమ్మ సాధారణ కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టగానే శిశువు ఏడవకపోవడంతో ఐసీయూలో ఉంచారు. పేదరికంలో ఉన్న తమను మాచర్ల ప్రభుత్వాస్పత్రిలో పట్టించుకోలేదని ఈ సందర్భంగా మిరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇస్రాయేలు, తాను కలిసి మాచర్ల వైద్యులను కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదని వాపోయింది. తన అల్లుడు లక్ష్మయ్య కూడా కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడని వెల్లడించింది. ఒకవేళ పురిటినొప్పులు తట్టుకోలేక ఏదైనా అపాయకర పరిస్థితి ఏర్పడి తల్లి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యులని ఆమె ప్రశ్నించింది. ఆందోళన వద్దు : ఆర్ఎంవో జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్ శనివారం సాగరమ్మను పరామర్శించారు. ఎలాంటి వైద్య సహాయం కావాలన్నా తక్షణమే అందేలా చూస్తామని, ఎలాంటి ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండాలని సాగరమ్మ కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. సకాలంలో వైద్య సేవలు అందించిన జీజీహెచ్ వైద్యులకు సాగరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్
గుంటూరు మెడికల్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడినట్లు గుంటూరు జీజీహెచ్ కార్డియోథొరాసిక్ వైద్య విభాగం( సిటిఎస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెగావత్ మోతీలాల్ చెప్పారు. గురువారం ఆస్పత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను ఆయన వెల్లడించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చెర్లోపల్లికి చెందిన పాముల ఆవులయ్య గొర్రెలు, మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 10న తన పశువులకు ఆహారం కోసం చెట్టు నరుకుతున్న సమయంలో కొమ్మ విరిగిపడి కుడికాలికి గుచ్చుకుని రక్తనాళం తెగిపోయింది. దీంతో ఆగకుండా రక్త స్రావం అవుతోంది. . సుమారు 4 లీటర్లకు పైగా ఆవులయ్య శరీరం నుండి రక్తం పోవటంతో అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో బుధవారం అర్ధరాత్రి జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డ్యూటీకి అర్ధరాత్రి హాజరై ముందస్తుగా ఐదు బ్యాగ్స్ రక్తం ఎక్కించి ఎమర్జన్సీ ఆపరేషన్ థియేటర్లోనే రెండుగంటలసేపు ఆపరేషన్ చేసి ఆవులయ్య ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ మోతీలాల్ చెప్పారు. ‘ఫిమరల్ వీన్ ఎండ్టు ఎండ్’ అనే ఆపరేషన్ చేశామని ఆపరేషన్ ప్రక్రియలో తనతోపాటుగా మత్తు వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగభూషణం, పీజీ వైద్యుడు డాక్టర్ కౌషిక్, జనరల్ సర్జరీ పీజీ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాకేష్, డాక్టర్ రాజేష్‌లు పాల్గొన్నట్లు వెల్లడించారు. జీజీహెచ్‌లో ఇలాంటి ఆపరేషన్ చేయటం ఇదే మొదటిసారి అని, ప్రమాద బాధితుడికి హెపటైటిస్ పాజిటివ్ ఉన్నప్పటికీ రిస్క్ తీసుకుని తాము ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడామన్నారు. సకాలంలో ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని, కుడి కాలిలో నరం తెగిపోవటంతో, కడుపులో రక్తనాళం తీసి ఆపరేషన్ చేశామని డాక్టర్ మోతీలాల్ వివరించారు. ఆవులయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆస్పత్రి నుండి డిశ్చార్జి చేస్తామన్నారు. -
జీజీహెచ్‌లో ఎంసీఐ తనిఖీలు
గుంటూరు మెడికల్ : గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి, ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో సోమవారం భారత వైద్య మండలి (ఎంసీఐ) ఇన్స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు జరిగాయి. ప్రస్తుతం వైద్య కళాశాలలో 97 పీజీ సీట్లు ఉండగా అదనంగా 45 సీట్లు కావాలని గుంటూరు వైద్య కళాశాల అధికారులు ఎంసీఐని కోరారు. పీజీ సీట్లు పెంచేందుకు నిబంధనల ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య సౌకర్యాలు, వైద్య పరికరాలు తదితరాలను తనిఖీచేసి ఎంసీఐ ఇన్స్పెక్టర్లు ఇచ్చే నివేదిక ఆధారంగా సీట్లు పెరగటం జరుగుతుంది. అందులో భాగంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పిల్లల వైద్య విభాగం, పల్మనరీ డిపార్ట్మెంట్, పెథాలజీ, ఎస్పిఎం, మానసిక వ్యాధుల వైద్య విభాగాల్లో తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. ఆస్పత్రిలోని ఓపీ వైద్య విభాగాలు, ఇన్‌పేషెంట్ విభాగాలు, ల్యాబ్‌లు, క్యాజువాలిటీ, కళాశాలలోని గ్యాలరీలు, సిబ్బంది హాజరు పట్టీలు తనిఖీ చేశారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మెండా ఫర్నికుమార్, డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజు నాయుడు, ఆయా వైద్య విభాగాధిపతులు వారికి వైద్య సౌకర్యాలు చూపించి, వారు అడిగిన సమాచారాన్ని అందించారు. -
జీజీహెచ్‌పై షార్ట్ ఫిల్మ్
గుంటూరు మెడికల్: పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు అందిస్తూ, అరుదైన ఆపరేషన్లు చేస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన గుంటూరు జీజీహెచ్ గురించి షార్ట్‌ఫిల్మ్‌ను తీస్తున్నారు. రాష్ట్రంలో గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డు సృష్టించిన జీజీహెచ్‌కు శనివారం ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్యానల్ డైరెక్టర్ ఎ.సైదారెడ్డి వచ్చి వీడియో తీశారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రి గురించి తొలిసారిగా షార్ట్‌ఫిల్మ్ తీస్తున్నామని, అది కూడా గుంటూరు జీజీహెచ్ గురించి ఫిల్మ్ చిత్రీకరించడం సంతోషంగా ఉందన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడుని, కొన్ని వైద్య విభాగాలను షూట్ చేశారు. ఆస్పత్రి చాలా పరిశుభ్రంగా ఉందని, కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా ఉందని సూపరింటెండెంట్‌ను అభినందించారు. ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలు గురించి ఆరా తీశారు. జీజీహెచ్‌పై ఉన్న అపోహలు తొలగిపోయేలా డాక్యుమెంటరీ రూపొందించి పేద ప్రజలు జీజీహెచ్‌లో కార్పొరేట్ వైద్యసేవలను వినియోగించుకునేలా చేస్తామన్నారు. సుమారు మూడు నిమిషాల నిడివిగల షార్ట్‌ఫిల్మ్ వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తారని చెప్పారు. -
‘మోకీళ్ల’కు మోక్షం
జీజీహెచ్‌లో బుధవారం పది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సాయంతో.. దేశ చరిత్రలోనే తొలిసారి గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మరో కీర్తి కిరీటాన్ని ధరించబోతోంది. ఇప్పటి వరకు డాక్టర్ గోఖలే సాయంతో ఉచిత గుండె ఆపరేషన్ చేసి తన విశాల హదయాన్ని చాటిన ఆస్పత్రి.. నేడు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి సంకల్పంతో ఒకేసారి పది మంది మోకీళ్లకు మోక్షం కల్పించబోతోంది. ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేక..కనీస సౌకర్యాలు కానరాక అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కొన్న రోగుల కళ్లలో ఆనంద కాంతులు వెలిగించబోతోంది. దేశచర్రితలోనే ఒకేసారి పది మందికి మోకీళ్ల ఆపరేషన్లు ఉచితంగా అందించిన వైద్యశాలగా మరో మైలురాయి దాటబోతోంది. గుంటూరు మెడికల్: స్థానిక జీజీహెచ్‌లో బుధవారం పది మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆపరేషన్లు జరగనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజు పది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతుండడంతో ఆర్థోపెడిక్ వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షుడు గుంటూరుకు వస్తున్నారని సమాచారం. గుంటూరు సాయిభాస్కర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఈ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల కోసం రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను ట్రస్ట్ ద్వారా పేద రోగులకు అందిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ తొమ్మిది మందికి మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేసి రూ.10 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను ఉచితంగా ఇచ్చారు. రాష్ట్ర వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్‌లోనూ ఈయన పాల్గొన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే... డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మైసూర్లో 1994లో ఎంబీబీఎస్, దావనగిరిలో 2003లో ఆర్థోపెడిక్ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. హైదరాబాద్ సన్‌షైన్ హాస్పిటల్లో 2003–05 వరకు డాక్టర్ గురవారెడ్డి వద్ద, అనంతరం ఇంగ్లాండ్‌లో 2005లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో గుంటూరులో సాయిభాస్కర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 2007 నుంచి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు.. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను 2007లో ప్రారంభించారు. ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వైద్య సేవలందిస్తున్నారు. గుంటూరును జాయింట్ రీప్లేస్మెంట్ సర్జీలకు రాజధానిగా చేయటమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. ఆర్ధోపెడిక్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న ఈయన జాయింట్రీప్లేస్మెంట్ సర్జరీల్లో వస్తున్న పలు నూతన వైద్య పద్ధతులను అవలంబిస్తున్నారు. డాక్టర్ నరేంద్రరెడ్డి సేవలు ఆదర్శం.. డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ పేద ప్రజలకు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఉచితంగా ఆపరేషన్లు చేయటం అభినందనీయం. సుమారు రూ.20 లక్షల ఖరీదు చేసే ఇంప్లాంట్లను సైతం ఆయనే తన ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా అందించారు. ప్రభుత్వం కూడా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు నిరంతరం కొనసాగించేందుకు గుంటూరుతోపాటుగా విశాఖపట్నం, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రులకు నిధులను విడుదల చేసేందకు సిద్ధంగా ఉంది. డాక్టర్ బూసిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైద్యులు ముందుకొస్తే పేద ప్రజలకు మరిన్ని సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందుతాయి. -
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనలు తరచుగా జరుగుతున్నా... అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కనిపించరు.. అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళల్లో మరీ ఘోరం... పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. -
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం
జీజీహెచ్‌లో ప్రాణాలు కోల్పోతున్న పేదలు క్యాజువాలిటీపై కొరవడిన పర్యవేక్షణ చర్యలు తీసుకోవడంలో అధికారుల వెనుకడుగు ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చేవారికి గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో సకాలంలో వైద్యం అందటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వైద్యసేవల విభాగంలో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. సోమవారం ఫిరంగిపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించినా సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే వారు మృత్యువాత పడ్డారని మృతుల బంధువులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రోడ్డు ప్రమాద బాధితులకు, ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు అత్యవసర వైద్యసేవలను అందించే క్యాజువాలిటీ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి గుండెకాయ లాంటి అత్యవసర వైద్యసేవల విభాగంలో సకాలంలో వైద్యసేవలు లభించక పలువురు పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫిరంగిపురం రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్సకోసం వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులకు సకాలంలో వైద్యులు సేవలను అందించకపోవడం వల్లే మృతిచెందారని ఆరోపిస్తూ ఆదివారం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఆస్పత్రి అధికారులు సైతం వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవమేననే విషయాన్ని సోమవారం సీసీ పుటేజీల ద్వారా గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇటువంటి దుర్ఘటనలు జరిగిన సమమాల్లో కిందిస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి కంటితుడుపు చర్యలే తీసుకుంటున్నారే తప్ప మెరుగైన వైద్యసేవలను అందించేందుకు తగు చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. సంఘటనలు తరచుగా జరుగుతున్నా... అత్యవసర వైద్యసేవల విభాగంలో వైద్యులు పట్టించుకోవడం లేదని గతంలో సైతం పలుమార్లు రోడ్డుప్రమాద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల విజయవాడకు చెందిన ఏడునెలల పసిపాపకు శరీరం కాలి చికిత్స కోసం జీజీహెచ్ క్యాజువాలిటీకి రాగా 24గంటల సేపు క్యాజువాలిటీలో ఉంచారే తప్ప ఎలాంటి వైద్యం చేయలేదని పాప తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఇలాంటి సందర్భాల్లో ఒకవేళ ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే దానికి ఎవరు జవాబుదారీ...పోయిన ప్రాణాలను తిరిగి తేగలరా అనే ప్రశ్నలకు వైద్యాధికారుల వద్ద సమాధానం ఉండదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులు సైతం వైద్యం అందక ప్రాణాలు పోతాయనే భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసిన సంఘటనలు ఉన్నాయి. డ్యూటీ డాక్టర్లు కనిపించరు.. అత్యవసర వైద్యసేవల విభాగంలో డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్(డీఏపీ) డ్యూటీ అసిస్టెంట్ సర్జన్(డీఏఎస్)లు విధుల్లో ఉండడం లేదని ఆస్పత్రి అంతా కోడై కూస్తున్నా, వారితో విధులను చేయించే అధికారులు లేకపోవడంతో క్యాజువాలిటీలో మరణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి కేటాయించిన గది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరికీ డ్యూటీ ఉంటే కేవలం ఒకరు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మరొకరు తమ సొంత క్లినిక్‌లో వైద్యం చేసుకుంటూ జీతాలు మాత్రం జీజీహెచ్ నుంచి తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తమకు కేటాయించిన గదిలో నిద్రపోవడం, లేదా కొద్దోగొప్పో డబ్బులు వచ్చే సర్టిఫికెట్ల మంజూరు పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారే తప్ప రోగులకు, ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాత్రివేళల్లో మరీ ఘోరం... పగలే చుక్కలు చూపించే వైద్యులు, వైద్య సిబ్బంది ఇక రాత్రివేళల్లో వచ్చే వారికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారు. రాత్రివేళల్లో క్యాజువాలిటిలో ఉండి ఎవరు విధుల్లో ఉన్నారు, ఎవరులేరనే విషయాలను పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు మిన్నకుండి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని బాధితులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. - డాక్టర్ రాజునాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ క్యాజువాలిటీలో రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకుంటాం. ఆదివారం క్యాజువాలిటీలో రోడ్డుప్రమాద బాధితులు మృతిచెందిన విషయంలో వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. -
బాలుడిని కాపాడిన వైద్యులు
సైకిల్ తొక్కుతూ కిందపడి గాయపడిన శ్రీరామకృష్ణ నాయక్ గుంటూరు మెడికల్ : సైకిల్ తొక్కుతూ జారిపడి గొంతు వాపు, ఛాతి వాపు సమస్యతో ఆసుపత్రికి వచ్చిన బాలుడు కోమాలోకి వెళ్లడంతో మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి అతనిని కాపాడినట్లు గుంటూరు జీజీహెచ్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ మెగావత్ మోతిలాల్ చెప్పారు. ఆసుపత్రిలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట మండలం, తాడవాయి తండాకు చెందిన భుక్కా భాస్కర్‌నాయక్, సాయిబాయి రెండో కుమారుడు శ్రీరామకృష్ణ నాయక్ S ఈనెల 19న ఇంటి వద్ద సైకిల్ తొక్కుతూ పడిపోయాడు. గొంతు మధ్య భాగంలో బలమైన గాయం, విపరీతమైన నొప్పి, ఛాతిపైన వాపుతో చికిత్స కోసం అదేరోజు జీజీహెచ్‌కు అచ్చంపేట వైద్యుల సూచనల మేరకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. అదేరోజు రాత్రి సీటీ స్కాన్, చెస్ట్ ఎక్స్‌రే పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసుకున్నారు. ఛాతి కుడివైపు భాగంలో, ఒళ్ళంతా చెడు గాలి చేరడం వల్ల వాపు వచ్చిందని, దీన్ని వైద్య పరిభాషలో సర్జికల్ ఎంఫైసియా, నిమో థొరాక్స్గా పిలుస్తారని డాక్టర్ మోతిలాల్ చెప్పారు. పక్కటెముకలకు గొట్టం అమర్చి వాపు తగ్గిస్తున్న సమయంలో పిల్లవాడికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడని, నాలుగు రోజులపాటు కోమాలోనే ఉన్నాడని వెల్లడించారు. సీటీ బ్రెయిన్ పరీక్ష చేసి శరిబ్రల్ ఎడిమాగా నిర్ధారణ చేశామని, మెడలో నీరు చేయడం వల్ల బాలుడు కోమాలోకి వెళ్ళినట్లు నిర్ధారణ చేశామన్నారు. నాలుగు రోజుల పాటు మెరుగైన వైద్య సేవలు అందించి కోమాలో చనిపోయే స్థితిలో ఉన్న పిల్లవాడిని తిరిగి బతికించామని డాక్టర్ మోతిలాల్ వివరించారు. జీజీహెచ్ సీటీఎస్ వైద్య విభాగంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్టర్ మోతిలాల్‌కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. బాలుడిని మంగళవారం డిశ్చార్జి చేశారు. -
ఉప్మాలో పిన్నీస్
జీజీహెచ్‌లో చోటు చేసుకున్న సంఘటన గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆదివారం రోగులకు అల్పాహారంగా ఉప్మా పెట్టారు. అందులో ఓరోగికి పెట్టిన ఉప్మా ప్లేటులో పిన్నీస్ ప్రత్యక్షమైంది. ఉప్మాను నోటిలో పెట్టుకున్న సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఒక్కసారిగా కంగారు పడిన రోగి ఉప్మాను బయటకు తీయడంతో పిన్నీస్ కనిపించింది. దీంతో ఆసుపత్రి అధికారులకు రోగి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మాచర్ల పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన రాగం లక్ష్మీనారాయణ రక్తహీనతతో బాధపడుతూ చికిత్స కోసం ఈనెల 21న జీజీహెచ్‌లోని 102 నంబర్ వార్డులో చేరాడు. ఆసుపత్రి ఇన్‌పేషెంట్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా కాంట్రాక్టర్ ద్వారా ఆహార పదార్థాలు అందజేస్తుంది. ఆదివారం లక్ష్మీనారాయణకు అల్పాహారం తీసుకొచ్చేందుకు తల్లి సామ్రాజ్యం అల్పాహారం పెట్టే బండి వద్దకు వెళ్ళి తీసుకొచ్చి కుమారుడికి ఇచ్చింది. రెండుముద్దలు తిన్న పిదప మూడో ముద్ద తినే సమయంలో నాలుకకు గుచ్చుకోవడంతో ఉప్మాను బయటకు ఊయడంతో పిన్నీస్ బయటపడింది. ఉప్మాను వడ్డించిన వారికి, నర్సింగ్ సిబ్బందికి విషయాన్ని తెలియజేసి తదుపరి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్‌కు బాధితుడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కాగా, ఈవిషయంపై ఆసుపత్రి డైటీషియన్ రవికుమార్, కాంట్రాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆహార పదార్థాలు తయారు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటామని, తమ వద్ద వండిన పదార్థాల్లో అలాంటివి ఉండవని పేర్కొన్నారు. కావాలనే కొందరు తమ పై బురదజల్లేందుకు ఈవిధంగాచేసి ఉండవచ్చని వెల్లడించారు. -
జీజీహెచ్‌లో చిన్నారికి వైద్యం నిరాకరణ
బాధితుల ఆందోళనతో ఆసుపత్రిలో అడ్మిషన్ గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్‌లో కొందరు వైద్యుల తీరుతో ఆసుపత్రి ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొద్దిపాటి కాలిన గాయాలతో వైద్యం కోసం వచ్చిన చిన్నారికి చికిత్స చేయకుండా రాత్రంతా అత్యవసర విభాగంలోనే ఉంచారు. వైద్యం చేయకపోగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలని, లేని పక్షంలో చిన్నారి ఆరోగ్యం విషమంగా మారుతుందని భయాందోళనకు గురిచేశారు. సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చిన చిన్నారికి మంగళవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి వైద్య సేవలు అందించకపోవడంతో బాధితులు ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళన చేశారు. దీంతో ఎట్టకేలకు మంగళవారం సాయంత్రానికి చిన్నారికి వార్డులో అడ్మిషన్ లభిం చింది. బాధితుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్‌కు చెందిన కొక్కెరపాటి చంద్రబాబు, నవ్య దంపతుల కుమార్తె ఎనిమిది నెల ల పూజిత సోమవారం ఇంట్లో స్నానానికి నీళ్లు తోడిన సమయంలో శరీరంపై వేడి నీళ్లుపడి గాయపడింది. వెంటనే తల్లిదండ్రులు చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు గుంటూరులో ప్రత్యేక వార్డు ఉందని చెప్పి రిఫర్ చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు క్యాజువాలిటీకి వచ్చిన చిన్నారి పూజితకు వైద్యులు అడ్మిషన్ ఇవ్వలేదు. జనరల్ సర్జరీ వైద్యులు, పిడియాట్రిక్ సర్జరీ వైద్యులు, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు, చిన్నపిల్లల వైద్య నిపుణులు చిన్నారిని అడ్మిట్ చేసుకోకుండా మాకు సంబంధించింది కాదంటే మాకు సంబంధించింది కాదంటూ మిన్నకుండిపోయారు. ఒక పక్క కాలినగాయాలతో పసికందు తీవ్రంగా రోదిస్తున్నా వైద్యులు పట్టించుకోకపోవడం చిన్నారి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచి వేసింది. విషయం తెలిసిన మీడియా ఆసుపత్రికి చేరుకోవడంతో ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్, క్యాజువాలిటీకి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి వార్డులో అడ్మిషన్ ఇచ్చారు. -
జీజీహెచ్‌లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం
గుంటూరు మెడికల్: స్థానిక ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో సోమవారం విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు ప్రారంభించి ఇప్పటికి ఐదు పూర్తి చేశారు. గుంటూరు బొంగరాలబీడు ఐదోలైన్కు చెందిన మరియమ్మకు తల్లి బెజవాడ విశ్రాంతమ్మ కిడ్నీ ఇవ్వటంతో ఆపరేషన్ విజయవంతమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆపరేషన్ జరిగింది. కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి, యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ కేఎస్ఎన్చారి, బూసం ప్రకాశరావు, డాక్టర్ ఉప్పలపాటి సూర్యకుమారి, మత్తు వైద్యనిపుణులు డాక్టర్ షరీఫ్, డాక్టర్ సుధాకర్, డాక్టర్ శ్యామ్ కుమార్, డాక్టర్ వేణుగోపాల్ ఆపరేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా సుమారు ఐదు లక్షల ఖరీదు చేసే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ఉచితంగా చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు తెలిపారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినందుకు వైద్యులను అభినందించారు. -
తల్లీబిడ్డకు రక్షణ కవచం
జీజీహెచ్‌లో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ప్రారంభం వారం రోజుల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి నాలుగు వార్డుల్లో సెన్సార్ల ఏర్పాటు గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా పసికందులు అదృశ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి పిల్లల అపహరణను నియంత్రించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్( ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌ను మొట్టమొదటిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆస్పత్రిలో నాలుగుచోట్ల ఏర్పాటు... ఆస్పత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని కాన్పుల విభాగం( లేబర్‌రూమ్), నవజాతశిశు సంరక్షణ కేంద్రం( ఎస్ఎన్సీయూ), పిల్లల వైద్య విభాగం, గైనకాలజీ వైద్యవిభాగం( 107, 107 వార్డుల్లో)లో సెన్సార్లు ఏర్పాటు చేశారు. పసికందులు పుట్టిన వెంటనే తల్లికి, బిడ్డకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను అమర్చుతారు. దీంతో తల్లీబిడ్డలకు ఒకటే నంబర్ ఉంటుంది. ట్యాగ్ అమర్చగానే తల్లి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఒకసారి ట్యాగ్‌ను చేతికి పెడితే దానిని తీయటం కుదరదు. ట్యాగ్‌లను కత్తిరించి తొలగించటమే మినహా వేరే మార్గం లేదు. తల్లికీ బిడ్డకు మధ్య దూరం 10 మీటర్లు దాటితే వెంటనే పెద్దగా శబ్దం వస్తుంది. వేరే‡వారు పిల్లలను పట్టుకుంటే వెంటనే దొరికిపోతారు. పిల్లలు, తల్లులను ఉంచే వార్డుల్లో సెన్సార్లు ఏర్పాటు చేయడంతో ఇవి ట్యాగ్‌లను మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. గుజరాత్‌కు చెందిన ఓడోహబ్ డాట్‌కామ్ సంస్థ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. వార్డుల ప్రారంభంలో, చివర్లో ఇంటిగ్రేటెడ్ రీడర్ల అమర్చుతారు. కంప్యూటర్లో డెస్క్‌టాప్ రీడర్ ఉంటుంది. తల్లికి, బిడ్డకు అమర్చే ట్యాగ్‌కు సిల్వర్ పూత మాదిరిగా రేడియోవేవ్స్ ఉంటాయి. ట్యాగ్ల నుంచి వచ్చే రేడియోవేవ్స్‌ను అనుసంధానం చేస్తూ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అమర్చారు. రూ.12 లక్షలతో ఏర్పాటు... ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఆస్పత్రిలో ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చయిందని, జీజీహెచ్‌లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న జేబీ సెక్యూరిటీ ఖర్చును భరించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు వెల్లడించారు. కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగానే ఈ నూతన విధానం ఏర్పాటు చేశామన్నారు. ట్యాగ్‌లను అమర్చిన వెంటనే తల్లి బిడ్డ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు రిసెప్షనిస్ట్ కమ్ ఆపరేటర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ట్యాగ్లు ఏర్పాటుచేసేందుకు జతకు రూ.50 ఖర్చవుతుందని, అహ్మదాబాద్ నుంచి ట్యాగ్‌లను తెప్పిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో తల్లిబిడ్డ సంరక్షక కవచాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. -
టెన్షన్.. టెన్షన్...
ఇంక్రిమెంట్ల కోతతో ప్రభుత్వ వైద్యుల్లో ఆందోళన పనిష్మెంట్కు గురైన వారిని పదవుల్లో కొనసాగిస్తారా ? లేదా ? ఓ వ్యక్తి స్వార్థంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్న వైద్యులు గుంటూరు మెడికల్ : ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న 20 మంది గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయటంతో వైద్యుల్లో ఆందోళన ప్రారంభమైంది. మంగళవారం పలువురు ప్రభుత్వ వైద్యుల ముఖాల్లో ఆందోళన, అలజడి ప్రస్ఫుటంగా కనిపించాయి. ముఖ్యంగా యువ వైద్యులు, పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న వైద్యుల్లో ఏం జరుగుతుందోననే కంగారు కనిపిం చింది. అనేక మంది ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దిమంది పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని మిగతా వారిని పక్కకు తప్పించారని కొందరు వైద్యులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ఇద్దరు జీజీహెచ్ వైద్యుల మధ్య కుర్చీ పోరేనని వారు అంటున్నారు. రాష్ట్రమంతా రాజుకుంది గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ కోసం 2014లో ఇద్దరు వైద్యులు పోటీ పడ్డారు. జనరల్ సర్జరీ వైద్యునికి సూపరింటెండెంట్ పోస్టు ఖరారు చేశారు. జీవో కూడా విడుదలైంది. అదే సమయంలో మత్తు వైద్య ని పుణులు సూపరింటెండెంట్ పోస్టు కోసం రాష్ట్ర ఉన్నతాధికారుల అండదండలతో ప్రయత్నం చేశారు. సర్జరీ డాక్టర్ సొంతంగా నర్శింగ్ హోమ్ పెట్టుకుని ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారని మెమో ఇప్పించారు. మెమోను సాకుగా చూపించి సూపరింటెండెంట్ పోస్టుకు అనర్హుడిని చేశారు. దీంతో సర్జరీ డాక్టర్ రాష్ర్టంలో ఎంత మంది ప్రభుత్వ వైద్యులు సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారో వారి వివరాలను విజిలెన్స్ అధికారులు, ఉన్నతాధికారులు అందజేశారు. వారందరి పైనా చర్యలు తీసుకోకపోతే తనపైనా చర్యలను ఉపసంహరించాలని కోరారు. విజిలెన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెప్పింది. పక్కన పెడతారా ? కొనసాగిస్తారా ? గతంలో మెమో ఆధారంగా ఓ వ్యక్తికి సూపరింటెండెంట్ సీటు ఇవ్వకుండా పక్కన పెట్టిన అధికారులు.. నేడు ఇంక్రిమెంట్స్ కోతకు గురైన వారిని ఉన్నత స్థానాల్లో కొనసాగిస్తారా లేక పక్కన పెడతారా అనే విషయంపై చర్చ నడుస్తోంది. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావుకు ఇంక్రిమెంట్స్లో కోత విధిస్తూ 20 మంది వైద్యుల జాబితాలో ఆయన పేరునూ ప్రభుత్వం చేర్చింది. ఇదే విధంగా అడిషనల్ డీఎంఈ బాజ్జికి కూడా నర్సింగ్ హోమ్ ఉందని ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్ నివేదిక ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. వీరిపై చర్యలను తీసుకున్న నేపథ్యంలో పదవుల నుంచి పక్కన పెట్టకుండా కొనసాగిస్తే ప్రభుత్వ తీరుపై వైద్యుల సంఘం నేతలు తీవ్రస్థాయిలో మండిపడతారు. 9న వైద్యుల సమావేశం జీజీహెచ్‌తోపాటుగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలను ఉపక్రమిస్తున్న నేపథ్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యుల సంఘ నేతలు విజయవాడలో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం 2004లో సాయంత్రం 4 గంటల తర్వాత ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఇవ్వటం వల్లే తాము క్లినిక్‌లకు వెళ్తున్న విషయాన్ని వివరించాలని నిర్ణయించారు. -
జీజీహెచ్‌లో బాలుడు అదృశ్యం
గుంటూరు : ఆసుపత్రిలో చికిత్సపొందేందుకు వచ్చిన ఓ బాలుడు క్యాంటిన్ వద్దకు వెళ్లి అదృశ్యమయ్యాడు. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పొన్నూరు మండలం నండూరుకు చెందిన షేక్‌బాజి తొమ్మిదేళ్ల కుమారుడు షాహిద్‌ను ఈనెల 15వ తేదీన చికిత్స కోసం 108వ నంబరు గదిలోని పిల్లల వార్డులో అడ్మిట్ చేశారు. బాలుడి ముక్కు నుంచి అప్పుడప్పుడూ రక్తం పడుతుండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. షాహిద్ బుధవారం టిఫిన్ చేసేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రిలోని క్యాంటిన్ వద్దకు వెళ్లాడు. కుటుంబసభ్యులు టిఫిన్ చేస్తున్న సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని చెప్పి క్యాంటిన్ నుంచి బయటకు వచ్చాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. కొంతసేపు వేచి చూసిన తల్లిదండ్రులు వార్డులో ఉన్నాడేమోనని వెతికారు. అక్కడ కనిపించకపోయేసరికి ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలలో పిల్లవాడు ఎటువైపు వెళ్లాడనే విషయాన్ని పరిశీలించారు. అయినా జాడ తెలియలేదు. అనంతరం ఆసుపత్రి అధికారులు కొత్తపేట పోలీసులకు బాలుడు అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. -
ఆస్పత్రి బాత్రూంలోకి లాక్కెళ్లి..
గుంటూరు ఆస్పత్రిలో బాలికపై అత్యాచారయత్నం గుంటూరు మెడికల్: గుంటూరు ఆస్పత్రిలో బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక కేకలతో ఆస్పత్రి సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలేనికి చెందిన మహిళ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. తన 13 ఏళ్ల మేనకోడలిని చూడాలని కబురు పంపడంతో బాలికతోపాటు ఆమె తల్లి, తండ్రి మంగళవారం జీజీహెచ్‌కు వచ్చారు. మధ్యాహ్న సమయంలో బాలిక మూత్రవిసర్జన కోసం బాత్రూమ్కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న జబీన్ బాలికను బలవంతంగా లోపలికి లాగి గడియపెట్టాడు. బాలిక అరిచేందుకు ప్రయత్నించగా చంపేస్తానని బెదిరించాడు. ఎంతసేపటికీ బాత్రూమ్ తలుపు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పలుమార్లు తలుపు కొట్టగా బాలిక బిగ్గరగా అరిచింది. నిందితుడు తలుపు తీసి పరుగెడుతుండగా సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మహిళా సెక్యూరిటీ సిబ్బంది జబీన్‌ను చితకబాదారు. జబీన్ తనపై లైంగికదాడికి యత్నించినట్లు బాలిక ఫిర్యాదు చేయడంతో మెడికో లీగల్ కేసుగా నమోదుచేసి వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను గైనిక్ విభాగానికి తరలించినట్లు ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ తెలిపారు. జబీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జబీన్ తరచూ ఆస్పత్రికి వచ్చి హడావుడి చేస్తుంటాడని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. గతంలోనూ పలువురు మహిళలను వేధించినట్లు ఆరోపణలున్నాయి. -
గుంటూరు జీజీహెచ్‌లో పసికందు మృతి
- కుటుంబ సభ్యుల ఆందోళన గుంటూరు : గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం ఓ పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు నెహ్రూనగర్ కు చెందిన రోహిణి సోమవారం తెల్లవారుజామున కాన్పుకోసం జీజీహెచ్ కు వచ్చింది. జూనియర్ వైద్యులు పరీక్షలు చేసి వేడి నొప్పులు అని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి వెళ్లమన్నారని, నొప్పులు తగ్గకపోయేసరికి తాము అక్కడే ఉన్నామని రోహిణి తల్లి పద్మ తెలిపింది. కొంతసేపటి అనంతరం సీనియర్ డాక్టర్లు వచ్చి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని, మగ శిశువును బయటకు తీసే సమయంలో కింద పడేయడంతో తలకు గాయమై మృతి చెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ మృతిచెందాడని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులో మృతి చెందాడని ఒకసారి, పేగు మెడకు చుట్టుకుని ఉండటం వల్ల మృతి చెందాడని మరోసారి.. పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని ఆరోపించారు. ధర్నా విషయం తెలుసుకున్నపోలీసులు, ఆర్ఎం డాక్టర్ రమేష్ బాధితులతో చర్చలు జరిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శౌరి రాజునాయుడు మాట్లాడుతూ కాన్పు విషయం కష్టంగా ఉన్నట్లు ముందస్తుగా కుటుంబ సభ్యులకు తెలియజేసి ఆపరేషన్ చేశామన్నారు. బాలింతను రక్షించాలనే ప్రయత్నం చేశాం తప్పితే వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. బాధితులు కోరితే పోస్టుమార్టం చేసి దానిపై విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
డాక్టర్ గోఖలేకు సీఎం సన్మానం
విజయవాడ : గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో ఒకరికి గుండె మార్పిడి చేసి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా జరిపిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాల యంలో శనివారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఎంసెట్ ఫలి తాలను ప్రకటించడంలో, నీట్ ఆర్డినెన్స్ జారీచేయడంలో కృషిచేసిన సీఎం చంద్రబాబునాయుడును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఎంసెట్ మెడికల్ ఫలితాల విడుదల కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సరైన విధంగా చర్యలు తీసుకున్నారని కామినేని సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని , ప్రత్తిపాటి పాల్గొన్నారు. సందర్శకులకు సీఎం చేయూత సమస్యలతో వచ్చిన పలువురు సందర్శకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేశారు. విజయవాడకు చెందిన చందన సీఎంను కలిసి తన భర్తకు హెచ్ఐవీ ఉందని, కుమారుడు మానసిక వికలాంగుడని, కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాని వివరించగా, సీఎం స్పందించి ఇల్లు మంజూరు చేసి, రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని అదికారులను ఆదేశించారు. మచిలీపట్నానికి చెందిన భారత్ గ్యాస్ డీలర్ బడే వెంకటేశ్వరరావు తాను భాగస్వామి చేతిలో మోసపోయానని, న్యాయం చేయాలని కోరగా ఆ మేరకు సీఎం హామీ ఇచ్చారు. -
జీజీహెచ్‌లో పూనం మాలకొండయ్య తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం కూడా తనిఖీలు నిర్వహించారు. వైద్య ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రతీ నెలా ఓ బోధనాస్పత్రిలో మూడు రోజుల పాటు ఆమె తనిఖీలు నిర్వహించనున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రోగులను అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వైద్య పరికరాలు ,మెరుగైన వైద్యం ఎలా అందించాలి అనే అంశాలపై ఆమె దృష్టి సారించారు. గత నెల విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. -
లంచం ఇస్తేనే బిడ్డను ఇస్తాం
గుంటూరు మెడికల్: ‘మగబిడ్డ పుడితే రూ.వెయ్యి ఇవ్వాలి.. ఆడపిల్ల పుడితే రూ.500 ఇవ్వాలి. లేదంటే మీ బిడ్డను ఇవ్వం’ అంటూ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో పనిచేస్తున్న ఆయాలు లంచాలు డిమాండ్ చేస్తున్నారని పలువురు బాలింతల కుటుంబసభ్యులు ఆదివారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఆర్ఎంవో డాక్టర్ రమేశ్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు కాన్పుల విభాగంలో విచారించారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఎఫ్ఎన్వో)లు పి.పద్మ, ఆర్.కమల, సత్యవేదంలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ తెలిపారు. సంఘటనలు పునరావృత్తం కాకుండా కాన్పుల విభాగంలో లోపల, వరండా వైపు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
గుంటూరు జీజీహెచ్‌లో 'మ్యాడ్ కౌ' కలకలం
- మందులు, వైద్యం అందుబాటులో లేని వ్యాధి - లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన మహిళ - వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్న వైద్యులు గుంటూరు : యూరప్ దేశాల్లో మాత్రమే కనిపించే అరుదైన వ్యాధి 'మ్యాడ్ కౌ'. ఈ వ్యాధి లక్షణాలున్న మహిళ గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఉన్న విషయం మంగళవారం కలకలం రేకెత్తించింది. ఈ వ్యాధికి వైద్యంగానీ, నియంత్రణకు మందులు గానీ అందుబాటులో లేకపోవటంతో వైద్యులు ఆమెను వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడాదికాలంలో ఇలాంటివి నాలుగు కేసులు నమోదవటంతో న్యూరాలజీ వైద్యులు ఆ రోగిపై పరిశోధన చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం రంగారావుపేటకు చెందిన దాసరి రత్నకుమారి ఏడాది నుంచి అనారోగ్యంతో ఉంటుంది. ఈ నెల 5న ఆమెను తల్లి కృపమ్మ చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చింది. న్యూరాలజీ వైద్యులు పరీక్షించి 'మ్యాడ్ కౌ' అనే అరుదైన వ్యాధి సోకినట్లు భావించి వార్డులో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. మంగళవారం న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి ఈ అరుదైన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. గతంలో గుంటూరుకు చెందిన ఒక మహిళ ఈ వ్యాధితో జీజీహెచ్‌లో చేరి చనిపోయిందన్నారు. మరొకరు గతంలో ఇదే వ్యాధితో చేరి కొన్ని రోజులకు వెళ్లిపోయారని వివరించారు. తాజాగా మంగళవారం మరో వ్యక్తి ఇదే వ్యాధితో జీజీహెచ్‌లో చేరాడని వివరించారు. ఈ వ్యాధి సోకినవారు రెండేళ్ల వ్యవధిలో చనిపోతారని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో ఈ వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు ఎక్కడా లేకపోవటం వల్ల, కేవలం లక్షణాలను బట్టి వ్యాధి సోకినట్లు నిర్ధారించామన్నారు. ఈ వ్యాధి ఇంట్లో ఒకరికి ఉంటే వారి నుంచి మరొకరికి వ్యాప్తించటం లేదా జన్యుపరమైన కారణాల వల్ల లేదా ఒక్కోసారి ఎలాంటి కారణాలు లేకుండా కూడా రావచ్చని చెప్పారు. గొడ్డు మాంసం( బీఫ్) తినేవాళ్లలో ఎక్కువగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యాధి సోకిన మనిషి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారని, మతి మరుపు ఉంటుందని, నడవలేకపోవటం, చేతుల్లో నుంచి వస్తువులు ఊరికే జారి కిందపడిపోతాయని తెలిపారు. ఇది చాలా భయంకరమైన వ్యాధి అని, ఈ వ్యాధికి ఇప్పటి వరకు చికిత్స కనుగొనలేదని, నివారణ, నియంత్రణ పద్ధతులు ఏమీ లేవని చెప్పారు. కనీసం ఉపశమనం కోసం మందులు కూడా లేవని, ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నట్లు చెప్పారు. ఈ వ్యాధిని 1920లో డాక్టర్ జాకబ్ తరువాత ఆయన శిష్యుడు క్రూడ్జ్ఫెల్డ్ కనుగొన్నారని, వారి పేరుమీదుగా ఈ వ్యాధిని వైద్య పరిభాషలో 'క్రుడ్జ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్' అంటారని చెప్పారు. వెన్నుపూసలో నుంచి నీరు తీసి, బ్రెయిన్‌కు బయాప్సీ పరీక్ష చేసి కొంతమేరకు వ్యాధిని నిర్ధారించవచ్చని, ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. వ్యాధి లక్షణాలు గుర్తించడంతోపాటు, ఎంఆర్ఐ పరీక్ష ద్వారా కూడా కొంతమేరకు నిర్ధారణ చేసుకున్నామన్నారు. ఢిల్లీ, ముంబై పట్టణాల్లో మ్యాడ్ కౌ వ్యాధికి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎన్నాళ్లో వేచిన హృదయం!
అనంత వాయువుల్లో కలిసిపోతున్న ప్రాణాలను సైతం అరచేరుు అడ్డుపెట్టి నిలబెట్టగల దేవుళ్లు వైద్యులు..అందుకే వారిని వైద్యో నారాయణ హరి అన్నారు.. ఇలాంటి కోవలోకే వస్తారు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే.. శరీరానికి వైద్యం చేసి.. గుండెల్లో కొలువుంటారాయన.. ఆరు జిల్లాల ఆరోగ్య ప్రదారుునిగా ఉన్న జీజీహెచ్ ఖ్యాతిని రెట్టింపు చేస్తూ గుండె మార్పిడి ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.. ప్రభుత్వ ప్యాకేజీపై స్పష్టత లేకపోరుునా.. దాతల ఔదార్యాన్నే ఆలంబనగా చేసుకుని పేదోడి గుండెకు ఆయుష్షు పోస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెరుున్ డెడ్ అరుు కట్టెగా మారిన అభాగ్యుల హృదయ స్పందనను పది కాలాలపాటు బతికుండేలా చేస్తున్నారు. సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోనే తొలిసారిగా జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత నెల 18వ తేదీలోపే గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించాలని డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ గుండె దానం చేసే దాత దొరక్క పోవడంతో కొంత ఆలస్యమైంది. జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతులు అయితే వచ్చాయిగానీ, ఇంత వరకు ఈ ఆపరేషన్‌కు ఎంత ప్యాకేజీ ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. అయినప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు దాతల సహాయంతో ముందుకు సాగుతున్నారు. జీజీహెచ్‌లో ఇప్పటికే గుండె మార్పిడి ఆపరేషన్ కోసం ఇద్దరు రోగులు ఎదురు చూపులు చూస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ కల నేటితో సాకారం కానుంది. కార్పొరేట్ వైద్యశాలలో గుండె మార్పిడి ఆపరేషన్‌కు లక్షల్లో డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించాలనే సంకల్పంతో డాక్టర్ గోఖలే సహృదయ ట్రస్టు ద్వార పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ ( పీపీపీ) పద్ధతిలో ముందుకు వచ్చారు. ఇప్పటికే జీజీహెచ్‌లో నిరుపేద రోగులకు ఏడాది కాలంలో 159 గుండె ఆపరేషన్లు నిర్వహించి చరిత్ర సృష్టించారు. పలు దురదృష్ట సంఘటనల ద్వారా మసక బారిన జీజీహెచ్ ప్రతిష్ట గుండె మార్పిడి ఆపరేషన్‌తో మళ్లీ పెరగనుంది. జీజీహెచ్‌లో జరిగే ఈ మహా యజ్ఞం విజయవంతం కావాలని అంతా కోరుకుంటున్నారు. భర్త గుండెతో మరొకరికి ప్రాణం పోయాలని.. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలేనికి చెందిన రంపచోటి వెంకట్రావు (24) మంగళవారం తన భార్యను చూసేందుకు జీ పంగలూరు వెళుతుండగా మేదరమెట్ల జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిపోయాడు. జీజీహెచ్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించి అవయవదానంపై కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో కుటుంబ సభ్యుల ఆమోదంతో వెంకట్రావు శరీరంలోని అన్ని అవయవాలను దానం చేశారు. గర్భిణి అరుున వెంకట్రావు భార్య శిరీష దుఖాన్ని పంటి బిగువన బిగపట్టి ఈ మహాయజ్ఞానికి పురుడు పోసింది. -
జీజీహెచ్‌లో అందుబాటులోకి రానున్న 24 గంటల ల్యాబ్
కాకినాడ సిటీ : కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో 24 గంటల ల్యాబ్ త్వరలో అందుబాటులోకి రానున్నది. ఆసుపత్రి అధికార్లు ఇప్పటికే ల్యాబ్‌టెక్నీషియన్ సిబ్బందికి శిక్షణను పూర్తిచేశారు. ప్రస్తుతం ప్రారంభ సన్నాహాల్లో భాగంగా సిబ్బంది సేవలందించేందుకు డ్యూటీ రోస్టర్ల జాబితా రూపొందిస్తున్నారు. సేవలు ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రిలయన్స్ అందించిన రూ.80 లక్షలు సీఎస్ఆర్ నిధులతో జీజీహెచ్‌లో మల్టీస్పెషాల్టీ లేబొరేటరీని నిర్మించి అధునాతన ల్యాబ్ పరికరాలు సిద్ధం చేసినప్పటికీ గడిచిన సంవత్సర కాలంగా సేవలు వినియోగంలోకి రాలేదు. జీజీహెచ్ ఉభయగోదావరి జిల్లాలకు ప్రధాన ఆస్పత్రి కావడంతో 24 గంటలూ అత్యవసర విభాగానికి వివిధ ప్రాంతాల నుంచి పాముకాటు బాధితులు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినవారు, వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారు వస్తుంటారు. మరోపక్క సుమారు 1500 మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతుంటారు. సుమారు 3 వేలమంది ప్రతీరోజు ఔట్పేషెంట్లు ఉంటారు. అయితే రోజూ వైద్యులు ఇన్, ఔట్‌పేషెంట్లకు పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలజీ విభాగాలకు సంబంధించి బ్లడ్‌సుగర్, యూరిన్ టెస్ట్, హిమోగ్లోబిన్, లివర్ ఫంక్షన్, థైరాయిడ్ వంటి టెస్ట్‌లు నాలుగు వందలకు పైబడి రాస్తుంటారు. వీరందరూ మధ్యాహ్నం 12గంటల వరకు పనిచేసే ఆసుపత్రిలోని 7వ నంబర్లోని ల్యాబ్‌కు వెళ్లాలి. కాని అక్కడ రద్దీ, సమయం దాటిపోవడం వంటి కారణాలతో చేసేదిలేక అనేకమంది బయటి ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం నుంచి తెల్లారే వరకు అత్యవసర విభాగానికి వచ్చే క్షతగాత్రుల బంధువులకు కన్నీటి పరీక్షలు తప్పడం లేదు. రక్తపరీక్షకు కూడా బయటి ప్రైవేటుల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా ల్యాబ్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నారు. ఈ పరిస్థితుల్లో 24గంటల ల్యాబ్ వినియోగంలోకి వస్తే ఇబ్బందులు తొలగుతాయి. -
జీజీహెచ్‌లో త్వరలో ఉచితంగా డయాలసిస్
గుంటూరు : ఇప్పటివరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే కిడ్నీ రోగులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యసేవలను ఉచితంగా అందించారు. ఇక నుంచి రేషన్‌కార్డు లేకపోయినా ఉచితంగా డయాలసిస్ వైద్యం అందిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గురువారం జీజీహెచ్‌కు వచ్చారు. జీజీహెచ్ కిడ్నీ వైద్యులు గొంది శివరామకృష్ణ, డేగల వాణిలు రెండు హీమోడయాలసిస్ మెషీన్లు కావాలని కోరగా వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. తక్షణమే జీజీహెచ్‌కు డయాలసిస్ మెషీన్లు వచ్చేలా చేస్తామని హామీఇచ్చారు. ఇప్పటివరకు పీపీపీ విధానంలో బిబ్రాన్ కంపెనీవారు జీజీహెచ్‌కు వచ్చే కిడ్నీరోగులకు తెల్లరేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు లేని వారు విజయవాడలోని సీఎం రిఫరల్ కేంద్రానికి వెళ్లి అనుమతి పత్రం తెచ్చుకుంటే డయాలసిస్ చేసేవారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు విజయవాడ వెళ్లి రావడం ఎంతో కష్టంగా ఉండడంతో జీజీహెచ్ నెఫ్రాలజీ వైద్యులు తమ విభాగానికి డయాలసిస్ మెషీన్లు ఇస్తే రోగులు ఇబ్బంది పడకుండా డయాలసిస్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరగుతున్న నేపథ్యంలో నెఫ్రాలజీ విభాగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పనిలేకుండా ప్రభుత్వం కొనుగోలుచేసిన మెషీన్లు ఉంటే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చనే విషయాన్ని వివరించడంతో డీఎంఈ డాక్టర్ వేణుగోపాలరావు కిడ్నీ డే సందర్భంగా ప్రకటన చేసి కిడ్నీ రోగులకు తీపికబురు అందించారు. ఈ నెలాఖరులోగా డయాలసిస్ మెషీన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మిషన్లు రాగానే అందరికీ ఉచిత డయాలసిస్ వైద్యం అందుబాటులోకి వస్తుంది. -
నాడు ఘన కీర్తి.. నేడు అపకీర్తి
పద్మశ్రీలు పొందిన జీజీహెచ్ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు క్రమేణా నిర్లక్ష్యంతో వైభవం కోల్పోతున్న వైద్య కళాశాల యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగానికి గుర్తింపు నిరాకరణ వైద్యుల రిజిస్ట్రేషన్‌కు తిరస్కరించిన ఏపీ మెడికల్ కౌన్సిల్ గుంటూరు: అనేక దేశాల్లో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న ఎందరో వైద్యులను అందించిన ఘన చరిత్ర గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ప్రభుత్వం పద్మశ్రీలతో సత్కరించింది. కొందరు ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, ప్రముఖ వైద్యులుగా, రాజకీయ నాయకులుగా రాణించారు. జీజీహెచ్‌లో సరైన సౌకర్యాలు లేనప్పుడే..అప్పటి అధికారులు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించారు. ఇప్పుడు పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. అత్యున్నత వైద్య పరికరాలు, వసతులు ఉన్నప్పటికీ గతంలో మాదిరిగా విద్యార్థులను తీర్చిదిద్దలేకపోతున్నారు. ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎంసీఐ ఆదేశాలు బేఖాతరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో తనిఖీలు నిర్వహించిన ప్రతిసారీ భారత వైద్య మండలి (ఎంసీఐ) అక్కడి వసతులు, వైద్య పరికరాల లేమి, సిబ్బంది కొరత వంటివి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు ఆ పోస్టుకు అర్హులు కాదని, గత తనిఖీల్లో తేల్చి చెప్పింది. కానీ ఈ ఏడాది తనిఖీల సమయంలో అర్హులను ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆ ఒక్కరోజు ఎంసీఐ అధికారుల కళ్లకు గంతలు కట్టారు. గతేడాది సూచనలు పాటించలేదంటూ ఎంసీఐ ఏకంగా 50 ఎంబీబీఎస్ సీట్లకు కోత విధించడంతో రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు రంగంలో దిగి బతిమాలుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆ తరువాతా గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు లేవు. నిన్న మొన్నటి వరకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పని చేసిన డాక్టర్ వేణుగోపాలరావు, ప్రస్తుతం డీఎంఈగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌లోని సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నా పరిష్కరించడంలో శ్రద్ధ చూపడం లేదు. రోడ్డున పడిన యూరాలజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఇటీవల యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కోర్సు పూర్తి చేసిన వైద్యులు రోడ్లపై తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఈ విభాగంలో సరైన వసతులు, వైద్య పరికరాలు లేవనే కారణంతో ఎంసీఐ గుర్తింపు ఇవ్వలేదు. దీంతో కోర్సు పూర్తి చేసిన వైద్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఎంసీఐ గుర్తింపు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌కు ఏపీ మెడికల్ కౌన్సిల్ తిరస్కరించింది. యూరాలజీ విభాగాధిపతిగా కొనసాగుతున్న డాక్టర్ సూర్యకుమారి నాలుగేళ్లుగా విజయవాడ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్‌గా డిప్యూటేషన్‌పై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో వేతనం తీసుకుంటూ విజయవాడలో పని చేస్తున్నారు. ఎంసీఐ తనిఖీలు, పీజీ పరీక్షలు జరుగుతున్న సమయంలో మాత్రం ఇక్కడ హెచ్ఓడీగా ప్రత్యక్షమవుతున్నారు. గుంటూరు వైద్య కళాశాల్లో చదివిన పూర్వ విద్యార్థులు డాక్టర్ సీఎం హబీబుల్లా, డాక్టర్ గొల్లపల్లి ఎన్ రావు, డాక్టర్ బీ సోమరాజు, డాక్టర్ డీ ప్రసాదరావు, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, డాక్టర్ నాయుడమ్మ, డాక్టర్ గోపీచంద్ వంటివారు పద్మశ్రీ అవార్డులు తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుత విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. -
పోలీస్‌స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
ఓ చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో.. అతని పరిస్థితి విషమంగా ఉంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు మర్మాంగాలపై బూటు కాళ్లతో తన్నడంతో.. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతన్ని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాదితుని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అమాయకుడిని పట్టకొని చితక బాదిన సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. ఓ సందర్భంలో పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఓ డాక్టర్ ఇంట్లో జరిగిన దొంగతనం విషయంలో సైదా అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో నలుగురు కానిస్టేబుల్స్‌తో కలిసి సైదాను తీవ్రంగా హింసించడంతో పాటు మర్మాంగం పై బూటు కాళ్లతో తన్నడంతో.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన అతని కుంటుంబ సభ్యులు గుంటూరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. -
డబ్బుల కోసం పురిటి బిడ్డను మార్చేశారు!
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ఓ వివాదంతో మరోసారి వార్తల్లో కెక్కింది. అప్పుడే పుట్టిన తమ బాబును మార్చేశారంటూ ఓ తల్లి తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ ఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే, ఆమె చేతికి మాత్రం అమ్మాయిని ఇచ్చారు. దీంతో ఆ తల్లి ఆందోళనకు గురై కుటుంబసభ్యులతో కలసి ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ఈ విషయమై సంప్రదించగా... వారికి పుట్టింది పాప అని.. అయితే పొరపాటున ఆస్పత్రి నర్స్ అబ్బాయి అని చెప్పడంతో వివాదం చెలరేగిందని వివరణ ఇచ్చుకున్నారు. నేడు ఒకే ఒక్క కాన్పు జరిగిందని.. పసివాళ్ల మార్పు జరిగే అవకాశాలే లేవని ఆస్పత్రి వర్గాలు తమపై వస్తోన్న ఆరోపణల్ని కొట్టిపారేశాయి. కానీ.. ఆస్పత్రిలోనే ఎదో గందరగోళం జరిగిందని బాధిత కుటుంబం ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి వర్గాలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. డబ్బులు ఇవ్వనందుకు తమ బిడ్డను మార్చివేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆస్పిత్రి సిబ్బంది అడిగితే తాము డబ్బులు ఇవ్వని కారణంగానే బాబుని మార్చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. -
జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో జీవన్‌దాన్ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభించామని సహృదయ ట్రస్టు నిర్వాహకులు, ప్రముఖ గుండెమార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ళ గోపాలకృష్ణగోఖలే చెప్పారు. గుండె మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు తమ వద్ద తొమ్మిది మంది గుండె జబ్బు రోగులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వ అనుమతి రాగానే గుండె మార్పిడి ఆపరేషన్లు ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేందుకు ఆలస్యమయ్యే పక్షంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు వైద్య బృందం జీజీహెచ్‌లో సిద్ధంగా ఉందని స్సష్టం చేశారు. బ్రెయిన్ డెడ్ అయినవారి అవయవాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించేందుకు, ఆపరేషన్ అనంతరం అవసరమయ్యే మందులు, ఆపరేషన్ చేసేందుకు అయ్యే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దాతలు పెద్ద మనస్సుతో ముందుకు రావాలని కోరారు. సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో జీజీహెచ్‌లో గత ఏడాది మార్చి 18 నుంచి ఆరోగ్యశ్రీ రోగులకు ఎన్టీఆర్‌ట్రస్టు వైద్య సేవ ద్వారా ఉచితంగా బైపాస్ సర్జరీలు చేస్తున్నామని తెలిపారు. తమ ట్రస్టు సేవలు జీజీహెచ్‌లో ప్రారంభమై మార్చి 18 నాటికి ఏడాది పూర్తి అవుతుందని, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆపరేషన్ చేసేందుకు ముందుగా వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సుమారు రూ. లక్షన్నర, ఆపరేషన్‌కు రూ. 12 లక్షలు, ఆపరేషన్ చేసిన తొలి ఏడాది మందులు వాడేందుకు రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. తాముచేస్తున ఓపెన్ హార్ట్ సర్జరీలకు గుంటూరుకు చెందిన వైద్య నిపుణులు వైద్య నిపుణులు డాక్టర్ చిరుగుపాటి నాగేశ్వరరావు కుమారుడు కృష్ణ ప్రసాద్, ప్రతినెలా కొంత విరాళంగా అందజేస్తున్నారని, దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ అనుమతి వచ్చేలోగా రోగులు ఇబ్బంది పడకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేస్తామన్నారు. దాతలు 9848045810, 9391029810 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని డాక్టర్ గోఖలే కోరారు.సమావేశంలో సీటీఎస్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్‌లు, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ లలిత, కో ఆర్డినేటర్ శాంతి, పాల్గొన్నారు. -
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి 'ప్రైవేటు' చికిత్సపై ఆయన మండిపడ్డారు. మంత్రిగారు మోచిప్ప మార్పిడి కన్నా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం అంబటి రాంబాబు ఇక్కడ మాట్లాడుతూ 'మంత్రిగారు జీజీహెచ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయట నుంచి ప్రయివేట్ వైద్యుల్ని తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. రోగులకు, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడం కోసం సాక్షాత్తూ మంత్రిగారే ఆపరేషన్ చేయించుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే మంత్రిగారి నిర్వాకం వల్ల జీజీహెచ్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. ఆయన బయట నుంచి డాక్టర్లను తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. డాక్టర్లేమో బయటవారు, బెడ్స్ మాత్రం గవర్నమెంట్వా? ఇలా చేస్తే ప్రభుత్వ ఆస్పత్రి పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? గవర్నమెంట్ ఆస్పత్రుల పరువు ప్రతిష్టలు దిగజార్చేలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రవర్తించారు. జీజీహెచ్ ప్రతిష్ట ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతగా దిగజారిపోయిందో మనం చూశాం. పసిపిల్లల్ని ఎలుకలు కొరుక్కు తిన్నాయి. ఆ ఎలుకల్ని తినడానికి పాములు వచ్చాయి. ఒక జూ పార్కులా గవర్నమెంట్ ఆస్పత్రి దిగజారిపోయింది. మంత్రిగారి చర్యలో అది మరింత పడిపోయిందని' మండిపడ్డారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పనిగట్టుకుని విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టి, ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని, చంద్రబాబు, ఆయన ప్రభుత్వం పని చేస్తున్నట్లు తేటతెల్లం అవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వైఎస్ఆర్ సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప మరే పనేమీ కనిపించడం లేదని అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని అణచాలని, కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారని, ఇది ఎక్కువ కాలం సాగదన్నారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సవాల్ చేస్తే ఏవో రెండు క్లిప్పింగ్స్ బయటపెట్టి, ఆధారాలు విడుదల చేశామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని అంబటి విమర్శించారు. వాటిలో మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ లేరనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. -
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
-
'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి'
గుంటూరు మెడికల్: సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు అందరూ సర్కారు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం గుంటూరు జిల్లా ఆస్పత్రిలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ను మంత్రి పల్లె, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పరామర్శించారు. అనంతరం మంత్రి ఓపీలో బీపీ, ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకే మంత్రి కామినేని ఇక్కడ మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారని, తాను పరీక్షలు చేయించుకున్నానని వివరించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. కాగా మంత్రి కామినేని మోకాలి ఆపరేషన్ వివాదంగా మారుతోంది. జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే ఇక్కడ ఆపరేషన్ అన్న ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది. -
ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స
-
ప్రభుత్వ ఆస్పత్రిలో కామినేనికి శస్త్రచికిత్స
గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు శుక్రవారం మోచిప్ప మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు మాట్లాడుతూ.. ఆస్పత్రి చరిత్రలో ఈ రోజును సువర్ణాక్షరాలతో లిఖించవచ్చన్నారు. జీజీహెచ్ వైద్యులపై నమ్మకం ఉంచి.. ప్రజలకు ప్రభుత్వాస్పత్రులపై ఉన్న అపనమ్మకాలను పారద్రోలేలా స్వయంగా మంత్రి జీజీహెచ్‌లో ఆపరేషన్ చేయించుకున్నారని చెప్పారు. -
'ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ డాక్టర్లకు మధ్య వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీలో 501 మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ 25న ప్రైవేట్ ఆస్పత్రులతో సమావేశమై ప్యాకేజీలు ఖరారు చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లోనూ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ 22న జీజీహెచ్ లో మోకాలికి చికిత్స చేయించుకుంటానని మంత్రి కామినేని వివరించారు. విధులకు సక్రమంగా హాజరు కాని 650 మంది ప్రభుత్వ వైద్యులకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ విదితమే. -
వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల
-
వైఎస్ జగన్ హెల్త్ బులెటిన్ విడుదల
గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 24 గంటలు తమ పర్యవేక్షణలో ఉండాలని గుంటూరు ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్) వైద్యులు తెలిపారు. జగన్ కు క్రమేణా ప్లూయిడ్స్ అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, మెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. జగన్ కు బీపీ 130/80, కీటోన్స్ 3 ప్లస్, యూరిక్ యాసిడ్ 13.2 గా ఉందని తెలిపారు. పూర్తిస్థాయిలో కోలుకునేదాకా జగన్ ఆస్పత్రిలోనే ఉండాలని ఆయన సూచించారు. ఏడు రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా జీజీహెచ్ కు తరలించారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
నెలలో ఒక్కరోజు ‘స్వచ్ఛాంధ్ర’కు
ప్రజలకు సీఎం పిలుపు సాక్షి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలూ నెలలో ఒక్కరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ విషయంలో మహాత్మాగాంధీ ఆదర్శంగా ముందుకు సాగుదామన్నారు. జపాన్, సింగపూర్ మాదిరిగా రాష్ట్రంలోనూ చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా బాధ్యతతో వ్యవహరించి ఉద్యమంలా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. ‘స్వచ్ఛ భారత్’లో ప్రస్తుతం దేశంలో మూడోస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటిస్థానంలోకి తేవాలని కోరారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని గుంటూరులో శుక్రవారం ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్’ను సీఎం ప్రారంభించారు. ప్రతినెలా మొదటి శనివారాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్కోసం కేటాయించామని ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ సీఎం చెప్పారు. రాజధాని నిర్మాణంలో బిల్డర్లకు భాగస్వామ్యం: సీఎం నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని భవన నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ రియల్ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్(అప్రెడా) ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన సీఎం మాట్లాడుతూ ఏపీ బిల్డర్లు ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు గుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పారు. శుక్రవారం జీజీహెచ్‌లో పలు వార్డులను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవుట్సోర్సింగ్ విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు బాధాకరమమన్నారు. కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యం వల్ల శానిటేషన్ పూర్తిగా దెబ్బతిందని, అన్ని ఆసుపత్రుల్లో శానిటేషన్ ప్రక్షాళన కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఆత్మహత్యలు మానసిక బలహీనత అని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనాలని, ఆత్మహత్యలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
మరో శిశువును మింగేసిన నిర్లక్ష్యం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఊడలు దిగిన నిర్లక్ష్య వటవృక్షపు వేళ్లు మరో శిశువు మెడకు ఉరితాడయ్యాయి. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయడం, చీపుళ్లు పట్టి ఊడవడం కాదు... ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల మనసుల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఊడ్చిపారేయాలి... వారి మనసు తలుపులు తెరిచి సేవాదృక్పథాన్ని తట్టి లేపాలి. అప్పుడు గానీ జీజీహెచ్‌లో మృత్యుహేల అంతం కాదు... • జీజీహెచ్‌లో కొనసాగుతున్న మృత్యుహేల • బంధువుల ఆందోళన • సిబ్బంది వైఖరిలో మార్పు రావాలి • ప్రజాసంఘాల ఉద్ఘాటన గుంటూరు రూరల్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందిన సంఘటన రాష్ట్ర ప్రజలు మరువక ముందే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సోమవారం మరో ముక్కు పచ్చలారని శిశువు కన్నుమూసింది. చిలకలూరిపేట మండలం తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడవ నెల గర్భిణి. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు బిడ్డ పరిస్థితి బాగాలేదని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌చేశారు. దీంతో ఉదయం 12 గంటలకు అనూష భర్త జాన్‌తో కలిసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఓపీ రాసిన వైద్యులు స్కానింగ్ తీయించుకోవాలని చెప్పగా, అక్కడినుంచి స్కానింగ్‌కు వెళ్లారు. స్కానింగ్ వద్ద సిబ్బంది లేకపోవటంతో మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే వైద్యుని వద్దకు వెళ్లగా అప్పటికే క్యూలో మరో 10 మంది ఉండటంతో కాన్పుల వార్డులో వేచి ఉండాలని సిబ్బంది సూచించారు. క్యూలో నిలబడిన అనూష సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిలబడలేక కూలబడటంతో అనూష బంధువులు సిబ్బందిని నిలదీశారు. దీంతో సిబ్బంది వీల్ చైర్‌ను ఇవ్వగా, వీల్ చైర్లో కూర్చున్న అనూషకు ఉమ్మనీరు పూర్తిగా పోయింది.నొప్పులు తీవ్రమవడంతో సిబ్బంది అనూషను నడిపించుకుంటూ వార్డుకు తీసుకెళ్లారని ఈ క్రమంలో కాన్పు పూర్తవుతుండగా మంచంపై పడుకోబెట్టగానే ప్రసవించిందని బంధువులు తెలిపారు. ప్రసవం జరిగిన 10 నిమిషాలకు బిడ్డ మృతి చెందాడని వాపోయారు. సిబ్బంది సరైన సమయానికి స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆరోపించారు. జీజీహెచ్‌లో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయి... జీజీహెచ్‌లో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ వద్ద బాధితులతో కలిసి వారు ఆందోళన నిర్వహించారు. రెండు నెలల క్రితం ఇదేవిధంగా స్కానింగ్ రూం వద్ద వేచిచూస్తూ ఓ గర్భిణి ప్రసవించిందని, అయితే అప్పుడు అదృష్టవశాత్తూ చిన్నారి బతికిందన్నారు. వార్డులో వైద్యుల కోసం ఎదురుచూస్తూ వరండాలో సైతం అనేక కాన్పులు జరిగిన సంఘటనలు కోకొల్లలన్నారు. సిబ్బందిలో కొరవడిన సేవాదృక్పథం ప్రక్షాళన పేరుతో జిల్లా స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకూ వారం రోజులుగా సమావేశాలతో ఊదరగొడుతూనే ఉన్నా సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయటం, రోడ్లు రంగులు వేయటం కాదని ముందుగా సిబ్బంది, వైద్యులలో మార్పు వచ్చి సేవా దృక్పథంతో పనిచేసే రోజులు వచ్చేవరకూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ప్రజా సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. అధికారులు ఇకనైనా స్పందించి సిబ్బంది, వైద్యులలో మార్పుకోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌లో మరో శిశువు మృతి
7 నెలల గర్భంతో 2 గంటలు క్యూలో నిలబడిన గర్భిణి నడిపిస్తుండగానే ప్రసవం.. బిడ్డ మృతి గుంటూరు : గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో సోమవారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏడు నెలల గర్భస్థ శిశువు మృతి చెందటంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బాధిత తల్లిదండ్రులు, బంధువుల కథనం మేరకు.. చిలకలూరిపేట తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడో నెల గర్భిణి. ఆదివారం నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆరోజు అక్కడే ఉండిపోయారు. సోమవారం ఉదయం మళ్లీ నొప్పులు ఎక్కువవడంతో వైద్యులు సెలవులో ఉన్నారని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో అనూష భర్త జాన్, తల్లి మేరి ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓపీ రాయించుకుని వైద్యుని వద్దకు వెళ్లగా స్కానింగ్ పరీక్షలు రాశారు. 3 గంటలకు రిపోర్టు తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లగా.. ‘నీ కంటే ముందుగా వచ్చిన రోగులు ఉన్నారు. లైనులో నిలబడాలి’ అని సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో రెండు గంటల పాటు లైనులో నిలబడిన అనూష 5 గంటల సమయంలో అక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో సిబ్బంది హటాహుటిన వార్డులోనికి నడిపించుకుంటూ వెళుతుండగా అనూషకు డెలివరీ అయి, బిడ్డ మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బిడ్డ తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బిడ్డ కేవలం 1.5 కిలోల బరువుతో జన్మించడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. -
కొనసాగుతున్న ఆపరేషన్ జీజీహెచ్
గుంటూరు రూరల్ : గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే సమీక్షించారు. ఆసుపత్రిలోని శుశ్రుత హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత మూడు రోజులుగా 45 మంది అధికారులు, 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చేసిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 72 గంటల్లో ఆసుపత్రి ప్రక్షాళన అనేది సాధ్యం కాదని తేలిందని, ఈ కార్యక్రమాలను ఈ నెలాఖరువరకూ కొనసాగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వార్డులో రోగులకు, సిబ్బందికి కావల్సిన సౌకర్యాలు ఒకటికి రెండుసార్లు ఆయా విభాగాలను కేటాయించిన అధికారులు సరిచూసుకోవాలన్నారు. రోగులకు, వారి బంధువులకు రాత్రి సమయంలో బసలు కల్పించేందుకు అవసరమైన చర్యలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జీజీహెచ్ అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు, వ్యాపార వేత్తల నుంచి మంచి స్పందన లభించిందని, ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగు కాల్వలు, టాయ్‌లెట్స్‌ను విధిగా పరిశీలించాలన్నారు. ప్రతి వారంలో ఒకసారి మురుగు కాల్వల పూర్తిస్థాయి శుభ్రం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యాలు, ప్రతి వార్డులో విద్యుత్ దీపాలు, ఫ్యానులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అత్యవసర విభాగాల్లో, ఐసీయూలలో ఉన్న ఏసీలు పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలని తెలిపారు. ఆసుపత్రిలోని ప్రతి చిన్న రంధ్రాన్ని సిమ్మెంట్ కాంక్రీట్‌తో పూడ్చి ఎటువంటి ప్రమాదం లేకండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ రాఘవ శర్మ తనవంతుగా ఆసుపత్రి అభివృద్దికి రూ.5 లక్షల విరాళంను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీధర్, డీఆర్వో నాగబాబు, ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజునాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. -
జీజీహెచ్‌కు సమగ్ర రూపం
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. జీజీహెచ్‌లోని శుశృత హాలులో మంగళవారం సుమారు 40 ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్‌లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల వల్ల చెడ్డపేరు వచ్చిందన్నారు. జీజీహెచ్‌ను 50 జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌కు ఒక జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో అధికారికి పది మంది సిబ్బందిని అప్పగిస్తామని, పది రోజులపాటు ఆస్పత్రిలో జిల్లా అధికారులు సిబ్బందితో పనిచేయించి జీజీహెచ్‌కు క్లీన్ఇమేజ్ తీసుకురావాలని కోరారు. ఇంకెంత మందిని చంపుతారు..? విద్యుత్ సమస్య వల్ల ఆస్పత్రిలో 70 పైగా ఏసీలు పనిచేయడం లేదని, ఏసీలు పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని అంటూ.. ఇంకా ఎంత మందిని చంపుతారు అంటూ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పాడుబడిన భవనాలన్నింటినీ కూల్చివేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, రోగుల సహాయకులు అధిక సంఖ్యలో రాకుండా ఒక రోగికి ఒక్కరు మాత్రమే లోపలకు అనుమతించేలా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఒక రోజు వేతనం విరాళం.. ఆస్పత్రి అభివృద్ధి కోసం రూ.2 కోట్ల మేర విరాళాలు సేకరించాలని అధికారులను కోరారు. సమీక్షకు హాజరైన జిల్లా అధికారులందరినీ ఆస్పత్రి అభివృద్ధి కోసం ఒకరోజు వేతనం విరాళం ఇవ్వాలని కోరగా, అందుకు వారు అంగీకారం తెలిపారు. కొత్తపేటలో ఆస్పత్రుల నుంచి రూ. కోటి విరాళం జీజీహెచ్‌కు వచ్చేలా డీఎంహెచ్‌వో కృషి చేయాలని చెప్పారు. పారిశుధ్యం మెరుగుపరిచేందుకు రూ.5 లక్షలు విరాళం ప్రకటించిన లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ అధినేత డాక్టర్ రాఘవశర్మను అభినందించారు. అక్టోబరు 2న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుంటూరు వస్తున్నారని, ఆయన వచ్చే నాటికి జీజీహెచ్‌కు రూపు రేఖలు వచ్చేలా అధికారులు పనిచేయాలని వెల్లడించారు. గ్రీన్ గుంటూరు, గ్రీన్ జీజీహెచ్ కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల జిల్లా అధికారులను సలహాలు, సూచనలు అడిగారు. మూడు రోజుల్లో మురికిలేకుండా చూడాలి జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మూడు రోజుల్లో చిన్న మురికి మరక కూడా లేకుండా ఉండేలా చూడాలన్నారు. మరుగుదొడ్లు వినియోగించేవారికి నిరంతరం వాటిని పరిశుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించాలన్నారు. డీఆర్వో కొసన నాగబాబు, నగర పాలక సంస్థ కమిషనర్ సి.అనురాధ, పులిచింతల డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లాపరిషత్ సీఈవో సుబ్బారావు, డీఎంహెచ్‌వో పద్మజారాణి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డీఎస్ రాజునాయుడు, ఇతర ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మళ్లీ ఎలుకలు
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు మళ్లీ స్వైర విహారం చేశాయి. ఎముకల వార్డులో చికిత్స పొందుతున్న ఓ మహిళ చేతి వేళ్లను ఎలుకలు కొరికాయి. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. గతనెలలో పసికందును ఎలుకలు తినేసిన సంఘటన మరిచి పోకముందే శుక్రవారం పాము కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే ఈ రోజు ఎలుకలు మహిళ చేతి వేళ్లను తినేశాయి. దాంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించారు. రోశమ్మ(40) అనే మహిళ జీజీహెచ్‌లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతోంది. శనివారం తెల్లవారుజామున ఆమెపై ఎలుకల గుంపు దాడి చేశాయి. అది గమనించిన రోగి తరపు వారు వైద్యులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు అత్యవసర చికిత్సా విభాగానికి తరలించి ఆమెకు వైద్యం చేశారు. ఈ సంఘటనతో వార్డులోని రోగులు బెంబేలెత్తుతున్నారు. కాగా అధికారుల నిర్లక్ష్యంతో ఎలుకల దాడిలో పసికందు చనిపోయిన ఘటనతో కళ్లు తెరిచిన అధికారులు ఎలుకలు పట్టేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో సుమారు 400 ఎలుకలను పట్టుకున్నారు. అయినా ఎలుకలు వస్తుండటంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. -
ఎనిమిది నెలల్లో 913 మరణాలు
సాక్షి, గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆరుజిల్లాలకు ఆరోగ్య ప్రదాయనిగా చెప్పుకొనే జీజీహెచ్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైద్యపరికరాలు, కనీస వసతులకు సైతం నిధులు మం జూరు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జీజీహెచ్‌లోని ప్రసూతి, శిశు వైద్య విభాగాలకు అనేక జిల్లాలనుంచి రో గులు చికిత్స నిమిత్తం వ స్తుంటారు. ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, సి బ్బంది కొరతతో వీరిని పట్టించుకునే దిక్కేలేకుం డా పోతుంది. శిశుశస్త్ర చికిత్సా విభాగంలో ఈ నెల 26వ తేదీన మూషికాల దాడిలో మృతి చెందిన శిశువు ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సరిపడా లేని సదుపాయాలు ఈ రెండు విభాగాల్లో ఇన్‌పేషెంట్లు అధికంగా చేరుతుండటంతో బెడ్లు సైతం సరిపోక ఒక్కో బెడ్‌పై ఇద్దరు బాలింతలు, ఇద్దరు పసిపిల్లలు చొప్పున పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక పిల్లల వైద్య విభాగంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో (ఎస్ఎన్సీయూ) కామెర్లు, బరువు తక్కువ పిల్లలను వార్మర్లు, ఫొటోథెరఫీ యూనిట్లో పెట్టి వైద్యసేవలు అందిస్తారు. ఒక పసికందును ఉంచాల్సిన వార్మర్, ఫొటోథెరపీ యూనిట్లో ఐదుగురు చొప్పున ఉంచుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒక శిశువు నుంచి మరొక శిశువుకు ఇన్ఫెక్షన్లు, వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందలమంది వచ్చే ఈ విభాగంలో కేవలం పది వార్మర్లు, పది ఫొటోథెర ఫి యూనిట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ పిల్లలకు ప్రాణాపాయ స్థితి వస్తేవారి ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన వెంటిలేటర్ ఒక్కటి కూడా ఈ విభాగంలో లేకపోవడం దారుణైం. ఎన్ఐసీయూలో సైతం దాదాపు ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎనిమిది నెలల్లో 913 మంది పసికందుల మృతి.. జీజీహెచ్‌లోని శిశు వైద్య విభాగంలో ఈఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఏడునెలల వ్యవధిలో 913 మంది చిన్నారులు మృతిచెందారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో నవజాత శిశువుల సంరక్షణ కేంద్రంలో (ఎస్ఎన్సీయూ)లో ఈ ఏడాది ఎనిమిది నెలల్లో మొత్తం 2,189 మంది పసికందులు వైద్యం కోసం చేరగా అందులో 737 మంది మృత్యువాత పడ్డారు. చిన్నపిల్లల అత్యవసర విభాగంలో మొత్తం 649 మంది చిన్నారులు చేరగా అందులో 176 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన చిన్నారుల్లో 32 శాతం మంది మృత్యు ఒడిలోకి జారుకుంటున్నారు. చివరి దశలో వస్తుండటం వల్లే.. జీజీహెచ్ శిశువైద్య విభాగంలో ప్రతి వంద మందిలో 30 మంది మృతి చెందుతున్న విషయం వాస్తవమే. ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న పసికందుల్లో అధికశాతం మంది ప్రాణాపాయ స్థితిలో వస్తున్నారు. జీజీహెచ్‌లో కాన్పు అయిన చిన్నారుల్లో మరణాల శాతం తక్కువ. ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పు జరిగి నెలలు నిండకముందే ప్రసావాలు జరుగుతున్న పసికందులను సీరియస్ కండిషన్లో జీజీహెచ్‌కు తీసుకువస్తున్నారు. వీరిలోనే మరణాలశాతం అధికంగా ఉంటుంది. దీనికితోడు పిల్లల విభాగంలో 60 మంది నర్సులకు గాను ఎనిమిదిమంది మాత్రమే ఉన్నారు. దీంతో పిల్లల పర్యవేక్షణ కష్టతరమౌతుంది. - డాక్టర్ యశోధర,శిశు వైద్య విభాగాధిపతి -
ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. శిశువు మృతిపై కలత చెందిన స్థానికులు కూడా గురువారం వేలాదిగా జీజీహెచ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ నేతలు, కార్యకర్తలు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ కాంతిలాల్ దండే ఆసుపత్రి అధికారులతో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధ శిశువు.. తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలను వారి వెంట తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మంత్రులను డిమాండ్ చేశారు. మంత్రుల ఘెరావ్.. అనంతరం జీజీహెచ్ మిలీనియం బ్లాక్ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న మంత్రులను కదలనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను బలవంతంగా పక్కకునెట్టి మంత్రుల వాహనాలను పంపివేశారు. అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి తనకు తెలుసుననీ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా పసికందులో మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి అధికార టీడీపీ నేతలు అండగా ఉంటున్నారు. -
100ఏళ్ల చరిత్రకి మాయని మచ్చ
-
తల్లుల కడుపుకోత పట్టదా!
సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల్లో తరచూ ఏదో ఒక సంఘటన జరుగుతున్నప్పటికీ అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో ఎటువంటి మార్పు రావడం లేదు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువులు అపహరణకు గురికావడం, నిర్లక్ష్యం వల్ల బాలింతలు మృతి చెందడం, బిడ్డలు మారిపోయారనే గందరగోళ పరిస్థితులు నెలకొనడం సర్వసాధారణంగా మారింది. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసే ఆసుపత్రి ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమవుతూనే ఉన్నారు. జీజీహెచ్‌లో ఐదు నెలల కాలంలో ఆరు సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా సోమవారం నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో బిడ్డ మాయమైందనే కలకలంతో అరగంట పాటు ఓ బాలింతరాలు నరకయాతన అనుభవించింది. ఇద్దరు తల్లుల పేర్లూ మార్తమ్మ కావడంతో ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. చివరకు ఇద్దరు బిడ్డలూ ఉండడంతో అయోమయానికి తెరపడింది. వరుస ఘటనలతో హడల్.. జీజీహెచ్ ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల వద్ద తరచూ ఇబ్బందికర ఘటనలు జరుగుతుండడంతో రోగులు, వారి బంధువులు హడలిపోతున్నారు. ఏప్రిల్ 10వ తేదీన గండి అనిత, కామినేని అనిత ఇద్దరూ ఒకేసారి మగ, ఆడ శివువులకు జన్మనిచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మగబిడ్డ తనకే పుట్టాడని ఇద్దరూ గొడవకు దిగడం, ఆడపిల్లను తీసుకునేందుకు ఎవరూ అంగీకరించకపోవడం, కనీసం ఆపరేషన్ చేసేందుకు సంతకాలు చేయకపోవడంతో పరిస్థితి విషమించి పాప మృతి చెందింది. మే నెలలో బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య స్కానింగ్ వైద్యుల కోసం వేచి చూసి నొప్పులు తట్టుకోలేక నేలపై పడిపోయి ప్రసవించిన విషయం తెలిసిందే. స్కానింగ్‌కు వెళ్లే ముందు ఆమె వెంట ఆయాను కూడా పంపలేదు సరికదా, నేలపై పడిన రక్తపు మరకలు సైతం గర్భిణి తల్లితో తుడిపించడం దారుణం. మే 20వ తేదీన మహారాష్ట్రకు చెందిన అనూష అనే గర్భిణి కాన్పుకోసం జీజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరింది. అదే నెల 23వ తేదీన వైద్యులు సిజేరియన్ చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కడుపు నొప్పిగా ఉందని చెప్పినప్పటికీ ఓ టాబ్లెట్ వేసి వెళ్లారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. కొంత సేపటికి ఆమె బెడ్‌పైనే మృతి చెందింది. ఈ విషయాన్ని ఆరు గంటల వరకు సిబ్బంది గుర్తించకపోవడం దారుణం. ఆమె మృతితో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. -
కబళించిన మృత్యువు
వినుకొండ /ఈపూరు : గుంటూరు జిల్లా ఈపూరు మండలం అంగలూరు పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ గ్రామం నుంచి పశువుల ఎరువును లారీలో లోడు చేసుకుని కూలీలు యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామం వెళ్తున్నారు. లారీ క్యాబిన్లో డ్రైవర్‌తోపాటు మరో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరేళ్ళ బాలిక కూడా ఉంది. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు మువ్వా గంగమ్మ, హనుమంతురావులు ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొండ్రముట్ల సమీపంలో ద్విచక్రవాహనం వేగంగా ఎదురుగా వస్తుండటంతో, దాన్ని తప్పించేందుకు లారీని రోడ్డు పక్కకు తీస్తుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న లోతైన కాలువలో పడిపోయింది. ప్రమాదంలో యర్రగొండపాలెంకు చెందిన డ్రైవర్ షేక్ మౌలాలి, ఇదే మండలం వాదంపల్లి గ్రామానికి చెందిన గోపినీడు పెదవెంకటేశ్వర్లు, కన్నమనీడు పెద వెంకటేశ్వర్లు, మువ్వా సుందరమ్మ, మువ్వా మంగమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనలో తీవ్ర గాయాలైన వాదంపల్లికి చెందిన దుగ్గినీడు ఆదిలకిృ్ష్మ, చింతల పెదవెంకటేశ్వర్లు, మూడమంచు వెంకటేశ్వర్లు, మూడమంచు గంగమ్మ, మూడమంచు పెదవెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటకు చెందిన మువ్వా గంగమ్మ, మువ్వా హనుమంతరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వీరిలో మువ్వా గంగమ్మ, హనుమంతరావుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృత్యుంజయరాలు కౌశల్య.. కర్ణాటకలో ఉండే ఆరేళ్ల కౌశల్య శుక్రవారం అమ్మమ్మ వద్దకు వచ్చింది. ఇంట్లో చిన్నారిని వదలలేక తమతోపాటు తీసుకువెళ్లారు. ఈ ప్రమాదంలో పాపకు ఎలాంటి గాయాలు కాకపోవటం విశేషం. అనాధైన కుటుంబాలు.. యర్రగొండపాలెం: ఒక లారీ లోడు పశువుల ఎరువులు తీసుకొస్తే రూ 1800 ఇస్తారు. ఆ డబ్బును పది మంది కూలీలు పంచుకుంటారు. గ్రామంలో పనులు లేని సమయంలో కూలీలు గ్రూపులుగా ఏర్పడి పశువుల ఎరువులు తీసుకొచ్చే పనికి వెళ్తుంటారు. మృతులలో మువ్వా సుందరమ్మ భర్త ఏడాది క్రితం మృతి చెందాడు. తన ఇద్దరి పిల్లలను పోషించుకునేందుకు కూలీ పనులకు వెళ్లక తప్పలేదు. ఆమె కూడా మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. మరో మృతుడు లారీ డ్రైవర్ షేక్ మౌలాలి తనకున్న సొంత లారీతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు పిల్లలకు వివాహాలు చేయగా మరో కుమార్తెకు ఈనెల 26వ తేదీన మార్కాపురంలో వివాహం చేయటానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో మృత్యువు కాటేసింది. రూ, లక్ష చొప్పున ఆర్థిక సాయానికి కృషి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురికి టీడీపీ వైపాలెం త్రిసభ్యకమిటీ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ, లక్ష చొప్పున ఆర్ధిక సాయానికి కృషి చేస్తానన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. త్రిసభ్య కమిటీ మరో సభ్యుడు పల్లె మార్కు రాజు, వైపాలెం జడ్పీటీసీ సభ్యుడు మంత్రూనాయక్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి లింగయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. -
అయ్యయ్యో..!
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్) ఆవరణలోని ప్రభుత్వ నర్సింగ్ పాఠశాల విద్యార్థినులు తినే ఆహారం కలుషితం కావటంతో పది మంది డయేరియా బారిన పడ్డారు. జీఎన్ఎం ప్రథమ సంవత్సరం చదువుతున్న ముగ్గురు, ద్వితీయ సంవత్సరం చదువుతున్న మరో ఏడుగురు విద్యార్థినులు మూడు రోజులుగా వాంతులు విరేచనాలతో బాధపడుతున్నారు. రెండురోజులుగా వసతి గృహంలో సొంత వైద్యం చేసుకుంటున్నా తగ్గకపోవటంతో మంగళవారం జీజీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. మరో వైపు వారం రోజులుగా 15 మందికి పైగా విద్యార్థినులు చికెన్‌పాక్స్‌తో (అమ్మవారు) బాధపడుతున్నారు. దీంతోపాటు పలువురు జ్వరాల బారిన పడ్డారు. అధిక శాతం మంది రోగాలకు గురయినా హాస్టల్లో తనిఖీలు చేసి భోజనం, మంచినీటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించకుండా సంబంధిత అధికారులు తాత్సారం చేయటం విమర్శలకు తావిస్తోంది. దాదాపు 200 మంది వరకు ఉండే ఈ వసతి గృహంలో రోగాల బారిన పడిన వారిలో ఇప్పటికే కొందరు సెలవుపెట్టి ఇళ్లకు వెళ్లిపోగా మరి కొంత మంది వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వంటకు నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నారని, ఉదయం వేళ ుగిలిన పదార్థాలను రాత్రికి, రాత్రి మిగిలిన పదార్థాలను ఉదయం భోజనంలో కలిపి వండుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచి నీరు కూడా సక్రమంగా రావటం లేదని, బయట నుంచి బక్కెట్లుతో తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని విద్యార్థినులు వాపోతున్నారు. విద్యార్థినులతో అత్యవసర సమావేశం... అధిక సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో మంగళవారం సాయంత్రం పాఠశాల నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ విన్నకోట సరోజిని విద్యార్థినులతో అత్యవసర సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, ఆర్ఎంఓ డాక్టర్ అనంత శ్రీనివాసులు చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యసేవలు అందించాలని సంబంధిత వైద్యులను ఆదేశించారు. -
వైద్య సేవలకు వర్షం ఎఫెక్ట్
జీజీహెచ్‌లోని పలు విభాగాల్లో చేరిన నీరు సగానికి తగ్గిన ఓపీ గుంటూరు మెడికల్ : రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జీజీహెచ్‌లోని పలు వైద్య విభాగాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇన్‌పేషేంట్ విభాగం,అవుట్పేషేంట్ వి భాగాల్లోని శ్లాబ్ లీకులు ఏర్పడి వర్షపు నీరు పలు వార్డుల్లో చేరటంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వార్డుల్లో పడకలు నిండుగా ఉండటంతో కొందరు రోగులకు వరండాల్లో మంచాలువేసి ఉం చారు. నిరంతరంగా కురుస్తున్న జల్లులతో వరండాల్లో నీరు చేరటంతోపాటు చలిగాలులు వీస్తూ ఉండటంతో వరండాల్లోని మంచాలపై రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం వల్ల జీజీహెచ్‌లో ఓిపీ రోగుల సంఖ్య గురువారం తగ్గింది. ప్రతిరోజూ సుమారు 2500 కంటే పైబడే రోగులు వస్తుండగా, గురువారం 1254 మంది మాత్రమే ఓపీ వైద్యసేవలు వినియోగించుకున్నారు. జీజీ హెచ్ మెడికల్ ఆఫీసర్స్ గది ముందు వర్షపు నీరు భారీగా చేరటంతో వైద్యులు లోపలకి వెళ్ళలేని ప రిస్థితి. పురాతన భవనం అవ్వటంతో లీకుల ద్వా రా వర్షపు నీరు ఆ గదిలో సైతం నిలిచిపోయింది. ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ అండ్ ట్రామాసెంటర్లోని సెల్లార్ అంతా లీకులు ఉండటంతో వర్షపు నీరు వచ్చి చేరింది. వైద్యులు, వైద్య సిబ్బంది కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకునే సెల్లార్లో నీరు నిలిచి వాహనాలు తడుస్తూ ఉండటంతో ఇంజనీరింగ్ అధికారుల పనితీరును వైద్య సిబ్బంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. సుమారు 33 కోట్ల రూపాయలతో నిర్మించిన మిలీనియం బ్లాక్‌లో లీకులు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో రూ.20 కోట్లతో జీజీహెచ్‌లో నిర్మాణం చేయనున ్న మాతా శిశు సంరక్షణ కేంద్రంలోనైనా ఇలాంటి సమస్యలు లేకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు. -
బ్యూటీపార్లర్‌కు వెళితే ముఖం కాల్చేశారు!
♦ ఫేషియల్ చేయడంతో ముఖంపై కాలిన మచ్చలు ఏర్పడ్డ వైనం ♦ జీజీహెచ్ వైద్యులను ఆశ్రయించిన బాధిత మహిళ ♦ నాలుగు నెలలపాటు ముఖానికి ఎండ తగలకూడదన్న వైద్యులు ♦ జూన్‌లో జరగాల్సిన కుమార్తె వివాహం వాయిదా సాక్షి, గుంటూరు : అందానికి మెరుగులు దిద్దుకునేందుకు బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకోవడానికి వెళితే అది కాస్తా వికటించి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. వెలుగును సైతం చూడలేని పరిస్థితి దాపురించింది. చివరకు ఈ నెలలో జరగాల్సిన కుమార్తె వివాహాన్ని సైతం వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బాధితురాలు, ఆమె భర్త విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరంలోని గౌతమినగర్ 4వలైనులో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళ కుటుంబంతో కలిసి ముస్సోరి యాత్రకు వెళ్లే సందర్భంలో గతనెల 13వ తేదీన అదే ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఫ్రూట్ ఫేషియల్ చేయమని కోరగా గోల్డ్ ఫేషియల్ అయితే బాగుంటుందని నిర్వాహకురాలు చెప్పింది. అయితే ఫేషియల్ చేస్తున్న క్రమంలో ముఖమంతా మంటగా ఉందని చెప్పినా మొదట్లో అలాగే ఉంటుందని, తరువాత తగ్గిపోతుందని చెప్పి ఫేషియల్ చేసి స్టీమ్ పెట్టి రూ. 400 చార్జి చేసింది. ఆ మరుసటి రోజుకు కూడా మంట తగ్గకపోగా మొఖంలో తేడా గమనించి బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి చెప్పగా, ఆమె ఏదో మాయిశ్చరైజర్ వాడితే తగ్గిపోతుందని చెప్పింది. మరుసటిరోజు ముస్సోరికి బయలుదేరి హైదరాబాద్ వెళ్లేసరికి మహిళ ముఖం మరింత నల్లగా మారడం గమనించిన భర్త ఆమె ముఖాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు మెసేజ్ చేశారు. నిర్వాహకురాలు విషయాన్ని ఓ చర్మవ్యాధుల వైద్యునికి చెప్పి ఆయన ఇచ్చిన ప్రిక్సిప్షన్ను తిరిగి వాట్సాప్‌లో పెట్టారు. ముస్సోరి పర్యటన ముగించుకుని గుంటూరుకు వచ్చిన బాధితురాలు మరో వైద్యుడిని కలిసి తన ముఖాన్ని చూపించగా, ఆయన వైద్యం మొదలు పెట్టడంతోపాటు, వేడి, ధూళి, ఎండ పడకుండా ముఖానికి గుడ్డకట్టుకుని నాలుగు నెలలపాటు ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని బ్యూటీపార్లర్ నిర్వాహకురాలికి తెలియజేయగా, ఆమె తన తప్పేమీ లేదన్నట్టు మాట్లాడింది. బాధితురాలు బుధవారం జీజీహెచ్‌లో చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ నాగేశ్వరమ్మను చికిత్స నిమిత్తం కలిశారు. అక్కడ విలేకరులకు తన ఆవేదన తెలియజేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు చేసిన తప్పుకు తాను శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని బాధిత మహిళ వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తన మాదిరిగా మరే మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. విచ్చిలవిడిగా బ్యూటీ పార్లర్లు గుంటూరు నగరంలో బ్యూటీ పార్లర్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వీటిపై ఏ శాఖకు స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మోటిక్ వంటి వాటిపై తమకు నియంత్రణ ఉందే తప్ప, బ్యూటీ పార్లర్‌పై నియంత్రణ లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు విన్నవించి వీటిపై ఫిర్యాదు చేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి తెలిపారు. -
మందుల్లేవ్!
నో స్టాక్ - గుంటూరు జీజీహెచ్‌లో మందుల్లేక రోగుల ఇక్కట్లు - ఆస్పత్రి ప్రారంభించినప్పటి బడ్జెట్టే నేటికీ అమలు.. - రోగులు పెరుగుతున్నా బడ్జెట్ పెంచని ప్రభుత్వం - తక్కువ ధర మందులైతేనే.. లేదంటే బయట కొనాల్సిందే! - టెండర్లు పిలిచే వరకు రోగులకు తప్పని అవస్థ సాక్షి, గుంటూరు : అపర సంజీవనిగా పేరొందిన ఆస్పత్రిలోనే మందుల కొరత వెంటాడుతోంది. కోస్తాంధ్ర ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ విభాగంలో చూపించుకుని వెళ్దామని వచ్చిన వారికి కూడా మందులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక వార్డుల్లో చేరిన వారి పరిస్థితి మరింత దారుణం. మందుల కొనుగోలుకు ఆస్పత్రి ప్రారంభమైనప్పుడు కేటాయించిన బడ్జెట్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో రెట్లు రోగులు పెరిగినా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆ స్థాయిలో మందులు రాక పోవడంతో వైద్యాధికారులు సైతం ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ధర తక్కువైతే ఇక్కడ.. లేదంటే బయట.. జీజీహెచ్‌కి వివిధ సమస్యలతో నిత్యం వేలాది మంది పేద రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో 1175 పడకలు ఉన్నప్పటికీ అవి కూడా చాలక ఒక్కొక్క బెడ్‌కు ఇద్దరు చొప్పున రోగులను ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. వార్డుల్లో రోగులకు వైద్యుల సూచనల మేరకు మందులు వేయాల్సిన స్టాఫ్ నర్సులు అవి తమ వద్ద లేవని బయట కొనుక్కోమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేక ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన పేద రోగులు, వారి బంధువులు మందులు బయట కొనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు. ఏవో తక్కువ ధరకు దొరికే మందులు మాత్రం ఆసుపత్రిలో ఉంటున్నాయని, అధిక ధరవైతే స్టాక్ లేవని చెబుతున్నారని రోగులు వాపోతున్నారు. సూపర్ స్పెషాలిటీ వార్డుల్లో మరింత తీవ్రం.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా కాని మందులను హెచ్‌డీఎస్ నిధుల ద్వారా కొనుగోలు చేసే వీలుంటుంది. కానీ అవి టెండర్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ టెండర్లు ఏడు నెలలుగా పిలవకపోవడంతో ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమయింది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జన్ వంటి విభాగాల్లో మందుల కొరత క్కువగా ఉందని చెబుతున్నారు. వీటిని బయట కొనుగోలు చేయాలంటే అధిక ధరలు ఉంటాయని, దీంతో పేద ప్రజలకు భారంగా మారుతుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. మందులపై పర్యవేక్షణ కరవు... మందుల స్టాక్ రూమ్ నుంచి వివిధ వార్డులకు రోజూ మందులు సరఫరా అవుతుంటాయి. ఆ మందులు ఎవరికి వేశారనేది ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి. ఆ మందులు ఏ రోగికి వినియోగించారో రోజూ ఆసుపత్రి ఉన్నతాధికారులకు తెలియజేస్తే కావాల్సిన మందులను సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించే వీలు ఉంటుంది. ఏ వార్డులో ఎన్ని మందులు ఉన్నాయి. ఏయే మందులు ఉన్నాయి అనే విషయం ఎవ్వరికీ తెలియడంలేదు. రోజూ ఎవరో ఒక ఉన్నతాధికారి వార్డులను పరిశీలించి అక్కడ ఏయే మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుంది. రోగులకు అందుబాటులేని మందులను కొనుగోలు చేసి అందించే అవకాశం ఉంటుంది. కొరత గుర్తించి కొనుగోలు చేస్తున్నాం.. జీజీహెచ్‌లో మందుల కొరత తలెత్తుతూనే ఉంది. వాటిని గుర్తించి వెంటనే కొనుగోలు చేస్తున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి కొన్ని మందులు రానప్పుడు టెండర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. కొన్ని నెలలుగా టెండర్లు పెండింగ్‌లో పడ్డాయ్. దీనిపై కలెక్టర్‌కు లేఖ రాస్తాం. రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ పెంచాలి.- డాక్టర్ వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
రాత్రి వేళ రాకండి
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్ : వ్యాధి తీవ్రతను తట్టుకోలేక గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)కి వచ్చే పేదలకు వైద్యసేవలు సకాలంలో అందడం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా రాత్రివేళల్లో వైద్యులు విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రాత్రి వేళల్లో సాధారణంగా రోడ్డు ప్రమాద కేసులు, గుండెపోటుకు గురైన బాధితులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు, విషప్రభావానికి గురైన కేసులు ఎక్కువగా వస్తుంటాయి. డ్యూటీ డాక్టర్లు విధులకు డుమ్మా కొడుతుండడంతో.. పీజీ వైద్యులే వివిధ రకాల వ్యాధుల నిర్థారణ పరీక్షల పేరుతో తెల్లవార్లూ అత్యవసర వైద్యసేవల విభాగంలోనే రోగులను ఉంచుతున్నారు. రోగులు ఆస్పత్రిలో ఉండి కూ డా వైద్యులు విధుల్లో లేకపోవడంతో బాధను భరిస్తూ దేవుడిపై భారం వేసి జాగారం చేయాల్సివస్తోంది. రెండు రోజులు గడిచినా కొన్ని అత్యవసర కేసులు కూడా క్యాజువాలిటీలోనే గడుపుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పగటి వేళా అత్తెసరు వైద్యమే... నిబంధనల ప్రకారం ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు వైద్యులు తమసేవలను అందించాల్సివుంటుంది. ఉదయం 9 గంటలకు ఓపీకి రావాల్సిన డాక్టర్లు 10 గంటలు దాటినా రావడం లేదు. కొందరు వైద్యులతే ఏకంగా ఓపీ విభాగాలకు హాజరుకాకుండానే గడిపేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండాల్సిన వైద్యవిభాగాలు మధ్యాహ్నం 12.30 గంటలకే మూతపడుతున్నాయి. ఓపీలో కొందరు వైద్యులు రోగులకు వైద్యం అందించకుండా వైద్యవిద్యార్థులకు బోధన చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం చేయాల్సిన బోధనను ఉదయం ఓపీ సమయంలోనే చేసి మధ్యాహ్నం నుంచి సొంత క్లినిక్‌లకు జారుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తీరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి హాజరుపట్టీలో సంతకాలు చేసి మరీ వెళుతున్నారు. వైద్యసిబ్బందిలో విధులపై నానాటికి చిత్తశుద్ధి లోపిస్తుండడంతో ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పర్యవేక్షణ ఉండడం లేదు.. పేదలకు వైద్యసేవలు అందుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాల్సిన వైద్యాధికారులు పట్టించుకోకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగులకు వైద్యసేవలు సకాలంలో అందేలా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తగు చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు. వైద్యసేవలకు ఆటంకం లేకుండా చూస్తాం.. క్యాజువాలిటీలో రోగులకు సకాలంలో వైద్యం అందేలా సంబంధిత విభాగాల అధిపతులను రెస్పాన్బుల్పర్సన్గా నియమిస్తామని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు. రోగులకు వైద్యసేవలకు ఆటంకం లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. -
జీజీహెచ్‌కు సమైక్య సెగ
సాక్షి, కాకినాడ :సమైక్య సమ్మె ప్రభావం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. సేవలు అందించడానికి వైద్యులతోపాటు స్టాఫ్ నర్సులు, ఆయాలు, ఇతర వార్డు సిబ్బంది అందుబాటులో ఉన్నా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి ఈ ఆస్పత్రికి రోజూ సగటున 3వేల మంది ఔట్ పేషెంట్లు వస్తారు. 1,500 మంది ఇన్ పేషెంట్లుగా ఉంటారు. సమైక్య సమ్మె ప్రారంభ మైన జూలై 31 నాటికి ఔట్ పేషెంట్ల సంఖ్య 2,475, ఇన్ పేషెంట్లుగా 1,226 మంది ఆస్పత్రిలో ఉన్నారు. అదేరోజు ఇన్ పేషెం ట్లుగా కొత్తగా 187 మంది చేరారు. ఈ నెల 23న ఔట్ పేషెంట్ల సంఖ్య చూస్తే 1,470 మా త్రమే ఉంది. తాజా లెక్కల ప్రకారం 1,030 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నారు. ఈ తగ్గుదల రోజుకో రీతిలో కొనసాగుతోంది. 1,065 పడకల ఈ బోధనాస్పత్రి చాలా భాగం ఖాళీ బెడ్లతో దర్శనమిస్తోంది. నిలిచిన రవాణా సమ్మె నేపథ్యంలో బస్సులు నిలిచిపోవడం, అంతంత మాత్రంగా ఆటో వంటి వాహనాలు తిరుగుతున్నా అధిక టికెట్ ధర డిమాండ్ చేస్తున్న కారణంగా గ్రామాల నుంచి పేద రోగు లు జీజీహెచ్‌కు రాలేని పరిస్థితి ఏర్పడింది. అన్నిటికీ మించి ప్రతిరోజూ గైనిక్ వార్డులో ముప్పై అయిదు మందికి పురుళ్లు పోస్తారు. ఇందులో సాధారణ పురుళ్లు ముప్పై ఉండేవి. సిజేరియన్ ఆపరేషన్లు చేసి కొంతమందికి పురుళ్లు పోసేవారు. ఆస్పత్రి మొత్తంలో సహ జ, అసహజ మరణాలు దాదాపుగా రోజుకు పదమూడు వరకూ ఉంటాయని అధికారిక అంచనా. ఆస్పత్రిలో జనన, మరణాల నమోదుకు సక్రమంగా రికార్డు నిర్వహించి మునిసిపల్ అధికారులకు క్రమం తప్పకుండా వాటిని పంపాలి. ఎలాంటి అవాంతరాలున్నా జనన, మరణాల వివరాలను 21 రోజుల లోపు పంపి తీరాలి. ఆస్పత్రి పరిపాలనా సిబ్బంది, పురపాలక సిబ్బంది 25 రోజులుగా సమ్మెలో ఉండడంతో జనన, మరణాల నమోదు ప్రక్రియ అటకెక్కింది. ఎంఎల్సీ (మెడికో లీగల్) కేసు ల్లో గాయాల సర్టిఫికెట్లు, ప్రమాద మరణాల్లో పోస్టుమార్టం సర్టిఫికెట్లు న్యాయస్థానాలకు ఆస్పత్రి నుంచి అందివ్వాల్సి ఉంది. ఇవి కూడా ఆస్పత్రి పాలనా సిబ్బందితో పాటు న్యాయస్థానాల ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున ైఫైళ్లు కదలక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఔను నిజమే : డాక్టర్ బుద్ధ సమైక్య సమ్మె ప్రభావంతో రోగుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడమే అందుకు సాక్ష్యమని శనివారం జీజీహెచ్ సూపరింటెండెంటు డాక్టర్ బుద్ధ చెప్పారు.పాలనా పరమైన వ్యవహారాలు కూడా కుంటుపడ్డాయని ఆయన అన్నారు. ప్రాణ ర క్షణ మందులు కొరత లేదని అవసరమైతే కొనుగోలుకు ఆరోగ్య శ్రీ నిధులు వినియోగించుకుంటామన్నారు.