విజయవాడ, సాక్షి: ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు ఇచ్చారు. రెండ్రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్‌లో వైద్యులపై దాడి జరిగింది. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూడాలు..వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు జారీ చేశారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు
చర్చలు విఫలం
వైద్యులపై దాడికి నిరసనగా గత రెండ్రోజులుగా విజయవాడ జీజీహెచ్‌లో జూడాలు సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలు బహిష్కరించి నిరసనను కొనసాగిస్తున్నారు.మరోవైపు జూడాల నిరసనలు, సమ్మె నోటీసుపై వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్, జూడా ప్రతినిధులతో డీఎంఈ నరసింహం వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని జూడాల డిమాండ్ చేశారు.
హామీలపై అసంతృప్తి
విజయవాడలో దాడికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపిన డీఎంఈ తెలిపారు. డ్యూటీ రూములో తగిన సదుపాయాలని కల్పించడానికి ఆదేశాలిచ్చామని చెప్పారు. అయితే డీఎంఈ నరసింహం హామీలపై సంతృప్తి చెందని జూడాలు.. సమ్మెపై ఆదివారం నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment