junior doctor strike
-
కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు
కోల్‌కతా: బెంగాల్లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేపట్టారు. దాదాపు 41 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా జూనియర్ డాక్టర్లు తామ ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి(శనివారం) అత్యవసర వైద్య సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన రెండు సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య రెండు రోజుల క్రితమే కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమ ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, దానికి ముందు నగరంలో మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ అమలుకాకపోతే తిరిగి విధులను బహిష్కస్తామని హెచ్చరించారు.మరోవైపు.. జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు.మాజీ ప్రిన్సిపల్ రిజిస్ట్రేషన్ రద్దుఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను బంగాల్ వైద్య మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది. అలాగే, 1914 బెంగాల్ వైద్య చట్టం కింద సందీప్ ఘోష్ మెడికల్ లైసెన్సును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్ ఇచ్చిన నడ్డా -
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు
విజయవాడ, సాక్షి: ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు ఇచ్చారు. రెండ్రోజుల క్రితం విజయవాడ జీజీహెచ్‌లో వైద్యులపై దాడి జరిగింది. ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూడాలు..వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ నిరసనలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జూడాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి జూడాలు సమ్మె నోటీసు జారీ చేశారు. సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారుచర్చలు విఫలంవైద్యులపై దాడికి నిరసనగా గత రెండ్రోజులుగా విజయవాడ జీజీహెచ్‌లో జూడాలు సమ్మె చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలు బహిష్కరించి నిరసనను కొనసాగిస్తున్నారు.మరోవైపు జూడాల నిరసనలు, సమ్మె నోటీసుపై వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్, జూడా ప్రతినిధులతో డీఎంఈ నరసింహం వర్చువల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైద్యులపై దాడులని నిరోధించాలని...దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని జూడాల డిమాండ్ చేశారు.హామీలపై అసంతృప్తివిజయవాడలో దాడికి పాల్పడ్డవారిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపిన డీఎంఈ తెలిపారు. డ్యూటీ రూములో తగిన సదుపాయాలని కల్పించడానికి ఆదేశాలిచ్చామని చెప్పారు. అయితే డీఎంఈ నరసింహం హామీలపై సంతృప్తి చెందని జూడాలు.. సమ్మెపై ఆదివారం నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. -
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. -
ఈనెల 19 నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
సాక్షి, హైదరాబాద్: జూనియార్ డాక్టర్లు పలు డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జూడాల సంఘం శనివారం నోటీసు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభింస్తామని జూడాల సంఘం డీఎంఈ రమేశ్‌రెడ్డికి ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విడుదల, బకాయిల చెల్లింపులే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. డిసెంబర్ 19న పెద్దఎత్తున జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతారని ఆయన నోటీసులో వెల్లడించారు. చదవండి: అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి.. కేరళ సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ -
చర్చలు విఫలం.. సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సంఘంతో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి జరిపిన చర్చ లు విఫలమయ్యాయి. బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు డిమాండ్లపై చర్చించినా డైరెక్టర్ నుం చి స్పష్టమైన హామీ రాలేదని, దీంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడిం చింది. పలు డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. స్టైఫండ్ పెంపుతోపాటు ప్రోత్సాహకాలు, కోవిడ్ విధుల్లో మరణిస్తే ఇచ్చే పరిహారం, కరోనాతో బాధపడుతున్న కుటుంబసభ్యులకు నిమ్స్‌లో ఉచిత చికి త్స వంటి అంశాలపై జూడాలు సమ్మెకు దిగారు. తొలిరోజు సమ్మెలో భాగంగా బుధవారం అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు కాగా, మిగతా విధులను బహిష్కరించారు. ఈ క్రమంలో బుధవారం సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షిస్తూ... ప్రస్తుత సమయంలో సమ్మె సరికాదని, జూడాల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుపుతూ చర్చలు జరపాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సైతం సమ్మెకు ఇది సరైన సమయం కాదని ట్విట్టర్ ద్వారా విన్నవించారు. ఈ క్రమంలో బుధవారం సాయం త్రం వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి జూడాల సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు. జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం స్టైఫండ్ పెంపు పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెప్పినా లిఖితపూర్వక హామీ రాలేదు. డైరెక్టర్ రమేశ్‌రెడ్డి జూడాల హామీలు అమలు చేయడం కుదరదని చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అనంతరం బయటకు వచ్చిన జూడాల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తా మని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనలతో చర్చలు జరిపామని పేర్కొన్నారు. అయితే సీఎం, మంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాకపోవడంతో సమ్మె ను కొనసాగించాల్సి వస్తోందని చెప్పారు. రేపటి నుంచి అత్యవసర సేవలూ బహిష్కరిస్తామని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. సమ్మె సరికాదు.. ‘జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు, పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదు. చీటికీ మాటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా, కరోనా పరిస్థితులను కూడా చూడకుండా విధులను బహిష్కరించడం సరికాదు’. – సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నాం... లిఖితపూర్వక హామీలు రాకపోవడం, డైరెక్టర్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా లేకపోవడంతో సమ్మెను కొనసాగిస్తున్నాం. మా హామీలు అమలు చేయడం కుదరదని రమేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి సానుకూల హామీలు వస్తే సమ్మె విరమిస్తాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందన అధికారుల నుంచి రాలేదు. –జూనియర్ డాక్టర్లు ముఖ్యమంత్రి ఆదేశాలు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని15 శాతం పెంచాలి. మూడేళ్ల వైద్య విద్య అభ్యసించి ‘కోవిడ్’వైద్య సేవల్లో కొనసాగుతున్న విద్యార్థులకు సైతం సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని అందించాలి. కోవిడ్ విధుల్లో మరణించిన వైద్యులకు ప్రభుత్వం ఇప్పటికే నిబంధనల మేరకుఎక్స్‌గ్రేషియాను అందిస్తున్న నేపథ్యంలో, జూడాల కోరిక మేరకు సత్వరమే చెల్లించాలి. జూడాలకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్‌లో అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి. స్తంభించిన వైద్య సేవలు జూనియర్ డాక్టర్ల సమ్మెతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. సకాలంలో సేవలు అందక సాధారణ రోగులు ఇబ్బందిపడ్డారు. క్లిష్టమైన ఈ సమయంలో మందులు, ఆక్సిజన్ మానిటరింగ్ చేసే వైద్యులు లేక కోవిడ్ బాధితులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కింగ్‌కోఠి ఆస్పత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు రోగుల బంధువులు మద్దతు పలికారు. ఇది సమయం కాదు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలి. లేని పక్షంలో చర్యలు తప్పవు. సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. –మంత్రి కేటీఆర్ చదవండి: జూడాల సమస్యలను పరిష్కరించాలి సమ్మె చేయడం మంచిది కాదు: సీఎం కేసీఆర్ -
Telangana: నేటి నుంచి జూడాల సమ్మె
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ ఉధృతి సమయంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి షాకిచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న టి–జూడా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది. ఈ సమ్మెతో బోధనాస్పత్రుల్లో వైద్య సేవలు సంకటంలో పడనున్నాయి. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు బాధితులతో నిండిపోయాయి. కోవిడ్‌యేతర సేవలకు సంబంధించిన వార్డుల్లో కూడా రద్దీ కొనసాగుతోంది. రోజువారీ అవుట్ పేషంట్ల(ఓపీ) విభాగాలు సైతం కిటకిటలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బోధనాస్పత్రుల్లో సేవలందించే జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టడంతో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో అత్యవసర, ఐసీయూ విధులకు మాత్రమే హాజరు కానున్నట్లు ప్రకటించారు. దీంతో మిగతా వార్డుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం ఈ రెండ్రోజుల్లో స్పందించకుంటే 28 నుంచి అన్ని రకాల విధులు బహిష్కరించనున్నట్లు జూడాలు ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు 6 వేల మంది జూనియర్ డాక్టర్లు, మరో వెయ్యి మంది వరకు సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు.ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వీరి సేవలే కీలకం. టీఎస్ఆర్డీఏ కూడా... జూనియర్ డాక్టర్ల సమ్మెతో పాటు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) కూడా సమ్మెకు దిగనుంది. ఇప్పటికే వైద్య, విద్య సంచాలకుడికి సమ్మె నోటీసు జారీ ఇచ్చిన టీఎస్ఆర్డీఏ.. బుధవారం ఉదయం 9 గంటల నుంచి కోవిడ్ అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరుకానున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే ఈనెల 27 నుంచి అన్నిరకాల విధులు బహిష్కరించనున్నట్లు టీఎస్ఆర్డీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 26 నుంచి నాన్‌కోవిడ్ ఆస్పత్రుల్లో సాధారణ విధులు బహిష్కరిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 28 నుంచి కోవిడ్, నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో సాధారణ, ఐసీయూ, అత్యవసర సర్వీసులను బహిష్కరిస్తాం. ఈనెల 19న గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ జూడాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నాం. – జూడాల అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ వాసరి నవీన్, స్వరూప్, విజయ్ కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 జూడాలు, 150 మంది సీనియర్ రెసిడెంట్లు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యాం. మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నాం. – జూడాల సంఘ గాంధీ యూనిట్ అధ్యక్షుడు మణికిరణ్‌రెడ్డి ప్రధాన డిమాండ్లు... జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లతో పాటు ఇంటర్న్‌లకు 15 శాతం స్టైపెండ్ పెంపు ఫైలు ఆర్థికశాఖ వద్ద ఉంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు 15 శాతం పెంపు ఫైలు కూడా పెండింగ్‌లో ఉంది. దీన్ని తక్షణమే పరిష్కరించి పెంచిన స్టైపెండ్‌ను అందించాలి. వైద్యులు, వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్ను ప్రకటించినా.. అమలు చేయలేదు. దాన్ని అమలుచేయాలి. కోవిడ్ విధులు నిర్వహిస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్(హెచ్సీడబ్ల్యూ), వాళ్ల కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో చికిత్స అందించాలి. దీని కోసం అదనపు వార్డులు ఏర్పాటు చేయాలి. ఇతర ఆస్పత్రుల్లోనూ ఉచిత చికిత్స పొందే అవకాశం కల్పించాలి. జీఓఎంఎస్–74 ప్రకారం వైద్య విద్యార్థుల(పోస్టు గాడ్యుయేషన్ వరకు)కు మెడికల్ ఇన్సూరెన్స్‌ను అమలుచేయాలి. కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం ద.. డాక్టర్‌కు రూ.50 లక్షలు, నర్సు, సపోర్టింగ్ స్టాఫ్‌కు రూ.25 లక్షలు చెల్లించాలి. జూడాల బహిష్కరణ ఇలా. నేటి నుంచి ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా కోవిడ్‌యేతర విధుల బహిష్కరణ. కోవిడ్ కేటగిరీలో ఐసీయూ, క్రిటికల్ కేర్ విధులు మినహా మిగతావన్నీ కూడా.(ఈనెల 28 నుంచి ఈ విధులూ బహిష్కరణ) సీనియర్ రెసిడెంట్లు ఇలా.. బుధవారం ఉదయం 9 గంటల నుంచి కోవిడ్ అత్యవసర సేవలు, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు. (రేపట్నుంచి అన్నిరకాల విధుల బహిష్కరణ) ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో డీఎంఈ.. జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు ఇచ్చిన వినతిని పరిగణించడం లేదని డీఎంఈ స్పష్టం చేసింది. జూడాలు విధులు బహిష్కరిస్తే.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్రిన్స్‌పాల్స్, డైరెక్టర్స్, సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్, ఇతర వైద్య సేవలందించడంలో ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా డ్యూటీ రోస్టర్‌ను రూపొందించి డీఎంఈ కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేసింది. డైరెక్టరేట్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. -
విధుల నుంచి కానిస్టేబుల్ తొలగింపు
దూద్‌బౌలి: ధర్నాలో ఆయుర్వేద వైద్య విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పరమేశ్ అనే కానిస్టేబుల్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ గురువారం విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాతబస్తీకి చెందిన కె.పరమేశ్ 2014లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి దక్షిణ మండలంలోని చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం జరిగిన సంఘటన సోషల్ మీడియాతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ కావడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యార్థినులు సైతం కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో వెంటనే స్పందించిన దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా విచారణ జరిపి ప్రాథమిక నివేదికను కమిషనర్‌కు సమర్పించారు. డీసీపీ నివేదిక ఆధారంగా నగర పోలీసు కమిషనర్ పరమేశ్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
జూడాల నిరసన.. రోగుల యాతన
గాంధీఆస్పత్రి: వైద్యుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు గాంధీ ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు (జూడాలు) బుధవారం సాధారణ విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. జూడాల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం విధులు బహిష్కరించిన జూడాలు ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించారు. ధర్నా, ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షుడు లోహిత్, కార్యదర్శి అర్జున్ మాట్లాడుతూ.. న్యాయమైన తమ డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు తాము వ్యతిరేకం కాదని, ముందుగా వైద్యుల పోస్టుల భర్తీ చేసిన తర్వాతే దీనిపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చల ద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ పరిష్కరించకుంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాధారణ విధులను మాత్రమే బహిష్కరించామని, అత్యవసర సేవలకు హాజరవుతున్నామన్నారు. సీఏఎస్ అమలు చేయాలి: టీజీజీడీఏ కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీంను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ వైద్యులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం గంట సమయం పాటు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ముందుగా సీఏఎస్ అమలు చేసిన తర్వాతే పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. జూడాల సమ్మెకు మద్దతు ప్రకటించారు. శస్త్ర చికిత్సలు వాయిదా... జూడాల సమ్మె నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో 70 శాతం శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందదులకు గురయ్యారు. తెలంగాణ జిల్లాలతోపాటు నగరం నలుమూలల నుంచి వైద్యసేవల కోసం ఓపీ విభాగానికి వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించారు. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. -
డాక్టర్లపై ఎవరు దాడులు చేసినా.. కఠిన శిక్షే
న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న వైద్యులపై ఎవరు దాడి చేసినా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని దాడుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆయన ముఖ్యమంత్రులను కోరారు. గతవారం కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 ఏళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి.. దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందితోపాటు పలువురు జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వైద్యుల నిరసన తీవ్రతరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే మమతకు సూచించారు. ఈ నేపథ్యంలోనే విధుల్లో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలంటూ ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మరోవైపు ఆందోళనకు దిగిన జూడాలను చర్చలకు మమత ప్రభుత్వం ఆహ్వానించగా జూడాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. తమ ఉద్యమాన్ని నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. -
చర్చలకు రండి; కుట్రలో భాగంగానే ఇలా..
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో జూడాల నిరసన మరింత ఉధృతమయ్యింది. గత వారంలో కోల్‌కతా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 85 యేళ్ల వ్యక్తి చనిపోవడంతో వారి బంధువులు ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆసుపత్రి సిబ్బందికి ,అనేక మంది జూనియర్ డాక్టర్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని జూడాలు కోరగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరిగా స్పందించకపోవడంతో వారు నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇంకా పెద్దది కాకుండా చూడాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మమతకు సూచించారు. ఈ మేరకు జూడాలను చర్చలకు ఆహ్వానించగా వారు తిరస్కరించారు. నిరసనను నీరు గార్చే కుట్రలో భాగంగానే ఈ చర్చల నాటకం ఆడుతున్నారంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. తాను కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు జూడాలు తనతో కూడా సరిగా ప్రవర్తించలేదని అయిన వారు చిన్నవారు కావడంతో తాను కూడా అవేమి పట్టించుకోలేదని,వారు తమ పనిని పునఃప్రారంభించడమే తనకు కావాలని మమత అన్నారు. అయితే మమత వ్యాఖ్యలను అనేక మంది తప్పుబడుతున్నారు. ఆసుపత్రిలపై జరిగే మూర్ఖపు దాడులను ప్రోత్సహించకూడదన్నారు. ఈ క్రమంలో జూడాలపై మమత చేసిన వాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రకంపనలు రేపడంతో కేంద్ర మంత్రులు, బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సహా సొంత పార్టీ నేతల నుంచి మమత విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జూడాల సమ్మె గురించి చర్చించడానికి తాను మమతకు కాల్ చేశానని..అయితే మమత స్పందించలేదని గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. కాగా మమత తీరుకు నిరసనగా కోల్‌కతాలోని 300 మంది డాక్టర్లు రాజీనామా చేశారు. జూడాలకు మద్దతుగా బెంగాల్‌తో పాటు ఢిల్లీలోని డాక్టర్లు నిరసనలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా,ఒడిశా, అస్సాం ,త్రిపురలోని డాక్టర్లు వారికి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో 48 గంటల్లోగా జూడాల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. అలా జరగని పక్షంలో నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. దీనిపై స్పందించి ఏడు రోజుల్లో సమాధానమివ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మమత తీరుపై సిగ్గు పడుతున్నా..
సాక్షి, కోల్‌కతా : జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూతురు షబ్బా హకీమ్ ఘాటైన విమర్శలు చేసింది. తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ ‘ పనికి తగిన భద్రత కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి ఆందోళన’ సరైనదేనని, ఒక టీఎంసీ కార్యకర్తగా మా నాయకురాలి ప్రవర్తన పట్ల సిగ్గుపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను వెంటనే విధుల్లో చేరాలని మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య, ప్రజా సంక్షేమ శాఖను నిర్వర్తించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. జాతీయ ఎన్నికల సందర్భంగా ఆసుపత్రుల్లో ఉన్న భద్రతను మమతా బెనర్జీ తొలగించిందని, దీన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు .బీజేపీ, సీపీఎంతో లోపాయికార ఒప్పందం చేసుకొని హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని షబానా ఆరోపించారు. దీనంతటికి పరోక్షంగా బీజేపీ చీఫ్ అమిత్ షా సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
13మందిని బలితీసుకున్న డాక్టర్ల సమ్మె
సాక్షి, పట్నా: రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారని నిరసనగా చేపట్టిన డాక్టర్ల సమ్మె 13 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విచారకర ఘటన బీహార్‌లోని పట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వైద్యం కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచారు. ఓరోగి మృతిని తట్టుకోలేని అతని బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. రెండు నెలల వ్యవధిలో మూడో ఘటన కావడంతో సుమారు 500 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. దీంతో అత్యవసర చికిత్సలు నిలిచిపోయాయి. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సుమారు 13 మంది ప్రాణాలు వదిలారని, చేసేదేమి లేక రోగులను ఇతర ప్రయివేట్ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు మీడియాకు తెలిపారు. సీనియర్ డాక్టర్లతో ఎమర్జన్సీ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో రోగులు ఉండటంతో ఏమి చేయలేకపోయామన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రక్షణ కల్పించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక 13 మంది మృతి చెందటంతో బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే జూడాలను చర్చలకు ఆహ్వానించారు.