కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు | Kolkata Junior Doctors Call Off Protest Resume Essential Services | Sakshi
Sakshi News home page

కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు

Published Fri, Sep 20 2024 7:17 AM | Last Updated on Fri, Sep 20 2024 8:54 AM

 Kolkata Junior Doctors Call Off Protest Resume Essential Services

కోల్‌కతా: బెంగాల్‌లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో జూనియర్‌ డాక్టర్లు ఆందోళనలు చేపట్టారు. దాదాపు 41 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా జూనియర్‌ డాక్టర్లు తామ ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి(శనివారం) అత్యవసర వైద్య సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన రెండు సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్‌ డాక్టర్ల మధ్య రెండు రోజుల క్రితమే కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్‌ వైద్యులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. అవుట్‌ పేషంట్‌ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో తమ ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, దానికి ముందు నగరంలో మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు బెంగాల్‌ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ అమలుకాకపోతే తిరిగి విధులను బహిష్కస్తామని హెచ్చరించారు.

మరోవైపు.. జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్‌ కుమార్‌ వర్మను నియమించారు. మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కౌస్తవ్‌ నాయక్‌, హెల్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ దేవాశిష్‌ హల్దేర్‌లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు.

మాజీ ప్రిన్సిపల్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు
ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ను బంగాల్​ వైద్య మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది. అలాగే, 1914 బెంగాల్‌ వైద్య చట్టం కింద సందీప్‌ ఘోష్‌ మెడికల్‌ లైసెన్సును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్‌ ఇచ్చిన నడ్డా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement