kolkata
-
ఇంగ్లండ్ వైస్ కెప్టెన్‌గా యువ క్రికెటర్.. ప్రకటించిన ఈసీబీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ పురుషుల జట్టుకు కొత్త వైస్ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ తరంగం హ్యారీ బ్రూక్ ఇకపై పరిమిత ఓవర్ల జట్టుకు ఉప నాయకుడిగా పనిచేస్తాడని మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు బ్రూక్ నియామకానికి సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.మూడేళ్ల నుంచి అదరగొడుతున్నాడుకాగా 2022లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది సౌతాఫ్రికాతో సిరీస్‌లో భాగంగా టెస్టుల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇక 25 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 24 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లలో అతడి సగటు 30.73.. స్ట్రైక్‌రేటు 146.07. వన్డేల్లో బ్రూక్ సగటు 39.94.. స్ట్రైక్‌రేటు 106.83. మూడేళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో టెస్టుల్లో ఎనిమిది, వన్డేల్లో ఒక శతకం సాధించాడు.బట్లర్ వారసుడిగాఇలా అద్భుత ప్రదర్శనతో మేనేజ్మెంట్ను ఆకట్టుకుంటున్న బ్రూక్‌ను వైస్ కెప్టెన్ పదవి వరించింది. బట్లర్ వారసుడిగా అతడిని చూస్తున్న యాజమాన్యం భవిష్యత్తులో సారథిగా నియమించాలనే యోచనలో ఉన్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఊహాగానాలు రాగా.. బ్రూక్ మాత్రం పెద్దగా స్పందించలేదు.ఐపీఎల్ ద్వారా భారత అభిమానులకు చేరువగా..ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్ ఆడుతున్నాడు. 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడు క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడి.. 190 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని విడిచిపెట్టింది.ఈ క్రమంలో 2024 ఎడిషన్‌కు గానూ ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్‌ను కొనుగోలు చేసింది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి అతడు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ ఢిల్లీ ఫ్రాంఛైజీ అతడిపై మరోసారి నమ్మకం ఉంచింది. 2025 మెగా వేలం సందర్భంగా రూ. 6.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా ఇంగ్లండ్‌కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 22 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2న పొట్టి ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగనుండగా.. ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌కు షెడ్యూల్ ఖరారైంది. కోల్‌కతా, చెన్నై, రాజ్‌కోట్, పుణె, ముంబై, టీ20లకు.. నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్ వన్డేలకు ఆతిథ్యం ఇస్తాయి. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌ల కోసం భారత్- ఇంగ్లండ్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి. చదవండి: Ind vs Eng: భారత తుదిజట్టులో వీరే.. ఆ ప్లేయర్లు బెంచ్‌కే పరిమితం! -
సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన సీల్దా కోర్టు
-
సంజయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవితఖైదు పడింది. స్థానిక సీల్దా కోర్డు సోమవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. దోషిగా ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను, సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ఆ కోవకు వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ అభిప్రాయపడ్డారు. 2024 ఆగస్ట్ 9న బోధనాస్పత్రి సెమినార్ హాల్లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేయడం తెలిసిందే. కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్‌గా పనిచేసిన సంజయ్‌ను ఈ కేసులో దోషిగా జడ్జి శనివారం నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64 (అత్యాచారం), 66 (మరణానికి కారణమవడం), 103 (1) (హత్య) కింద దోషిగా తేల్చారు. సోమవారం మధ్యాహ్నం శిక్ష ఖరారు చే శారు. నిందితుడు, బాధితురాలి కుటుంబం, సీబీఐ ల వాదనలు విన్నమీదట తీర్పు వెలువరించారు. సంజయ్ బతికినంతకాలం జైళ్లోనే గడపాలని పే ర్కొన్నారు. అతనికి రూ.50,000 జరిమానా కూడా విధించారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘‘బాధితురాలు విధి నిర్వహణలో చనిపోయినందున రూ.10 లక్షలు, అత్యాచారానికి గురైనందుకు రూ.7 లక్షలు ఆమె కుటుంబానికి పరిహారమివ్వాలి’’ అని పేర్కొన్నారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేసే వీలుంది.అప్పీలు చేస్తాం: బాధిత కుటుంబం జీవితఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దోషికి ఉరిశిక్ష వేయాల్సిందే. మాకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తాం. నేరంలో ఇతర భాగస్వాములను వదిలేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కాదా? వైద్యురాలు విధి నిర్వహణలో అత్యాచారానికి, హత్యకు గురైంది. దీనివెనక పెద్ద కుట్ర దాగుంది’’ అని జూనియర్ వైద్యురాలి తండ్రి అన్నారు. ‘‘నష్టపరిహారం మాకు వద్దు. మిగతా నేరస్తులూ బోనెక్కేదాకా పోరాడతాం’’ అన్నారు. వైద్యురాలి తల్లి కోర్టుకు రాలేదు. తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మీరంతా వెళ్లిపొండి’’ అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహించారు. ‘‘ఘటన జరిగినప్పుడు సంజయ్‌తో పాటు మరికొందరు ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో కచ్చితంగా ఇతరుల పాత్ర ఉంది. వాళ్లనూ చట్టం ముందు నిలబెట్టాలి’’ అని వైద్యురాలి అక్కలు డిమాండ్ చేశారు.వైద్యుల తీవ్ర అసంతృప్తి పని ప్రదేశాల్లో తమ భద్రత గాల్లో దీపమని చాటిచెప్పిన ఈ ఉదంతంలో దోషికి ఉరిశిక్ష పడక పోవడం దారుణమంటూ ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ఒక్కని పని కాదు. వ్యవస్థీకృత నేరమిది. ఈ కుట్రలో చాలామంది పాత్ర ఉంది. పరిహారం ప్రకటించేసి జీవితఖైదు విధించడం అసంబద్ధం. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం’’ అని సీనియర్ వైద్యుడు రాజీవ్ పాండే అన్నారు. మా వాళ్లయితే ఉరి వేయించేవాళ్లు: మమత తామైతే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి కచ్చి తంగా ఉరిశిక్ష వేయించేవాళ్లమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘‘మేమంతా దోషికి ఉరిశిక్షే కోరుకున్నాం. కేసును సీబీఐ మా నుంచి బలవంతంగా లాక్కుంది. సమగ్రంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. గట్టిగా వాదించలేదు. కోల్‌కతా పోలీసులైతే సమగ్రంగా దర్యాప్తు చేసేవాళ్లు’’ అన్నారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు అసలు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను, వెనకుండి సహకరించిన మమతను విచారించాలి’’ అని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన మర్నాడు సంజయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. విచారణ నత్తనడకన సాగుతోందని, బోధనాస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను, ఇతరలను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీచేసింది. -
శిక్ష సరే.. రక్షణ ఏది?
నెవర్ అగైన్.. దేశంలో ఎక్కడ ఏ మహిళపై ఏ నేరం జరిగినా ప్లకార్డ్ మీద కనిపించే స్లోగన్! కానీ ఆ నేరాలూ అగైన్ అండ్ అగైనే.. ఈ ప్లకార్డూ అగైన్ అండ్ అగైనే! లేకపోతే నిర్భయ ప్రజాగ్రహానికి పార్లమెంట్ దద్దరిల్లి.. ప్రత్యేక చట్టం, మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక ఫండ్, హెల్ప్ లైన్స్, అలర్ట్ యాప్స్.. ఎన్ని వచ్చాయి! అయినా కోల్‌కతా ఆర్జీ కర్ దారుణం జరిగింది.. మనమంతా మళ్లీ ఉలిక్కిపడేలా చేసింది. పనిచేసే చోటే డాక్టర్ లైంగిక దాడికి.. హత్యకు గురైంది. దోషి సంజయ్ రాయ్ అనే వలంటీరని తేల్చిన సియల్దా జిల్లా సెషన్స్ కోర్ట్ అతనికి జీవిత ఖైదు విధించింది. ఇలాంటివి జరిగినప్పుడల్లా అల్టిమేట్ శిక్షలను చేర్చుకుంటూ చట్టాలను మార్చుకుంటున్నాం! అయినా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో హెచ్చరిస్తూనే ఉంది ఏ ఏటికా ఏడు మహిళలపై పెరుగుతున్న నేరాలతో! కారణం మనం విక్టిమ్కే సుద్దులు చెబుతున్నాం. విక్టిమ్కే హద్దులు పెడుతున్నాం. విక్టిమ్నే బ్లేమ్ చేస్తున్నాం! అంటే నేరాన్ని ప్రేరేపించే భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాం! ఆ సుద్దులేవో అక్యూజ్డ్కి చెప్పడం మొదలుపెడితే, తన హద్దులేంటో అక్యూజ్డ్ గుర్తించేలా చేయగలిగితే, అమ్మాయి అంటే సెక్సువల్ ఆబ్జెక్ట్ కాదు, వ్యక్తిత్వమున్న తనలాంటి మనిషే అనే అవగాహన కల్పించగలిగితే... నెవర్ అగైన్ ప్లకార్డ్ అవసరం రాదు! శిక్షల మీద మొమెంటరీ కామెంట్స్‌కి స్పేస్ ఉండదు! మహిళ హాయిగా పనిచేసుకుంటుంది. ఎన్సీఆర్బీ ఆశ్చర్యపోతుంది. ఆర్జీ కర్ డాక్టర్ సంఘటనలో కోర్టు జీవితఖైదు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో శిక్ష సరే మహిళకు రక్షణేది అంటూ తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు.ఒక్కటి నెరవేరక పోయినా.. ఆర్జీ కర్ సంఘటన తర్వాత ఆ హాస్పిటల్‌లోని జూనియర్ డాక్టర్లు నిరహార దీక్ష చేశారు. సీసీటీవీ కెమెరాలు, ట్రాన్స్‌పోర్టేషన్, వాష్ రూమ్స్, ఇంటర్నల్ కంప్లయింట్ సెల్ వంటి వాటికోసం డిమాండ్ చేశారు. అవన్నీ నేరవేరాయో లేదో తెలియదు. ఒక్కటి నేరవేరకపోయినా ఉద్యమించాల్సిందే. మళ్లీ ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండటానికి! ఇక నేరస్థుడి శిక్ష విషయానికి వస్తే సంజయ్ రాయ్ నిజంగా దోషే అయితే అతనికి శిక్ష అవసరమే! అది అతనిలో పరివర్తన తీసుకురావాలి. అందులో అనుమానమే లేదు. అయితే అంతకన్నా ముందు అలాంటి నేరాలను ప్రేరేపించే పురుషాధిపత్య భావజాలాన్ని రూపు మాపాలి. ఆ మార్పు కోసం అందరం పాటుపడాలి.– బి. జ్యోతి, రాష్ట్ర కన్వీనర్, చైతన్య మహిళా సంఘం.రియాక్షన్స్ మాత్రమే ఉంటాయిఆర్జీ కర్ కేస్ జడ్జిమెంట్ రాగానే దోషికి డెత్ పెనాల్టీ విధించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్షణికావేశాలు, కోపాల వల్లే లాంగ్ టర్మ్ సొల్యుషన్ వైపు వెళ్లనివ్వకుండా మహిళా భద్రత, రక్షణ విఫలమవుతూ వస్తోంది. మన దగ్గర నివారణ చర్యలుండవు. రియాక్షన్సే ఉంటాయి. న్యాయం కోసం పోరాడేవాళ్లనే వేధిస్తుంటారు. నేరస్థులను పూజిస్తారు. మ్యారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించడాన్ని ప్రభుత్వాలే అడ్డుకుంటున్నాయి. ఇక ట్రాన్స్ విమెన్‌పై జరిగే నేరాలనైతే నేరాలుగానే చూడట్లేదు. మార్పును మతం మీదో, సంస్కృతి మీదో దాడిలాగా చూస్తున్నంత కాలం ఈ నేరాలు ఆగవు. నేరం జరిగిన తర్వాత ఏం చేయాలి, ఎలాంటి శిక్షలు పడాలి అని కాకుండా అసలు నేరాలు జరగకుండా ఏం చేయాలి, ఎలాంటి సిస్టమ్స్‌ను డెవలప్ చేయాలనే దాని మీద దృష్టిపెట్టాలి. ప్రాథమిక స్థాయిలోనే జెండర్ సెన్సిటైజేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ మొదలవ్వాలి. సమానత్వం, పరస్పర గౌరవం, కన్సెంట్ గురించి పిల్లలకు నేర్పాలి.– దీప్తి సిర్ల, జెండర్ యాక్టివిస్ట్తల్లిదండ్రులే కల్పించాలిపైశాచికంగా ప్రవర్తించిన ఒక వ్యక్తికి న్యాయస్థానం సరైన శిక్షనే విధించింది. స్త్రీ–పురుష సమానత్వం, స్త్రీల మీద గౌరవం లేకనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంతటా ఇలాంటి పరిస్థితే! సామాజిక మార్పే దీనికి పరిష్కారం. స్త్రీ–పురుషులు ఇద్దరూ సమానమనే అవగాహన వస్తే స్త్రీల పట్ల పురుషులకు గౌరవం ఏర్పడుతుంది. తల్లిదండ్రులే ఆ అవగాహన కల్పించాలి.– డా.రుక్మిణీరావు, సామాజిక కార్యకర్తఆ ప్రయత్నం లేకపోతే రక్షణ ఎండమావే!సంజయ్ రాయ్‌కి పడిన శిక్ష గురించి అసంతృప్తి వినిపిస్తోంది మరణ శిక్ష విధిస్తే బాగుండేదంటూ! రేప్ చేసిన వాళ్లను ఎన్కౌంటర్ చేసిన దాఖలాలున్నాయి. లైంగికదాడులు, హత్యలు ఆగలేదే! దీన్ని బట్టి పురుషాధిపత్య సమాజానికి సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరమని అర్థమవుతోంది. విచ్చలవిడి శృంగారం, క్రైమ్ సినిమాలు, డ్రగ్స్‌ను కట్టడి చేయాలి. మహిళలను సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా చూసే తీరును సంస్కరించాలి. మగపిల్లలకు చిన్నప్పటి నుంచే జెండర్ సెన్సిటివిటీని బోధించాలి. ఇందుకోసం పౌర సంస్థలు, విద్యావంతులు, ఎన్జీవోలు ఉద్యమించాలి. ఈ ప్రయత్నం లేకుండా ఎంతటి కఠిన శిక్షలు విధించినా మహిళా రక్షణ ఎండమావే! కార్యాచరణ మహిళా భద్రత, రక్షణ లక్ష్యంగా ఉండాలి తప్ప శిక్షల ధ్యేయంగా కాదు! – జూపాక సుభద్ర, రచయిత్రి, అడిషనల్ సెక్రటరీ గవర్నమెంట్ రిటైర్డ్ నేరాలు పుట్టకుండా ఆపాలిశిక్ష ఉద్దేశం నేరాన్ని తొలగించడం కానీ నేరస్థుడిని కాదు. ఇక్కడ మనం నేరస్థుడి గురించే మాట్లాడుతున్నాం. కానీ నేరం జరగకుండా ఉండే వాతావరణ కల్పన గురించి ఆలోచించట్లేదు. చర్చించట్లేదు. మాట్లాడట్లేదు. నేరస్థుడిని శిక్షించడం ఒక ఎత్తు. మరోవైపు మహిళల పట్ల జరుగుతున్న నేరాలను నిరోధించగలగాలి, నేరాలు పుట్టకుండా ఆపగలగాలి, నేరప్రవృత్తి ప్రబలకుండా చేయగలగాలి. ఇది సమాజం బాధ్యత. అయితే లోపమెక్కడంటే.. నువ్విలా ఉండు, ఇలా నడుచుకో అంటూ విక్టిమ్నే డిక్టేట్ చేస్తున్నాం. ఆర్డర్ వేస్తున్నాం. అక్యూజ్డ్ని అడ్రస్ చేయం. ఈ ఆలోచనలో, ఆచరణలో మార్పు రావాలి. పురుషుడి లైంగిక స్వేచ్ఛకి హద్దులున్నాయని నేర్పాలి. మగ పిల్లలకు జెండర్ కాన్షస్ కల్పించాలి. మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత రావాలి. ఇవన్నీ సాధ్యమైతేనే స్త్రీలపై జరిగే నేరాలు తగ్గుతాయి. – జహా ఆరా, సీనియర్ అడ్వకేట్, విశాఖపట్టణంపెద్ద తలకాయల కుట్రఆర్జీ కర్ కేస్ ఒక వ్యవస్థాగత హత్య. ఆ దారుణానికి పాల్పడిన నేరస్థుల్లో సంజయ్ రాయ్ ఒకడు తప్ప కేవలం అతనొక్కడే నేరస్థుడు కాదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నివేదిక కూడా చెప్పింది.. మల్టిపుల్ డీఎన్ఏ ఆనవాళ్లున్నాయని తేల్చి! అందుకే సంజయ్ రాయ్ ఒక్కడికే శిక్ష పడటం పట్ల అంతటా అసంతృప్తి కనపడుతోంది. ఇందులో రూలింగ్ పార్టీ ఇన్వాల్వ్ అయినట్టు తోస్తోంది. బాధిత కుటుంబాన్ని రకరకాలుగా మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలే అందుకు నిదర్శనం. అసలు నేరస్థులు వెలుగులోకి రాకుండా సాక్ష్యాలను మాయం చేయడం, ఒక్కడినే దోషిగా నిలబెట్టడం వంటివన్నీ చూస్తే నిజంగా దీని వెనక పెద్ద తలకాయలున్నట్లు, వాళ్లే ఈ నేరానికి కుట్ర పన్నినట్టు అనిపిస్తోంది.– మోక్ష, నటిప్రధాన సమస్యఖైదీకి ఉరి శిక్ష నుంచి లైఫ్ పడిందంటే దీని వెనకాల ఎంత మంది ప్రమేయం ఉందో! ఇది దోషిని బతికించే ప్రయత్నమే. మెడికల్ కాలేజీలలో సెక్యూరిటీ అనేది ప్రధాన సమస్య. సాధారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లందరికీ ఒక్కటే విశ్రాంతి గది ఉంటుంది. లేడీ డాక్టర్లు తెల్లవారు జామున రెండు–మూడు గంటలకు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే బోల్ట్ లేని ఆ గదిలోని పడుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ బ్లాక్‌లలో సెక్యూరిటీ ఉండదు. లేడీ డాక్టర్లకు అనుకోని అవాంతరం ఎదురైనప్పుడు ఒక అలారం కోడ్ ఉంటే బాగుంటుంది. దానికి వెంటనే ఆ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు నైట్ షిఫ్టుల్లోనూ అమ్మాయిలు ధైర్యంగా పనిచేయగలుగుతారు. అప్రమత్తంగా ఉండాల్సిన విషయాల పట్ల అమ్మాయిలకు అవగాహన పెంచాలి. – డాక్టర్ మనోరమ, గైనకాలజిస్ట్ -
కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసులో దోషికి - శిక్ష ఖరారు
-
RG Kar Case : నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Case) ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు (sealdah court ) సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్‌కు మరణిశిక్ష విధించాలని కోరింది. సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్‌కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు కోర్టులను ఆశ్రయిస్తామని కన్నీటి పర్యంతరమవుతున్నారు. ఉరితీయండిగత నెల డిసెంబర్లో కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది. తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్‌కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు. -
కోల్ కతా డాక్టర్ హత్యాచార కేసు నిందితుడికి నేడు శిక్ష ఖరారు
-
ఆర్జీకర్ ఘటనలో తీర్పు.. కోర్టు హాలులో కన్నీటి రోదనలు
కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది సీల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. అయితే జడ్జి తీర్పు చదువుతుండగా.. ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువుల కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది.‘‘నేను ఈ పని చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. తప్పు చేసినవాళ్లను ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?. ఏ తప్పూ చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు?’’ అంటూ గట్టిగా రోదించాడు. ఆ సమయంలో జడ్జి అనిర్బన్ దాస్ కలుగజేసుకుని చేసుకుని ‘‘నువ్వేమైనా మాట్లాడదల్చుకుంటే సోమవారం శిక్ష ఖరారు చేసే సమయంలో అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ సైలెంట్ అయ్యాడు.మరోవైపు.. తీర్పు వెలువడుతున్న టైంలోనే బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘న్యాయాన్ని రక్షించి.. మీపై నాకున్న నమ్మకం నిలబెట్టుకున్నారు. మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్నారు సర్’’ అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాధితురాలి తరపున వచ్చినవాళ్లంతా చప్పట్లు కొట్టారు. దీంతో.. జడ్జి నిశబ్దం పాటించాలంటూ అంటూ గావెల్(సుత్తి)తో మందలించారు.తీర్పు వెలువడక ముందు సీల్దా(Sealdah) కోర్టు ప్రాంగణంలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సంజయ్‌ను గట్టి భద్రతా మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్లంతా కోర్టు బయట ఉండి సంఘీభావం ప్రకటించారు. అయితే.. తీర్పు అనంతరం బాధితురాలి తరఫున పోరాడిన సంఘాలు, ఇతరులు లాయర్లతో కలిసి స్వీట్లు పంచడంతో సందడి కనిపిచింది.కోల్‌కతాలోని రాధా గోబిందా కర్(RG Kar) మెడికల్ కాలేజీ సెమినార్లో కిందటి ఏడాది ఆగష్టు 7వ తేదీన ఓ వైద్యవిద్యార్థిని(31) అర్ధనగ్నంగా విగతజీవిగా కనిపించింది. ఈ ఘోరం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వైద్య సిబ్బంది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. మూడు రోజుల తర్వాత(ఆగష్టు 10న) సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈలోపు ఘటనాస్థలంలోకి నిరసనకారులు దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమేననే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. బాధితురాలికి అండగా దేశం మొత్తం కదలడంతో.. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ కేసును ‘అభయ’గా మీడియా అభివర్ణించడం మొదలుపెట్టింది. ఇక.. ఈ ఘటనలో రాయ్ ఒక్కడే లేడని, ఇంకొందరి ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఇటు కోల్‌కతా పోలీసులు, ఆపై సీబీఐ కూడా రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాయి. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. అయితే బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ అంశాన్ని కూడా పరిశీలించింది. మరోవైపు.. అక్టోబర్ 7, 2024 సీల్దా కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్ ఆధారంగా సీల్దా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ దాకా.. నిందితుడి ఇన్‌కెమెరా ట్రయల్ జరిగింది. ఆ టైంలో 50 మంది సాక్షులను విచారించారు. చివరకు.. ఆర్జీకర్ హత్యాచార కేసులో వలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్ పాత్రను సీబీఐ నిర్ధారించగా.. సీల్దా కోర్టు ఇవాళ దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అన్నివిషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బీఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది కోర్టు. దీంతో సంజయ్‌కు మరణశిక్షగానీ, జీవితఖైదుగానీ పడే అవకాశాలే ఉన్నాయని జడ్జి వెల్లడించారు. -
కోల్‌కతా ఆర్జీకార్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సంచలన తీర్పు
-
ఆర్జీకార్ జూనియర్ వైద్యురాలి హత్యోదంతం.. బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు
కోల్‌కతా : యావద్దేశాన్నీ కదిలించిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన యువ వైద్యురాలి (అభయ) పాశవిక హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యోదంతంలో సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్‌పై జురిగిన దారుణంపై సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు ఆధారంగా మరికొద్ది సేపట్లో సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.ఈ సమయంలో అభయ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దర్యాప్తులో సీబీఐ చేసింది ఏమీలేదు. మా కుమార్తె కేసుకు సంబంధించి మేం కోల్‌కతా హైకోర్టు,సుప్రీం కోర్టు ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తాం. సమాధానాలు కోరాం. కోర్టు ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.కానీ సీబీఐ మా అనుమానాల్ని ఇంతవరకూ నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగిన దారుణంలో ఒక్కరు కాదు. నలుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ప్రమేయం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ చెబుతోంది. నిందితులకు శిక్ష పడినప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ స్థానాల తలుపు తడుతూనే ఉంటామని’ స్పష్టం చేశారు.ప్రధాని మోదీకి లేఖ మా అమ్మాయి కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మేం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశాం.వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని అభయ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
Ind vs Eng: టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అతడు ఫిక్స్!.. వారిపై వేటు?
టెస్టుల్లో వరుస వైఫల్యాల తర్వాత టీమిండియా.. మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. జనవరి 22న టీ20తో మొదలై.. ఫిబ్రవరి 12న మూడో వన్డేతో ఈ సిరీస్ ముగియనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీస్ నుంచి టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.గంభీర్‌కు చేదు అనుభవాలుఈ క్రమంలో మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir) ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేశాడు. గతేడాది శ్రీలంక పర్యటనతో కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీకి ఆరంభంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లంకతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం 2-0తో ఓడిపోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్‌ను కోల్పోయింది.అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో టీ20, టెస్టుల్లో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు.. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడింది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో 3-1తో ఓడి ట్రోఫీని కోల్పోయింది. ఇందుకు టీమిండియా బ్యాటర్ల వైఫల్యమే ప్రధానం కారణం.ద్రవిడ్‌తో సితాన్షు కొటక్ఈ ఘోర పరాభవాల నేపథ్యంలో బ్యాటింగ్‌కు ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. గంభీర్ ఏరికోరి తన సహాయక సిబ్బందికిలోకి తీసుకున్న అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ డష్కాటే పని తీరుపై గుర్రుగా ఉన్న మేనేజ్మెంట్.. వారిని తప్పించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు కీలక విషయాలు వెల్లడించాయి. ‘‘సితాన్షు కొటక్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరతాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు తుది నిర్ణయం జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతోంది. కాబట్టి బీసీసీఐ ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది.ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు కోల్‌కతాలో మూడు రోజుల పాటు శిక్షణా శిబిరం నిర్వహించనున్నారు. అందరు ఆటగాళ్లు జనవరి 18నే రిపోర్టు చేయాల్సి ఉంటుంది’’ అని సదరు వర్గాలు తెలిపాయి.కాగా సౌరాష్ట్ర మాజీ క్రికెటర్ సితాన్షు కొటక్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఈ మాజీ బ్యాటర్.. ఇండియా-‘ఎ’ జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో చివరగా కోచ్‌గా వ్యవహరించాడు.దేశీ క్రికెట్లో అద్భుతమైన రికార్డుసౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహించిన సితాన్షు కొటక్.. 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 8061 పరుగులు చేశాడు. ఇక గతంలో టీమిండియా తాత్కాలిక కోచ్‌గానూ కొటక్ వ్యవహరించాడు. 2023లో జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో ఐర్లాండ్ పర్యటనలో భారత్ టీ20 సిరీస్ ఆడినప్పుడు అతడు జట్టుతోనే ఉన్నాడు.కాగా రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో విక్రం రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అయితే, జూలై 2024 తర్వాత ఈ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో సితాన్షు కొటక్ వైపు బీసీసీఐ మొగ్గుచూపుతున్నట్లు తాజా సమాచారం.చదవండి: ఇలాంటి కెప్టెన్‌ను ఎప్పుడూ చూడలేదు: రోహిత్ శర్మపై టీమిండియా స్టార్ కామెంట్స్ -
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
సౌరవ్ గంగూలీ కుమార్తె సనా కారుకు యాక్సిడెంట్
టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) కుమార్తె సనా గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కోల్‌కతాలోని తమ ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం కారులో బయల్దేరిన సనా గంగూలీ బెహాలా చౌరాస్తాకు చేరుకున్న సమయంలో ఓ ప్రైవేటు బస్సు ఆమె కారును బలంగా ఢీకొట్టింది.ఈ ఘటనలో సనా(Sana Ganguly)తో పాటు కారులో ఉన్న మిగతా వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, కారును ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు వేగంగా అక్కడి నుంచి కదిలింది. ఈ క్రమంలో స్థానికులతో పాటు.. పోలీసులు బస్సును వెంబడించారు. దాదాపు కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత.. ఎట్టకేలకు సఖేర్‌బజార్ క్రాసింగ్ వద్ద బస్సును ఆపగలిగారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు.అప్పటి నుంచి పోలీసు నిఘాలో కాగా బెహాలా చౌరాస్తా వద్ద గత ఏడాదిన్నర కాలంగా పోలీసు బందోబస్తు ఉంది. 2023లో బెహాలా చౌరాస్తా వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎనిమిదేళ్ల విద్యార్థిని ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు తవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. రెండో తరగతి చదువుతున్న ఆ పిల్లాడు పరీక్ష రాసేందుకు వెళ్తూ దుర్మరణం పాలు కావడంతో స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన పెల్లుబికాయి.పరిస్థితి చేయిదాటంతో పోలీసులు వచ్చి వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చౌరాస్తా ప్రాంతం పోలీసు నిఘాలో ఉంది. ఈ క్రమంలోనే సనా గంగూలీ కారును ఢీకొట్టిన ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించగలిగారు. ఇక రాయ్చక్ నుంచి కోల్‌కతా మార్గంలో వెళ్తున్న బస్సు.. సనా కారును ఢీకొట్టిందని.. అయితే, ఈ ఘటనలో కారు పెద్దగా డ్యామేజ్ కాలేదని.. అలాగే అందులోని ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏకైక సంతానంకాగా భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ- డోనా దంపతులకు ఏకైక సంతానం సనా. 1997లో పెళ్లి చేసుకున్న సౌరవ్- డోనాలకు 2001లో కుమార్తె సనా జన్మించింది. తల్లిలాగే సనా కూడా ఒడిస్సీ డాన్సర్. లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి ఎకనామిక్స్‌లో ఆమె పట్టా పుచ్చుకుంది. చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. ఆస్పత్రికి జస్ప్రీత్ బుమ్రా -
చిన్మయ్ కృష్ణదాస్‌కు దక్కని ఊరట
ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై చట్టోగ్రామ్ కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. గురువారం కోర్టులో జరిగిన విచారణకు కృష్ణదాస్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన తరఫున 11 మంది లాయర్లు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు దశలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. దీంతో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జి మొహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ నిర్ణయం తీసుకున్నారు. కృష్టదాస్ను గత ఏడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారు.చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు -
సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ
కోల్‌కతా : బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) దుమ్మెత్తి పోశారు. సందేశ్‌ఖాలీపై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేందుకు పెద్దమొత్తంలో నిధుల్ని ఖర్చు చేశారని ఆరోపించారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్(trinamool congress)కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో సోమవారం తొలిసారి మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించారు.ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ..‘నిందితుల్ని ప్రోత్సహించవద్దు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసేలా ఇక్కడ (సందేశ్‌ఖాలీ) పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. కానీ దాని గురించి నేను పెద్దగా మాట్లడదలుచుకోలేదు. అబద్ధానికి అందం ఎక్కువ. నిజానికి సహనం తక్కువ. ఆ అందమైన అబద్ధాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశ్‌ఖాలీ (sandeshkhali) స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అయినప్పటికీ తాజా పర్యటనలో ఆ ఆందోళనల్ని ప్రస్తావించలేదు. పరోక్షంగా వాటిని నేను ఎప్పుడో మరిచి పోయా. ఇక్కడి మహిళలు మోసగాళ్లను నమ్మకండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అలాంటి వారిపట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.సందేశ్‌ఖాలీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించా. ప్రచారంలో ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్ ఖాలీని పర్యటిస్తారా? అని స్థానికులు నన్ను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యటనకు వస్తానని మాట ఇచ్చా. మాట ప్రకారం మీ ముందుకు వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానికులు ప్రయోజనం పొందుతున్నారా? లేదా? ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఇప్పుడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు, పురుషులు ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను’అంటూ మమతా బెనర్జీ ఆకాంక్షించారు.సందేశ్‌ఖాలీ వివాదం ఏంటి?పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ అనే ప్రాంతంలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన చేపట్టారు. మహిళల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో షాజహాన్‌ఖాన్ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులకే షాజహాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. -
బెంగాల్ మాజీ మంత్రికి భవిష్యత్ బెయిల్!
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఒక బెయిల్ కేసులో వినూత్న పోకడకు శ్రీకారం చుట్టింది. బెయిల్‌కు ముందు పూర్తిచేయాల్సిన విధివిధానాలపై కిందికోర్టు సంతృప్తి చెందితే వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటోతేదీ లోపు మాజీ మంత్రి పార్థా ఛటర్జీని షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం కింది కోర్టుకు వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. సాధారణంగా ఏదైనా కేసులో ఇరువైపులా వాదనలు విన్నాక బెయిల్‌కు అవకాశం ఉంటే వెంటనే బెయిల్ ఉత్తర్వులు ఇస్తారుగానీ ఇలా కొద్దిరోజుల తర్వాతనే బెయిల్‌పై విడుదల చేయాలని సూచించడం ఇదే తొలిసారి అని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. నగదుకు ఉద్యోగం కుంభకోణంలో 2022 జూలై 22న అరెస్టయి ఇన్నాళ్లుగా విచారణ ఖైదీగా జైళ్లో గడుపుతున్న పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత పార్థా ఛటర్జీ బెయిల్ కేసులో విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వినూత్న ఉత్తర్వులు జారీచేసింది. #SupremeCourt to shortly pronounce judgment on the #bail plea of former West Bengal Education Minister and now MLA #ParthaChatterjee in the money laundering case arising out of the West Bengal cash-for-jobs scamBench: Justices Surya Kant and Ujjal Bhuyan pic.twitter.com/IB9mOBSFHI— Live Law (@LiveLawIndia) December 13, 2024‘‘జనవరి రెండో, మూడో, నాలుగో వారా ల్లో సాక్షుల వాంగ్మూలాలతోపాటు నేరాభి యోగాల సమర్పణ ట్రయల్ కోర్టులో పూ ర్తవ్వాలి. ఇదంతా పూర్తయితే ఫిబ్రవరి ఒకటి లోపు ఆయనకు బెయిల్ ఇవ్వండి’’ అని జడ్జి సూర్యకాంత్ తీర్పు రాశారు. భవిష్యత్ బెయిల్‌గా అభివర్ణించిన ఈ కేసులో ఫిబ్రవరిలో కూడా ఆయన బెయిల్‌పై బయటికొచ్చే అవకాశం లేకపోవడం గమనార్హం. ఈ కుంభకోణానికి సంబంధించిన వేరే కేసుల్లోనూ ఆయనను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేయడమే ఇందుకు కారణం. మనీలాండరింగ్, ఇతర అక్ర మాల కోణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు పలు ఎఫ్ఐఆర్లు నమోదుచేసి విచారిస్తున్నాయి. ఈయనపై ఈడీ 3, సీబీఐ 5 కేసులను నమోదు చేశాయి. అరెస్ట్ సమయంలో మంత్రిగా ఉన్నా రన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ఛటర్జీ తరఫు లాయర్ల వాదనను కోర్టు తప్పుబట్టింది. ‘‘ఎవరైనా నిందితుడు మంత్రి వంటి పదవులు, హోదాల్లో ఉన్నంత మాత్రాన వారికి బెయిల్ ఇచ్చే విషయంలో ప్రత్యేక మినహాయింపులు అంటూ ఏవీ ఉండవు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. -
దేశరాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మారిన వేళ..
ఒకప్పుడు మన దేశ రాజధాని కలకత్తా..తనదంతర కాలంలో అది ఢిల్లీకి మారింది. చరిత్రలో నిలిచిపోయే ఈ ఘటన ఈరోజు (డిసెంబరు 12)న జరిగింది. నాటి బ్రిటీష్ పాలకులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దేశరాజధాని కలకత్తా కాదు.. ఢిల్లీ అంటూ ఎందుకు ప్రకటించారు?అది.. 1911 డిసెంబర్ 11.. బ్రిటీష్ పాలకులు ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఢిల్లీ దర్బార్‌లో భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలని జార్జ్ వీ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు నాటి బ్రిటీష్ అధికారులంతా సమ్మతి తెలిపారు. ఈ నేపధ్యంలో 1911, డిసెంబరు 12న ఉదయం 80 వేల మందికి పైగా ప్రజల సమక్షంలో బ్రిటన్ రాజు జార్జ్ వీ ఇకపై ఢిల్లీ భారతదేశానికి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు.రాజధాని మార్పు వెనుక రెండు కారణాలుఅయితే దీనిని అధికారికంగా అమలు చేయడం ఆంగ్లేయులకు అంత సులభం కాలేదు. ఎట్టకేలకు 1931 మార్చి నాటికి, బ్రిటీష్ హైకమాండ్ పూర్తిస్థాయిలో ఢిల్లీని రాజధానిగా అంగీకరించింది. ఈ విషయాన్ని బ్రిటీషర్లు యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఆంగ్లేయులు కలకత్తాను పక్కనపెట్టి, ఢిల్లీని రాజధానిగా చేయడం వెనుక రెండు ప్రత్యేక కారణాలున్నాయి. మొదటిది బ్రిటిష్ ప్రభుత్వ పాలనకు ముందు పలు సామ్రాజ్యాలు ఢిల్లీ నుంచి పాలన సాగించాయి. రెండవది భారతదేశంలోని ఢిల్లీ భౌగోళిక స్వరూపం. ఈ రెండు కారణాలను పరిగణలోకి తీసుకున్న ఆంగ్లేయులు ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభమని భావించారు.ఈస్ట్ ఇండియా కంపెనీ బలహీనపడటంతో..కాగా బెంగాల్ విభజన తర్వాత కలకత్తాలో పెరిగిన హింస, అల్లర్లతో పాటు బెంగాల్లో స్వరాజ్యం కోసం పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా బ్రిటీషర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నిపుణులు చెబుతుంటారు. బ్రిటీష్ వారు మొదట ఆశ్రయం పొందిన భూమి బెంగాల్ అని, ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించింది అక్కడేనని, అయితే కంపెనీ బలహీనపడటంతో వారు దేశరాజధానిని ఢిల్లీ మార్చారనే వాదన కూడా వినిపిస్తుంటుంది. రాజధానిని మార్చేందుకు వ్యూహాత్మకంగా భారీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, రాజధాని మార్పు నిర్ణయం భారత్‌లోని అందరికీ అనుకూలమేనని బ్రిటీషర్లు ప్రకటించారు.1911 ఆగస్టులో అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ లండన్‌కు పంపిన లేఖలో భారత్ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాలంటూ పేర్కొన్నారు. 1931లో నాటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఢిల్లీని అధికారికంగా రాజధానిగా ప్రకటించారు. తరువాత వారు బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్లకు ఢిల్లీ రూపకల్పన బాధ్యతను అప్పగించారు.తరగని వైభవందేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఢిల్లీని 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అయితే 1991లో 69వ సవరణ ద్వారా ఢిల్లీకి జాతీయ రాజధాని ప్రాంతం హోదాను కల్పించారు. ఢిల్లీ చరిత్ర కథ మహాభారత కాలంలో ఇంద్రప్రస్థ ప్రస్తావనతో ముడిపడివుంది. 12వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల పాలనలో ఉంది. తదనంతరకాలంలో సామ్రాజ్యాలు మారాయి. పాలకులు మారారు. చివరికి ప్రభుత్వాలు కూడా మారాయి. అయితే దేశ చరిత్రలో ఢిల్లీకి ఘనమైన స్థానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు -
కోల్‌కతా విమానాశ్రయానికి వందేళ్లు
కోల్‌కతా: సిటీ ఆఫ్ జాయ్.. భారతదేశపు ఒకనాటి రాజధాని.. బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోని ఇన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచినా మహానగరం కలకత్తా.. ఇప్పుడు ఒకనాడు డమ్ - డమ్ విమానాశ్రయంగా పేరుగాంచి తరువాత 1995 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చుకున్న కలకత్తా విమానాశ్రయం ఈ ఏడాది వందేళ్ల పండగను జరుపుకోనుంది. వాస్తవానికి కోల్‌కతా 1772 - 1912 మధ్య భారత రాజధానిగా ఉండేది. ఆ తరువాత 1924లో కోల్‌కతాలో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాలతోబాటు అటువైపునున్న దేశాలన్నిటికీ ముఖద్వారం వంటి కోల్‌కతా నుంచి విమాన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచినా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.వందేళ్ల క్రితం క్రితం .. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే... 1900ల కాలంలో చిన్న ఎయిరోడ్రోముగా మొదలైన కలకత్తా ప్రస్థానం.. 1924 నాటికి పూర్తి స్థాయి విమానాశ్రయంగా మారింది. అప్పట్లో నెదర్లాండ్స్ కు చెందిన కెఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM airlines ) ఆమ్స్టర్డామ్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు నడిపే విమానానికి కోల్ కతాలో స్టాప్ ఇచ్చేది. అలా అందర్జాతీయ విమానసర్వీసులు మొదలైన ఈ విమానాశ్రయం ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ఆకాశాన్ని ఎందుకులే లోహ విహంగాలకు ఆశ్రయం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయికి చేరింది.1924లో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇక్కడ ల్యాండ్ అయింది.ఆ తరువాత మే 2న ఫ్రెంచ్ పైలట్ మిస్టర్ డోయ్సీ రాక కూడా జరిగింది. అదే సంవత్సరం, డమ్ డమ్ విమానాశ్రయంలో తొలిసారిగా రాత్రిపూట విమానం ల్యాండ్ అవడం, ఓ గొప్ప ముందడుగుకు నాంది అని చెప్పవచ్చు. మొదట్లో టార్చిలైటు వెలుగులో విమానాలను రాత్రిపూట ల్యాండ్ చేసేవాళ్ళు. వాస్తవానికి ఈ విమానాశ్రయం అటు యూరోప్.. ఉత్తర అమెరికాలనుంచి ఇటు ఆసియావైపు వెళ్లే విమానాలకు మార్గమధ్యంలో ఒక టెక్నీకల్ హాల్ట్‌గా గణనీయంగా ఉపయోగపడడం మొదలయ్యాక దాని స్థాయి అమాంతం పెరిగిపోయిడ్ని. ఆ రెండు మార్గాల నడుమ నడిచే విమానాలన్నీ కలకత్తాలో కాసేపు ఆగి.. ఇంధనం నింపుకు వెళ్లడం.. విమానాల సాంకేతికత తనిఖీ వంటి పనులన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు. దీంతో అనివార్యంగా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చింది.ఇదిలా ఉండగానే 1929లో అప్పటి అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్‌లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్‌ను ప్రారంభించి విమానాశ్రయ హోదాను మరింతగా పెంచారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన యుద్ధానికి సైతం కోల్ కతా విమానాశ్రయం వేదిక ఐంది. 1938లో బోస్ ఇక్కణ్నుంచే బ్రిటిష్ వారిపై సమరశంఖాన్ని పూరించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, కోల్‌కతా వాణిజ్య విమానాలకు కీలక గమ్యస్థానంగా మారింది. 1940-1960ల మధ్య, విమానాశ్రయం ఏరోఫ్లాట్, ఎయిర్ ఫ్రాన్స్ మరియు పాన్ ఆమ్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రముఖ స్టాప్ ఓవర్ హబ్‌గా మారింది. 1990 తరువాత దశమారింది. 1990ల నాటికి, కోల్‌కతా విమానాశ్రయం ప్రయాణీకు లు,కార్గో కార్యకలాపాలకు ప్రధాన అంతర్జాతీయ, దేశీయ కేంద్రంగా ఎదిగింది1990లలో, విమానాశ్రయం ఆధునీకరణ చేయగా 1995లో నిర్మించిన కొత్త దేశీయ టెర్మినల్ భారత విమానయాన రంగం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.అదే ఏడాది దీనిపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.2000లలో భారత వైమానిక రంగం గొప్ప పురోగతి సాధించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణం అంటూ సరికొత్త ప్రయివేటు విమాన సంస్థలు రావడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల మాదిరే ఇక్కడా రద్దీ పెరిగింది. తద్వారా విమానాశ్రయం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.2013లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం, రన్‌వే పొడిగింపు వంటి అభివృద్ధి పనులతో ఈ విమానాశ్రయం ప్రాధాన్యం అమాంతం ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతంప్రస్తుతం పాతికదేశాలకు పైగా విమానయాన సంస్థలు వాణిజ్యకార్యకలాపాలను ఇక్కణ్ణుంచి కొనసాగిస్తున్నాయి. వందలాది విమానాలు.. కార్గో సంస్థలకు కోల్ కతా ఇప్పుడు ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కణ్ణుంచి 1,97,84,417 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు పయనమయ్యారు. దాదాపు రోజూ 430 విమానాలు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకముగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది వందో పుట్టినరోజును జరుపుకుంటోంది. సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతా తో బాటు ఈశాన్య భారతానికే కాకుండా పలు ఆసియా దేశాలకు ఈ విమానాశ్రయం ఒక ముఖద్వారం.. ఈ వందేళ్ల పండుగకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.:::సిమ్మాదిరప్పన్న -
అక్కడ కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్..!
హిందూవుల అత్యంత పవర్ఫుల్ దేవత కాళీమాత. ఆమె పూజ విధానం, ఆచారా వ్యవహారాలు అత్యంత విభిన్నంగా ఉంటాయి. అలాంటి శక్తిమంతమైన దేవత కాళీమాతకు నైవేద్యంగా న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెట్టడం గురించి విన్నారా..? అది కూడా శక్తి పీఠాల్లో ఒకటిగా అలరారుతున్న కోల్‌కతాలోనే ఓ మామూల ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉంది. అయితే ఆ దేవతను ఎవరూ కొలుస్తున్నారో వింటే ఆశ్చర్యపోతారు.కలకత్తాలోని చైనీస్ టౌన్‌గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో ఈ కాళిమాత ఆలయం ఉంది. రహదారి పక్కనే ఉన్న ఓ చెట్టు వద్ద ఉంది. ఈ అమ్మవారిని తొలుత స్థానిక హిందువులు పూజించేవారు. ఆ తర్వాత అక్కడే నివశించే చైనా కమ్యూనిటీవారిచే పూజలు అందుకోవడమే గాక వారే ఆ చెట్టు వద్ద చిన్నగా ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించి వారి ఆచార వ్యవహారంలో నిర్మించారు. అలా క్రమంగా ఆ ఆలయం పేరు చైనీస్ కాళీమందిరంగా ఏర్పడింది. ఈ గుడికి సంబంధించి ఓ ఆసక్తికర కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే..ఒక చైనీస బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యలు అతడిపై ఆశ వదిలేసుకోవాలని చెప్పడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఈ కాళీ మందిరానికి తీసుకువచ్చి..భక్తితో పూజించడం ప్రారంభించారు. అనూహ్యంగా కొద్ది రోజుల్లోనే ఆ బాలుడు కోలుకోవటం ప్రారంభించాడు. అప్పటి నుంచి అక్కడ ఉండే చైనా వాళ్లే ఈ అమ్మవారిని భక్తిగా కొలవడం ప్రారంభించారు. ఈ ఆలయ బాగోగులు చూసుకునేది కూడా ఓ చైనీస్ వ్యక్తే. అతడు తనను తాను చైనీస్ హిందువుగా పేర్కొనడం వివేషం. అంతేగాదు ఈ చైనీస్ కాళీ మందిరంలో అమ్మవారికి న్యూడిల్స్‌ని నైవేద్యంగా పెడతారట. దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారట. ఇలా ఎన్నో ఏళ్లుగా న్యూడిల్స్నే కాళీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఆ ఆలయం కూడా చైనీస్ డ్రాగన్ పెయింట్‌తో ఉంటుంది. ఆ విగ్రహ వెనకాల ఓం గుర్తుల తోపాటు చైనా మూలాంశాలతో కూడిన గుర్తులు కూడా ఉంటాయి. ఈ మాతను దర్శించుకునేందుకు సుదూరప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడం విశేషం. (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!) -
‘చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ను ఖండిస్తున్నాం’
కోల్‌కతా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్ట్‌ని కోల్‌కతా సీఎం మమతాబెనర్జీ ఖండించారు. ఈ అరెస్ట్ అంశంలో ప్రధాని మోదీతో పాటు అంతర్జాతీయ ప్రముఖులు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘తమ ప్రభుత్వం మతాల విషయంలో సామరస్యాన్ని కోరుకుంటుంది. ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఆయన అరెస్ట్‌పై స్థానిక ఇస్కాన్ ప్రతినిధులతో మాట్లాడాను.అరెస్ట్ అంశం విదేశానికి సంబందించి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో మేం కేంద్రానికి అండగా నిలుస్తామని తెలిపారు. కాగా, హిందూ సమాజంపై అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు ఇస్కాన్‌కు చెందినచిన్మయ్ కృష్ణదాస్ ప్రభుని బంగ్లాదేశ్ పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌ను ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. Speaking on the Bangladesh issue in the Legislative Assembly, West Bengal CM Mamata Banerjee says, "We do not want any religion to be harmed. I have spoken to ISKCON here. Since this is a matter of another country, the Central government should take relevant action on this. We… pic.twitter.com/Keob4a9aGf— ANI (@ANI) November 28, 2024 -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
ఆర్జీ కర్ ఆసుపత్రి.. నిందితుడు సంజయ్రాయ్ గొంతు వినిపడకుండా పోలీసుల హారన్లు!
కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటన కేసు విచారణలో కోల్‌కతా పోలీసులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలో విచారణ కొనసాగుతుంది.అయితే విచారణ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు. ఆ సమయంలో సంజయ్ రాయ్ మీడియాకు, ప్రజలకు వినిపించకుండా పోలీసులు హారన్ కొడుతూ తీసుకెళ్లడం చర్చనీయాశంగా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నవంబర్ 11న సీల్దా కోర్టుకు సంజయ్‌రాయ్‌ను తీసుకెళ్లే సమయంలో కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్‌పై రాయ్ తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించాడు. ఈ తరహ ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా సైరన్ మోగిస్తూ కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. -
టీఎంసీ నేతపై అటాక్ ప్లాన్.. సీన్ రివర్స్ కావడంతో..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అధికార టీఎంసీ నేతను టార్గెట్ చేసి దుండగులు చంపే ప్రయత్నం చేయగా.. ప్లాన్ విఫలమైంది. దీంతో, సదరు నేత.. వారికి పట్టుకోవడంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.వివరాల ప్రకారం.. టీఎంసీ నేత సుశాంత ఘోష్ కోల్కత్తా మున్సిపల్ కార్పొరేషన్లో 108 వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్నాడు. సుశాంత.. శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం, ఇంటి బయటే వారందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు షూటర్లు బైక్‌పై వచ్చి సుశాంతను తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి తన జేబులో నుంచి తుపాకీ తీసి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు.అయితే, అది పనిచేయకపోవడంతో మరోసారి కాల్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అది మొరాయించింది. అప్పటికి తేరుకున్న సుశాంత వెంటనే లేచి అతడిని పట్టుకున్నాడు. అక్కడే ఉన్న మరికొందరు టీఎంసీ నేతలు కూడా అలర్ట్ అయ్యి.. వారిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం, వారిని ఎవరు పంపారని ప్రశ్నించగా.. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదని, ఫొటో ఇచ్చి చంపమని అడిగారని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.దీంతో, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌన్సిలర్‌ను చంపేందుకు బీహార్ నుంచి కిల్లర్లను రప్పించినట్టు విచారణలో తేలింది. దీని వెనుక స్థానిక ప్రత్యర్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, తనను చంపేందుకు ప్లాన్ చేసిన వారు ఎవరో తెలియదని కౌన్సిలర్ పేర్కొన్నారు. తాను పుష్కర కాలంగా కౌన్సిలర్‌గా ఉన్నానని, తనపై దాడి జరుగుతుందని ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు. తన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. #Shocking| #CCTV| Miraculous escape for #TMC leader Sushanta Ghosh after two bike borne youths appeared in front of him & one of them tried to shoot him at point blank range this evening in #Kolkata. However, the 9mm pistol got locked & he couldn’t open fire. Ghosh escaped unhurt… pic.twitter.com/onSn1TxYcd— Pooja Mehta (@pooja_news) November 15, 2024 -
డాక్టర్‌పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్లోనే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్ టాస్‌్కఫోర్స్(ఎన్టీఎఫ్) సైతం తమ నివేదికను అందజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్‌టీఎఫ్‌కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్టీఎఫ్ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. -
కోల్‌కతా హత్యాచార ఘటన: కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దారుణ ఘటన కేసుకు సంబంధించిన విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇక.. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్ స్టేట్మెంట్లు చేయొద్దని సూచించారు.‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి లేదు. కావును అటువంటి బదిలీ చేయలేం. ఇక.. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్ పోర్టును మేం పరిశీలించాం. అయితే..సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో మేం కేసు స్టేటస్ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వత స్టేటల్ అప్డేట్ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. వాదన సమయలో పశ్చిమ బెంగాల్ ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని ఓ న్యాయవాది అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. ‘‘ మీరు ఎవరి తరపున హాజరవుతున్నారు. ఇలాంటి సాధారణ ప్రకటనలు చేయొద్దు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు. కోర్టులో క్యాంటీన్ కబుర్లు చెప్పొద్దు’’ అని మందలించారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.చదవండి: నేను ఏ నేరం చేయలేదు.. ప్రభుత్వమే ఇరికిస్తోంది: సంజయ్ రాయ్ కేకలు