కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులు దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. సందీప్ ఘోష్ ప్రన్సిపల్‌గా ఉన్న సమయంలో ఆస్పత్రిలో పేషెంట్లకు అందించే మెడిసిన్ కొనుగోళ్ల వ్యవస్థలో భారీ లోపాలు ఉన్నాయని సీబీఐ తాజాగా పేర్కొంది.
బయటి ఏజెన్సీల నుంచి ఔషధాలను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా బిడ్డర్లను సాంకేతికంగా పరిశీలన చేసే కీలకమైన అంశాన్ని విస్మరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. పేషెంట్ల ఆరోగ్యం బిడ్డర్లు సప్లై చేసే నాణ్యమైన మెడిసిన్‌పై అధారపడి ఉంటుంది. అయితే.. ఈ క్రమంలో బిడ్డర్ల సాంకేతిక పరిశీలిన చాలా ముఖ్యమైన అంశం. కానీ.. రెండు దశల్లో పూర్తి చేసుకోవల్సిన సాంకేతిక పరిశీలనను కేవలం ఒక దశ తర్వాతే బిడ్డర్లకు కాంట్రాక్ట్ అప్పగించనట్లు పలు డాక్యుమెంట్లపై దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు వెల్లడించారు.
బిడ్డర్లు మొదటి దశ పరిశీలనలో అర్హత సాధించకపోయినా రెండోదశకు అనుమతించి మరీ కాంట్రాక్టు అప్పగించినట్లు సీబీఐ పేర్కొంది. అదే విధంగా ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే మెడిసిన్ నాణ్యత విషయంలో పీజీ ట్రైనింగ్ డాక్టర్లు ఎన్నిసార్లు సందీప్ ఘోస్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోలేదని సీబీఐ తెలిపింది.
మరోవైపు.. కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్‌లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన సమాచారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయటంలో నిర్లక్ష్యం కారణంగా సందీప్ ఘోష్ సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక.. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌తో పాటు సందిప్ ఘోష్‌కు కూడా సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
చదవండి: కోల్‌కతా కేసు: 25 దాకా ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment