
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారానికి సంబంధించి సాక్ష్యాలు నాశనం చేసిన కేసులో ఘోష్ సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 25దాకా కోర్టు పొడిగించింది. ఘోష్‌తో పాటు ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కోల్‌కతా తాలా పోలీస్‌స్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా కోర్టు సెప్టెంబర్ 25 దాకా సీబీఐ కస్టడీకి ఇచ్చింది.
మహిళా డాక్టర్ హత్యాచారం వెనుక ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తో కలిసి ఘోష్, మండల్ ఏదైనా కుట్ర చేశారా అని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. కుట్ర కోణంలో సీబీఐ వీరిని విచారించనుంది. కాగా, మెడికల్ కాలేజీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్ మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది.
ఇదీ చదవండి.. మాపైనే నిందలా..? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment