RG Kar Medical Hospital
-
ఆర్జీకార్ జూనియర్ వైద్యురాలి హత్యోదంతం.. బాధితురాలి తండ్రి సంచలన ఆరోపణలు
కోల్‌కతా : యావద్దేశాన్నీ కదిలించిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన యువ వైద్యురాలి (అభయ) పాశవిక హత్యోదంతంపై సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యోదంతంలో సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని వ్యాఖ్యానించారు. గతేడాది ఆగస్ట్ 9న ట్రైనీ డాక్టర్‌పై జురిగిన దారుణంపై సీబీఐ సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తు ఆధారంగా మరికొద్ది సేపట్లో సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.ఈ సమయంలో అభయ తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దర్యాప్తులో సీబీఐ చేసింది ఏమీలేదు. మా కుమార్తె కేసుకు సంబంధించి మేం కోల్‌కతా హైకోర్టు,సుప్రీం కోర్టు ముందు అనేక ప్రశ్నలను లేవనెత్తాం. సమాధానాలు కోరాం. కోర్టు ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించింది.కానీ సీబీఐ మా అనుమానాల్ని ఇంతవరకూ నివృత్తి చేయలేదు. మా అమ్మాయికి జరిగిన దారుణంలో ఒక్కరు కాదు. నలుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి ప్రమేయం ఉందని డీఎన్ఏ రిపోర్ట్ చెబుతోంది. నిందితులకు శిక్ష పడినప్పుడే మాకు ఉపశమనం లభిస్తుంది. ఈ కేసులో మాకు న్యాయం జరిగేంత వరకు న్యాయ స్థానాల తలుపు తడుతూనే ఉంటామని’ స్పష్టం చేశారు.ప్రధాని మోదీకి లేఖ మా అమ్మాయి కేసు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ మేం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు లేఖలు రాశాం.వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు’ అని అభయ తండ్రి మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
కోల్కత్తా ఆర్జీకార్ వైద్యురాలి కేసు.. నేడు తుది తీర్పు
కోల్కత్తా: కోల్కత్తా ఆర్జీకార్(RGKar Hospital) మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక, ఈ కేసుకు సంబంధించి నేడు సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. ఈ కేసుపై నవంబర్ 12నుంచి సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణలో భాగంగా దాదాపు 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో నేడు తీర్పును వెల్లడించనుంది.కోల్కత్తా(Kolkata) ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసు అంశంపై నేడు తుది తీర్పు రానుంది. సిల్దా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టు నేడు తుది తీర్పు ఇవ్వబోతుంది. గతేడాది ఆగస్ట్ 9న ఆర్జీకార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై హత్యాచారం ఘటన జరిగింది. ఈ కేసు విషయమై 50 మంది సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది. దీంతో, ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. రెండు నెలల పాటు విచారణ జరిపిన సిల్దా కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఇదిలా ఉండగా.. ఈ కేసుపై కోల్కత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం సహా ఆర్జీకార్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు పలువురిని సీబీఐ ప్రశ్నించింది. అయితే.. ఈ ఘటనకు నిరసనగా ఆర్జీకార్ హాస్పిటల్లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ సర్కార్‌ను హైకోర్టు తీవ్రంగా మందలించింది.మరోవైపు.. డాక్టర్‌పై హత్యాచార ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు రేపింది. ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ క్రమంలోనే ర్యాలీ నిర్వహించారు సీఎం మమతా బెనర్జీ.. హత్యాచారం కేసులో నిందితులను ఉరితీయాలన్నారు. కొందరు నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దేశంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చేపట్టాల్సిన చర్యలపై నిపుణులతో నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సంచలనం రేపిన డాక్టర్ హత్యాచారం కేసులో నివేదిక ఇచ్చిన సీబీఐ.. నిందితుడికి మరణ శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. సీబీఐ సిఫార్సు చేసినట్టుగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణ శిక్ష ఖాయమా? మరికొందరి ప్రమేయం కూడా వుందన్న డాక్టర్ అభయ పేరెంట్స్ ఫిర్యాదు కీలకంగా మారనుందా? హత్యాచారం కేసు సహా ఆర్జీకార్లో అక్రమాలపై కూడా సిల్దా కోర్టు సంచలన తీర్పు ఇవ్వనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. 9 Aug: A Trainee doctor was R*PED and MURDERED in #RGKar Hospital.13 Aug: Calcutta HC ordered CBI Probe2 Sept: Former principal Sandip Ghosh arrested.7 Oct: Chargesheet Filed. Sanjay Roy named the key accused.18 January: Trial Court will pronounce the VERDICT Today. pic.twitter.com/NxVA6CXD5o— SAVE THE WORLD 🗺 (@ProtecterIM) January 18, 2025 -
ఆర్జీ కార్ ఆస్పత్రి ఘటన.. నిందితుడు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష?
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీకార్ ఆస్పత్రి (rg kar hospital) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) గురువారం సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. ఈ కేసులో జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది.ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ దర్యాప్తు ముగిసింది. దర్యాప్తు సమయంలో సేకరించిన కీలక ఆధారాల్ని సీల్దా సెషన్స్ (Sealdah sessions court) కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. సంజయ్ రాయ్‌కు ఉరే సరినిందితుడు సంజయ్ రాయ్‌పై హత్య, అత్యాచారం, మరణానికి కారణమైనందుకు, బాధితురాలు కోలుకోలేని విధంగా హింసించినట్లు తేలింది. కోర్టు తీర్పుతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 103(1), 64, 66 కింద ఉరిశిక్ష,లేదంటే జీవిత కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉండనుంది. సంజయ్ రాయ్ నిర్దోషి సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సౌత్ 24 పరగణాలకు చెందిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సర్వీస్ చీఫ్, డిఫెన్స్ లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన తుది వాదనలలో తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని వాదించారు. ఆ రోజు రాత్రి ఆర్జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటేగతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.సుమారు ఐదు నెలల పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ఆధారాల్ని జనవరి 9న కోర్టుకు అందించింది. జనవరి 18న కోర్టు తీర్పును వెలువరించనుంది. -
రివైండ్ 2024: విషాదాలు... విజయాలు
2024లో భారతావని తీపి, చేదులెన్నింటినో చవిచూసింది. హిందువుల ఐదు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో బాలరామునికి దివ్య ధామం కొలువుదీరింది. అస్తవ్యస్థ అభివృద్ధి తగదని కేరళ కొండల్లో ప్రకోపం రూపంలో ప్రకృతి హెచ్చరించింది. ‘400 పార్’ అన్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు హ్యాట్రిక్ ఇచ్చినా మెజారిటీకి కాస్త దూరంలోనే నిలబెట్టి షాకిచ్చారు. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలిపై కామాంధుడి హత్యాచారం యావత్ జాతినీ నిశ్చేష్టపరిచింది. వలస చట్టాల స్థానంలో భారతీయ చట్టాలు వచ్చాయి. చచ్చిన జంతువుల చర్మాలపై వేళ్లు కదలించే వాళ్లంటూ దూరం పెట్టిన నోళ్లు నివ్వెరబోయేలా తబలాకు విశ్వవ్యాప్త కీర్తి కిరీటం తొడిగిన స్వర తపస్వి జాకీర్ హుస్సేన్ అస్తమయంతో సంగీత ప్రపంచం మూగబోయింది. సంస్కరణల బాటలో దేశాన్ని ప్రగతి పరుగులు పెట్టించిన కర్మయోగి మన్మోహన్, పారిశ్రామిక జగజ్జేత రతన్ టాటా సహా దిగ్గజాలెందరో ఇక సెలవంటూ మనను వీడి వెళ్లారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో జగజ్జేతగా నిలిచి టీనేజర్ గుకేశ్ దొమ్మరాజు ఆనంద డోలికల్లో ముంచెత్తాడు...అయోధ్యలో బాల రాముడు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో భవ్య రామమందిరం రూపుదిద్దుకుంది. బాల రాము ని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరిలో అతిరథ మహారథుల సమక్షంలో కన్నులపండువగా జరిగింది. వజ్రతిలకంతో అపూర్వ ఆభరణాలతో కూడిన ఆ సుందర రూపాన్ని చూసేందుకు భక్త కోటి పోటెత్తింది. ప్రారం¿ోత్సవాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించారు.సత్తా చాటిన ఇస్రో 2024 మొదలవుతూనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జయభేరి మోగించింది. కృష్ణబిలాలు, ఎక్స్ కిరణాలపై శోధనకు ఎక్స్‌రే పొలారీమీటర్ శాటిలైట్‌ను జనవరి 1న తొలి ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించింది. వారంలోపే సూర్యునిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్–1ను సైతం ఎల్–1 కక్ష్యలోకి చేర్చింది. ఏడాది పొడవునా ప్రయోగాలతో సత్తా చాటింది.పరిణిత తీర్పు లోక్‌సభలో తమకు ఎదురు లేదని భావించిన కమల దళానికి ఓటర్లు చిన్న షాకిచ్చారు. మోదీ మేనియాలో హ్యాట్రిక్ ఖాయమన్న అంచనాలను నిజం చేసినా, బీజేపీని మాత్రం మెజారిటీకి కాస్త దూరంలోనే ఉంచారు. అయోధ్యకు నెలవైన లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. విపక్ష ‘ఇండియా’ కూటమి పర్వాలేదనిపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కలిసొచ్చి కాంగ్రెస్ కూడా కాస్త కోలుకుంది. దివికేగిన దిగ్గజాలు న్యాయ కోవిదుడు ఫాలీ ఎస్ నారిమన్, వామపక్ష దిగ్గజాలు బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారాం ఏచూరి మొదలుకుని ఓం ప్రకాశ్ చౌతాలా, ఎస్ఎస్ కృష్ణ వంటి దిగ్గజ నేతలను, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నిపుణురాలు యామినీ కృష్ణమూర్తి తదితరులనూ ఈ ఏడాదిలోనే దేశం కోల్పోయింది. పారిశ్రామిక దిగ్గజం, మానవీయ విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అస్తమయం తీరని లోటు మిగిల్చింది. డిసెంబర్ అయితే పీడకలగా మిగిలింది. తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్, భారతీయ సినిమాకు మట్టి పరిమళాలద్దిన హైదరాబాదీ శిఖరం శ్యామ్ బెనగల్, రాజనీతిజు్ఞడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంస్కరణల ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరి వెంట ఒకరు సెలవంటూ వెళ్లిపోయారు.బాండ్లకు బైబై పారీ్టలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచి్చన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాటి జారీని తక్షణమే నిలిపేయాలంటూ ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎన్నికల బాండ్ల ముసుగులో గోప్యంగా విరాళాల స్వీకరణ సమాచార హక్కుకు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. దాతల పేర్లపై గోప్యత తగదని చెప్పింది.వయనాడ్ విలయం కేరళలోని వయనాడ్ జిల్లాలో మారుమూల గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డ విలయంలో 231 మంది అమాయకులు సజీవ సమాధి అయ్యారు. పర్యాటకం పేరిట కొండలను ఇష్టంగా తవ్వేసిన పాపానికి వాళ్లు బలైపోయారు. దాదాపు 120 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. వేలమంది సర్వస్వం కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో సత్సంగ్‌లో బోలే బాబా పాదస్పర్శ జరిగిన మట్టి కోసం భక్తులు వేలాదిగా ఎగబడ్డ ఉదంతం తొక్కిసలాటకు దారితీసి 121 మంది ప్రాణాలు కోల్పోయారు.అరెస్టులే అరెస్టులు ఢిల్లీలో మద్యం విధా నం కుంభకోణం కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ఎట్టకేలకు బెయిల్ మీద బయటికొచి్చనా నమ్మినబంటు అతిశిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారాల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ అరెస్టయ్యారు. కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కూడా అభిమానిని కొట్టి చంపిన కేసులో కటకటాలపాలయ్యారు. సంచలనం సృష్టించిన నీట్ ప్రవేశ పరీక్షలోనూ పలు అరెస్టులు జరిగాయి.రైతన్నల పోరుబాట మద్దతు ధరకు చట్ట బద్ధత కోరుతూ పంజాబ్, హరియాణాలో కర్షకలోకం మరోసారి సమరశంఖం పూరించింది. శంభూ సరిహద్దు వద్ద మొదలైన రైతు ఉద్యమం మరోసారి ఉధృతంగా సాగింది. ఢిల్లీ, హరియాణా సరిహద్దుల దిగ్బంధం, పోలీసులతో రైతుల ఘర్షణ, లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో రైతన్నలు నెల రోజులుగా రోడ్డుపై రక్తమోడుతున్నా కేంద్రం నుంచి ఇప్పటికైతే సానుకూల ప్రకటన లేదు. నానాటికీ క్షీణిస్తున్న రైతు నేత డల్లేవాల్ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది.అమల్లోకి సీఏఏ వివాదాస్పద పౌరస త్వ సవరణ చట్టాన్ని మోదీ సర్కారు అమల్లోకి తెచ్చింది. 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలు లేకున్నా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైంది.భారత న్యాయవ్యవస్థభారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. బ్రిటిష్ హయాం నాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధార చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. సత్వర న్యాయం, జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎల్రక్టానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి.చైనా దోస్తీ సరిహద్దు సంక్షోభాగ్నిని ఎగదోసే డ్రాగన్ దేశంతో ఎట్టకేలకు తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరింది. అక్కడ బలగాల ఉపసంహరణ, ఉమ్మడి గస్తీకి ఇరు దేశాలు సరేనన్నాయి. దాంతో గల్వాన్ లోయ ఉద్రిక్తత అనంతరం దిగజారిన ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగయ్యాయి.ఆర్జీ కర్ దారుణం కోల్‌కతా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై సివిల్ వలంటీర్ చేసిన దారుణ హత్యాచారం యావద్దేశాన్నీ కలచివేసింది. నిందితునితో అంటకాగిన కాలేజీ ప్రిన్సిపల్‌ను తొలగించకపోగా వేరే పోస్టింగ్ ఇచ్చి మమత సర్కారు జనాగ్రహానికి గురైంది. మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత గాల్లో దీపమంటూ దేశవ్యాప్తంగా వైద్య లోకం రోడ్డెక్కడంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.చదరంగంలో యువరాజు 18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు చదరంగంలో భారత పతాకను సమున్నతంగా ఎగరేశాడు. ఏడేళ్ల వయసు నుంచే గళ్లపై తిరుగులేని పట్టు సాధించిన ఈ సంచలనం తాజాగా ప్రపంచ వేదికపై డిఫండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను మట్టికరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆర్జీ కర్ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
ఆర్జీ కర్ ఆసుపత్రి.. నిందితుడు సంజయ్రాయ్ గొంతు వినిపడకుండా పోలీసుల హారన్లు!
కోల్‌కతా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటన కేసు విచారణలో కోల్‌కతా పోలీసులు చిత్ర విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటనలో విచారణ కొనసాగుతుంది.అయితే విచారణ నిమిత్తం జైల్లో ఉన్న నిందితుడు సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు సోమవారం సీల్దా కోర్టుకు తరలించారు. ఆ సమయంలో సంజయ్ రాయ్ మీడియాకు, ప్రజలకు వినిపించకుండా పోలీసులు హారన్ కొడుతూ తీసుకెళ్లడం చర్చనీయాశంగా మారింది. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. నవంబర్ 11న సీల్దా కోర్టుకు సంజయ్‌రాయ్‌ను తీసుకెళ్లే సమయంలో కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ వినీత్ గోయల్‌పై రాయ్ తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని, తాను ఏ తప్పూ చేయలేదని వ్యాఖ్యానించాడు. ఈ తరహ ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండేలా సైరన్ మోగిస్తూ కోర్టుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. -
డాక్టర్‌పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్లోనే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్ టాస్‌్కఫోర్స్(ఎన్టీఎఫ్) సైతం తమ నివేదికను అందజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్‌టీఎఫ్‌కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్టీఎఫ్ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. -
కోల్‌కతా హత్యాచార ఘటన: కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ దారుణ ఘటన కేసుకు సంబంధించిన విచారణను పశ్చిమ బెంగాల్ వెలుపలకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇక.. జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నిరాకరించింది. ఈ సందర్భంగా పోలీసు, న్యాయవ్యవస్థపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోతోందని వ్యాఖ్యానించిన ఓ లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మందలించారు. కోర్టులో ‘క్యాంటీన్ కబుర్లు’ చెప్పొద్దని, అటువంటి జనరల్ స్టేట్మెంట్లు చేయొద్దని సూచించారు.‘‘మణిపూర్ వంటి కేసుల్లో బదలీ చేశాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమి లేదు. కావును అటువంటి బదిలీ చేయలేం. ఇక.. ఈ కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ దాఖలు చేసిన ఆరో స్టేటస్ పోర్టును మేం పరిశీలించాం. అయితే..సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో మేం కేసు స్టేటస్ పరిశీలనకు దూరంగా ఉన్నాం. నాలుగు వారాల తర్వత స్టేటల్ అప్డేట్ అయిన కొత్త రిపోర్టును దాఖలు చేయనివ్వండి’ అని సీజేఐ పేర్కొన్నారు. ఇక.. వాదన సమయలో పశ్చిమ బెంగాల్ ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోయారని ఓ న్యాయవాది అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఘాటుగా స్పందించారు. ‘‘ మీరు ఎవరి తరపున హాజరవుతున్నారు. ఇలాంటి సాధారణ ప్రకటనలు చేయొద్దు. ఈ కేసులో అలాంటిదేమీ లేదు. కోర్టులో క్యాంటీన్ కబుర్లు చెప్పొద్దు’’ అని మందలించారు. ఇక.. తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 11కు వాయిదా వేసింది.చదవండి: నేను ఏ నేరం చేయలేదు.. ప్రభుత్వమే ఇరికిస్తోంది: సంజయ్ రాయ్ కేకలు -
‘దీదీ’కి అగ్ని పరీక్ష .. పశ్చిమ బెంగాల్లో హీటు పుట్టిస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి ఘటనలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. నవంబర్ 13న ఆరు అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆర్జీ కార్ ఘటనే కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పశ్చిమ బెంగాల్లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్జీ కార్ ఘటనలో జూనియర్ వైద్యురాలికి మద్దతుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ అంశం దీదీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్జీ కార్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్ ఘోష్ మాట్లాడుతూ..‘ఆర్జీ కర్ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను తప్పుదారి పట్టించేలా గందరగోళానికి గురిచేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి’ అని అన్నారు.‘సీపీఐఎం పాలన ఎలా ఉందో పశ్చిమ బెంగాల్ ప్రజలు చూశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ పాలన ఎలా ఉందో గమనిస్తున్నారు. ఆర్జీ కర్ ఘటన కేసు నిందితుణ్ని కోల్‌కతా పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నాం. ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం. మేం అన్నీ స్థానాల్లో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆరు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. -
హోం మంత్రి అమిత్ షాకు కోల్‌కతా డాక్టర్ తండ్రి లేఖ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో హత్యాచారానికి గురైన యువ లేడీ డాక్టర్ తండ్రి మంగళవారం(అక్టోబర్22) కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. తమ కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటోందని లేఖలో ఆయన అమిత్‌షాకు తెలిపారు.‘నా కుమార్తెకు జరిగిన అమానవీయ ఘటనతో మా కుటుంబం మొత్తం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేం నిస్సహాయులమని అనిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తయ్యేందుకు,మా కుమార్తెకు న్యాయం జరిగేందుకు మీ మార్గదర్శకత్వం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ విషయమై మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. మంత్రికి బాధితురాలి తండ్రి తన లేఖను ఈ-మెయిల్ చేశారు.ఇదీ చదవండి: వక్ఫ్ జేపీసీలో గొడవ.. టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆర్జీ కర్ డాక్టర్లతో చర్చలు విఫలం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధనం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష పదోరోజుకు చేరింది. జూడాల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటువేసి.. మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న బెంగాల్ ప్రభుత్వం.. జూడాల మిగతా డిమాండ్లను తీర్చడానికి గడువు పెట్టడాన్ని అంగీకరించడం లేదు. ‘సీఎస్‌తో సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఎప్పటిలోగా జూడాల సమస్య పరిష్కరిస్తామనేది నిర్దిష్టంగా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సూచనప్రాయంగా తెలిపారు’ అని పశి్చమబెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ చకి తెలిపారు. -
డాక్టర్ల రాజీమాలు చట్టపరంగా చెల్లవు: బెంగాల్ సర్కార్
కోల్‌కతా ఆర్టీ కర్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దారుణ ఘటనపై బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే వారి నిరసన దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. జూనియర్ డాక్టర్ల చేస్తున్న నిరసనకు సంఘీభావంగా ఇప్పటివరకు సుమారు 200 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది.ఆ రాజీనామాలన్నీ చట్టబద్ధంగా అవి చెల్లుబాటు కావని తెలిపింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన లేఖలలో సామూహిక రాజీనామాల ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు రాజీనామాలు చేయడంపై ఇటీవల గందరగోళ పరిస్థితి నెలకొంది. మూకుమ్మడిగా రాజీనామాలను సూచించే కొన్ని లేఖలు మాకు అందుతున్నాయి. అయితే అటువంటి లేఖల్లో సబ్జెక్ట్ ప్రస్తావన లేకుండా కొన్ని పేజీలు జతచేయబడ్డాయి. హోదాలు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం కొన్ని సంతకాలను కలిగి పేపర్లు జతచేయపడ్డాయి. వాస్తవానికి ఈ రాజీనామా లేఖలకు ఎటువంటి చట్టబద్దమైన విలువ లేదు. ఈ రకమైన సాధారణ లేఖలకు చట్టపరమైన ఉండదు’ అని తెలిపారు.#WATCH | Howrah: Chief advisor to West Bengal CM Mamata Banerjee, Alapan Bandyopadhyay says, "There has been confusion recently regarding the so-called resignation of senior doctors working in government medical colleges and hospitals. We have been receiving certain letters which… pic.twitter.com/2jP1dkhCkJ— ANI (@ANI) October 12, 2024 జూనియర్ డాక్టర్ల బృందం గత ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం న్యాయం చేయడంలో జాప్యం చేస్తుందని, పని ప్రదేశంలో ఆరోగ్య కార్యకర్తల భద్రతకు సరైన చర్యలు తీసుకోలేదని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి సైతం క్షీణిస్తోందని తోటి డాక్టర్లు తెలిపారు. -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
RG Kar Medical Hospital: బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు
కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది. -
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ
కోల్‌కతా: కోల్‌కత ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్ డాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. తాజాగా ఆర్జీ కర్ మెడికల్ అండ్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. 10 మంది డాక్టర్లపై ఆర్టీ కర్ హాస్పిటల్ అంతర్గత కౌన్సిల్ బహిష్కరణ వేటు వేసింది. ఆస్పత్రిలో బెదిరింపులు, వేధింపులు, ర్యాగింగ్, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు సదరు డాక్టర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ డాక్టర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, వారి ఇళ్లకు నోటీసులు కూడా పంపాలని సమిష్టిగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 10 మంది వైద్యుల బహిష్కరణతో పాటు, ఇంటర్న్లు, విద్యార్థులు, హౌస్ సిబ్బందితో సహా మొత్తం 59 మంది వ్యక్తులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బహిష్కరణ వేటుపడిన డాక్టర్లలో సౌరభ్ పాల్, ఆశిష్ పాండే (సీబీఐ అరెస్టు చేసిన), అభిషేక్ సేన్, ఆయుశ్రీ థాపా, నిర్జన్ బాగ్చీ, సరీఫ్ హసన్, నీలాగ్ని దేబ్నాథ్, అమరేంద్ర సింగ్, సత్పాల్ సింగ్, తన్వీర్ అహ్మద్ కాజీలు ఉన్నారు. ఈ డాక్టర్లు తమ హాస్టల్‌ను ఖాళీ చేయడానికి అధికారులు 72 గంటల సమయం ఇచ్చారు. మరోవైపు.. బహిష్కరణకు గురైన డాక్టర్ల పేర్లు రాష్ట్ర వైద్య మండలికి పంపిస్తామని అధికారులు తెలిపారు. ఆ డాక్టర్ల మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను సమీక్షించవచ్చు లేదా రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా బాధితురాలి విగ్రహావిష్కరణ -
కోల్‌కతా కేసు: ‘ఘోష్’ సీబీఐ కస్టడీ పొడిగింపు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఘటనలో కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారానికి సంబంధించి సాక్ష్యాలు నాశనం చేసిన కేసులో ఘోష్ సీబీఐ కస్టడీని సెప్టెంబర్ 25దాకా కోర్టు పొడిగించింది. ఘోష్‌తో పాటు ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన కోల్‌కతా తాలా పోలీస్‌స్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా కోర్టు సెప్టెంబర్ 25 దాకా సీబీఐ కస్టడీకి ఇచ్చింది. మహిళా డాక్టర్ హత్యాచారం వెనుక ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తో కలిసి ఘోష్, మండల్ ఏదైనా కుట్ర చేశారా అని సీబీఐ అనుమానిస్తోంది. దీంతో వీరిద్దరి కస్టడీని పొడిగించాలని కోరగా కోర్టు అనుమతిచ్చింది. కుట్ర కోణంలో సీబీఐ వీరిని విచారించనుంది. కాగా, మెడికల్ కాలేజీలో ఆర్థిక అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘోష్ మెడికల్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. ఇదీ చదవండి.. మాపైనే నిందలా..? సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం -
కోల్‌కతా: సీఎం మమతకు ఊరట.. రేపటి నుంచి విధుల్లోకి జూడాలు
కోల్‌కతా: బెంగాల్లో అభయ ఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్‌తో జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేపట్టారు. దాదాపు 41 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా జూనియర్ డాక్టర్లు తామ ఆందోళనలను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు. రేపటి నుంచి(శనివారం) అత్యవసర వైద్య సేవల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రభుత్వంతో జరిపిన రెండు సమావేశాల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జూనియర్ డాక్టర్ల మధ్య రెండు రోజుల క్రితమే కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూడాల డిమాండ్లకు దీదీ అంగీకరించారు. తమ డిమాండ్లలో అధిక శాతానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పాక్షికంగా విధులకు హాజరుకావాలని జూనియర్ వైద్యులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో మాత్రమే తాము విధుల్లో పాల్గొంటామని వారు ప్రకటించారు. అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తమ ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని చెప్పుకొచ్చారు. కానీ, దానికి ముందు నగరంలో మధ్యాహ్నం మూడు గంటలకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కేసును త్వరగా విచారించేందుకు సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే, తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజుల సమయం ఇస్తామని, అప్పటికీ అమలుకాకపోతే తిరిగి విధులను బహిష్కస్తామని హెచ్చరించారు.మరోవైపు.. జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు.మాజీ ప్రిన్సిపల్ రిజిస్ట్రేషన్ రద్దుఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను బంగాల్ వైద్య మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది. అలాగే, 1914 బెంగాల్ వైద్య చట్టం కింద సందీప్ ఘోష్ మెడికల్ లైసెన్సును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్ ఇచ్చిన నడ్డా -
కోల్‌కతా కేసు.. సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మెడికల్ రిజిస్ట్రేషన్‌ను పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ రద్దుచేసింది. ఘోష్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బెంగాల్ విభాగం ఇటీవల డబ్ల్యూబీఎంసీకి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న మెడికల్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు నిన్న(బుధవారం) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది.ఇదీ చదవండి: నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తిఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది. -
కోల్‌కతా డాక్టర్ కేసు: కుట్ర కోణంలో సీబీ‘ఐ’ దర్యాప్తు!
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ అధికారులు బుధవారం(సెప్టెంబర్18) కీలక విషయాలు వెల్లడించారు. హత్యాచారం సమయంలో కేసులో ప్రధాన నిందితుడు సంజయ్రాయ్ ధరించిన దుస్తులను కోల్‌కతా పోలీసులు ఆలస్యంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.హత్య జరిగిన రోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సెమినార్‌హాల్‌లోకి నిందితుడు సంజయ్రాయ్ వస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా కేసులో సంజయ్రాయ్ ప్రధాన నిందితుడని హత్య జరిగిన మరుసటి రోజే స్పష్టమైంది. అయినా హత్య సమయంలో రాయ్ ధరించిన దుస్తులను సీజ్ చేసేందుకు కోల్‌కతాలోని తాలా పోలీస్‌స్టేషన్ పోలీసులకు రెండు రోజులు పట్టింది. ఒకవేళ హత్యాచారం జరిగిన మరుటిరోజే రాయ్ దుస్తులను సీజ్ చేసి ఉంటే మరిన్ని కీలక ఆధారాలు లభించి ఉండేవి’అని సీబీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్‌రాయ్‌తో పాటు ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, తాలా మాజీ సీఐ అభిజిత్ మండల్‌ను సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేసింది. అయితే వీరు విచారణలో సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని సీబీఐ తెలిపింది.రాయ్,ఘోష్,మండల్లు కుట్ర చేశారా..? సీబీఐ కూపీ..!మహిళా డాక్టర్ హత్యాచారంలో సంజయ్ రాయ్, ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఘోష్, తాలా పీఎస్ సీఐ మండల్ మధ్య కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ సీబీఐ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. హత్యకు ముందు వీరు ముగ్గురి మధ్య ఏమైనా ఫోన్‌కాల్స్ నడిచాయా అన్నకోణంలోనూ శోధిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు9 తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో సెమినార్‌హాల్‌లో నిద్రపోతున్న మహిళా ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి చేసి హత్యచేశారు. ఈ కేసును తొలుత కోల్‌కతా తాలా పీఎస్ పోలీసులు దర్యాప్తు చేయగా హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలను ఐదు రోజుల తర్వాత సీబీఐ తీసుకుంది. కేసు దర్యాప్తును స్వయంగా సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుండడం గమనార్హం. ఇదీ చదవండి.. కోల్‌కతా సీపీగా మనోజ్‌వర్మ -
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది.