పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై ప్రముఖ భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రెండు పేజీల లేఖ రాశారు.
ఆర్‌జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణం జరిగినా.. విచారణ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
సీఎం,గవర్నర్‌కు లేఖ
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ‘మనందరి మనస్సాక్షిని కదిలించిన చెప్పలేని హింస. ఒక వ్యక్తిపై జరిగిన ఘోరమైన నేరం కాదు ఇది. మన సమాజంలోని ప్రతి మహిళ, గౌరవం, భద్రతపై జరిగిన తీవ్రమైన దాడి. ఇది లోతుగా పాతుకుపోయిన సమస్యలకు ప్రతిబింబం. సమాజంలో అధికారులు, వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.
దిగ్భ్రాంతిని గురి చేసింది
ఆస్పత్రిలో వైద్యం అందిస్తూ ప్రాణం పోసే వైద్యుల పట్ల జరిగిన దారుణం దిగ్భ్రాంతిని గురి చేసిందని దీదీ రాసిన రెండు పేజీల లేఖలో ఆప్ ఎంజీ రాసిన లేఖలో తెలిపారు. రోజులు గడుస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైద్యులు, వైద్య సంఘాలు రోడ్లపై నిరసనకు దిగాయని అన్నారు. వారి (వైద్యుల) నిరసనల్ని సమాజం అర్ధం చేసుకుంది. న్యాయం కోసం వారు చేసే పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు.
With deep anguish over delay in justice to the Kolkata rape and murder victim, the incident which had shaken the conscience of all of us, I have penned a heartfelt plea to the Hon'ble Chief Minister of West Bengal , Ms. @MamataOfficial Ji and Hon'ble @BengalGovernor urging them… pic.twitter.com/XU9SuYFhbY
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 18, 2024
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
టీవీల్లో సర్వసాధారణమయ్యాయి
దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వార్తాపత్రికలు, టీవీల్లో సర్వసాధారణంగా మారాయని అన్న హర్భజన్ సింగ్..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకోవాలని అని హర్భజన్ సింగ్ దీదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment