mamatha banargy
-
‘తీవ్ర మనోవేదనకు గురవుతున్నా’.. దీదీకి హర్భజన్ సింగ్ లేఖ
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై ప్రముఖ భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రెండు పేజీల లేఖ రాశారు. ఆర్జీకార్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణం జరిగినా.. విచారణ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. సీఎం,గవర్నర్‌కు లేఖఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ‘మనందరి మనస్సాక్షిని కదిలించిన చెప్పలేని హింస. ఒక వ్యక్తిపై జరిగిన ఘోరమైన నేరం కాదు ఇది. మన సమాజంలోని ప్రతి మహిళ, గౌరవం, భద్రతపై జరిగిన తీవ్రమైన దాడి. ఇది లోతుగా పాతుకుపోయిన సమస్యలకు ప్రతిబింబం. సమాజంలో అధికారులు, వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.దిగ్భ్రాంతిని గురి చేసిందిఆస్పత్రిలో వైద్యం అందిస్తూ ప్రాణం పోసే వైద్యుల పట్ల జరిగిన దారుణం దిగ్భ్రాంతిని గురి చేసిందని దీదీ రాసిన రెండు పేజీల లేఖలో ఆప్ ఎంజీ రాసిన లేఖలో తెలిపారు. రోజులు గడుస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైద్యులు, వైద్య సంఘాలు రోడ్లపై నిరసనకు దిగాయని అన్నారు. వారి (వైద్యుల) నిరసనల్ని సమాజం అర్ధం చేసుకుంది. న్యాయం కోసం వారు చేసే పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు. With deep anguish over delay in justice to the Kolkata rape and murder victim, the incident which had shaken the conscience of all of us, I have penned a heartfelt plea to the Hon'ble Chief Minister of West Bengal , Ms. @MamataOfficial Ji and Hon'ble @BengalGovernor urging them… pic.twitter.com/XU9SuYFhbY— Harbhajan Turbanator (@harbhajan_singh) August 18, 2024 ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.టీవీల్లో సర్వసాధారణమయ్యాయిదేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వార్తాపత్రికలు, టీవీల్లో సర్వసాధారణంగా మారాయని అన్న హర్భజన్ సింగ్..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకోవాలని అని హర్భజన్ సింగ్ దీదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. -
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
కోల్‌కతా: ఇటీవల పశ్చిమ బెంగాల్ గవర్నర్ 'సీవీ ఆనంద బోస్' మీద లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. దీనిపైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీఎంసీ అధినేత్రి వ్యాఖ్యలపై ఆనంద బోస్ స్పందించారు.తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మాట్లాడుతూ.. నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను రాజకీయాల్లోకి లాగుతున్నందుకు చాలా చింతిస్తున్నాను.ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. అవమానకరమైన వ్యాఖ్యల చేశారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె ఆలా మాట్లాడకూడదు. ఆమెను (మమతా బెనర్జీ) రక్షించమని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది దేవునికి కూడా కష్టతమైన బాధ్యత. నేను ఎప్పుడూ 'దీదీ గిరి'ని అంగీకరించను అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ అన్నారు.#WATCH | On sexual harassment allegation against him, West Bengal Governor CV Ananda Bose says, "The Governor is supposed to stay away from politics. Now I am very sorry that the Chief Minister has dragged me into politics, especially at a time when the elections are going on...… pic.twitter.com/u624O6gHOx— ANI (@ANI) May 6, 2024 -
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కాతా: పశ్చిమబెంగాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓ కాంగ్రెస్ నేత 'టీఎంసీకు ఓటు వేయడం కంటే బీజేపీకి ఓటు వేయడం ఉత్తమం' అని అన్నారని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపైన సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీకి లేదా కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని కాంగ్రెస్ నేత చెబుతున్నారు. ఆలోచించండి వీరికి సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయా?. ఇలాంటి కొందరు స్వార్థపరులే దేశాన్ని అమ్మేస్తారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.మంగళవారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.గతంలో బెంగాల్లో బీజేపీ సంఖ్యను తగ్గించడమే పార్టీ లక్ష్యమని, తృణమూల్ ఇండియా కూటమిలో భాగమేనని జైరాం రమేష్ అన్నారు. కానీ ఈ రెండు చివరకు పొత్తు పెట్టుకోలేదు. కానీ అధీర్ చౌదరి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ సంఖ్యను గణనీయంగా తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని జైరాం రమేష్ అన్నారు.A doctored video has been surfaced in the Social Media, perhaps either by the TMC or BJP IT Cell ( both are same notorious in the way they perform), wherein it’s being shown as if the @INCWestBengal President @adhirrcinc is asking the voters in a public meeting, to vote for BJP… pic.twitter.com/ZeTrp7SInB— West Bengal Congress (@INCWestBengal) May 1, 2024 -
రాష్ట్రపతి వద్దకు పెద్దనోట్ల రగడ!
-
రాష్ట్రపతి వద్దకు పెద్దనోట్ల రగడ!
న్యూఢిల్లీ: పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆకస్మిక సంచలన నిర్ణయంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీలకతీతంగా ఉమ్మడిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువాలని నిర్ణయించినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తెలిపారు. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలతో తాను మాట్లాడానని ఆమె తెలిపారు. పెద్దనోట్ల రద్దు అనాగరికమని, ఈ చర్యను వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. సామాన్యులకు ఊరట కలిగేలా రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని చెప్పారు. ఈ విషయమై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఫోన్లో మాట్లాడానని తెలిపారు.