కోల్‌కాతా: పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓ కాంగ్రెస్ నేత 'టీఎంసీకు ఓటు వేయడం కంటే బీజేపీకి ఓటు వేయడం ఉత్తమం' అని అన్నారని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపైన సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి లేదా కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని కాంగ్రెస్ నేత చెబుతున్నారు. ఆలోచించండి వీరికి సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయా?. ఇలాంటి కొందరు స్వార్థపరులే దేశాన్ని అమ్మేస్తారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
మంగళవారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
గతంలో బెంగాల్‌లో బీజేపీ సంఖ్యను తగ్గించడమే పార్టీ లక్ష్యమని, తృణమూల్ ఇండియా కూటమిలో భాగమేనని జైరాం రమేష్ అన్నారు. కానీ ఈ రెండు చివరకు పొత్తు పెట్టుకోలేదు. కానీ అధీర్ చౌదరి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. అయితే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సంఖ్యను గణనీయంగా తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని జైరాం రమేష్ అన్నారు.
A doctored video has been surfaced in the Social Media, perhaps either by the TMC or BJP IT Cell ( both are same notorious in the way they perform), wherein it’s being shown as if the @INCWestBengal President @adhirrcinc is asking the voters in a public meeting, to vote for BJP… pic.twitter.com/ZeTrp7SInB
— West Bengal Congress (@INCWestBengal) May 1, 2024
Comments
Please login to add a commentAdd a comment