లోక్‌సభ ఎన్నికల జరగటానికి ముందే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బరాక్‌పూర్ నియోజకవర్గానికి చెందిన నుంచి ఎంపీ అర్జున్ సింగ్.. బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఎప్పుడు చేరుతారనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు.
'ఇది ఫిక్స్.. నేను బీజేపీలో చేరతాను' నేను ఇక్కడ లేదా ఢిల్లీలో ఎక్కడైనా బీజేపీ పార్టీలో చేరవచ్చు. పార్టీ నాకు ఏ పని ఇస్తే అది చేస్తానని విలేకర్ల సమావేశంలో అర్జున్ సింగ్ అన్నారు. 2022లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినప్పుడు, నన్ను బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ పార్టీ ఇప్పుడు తమ హామీని నిలబెట్టుకోలేదు, నాకు ద్రోహం చేసిందని అన్నారు.
ఆదివారం టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు.. జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బరాక్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర మంత్రి పార్థ భౌమిక్‌ను నామినేట్ చేశారు. అర్జున్ సింగ్ 2019లో బీజేపీలో చేరి అప్పటి టీఎంసీ అభ్యర్థిని బరాక్‌పూర్‌లో ఓడించారు. కాగా ఇప్పుడు టీఎంసీ సీటు ఇవ్వకపోవడంతో సొంత గూటికే చేరనున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment