tmc
-
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఎమ్మెల్యేలు
కోల్‌కతా: మమతా బెనర్జీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దశాబ్ధన్నర కాలంగా బెంగాల్‌ను శాసించిన మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా అత్యంత గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ రోజు (శుక్రవారం) కోల్‌కతా కాళీఘాట్‌లోని ఆమె నివాసంలో నిర్వహించిన పార్టీ సమావేశానికి తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. ప్రస్తుతం మమతా బెనర్జీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇటీవల తృణముల్ పార్టీలో చీలిక రావడం ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని వార్తలు రావడం ఇలా రాజకీయంగా మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని చవి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశం ఇప్పుడు మరోసారి హాట్‌టాఫిక్‌గా మారింది.కోల్‌కతాలోని ఆమె కాళీఘాట్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. దీంతో తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మమతాపై ఉన్న వ్యతిరేఖత స్పష్టమవుతోంది. అంతేకాకుండా అత్యధిక సంఖ్యలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఈ భేటీని బహిష్కరించారు.తృణమూల్ కాంగ్రెస్‌కు ఉన్న 28 మంది లోక్‌సభ ఎంపీలలో కేవలం నలుగురు మాత్రమే శుక్రవారం నాటి సమావేశానికి వచ్చారు. (వీరిలో మమతా బెనర్జీ 13 మంది రాజ్యసభ ఎంపీలలో కేవలం ఇద్దరే డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్ మాత్రమే హాజరయ్యారు.అయితే ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగురవేసిన "రీతాబ్రతా బెనర్ మాట్లాడుతూ మమతా బెనర్జీని తమ నాయకురాలిగా అంగీకరించే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మాకున్న ఎమ్మెల్యేల బలం 2/3 వంతు కంటే ఎక్కువే ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి మా సంఖ్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. వేచి చూడండి, ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. అయితే ఎంపీల విషయమై గత ఏడు రోజులుగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు, కాబట్టి వారి గురించి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను" అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. రీతాబ్రతా బెనర్జీకి ప్రస్తుతం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సమాచారం . -
మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్టీలో చీలికతో కుంగిపోయిన మమతా బెనర్జీకి ఇప్పుడు అనూహ్యమైన అండ లభించింది. ఒకప్పుడు తనపై కుట్రలు పన్నాడని, బీజేపీతో చేతులు కలిపాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు కోట్ల రూపాయలు తీసుకున్నాడని తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన నేతే.. ఇప్పుడు మమతా బెనర్జీ కోసం తన ఎమ్మెల్యే సీటును వదులుకోవడానికి సిద్ధమని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె ప్రస్తుతం అసెంబ్లీ సభ్యురాలు కాదు. మళ్లీ సభలో అడుగుపెట్టాలంటే ఏదైనా ఉప ఎన్నికలో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమె నందిగ్రామ్(సువేందు పోటీ చేసిన రెండో స్థానం.. రాజీనామా కూడా చేశారు) నుంచి పోటీ చేయొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరాలు కూడా పెరుగుతుండటంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురై.. ప్రస్తుతం ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’ (ఏజేయూపీ)ని నడిపిస్తున్న హుమాయున్ కబీర్ సంచలన ప్రకటన చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని నవడా, రెజీనగర్ స్థానాల నుంచి గెలిచిన ఆయన.. అవసరమైతే రెజీనగర్ సీటుకు రాజీనామా చేసి మమతా బెనర్జీని అక్కడి నుంచి అసెంబ్లీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించారు.“మమతా బెనర్జీ నన్ను సంప్రదిస్తే రెజీనగర్ నుంచి ఆమెను అసెంబ్లీకి పంపగలను. నందిగ్రామ్‌లో పోటీ చేస్తే ఆమె గెలుపు కష్టమే. కానీ నా నియోజకవర్గంలో ఆమె విజయాన్ని నేను ఖాయం చేస్తా” అని కబీర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, “నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మమతా బెనర్జీయే. ఆమె ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి నన్ను బాధిస్తోంది” అంటూ తన విధేయతను కూడా చాటుకున్నారు.హుమాయున్ కబీర్‌పై టీఎంసీ గతంలో చేసిన ఆరోపణలు చిన్నవి కావు. బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నాడని, మైనారిటీ ఓట్లను చీల్చేందుకు భారీ మొత్తంలో నిధులు స్వీకరించాడని, రాజకీయ కుట్రలో భాగస్వామి అయ్యాడని తృణమూల్ కాంగ్రెస్ స్టింగ్ వీడియోలు విడుదల చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదాల కారణంగానే ఎంఐఎం కూడా ఆయనతో పొత్తును తెంచుకుంది. అయితే కబీర్ మాత్రం అవన్నీ కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన వీడియోలేనని కొట్టిపారేశారు.అయినప్పటికీ, తనపై టీఎంసీ చేసిన ఆరోపణలు, బహిష్కరణ, రాజకీయ దాడులను పక్కనబెట్టి అదే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సహాయం చేసేందుకు ముందుకు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం కొనసాగిన ఆయన, తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన కబీర్.. గత ఏడాది ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు నమునాతో మసీదు నిర్మిస్తానన్న వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.ఇదిలా ఉండగా.. తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం కూడా కొత్త మలుపు తిరిగింది. 58 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించినప్పటికీ, మమతా బెనర్జీయే తమ సర్వోన్నత నాయకురాలని పలువురు స్పష్టం చేశారు. తమ వ్యతిరేకత అభిషేక్ బెనర్జీపైనే తప్ప మమతాపై కాదని పేర్కొన్నారు. ఆమెను కేవలం సలహాదారు పాత్రకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. అవసరమైతే తిరుగుబాటు శిబిరంలో కొనసాగడంపైనా పునరాలోచిస్తామని హెచ్చరించారు.ఒకవైపు సొంత పార్టీ తిరుగుబాటు వర్గం "మమతనే మా సుప్రీం లీడర్" అంటూ గళమెత్తుతుండగా.. మరోవైపు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుమాయున్ కబీర్ తన ఎమ్మెల్యే సీటునే ఆఫర్ చేయడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాటను ఈ పరిణామం మరోసారి గుర్తు చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మరోసారి డీలిమిటేషన్ బిల్లు.. డీఎంకే, టీఎంసీ మద్దతు?
ఢిల్లీ: పార్లమెంట్ ముందుకు మరోసారి డీలిమిటేషన్ బిల్లు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో బిల్లు పాస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. డీ లిమిటేషన్ పై తమ విధానంలో పునరాలోచన దిశగా డీఎంకే ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, తమ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదని డీఎంకె వర్గాలు అంటున్నాయి. డీఎంకే నేతలతో అంతర్గతంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వాజ్‌పేయీ మంత్రివర్గంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ గుడ్‌బై చెప్పడంతో పరిణామాలు మారాయి. డీ లిమిటేషన్ బిల్లుకు పలువురు టీఎంసీ ఎంపీలు కూడా సహకరించే అవకాశం ఉంది.డీఎంకే, టీఎంసీ పార్టీలకు లోక్ సభలో 50 మంది ఎంపీలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 50 శాతం లోక్ సభ, 50 శాతం అసెంబ్లీ సీట్లు పెంచేలా డీ లిమిటేషన్ బిల్లును రూపొందించారు. గత ప్రత్యేక సమావేశాల్లో 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది. జమిలి ఎన్నికల బిల్లును కూడా వీలైనంత త్వరగా ప్రవేశపెట్టి యోచనలో ప్రభుత్వం ఉంది. వర్షాకాల సమావేశాల తొలి వారంలో జేపీసీ నివేదికను వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ ప్రవేశపెట్టనుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాదనలు ఉన్నాయి -
టీఎంసీని కాపాడే పనిలో బీజేపీ!?
రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ బలహీనపడితే ఆనందపడటం సహజం. ఆ పార్టీ చీలిపోతే ఆ కిక్కే వేరేలా ఉంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన చరిత్రలోనే అతిపెద్ద అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, బీజేపీ మాత్రం ఆ పార్టీ పూర్తిగా కూలిపోవాలని కోరుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే తాజా పరిణామాలు ఆ పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం టీఎంసీలో అంతర్గత అసంతృప్తి బహిర్గతమైంది. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 60 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేయడం, మమతా ఎంపిక చేసిన నాయకత్వానికి వ్యతిరేకంగా రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.టీఎంసీ ఆవిర్భావం తర్వాత ఇదే అతిపెద్ద అంతర్గత సంక్షోభంగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ప్రత్యర్థి బీజేపీ దాడిని మరింత ఉధృతం చేయాలి. కానీ ఆశ్చర్యకరంగా అలా జరిగిన పరిస్థితి కనిపించడం లేదు. పైగా, టీఎంసీ పూర్తిగా కూలిపోవడం బీజేపీకి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.టీఎంసీ కూలిపోతే బీజేపీకి నష్టమా?ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ ఉంది. టీఎంసీ బలహీనపడితే రాజకీయంగా లాభపడాల్సింది బీజేపీ. కానీ బీజేపీలోని ఒక వర్గం మాత్రం టీఎంసీ పూర్తిగా కూలిపోవడం ప్రమాదకరమని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి ప్రధాన కారణం వామపక్షాల పునరాగమనం.ఒకప్పుడు 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను ఏలిన సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ గత కొన్నేళ్లుగా రాజకీయంగా దాదాపు కనుమరుగైంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ పార్టీలు పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డోమ్కల్ అసెంబ్లీ స్థానంలో విజయం, ఫాల్టా రీపోల్‌లో 40 వేలకుపైగా ఓట్లు సాధించడం, మూతపడిన పార్టీ కార్యాలయాలు మళ్లీ తెరుచుకోవడం, కార్మిక సంఘాలు తిరిగి చురుకుగా మారడం వంటి పరిణామాలు వామపక్షాల పునరుజ్జీవనానికి సంకేతాలుగా చెబుతున్నారు.దీంతో ఇప్పుడు బీజేపీకి అసలు భయం మమతా బెనర్జీనా? లేక తిరిగి బలపడుతున్న లెఫ్ట్-కాంగ్రెస్ కూటమినా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.ఓటు బ్యాంక్ మొత్తం..గత రెండు ఎన్నికల్లో టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదిగింది. అయితే టీఎంసీ ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. దాని ప్రభావం ప్రధానంగా బెంగాల్‌కే పరిమితం. కానీ కాంగ్రెస్, సీపీఎం వంటి పార్టీలు జాతీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉన్నాయి.ఒకవేళ టీఎంసీ పూర్తిగా కూలిపోతే, దాని ఓటు బ్యాంక్‌లో గణనీయమైన భాగం లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లే అవకాశం ఉందని బీజేపీలోని కొందరు నేతలు భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లెఫ్ట్ ఓటర్లలో గణనీయమైన వర్గాన్ని తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని లెఫ్ట్ టీఎంసీ ఓటర్లపై ప్రయోగిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి.అందుకే చేరికలకు విముఖత?టీఎంసీలో అసంతృప్తి పెరుగుతున్నా, తిరుగుబాటు నేతలను పెద్దఎత్తున బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం కనిపించడం లేదు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, టీఎంసీ ఎమ్మెల్యేలను భారీ సంఖ్యలో చేర్చుకుంటే ఆ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్త పడుతోంది.బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ సైతం ఒక సందర్భంలో "కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు వెంటనే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు" అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటివరకు అలాంటి చర్య జరగలేదు. టీఎంసీ నుంచి వచ్చే వారిని విచక్షణారహితంగా చేర్చుకోవద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా బహిరంగంగానే చెబుతోంది.ఈ పరిస్థితిని కొందరు రాజకీయ పరిశీలకులు "టీఎంసీని పూర్తిగా కూల్చకుండా నియంత్రిత బలహీనతలో ఉంచే వ్యూహం"గా అభివర్ణిస్తున్నారు.ఒడిశా మోడల్ ఇప్పుడు బెంగాల్లోనా?ఈ చర్చల్లో మరో ఉదాహరణ కూడా తరచూ వినిపిస్తోంది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న తర్వాత కూడా పూర్తిగా చీలిపోకుండా నిలబడగలిగింది. కాంగ్రెస్ పునరాగమనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పరోక్షంగా బీజేడీని నిలబెట్టిందన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి.ఇప్పుడు అదే తరహా వ్యూహం బెంగాల్లోనూ అమలవుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీఎంసీ బలహీనపడాలి కానీ పూర్తిగా కూలిపోకూడదు. ఎందుకంటే ఆ ఖాళీని లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి భర్తీ చేస్తే అది భవిష్యత్తులో బీజేపీకి మరింత పెద్ద రాజకీయ సవాలుగా మారవచ్చన్నది ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన ఆలోచనగా చెబుతున్నారు.అసలు పోరాటం ఇప్పుడే మొదలైందిప్రస్తుతం బెంగాల్ రాజకీయాలను పరిశీలిస్తే, ఇది ఇక టీఎంసీ వర్సెస్ బీజేపీ పోరాటం మాత్రమే కాదు. టీఎంసీ బలహీనతతో ఏర్పడే రాజకీయ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? అన్నదే అసలు ప్రశ్నగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. బీజేపీ మాత్రం టీఎంసీని ఓడించాలని కోరుకుంటూనే, అది పూర్తిగా కనుమరుగవ్వకూడదని భావిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అందుకే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. "టీఎంసీని కూల్చేయగల శక్తి బీజేపీకి ఉన్నా... కాపాడే వ్యూహాన్నే ఎంచుకుందా?". రానున్న రోజుల్లో బెంగాల్ రాజకీయాల దిశను నిర్ణయించేది ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే కావొచ్చు. -
బెంగాల్లో మరో సంచలనం.. మమతకు బిగ్ షాక్!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ)లో సంక్షోభం మరింత ముదిరింది. టీఎంసీకి చెందిన మంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే టీఎంసీలు ఎమ్మెల్యేలు 60 మంది వేరు కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు మాజీ సీఎం మమతా బెనర్జీకి ఊహించని షాక్ ఇస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చలు బలంగా జరుగుతున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ మాట్లాడుతూ.. 18–20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత అసంతృప్తి, పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వార్తలు వచ్చాయి. పార్టీ తన కమిటీలు, అనుబంధ విభాగాలను రద్దు చేసి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించింది. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 29 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఒకటిగా నిలిచింది.ఇదిలా ఉండగా, అంతకుముందు.. బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. -
మమతకు బిగ్ షాక్.. ప్రతిపక్ష నేతగా టీఎంసీ ఎమ్మెల్యే
-
ఆశ్చర్యపరిచిన బెంగాల్ ట్విస్ట్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది. అసలు ఇంత తక్కువ టైంలో.. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆయన ఎలా తనవైపు తిప్పుకోగలిగాడని రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి?.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. అలాగే..తాజా రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా నిలిచింది మాత్రం అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద్ ఒపోజిషన్ (LoP) నియామకంపై వచ్చిన వివాదం. తృణమూల్‌లోని కొందరు ఎమ్మెల్యేలు తమ సంతకాలను ఫోర్జరీ చేసి సోభందేబ్ చటోపాధ్యాయ్‌ను ఎల్వోపీగా ప్రకటించారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రీతాబ్రత బెనర్జీ సహా ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ “అంతర్గత వ్యతిరేక కార్యకలాపాలు” పేరిట మమతా బెనర్జీ బహిష్కరించారు. దీంతో రీతాబ్రత నేతృత్వంలోని వర్గం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.రీతాబ్రత మాములోడేం కాదు.. రీతాబ్రత బెనర్జీ.. పుట్టింది 15 నవంబర్ 1979. చదువంతా కోల్‌కతాలోనే సాగింది. విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రారంభమైన ఆయన ప్రయాణంలో ఎస్ఎఫ్ఐలో కీలక నాయకుడిగా ఎదిగి.. సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. 34 ఏళ్ల వయసులో సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి సస్పెండ్ అయ్యి, తరువాత బహిష్కరణకు గురయ్యారు. అనంతరం.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఉలుబేరియా పూర్వ (Uluberia Purba) నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే పార్టీ అంతర్గత వివాదాలు, అసంతృప్తి, ఫోర్జరీ సంతకాల ఆరోపణల వివాదం నేపథ్యంలో టీఎంసీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ లోపల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహించడమే కాదు.. ప్రతిపక్ష నేతగా తనను తాను ప్రకటించుకుని, ఆ గుర్తింపు ఇవ్వాలంటూ స్పీకర్‌కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అసలు ‘టర్నింగ్ పాయింట్’ ఇదేబెంగాల్ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. టీఎంసీలో చీలిక(తిరుగుబాటు) ఒక్కరోజులో జరిగినది కాదు. దీని వెనుక మూడు కీలక దశల్లో జరిగింది.. 1) ఎన్నికల తర్వాత అసంతృప్తి పెరుగుదల: తాజా ఎన్నికల తర్వాత పార్టీ లోపల నాయకత్వంపై అసంతృప్తి వేగంగా పెరిగింది. నిర్ణయాలు కేంద్రీకృతంగా (centralized) మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లోనే ఉండటంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.2) ‘సైడ్‌లైనింగ్’ భావన: పార్టీ టికెట్ దక్కినా, ప్రభుత్వ–పార్టీ నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం లేదని అనేక మంది సీనియర్, మిడ్-లెవల్ ఎమ్మెల్యేలు భావించారు. బెంగాల్ రాజకీయ భాషలో దీనిని “অবহেলা” (అవహేళన) భావనగా పేర్కొంటారు.3) రీతాబ్రత ఎంట్రీ.. “అసంతృప్త వేదిక”గా మారడం: ఇక్కడే అసలు ట్విస్ట్. రీతాబ్రత బెనర్జీ కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయనకు ముందే రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభలో టీఎంసీ, లెఫ్ట్ రెండింటిలో పని చేసిన నేపథ్యం ఉంది. దీనివల్ల ఆయనను “అనుభవజ్ఞుడైన అవుట్‌సైడర్”గా కొంతమంది నేతలు చూశారు.రీతాబ్రత రెబల్స్ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించడంలో రాజకీయ వ్యూహమే కీలకంగా మారింది. ప్రత్యక్షంగా పార్టీకి వ్యతిరేకంగా కాకుండా “నిర్ణయాల పునర్వ్యవస్థీకరణ” అనే నినాదంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక చోటుకి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో.. ఫోర్జరీ సంతకాల ఆరోపణ తర్వాత ఏర్పడిన గందరగోళాన్ని ఆయన తన వైపు మలుచుకున్నాడు. తన సస్పెన్షన్‌తో “పార్టీ లోపల న్యాయం లేదు” అనే భావనను టీఎంసీ శ్రేణుల్లో బలపరిచగలిగారు. తద్వారా.. రాజకీయంగా హై-ప్రొఫైల్ కాకపోయినా, అతను లోపలే నెట్వర్క్ నిర్మించుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. మరీ ముఖ్యంగా.. బెంగాల్ రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలు మమత చేతిని ఎప్పుడో దాటేసి పూర్తిగా అభిషేక్ బెనర్జీ ప్రభావంలోకి వెళ్లాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రీతాబ్రతకు అనుకూలంగా మారాయి.పరిశీలకులు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జరిగిన తిరుగుబాట్లతో పోలుస్తున్నారు. అయితే అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల్లో సిద్ధాంత బలం ఉంది. కానీ, టీఎంసీలో అలాంటిది మచ్చుకైనా కనిపించదని విశ్లేషకుల మాట. అందుకే ఇక్కడ తిరుగుబాటు ఒక ఐడియాలజీపై కాకుండా, నాయకత్వ అసంతృప్తి, అధికార పంపకాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నారు.ఇప్పటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకటి.. పార్టీలో తిరుగుబాటును నియంత్రించడం. రెండోది.. అధికార కేంద్రాన్ని తిరిగి స్థిరపరచడం. పార్టీలో ఉన్న అన్ని వర్గాలు విడిపోకుండా ఒకటిగా ఉండేలా చేయగల నాయకురాలిగా మమతా మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించుకోగలగాలి..కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే.. మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గిన ఉన్న నాయకుడు 60 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్‌లో లోపలి బలహీనతలను బయటపెట్టింది. అంతేకాదు.. తాము మమతా బెనర్జీ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని రీతాబ్రతా ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్. దీంతో.. ఇది కేవలం నాయకత్వ సంక్షోభమా? లేదంటే పెద్ద రాజకీయ విభజనకు సంకేతమా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. -
బెంగాల్ రాజకీయాల్లో భూకంపం సృష్టించిన రితబ్రత బెనర్జీ ఎవరు?
అసలే ఓటమి బాధతో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై మరో పిడుగుపడేలా చేశారు రితబ్రత బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారని ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక శాసనసభా పక్షంగా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా స్పీకర్ అంగీకరించారని ఆయన చెప్పారు.తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మద్దతుగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచి, శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్టు స్పీకర్ రథీంద్ర బోస్‌కు అధికారికంగా తెలియజేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ చర్యతో తృణమూల్ కాంగ్రెస్ శాసన విభాగంపై నియంత్రణ తిరుగుబాటు వర్గానికి వెళ్లినట్టయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ నాయకత్వానికి ఇప్పటివరకు ఎదురైన అతిపెద్ద సవాలుగా ఇది నిలిచింది.అసలు రితబ్రత బెనర్జీ ఎవరు?పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బా నియోజకవర్గం నుంచి రితబ్రత బెనర్జీ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై 11,838 ఓట్ల తేడాతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎన్నికల పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, రితబ్రత విజయం సాధించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సోమవారం బహిష్కరణకు గురైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రితబ్రత ఒకరు. ఒకప్పుడు సీపీఎంలో ఎదుగుతున్న నాయకుడిగా, వామపక్షాల భవిష్యత్ నేతగా భావించేవారు. అయితే ఓ వివాదాస్పద ఘటన, వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఎదుగుదల ఆగిపోయింది. 2018లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించిన వెంటనే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం రితబ్రతను బహిష్కరించింది. ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చట్టోపాధ్యాయ్కు మద్దతు తెలిపిన పార్టీ లేఖపై తమ సంతకాలు నకిలీవని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారని ఆరోపణలు వచ్చాయి.రితబ్రత రాజకీయ ప్రయాణంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. వామపక్ష ఉద్యమంలో ప్రారంభించి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వేగంగా ఎదిగి, సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. పార్టీ కీలక యువ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తర్వాత వామపక్షాల్లో ఆయన ప్రభావం తగ్గి, 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన రాజకీయ పునరాగమనం ప్రారంభమైంది. అక్కడ కూడా సంస్థాగతంగా ఎదిగారు. తొలుత పార్టీ కార్మిక సంఘ విభాగ బాధ్యతలు అప్పగించారు. తర్వాత రాజ్యసభ నామినేషన్ ఇచ్చి ప్రోత్సహించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, రితబ్రత ఉలుబేరియా పూర్బా నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా ఆయనను చూస్తున్నారు. టీఎంసీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును పొందారు. రితబ్రత బెనర్జీ పార్టీ నాయకత్వ అధికారాన్ని సవాలు చేస్తున్న తీరును మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సృష్టించిన రాజకీయ ప్రకంపనలతో పోలుస్తున్నారు. -
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో భారీ చీలిక చోటు చేసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లి తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు. ఈ పరిణామంతో తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.టీఎంసీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలుపుతున్నారని, దీంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఆయనను ప్రతిపక్ష నేత (LoP)గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో అధికార టీఎంసీకి వ్యతిరేకంగా కొత్త శక్తి రూపుదిద్దుకుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.బెంగాల్లో టీఎంసీ దారుణ ఓటమి తర్వాత.. ఆ పార్టీలో మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి బయటపడుతోంది. ఇక ఇటీవల మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన టీఎంసీ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో అది దాదాపు ఖాయమైంది. అదే సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలంతా విడిగా ఓ హెటల్లో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీటా బ్రతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు టీఎంసీ అంతర్గత రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. పార్టీ చీలిక నిజంగానే జరుగుతోందా? లేదంటే ఇది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా? అన్నది బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.మహా సీన్ రిపీటా?టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తి మరింత పెరిగితే పార్టీపై మమతా బెనర్జీ పట్టు బలహీనపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కీలకంగా మారితే.. పార్టీ ఆమె చేజారి పోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉదాహరణగా చెబుతున్నారు.2022లో మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో మొదలైన అసంతృప్తి.. ఏక్నాథ్ షిండే వర్గం భారీగా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంతో అసెంబ్లీలో మెజారిటీ సమీకరణం మారిపోయింది. చివరికి పార్టీ గుర్తు, నాయకత్వం కూడా మారిన పరిణామం రాజకీయంగా పెద్ద మలుపుగా నిలిచింది. రీటా బ్రతా బెనర్జీ చేసిన 50 మంది ఎమ్మెల్యేల మద్దతు వ్యాఖ్యలు ఆ దిశగా సంకేతాలిస్తున్నాయనే చెప్పొచ్చు. మహారాష్ట్ర శివసేన సంక్షోభం తరహాలో టీఎంసీలో కూడా ఎమ్మెల్యేల మద్దతు సమీకరణం మారితే, ప్రస్తుత అసంతృప్తి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని మమతను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎవరీ రీటా బ్రతా బెనర్జీ..రీటా బ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వివాదాలతో పాటు వేగంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కోల్‌కతా సౌత్ పాయింట్ హైస్కూల్, అసుతోష్ కాలేజీలో చదువుకున్న ఆయన 2000ల ప్రారంభంలో విద్యార్థి రాజకీయాల ద్వారా ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనను సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికు దగ్గరగా ఉన్న యువ నాయకుడిగా భావించేవారు.తరువాత 34 ఏళ్లకే సీపీఎం ఆయనను రాజ్యసభకు పంపడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం ఆయనను తొలుత సస్పెండ్ చేసి, తరువాత పూర్తిగా బహిష్కరించింది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగ విమర్శలు చేయడం, అంతర్గత విభేదాలు తీవ్రమవ్వడం ఈ చర్యకు కారణమయ్యాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన, పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టి తిరిగి రాజకీయంగా పుంజుకున్నారు.టీఎంసీలో చేరిన తర్వాత కూడా ఆయన ప్రయాణం వివాదాల నుంచి పూర్తిగా బయటపడలేదు. తాజాగా ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీ ఆరోపణల వివాదం ఆయనను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. పార్టీ కమ్యూనికేషన్లో తప్పుదారి పట్టించే సంతకాలు ఉన్నాయని ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పార్టీ చర్యలు తీసుకుని ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య.. మమతకు దగ్గరేనా?తాజాగా ఆయన “50 మంది ఎమ్మెల్యేల మద్దతు” ఉందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రీటా ఒక్కసారిగా రెబల్ వర్గానికి కేంద్రబిందువుగా మారారు. అయితే ఈ మద్దతు ఎంతవరకు వాస్తవమో ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఇలాంటి క్లెయిమ్స్ సాధారణంగా అంతర్గత అసంతృప్తిని ఒక రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంగా కూడా ఉండవచ్చు. అలాగే..మాజీ సీఎం మమతా బెనర్జీతో ఆయన సంబంధంపై చూస్తే.. ప్రారంభంలో పార్టీ వేదికలో భాగంగా ఉండటం వల్ల ఒక స్థాయి సాన్నిహిత్యం, రాజకీయ సమన్వయం ఉండే అవకాశం ఉంది. కానీ పార్టీ నిర్ణయాలపై భిన్న అభిప్రాయాలు పెరిగిన తర్వాత ఆ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనను మమతకు “దగ్గర నేత”గా కాకుండా, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా నిలిచిన రెబల్ నేతగా మాత్రమే చూస్తున్నారు. -
దీదీ ఉక్కిరి బిక్కిరి.. బీజేపీలోకి 75 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు?!
కోల్‌కతా: 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన మాజీ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు, అలాగే తాను స్థాపించిన పార్టీ చేజారిపోతుందేమోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 80 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ 80 మంది ఎమ్మెల్యేలలో 70 మందికి పైగా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి ఊతం ఇచ్చేలా సెంట్రల్ కోల్‌కతాలో మమతా చేపట్టిన నిరసన కార్యక్రమం వేదికైంది.అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలపై దాడులు, కేసులు, ఇతర అంశాలపై మమతా బెనర్జీ మంగళవారం ఆందోళన చేపట్టారు. కానీ ఆ నిరసనకు 80 మంది ఎమ్మెల్యేలలో 75 మంది గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే పాల్గొన్నారు.ఎస్ప్లనేడ్లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యేలలో శోవన్‌దేబ్ చటోపాధ్యాయ్, నైనా బందోపాధ్యాయ్, మదన్ మిత్రా, అశోక్ దేబ్, అసిమా పాత్రా ఉన్నారు. మమతా పక్కన కనిపించిన ఎంపీలలో డోలా సేన్, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్ ఉన్నారు. దీంతో టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.మరోవైపు మహారాష్ట్ర శివసేన తరహాలో టీఎంసీ కూడా రెండుగా చీలే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరకపోయినా, పార్టీ గుర్తును మమతా బెనర్జీకి దూరం చేయాలన్న ఉద్దేశంతో బహిష్కృత నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రీతబ్రత బెనర్జీ, సందీపన్ సాహా తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.శోభన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నాయకుడిగా ఆమోదిస్తూ రాసిన లేఖలో పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు మమతా బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది గైర్హాజరయ్యారు.అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో జరిగిన దాడి తర్వాత కూడా చాలా మంది టీఎంసీ నాయకులు బహిరంగంగా స్పందించలేదు. ఇప్పటికే 100 మందికి పైగా కౌన్సిలర్లు పార్టీని వీడగా, పలువురు నాయకులు ముఖ్యంగా అభిషేక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేయడం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఈ వరుస పరిణామాలతో టీఎంసీ భవిష్యత్తు అంధకారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
పోరాడతాం లేదా చనిపోతాం: ధర్నాలో మమతా బెనర్జీ ప్రతిజ్ఞ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కోల్‌కతాలో భారీ ధర్నా నిర్వహించారు. ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఎన్నికల తర్వాత జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.మొదట ఎస్ప్లానేడ్‌లోని వై-చానెల్ వద్ద ధర్నా ప్రదేశానికి మమతా బెనర్జీ చేరుకున్నారు. పక్కనే ఉన్న రాణి రష్మోని రోడ్డులో నిరసన చేపట్టాలన్న టీఎంసీ విజ్ఞప్తిని కోల్‌కతా పోలీసులు తిరస్కరించారని పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “పోరాడతాం లేదా చనిపోతాం” అని ప్రతిజ్ఞ చేశారు. రాణి రష్మోని రోడ్డుపై నిరసన చేపట్టేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీపై విమర్శలు గుప్పించారు. బుల్డోజర్ పాలిటిక్స్‌తో టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. “వేదిక ఏర్పాటు చేసుకునేందుకు, మైక్రోఫోన్లు ఉపయోగించేందుకు మాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె మెగాఫోన్ ద్వారా మద్దతుదారులను ఉద్దేశించి చెప్పారు. నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. “బీజేపీ వ్యతిరేక పార్టీలు” త్వరలో ఢిల్లీలో సమావేశమై “దేశవ్యాప్త కార్యాచరణ”పై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో వందలాది మంది టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేయడంతో నిరసన ప్రాంగణం హోరెత్తింది.కోల్‌కతా మేయర్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్, మదన్ మిత్రా, డెరెక్ ఓబ్రియన్, కల్యాణ్ బెనర్జీ, డోలా సేన్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు మమతా బెనర్జీతో కలిసి పాల్గొన్నారు. గత శనివారం తన మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి, ఎన్నికల అనంతర హింస, వీధి వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. -
50 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ? టీఎంసీ ఇక తమదేనంటూ..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ను అంతర్గత సంక్షోభం కలవరపెడుతోంది. చీలిక దిశగా టీఎంసీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. టీఎంసీ బహిష్కృత నేత రితబ్రత్ బెనర్జీ వద్దకు అసంతృప్త నేతలు వెళ్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కోల్‌కతాలో పలుసార్లు రహస్య సమావేశాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నివాసంలో కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరైన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 50 మందికి తిరుగుబాటు చేస్తే దీదీకి కష్టాలు మొదలవుతాయి. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైనా భవిష్యత్తులో పోరు జరిగే అవకాశం ఉంది. బెంగాల్ రాజకీయాల్లో మమత నాయకత్వానికి కొత్త సవాల్ వస్తుంది. తాజా పరిణామాలు టీఎంసీ భవిష్యత్తు ఏంటన్న అంశంపై ఉత్కంఠ రేపుతున్నాయి.పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతున్న వేళ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసిన రిజు దత్తా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు ఏకమయ్యారని, ఇటీవల ఓ హోటల్లో సమావేశమయ్యారని చెప్పారు. తమ వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, బెంగాల్లో “మహారాష్ట్ర మోడల్” తరహా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని కూడా ఆయన అన్నారు. కొందరు పార్టీ నాయకులు తమ సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీ స్పీకర్‌ను కలవనున్నారని కూడా చెప్పారు.బెంగాల్లో మహారాష్ట్ర నమూనా?బెంగాల్లో “మహారాష్ట్ర నమూనా” అమల్లో ఉందని రిజు దత్తా అన్నారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు ఏకమై మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారని తెలిపారు. “మా వద్ద మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మాతో ఉన్నారు. నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే కాబట్టి, ప్రతిపక్ష నేతగా శోభన్‌దేవ్ చట్టోపాధ్యాయ్ కాదు, రితబ్రత బందోపాధ్యాయ్ ఉంటారు” అని రిజు దత్తా చెప్పారు. అలాగే, ఈ ఎమ్మెల్యేలే మెజారిటీగా ఉండడంతో పార్టీ గుర్తుపై కూడా తమకే హక్కు ఉండాలని ఆయన పేర్కొన్నారు. -
బీజేపీ అంత సాహసం చేస్తుందా?
ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను శాసించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ).. ఇప్పుడు తన అస్తిత్వానికే పోరాడుతోందా? వరుస రాజీనామాలు, ఎమ్మెల్యేల తిరుగుబాటు సంకేతాలు, వేటులు, పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీ ప్రభావం.. ఈ పరిణామాలన్నీ టీఎంసీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని కాపాడగలిగేది మమతా బెనర్జీ ఒక్కరేనా? లేదంటే టీఎంసీ ఆమె చేతుల్లో నుంచి కూడా జారిపోతుందా? అనే చర్చ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 294 స్థానాల్లో 208 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. దాదాపు పదిహేనేళ్ల అధికారాన్ని కోల్పోయిన పార్టీ ఒక్కసారిగా ప్రతిపక్ష పాత్రలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఫలితాల తర్వాతే టీఎంసీలో అసంతృప్తి బయటపడటం మొదలైంది. ఇటీవల మమతా నిర్వహించిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది హాజరుకాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపించింది. ఇదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం పరిస్థితి తీవ్రతను వెల్లడించింది.బహిరంగంగానే అంగీకారంపార్టీలో చీలిక తీసుకురావడానికి కుట్ర జరుగుతోందని మమతా బెనర్జీ స్వయంగా ఫేస్బుక్ లైవ్‌లో అంగీకరించారు. కొంతమంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తెచ్చి పార్టీని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. “నాయకులు భయపడవచ్చు.. కానీ కార్యకర్తలు భయపడరు. కార్యకర్తలు ఉన్నంతకాలం నేను పార్టీని మళ్లీ నిర్మిస్తా” అని ఆమె ప్రకటించారు.అభిషేక్‌పై అసంతృప్తి?పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహారశైలిపై కూడా టీఎంసీ సీనియర్ నేతల్లో అసంతృప్తి పెరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పాత తరం నాయకులను పక్కనపెట్టి కొత్త బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎన్నికల వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు అధిక ప్రాధాన్యం కల్పించడం వల్ల మధ్యస్థాయి నాయకత్వం పార్టీకి దూరమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక మంది నేతలు ఎన్నికల ఓటమికి ఐ-ప్యాక్ వ్యూహాలే కారణమని కూడా ఆరోపిస్తున్నారు.పార్టీ నుంచి నిష్క్రమణల పరంపరఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ పదవులకు రాజీనామా చేయడం పెద్ద చర్చకు దారితీసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు శంతను సేన్, సీనియర్ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి కూడా పదవులు వీడారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, సినీ దర్శకుడు రాజ్ చక్రవర్తి, అసోం యూనిట్ మాజీ అధ్యక్షుడు అభిజిత్ మజుందార్ వంటి ప్రముఖులు పార్టీని పూర్తిగా విడిచిపెట్టారు. మరోవైపు వందకు పైగా కార్పొరేటర్లు కూడా టీఎంసీకి రాజీనామా చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఎందుకు దూరమవుతున్నారు?రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. టీఎంసీలో సిద్ధాంతపరమైన బలం ఎప్పటినుంచో బలహీనంగానే ఉంది. సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను గెలుపు అవకాశాల కోసం పార్టీలోకి తీసుకువచ్చారు. వారు మమతా ఇమేజ్, టీఎంసీ బలంతో గెలిచినా.. పార్టీతో భావోద్వేగ అనుబంధం లేదంటే సిద్ధాంతపరమైన నిబద్ధత మాత్రం ఎక్కువగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి అధికారం కోల్పోయిన తర్వాత అలాంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొత్త మార్గాలు వెతకడం సహజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.బీజేపీ అంత సాహసం చేస్తుందా?టీఎంసీ నేతల్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత టీఎంసీలో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొనడంతో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆశ్రయాల కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో ఉండటం రాజకీయంగా లాభదాయకమని భావిస్తున్న నేతలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.అయితే టీఎంసీ నుంచి వచ్చే ప్రతి నేతకు బీజేపీ తలుపులు తెరుస్తుందా? అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. 2021 ఎన్నికల సమయంలో టీఎంసీ నుంచి భారీగా వచ్చిన నేతలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం పార్టీకి మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పాత బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి పెరగడంతో పాటు, టీఎంసీ నుంచి వచ్చిన వారిని ప్రజలు పూర్తిగా నమ్మలేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అంతేకాకుండా అవినీతి, స్థానిక వివాదాలు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు మాజీ టీఎంసీ నేతలను చేర్చుకోవడం వల్ల బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు కేవలం సంఖ్యాబలం కోసం కాకుండా.. పార్టీకి రాజకీయంగా ఉపయోగపడే, ప్రజల్లో బలమైన గుర్తింపు ఉన్న నాయకుల విషయంలో మాత్రమే బీజేపీ ఆసక్తి చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు టీఎంసీ నుంచి బయటకు రావాలనుకునే నేతలకు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ఆహ్వానం కనిపించడం లేదు. దీంతో పార్టీ మారాలని భావిస్తున్న నేతలు కూడా కొంత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం టీఎంసీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. అది వెంటనే బీజేపీలో భారీ చేరికలుగా మారుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేని అంశంగానే మిగిలింది.టీఎంసీకి మమతే బలం.. అదే బలహీనతటీఎంసీ అంటే మమతా.. మమతా అంటే టీఎంసీ అన్న స్థాయిలో పార్టీ నిర్మాణం జరిగింది. అదే ఇప్పుడు పార్టీకి బలం కూడా, బలహీనత కూడా అయింది. ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించకపోవడం ఒకవైపు సానుకూల అంశమైతే.. మొత్తం పార్టీ ఒకే వ్యక్తిపై ఆధారపడటం మరోవైపు ప్రమాద సంకేతంగా మారింది. ప్రస్తుతం మమతా లేకుండా టీఎంసీని ఊహించడం కష్టమే. కానీ మమతా ఒక్కరే పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలరా? అనే ప్రశ్న మాత్రం మరింత బలంగా వినిపిస్తోంది.అసలైన పరీక్ష ఇప్పుడేబెంగాల్ రాజకీయ చరిత్ర చూస్తే ఒకసారి అధికారాన్ని కోల్పోయిన పార్టీ మళ్లీ తిరిగి రావడం చాలా అరుదు. కాంగ్రెస్, సీపీఎం వంటి దిగ్గజాలు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అలాంటి మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం మమతా బెనర్జీకి రెండు సవాళ్లు ఒకేసారి ఎదురయ్యాయి. బయట బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుండగా.. లోపల పార్టీ చీలికల ముప్పు వెంటాడుతోంది. 2029 లోక్‌సభ, 2031 అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని కాపాడటం, మళ్లీ కార్యకర్తల్లో నమ్మకం నింపడం ఆమె ముందున్న అతిపెద్ద పరీక్షగా మారింది. -
అప్పట్లో పనిమనిషి.. నేటి నుంచి బెంగాల్ మంత్రి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కలితా మాఝీ అనే మహిళ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసిన ఆమె ఇప్పుడు మంత్రి స్థాయికి ఎదిగారు. సోమవారం ఆమె రాష్ట్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు నెలకు ఆమె జీతం కేవలం రూ.2,500. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతల్లో భాగస్వామి కావడం విశేషం.ప్రమాణ స్వీకారం అనంతరం కలితా మాఝీ మాట్లాడుతూ.. "మోదీజీ నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యేని అవుతానని కూడా ఊహించలేదు. మంత్రిని అవుతానని అస్సలు అనుకోలేదు. 2014 నుంచి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంపైనే దృష్టి ఉండేది. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ బాధ్యత నా భుజాలపై ఉంది" అని తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలితా మాఝీ చదువును మధ్యలోనే నిలిపివేశారు. కుటుంబ పోషణ కోసం అనేక ఇళ్లలో పనిమనిషిగా చేశారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు పార్థ్ ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నాడు.బూత్ స్థాయి కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కలితా మాఝీకి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా, 2026లో మరోసారి అవకాశం కల్పించగా ఆమె విజయం సాధించారు.సోమవారం కోల్‌కతాలోని లోక్ భవన్లో గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ విస్తరణలో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 19 మంది రాష్ట్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.కాగా, బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను ఆ కలితా మాఝీ దాదాపు 12 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. -
కష్టకాలంలో దీదీ పార్టీ!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో దారుణ పరాభవం. ఆ వెంటనే పార్టీ నేతలపై దాడులు. నిరసనలు.. వీధి పోరాటాల పిలుపు నేపథ్యంలో కీలక సమావేశానికి రావాలని స్వయంగా పార్టీ అధినేత్రి నుంచి ఆహ్వానం. కానీ ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేల డుమ్మా! దీంతో ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ఒకటే చర్చ. అసలు టీఎంసీలో ఏమి జరుగుతోంది?.. ఇది కేవలం రాజకీయ ఉద్రిక్తతల ప్రభావమా? లేక మరేదైనా పెద్ద సంకేతమా?పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రస్తుతం రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడం కొత్త వివాదానికి తెరతీసింది. ఆ ఘటన తర్వాత పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కలీఘాట్ నివాసంలో అత్యవసరంగా ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే 80 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ పరిణామంతో మమత సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. దీంతో.. చేసేది లేక సమావేశం వాయిదా వేశారు.సాధారణంగా రాజకీయ సంక్షోభ సమయంలో పార్టీ అధినేత పిలిస్తే శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. అలాంటిది దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత టీఎంసీ ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఈ గైర్హాజరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే టీఎంసీ దీనికి భిన్నమైన వివరణ ఇస్తోంది. అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని, పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆందోళనలను పర్యవేక్షిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు. పరిస్థితుల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేయాలని వారే కోరారని, అందుకే పార్టీ అంగీకరించిందని చెప్పారు.కానీ ఈ వ్యవహారంలో రాజకీయంగా మరింత ఆసక్తికరమైన అంశం ఆరోపణలు-ప్రత్యారోపణలే. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక బీజేపీ అనుకూల వర్గాల హస్తం ఉందని టీఎంసీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తూ, దాడికి పాల్పడింది టీఎంసీకి చెందిన వర్గాలేనని ఎదురుదాడి చేస్తోంది. పార్టీ అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని కమలనాథులు విమర్శిస్తున్నారు.ఇక్కడే రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవేళ బీజేపీ చెబుతున్నట్లుగా ఈ ఘటన వెనుక నిజంగానే టీఎంసీ అంతర్గత వర్గాల ప్రమేయం ఉన్నట్లు తేలితే.. అది పార్టీకి పెద్ద రాజకీయ, సంస్థాగత సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత నాయకత్వం, వారసత్వం, భవిష్యత్ వ్యూహాలపై పార్టీలో అసంతృప్తి ఉందన్న ప్రచారానికి అప్పుడు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమావేశానికి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా అదే కోణంలో విశ్లేషణకు దారితీయొచ్చు.అయితే ప్రస్తుతం ఈ ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు బయటకు రాలేదు. అందుకే టీఎంసీ, బీజేపీ రెండూ తమ తమ రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవైపు అభిషేక్ బెనర్జీపై దాడిని ప్రజా ఉద్యమంగా మలచాలని టీఎంసీ భావిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎత్తిచూపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలో టీఎంసీ మరింత దూకుడైన ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. బ్లాక్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు నిరసన ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. కోల్‌కతాలో మమతా బెనర్జీ స్వయంగా పాల్గొనే ధర్నా కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఎన్నికల అనంతర హింస, కార్యకర్తలపై దాడులు, బుల్డోజర్ చర్యలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే.. అభిషేక్ బెనర్జీపై దాడి కంటే, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారాయి. 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది గైర్హాజరు కావడం, బీజేపీ-టీఎంసీ మధ్య ఆరోపణల యుద్ధం, వీధి పోరాటాలకు పార్టీ సిద్ధమవడం.. ఇవన్నీ కలిసి ఒక పెద్ద రాజకీయ కథకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఇది కేవలం ఒక దాడి ఘటన ప్రభావమా? లేదంటే టీఎంసీలో జరుగుతున్న లోతైన రాజకీయ మార్పులకు సూచనా? అనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
దిమ్మతిరిగిపోయే ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి చేసింది ఎవరో కాదు!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై కొందరు గుడ్లు, రాళ్లు విసరడంతో కలకలం చెలరేగింది. నిరసనకారులు “చోర్ చోర్” అంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ రాకను వ్యతిరేకించారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి కేసు దర్యాప్తులో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన పలువురు నిందితులకు సోనార్పూర్ మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో తపన్ మైతి, ఆకాశ్ గాయెన్, కాజల్ దాస్, దేవాశిష్ దత్తా, నిర్మాల్య సెంగుప్తా అలియాస్ జాయ్ ఉన్నారు. ఈ ఘటనలో వారి పాత్రలపై దర్యాప్తు జరుపుతున్నారు. తపన్ మైతి, జాయ్ సెంగుప్తా మాజీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు సన్నిహిత సహచరులు. కాజల్ దాస్, దేవాశిష్ దత్తా కూడా లవ్లీ మైత్రాతో అనుబంధం ఉన్నవారని తెలుస్తోంది. ఈ నలుగురూ కేసులో అరెస్టయిన వారిలో ఉన్నారు.ఆకాశ్ గాయెన్ ఎవరు?ఈ దాడి కేసులో అరెస్టయిన నిందితుల్లో ఆకాశ్ గాయెన్ ఒకరు. ఆయన స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త.. తన కుమారుడు చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్నాడని, టీఎంసీ ఎన్నికల బూత్‌ల వద్ద క్రమం తప్పకుండా విధులు నిర్వహించేవాడని ఆయన తల్లి తెలిపారు.తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. అభిషేక్ బెనర్జీపై ద్వేషం పెట్టుకునే కారణం ఆకాశ్‌కు లేదని చెప్పారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ఘటన తర్వాత అతడు ఇంటికి వచ్చి, అనంతరం సమీప మైదానంలో ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లాడు. అదే రాత్రి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు కచ్చితమైన కారణాలను కుటుంబానికి తెలియజేయలేదని ఆమె అన్నారు. ఆకాశ్ తండ్రి వ్యాన్-రిక్షా నడుపుతుండగా, ఆకాశ్ నిరుద్యోగి.జాయ్ సెంగుప్తా ఎవరు?ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు జాయ్ సెంగుప్తా. ఆయన స్థానిక టీఎంసీ నాయకుడు. చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్నారు. దాడి కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆయనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. సెంగుప్తా 1998 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌తో అనుబంధంగా ఉన్నారని, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు మారినా పార్టీ పట్ల విధేయత చూపారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిషేక్ బెనర్జీపై సెంగుప్తాకు ఎలాంటి అసంతృప్తి లేదని కూడా వారు స్పష్టం చేశారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున అక్కడికి రావద్దని బెనర్జీకి సూచించాడని, అయినప్పటికీ పర్యటన జరిగిందని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలో సెంగుప్తాకు ఎలాంటి పాత్ర లేదని కుటుంబ సభ్యులు చెప్పారు.రాజకీయ ఆరోపణలుటీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించిందని ఆరోపించారు. బీజేపీ ఆ ఆరోపణలను తిరస్కరించింది. తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.ఈ దాడి ఘటన పెద్ద రాజకీయ వివాదంగా మారింది. హింసకు బాధ్యత ఎవరిదన్న అంశంపై రెండు పార్టీలూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అరెస్టయిన పలువురు నిందితులకు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారం దర్యాప్తును కొత్త కోణంలో చేయడానికి అవకాశం ఇచ్చింది. దాడి జరిగిన పరిస్థితులు, అరెస్టయిన వారి మధ్య సంబంధాలపై దర్యాప్తు అధికారులు పరిశీలన కొనసాగిస్తున్నారు. -
బెంగాల్లో మళ్లీ హింస: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
హుగ్లీ: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చండితాల పోలీస్ స్టేషన్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టుకు నిరసనగా టీఎంసీ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి.ఘర్షణకు దారితీసిన పరిస్థితులుటీఎంసీ బృందం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, అదే సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. రెండు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో పాటు పరిస్థితి భౌతిక దాడుల వరకు దారితీసింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి తీవ్ర గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలు ‘చోర్-చోర్’ (దొంగ-దొంగ) అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో, టీఎంసీ మద్దతుదారులకు, వారికి మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరిందని సమాచారం. ఈ క్రమంలో జరిగిన దాడిలో ఎంపీ కల్యాణ్ బెనర్జీ తలకు బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు.అధికార యంత్రాంగం అప్రమత్తంఘటన జరిగిన వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. అరెస్టులు, ఆ తర్వాత జరిగిన ఈ ఘర్షణ ఘటన రాజకీయంగా మరింత దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బలగాలు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. -
3 నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నెల రోజులు అవుతోంది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆగడాలకు ఇక ముగింపు పడిందని బీజేపీ అంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ నుంచి మమతా బెనర్జీకి షాక్‌ల మీద షాక్‌లు ఎదురవుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నేతలు వరుసగా పార్టీ నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీ పదవులకు కొందరు రాజీనామాలు చేశారు. వారిలో చాలామంది తాము బీజేపీలో చేరాలనుకుంటున్నామని నేరుగా చెప్పడం లేదు. వారి తిరుగుబాటు సిద్ధాంతపరమైన మార్పు కంటే, పార్టీలో పెరిగిన అసంతృప్తి, నిరాశ, దూరం పెరగడాన్ని ప్రతిబింబిస్తోంది.బీజేపీ కూడా వచ్చే మూడు నెలల వరకు ఫిరాయింపుదారులను చేర్చుకునే ఆసక్తి తమకు లేదని బహిరంగంగా ప్రకటించింది. టీఎంసీలోని మంచి, చెడు నేతల మధ్య తేడా స్పష్టంగా తెలిసిన తర్వాతే పార్టీలో చేర్చుకోవడంపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. బీజేపీ ఇప్పుడు భావిస్తున్నట్లు కాకుండా తమ వద్దకు వచ్చిన టీఎంసీ నేతలందరినీ పార్టీలో చేర్చుకుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. మూడు నెలల తర్వాత బీజేపీ గేట్లు తెరిస్తే ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కనుమరుగు అవుతుందన్న ఊహాగానాలు వస్తున్నాయి.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు సైతం తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. వారి ఆరోపణలు దాదాపు ఒకేలా ఉన్నాయి. పార్టీ కార్పొరేట్ శైలిలో నడుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. నాయకత్వాన్ని చేరుకోవడం కష్టమైందని మరికొందరు చెబుతున్నారు. కీలక సమయాల్లో అభిషేక్ బెనర్జీ రాజకీయంగా అందుబాటులో లేరని కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతమంది సొంత పార్టీ నేతల నుంచి విమర్శలువస్తున్నాయి.ఓటమిపై మమత సమీక్ష ఏది? ఇటువంటి ప్రచారం జరుగుతుండడానికి బలమైన కారణం ఉంది. ఓటమి తర్వాత మమతా బెనర్జీ వాస్తవిక పరిస్థితుల గురించి, పరాజయం వెనుక ఉన్న కారణాల గురించి పునరాలోచన చేయడం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు శాశ్వతం కాకపోయినప్పటికీ ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రతి ప్రధాన రాజకీయ శక్తి తనలోతాను విశ్లేషించుకునే దశలోకి వెళ్తుంది.చరిత్రలో చోటుచేసుకున్న ఇటువంటి ఘటనలు చూస్తే.. జ్యోతి బసు యుగం నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య నాయకత్వానికి సీపీఎం మారిన సమయంలో కమ్యూనిస్టు పార్టీలో కూడా అంతర్గత చర్చలు జరిగాయి. సీనియర్ కమ్యూనిస్టు నేత అబ్దుల్లా రసూల్ అప్పట్లో నాయకత్వాన్ని బహిరంగంగా హెచ్చరించారు. చివరకు పార్టీ ఆత్మపరిశీలన చేపట్టక తప్పలేదు. సీపీఎం సీనియర్ నేత శ్యామల్ చక్రవర్తి ఆత్మశుద్ధి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకునే ప్రక్రియను చేపట్టారు. బీజేపీ కూడా ఇలాంటి ఆత్మపరిశీలన దశను ఎదుర్కొంది.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఎలాంటి తప్పులను బహిరంగంగా అంగీకరించడానికి సిద్ధంగా కనిపించడం లేదు. మమతా బెనర్జీ గానీ, అభిషేక్ బెనర్జీ గానీ ఎన్నికల పరాజయానికి వ్యూహాత్మక లేదా సంస్థాగత తప్పిదాలు కారణమయ్యాయని ఒప్పుకోలేదు. దీంతో పార్టీలో మరింత అసంతృప్తి పెరిగి ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఊహాగానాలు వస్తున్నాయి. -
MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు
-
మమత ‘ఊసరవెల్లి’ కవిత
కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీలోని నేతలు రకరకాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటంతోపాటు పార్టీ నుంచి వెళ్లిపోతుండటం తెల్సిందే. వీరి వైఖరులను ఎండగడుతూ టీఎంసీ చీఫ్, మాజీ సీఎం మమతా బెనర్జీ గిర్గిటి(ఊసరవెల్లి)పేరుతో రాసిన ఓ కవితను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.ఈ సందర్భంగా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు నేతలు ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుతున్నారంటూ ఆ కవితలో ఆమె నర్మగర్భంగా పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని గంటల్లోనే వ్యక్తిత్వాలను, విధేయతలను మార్చుకునే కొందరు వ్యక్తులు ఊసరవెల్లి కంటే ప్రమాదకరంగా మారారని పేర్కొన్నారు.‘మీ ప్రవర్తనను ఇంకెంతగా మార్చుకుంటారు? మీకు ఇంకెంత లంచం రావాలి? మిమ్మల్ని మీరు ఇంకెంతగా మారాలని అనుకుంటున్నారు?’అంటూ ఆ కవితలో మమత ప్రశ్నించారు. ఇందులో ఆమె ప్రత్యేకంగా ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. సమాజం, రాజకీయాల్లో కృతజ్ఞత, నైతిక విలువలు, మానవీయ స్పందనలు అంతరించిపోతున్నాయంటూ ఆవేదనతో వ్యక్తం చేశారు. -
బెంగాల్లో ట్విస్ట్.. మమతకు మరో ఝలక్
కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీలో లుకలుకలు ఒకటొకటి బయటపడుతున్నాయి. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ మాజీ ఎంపీ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి పంపానన్నారు.ఈ సందర్భంగా మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఉదంతంపై తమ పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. అనైతిక చర్యల కారణంగానే ఎన్నికల్లో ప్రజలు పార్టీని తిరస్కరించారని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను టీఎంసీ ఆవిర్భావం నుంచి విధేయత కలిగిన సైనికుడిగా ఉన్నానంటూ..పార్టీ వివాదాలను బహిరంగంగా సమర్థించడం తనకు నైతికంగా ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు.కాగా, ఆర్జీకర్ ఉదంతంపై నిరసన గళం వినిపించిన అతికొద్ది మంది టీఎంసీ నేతల్లో శంతను సేన్ ఒకరు. దీనిపై అప్పట్లో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తిరిగి పార్టీలో చేర్చుకుంది. బుధవారం సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్, పార్టీ అధికార ప్రతినిధి, టీఎంసీ కౌన్సిలర్లు అనూప్ చక్రవర్తి, సుశాంత ఘోష్ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. -
టీఎంసీకి ఎంపీ దస్తీదార్ రాజీనామా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. బరాసత్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తిదార్ అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంపై నైతిక బాధ్యత వహిస్తూ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం రాజకీయ కన్సల్టెన్సీ ఐపాక్‌పై దస్తిదార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలోనే ఆమెకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఇతర నేతలతో కూడా దూరం పెరిగింది. దీనితో తాత్కాలికంగా పార్టీ సమావేశాలకు దూరంగా ఉండాలని మమతా ఆదేశాలు జారీ చేశారు.అయినప్పటికీ మమతా బెనర్జీ నిర్వహించిన పరిపాలనా సమీక్ష సమావేశానికి దస్తిదార్ హాజరయ్యారు. పార్టీ ఆదేశాలు ఉన్నప్పటికీ ఆమె పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఈ నేపథ్యంలో బుధవారం దస్తిదార్ తృణమూల్ కాంగ్రెస్‌లోని జిల్లా అధ్యక్షురాలు పదవి, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ నాయకత్వంతో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల పరాజయాల తరువాత పలువురు నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం బీజేపీ వంటి ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తోంది. -
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. 28ఏళ్లలో తొలిసారిగా దీదీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సంచలనం చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, వందలమంది కౌన్సిలర్లు టీఎంసీని వీడి బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు, ముఖ్యంగా లోక్‌సభ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.టీఎంసీ నియంత్రణలో ఉన్న మున్సిపల్ సంస్థల్లో వరుస రాజీనామాలు చోటు చేసుకున్నాయి. భట్పారా మున్సిపాలిటీలో 35 మందిలో 30 మంది, హాలిసహర్‌లో 23 మందిలో 16 మంది, కంచరపారాలో 14 మంది కౌన్సిలర్లు వైదొలిగారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం, పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వంటి కారణాలతో కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.అవినీతి, దోపిడీ ఆరోపణలు పార్టీపై మరింత ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల ముగ్గురు కౌన్సిలర్లు అరెస్టు అయ్యారు. సౌత్ డుమ్ డుమ్ కౌన్సిలర్ సంజయ్ దాస్ మర్మమైన మరణం ఆందోళనను పెంచింది. మాజీ టీఎంసీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ అరెస్టు చేయడం, మాజీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త దేబ్రాజ్ చక్రవర్తిపై విచారణ కొనసాగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది.కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా గందరగోళంలో ఉంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు జారీ కావడం, బీజేపీ 43 ఆస్తుల జాబితాను విడుదల చేయడం అంతర్గత కలహాలకు దారితీసింది. మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్రపై ప్రశ్నలు తలెత్తాయి. ఆయన రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.మే 22న మేయర్‌తో సహా కౌన్సిలర్లు ప్రధాన ఛాంబర్ వెలుపల సమావేశం నిర్వహించవలసి రావడం, ఎన్నికైన ప్రతినిధులకు అవమానకరంగా మారింది. వరుస రాజీనామాలు మున్సిపల్ సేవలను తీవ్ర గందరగోళంలోకి నెట్టాయి. రాబోయే వర్షాకాలం ముందు డ్రైనేజీ, పారిశుధ్యం, అత్యవసర సన్నద్ధతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.కౌన్సిలర్లు అందుబాటులో లేని చోట బీజేపీ ప్రభుత్వం నిర్వాహకులను నియమించడం ప్రారంభించింది. దీంతో, టీఎంసీ సంక్షోభం కేవలం స్థానిక సంస్థలకే పరిమితం కాకుండా, మొత్తం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలు 1998లో కాంగ్రెస్ నుండి విడిపోయి మమతా బెనర్జీ స్థాపించినప్పటి నుండి టీఎంసీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభంగా విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ లక్ష ఓట్ల తేడాతో ఘన విజయం.. ఇక టీఎంసీ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం రీపోలింగ్‌లో బీజేపీ భారీ విజయం సాధించింది. ఫల్తా స్థానానికి గురువారం (మే 21) రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి శంభు నాథ్ కుర్మీపై లక్షకు పైగా (1,09,021) ఓట్ల తేడాతో గెలిచారు.తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, తనను తాను ‘‘పుష్ప’’గా చెప్పుకున్న జహంగీర్ ఖాన్ గత వారం రీపోలింగ్ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘పుష్ప’’ సంగతి తాను చూసుకుంటానని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా అన్నారు. ‘‘పుష్ప’’ సినిమాలో అల్లు అర్జున్‌లా జహంగీర్ ఖాన్ తనను తాను పోల్చుకునేవారు. అందుకే ఆయనను ‘‘పుష్ప’’ అని అంటుంటారు.ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్ సమయంలో ఓటింగ్ యంత్రాల్లో జోక్యం జరిగిందన్న ఆరోపణలు, ఎన్నికల అక్రమాల ఫిర్యాదుల తర్వాత ఈ నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించారు. గురువారం జరిగిన రీపోలింగ్‌లో మొత్తం 2.36 లక్షల ఓటర్లలో 87 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.రీపోలింగ్ సందర్భంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఈ నియోజకవర్గంలో భద్రతను రెట్టింపు చేశారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిపేందుకు కేంద్ర బలగాల 25 కంపెనీలను మోహరించారు.ఫల్తా నియోజక వర్గం తృణమూల్‌కు బలమైన కోటగా ఉండేది. లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆధిపత్యం ఉన్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ స్థానం ఉంది. 2011 నుంచి ఈ స్థానంలో తృణమూల్ గెలుస్తోంది. అయినప్పటికీ తృణమూల్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కొన్ని రోజుల ముందే పోటీ నుంచి తప్పుకున్నారు.ఈ ఎన్నికలో దేవాంగ్షు పాండా (బీజేపీ)తో పాటు అబ్దుర్ రజాక్ మోల్లా (కాంగ్రెస్), శంభు నాథ్ కుర్మీ (సీపీఎం), ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. పాండాకు 1,49,666 ఓట్లు, కుర్మీకి 40,645 ఓట్లు, మోల్లాకు 10,084 ఓట్లు, ఖాన్‌కు 7,783 ఓట్లు వచ్చాయి. ఖాన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ అప్పటికే నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ కూడా అయిపోవడంతో ఆయన పేరు, టీఎంసీ గుర్తు ఈవీఎంలపై ఉంది.రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు జహంగీర్ ఖాన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫల్తా ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చినందుకు తాను పోటీ నుంచి తప్పుకున్నానని చెప్పుకొచ్చారు. జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. “బీజేపీ బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం” అని పేర్కొంది. -
సరదా తీర్చిన ట్వీట్.. తారల మెడకు ఉచ్చు?
ఒకప్పుడు సరదాగా చేసిన పని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద రాజకీయ బాంబులా పేలింది. ఐదేళ్ల కిందటి ఎన్నికల హింస తెర మీదకు రావడంతో ఇద్దరు సినీ తారలు చిక్కుల్లో పడ్డారు. వాళ్ల మీద ఫిర్యాదు నమోదు కావడం, పైగా టీఎంసీతో దగ్గరి సంబంధాలు ఉండడంతో సువేందు అధికారి సర్కార్ చర్యలు తీసుకోవడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోందనే చర్చ ఊపందుకుంది.2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఫలితాల తర్వాత చెలరేగిన హింస మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆనాడు కౌంటింగ్ జరుగుతున్న టైంలో నటుడు పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. ఫలితాల ట్రెండ్ ఆధారంగా ఆయన చేసిన ట్వీట్ ‘ఈరోజు ప్రత్యర్థులను చితక్కొట్టే రోజు’ అనే అర్థం వచ్చేలా ఉంది. దానికి నటి స్వస్తికా ముఖర్జీ ‘హహహ’ అంటూ లాఫింగ్ రియాక్షన్‌తో స్పందించారు.అయితే.. ఆ తర్వాత కొన్నిగంటలకే బెంగాల్ అంతటా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంత మంది చనిపోయారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనీసం 11 మంది చనిపోయినట్లు అప్పటి దీదీ సర్కార్ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికల్లో ఉంది. అయితే తర్వాత వెలువడిన వివిధ నివేదికలు, దర్యాప్తుల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. “కాల్ ఫర్ జస్టిస్” అనే పౌర సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని, 25 మంది మరణించారని, సుమారు 7 వేల మంది మహిళలు వేధింపులకు గురయ్యారని పేర్కొంది.హత్యలు, దాడులు, అత్యాచారాలు, అగ్నిప్రమాదాలు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులపై తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఒక్క దశలోనే 31 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. పాత కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వందల సంఖ్యలో కొత్త దర్యాప్తులు కూడా ప్రారంభించారు. అయితే.. ఐదేళ్ల కిందట బెంగాల్ హింసపై దర్యాప్తు చేపట్టాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ అంశం మళ్లీ చర్చకు రావడంతో.. ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటుల పేర్లు కూడా వివాదంలో వినిపిస్తున్నాయి.బెంగాలీ తారలు చేసిన ట్వీట్ హింసను ప్రేరేపించేలా ఉందని ఆరోపిస్తూ కోల్‌కతాలోని గరియాహట్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన జోయ్‌దీప్ సేన్ అనే వ్యక్తి ఆరోపణ ఏమిటంటే.. 2021 మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. దానికి స్వస్తికా ముఖర్జీ నవ్వు గుర్తులతో స్పందించారు. అప్పటికే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖులైన వీరి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా పనిచేశాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, మహిళలపై దాడులు జరిగిన ఘటనలకు ఇలాంటి పోస్టులు మానసిక ప్రోత్సాహం ఇచ్చాయి. అంతేకాదు.. ఆ ట్వీట్ చేసిన గంటలోపే బీజేపీ కార్యకర్త అభిజిత్ సర్కార్ హత్య జరిగిందని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస మరింత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఆ ఎన్నికల హింసను విచారణ జరిపేందుకు సువేందు సర్కార్ ఓ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా వీళ్ల అంశాన్ని పరిశీలించే అవకాశమూ కనిపిస్తోంది. పరంబ్రతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ.. ప్రముఖ బెంగాలీ యాక్టర్లు. పరంబత్రాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రముఖ దర్శకుడు రుత్విక్ ఘటక్‌కు బంధువు. రచయిత్రి మహాశ్వేతా దేవి కుటుంబానికి చెందినవారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. అందులో కహానీ, బైషే శ్రాబోన్, పారి, బుల్బుల్, అరణ్యక్‌లో నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక.. స్వస్తిక ముఖర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు సంతూ ముఖర్జీ కుమార్తె. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించి బెంగాలీ స్టార్‌గా ఎదిగారు. బెంగాలీతో పాటు హిందీలోనూ నటించారు. పాతాళ్ లోక్, దిల్ బేచారా, ఖాలా, మస్తాన్, శ్రీమతి వాటిల్లో ప్రముఖమైనవి.పరంబత్రా, స్వస్తికా ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు చెప్పడం వల్ల తరచూ వార్తల్లో ఉంటుంటారు. బెంగాల్లో లౌకికవాదం, స్వేచ్ఛ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై విమర్శలు చేస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. అందుకే ఈ ఇద్దరికీ మమతా బెనర్జీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చెబుతుంటారు. -
టీఎంసీకి ఝలక్.. అభిషేక్ బెనర్జీనే కారణమా?
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన తర్వాత తృణముల్ కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ దేబాలినా బిస్వాస్ కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఆమె రాజీనామా లేఖ వెలుగులోకి రావడంతో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. అయితే, టీఎంసీ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కారణంగానే ఆమె తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.టీఎంసీ నియంత్రణలో ఉన్న కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), అభిషేక్ బెనర్జీకి సంబంధించిన 17 ఆస్తులకు నోటీసులు జారీ చేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్బంగా దేబాలినా బిస్వాస్ మాట్లాడుతూ..‘నేను నా పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాలా రాయ్‌కి లేఖ పంపాను. కౌన్సిలర్‌గా కొనసాగుతూ, నా ప్రాంత ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ పదవిలో చాలా కాలంగా ఉన్నాను, కానీ ఇప్పుడు తప్పుకుంటున్నాను. నేను ఇది పూర్తిగా పార్టీ సంబంధిత కారణాల వల్ల చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, అభిషేక్ బెనర్జీ నివాసం.. అక్రమ నిర్మాణంగా జరిగిందంటూ కేఎంసీ (KMC) నోటీసులు జారీ చేసిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ అగ్ర నాయకత్వం తనపై ఒత్తిడి తెచ్చారని బిస్వాస్ ఆరోపించారు. ఈ క్రమంలో..‘నిన్న నోటీసు ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు. అకస్మాత్తుగా, అర్ధరాత్రి వేళ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. ‘లేదు, ఇది సరికాదు’ అని నాకు అనిపించింది. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని ఒకరిని బలవంతం చేయడం లేదా వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయమని ఒత్తిడి చేయడం పార్టీకి తగదని నేను భావిస్తున్నాను. విషయాన్ని కప్పిపుచ్చడం సరైన పద్ధతి కాదు. మనం అడగాలి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు?. కొన్ని విషయాలు నా పరిధిలోకి రావు’ అని వ్యాఖ్యానించారు.అభిషేక్ బెనర్జీ కంపెనీ, కుటుంబానికి సంబంధించి కేఎంసీ నోటీసులు అందుకున్న 17 చిరునామాలలో, 14 చిరునామాలు బిస్వాస్ అధ్యక్షత వహించిన బరో 9 పరిధిలోకి వస్తాయి. నోటీసులు జారీ చేసిన తర్వాత సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యాయని ఆమె చెప్పారు. పార్టీ అగ్ర నాయకత్వంలోని ఒక వర్గం ఆదేశాల మేరకు బిస్వాస్ రాజీనామా చేశారని టీఎంసీ నాయకుల్లో ఒక వర్గం ఆరోపిస్తోంది. కాగా, తన రాజీనామా ఇంకా అధికారికంగా ఆమోదించబడలేదని బిస్వాస్ తెలిపారు. మరోవైపు.. నగరంలో అభిషేక్ బెనర్జీకి అనేక అక్రమ ఆస్తులు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. -
పశ్చిమ బెంగాల్ రీపోలింగ్ లో ట్విస్ట్
-
పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఇమామ్‌లు, ముయజ్జిన్లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన గుర్తింపుల ఆధారంగా సంక్షేమ పథకాలు ఉండకూడదని సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ ఒకటి నుండి మతపరమైన వర్గీకరణ ఆధారంగా ఇచ్చే గౌరవ వేతనాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఇప్పటివరకు సమాచార, సాంస్కృతిక వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖల ద్వారా ఈ పథకాలు అమలులో ఉన్నాయి. అవి వచ్చేలా మొదటి తేదీ నుంచి నిలిచిపోనున్నాయి.2012లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఇమామ్‌లకు నెలకు రూ. 2,500 గౌరవ వేతనం ప్రకటించింది. ఆ తర్వాత ముయజ్జిన్లకు కూడా ఆర్థిక సహాయం అందించారు. 2020లో హిందూ పూజారులకు కూడా గౌరవ వేతనం ఇచ్చే పథకం ప్రారంభమైంది. మొదట రూ.1,000గా నిర్ణయించిన ఈ వేతనం 2026 ఎన్నికల ముందు రూ.2,000కి పెంచారు.అయితే, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు మతపరమైన గుర్తింపులపై ఆధారపడకూడదని స్పష్టం చేసింది. అందుకే ఈ పథకాలను నిలిపివేస్తూ, కోటా అర్హతను నిర్ణయించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కోల్కత్తా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.మమతా బెనర్జీ ప్రభుత్వ కాలంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. అలాగే, మహిళలపై జరిగిన దాడుల కేసులను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఒక నెలలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది. -
గోవులకు బర్త్ సర్టిఫికేట్.. బీజేపీ ఎమ్మెల్యేపై టీఎంసీ సెటైర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాల్ని అడ్డుకున్న ఆమె.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆవుల జనన సర్టిఫికేట్ చూపించాలి’అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా శనివారం హింగల్గంజ్లోని లేబుఖాలి ప్రాంతంలో గోవుల రవాణా వాహనాన్ని అడ్డుకున్నారు. రహదారి మార్గంలో వాటికి నీరు, ఆహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేఖా పత్రా మాట్లాడుతూ.. 14 ఏళ్ల లోపు ఆవులను వధ చేయరాదు. ఎవరు అక్రమంగా ఆవులను తరలిస్తే వారిని పట్టుకోవాలి. ఆవుల జనన సర్టిఫికేట్ చూపించమని అడగాలి. చూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మాట్లాడుతూ, “బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఆవుకు జనన సర్టిఫికేట్ ఇచ్చిన ఉదాహరణ చూపించగలరా? ఒకటి చూపిస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరు జారీ చేశారో కూడా తెలుసుకోవాలి” అని వ్యంగ్యంగా అన్నారు.అయితే టీఎంసీ నేతల సెటైర్లపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. గోవధను అరికట్టాలంటే జనన దృవీకరణ పత్రాలు ఉండాల్సిందేనని అంటున్నారు. ఎమ్మెల్యే రేఖా పత్రా ఆలోచన బాగుందని తెలిపారు. -
మమతకు బిగ్ షాక్.. సువేందు అధికారి అదిరిపోయే దెబ్బ
పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలను, గుర్తులను సువేందు ప్రభుత్వం తొలగిస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బిస్వా బంగ్లా’ లోగోను రాష్ట్రవ్యాప్తంగా తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారిక వేదికలు, ప్రజా మౌలిక సదుపాయాల నుండి అధికారికంగా తొలగించడం ప్రారంభించింది. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు.కాగా, మాజీ సీఎం మమతా బెనర్జీ సెప్టెంబర్ 16, 2013న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను ప్రారంభించారు. బెంగాల్ సాంస్కృతిక గుర్తింపు, పర్యాటకం, సాంప్రదాయ కళలు మరియు చేతివృత్తులకు ప్రాతినిధ్యం వహించే చిహ్నంగా దీనిని రూపొందించారు. బెంగాలీ అక్షరం “B” చుట్టూ రూపొందించబడిన ఈ లోగో, తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వెబ్సైట్లు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు సుందరీకరణ కార్యక్రమాలలో క్రమంగా అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా మారింది.దశాబ్దానికి పైగా తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది గుర్తింపుగా పనిచేసింది. కాగా, బెంగాల్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం, ఈ లోగో స్థానంలో మరో కొత్త లోగోను తీసుకువచ్చారు. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా సాల్ట్ లేక్ స్టేడియంలో 'బిస్వా బంగ్లా' గుర్తును తొలగించి, దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఈ రీబ్రాండింగ్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించింది. పలు ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్‌లను అందించే 'ఎగియే బంగ్లా' పోర్టల్‌లో ఇప్పుడు బిస్వా బంగ్లా లోగో స్థానంలో అశోక స్తంభాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టల్ థీమ్‌లో కూడా మార్పు వచ్చింది. గతంలో ఉన్న తెలుపు-నీలం రంగుల స్థానంలో కాషాయ రంగును చేర్చారు.The 'Biswa Bangla' logo has been removed from the Salt Lake stadium in Kolkata. Its been replaced by India's national emblem - the Ashok StambhBiswa Bangla logo was introduced by former CM Mamata Banerjee as the state emblem for Bengal pic.twitter.com/dSGg4ViC9Q— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) May 16, 2026అయితే, ఒక వ్యక్తి సృష్టించిన లోగో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక గుర్తింపుగా పనిచేయకూడదని వాదిస్తూ బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అధికారిక ప్రభుత్వ వినియోగానికి అశోక చిహ్నమే అత్యున్నతమైన మరియు అత్యంత సముచితమైన చిహ్నంగా ఉంటుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. 2017లో 'బిస్వా బంగ్లా' లోగో ఒక రాజకీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అప్పుడు మాజీ బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్, ఆ లోగో ప్రైవేట్ యాజమాన్యంలో ఉందని, అది ప్రభుత్వానిది కాదని ఆరోపించారు. ఈ ఆరోపణలను అభిషేక్ బెనర్జీ ఖండించగా మమతా బెనర్జీ అసెంబ్లీలో ఆ లోగోను తానే స్వయంగా సృష్టించానని, రాయల్టీ వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపయోగించుకోవడానికి అనుమతించానని తరువాత స్పష్టం చేశారు.దాదాపు 13 సంవత్సరాలుగా బిస్వా బంగ్లా చిహ్నం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ గుర్తింపుతో మరియు ప్రజా సంబంధాలతో ముడిపడి ఉంది. అయితే, బీజేపీ ప్రభుత్వం వచ్చాక అధికారిక వ్యవస్థలు మరియు రాష్ట్ర నియంత్రిత వేదికల నుండి ఆ లోగో తొలగించడం ఎంతో కీలకంగా మారింది. ఇది బెంగాల్ రాజకీయ, పరిపాలనా బ్రాండింగ్‌లో ఒక ప్రతీకాత్మక మార్పును సూచిస్తుంది.రాజకీయ ప్రభావంటీఎంసీ గుర్తింపు తొలగింపు: బిశ్వ బంగ్లా లోగో తొలగించడం ద్వారా టీఎంసీ పాలనలో ఏర్పడిన గుర్తింపును తొలగిస్తున్నారు.బీజేపీ సంకేతం: అశోక స్తంభం ప్రవేశపెట్టడం ద్వారా జాతీయ చిహ్నాన్ని రాష్ట్ర గుర్తింపుగా మార్చి, “సాఫ్రన్ బ్రాండింగ్”ను బలపరుస్తోంది.సాంస్కృతిక ప్రభావం: దుర్గాపూజ వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బీజేపీ ప్రభావం పెరుగుతుందని అంచనా. -
పొదుపా పాడా.. మోదీ వసూళ్లు మొదలయ్యాయి
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు చెప్పడంతో సామాన్యుడిపై పిడుగు గ్యారెంటీ అనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్లే.. మొన్న కమర్షియల్ గ్యాస్.. నిన్న పాలు, కూరగాయలు.. రేట్లు పెరుగుతూ వచ్చాయి. తాజాగా.. ఇంధన ధరలు పెరగడంతో విపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎన్నికలు కావడంతో ప్రధాని మోదీ వసూళ్లు మొదలుపెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. మోదీని ద్రవ్యోల్బణం మనిషి(Mehngai Man Modi)గా అభివర్ణిస్తూ.. ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మండిపడింది. ఇంధన పొదుపు పేరిట కొత్త డ్రామాలకు తెర తీశారని.. విదేశీ ప్రయాణాలు వద్దంటూనే ఇప్పుడు ఆయనే విదేశాలకు వెళ్లాడని ఆ పార్టీ కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శలు గుప్పించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పెరుగుదలను దయనీయమైన పరిస్థితిగా పేర్కొంది. అదే సమయంలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తుందా? అని ప్రశ్నించింది. మరోవైపు.. కేంద్రంలోని బీజేపీ సర్కాన్‌ను సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశారు. పెట్రోల్ రేట్లు పెరగడం.. సైకిల్(సమాజ్‌వాదీ గుర్తు)నే భవిష్యత్తు అంటూ కార్టూన్ షేర్ చేశారు.దేశవ్యాప్తంగా పెట్రో రేట్లు తప్పవనే ఊహాగానాలు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికలయ్యాక అది ఉండొచ్చని అంతా భావించారు. ఈ మధ్యలో పెంపు వార్తలను కొట్టేసిన కేంద్రం.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతూ వస్తోంది. అయితే ఎన్నికలయ్యాక ప్రధాని మోదీ ఇంధన పొదుపు వ్యాఖ్యలు చేయడం.. ఆ వెంటనే కేంద్ర పెట్రోలియం శాఖ సైతం పెంపు తప్పదనే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ పెట్రోల్, డీజిల్‌పైన రూ.3 చొప్పున పెంపును ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. -
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది? తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తిపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.అన్నాడీఎంకేలో అలజడితమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్ను షణ్ముగం మంగళవారం కలిశారు.అస్సాంలోనూ అసంతృప్తిఅస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్ గోగోయి సిబ్సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్‌కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
మమతను ముంచిన ముస్లింలు.. BJPని గెలిపించిన హిందూ ఓటు బ్యాంకు
-
మమతా వారసత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం
కోల్‌కతా: సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే.. గత పాలన తాలూకు ఆనవాళ్లు చెరిపేయడం, లేదంటే ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేసి తామే చేశామని చెప్పుకునే ఈ రోజుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం మమతా బెనర్జీ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.దీదీ ప్రభుత్వం 2021లో మహిళా సాధికారత పథకం లక్ష్మీర్ బండార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద అర్హులైన 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీలకు నెలకు రూ.1200, సాధారణ వర్గాలకు రూ.1000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేవారు.ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి రాగా.. ఆ రాష్ట్రానికి తొమ్మదవ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేపట్టారు. పాలనలో తనదైన మార్క్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారు.సోమవారం పశ్చిమ బెంగాల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో లక్ష్మీర్ బండార్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ అమలు చేసిన లక్ష్మీర్ బండార్లాంటి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.దీంతో పాటు ఎన్నికల్ని సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ బీజేపీ కార్యకర్తకు నివాళులర్పించారు. -
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్.. ఇకపై..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది.కాగా, ఈవీఎంల మానిప్యులేషన్, హింస ద్వారా పశ్చిమ బెంగాల్లో ప్రజా తీర్పును మార్చారంటూ బీజేపీ, భారత ఎన్నికల కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు.బెనర్జీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అగర్వాల్‌తో పాటు ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ నరియాలాను కూడా గవర్నర్‌ను కలిశారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. “భారత ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 172ను ప్రస్తావిస్తూ, లోక్ భవన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో మే 6 అర్ధరాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చని చెప్పారు. -
బెంగాల్ ట్విస్ట్: దీదీకి సరికొత్త టెన్షన్!
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరో మలుపు తిరిగింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గిందంటూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్ హత్యకు గురి కావడంతో రాజకీయ దుమారం రేగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం రద్దుమమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం!9న పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం దర్యాప్తు ముమ్మరంసువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంఘటనాస్థలి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకిమధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులుకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్ పక్షపాతం లేకుండా విచారణ జరగాలన్న తృణమూల్అందుకే నా పీఏను చంపారు: సువేందునా పీఏ చంద్రనాథ్ రాథ్ హత్యకు కారణాలు ఉన్నాయిఆయన నా కార్యనిర్వాహక సహాయకుడిగా ఉండటమే హత్యకు కారణంభవానీపూర్లో మమతా బెనర్జీని నేను ఓడించడమూ ఓ కారణంనా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తిస్తాను: సువేందుమమతకు కొత్త తలనొప్పి!ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ దీదీ ప్రకటనతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్ రాజకీయాలు నేటితో బెంగాల్ అసెంబ్లీ గడువు పూర్తిఆటోమేటిక్గా రద్దు కానున్న టీఎంసీ సర్కార్ఈలోపు.. మరో ట్విస్ట్!టీఎంసీ భేటీకి డుమ్మా కొట్టిన 10 మంది కొత్త ఎమ్మెల్యేలుపార్టీలో జోష్ నింపేందుకు భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ80 మందికిగానూ 70 మందే హాజరుచీలిక ఏర్పడిందా అనుమానాలుపార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారంఆ ఊహాగానాలను తోసిపుచ్చిన టీఎంసీ గైర్హాజరుపై ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడితాజా పరిణామాలపై బీజేపీ సైలెన్స్ ఆ పిస్టోల్ అక్రమంగా వచ్చిందే!బెంగాల్లో సంచలనంగా సువేందు అధికారి పీఏ హత్య కేసుసువేందు పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యబుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో కాల్పులు జరిపిన దుండగులుఅక్కడికక్కడే కారులో కుప్పకూలిన చంద్రనాథ్చంద్రనాథ్ రథ్ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా వచ్చిందే!హత్యకు ఆస్ట్రియా మేడ్ తుపాకీ వాడిన దుండగలుతుపాకీని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తింపునిందితులను ట్రేస్ చేసే పనిలో కోల్‌కతా పోలీసులుమమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలుఈ నెల 9న బెంగాల్ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంసీఎం ఎంపిక.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై దృష్టి పెట్టిన బీజేపీటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలుమే 4వ తేదీన వెలువడ్డ బెంగాల్ ఫలితాలుఫలితాల్లో బీజేపీ ఘన విజయంసీఎం పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయని మమతా బెనర్జీదేశ రాజకీయాల్లో.. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేయలేదు!సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చేసిన దీదీఏం చేసుకుంటారో చేస్కోమంటూ తాజాగా మరోసారి సవాల్కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి అంటూ వ్యాఖ్యసీఎంగా ఎవరైనా ప్రమాణం చేస్తే.. ఆ రోజును బ్లాక్‌డేగా పాటిస్తామని ప్రకటనమరోవైపు.. ఇప్పటికే ముగిసిన బెంగాల్ అసెంబ్లీ గడువురాజ్యాంగం ప్రకారం.. రద్దైన మమతా బెనర్జీ సర్కార్అయినా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానంటున్న మమతా బెనర్జీఎవరీ చంద్రనాథ్?చంద్రనాథ్ రథ్.. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయ సహాయకుడుచంద్రనాథ్ వయసు 41 ఏళ్లు.. స్వస్థలం మేదినిపూర్ జిల్లా చందిపూర్ రహారా రామకృష్ణ మిషన్‌లో చదివిన చంద్రనాథ్ దాదాపు రెండు దశాబ్దాలు భారత వాయుసేనలో సేవలుఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన.. ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ కొంతకాలం రామకృష్ణ మిషన్‌లో సేవలందించిన చంద్రనాథ్ ఆపై కార్పొరేట్ రంగంలో పనిచేసి.. అక్కడ నుంచి పొలిటికల్ కన్సల్టెన్సీలో విధులు తృణమూల్ కాంగ్రెస్‌తో చంద్రనాథ్ కుటుంబానికి అవినాభావ సంబంధంసువేందు అధికారి బీజేపీలో చేరాక.. ఆయన వెంటే చంద్రనాథ్సువేందు కోసం బీజేపీ తరఫున కీలకంగా పని చేసిన చంద్రనాథ్అధికారి సువేందు ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, లాజిస్టిక్స్ వంటి సున్నితమైన పనులను హ్యాండిల్ చేసిన చంద్రనాథ్తాజా విజయంతో.. బీజేపీ చంద్రనాథ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్తుందనే ఊహాగానాలు ఈలోపే.. చంద్రనాథ్ దారుణ హత్యబెంగాల్ను కుదిపేస్తున్న హత్యారాజకీయాలు ఉత్తర 24 పరగణాలో దారుణ హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందు పీఏ చంద్రనాథ్తన నివాసానికి వెళ్తున్న టైంలో బైక్ మీద వచ్చి కాల్చి చంపిన దుండగులుఅక్కడికక్కడే మృతి చెందిన చంద్రనాథ్.. డ్రైవర్ పరిస్థితి విషమంటీఎంసీపై బీజేపీ ఆరోపణలు.. ఆరోపణలను ఖండించిన టీఎంసీఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసహింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మృతిఈసీ సీరియస్బెంగాల్లో హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. వరుసగా దాడులు, హత్యలుఇప్పటికే పలువురు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులుహత్యకు గురైన పలువురు!బెంగాల్ పోలీస్ శాఖపై ఈసీ ఆగ్రహంశాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని ఆదేశంఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశం #WATCH | North 24 Parganas | On Suvendu Adhikari's PA Chandra shot dead in Madhyamgram, BJP leader Sajal Ghosh says, "He had no enemies and was a cheerful boy. This was destined for him just because he worked for Suvendu... This is Bengal... 5 bullets were shot... I have been… pic.twitter.com/X6rFpnDzyZ— ANI (@ANI) May 6, 2026టీఎంసీ స్పందన ఇదే.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదుచంద్రనాథ్ హత్యను ఖండిస్తున్నాంఆ హత్యతో మాకు సంబంధం లేదుదోషులెవరైనా కఠినంగా శిక్షించాలికోడ్ అమల్లో ఉండగా హింస దురదృష్టకరంచంద్రనాథ్ హత్యపై సీబీఐ విచారణ జరగాలి పీఏ హత్యపై సువేందు రియాక్షన్మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై సంచలన ఆరోపణలుఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారి సువేందుపక్కా ప్లాన్‌తోనే నా పీఏను మత్య చేశారుహత్య వెనుక మమతా మేనల్లుడి ప్రమేయం ఉంది సువేందు పీఏ దారుణ హత్యబీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పీఏ దారుణ హత్యచంద్రనాథ్ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులుమధ్యమ్గ్రామ్లో హత్య చేసిన దుండగులుకారులో వెళ్తుండగా కాల్చివేతనాలుగు రౌండ్ల కాల్పులుఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లి కారులోనే కుప్పకూలిన చంద్రనాథ్కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలూ.. పరిస్థితి విషమంSTORY | Bengal BJP leader Suvendu Adhikari's personal assistant shot deadBJP leader Suvendu Adhikari's personal assistant was shot dead by unidentified assailants in West Bengal's North 24 Parganas district, party sources said. The incident took place at Doharia in Madhyamgram… pic.twitter.com/oMET6SQm8w— Press Trust of India (@PTI_News) May 6, 2026 -
బెంగాల్లో టెన్షన్.. మమతకు తొలి షాక్
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. బెంగాల్లో బీజేపీ ఘన విజయం అందుకుంది. అయితే, ఫలితాల అనంతరం, బెంగాల్లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి తృణముల్ కాంగ్రెస్ యూనియన్ ఆఫీసుకు బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. దీంతో, బెంగాల్లో బుల్డోజర్ల అంశం చర్చనీయాంశంగా మారింది.వివరాల మేరకు.. బెంగాల్‌లోని చారిత్రక హాగ్ మార్కెట్ (న్యూ మార్కెట్) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్ల గర్జన మొదలైంది. బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు టీఎంసీ యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేశారు. టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు ఈ ఘటనలో పూర్తిగా నేలమట్టమైంది. దీంతో భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు.అయితే, బుల్డోజర్ కూల్చివేతపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై టీఎంసీ నేతలు స్పందిస్తూ.. ఇదే బీజేపీ అసలు రూపం. బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కోల్‌కతాలోని చారిత్రక న్యూ మార్కెట్.. బెంగాలీలు ఈ పరివర్తనాన్ని ఆస్వాదిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర బలగాలు (CAPF) అక్కడ చూస్తుండగానే, బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా మాంసం దుకాణాలను కూల్చడానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు అంటూ ఆరోపించారు. బెంగాల్లో ఈ ‘బుల్డోజర్ రాజకీయాలను’ అడ్డుకుంటామని నేతలు స్పష్టం చేశారు.Bulldozers are rolling across West BengalBJP is clearing West Bengal by demolishing illegal TMC party offices and shops in the New Market area pic.twitter.com/bHqlrjWa4X— Surajit (@surajit_ghosh2) May 5, 2026అనంతరం, పార్టీ ఆఫీసు కూల్చివేతపై టీఎంసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్బంగా టీఎంసీ..‘ఇది బీజేపీ మద్దతుదారుల గూండాయిజం, వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. బీజేపీ అగ్రనేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయితే, ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఏది ఏమైనా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే బెంగాల్లో ఇలా బుల్డోజర్లు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
‘‘రాజీనామా చేయకపోతే మమతా బెనర్జీని ఇలా తొలగించొచ్చు’’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు."ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేస్తారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అంతే, ఈ ప్రక్రియ సులభం. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు."మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. ఈ ఫలితం చాలా కాలం క్రితమే రావాలి. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. మీరు 'నేను రాజీనామా చేయను' అంటారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్ఐఆర్ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.కాగా, గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇవాళ రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె తీరు వల్ల ఊహించని పరిస్థితి ఏర్పడింది. "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజ్ భవన్‌కు వెళ్లను. రాజీనామా ఇవ్వను" అని మమతా బెనర్జీ మీడియాతో చెప్పారు.గవర్నర్ సాంకేతికంగా ముఖ్యమంత్రిని తొలగించొచ్చు. అయితే కొన్ని నియంత్రణలు ఉన్నాయి. గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా నిర్దేశించాయి. అసెంబ్లీకి ఉన్న గడువు మే 7. అది పూర్తయ్యేలోపే గెలిచిన పార్టీ ముందుకు వచ్చి “మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని చెబితే.. గవర్నర్ వారిని ఆహ్వానించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. అలా జరిగితే మమతా బెనర్జీని ప్రత్యేకంగా తొలగించే అవసరం ఉండదు. -
దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!
-
భారత రాజకీయాల్లోనే పెను సంచలనం!
పశ్చిమ బెంగాల్.. దశాబ్దాల పాటు వామపక్షాలకు అండగా నిలిచింది. ఆ తర్వాత 'దీదీ' మమతా బెనర్జీని అక్కున చేర్చుకుంది. కానీ, నిన్నటి సోమవారం వెలువడిన ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్రను లిఖించాయి. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ, అసాధ్యమనుకున్న బెంగాల్ కోటను బద్ధలు కొట్టింది. ఇది కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితం కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని తనదైన శైలిలో మార్చాలనుకుంటున్న బీజేపీకి దక్కిన అతిపెద్ద విజయం.పదేళ్ల క్రితం కేవలం 3 సీట్లు ఉన్న బీజేపీ, నేడు 294 స్థానాలకు గాను 208 సీట్లు గెలుచుకోవడం ఒక అద్భుతం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలన కుప్పకూలిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ కోల్పోయి దెబ్బతిన్న బీజేపీకి, ఈ విజయం సంజీవనిలా మారింది. హర్యానా, మహారాష్ట్ర, బీహార్లలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి, బెంగాల్ విజయం కిరీటంలో మణి లాంటిది.ఈ ఎన్నికలు కేవలం గెలుపోటములకే పరిమితం కాలేదు. ఎన్నికల కంటే ముందే దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం పెను దుమారం రేపింది. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఓట్లను లూటీ చేసింది.. ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని 100కు పైగా సీట్లలో మోసానికి పాల్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.రాజకీయ విశ్లేషకులు చెబుతున్నట్లుగా.. మమత ఓటమి ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి గురించి గట్టిగా మాట్లాడే ఒక బలమైన గొంతుక ఇప్పుడు మూగబోయింది. చివరకు తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో కూడా మమత ఓడిపోవడం శోచనీయం. తన పాత మిత్రుడు, ప్రస్తుతం బీజేపీ నేత అయిన సువేందు అధికారి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఆయనే ఇప్పుడు బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి అవినీతి. విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్న ఆరోపణలు, ఇతర కుంభకోణాలు ప్రజల్లో తీవ్ర అసహనాన్ని నింపాయి. రెండోది భద్రత. గతేడాది కోల్‌కతా ఆసుపత్రిలో జరిగిన డాక్టర్ రేప్, హత్య ఉదంతం దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. ఆ బాధితురాలి తల్లిని అభ్యర్థిగా నిలబెట్టిన బీజేపీ, మహిళా ఓటర్ల మద్దతును పూర్తిగా తనవైపు తిప్పుకుంది. దీదీ మంచిదే కానీ, ఆమె పార్టీ అవినీతిమయం.. పరిశ్రమలను తరిమేశారు అన్న సామాన్యుడి మాటలే బెంగాల్లో ప్రతిధ్వనించాయి. సెక్యులరిజం వర్సెస్ హిందూత్వ ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా, లౌకికవాదానికి, కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న బెంగాల్, ఇప్పుడు హిందూత్వ రాజకీయాల వైపు మొగ్గు చూపడం దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు. మమత బెంగాలీ సంస్కృతిని రక్షించాలని పిలుపునిచ్చినా, ప్రజలు మాత్రం ఉద్యోగాలు మరియు అభివృద్ధికే ఓటు వేశారు.దక్షిణాది రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడూ ఒక ఉద్వేగభరితమైన ప్రయోగశాలే. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత శూన్యంగా మారిన ఆ గడ్డపై, ఇప్పుడు 'దళపతి' విజయ్ ఒక ఆశగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ఒక రాజకీయ నూతన విదేశీయుడిగా అడుగుపెట్టి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల పునాదులను కదిలించడం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ విజయం వెనుక విజయ్ పడ్డ సంఘర్షణ అంతా ఇంతా కాదు. గ్లామర్, అధికారం మధ్య ఆయన నలిగిపోలేదు. అటు ప్రజల ఆకాంక్షలకు, ఇటు తన వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న సన్నని గీతపై నడుస్తూ ఈ ఘనత సాధించారు. సొంత కుటుంబం తన రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మానసికంగా ఎంతో కుంగదీశాయి. కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తి, పేరు ప్రఖ్యాతుల గొడవలు బహిరంగమైనప్పుడు, శత్రువులు ఆయనను విమర్శించడానికి అస్త్రాలుగా వాడుకున్నారు. కానీ, తన ఇంట్లో రగులుతున్న ఆ వేదనను దిగమింగుకుని, బయట ప్రజల కోసం నిలబడ్డ విజయ్ తీరు చూసి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. ఆయన గెలుపు వెనుక కేవలం స్టార్డమ్ మాత్రమే లేదు, ఒంటరిగా నిలబడి పోరాడిన ఒక వ్యక్తి తాలూకు నిశ్శబ్ద ఆవేదన కూడా ఉంది.ఇక చివరగా, కేరళం,అక్కడ రాజకీయాల గురించి చెప్పాలంటే అది ఎప్పుడూ ఎల్.డి.ఎఫ్, యు.డి.ఎఫ్ మధ్య సాగే హోరాహోరీ పోరాటం. కానీ, ఈసారి దేవుడి సొంత గడ్డపై కమలం పువ్వు వికసించిన తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కమ్యూనిస్ట్ భావజాలం బలంగా ఉన్న కేరళలో, బిజెపి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం అంటే అది ఒక భావజాల విప్లవమే అని చెప్పాలి. క్రైస్తవ మైనారిటీలతో చేతులు కలుపుతూ, మోదీ గ్యారంటీ ని కేరళంలో ఇంటింటికి తీసుకెళ్లడంలో ఆ పార్టీ సఫలమైంది. పశ్చిమ బెంగాల్లో సాధించిన భారీ విజయంతో పోలిస్తే కేరళలో వచ్చిన ఓట్ల శాతం అతి తక్కువే కావొచ్చు, కానీ కేరళ ఓటరు మదిలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ముద్ర వేయడం మాత్రం ఆ రాష్ట్ర భవిష్యత్తు రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతం. అజేయమైన కోటలుగా భావించిన నియోజకవర్గాల్లో కూడా బిజెపి ఓట్ల శాతం పెరగడం చూస్తుంటే, కేరళలో మార్పు మొదలైందని స్పష్టమవుతోంది.మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై ఒక నూతన శకాన్ని ఆవిష్కరించాయి. అజేయమని భావించిన మమతా బెనర్జీ సామ్రాజ్యం కూలిపోవడం, అస్సాం నుంచి కేరళ దాకా బీజేపీ తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కేవలం ఒక పార్టీ గెలుపు మాత్రమే కాదు.. అది దేశంలో మారుతున్న సామాన్యుడి ఆకాంక్షలకు నిదర్శనం. ప్రాంతీయ భావోద్వేగాలు, సంస్కృతి పేరుతో చేసే రాజకీయాల కంటే అభివృద్ధి, భద్రత, అవినీతి రహిత పాలనే ముఖ్యమని ఓటరు తీర్పునిచ్చాడు. అటు తమిళనాడులో విజయ్ వంటి కొత్త తరం నాయకుల రాక, ఇటు బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలు.. వెరసి 2026 నాటి ఈ రాజకీయ చిత్రం దేశ భవిష్యత్తును సరికొత్త తీరాలకు తీసుకెళ్లేలా కనిపిస్తోంది. పాత వ్యవస్థలు పోయి, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసం పెరిగేలా ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ పక్షాలు ఎలా గౌరవిస్తాయో వేచి చూడాలి. -
టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్ సంబురాలు.. రాహుల్ చురకలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్ డిజిట్ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. .. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్ హితవు పలికినట్లు సమాచారం. అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీదీకి మద్దతుగా.. బెంగాల్లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఏకీభవించారు. బెంగాల్‌తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్ మేనిప్యులేషన్ ప్లేబుక్”లో భాగమని ఆయన ఆరోపించారు. -
భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి
కోల్‌కతా: భవానీ పూర్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. మమతాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ సందర్భంగా తన ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు. సర్పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏంజెట్లను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. పార్టీ ఏజెంట్లను అనుమతి ఇస్తామని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వచ్చిన తర్వాత డీవో ఇక్కడ లేరు అని వాపోయారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండవ సీఎంగా మమతా బెనర్జీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. -
పవర్ పోయింది.. దీదీ పాలనకు చరమగీతం..
-
మమతా బెనర్జీ పార్టీని దెబ్బ తీసిన ‘ఎం’
పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు బ్రేక్ వేస్తూ.. భారీ ఆధిక్యం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. ట్రెండ్స్ ప్రకారం.. డబుల్ సెంచరీకి చేరువగా ఆధిక్యంలో కొనసాగుతూ అధికార కైవసం దిశగా పయనిస్తోంది. టీంఎసీ 100 లోపే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిందనేదానిపై విశ్లేషణలు నడుస్తున్నాయి. ‘‘బెంగాల్ మళ్లీ గెలుస్తుంది’’.. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి ఆహారపు అలవాట్లను కూడా మారుస్తారు’’ అంటూ ఈ మమతా బెనర్జీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారాన్ని అక్కడి ఓటర్లు సున్నితంగా తిరస్కరించారు. మార్పు అవసరం అనే బీజేపీ నినాదానికి పట్టం కట్టారు. అయితే.. వీటితో పాటు ‘ఎం’(M) అనే ఫ్యాక్టర్ కూడా టీఎంసీ ఓటమికి ఓ కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. M.. మహిళలు: గత మూడు టర్మ్‌లు టీఎంసీ విజయానికి మహిళలు ప్రధాన కారణం. అయితే ఆర్జీకర్ ఘటన, సందేశ్‌ఖాళి వివాదం మహిళలపై భద్రతపై నీలి నీడలు కమ్మేలా చేశాయి. బీజేపీ ఈ అంశాలను ఉపయోగించుకుంది. ఆర్టీకర్ బాధితురాలి తల్లిని ఏకంగా ఎన్నికల బరిలో దింపింది. మహిళా సెంటిమెంట్‌ను బీజేపీ ఓట్లుగా మార్చుకుంది. M.. ముస్లింలు: బెంగాల్లో టీఎంసీ సంప్రదాయంగా మైనారిటీ ఓటు బ్యాంక్‌పై ఆధారపడింది. ఆ జనాభాలో 27 శాతం టీఎంసీ మద్దతుగా ఉండేది. అయితే.. ఎన్ఆర్సీ, యూసీసీ భయాలు.. అలాగే ఓటర్ల జాబితా (SIR) వివాదం ఈసారి ముస్లిం ఓటు ధోరణిని ప్రభావితం చేసింది. అంతేకాదు.. ముస్లిం ప్రాబల్యం ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ లలో ముస్లిం ఓట్లలో చీలిక ఏర్పడిందని.. బీజేపీకి ఇది బాగా కలిసొచ్చిందని చెబుతున్నారుM.. (మైగ్రేంట్స్.. వలసదారులు): ఇతర రాష్ట్రాల్లో పనిచేసే వలస కార్మికులు తిరిగి వచ్చి ఓటు వేశారు. ఓటర్ల జాబితాలో పేరు ఉండాలంటే తప్పనిసరిగా ఓటు వేయాలని భావించారు. వీరి ఓటు ధోరణి ఎన్నికల్లో కీలకంగా మారింది. ఈ క్రమంలోనే బెంగాల్ చరిత్రలోనే.. భారీగా పోలింగ్ నమోదు అయ్యింది.. M.. (మటువా కమ్యూనిటీ): రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న ఈ సామాజిక వర్గం.. బీజేపీకి బలమైన మద్దతు ఇచ్చింది. ఈ ఓటు టీఎంసీకి పెద్ద దెబ్బగా మారింది.M.. (మెషినరీ.. బీజేపీ యంత్రాంగం): టీఎంసీ కేవలం తన ప్రచారం మీదే ఆధారపడింది. స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించలేకపోయింది. కానీ, బీజేపీ మాత్రం కేంద్రం నుంచి భారీ స్థాయిలో ప్రచార యంత్రాంగం, నాయకులను రప్పించుకుంది. ర్యాలీలు, రోడ్‌షోలు, సభలు నిర్వహించింది. ఇది ఎన్నికల్లో BJPకి బలమైన ప్రోత్సాహం ఇచ్చింది. తద్వారా ఓటర్లపై ప్రభావం చూపించింది. M.. (మోదీ): ప్రధాని మోదీ వ్యక్తిత్వం, దఫదఫాలుగా చేసిన సుదీర్ఘ ప్రచారం, ప్రసంగాలు కమలం పార్టీకి బాగా కలిసొచ్చాయి. చివరగా.. M.. (మమతా బెనర్జీ): మమతా బెనర్జీ వ్యక్తిత్వం, “మా మట్టి మనుష్” భావోద్వేగ పిలుపు టీఎంసీకి బలాన్ని ఇచ్చింది. కానీ, ఇది ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ప్రతిపక్ష బీజేపీ ఆమెపై అవినీతి, హింసా, శాంతి భధ్రతలు క్షీణించడం.. తదితర అంశాలతో దాడి చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత నాడి పట్టుకుని సరికొత్త పాలనా వాగ్దానాలకు చేసింది. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అంతేకాదు..ఈ 2026 ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ వంటి పార్టీలతో ఓటు విభజన జరిగింది. ఇది కీలక నియోజకవర్గాల్లో టీఎంసీకి భారీ నష్టం కలిగించింది. వీటికి తోడు.. బెంగాల్లో కేంద్రం జోక్యం తగదంటూ గత ఐదేళ్లుగా మమతా బెనర్జీ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సవరణలో దాదాపు 91 లక్షల ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి దిగారు. అయితే టీఎంసీపై ఇవేవీ ప్రజల్లో సింపథీని రాబట్టలేకపోయాయి. -
బెంగాల్ లో టీఎంసీ ముందంజ
-
బెంగాల్లో బీజేపీ ముందంజ!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్‌లో కాసేపు టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగింది. అయితే ఈ రేసులో టీఎంసీ వెనకబడిపోయింది. బీజేపీ అగ్రనేతలు కౌంటింగ్‌లో జోరు చూపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలంతా ముందంజలో ఉన్నట్లు సమాచారం. సువేందు అధికారి, నిశిత్ ప్రామాణిక్ (మథాభంగా (SC)), రేఖా పత్రా (హింగల్గంజ్ (SC)), రత్నా దేవనాథ్(పనిహాటి), అనందమయ్ బర్మన్(మాటిగారా–నక్సల్బరి), శిఖా చటర్జీ(డాబ్‌గ్రామ్–ఫుల్బారి), శంకర్ ఘోష్ (సిలిగురి) అంతా ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే భవానీపూర్‌లో మాత్రం ఆసక్తికర పోరు నడుస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపు ముందంజలో కొనసాగారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర చీఫ్ సువేందు అధికారి లీడ్‌లోకి వచ్చారు. నందిగ్రాంలోనూ ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ లీడ్‌తో బీజేపీ శ్రేణుల్లో సంబురాలకు సిద్ధమయ్యాయి. ఈ ఎన్నికలు మమతా వర్సెస్ జనతా అని.. ప్రజల్లో ఆమెపై ఉన్న కోపం విస్పష్టమని బీజేపీ అంటోంది. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు 148 స్థానాలు అవసరం. అయితే ఒక నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా 293 స్థానాలకుగానూ 147 సీట్లు కైవసం చేసుకుంటే సరిపోతుంది. -
సుప్రీం కోర్టులో టీఎంసీకి ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా కేంద్ర ఉద్యోగులను నియమించడంపై అభ్యంతరాలతో ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను శనివారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. మైక్రో అబ్జర్వర్లు ఎంపిక విషయంలో కేంద్రం ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా కోర్టు పూర్తిగా సమర్థించింది. ‘‘రాష్ట్రమైనా.. కేంద్రమైనా.. ప్రభుత్వ ఉద్యోగులు వారి విధుల్లో భాగంగానే పని చేస్తారు. వారికి ఎలాంటి విధేయతలు ఉండవు. మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉండడంలో తప్పేముంది?. ఆ ఎంపికలో పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. సిబ్బంది నియామకంపై రాజకీయ పార్టీలను ఈసీ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయం చేయడం తగదు’’ అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కౌంటింగ్ సూపర్వైజర్లుగా ఉన్న రాష్ట్ర ఉద్యోగులను తప్పించి ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించారంటూ ఈసీపై టీఎంసీ ఆరోపణలకు దిగింది. అయితే ఈసీ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. కేంద్ర ఉద్యోగులతో పాటు రాష్ట్ర ఉద్యోగులు కూడా కొనసాగుతారని స్పష్టం చేసింది. అయినప్పటికీ టీఎంసీ పార్టీ శుక్రవారం కోల్‌కతా హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. అయితే ఇక్కడ కూడా మమతా బెనర్జీకి బిగ్ షాకే తగిలింది. ఈ విషయంలో ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమంటు సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.పశ్చిమ బెంగాల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో పోలింగ్ శాతం నమోదుకాగా.. కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు. అయితే రెండో విడత పోలింగ్ తర్వాత అధికార టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ధర్నాకు దిగింది. అయితే ఆ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
సుప్రీంకోర్టుకు టీఎంసీ.. ఓట్ల కౌంటింగ్ టెన్షన్ షురూ..
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మే 4న ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ సూపర్ వైజర్లు, సహాయకులుగా కేవలం కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ ఉద్యోగులను మాత్రమే నియమించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేసి.. అత్యవసర విచారణ కోరింది. న్యాయమూర్తులు పీఎస్ నరసింహా, జోయ్‌మాల్య బాగ్చీతో కూడిన ప్రత్యేక ద్విసభ్య బెంచ్ శనివారం కేసును విచారించనుంది.రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో టీఎంసీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. బయటి నుంచి వచ్చిన పరిశీలకులు, బెంగాల్‌కు పరిచయంలేని పోలీసు సిబ్బంది అంతా టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా పెట్టుకుని నియమితులైనవారేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. రెండో దశ పోలింగ్ సమయంలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఆ ఉద్యోగిఇటీవల పశ్చిమ బెంగాల్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ఒక ప్రకటన జారీ చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్ లేదా సహాయకుల్లో కనీసం ఒకరు కేంద్ర ప్రభుత్వం లేదా పీఎస్‌యూ ఉద్యోగి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఆదేశాన్ని టీఎంసీ సవాలు చేసింది. ఇలాంటి ఆదేశం ఎన్నికల కమిషన్ మాత్రమే జారీ చేయగలదని, అదనపు సీఈఓకు ఆ అధికారం లేదని ‘లైవ్ లా’ వెబ్సైట్ నివేదించింది.ఎన్నికల కమిషన్ హ్యాండ్‌బుక్‌లో కౌంటింగ్ సూపర్వైజర్, సహాయకులుగా కేంద్ర సిబ్బంది తప్పనిసరి అని చెప్పలేదని పార్టీ వాదించింది. మైక్రో పరిశీలకులను సాధారణంగా కేంద్ర సేవల నుంచి తీసుకున్నప్పటికీ, అదే నిబంధనను కౌంటింగ్ సిబ్బందికి కూడా తీసుకురావడం పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే ప్రత్యేకమా? అని టీఎంసీ అడిగింది.పక్షపాత ధోరణి కనబర్చే అవకాశం ఉందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ అధీనంలో ఉండటం వల్ల కేంద్ర ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, దాంతో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని పేర్కొంది.ముందు టీఎంసీ కలకత్తా హైకోర్టుకు వెళ్లగా ఆ పార్టీ చేసిన ఈ వాదనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్నికల కమిషన్ హ్యాండ్‌బుక్ ప్రకారం కౌంటింగ్ సిబ్బందిని కేంద్ర లేదా రాష్ట్ర సేవల నుంచి నియమించవచ్చని పేర్కొంది. సిబ్బంది ఎంపిక ఎన్నికల అధికారుల స్వేచ్ఛాధికార పరిధిలోకి వస్తుందని ‘లైవ్ లా’ తెలిపింది.‘పక్షపాతం’ అంటూ చేసిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, కౌంటింగ్ ప్రక్రియలో ఇప్పటికే అనేక రక్షణ చర్యలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. మైక్రో పరిశీలకులు, అభ్యర్థులు నియమించిన కౌంటింగ్ ఏజెంట్లు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. టీఎంసీ వ్యక్తం చేసిన అనుమానాలకు ఆధారాలు లేవని చెప్పింది.ఇలాంటి ఎన్నికల సంబంధిత సవాళ్లపై గత విచారణలను హైకోర్టు ప్రస్తావించింది. కేవలం అనుమానం ఆధారంగా న్యాయ జోక్యం సాధ్యం కాదని హైకోర్టు పేర్కొని పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో టీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.రెండో దశ పోలింగ్ సమయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. టీఎంసీ, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పలు నియోజకవర్గాల్లో ప్రత్యర్థి అనుచరుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల పెంపుపై అధికార పార్టీ విమర్శలు చేసింది. -
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద టీఎంసీ ధర్నా
కోల్‌కతా: ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ అభ్యర్థులు కునాల్ ఘోష్, శశి పంజా గురువారం ధర్నాకు దిగారు. ఖుదీరాం అనుశీలన్ కేంద్రలోని స్ట్రాంగ్‌రూంలో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఇక్కడ బుధవారం రెండో విడత పోలింగ్ ముగియడం తెల్సిందే. ‘స్ట్రాంగ్ రూం వద్ద బైటాయించిన తమను అధికారులు మధ్యాహ్నం అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. సాయంత్రం 4 గంటలకు స్ట్రాంగ్‌రూంలను తిరిగి తెరుస్తామంటూ ఆ తర్వాత మాకు సమాచారమిచ్చారు’అని కునాల్ ఘోష్ తెలిపారు. ‘దీంతో, మా కార్యకర్తలంతా వెళ్లిపోయారు. మళ్లీ తెరుస్తామని సమాచారమివ్వడంతో హడావుడిగా తిరిగి వచ్చేశాం. ఇప్పుడేమో మమ్మల్ని రానివ్వడం లేదు. బీజేపీ నేతలకు మాత్రం అనుమతిచ్చారు’అని ఆయన ఆరోపించారు. ‘బ్యాలెట్ పేపర్లను లోపలకు తీసుకెళ్లారు. లైవ్‌లో ఇదంతా కనిపిస్తూనే ఉంది. అయిన్పటికీ, ఏమీ జరగడం లేదని సీఈవో అంటున్నారు’అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవానీపూర్ స్ట్రాంగ్‌రూంలో మమత తన నియోజకవర్గం(భవానీపూర్) ఈవీఎంలను భద్రపరచిన షకావత్ స్కూల్ వద్దకు సీఎం మమత సాయంత్రానికల్లా చేరుకు న్నారు. అవకతవకలు జరిగే ఆస్కారముందన్న అనుమానంతో తన ఎన్నికల ఏజెంట్‌తోపాటు స్ట్రాంగ్‌రూంలోకి వెళ్లి అక్కడే కూర్చున్నారు. -
ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చిన మమతా..226 సీట్లు మా వశం!
ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తలకిందులు చేస్తూ మే 4న విడుదల కానున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై గురువారం ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఢీలా పడ్డ టీఎంసీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోశారు.ఆ వీడియోలో దీదీ మాట్లాడాతూ.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లకు మించి గెలుస్తుంది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, ఫలితాలు దానికి సాక్ష్యం చెబుతాయి’అని అన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ తన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. బీజేపీ తరఫున ఎగ్జిట్ పోల్స్‌లో చూపిన ఆధిక్యం కేవలం మానసిక ఒత్తిడి సృష్టించడానికే అని ఆమె ఆరోపించారు.ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒకవైపు బీజేపీకి ఆధిక్యం చూపుతున్నప్పటికీ,మమతా బెనర్జీ ధైర్యవంతమైన ప్రకటన మరోవైపు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ఫలితాలు వెలువడే వరకు ఈ పోటీ ఉత్కంఠ భరితంగా కొనసాగనుంది. -
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్.. బెంగాల్ వారిదే.. తమిళనాడులో..?
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థ టుడేస్ చాణుక్య విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ 192 సీట్లను కైవసం చేసుకుంటుందని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఓటమి ఖాయమని పేర్కొంది.ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, బీజేపీకి 48 శాతం ఓటు షేర్‌తో 192 సీట్లు, టీఎంసీకి 38 శాతం ఓటు షేర్‌తో 100 సీట్లు, ఇతరులకు 14 శాతం ఓటు షేర్‌తో 2 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది.అదే సమయంలో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తుందని టుడేస్ చాణుక్య అంచనా వేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 39 శాతం ఓటు షేర్‌తో 125 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. విజయ్ పార్టీ 30 శాతం ఓటు షేర్‌తో 63 స్థానాలు సాధిస్తుందని, మరో 10 స్థానాల్లో ఎడ్జ్‌లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-బీజేపీ అలయన్స్ నిరాశ చెందుతుందని, 27 శాతం ఓటు షేర్‌తో 45 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వేలో తేల్చింది. -
బెంగాల్లో ఈ సారి జెండా వారిదే.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?
పశ్చిమబెంగాల్లో రికార్డులు బద్దలయ్యాయి. స్వాత్యంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పోలింగ్ శాతం జరిగిన ఎన్నికలుగా పశ్చిమబెంగాల్ ఎన్నికలు రికార్డుల్లోకెక్కాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రానే వచ్చాయి. చాణక్య స్ట్రాటజీ ఎగ్జిట్ పోల్స్టీఎంసీ-130-140బీజేపీ- 150-160 కాంగ్రెస్2-4పీమార్క్ ఎగ్జిట్ పోల్స్TMC 118-138BJP 150-175CONG 2-6దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పై చేయి సాధిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది.పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ సర్వే పూర్తి వివరాలురాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలుండగా అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు.అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2, గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది.టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం,ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాయ్గురి డివిజన్లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఈ డివిజన్లో బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్‌లో బలహీనంగా ఉంది. ఇక్కడ దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది..మైనార్టీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని ప్రెసిడెన్సీ డివిజన్లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్‌కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పై చేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది. సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజిక వర్గం ‘సర్’ పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు. ముస్లిం సామాజిక వర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు.అని సర్వే చెబుతోంది.రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు.‘సర్’ తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది. టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ జాతీయ వాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఏవరూ లేరు. కాగా స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్ల పాటు అధికారం కట్టబెడితే, ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి. బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది. కాగా ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే చాలా సార్లు ఇవి తారుమారైన సందర్బాలున్నాయి. వాస్తవిక ఫలితాలు మే 4న ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. మమతా బెనర్జీ ఓటమి ఖాయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానిపూర్ చక్రబేరియా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు, ఒకప్పుడు ఆమెకు అత్యంత సన్నిహితుడైన సువేందు అధికారి ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తమైంది.స్థానిక టీఎంసీ నాయకులను బెదిరిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ పార్టీ కార్యాలయం బయట కూర్చుని ఉండగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సువేందు అధికారి ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకి ఒక్క ఓటు పడటం లేదని మమతా బెనర్జీ గ్రహించారు’ అని ఆయన ఆరోపించారు. మరోవైపు మమతా బెనర్జీ, కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారులను ఉపయోగించి బీజేపీ ఎన్నికలను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.ఈ సందర్భంగా సువేందు అధికారి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ భయపడుతున్నారు. ఆమె పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలను నియమించారు. ఇక్కడ ఈసీ సీఏపీఎఫ్‌లను మోహరించింది. ఆమెకు ఏమైనా సమస్య ఉంటే వారిని సంప్రదించాలి. కానీ ఆమెతో పాటు 40-50 మందిని ఎందుకు తీసుకువస్తున్నారు?’అని ప్రశ్నించారు.అలాగే, సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ మమతా యాబై, అరవై మంది గూండాలతో తిరుగుతున్నారు. ఆమె ఒక అభ్యర్థి కాబట్టి బూత్‌లను సందర్శించవచ్చు. కానీ ఈ గూండాగిరి ఎందుకు? నేను కోల్‌కతా డీఈఓకు ఫిర్యాదు చేశాను. ఈసారి ఎవరినీ బెదిరింపులకు పాల్పడటానికి అనుమతించబోము’అని అన్నారు. ఆమెకు ఎవరూ ఓటు వేయడం లేదు. ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనివ్వాలి. నేను భవానిపూర్‌లో కనీసం 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాను’అని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు.ఇక మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల రెండవ, చివరి దశలో 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. నేను చెట్లా, పద్మపుకూర్, చక్రబేరియా ప్రాంతాల్లోని బూత్‌లను సందర్శించాను. బీజేపీ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని చూస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు సాధారణంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఇక్కడ గూండా రాజ్ ఉందా?’అని ప్రశ్నించారు. -
బెంగాల్ దంగల్ మోదీకి దీదీకి మధ్య యుద్ధం
-
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్‌ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్‌తోనే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను టేప్‌తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్‌ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
బెంగాల్‌ను ఏలేదెవరు? కూలేదెవరు?
ఉత్తర బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్‌తో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు, ఇవాళ దక్షిణ బెంగాల్లో రెండో విడతతో మరింత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. 142 నియోజకవర్గాల్లో 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ విడతలో భవానీపూర్ పోరు ప్రత్యేక ఆకర్షణ. మమతా బెనర్జీ (TMC) మరియు సువేందు అధికారి (BJP) మధ్య జరుగుతున్న ఈ పోటీ కేవలం ఒక నియోజకవర్గం పోరాటం కాదు. అది బెంగాల్ భవిష్యత్తు దిశను నిర్ణయించే ప్రతీకాత్మక యుద్ధంగా మారింది.సంక్షేమం Vs పరివర్తనం..ఇదే ఈ విడతలో ప్రధాన నినాదం. మమతా బెనర్జీ సంక్షేమ పథకాలతో గ్రామీణ మహిళల మద్దతు పొందుతుండగా బీజేపీ “మార్పు” వాగ్దానంతో ముందుకు వస్తోంది. మరోవైపు సర్ సమస్య (ఓటర్ల పేర్లు తొలగింపు) ప్రజల్లో ఆందోళన కలిగించి, అధిక ఓటర్ల హాజరుకు దారితీస్తోంది. కోల్‌కతా, హౌరా, హుగ్లీ, నాదియా, బర్దమాన్ జిల్లాల్లో కీలక పోటీలు జరుగుతున్నాయి. టీఎంసీ మంత్రులు తమ స్థానాలను కాపాడుకోవడానికి పోటీ పడుతుండగా బీజేపీ ఈ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది.ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 41,000కి పైగా పోలింగ్ కేంద్రాల్లో CAPF బలగాలు మోహరించబడ్డాయి. సున్నితమైన బూత్‌లలో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. తొలి విడతలో 93% పైగా ఓటింగ్ నమోదైన నేపథ్యంలో, రెండో విడతలో కూడా అధిక హాజరు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు మౌనంగా ఉన్నా, వారి ఓటు నిర్ణయం ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనుంది. మొత్తంగా, ఇవాళ జరుగుతున్న రెండో విడత పోలింగ్, బెంగాల్ ఎన్నికల తుది ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. “ఏలేదెవరు? కూలెదెవరు?” అన్న ప్రశ్నకు సమాధానం దిశగా ప్రజాస్వామ్య యాత్ర కొనసాగుతోంది. -
బెంగాల్‌కు యూపీ ‘సింగం’.. ఊర మాస్ వార్నింగ్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న యూపీకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, పోలీస్ అబ్జర్వర్ అజయ్ పాల్ శర్మ.. అధికార టీఎంసీ అభ్యర్థికి ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.ఆకతాయి పనులొద్దుఫల్టా నియోజకవర్గంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనుచరులు.. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో అజయ్ పాల్ శర్మ స్వయంగా రంగంలోకి దిగారు. జహంగీర్ నివాసానికి చేరుకున్న ఆయన, అక్కడ అభ్యర్థి లేకపోవడంతో కుటుంబ సభ్యులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘జహంగీర్‌కు స్పష్టంగా చెప్పండి.. ప్రజలను బెదిరించినట్లు మళ్లీ ఫిర్యాదులు వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడినా, ఓటర్లను వేధించినా వదిలే ప్రసక్తే లేదు’ అని ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.భద్రతపై అనుమానాలు.. ఎస్పీకి నోటీసులుజహంగీర్ ఖాన్ నివాసం వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది వివరాలను కూడా శర్మ ఆరా తీశారు. అక్కడ 14 మంది పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉండటాన్ని గమనించిన ఆయన స్థానిక ఎస్పీ నుంచి వివరాలు కోరారు. అయితే, జహంగీర్‌కు ఉన్న వై-కేటగిరీ భద్రత కింద కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే కేటాయించినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో మంజూరైన దానికంటే అదనంగా నలుగురు పోలీసులను ఎందుకు మోహరించారనే దానిపై వివరణ కోరుతూ శర్మ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భగ్గుమన్న టీఎంసీఈ సంఘటనతో బెంగాల్లో తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. శర్మ చర్యలను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్వాగతిస్తూ.. ‘బెదిరింపుల శకం ముగిసింది, చట్టం తనపని తాను చేసుకుపోతుంది’ అని అన్నారు. మరోవైపు టీఎంసీ తీవ్రస్థాయిలో మండిపడింది. వివాదాస్పద ఎన్కౌంటర్లతో పేరుగాంచిన అధికారిని ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ నియమించిందని, ఆయన నిష్పాక్షికతపై అనుమానాలున్నాయని విమర్శించింది.ఇది కూడా చదవండి: Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి -
తరిమి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు పారిపోయిన బీజేపీ అభ్యర్థి
-
అల్లర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని సువేందు హెచ్చరిక
-
అల్లరిమూకలపై డేగ కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్లో తొలి దశ పోలింగ్ సందర్భంగా సమస్యలు సృష్టించే వారు, అల్లరి మూకలను కట్టడి చేయడంపై ఈసీ దృష్టిపెట్టింది. ఇలాంటి వారితో కూడిన వెయ్యిమంది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో 9మంది వరకు తృణమూల్ ఎమ్మెల్యేలున్నారు. పలువురు అభ్యర్థులు, కౌన్సిలర్లు ఉన్నారు. వీరిపై పోలీసు నిఘా పెరిగింది. ఈ జాబితాపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. తమ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే ఈ ప్రయత్నమని ఆరోపించింది. దీనిపై టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట ఆధారాలు లేకుండా రాజకీయ నాయకులను సమస్యాత్మక వ్యక్తులుగా గుర్తించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సమయంలో ఈ జాబితా వెలుగులోకి రావడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. -
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
కోల్‌కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జాబితాలో మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్‌కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్‌కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.తృణమూల్‌కు సవాలే..పశ్చిమ బెంగాల్లో తృణమూల్ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్‌కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్‌వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్‌డా, ఉత్తర్ దినాజ్‌పుర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. -
‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని, కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆదివారం(ఏప్రిల్ 19వ తేదీ) హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్ అంశం మోదీ పొలిటికల్ అజెండాగా మమతా అభివర్ణించారు.శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. -
టీఎంసీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం. కోల్‌కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు. దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. -
బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఈ పోరులో బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి వచ్చిన కీలక నేత, ఆయన మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, టీఎంసీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు, పాలించు విధానాన్నే నేడు బీజేపీ పాటిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించిన మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుండటం ఏమాత్రం అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుని, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. #WATCH | Kolkata, West Bengal | Netaji Subhas Chandra Bose's grandnephew Chandra Kumar Bose joins TMC. pic.twitter.com/z8Rzt46XHo— ANI (@ANI) April 12, 2026దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను భరించలేకే ఆ పార్టీని వీడానని, లౌకికవాదం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న టీఎంసీ విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చంద్ర కుమార్ బోస్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో దీదీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా బెంగాల్ ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత 2021 ఎన్నికల్లో 213 స్థానాలతో అఖండ విజయం సాధించిన టీఎంసీకి, 77 స్థానాలతో బలపడిన బీజేపీకి మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ తరుణంలో నేతాజీ వారసుడు టీఎంసీలో చేరడం ఆ పార్టీ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
బెంగాల్ ఎన్నికలు: వీడియో ఎపిసోడ్‌తో బిగ్ షాక్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నెట్లో వదిలిన ఓ వీడియో రాజకీయ ప్రకంపనలు రేపింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత హుమాయున్ కబీర్.. బీజేపీతో చేతులు కలిపి మైనారిటీల ఓట్లను మళ్లించే కుట్ర చేశాడన్నది ఆ వీడియో సారాంశం. అయితే ఆ వీడియోను కబీర్ ఖండించినప్పటికీ నష్టం జరిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ వీడియోలో హుమాయున్ కబీర్.. బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నాడని, మైనారిటీ ఓట్లను మళ్లించేందుకు భారీ నిధులు పొందాడని ఉంది. ఏకంగా ప్రధాని కార్యాలయం ఈ కుట్రలో భాగమైందని.. సువేందు అధికారి, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో సమన్వయం చేసుకోవాలని పీఎంవో సూచనలు చేసినట్లు ఉంది. అంతేకాదు.. पश्चिम बंगाल चुनाव के बीच हुमायूँ कबीर का सनसनीखेज वीडियोहुमायूँ कबीर ने BJP से 200 करोड़ रुपये की अग्रिम राशि की मांग की।"मुसलमानों को बेवकूफ़ बनाना आसान है, -हुमायूँबाबरी मस्जिद बने न बने लेकिन हमारा काम हो जाएगा- हुमायूँ#humayunkabir #WestBengalAssemblyElection2026 #TMC pic.twitter.com/xlOyKkfDgk— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 9, 2026ముస్లింలను మోసం చేయడం సులభమని.. ఇందుకు బాబ్రీ మసీదు అంశమే ఉదాహరణ అని హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. బెంగాల్ ఓట్లలో ముస్లిం ఓట్లను మళ్లించేందుకు బీజేపీ నుంచి రూ.200 కోట్లు ముందస్తు నిధులు కబీర్ పొందినట్లు టీఎంసీ సంచలన ఆరోపణలకు దిగింది. దాదాపు రూ.1000 కోట్లతో ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించిన టీఎంసీ.. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు. అయితే హుమాయున్ కబీర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తీసిన వీడియో అని.. 2019 నవంబర్ తర్వాత ఏ బీజేపీ నేతతోనూ తాను టచ్‌లో లేనని.. ఇది తృణమూల్ నేతల దుష్ప్రచారమని.. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం వెంటనే రాజకీయ ప్రభావం చూపింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. తాజా వీడియో కలకలం నేపథ్యంలో.. ఆ కూటమిని రద్దు చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్(తెలంగాణ) ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. హుమాయున్ కబీర్ మాజీ ఐపీఎస్ అధికారి. టీఎంసీలో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రిగా పని చేశారు. బీజేపీలో చేరి అక్కడా కొంత కాలం ఉన్నారు. తిరిగి టీఎంసీలో చేరారు. అయితే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. గత ఏడాది ముర్షీదాబాద్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బాబ్రీ మసీదు నమునాతో అక్కడ ఓ మసీదు నిర్మిస్తానని చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. విమర్శల నేపథ్యంలో.. టీఎంసీ ఆయన్ని బహిష్కరించగా ఏజేయూపీ పేరిట కొత్త పార్టీ స్థాపించాడాయన. తాజా వివాదం ఎన్నికల ముందు మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం.. 294 స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
ఎన్నికల సంఘం-TMC ఎంపిల సమావేశంలో రసాభాస
-
దర్యాప్తు పేరుతో స్థానికులకు వేధింపులు: మమత ఆరోపణలు
మాల్దా: న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనకు బాధ్యులైన నేరగాళ్లు తప్పించుకుపోగా, దర్యాప్తు అధికారులు అమాయకులైన స్థానికులను వేధిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మాల్దా జిల్లా మోతాబరిలో బుధవారం రాత్రి న్యాయాధికారులను గంటలపాటు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఐ దర్యాప్తు చేపట్టడం తెల్సిందే.శనివారం సీఎం మమత మాల్దాలోని మానిక్చక్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్), ఎంఐఎంలనుద్దేశించి పరోక్షంగా ఆమె.. ‘జడ్జీలను ఘెరావ్ చేసిన ఆ రెండు మత పార్టీల వాళ్లు తప్పించుకుపోయారు. ఎన్ఐఏ అధికారులు విచారణ పేరుతో స్థానికులను వేధిస్తున్నారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు’అని ఆరోపించారు. సర్‌లో పేర్ల తొలగింపునకు గురైన వారు న్యాయాధికారుల దగ్గరికి వెళ్లవద్దని, ఓటరు జాబితాలో తిరిగి తమ పేర్లను చేర్చాలంటూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోయిన వారిని చేతులెత్తాలని ఆమె కోరగా సభలో పాల్గొన్న చాలా మంది స్పందించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని ట్రిబ్యునళ్ల వద్దకు వెళ్లేలా చేయడమే మా కర్తవ్యం’అని అన్నారు. -
సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్వో సురాజిత్ రాయ్ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.ప్రస్తుత ఆర్వో రాయ్ గతంలో నందిగ్రామ్ నియోజకవర్గంలో బ్లాక్ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపింది. -
సర్వం ‘సర్’మయం!
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రధానాంశంగా మారుతోంది. ముఖ్యంగా ప్రధాన పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ప్రచారమంతా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ చుట్టే తిరుగుతోంది! దాంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీ వంటివి పూర్తిగా పక్కకు పోయాయి. సర్, చొరబాట్లు, మైనారిటీల సంతుష్టీకరణే ప్రచారాంశాలుగా మారాయి.సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 64 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఇంకా లక్షలాది ఓటర్ల తనిఖీ కొనసాగుతోంది. దాంతో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలే పూర్తిగా మారిపోతున్నాయి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 90 స్థానాల్లో మెజారిటీ 10 వేల లోపే నమోదైంది. భారీ ఓట్ల తొలగింపు కారణంగా ఆ స్థానాల్లో ఈసారి పార్టీల బలాబలాలే తారుమారయ్యే పరిస్థితి నెలకొంది! ఒక్క ముర్షీదాబాద్ జిల్లాలోనే ఏకంగా 11 లక్షల ఓట్లు తొలగింపునకు గురవడం విశేషం. 8.3 లక్షలతో మాల్డా రెండో స్థానంలో నిలిచింది. నార్త్, సౌత్ 24 పరగణా జిల్లాల్లో కలిపి 12 లక్షల పైచిలుకు ఓట్లు గల్లంతయ్యాయి. ఆ రెండు జిల్లాల్లో మరో 11 లక్షల ఓట్ల తనిఖీ కొనసాగుతోంది! ఇదంతా తమ ఓటుబ్యాంకుకు గండి కొట్టే కుట్రేనని టీఎంసీ ఆరోపిస్తుండగా, కేవలం చొరబాటుదారులను, దొంగ ఓటర్లను ఏరివేయడమే లక్ష్యమని బీజేపీ చెబుతోంది.అస్తిత్వవాదం దిశగా... బెంగాల్లో గతంలో ప్రధానంగా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు, మతపరమైన విభజన వంటివి తెరపైకి వచ్చేవి. ‘‘సర్ ప్రక్రియతో పరిస్థితే మారిపోయింది. కొంతకాలంగా ఏ జిల్లాను తీసుకున్నా మతపరమైన విభజన కొట్టొచ్చినట్టుగా కన్పిస్తోంది. అంతేగాక అది క్రమంగా శాశ్వత రూపు సంతరించుకుంటూ ఉండటం ఆందోళనకరం. స్థానికంగా చిన్న స్థాయిలో జరిగే శ్రీ రామనవమి ఉత్సవాలు ఈసారి భారీ జన సమీకరణ వేదికలుగా మారడం ఇందుకు నిదర్శనం’’ అని రాజకీయ విశ్లేషకులు సుమన్ భట్టాచార్య, మొయిదుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు. బెంగాల్ రాజకీయాలు వర్గ సమీకరణల నుంచి పూర్తిగా మతం, సంస్కృతి, పౌరసత్వం పేరిట క్రమంగా అస్తిత్వవాదం వైపు మళ్లుతున్నాయని వారన్నారు. -
బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్
కోల్‌కతా: బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. శనివారం రాష్ట్రంలో పర్యటించిన హోంమంత్రి అమిత్ షా.. టీఎంసీ ప్రభుత్వ పదిహేనేళ్ల పరిపాలనా వైఫల్యాలను ఎండగట్టారు. బెంగాల్ అవినీతి ప్రయోగశాలగా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. చొరబాటు దారులకు బెంగాల్ అడ్డాగా ఉందని.. బెంగాల్లో శాంతి భద్రతలు క్షీణించాయన్న అమిత్ షా.. మమత పాలనలో అరాచకం రాజ్యమేలుతోందంటూ దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే(బెంగాల్) పరిమితం కాదని.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని.. అందుకే అత్యంత కీలకమంటూ వ్యాఖ్యానించారు.గత 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్ చొరబాట్లకు, బుజ్జగింపు రాజకీయాలకు, సరిహద్దు అభద్రతకు ప్రధాన కారిడార్‌గా మారిందని షా ఆరోపించారు. కేంద్రం పదేపదే కోరినప్పటికీ, సరిహద్దు కంచె ఏర్పాటుకు మమతా బెనర్జీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని అంటూ ఆయన విమర్శించారు. చొరబాటుదారులతో ఓటు బ్యాంకును సృష్టించుకోవడమే వారి లక్ష్యమంటూ ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలను భయం- విశ్వాసం మధ్య జరుగుతున్న పోరాటంగా అమిత్ షా అభివర్ణించారు. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అబద్ధాలు, హింస, అవినీతి రాజకీయాలను పెంచి పోషించారు. ఈసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే పరివర్తన్ ర్యాలీల పేరిట ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ.. మమత సర్కారు వైఫల్యాలపై బహిరంగ సభలు, చిన్న స్థాయి భేటీల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఛార్జ్‌షీట్ పేరుతో ప్రజలను మరింతగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అవినీతి–కుంభకోణాలు, పరిపాలనా వైఫల్యాలు, శాంతిభద్రతల పతనం, మహిళలపై నేరాలు– భద్రతా లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులు, పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాల క్షీణత, రైతు సమస్యలు, తేయాకు తోట కార్మికుల దుస్థితి, కోల్‌కతా నగర పరిస్థితి, ‘సిండికేట్ రాజ్’వంటివి ఇందులో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
West Bengal: 57 సీట్లు.. నరాలు తెగే ఉత్కంఠ!
పశ్చిమ బెంగాల్ రాజకీయం ఎప్పుడూ సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఇప్పుడు నేతలందరి దృష్టి ఆ 57 నియోజకవర్గాలపైనే నిలిచింది. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఘనవిజయం సాధించినప్పటికీ, ఈ సీట్ల ఫలితాలను పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతూ, నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా..రాష్ట్ర అధికార పీఠాన్ని నిర్ణయించడంలో కేవలం 8,000 లోపు ఓట్ల తేడాతో గెలిచిన ఈ 57 సీట్లు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ఈ స్వల్ప ఓట్ల తేడా అటు ఇటు అయితే బెంగాల్ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గత 2021 ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, ఈ 57 స్థానాల్లో గెలుపోటములు వెంట్రుక వాసిలో జరిగాయి. వీటిలో సగటున 8,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీతోనే అభ్యర్థులు గట్టెక్కారు. మరీ ముఖ్యంగా, 19 నియోజకవర్గాల్లో అయితే మెజారిటీ 3,000 ఓట్ల లోపే ఉండటం గమనార్హం. ఈ 57 కీలక స్థానాల్లో గతంలో టీఎంసీ 29 సీట్లు గెలవగా, బీజేపీ 28 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే రెండు పార్టీల మధ్య పోరు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3,000 కంటే తక్కువ ఓట్ల మెజారిటీ ఉన్న 19 సీట్లలో బీజేపీ 12 చోట్ల విజయం సాధించగా, టీఎంసీ 7 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో, 2026లో ఈ 57 స్థానాల్లో చిన్నపాటి ఓట్ల మార్పు జరిగినా అది ప్రభుత్వ మనుగడనే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే అసలైన కురుక్షేత్రంఈ ఉత్కంఠభరిత నియోజకవర్గాల్లో అత్యధికంగా 47 సీట్లు దక్షిణ బెంగాల్లోనే ఉన్నాయి. ఉత్తర బెంగాల్లో కేవలం 10 స్థానాలు మాత్రమే ఇటువంటి స్వల్ప మెజారిటీ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన పుర్బా మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, పురూలియా, పశ్చిమ బర్థమాన్ జిల్లాలు ఈసారి ప్రధాన యుద్ధభూమిగా మారనున్నాయి. బంకురా, పశ్చిమ బర్థమాన్ జిల్లాల్లో ఇటువంటి సీట్లు ఆరేసి చొప్పున ఉండగా.. మిగిలిన మూడు జిల్లాల్లో ఐదు చొప్పున ఉన్నాయి.గత ఎన్నికల్లో షాకింగ్ మెజారిటీలునందిగ్రామ్: ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి కేవలం 1,956 ఓట్ల తేడాతో విజయం సాధించారు.కుల్తీ: ఇక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 679 ఓట్లతో గట్టెక్కారు.దంతాన్: టీఎంసీ కేవలం 623 ఓట్లతో ఇక్కడ విజయాన్ని అందుకుంది.ఘటల్: బీజేపీ కేవలం 966 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచింది.దిన్హాటా: కూచ్ బెహార్ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి నిశిత్ ప్రామాణిక్ కేవలం 57 ఓట్ల తేడాతో గెలవడం ఒక సంచలనం. అయితే ఆయన రాజీనామా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 1.64 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఇక్కడ గెలవడం గమనార్హం.మారిన రాజకీయ సమీకరణలు2026 సమరంలో పాత లెక్కలు చెల్లుతాయని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈసారి పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశం ఉండగా, సీపీఐ(ఎం) - ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేస్తున్నాయి. వీరికి తోడుగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్‌కు చెందిన ఏజేయూపీ కూటమి ముస్లిం ఓట్ల సమీకరణలను మార్చే అవకాశం ఉంది. ఓట్లు ఇలా చీలిపోవడం వల్ల స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాల్లో ఫలితాలు ఎటువైపు తిరుగుతాయోనన్న టెన్షన్ పార్టీల్లో నెలకొంది.పార్టీల ధీమా.. పరస్పర విమర్శలుబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథ్ ఛటోపాధ్యాయ మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకత, ఓటర్ల జాబితా సవరణ తమకు కలిసి వస్తుందని, తాము 80 శాతానికి పైగా సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు టీఎంసీ ప్రతినిధి అరూర్ చక్రవర్తి ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా కొన్ని వర్గాల ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు తమవైపే ఉన్నారని, స్వల్ప మెజారిటీ సీట్లలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2021లో 213 సీట్లతో భారీ విజయం సాధించిన టీఎంసీకి, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీకి మధ్య 2026 ఎన్నికలు చావో రేవో అన్నట్లు ఉండబోతున్నాయనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మంచు దిబ్బల్లో ఘోరం.. ఐదుగురు మృతి -
మమతా మ్యానిఫెస్టో విడుదల.. గ్యారంటీలు ఇవే..!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దీదీకే వచన్ పేరుతో ప్రజలకు పది హామీలను ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. దీదీకే వచన్ దువారో చికిత్స ( ప్రజలకు ఇంటి వద్దకే వైద్యసేవలు) నిరుద్యోగులకు ప్రతినెల రూ.1,500, మహిళలకు ప్రతినెల రూ. 1,500,ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 1,700 అందజేయనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరిన్ని సంక్షేమ ఫలితాలను ప్రకటించింది. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి.కాగా ఇటీవలే ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు,కేరళ, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతాలకు ఎన్నికలు జరగనున్నాయి.మెుత్తంగా ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా 17.4 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. సీఎం మమతా బెనర్జీ పేచీలో ఉన్న చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించి వారి స్థానంలో ఇతర అధికారులను నియమించింది. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సారి 226 కు పైగా స్థానాల్లో విజయం సాధించి వరుసగా నాలుగవ సారి అధికారం ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ప్రకటించింది. ఈ ఏడాది భవానీపూర్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపింది. దీంతో బీజేపీ సైతం మమత పోటీ చేస్తున్న స్థానంలో తమ అభ్యర్థిగా సువేందు అధికారిని నిలపనుంది. 2021లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది. దీంతో భవానీపూర్ నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. 2021లో టీఎంసీ 213 స్థానాలు గెలుచుకొని హ్యాట్రిక్ విజయం సాధించింది. 2016లో మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2021లో 77 స్థానాలు చేజిక్కించుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. దీంతో ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. -
మమత Vs సువెందు : రసవత్తరంగా బెంగాల్ పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.సై అంటే సై అంటున్న దీదీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్‌కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 2021లో ఇలా2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది. 2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది. -
ఓటర్ల తొలగింపును నిరసిస్తూ సీఎం మమత ధర్నా
కోల్‌కతా: ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం టీఎంసీ అధినేత్రి, పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెంట్రల్ కోల్‌కతాలో ధర్నాకు పూనుకున్నారు. ఏప్రిల్‌లో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా వివాదాన్ని టీఎంసీ ప్రచారంలో ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకోనున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎస్ప్లానెడ్ ప్రాంతంలోని మెట్రో చానల్ వద్ద మమత మధ్యాహ్నం 2.15 గంటలకు ధర్నా ప్రారంభించారు. బీజేపీ, ఈసీలు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించాలని కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను తాను బయటపెడతానని ఆమె ప్రకటించారు. ఇటీవల ప్రకటించిన జాబితాలో బతికున్న వారిని కూడా చనిపోయిన వారి కిందకి చేర్చారని ఆరోపించారు. అలాంటి వారిని ధర్నా వేదికపైకి తీసుకొచి్చ, ఈసీ పాల్పడిన అవకతవకలను బయటపెడతామన్నారు. ఇదే అంశంపై శనివారం మరికొన్ని వివరాలను బయటపెడతామన్నారు. బీజేపీ, ఈసీలోని ఆ పార్టీ ఏజెంట్లు బరి తెగించారని, వారికి ఏమాత్రం సిగ్గు లేదంటూ తిట్టిపోశారు. ఇటీవల ఈసీ వెల్లడించిన తుది ఓటరు జాబితాలో 63.66 లక్షల పేర్లను, అంటే మొత్తం ఓటర్లలో 8.3 శాతం మందిని తొలగించడం తెల్సిందే. మరో 60 లక్షల పేర్లను న్యాయపరమైన పరిశీలన కోసం ఉంచారు. త్వరలో న్యాయాధికారులు వీటిని పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ఎన్నికల సమీకరణాలను తీవ్రంగా ప్రభావితం చేయనుండగా మమత పోరాటానికి దిగారు. అయితే, ధర్నా ఎన్ని రోజులు కొనసాగనుందనే విషయాన్ని మమత వెల్లడించలేదు. -
బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రంలోని తమ పార్టీ అనుకూలంగా లేదన్న ఆగ్రహంతో పశ్చిమబెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గురువారం మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కుర్సియాంగ్ శాసనసభ్యుడైన శర్మ కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీఎంసీలో చేరారు. మరో రెండు నెలల్లో బెంగాల్లో ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ బీజేపీ రెబల్ ఎమ్మెల్యే పార్టీని వీడటం గమనార్హం. ‘కుర్సియాంగ్ ఓటర్ల మనోభీష్టానికి వ్యతిరేకంగా పనిచేయదల్చుకోలేదు. ఇప్పుడు నేను స్వేచ్ఛాజీవిని. ఎవరేం అనుకున్నా భయపడేదే లేదు’ అని పార్టీ మారాక బిష్ణుప్రసాద్ అన్నారు.బెంగాల్ కొండ ప్రాంతాలకు ప్రత్యేక పరిపాలనా విభాగం ఉండాలని గత రెండేళ్లుగా బీజేపీ అధిష్టానంతో బిష్ణు పోరాడుతున్నారు. పశ్చిమబెంగాల్ మాత్రమేకాదు నార్త్ బెంగాల్ కూడా ముఖ్యమే’ అని గతంలో వ్యాఖ్యానించారు. పార్టీ వద్దని వారించినాసరే బిష్ణు ప్రసాద్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డార్జిలింగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. -
ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి
ఢిల్లీ: కోల్‌కతా ఐప్యాక్ కార్యాలయం ఘటన కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాదనల సందర్భంగా టీఎంసీ ప్రభుత్వంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలకు దిగింది. మమత ఒక ప్లాన్ ప్రకారమే కథ నడిపిస్తున్నారని.. ఈడీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల వినిపించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం దీనిని తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీకి సోదాలు జరుగుతున్న టైంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి?. ఆమె ఈడీ నుంచి కీలక డాక్యుమెంట్లు.. అధికారుల ఫోన్లను లాక్కున్నారు. ఆధారాలను దొంగింలించారు. ఆ సమయంలో యూనిఫాంలో ఉన్న పోలీసులు ఆమె వెంట ఉన్నారు. బెంగాల్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ధ్వంసం చేశారు. కోల్‌కతా హైకోర్టుకు బస్సులు ఏర్పాటు చేసి మరీ జనాల్ని తరలించారు. హైకోర్టలో మా తరఫు లాయర్‌ను వాదించకుండా అడ్డుకున్నారు. కోర్టు హాల్లో ఆయన మైక్ కట్ చేశారు అని సోలిసిటర్ జనరల్ వాదించారు. అయితే..సోదాలు జరిపేందుకు రెండేళ్లు ఎందుకు ఎదురు చూడాల్సి వచ్చిందని కోల్‌కతా ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. సరిగ్గా ఎన్నికల ముందే ఈ హడావిడి ఎందుకు? అని ప్రశ్నించింది. అయితే.. సోలిసిటర్ జనరల్ వాదనలను నిశితంగా విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోల్‌కతా హైకోర్టును జంతర్ మంతర్ చేశారా? అని వ్యాఖ్యానించింది. ఇది సీరియస్ మ్యాటర్.. దీన్ని విచారించాలి. కేసు మొత్తాన్ని సమగ్రంగా విచారణ జరపాలి అని అభిప్రాయపడింది.జనవరి 8వ తేదీన కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయంతో పాటు ఢిల్లీలోని నాలుగు చోట్ల గురువారం ఉదయం ఏడు గంటల నుంచే ఏకకాలంలో ఈడీ సోదాలు చేసింది. కొన్ని హవాలా లావాదేవీలు, నగదు వ్యవహారాలు.. కోల్‌కతా ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ ద్వారా జరిగినట్లు నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ఈడీ అంటోంది. బొగ్గు స్మగ్లింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐ-ప్యాక్‌కు చెందిన ‘ఇండియన్ పీఏసీ కన్సల్టింగ్ ప్రై.లి.’కు రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అయితే.. సోదాల గురించి తెలిసిన వెంటనే జైన్ నివాసానికి మమత హుటాహుటిన చేరుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు జరిగాయని, ఇవి రాజ్యాంగ విరుద్ధమని దీదీ మండిపడ్డారు. అయితే ఈడీ తమ విధులకు ఆమె ఆటంకాలు కల్పించారని కోర్టును ఆశ్రయించగా.. మరోవైపు బీజేపీ రాజకీయంగానూ విమర్శలకు దిగింది. -
బెంగాల్లో ఈడీ దాడుల టెన్షన్.. సీఎం మమత ర్యాలీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ సహా ఆ సంస్థ కార్యాలయాలపై ఈడీ దాడులు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బెంగాల్లో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనార్జీ ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీఎంసీ నేతలు. సీఎం మమత చేపట్టిన ర్యాలీలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.మరోవైపు.. అంతకుముందు ఈడీ దాడులను నిరసిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వెలుపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. రాజకీయ వైరంతోనే ఈడీని ఆయుధంగా ఉయోగిస్తోందని అమిత్‌షాపై టీఎంసీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, అమిత్ షా ఇంటి వద్ద టీఎంసీ నేతలు నిరసనలు తెలపడంతో పోలీసులు వారిని నిరసన ప్రాంతం నుంచి లాక్కెళ్లారు. తాము శాంతియుతంగా ఆందోళన చేపట్టామంటూ పోలీసుల చర్యను నేతలు ఖండించారు.#WATCH | Kolkata | TMC Chairperson and West Bengal CM Mamata Banerjee leads a rally today against the Enforcement Directorate, following the raid on I-PAC yesterday. Visuals from the 8B bus stand, Jadavpur pic.twitter.com/On4uMtFUBG— ANI (@ANI) January 9, 2026ఈ నిరసనల్లో టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, శతాబ్ది రాయ్, కీర్తి ఆజాద్, డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం, ఎంపీలు మాట్లాడుతూ.. ‘‘ఎంపీలతో పోలీసులు వ్యవహరించిన తీరు అందరికీ కనిపిస్తోంది’’ అని డెరెక్, మహువా వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాస్వామ్య నిరసనలకు తావులేకుండా పోతోంది. నేరగాళ్లకు రివార్డులు దక్కుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వాడుతున్నారు. ఎన్నికలను తారుమారు చేస్తున్నారు. నిరసనకారులను జైలుకు పంపి.. రేపిస్టులకు బెయిల్ ఇస్తున్నారు. ఇది బీజేపీ విధానం. దీనిని బెంగాల్ అంగీకరించదు. మిమ్మల్ని ఓడించేందుకు మా శాయశక్తులా కృషిచేస్తాం’ అని అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. ఇక, సోదాలు అడ్డుకున్నారని ఈడీ.. వాటిని ప్రశ్నిస్తూ ఐప్యాక్ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించాయి.#WATCH | Kolkata | TMC Chairperson and West Bengal CM Mamata Banerjee leads a rally following the ED raid on I-PAC yesterday pic.twitter.com/CkYfedjywC— ANI (@ANI) January 9, 2026ఇదిలా ఉండగా.. కోల్‌కతాలో రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటికి వ్యతిరేకంగా ఎంపీలు, నేతలు నినాదాలు చేశారు. ఈడీ సోదాల సందర్బంగా అధికారుల వద్ద నుంచి సీఎం మమతా బెనర్జీ పలు ఫైల్స్‌ను తీసుకెళ్లారు. దీంతో, ఈడీ దాడుల ఘటన బెంగాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. -
అమిత్ షా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం దుమారం కొనసాగుతుంది. న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, డెరెక్ ఓ’బ్రయన్ సహా పలువురు నేతలు నిరసనకు దిగారు. ఈ నిరసనలో పోలీసులు వారిని బలవంతంగా లాగి అరెస్టు చేశారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీకి ఐపాక్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఈనేపథ్యంలో ఈడీ అధికారులు ఐపాక్ కార్యాలయంపై దాడులు జరిపారు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.అయితే,ఈడీ దాడుల్ని టీఎంసీ ఎంపీలు ఖండిస్తున్నారు. ఎన్నికల ముందు ఈడీ దాడులు ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలనే ప్రయత్నం. తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలని కేంద్రం చూస్తోంది’అని ఆరోపణలు గుప్పిస్తున్నారు.అందుకు బీజేపీ సైతం టీఎంసీ దాడుల్ని తిప్పికొడుతోంది. ఈడీ దాడులు చట్టుపరమైనవని, ఇందులో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న దాడులు చట్టపరమైనవని, అవినీతి కేసులపై విచారణలో భాగమని స్పష్టం చేసింది. VIDEO | Delhi: TMC MPs protest outside Union Home Minister Amit Shah’s office with placards reading “Bengal rejects Modi-Shah’s dirty politics,” following the ED raids at I-PAC’s office in Kolkata yesterday.#TMC #AmitShah #Kolkata(Source - Third party)(Full VIDEO available… pic.twitter.com/7VyF2e7dfL— Press Trust of India (@PTI_News) January 9, 2026 -
టీఎంసీకి భారీ షాక్.. ఎన్నికలకు ముందే తిరుగుబాటు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ అనూహ్యంగా తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తన మేనమామ, దివంగత కాంగ్రెస్ దిగ్గజం గనీ ఖాన్ చౌదరి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.వచ్చే ఏప్రిల్‌తో మౌసమ్ నూర్ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఆమె త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దా జిల్లా నుండి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె 2009 నుండి 2019 వరకు మాల్దా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా గతంలో పశ్చిమ బెంగాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా ఆమె కీలక బాధ్యతలు చేపట్టారు.న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మౌసమ్ నూర్ అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సుభంకర్ సర్కార్ సమక్షంలో ఆమె పార్టీలోకి తిరిగి ప్రవేశించారు. పార్టీ అగ్రనేతలు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ చేరికతో బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.కాంగ్రెస్‌లో చేరికపై మౌసమ్ నూర్ స్పందిస్తూ ‘పశ్చిమ బెంగాల్‌కు మార్పు అవసరం, ఆ మార్పు నా నుండే మొదలు కానివ్వండి’ అని వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరానని, కాంగ్రెస్ సిద్ధాంతాలైన లౌకికవాదం, అభివృద్ధి, శాంతిపై మాల్దాలోని ప్రజలకు గట్టి నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి పంపినట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తానని మౌసమ్ నూర్ అన్నారు. ఇది కూడా చదవండి: Bangladesh: హిందువుల సంచలన నిర్ణయం.. ఎన్నికలపై పిడుగుపాటు -
దుష్ట శక్తులకు తల వంచేది లేదు
కోల్‌కతా: ప్రజల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంలో దుష్ట శక్తుల ఒత్తిళ్ల కు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఎక్స్‌లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. మా, మా తి, మనుష్(తల్లి, భూమి, ప్రజలు)లకు సేవే లక్ష్యంగా టీఎంసీ 1998 జనవరి ఒకటో తేదీన ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు. ఇప్పటికీ ప్రతి కార్యకర్త, ప్రతి మద్దతుదారు ఈ లక్ష్య సాధనకే కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు ఆమె నివాళులర్పించారు. అసంఖ్యాక ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే పార్టీకి రక్షగా నిలుస్తు న్నాయన్నారు. ప్రజల మద్దతే తమకు జీవనాధారమని, దేశంలోని ప్రతి వ్యక్తి కోసం జరిగే పోరాటంలో వెనకడుగు వేయ దని బెనర్జీ స్పష్టం చేశారు. ‘మేం ఏ దుష్ట శక్తులకూ తలవంచబోం. అన్ని రకాల పగ ప్రతీకారాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల కోసం జీవి తాంతం పోరాటం కొనసాగి స్తాం’అని మమత ప్రకటించా రు. పార్టీపై ప్రేమాదరాలను కురిపించే ప్రతి ఒక్కరికీ టీఎంసీ ఎక్స్‌లో ధన్యవాదాలు తెలి పింది. ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటాన్ని ఇకపైనా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను మట్టి కరిపిస్తామని ప్రతిన బూనింది. కాంగ్రెస్‌ను వీడిన మమతా బెనర్జీ 1998లో టీఎంసీని స్థాపించారు. బెంగాల్లో దశాబ్దాల వామపక్ష పాలనకు గట్టి సవాల్‌గా నిలిచారు. సీపీఎం 34 ఏళ్ల పాలనను అంతం చేసి, మమతా బెనర్జీ 2011లో సీఎం పీఠాన్ని అధిరోహించారు. అప్పటి నుంచి ఏకధాటిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బెంగాల్లో పరిణామాలు వేగంగా మారుతున్న వేళ..మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలు టీఎంసీకి నిర్ణాయకంగా మారనున్నాయి. -
‘మిమ్మల్ని ఓటర్ల జాబితా ఆయుధంగా మార్చారు’
న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మరోసారి ధ్వజమెత్తింది. కొత్త ఏర్పాటైన ‘సర్’తో ఓటర్ల జాబితాలో తారుమారు జరుగుతుందంటూ మండిపడింది. ఈరోజు(బుధవారం, డిసెంబర్ 31) సీఈసీని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.. కలిసి పశ్చిమబెంగాల్ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి నివేదిక సమర్పించారు. అనంతరం సీఈసీతో చర్చించారు. అయితే ఆపై బయటకొచ్చిన అభిషేక్ బెనర్జీ.. సీఈసీ టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న జ్ఞానేష్ కుమార్‌ను.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇష్టమొచ్చినట్లు వాడుకుంటుందని ఘాటు వ్యాఖ్యలుచేశారు. దేశాన్ని విచ్చిన్నం శక్తిగా జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం ఉపయోగించుకుంటుందన్నారు. తమకు ఈవీఎంల ఓటింగ్‌తో ఎటువంటి సమస్యా లేదని, కానీ ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారనే అనుమానం మాత్రం ఉందన్నారు. ‘ మా ప్రశ్నలకు దేనికి కూడా సీఈసీ సరైన క్లారిటీ ఇవ్వలేదు. సుమారు 20 ప్రశ్నల వరకూ సీఈసీని అడిగాం. కానీ వాటిలో స్పష్టత లేదు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్‌ను ఓటర్ల జాబితా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు తయారు చేస్తున్న ఓటర్ల జాబితాను ప్రజల ముందు బహిర్గతం చేయండి. కనీసం అది కుదరకపోతే.. దాన్ని లాజికల్‌గానైనా నిరూపించండి. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత లేదనేది మా అనుమానం’ అని విమర్శించారు. -
ఎస్ఐఆర్ ఉద్యోగుల మృతి వెనుక ఈసీ హస్తం ఉంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు సంబంధించిన 40 మంది మరణించారని టీఎంసీ శుక్రవారం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీని వెనుక రాష్ట్రంలోని పోల్ ప్యానెల్ చీఫ్ హస్తం ఉందని ఆరోపించింది. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ నేతృత్వంలో పదిమంది ఎంపీల ప్రతినిధి బృందం శుక్రవారం సీఈసీ అధికారులను కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఓబ్రియన్.. తమ పార్టీ ఐదు ప్రశ్నలను సీఈసీ ముందుంచుందని, కానీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలిపారు. తాము ఎస్ఐఆర్ను వ్యతిరేకించడం లేదని, ఈసీ పనిచే స్తున్న తీరుపై తమకు అభ్యంతరం ఉందని నొక్కి చెప్పారు. కమిషన్ దానిని కేవలం ఆరోపణలుగా తోసిపుచ్చిందని లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా తెలిపారు. సీఈసీని కలిసిన ప్రతినిధి బృందంలో లోక్‌సభ ఎంపీలు శతాబ్దిరాయ్, కళ్యాణ్ బెనర్జీ, ప్రతిమా మండల్, సజ్దా అహ్మద్, రాజ్యసభ ఎంపీలు డోలా సేన్, మమతా ఠాకూర్, సాకేత్ గోఖలే, ప్రకాష్ చిక్ బారిక్ ఉన్నారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ విధుల్లో నిమగ్నమైన బూత్ స్థాయి అధికారులు మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, తమిళనాడు ఈ సంఖ్య అధికంగా ఉంది. ఒక్క పశ్చిమబెంగాల్లోనే 40 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఎల్ఓల మరణాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఇతర ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎస్ఐఆర్ సంస్కరణకాదని, విజయం కోసం బీజేపీ చేస్తున్న నియంతృత్వ పాలనని విమర్శిస్తున్నారు. -
లాటరీలో భారీ జాక్‌పాట్.. కట్‌చేస్తే మృతదేహం అలా..
కోల్కత్తా: లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మాజీ తృణముల్ కాంగ్రెస్ నాయకుడు సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగాల్‌లోని కుల్తీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖియాబాద్ అప్పర్ పారా ప్రాంతంలో కార్తీక్ బౌరి కుటుంబం నివసిస్తోంది. ఈ మధ్యే కార్తీక్ బౌరికి కోటి రూపాయల లాటరీ తగిలింది. ఇంతలోనే అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో, కార్తీక్ బౌరి తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన ఫిర్యాదులో మాజీ టీఎంసీ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరి, సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరిలే కార్తీక్‌ను హత్య చేసినట్లు ఆరోపించారు.అక్కడ మృతదేహాం.. కార్తీక్ బౌరి అచేతనంగా బేబీ బౌరి ఇంటి బయట ఉన్న మెట్లపై కనిపించాడు. అనంతరం, అతడి కుటుంబం అక్కడికి చేరుకుని వెంటనే కార్తీక్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కార్తీక్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బేబీ బౌరిని కార్తీక్ కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. కార్తీక్ తన ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని తెలిపారు. దొంగతనానికి వచ్చి ఇంటి గోడ దూకి పారిపోతుండగా కిందపడి మృతి చెందినట్టు చెప్పుకొచ్చాడు.అయితే, బేబీ బౌరి వ్యాఖ్యలను కార్తిక్ తల్లి తిరస్కరించింది. ఇటీవలే తన కొడుకు లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నాడని, దొంగతనం చేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పింది. కార్తీక్‌ను ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్టు ఆరోపించారు. దీంతో, కార్తీక్ మృతి కేసులో మాజీ తృణమూల్ నాయకుడు బేబీ బౌరి, అమర్దీప్ బౌరిలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు సందీప్ బౌరి, జ్యోత్స్న బౌరి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరినీ అసన్సోల్ కోర్టు ముందు హాజరుపరిచినట్టు వెల్లడించారు. -
Durga Puja:‘ముందుగానే నిమజ్జనం చేయిస్తారా?’.. టీఎంసీపై బీజేపీ మండిపాటు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న దుర్గా పూజలను అడ్డుకునేందుకు అధికార టీఎంసీ ప్రయత్నిస్తున్నదని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో ఏర్పాటు చేసిన వేదికపై జరుగుతున్న దుర్గా పూజ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోందని, ఇది సిగ్గుచేటని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. టీఎంసీ కల్పిస్తున్న ఆటంకాలను చూస్తుంటే, మండప నిర్వాహకులు భయంతో విజయదశమికి ముందుగానే దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఉన్నారని అమిత్ మాల్వియా ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ఏడాది కోల్‌కతాలో దుర్గా పూజలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ పూజల ప్రారంభానికి ముందు నుంచే అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని, ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ థీమ్‌తో ఏర్పాటు చేసిన మండపంలో పూజలను టీఎంసీ అడ్డుకుంటున్నదని మాల్వియా ఆరోపించారు. మరోవైపు భక్తులు వేడుకల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు కోల్‌కతా వీధుల్లో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారని అన్నారు. మాల్వియా తన ‘ఎక్స్’ ఖాతాలో .. దుర్గా పూజల్లో టీఎంసీ అనుసరిస్తున్న చర్యలు భారతదేశ ప్రజల జాతీయ గౌరవాన్ని కోల్పోయేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ అడ్డంకులు ఇలాగే కొనసాగితే, దశమి కంటే ముందే నిర్వాహకులు దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయవలసిన స్థాయికి పరిస్థితి దిగజారాలా ఉందని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతా నడిబొడ్డున ఇటువంటి హిందూ వ్యతిరేక చర్యలకు మమతా సర్కారు అనుమతిస్తే, అది తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.కాగా శుక్రవారం అమిత్ షా కోల్‌కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్‌లో దుర్గా పూజా మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన.. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వర్ణ బెంగాల్ వైభవాన్ని పునరుద్ధరించగల ప్రభుత్వాన్ని తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కలలను ప్రతిబింబించే విధంగా, సురక్షితమైన, సంపన్నమైన, ప్రశాంతమైన బెంగాల్ దార్శనికతను నెరవేర్చేలా తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆయన దుర్గామాతను ప్రార్థించారు. ప్రజలకు దుర్గాపూజ శుభాకాంక్షలు తెలిపారు. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. ఈడీ కోర్టులో మంత్రి లొంగుబాటు
కోల్‌కతా: ప్రాథమిక పాఠశాలల్లో నియామకాల అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రకాంత్ సిన్హా శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సిన్హా ఈడీ కోర్టులో హాజరై లొంగుపోతున్నట్లు ప్రకటించారని ఈడీ అధికారులు తెలిపారు.కాగా, కేసు విచారణకు గాను ఆయన్ను ఈడీ కస్టడీ కోరగా కోర్టు తోసిపుచ్చింది. షరతులకు లోబడి రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోల్‌కతా లేదా సొంత నియోజకవర్గం వీడి వెళ్లరాదని సిన్హాను కోర్టు ఆదేశించింది అని అన్నారు. కాగా, బిర్హుమ్ జిల్లాలోని బోల్పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
‘ఓటర్ అధికార్ యాత్ర’కు యూసుఫ్ పఠాన్
కోల్‌కతా: బీహార్‌లో ఓటరు జాబితా సవరణ పేరుతో కొందరు ఓటర్ల పేర్లను ప్రభుత్వం తొలగించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు ‘ఓటర్ అధికార్ యాత్ర’ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలో టీఎంసీ నేత, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ భాగస్వాములు కానున్నారు. ఆయనతో పాటు మరో టీఎంసీ నేత లలితేష్ త్రిపాఠి కూడా ఈ యాత్రలో పాల్గొననున్నారు.సెప్టెంబర్ ఒకటిన బీహార్‌లో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’లో యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు తృణమూల్ కాంగ్రెస్ తరపున పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 17న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ పాదయాత్రను ప్రారంభించారు. బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ ఈ యాత్రను చేపట్టారు. సోమవారం(సెప్టెంబరు ఒకటి)పట్నాలో జరిగే ఊరేగింపుతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగియనుంది. యూసుఫ్ పఠాన్, లలితేష్ త్రిపాఠిలు పట్నాలో జరిగే ‘ఓటర్ అధికార్ యాత్ర’కు ప్రాతినిధ్యం వహించనున్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్‌లోని 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు. బీహార్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ సహాయంతో ఓట్లను దొంగిలిస్తూ పట్టుబడటంతో బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. ముసాయిదా ఓటర్ల జాబితా నుండి 65 లక్షల మంది పేర్లను తొలగించడం అనేది వారి ఓటు హక్కుపై జరిగిన దాడిగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. -
నోరుపారేసుకున్న మహువా
కోల్‌కతా: సంచలనాలకు మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా మరో వివాదానికి తెరతీశారు. దేశంలోకి యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ చొరబాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడ్డుకోలేకపోతున్నారని, అందుకు శిక్షగా ఆయన తల నరికేయాలని తేల్చిచెప్పారు. శుక్రవారం పశి్చమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి చొరబాట్లు జరుగుతున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో రక్షణ భద్రత కేంద్ర హోంశాఖ మంత్రిగా పదవిలో ఉన్న అమిత్ షాదేనని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ పౌరుల రాకను అడ్డుకొనే సత్తా లేని అమిత్ షా ఆ నెపాన్ని పశి్చమ బెంగాల్ ప్రభుత్వంపై వేసి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చొరబాటుదార్లు వస్తున్నారంటూ తరచుగా గొంతు చించుకుంటున్న ఆయనకు వారిని అడ్డుకొనే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అక్రమ వలసల కారణంగా దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయంటూ ఆగస్టు 15న స్వాతంత్య్రం దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ షా చప్పట్లు కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారని గుర్తుచేశారు. దేశ సరిహద్దులను రక్షించేవారు లేకపోతే పొరుగుదేశాల నుంచి జనం వస్తూనే ఉంటారని, మన తల్లులు, అక్కాచెల్లెమ్మలపై కన్నేస్తారని, మన భూములు ఆక్రమించుకుంటారని పేర్కొన్నారు. సరిహద్దులను కాపాడలేకపోవడంతో చొరబాట్లను ఆపలేనందుకు అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలని మహువా మొయిత్రా పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలు క్షీణించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వమే కారణమని అన్నారు. గతంలో మన మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు శత్రుదేశంగా మారిపోయిందని చెప్పారు. మొయిత్రాది తాలిబన్ మైండ్‌సెట్: బీజేపీ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షాపై ఆమె చేసిన విమర్శల వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. మొయిత్రాది తాలిబన్ మైండ్‌సెట్, తాలిబన్ కల్చర్ అని ధ్వజమెత్తారు. ఆమెపై కొత్వాలీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొయిత్రా జిహాదీ ఉగ్రవాదుల తరహాలో మాట్లాడారని బీజేపీ అధికార ప్రతనిధి షెహజాద్ పూనవాలా ఆరోపించారు. మొయిత్రా వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. రాజకీయంగా ఎదిరించాలి తప్ప హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సరైంది కాదని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయడంలో తప్పులేదన్నారు. వ్యక్తిగతంగా మాటల దాడి చేయొద్దని సూచించారు. ఎవరైనా సరే వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టంచేశారు. Shameful and disgraceful!How can an elected MP like Mahua Moitra stoop so low as to use violent language against Shri Amit Shah ji?Such statements are not just an insult to democracy but also a dangerous encouragement of hatred and violence in public life.We strongly condemn… pic.twitter.com/X9XS5IA9zW— Lakshmi Singh (@LakshmiSinghBJP) August 29, 2025 -
గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అధికారులు అనూహ్యరీతిలో అరెస్ట్‌చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో, తనకు సంబంధించిన స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, తర్వాత ఎత్తయిన గోడ ఎక్కి బయటకు ఎలాగోలా దూకి పారిపోయారు. రెప్పపాటులో ఈ విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ఆయన వెంటబడిమరీ సమీప పొలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్ఫోన్లను సమీపంలోని బురదకుంటలో పడేశారు. అయినాసరే పోలీసులు వాటిని వెలికితీసి స్వాధీనంచేసుకున్నారు. మొబైల్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. బురదకొట్టుకుపోయిన ఎమ్మెల్యేను పొలం గట్టు వెంట పోలీసులు అరెస్ట్‌చేసి తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముర్షీదాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ నాటకీయ పరిణామం జరిగింది. అరెస్ట్ తర్వాత సాహాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆగస్ట్ 30వ తేదీదాకా ఈడీ రిమాండ్‌కు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యే సాహా సంబంధ స్థలాలతోపాట రఘునాథ్‌గంజ్‌లోని సాహా కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నివాసాల్లోనూ ఈడీ సోదాలుచేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది. ఇదే టీచర్లు, స్టాఫ్ నియామక కేసులో 2023 ఏప్రిల్‌లో సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించగా ఏమాత్రం సహకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్చేయాల్సి వచ్చిందని న్యాయస్థానంలో హాజరుపర్చిన సందర్భంగా ఈడీ వాదించింది. పశ్చిమబెంగాల్లో ప్రైమరీ టీచర్లతోపాటు 9, 10వ తరగతులు బోధించే అసిస్టెంట్ టీచర్లు, గ్రూప్–సి, డి సిబ్బంది నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సీబీఐ తొలుత కేసు నమోదుచేసింది. ఇందులోని వివరాలతో తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తును మనీలాండరింగ్ కోణంలో విస్తృతస్థాయిలో దర్యాప్తుచేసింది. ఈ కుంభకోణంలో కీలకసూత్రధారిగా భావిస్తున్న నాటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్‌చేశాయి. #Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam. Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025 -
ఇద్దరు ఎంపీల రగడ.. ‘ఆమెతో టైమ్ వేస్ట్.. ’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీల మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కింది. గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీఎంసీ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ-మహువా మొయిత్రాల మధ్య రగడ హద్దులు దాటింది. తాజాగా టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై మరో టీఎంసీ ఎంపి కళ్యాణ్ బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక టైమ్ వేస్ట్ మనిషి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ చీప్ విప్ పదవికి రాజీనామా చేసిన కళ్యాణ్ బెనర్జీ.. మహువా మొయిత్రా టార్గెట్‌గా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ ఆమె గురించి మాట్లాడి నా విలువైన సమయాన్ని వృథా చేసుకోను. ఆమె ఒక వేస్ట్. నేను దృష్టి సారించేంతగా ఆమెకు ఏ లక్షణాలు లేవు. ఆమె కారణంగా నేను చాలా మంది వద్ద చెడ్డవాడిగా మారిపోయాను. ఇప్పుడు మరోసారి ఆమె గురించి మాట్లాడటం అనవసరం. నా సమయం వేస్ట్ చేయకండి’ అంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ క్రమంలోనే తన అడ్వొకేట్కు ధన్యవాదాలు తెలిపారు. ‘ నా అడ్వొకేట్ నాకు ఒక మెస్సేజ్ చేశారు. నేను దానితో స్ఫూర్తి పొందాను. నేను ఎక్కువగా దృష్టి నిలపాల్సిన స్థాయి మొయిత్రాకు లేదు. నాకు ఇప్పుడు చాలా పని ఉంది’ అంటూ పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ నెలలో కళ్యాణ్ బెనర్జీ మహిళా ద్వేషి అంటూ మొయిత్రా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఆమె చేసిన వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీడ గుగ్గిలమయ్యారు. ‘ ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? అంటూ నిలదీశారు. ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.మొయిత్రా వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.వీరిద్దరూ బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు గతంలో కూడా చాలానే ఉన్నాయి. -
సువేందు అధికారి కాన్వాయ్‌పై దాడి.. తీవ్ర ఉద్రిక్తత
కూచ్ బెహార్: పశ్చిమబెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ కూచ్ బెహార్లో నిర్వహించిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఇటీవల బెంగాల్లో మహిళలపై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయన ర్యాలీ నిర్వహించగా.. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. దాడులకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఖగ్రాబారి ప్రాంతంలో సువేందు అధికారి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నల్ల జెండాలు పట్టుకున్న నిరసన కారులు ‘వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ధ్వంసమైంది. ఆ సమయంలోనే అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామాగా అంటూ టీఎంసీ నేతలు అభివర్ణిఇంచారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష గళాన్ని అణచివేయాలనే కుట్ర అంటూ బీజేపీ మండిపడింది. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ఉండడం వల్లే సువేందు ప్రాణాలతో బయటపడినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా
కోల్‌కతా: లోక్‌సభ ఎంపీ కల్యాణ్ బెనర్జీ టీఎంసీ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. సభలో ఎంపీల మధ్య సమన్వయం లేదంటూ అన్యాయంగా తనను నిందిస్తున్నారంటూ ఆవేదన చెందారు. పార్టీకి చెందిన చాలా మంది ఎంపీలు లోక్‌సభ సమావేశాలకు రావడమే అరుదని చెప్పారు. టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం పార్టీ ఎంపీలతో వర్చువల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటరీ విభాగంలో సమన్వయం కొరవడిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం కల్యాణ్ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంటరీ పార్టీలో సమన్వయం లేదంటూ వర్చువల్ మీటింగ్‌లో దీదీ(మమత)అన్నారు. అందుకు నేనే కారణం. అందుకే, రాజీనామా చేస్తున్నా’అని వివరించారు.పార్లమెంట్‌కు తరచూ డుమ్మాకొట్టే వారిని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని వదిలేసి ప్రతిదానికీ తననే తప్పుపట్టడంపై కల్యాణ్ బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పార్టీ ఎంపీ మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇంతకుముందు, మరో ఎంపీ కీర్తి ఆజాద్‌తో కల్యాణ్ బెనర్జీ వివాదం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ఘటనే తాజా పరిణామాలకు దారి తీసిందని చెబుతున్నారు. ఓ ఎంపీ తనను వ్యక్తిగతంగా అవమానించినా పార్టీ నాయకత్వం మౌనందాల్చిందంటూ పరోక్షంగా మహువా మొయిత్రా నుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘లోక్‌సభ ఎంపీల మధ్య పోట్లాటలు, తగవులు జరుగుతున్నాయని దీదీ అంటున్నారు. నన్ను దూషించిన వారిని వదిలేయాలా? ఈ విషయం నేను నాయకత్వానికి చెప్పినా, నాదే తప్పంటున్నారు. మమతా బెనర్జీని ఆమె ఇష్టమొచ్చినట్లుగా పార్టీని నడుపుకోనివ్వండి’అంటూ నిర్వేదం చెందారు. టీఎంసీ పార్లమెంటరీ పార్టీలో కీలక మార్పు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధిష్టానం పార్లమెంటరీ పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు జరిగాయి. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అభిషేక్ బెనర్జీకి లోక్‌సభ నేతగా బాధ్యతలు అప్పగించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నేత ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తిరిగి వచ్చే వరకు ఆయన స్థానంలో అభిషేక్ కొనసాగనున్నారు. -
సీఎం మమతకు ఝలక్!.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన టీఎంసీ ఎమ్మెల్యే
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. తాను కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 50 స్థానాల్లో పోటీ చేస్తుందని బాంబు పేల్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.భరత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. ఇటీవలి కాలంలో పార్టీ హైకమాండ్‌ను టార్గెట్ చేసి పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నేతలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యే కబీర్‌ను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలను వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు కబీర్ ప్రకటించారు.Trinamool Congress (TMC) MLA, Humayun Kabir, has announced the formation of a new political party NTMC (No TMC) 🎃# News is true, party name is #Satire pic.twitter.com/HpJMmUDGSU— The Story Teller (@IamTheStory__) July 24, 2025టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పట్ల నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ, కొందరు నేతలు నన్ను టార్గెట్ చేశారు. అందుకే నేను పార్టీని వీడాలనుకుంటున్నాను. జనవరి 1, 2026వ తేదీన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నాను. మన పార్టీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. నా కొత్త పార్టీ ముర్షిదాబాద్‌కు మాత్రమే పరిమితం కాదు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, నదియాలోని కొన్ని ప్రాంతాలలో 50–52 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక, హుమాయున్ కబీర్ మైనారిటీలు ఎక్కువగా ఉండే భరత్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్లో ఆయన కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో, ఆయన కొత్త పార్టీ.. అధికార టీఎంసీకి ఓట్లను చీల్చే అవకాశం ఉంది. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్‌కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్‌కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్‌కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ
కోల్‌కతా: లా విద్యార్ధిని గ్యాంగ్ రేప్ నిందితులకు.. టీఎంసీ అగ్రనేతలకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ బీజేపీ నేతలు అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 26న సౌత్ కలకత్తా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే చోటుచేసుకున్న తాజా ఉదంతం బెంగాల్లో మరోమారు రాజకీయ దుమారాన్ని రేపుతోంది.ఈ కేసులోని నిందితులకు, టీఎంసీ అగ్ర నేతలకు మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విమర్శల దాడి ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి, పార్టీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియాలు తాజాగా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్యతో సహా పలువురు టీఎంసీ నేతల పక్కన నిందితుడు మనోజిత్ మిశ్రా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఒక పోస్టులో షేర్ చేశారు. Yet again Mamata Banerjee's govt is found standing with the accused!Accused no 1 Manojit Mishra is a TMC member!Whether it is RG Kar Rape and Murder case where Mamta Banerjee tried to silence victims parents,Or now when accused in Kasba gangrape case is found to be a TMC… pic.twitter.com/mYuAYjRgwh— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 27, 2025‘మళ్లీ మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది. మనోజిత్ మిశ్రా టీఎంసీ సభ్యుడు అని బీజేపీ నేత భండారి పేర్కొన్నారు. టీఎంసీ నిందితులను కాపాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఎందుకు మౌనం? ఎవరిని కాపాడుతారు?” అని బీజేపీ నేత మాల్వియా ప్రశ్నించారు. మమతా బెనర్జీ పాలన.. బెంగాల్ మహిళలకు ఒక పీడకలగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణలకు స్పందించిన టీఎంసీ మహిళా నేత శశి పంజా ఈ ఘటనను ఖండించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని, ఈ కేసలో నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం -
బెంగాల్లో లా విద్యార్థి ఘటన.. ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచార ఘటన మరువక ముందే.. కోల్‌కతాలోని ఓ న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థిని సామూహిక అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వరుస ఘటనలపై ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.బెంగాణలో పరిస్థితులపై తాజాగా ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి స్పందిస్తూ..‘న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థిని సామూహిక అత్యాచారం జరగడం దారుణం. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు అధికార టీఎంసీకి చెందిన వారే. గతంలో నా కుమార్తె అత్యాచారానికి గురైనప్పుడు వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కావని భావించాం. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి రాజకీయ పార్టీలే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.ఘటన వివరాలు.. ఇదిలా ఉండగా.. దక్షిణ కోల్కత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మోనోజిత్ బెదిరింపు..మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది.‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు. -
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆర్జీకర్ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూమ్‌లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Kolkata Law student gang-raped inside college campusDo not repost @ravish_journo will get angry if news go viral. pic.twitter.com/Q8sqXyeCmt— Lala (@FabulasGuy) June 27, 2025కోల్‌కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్‌కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్‌లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్‌రేప్ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం యూనిట్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. కాళ్లమీద పడ్డా కనికరించని నిందితులుబాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూమ్‌లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముగ్గురిలో నిందితుల్లో ఒకరైన మిశ్రా నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. అంతే మిశ్రా కోపంతో రగిలిపోయాడు. నన్ను ఓ రూమ్‌లోకి నెట్టి తాళం వేశాడు. నన్ను,నా స్నేహితుడిని చంపేస్తామని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు.దారుణం జరుగుతుండా వీడియోలు తీసివద్దని మిశ్రా కాళ్లమీద పడ్డా కనికరించలేదు. గార్డ్ రూమ్‌కి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్‌తో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయ’ని బాధితురాలి ఫిర్యాదుతో కస్బా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.నిందితులకు ఐదురోజుల పోలీస్ కస్టడీజూన్ 26న తల్బాగన్ క్రాసింగ్‌లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్‌లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు గతేడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. లా విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.స్పందించిన టీఎంసీఈ తరుణంలో లా విద్యార్థినిపై జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు.అయినప్పటికీ, కాలేజీలు, విద్యాసంస్థలలో పోలీసులను మోహరించడం సాధ్యం కాదు’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై పోరాడాలి. అది ప్రభుత్వ కళాశాల అయినా.. కళాశాల పరిపాలనపై విభాగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులే బాధ్యత వహించాలిఈ సంఘటనపై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కోల్‌కతాలోని మొత్తం పోలీసులను దిఘా (రథ యాత్రలో)కి పాల్గొన్నారు. కోల్‌కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కొనసాగే హక్కులేదని మండిపడ్డారు. কলকাতার কসবা ল' কলেজ ক্যাম্পাসের মধ্যে এক তরুণীর উপর নৃশংস গণধর্ষণের ঘটনায় আমি স্তম্ভিত। এই জঘন্য অপরাধের সঙ্গে জড়িত তিনজন অভিযুক্তের মধ্যে মূল মাথা হিসেবে চিহ্নিত হয়েছে তৃণমূল ছাত্র পরিষদের প্রভাবশালী নেতা মনোজিৎ মিশ্র (৩১)। পুলিশ তাকে গতকাল সন্ধ্যায় তালবাগান ক্রসিংয়ের কাছে… pic.twitter.com/ishPpC7Iui— Suvendu Adhikari (@SuvenduWB) June 27, 2025 బాధితురాలికి అండగా బీజేపీమరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదని అభివర్ణించారు. ఈ నేరాన్ని ఒక మాజీ విద్యార్థి,ఇద్దరు కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఆర్జీ కార్ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ..పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తోందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని అన్నారు. 🔴 RAPE IN A REPUTED LAW COLLEGE IN KOLKATA BY A TMC LEADERAnother shameful chapter has been added to Bengal’s collapsing law and order under TMC rule.▶️ A female student of a prestigious law college in South Kolkata was brutally gang-raped—not in some dark alley, but right… pic.twitter.com/PFVpEOR7Mj— Amit Malviya (@amitmalviya) June 27, 2025 -
కాలీగంజ్ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన టీఎంసీ
నదియా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జూన్ 19న జరగనున్న కాలీగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Kaliganj Assembly by-election)కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తమ అభ్యర్థిగా అలీఫా అహ్మద్‌ను ప్రకటించింది. అలీఫా అహ్మద్ దివంగత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ కుమార్తె. ఈ విషయాన్ని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది.‘పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మార్గదర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం. కాలీగంజ్ అభ్యర్థి అలీఫా అహ్మద్’ అని టీఎంసీ తెలిపింది. సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు నసీరుద్దీన్ అహ్మద్(Naseeruddin Ahmed) మృతితో కాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ‘లాల్ దా’గా పేరొందిన అహ్మద్ తన 70వ ఏట కన్నుమూశారు. ఆయన కాలీగంజ్ నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు.ఈ సీటుకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణ తర్వాత, కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 19న ఉప ఎన్నిక జరగనున్నదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆదే రోజున ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాలీగంజ్ ఒకటి. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23న ప్రకటించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. జూన్ 3న వీటి పరిశీలన జరగనుంది. అభ్యర్థులు జూన్ 5 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు దుర్మరణం -
అల్లర్ల కుట్రలో బీఎస్ఎఫ్, నిఘా సంస్థలు
కోల్‌కతా: వివాదాస్పద వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో కొనసాగిన ఘర్షణలు, హింసాత్మక ఘటనల వెనుక కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సరిహద్దు భద్రతా బలగం(బీఎస్ఎఫ్), నిఘా వర్గాల హస్తముందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం కోల్‌కతాలో ముస్లిం మతాధికారులతో సమావేశం సందర్భంగా మమత మాట్లాడారు. ‘‘ అరాచక, సమాఖ్య వ్యతిరేక వక్ఫ్(సవరణ) చట్టాన్ని ప్రధాని మోదీ అమలుచేయొద్దు. దీని అమలు కొనసాగితే అది దేశాన్ని ముక్కలుచేస్తుంది. సొంత రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ప్రధాని మోదీ వెంటనే పదవి నుంచి తప్పించాలి. ఓవైపు బంగ్లాదేశ్‌లో అస్థిర పరిస్థితులు రాజ్యమేలుతుంటే బీజేపీ సర్కార్ హడావుడిగా వక్ఫ్ చట్టం తెచ్చింది. బెంగాల్లో హింసకు కేంద్ర హోం శాఖ పథకరచన చేసింది. ఈ కుట్రలో బీఎస్ఎఫ్ పాత్రపై విచారణ జరిపించాలి. సరిహద్దును పరిరక్షించాల్సిన బాధ్యత బీఎస్‌ఎఫ్‌ది కాదా?. అంతర్జాతీయ సరిహద్దును మా(టీఎంసీ) ప్రభుత్వం పరిరక్షించదు. ఈ విషయంలో కేంద్రం తన బాధ్యతలను విస్మరించకూడదు. బెంగాల్ అల్లర్లలో మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల నష్టపరిహారం ఇస్తున్నా. సరిహద్దు దాటి బెంగాల్లోకి బంగ్లాదేశీయులు చొరబడుతుంటే నిర్లక్ష్యంగా ఉన్న బీఎస్ఎఫ్ వైఖరిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తున్నా’’ అని మమత అన్నారు. ‘‘అమిత్ షా ఎన్నటికీ ప్రధాని కాలేరు. మోదీజీ ప్రధాని పీఠం నుంచి దిగిపోయాక అమిత్ షా ఏం చేస్తారు?. కేంద్ర నిఘా సంస్థలను అమిత్ షా దుర్వినియోగం చేస్తున్నారు. అమిత్ షా కార్యకలాపాలపై మోదీ ఓ కన్నేసి ఉంచాలి. మోదీ అమిత్‌కు అడ్డుకట్టవేయాల్సిందే’’ అని మమత అభ్యర్థించారు. స్థానిక కాంగ్రెస్ నిర్లక్ష్యమూ దాగి ఉందిఘర్షణల వెనుక టీఎంసీ ఉందన్న ఆరోపణలను మమత ఖండించారు. ‘‘ ఘర్షణలు జరిగిన ధులియాన్, షంషేర్‌గంజ్‌లు మాల్డా దక్షిణ్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. కాంగ్రెస్ నేత ఇషా ఖాన్ చౌదరి అక్కడ ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ క్రియాశీలకంగా ఉంది. ఈ ఘర్షణల వెనుక నిజంగా టీఎంసీ ఉంటే మా ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారులు ఎందుకు దాడులు చేస్తారు?. మా పార్టీ కార్యాలయాన్ని ఎందుకు ధ్వంసం చేస్తారు? అని మమత ఎదురు ప్రశ్నించారు. ముస్లిం మతాధికారులు వక్ఫ్ అంశంలో నేరుగా రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలను కలిసి తమ ఆందోళనను తెలియజేయాలి. వక్ఫ్‌కు వ్యతిరేకంగా విపక్షాల ‘ఇండియా’ కూటమి తుదికంటా పోరాడుతుంది’’ అని అన్నారు.ఆయన యోగి కాదు భోగితనపై విమర్శలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మమత ప్రతివిమర్శలు చేశారు. ‘‘యోగి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన యోగి కాదు పెద్ద భోగి. మహాకుంభమేళాలో తొక్కిసలాటలో ఎంత మంది చనిపోయారు?. మీ రాష్ట్రంలో పోలీస్ ఎన్కౌంటర్లలో ఎంత మందిని చంపేశారు?. రాష్ట్రంలో శాంతియుత ర్యాలీలను కూడా యోగి అనుమతించట్లేదు. బెంగాల్లో మాత్రం ప్రజలు స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు’’ అని అన్నారు. హిందువులను బాధితులుగా మారుస్తున్న మమత సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ విమర్శించింది. -
టీఎంసీలో అంతర్గత విభేదాలు.. ఆగని అమిత్ మాలవీయ వరుస పోస్టులు
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పోరును బీజేపీ రచ్చకెక్కించింది. టీఎంసీ నేతల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు, వాట్సప్ చాట్లను కమలం పార్టీ బయటపెట్టింది. సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మరో ఎంపీ మధ్య గొడవ జరిగిందని.. అదీ ఎన్నికల సంఘం కేంద్రకార్యాలయం వద్దేనంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయ వాటిని షేర్ చేశారు. ఈ క్రమంలో ఇంకా వరుస వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు.మాలవీయ చేసిన పోస్టుల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రతినిధుల బృందం ఒక ప్రజెంటేషన్‌ను సమర్పించడానికి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లింది. ఆ టైంలో.. ఈసీ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు ఒకసారి సమావేశం కావాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. కానీ సదరు ఎంపీ ఆ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. నేరుగా ఈసీ వద్దకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే.. ఇద్దరు ఎంపీల మధ్య గొడవకు దారితీసి పోలీసుల జోక్యం దాకా వెళ్లింది. అమిత్ మాలవీయా షేర్ చేసిన వీడియోలో కల్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై ‘‘ఇదంతా పబ్లిక్ ప్లేస్. కాస్త సంయమనం పాటించండి’’ అని ఊగిపోతూ కనిపించినట్లు ఉంది. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రిన్ మధ్యలో వచ్చి‘‘మీడియాలో ప్రసారమవుతుంది. వద్దు..’’ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. కొసమెరుపు ఏంటంటే.. ఈ వ్యవహారం తర్వాత పార్లమెంట్ సభ్యులు బెనర్జీ, కీర్తి ఆజాద్ చాటింగ్ చేసుకుంటే.. ఏఐటీసీ ఎంపీ 2024 పేరిట ఉన్న గ్రూపులోని ఆ సంభాషణను కూడా మాలవీయ బయటపెట్టారు. ఆ సంభాషణ ధాటి తట్టుకోలేక సదరు మహిళా ఎంపీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు ఆ షేరింగ్‌లో ఉంది. Soon after the public spat between two TMC MPs in the precincts of the Election Commission of India on 4th April 2025, the irate MP continued slandering the ‘Versatile International Lady (VIL)’…This is the stuff legends are made of! pic.twitter.com/dsubQrmQUj— Amit Malviya (@amitmalviya) April 8, 2025ఇక ఈ వ్యవహారంపై టీఎంసీ నేత సౌగతారాయ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ అంతర్గత గోప్యతను కాపాడుకోవాలంటూ టీఎంసీ నేతలకు హితవు పలికారు. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ మహిళా ఎంపీ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. కల్యాణ్ ప్రవర్తనపై పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అని రాయ్ అన్నారు. అయితే అమిత్ మాలవీయా ఇక్కడితోనే ఆగలేదు. సౌగతారాయ్ను తీవ్రంగా విమర్శించిన కళ్యాణ్ బెనర్జీ వీడియోను సైతం షేర్ చేశారు.A defiant Kalyana Banerjee, one of the TMC MP, who had a bitter altercation with someone he described as ‘versatile international lady’… pic.twitter.com/JSieKoVynw— Amit Malviya (@amitmalviya) April 8, 2025 TMC MP Kalyan Banerjee won’t stop at anything. He hits back at his senior colleague Saugata Roy after Roy claimed that Banerjee is damaging TMC’s public image. In a sharp retort, Kalyan calls Roy a man with ‘no character,’ labelling him a ‘chor’ in reference to the Narada case.… pic.twitter.com/5LrNexOLGL— Amit Malviya (@amitmalviya) April 8, 2025 మరోవైపు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గోప్యంగా ఈ విషయాన్ని ఉంచాలని మొదటి నుంచి భావించారట. అయితే ఈలోపే బీజేపీ నేత అమిత్ మాలవీయ పోస్టులతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని బెంగాలీ న్యూస్ ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. -
మహిళలకు బీజేపీ మాజీ ఎంపీ వార్నింగ్.. మీ గొంతు నులిమేస్తా అంటూ..
కోల్కత్తా: బెంగాల్లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ సహనం కోల్పోయి స్థానిక మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, బెంగాల్ మహిళలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బెంగాల్‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ శుక్రవారం ఖరగ్‌పూర్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా ఖరగ్‌పూర్‌లోని వార్డు నంబర్-6లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు, స్థానికులు హాజరయ్యారు. అయితే, రోడ్డు ప్రారంభోత్సం సందర్బంగా దిలీప్ ఘోష్‌ను అక్కడున్న మహిళలు అడ్డగించారు. మేం ఇప్పుడు గుర్తొచ్చామా?. మీరు ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియాకు ఎందుకు ఒక్కసారి కూడా రాలేదని నిలదీశారు. రోడ్డును మా కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మిస్తే మీరు వచ్చి ప్రారంభిస్తారా? అని ప్రశ్నించారు.మహిళల ప్రశ్నలకు దిలీప్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. వారితో వాదిస్తూ..‘ఈ రోడ్డు నిర్మాణానికి నేనే డబ్బులు ఇచ్చాను. మీ తండ్రి డబ్బులతో రోడ్డు వేయలేదు. కావాలంటే వెళ్లి ప్రదీప్ సర్కార్‌ను అడగండి’ అంటూ మండిపడ్డారు. ఆయన సమాధానానికి సదరు మహిళలు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. మరోసారి మహిళలు కల్పించుకుని.. మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?. ఎంపీ మీరు కదా.. రోడ్డు వేయాల్సింది కూడా మీరే అని అని నిలదీశారు. ఈ క్రమంలో పూర్తిగా సంయమనం కోల్పోయిన దిలీప్ ఘోష్ బెదిరింపులకు దిగారు. వెంటనే..‘అలా అరవకండి. అలా అరిస్తే మీ గొంతు నులిమేస్తా’ అని మహిళకు వార్నింగ్ ఇచ్చారు.ছিঃ! একজন মহিলাকে বিজেপি নেতা দিলীপ ঘোষ কিভাবে হুমকি দিচ্ছে, শুনে নিন! বিজেপির থেকে এর বেশি আর কিই বা আশা করা যায়? ধিক্কার বিজেপিকে!#ShameOnBJP #DilipGhosh #bjpwestbangal pic.twitter.com/JdGL4guhJc— Banglar Gorbo Mamata (@BanglarGorboMB) March 21, 2025అనంతరం, మహిళలకు, దిలీప్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో.. భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు దిలీప్ ఘోష్‌ను వెంటనే కారు ఎక్కించగా.. మహిళలు వాహనాన్ని చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే ఘోష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. తాను పార్లమెంటేరియన్‌గా ఉన్న సమయంలోనే ఎంపీ లాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుకు డబ్బు ఇచ్చానని వివరణ ఇచ్చారు. అయితే, మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీంఎసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. দিলিপ ঘোষেরা বাংলার মা বোনেদের কনো দিন সম্মান করেনি আর করবেও না, দেখুন ভিডিও টা, #DilipGhosh #BJPLeader #WestBengal #Kharagpur #exmp #foryoupage #banglaviral #highlighteveryone pic.twitter.com/EWSvjXjvTf— Belal Hossen🇮🇳 (@BelalHossen786) March 22, 2025 -
‘ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు’.. దీదీతోనే నా ప్రయాణం
కోల్‌కతా: ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు తన ప్రయాణం తన మేనత్త, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనేనని ఆమె మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పష్టం చేశారు. సీఎం మమతతో విభేదాలున్నాయన్న ప్రచారాన్ని ఖండించారు. గొంతు కోసినా బీజేపీలో చేరని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తాను బీజేపీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. నా మెడలు విరిచినా సరే ఆ పని చేయను’ అని స్పష్టం చేశారు.కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో గురువారం టీఎంసీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అభిషేక్ బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు గురించి జరుగుతున్న ప్రచారంపై మాట్లాడారు.VIDEO | TMC MP Abhishek Banerjee (@abhishekaitc) addresses party workers at Netaji Indoor Stadium, Kolkata. He says, "Till the time all of you are with us, we will continue to demolish BJP's 'chakravyuh'... Those who spoke ill about the party have been identified. I was the one… pic.twitter.com/4HeVzVAZVY— Press Trust of India (@PTI_News) February 27, 2025 కొంతమంది నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లెవరో నాకు తెలుసంటూ.. టీఎంసీ మాజీ నేతలు ముకుల్ రాయ్,సువేందు అధికారి పేర్లను ప్రస్తావించారు. నేను మోసగాణ్ని కాదు. నా మెడలు విరిచినా, నా నాలుక చీల్చినా బీజేపీలో చేరను. మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ.. తనకు తన మేనత్త సీఎం మమతా బెనర్జీకి మధ్య విబేధాలున్నాయన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నేను టీఎంసీలోనే కొనసాగుతా. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థరాజకీయాలు చేస్తున్న ముకుల్ రాయ్, సువేందు అధికారి ద్రోహులుగా అభివర్ణించారు. అనంతరం,టీచర్ రిక్రూట్మెంట్ స్కాంలో తనని విచారణ చేపట్టేందుకు సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ గురించి ప్రస్తావించారు. ప్రతిపక్ష నేతలతో సీబీఐ ఎలా వ్యవహరించిందో నాతో అలాగే వ్యవహరిస్తోంది. పాపం సీబీఐ ఏం చేస్తోంది? చెప్పండి. దాని రాజకీయ గురువుల ఆదేశానుసారం వ్యవహరిస్తోంది.టీచర్ స్కాంలో తన గురించి ఒక్క ఆధారం బయటపెట్టలేదు. ఇదే విషయం గురించి సీబీఐని అడుగుతుంటే ఒక్క సమాధానం చెప్పడం లేదు. చెప్పడానికి సంకోచిస్తోంది. ఒక్కోసారి సీబీఐ తీరు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది. ఐదేళ్ల క్రితం ఇదే విషయం చెప్పా. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. టీచర్ స్కాంలో నేను నేరస్తుడిని అని నిరూపిస్తూ సీబీఐ కోర్టుకు ఆధారాల్ని అందిస్తే నాకు నేనుగా ఉరివేసుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. -
‘‘అలాగైతే ఇండియా కూటమిని రద్దు చేయండి’’
ఒకవైపు విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు నడుస్తుండగా.. భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసం మాత్రమే కూటమి మనుగడ కొనసాగాలనుకుంటే.. వెంటనే దానిని రద్దు చేయాలని సూచించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్‌లు తలపడుతుండడమే అందుకు కారణం. ఎన్సీ అధినేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘ఢిల్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఆ ఎన్నికలతో మాకు సంబంధం లేదు కాబట్టి. కానీ, మా ఇండియా కూటమికి ఓ కాలపరిమితి అంటూ లేకుండా పోయింది.దురదృష్టవశాత్తూ.. ఇండియా కూటమి సమావేశాలు జరిగినా నాయకత్వం, ఎజెండా, దాని మనుగడ గురించి స్పష్టత లేకుండా పోయింది. కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే కూటమి అనుకుంటే గనుక దానిని రద్దు చేస్తేనే మంచిది అని అభిప్రాయపడ్డారాయన.#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, "... I cannot say anything about what's going on in Delhi because we have nothing to do with Delhi Elections... As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG— ANI (@ANI) January 9, 2025ఇదిలా ఉంటే.. కిందటి ఏడాదిలో జరిగిన జమ్ము కశ్మీర్(Jammu Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, ఎన్సీ కలిసే పోటీ చేసి విజయం సాధించాయి. అయితే.. మొన్నీమధ్య ఈవీఎంల వ్యవహారంలో ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీతో విబేధించారు. ఈవీఎంలను నిందించడం ఆపేసి గెలుపోటములను అంగీకరించాలని సలహా కూడా ఇచ్చారు. అయితే సీఎం అయ్యాక ఆయన ధోరణి మారిందంటూ కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ మధ్యలో..బీజేపీపైనా ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు గుప్పించడంతో ఆయన విపక్ష కూటమికి దూరం అవుతున్నారనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ వెంటనే ఆయన అమిత్ షాను కలవడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అయితే.. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రహోదా పునరుద్దరణ కోసమే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు స్పష్టత ఇచ్చారు.తేజస్వి కామెంట్లతో.. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమి రద్దు వ్యాఖ్యలు ఊరికనే చేయలేదు. ఇండియా కూటమిలో గత కొంతకాలంగా నాయకత్వం విషయంలో బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియా కూటమిని కాంగ్రెస్ ముందుండి నడిపించాలని భావిస్తుండగా.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎస్పీ, ఆర్జేడీ లాంటి కొన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ కాంగ్రెస్ వెంట ‘బీజేపీ వ్యతిరేక నిరసనల్లో’’ ఈ రెండు పార్టీలు కలిసి రాలేదు. దీంతో ఇండియా కూటమి మనుగడపై నీలినీడలు కమ్ముకున్నాయనన్న చర్చ నడిచింది. ఈ తరుణంలో.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ ఫైట్ ఈ గ్యాప్‌ను మరింతగా పెంచాయి. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, దానిని ఇండియా కూటమి నుంచి దూరం పెట్టాలని ఆప్ డిమాండ్ సైతం చేసింది. ఈ పోటీని ఉద్దేశించి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేసిన కామెంట్లపైనే ఆయన అలా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ తేజస్వి ఏమన్నారంటే.. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యం. కాబట్టి కూటమి ఆ లక్ష్యం వరకే కట్టుబడి ఉంటుంది. అలాంటప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఆప్‌లు తలబడడం అసాధారణమైనదేం కాదు’’ అని తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ పరిణామంపై బీజేపీ సైతం స్పందించింది. ‘‘దేశీయంగా, అంతర్జాతీయంగా కుంభకోణాలు చేసినవాళ్లు, కేసులు ఉన్నవాళ్లు.. నిజాయితీపరుడైన మోదీకి వ్యతిరేకంగా ఒక్కతాటి మీదకు వచ్చాయి’’ అని ఎద్దేవా చేసింది. -
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘దీదీ’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ బుధవారం(జనవరి 8) ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది. ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు. తృణమూల్ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆప్ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదీ చదవండి: రమేష్ బిదూరిపై బీజేపీ చర్యలు -
సందేశ్‌ఖాలీ ఘటన .. విపక్షాలపై దుమ్మెత్తిపోసిన దీదీ
కోల్‌కతా : బీజేపీ,ఇతర ప్రతిపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) దుమ్మెత్తి పోశారు. సందేశ్‌ఖాలీపై తప్పుడు కథనాల్ని ప్రచారం చేసేందుకు పెద్దమొత్తంలో నిధుల్ని ఖర్చు చేశారని ఆరోపించారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్(trinamool congress)కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో సోమవారం తొలిసారి మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీలో పర్యటించారు.ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ..‘నిందితుల్ని ప్రోత్సహించవద్దు. నకిలీ వార్తలను వ్యాప్తి చేసేలా ఇక్కడ (సందేశ్‌ఖాలీ) పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశారని నాకు తెలుసు. కానీ దాని గురించి నేను పెద్దగా మాట్లడదలుచుకోలేదు. అబద్ధానికి అందం ఎక్కువ. నిజానికి సహనం తక్కువ. ఆ అందమైన అబద్ధాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వదు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది’ అని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దీదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశ్‌ఖాలీ (sandeshkhali) స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. అయినప్పటికీ తాజా పర్యటనలో ఆ ఆందోళనల్ని ప్రస్తావించలేదు. పరోక్షంగా వాటిని నేను ఎప్పుడో మరిచి పోయా. ఇక్కడి మహిళలు మోసగాళ్లను నమ్మకండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అలాంటి వారిపట్ల తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు.సందేశ్‌ఖాలీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించా. ప్రచారంలో ఎన్నికల ఫలితాల తర్వాత సందేశ్ ఖాలీని పర్యటిస్తారా? అని స్థానికులు నన్ను ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యటనకు వస్తానని మాట ఇచ్చా. మాట ప్రకారం మీ ముందుకు వచ్చా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో స్థానికులు ప్రయోజనం పొందుతున్నారా? లేదా? ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఇప్పుడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు, పురుషులు ప్రపంచంలో నెంబర్‌వన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను’అంటూ మమతా బెనర్జీ ఆకాంక్షించారు.సందేశ్‌ఖాలీ వివాదం ఏంటి?పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ అనే ప్రాంతంలో టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతని అనుచరులు తమపై లైంగిక దాడులు చేసేందుకు, తమ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని అక్కడి మహిళలు ఈ ఏడాది ప్రారంభంలో ఆందోళన చేపట్టారు. మహిళల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ ఆందోళనల నేపథ్యంలో షాజహాన్‌ఖాన్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు కూడా జరిపింది. దాడులు జరుపుతున్న సమయంలో షాజహాన్‌ఖాన్ మనుషులు ఈడీ సిబ్బందిపై దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి షాజహాన్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులకే షాజహాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. -
రాజకీయ వారసులపై మమత ఆసక్తికర కామెంట్స్
కోల్‌కతా:తన రాజకీయ వారసులెవరన్న దానిపై పశ్చిమబెంగాల్ సీఎం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయమై మాట్లాడారు. ‘నా రాజకీయ వారసులెవరన్నదానిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అంటే నేనొక్కదాన్నే కాదు.మా పార్టీ నేతలు, కార్యకర్తలంతా క్రమశిక్షణ కలిగిన సైనికులు. మాకు ఎమ్మెల్యులు,ఎంపీలు,బూత్ వర్కర్లున్నారు. ఇంతమంది కలిస్తేనే పార్టీ అవుతుంది. నా రాజకీయ వారసులపై పార్టీలో ఉన్నవారంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. పార్టీలోకి ఈరోజు కొత్తగా వచ్చినవారు రేపు సీనియర్లవుతారు’అని మమత వ్యాఖ్యానించారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్లు,జూనియర్ల మధ్య గ్రూపు తగాదాలు జరుగుతున్న వేళ మమత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, తృణమూల్ కాంగ్రెస్‌లో మమత తర్వాత ఆమె మేనల్లుడు అభిషేక్‌బెనర్జీ పార్టీ పగ్గాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ఢిల్లీలో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్ -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్‌వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
ఉప ఎన్నికల్లో అధికార పార్టీల హవా
న్యూఢిల్లీ: పదమూడు రాష్ట్రాల్లో 46 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లో బీజేపీ, దాని మిత్రపక్షాలు తమ స్థానాలను మళ్లీ గెల్చుకున్నాయి. పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. అత్యధికంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు 26 చోట్ల గెలిచాయి. ఇవి గతంలో పోలిస్తే అదనంగా తొమ్మిది స్థానాల్లో గెలవడం విశేషం. కాంగ్రెస్ ఏడు చోట్ల గెలిచింది. గతంలో గెలిచిన స్థానాల్లో ఆరింటిని చేజార్చుకుంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరిగిన ఆరు స్థానాల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఐదు స్థానాలను నిలబెట్టుకున్న టీఎంసీ ఈసారి మదారిహాట్ను బీజేపీ నుంచి లాగేసుకుంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్యకళాశాలలో జూనియర్ వైద్యురాలి రేప్, హత్యోదంతం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైనాసరే ఆ అంశం రాష్ట్రంలో టీఎంసీ హవాను ఆపలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మూడు చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ రెండు చోట్ల గెలిచాయి. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిలోని సీపీఐ(ఎం) పార్టీ, రాజస్థాన్‌లో భారత్ ఆదివాసీ పార్టీ(బీఏపీ) పార్టీ ఒక్కో స్థానంలో జయకేతనం ఎగరేశాయి. యూపీలో బీజేపీ హవా ఉత్తరప్రదేశ్‌లో 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా అధికార బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. రాష్ట్రంలోని కుందార్కీ, ఘజియాబాద్, ఖేర్, ఫూల్పూర్, ఖతేహరీ, మఝావాన్లో బీజేపీ గెలిచింది. కర్హాల్, సిషామావూలలో సమాజ్‌వాదీ పార్టీ, మీరాపూర్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ విజయం సాధించాయి. కుందార్కీ స్థానంలో 12 మంది పోటీచేస్తే అందులో 11 మంది ముస్లిం అభ్యర్థులే. ఈ 11 మంది అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి ఏకైక హిందూ అభ్యరి్థ, బీజేపీ నేత రామ్‌వీర్ సింగ్ ఏకంగా 1,44,791 ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1993 నుంచి చూస్తే ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. ఖతేహరీలోనూ 1991 తర్వాత బీజేపీకి తొలిసారిగా విజయం దక్కింది. రెండూ క్రాంతికారీకే సిక్కింలోని రెండు స్థానాలను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకగ్రీవంగా గెల్చుకుంది. రాజస్థాన్‌లో అధికార బీజేపీ ఏడింటికిగాను ఐదు చోట్ల జయపతాకం ఎగరేసింది. అస్సాంలోని ఐదు స్థానాలనూ బీజేపీ, దాని మిత్రపక్షాలే గెల్చుకున్నాయి. బీజేపీ మూడు చోట్ల, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(యునైటెడ్) ఒక్క స్థానంలో గెలిచాయి. పంజాబ్‌లోని నాలుగు స్థానాల్లో మూడింటిని ఆమ్ ఆద్మీ పార్టీ తన వశంచేసుకుంది. బిహార్‌లోని నాలుగు స్థానాలకుగాను రెండు చోట్ల బీజేపీ, ఒక చోట హిందుస్తానీ ఆవామ్ మోర్చా, మరో చోట జనతాదళ్(యునైటెడ్) గెలిచాయి. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్ పార్టీ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు. కర్ణాటకలోని మొత్తం మూడు సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అభ్యర్థి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ గిద్దెర్బహాలో ఓడారు, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సతీమణి అమృత, గుర్దాస్పూర్ ఎంపీ సుఖ్జీందర్ రంధావా భార్య జతీందర్ కౌర్ సైతం ఓడారు. ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
టీఎంసీ నేత దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్
బీర్భూమ్: పశ్చిమ బెంగాల్లో మరోదారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన నేత హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోల్పూర్ పట్టణ సమీపంలోని పరుల్‌దంగా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.టీఎంసీ నేత సమీర్ తాండర్ (40) తన ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. సమీర్ తాండర్ కంకలితల పంచాయతీ సభ్యునిగా ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమీర్ తాండార్ కుమారుడు ప్రతీక్ తాండర్ మాట్లాడుతూ గ్రామస్తులు కొందరు తన తండ్రిపై దాడి చేశారని, వెంటనే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.గ్రామంలో తలెత్తిన గొడవల కారణంగానే తాండర్పై దాడి జరిగివుండవచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ రాయ్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: అమెరికా నుంచి లారెన్స్‌బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్పైన, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపైన దాడి జరిగింది. పోలీసులు ఈ రెండు కేసులను నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఎమ్మెల్యే ఉషారాణి మండల్ కాళీపూజ మండపానికి వెళ్లి, పూజలు నిర్వహించి, తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది. హరోవా ప్రాంతంలో 150 మంది ఆమెను చుట్టుముట్టారు. తనను కారులోంచి బయటకు లాగి తుపాకీతో కాల్పులు జరిపారని టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.ఇదేవిధంగా సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. నజత్‌లో జరిగిన కాళీ పూజకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. దాడి అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాను కాళీ పూజ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు తన వాహనంపై దాడి చేశారన్నారు. అలాగే తనతో పాటు వస్తున్న పార్టీ కార్యకర్తలపైనా దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన ఒక కార్యకర్తను ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే సుకుమార్ మహతా ఆరోపించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసుల్లో కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం -
‘మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయనందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లను లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అనారోగ్యంతో ఉన్న ప్రజలను పట్టించుకోకపోవటం అమానుషమని మండిపడ్డారు. ప్రధాని మోదీ మంగళవారం వృద్ధుల కోసం ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య రక్షణ పొందుతారు. దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు.‘‘ ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. తీవ్రమైన వ్యాధికి చికిత్సకు అయ్యే ఖర్చు విని పేదలు వణికిపోయేవారు. డబ్బు లేకపోవడంతో వైద్యం చేయించుకోలేని నిస్సహాయతలో ఉండేవారు. ఈ నిస్సహాయతలో ఉన్న పేద ప్రజలను నేను చూడలేకపోయా. అందుకే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందారు. .. కానీ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయలేక పోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ నేను మీకు సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వాలు ఈ పథకంలో చేరటం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా రాష్ట్రంలోని జబ్బుపడిన ప్రజలను అణచివేసే ధోరణి అమానుషం. నేను దేశ ప్రజలకు సేవ చేయగలను. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోని వృద్ధులకు సేవ చేయకుండా నన్ను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.చదవండి: రాణి రాంపాల్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ -
‘శ్రీశైలం’ పూడిక నష్టం 102.11 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గింది. లైవ్ స్టోరేజీ సామర్థ్యం 72.77 టీఎంసీలు.. డెడ్ స్టోరేజీ సామర్థ్యం 29.33 టీఎంసీలు తగ్గిందన్నది రాష్ట్ర జలవనరులశాఖ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సంయుక్తంగా రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించిన హైడ్రోగ్రాఫిక్ సర్వేలో వెల్లడైంది. బేసిన్లో పెద్దఎత్తున అడవులను నరికివేస్తుండటంతో వర్షాలు కురిసినప్పుడు వరదతోపాటు భూమి కోతకు గురవడం వల్ల మట్టి కలిసి ప్రవహిస్తూ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిందని సీడబ్ల్యూసీ తేల్చింది. దేశంలో జలాశయాల్లో పేరుకుపోతున్న పూడికపై 1991, 2001, 2015, 2020లలో సీడబ్ల్యూసీ సర్వే చేసి.. నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ఏడాది దేశంలో 548 జలాశయాలలో నీటినిల్వ సామర్థ్యంపై సర్వే చేసింది. పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడం వల్ల నీటినిల్వ సామర్థ్యం భారీగా తగ్గిన జలాశయాల్లో శ్రీశైలం మొదటిస్థానంలో నిలిచింది. 45 ఏళ్లలో కొండలా పూడిక కృష్ణానదిపై నంద్యాల జిల్లాలో శ్రీశైలం సమీపంలో 1960లో జలాశయ నిర్మాణాన్ని ప్రారంభించి, 1976 నాటికి పూర్తి చేశారు. జలాశయంలో నీటినిల్వను 1976 నుంచే ప్రారంభించారు. అప్పట్లో రాష్ట్ర జలవనరుల శాఖ నిర్వహించిన సర్వేలో జలాశయంలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 308.06 టీఎంసీలు.. సాగు, తాగునీటి అవసరాలకు ఏటా 253.05 టీఎంసీలను వినియోగించుకోవచ్చునని తేల్చింది. జలాశయంలో పూడిక పేరుకుపోతుండటం వల్ల ఏటా నీటినిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ తాజాగా నిర్వహించిన సర్వేలో శ్రీశైలం గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 205.95 టీఎంసీలుగా తేలింది. అంటే.. 45 ఏళ్లలో గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 102.11 టీఎంసీలు తగ్గినట్టు స్పష్టమవుతోంది. జలాశయంలో పూడిక కొండలా పేరుకుపోవడం వల్లే ఆ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నది స్పష్టమవుతోంది.ఆయకట్టుకు నీళ్లందించడం సవాలే..శ్రీశైలం జలాశయంపై తెలంగాణలో ఎస్ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ఎత్తిపోతలు, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి, హంద్రీ–నీవా ఆధారపడ్డాయి. పూడిక వల్ల శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం.. లైవ్ స్టోరేజీ సామర్థ్యం భారీగా తగ్గిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలా మారిన పూడికను తొలగించడం భారీ ఎత్తున వ్యయంతో కూడిన పని.. పూడిక తొలగింపు అసాధ్యమని తేల్చిచెబుతున్నారు. తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం మేరకు కొత్తగా రిజర్వాయర్ నిర్మించే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇదీ శ్రీశైలం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం👉తొలిసారి రిజర్వాయర్‌ను నింపింది: 1976👉 కనీస నీటిమట్టం: 854 అడుగులు👉 గరిష్ట నీటిమట్టం: 885 అడుగులు👉 క్యాచ్మెంట్ ఏరియా: 60,350 చదరపు కిలోమీటర్లు👉 గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు నీరు నిల్వ ఉండే ప్రాంతం: 615.18 చదరపు కిలోమీటర్లు -
కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.అయితే ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ -
మమతా బెనర్జీ ప్రభుత్వంలో కోట్లలో అవినీతి: బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ రాజీనామా చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీకి సిర్కార్ రాసిన లేఖ ద్వారా.. అంతర్గతంగా టీఎంసీలో సీఎం మమత అవినీతి, నియంతృత్వ విధానాన్ని తెలియాజేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.సిర్కార్ లేఖ ద్వారా పశ్చిమ బెంగాల్లో అన్ని సంస్థల్లో కోట్లాది అవినీతి జరిగినట్లు తెలుస్తోందని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సీఎం దీదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై సీఎం మమత ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తోందని అన్నారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగదని స్పష్టమవుతోందని తెలిపారు.‘‘జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు విషయంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకం సీఎం మమత ప్రభుత్వంలో లేదు. అయినా ఇంకా టీఎంసీ నేతలు నిరసనకారులను వేధిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంకా మమతా బెనర్జీ సీఎంగా ఎందుకు కొనసాగుతున్నారు? ఆమె ఇంకా ఎందుకు సీఎం పదవికి రాజీనామా చేయటం లేదు? ఆమె రాజీనామా చేయకుండా కోల్‌కతా సీపీని, ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌ను ఎందుకు రక్షిస్తున్నారు?’ అని అన్నారు.#WATCH | On TMC Rajya Sabha MP Jawhar Sircar resigning as party MP, BJP leader Shehzad Poonawalla says, "If someone should give the resignation it should be West Bengal CM Mamata Banerjee...TMC government and Mamata Banerjee institutionalised corruption and in his letter, he… pic.twitter.com/tY1d4E59Nu— ANI (@ANI) September 8, 2024మరోవైపు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. -
‘ఆమె తల్లిదండ్రుల్ని అనవసరంగా లాగొద్దు’
కోల్‌కతా: ఆర్జీ కర్ హాస్పిటర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు. .. ఇప్పటికే బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. ఇక్కడ రాజకీయాలు చేయటం సరికాదు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లను అలా ఒంటరిగా వదిలేయండి’ అని అన్నారామె. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సైతం బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని అన్నారామె. ‘కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి కేసు బదిలీ అయి 23 రోజులు గడిచాయి. ఇంతవరకు సీబీఐ నుంచి ఎటువంటి పురోగతి నివేదిక వెల్లడికాలేదు. సీబీఐ ఈ కేసు పురోగతిపై నివేదికను అందించాలని కోరుతున్నా. కోల్‌కతా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు.. రెగ్యులర్ అప్డేట్లు ప్రెస్‌మీట్ ద్వారా బయటపెట్టారు’ అని మరో మంత్రి బ్రత్యా బసు అన్నారు. -
నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత
Updates బెంగాల్లో బీజీపీ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘వచ్చే వారం అసెంబ్లీ సమావేశాన్ని జరిపించి నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించడానికి 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తాం. ఆ బిల్లును గవర్నర్‌కు పంపుతాము. ఆయన ఆమోదించకపోతే మేము రాజ్‌భవన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతాం. ఈ బిల్లు తప్పక ఆమోదించబడుతుంది. గవర్నర్ ఈసారి తన జవాబుదారీతనం నుంచి తప్పించులేరు’అని మమత స్పష్టం చేశారు.Kolkata | West Bengal CM Mamata Banerjee says, "Next week, we will call an Assembly session and pass a Bill within 10 days to ensure capital punishment for rapists. We will send this Bill to the Governor. If he doesn't pass, we will sit outside Raj Bhavan. This Bill must be… pic.twitter.com/GQFPvTStZX— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్‌లో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసన్సోల్ రైల్వే స్టేషన్ పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు.#WATCH | Asansol, West Bengal: BJP workers stage a protest demanding justice for woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital pic.twitter.com/ZBKJzdOYuG— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ బీజేపీ బంద్ నిరసనలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడు రోజుల పాటుచేసే ధర్నాకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ధర్నా ప్రారంభిస్తాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీసులు కాల్పులు ఆపలేరు. బీజేపీ నిరసనను అడ్డుకుంటారు. హత్యాచార ఘటన నిందితును అరెస్ట్ చేయరు. కానీ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తారు’’ అని అన్నారు. #WATCH | Union Minister and West Bengal BJP President Sukanta Majumdar says, "Kolkata HC has given us the permission for seven-day Dharna. We will start it from tomorrow...We welcome their verdict...There is no democracy here, police cannot stop firing but only stop BJP's… https://t.co/5ASm6Tg990 pic.twitter.com/zfzKuGmIK1— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్‌లో బీజేపీ నేత కారుపై జరిగిన కాల్పుల్లో డ్రైవర్ మృతి చెందాడు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో 12 గంటల బీజేపీ బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా పోలీసుల తీరు నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ర్యాలీలో బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు.#WATCH | Kolkata: Union Minister and West Bengal BJP President Sukanta Majumdar joins the protest. BJP has called for a 12-hour 'Bengal Bandh'. (Visuals from Baguiati Mor) pic.twitter.com/n4uXjilIQE— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ ఉత్తర 24 పరగణాలులో భాట్పరా ప్రాంతంలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు, దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.West Bengal | Two people got injured in the attack and firing incident on the BJP leader Priyangu Pandey's car, earlier today, in Bhatpara of North 24 Parganas pic.twitter.com/MO2x3vxabB— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ హింసాత్మకంగా మారింది. తమ పార్టీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు జరిగాయని బీజేపీ నేత అర్జున్ సింగ్ తెలిపారు. ‘ప్రియాంగు కారుపై ఏడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఏసీపీ సమక్షంలోనే జరిగాయి. ప్రియాంగు పాండేని చంపేందుకు ప్లాన్ చేశారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి’అని అన్నారు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 "Bombs thrown, vehicle fired on": BJP's Priyangu Pandey claims TMC workers attacked him during Bengal BandhRead @ANI Story | https://t.co/GUPWv28WrO#BJP #TMC #BengalBandh #PriyanguPandey pic.twitter.com/TGlNUNugOg— ANI Digital (@ani_digital) August 28, 2024 పశ్చిమ బెంగాల్లో బీజేపీ పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా నందిగ్రామ్‌లో పార్టీ కార్యకర్తలతో సువేందు అధికారి నిరసనలో పాల్గొన్నారు. #WATCH | Nandigram | West Bengal LoP Suvendu Adhikari joins BJP's protest, call for 12-hour 'Bengal Bandh'.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna… pic.twitter.com/iLDff6ra2H— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతా బాటా చౌక్‌లో బంద్ చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. బంద్‌లో పాల్గొన్న బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.#WATCH | West Bengal | Police detains protesting BJP party workers at Kolkata's Bata Chowk12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/vt7MaQjZCv— ANI (@ANI) August 28, 2024 #WATCH | West Bengal | Police detains BJP leader Locket Chatterjee who joined protest after BJP's call for 12-hour 'Bharat Bandh' at Kolkata's Bata Chowk pic.twitter.com/Zd8eAiH0mF— ANI (@ANI) August 28, 2024 బంద్ కొనసాగుతోందని పోలీసులు ఏమీ చేయలేకపోయారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా అన్నారు. ‘టీఎంసీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు.వారిని సీఎం మమత ఇక్కడి పంపారు. కానీ, మేం ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లము. మేము చేపట్టిన బెంగాల్ బంద్‌ను కొనసాగిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని ఆయన అన్నారు.#WATCH | West Bengal: BJP MLA Ashok Kirtania says, "Bandh is going on...Police were not able to do anything, therefore, the workers of TMC are here, Mamata sent them...We will not move from here, we will continue the fight..." pic.twitter.com/z4YubShK3h— ANI (@ANI) August 28, 2024సిలిగురిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల 'బెంగాల్ బంద్’ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు.#WATCH | Siliguri, West Bengal: 12-hour 'Bengal Bandh' called by the BJP to protest against the state government; security deployed in the area The bandh has been called after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/K8oIGYs5tx— ANI (@ANI) August 28, 2024 బీజేపీ చేపట్టిన బంద్‌ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. రైలు పట్టాల మీద పెద్దఎత్తున నిరసన తెలపటంతో బంగాన్-సీల్దా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. తర్వాత మళ్లీ రైలు సేవలను అధికారులు పునరుద్దరించారు.#WATCH | North 24 Parganas | TMC Party workers protest against BJP's 12-hour 'Bengal Bandh' call for today.Train services were disrupted between Bangaon-Sealdah which is now being reinstated pic.twitter.com/ISyiQqBlv6— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ నేపథ్యంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు హెల్మెట్స్ ధరించారు. ‘‘ఈ రోజు బంద్ ఉంది. కావున తాను హెల్మెట్ ధరించాను’’ అని బస్ డ్రైవర్ తెలిపారు.#WATCH | BJP's 12-hour 'Bengal Bandh': Drivers of Government bus in Howrah seen wearing helmetsA bus driver says, "Today is bandh, so we are wearing helmets..." pic.twitter.com/b5GHHD4Ocq— ANI (@ANI) August 28, 2024 కోల్‌కతాలో బీజేపీ బంద్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలీపుర్దువార్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది#WATCH | West Bengal | Police detains protesting BJP workers at Alipurduar.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/tJuKKgMGum— ANI (@ANI) August 28, 2024పోలీసు తీరుపై బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ బెంగాల్లో కొనసాగుతోంది.పోలీసులు అణచివేయాలనే వైఖరితో తిరుగుతున్నారని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్‌కు సహరించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు రద్దు చేశారు.ఆందోళనకారులపై రసాయనాలు కలిపిన వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసులు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నారు’ అని అన్నారు. బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.#WATCH | Kolkata, West Bengal: BJP leader Agnimitra Paul says, "They are going around with a disgusting attitude. They have all become spineless. Police have invalidated the orders of the Supreme Court... They used water canons mixed with chemicals on the protestors... They are… https://t.co/MP0SU69Wwc pic.twitter.com/Dkhj7g5e2Y— ANI (@ANI) August 28, 2024 పశ్చిమ బెంగాల్‌ల్లో ఇవాళ(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.#WATCH | Kolkata: BJP leader Agnimitra Paul reviews the 12-hour 'Bengal Bandh' called by BJP to protest against the state government. pic.twitter.com/AAvoFWrjuj— ANI (@ANI) August 28, 2024ఈ బంద్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్‌ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్‌ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.बंगाल कल बंद है#KolkataDoctorDeathCase #bengal_band_haipic.twitter.com/IIUK0rMY0Q— Rastra Janmat (@Rastrajanmat360) August 27, 2024 కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జానియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బంధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ అనటం గమనార్హం. -
ఆర్జీ కార్ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
కోల్‌కతా: ఆర్జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రజలు, వైద్యులు, న్యాయవాదులు చేస్తున్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రతిపక్షాలు సైతం దీదీ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఆ డిమాండ్‌పై టీఎంసీ నేతలు బీజేపీది పితృస్వామ్య పాలన అంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీదీకి మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణాలు జరిగినప్పుడు ఇలాంటి డిమాండ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ‘ బీజేపీ నేతలు ముఖ్య మంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో చాలా దారుణాలే జరిగాయి. కానీ పశ్చిమబెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీనే ఎందుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు’ అని పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య ప్రశ్నించారు. బీజేపీదీ పితృస్వామ్య పాలన ఇలాగే ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించేందుకు బీజేపీ-ఏబీవీపీ పన్నాగం పన్నాయి. పోలీసు యూనిఫాంలో ఉన్న అనుమానితులు కాల్పులు జరిపేందుకు కుట్రపన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి ఆందోళనలు చేయమంటే చేస్తారా? అని భట్టాచార్య ప్రశ్నించారు. రాబందు రాజకీయాలతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం జరుగుతుంది’ అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టీఎంసీ నేతల వ్యాఖ్యల్ని బీజేపీ స్పందించింది. ర్యాలీలో ఎటువంటి ప్రమేయం లేదని ఖండించింది. తమ పార్టీ సభ్యులు ఏదైనా నిరసనలకు హాజరైతే, అది వారి వ్యక్తిగతంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. -
దీదీ.. రాజీనామా చేయండి: నిర్భయ తల్లి డిమాండ్
ఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. ఈ సందర్బంగా హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారామె.ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి ఆశాదేవి స్పందిస్తూ.. అఘాయిత్యాలను నిలువరించడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమైనట్లు విమర్శించారు. నిందితులను శిక్షించడానికి బదులుగా.. నిరసన ప్రదర్శనలతో డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రజలను ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమె కూడా మహిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇదే సమయంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుంటే, అప్పుడు దేశంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.మరోవైపు.. ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైంది. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వైద్యసేవలను నిలిపివేశారు. ఇక, కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. -
అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు.. కానీ!: బెంగాల్ మంత్రి
కోల్‌కతా: అటవీశాఖ మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఎట్టకేలకు దిగివచ్చరు. జైళ్లశాఖ మంత్రి పదవికి ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం మమతా బెనర్జీకి పంపించారు. అయితే తాను సీఎం మమతా బెనర్జీకి తప్ప మరో అధికారికి(అటవీ అధికారిణికి) క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పారు.‘నేను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాన కార్యదర్శి ద్వారా నా రాజీనామాను సమర్పించాను. కానీ నేను ఏ అధికారికి క్షమాపణ చెప్పను. కేవలం నేను ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతాను. ఆ రోజు ప్రజల కష్టాలు చూసి, అటవీ శాఖ వాళ్ళు ఎలా హింసిస్తున్నారో చూసి చలించిపోయాను. నేను ఒక అనుచిత పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. కానీ నేను చెప్పిన దాని కోసం క్షమాపణలు చెప్పలేను. నేను ఏం చేసినా ప్రజల కోసమే’ అని గిరి అన్నారు. అయితే పుర్బా మేదినీపూర్ జిల్లాలోని తాజ్పూర్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో దుకాణాలు ప్రారంభించేందుకు చిన్నతరహా వ్యాపారుల నుంచి అటవీ శాఖ అధికారులు లంచం డిమాండ్ చేశారని మంత్రి ఆరోపించారు.కాగా రామ్‌నగర్ నుంచి టీఎంసీ ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిల్ గిరి మమతా మంత్రివర్గంలో జైళ్లశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 1998లో టీఎంసీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తాను సహనం కోల్పోవడానికి దారీతిసన పరిణామాలను సీఎంకు వివరంగాచెబుతానని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నారా అని గిరి మీడియా అడగ్గా.. 2026 వరకు తన పదవీకాల ఉందని, అప్పటి వరకు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేస్తానని తెలిపారుఇదిలా ఉండగా మంత్రి అఖిల్ గిరి అదివారం అటవీ శాఖ మహిళా అధికారి మనీషా సాహుపై బెదిరింపులకు పాల్పడ్డారు. తేజ్‌పుర్ బీచ్ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. దీంతో మంత్రి గిరి స్థానికుల సమక్షంలో మహిళా అధికారిపై మాటల దూషణలకు దిగారు. మనీషా సాహు పదవీకాలన్ని తగ్గించాలని హెచ్చరించారు. అధికారిని బెదిరించిన వీడియో వైరల్‌గా మారడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి ఈ వ్యవహారం సీఎం మమతా వరకు చేరింది. దీంతో ఆమె మహిళా అధికారికి క్షమాపణలు చెప్పాడలని, అంతేగాక మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆదేశించారు. -
కూటమిలో కీలకమైనా.. దీదీపై కాంగ్రెస్ నేత విమర్శలు
కోల్‌కతా: నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అబద్దమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘నీతి ఆయోగ్ సమావేశం గురించి సీఎం మమత చెసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటారని మమత చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సీఎంలను మాట్లాన్వికుండా చేస్తారని నేను నమ్మటం లేదు. మమత బెనర్జీకి అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆమె పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు’’ అని అన్నారు. మరోవైపు.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించి.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే కాంగ్రెస్ స్పందనకు భిన్నంగా అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేయటం గమనార్హం.దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రలు క్షీణిస్తూ.. అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అధీర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, శనివారం ప్రధానిమోదీ అధ్యక్షత జరిగిన నీతి ఆయోగ్ సమాశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అనంతరం తానను మాట్లాడనివ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపలు చేశారు. తర్వాత ఆమె నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు. మరోపైపు.. లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరీ టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సీఎం మమత ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అధీర్ రంజన్ ఆమెపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్ దాడి.. వీడియో వైరల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సొంత పార్టీ కార్యకర్తపైనే దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ 18వ వార్డు టీఎంసీ కౌన్సిలర్ సునందా సర్కార్ అదే వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త(18వార్డ్ టీఎంసీ యూత్ ప్రెసిడెంట్)పై దాడి చేశారు. పలు అవినీతి కేసుల్లో సునందాకు ప్రమేయం ఉందని సదరు కార్యకర్త కొంత కాలం నుంచి ఆమెపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం అతను కనిపించగానే కోపం పట్టలేక కౌన్సిల్ సునందా కార్యకర్తపై దాడి చేశారు.This is one of the “finest” examples of the “Joy Bangla” model currently being implemented across West Bengal by TMC “luminaries”. Ms Sunanda Sarkar, TMC Councillor of Ward 18 is seen here administering a dose of “Joy Bangla” to TMC youth wing president of Ward 18 Mr Kedar… pic.twitter.com/R8rpZ5YIru— Dr. Anirban Ganguly (অনির্বাণ গঙ্গোপাধ্যায়) (@anirbanganguly) July 16, 2024 కార్యకర్తపై కౌన్సిల్ దాడి చేయటంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా జగ్రత్తగా ఉండాలి. ఇది చాలా హాస్యాస్పదమైనది’ అని అన్నారు. అయితే టీఎంసీ కౌన్సిల్ సొంతపార్టీ కార్యకర్తపై చేసిన దాడి ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ ఘటన బెంగాల్ టీఎంసీ పార్టీ అంతర్గత గందరగోళం, నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలను నిదర్శనమని పేర్కొంది. సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటరీ మహ్మద్ సాలిమ్ ఖండించారు. ఈ ఘటనను చూస్తే.. ‘వీధి న్యాయం’లా కనిపిస్తోందన్నారు. -
చంపేస్తామని బెదిరిస్తున్నారు: టీఎంసీ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ బుధవారం తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పేర్కొన్నారు. అరెస్టయిన పార్టీ నాయకుడు జయంత్ సింగ్‌ను త్వరగా విడుదల చేయకపోతే తనను చంపేస్తానని ఫోన్లో బెదిరించారని తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించడమే కాకుండా.. తనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడని సౌగతా రాయ్ పేర్కొన్నారు.కాగా పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని అరియాదాహా ప్రాంతానికి చెందిన టీఎంసీ నాయకుడు జయంత్ సింగ్‌ను జూన్ 30న జరిగిన ఓ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గత వారం అరెస్టు చేశారు. అరియాదాహ.. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ స్థానానికి సౌగతా రాయ్ గత నాలుగు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అయితే గుర్తు తెలియని నెంబర్ నుంచి రెండు ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు రాయ్ పేర్కొన్నారు. అరియాదాహకు వెళితే చంపేస్తానని కూడా కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని తెలిపారు. తర్వాత తాను బరాక్‌పూర్ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి నంబర్‌ను ట్రాక్ చేయమని కోరినట్లు చెప్పారు. అనంతరం తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.టీఎంసీ నేత జయంత్ సింగ్‌పై కేసు ఏంటి?జూన్ 30న కళాశాల విద్యార్థిని, అతని తల్లిపై దాడి చేసిన కేసులో జయంత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇందులో కొంతమంది వ్యక్తులు ఇద్దరు వ్యక్తులను కొట్టడం కనిపించింది.అరియాదాహాలో ఒక బాలికపై కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లు చూపుతున్న పాత వీడియో ఆధారంగా పోలీసులు సింగ్‌పై సుమోటో కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ ఘటనకు సంబంధించి సింగ్ సన్నిహితుడు పట్టుబడ్డాడు. , ఈ కేసులో ఇప్పటి ముగ్గురిని అరెస్ట్ చేశారు.2023లో మరో కేసులో అరెస్టయి, ఇకపై ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా హామీ ఇచ్చి బాండ్‌తో బెయిల్‌పై బయటకు వచ్చాడు జయంత్. ఆ షరతును ఇప్పుడు ఉల్లంఘించినందుకు ఆయన తాజా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. -
ఎంపీ మహువా మొయిత్రాపై మళ్లీ కేసు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖాశర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకుగాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్(ట్విటర్)లో తమపై చేసిన వ్యాఖ్యలకుగాను మహువా మీద మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖాశర్మ సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వీడియోలో రేఖాశర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్ స్పందించారు. రేఖాశర్మ ఆమె గొడుగు ఆమె సొంతగా ఎందుకు పట్టుకోలేపోతున్నారని ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రేఖాశర్మ ఆమె బాస్ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేశారు. మహువా మొయిత్రా గత లోక్‌సభలో తన ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
హాస్పిటల్లో చేరిన టీఎంసీ సీనియర్ నేత
కోల్‌కతా: టీఎంసీ సీనియర్‌నేత ముకుల్ రాయ్ గురువారం ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలోని బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోవటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ స్పృహ కోల్పోయే ముందు వాంతులు చేసుకున్నారని కుటంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన బాత్రూంలో జారిపడటంతో తలకు గాయం అయింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పలు టెస్ట్‌ల రిపోర్టుల కోసం ఎదురు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.టీఎంసీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్.. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ కృష్ణానగర్‌లో గెలుపొందారు.అనంతరం ఆయన మళ్లీ టీఎంసీలో చేరారు. -
వాషింగ్ మిషన్ మోదీ బాబు అవినీతి మర్చిపోయారా సారూ..
-
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే ఆలోచన అదేనా!
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిని తమ కూటమి సభ్యుడికే ఇవ్వాలని బీజేపీ యోచిస్తుండగా... మరోవైపు విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఫైజాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికైన అవధేశ్ ప్రసాద్‌కు ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రతిపాదనకు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు పలికింది.అయితే డిప్యూటీ స్పీకర్ నియామకంపై ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ.. ఈ విషయంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు లేనట్లు సమాచారం, డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విమర్శిస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా 2019 నుంచి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. గతంలో ఎక్కువ శాతం ప్రతిపక్షమే ఈ పదవిని కేటాయించారు. అయితే ఇది ఎల్లప్పుడూ కొనసాగదని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఉండటంతో.. తమ ఎంపీలలో ఒకరికి డిప్యూటీ పదవి దక్కాలని డిమాండ్ చేస్తోంది. కాగా 16వ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని అన్నాడీఎంకేకు ఇవ్వగా, 17వ లోక్ సభ పదవీ కాలం మొత్తం ఈ పోస్టు ఖాళీగానే ఉంది. భారత పార్లమెంట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈసారి కూడా . అయితే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల కాకపోవడంతో ఆ పదవిపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది.. ఇక స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించి రెండవసారి స్పీకర్ పదవిని చేపట్టారు. -
‘అయోధ్య ఎంపీకే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి!’
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవికి 48 ఏళ్ల తర్వాత ఎన్నిక జరగ్గా అధికార ఎన్డీయే కోటా ఎంపీ ఓం బిర్లా తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే అధికార ఎన్డీయే ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. ఆనవాయితీ ప్రకారం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పట్టుపట్టడంతో స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. స్పీకర్ ఎన్నిక పూర్తికావడంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే చర్చ మొదలైంది.అయితే తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. డిప్యూటీ స్పీకర్ పదవిని ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్‌కు కేటాయించాలని టీఎంసీ కేంద్రాన్ని కోరుతోంది. ఆయోధ్య ఉన్న ఫైజాబాద్ సెగ్మెంట్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేసిన అవధేష్ ప్రసాద్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఎటువంటి షెడ్యూల్ విడుదలచేయలేదు. గతంలో 17వ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఎన్డీయేలోని ఏ మిత్రక్షానికి కూడా ఇవ్వకుండా బీజేపీ ఖాళీగా ఉంచిన ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవికి బలమైన నాయకున్ని ఇండియా కూటమి పోటీలోకి దింపాలనుకుంటున్న నేపథ్యంలో ఎంపీ అవధేష్ ప్రసాద్‌ను ఎన్నుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అవధేష్ ప్రసాద్ దళిత సమాజిక వర్గానికి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌పై 50వేల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం నేపథ్యంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థే గెలుస్తారని అంతా భావించారు. అదే విధంగా జనరల్ స్థానమైన ఫైజాబాద్‌లో అవధేష్ ప్రసాద్ గెలిచి అందిరనీ ఆశ్చర్యపరిచారు.ఇక.. డిప్యూటీ స్పీకర్‌సైతం లోక్స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ అందుబాటులో లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లోక్‌సభ సమావేశాలను నడిస్తారు. డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని ఆనవాయితీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజులగ్యాప్ తర్వాత.. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానుంది. -
18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్‌కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్‌సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్‌గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్‌సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్‌సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ తరఫున సీఎం మమత ప్రచారం!
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వదలుకున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో.. ఉపఎన్నికలో భాగంగా ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా గాంధీకి ఇదే మొదటి లోక్‌సభ ఎన్నిక కావటం గమనార్హం. అయితే ప్రియాంకా గాంధీ బరిలోకి దిగే వయనాడ్‌లో టీఎంసీ సుప్రీం నేత, సీఎం మమత ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌధరీకి మమతా బెనర్జీ మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు బాధ్యతగా బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి శుక్రవారం అధీర్ రంజన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల అంతర్గత సమావేశాల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. మమతా బెనర్జీకి తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తాను విభేదించినట్లు చూడాలని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.కాగా, బెంగాల్లో సీఎం మమతను విభేదించే అధీర్ రంజన్ రాజీనామా చేయటంతో దీదీ.. ప్రియాంకా గాంధీ ప్రచారానికి సిద్ధమైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఇక.. లోక్‌సభలో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ మొత్తం 42 స్థానాలకు గాను 29 సీట్లును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధీర్ రంజన్ సైతం ఈసారి టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారీ కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలసి బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. -
ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
బారూయ్‌పూర్(పశి్చమబెంగాల్): వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాని మోదీ చేయబోయే ధ్యానంపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అనుమానం వ్యక్తంచేశారు. మంగళవారం పశి్చమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ నియోజకవర్గంలో టీఎంసీ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘‘ మేం ఖచి్చతంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తాం. ఆయన ధ్యానం చేసుకోవాలనుకుంటే చేసుకోమనండి. కానీ ఆయన మెడిటేషన్ చేస్తున్నపుడు టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే ఒప్పుకోం. ధ్యానం చేసేందుకు వెళ్తూ ఎవరైనా కెమెరా వెంట తీసుకెళ్తారా?’’ అని అన్నారు. -
మమత మనసులో ఏముంది? ‘ఇండియా’ భేటీకి ఎందుకు వెళ్లరు?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష ఇండియా కూటమితో జత కడతారా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన మమత ఎన్నికల తర్వాత విపక్షాల కూటమి ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కాబోనని ముందుగానే ప్రకటించారు.టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి సమావేశంపై తాను తీసుకున్న నిర్ణయానికి లోక్‌సభ ఎన్నికలు, రెమాల్ తుపాను కారణాలని పేర్కొన్నారు. విలేకరులతో మాట్లాడిన ఆమె లోక్‌సభ ఎన్నికల చివరి విడత ఓటింగ్, రెమాల్ తుపాను అనంతరం చేపడుతున్న సహాయక చర్యల కారణంగా జూన్ ఒకటిన జరిగే కూటమి మీటింగ్‌కు హాజరు కాలేనన్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూన్ ఒకటిన ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, దీనికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఒకవైపు తుఫాన్, మరోవైపు ఎన్నికలు ఈ నేపధ్యంలో తాను వీటిని విస్మరించి, సమావేశానికి ఎలా హాజరుకాగలను అని అని ప్రశ్నించారు.మమత సమాధానంపై స్పందించిన బీజేపీ నేతలు.. కూటమి నుంచి తప్పించుకునేందుకే మమత ఇలాంటి సాకులు చూపుతున్నారని ఆరోపించారు. కాగా ఎన్నికల ఫలితాలకు ముందు మమతా బెనర్జీ బహిరంగంగా ప్రతిపక్ష శిబిరంతో సహవాసం చేయకూడదని భావించివుంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక, అప్పటి సీట్ల సంఖ్యను అనుసరించి ఆమె ఇండియా కూటమిలో చేరాలని అనుకుంటున్నారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల చివరి దశలో అంటే జూన్ ఒకటిన పశ్చిమ బెంగాల్‌లోని తొమ్మిది స్థానాలకు ఓటింగ్ జరగనుంది. -
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్‌కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్‌లోని ఝర్గ్రామ్లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్‌లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్‌టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్‌కు వెళ్లారు.వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్‌ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. -
ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేసింది. బెంగాల్ రఘునాథపూర్లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్‌కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.Smt. @MamataOfficial has repeatedly flagged how @BJP4India was trying to rig votes by tampering with EVMs.And today, in Bankura's Raghunathpur, 5 EVMs were found with BJP tags on them.@ECISVEEP should immediately look into it and take corrective action! pic.twitter.com/aJwIotHAbX— All India Trinamool Congress (@AITCofficial) May 25, 2024 ‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్‌పూర్‌లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్లు ఉండటం మా దృష్టకి వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో కూడా బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.స్పందించిన బెంగాల్ ఎన్నికల సంఘం:టీఎంసీ ఆరోపణలపై బెంగాల్ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్ అడ్రస్ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు.(2/1) While commissioning, common address tags were signed by the Candidates and their agents present. And since only BJP Candidate's representative was present during that time in the commissioning hall, his signature was taken during commissioning of that EVM and VVPAT. pic.twitter.com/54p78J2jUe— CEO West Bengal (@CEOWestBengal) May 25, 2024 .. అందుకే ఆ ఏజెంట్ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది. -
సందేశ్‌ఖాళీ ఓ కట్టుకథ.. మాజీ బీజేపీ నేత సంచలన కామెంట్స్
కోల్కత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పర్విన్.. అధికార టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా బెంగాల్లో బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.ఇక, బీజేపీకి రాజీనామా సందర్భంగా సిరియా పర్విన్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్లో సందేశ్‌ఖాళీ ఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్ ప్రకారం జరిగింది. అదంతా ఓ కట్టుకథ(పొలిటికల్ డ్రామా). సందేశ్‌ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేరు వేరు సిమ్ కార్డ్స్, ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి డ్రామా నడిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తృణముల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. అవేవీ నిజం కాదు. టీఎంసీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను టీఎంసీలో చేరుతున్నానని కామెంట్స్ చేశారు. ఇక, సందేశ్‌ఖాళీ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో సిరియా పర్విన్ కూడా ఒకరు కావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. సందేశ్‌ఖాళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సందేశ్‌ఖాళీలో భూముల కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేశారన్న కేసులో టీఎంసీ మాజీ నేత షేక్ షాజాహాన్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు.. సందేశ్‌ఖాళీ ఘటనపై ఉద్యమించిన కారణంగా రేఖా పాత్ర అనే మహిళకు బీజేపీ లోక్‌సభ టికెట్‌ను ఇచ్చింది. బసిర్హత్ లోక్‌సభ స్థానంలో టీఎంసీకి చెందిన హాజీ నూరుల్ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర మధ్య ద్వైపాక్షిక పోరు నెలకొంది. -
బెంగాల్ గవర్నర్‌పై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి కోసం ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపణలు చేసింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో గవర్నర్ తన ఛాతికి ‘బీజేపీ లోగో’ ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది.లోక్‌సభ ఎన్నికల కోసం గవర్నర్ బీజేపీ ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్పరై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. -
ఓట్ల కోసమే సాధువులపై దాడి: ప్రధాని మోదీ
కోల్‌కతా: బుజ్జగింపు రాజకీయాల కోసమే పశ్చిమబెంగాల్ తృణమూల్ (టీఎంసీ) గూండాలు సాధువులపై దాడులు చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం(మే20) పశ్చిమ బెంగాల్‌లోని జార్గ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.‘టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు. ఇది చేసింది తామేనని టీఎంసీ ప్రకటించడం సిగ్గుచేటు. సీఎం రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ మఠాల సాధువులను బెదిరిస్తున్నారు. ఆదివారం రాత్రి జల్పాయ్గురిలోని రామకృష్ణ మిషన్‌పై దాడి చేశారు.ఇలాంటి వాటిని బెంగాల్ ప్రజలు సహించరు. ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సంస్థలు సేవ, విలువలకు నిదర్శనం, కానీ సీఎం మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బహిరంగంగా వారిని బెదిరిస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు.కాగా, ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంస్థలకు చెందిన సాధువులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే మమత వ్యాఖ్యలను రెండు సంస్థలకు చెందిన సాధువులు ఖండించారు. -
టీఎంసీకి బూత్ ఏజెంట్ ప్రచారం.. పట్టుకున్న బీజేపీ ఎంపీ
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. హుగ్లీలో టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న బూత్ ఏజెంట్‌ను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ బూత్ ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి, ఒక ఆశా వర్కర్‌ను బూత్‌లో కూర్చోబెట్టారని లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఆ ఆశా వర్కర్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లతో టీఎంసీకి అనుకూలంగా ఓటువేయాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ తృణమూల్ ఏజెంట్ అని లాకెట్ చటర్జీ పేర్కొన్నారు.ఆ మహిళను పట్టుకుని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదని ఆమె అన్నారు. దీనిపై బూత్ ఏజెంట్‌ను ప్రశ్నించగా, ఆమె ఓటర్లు క్యూలో నిలుచునేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బూత్ వద్ద ఎక్కువ మంది ఓటర్లు లేరని లాకెట్ చటర్జీ తెలిపారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. -
‘ఖర్గే చెప్పినా.. నా పోరాటం ఆగదు’
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు. ‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు. ..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్‌ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్‌లోని పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది. -
200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అదే సమయంలో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 మార్కును కూడా దాటలేదని అన్నారు.లోక్‌సభ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అయితే బీజేపీకి లబ్ధి చేకూర్చే టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేయొద్దని మమతా బెనర్జీ ఓటర్లను కోరారు. ఆరంబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి పేరు పెట్టింది నేనే. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదే ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు టీఎంసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోదీ 400 పై చీలూకు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవన్నీ సాధ్యమయ్యేవి కావు. 200 సీట్లు దాటడం గగనమేనని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. -
పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ - దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి నాలుగో దశ పోలింగ్ సోమవారం ప్రారంభం కాగానే, ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్.. టీఎంసీ గూండాలు పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని ఆరోపించారు.నిన్న రాత్రి ప్రిసైడింగ్ అధికారితో సహా పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదని, పరిస్థితి చక్కబడేలా.. ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని దిలీప్ ఘోష్ అన్నారు. ప్రతి బూత్ దగ్గర పోలీస్ బలగాలు ఉన్నప్పటికీ టీఎంసీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు.వర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కీర్తి ఆజాద్, సీపీఐ(ఎం)కి చెందిన సుకృతి ఘోషల్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.2014 లోక్‌సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 34 స్థానాల్లో గెలిచింది. అయితే అప్పుడు బీజేపీ కేవలం 2 సీట్లను మాత్రమే సొంతం చేసుకోగలిగింది. సీపీఐ(ఎం) 2, కాంగ్రెస్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ సారి బీజేపీ మరిన్ని స్థానాల్లో గెలుపొందటానికి ప్రయత్నిస్తోంది. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
గవర్నర్ మారేవరకు రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను: మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని వేధించినట్లు గత వారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేయకూడదో బోస్ వివరించాలి కోరారు.టీఎంసీ హుగ్లీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. గవర్నర్ సివి ఆనంద బోస్‌ను నిందించారు. బోస్ గవర్నర్‌గా కొనసాగే వరకు రాజ్‌భవన్‌లోకి అడుగు పెట్టనని కూడా ఆమె తేల్చిచెప్పారు. గవర్నర్ దాదాగిరి ఇక చెల్లదని పేర్కొన్నారు.గవర్నర్ మీద ఆరోపణలు వచ్చిన తరువాత రాజ్‌భవన్‌లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. అవన్నీ గవర్నర్ ఎడిట్ చేసిన వీడియోను విడుదల చేశారని, నేను మొత్తం ఫుటేజీని చూశాను. అవన్నీ షాకింగ్‌గా ఉన్నాయని అన్నారు. మీ ప్రవర్తన సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి అన్నారు. -
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
ఆసన్సోల్. పశ్చిమ బెంగాల్లో కీలక లోక్‌సభ స్థానం. గత ఉప ఎన్నికలో బీజేపీని ఓడించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘షాట్‌గన్’, ‘బిహారీ బాబు’గా ప్రసిద్ధుడైన బాలీవుడ్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ శత్రుఘ్న సిన్హా టీఎంసీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. సీనియర్ నేత సురేంద్రజీత్‌సింగ్ అహ్లువాలియాను బీజేపీ బరిలో నిలిపింది. ఈ హాట్ సీట్లో నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది... ఆసన్సోల్లో టీఎంసీ, బీజేపీ హోరాహోరీ హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానమైన ఆసన్సోల్లో హిందీ మాట్లాడేవారు ఎక్కువ. జార్ఖండ్ సరిహద్దు కావడమే అందుకు కారణం. ఇక్కడ పరిశ్రమలు అధికం. రాణిగంజ్, పాండవేశ్వర్, జమురియాల్లో బొగ్గు గనులున్నాయి. దాంతో బిహార్, యూపీ వలస కారి్మకులు ఎక్కువ. తాగునీటి ఎద్దడి, అక్రమ మైనింగ్ ఇక్కడి ప్రధాన సమస్యలు. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. 2014లో దానికి బీటలు వారాయి. బీజేపీ నుంచి బాబుల్ సుప్రియో బరాల్ గెలుపొందారు. 2019లోనూ ఆ పరంపరను కొనసాగించారు. 2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సుప్రియో తృణమూల్‌లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది. టీఎంసీ నుంచి శత్రుఘ్న సిన్హా గెలుపొందారు. అహ్లూవాలియాపైనే బీజేపీ ఆశలు... ఈసారి బీజేపీ తమ తొలి జాబితాలోనే భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్‌కు ఆసన్సోల్ టికెటిచ్చింది. తన పాటల్లో మహిళలను అగౌరవపరిచే వ్యక్తికి టికెటిచ్చారంటూ టీఎంసీ తదితర పక్షాలు విమర్శలు గుప్పించాయి. దాంతో పవన్ స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అనంతరం ‘సర్దార్జీ’గా పిలుచుకునే ఎస్.ఎస్. అహ్లువాలియాకు బీజేపీ టికెట్ దక్కింది. ఆయన రాజ్యసభ మాజీ సభ్యుడు. 2014లో డార్జిలింగ్, 2019లో బర్ధమాన్–దుర్గాపూర్ లోక్‌సభ స్థానాల నుంచి గెలుపొందారు. ఆయన కచి్చతంగా నెగ్గుతారని బీజేపీ అంటోంది. ఎంపీగా పార్లమెంటు ముఖమే చూడని వ్యక్తి ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారన్న టీఎంసీ విమర్శలను అహ్లూవాలియా తిప్పికొడుతున్నారు. ‘‘నేను సర్దార్‌ను. ఆసన్సోల్ బిడ్డను. ఇక్కడే పుట్టి పెరిగా. నా మూలాలిక్కడే ఉన్నాయి. నా ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షే నన్నిక్కడికి నడిపించింది’’ అంటున్నారు.భారీ మెజారిటీపై శత్రుఘ్న కన్ను శత్రుఘ్న సిన్హా పూర్వాశ్రమంలో బీజేపీ నాయకుడే కావడం విశేషం! పట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. 2022లో టీఎంసీకి మారారు. అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తన బలమంటున్నారాయన. ‘‘ఎంపీగా రెండేళ్లలో చేసిన కృషే నా తరఫున మాట్లాడుతుంది. పైగా ఆసన్సోల్లో యూపీ, బిహార్ కారి్మకుల సంఖ్య చాలా ఎక్కువ. ఈసారి మరింత భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని ధీమాగా చెబుతున్నారు. సీపీఎం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జహనారా ఖాన్ బరిలో ఉన్నారు. లోక్‌సభకు పోటీ చేయడం ఆమెకిదే తొలిసారి. 55 ఏళ్ల జహనారాది దిగువ మధ్యతరగతి నేపథ్యం. రెండుసార్లు జమురియా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ‘‘ఆసన్సోల్ పదేళ్లుగా ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ సుప్రియోలు, సిన్హాలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదు. గ్రామీణ గిరిజనులు, మైనారిటీలు తాగునీటి కొరతతో అల్లాడుతున్నారు. పదేళ్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ కేబుల్స్ సహా ఎన్నో కర్మాగారాలు మూతపడ్డాయి’’ అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి: మండిపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కతా: రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించారని గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిపైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం 'మమతా బెనర్జీ' మండిపడ్డారు.పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన బహిరంగ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో మహిళ వేధింపుకు గురికావడం సిగ్గు చేటు అని అన్నారు. రాజ్‌భవన్‌లో పనిచేసిన ఓ యువతి బయటకు వచ్చి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఆ మహిళ కన్నీళ్లకు నా గుండె పగిలింది. సందేశ్‌ఖలీ గురించి మాట్లాడే ముందు బీజేపీ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదు? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కేసులో చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడానికి కూడా బీజేపీయే కారణమని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న ఒక మహిళ తనపై వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత టీఎంసీ నేతలు మండిపడ్డారు. ఇలాంటి కథనాలకు భయపడబోమని.. సత్యం గెలుస్తుందని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.Smt. @mamataofficial strongly condemned the appalling incident in Raj Bhavan!It's deeply disturbing that the same Governor who showed great urgency in reaching Sandeshkhali now stands accused of molesting a female staff member.PM @narendramodi's spent the night there and his… pic.twitter.com/b07DXs1LNp— All India Trinamool Congress (@AITCofficial) May 3, 2024 -
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కాతా: పశ్చిమబెంగాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓ కాంగ్రెస్ నేత 'టీఎంసీకు ఓటు వేయడం కంటే బీజేపీకి ఓటు వేయడం ఉత్తమం' అని అన్నారని ఓ వార్త నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపైన సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీకి లేదా కాంగ్రెస్‌కు ఓటు వేయండి అని కాంగ్రెస్ నేత చెబుతున్నారు. ఆలోచించండి వీరికి సిద్ధాంతాలు, ఆదర్శాలు ఉన్నాయా?. ఇలాంటి కొందరు స్వార్థపరులే దేశాన్ని అమ్మేస్తారని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.మంగళవారం బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.గతంలో బెంగాల్లో బీజేపీ సంఖ్యను తగ్గించడమే పార్టీ లక్ష్యమని, తృణమూల్ ఇండియా కూటమిలో భాగమేనని జైరాం రమేష్ అన్నారు. కానీ ఈ రెండు చివరకు పొత్తు పెట్టుకోలేదు. కానీ అధీర్ చౌదరి ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారో నాకు తెలియదు. అయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ సంఖ్యను గణనీయంగా తగ్గించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అని జైరాం రమేష్ అన్నారు.A doctored video has been surfaced in the Social Media, perhaps either by the TMC or BJP IT Cell ( both are same notorious in the way they perform), wherein it’s being shown as if the @INCWestBengal President @adhirrcinc is asking the voters in a public meeting, to vote for BJP… pic.twitter.com/ZeTrp7SInB— West Bengal Congress (@INCWestBengal) May 1, 2024 -
ప్రధాని మోదీ సినిమా ఫ్లాప్.. కల్యాణ్ బెనర్జీ విమర్శలు
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పాలనను ట్రైలర్ అంటున్నారని కానీ సినిమా అంతా ఫ్లాప్ అయిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఎద్దేవా చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి.. నెరవేర్చకుండా కేవలం అబద్ధాలు చెప్పే వ్యక్తి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. కల్యాణ్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘బేటీ బచావో, బేటీ పడావో ప్రచారంలో భాగంగా వేల కోట్ల రూపాయల నిధులను కేంద్ర కేటాయిస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రచారం పేరుతో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో మాకు జాబితా అందించండి. 2014 నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. గత పదేళ్ల పాలనలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. మోదీ అబద్ధాలు చెప్పే వ్యక్తి. ఆయన ఒక నకిలీ నటుడు. ప్రజలు నకిలీ నటుడు మోదీకి, బీజేపీ ఓటు వేయొద్దు. ప్రధాని మోదీ ట్రైలర్లో ఫెయిల్ అయ్యారు. సినిమా కూడా సక్సెస్ కాబోదు. మోదీ ఇక గుజరాత్ వెళ్లిపోతారు. మార్కెట్లో మోదీ సినిమా ఎక్కవ కాలం పని చేయదు. విదేశాలకు వెళ్లి కరచాలనాలు చేసే నకిలీ నటుడికి ప్రజలు అస్సలు ఓటువేయొద్దు’ అని ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు. ఇక.. జనవరిలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భారీగా ఎంపీలను సస్పెండ్ చేసిన విషయంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మణ్ జగదీప్ ధన్‌ఖడ్ తీరును ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. -
రామ్‌నవమి వేడుకలపై ‘తృణమూల్’ కుట్ర: ప్రధాని
కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్ 16) పశ్చిమబెంగాల్లోని బలూర్‌ఘాట్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్‌నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్‌నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్‌నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు. ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్‌ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్‌బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని వెళ్తున్న దుశ్యాలు వైరల్‌గా మారాయి. ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో టీఎంసీ ఎంపీలు హల్చల్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలకు నేతృత్వం వహించే చీఫ్‌లను ఎన్నికల సంఘం తొలగించాలని నినాదాలు చేశారు. ఎంపీల ఆందోళనతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాట వినకపోవడంతో వారిని నెట్టడం, లాగడం, ఎత్తుకెళ్లి పోలీస్ వాహనం ఎక్కించారు. అయితే, ఎన్నికల కమీషనర్లను కలిసిన తర్వాత వెళ్లిపోవాలని అధికారులు పలుమార్లు చెప్పినప్పటికి వినకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని బలవంతంగా పోలీస్ వాహనంలోకి తరలించాల్సి వచ్చిందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రధాని మోదీ హెచ్చరిక పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఎంసీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు వేగవంతం అవుతాయని హెచ్చరించారు. అవినీతిని అంతం చేయకూడదా? అవినీతిపరులను జైలుకు పంపకూడదా? టీఎంసీ అవినీతిని వదిలించుకోకూడదా? ఇది మోదీ హామీ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం టీఎంసీ ఎంపీలు ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేపట్టడం గమనార్హం. ఆందోళన చేపట్టిన టీఎంసీ అంతకుముందు తమ పార్టీకి భయం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. మోడీ కా గ్యారెంటీ అంటున్నారు.. మోడీ గ్యారెంటీ ఏమిటి.. జూన్ 4 తర్వాత అందరినీ జైల్లో పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ


