న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) చీఫ్ రేఖాశర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకుగాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్(ట్విటర్)లో తమపై చేసిన వ్యాఖ్యలకుగాను మహువా మీద మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇటీవల హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖాశర్మ సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వీడియోలో రేఖాశర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్ స్పందించారు. రేఖాశర్మ ఆమె గొడుగు ఆమె సొంతగా ఎందుకు పట్టుకోలేపోతున్నారని ఆ నెటిజన్ ప్రశ్నించారు.
దీనికి రేఖాశర్మ ఆమె బాస్ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేశారు. మహువా మొయిత్రా గత లోక్‌సభలో తన ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment