Mahua Moitra
-
ఐస్‌క్రీమ్ బాలేదు.. రూ.1200 నాకిచ్చేయండి: స్విగ్గీపై ఎంపీ ఫైర్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ 'మహువా మొయిత్రా' (Mahua Moitra).. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ (Swiggy)లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు. అయితే తనకు డెలివరీ చేసిన ఐస్‌క్రీమ్ పాడైపోయిందని.. తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింలో వైరల్ అవుతోంది.ఎంపీ మహువా మొయిత్రా.. గత రాత్రి స్విగ్గీని సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసి ఆమె ఆర్డర్ చేసిన ఖరీదైన ఐస్‌క్రీమ్‌ల డెలివరీ సమస్యలను ఫ్లాగ్ చేశారు. 50 ఏళ్ల మొయిత్రా తనకు అందిన ఐస్‌క్రీమ్‌లు పోయిందని, అది తినడానికి కూడా ఏ మాత్రం బాగాలేదని పేర్కొన్నారు.నేను ఖరీదైన మైనస్ థర్టీ మినీ స్టిక్స్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసాను. కానీ అది పాడైపోయింది. త్వరలో రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ చేయాలనీ ఆశిస్తున్నాను, అని స్విగ్గీని ట్యాగ్ చేస్తూ.. మహువా మొయిత్రా జనవరి 16న రాత్రి 10.15 గంటలకు ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై స్విగ్గీ నిమిషాల వ్యవధిలో స్పందించి.. ఆమె ఆర్డర్ నెంబర్‌ను అడిగింది. మొయిత్రా అవసరమైన వివరాలను షేర్ చేశారు. ఎంపీ ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ విలువ రూ. 1200.Sorry @Swiggy -you’ve got to up your game. Unacceptable that I ordered expensive Minus Thirty mini sticks ice cream & it arrives spoilt and inedible. Expecting a refund or replacement asap .— Mahua Moitra (@MahuaMoitra) January 16, 2025ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు మొయిత్రాను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నేను ఎంపీని అయినంత మాత్రమే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయకూడదా అని సమాధానమిస్తూ.. దయచేసి ప్రజా ప్రతినిధులు సాధారణ వ్యక్తులు కాదు, అనే ఆలోచన నుంచి బయటపడండి, అని పేర్కొన్నారు.నెటిజన్ల స్పందనకొన్ని నిమిషాల్లోనే కరిగిపోయే ఫుడ్ ఎప్పుడూ ఆర్డర్ చేయకూడదు, మీకు సమీపంలో ఎక్కడైనా స్టోర్ ఉంటే.. అక్కడే కొనుగోలు చేసుకోవడం మంచిదని ఒకరు పేర్కొన్నారు. ఇలాంటి ఘటన తనకు కూడా ఎదురైందని.. అయితే భారీ ట్రాఫిక్ సమస్యల కారణంగా ఐస్‌క్రీమ్ కొంత పాడైందని అర్థం చేసుకున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ -
జస్టిస్ చంద్రచూడ్‌పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
మీరు, మేము కాదు.. మనమంతా: కోల్‌కతా ఘటనపై మహువా ట్వీట్
కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి నిరసనగా నేడు(మంగళవారం) కోల్‌కతా సచివాలయం నవన్ అభియాన్ ముట్టడికి జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సచివాలయం వద్ద ర్యాలీకి అనుమతి లేదని బెంగాల్ పోలీసులు తేల్చి చెప్పారు. తాజాగా వైద్యురాలి ఘటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ దారుణమైన హత్యాచారంపై న్యాయం కోరే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఈ విషయంలో మీరు, మేము అని కాకుండా అందరూ తమ కూతుళ్ల కోసం రక్తం చిందిస్తారని, న్యాయం కోసం పోరాడుతారని తెలిపారు.కాగా వైద్యురాలి ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహువా ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు."ఇది సామూహిక అత్యాచారం కాదు, ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. హడావిడిగా దహన సంస్కారాలు చేయలేదు. పోస్టుమార్టం వీడియో తీశారు. 12 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఓ మృగం చేతిలో అత్యాచారానికి గురైన మన 31 ఏళ్ల కుమార్తె కోసం మనమంతా రక్తమోడుతున్నాం. మీరు, మేము కాదు. సత్వర విచారణ, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పండి’’ అని మహువా ట్వీట్ చేసింది.It wasn’t a gangrape, there were no fractures, no hurried cremation & autopsy was videographed. Killer was caught within 12 hours & CBI is in charge of case. All of us bleed for our 31 year old daughter who was raped by this animal. There is no “us” & no “them”. Everybody wants…— Mahua Moitra (@MahuaMoitra) August 26, 2024 -
కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్ కాదు : మహవా
ఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర మాట్లాడారు.కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజలను ఫూల్స్ చేయొద్దన్నారు. ఏపీకి ఇచ్చేది అప్పేనని గ్రాంట్ కాదని అన్నారు. డాలర్ల లోను కట్టాల్సిన బాధ్యత ఏపీ భవిష్యత్తు తరాలదేనని అన్నారు టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర.ఇక ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడి జిల్లాలకు గ్రాంట్లు ఇస్తామని, కానీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని సూచించారు. తెలివైన ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు. -
ఎంపీ మహువా మొయిత్రాపై మళ్లీ కేసు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై తాజాగా మరో క్రిమినల్ కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) చీఫ్ రేఖాశర్మపై దూషణపూర్వక వ్యాఖ్యలు చేసినందుకుగాను మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్స్(ట్విటర్)లో తమపై చేసిన వ్యాఖ్యలకుగాను మహువా మీద మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల హత్రాస్ తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని రేఖాశర్మ సందర్శించిన వీడియోపై మహువా మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆ వీడియోలో రేఖాశర్మకు ఆమె సహాయకుడు గొడుగు పట్టడంపై ఓ నెటిజన్ స్పందించారు. రేఖాశర్మ ఆమె గొడుగు ఆమె సొంతగా ఎందుకు పట్టుకోలేపోతున్నారని ఆ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి రేఖాశర్మ ఆమె బాస్ పైజామా ఊడిపోకుండా పట్టుకునే పనిలో బిజీగా ఉండటం వల్లే గొడుగు పట్టుకోలేకపోతుందని మహువా వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేశారు. మహువా మొయిత్రా గత లోక్‌సభలో తన ఎంపీ పదవి నుంచి సస్పెన్షన్‌కు గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
బీజేపీతో ఇబ్బందులకు గురయ్యా: మహువా మొయిత్రా
ఢిల్లీ: బీజేపీ తనను టార్గెట్ చేసి మరీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ తరఫున కృష్ణానగర్ సెగ్మెంట్లో పోటీ చేసిన మొయిత్రా.. బీజేపీ అభ్యర్థినిపై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా గెలుపొందిన అనంతరం ఆమె తొలిసారి ఓ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను సిస్టరెక్టమీ (ఆపరేషన్ ద్వారా గర్భసంచి తొలగింపు) సర్జరీ చేసుకున్నాను. అప్పటికి నేను సర్జరీ చేసుకొని కేవలం ఎనిమిది రోజులు అవుతోంది. ఆ సమయంలో నాకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నాపై ఒత్తిడి తీసుకువచ్చారు. అలాంటి సయయంలో కూడా నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు’’ అని మొయిత్రా చెప్పుకొచ్చారు.Total Hysterectomy is a surgical removal of entire female reproductive system.@MahuaMoitra had undergone this surgery & 8 days after that she was asked to vacate residence OR face forceShe's saying this publicly after defeating BJP with a huge margin, NOT BEFORE: Strong Woman pic.twitter.com/HzWlEq26v9— Dr Ranjan (@AAPforNewIndia) June 12, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన మహువా మొయిత్రా.. బీజేపీ అభ్యర్థిని అమిత్ రాయ్‌పై 56705 ఓట్లు మేజార్టితో గెలుపొందారు. బీజేపీతో తాను ఎదుర్కొన్న కష్టాలను సంబంధించి మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగిన కేసులో మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని గతేడాది డిసెంబర్ 8న లోక్‌సభ స్పీకర్ రద్దు చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ దోషిగా తేలుస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నివేదిక సమర్పించారు. దీంతో స్పీకర్ ఆమెపై వేటు వేశారు. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయటంపై టీఎంసీతో సహా విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఎంపీ సభ్యత్వం రద్దు అయిన వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. ఆమెకు కేయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. అనంతరం మొయిత్రాను ప్రభుత్వ బంగ్లాను నుంచి ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. -
వివాదాలకు కేరాఫ్.. ఫైర్‌బ్రాండ్ మహువా
చిన్న కుక్కపిల్ల కస్టడీకోసం మాజీ సహచరునితో కావచ్చు.. పార్లమెంటులో ఏకంగా ప్రధాని మోదీతో కావచ్చు... మహువా మొయిత్రా అంటేనే పోరాటం. తెలివైన వ్యక్తి. ఆధునికంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశి్నస్తారు. పార్లమెంటులో బలమైన స్వరం. ఎంపీగా ఎన్నికైన నాటినుంచే మోదీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ఆ క్రమంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. అంతే వివాదాస్పద రీతిలో నోటుకు ప్రశ్నల కేసులో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు కూడా. కాంగ్రెస్‌లో మొదలై... దాదాపు 15 ఏళ్ల క్రితం ‘ఆమ్ ఆద్మీ కా సిపాహీ’ ప్రచారానికి నాటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎంపిక చేసిన యువజన కాంగ్రెస్ నాయకురాలిగా తొలిసారిగా మీడియా దృష్టిని ఆకర్షించారు మహువా. 1974 అక్టోబర్ 12 న అస్సాంలోని కచార్ జిల్లా లాబాక్‌లో జన్మించిన ఆమె అమెరికాలోని మసాచుసెట్స్‌లో మౌంట్ హోలియోక్ కాలేజీలో పై చదువులు చదివారు. అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్‌లో బ్యాంకర్‌గా న్యూయార్క్‌లో, లండన్‌లో పనిచేశారు. 2009లో ఉద్యోగం వదిలి భారత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్‌లో చేరినా 2010లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2016 పశి్చమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. 2019లో కృష్ణానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అక్కడా అదే వాగ్ధాటి కొనసాగించారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీ సంబంధం గురించి పదేపదే సభలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈసారీ కృష్ణానగర్ నుంచే పోటీ చేస్తున్నారు... కొత్త రోల్ మోడల్స్ కావాలి.. ఖరీదైన బూట్లు, బ్రాండెడ్ బ్యాగులు కొనడానికి తనకు లంచాలు అవసరం లేదంటూ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు మొయిత్రా. తనపై ఆరోపణలను భారత రాజకీయాల్లో ఇమిడి ఉన్న స్త్రీ ద్వేషంలో భాగంగా అభివర్ణించారు. ‘‘నేను ప్రగతిశీల కుటుంబంనుంచి వచ్చాను. భారతీయ స్త్రీ ఇలాగే ఉండాలనే మూస పద్ధతిలో పెరగలేదు. తృణమూల్ ఓ మహిళ సారథ్యంలో ఉంది. మమత మహిళలను ప్రోత్సహిస్తారు. అందుకే ఆ పార్టీలో చేరా. పార్లమెంటులో సగం మంది మహిళా ఎంపీలు టీఎంసీ వాళ్లే. ఎందుకంటే బెంగాల్లో స్త్రీలను శక్తిగా భావిస్తాం. మెదడున్న, గా చదువుకున్న, ఆర్థిక అవగాహన, ఆత్మవిశ్వాసమున్న స్త్రీని సగటు భారతీయ పురుషుడు, నాయకుడు ఎదుర్కోలేడు’’ అంటూ కుండబద్దలు కొడతారు. ప్రజా జీవితంలో ఉన్న మహిళలకు సరికొత్త రోల్ మోడల్స్ అవసరమంటారు. ‘కుక్కపిల్ల కస్టడీ’ తో సీటుకే ఎసరు... పెంపుడు కుక్కపిల్ల కస్టడీ వ్యవహారం పార్లమెంటు నుంచి మొయిత్రా బహిష్కరణకు దారితీసింది. మాజీ సహచరుడు జై అనంత్ దెహద్రాయ్ నుంచి తమ పెంపుడు కుక్కపిల్ల కస్టడీ కోరుతూ కోర్టుకెక్కారు. ప్రతిగా అదానీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి మొయిత్రా భారీగా లంచం, బహుమతులు తీసుకుంంటున్నారంటూ సీబీఐకి ఫిర్యాదు చేశారు. వ్యవహారం పార్లమెంటు ఎథిక్స్ కమిటీ విచారణ దాకా వెళ్లింది. పార్లమెంట్ లాగిన్ ఐడీని ఇతరులతో పంచుకున్నందుకు ఆమెను దోషిగా తేల్చి 2023 డిసెంబర్ 8న లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు
కలకత్తా: పార్లమెంటులో డబ్బులు తీసుకొని ప్రశ్నలడిగిన వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే డబ్బులకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఆధారంగానే ఈడీ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో విచారణకు రావాల్సిందిగా ఈడీ పంపిన సమన్లకు ఇటీవల మహువా స్పందించలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం. లోక్‌పాల్ ఆదేశాలతో మహువాపై కేసు నమోదు చేసిన సీబీఐ ఇటీవలే కలకత్తాలోని ఆమె ఇళ్లలో సోదాలు నిర్వహించింది. కాగా, డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇచ్చిన ఆరోపణలపై మహువా ఎంపీ సభ్యత్వాన్ని స్పీకర్ ఇప్పటికే రద్దు చేశారు. ఎథిక్స్ కమిటీ సిఫారసుల మేరకు లోక్‌సభ స్పీకర్ మహువాపై సభ్యత్వ రద్దు చర్య తీసుకున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహువా పశ్చిమబెంగాల్లోని కృష్ణానగర్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి.. తీహార్ జైలులో కేజ్రీవాల్ కష్టాలు -
‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్
ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 లోక్‌సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్‌మార్క్‌ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు. #InPics | West Bengal chief minister Mamata Banerjee, along with TMC leader Mahua Moitra, holds a poll rally in Krishnanagar.#ElectionsWithNDTV #LokSabhaElection2024 pic.twitter.com/4iuTTL203Q — NDTV (@ndtv) March 31, 2024 సీఏఏని అనుమతించబోం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించినందునే టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బీజేపీ ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు. -
Cash for Query : మరోసారి ‘మహువా మొయిత్రా’ కు ఈడీ నోటీసులు
పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్‌సభ అభ్యర్ధి, తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సమన్లు పంపిన ఈడీ.. తాజాగా మరోసారి పంపింది. విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘన ఆరోపణలపై ఆమెను ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. మహువా మొయిత్రాను ఈడీ అధికారులు నాన్ రెసిడెన్షియల్ ఎక్స్‌ట్రనల్ (ఎన్ఆర్ఈ), అకౌంట్స్, ఒక దేశం నుంచి మరో దేశానికి చెందిన అకౌంట్లకు నగదు (foreign remittance)చెల్లింపులు, ఇతర లావాదేవీల గురించి ప్రశ్నించనున్నారు. గతంలో రెండు సార్లు గత ఏడాది మహువా మొయిత్రా స్నేహితుడు, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఆమెపై ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త హీరానందానీకి మహువా తన పార్లమెంట్ పాస్‌వర్డ్‌ను ఇచ్చారని అనంత్ ఆరోపించారు. దీనివల్ల హీరానందానీ అవసరమైనప్పుడు నేరుగా పార్లమెంట్లో తనకు కావాల్సిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందని అనంత్ అన్నారు. అంతేకాకుండా, డబ్బులు తీసుకొని హీరానందానీ గ్రూప్ తరఫున పార్లమెంట్లో మహువా ప్రశ్నలు అడిగారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలతో వివాదం మొదలైంది. ఈ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహువా మొయిత్రాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించారు. కొద్ది రోజులకే ఆమె పార్లమెంట్ నుంచి బహిష్కరణకు గురయ్యారు. రూ.2 కోట్ల వరకు తాజాగా, పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రశ్నలను అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి మహువా మొయిత్రా రూ.2 కోట్ల నగదు, అలాగే లగ్జరీ ఐటమ్స్ తీసుకున్నారని, ప్రతిఫలంగా ఆమె తన పార్లమెంటు వెబ్సైట్ లాగిన్ వివరాలను దర్శన్ హీరానందానీకి షేర్ చేశారని, ఇదే అంశంపై ఈడీ హీరానందనీని సైతం విచారణ కోసం పిలిపించినట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, క్యాష్ ఫర్ క్వైరీ ఆరోపణల్ని మోయిత్రా ఖండించారు (కానీ ఆమె వెబ్సైట్ ఆధారాలను పంచుకున్నారని, ఇది ఎంపీలలో సాధారణ పద్ధతి అని వాదించారు). మేలో ఈ కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. -
‘రాజమాత కుటుంబం బ్రిటిష్ వాళ్లకి సహాయం చేసింది’
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలో భాగంగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర స్థానంలో రాజమాత అమ్రితా రాయ్‌ని బరిలోకి దించింది. దీంతో ఆమె ఎవరూ అని సోషల్‌మీడియాలో చర్చ జరిగింది. అయితే అదే స్థానంలో గతేడాది ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) నేత మహువా మొయిత్రా పోటిలో ఉంది. దీంతో టీఎంసీ అమ్రితా రాయ్‌పై విమర్శలకు తెరలేపింది. ఆమె రాజకుటుంబం భారత దేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారి పక్షమని మండిపడింది. కృష్ణానగర్‌ను పరిపాలించిన రాజు రాజా కృష్ణచంద్ర రాయ్.. బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బ్రిటీష్ వారికి సాయం చేసి అనుకూలంగా పనిచేశారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శించారు. ‘బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా బ్రిటిష్‌వారి వ్యతిరేకంగా పోరాడుతున్నసమయంలో కృష్ణా నగర్ రాజకుటుంబం బ్రిటీష్వారికి సాయం చేసిందని చరిత్ర చెబుతోంది. అనాడు రాజా కృష్ణచంద్ర రాయ్.. బ్రిటీష్ బలగాలు సాయం చేశారు. బీజేపీ వీర్‌సావర్కర్ పార్టీ. ఈ పార్టీ మహాత్మ గాంధీ హత్యకు బాధ్యత వహించాలి. బ్రిటీష్వారికే సాయం చేసిన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దించింది బీజేపీ. మహువా మొయిత్రా దేశంలోని అవినీతిపై పోరాటం చేస్తోంది’ అని కునాల్ ఆరోపణలు చేశారు. టీఎంసీ విమర్శలపై రాజమాత అమ్రితా రాయ్ స్పందించారు. తన కుటుంబంపై చేస్తున్నఆరోపణలు అసత్యాలని తెలిపారు. ‘టీఎంసీ చేసే ఆరోపణలను భారత్, బెంగాల్లో ఎవరూ నమ్మరు. నా కుటుంబంపై చేస్తున్న విమర్శలు అసత్యం. మహారాజా కృష్ణ చంద్ర రాయ్ బ్రిటిష్ పక్షమన్న ఆరోపణ నిజం కాదు. ఆయన అలా ఎందుకు చేశాడు?. ఆయన అలా చేసిఉంటే ఇక్కడ హిందుత్వం ఉండేదా? సనాతన ధర్మం ఉండేదా? ఆయన బెంగాల్‌కు మరో గుర్తింపు తీసుకువచ్చారు. మత వ్యతిరేకత నుంచి రాజా కృష్ణచంద్ర రాయ్ మనల్నీ కాపాడారని ఎందుకు అనుకోకుడదు?’అని ఆమె టీఎంసీ కౌంటర్ ఇచ్చారు. -
పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ.. ఎవరీ ‘రాజమాత’
కోల్‌కతా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువా మొయిత్రా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మరి ఈసారి మహువా గెలుస్తారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే.. ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రాజమాత అమ్రితా రాయ్‌కి గురించి పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతకీ ఈ రాజమాత ఎవరు? కృష్ణా నగర్ లోక్‌సభ నియోజవర్గంలో మొత్తం 14 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో బీజేపీ 1999 ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఆ నియోజకవర్గంలో కమలం గెలుపు కత్తిమీద సాములా మారింది. అయితే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న కమలం.. మహువా మొయిత్రా మీద ఏరికోరి అమ్రితా రాయ్‌ని నిలబెట్టింది. బీజేపీ 111 అభ్యర్ధులతో ఐదువ జాబితాను విడుదల చేసింది. అందులో కృష్ణా నగర్ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్ధిగా రాజమాత అమ్రితా రాయ్‌ని ఖరారు చేసింది. అమ్రితా రాయ్ ఎవరు? అమ్రితా రాయ్ కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందినవారు. నియోజకవర్గానికి చెందిన 'రాజ్‌బరీ రాజమాత' (రాచరికపు రాణి తల్లి) గా ప్రసిద్ధి మొయిత్రాకు పోటీగా బీజేపీ రాజ మహారాజా కృష్ణచంద్ర కుటుంబ సభ్యులను పోటీకి దించవచ్చని ఊహాగానాలు ఊపందుకున్న తర్వాత బీజేపీ ఢిల్లీ అధిష్టానం అమ్రితారాయ్ని కృష్ణానగర్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 20న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, సువేందు అధికారి సమక్షంలో రాయ్ అధికారికంగా బీజేపీలో చేరారు. పలు నివేదికల ప్రకారం.. కృష్ణా నగర్ జిల్లా నాయకత్వమే మొదట అమ్రితా రాయ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఆ తర్వాతే కమలం పెద్దలు రంగంలోకి దిగారు. ముఖ్యంగా, కృష్ణనగర్ లోక్‌సభ అభ్యర్థిగా మహారాజా కృష్ణ చంద్ర రాయ్ రాజమహల్ నుంచి తొలిసారి రాజకీయాలతో అనుసంధానించారు. రాష్ట్రంలో వీరి వారసత్వం హవా నేటికీ కొనసాగుతుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత రాయ్ మాట్లాడుతూ “నాడియా చరిత్రకు రాజు కృష్ణచంద్ర చేసిన కృషి గురించి అందరికి తెలుసు. చరిత్రలో కృష్ణానగర్ రాజకుటుంబం పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. నేను ఎన్నికల రంగంలోకి రాచరికపు కోడలుగా కాకుండా సాధారణ ప్రజల గొంతుకగా నిలిచాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. వెస్ట్ బెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు బీజేపీ మొత్తం 38 మధ్య అభ్యర్ధులను ఖరారు చేసింది. ఐదవ జాబితాలో 19 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. -
Loksabha Elections 2024: ‘మహువా’ మళ్లీ గెలిచేనా !
కలకత్తా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహువామొయిత్రా రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలుస్తారా అంటే కష్టమేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఈసారి ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లోని మహువా నియోజకవర్గం కృష్ణానగర్ నుంచి బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలోకి దింపింది. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఇక్కడి నుంచి మహువా అభ్యర్థిత్వాన్ని టీఎంసీ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఆదివారం(మార్చ్ 24) ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాలో కృష్ణానగర్ సీటును స్థానిక రాజవంశానికి చెందిన రాజమాత అమ్రితా రాయ్‌కి కేటాయించింది. ఈమె గత వారమే బీజేపీలో చేరడం గమనార్హం. 18వ శతాబ్దంలో బెంగాల్‌ను పరపాలించిన మహారాజ కృష్ణ చంద్ర రాయ్ చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకు కూడా గుర్తు చేసుకుంటారు. కృష్ణా నగర్ బీజేపీ టికెట్ దక్కించుకున్న రాజమాత అమ్రితా రాయ్ కృష్ణచంద్రరాయ్ వంశానికి చెందినవారే. నడియా జిల్లా బీజేపీ నాయకత్వం ఏరికోరి రాజమాత అమ్రితా రాయ్‌కి కృష్ణానగర్ టికెట్ ఇప్పించారని, పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెతో పలుమార్లు చర్చలు జరిపి ఒప్పించారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కళ్యాణ్‌చౌబే స్వల్పంగా 63,218 ఓట్ల తేడాతో మహువా విజయం సాధించారు. మహువా గెలుపులో టీఎంసీకి అప్పట్లో గట్టి పట్టున్న కాలీగంజ్, చోప్రా, పలాషిపర అసెంబ్లీ నియోజకవర్గాలు కీలక పాత్ర పోషించాయి. అయితే వీటిలో కాలీగంజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో గత కొన్ని నెలల్లో బీజేపీ బలపడినట్లు చెబుతున్నారు. దీనికి తోడు నడియా జిల్లా వ్యాప్తంగా టీఎంసీ గతంతో పోలిస్తే బలహీనపడినట్లు తెలుస్తోంది.ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో డబ్బుకు ప్రశ్నలడిగిన కేసులో ఇప్పటికే ఈ టర్ములో ఎంపీ సభ్యత్వం కోల్పోయి సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న మహువా కృష్ణానగర్ నుంచి పార్లమెంటులో మళ్లీ అడుగుపెట్టడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదీ చదవండి.. కంగనకు బీజేపీ టికెట్.. నటి పాత ట్వీట్ వైరల్ -
Cash for query scam: ‘మహువా’కు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలడిగిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన దర్శన్ హీరానందాని, ఇతర వ్యక్తులతో కలిసి మహువా కుట్ర పన్నారని, పార్లమెంటు కల్పించిన ప్రత్యేక హక్కులను సొంతానికి వాడుకుని జాతి భద్రతను ప్రమాదంలో పడేశారని కేసు ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. లోక్‌పాల్ ఆదేశాల మేరకు మార్చ్ 21నే సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ కేసులో మహువాతో పాటు చేర్చిన ఇతర నిందితుల పేర్లు, సెక్షన్లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విచారణలో సీబీఐ ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. కోల్‌కతాలోని మహువా ఇళ్లపై ఇటీవల సీబీఐ సోదాలు కూడా జరిపింది. కాగా, వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని వద్ద డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లక్ష్యంగా మహువా ప్రశ్నలడిగారన్న ఆరోపణలపై లోక్‌సభ నుంచి ఆమె సభ్యత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 8న స్పీకర్ రద్దు చేశారు. అంతకుముందు ఈ వ్యవహారంలో విచారణ జరిపిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఆమె స్నేహితుడు హీరానందాని స్వయంగా లేఖ రాశారు. మహువా తన పార్లమెంటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తనకు ఇచ్చారని దీని ద్వారా తాను ప్రశ్నలను నేరుగా పోస్ట్ చేయగలిగానని లేఖలో తెలిపారు. ఇది మోదీ రాయించిన లేఖ అని అప్పట్లో మహువా మండిపడ్డారు. కాగా, తాజాగా కేసులో మహువాతో పాటు హీరానందానిని కూడా ప్రధాన నిందితునిగా చేర్చడం గమనార్హం. ఇదీ చదవండి.. సునీత మరో రబ్డీ అయ్యేనా -
Kolkata: మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్‌కతా: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలడిగిన కేసులో మాజీ ఎంపీ మహువా మొయిత్రా ఇంట్లో సీబీఐ శనివారం ఉదయం సోదాలు ప్రారంభించింది. కోల్‌కతాలోని మహువా ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేస్తోంది. ఇటీవలే ఈ కేసులో మహువాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. క్యాష్ ఫర్ క్వెయిరీ కేసు దర్యాప్తులో భాగంగానే సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన మహువా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకుగాను వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల ఆధారంగా స్పీకర్ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేశారు. డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో మహువాపై సుదీర్ఘ ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్పాల్ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై మహువా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి.. కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు -
మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మహువా.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ)పై దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ తనకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తోందని.. దాన్ని నిరోధించాలని మహువా ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై గరువారం విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్ తీర్పును రిజర్వులో పెట్టి నేడు(శుక్రవారం) విడుదల చేశారు. మహువా మొయిత్రి చేసిన ఆరోపణలను ఈడీ తరఫు న్యాయవాది ఖండించాడు. ఈ కేసు సంబంధించి మహువా సమాచారాన్ని ప్రెస్ రిలీజ్ లేదా మీడియాకు వెల్లడించటం చేయలేదని తెలిపారు. ఇక.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసులో సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మహువా మొయిత్రా హాజరుకాలేదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే... తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారు. అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని.. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో మహువా మొయిత్రాపై సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుపుతోంది. భాజపా ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు లోక్‌పాల్ ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పార్లమెంటు నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా గత డిసెంబరులో మహువా లోక్‌సభ సభ్యత్వం కూడా రద్దయింది. మొయిత్రా.. తాను ఏ తప్పు చేయలేదని లోక్‌సభ సభ్యత్వ రద్దును ఖండించారు.తన బహిష్కరణ వేటుపై ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
మహువా అవినీతి కేసు: జై అనంత్ దేహద్రాయ్కు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా అనివీతి కేసులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సమన్లు జారీ చేసింది. మహువా అవినీతి కేసుకు సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలకు డబ్బులు తీసుకున్న కేసులో మహువా డిసెంబర్లో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరకు ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించారు. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DEO) కూడా ఇటీవలే నోటీసులు పంపింది. అయితే తనకు ఆ బంగ్లాను కొనసాగించాలని మహువా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె ఎదురుదెబ్బ తగలటంతో తన కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
మహువా మొయిత్రాకు మరో షాక్
ఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాకు మరో షాక్ తగిలింది. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను తక్షణమే ఖాళీ చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీకాగా.. సంబంధిత అధికారులు నేడో, రేపో రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ నేత మహువా మొయిత్రా పై డిసెంబర్ 8వ తేదీన బహిష్కరణ వేటు పడింది. ఆ వెంటనే ఆమె అధికారిక బంగ్లా కేటాయింపు సైతం రద్దైంది. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ మహువాకు కిందటి నెలలోనే నోటీసు వెళ్లింది. జనవరి 7వ తేదీ లోపు బంగ్లా ఖాళీ చేయాలన్నది ఆ నోటీసుల సారాంశం. ఈ విషయంపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(DOE)కు విజ్ఞప్తి చేయాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈలోపు గడువు ముగియడంతో డీవోఈ జనవరి 8వ తేదీన.. బంగ్లాలో ఎందుకు కొనసాగనివ్వాలో చెప్పాలంటూ ఆమెకు నోటీసులు పంపింది. మూడు రోజులు గడిచినా ఆమె నుంచి సమాధానం లేకపోవడంతో.. 12వ తేదీన మరోసారి నోటీసులు పంపింది. దీంతో ఆమె డీవోఈ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే ఆమె వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. మంగళవారం నాడు తక్షణమే బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు పంపింది డీవోఈ. అంతేకాదు.. ఆలస్యం చేయకుండా ఆమెతో బంగ్లా ఖాళీ చేయించేందుకు అధికారుల బృందాన్ని రంగంలోకి దింపనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
మహువా పిటిషన్: లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం కోర్టు నోటీసు
ఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన విషయం తెలిసందే. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించిన విషయంలో ఆమె సూప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా .. లోక్ సభ మహువా మొయిత్రిపై వేసిన సస్పెన్షన్ వేటుకు సంబంధించి స్టే ఇవ్వాలన్న ఆమె పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. మహువా మోయిత్రా వేసిన పిటిషన్‌పై రెండు వారాల్లోగా పూర్తి సమాధానం అందించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటిసు ఇచ్చింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ మార్చి మూడో వారానికి వాయిదా చేస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో టీఎంసీ నాయకురాలు మహువా మొయిత్రాను ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఎంపీగా కొనసాగకూడదని లోక్ సభ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఆమె ప్రవర్తన అనైతికమని ఎథిక్స్ కమిటీ తేల్చి చేప్పింది. కాగా.. తనను ఎంపీగా సస్పెండ్‌పై చేయడంపై మహువా సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: మీతోనే ఉంటానంటూ శివరాజ్ సింగ్ భావోద్వేగం -
సీఎం యోగిపై మహువా మొయిత్రా విమర్శలు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయుకురాలు మహువా మొయిత్రా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ఐఐటీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులపై ఎందుకు బుల్డోజర్ చర్యలు తీసుకోవడం లేదని మహువా మొయిత్రా సూటిగా ప్రశ్నించారు. 2013 నవంబర్ 1న ఐఐటీ బీహెచ్‌యూలో ముగ్గురు వ్యక్తులు ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారు. ఈ ఘటనలోని నిందితులు బీజేపీ పార్టీ ఐటీ సెల్‌కు చెందినవారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వారిని ఆలస్యంగా అరెస్ట్ చేయడం వల్ల సాక్ష్యాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని దుయ్యబట్టారు. ‘విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన నిందితులపై సీఎం సీఎం యోగి ‘బుల్డోజర్ చర్యలు’ ఎందుకు తీసుకోవటం లేదు?. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడిచిపోయింది. వారంతా బీజేపీ ఐటీ సెల్ చెందినవారే’ అంటూ ఆమె నిందితులు సీఎం యోగితో దిగిన ఫొటోలను ‘ఎక్స్’ ట్విటర్లో ప్రశ్నించారు. Wonder Ajay Bisht aka @myogiadityanath was doing since Nov 2nd when his BJP Troll Sena aka IT cell vaanars gang -raped a woman. Thok dijiye, Sir. Is Baar Bulldozer Chalaane Mein Itni Der Kyon? pic.twitter.com/R4xvJMG1D5 — Mahua Moitra (@MahuaMoitra) January 2, 2024 తాజాగా విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను పార్టీ నుంచి బీజేపీ బహిస్కరించింది. ఇక నిందితులను కునాల్ పాండే, ఆనంద్ చౌహాన్, సాక్షం పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నిందితులు.. బీజేపీ సభ్యులని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. చదవండి: Dawood Ibrahim Maharashtra Home: వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు -
మహువా మెయిత్రా పిటిషన్‌పై సుప్రీంలో నేడు విచారణ
ఢీల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. క్యాష్ ఫర్ క్వారీ ఆరోపణలతో తన ఎంపీ సభ్యత్వం రద్దును సుప్రీంకోర్టులో ఆమె సవాల్ చేశారు. కేంద్రంపై విమర్శలు చేయడానికి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం చేసుకున్నట్లు మెయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదటిసారి పార్లమెంట్లో ఈ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చే జరిగింది. ఈ అంశం చివరికి ఎథిక్స్ కమిటీకి చేరింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రశ్నలు అడగడానికి మహువా అనైతిక చర్యకు పాల్పడినట్లు ఎథిక్స్ కమిటీ నిర్దారిచింది. మెయిత్రా తన లోక్‌సభ పోర్టల్ లాగిన్ వివరాలను వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో పంచుకున్నట్లు ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఈ 'క్యాష్-ఫర్-క్వారీ' కుంభకోణంలో ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక సిఫార్సు చేసింది. దీంతో డిసెంబర్ 8న ఆమె తన ఎంపీ పదవిని రద్దు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. ఎథిక్స్ కమిటీ తన వాదనను వినిపించుకోలేదని మహువా ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ పదవి రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు -
బహిష్కరణకూ ఓ పద్ధతుంది!
పార్లమెంట్ సభ్యురాలు మహువా మోయిత్రాను సభా సభ్యత్వం నుండి డిసెంబర్ 8న లోక్‌సభ బహిష్కరించింది. ఆమెను లోక్‌సభలో ప్రసంగించడానికి అనుమతించలేదు. ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. అయినా మొయిత్రాను 17వ లోక్‌సభ నుండి బహిష్కరించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఉనికిలో లేని నీతి నియమావళితో ఆమెను దోషిగా నిర్ధారించారు. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దు చేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘనల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రిటన్ ఉదాహరణలు మనకు ఉన్నాయి. మహువా మొయిత్రాను బహిష్కరించే తీర్మా నాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రవేశపెట్టారు. మొయిత్రా ప్రవర్తన (ఆమె తన పార్ల మెంటరీ లాగిన్ వివరాలను పంచుకోవడం, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి నగదును, సౌకర్యాలను స్వీకరించడం) పార్ల మెంట్ సభ్యురాలికి తగదని ఆ తీర్మానం పేర్కొంది. బహిష్కరణ ప్రక్రియను వెంటాడి వేధించడంగా అభివర్ణించారు మొయిత్రా. తనపై ఆరోపణకు సంబంధించి డబ్బు మార్పిడికి ఎలాంటి రుజువు లేదనీ, నైతిక కమిటీలో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యం ప్రేరేపితమైనదనీ, ఇది వైరుద్ధ్యపూరితంగా ఉందనీ అన్నారు. తనపై నిందమోపిన వారిని ఎదురు ప్రశ్నించడానికి ఆమెను అనుమతించలేదు. మన పార్లమెంట్ పనితీరుకు సంబంధించినంత వరకు ఈ మొత్తం అధ్యాయం వివాదాస్పదమైంది. రాజకీయాలు, వ్యక్తిత్వం ఈ ప్రక్రియను కప్పివేశాయి. పార్లమెంట్ తన వ్యవహారాల నిర్వహణకు సొంత నిబంధనలను రూపొందించుకునే అధికారాన్ని మన రాజ్యాంగం ఇచ్చింది. దుష్ప్రవర్తన కారణంగా దాని సభ్యులను బహిష్కరించే అధికారం దీని పర్యవసానమే. పార్లమెంటు తనను తానే నియంత్రించుకుంటుంది కాబట్టి, ఎంపికైన ప్రజా ప్రతినిధి సభ్యత్వాన్ని రద్దుచేయడం అనే తీవ్రమైన చర్యను నిందకు తావులేని ప్రక్రియ ద్వారా చేయాలి. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధుల దుష్ప్రవర్తన, నైతిక ఉల్లంఘ నల ప్రశ్నలను ఎదుర్కోవటానికి రెండు ప్రజాస్వామ్య దేశాలైన అమె రికా, బ్రిటన్ల ఉదాహరణలు మనకు ఉన్నాయి. అమెరికన్ కాంగ్రెస్‌తో మొదలుపెడదాం: డిసెంబర్ 1న అమెరికా ప్రతినిధుల సభ, న్యూయార్క్ రిపబ్లికన్ గెరోజ్ శాంటోస్‌ను తన సభ్యత్వం నుండి బహిష్కరించింది. ఎన్నికల ప్రచారంలో వంచన, ఆర్థికపరమైన అవక తవకలు, ఉల్లంఘనలు, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై సుమారు తొమ్మిది నెలల విచారణ తర్వాత ఈ బహిష్కరణ ఆదేశం వచ్చింది. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిపై వచ్చిన ఫిర్యాదులను రెండు వేర్వేరు కార్యాలయాలు పరిశీలించాయి. ఒకటి... కాంగ్రెషనల్ ఎథిక్స్ కార్యా లయం (ఓసీఈ). నైతిక చట్టంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదులు, పరిశోధకులతో కూడిన స్వతంత్ర, పక్షపాతం లేని ఈ సంస్థను 2008లో స్థాపించారు. ఇది హౌస్ సభ్యులపై, కాంగ్రెస్ సిబ్బందిపై ఫిర్యాదులను స్వీకరిస్తుంది, పునఃపరిశీలిస్తుంది. ఒక వివరణాత్మక పరీక్ష తర్వాత, ఇది తన సిఫార్సును ఎథిక్స్ కమిటీకి పంపుతుంది. ఇది స్వీకరించే ఫిర్యాదులు, వాటిపై తీసుకునే చర్యల గురించి వివరణా త్మక గణాంకాలను కూడా ప్రచురిస్తుంది. శాంటోస్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన రెండో కార్యా లయం హౌస్ ఎథిక్స్ కమిటీ. ఇది ఇతర సభ్యుల నుండి ఫిర్యాదులను స్వీకరించింది. ‘ఓసీఈ’ నుండి సూచనను, శాంటోస్ వ్యవహారాన్ని విచారించిన ప్రతినిధుల సభ నుండి తీర్మానాన్ని హౌస్ ఎథిక్స్ కమిటీ పరిశీలించి ఒక పరిశోధనాత్మక సబ్ కమిటీని నియమించింది. ఇది 40 మంది సాక్షులను ఇంటర్వ్యూ చేసింది. 72,000 పేజీల పత్రాలను అందుకుంది. సబ్‌కమిటీకి తన వివరణను ఇవ్వడానికి ఎథిక్స్ కమిటీ శాంటోస్నూ అనుమతించింది. కాని దాన్ని ఆయన తిరస్కరించారు. శాంటోస్ ‘తన వ్యక్తిగత ఆర్థిక లాభం కోసం, ప్రతినిధుల సభకు తన అభ్యర్థిత్వంలోని ప్రతి అంశాన్నీ మోసపూరితంగా ఉపయోగించు కోవాలని చూసినట్లు’ పరిశోధనాత్మక కమిటీ కనుగొంది. ఎథిక్స్ కమిటీ నివేదికలోని బహిష్కరణ ప్రతిపాదనను ప్రతినిధుల సభ పరి గణనలోకి తీసుకుంది. కాంగ్రెస్ సభ్యుడిని తొలగించడానికి అమెరికా రాజ్యాంగం ఒక భారీ అడ్డంకిని ఉంచింది. అలాంటి తొలగింపు ప్రతి పాదనకు సంబంధిత సభలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు అంగీకరించాలి. అతడిని తొలగించడానికి చేసిన మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. మూడవ ప్రయత్నంలో, అతని రిపబ్లికన్ పార్టీకి చెందిన 105 మంది సభ్యులు కూడా 206 మంది డెమోక్రాట్లతో కలిసి శాంటోస్‌ని బహిష్కరించారు. ఎంపీల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండేలా పర్యవేక్షించ డానికి బ్రిటన్ పార్లమెంట్ కూడా విస్తృతమైన యంత్రాంగాన్ని కలిగి ఉంది. ఇది ప్రయోజనాలకు సంబంధించిన పబ్లిక్ రిజిస్టర్ని నిర్వ హిస్తుంది. ఎంపీలు తమ పార్లమెంటరీ విధుల సమయంలో పొందిన ఆదాయాలు, ఆతిథ్యం, బహుమతులను తప్పనిసరిగా ప్రకటించాలి. పార్లమెంటరీ ప్రమాణాల కమిషనర్ అని పిలిచే ఒక స్వతంత్ర అధికారి ఈ రిజిస్టర్‌ను నిర్వహిస్తారు. ఎంపీలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలి స్తారు. కమిషనర్ పనిని ఎంపీల స్టాండర్డ్స్ కమిటీ సమీక్షిస్తుంది.ఎంపీలపై ఎలాంటి చర్య తీసుకోవాలో సిఫారసు చేస్తుంది. 2009లో, ఖర్చుల కుంభకోణం (హౌస్ ఆఫ్ కామర్స్ ఎంపీలు పార్లమెంట్ నుండి వ్యక్తిగత ఖర్చులను రీయింబర్స్ చేయడం) తర్వాత, ఎంపీలు, వారి సిబ్బంది వేతనాలు, పింఛన్లను నియంత్రించేందుకు స్వతంత్ర పార్లమెంట్ ప్రమాణాల సంస్థను ఏర్పాటు చేయడానికి బ్రిటన్ ఒక చట్టాన్ని కూడా ఆమోదించింది. ఫిర్యాదులను స్వీకరించడానికి, దర్యాప్తు చేయడానికి స్వతంత్ర యంత్రాంగాలతో పాటు, అమెరికా, బ్రిటన్ పార్లమెంటులు, వారి సభ్యులు అనుసరించ డానికి వివరణాత్మక మార్గదర్శకాలను కూడా అందించాయి. ఉదాహ రణకు అమెరికాలో ఈ సంవత్సరం ప్రారంభంలో, కాంగ్రెషనల్ ఎథిక్స్ కార్యాలయం ఒక విషయాన్ని హౌస్ ఎథిక్స్ కమిటీకి సూచించింది; ప్రతినిధుల సభకు చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కోర్టెజ్, 2021లో ఛారిటీ మెట్ గాలాలో ధరించేందుకు మేకప్ సేవలు, హ్యాండ్‌బ్యాగ్, ఆభరణాలు, దుస్తులను అంగీకరించడం ద్వారా బహు మతి నియమాలను ఉల్లంఘించి ఉండవచ్చంది. భారతదేశంలో రాజ్యసభ ఎథిక్స్ కమిటీ తన ఎంపీలకు ప్రవ ర్తనా నియమావళిని నిర్వచించింది. రాజ్యసభ ఎంపీలు తమ పార్ల మెంటరీ వ్యవహారాల కోసం ఎలాంటి ప్రయోజనాలనూ అంగీకరించకూడదని కోడ్ నిర్దేశిస్తుంది. వారి వ్యక్తిగత ప్రయోజనాలకూ, ప్రజా ప్రతినిధిగా వారి విధినిర్వహణకూ మధ్య వైరుద్ధ్యం ఏర్పడిన సంద ర్భాల్లో, వారు తమ ప్రభుత్వ కార్యాలయానికి బాధ్యత వహించాలని కూడా ఇది పేర్కొంది. రాజ్యసభ ఎంపీలు తప్పనిసరిగా బ్రిటన్ పార్లమెంట్ పద్ధతిలో వలే సభ్యుల ప్రయోజనాల రిజిస్టర్‌ను కూడా పూరించాలి. ప్రత్యక్షంగా ఎన్నికైన సభ ఇంకా ఈ నిబంధనలను తన నియమాలలో పొందుపరచనందున ఈ కోడ్, రిజిస్టర్ రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుంది తప్ప లోక్‌సభ సభ్యులకు కాదు. 1951లో నాటి మన తాత్కాలిక పార్లమెంటు తన సభ్యులలో ఒకరైన హెచ్‌జి ముద్గల్ సభా గౌరవాన్ని కించపరిచేలా ప్రవర్తించిన మొదటి కేసును ఎదుర్కొంది. ఈ కేసులో ముద్గల్‌ను సమర్థించుకోవ డానికి అనుమతించారు. ఆ తర్వాత సభ తనను బహిష్కరించే ముందు ఆయన రాజీనామా చేశారు. ఆయన ప్రవర్తనను పరిశీలించిన కమిటీ, ఎంపీలకు ప్రవర్తనా నియమావళిని విధించాలని కోరింది. ఏ సభ్యుడైనా సంబంధిత పార్టీల నుండి ద్రవ్య లేదా ఇతర పరిగణనలను అంగీకరించడంపై నిర్దిష్ట కారణాలను, ప్రయోజనాలను సమర్థించు కోవడం అనేది ప్రజాస్వామ్యానికి విషం అవుతుంది. 72 ఏళ్ల తరువాత, ఇదే విధమైన ప్రశ్నపై బహిరంగ చర్చ కేంద్రీకృతమై ఉన్నందున, ఎంపీల నైతిక నిబంధనల ఉల్లంఘనలను నిర్ణయించడానికి పార్లమెంటుకు పటిష్ఠమైన విధానం ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి ప్రక్రియ పార్లమెంటు గౌరవాన్ని నిలబెట్టి, దాని శాసన సమగ్రతను కాపాడే సాధనంగా మారుతుంది. దాని నిర్ణ యాల గురించి ఎలాంటి అనుమానాలనైనా తొలగించివేస్తుంది. వ్యాసకర్త, చక్షూరాయ్, లెజిస్లేటివ్ అండ్ సివిక్ ఎంగేజ్మెంట్ హెడ్, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన టీఎంసీ లీడర్ మహువా
-
సుప్రీంను ఆశ్రయించిన మహువా
సాక్షి, ఢిల్లీ: టీఎంసీ నేత మహువా మొయిత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై ఆమె కోర్టులో సోమవారం ఒక పిటిషన్ వేశారు. ఆధారాల్లేకుండా, వచ్చిన ఆరోపణలపై సరైన దర్యాప్తు చేయకుండానే తనపై చర్యలు తీసుకున్నారంటూ ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ముడుపులు తీసుకుని అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగారంటూ అభియోగాలు వచ్చాయి. ఆ అభియోగాలపై విచారణ జరిపిన పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ‘నిజమేనని’ నివేదిక సమర్పించగా.. పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత లోక్‌సభ స్పీకర్ డిసెంబర్ 8వ తేదీన మహువా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ ముందు వరకు ఆమె పశ్చిమ బంగాల్లోని కృష్ణా నగర్ ఎంపీగా ఉన్నారు. క్యాష్ ఫర్ క్వరీ కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సంబంధించిన తీర్మానానికి అనుకూలంగా సభ్యులు ఓటు వేసిన తర్వాత లోక్‌సభలో హై డ్రామా నడిచింది. ఎంపీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో మొయిత్రా పార్లమెంట్ నుండి బహిష్కరించబడ్డారు. అదే సమయంలో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసారు. ‘‘కేసు మూలాలను తీసుకోకుండానే ఎథిక్స్ కమిటీ నన్ను ఉరితీయాలని నిర్ణయించింది. సాక్ష్యమివ్వడానికి వ్యాపారిని పిలవడానికి అది నిరాకరించింది. ఈ కేసులో ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పీఈ దాఖలు చేసింది అని ఆమె వేటు సందర్భంగా వ్యాఖ్యానించారు. -
‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొదటిసారి స్పందించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. #WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament "The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day." pic.twitter.com/DZoZei5AqF — ANI (@ANI) December 9, 2023 ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
‘మహువా’ పై వేటు క్రికెట్లో ఆ రూల్ లాంటిదే: కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.మహిళా ఎంపీపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆసక్తికరంగా స్పందించారు. మహువాను బహిష్కరించడాన్ని క్రికెట్లో టైమ్ అవుట్ పద్ధతితో పోల్చారు. ‘మహువాపై ఒక ఫిర్యాదు వచ్చింది.దీనిపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. ఆమెను సభ నుంచి బహిష్కరించాలని కమిటీ నివేదిక ఇచ్చింది. అనంతరం ఆమెను బహిష్కరించారు. ఇదంతా చూస్తుంటే విచారణ ఏదో కంటి తుడుపు చర్యలా కనిపిస్తోంది’ అని కార్తీ వ్యాఖ్యానించారు. ‘రెండువారాల క్రితం వరల్డ్ కప్ జరిగింది.అందులో ఒక మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మ్యాథ్యూస్‌ను బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ టైమ్ అవుట్ చేశాడు.ఇది ఆట నిబంధనల్లో భాగమే కావచ్చు. కాని దీనిని క్రికెట్ ఫ్యాన్స్ ఒప్పుకోలేదు. ఆట స్ఫూర్తికి విరుద్ధమని వారంతా అభిప్రాయపడ్డారు. మహువా విషయంలోనూ ఇదే జరిగింది. ఒక ఒంటరి మహిళను అవమానించారు. ఇది ప్రజలు ఒప్పుకోరు. ఆమెను మళ్లీ భారీ మెజారిటీతో లోక్‌సభకు పంపిస్తారు’అని కార్తీ చెప్పారు. కాగా, పార్లమెంట్లో అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా నగదు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను హీరానందానికి ఇచ్చారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మహువాపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ ఆమెపై విచారణకు ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. విచారణజరిపిన ఎథిక్స్ కమిటీ మహువానున లోక్‌సభ నుంచి బహిష్కరించాలని నివేదిక ఇచ్చింది.ఈ సిఫారసును లోక్‌సభ శుక్రవారం వాయిస్ ఓట్‌తో ఆమోదించడంతో మహువా సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇదీచదవండి..ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం -
మహువాపై వేటు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వెలిబుచ్చగా స్పీకర్ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. తనపై వేటును మొయిత్రా తీవ్రంగా నిరసించారు. స్పీకర్ చర్య అనర్హులైన జడ్జిలతో కూడిన (కంగారూ) కోర్టు ఉరిశిక్ష తీర్పు వెలువరించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆమె పశి్చమబెంగాల్‌లోని కృష్ణనగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాట్లాడే చాన్సివ్వని స్పీకర్ మొయిత్రా ఉదంతంపై విచారణ జరిపిన బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్ సోంకర్ సారథ్యంలోని ఎథిక్స్ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభకు నివేదిక సమరి్పంచింది. ఆమెను దోషిగా తేలి్చనట్టు పేర్కొంది. ‘‘మొయిత్రా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారు. తన లోక్‌సభ పోర్టల్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అనధికారిక వ్యక్తులకు ఇచ్చారు. తద్వారా దేశ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించే పని చేశారు’’ అని తెలిపింది. అనంతరం మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘మొయిత్రా ప్రవర్తన ఒక ఎంపీ స్థాయికి తగ్గట్టుగా లేదని తేలింది. ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు, కానుకలు తీసుకుని ప్రతిగా అతని ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయడం గర్హనీయం’’ అని అందులో పేర్కొన్నారు. మొయిత్రా సభ్యత్వ రద్దుకు కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించాల్సిందిగా సభను మంత్రి కోరారు. తృణమూల్‌తో పాటు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఇందుకు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. మొయిత్రాకు తన వాదన విని్పంచే అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. గత ఉదంతాలను ఉటంకిస్తూ అందుకు స్పీకర్ నిరాకరించారు. ‘‘2005లో నగదుకు ప్రశ్నల కుంభకోణానికి పాల్పడ్డ 10 మంది లోక్‌సభ సభ్యులను నాటి స్పీకర్ సోమనాథచటర్జీ సభ నుంచి బహిష్కరించారు. ఆ సందర్భంగా సదరు ఎంపీలకు తమ వాదన చెప్పుకునే అవకాశమివ్వలేదు. అంతేకాదు, ఈ ఉదంతంపై ఎథిక్స్ కమిటీ నివేదిక సభకు అందిన రోజే దాని సిఫార్సు మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని సభను కోరుతూ నాటి లోక్‌సభ నేత ప్రణబ్ ముఖర్జీ తీర్మానం ప్రవేశపెట్టారు’’ అని గుర్తు చేశారు. అనంతరం నివేదిక, తీర్మానంపై కాసేపు వాడివేడి చర్చ జరిగింది. నివేదికను విశ్లేíÙంచేందుకు సభ్యులకు కనీసం మూడు నాలుగు రోజుల సమయమివ్వాలని సభ్యుడు అ«దీర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్) కోరగా స్పీకర్ తిరస్కరించారు. ఒక సభ్యున్ని బహిష్కరించాలంటూ సిఫార్సు చేసే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ వాదించారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీన్ని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం మహువాతో కలిసి గాం«దీజీ విగ్రహం వద్ద నేతలు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఉరి: మమత డార్జిలింగ్: మొయిత్రాను బహిష్కరించడం ద్వారా ప్రజాస్వా మ్యాన్ని హత్య చేశారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య పార్లమెంటుకే మచ్చ తెచి్చందన్నారు. ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. ఎన్నికల్లో తమను ఓడించలేక బీజేపీ ఇలా కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోంది’’ అని ఆరోపించారు. మొయిత్రాకు పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘500 పేజీల నివేదిక సభ ముందు పెట్టి, కేవలం 30 నిమిషాల చర్చతో తీర్పు వెలువరించడమా? అంత తక్కువ సమయంలో సభ్యులు నిర్ణయానికి ఎలా రాగలరు?’’ అని మమత ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమన్నారు. మొయిత్రాకు దన్నుగా నిలిచినందుకు ఇండియా కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ, పీడీపీ తదితర పారీ్టల నేతలు కూడా బహిష్కరణను తప్పుబట్టారు. ఏం జరిగింది? వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి మొయిత్రా భారీగా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ఆయనకు లబ్ధి చేకూర్చేలా అదానీ సంస్థ తదితరాలపై లోక్‌సభలో ప్రశ్నలడిగారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత అక్టోబర్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా నందానీకి ఇచ్చారని దూబేతో పాటు ఆమె మాజీ సన్నిహితుడు జై అనంత్ దేహద్రాయ్ కూడా ఆరోపించారు. అది నిజమేనంటూ నందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమరి్పంచారు. దీనిపై మొయిత్రాను ఎథిక్స్ కమిటీ విచారణకు పిలిచింది. అసభ్యకరమైన ప్రశ్నలడిగారంటూ విచారణను ఆమె బాయ్‌కాట్ చేశారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ప్రశ్నలడిగేది నా పీఏనే! మొయిత్రా ఉదంతంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో జేడీ(యూ) సభ్యుడు గిరిధారీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘‘నాకసలు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. అందుకే నేను ఒక్క లిఖిత ప్రశ్న కూడా స్వయంగా అడగలేదు. నా లోక్‌సభ పోర్టల్ లాగిన్‌ఐడీ, పాస్వర్డ్ నా పీఏ దగ్గరుంటాయి. నా తరఫున నా ప్రశ్నలన్నింటినీ అతనే అందులో అడుగుతాడు’’ అని చెప్పుకొచ్చారు! దాంతో అంతా అవాక్కయ్యారు. అలా ఇతరులతో ప్రశ్నలు తయారు చేయించకూడదంటూ ఎంపీని స్పీకర్ మందలించారు. ఏ ఆధారాలతో వేటు? తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లేకపోయినా ఎథిక్స్ కమిటీ తప్పుడు సిఫార్సు చేసిందని మొయిత్రా ఆరోపించారు. విపక్షాలను లొంగదీసుకునేందుకు మోదీ సర్కారు చేతిలో ఆయుధంగా కమిటీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘నాకు డబ్బు గానీ, కానుకలు గానీ ఇచి్చనట్టు ఒక్క ఆధారమన్నా ఉందా? పైగా, అసలు ఉనికిలోనే లేని నైతిక నియామవళిని ఉల్లంఘించానని తేల్చడం మరీ విడ్డూరం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎథిక్స్ కమిటీ నివేదిక నియమావళిలోని ప్రతి రూల్‌నూ ఉల్లంఘించింది. సభ ఆమోదించి ప్రోత్సహించిన రోజువారీ విధానాన్ని పాటించినందుకు నన్ను శిక్షిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించిన 17వ లోక్‌సభే 78 మంది మహిళా ఎంపీల్లో ఒకరినైన నన్ను ఫక్తు కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా వెంటాడి వేధించిన ఉదంతానికి కూడా వేదికైంది. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకున్న సుదూర లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ రాజకీయ నేపథ్యమూ లేని నావంటి తొలిసారి ఎంపీని అనుక్షణం వేధించింది’’ అంటూ ధ్వజమెత్తారు. విరుద్ధ వాంగ్మూలాలు ఫిర్యాదుదారుల్లో ఒకరు తన మాజీ సహచరుడని మొయిత్రా గుర్తు చేశారు. ‘‘అతడు తప్పుడు ఉద్దేశంతో నాపై బురదజల్లాడు. కేవలం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులిచి్చన వాంగ్మూలాల ఆధారంగా నాపై వేటు వేశారు. వారి వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నా పట్టించుకోలేదు. కనీసం వారిని విచారించను కూడా లేదు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కూడా పిలిచి విచారించలేదు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘నందానీ వ్యాపార ప్రయోజనాల కోసం అతని దగ్గర డబ్బులు, కానుకలు తీసుకుని సభలో ప్రశ్నలడిగానని ఎంపీ దూబే తన ఫిర్యాదులో ఆరోపించారు. నందానీ మాత్రం నేనే నా సొంత అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి వీలైన ప్రశ్నలు లోక్‌సభ పోర్టల్‌లో అప్లోడ్ చేసేలా తనపై ఒత్తిడి తెచ్చానని సుమోటో అఫిడవిట్ దాఖలు చేశారు. వీటిలో ఏది నిజం?’’ అని ప్రశ్నించారు. లాగిన్ రూల్స్ ఉన్నాయా? లోక్‌సభ పోర్టల్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇతరులకు ఇచ్చానన్న ఏకైక అభియోగంపైనే తనను బహిష్కరించారని మొయిత్రా గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలూ లేవని వాదించారు. 30 ఏళ్లైనా పోరాడతా: మొయిత్రా ఎథిక్స్ కమిటీ నివేదికను మొయిత్రా తూర్పారబట్టారు. నిబంధనలకు పాతరేస్తూ తనపై హడావుడిగా వేటు వేశారని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయం అనంతరం విపక్ష ఇండియా కూటమి నేతలు సోనియాగాం«దీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పార్లమెంటు ఆవరణలో మొయిత్రా మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు కచ్చితంగా సీబీఐని నా ఇంటిపైకి ఉసిగొల్పుతారు. మరో ఆర్నెల్ల పాటు నన్నిలాగే వేధిస్తారు. కానీ పారిశ్రామికవేత్త అదానీ అక్రమాల మాటేమిటి? ఆయన పాల్పడ్డ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణంకేసి సీబీఐ, ఈడీ కన్నెత్తి కూడా చూడవెందుకు?’’ అని ప్రశ్నించారు. మోదీ సర్కారుకు అదానీ ఎంతటి ముఖ్యుడో తనపై వేటుతో మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘లోక్‌సభ నుంచి బహిష్కరించి నా నోరు మూయించవచ్చని, పారిశ్రామికవేత్త అదానీ ఉదంతం నుంచి బయట పడొచ్చని భావిస్తే పొరపాటు. నాకిప్పుడు 49 ఏళ్లు. మరో 30 ఏళ్ల దాకా పార్లమెంటు లోపల, బయట మీపై పోరాడుతూనే ఉంటా’’ అని ప్రకటించారు. -
‘బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది.. ఆమె గెలిచి వస్తుంది’
ఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ క్రమంలో సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపీలందరూ ఆమెకు మద్దతుగా సభ నుంచి వాకౌట్ చేశారు. #WATCH | "This is vendetta politics of BJP. They killed democracy....It is injustice. Mahua will win the battle. The people will give justice. They (BJP) will be defeated in the next election," says TMC chairperson Mamata Banerjee. pic.twitter.com/Y88F8YhNwK — ANI (@ANI) December 8, 2023 ఇక ఈ వ్యహారంపై టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీవి ప్రతీకార రాజకీయాలని మండిపడ్డారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని దుయ్యబట్టారు. బీజేపీ తమ పార్టీ ఎంపీపై వ్యవహరించిన తీరు చాలా అన్యాయమని అన్నారు. మహువా మెయిత్రా మళ్లీ గెలిచి వస్తుందని తెలిపారు. ఎన్నికల్లో తనకు ప్రజలు న్యాయం చేస్తారని చెప్పారు. బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తుందని మండిపడ్డారు. -
మహువా మెయిత్రాపై వేటు.. లోక్‌సభ నుంచి బహిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మెయిత్రాపై వేటు పడింది. లోక్ సభ నుంచి ఆమెను బహిష్కరించినట్లు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఎంపీ మహువా మొయిత్రా ప్రవర్తన అనైతికమని, అసభ్యకరంగా ఉందని ఎథిక్స్‌కమిటీ చేసిన తీర్మానాలను లోక్ సభ అంగీకరిస్తుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఎంపీగా కొనసాగడం తగదని.. ఆమెను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు లోక్ సభ స్పీకర్ పేర్కొన్నారు. #WATCH | Cash for query matter | TMC's Mahua Moitra expelled as a Member of the Lok Sabha; House adjourned till 11th December. Speaker Om Birla says, "...This House accepts the conclusions of the Committee that MP Mahua Moitra's conduct was immoral and indecent as an MP. So, it… pic.twitter.com/mUTKqPVQsG — ANI (@ANI) December 8, 2023 ఇక, టీఎంసీ ఎంపీగా మహువా మోయిత్రాను బహిష్కరించాలని లోక్‌సభ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి పార్లమెంట్ బయటకు వచ్చారు. #WATCH | Opposition MPs in Parliament premises after they stage walkout following Lok Sabha adopting motion to expel Mahua Moitra as TMC MP pic.twitter.com/5RJ9kaFWPN — ANI (@ANI) December 8, 2023 ప్రతిపక్షాలను కూల్చే ఆయుధం లోక్‌సభలో ఎంపీగా బహిష్కరణకు గురైన టీఎంసీ నాయకురాలు మహువా మెయిత్రా ఎథిక్స్ కమిటీపై విమర్శలు గుప్పించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక సరైంది కాదని అన్నారు. ఎథిక్స్ కమిటీ ప్రతిపక్షాన్ని కూల్చడానికి ఒక ఆయూధంగా మారిందని మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీ నియమ, నిబంధనలు అన్నీ ఉల్లంఘించి నివేదిక సమర్చిందని దుయ్యబట్టారు. "Ethics Committee another weapon to crush opposition," says Moitra soon after expulsion from Lok Sabha Read @ANI | https://t.co/jb6uvpSikT#MahuaMoitra #LokSabha #Parliament pic.twitter.com/be6Cm5dF8H — ANI Digital (@ani_digital) December 8, 2023 చదవండి: ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..! -
ఎంపీ మహువాపై లోక్‌సభ నిర్ణయం అదేనా..!
న్యూఢిల్లీ : పార్లమెంట్లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఎంపీ మహువా మెయిత్రాపై నివేదికను ఎథిక్స్‌కమిటీ ఇవాళ లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. వినోద్‌కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ సిఫారసు చేసిన నివేదికను ఇప్పటికే ఆమోదించింది. మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ ముందు ప్రవేశపెట్టేందుకు శుక్రవారం(డిసెంబర్ 8) లిస్ట్ చేశారు. ఎజెండాలో ఐటెమ్ నంబర్ ఏడుగా దీనిని చేర్చారు. నివేదికను సభ ఆమోదిస్తే మహువా తన ఎంపీ పదవిని కోల్పోతారు. ఈ నెల 4వ తేదీనే మహువాపై నివేదికను టేబుల్ చేసేందుకు లిస్ట్ చేసినప్పటికీ దానిని ప్రవేశపెట్టలేదు. అయితే మహువాపై నివేదికపై సభలో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చ లేకుండా చర్యలు తీసుకోవడం సరికాదని సూచిస్తున్నాయి. ఈ నివేదిక మ్యాచ్ ఫిక్సింగ్‌లా కనిపిస్తోందని ఆ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని ఆదేశాల మేరకే అదానీ గ్రూపుపై ప్రశ్నలు వేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు మహువాపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఎథిక్స్ కమిటీ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను సిద్ధం చేసింది. ఈ విచారణలో భాగంగా ఎథిక్స్ కమిటీ ముందు మహువా హాజరయ్యారు. ఇదీచదవండి..2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు -
‘బహిష్కరణ’పై చర్చ జరగాల్సిందే
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సులు.. అఖిలపక్ష భేటీలో వేడిపుట్టించాయి. ఆ సిఫార్సులపై లోక్‌సభలో తుది నిర్ణయం తీసుకు నేలోపే పార్లమెంట్లో వాటిపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి పార్ల మెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్, ప్రమోద్ తివారీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియాన్, ఎన్సీపీ నేతలు ఫౌజియా ఖాన్ తదితరులు హాజరయ్యారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో మహువా మొయిత్రాను బహిష్కరించేందుకు వీలుగా లోక్‌సభ ఎథిక్స్ కమిటీ నివేదికపై పార్లమెంట్ తొలిరోజే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోస్తోంది. దీంతో ప్రభుత్వ వైఖరిని విపక్ష సభ్యులు ఆక్షేపించారు. బహిష్కరణపై తుది నిర్ణయం తీసుకునే ముందు నివేదికపై చర్చ చేపట్టాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేశారు. సభలో చర్చ జరక్కుండానే ఎథిక్స్ కమిటీ నివేదిక బహిర్గతం కావడాన్ని వారు నిరసించారు. మహువాపై బహిష్కరణ వేటు తీవ్ర శిక్ష: అధీర్ రంజన్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలన్న యోచన అత్యంత తీవ్రమైనదని, దీని పర్యవసానాలు ఎన్నో రకాలుగా ఉంటాయని లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురి ఆగ్రహంవ్యక్తంచేశారు. పార్లమెంటరీ కమిటీ నిబంధనలు, ప్రక్రియలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నాలుగు పేజీల లేఖ రాశారు. అఖిలపక్షానికి హాజరుకాలేకపోయిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చే ఎయిర్ఇండి యా విమానం శనివారం దారి మళ్లింపు కారణంగా పార్లమెంటు అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరుకాలేకపో యింది. ఉదయం 8.10 నిమిషాలకు ఢిల్లీ రావాల్సిన విమానా న్ని విజిబిలిటీ లేని కారణంగా జైపూర్ మళ్లించారు. ఇదే విమానంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణించారు. విమానం దారి మళ్లింపు కారణంగా ఉదయం పార్లమెంటు లైబ్రరీ భవనంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎంపీ విజయసాయిరెడ్డి హాజరుకాలేకపోయారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఎంపీ మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు!
డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన నివేదికను లోక్‌సభలో సమర్పించనున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన రిపోర్టును డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్ వచ్చే సోమవారం ప్యానెల్ నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్సమావేశమై కమిటీ.. మహువాను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలంటూ చేసిన సిఫార్సును ప్యానెల్ ఆమెదించింది. లోక్‌సభ స్పీకర్‌కు ఈ నివేదికను సమర్పించింది. పార్లమెంట్ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. వ్యాపారవేత్త హీరానందానీ కూడా పార్లమెంట్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. హీరానందనీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. నవంబర్ రెండున లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరైన మహువా.. ప్యానెల్ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారంటూ ఆగ్రహించి విచారణ మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం మహువా కేసులో ఎథిక్స్ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సమావేశమై ఈ నివేదికను పరిశీలించింది. అనంతరం 6:4తో ఈ నివేదికను కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది. మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్ లాగిన్ ఐడిని షేర్ చేసుకున్నారని, దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించిందని సోన్కర్ పేర్కొన్నారు. ఆమె చర్య తీవ్రమైన శిక్షకు కారణమని తెలిపారు. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు. -
ఎంపీ మహువా కేసులో సీబీఐ విచారణ !
ఢిల్లీ: తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా డబ్బుకు ప్రశ్నల స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది. లోక్‌పాల్ మార్గదర్శకాల మేరకు ఈ స్కామ్‌లో సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించినట్లు సమాచారం. మొయిత్రాపై కేసు నమోదు చేయాలా లేదా అనే అంశాన్నితేల్చడానికి ప్రాథమిక విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సుప్రీం కోర్టు అడ్వకేట్ జై అనంత్ దేహదారి ఫిర్యాదు మేరకు సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించిందని సమాచారం. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికిగాను ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని వద్ద నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులో దేహదారి ఆరోపించారు. దేహదారి ఇదే విషయమై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేకు లేఖ రాశారు. దీంతో ఆయన స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదుచేశారు. ఓం బిర్లా ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసిన విషయం తెలిసిందే. దూబే ఇంతటితో ఆగకుండా మహువాపై లోక్‌పాల్‌కు కూడా మరో ఫిర్యాదు చేశారు. అయితే సీబీఐ ప్రాథమిక విచారణలో నిందితులను అరెస్టు చేసే వీలుండదు. కానీ నిందితులను ప్రశ్నించే వెసులుబాటుతో పాటు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించే వీలుంటుంది. సీబీఐ మహువా కేసులో ప్రారంభించిన ప్రాథమిక విచారణ నివేదికను లోక్‌పాల్‌కు అందజేయాల్సి ఉంటుంది. డబ్బుకు ప్రశ్నల కేసులో ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరైన మహువాను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయాలని కమిటీ స్పీకర్‌కు నివేదించింది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సి ఉంది. తనకు తొలుత ఎంపీ మహువా తన ఈ మెయిల్ ఐడీ పంపించారని, తద్వారా ఆమెకు ప్రశ్నలు పంపితే వాటిని ఆమె పార్లమెంట్లో లేవనెత్తారని వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని పార్లమెంటుకు ఇచ్చిన అఫిడవిట్లో తెలిపారు. ఇంతేగాక మహువా ఏకంగా తన పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను పంపించారని వాటితో తాను నేరుగా ప్రశ్నలు పోస్ట్ చేయగలిగానని వెల్లడించారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
ఎంపీలకే డిజిటల్ యాక్సెస్
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పారీ్ట(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్ హౌజ్ పోర్టల్ లేదా పార్లమెంట్ యాప్‌ల పాస్వర్డ్లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్ సభ్యులు మాత్రమే డిజిటల్ సంసద్ పోర్టల్ లేదా యాప్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించవచ్చు. ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన అధికారిక ఈమెయిల్ పాస్‌వర్డ్‌ను దుబాయి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచి్చనట్లు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ గుర్తించింది. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించింది. డిజిటల్ సంసద్ పోర్టల్ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి వచి్చంది. ఈ పోర్టల్‌కు ఎలా ఉపయోగించాలో చాలామందిఎంపీలకు తెలియదు. అందుకే వారు తమ వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులపై ఆధారపడుతున్నారు. ఈమెయిల్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి అందజేస్తున్నారు. దీనివల్ల పోర్టల్ అనధికార వ్యక్తుల చేతుల్లో పడి దురి్వనియోగం అవుతున్నట్లు మహువా మొయిత్రా కేసు నిరూపించింది. ఈ నేపథ్యంలో పోర్టల్ పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
మహువా మొయిత్రా వివాదం: తొలిసారి మౌనం వీడిన మమత
కోలకతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరణ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడిన దీదీ ఇదంతా ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని బీజేపీపై మండి పడ్డారు. అయితే ఇది వచ్చే ఏడాది (2024) ఎన్నికల ముందు మహువాకే సాయం చేస్తుందని వ్యాఖ్యానించారు. గురువారం కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో టీఎంసీ చీఫ్ మమత, మహువా మొయిత్రాకు మద్దతుగా నిలిచారు. వివిధ కేసులలో తమ పార్టీ నాయకులను అరెస్టు చేసిన తర్వాత, లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించే అవకాశం ఉందని, మొయిత్రాను లోక్‌సభ నుంచి తప్పించాలనేదే బీజేపీ ప్లాన్ అని, అయితే ఈ కుట్రలు మహువా మరింత పాపులర్ కావడానికి దోహద పడతాయని పేర్కొన్నారు. ఇపుడామె బయట మాట్లాడగలుతున్నారన్నారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని,కేవలం మూడు నెలలు మాత్రమే మోదీ సర్కార్ ఉంటుందన్నారు. అంతేకాదు ప్రత్యర్థి నాయకులే లక్ష్యంగా దాడులు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల తరువాత బీజేపీని వెంటాడుతాయంటూ జోస్యం చెప్పారు. కాగా పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుండి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు పెను దుమారాన్ని రాజేశాయి. దీనిపై బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ అధ్యక్షతన ఏర్పాటైన 15 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ మహువాను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసింది. Kolkata | West Bengal CM Mamata Banerjee says "Their (BJP) plan is to remove Mahua Moitra (from Lok Sabha). This will help her become more popular before the elections. What she used to speak inside (Parliament), now she will speak outside..." pic.twitter.com/V10seOqprj — ANI (@ANI) November 23, 2023 -
దుష్ప్రవర్తనను నిగ్గు తేల్చడమెలా?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకు గానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్క రించాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేస్తుంది. నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా, కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. ఎథిక్స్ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. సభ్యులను విచా రించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు అనుసరించే ప్రక్రియ సమర్థతపై సరైన అంచనా ఇంకా రావలసే ఉంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు మహువా మొయిత్రా తీవ్రమైన దుష్ప్రవర్తనతోపాటు, సభను ధిక్కరించినందుకుగానూ ఆమెను పార్లమెంటు నుండి బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంటులో ప్రశ్నలను లేవనెత్తడం కోసం ఆమెకు ఇచ్చిన లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌ను దుబాయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తతో పంచుకున్నారనేది ఆమెపై ఉన్న ప్రధాన అభియోగం. ఆ వ్యాపారవేత్త ఆమె పేరుతో లోక్‌సభకు ప్రశ్నలు పంపడానికి ఆమె లాగిన్, పాస్‌వర్డ్‌ను ఉపయోగించుకున్నారు. ఆయన వ్యాపార ప్రయోజనాల సమర్థవంతమైన ప్రమోషన్ కోసం ఆమె లాగిన్ ఐడీని దుర్వినియోగం చేయడానికి అనుమతించారనేది మొయిత్రాపై ఉన్న అభియోగంలోని ప్రధానాంశం. ఎథిక్స్ కమిటీ రెండు రోజులపాటు సమావేశమై, మొయిత్రాను దోషిగా నిర్ధారించి, ఆమెను బహిష్కరించాలని కోరింది. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ, దాని పేరు సూచించినట్లుగానే, ఎంపీల అనైతిక ప్రవర్తనను పరిశీలించి తగిన శిక్షలను సిఫారసు చేయవలసి ఉంటుంది. అయితే, నేటి వరకూ, ‘అనైతిక ప్రవర్తన’ అనేదానికి తగిన నిర్వచనం లేదు. ఎంపీల ప్రవర్తన తీరును పరిశీలించి, అది అనైతికమా కాదా అని కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ చరిత్రలో లేని బహిష్కరణ ఎథిక్స్ కమిటీ ఇప్పటివరకు పరిశీలించిన కేసులు ఏమంత ఎక్కువగా లేవు. సాధారణ ప్రవర్తనా నియమాలకు భిన్నమైన చిన్న చిన్న అతిక్రమణలతో ఈ కమిటీ వ్యవహరించింది. అటువంటి అతిక్రమణల తీవ్రతను బట్టి శిక్షలు మారుతూ ఉంటాయి: ఉపదేశించడం, మందలించడం, సభా సమావేశాల నుండి నిర్దిష్ట కాలానికి సస్పెండ్ చేయడం సాధారణంగా సిఫారసు చేస్తారు. లోక్‌సభ ఎథిక్స్ కమిటీ చరిత్రలో ఎప్పుడూ ఒక ఎంపీని సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేయలేదు. పార్లమెంటు నుండి బహిష్కరించడం చాలా తీవ్రమైన శిక్ష. ఎందుకంటే బహిష్కరించబడిన ఎంపీకి చెందిన నియోజకవర్గ ప్రజలకు సభలో ప్రాతినిధ్యం వహించే హక్కు, అవకాశం లేకుండాపోతాయి. అందువల్ల, బహిష్కరణ చాలా అరుదుగా సిఫారసు చేస్తారు. 1951లో, తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు హెచ్డి ముద్గల్, ఒక వ్యాపార సంస్థ ప్రయోజనాలను ప్రోత్సహిస్తున్నట్లూ, దానికిగానూ ఆర్థిక ప్రయోజనాలను పొందు తున్నట్లూ గుర్తించి సభ నుండి బహిష్కరించారు. హౌస్‌లోని ప్రత్యేక కమిటీ ఈ కేసును విచారించి, ఆయన బహిష్కరణకు సిఫారసు చేసింది. అదే విధంగా, 2005లో, 10 మంది ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు డబ్బును స్వీకరిస్తున్నట్లు ఒక స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన సందర్భంలో వారిని లోక్‌సభ నుండి బహిష్కరించారు. ఈసారి కూడా ప్రత్యేక కమిటీ కేసు దర్యాప్తు చేసింది. ఒకరి వ్యక్తిగత ప్రయోజనాలను ప్రోత్సహించడానికి పార్లమెంటరీ పని చేయడం కోసం డబ్బును స్వీకరించడం సభా నియమాలకు సంబంధించి తీవ్ర మైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. కాబట్టి, అటువంటి దుష్ప్రవర్తనకు గాను అంగీకరించిన శిక్ష– బహిష్కరణ. రాజా రామ్ పాల్ వర్సెస్ గౌరవనీయ స్పీకర్, లోక్‌సభ (2007) ఉదంతంలో సుప్రీంకోర్టు... ప్రత్యేక హక్కును ఉల్లంఘించినందుకు సభ్యుడిని బహిష్కరించే సభ అధికారాన్ని ఆమోదించింది. అధికారం ఉందా, లేదా? అయితే, (ఆ సందర్భంలో) అటువంటి ప్రత్యేక హక్కు ఉందా లేదా అనే అంశాన్ని కోర్టు నిర్ధారిస్తుంది. అలాంటి హక్కు ఉనికిలో లేదని గుర్తిస్తే, సదరు బహిష్కరణను కొట్టివేస్తుంది. రాజా రామ్ పాల్ కేసు ప్రాముఖ్యత ఏమిటంటే, ఒక ఎంపీని బహిష్కరించే సభ అధి కారం ఒక ప్రత్యేక హక్కు ఉనికితో నేరుగా ముడిపడి ఉండటం. దాన్ని ఉల్లంఘిస్తే బహిష్కరణ సాధ్యపడుతుంది. అయితే ఇది ఒక ముఖ్య మైన ప్రశ్నకు దారి తీస్తుంది. విశేషాధికారాల కమిటీకి కాకుండా, ఇతర కమిటీకి బహిష్కరణను సిఫార్సు చేసే అధికారం ఉందా? (1951, 2005 సంవత్సరాలలో ఎంపీల బహిష్కరణకు సిఫార్సు చేసిన కమి టీలు నైతిక లేదా విశేషాధికారాల కమిటీలు కావు. నిర్దిష్ట సమస్యలపై విచారణ కోసం సభ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలు.) రాజా రామ్ పాల్ తీర్పులోని తర్కాన్ని అనుసరించినట్లయితే, విశేషాధికారాల కమిటీ లేదా సభ నియమించిన ప్రత్యేక కమిటీ మాత్రమే విశేషాధికారాల ఉల్లంఘనపై ఎంపీని బహిష్కరించే వ్యవహా రాన్ని నడపగలదు. పార్లమెంట్‌లోని ఏ ఇతర సాధారణ కమిటీ ఆ సిఫారసు చేయలేదు. విశేషాధికారాల కమిటీ ముందుకు తేలేని సమస్యలతోనే ఎథిక్స్ కమిటీ వ్యవహరిస్తుంది. ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడంలోని తర్కం ఏమిటంటే, విశేషాధికారాల కమిటీ ముందుకు తేనక్కరలేనంతటి దుష్ప్రవర్తనలు చాలా ఉన్నాయి. అయితే అదే సమయంలో అటువంటి ప్రవర్తనతో తగిన విధంగా వ్యవహరించడానికి సభా క్రమశిక్షణా యంత్రాంగం అందుబాటులో ఉండాలి. వివిధ కమిటీల పాత్రల్లోని ఈ వ్యత్యాసం పార్లమెంటు దృష్టిని డిమాండ్ చేస్తుంది. తద్వారా పార్లమెంట్ శిక్షాస్మృతి అధికారాల కార్యాచరణలో మరింత స్పష్టత తేవడం జరుగుతుంది. పార్లమెంటరీ కమిటీలు చేసే దర్యాప్తు పరిధి, ప్రయోజనం, దాని స్వభావం కూడా ఇక్కడ దృష్టిలో ఉంటుంది. తక్షణ అవసరం స్కామ్‌లు, ఇతర తీవ్రమైన కేసులకు దారితీసే ఆర్థిక దుర్విని యోగానికి సంబంధించిన విషయాలను పార్లమెంట్ పరిశోధిస్తుంది. ఇటువంటి పరిశోధనలు భారీ ఆర్థిక మోసాలకు దారి తీసే వ్యవస్థాగత లోపాలను వెలికితీసేంత సమగ్రంగా ఉంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి దర్యాప్తు సంస్థ చేయలేని ఈ విధిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నిర్వహిస్తుంది. అయితే సభ్యుడిని బహిష్కరించే అధికారంపై ఎటువంటి వివాదం లేనప్పటికీ, విచారణ విధానం గురించి కొన్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ఫిర్యాదుదారు, ప్రతివాది ఎంపీ, ఇతర ప్రమేయం గల వ్యక్తులతో సహా సాక్ష్యం తీసుకోవడం కమిటీ సాధారణంగా అనుసరించే విధానం. వారు రాతపూర్వక పత్రాలను సమర్పించవచ్చు. అలాగే మౌఖిక ప్రకటనలు తీసుకోవచ్చు. ఆధారాలు సేకరించిన తర్వాత, సచివాలయ అధికారులు అటువంటి సాక్ష్యాలను జల్లెడ పట్టి, కనుగొన్న విషయాలు, సిఫార్సులతో కూడిన ముసాయిదా నివేదికను సిద్ధం చేస్తారు. కాబట్టి, ఒక ఎంపీకి ఇచ్చే అత్యంత తీవ్రమైన శిక్ష అయిన బహిష్కరణను కమిటీలోని మెజారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. పార్లమెంటరీ విచారణ స్వభావాన్ని మనం పరిశీలించినప్పుడు. సాక్ష్యాధారాలను బేరీజు వేసే అధికారుల సామర్థ్యాలు, దర్యాప్తు రంగంలో వారి నైపుణ్యం, మరియు ఎక్కువగా నిపుణులు కాని, న్యాయపరంగా శిక్షణ పొందని కమిటీ సభ్యుల మనస్సును అన్వయించడం వంటి సంబంధిత అంశాలను ఎప్పుడూ పరిగణనలోకి తీసు కోవాలి. పరిశోధనాత్మక యంత్రాంగాల ద్వారా విధానపరమైన సమగ్ర తను కొనసాగించినప్పుడు మాత్రమే న్యాయం, సత్యం నిర్ధారించ బడతాయి. ఏ తప్పు చేసినా దాని సభ్యులను విచారించి శిక్షించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ, సత్యాన్ని తెలుసుకునేందుకు, న్యాయం చేయడానికి అనుసరించే ప్రక్రియ సమర్థత, దాని పటిష్టతపై సరైన అంచనా అనేది ఇంకా రావలసే ఉంది. మహువా మొయిత్రా కేసు ఈ పనికి సంబంధించిన ఆవశ్యకతను మనకు గుర్తు చేస్తోంది. పి.డి.టి. ఆచారి వ్యాసకర్త లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు కీలక బాధ్యతలు
ముడుపులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు కీలక బాధ్యతలు అప్పగించింది పార్టీ. కృష్ణానగర్ (నాడియా నార్త్) పార్టీ జిల్లా అధ్యక్షురాలి నియమించింది. ఈరోజు బెంగాల్లో అధికార పార్టీ ప్రకటించిన 15 మంది కొత్త జిల్లాల చీఫ్‌లలో మోయిత్రా కూడా ఒకరు. లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసిన తరువాత జరిగిన ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై టీఎంసీ ఎంపీ మొయిత్రా ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. తన నియామకంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ పార్టీకి, ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణానగర్ ప్రజల కోసం తాను ఎప్పుడూ పార్టీతో కలిసి పనిచేస్తానంటూ ట్వీట్ చేశారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీని ఆశ్రయించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు పెను దుమారాన్ని రేపాయి. దీనిపై ఏర్పాటైన లోక్‌సభ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను బహిష్కరించాలని సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీల నివేదికను రూపొందించింది. అయితే ఇది విడుదలకు ముందే మీడియాకు లీక్ అయింది. ఇది ఇలా ఉంటే ఎథిక్స్ ఆరోపణలను మొయిత్రా తోసిపుచ్చారు. బీజేపీ సర్కార్‌కు గట్టిగా ఎదురు నిలబడిన కారణంగానే తనను టార్గెట్‌ని చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. Thank you @MamataOfficial and @AITCofficial for appointing me District President of Krishnanagar (Nadia North) . Will always work with the party for the people of Krishnanagar. — Mahua Moitra (@MahuaMoitra) November 13, 2023 -
మహువాపై స్పీకర్‌కు నివేదిక
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలడిగిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిన ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. నివేదికను ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ శుక్రవారం స్పీకర్ కార్యాలయంలో అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి చట్టవిరుద్ధంగా ప్రతిఫలం స్వీకరించినందుకు మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. -
Mahua Moitra: కష్టాల్లో ఫైర్ బ్రాండ్
తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టినవారికి గుర్తింపు రావటం అంత సులభం కాదు. ప్రసంగించే అవకాశం లభించటం, దాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా అరుదు. మహిళా ఎంపీల విషయంలో దాదాపు అసాధ్యం. కానీ రాజకీయ రంగప్రవేశం చేసిన కొద్దికాలంలోనే తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికై లోక్‌సభలో ప్రవేశించిన మహువా మొయిత్రా చాలా త్వరగానే ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యారు. తీరా నాలుగేళ్లయ్యే సరికల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఏం జరిగిందో అందరూ గ్రహించే లోగానే ఉరుము లేని పిడుగులా, ఊహించని ఉత్పాతంలా వచ్చిపడిన వివాదం చివరికామె పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరుపెట్టేలా పరిణమించింది. సభ్యుల నైతిక వర్తనను నియంత్రించే లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఆమెను సభ నుంచి బహిష్కరించాలని స్పీకర్‌ను కోరుతూ గురువారం నివేదికను ఆమోదించింది. ఇందుకు ప్రధానంగా అనైతిక వర్తన, తీవ్ర తప్పిదాలకు పాల్పడటం కారణాలుగా చూపింది. అంతేకాదు... ఈ విషయంలో సంస్థాగత విచారణ, చట్టపరంగా గట్టి చర్యలు అవసరమని సిఫార్సు చేసింది. పార్లమెంటు సభ్యులు సభలో ప్రశ్నలు వేయటానికి వినియోగించే ఎన్ఐసీ వెబ్సైట్ లాగిన్, పాస్వర్డ్ ఆమె తన స్నేహితుడైన దుబాయ్ రియలెస్టేట్ వ్యాపారి దర్శన్ హీరానందానీకి ఇచ్చారనీ, ఆయన నుంచి కోటి రూపాయల ముడుపులు తీసుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ సంస్థలపై ప్రశ్నలు సంధించారనీ మొయిత్రాపై వచ్చిన ఆరోపణలు. ఆ ప్రశ్నలు అదానీ సంస్థల ప్రయోజనాలు దెబ్బతీసేంత తీవ్రమైనవా? అందువల్ల హీరానందానీకి ఒరిగేదేమిటి? ముడుపుల సంగతిని మొయిత్రా తోసి పుచ్చారు. లాగిన్, పాస్వర్డ్ ఇచ్చినట్టు అంగీకరించారు. అందుకుగల కారణాలు చెప్పారు. ఇదంతా దేశభద్రతకు ముప్పు తెచ్చే చర్య అనీ, లంచం తీసుకుని ప్రశ్నలేయటం అనైతికమనీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత నెలలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. కమిటీ విచారణ తీరుతెన్నులను ప్రశ్నిస్తూ ఇప్పటికే మొయిత్రా ఓం బిర్లాకు లేఖ రాశారు. కమిటీ తనను ప్రశ్నించిన తీరు ‘వస్త్రాపహరణం’ మాదిరిగా వున్నదంటూ దుయ్యబట్టారు. మొయిత్రా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వలె ఆంగ్ల భాషాప్రావీణ్యం వుండటం వల్లనే త్వరగా ఆమెకు పేరుప్రతిష్టలు సాధ్యమైనాయని అనుకోవటానికి లేదు. ప్రసంగించదల్చుకున్న అంశంపై పట్టు సంపాదించటం ఒక్కటే మొయిత్రా ప్రత్యేకతని చెప్పడానికి కూడా లేదు. విషయ పరిజ్ఞానంతోపాటు విస్ఫులింగాలు విరజిమ్మే స్వభావం, నిర్భీతిగా పాలక పక్షాన్ని నిలదీసే తత్వం ఆమెకొక విశిష్టతను తీసుకొచ్చాయి. అంతకుముందు మూడేళ్లు ఆమె తృణమూల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ మొయిత్రా గురించి దేశానికంతకూ తెలిసింది ఈ నాలుగేళ్ల కాలంలోనే. సభలోనే కాదు... వెలుపల కూడా ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిప్పులు చిమ్ముతారు. మూకుమ్మడి అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్షపడిన గుజరాత్ దోషులకు క్షమాభిక్ష పెట్టడాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎథిక్స్ కమిటీ విచారణలో నిర్ధారించిన అంశాలేమిటో, అవి ఏరకంగా తీవ్రమైన స్వభావంతో కూడుకున్నవో ఇంకా తెలియాల్సి వుంది. ఎన్ఐసీ లాగిన్, పాస్వర్డ్ ఇవ్వటం విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా సరైంది కాదనుకుంటే ఆమెను మందలించవచ్చు. కమిటీలోని విపక్ష సభ్యులు చెబుతున్న ప్రకారం 800 మంది ఎంపీల్లో అనేకులు సగటున కనీసం ఇద్దరు ముగ్గురికి ఇలా ఇస్తారు. కంప్యూ టర్ల వాడకం, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం ఇందుకు కారణం. ఈ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయిస్తారన్నది చూడాలి. ఆ సంగతలా వుంచితే ఫిర్యాదు, విచారణ వగైరాలన్నీ ఆదరా బాదరాగా సాగినట్టు కనబడుతోంది. అక్టోబర్ 26న కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ నెల 2న జరిగిన రెండో సమావేశం మధ్యలోనే ముగిసింది. అడిగినవాటికి జవాబివ్వకుండా ఆమె దుర్భాషలాడారని కమిటీ ఛైర్మన్ వినోద్ కుమార్ సోంకార్ ఆరోపిస్తే... ఫిర్యాదుతో సంబంధం లేని ప్రశ్నలతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వేధించారన్నది మొయిత్రా ఆరోపణ. దుబాయ్ వెళ్తే ఏ హోటల్లో దిగుతారు... మీతో ఎవరుంటారు... మీరు మీ మిత్రులతో మాట్లాడుతున్నట్టు వారి భార్యలకు తెలుసా అని అడిగారని కూడా ఆమె ఆరోపించారు. దీనికి నిరసనగా ఆమె, విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. కమిటీ విచారణ గోప్యం కనుక ఆరోపణలు, ప్రత్యారోపణల్లో నిజానిజాలేమిటో తెలియదు. అయితే ఈ మొత్తం వ్యవహారం మన పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందన్నది మాత్రం వాస్తవం. అసలు దూబే ఫిర్యాదుకు మొయిత్రా మాజీ సహచరుడు దేహద్రాయ్ లేఖ ఆధారమన్న సంగతి కమిటీకి తెలుసా? కమిటీకిచ్చిన అఫిడవిట్లో మొయిత్రాకు ముడుపులు చెల్లించానని హీరానందానీ అంగీకరించారా? లేదని విపక్ష సభ్యులు చెబుతున్నారు. విడిపోయిన జంట పరస్పరం ఆరోపించుకోవటం సర్వసాధారణం. ఇప్పటికే పెంపుడు కుక్క విషయంలో వారిద్దరూ కేసులు పెట్టుకున్నారు. కనుక దేహద్రాయ్ ఫిర్యాదు అంశంలో దూబే, ఎథిక్స్ కమిటీ ఆచితూచి అడుగు లేయాల్సింది. మహిళ గనుకే ఇలా చేశారన్న అపవాదు రానీయకుండా చూసుకోవాల్సింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతం, రాజకీయం కలగాపులగం చేశారన్న అప్రదిష్ట కలగడమూ మంచిది కాదు. ఏదేమైనా వ్యవస్థను ఢీకొట్టేవారు నిరంతరం అత్యంత జాగురూకతతో మెలగాలని మొయిత్రా ఇప్పటికే గుర్తించి వుంటారు. ఈ వివాదంలో పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యానికి అనుగుణమైన నిర్ణయం వెలువడాలని అందరూ కోరుకుంటారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి
న్యూఢిల్లీ: టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటువేయాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలడిగేందుకు వ్యాపార వేత్త హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకు న్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన విష యం తెలిసిందే. ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్ సోంకార్ సారథ్యంలో గురువారం సమావేశమైన 10 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ 479 పేజీల నివేదిను ఆమోదించింది. పదిహేను రోజుల వ్యవధిలో ముగ్గురిని ప్రశ్నించి దీనిని తయారు చేశామని సోంకార్ చెప్పారు. ఎంపీ మొయిత్రాను సస్పెండ్ చేయా లన్న సిఫారసును కమిటీలోని నలుగురు వ్యతిరేకించగా ఆరుగురు బలపరిచారని తెలిపా రు. కాగా, ఒక ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దీనిపై ఎంపీ మొయిత్రా స్పందిస్తూ.. ఇదంతా ముందుగానే ఖరారు చేసిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికి తనను బహిష్కరించినా, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ సభలోకి అడుగుపెడతానన్నారు. ఈ నివేదికను ఎథిక్స్ కమిటీ పార్లమెంట్ ముందుంచుతుంది. అనంతరం చర్చ, ఆపైన చర్యలపై ఓటింగ్‌కు పెడతారు. ఎంపీ మహువా మొయిత్రా లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, లాయర్ జై అనంత్ దేహద్‌రా య్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఇలా ఉండగా, తమ ఎంపీ మొయిత్రాను టీఎంసీ గట్టి గా సమర్థించింది. బీజేపీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని వేధిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఆరోపణలు రుజువు కాకు ండానే పార్లమెంటరీ కమిటీ ఆమెపై చర్యలకు ఎలా సిఫారసు చేస్తుందని ప్రశ్నించారు. -
మహువా లోక్‌సభ బహిష్కరణ సిఫార్సుకు.. ఎథిక్స్ కమిటీ ఆమోదం
డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకంది. ఆమెను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలంటూ చేసిన సిఫార్సును పార్లమెంట్ నైతిక విలువల కమిటీ ప్యానెల్ ఆమెదించింది.పార్లమెంట్ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. హీరానందనీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. చదవండి: మహువాపై సీబీఐ విచారణ ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. నవంబర్ రెండున లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరైన మహువా.. ప్యానెల్ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారంటూ ఆగ్రహించి విచారణ మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం మహువా కేసులో ఎథిక్స్ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని లోక్‌సభ నైతిక విలువల కమిటీ గురువారం సమావేశమై ఈ నివేదికను పరిశీలించింది. అనంతరం 6:4తో ఈ నివేదికను కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది. ఈ నివేదికను శుక్రవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించనున్నట్లు కమిటీ చీఫ్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ తెలిపారు అన్ని చర్చించిన అనంతరం మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్ లాగిన్ ఐడిని షేర్ చేసుకున్నారని, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించిందని సోన్కర్ పేర్కొన్నారు. ఆమె చర్య తీవ్రమైన శిక్షకు కారణమని తెలిపారు. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు. పదిమందే హాజరు లోక్‌సభ ఎథిక్స్ కమిటీలో మొత్తం 15 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వారిలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు. బీఎస్పీ, శివసేన, వైఎస్సార్సీపీ, సీపీఎం, జేడీయూ నుంచి ఒక్కక్కరు ఉన్నారు. నేటీ సమావేశానికి 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఏడుగురు బీజేపీ ఎంపీల్లో నలుగురు మాత్రమే హాజరయ్యారు. మహువా పార్లమెంట్ బహిష్కరణను సమర్ధించిన వారిలో కాంగ్రెస్ సస్పెండెడ్ ఎంపీ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ కూడా ఉన్నారు. ఆమెతోపాటు అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, వినోద్ సోన్కర్, హేమంత్ గాడ్సే మహువాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక నివేదికను వ్యతిరేకించిన వారిలో డానిష్ అలీ, వి వైతిలింగం, పీఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేత సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు నియోజకవర్గానికి వెళ్లడంతో ఆయన ఓటింగ్‌లో పాల్గొనలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ కూడా సమావేశానికి హాజరు కాలేదు. -
మహువాపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభలో ప్రశ్నలడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరపనుందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తాజాగా వెల్లడించారు. తన ఫిర్యాదు ఆధారంగా లోక్‌పాల్ ఈ మేరకు ఆదేశించినట్టు వివరించారు. ఈ మేరకు బుధవారం తన సామాజిక మాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. దీనిపై మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ‘‘సీబీఐ ముందుగా అదానీ గ్రూప్ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణం తదితరాలపై విచారణ జరిపితే బాగుంటుంది. ఆ తర్వాత నా అంశానికి రావచ్చు. నాకు ఎన్ని పాదరక్షలున్నాయో లెక్కపెట్టుకోవచ్చు’’ అని ఎద్దేవా చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. ఇందుకు బదులుగా హీరానందానీ నుంచి డబ్బులతో పాటు ఇతరత్రా పలు రకాలుగా ఆమె భారీ స్థాయిలో లబ్ధి పొందారని ఆమెపై ఆరోపణ. ఎంపీ హోదాలో ఉంటూ డబ్బుల కోసం జాతీయ భద్రతనే ఆమె ప్రమాదంలో పడవేశారని లోక్‌సభ స్పీకర్‌కు దూబే గతంలో ఫిర్యాదు చేయడం తెల్సిందే. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. కమిటీ గత భేటీకి హాజరైన మొయిత్రా, చైర్మన్ తనను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని ఆరోపిస్తూ వాకౌట్ చేయడం విదితమే. ఈ ఉదంతంపై కమిటీ గురువారం మరోసారి భేటీ కానుంది. డబ్బులకు ప్రశ్నలడిగిన ఉదంతంలో మొయిత్రాను దోషిగా తేలుస్తూ స్పీకర్‌కు కమిటీ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. అదే జరిగితే దానితో విభేదిస్తూ కమిటీలోని విపక్ష సభ్యులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి (కాంగ్రెస్), కున్వర్ దానిష్ అలీ (బీఎస్పీ) నోట్ ఇస్తారని చెబుతున్నారు. -
మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు ఎథిక్స్ కమిటీ సిఫార్సు
సాక్షి, ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగేందుకు అర్హత లేదని, ఆమెను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ తేల్చి చెప్పింది. ఆమెపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ఆమెను లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బుధవారం సిఫార్సు చేసింది. మహువాపై వచ్చిన నగదు సంబంధిత ఆరోపణలపై ఎథిక్స్ ప్యానెల్ పరిశీలన జరిపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. మొత్తం 500 పేజీలతో కూడిన నివేదికను ప్యానెల్ సిద్ధం చేసింది. ఆమె నివేదిక ఆమె ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ సిఫారసు చేసింది. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంలో ఆమెపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ప్యానెల్.. కేంద్రం ఆధ్వర్యంలో కాలపరిమితితో కూడిన చట్టపరమైన దర్యాప్తునకు సిఫార్సు చేసింది. రాజకీయంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. పార్లమెంటులో ప్రశ్నలడగటానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువాకు డబ్బులు చెల్లించినట్లు ఓ వ్యాపారవేత్త చేసిన ఆరోపణలతో పెను దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారం అంతా ప్రధాని కార్యాలయం నుంచే నడుస్తోందని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమెపై నమోదు అయిన ఫిర్యాదుల ఆధారంగా.. పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ విచారణ చేపట్టింది. నవంబర్ 2వ తేదీన ఎథిక్స్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు కూడా. అయితే విచారణ మధ్యలోనే ఆమె వెళ్లిపోవడం, ఆ సమయంలో ఎథిక్స్ కమిటీపై ఆమె చేసిన ఆరోపణలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. -
మొయిత్రా వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ నైతిక విలువల కమిటీ ముందు హాజరై తర్వాత వాకౌట్ చేశారు. కమిటీ భేటీలో తీవ్ర అభ్యంతర, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారంటూ ఆమె మధ్యలోనే బయటికొచ్చారు. ఆమెకు మద్దతు పలుకుతూ విపక్ష ఎంపీలు సైతం అర్ధంతరంగా బయటికొచ్చారు. కాగా, ‘ఎథిక్స్ కమిటీని మొయిత్రా తప్పుదోవ పట్టించే ప్రయత్నంచేశారు. కమిటీ తప్పుడు విధానాలను అవలంబిస్తోందంటూ, కమిటీ నిర్వహణ పద్ధతిని మొయిత్రా తప్పుగా చిత్రించే దుస్సాహసం చేశారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. ‘నగదుకు ప్రశ్నలు’ ఆరోపణలుసహా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందానీకి మొయిత్రా ఇచ్చారని, దుబాయ్ నుంచి చాలాసార్లు లాగిన్ అయ్యా, విదేశాల్లో లాగిన్ అవడంతో దేశభద్రత ప్రమాదంలో పడిందని దూబే తీవ్ర ఆరోపణలు చేయడం తెల్సిందే. లోక్‌సభ స్పీకర్ బిర్లాకు దూబే ఫిర్యాదుచేయడంతో వివరణ కోరుతూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మొయిత్రాను గురువారం పిలిచింది. ఈ భేటీ దాదాపు నాలుగు గంటలపాటు సాగింది. అసభ్యమైన ప్రశ్నలు వేస్తున్నారు: మొయిత్రా ‘అసలు అవేం ప్రశ్నలు?. తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే బయటికొచ్చేశా’ అని అక్కడ ఉన్న మీడియాతో అన్నారు. ‘మీ కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు ఉన్నాయిగా’ అని అక్కడున్న ఒక విలేకరి ప్రశ్నించగా.. ‘ఏమిటా చెత్త ప్రశ్న. చూడు నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అంటూ మొయిత్రా తన రెండు కళ్లను చూపించారు. ‘అసలు ఇది ఎథిక్స్ కమిటీయేనా?. ముందే సిద్దంచేసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారు’ అంటూ కమిటీపై మొయిత్రా ఆరోపణలు చేశారు. ‘‘కమిటీలో చైర్మన్ నన్ను మాటలతో ‘వ్రస్తాపహరణం’ చేశారు’’ అని ఫిర్యాదుచేస్తూ స్పీకర్ బిర్లాకు మొయిత్రా ఒక లేఖ రాశారు. మొయిత్రా, కమిటీ చైర్మన్, సభ్యులు ఏమన్నారు? మొయిత్రా వాకౌట్ తర్వాత ఎథిక్స్ కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ మీడియాతో మాట్లాడారు. ‘ నిజానికి కమిటీ విధివిధానాలు, నిర్వహణ పద్ధతిపై మొయిత్రా తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. తర్వాత ఆమె, విపక్ష సభ్యులు చర్చ జరుగుతుండగానే మధ్యలో బయటికొచ్చేశారు’ అని చెప్పారు. ‘ మొయిత్రాను అడిగిన ప్రశ్నలు అగౌరవనీయం, అనైతికంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరితో మాట్లాడారు. మీ ఫోన్ రికార్డింగ్‌లు ఇవ్వాలని కమిటీ అడిగింది’ అని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు అయిన ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ‘రాత్రిళ్లు ఎవరితో మాట్లాడతారు? ఎలాంటి విషయాలు మాట్లాడతారు? అని ఆమెను ప్రశ్నించారు. మహిళా ఎంపీని చైర్మన్ ప్రశ్నలు అడిగే పద్దతి ఇదేనా? ద్రౌపది వస్త్రాపహరణం తరహాలో విచారణ కొనసాగింది’ అని కమిటీ సభ్యుడు డ్యానిష్ అలీ ఆరోపించారు. ఆ లాయర్ వల్లే ఇదంతా ! బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేకు బలమైన సాక్ష్యాలు ఇచ్చారంటూ వార్తల్లో నిలిచిన న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ గతంలో మొయిత్రాకు బాగా తెలుసు. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేసి విడిపోయారు. విడిపోయేటపుడు జరిగిన గొడవకు ప్రతీకారంగానే జై అనంత్ ఇవన్నీ చేస్తున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. కమిటీ ముందు ఇవే అంశాలను మొయిత్రా ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే, దేహద్రాయ్‌తో బంధం విడిపోయిన విషయం పక్కనబెట్టి ‘నగదుకు ప్రశ్నలు’ అంశంపై వివరణ ఇవ్వాలని కోరినా ఆమె పట్టించుకోలేదని బీజేపీ ఎంపీ, కమిటీ సభ్యుడు విష్ణుదత్ శర్మ ఆరోపించారు. -
ఎంపీ మహువా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఎథిక్స్ కమిటీ
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా గురువారం లోక్‌సభ నైతిక విలువల కమిటీ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే కమిటీ సంబంధం లేని చెత్త ప్రశ్నలు అడిగారంటూఎంపీ మహువాతోపాటు బీఎస్పీ ఎంపీ డ్యానిష్ అలీ, గిర్ధారీ యాదవ్‌తోపాటు మరికొంతమంది ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి మధ్యలోనే బయటకొచ్చారు. ఎథిక్స్ కమిటీ సభ్యులు వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడుగుతున్నారంటూ మీడియా ముందు మహువా మండిపడ్డారు. రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని, అసలు ఇది ఎథిక్స్ కమిటేనా అని ప్రశ్నించారు. ‘నా కంట్లో నీళ్లు వస్తున్నాయంటూ చెత్త వాగుడు వాగుతున్నారు. మీకు నా కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయా’ అని ధ్వజమెత్తారు. అయితే మహువా చేసిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ ఘాటుగా స్పందించారు. టీఎంపీ ఎంపీ విచారణకు సహకరించలేదని అన్నారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిందని మండిపడ్డారు. ‘మొయిత్రా విచారణ సమయంలో సమాధానాలు చెప్పకుండా.. కమిటీ సభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకర పదజాలంతో చైర్మన్, ప్యానెల్ మెంబర్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడానికే మహువా, డ్యానిష్ అలీ, గిర్దారీ యాదవ్, ఇతర ప్రతిపక్ష ఎంపీలు కమిటీని నిందిస్తూ ఆకస్మాత్తుగా బయటకొచ్చేశారు. దీనిపై ప్యానెల్ మరోసారి సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుంది’ అని వినోద్ సోంకర్ వెల్లడించారు. చదవండి: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వండి: ఈసీకి సుప్రీం ఆదేశం మరోవైపు మోయిత్రాను ఎథిక్స్ కమిటీ చైర్ పర్సన్ అడిగిన ప్రశ్నలు అనైతికంగా ఉన్నట్లు తాము గుర్తించామని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అతను ఎవరో ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నాడనే విషయం అర్థమవుతోందన్నారు. ఇది మంచిది కాదని అన్నారు. కమిటీ సభ్యులు మహువా ‘ఎక్కడికి వెళ్లున్నారు? ఎక్కడ ఎవరిని కలుస్తున్నారు? మీ ఫోన్ రికార్డులు మాకు ఇవ్వగలరా?’ అంటూ చెత్త ప్రశ్నలు అడుగుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.అదే విధంగా జనతాదళ్ఎంపీ గిరిధారి యాదవ్ మాట్లాడుతూ, మహువా మోయిత్రాను వ్యక్తిగత ప్రశ్నలు అడిగే హక్కు ప్యానెల్‌కు లేదని అన్నారు. -
చెత్త ప్రశ్నలు అడిగారు: మహువా మెయిత్రా
ఢిల్లీ: ఎథిక్స్ కమిటీ సభ్యులు చెత్త ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా తెలిపారు. అనైతిక, వ్యక్తిగత ప్రశ్నలు అడిగారని ఎథిక్స్ కమిటీ సభ్యులపై మండిపడ్డారు. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపీలు విచారణ నుంచి బయటకొచ్చారు. ప్యానెల్ వ్యక్తిగత, అనైతిక ప్రశ్నలు అడుగుతోందంటూ ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఏదేదో విషయాలు తీస్తూ చెత్తగా మాట్లాడుతున్నారని మహువా తెలిపారు. ‘మీ కళ్లలో నీళ్లు ఉన్నాయని అంటున్నారు. నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా?’ అని మీడియా ముందు మహువా ప్రశ్నించారు. ‘వ్యక్తిగత సంబంధం’లోని అపార్థాలే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసు నమోదుకు కారణమైనట్లు ఎథిక్స్ కమిటీకి మహువా మెయిత్రా తెలిపారు. కాగా గతంలోనూ తనపై వచ్చిన ఆరోపణల వెనుక తన మాజీ ప్రియుడు జైన్ అనంత్ దేహద్రాయ్ హస్తం ఉన్నట్లు మెయిత్రా పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న కేసులో టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. మూడు కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి ఎథిక్స్ కమిటీకి వచ్చిన నివేదికలతో పాటు ఇతర పత్రాలు, సాక్ష్యాల ఆధారంగా మహువా మొయిత్రాను ప్రశ్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హోం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నివేదికలు ఎథిక్స్ కమిటీ వద్ద ఉన్నాయి. #WATCH | TMC MP Mahua Moitra arrives at the Parliament in Delhi. She is appearing before the Parliament Ethics Committee in connection with the 'cash for query' charge against her. pic.twitter.com/Hl4ZqG3eEl — ANI (@ANI) November 2, 2023 ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా.. వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు కూడా చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు. ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె నేడు ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే.. తనకు లంచం ఇచ్చినట్లు బయటకొచ్చిన అఫిడవిట్‌పై హీరానందానీని ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె ఎథిక్స్ కమిటీని కోరారు. ఇదీ చదవండి: దుబాయ్ నుంచి 47 సార్లు.. మహువా మెయిత్రా కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
మహువా మెయిత్రా కేసులో వెలుగులోకి కీలక అంశాలు
ఢిల్లీ: డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మెయిత్రా కేసులో కీలక అంశాలు బయటకొస్తున్నాయి. ఆమె పార్లమెంటరీ ఖాతాను దుబాయ్ నుంచి 47 సార్లు ఉపయోగించినట్లు తెలుస్తోంది. మహవా మెయిత్రా నేడు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు వెలువడ్డాయి. దుబాయ్ నుంచి మహువా ఎంపీ ఖాతా 47 సార్లు తెరవబడినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా ఎంపీ నిషికాంత్ దూబే స్పందించారు. మహువా అవినీతి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎంపీలందరూ నిలబడాలని కోరారు. వ్యాపారవేత్త హీరానందానీ తన వ్యాపార ప్రయోజనాల కోసమే మహువా ఖాతాను ఉపయోగించి ఆయనే ఈ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోందని అన్నారు. పెట్టిబడిదారుల ఉపయోగాల కోసం ఎంపీల బృందం పనిచేస్తోంందా? అని దేశవ్యాప్తంగా ఎంపీలందర్ని ఉద్దేశించి ప్రశ్నించారు. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి టీఎంసీ ఎంపీ మహవా మెయిత్రా వ్యాపారవేత్త హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఈ క్రమంలో మహువాకు లంచం ఇచ్చినట్లు ఆరోపిస్తూ హీరానందానీ పేర ఓ లేఖకు చక్కర్లు కొట్టింది. వీటిని మహవా మెయిత్రా ఖండించారు. ఈ వ్యవహారంలో మహువాకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సమన్లు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఎథిక్స్ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇదీ చదవండి: మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్నాథ్ షిండే -
ఆ అధికారం ఎథిక్స్ కమిటీకి లేదు: ఎంపీ మహువా మొయిత్రా
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ నైతిక విలువల కమిటీకి నేరపూరిత ఆరోపణలను పరిశీలించే అధికారాలు లేవని ఆరోపించారు. ఈ మేరకు ఆమె కమిటీకి బుధవారం ఓ లేఖ రాశారు. కాగా ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యేందుకు మహువా సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే కమిటీ ముందు హాజరయ్యే ఒకరోజు ముందు ఆమె లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘తనకు జారీ చేసిన సమన్లను మీడియాకు విడుదల చేయడం సరైందని ఎథిక్స్ కమిటీ భావించినందున.. గురువారం విచారణను ఎదుర్కొనే ముందు నా లేఖను సైతం విడుదల చేయడం ముఖ్యమని భావిస్తున్నాను’ అని ఆమె చెప్పారు. ప్యానల్‌కు క్రిమినల్ అధికార పరిధి లేదు కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్‌కు రాసిన లేఖలో.. తనపై వచ్చిన నేరాపూరిత ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదికేనా? అని మహువా ప్రశ్నించారు. పార్లమెంటరీ కమిటీలకు నేరారోపణలను విచారించే క్రిమినల్ అధికార పరిధి లేదని పేర్కొన్నారు. చట్టపరమైన దర్యాప్తు సంస్థలు మాత్రమే ఇటువంటి కేసులో విచారించవచ్చునని చెప్పారు. దేశ రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ కమిటీల దుర్వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో ఇలాంటి ఏర్పాట్లు చేశారని మోయిత్రా తెలిపారు. చదవండి: రిచెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరో తెలుసా? గ్లోబల్ సెలబ్రిటీలు ఆమె కస్టమర్లు హీరానందానీని కూడా విచారణకు పిలవాలి వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు అనుమతించాలని మోయిత్రా డిమాండ్ చేశారు. కాగా పార్లమెంట్లో అడిగేందుకు తన నుంచి ప్రశ్నలు స్వీకరించినట్లు దర్శన్ ఆరోపిస్తున్నారు. అంతేగాక దుబాయ్ నుంచి ప్రశ్నలు పోస్టు చేసేందుకు ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌కు వాడినట్లు తెలిపారు. కాగా అదానీ గ్రూప్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకునేలా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మోయితా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయగా.. నైతిక విలువలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టింది. ఈ కేసులో నవంబర్ రెండున మహువా లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. -
ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ అలర్ట్.. మీ ఫోన్ హ్యాక్ అవుతుందంటూ వార్నింగ్
న్యూఢిల్లీ: పలువురు లోక్‌సభ ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ ఫోన్ వార్నింగ్ అలర్ట్ పంపింది. ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసెజ్ అందుకున్న వారిలో త్రుణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభత్వం తన ఫోన్, ఈ-మెయిల్‌ను హ్యక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి తన ఫోన్‌కు వచ్చిన హెచ్చరిక మెసెజ్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్లో చేశారు. ‘ప్రభుత్వం నా ఫోన్, ఈ-ఇమెయిల్‌లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తూ ఆపిల్ నుంచి టెక్స్ట్, ఈ మెయిల్ వచ్చింది. మీ భయం నన్ను మీపై జాలిపడేలా చేస్తుంది’ అంటూ అదానీ, పీఎంవో, హోమంమంత్రి కార్యాలయాలను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేశారు. So not just me but also @MahuaMoitra has received this warning from Apple. Will @HMOIndia investigate? https://t.co/aS01YQpRpB — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 31, 2023 అదే విధంగా శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ, తను, మరో ముగ్గురు ఇండియా కూటమి సభ్యులకు ఈ మెసెజ్ అందినట్లు మహువా పేర్కొన్నారు. ఆమెకు అందిన ఈ మెసెజ్‌లో ‘హెచ్చరిక:మీ యాపిల్ ఐడీతో అనుసంధానించిన ఐఫోన్‌ను స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మీ ఐఫోన్‌ను టార్గెట్ సేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఉంది. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరరూర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తనకు కూడా యాపిల్ నుంచి హెచ్చరిక సందేశం వచ్చినట్లు పేర్కొన్నారు. తన ఫోన్, ఈ-మెయిల్ లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొంటూ ట్విటర్లో పీఎంవోను ట్యాగ్ చేశారు. ప్రభుత్వానికి చేయడానికి ఇంతకుమించిన ముఖ్యమైన పని మరేం లేదా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వీరితో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ హెచ్చరికను అందుకున్నారు. తనకు వచ్చిన మెసెజ్‌ను ఒవైసీ ట్విటర్లో పంచుకున్నారు. Received from an Apple ID, threat-notifications@apple.com, which I have verified. Authenticity confirmed. Glad to keep underemployed officials busy at the expenses of taxpayers like me! Nothing more important to do?@PMOIndia @INCIndia @kharge @RahulGandhi pic.twitter.com/5zyuoFmaIa — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2023 Received an Apple Threat Notification last night that attackers may be targeting my phone ḳhuub parda hai ki chilman se lage baiThe haiñ saaf chhupte bhī nahīñ sāmne aate bhī nahīñ pic.twitter.com/u2PDYcqNj6 — Asaduddin Owaisi (@asadowaisi) October 31, 2023 -
నవంబర్ 2న హాజరుకండి
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై మౌఖిక సాక్ష్యమిచ్చేందుకు నవంబర్ 2న తమ ముందుకు రావాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను ఎథిక్స్ కమిటీ కోరింది. వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్ 31కి బదులుగా నవంబర్ 5న హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని శుక్రవారం ఎంపీ మొయిత్రా ఎథిక్స్ కమిటీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఎథిక్స్ కమిటీ చైర్ పర్సన్, బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ స్పందించారు. పార్లమెంటు, ఎంపీల గౌరవానికి సంబంధించిన అంశమైనందున నవంబర్ 2వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీని కోరారు. ఆ తర్వాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంపీ మొయిత్రాపై లంచం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దుబే, మొయిత్రా ఒకప్పటి స్నేహితుడు, లాయర్ జై అనంత్ దేహద్రాయ్ గురువారం ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హీరానందానీకి లాగిన్ ఐడీ ఇచ్చింది నిజమే లంచం ఆరోపణలపై ఎంపీ మొయిత్రా పీటీఐతో మాట్లాడారు. తనపై వారిద్దరూ తప్పుడు, పరువు నష్టం ఆరోపణలు చేసినందున కమిటీ ఎదుట హాజరై వాదన వినిపిస్తానన్నారు. అదానీ గ్రూప్‌తో పాటు మోదీని టార్గెట్ చేసేందుకు మొయిత్రాకు లంచం ఇచ్చారనే ఆరోపణలను అంగీకరిస్తూ హీరానందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమర్పించిన విషయం ప్రస్తావించగా.. దీని వెనుక అదానీ గ్రూప్ హస్తం ఉందని మొయిత్రా అన్నారు. పార్లమెంటరీ పోర్టల్ ఐడీ వివరాలను వ్యాపారి హీరానందానికి ఇచ్చిన విషయం నిజమేనని ఆమె ఒప్పుకున్నారు. తనకు సౌకర్యంగా ఉండేందుకే ఆయనకిచ్చానే తప్ప, ఈ విషయంలో ఎటువంటి లాభాపేక్ష లేదని పేర్కొన్నారు. లాగిన్ ఐడీ వివరాలను ఇతరులకు వెల్లడించడం దేశ భద్రతకు ప్రమాదకరం అంటూ దుబే ఆరోపణలు చేశారు. -
అవును.. పార్లమెంట్ లాగిన్ ఐడీ ఇచ్చా: ఎంపీ మహువా మొయిత్రా
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన లోక్‌సభ లాగిన్ ఐడీ వివరాలు వ్యాపారవేత్త, హీరానందాని గ్రూప్ సీఈవో దర్శన్ హీరానందానికి ఇచ్చినట్లు ఆమె ఆంగీకరించారు. అయితే అతని నుంచి కేవలం చిన్న చిన్న గిఫ్ట్‌లే అందుకున్నట్లు చెప్పారు. హిరానందని గ్రూప్ సీఈవో నుంచి స్కార్ఫ్, కొన్ని లిప్‌స్టిక్‌లు, ఐషాడో వంటి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. పార్లమెంటులో తాను అడగాల్సిన ప్రశ్నలను పోస్ట్ చేసేందుకు తన లోక్‌సభ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించేందుకు స్నిహితుడైన దర్శన్ హీరానందానికి అనుమతి ఇచ్చినట్లు ఆమె అంగీకరించారు. అయితే హీరానందని నుంచి డబ్బుల రూపంలో లంచం తీసుకున్నారనే ఆరోపణలను మహువా ఖండించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్తను ప్రశ్నించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతరులకు కూడా వివరాలు ఇచ్చా! లోక్‌సభ లాగిన్ వివరాలు ఇచ్చినట్లు అంగీకరించిన మహువా.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుందని, తన ప్రశ్నలు పోస్టు అవుతుంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్సైట్లను నిర్వహించే ఎన్ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని తెలిపారు.. ముంబైలో ఉన్నప్పుడు హీరానందానీ కారు వాడాను వ్యాపారవేత్త అయిన హీరానందాని తన స్నేహితుడని, అతని నుంచి పుట్టినరోజు కానుకగా స్కార్ఫ్, లిప్‌స్టిక్‌లు, బాబీ బ్రౌన్ నుంచి మేకప్ ఐటమ్స్ తీసుకున్నట్లు మొయిత్రా పేర్కొన్నారు. తన కోసం దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్ నుంచి మేకప్ వస్తువులు తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. తన ఇంటి ఇంటీరియర్లను మార్చడం కోసం తాను అతనిని సంప్రదించానని, అతను ఆమెకు కొత్త ఆర్కిటెక్చరల్ ప్లాన్లు, డ్రాయింగ్లను అందించాడని, అయితే ఖర్చులను ప్రభుత్వం పరిధిలోకి వచ్చే సీపీడబ్ల్యూడీ చేపట్టిందని ఆమె చెప్పారు. అలాగే తాను ముంబయిలో ఉన్నప్పుడల్లా హీరానందానీ స్నేహితుడైనందున అతని కారును ఉపయోగించేదానినని కూడా చెప్పింది. రూ. 2 కోట్ల ప్రస్తావన లేదు దర్శన్ హీరానందని తనకు ఇంకా ఏమైనా ఇచ్చి ఉంటే వెంటనే వచ్చి చెప్పాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఆరోపణ చేస్తారని, కానీ ఆ ఆరోపణలను నిరూపించే బాధ్యత వారిపై ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. అఫిడవిట్లో తనకు 2 కోట్ల నగదు ఇచ్చిన ప్రస్తావన లేదని, ఒకవేళ ఇచ్చినట్లయితే.. దయచేసి ఎప్పుడు ఇచ్చారో తేదీ చెప్పాలని, అన్ని డాక్యుమెంటరీ సాక్ష్యాలను అందించాలని కోరారు. సొమ్ములు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం ప్రధాని మోదీ, అదానీ గ్రూప్‌ను,లక్ష్యంగా చేసుకొని ప్రశ్నించినవేనని లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వీటికి తోడు మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని నిషికాంత్ దూబే మరో ఆరోపణలు చేయడం దుమారం చెలరేపింది. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31న తమ ముందు విచారణకు హాజరు కావాలని మహువాను కమిటీ తెలిపింది. అయితే తన నియోజకవర్గం కృష్ణానగర్‌లో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల వల్ల మరికొంత సమయం కావాలని ఎంపీ కోరగా.. ఆమె హాజరుకావాల్సిన తేదీ నవంబర్ రెండుకు మారింది. కొత్త తేదీ ఇచ్చిన ఎథిక్స్ కమిటీ.. ఇంతకు మించి పొడిగింపు ఉండదని వెల్లడించింది. ఇక ఇప్పటికే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ నైతిక వ్యవహారాల కమిటీ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇచ్చారు. అదే విధంగా మహువాకు వ్యతిరేకంగాపలు సాక్ష్యాలను సమర్పించారు. -
మోదీకి ప్రశ్నలు.. ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ మహువా మోయిత్రా
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎథిక్ కమిటీ విచారణను తాను ఇప్పుడు రాలేనని ఆమె లేఖ రాశారు. ఈ మేరకు లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఈ వ్యవహరం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో, ఈ విషయంలో విచారణకు రావాల్సిందిగా పార్లమెంట్ ఎథిక్ కమిటీ ఎంపీకి నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై ఎంపీ మహువా స్పందిస్తూ ఎథిక్స్ కమిటీకి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో..‘ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ నాకు సమన్లు ఈ-మెయిల్ చేయడానికి ముందే టీవీల్లో వాటిని ప్రసారం చేశారు. నాపై నమోదైన ఫిర్యాదులు, సుమోటో అఫిడవిట్లు మీడియా సంస్థలకు అందాయి. నా నియోజకవర్గంలో ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు నవంబరు 4న ముగిసిన వెంటనే విచారణకు హాజరవుతాను అని తెలిపారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో అక్టోబరు 30 నుంచి నవంబరు 4 వరకు ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, అందువల్ల అక్టోబరు 31న కమిటీ విచారణకు హాజరుకాలేనని మొయిత్రా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో బీజేపీ ఎంపీ రమేష్ భిధూరీ విజ్ఞప్తి మేరకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ తేదీని మార్పు చేసిన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తన లేఖను ట్విట్టర్లో షేర్ చేశారు. Chairman, Ethics Comm announced my 31/10 summons on live TV way before official letter emailed to me at 19:20 hrs. All complaints & suo moto affidavits also released to media. I look forward to deposing immediately after my pre- scheduled constituency programmes end on Nov 4. pic.twitter.com/ARgWeSQiHJ — Mahua Moitra (@MahuaMoitra) October 27, 2023 మరోవైపు మొయిత్రాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేత నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు గురువారం కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కమిటీ సభ్యుల ముందు నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. మొయిత్రాపై సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. లంచం తీసుకుని ప్రధాని మోదీని ఇరుకునబెట్టేందుకు వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 అదానీపైనే ఉన్నాయని నిషికాంత్ దూబే ఆరోపిస్తూ ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఇదిలా ఉంటే మోయిత్రాకు సంబంధించిన పార్లమెంట్ లాగిన్ వేరే వ్యక్తుల చేతికి వెళ్లినట్లు నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆమె ఇండియాలో ఉన్న సమయంలో దుబాయ్ నుంచి లాగిన్ అయినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎథిక్స్ కమిటీ ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. అయితే మోయిత్రా చేసిన విదేశీ పర్యటన వివరాలను హోంమంత్రిత్వ శాఖను నుంచి పార్లమెంట్ ప్యానెల్ కోరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో టీఎంసీ.. ఎంపీ మహువా మోయిత్రాకు సపోర్టు చేయలేదు. విచారణ జరుగుతుందని ఏం జరుగుతుందో చూడాలనే ధోరణిని టీఎంసీ ప్రదర్శిస్తోంది. -
మొయిత్రా ఢిల్లీలో ఉంటే.. దుబాయ్‌లో ఆమె లాగిన్ ఐడీని వాడారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే పరోక్షంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. ఎంపీ మొయిత్రా ఢిల్లీలో ఉన్న సమయంలో ఆమె పార్లమెంట్ ఐడీని దుబాయ్‌లో కొందరు ఉపయోగించుకుని లాగిన్ అయిన విషయాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించిందని వెల్లడించారు. ఎంపీ దుబే శనివారం ‘ఎక్స్’లో‘ ..‘కొంత డబ్బు కోసం ఆమె జాతీయ భద్రతను పణంగా పెట్టారు. ఇదే ఎన్ఐసీని ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ, వివిధ కేంద్ర విభాగాలు వాడుతుంటాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్షాలు ఇంకా దీనిపై రాజకీయాలు చేయాలా? దీనిపై ఇక ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’ అని దూబే పేర్కొన్నారు. కానీ, దర్యాప్తు విభాగం పేరును ఆయన పేర్కొనలేదు. అంతేకాకుండా, ఆమె ఎవరి నుంచి లంచం తీసుకున్నారు? వ్యాపారవేత్త దర్శన్ హిరా నందాని తరఫున అదానీ గ్రూప్, ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభలో ఆమె ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వంటి విషయాలను దుబే వివరించలేదు. ఎంపీ దుబేకి ఎథిక్స్ కమిటీ పిలుపు అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఎంపీ దుబే ఇటీవల లోక్‌సభ స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై లోక్‌సభ నైతిక వ్యవహారాల కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా, ఈ నెల 26న తమ ముందు హాజరై మౌఖిక సాక్ష్యం ఇవ్వాలని దుబేను కోరింది. అదానీ గ్రూప్ గుజరాత్‌లోని తన కంపెనీకి బదులుగా ఒడిశాలోని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన విభాగంలో ఎల్ఎన్జీ నిల్వ చేసుకునేందుకు అనుమతి పొందిన అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించేందుకు ఎంపీ మహువా పార్లమెంటరీ ఐడీని లాగిన్ చేసినట్లు వివరిస్తూ హిరా నందాని స్వయంగా సంతకం చేసిన ఒక సీల్డు కవర్‌ను ఈ కమిటీకి అందజేశారు. ఈ వివరాలు కూడా బయటకు వెల్లడి కావడం గమనార్హం. ఎంపీ మొయిత్రాపై ఆరోపణల విషయంలో సొంత పార్టీ టీఎంసీ మౌనంగా ఉంటోంది. అయినప్పటికీ మొయిత్రా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్‌పైనా, ఎంపీ దుబేపైనా ఆరోపణలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను ఎన్ఐసీ వెల్లడించాలి: మొయిత్రా తను ఢిల్లీలో ఉండగా పార్లమెంటరీ లాగిన్ ఐడీని దుబాయ్‌లో వాడారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన ఆరోపణలపై ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీలందరి లాగిన్ వివరాలను కూడా ఎన్ఐసీ బహిరంగ పర్చాలని, వారు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉన్నారో కూడా పరిశీలించాలని ఆమె డిమాండ్ చేశారు. తనకంటే జాతీయ భద్రతకు అత్యంత ప్రమాదకరం అదానీ గ్రూపేనని ఆమె ఎదురుదాడికి దిగారు. అదానీ గ్రూప్ కంపెనీ బొగ్గు దిగుమతులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. -
అవతలి పక్షంతో సంప్రదింపులా?
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పరువు నష్టం కేసులో అవతలి పక్షంతో సంప్రదింపులకు దిగినందుకు ఆమె తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్‌ను ఢిల్లీ హైకోర్టు మందలించింది. దాంతో ఆయన కేసు నుంచి తప్పుకున్నారు. లోక్‌సభలో పారిశ్రామికవేత్త అదానీ గ్రూపుపై ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, సుప్రీంకోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తదితరులు ఆరోపించడం తెలిసిందే. వారిపై ఆమె పరువు నష్టం దావా వేశారు. లాయర్ నారాయణన్ గురువారం తనకు ఫోన్ చేసి, ఆమెపై దాఖలు చేసిన సీబీఐ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరినట్టు దేహద్రాయ్ హైకోర్టుకు తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా ఆగ్రహించారు. ‘‘ఇది విని నేను నిజంగా షాక య్యాను. ఇలా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నిస్తే ఈ కేసులో వాదించేందుకు మీరెలా అర్హుల వుతారు?’’అని ప్రశ్నించారు. దేహద్రాయ్, మహువా కొంతకాలం పాటు సహజీవనం చేసినట్టు తృణమూల్ వర్గాలు చెబుతుంటాయి. ఆయన తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అసభ్యకర మెసేజీలు పంపుతున్నారని, చోరీకి యత్నించారని గత ఆర్నెల్లలో మహువా పలు కేసులు పెట్టారు. -
దర్శన్ అఫిడవిట్ పీఎంవో పనే: మహువా మొయిత్రా
ఢిల్లీ: మీడియాలో బహిర్గతమైన వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ అఫిడవిట్ వ్యవహారంపై ఎంపీ మహువా మొయిత్రా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం దర్శన్‌పై ఒత్తిడి చేసి తెల్లకాగితంపై సంతకం చేయించారని ఆరోపించారు. పీంవోనే ఓ తెల్లకాగితంపై రాసి మీడియాకు లీక్ చేశారని అన్నారు. పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి సమర్పించిన అఫిడవిట్ విశ్వసనీయతపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అఫిడవిట్ లెటర్ హెడ్ లేని తెల్ల కాగితంపై ఉందని అన్నారు. అధికారికంగా విడుదల చేయలేదని చెప్పారు. 'వ్యాపార వేత్తగా కొనసాగుతున్న దర్శన్‌కు పీఎంతో పాటు మంత్రులందర్ని కలవగల సమర్ధత ఉంది. అలాంటప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మొదటిసారి ప్రతిపక్ష ఎంపీగా కొనసాగుతున్న నాకు ఎందుకు లంచం ఇస్తారు? ఇది పూర్తిగా అసత్యం. ఈ లేఖను దర్శన్ కాకుండా పీఎంవోనే రాసింది. దర్శన్, ఆయన తండ్రిపై పీఎంవో బెదిరింపులకు పాల్పడింది. లేఖపై సంతకం చేయడానికి 20 నిమిషాలు సమయం ఇచ్చారు.' అని పేర్కొంటూ తాను దర్శన్ నుంచి లంచం తీసుకున్నాననే ఆరోపణలను మహువా మొయిత్రా ఖండించారు. అదానీ వ్యవహారాన్ని లేవనెత్తకుండా తన నోరు మూయించడానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడిందని మహువా మెుయిత్రా ఆరోపించారు. అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు హాస్యాస్పదమైన అంశాలుగా పేర్కొన్నారు. బీజేపీ ఐటీ సెల్లో మంచి రచనా నైపుణ్యం కలిగిన మందబుద్ధిగల వ్యక్తిచే ఈ లేఖను రాయించారని దుయ్యబట్టారు. దర్శన్ తనపై నిజంగా ఆరోపణలు చేయాలనుకుంటే మీడియా ముందుకు వస్తారు కానీ ఇలా ఏదో ఒక ఛానల్‌కు లీక్ చేయరని అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, ఆదానీ గ్రూప్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా టీఎంసీ నేత మొయిత్రా కుట్ర పన్నారని దర్శన్ ఆరోపించారు. ఈ మేరకు దర్శన్ సంతకం చేసిన అఫిడవిట్ ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. దర్శన్ అఫిడవిట్లో ఏముందంటే..? ► నాకు అనుకూలమైన ప్రశ్నలు అడిగేందుకు ఎంపీ అయిన మొయిత్రా నుంచి పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను తీసుకున్నాను ► ఇందుకుగాను ఆమె చాలా విలాసవంతమైన ప్రతిఫలాలు పొందారు. లగ్జరీ ఐటెమ్ అడిగేవారు. ఢిల్లీలోని ఆమె తన అధికారిక బంగ్లా ఆధునీకరణ పనులు చేయించుకున్నారు. దేశ, విదేశాల్లో ప్రయాణ ఖర్చులను భరించాలని డిమాండ్‌చేశారు. ► జాతీయస్థాయి నేతగా ఎదగాలని మొయిత్రాకు ఆశ. అందుకే ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలను అప్రతిష్టపాలు చేసి ప్రతిష్ట పెంచుకుందామని స్నేహితులను ఉపాయాలు అడిగేవారు. ► పార్లమెంట్లో ఆమె ప్రశ్నలు అడిగేందుకు తగిన సమాచారాన్ని ఆమె పార్లమెంటరీ మెయిల్ ఐడీకి పంపేవాడిని. తర్వాత నేనే నేరుగా ప్రశ్నలు అప్లోడ్ చేసేవాడిని. ► ఆమెకు రాహుల్ గాందీ, శశి థరూర్, పినాకీ మిశ్రా వంటి నేతలతో సత్సంబంధాలు ఉండటంతో నాకూ లాభం ఉంటుందని భావించా. ► ఫైనాన్షియల్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, బీబీసీ ఇలా ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థలకు చెందిన జర్నలిస్టులతో ఆమె మాట్లాడేవారు ► సుచేతా దలాల్, శార్దూల్ ష్రాఫ్‌లతోపాటు మాజీ అదానీ ఉద్యోగులు ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ప్రశ్నలు అడిగేవాళ్లం. ఇలా ఉండగా, తన పరువుకు భంగం కలిగేలా మీడియా సంస్థలు వార్తలు ప్రచురించకుండా అడ్డుకోవాలంటూ మొయిత్రా వేసిన పిటిషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. లేఖ ఇంకా అందలేదు.: ఎథిక్స్ కమిటీ చీఫ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ లేఖ తనకు ఇంకా అందలేదని ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ శుక్రవారం తెలిపారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే అంశం తీవ్రమైనదని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాలను కమిటీ పరిశీలిస్తోందని సోంకర్ చెప్పారు. ఆధారాలు సమర్పించాలని ఇరువర్గాలను కోరామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: ప్రయోజనం పొంది ప్రశ్నలడిగారు -
ఎంపీ మహువాపై ఆరోపణలు.. ఎథిక్స్ కమిటీ ముందుకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఫిర్యాదును లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్‌ఖర్ లోక్‌సబ ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. కాగా మహువా మోయిత్రాపై నిషికాంత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాట్లాడేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువా కోట్ల రూపాయలు తీసుకున్నారని తన లేఖలో పేర్కొన్నారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 దర్శన్ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని తెలిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు లాయర్ తనకు అందించారని, తక్షణమే మహువాను లోక్ సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేయాలని కోరుతూ.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్‌సైట్‌కు సంబంధించి తన లాగిన్ వివరాలను ఎవరికైనా ఇచ్చారా అనే విషయాలపై దర్యాప్తు చేయాలని కోరారు. ఇందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే నిషికాంత్ దూబే ఆరోపణలపై తృణమూల్ ఎంపీ ఘాటుగా స్పందించారు. నిషికాంత్ దూబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తును పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. ఇక బీజేపీ ఎంపీ ఆరోపణల్ని హీరానందానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాల కోసం తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని తేల్చి చెప్పింది. -
ప్రశ్నలడిగేందుకు లంచం తీసుకున్నారు
న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మొయిత్రా, వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటున్నట్లు ఉన్న తిరుగులేని సాక్ష్యాలను ఒక న్యాయవాది తనతో పంచుకున్నారని దూబే చెప్పారు. ‘అదానీ గ్రూప్ లక్ష్యంగా ఇప్పటి వరకు ఆమె లోక్‌సభలో ఇప్పటి వరకు 50 నుంచి 61 వరకు ప్రశ్నలడిగారు. 12 డిసెంబర్ 2005 నాటి ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసే విధంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం ద్వారా వ్యాపారవేత్త శ్రీ దర్శన్ హీరానందానీ వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనేందుకు ఎలాంటి సందేహం లేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిగ్గు తేల్చాలి’అని ఆయన స్పీకర్ బిర్లాను కోరారు. దీనిపై మొయిత్రా ఘాటుగా స్పందించారు. ముందుగా దుబేపై పెండింగ్‌లో ఉన్న ఆరోపణలపై స్పీకర్ చర్యలు తీసుకున్నాక తనపై చర్యలకు ఉపక్రమిస్తే సంతోషిస్తానని ఆమె అన్నారు. ‘నకిలీ డిగ్రీ పట్టావాలా, ఇతర బీజేపీ ప్రముఖులపై పెండింగ్‌లో ఉన్న ఉల్లంఘనలు చాలానే ఉన్నాయి. స్పీకర్ వాటిని పరిష్కరించిన వెంటనే నాకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తే స్వాగతిస్తా’అంటూ ఆమె ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. రెండు పార్టీలకు చెందిన ఈ ఎంపీల మధ్య పార్లమెంట్‌లోనూ తరచూ వాదోపవాదాలు జరుగుతుంటాయి. -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్‌ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్‌కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్‌కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
Mahua Moitra: సారీనా? నేనెందుకు చెప్పాలి?
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పేదే లే అంటున్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో.. మెహువా లేచినిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై పెను దుమారమే రేగింది. బీజేపీ ఎంపీలు ఆమె వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అయితే వివరణాత్మక క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌పై ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. యాపిల్‌ను యాపిల్ అనే అన్నాను. అందులో తప్పేం ఉంది. నేను ఏదైతే అన్నానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని బుధవారం పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారామె. సారీనా? ఎందుకు చెప్పాలి?. గతంలో ఇదే పెద్దమనిషి(రమేశ్ బిదూరిని ఉద్దేశించి) రైతులను వ్యభిచార గృహాల నిర్వాకులని వ్యాఖ్యానించాడు. అది పార్లమెంట్ రికార్డుల్లోనూ ఉంది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను. Mahua Moitra using cuss word like “harami” in Parliament And Brut won’t show this 😀 pic.twitter.com/y8gMNXTR3i — Rishi Bagree (@rishibagree) February 7, 2023 బీజేపీకి చెందిన గౌరవనీయులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారూ రాజ్యసభలో.. డాక్టర్ శాంతనూ సేన్‌ను ఉద్దేశించి అభ్యంతరకర పదం వాడారు. అయినా పార్లమెంట్లో ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్తేం కాదు కదా. ఒక మహిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. మంచిగా తిరిగి ఇవ్వడానికి నేను పురుషుడినే కావాలా ఏంటి?. అయినా.. బీజేపీ వాళ్లు పార్లమెంటరీ మర్యాదలు బోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారామె. ఇదిలా ఉంటే మెహువా వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ హేమా మాలిని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుకను అదుపులో ఉంచుకోవాలని. భావోద్వేగంలో ఏది పడితే అది మాట్లాడొద్దని.. పార్లమెంట్లో సభ్యులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని హేమమాలిని వ్యాఖ్యానించారు. -
ఇప్పుడు ‘పప్పు’ ఎవరు?
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామికోత్పత్తి క్షీణతలను సూచిస్తూ ఇప్పుడు పప్పు ఎవరు? అని నిలదీశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అసత్యాలు ప్రచారం చేశారంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అడిషనల్ గ్రాంట్స్ విడుదలపై లోక్‌సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ మేరకు నేల చూపులు చూస్తున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సూచించారు టీఎంసీ ఎంపీ. ‘ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయి. తీవ్ర అసమర్థతను సూచించేందుకు, ఎదుటివారిని కించపరచేందుకు దానిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న గణాంకాలు ఎవరు నిజమైన పప్పు అనేది వెల్లడిస్తున్నాయి.’ అని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో 26 నెలల కనిష్ఠానికి చేరుకున్న గణాంకాలను సూచిస్తూ ఈ మేరకు మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించే తయారీ రంగం అక్టోబర్‌లో 5.6 శాతం మేర క్షీణించింది. మరోవైపు.. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని సూచిస్తూ విమర్శలు గుప్పించారు మహువా మొయిత్రా. ‘అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు, ఇప్పుడు పప్పు ఎవరు?’ అని ప్రశ్నించారు. అలాగే.. భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్న డేటాను ఉటంకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 1/x In the spirit of the inalienable right to question the government, #Trinamool MP @MahuaMoitra makes a point on #ModiSarkar worth paying attention: “..the greatest liars has the believers” isn’t emotive but a fact based construct as #MahuaMoitra states facts on our economy. pic.twitter.com/1ukOSUv0aT — DOINBENGAL (@doinbengal) December 13, 2022 ఇదీ చదవండి: పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు -
వీడియో: స్పెషల్ అట్రాక్షన్.. క్లాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన మహిళా ఎంపీ
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్లో సైతం అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అయితే, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్‌లోని నదియా జిల్లాలో దుర్గా పూజ ఉత్సవాల్లో మహాపంచమి వేడుకల సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డ్యాన్స్ చేసిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆమె డ్యాన్స్ చేసిన వీడియోను టీఎంసీ ఎంపీ.. ఆమె ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా వీడియోకు లవ్లీ మూవ్మెంట్స్ ఫ్రమ్ మహాపంచమీ వేడుకలు అన్ని క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ఈ వీడియోలో బెంగాలీ జానపద గీతానికి టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర చేసిన డ్యాన్స్ స్టెప్స్ అందరినీ అలరించాయి. మహాపంచమి వేడుకల సందర్భంగా పాటను ఆలపిస్తూ చేసిన డ్యాన్స్ హైలైట్ అని చెప్పవచ్చు. ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Lovely moments from Mahapanchami celebrations in Nadia pic.twitter.com/y0mkbhGGiC — Mahua Moitra (@MahuaMoitra) September 30, 2022 -
కాస్ట్లీ హ్యాండ్‌బ్యాగ్ ట్రోలింగ్‌పై స్పందించిన ఎంపీ
న్యూఢిల్లీ: ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల అంశంపై ఉభయ సభలు అట్టుడుకిపోతున్నాయి. విపక్షాలు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభలో విపక్ష పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కకోలి ఘోష్ దస్తిదార్ ధరల పెరుగుదల అంశంపై మాట్లాడుతున్నారు. ఆ సమయంలో.. ఆమె పక్కనే ఉన్న మరో ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను టేబుల్ కింద దాచేశారు. అంతే.. అధిక ధరల గురించి మాట్లాడుతున్నందునే ఆమె తన కాస్ట్లీ బ్యాగ్‌ను కనిపించకుండా పక్కన పెట్టారంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆ బ్యాగు లూయిస్ వియుట్టన్ కంపెనీ బ్రాండ్. ధర రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది. దీంతో రాజకీయంగానూ ఈ సీన్‌పై విమర్శలు మొదలయ్యాయి. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ సభ్యులు.. ఇలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ నేతలు, మద్దతుదారులు వ్యంగ్యం ప్రదర్శించారు. ఆఖరికి మీమ్స్గానూ ఆమె వీడియో ట్రెండ్ అయ్యింది. ఈ తరుణంలో సోషల్ మీడియా సెటైర్లు, రాజకీయ విమర్శలపై ఆమె సింపుల్‌గా స్పందించారు. Jholewala fakir in Parliament since 2019. Jhola leke aye the… jhola leke chal padenge… pic.twitter.com/2YOWst8j98 — Mahua Moitra (@MahuaMoitra) August 2, 2022 జోలేవాలా ఫకీర్‌ను 2019 నుంచి పార్లమెంట్లో ఉన్నా. బ్యాగుతో వచ్చాం.. బ్యాగుతోనే వెళ్తాం అంటూ ట్వీట్ చేశారామె. అయితే ఆమె ట్వీట్లో లోతైన అర్థం దాగుండడం గమనార్హం. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2016 యూపీ మోరాదాబాద్ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను ఓ ఫకీర్‌గా అభివర్ణించుకున్నారు. రాజకీయాల నుంచి ప్రత్యర్థులు తనను దూరం చేయాలని ప్రయత్నిస్తే.. సాదాసీదా వ్యక్తినైన తాను ఫకీర్లాగా జోలె పట్టుకుని ముందుకు వెళ్తానని.. అంతేగానీ అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తాను ఆపబోనని భావోద్వేగంగా ప్రసంగించారు ఆయన. Marie Antoinette Mahau Moitra hiding her expensive bag during a discussion on price rise- hypocrisy has a face & its this! A party that believes in TMC- Too Much Corruption discusses price rise after not cutting VAT & alliance with UPA that gave run away inflation of 10% plus pic.twitter.com/VByJsk4tBV — Shehzad Jai Hind (@Shehzad_Ind) August 1, 2022 -
'హిందూ ధర్మాన్ని బీజేపీ ఏమైనా లీజుకు తీసుకుందా?'
బెంగాల్: కాళీమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా.. బీజేపీపై విమర్శలతో విరుచకుపడ్డారు. హిందూ ధర్మాన్ని ఆ పార్టీ ఏమైనా లీజుకు తీసుకుందా? అని ప్రశ్నించారు. ఏం చేయాలో కమలం పార్టీ ఇతరులకు ఎందుకు బోధిస్తోందని నిలదీశారు.. బెంగాలీ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన ఎజెండాను, అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఇతరులు దీన్ని ప్రతిఘటించి దేశం కోసం ఒక్కసారి మాట్లాడాలి' అని మహువా అన్నారు. బీజేపీ తన సొంత వెర్షన్ హిందూయిజాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపింపజేయాలని చూస్తోందని మహువా మెయిత్రా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని హిందువులు వందల ఏళ్లుగా సుస్థిరమైన ఆచారాలను పాటిస్తున్నారని గుర్తు చేశారు. కాళీమాతను ఇలానే పూజించాలని బీజేపీ చెప్పడమేంటన్నారు. శ్రీరాముడు, హనుమంతుడు కేవలం ఆ పార్టీకే చెందినవారు కాదన్నారు. హిందుత్వ రాజకీయాలను బలవంతంగా తమపై రుద్దాలని చూసిన బీజేపీని బెంగాల్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని మహువా అన్నారు. కాళీమాతను ఎలా పూజించాలో ఆ పార్టీ తనకు చెప్పొద్దని, 2000 ఏళ్లుగా తాము ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నామని అన్నారు. ►చదవండి: TMC Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత -
కాళీ మాతపై వ్యాఖ్యలు ఇష్యూ.. సీఎం మమత కామెంట్స్ ఇవే..
కోల్కత్తా: కాళీమాతను అవమానిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్ వెలిసిన వివాదం ముదిరిపోయి భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌పై తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. తప్పులు అందరూ చేస్తారు. కానీ, వాటిని సరిదిద్దుకోగలరు. మేము కూడా పని చేస్తున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ, ఆ తర్వాత సరిదిద్దుకుంటాం. కొందరు మంచి పనిని సహించక అరుస్తుంటారు. ప్రతికూల ఆలోచనలు మన మెదడుకు మంచిది కాదు. అందుకే సానుకూల దృక్పథంతో ఆలోచించండి అని అన్నారు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఎంపీ మొయిత్రా.. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి’, ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ’ చేస్తారని ఆమె అన్నారు. అదే బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారం చోటుచేసుకుంది. బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మొయిత్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఆమెపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. టీఎంసీ ఎంపీ మొయిత్రా.. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: హిందుత్వం ఎప్పటికీ భారతదేశంగా మారదు.. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం -
Mahua Moitra: మాంసం తినే మద్యం తాగే దేవత
కోల్‌కతా: కాళీమాతను అవమా నిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్ వెలిసిన వివాదం ముదిరిన వేళ తృణమూల్ కాంగ్రెస్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి’ అని మంగళవారం కోల్‌కతాలో ఇండియాటుడే సదస్సులో వ్యాఖ్యానించారు. ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ. అదే బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని మొయి త్రా అన్నారు. మొయిత్రా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ అధికార టీఎంసీ అభి ప్రాయంగా భావించాలేమో అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. మొయి త్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది. మణిమేఖలైపై కేసులు నమోదు కాళీమాత వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చూపే డాక్యుమెంటరీ పోస్టర్‌ను ఆన్లైన్లో పోస్ట్చేసిన మధురైకి చెందిన దర్శకురాలు లీనా మణిమేఖలైపై 153ఏ, 295ఏ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు మంగళవారం కేసు నమోదుచేశారు. ‘కాళీ’పోస్టర్ ప్రొడ్యూసర్ ఆశా అసోసియేట్స్, ఎడిటర్ శ్రవణ్ ఓనచంద్, మణిమేఖలైపై లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. చదవండి: (కాంగ్రెస్‌లో చేరినవారికి టికెట్ల హామీ ఇవ్వట్లేదు) -
అంత కోపం వద్దు...ప్రేమతో మాట్లాడండి; మీరేమీ మోరల్ సైన్స్ టీచర్ కాదు!
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంపై జరిగిన ధన్యవాద తీర్మానంలో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ నేత మహువా మోయిత్రా వివిధ సమస్యల పట్ల ప్రభుత్వ తీరు పై నిప్పులు చెరిగారు. దీంతో లోక్ సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవి.. మోయిత్రా మాటలకు అంతరాయం కలిగిస్తూ లోక్‌సభ గౌరవార్థం "ప్రేమతో మాట్లాడండి, అంత కోపం తెచ్చుకోవద్దని కోరారు. అంతేకాదు సహనం, క్షమ, దయాలతోనే ప్రపంచం ఒక శక్తి దర్పణంలా ప్రకాశిస్తోందని కూడా అన్నారు. దీంతో మోయిత్రా ఒకింతా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాదు ఆమె సోషల్‌మీడియా వేదికగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు మోయిత్రా మాట్లాడుతూ.." మేము సహనం, క్షమాపణను తీసుకువస్తాం. కానీ వాటి వెనుక కొద్దిమొత్తంలో కోపంతో కూడిన ఆవేశం కూడా ఉంటుంది. నేను కోపంతో కాక ప్రేమతో మాట్లాడాలి అంటూ ఉపన్యాసాలివ్వడానికి మీరెవరని ప్రశ్నించారు. మీరు నిబంధనల నిమిత్తమే నన్ను సరిదిద్దగలరు. మీరేమీ లోక్‌సభకు మోరల్ సైన్స్ టీచర్ కాదు అంటూ ట్విట్టర్లో ఘాటుగా విమర్శించారు. (చదవండి: నా నియోజకవర్గమే నా పెద్ద కుటుంబం: గనీవ్ కౌర్) -
‘కేంద్రం చరిత్రను మారుస్తోంది’
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చరిత్రనే మార్చేయడానికి ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మొహువా మొయిత్రా దుయ్యబట్టారు. గురువారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. వర్తమానంపై అపనమ్మకం, భవిష్యత్తు పట్ల భయం కేంద్రం చర్యల్లో అడుగడుగునా కన్పిస్తున్నాయని, ఈ ప్రభుత్వం బారినుంచి దేశా న్ని కాపాడటం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. చదవండి: రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించడం లేదు: అమెరికా -
సొంత పార్టీ ఎంపీకి పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చిన మమత
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సొంత పార్టీ మహిళా ఎంపీ మహువా మోయిత్రాకు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులు కడితే సహించేది లేదని స్పష్టం చేశారు. నదియా జిల్లాలో తృణమూల్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పార్టీ నేతలకు మమత గట్టి హెచ్చరిక జారీ చేశారు. నదియా జిల్లాలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ నాయకులు విభేదాలు పక్కనపెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఆధిపత్యం కోసం రచ్చకెక్కితే వేటు తప్పదని హెచ్చరించారు. ‘మహువా.. నేను ఇక్కడ ఒకటే స్పష్టం చేస్తున్నాను. ఎవరికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనేది నాకు అవసరం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరిని పోటీకి దింపాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి శాశ్వతంగా ఒక స్థానంలో ఉంటాడని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాల’ని అన్నారు. ఆ సమయంలో వేదికపైనే మొయిత్రా.. మమతా బెనర్జీ వెనుక కూర్చున్నారు. కాగా, పార్టీ నదియా జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి ఇటీవలే ఆమెను తొలగించారు. (చదవండి: తొలిసారి ఆ రాష్ట్ర పర్యటనకు.. భారీగా భద్రతా ఏర్పాట్లు ) టీఎంసీ నాయకత్వంలోని ఓ వర్గం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఇటీవల పోస్టర్లు వెలిసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పోలీసు విచారణలో తేలినట్టు మమత తెలిపారు. పథకం ప్రకారం మీడియాను తప్పుదారి పట్టించారని, దీని వెనుక ఎవరున్నారో తనకు తెలుసని అన్నారు. త్వరలో స్థానిక సంస్థలు జరగనున్న నేపథ్యంలో ‘దీదీ’ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (చదవండి: లోహాఘాట్ అసెంబ్లీ సీటు ఎవరిది? పోటాపోటీగా..)