కోల్కతా: కోల్‌కతాలో ఆర్‌జీ మెడికల్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతోంది. దీనికి నిరసనగా నేడు(మంగళవారం) కోల్కతా సచివాలయం నవన్ అభియాన్ ముట్టడికి జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. మరోవైపు దీనిని అడ్డుకునేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సచివాలయం వద్ద ర్యాలీకి అనుమతి లేదని బెంగాల్ పోలీసులు తేల్చి చెప్పారు.
తాజాగా వైద్యురాలి ఘటనపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఈ దారుణమైన హత్యాచారంపై న్యాయం కోరే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఈ విషయంలో మీరు, మేము అని కాకుండా అందరూ తమ కూతుళ్ల కోసం రక్తం చిందిస్తారని, న్యాయం కోసం పోరాడుతారని తెలిపారు.
కాగా వైద్యురాలి ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహువా ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇది సామూహిక అత్యాచారం కాదు, ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. హడావిడిగా దహన సంస్కారాలు చేయలేదు. పోస్టుమార్టం వీడియో తీశారు. 12 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఓ మృగం చేతిలో అత్యాచారానికి గురైన మన 31 ఏళ్ల కుమార్తె కోసం మనమంతా రక్తమోడుతున్నాం. మీరు, మేము కాదు. సత్వర విచారణ, న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పండి’’ అని మహువా ట్వీట్ చేసింది.
It wasn’t a gangrape, there were no fractures, no hurried cremation & autopsy was videographed. Killer was caught within 12 hours & CBI is in charge of case. All of us bleed for our 31 year old daughter who was raped by this animal. There is no “us” & no “them”. Everybody wants…
— Mahua Moitra (@MahuaMoitra) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment