కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్.. తాను నిర్ధొషినని చెబుతున్నాడు. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను ఇరికిస్తుందని ఆరోపించాడు. తన మాట ఎవరూ వినడం లేదని, పోలీస్ అధికారులు తనను భయపెడుతున్నారని తెలిపాడు.
కాగా నిందితుడు సంజయ్‌రాయ్‌ను సోమవారం సీబీఐ అధికారులు సీల్డా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత కోర్టునుంచి వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్తుండగా.. వ్యాన్‌లో నుంచే మీడియాతో మాట్లాడాడు సంజయ్ రాయ్. నేను ఏ నేరం చేయలేదంటూ గట్టిగా కేకలు వేస్తూ చెప్పాడు. ప్రభుత్వం తనను ఇరికించి నోరు విప్పకుండా బెదిరిస్తోందన్నారు.
మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరికి మహిళలు కూడా మద్దతు తెలిపారు. భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురి అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఎనభై ఏడు రోజుల తర్వాత కోల్‌కతా కోర్టు సోమవారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై అభియోగాలు మోపింది. ఈ కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు వెల్లడించింది. రాయ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు), 103 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment