Sanjay
-
గణతంత్ర పరేడ్‌లో తొలిసారిగా సంజయ్, ప్రళయ్!
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌లో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ వంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలతోపాటు తొలిసారిగా యుద్ధ నిఘా వ్యవస్థ ‘సంజయ్’, వ్యూహాత్మక క్షిపణి ‘ప్రళయ్’ కనిపించనున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన 40 యుద్ధ విమానాలు, తీరరక్షక దళంలోని 3 డోర్నియర్ విమానాలు ఆకాశంలో విన్యాసాలతో వైమానిక దళ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి. పరేడ్ కమాండర్‌గా ఢిల్లీలోని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ భవ్నీశ్, పరేడ్ సెకండ్ –ఇన్–కమాండ్‌గా ఢిల్లీ ప్రాంత చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ సుమిత్ మెహతా వ్యవహరిస్తారు. టి–90 భీష్మ ట్యాంకులు, బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, నాగ్ క్షిపణి వ్యవస్థ ఇందులో పాలుపంచుకుంటాయి. పరేడ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 15 శకటాలు పాల్గొంటాయి. ఇందులో డీఆర్డీవోకు చెందిన పలు అంచల రక్షణ వ్యవస్థ ‘రక్షా కవచ్’కూడా ఉంటుందని రక్షణ శాఖ గురువారం వివరించింది. మొట్టమొదటిసారిగా త్రివిధ దళాల శకటం కూడా ఇందులో ఉంటుందన్నారు. ఈ వేడుకల ప్రధాన అతిథి ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంతో కాగా, ఆదేశం నుంచి కూడా ఒక బ్యాండ్ జట్టు పరేడ్‌లో కలిసి నడుస్తుందన్నారు. కార్గిల్ యుద్ధ వీరులైన ఇద్దరు పరమ వీర చక్ర గ్రహీతలు, ఒక అశోక చక్ర గ్రహీత కూడా పరేడ్‌లో భాగస్వాములవనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాలు కొనసాగి, దేశ వారసత్వం, అభివృద్ధి పయనాన్ని కళ్లకు కడుతుందని అధికారులు తెలిపారు. -
దోషి సంజయ్ రాయ్ కు మరణశిక్ష విధించాలంటూ దీదీ సర్కార్ పిటిషన్
-
సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన సీల్దా కోర్టు
-
ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచారం కేసులో.. సంజయ్ రాయ్‌కి మరణశిక్ష పడకపోవడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన కేసు కాదనే ఉద్దేశంతోనే అంతటి శిక్ష వేయడం లేదని సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కంటికి కన్నులాగా.. ప్రాణానికి ప్రాణం తీయడమే సరైందని.. న్యాయస్థానం ఆ అంశాల్ని పరిశీలించి ఉండాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో బెంగాల్లోనే చర్చనీయాంశమైన కేసుల్ని ప్రస్తావిస్తున్నారు.కిందటి ఏడాది ఆగష్టులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారోదంతం.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టడంతో వైద్య సేవలపైనా ప్రభావం పడడమే అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనే వాదనను ఈ కేసు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సర్కార్ అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టం చేసుకుంది కూడా. కానీ, దోషికి సరైన శిక్ష పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఆర్జీకర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించాయి పశ్చిమ బెంగాల్ న్యాయస్థానాలు.1. ఆగష్టు 2023లో మతిగరలో 16 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అతనికి సిలిగూరి కోర్టు కిందటి ఏడాది సెప్టెంబర్ 21న మరణశిక్ష విధించింది.2. 2023 ఏప్రిల్‌లో.. తిల్జల ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన ఆ మానవమృగానికి మరణశిక్ష విధించింది కోల్కత్తా కోర్టు.3. కిందటి ఏడాది అక్టోబర్‌లో కుల్తలి ఏరియాలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డ వ్యక్తికి.. డిసెంబర్ 6వ తేదీన కోర్టు మరణశిక్ష విధించింది.4. డిసెంబర్ 13వ తేదీన.. తొమ్మిదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడికి మరణశిక్ష విధించింది ఫరక్కా కోర్టు.5. కిందటి ఏడాది నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడి ప్రాణం తీసిన కిరాతకుడికి ఆదివారం(జనవరి 20న) హూగ్లీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.ఈ ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించిన న్యాయస్థానాలు.. ఆర్జీకర్ కేసు, ఆ కేసులో చోటుచేసుకున్న పరిణామాలను ఎందుకు అంతతీవ్రమైనవిగా పరిగణించలేకపోయిందనేది పలువురి ప్రశ్న. అయితే దీనికి న్యాయ నిపుణులు వివరణ ఇస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షలు కేవలం బాధితురాలికో, ఆమె కుటుంబానికో మాత్రమే కాదు.. యావత్ సమాజానికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని పంపిస్తాయి. మహిళలు, మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో కలిగే అభద్రతాభావాన్ని తొలగించే అడుగు అని అన్నారు. అయితే.. పైన చెప్పుకున్న అన్ని కేసులు మైనర్లపై జరిగిన అఘాయిత్యాలే. తీర్పులు ఇచ్చిన అన్ని కోర్టులు.. పోక్సో న్యాయస్థానాలే. పైగా ఈ కేసులన్నింటిలో బాధిత చిన్నారులకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో నేరానికి పాల్పడిన వాళ్లకు పరిచయాలు ఉన్నాయి. నమ్మి వెంట వెళ్లిన చిన్నారులను చిధిమేశాయి ఆ మానవమృగాలు. పైగా ఈ కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అత్యంత అరుదైన కేసులుగా ఆయా న్యాయస్థానాలు గుర్తించాయి అని చెబుతున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ. మతిగర, కుల్తలి, ఫరక్కా కేసుల్లో స్వయంగా ఈయనే వాదనలు వినిపించారు. పై ఐదు కేసుల్లో మరణశిక్షలను, అలాగే ఆర్జీకర్ కేసుల్లో యావజ్జీవ కాగారార శిక్షను న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రజాభిప్రాయాలు.. న్యాయవ్యవస్థలను ఎంతమాత్రం ప్రభావితం చేయబోవని చెబుతున్నారు. అలాగని.. ఆ ఆందోళనలను గనుక పరిగణనలోకి తీసుకుని కోర్టులు సత్వర న్యాయానికి ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిదికాదని అంటున్నారు.అత్యంత అరుదైన కేసంటే.. మన దేశంలో అంత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షలు విధిస్థాయి న్యాయస్థానాలు. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు తొలిసారి ఈ తరహా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ముగ్గురిని హతమార్చాడనే అభియోగాల కింద బచ్చన్ సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా.. హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది.ఐపీసీ సెక్షన్ 302 రాజ్యాంగబద్ధతతో పాటు సీఆర్పీసీలోని సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్షలకు ప్రత్యేక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలను ఈ కేసు సవాల్ చేసింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ వైసీ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 1980 ఆగష్టు 16వ తేదీన తీర్పు వెల్లడించింది. కింది కోర్టులు విధించిన మరణశిక్షను సమర్థించింది.భారతీయ న్యాయవ్యవస్థకు ‘‘అత్యంత అరుదైన కేసు’’ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టింది ఈ తీర్పు. నేర తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను, మానవ హక్కులను గౌరవించడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అంతిమ మార్గంగా మరణశిక్షలు విధించాలని తీర్పు సమయంలో రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తర్వాతి కాలంలో భారతీయ కోర్టులకు మార్గదర్శకంగా మారింది.అంత్యత అరుదైన కేసులకు వర్తించేవి ఇవే..నేర తీవ్రతనేరానికి పాల్పడ్డ తీరు, ఉద్దేశాలుఆ నేరం.. సమాజంపై చూపించే ప్రభావంనేరస్తుడి వయసు, కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులునేరస్థుడిలో జైలు జీవితం పరివర్తన తీసుకొచ్చే అంశాల పరిశీలనమన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో మరణశిక్షలు పడ్డవెన్నో. వాటిల్లో కోల్‌కతాలో స్కూల్ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ ఛటర్జీ(1990)కి, నిర్భయ ఘటన(2012)లో, 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌లకు అత్యంత ప్రముఖమైన కేసులుగా నిలిచాయి.అయితే.. అత్యంత అరుదైన కేసుల్లో సాధారణంగా కింది కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. వాళ్లు పైకోర్టులకు వెళ్లినప్పుడు.. ఊరట లభించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి అని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ జయంత మిత్రా అంటున్నారు. ఆర్జీకర్ కేసులోనూ నిందితుడు పైకోర్టులో తనకు పడ్డ జీవితఖైదు శిక్షనూ సవాల్ చేసే అవకాశం లేకపోదని చెబుతున్నారాయన. -
సంజయ్‌కు జీవిత ఖైదు
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ బోధనాస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవితఖైదు పడింది. స్థానిక సీల్దా కోర్డు సోమవారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. దోషిగా ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను, సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది ఆ కోవకు వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ అభిప్రాయపడ్డారు. 2024 ఆగస్ట్ 9న బోధనాస్పత్రి సెమినార్ హాల్లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపేయడం తెలిసిందే. కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్‌గా పనిచేసిన సంజయ్‌ను ఈ కేసులో దోషిగా జడ్జి శనివారం నిర్ధారించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 64 (అత్యాచారం), 66 (మరణానికి కారణమవడం), 103 (1) (హత్య) కింద దోషిగా తేల్చారు. సోమవారం మధ్యాహ్నం శిక్ష ఖరారు చే శారు. నిందితుడు, బాధితురాలి కుటుంబం, సీబీఐ ల వాదనలు విన్నమీదట తీర్పు వెలువరించారు. సంజయ్ బతికినంతకాలం జైళ్లోనే గడపాలని పే ర్కొన్నారు. అతనికి రూ.50,000 జరిమానా కూడా విధించారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ‘‘బాధితురాలు విధి నిర్వహణలో చనిపోయినందున రూ.10 లక్షలు, అత్యాచారానికి గురైనందుకు రూ.7 లక్షలు ఆమె కుటుంబానికి పరిహారమివ్వాలి’’ అని పేర్కొన్నారు. తీర్పును హైకోర్టులో సవాల్ చేసే వీలుంది.అప్పీలు చేస్తాం: బాధిత కుటుంబం జీవితఖైదుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘దోషికి ఉరిశిక్ష వేయాల్సిందే. మాకు పరిహారం ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు. సరైన న్యాయం కోసం పై కోర్టును ఆశ్రయిస్తాం. నేరంలో ఇతర భాగస్వాములను వదిలేశారు. ఇది అత్యంత అరుదైన కేసు కాదా? వైద్యురాలు విధి నిర్వహణలో అత్యాచారానికి, హత్యకు గురైంది. దీనివెనక పెద్ద కుట్ర దాగుంది’’ అని జూనియర్ వైద్యురాలి తండ్రి అన్నారు. ‘‘నష్టపరిహారం మాకు వద్దు. మిగతా నేరస్తులూ బోనెక్కేదాకా పోరాడతాం’’ అన్నారు. వైద్యురాలి తల్లి కోర్టుకు రాలేదు. తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మీరంతా వెళ్లిపొండి’’ అంటూ మీడియా ప్రతినిధులపై ఆగ్రహించారు. ‘‘ఘటన జరిగినప్పుడు సంజయ్‌తో పాటు మరికొందరు ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో కచ్చితంగా ఇతరుల పాత్ర ఉంది. వాళ్లనూ చట్టం ముందు నిలబెట్టాలి’’ అని వైద్యురాలి అక్కలు డిమాండ్ చేశారు.వైద్యుల తీవ్ర అసంతృప్తి పని ప్రదేశాల్లో తమ భద్రత గాల్లో దీపమని చాటిచెప్పిన ఈ ఉదంతంలో దోషికి ఉరిశిక్ష పడక పోవడం దారుణమంటూ ఆర్జీ కర్ ఆస్పత్రి వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ఒక్కని పని కాదు. వ్యవస్థీకృత నేరమిది. ఈ కుట్రలో చాలామంది పాత్ర ఉంది. పరిహారం ప్రకటించేసి జీవితఖైదు విధించడం అసంబద్ధం. తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తాం’’ అని సీనియర్ వైద్యుడు రాజీవ్ పాండే అన్నారు. మా వాళ్లయితే ఉరి వేయించేవాళ్లు: మమత తామైతే ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి కచ్చి తంగా ఉరిశిక్ష వేయించేవాళ్లమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘‘మేమంతా దోషికి ఉరిశిక్షే కోరుకున్నాం. కేసును సీబీఐ మా నుంచి బలవంతంగా లాక్కుంది. సమగ్రంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. గట్టిగా వాదించలేదు. కోల్‌కతా పోలీసులైతే సమగ్రంగా దర్యాప్తు చేసేవాళ్లు’’ అన్నారు. మమత వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినందుకు అసలు కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను, వెనకుండి సహకరించిన మమతను విచారించాలి’’ అని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన మర్నాడు సంజయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేయడం తెల్సిందే. విచారణ నత్తనడకన సాగుతోందని, బోధనాస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను, ఇతరలను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి బదిలీచేసింది. -
సీబీఐ వల్లే ఇలా జరిగింది.. కోర్టు తీర్పు సంతృప్తిగా లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ కేసులో తాము.. దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాము. కోర్టు తీర్పు విషయంలో సంతృప్తి చెందలేదని వెల్లడించారు.ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో కోర్టులపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. మేమంతా దోషి సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశాం. కానీ, కోర్టు మాత్రం జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు విషయంలో మేము అసంతృప్తిగానే ఉన్నాం. ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బలవంతంగా బదిలీ చేశారు. సీబీఐ కారణంగానే ఇలా జరిగింది. ఒకవేళ వారి చేతుల్లోనే ఉంటే మరణశిక్ష పడేలా పోలీసులు శాయశక్తులా ప్రయత్నించేవారు. బాధితురాలికా న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. జీవిత ఖైతు చిన్న శిక్ష వంటిది. ఇలాంటి నేరస్థులను తప్పకుండా ఉరితీయాలి’ అని డిమాండ్ చేశారు. VIDEO | RG Kar rape and murder case: Here's what West Bengal CM Mamata Banerjee (@MamataOfficial) said on Sealdah Court sentencing convict Sanjoy Roy to life term till death. "We have been demanding death sentence to the convict since Day 1 and we are still demanding the… pic.twitter.com/DdJBpJoZ4H— Press Trust of India (@PTI_News) January 20, 2025ఇదిలా ఉండగా.. ఆర్జీకర్ వైద్యుర్యాలి కేసులో తీర్పును వెల్లడిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని తెలిపింది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించగా.. ఇది అరుదైన కేసు అని.. అతడికి మరణ శిక్ష విధించాలని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఇక, శనివారం న్యాయస్థానం సంజయ్‌ను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే, దోషికి జీవిత ఖైదు విధించడమే కాకుండగా.. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు.. సంజయ్‌కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: కోల్కత్తా కేసు వివరాలు ఇలా.. -
ఆర్జీకర్ ఘటనలో తీర్పు.. కోర్టు హాలులో కన్నీటి రోదనలు
కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది సీల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. అయితే జడ్జి తీర్పు చదువుతుండగా.. ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువుల కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది.‘‘నేను ఈ పని చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. తప్పు చేసినవాళ్లను ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?. ఏ తప్పూ చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు?’’ అంటూ గట్టిగా రోదించాడు. ఆ సమయంలో జడ్జి అనిర్బన్ దాస్ కలుగజేసుకుని చేసుకుని ‘‘నువ్వేమైనా మాట్లాడదల్చుకుంటే సోమవారం శిక్ష ఖరారు చేసే సమయంలో అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ సైలెంట్ అయ్యాడు.మరోవైపు.. తీర్పు వెలువడుతున్న టైంలోనే బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘న్యాయాన్ని రక్షించి.. మీపై నాకున్న నమ్మకం నిలబెట్టుకున్నారు. మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్నారు సర్’’ అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాధితురాలి తరపున వచ్చినవాళ్లంతా చప్పట్లు కొట్టారు. దీంతో.. జడ్జి నిశబ్దం పాటించాలంటూ అంటూ గావెల్(సుత్తి)తో మందలించారు.తీర్పు వెలువడక ముందు సీల్దా(Sealdah) కోర్టు ప్రాంగణంలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సంజయ్‌ను గట్టి భద్రతా మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్లంతా కోర్టు బయట ఉండి సంఘీభావం ప్రకటించారు. అయితే.. తీర్పు అనంతరం బాధితురాలి తరఫున పోరాడిన సంఘాలు, ఇతరులు లాయర్లతో కలిసి స్వీట్లు పంచడంతో సందడి కనిపిచింది.కోల్‌కతాలోని రాధా గోబిందా కర్(RG Kar) మెడికల్ కాలేజీ సెమినార్లో కిందటి ఏడాది ఆగష్టు 7వ తేదీన ఓ వైద్యవిద్యార్థిని(31) అర్ధనగ్నంగా విగతజీవిగా కనిపించింది. ఈ ఘోరం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వైద్య సిబ్బంది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. మూడు రోజుల తర్వాత(ఆగష్టు 10న) సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈలోపు ఘటనాస్థలంలోకి నిరసనకారులు దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమేననే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. బాధితురాలికి అండగా దేశం మొత్తం కదలడంతో.. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ కేసును ‘అభయ’గా మీడియా అభివర్ణించడం మొదలుపెట్టింది. ఇక.. ఈ ఘటనలో రాయ్ ఒక్కడే లేడని, ఇంకొందరి ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఇటు కోల్‌కతా పోలీసులు, ఆపై సీబీఐ కూడా రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాయి. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. అయితే బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ అంశాన్ని కూడా పరిశీలించింది. మరోవైపు.. అక్టోబర్ 7, 2024 సీల్దా కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్ ఆధారంగా సీల్దా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ దాకా.. నిందితుడి ఇన్‌కెమెరా ట్రయల్ జరిగింది. ఆ టైంలో 50 మంది సాక్షులను విచారించారు. చివరకు.. ఆర్జీకర్ హత్యాచార కేసులో వలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్ పాత్రను సీబీఐ నిర్ధారించగా.. సీల్దా కోర్టు ఇవాళ దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అన్నివిషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బీఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది కోర్టు. దీంతో సంజయ్‌కు మరణశిక్షగానీ, జీవితఖైదుగానీ పడే అవకాశాలే ఉన్నాయని జడ్జి వెల్లడించారు. -
కాగ్ చీఫ్ గా సంయ్ మూర్తి ప్రమాణస్వీకారం
-
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: హరీశ్‌రావు
సాక్షి,జగిత్యాల: రైతు సీఎం కేసీఆర్ అయితే,బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న హరీష్‌రావు మాట్లాడారు.‘ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలు చూసిండు కాబట్టే పాదయాత్ర చేపట్టిండు. ధాన్యం దళారుల పాలైపోయింది. రూ.500 బోనస్ ఇస్తానన్నాడు. బోనస్‌తో కలిపి 2820 రూపాయలు క్వింటాలుకు అందాల్సి ఉంటే పద్దెనిమిది,పందొమ్మిది వందలకే దళారులకు అమ్ముకుంటున్రు.వడ్లు కొన్న 24 గంటల్లో పైసలు పడాలని నాడు కేసీఆర్ చెబుతుండే.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలెక్కువ,పని తక్కువ. ఎన్నికల సమయంలో కూడా రైతుల విషయంలో రాజకీయం చేసిన్రు, రైతుబంధు విషయంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన్రు. ఈ సర్కారు వచ్చాక ఒక్క విడత కూడా రైతుబంధు పడలే. దాన్ని ప్రశ్నించడానికే మా సంజయ్ పాదయాత్ర చేసిండు.అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాండ్ పేపర్లు రాసిచ్చిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒట్లు పెట్టిండు రేవంత్. రైతు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా అన్నడు. రుణమాఫీ అయిందా..?రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కొందరు రైతుల మిత్తీ పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.రైతుబంధుకు, రుణమాఫీకి డబ్బుల్లేవంటగానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్ల ఖర్చు పెడతానంటుండు రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిన ఘనత కేసీఆర్‌ది. మా సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే..రేపు ముందర ఉంది 70 ఎంఎం సినిమా.జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తిగా దండోరా ప్రకటించాం’అని హరీశ్‌రావు అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీలో హీట్.. ఇటు కేటీఆర్..అటు రేవంత్.. గవర్నర్ కూడా -
కోల్‌కతా వైద్యురాలి కేసులో బిగ్ ట్విస్ట్
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్.. తాను నిర్ధొషినని చెబుతున్నాడు. జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేయలేదని, ప్రభుత్వం కావాలనే తనను ఇరికిస్తుందని ఆరోపించాడు. తన మాట ఎవరూ వినడం లేదని, పోలీస్ అధికారులు తనను భయపెడుతున్నారని తెలిపాడు.కాగా నిందితుడు సంజయ్‌రాయ్‌ను సోమవారం సీబీఐ అధికారులు సీల్డా కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తరువాత కోర్టునుంచి వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్తుండగా.. వ్యాన్‌లో నుంచే మీడియాతో మాట్లాడాడు సంజయ్ రాయ్. నేను ఏ నేరం చేయలేదంటూ గట్టిగా కేకలు వేస్తూ చెప్పాడు. ప్రభుత్వం తనను ఇరికించి నోరు విప్పకుండా బెదిరిస్తోందన్నారు.మరోవైపు ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీరికి మహిళలు కూడా మద్దతు తెలిపారు. భారీగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పలువురి అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఎనభై ఏడు రోజుల తర్వాత కోల్‌కతా కోర్టు సోమవారం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై అభియోగాలు మోపింది. ఈ కేసులో రోజువారీ విచారణ నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతుందని కోర్టు వెల్లడించింది. రాయ్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు), 103 (హత్యకు శిక్ష) కింద కేసు నమోదైంది. -
ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్
-
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
Sanjay Rajaram Raut: పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్‌రౌత్‌కు బిగ్ షాక్
-
రాష్ట్రంలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం
సాక్షి, హైదరాబాద్/ గాంధీ ఆస్పత్రి: రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని.. మాతాశిశు మరణాలు, విషజ్వరాలు పెరిగిపోతు న్నాయని బీఆర్ఎస్ ‘ప్రజారోగ్య కమిటీ’ మండిప డింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, ఎమర్జెన్సీ పాలన అని ఆరోపించింది. గాంధీ ఆస్ప త్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తే పోలీ సులు అడ్డుకోవడం దారుణమని మండిపడింది.గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. నేతల అరెస్టులు..ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితుల అధ్యయనం కోసం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ టి.రాజయ్య నేతృత్వంలో.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌లతో కమిటీని వేసింది. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ నుంచి గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని.. మాతాశిశు మరణాలపై నిజనిర్ధారణ చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. అయితే కమి టీకి నేతృత్వం వహిస్తున్న టి.రాజయ్యను పోలీ సులు ఉదయమే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గృహ నిర్బంధం చేశారు. మిగతా ఇద్దరు సభ్యులు డాక్టర్ సంజయ్, డాక్టర్ మెతుకు ఆనంద్ పోలీసుల కళ్లు గప్పి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మరికొందరు పార్టీ నేతలతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులు వారిని ఆస్పత్రి ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరగ డంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు మాగంటి గోపీనాథ్, సంజయ్, మెతుకు ఆనంద్ లను అరెస్టు చేసి నారాయణగూడ ఠాణాకు.. ఇతర నేతలు, కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించి బొల్లారం ఠాణాకు తరలించారు. మధ్యాహ్నం తర్వాత నేతలు, కార్యకర్తలను వదిలేశారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలిగాంధీ ఆస్పత్రి ఘటన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ప్రజారోగ్య కమిటీ సభ్యులు రాజయ్య, సంజయ్, మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లా డారు. సీఎం, మంత్రుల సమీక్ష లేకపోవడంతో.. రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని రాజయ్య ఆరోపించారు. నిజనిర్ధారణ కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు.రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం నిద్రపోతోందని డాక్టర్ సంజ య్ విమర్శించారు. ఆస్పత్రుల్లో డొల్లతనం బయట పడుతుందనే తమకు అడ్డుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. నిపుణులైన వైద్యులు లేకే, ఆస్పత్రుల్లో మరణాలు సంభవి స్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.మాతాశిశు మరణాలపై దాపరికం ఎందుకు?ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న మాతాశిశు మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాపరికంగా వ్యవహరి స్తోందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోపించారు. గాంధీ ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాము నిర్మాణాత్మక అంశాలపైనే పోరాడుతు న్నామని, ప్రతిపక్షంగా ఇది తమ బాధ్యత అని చెప్పారు. సీఎం కార్యాలయం నుంచి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు సరైన సహ కారం లేదని ఆరోపించారు. -
చిన్న వయసులోనే సీయీవో అయ్యారు!
ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు ఈ బ్రదర్స్.ఫ్రెండ్స్ ఈరోజు మనం చెన్నైకి చెందిన శ్రావణ్, సంజయ్ బ్రదర్స్ గురించి తెలుసుకుందాం. పది, పన్నెండేళ్ల వయసులోనే ఈ బ్రదర్స్ ఒక యాప్‌ను డెవలప్ చేసి బోలెడు పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు...‘గో డైమన్షన్స్’ పేరుతో ఒక కంపెనీని మొదలుపెట్టారు. యంగెస్ట్ సీయీవోలుగా దేశం దృష్టిని ఆకర్షించారు.వారి తండ్రి కుమరన్ సురేంద్రన్ వల్ల శ్రావణ్, సంజయ్‌లకు సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరిగింది.‘కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి?’ నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు తండ్రి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునేవారు.టెక్నాలజీకి సంబంధించిన విషయాలను చందమామ కథల్లాగా ఆసక్తిగా వినేవారు.ఏ మాత్రం సమయం దొరికిన కంప్యూటర్లో రకరకాల కొత్త విషయాల గురించి తెలుసుకునేవారు.అలా ఎన్నో యాప్‌ల గురించి తెలుసుకున్నారు.కొత్త కొత్త యాప్‌ల గురించి తెలుసుకునేటప్పుడు తమకు కూడా యాప్ తయారు చేయాలనిపించింది.‘క్యాచ్ మీ కాప్’ పేరుతో ఈ బ్రదర్స్ రూపోందించిన యాప్‌కు మంచి పేరు వచ్చింది. ఇది పిల్లల ఆటలకు సంబంధించిన యాప్. దీంతో పాటు రూపోందించిన ఎడ్యుకేషన్ యాప్ ‘అల్ఫా బెట్’. ఎమర్జెన్సీ సర్వీస్ యాప్ ‘ఎమర్జెన్సీ’ గేమింగ్ యాప్ ‘సూపర్ హీరో అండ్ కార్ రేసింగ్ ఒకటి కాదు రెండు కాదు 150 యాప్స్ క్రియేట్ చేశారు.ఫ్రెండ్స్, శ్రావణ్, సంజయ్ గురించి మీరు చదివారు కదా... మరి మీ గురించి కూడా గొప్పగా రాయాలంటే.... మీరు కూడా ఏదైనా సాధించాలి. మరి ఒకేనా! -
‘సంజయ్ రాయ్‌పై నార్కో టెస్ట్ వద్దు’
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్యకళాశాల జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలసిస్ పరీక్ష చేసేందుకు కోల్‌కతా కోర్టును సీబీఐ అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఆ కుటుంబాలకు ఆర్థికసాయం జూనియర్ వైద్యుల సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యం అందక మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం ముందుకొచి్చంది. 29 మంది మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షలు ఇస్తామని సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రపతి, ప్రధానికి జూడాల లేఖ ఈ ఉదంతంలో స్వయంగా కలగజేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాలకూ పంపించారు. ‘‘ అత్యంత జుగుప్సాకరమైన నేరానికి మా తోటి సహాధ్యాయి బలైంది. న్యాయం జరిగేలా మీరు జోక్యం చేసుకోండి. అప్పుడే ఎలాంటి భయాలు లేకుండా మళ్లీ మా విధుల్లో చేరతాం’’ అని ఆ లేఖలో జూనియర్ వైద్యులు పేర్కొన్నారు. -
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
ఆవిష్కరణలు, పరిశోధనలకు ఎస్బీఐ సహకారం
సాక్షి, విశాఖపట్నం : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పంథాలో వినియోగిస్తోందని, కేవలం విద్య, వైద్యంపైనే కాకుండా.. ఆవిష్కరణలు, పరిశోధనలకు చేయూతనిస్తోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ (ఎస్బీఐఎఫ్) ఎండీ సంజయ్ ప్రకాష్ తెలిపారు. ఇక్కడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఎస్బీఐఎఫ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఎక్స్ఆర్డీ ఎనలైటికల్ ల్యాబ్‌ని ఆయన ఐఐపీఈ డైరెక్టర్ ప్రొ.శాలివాహన్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ ప్రకాష్ ‘సాక్షి’తో స్టేట్ బ్యాంక్ ఫౌండేషన్ గురించి పలు విషయాలు వెల్లడించారు.పరిశోధనలకు ప్రాధాన్యంకార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఎస్బీఐ దశాబ్దాలుగా సేవలందిస్తోంది. లాభాల్లో ఒక శాతం సామాజిక సేవకు కేటాయిస్తున్నాం. గతేడాది రూ.61 వేల కోట్ల లాభాలొచ్చాయి. ఏటా లాభాలు పెరుగుతున్నకొద్దీ సీఎస్ఆర్ కార్యక్రమాలు పెంచుతున్నాం. ఇప్పటివరకు విద్య, వైద్యం, పర్యావరణం, నీటి నిర్వహణ, గ్రామీణాభివృద్ధి తదితర విభాగాల్లో సీఎస్సార్ నిధులు వెచ్చించాం. కానీ.. దేశ భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైన పరిశోధనలకూ చేయూతనందించాలని నిర్ణయించాం. అదేవిధంగా యువత ఆవిష్కరణలకు ఆర్థికంగా దన్నుగా నిలబడుతున్నాం. ఐదేళ్లుగా ఈ తరహా కార్యక్రమాలు విస్తృతం చేశాం. ఇప్పటికే ఐఐటీ బాంబే, ఐఐఎస్సీ బెంగళూరు, సీ–క్యాంప్ బెంగళూరు, ఇక్రిశాట్ మొదలైన సంస్థలకు సహకారం అందిస్తున్నాం. ఎస్బీఐఎఫ్ ద్వారా అనేక ఆవిష్కరణలు, పరిశోధనలు జరగడం మాకూ గర్వకారణంగానే ఉంది.ఏపీలో తొలిసారిగా..అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్బీఐఎఫ్ సేవలు ప్రముఖ సంస్థలకు అందాయి. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ ఐఐపీఈతో భాగస్వామ్యమయ్యాం. చమురు పరిశోధనలకు ఐఐపీఈకి సహకారం అందించేందుకు ఎక్స్ఆర్డీ ల్యాబ్ ఏర్పాటు చేశాం. వాస్తవానికి ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ప్రతిపాదనలకు ఎవరైనా కొంత తగ్గించి నిధులు కేటాయిస్తారు. ఎస్బీఐఎఫ్ మాత్రం ఇందుకు భిన్నం. ఈ ల్యాబ్ ఏర్పాటుకు రూ. రూ.2.50 కోట్లకు ప్రతిపాదనలిస్తే.. ఎస్బీఐఎఫ్ మాత్రం రూ.4 కోట్లు అందించింది. ఈ ల్యాబ్ మూడేళ్ల పాటు పరిశోధనలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టేందుకు అవసరమైన చేయూతనందిస్తున్నాం.యువతకూ ప్రోత్సాహందేశంలో సామాజిక సేవపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్స్, యంగ్ ప్రొఫెషనల్స్‌కు సాయమందించేందుకు ఎస్బీఐఎఫ్ ద్వారా ఏటా ఫెలోషిప్ ప్రొగ్రామ్ అందిస్తున్నాం. స్టేట్ బ్యాంక్ గ్రూప్‌లోని ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రొగ్రామ్ పేరుతో దేశంలో సామాజికంగా మార్పులు తీసుకురావడం లక్ష్యంగా ఎస్బీఐఎఫ్ 2011లో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దేశంలోని గ్రామాల స్థితిగతులు, అక్కడ ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎన్జీవోలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ చేయూతనందిస్తున్నాం. ఇప్పటివరకు 27 బ్యాచ్‌లలో 20 రాష్ట్రాలకు చెందిన 250కి పైగా గ్రామాల్లో 580 మంది ఫెలోషిప్ చేశారు. ఇలా.. భిన్నమైన ఆలోచనలతో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ఎస్బీఐఎఫ్ ప్రోత్సాహమందిస్తోంది. -
కోల్‌కతా కేసులో ట్విస్ట్: సంజయ్ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..
కోల్‌కతా: బెంగాల్‌లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌కి జరిపిన పాలీగ్రాఫ్ టెస్టులో కొన్ని కీలక అంశాలు వెల్లడించాడు. నేరం జరిగిన రోజున వారు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్టు నిందితుడు చెప్పుకొచ్చాడు.కాగా, ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా కోర్టు అనుమతిలో సంజయ్‌కు పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్బంగా నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వివరాలను వెల్లడించారు.నేరం జరిగిన రోజు రాత్రి జరిగింది ఇది..ఆగస్టు 8వ తేదీన రాత్రి నిందితుడు ఆసుపత్రికి చేరుకున్నాడు.11:15 PM: రాయ్ తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లాడు.బయట మద్యం సేవించి.. అనంతరం, నార్త్ కోల్‌కతాలోని సోనాగాచీ రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లారు.కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్ కోల్‌కతాలో ఉన్న చెట్లా రెడ్‌లైట్ చేరుకున్నారు.అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు. నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు.ఈ సందర్భంగా రాయ్ తన ప్రియురాలికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ.. తన నగ్న ఫొటోలను పంపాలని కోరాడు. దీంతో, ఆమె ఫొటోలను పంపించింది.అదే వీధిలో ఓ మహిళను అతడు వేధింపులకు గురిచేశాడు.కాసేపటి తర్వాత వారిద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు.ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 4:03 AM ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు(సీసీ టీవీ ఫుటేజ్ ప్రకారం) ఉన్నాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లోనే నిద్రిస్తోంది. కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అలాగే, తాను చూసే సరికే లేడీ డాక్టర్ మరణించిందని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో, ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్‌లకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి సంజయ్‌ను ప్రశ్నించారు. దీంతో, మాట మార్చిన నిందితుడు హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్టు చెప్పాడు. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సీబీఐ ఆరోపిస్తుంది. Sanjoy Roy, the prime accused in the rape and murder of a trainee doctor at Kolkata's R.G. Kar Medical College and Hospital, has reportedly claimed in a lie detector test that the victim was dead when he reached the hospital's seminar hall.Sanjay Roy was subjected to a… pic.twitter.com/N6zmkYPBd4— Shyam Awadh Yadav parody© (@shyamawadhyada2) August 26, 2024 -
‘కోల్‌కతా’ నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఆదివారం లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్‌కతాకు వచ్చారు.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్షన్ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో వాళ్లు ఏమేం చెప్పారనే వివరాలను పోలీసులు బయట పెట్టలేదు. సత్యశోధన పరీక్షలో వీళ్లు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి.ఘోష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కర్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉండగా సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఉదయమే కేంద్ర బలగాలతో ఘోష్ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచి్చంది. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ వశిష్్ట, మరో ప్రొఫెసర్, ఇంకో 12 మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఆస్పత్రికి ఔషధాలు, ఇతర ఉపకరణాలను సరఫరాచేసే వారి ఆఫీసుల్లో సోదాలు చేశారు. -
నిందితుడు సంజయ్‌ది పశు ప్రవృత్తి
న్యూఢిల్లీ/ కోల్‌కతా: ట్రైనీ పీజీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్ర ధాన నిందితుడైన సంజయ్ రాయ్ పశుప్రవృత్తిని కలిగి ఉన్నాడని సైకో అనాలసిస్ పరీక్షలో తేలింది. వైద్యురాలిపై పాశవిక రేప్, హత్యపై అతనిలో కించిత్తు కూడా పశ్చాత్తాపం లేదని, అశ్లీల చిత్రాలు విపరీతంగా చూస్తాడని సైకో అనాలసిస్‌లో తేలిందని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. “అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. రేప్, హత్యను ప్రతి చిన్న అంశంతో సహా పూసగుచ్చినట్లు వివరించాడు.ఏమాత్రం సంకోచించలేదు’అని సీబీఐ అధికారి చెప్పారు. సంజయ్ రాయ్ మొబైల్ ఫోన్లో పలు అశ్లీల చిత్రాలు పోలీసులకు లభించిన విషయం తెలిసిందే. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలు సంజయ్ రాయ్ ఘటనా స్థలి (ఆర్.జి.కర్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్) వద్ద ఉన్నట్లు నిరూపిస్తున్నాయని సీబీఐ తెలిపింది. హత్యాచారం జరిగిన ఆగస్టు 8న అర్ధరాత్రి దాటాక సంజయ్ రాయ్ తప్పతాగి ఉత్తర కోల్‌కతాలోని వేశ్యావాటికను సందర్శించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అక్కడ ఒక మహిళను నగ్న చిత్రాన్ని అడిగాడు. ఆగస్టు 9న వేకువజామున 4 గంటల ప్రాంతంలో సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నట్లు సీసీటీవీల్లో రికార్డైంది. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతని చేతిలో పోలీసు హెల్మెట్ ఉంది. రాయ్ కోల్‌కతా పోలీసు సివిల్ వాలంటీర్ అనే విషయం తెలిసిందే. రాయ్ మెడచుట్టూ బ్లూటూత్ డివైస్ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాత ఇదే బ్లూటూత్ డివైస్ క్రైమ్ సీన్లో లభించింది. దర్యాప్తులో కీలకంగా మారింది. సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. సందీప్ ఘోష్‌కు లై డిటెక్టర్ టెస్టు ఆర్.జి.కర్ ఆసుపత్రిలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకల కేసును కలకత్తా హైకోర్టు శుక్రవారం సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అప్పగించాలని ఆసుపత్రి మాజీ డిప్యూ టీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ పిటిషన్ వేయడంతో హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. మూడు వారాల్లో పురోగతి నివేదిక సమరి్పంచాలని ఆదేశిస్తూ కేసును సెపె్టంబరు 17కు వాయిదా వేసింది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ఐదుగురికి లై డిటెక్టర్ పరీక్షలు చేయడానికి స్థానిక కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. అలాగే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై పాలిగ్రాఫ్ పరీక్షకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ కార్యాకర్తలు బెంగాల్ వ్యాప్తంగా పోలీసుస్టేషన్ల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
ఆస్పత్రిలో అవినీతి జలగ
కోల్‌కతా: కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతం వేళ ఆ ఆస్పత్రి తాజా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. గతంలో ఆయన పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని అదే ఆస్పత్రి మాజీ డెప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఒక జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘సందీప్ సెక్యూరిటీ సిబ్బందిలో నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు. ఆస్పత్రి, వైద్యకళాశాలలోని అనాథ మృతదేహాలను సందీప్ అమ్ముకునేవాడు. దీనిపై కేసు నమోదైంది. తనకు సెక్యూరిటీగా ఉండే బంగ్లాదేశీలతో కలిసి సిరంజీలు, గ్లౌజులు, బయో వ్యర్థ్యాలను రీసైకిల్ చేసి బంగ్లాదేశ్‌కు తరలించి సొమ్మ చేసుకునేవారు. నేను గతేడాది వరకు ఆస్పత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా ఉండగా సందీప్ అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశా. దీనిపై ఏర్పాటుచేసిన దర్యాప్తు కమిటీలో నేనూ ఉన్నా. సందీప్‌ను దోషిగా తేల్చినా చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖకు నివేదిక పంపిన రోజు నన్ను, కమిటీలోని ఇద్దరు సభ్యులను బదిలీచేశారు. ఈయన నుంచి విద్యార్థులను కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యా’’ అని అఖ్తర్ అన్నారు.ప్రతి టెండర్లో 20 శాతం కమిషన్‘‘ ఆస్పత్రి, వైద్యకళాశాల పరిధిలో చేపట్టే ప్రతి టెండర్ ప్రక్రియలో సందీప్ 20 శాతం కమిషన్ తీసుకునేవాడు. తనకు అనుకూలమైన సుమన్ హజ్రా, బిప్లబ్ సింఘాలకు ఈ టెండర్లు దక్కేలా చూసేవాడు. సుమన్, సింఘాలకు 12 కంపెనీలు ఉన్నాయి. ఏ టెండర్ అయినా వారికి రావాల్సిందే. డబ్బులు ఇచ్చిన వైద్య విద్యార్థులనే పాస్ చేసేవాడు. లేకుంటే ఫెయిలే. తర్వాత డబ్బులు తీసుకుని మళ్లీ పాస్ చేయించేవాడు. ‘శక్తివంతమైన’ వ్యక్తులతో సందీప్‌కు సత్సంబంధాలున్నాయి. అందుకే రెండు సార్లు బదిలీచేసినా మళ్లీ ఇక్కడే తిష్టవేశాడు’’ అని అఖ్తర్ చెప్పారు.కొత్త ప్రిన్సిపల్ తొలగింపుకోల్కతా: వైద్య విద్యార్థుల డిమాండ్ మేరకు ఆర్జి కర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను బెంగాల్ ప్రభుత్వం తొలగించింది. వైస్–ప్రిన్సిపల్ బుల్బుల్, మరో ఇద్దరిని కూడా తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ‘‘మా కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్ పత్తా లేరు. మాకు సంరక్షకురాలి వ్యవహరించాల్సిన ఆమె ఆర్జి కర్ ఆసుపత్రిలో విధ్వంసం జరిగిన రాత్రి నుంచి ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించలేదు. ఆమె స్వాస్థ్య భవన్ నుంచి పనిచేస్తున్నారని విన్నాం. అందుకే ఇక్కడకు వచ్చాం’ అని ఒక జూనియర్ డాక్టర్ బుధవారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్పత్రిపై దుండగులు దాడి చేస్తుంటే అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు, ఒక ఇన్స్పెక్టర్ను కూడా కోల్‌కతా పోలీసు శాఖ బుధవారం సస్పెండ్ చేసింది. మంగళవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ ఆస్పత్రి, వైద్యకళాశాల వద్ద దాదాపు 150 మంది పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ కల్పించారు. మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డాక్టర్ల ఆందోళనలు పదోరోజు కూడా కొనసాగాయి. విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్స్‌కు ఎయిమ్స్ విజ్ఞప్తి చేసింది. -
కోల్‌కతా డాక్టర్ కేసులో నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
‘గద్వాల ఎమ్మెల్యేకు ప్రాణ హాని’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ప్రాణహాని ఉన్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం కోరుట్లలో తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘బీఆర్ఎస్లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దగ్గరికి ప్రభుత్వ పెద్దలందరూ వెళ్లి బెదిరింపులకు గురి చేశారు. నేను అయితే నా తల తీసివేసినా పార్టీ మారను. అభివృద్ధి కోసం పార్టీ మారవలసిన అవసరం లేదు. కోరుట్ల ప్రజలకు అవసరమైన 100 పడకల హాస్పిటల్ సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. కేవలం తన స్వార్థం కోసమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో తప్పుడు నివేదికలు చదివి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు’అని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగుతారని వార్తలు వచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు నేతలను కలవటం తీవ్ర చర్చనీయంగా మారింది. ఆయన మనసు మార్చుకొని బీఆర్ఎస్లోనే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. అనంతం కాంగ్రెస్ నేతలు రంగంలోకి ఆయన్ను బుజ్జగించిన విషయం తెలిసిందే. -
రాజకీయాల్లోకి మాజీ డీజీపీ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
రిటైర్డ్ పోలీసు అధికారులు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణంగా మారింది. పోలీసు ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకుని, యూపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అసీమ్ అరుణ్ బీజేపీకి చెందిన ప్రముఖ నేతల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇదేవిధంగా పలు రాష్ట్రాల పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సంజయ్ పాండే ముంబైలోని వెర్సోవా నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు.తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ నేపధ్యంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు మాజీ డీజీపీ పాండే మీడియాకు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాను ఉంటున్న నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, అన్ని వర్గాల మద్దతును స్వాగతిస్తున్నానని పాండే పేర్కొన్నారు.ముంబై పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేసిన పాండే తాను ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీని సంప్రదించలేదని, సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, దానిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పాండేను 2022 సెప్టెంబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు నేపధ్యంలోనే సంజయ్ పాండే వార్తల్లో నిలిచారు. ఆయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో చదువుకున్నారు. -
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ రద్దు చేసింది
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని అప్పట్లో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మెట్టుసాయికుమార్, కోట్ల శ్రీనివాస్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు దేవుడి పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప బతుకుతెరువు కోసం ఉద్యోగాలు ఇప్పించడం తెలియదని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాష్ట్ర యువతకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు దక్కేవని, కానీ ఆ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గడ్డ సేఫ్టీకి అడ్డా అని, అందుకే ఐటీఐఆర్‌ను సోనియాగాంధీ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ గడ్డపై ఐటీఐఆర్‌తో అడుగుపెట్టి ఉంటే ప్రజలు సంతోíÙంచే వారన్నారు. ఇప్పుడు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టును మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదేనని, వారికి ఎప్పటికప్పుడు ఐటీఐఆర్ గురించి గుర్తుచేస్తుంటామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అంశం తన పరిధిలోనిది కాదని, శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. -
విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
బుల్లితెర జంట సంజయ్ గగ్నానీ, పూనమ్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. అయితే వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని, త్వరలోనే విడిపోవడం ఖాయమంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వైరలవుతున్నాయి. ఇందుకు తోడు సంజయ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి తొలగించాడట! ఇంకేముంది.. ఈ దంపతులిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు.ఫస్ట్ టైం చూసి..తాజాగా ఈ రూమర్స్‌పై సంజయ్ స్పందించాడు. మేము విడిపోతున్నామన్న వార్త మొదటిసారి చదివినిప్పుడు షాకయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. నా భార్య అంటే నాకెంతో ఇష్టం. తను ఇది చూస్తే ఎంత బాధపడుతుందోనని కంగారుపడ్డాను. కానీ ఆమె కూడా ఒక యాక్టర్ కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోగలదనిపించింది.ఈ ప్రపంచం ఏమనుకున్నా..ఈ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సర్వసాధారణమే! మేమేంటో మాకు తెలుసు. ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందనే అస్సలు పట్టించుకోము. అలాగే ఈ పుకారును కూడా లైట్ తీసుకున్నాం. అయితే విడాకుల కోసం లాయర్‌ను సంప్రదించానని ప్రచారం చేశారు. ఎంత నవ్వుకున్నానో..అది విని అయితే ఎంత నవ్వుకున్నానో నాకే తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కుండలీ భాగ్య సీరియల్ తర్వాత సంజయ్ మరే ధారావాహికలోనూ కనిపించలేదు. అన్నీ నెగెటివ్ రోల్స్ వస్తుండటం వల్లే దేనికీ ఒప్పుకోలేదంటున్నాడు. తాజాగా యూట్యూబ్‌లో రిలీజైన రాత్ అభి అనే సాంగ్‌లో సంజయ్ మెరిశాడు.చదవండి: రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి -
క్లీన్ కామెడీతో పార్టీ
‘‘రెండు గంటల పాటు ప్రేక్షకులు నవ్వుకునే క్లీన్ కామెడీతో ‘సౌండ్ పార్టీ’ని రూపొందించాం’’ అన్నారు రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర. వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో వ్యాపారం చేస్తున్న మేం సినిమాలపై ఫ్యాషన్‌తో తెలుగులో ‘సౌండ్ పార్టీ’ తీశాం. అమాయకులైన తండ్రీ కొడుకులిద్దరూ ధనవంతులు అయిపోవడానికి ఏం చేశారనేది ఈ చిత్రకథ. మన ప్రేక్షకులైనా, అమెరికా ఆడియన్స్ అయినా కామెడీ జానర్ చిత్రాలనే ఎక్కువగా ఇష్టపడతారు. మా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 100, యూఎస్‌లో 150కి పైగా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. -
తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే!
వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
ఆమనికి ఈ హీరోయిన్ ఏమవుతుందో తెలుసా?
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా సంజయ్ శేరి దర్శకత్వం వహించిన చిత్రం ‘సౌండ్ పార్టీ’. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా హ్రితికా శ్రీనివాస్‌మాట్లాడుతూ–‘‘నటి ఆమనిగారు మా మేనత్త. దీంతో చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉండేది. బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించాను. అమాయకులైన తండ్రీకొడుకులు ఈజీ మనీ కోసం ఏం చేస్తారు? అనేది ‘సౌండ్ పార్టీ’ కథ. ఇందులో నేను సిరి పాత్రలో నటించాను. కామెడీతో పాటు కంటెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. తెలుగులో సాయిపల్లవిగారంటే ఇష్టం. ఆమెలాంటి పాత్రలు చేయాలని ఉంది. హీరోల్లో నానీగారు అంటే ఇష్టం. భవిష్యత్తులో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది’’ అన్నారు. -
ఇండస్ట్రీలో విషాదం.. సూపర్ హిట్ మూవీ డైరెక్టర్ మృతి!
చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాధ్వి (56) కన్నుమూశారు. ముంబయిలోని నివాసంలో ఉదయం సంజయ్ తుదిశ్వాస విడిచారని ఆయన పెద్దకుమార్తె సంజినా తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. 2000లో విడుదలైన తేరే లియే చిత్రంతో సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. 2004లో విడుదలైన ధూమ్ సినిమాతో ఆయన తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఏడాదే ధూమ్ -2తో అలరించారు. 2020లో విడుదలైన ఆపరేషన్ పరిందే ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన చివరి చిత్రంగా నిలిచింది. -
‘ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినా చర్యలు తప్పవు’
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది నేర దర్యాప్తు సంస్థ(Crime Investigation Department..సీఐడీ). ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. ‘‘సీఎంపై, వారి కుటుంబసభ్యులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారుపేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటు. ఫేక్ అకౌంట్స్‌ను పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్‌ను నడిపే వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయి. హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టాం’’ అని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయి. అలాగే ప్రతిపక్ష నేతలపైనా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలిస్తున్నాం. ఎవరి మీద అయినా సరే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే చూస్తూ ఊరుకోం. కఠిన చర్యలు మాత్రం తప్పవు అని స్పష్టం చేశారాయన. సోషల్ మీడియాను చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలి. దీనిపై మరింత అవగాహన కల్పించాలని భావిస్తున్నాం అని సంజయ్ తెలిపారు. చదవండి: తుస్సుమనిపించిన పవన్.. ఎందుకంత వణుకు? గత ఏడాది 1450 పోస్టులు.. ఈ ఏడాది 2164 సోషల్ మీడియాలో వచ్చిన అభ్యంతర మెసేజ్‌లను తొలగించాం. న్యాయ వ్యవస్ధపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వీరి ఆస్తులు సీజ్ చేయడానికి వెనకాడం. ప్రతిపక్షాలపై అసభ్యకర పోస్టులపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ విధంగా 45 తప్పుడు పోస్టులని గుర్తించాం. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తాం. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలు పంపించాం. యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపాం. ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టాం. రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు’’ అని సీఐడీ సూచించింది. సోషల్ మీడియా అకౌంట్స్‌ను వ్యక్తిగత దూషణలకు వినియోగించొద్దు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగ్‌లు 19 మందికి నోటీసులు ఇచ్చాం. ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్ అకౌంట్ నడుపుతున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చాం. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశాం. సీఎం, ఆయన కుటుంబ సభ్యులని ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లని గుర్తించాం. సోషల్ మీడియా పేరుతో పరిధి దాటి అసభ్యకరమెసేజ్‌లు పెడితే కఠినంగా వ్యవహరిస్తాం’’ ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. -
జప్తు చేసింది రూ.1.7 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కలిపి మొత్తం రూ.59.93 కోట్ల నగదు, 156 కిలోల బంగారం, 454 కిలోల వెండిని స్వాధీనం చేసుకోగా... అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కలు లేని నగదుగా తేల్చి జప్తు చేశామని ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్ ప్రాంత డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్) సంజయ్ బహదూర్ వెల్లడించారు. ఇప్పటికే రూ.10.99 కోట్ల నగదును సంబంధిత యజమానులకు అప్పగించామని, మిగిలిన నగదు విషయంలో దర్యాప్తు పురోగతిలో ఉందన్నారు. బుధవారం ఆయన ఆయకార్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ 1800–425– 1785తో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ల్యాండ్‌లైన్ నంబర్ 040–234262201/ 23426202 లేదా వాట్సాప్/టెలిగ్రామ్ నంబర్ 7013711399ను సంప్రదించవచ్చని చెప్పారు. అభ్యర్థుల అఫిడవిట్ల పరిశీలన నామినేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన ఆస్తులు, అప్పుల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సహకారంతో తనిఖీ చేస్తామని డీజీ సంజయ్ బహదూర్ తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆరు నెలల్లోగా అభ్యర్థుల ఖర్చులపై ఈసీకి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ‘రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సహకారంతో బ్యాంకు ఖాతాల నుంచి రూ.10లక్షలకు పైగా నగదు ఉపసంహరణలను పరిశీలిస్తాం. వీసా కోసం ఎవరైనా బంధువుల ఖాతాల నుంచి తమ ఖాతాకి నగదు బదిలీ చేసుకుంటే వారికి మినహాయింపు ఇస్తున్నాం. వ్యాపారంలో ఎవరికైనా అసాధారణ రీతిలో భారీగా ఆదాయం పెరిగినట్టు చూపినా మూలాలను పరిశీలిస్తాం. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే విత్‌డ్రా చేసినా పరిశీలన జరుపుతాం. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాల్లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నాం. ఇతర చిన్న విమానాశ్రయాల్లో విమానాల తనిఖీల బాధ్యత జిల్లా కలెక్టర్లదే’అని ఆయన చెప్పారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే యాప్ ద్వారా స్వా«దీనం చేసుకున్న నగదుకు సంబంధించిన లెక్కలను పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. -
ఈ కొండ గట్టెక్కిస్తుందని..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముడుపు కట్టి మొక్కడం తెలుగు ప్రజల సంప్రదాయం. అందులోనూ ఏదైనా మంచిపని చేసేముందు.. కొత్త వాహనం కొన్న తర్వాత పూజలు చేయించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల) కొండగట్టు ఎంతో ప్రసిద్ధి చెందింది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయానికి తెలుగువారే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ముఖ్యంగా తెలుగు రాజకీయ నేతలు ఇక్కడ పూజలు నిర్వహించి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేయడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం సిద్దిస్తే.. కొండగట్టుకు వచ్చి మొక్కు తీరుస్తానని ఆయన ఉద్యమ సమయంలో అంజన్నకు మొక్కుకున్నారు. ఇటీవల జగిత్యాల పర్యటన సందర్భంగా అంజన్నకు తన మొక్కు చెల్లించుకున్నారు. కొండగట్టు అంటే సీఎం కేసీఆర్‌కు మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇక్కడికి కుటుంబంతో వచ్చేవారు. ఎమ్మెల్సీ కవిత కూడా బాల్యం నుంచే కొండగట్టుకు వచ్చేవారు. ఎంపీ అయిన తర్వాత కూడా పలుమార్లు ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. 2019లో ఎంపీగా గెలవకముందు సంజయ్ కూడా అంజన్నకు ముడుపు కట్టారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన సంజయ్, కొండగట్టులో మొక్కు చెల్లించుకున్నారు. ఈనెల 19న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కరీంనగర్ మీదుగా బోధన్ వెళ్లే దారిలో కొండగట్టును దర్శించుకోనున్నారు. రాష్ట్రంలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు వాయుపుత్రుని దీవెనలు ఉండాలని కాంగ్రెస నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి కొండగట్టు పూజలు షెడ్యూలులో లేనప్పటికీ, రాహుల్‌గాం«దీని కొండగట్టు వద్ద ఆపి, పూజలు చేయించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలకు పూజలు కూడా చేయించనున్నారు. -
కాంగ్రెస్‌ది గతం.. ఇప్పుడు ఖతం!
జగిత్యాల, జగిత్యాల క్రైం, ధర్మపురి, సిరిసిల్ల, సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది గతమని, ఇప్పుడా పార్టీ ఖతమైందని, వారంటీ ముగిసిన పార్టీ గ్యారంటీ ఎలా ఇస్తుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. 150 ఏళ్ల కాంగ్రెస్ వారంటీ అయిపోయిందని, ఆరు గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 24 గంటల కరెంట్‌పై అనుమానం ఉందని, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, ఆ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సోనియాకు సైతం లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అని, జనాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీకి తెలుసని ధ్వజ మెత్తారు. పీఎం మోదీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా వేరే ఎవరూ విమర్శించలేరని, మాకు ఆ పార్టీతో, మోదీతో ఎలాంటి మిలాఖత్ లేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మోదీది గాడ్సే వారసత్వమని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం బీఆర్ఎస్ అంటే కాళేశ్వరమని, కాంగ్రెస్ అంటే శనీశ్వరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మాతాశిశు ఆస్పత్రితోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. నరేంద్రమోదీ అంటే నమ్మించి మోసం చేసేవాడని విమర్శించారు. కాగా జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యా లయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హోంమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. ఒక్క రూపాయి లంచం లేకుండా.. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ 577 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, 1,747 మందికి గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి కలిగే విధంగా కేసీఆర్ పాలన వర్ధిల్లుతోందన్నారు. మోదీ అబద్ధాల జాతర ఎక్స్(ట్విట్టర్)లో మంత్రి కేటీఆర్ ధ్వజం పీఎం నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలనే కాకుండా 140 కోట్ల మంది భారతీయులను మోసం చేశారని మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విభజన హామీలకు దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ విభజన హామీలకు పదేళ్లుగా పాతరేసి అబద్ధాల జాతర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. -
చంద్రబాబు పాత్ర సుస్పష్టం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుకున్నారని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిలు తెలిపారు. ఈ అడ్డగోలు అవినీతికి పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఈ స్కామ్ తాలూకు ఫైళ్లపై 13 డిజిటల్ సంతకాలు చేశారని వెల్లడించారు. ఆ సంతకాల కాపీలను మీడియా ఎదుట ప్రదర్శించారు. అగ్రిమెంట్లలో కనీసం తేదీ వేయకపోవడం, లెటర్ నంబర్ ప్రాంతాల్లో ఖాళీలను వదిలిన విషయాన్ని బయటపెట్టారు. థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వకూడదన్న నిబంధనలు పాటించలేదన్నారు. అన్ని వివరాలను పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో వివరించారు. ఈ కుంభకోణానికి తెరతీసేందుకు రూపొందించిన అగ్రిమెంట్లో లోపాలు మొదలు.. నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల్లోకి వాటిని తరలించిన విధానం.. తద్వారా ఎలా లబ్ధిపొందారన్న పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. సీమెన్స్ కంపెనీకి ప్రాజెక్టు గురించే తెలీదు జీఓ నంబర్ 4 ఆధారంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిజైన్‌టెక్ కంపెనీ, సీమెన్స్ ఇండియా సాఫ్ట్వేర్ల మధ్య త్రైపాక్షిక అగ్రిమెంట్ జరిగినట్టు చూపారు. వాస్తవంగా జీవోలో ఉన్న అంశాలు, అగ్రిమెంట్‌లోని అంశాలు వేరుగా ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి సీమెన్స్ కంపెనీకి తెలియదు. ఆ కంపెనీ పేరుతో కుట్రపూరితంగా ప్రాజెక్ట్‌ను రూపొంందించారు. ఈ అగ్రిమెంట్ పరిశీలిస్తే..అందులో జీఓ నంబర్, లెటర్ నంబర్, తేదీలు సైతం సరిగా లేవు. కేవలం డ్రాఫ్ట్‌గా తయారు చేసి, భవిష్యత్తులో నంబర్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంచినట్టు నిర్ధారణ అవుతోంది. ఒరిజినల్ పత్రాలు పరిశీలించాం. అవి నకిలీ అని నిర్ధారణ అయ్యింది. థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వకూడదని అగ్రిమెంట్లో రాసుకున్నట్టు స్పష్టంగా ఉంది. అయినా థర్డ్ పార్టీకి రూ.330 కోట్లు వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయి. డిజైన్‌టెక్ నుంచి ఈ మొత్తాన్ని పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించారు. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. 2014లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశాక ఆడిటర్‌గా జి వెంకటేశ్వర్లు అనే ప్రైవేటు వ్యక్తిని నియమించారు. గంటా సుబ్బారావును స్కిల్ డెవలప్మెంట్ కార్యదర్శిగా, ఎక్స్ అఫీషియో సెక్రెటరీ టు సీఎంగా నియమించారు. ఇలా ఉన్నత విద్యా శాఖ పర్యవేక్షణ లేకుండా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి సీఎం కార్యాలయం నుంచే నేరుగా పనిచేసేలా ‘కావాల్సిన’ విధంగా పని పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. డిప్యూటీ సీఈఓగా యూపీ కేడర్‌కు చెందిన అపర్ణ అనే ఐఏఎస్ అధికారిని నియమించారు. ఆమె భర్త సీమెన్స్ తరఫున అగ్రిమెంట్ల తయారీలో పనిచేశారు. తమ ప్రమేయమే లేదని ‘సీమెన్స్’ చెప్పింది గుజరాత్ తరహాలో యువతకు నైపుణ్యాభివృద్ధి అంటూ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి తెరతీశారు. కనీసం పైలెట్ ప్రాజెక్టు అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని సీమెన్స్ సంస్థ స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. భారత్‌లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారణ అయ్యింది. గుజరాత్లో కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందంలో సౌమ్యాద్రి బోస్‌గా సంతకాలు చేయగా, ఏపీలో ఉన్న ఒప్పందంలో మాత్రం సుమన్ బోస్ పేరిట సంతకాలు చేసినట్టు సదరు కంపెనీ వెల్లడించింది. సదరు కంపెనీ లీగల్ కౌన్సిల్ సైతం ఈ విషయాలను సీఐడీకి నిర్ధారించింది. సాఫ్ట్వేర్ కోసం డిజైన్‌టెక్ నుంచి రూ.58.80 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలోని రూ.371 కోట్లలో రూ.58.80 కోట్లు జర్మనీలోని తమ సీమెన్స్ కంపెనీకి వచ్చాయని, అయితే ఆ సొమ్ము తమ కంపెనీకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ, ఏపీ ఆర్థిక శాఖ నుంచి కానీ రాలేదని ఆ కంపెనీ స్పష్టం చేసింది. డిజైన్ టెక్ సంస్థ కోరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే రూ.58.80 కోట్లు ప్రభుత్వం నుంచి డిజైన్ టెక్ అనే సంస్థకు తొలుత చేరినట్టు రూడీ అవుతోంది. వాస్తవానికి అగ్రిమెంట్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ నగదు బదిలీ జరిగినట్టు స్పష్టం అవుతోంది. సీఐటీడీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) ప్రభుత్వానికి ఏ ప్రతిపాదనలు ఇవ్వాలో కూడా సుమన్ బోస్ తయారు చేశారు. ఇంకా లోతుగా పరిశీలిస్తే.. సీఐటీడీ రిపోర్ట్ ఇవ్వకముందే రూ.200 కోట్లకు పైగా నగదు మళ్లించారు. ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ‘దశా’ంశాల ఆధారంగా దర్యాప్తు నకిలీ, కల్పిత ట్రై ప్యాట్రియేట్ అగ్రిమెంట్ ఎలాంటి నిబంధనలు పాటించకుండానే రూ.371 కోట్లు విడుదల నోట్‌ఫైల్‌లో రిమార్క్‌లు పూర్తిగా విస్మరించడమే కాక అధికారులపై తీవ్ర ఒత్తిడి ఈ కుంభకోణంలో తమ కంపెనీ పేరును వాడారని, అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా స్పష్టం చేసింది గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, అమలు తీరుతెన్నులతో పోలిస్తే ఏపీలో జరిగింది వేరు. ఇక్కడ ప్రాజెక్టు అంతా అక్రమాలే. రూ.371 కోట్ల స్కామ్‌లో షెల్ కంపెనీల పాత్ర ఈ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు, అరెస్టుల వివరాలు, ఈ కేసులో అటాచ్మెంట్లు ప్రాథమిక ఆధారాలు, కోర్టులో సమర్పించిన వివరాలు ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు సీఐటీడీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) థర్డ్ పార్టీ అభిప్రాయం నోట్ ఫైళ్లు మాయం చేశారు ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్‌తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం బయటపడింది. వెలుగులోకి విస్తుపోయే నిజాలు ఈ కుంభకోణం బయట పడకూడదని నోట్ ఫైల్స్‌ను సెక్రెటేరియట్‌లో తగలబెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఎంతో స్కిల్‌ఫుల్‌గా టీడీపీ ప్రభుత్వ హయాంలో దోచేశారు. జర్మనీకి చెందిన సీమెన్స్ ఏజీ అనే కంపెనీ ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.3300 కోట్ల ప్రాజెక్టులో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అంటే ఉచితంగా ఇస్తామంటూ ముందుకు వచ్చినట్టు ఒప్పందంలో పేర్కొన్నారు. కేవలం 10 శాతం ఏపీ ప్రభుత్వం కంట్రిబ్యూషన్ కింద ఇస్తే చాలన్నట్టుగా ఒప్పందాల్లో ఉంది. చివరకు ఈ పది శాతం సొమ్ము రూ.371 కోట్లను నాలుగు లేయర్లుగా సృష్టించి పప్పు బెల్లాలుగా ఏపీ ఖజానా నుంచి కొల్లగొట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధం అని అధికారులు అభ్యంతరం పెట్టినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు సరిగా లేనందున ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా.. తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు సూచించినా పట్టించుకోలేదు. ఈ విషయాలన్నీ నోట్‌ఫైల్‌లో ఉన్నాయి. జీఎస్టీ మినహాయింపుల కోసం డిజైన్‌టెక్ చేసిన ప్రయత్నంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పుణేలో జీఎస్టీ అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం రూ.కోటి అయ్యే సాఫ్ట్‌వేర్‌ను రూ.250 కోట్లుగా చూపారు. ఇది ఎంతో అన్యాయం. – పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఏఏజీ యోగేష్ గుప్తాతో చంద్రబాబు పీఎస్‌కు సంబంధాలు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొట్టేసిన సొమ్మును షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించి చివరకు నగదు రూపంలో మార్చడంలో షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించినట్టు అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తాలకు ఆర్థిక అంశాల్లో సంబంధాలున్నట్టు గతంలో ఐటీ దాడుల్లో వెల్లడైందన్నారు. పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్గుప్తాలు కలిసి ఈ మొత్తం వ్యవహారం నడిపారన్నారు. డబ్బులు ఎలా చేర్చారన్న పూర్తి వివరాలు మరింత స్పష్టంగా వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ సొమ్మును మళ్లించడం, తిరిగి షెల్ కంపెనీల ద్వారా వాటిని ఒకే వ్యక్తి పొందారనడానికి పూర్తి ఆధారాలున్నాయని చెప్పారు. ఇందులో హవాలా జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, సీఐడీ దర్యాప్తుతోపాటు సీమెన్స్ గ్లోబల్ కంపెనీ ఇచ్చిన వివరణలు సైతం వెల్లడించాయని తెలిపారు. ఈ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. సీఐడి దర్యాప్తు కూడా కొనసాగుతోందని, అవసరం మేరకు ఇంకా అరెస్టులు ఉంటాయన్నారు. ఇందులో అనేక కోణాలు దాగి ఉన్నాయని, చార్జిషీట్‌కు ఇంకా సమయం పడుతుందని వివరించారు. -
‘స్కిల్’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే
సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్ కంపెనీయే ఈ మెయిల్ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు. విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్ ఇంకా ఏం చెప్పారంటే.. కుంభకోణం సూత్రధారి చంద్రబాబే ♦ కేబినెట్ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్ఎస్డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు. ♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్ అకౌంటెంట్‌కు ఏపీఎస్ఎస్డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమెన్స్ కంపెనీ పేరుతో మోసం ♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వాడుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. ♦ సీమెన్స్ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్ఎస్డీసీ, సీఐడీలకు అందించింది. భారత్‌లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్ బోస్ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మేరMý ు సుమన్‌బోస్, ఇతరులు డిలీట్ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, మెసేజ్‌లు, ఇతర డాటాను రిట్రైవ్ చేసి సీఐడీకి అందించింది. ♦ డిజైన్ టెక్ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్‌గా నకిలీ ఒప్పందం ♦ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్ టెక్ అనే కంపెనీని భాగస్వామిని చేశారు. ♦ సీమెన్స్ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్‌టెక్ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల ♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్ టెక్ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు ♦ డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్ కంపెనీ నుంచి రూ.58.80 కోట్ల సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్ టెక్ కంపెనీ వివిధ షెల్ కంపెనీలకు మళ్లించింది. ♦ వాటిలో షెల్ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. గుజరాత్ మోడల్ కాదు.. ♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్‌నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధికారుల బృందం గుజరాత్లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్‌ను రూపొందించింది. ♦ 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. నోట్ ఫైళ్లు మాయం ♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్ చేసింది. ♦ ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్‌తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది. చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు ♦ షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. ♦ డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్ కంపెనీల ద్వారా యోగేశ్ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు. ♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. ♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కే అందించామని మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్’ కుంభకోణం బట్టబయలు ♦ ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సీమెన్స్ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్బోస్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. ♦ డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్ కూడా చేసింది. డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. ♦ ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్ వినాయక్ ఖన్వేల్కర్‌తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసింది. ♦ సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
మార్గదర్శి ఫైనాన్సియల్ పెద్ద స్కాం: ఏపీసీఐడీ
-
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ
టైటిల్: స్లమ్ డాగ్ హజ్బెండ్ నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి నిర్మాణ సంస్థ:మైక్ మూవీస్ దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో విడుదల తేది: జులై 29, 2023 కథేంటంటే.. హైదరాబాద్‌లోని పార్శీగుట్టకు చెందిన లక్ష్మణ్ అలియాస్ లచ్చి(సంజయ్ రావు), మౌనిక(ప్రణవి మానుకొండ) ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే... ఇద్దరి జాతకాలు ఉండవు. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే ఇరు కుటుంబాలలో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతాడు పంతులు. ఈ గండం పోవాలంటే లచ్చి ముందుగా ఓ కుక్కను లేదా చెట్టును పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు. స్నేహితుడు సంతోష్(యాదమ్మ రాజు)సలహాతో లచ్చి ఓ కుక్క(బేబీ)ని పెళ్లి చేసుకుంటాడు. వారం రోజుల తర్వాత ప్రియురాలు మౌనికతో పెళ్లి జరుగుతుండగా పోలీసులు లచ్చిని అరెస్ట్ చేస్తారు. బేబీ(కుక్క) ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. బేబీతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం నేరమని, విడాకుల కోసం రూ.20లక్షలు భరణంగా ఇవ్వాలని కుక్క ఓనర్ డిమాండ్ చేస్తారు. ఈ కేసు కోర్టుకెక్కుతుంది. మరి ఈ కేసులో ఎవరు గెలిచారు? బేబీ ఓనర్ ఎందుకు రూ.20లక్షలు డిమాండ్ చేస్తాడు? మౌనికతో లచ్చి పెళ్లి జరిగిందా లేదా? బేబీతో లచ్చి ఎలా ప్రేమలో పడ్డాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కుక్కతో పెళ్లి.. ఇది వినడానికే కాస్త వింతగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు మనం టీవీల్లో చూస్తుంటాం. జంతువులపై ప్రేమతోనో లేదా దోషం పోవాలనో కొంతమంది ఇలాంటి వింత పనులు చేస్తుంటారు. అదే పాయింట్‌ని కథగా మలిచి స్లమ్ డాగ్ హజ్బెండ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీధర్. మూఢనమ్మకంతో ఓ కుక్కను పెళ్లి చేసుకున్నాక..అతనికి ఏర్పడిన ఇబ్బందులు ఏంటనేది కామెడీగా చూపిస్తూనే..అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. నా అనుకున్నవారే అవసరాన్ని బట్టి మోసం చేస్తుంటారు. కానీ జంతువులకు అలాంటివేవి తెలియదు. ఒక్కపూట తిండి పెడితే చాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయని అనేది ఈ సినిమాలో చూపించారు. బస్తీకి చెందిన లచ్చి తన ప్రియురాలు మౌనికతో ఫోన్లో సెక్సీ స్పీకింగ్ చేస్తున్న సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కూడా కాసేపు ఆ తరహా సన్నివేశాలే ఉంటాయి.ఇవి యాత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఇక కుక్కతో పెళ్లి కాస్సెప్ట్ ప్రారంభమై తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే కుక్కతో పెళ్లి జరిగే వరకు కాస్త ఎంటర్టైనింగ్ సాగుతుంది. ఆ తర్వాత కథ కోర్టు చుట్టు తిరుగుతుంది. కోర్డు రూమ్ సీన్స్ ఫేలవంగా ఉంటాయి. కామెడీ పండించడానికి ఆస్కారం ఉన్నా..దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కుక్కకు ‘వెన్నెల’కిశోర్ వాయిస్ పెట్టడం..దాని వెనుక సీక్రెట్‌ని రివీల్ చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. కోర్టులో జంతువుల విశ్వాసం గురించి చెప్పే సీన్స్ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. దర్శకుడు రొమాంటిక్ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ కామెడీపై కూడా పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. బస్తీకి చెందిన లచ్చి అలియాస్ లక్ష్మణ్‌గా సంజయ్ రావు జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక మౌనికగా ప్రణవి మానుకొండ అదరగొట్టేసేంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే తనదైన నటన, మాటలతో యువతకు మత్తెకించేసింది. ఈ సినిమాలో యాదమ్మ రాజుకు మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు సంతోష్‌గా యాదమ్ రాజు కామెడీ సినిమాకు ప్లస్. అంతేకాదు క్లైమాక్స్ అతని పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. కుక్క ఓనర్‌గా నటించిన వేణు కొలసాని తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో అందరికి గుర్తిండిపోయేలా చేశాడు. ఇక లాయర్లుగా బ్రహ్మాజీ, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భీమ్స్ సంగీతం సినిమాకు చాలా ప్లస్. 'లచ్చి గాని పెళ్లి' సాంగ్ థియేటర్స్‌లో విజిల్స్ వేయిస్తుంది. రెట్రోసాంగ్తో పాటు మిగతావి కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్‌కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
ఆర్జీవీకి కథ చెబితే ‘కుక్క మొగుడు’ అని టైటిల్ పెట్టాడు : బ్రహ్మాజీ
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ స్టోరీని రామ్ గోపాల్‌వర్మకు వినిపించి టైటిల్ అడిగితే ‘కుక్క మొగుడు’అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారు. కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’అని సీనియర్ నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం. ►సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు. ►మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను. ► సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది. ► జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అదే టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం. ► భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది. ► సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్‌గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు. ► ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్నాను. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్‌లోనే ఎక్కువగా కనిపిస్తాను. -
బన్నీని చూసి ఇండస్ట్రీలోకి వచ్చా: యంగ్ హీరో సంజయ్ రావు
మా నాన్న(బ్రహ్మాజీ)ను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత బన్నీ(అల్లు అర్జున్)ని ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన జర్నీ నాకు తెలుసు. ఓ పెద్ద నిర్మాత కొడుకు ఈజీగా సినిమాల్లోకి వచ్చాడు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. సినిమాల కోసం బన్నీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. నేను కూడా బన్నీలాగే కష్టపడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను’అని యంగ్ హీరో సంజయ్ రావు అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా హీరో సంజయ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ కథ మా నాన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే ఒకే చేశా. ►రెగ్యూలర్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్.. హీరోయిన్ పెట్టాలని పెడతారు. కానీ ఈ సినిమాలో ప్రణవి రోల్ ఫుల్ లెంగ్త్‌లో ఉంటుంది. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. ఈ సినిమాలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది. అదే రియాలిటీ ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతోంది. ►ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది.నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా. ►సెట్స్‌లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. కో యాక్టర్‌గానే కలిసి నటిస్తా. పుష్ప షూటింగ్లో అల్లు అర్జున్ గారు నాన్నతో మాట్లాడారు. 'బ్రహ్మాజీ మీ కొడుకు సినిమా ట్రైలర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది..' అని బన్నీ గారు అన్నారు. కారు ఎక్కే ముందు ఫయాద్ ఫజిల్ గారికి ఈ ట్రైలర్‌ను కచ్చితంగా చూడాలని చెప్పారు. ►నాకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు. నేను ఎవరి అయినా కలవాలంటే వాళ్ల ఇంటి బయట నిల్చుంటా. భీమ్లా నాయక్ సినిమా సమయంలో త్రివిక్రమ్‌ను కలిసేందుకు ఐదు రోజులు అక్కడ జనాల మధ్య లైన్లో నిలబడ్డా. ఒక బౌన్సర్ నన్ను చూసి ఏంటి సార్ అక్కడ నిల్చున్నారని అన్నాడు. తరువాత రెండు నిమిషాలు త్రివిక్రమ్ గారితో మాట్లాడా. ►నేను నావీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చా. ఆ తరువాత యాక్టింగ్‌లో శిక్షణ కోసం ముంబై వెళ్లా. ఆళ్ల పురుషోత్తం గారి దగ్గరకు వెళ్లా. లావణ్య త్రిపాఠి గారు అక్కడే శిక్షణ తీసుకున్నారు. ఆమె మా నాన్నతో చెప్పి అక్కడికి రికమెండ్ చేశారు. అక్కడ వెళితే.. స్టూడెంట్స్ అంతా నార్త్ వాళ్లే ఉన్నారు. నాది హైదరాబాద్ అని చెబితే.. హైదరాబాదా..? సౌత్ ఇండియానా..? అని ఒక రకంగా చూశారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ ముందుకు వెళుతోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెడితే మనకు ఇచ్చే గౌరవమే వేరు. ►హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. అవి హోల్డ్‌లో పెట్టా. ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఓ పిట్టకథ చిత్రం కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. నాకు వెబ్‌సిరీస్ అని.. సినిమా అని వేరే క్యాటగిరీలు ఉండవు. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. రిలయ¯Œ ్స ఎంటర్ౖటెన్మెంట్ సంస్థ ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తోంది. ‘‘మ్యారేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించబోతున్నాం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: చింతా మెర్వాన్, సీహెచ్ చైతన్య పెన్మత్స, నిహార్ దేవెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఐటీఆర్ గడువు పొడిగింపు పరిశీలనలో లేదు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులు వీలైనంత ముందుగా పన్ను రిటర్నులను (ఐటీఆర్‌లు) దాఖలు చేసుకోవాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంయజ్ మల్హోత్రా సూచించారు. జూలై 31గా ఉన్న ఐటీఆర్‌ల దాఖలు గడువు పొడిగింపును ప్రభుత్వం పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. గతేడాది కంటే ఎక్కువ మంది రిటర్నులు దాఖలు చేస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతేడాది జూలై 31 నాటికి 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ‘‘పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే గతేడాది కంటే చాలా వేగంగా రిటర్నులు దాఖలు అవుతున్నాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రిటర్నులు దాఖలు చేసుకోవాలన్నది మా సూచన. జూలై 31కి ఇంకా ఎన్నో రోజులు లేనందున వెంటనే రిటర్నులు దాఖలు చేసుకోవాలి’’అని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యంపై మాట్లాడుతూ.. 10.5 శాతం వృద్ధి రేటు స్థాయిలోనే ఆదాయం ఉంటుందన్నారు. జీఎస్టీ పరంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 12 శాతం ఆదాయం వృద్ధి చెందినట్టు చెప్పారు. 2023–24 బడ్జెట్ ఆధారంగా చూస్తే స్థూలంగా రూ.33.61 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.18.23 లక్షల కోట్లను కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో వసూలు చేయాలన్నది లక్ష్యం. గతేడాదితో పోలిస్తే 10.5 శాతం ఎక్కువ. -
స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!
సినిమా రంగంలో వారసుల తెరంగేట్రం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పటికే చాలామంది వారసులు వివిధ శాఖల్లో రాణిస్తున్నారు. తాజాగా ఒక కొత్త కాంబినేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటుడు విజయ్ తన తండ్రి దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ ద్వారా కథానాయకుడుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) అదేవిధంగా నటి దేవయాని. ఈమె బహుభాషా నటి. తొట్టాల్ సీణుంగి చిత్రం ద్వారా తమిళంలో కథానాయకగా పరిచయమైన దేవయాని ఆ తర్వాత కాదల్ కోట్టై వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. నీ వరివాయ్ ఎన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజకుమార్. ఆ చిత్రంలో అజిత్, దేవయాని హీరో హీరోయిన్గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు రాజకుమార్‌కు, నటి దేవయానికి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె ఇనియ కుమార్‌ను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.రాజకుమార్ దర్శకత్వం వహించిన నీ వరువాయ్ ఎన్ చిత్రం 1999లో విడుదలైంది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇందులో విజయ్ కుమారుడు సంజయ్, తన కూతురు ఇనియకుమార్తోను, హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన కూతురు ఇనియాకు నటించాలని కోరిక ఉందని దీంతో సంజయ్‌కు జంటగా ఆమెను నటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు అయితే విజయ్ వారసుడు సంజయ్ తెరవెనుక బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఆయన కథానాయకుడిగా నటిస్తారా వేచి చూడాల్సిందే. -
తెరపైకి ‘ప్రాజెక్ట్ సంజయ్’
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాలు సైనికపరంగా అనేక నూతన అస్త్రాలను సమకూర్చుకుంటున్న వేళ..భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అత్యాధునిక డిజిటల్ యుద్ద క్షేత్రాల్లో పోరాటంలో సైతం పైచేయి సాధించేందుకు ఆర్మీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘ప్రాజెక్ట్ సంజయ్’పేరుతో యుద్ధ క్షేత్రంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కచ్చితంగా బేరీజు వేసేందుకు సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాల (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్ల)కు రూపకల్పన చేస్తోంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు రాడార్లు, శాటిలైట్లు, డ్రోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని బలగాలకు అందజేస్తాయి. దీని సాయంతో ప్రత్యర్థి బలగాల ఆనుపానులను నిక్కచ్చిగా తెలుసుకునేందుకు వీలుంటుంది. 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్‌ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లను డజన్ల కొద్దీ ఏర్పాటు చేయనుంది. తాజాగా వ్యూహం అమల్లోకి వస్తే యుద్ధ క్షేత్రంలో కార్యకలాపాలను, నిఘాను విస్తృతం చేసేందుకు వీలవుతుంది. ఫలితంగా ఆర్మీ కమాండర్లు ఫ్రంట్‌లైన్ బలగాల మోహరింపు, యుద్ధ సామగ్రి తరలింపు వంటి విషయాల్లో వెంటవెంటనే మెరుగైన నిర్ణయాలు తీసుకునే వీలుకల్పించడమే దీని లక్ష్యమని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఇందులోభాగంగా, పర్వత ప్రాంతాలు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. పొరుగుదేశం చైనా చాలా రోజుల నుంచి ఇదే రకమైన వ్యవస్థల ఏర్పాటులో నిమగ్నమై ఉంది. భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ వ్యవస్థలను సమకూరుస్తోంది. దేశం 12 లక్షల పటిష్ట ఆర్మీ ‘ఆటోమేషన్, డిజిటైజేషన్, నెట్వర్కింగ్’కోసం ఇప్పటికే పలు పథకాలు అమలవుతున్నాయి. ప్రాజెక్ట్ శక్తి పేరుతో ఇప్పటికే ఏసీసీసీసీఎస్(ఆర్టిలరీ కంబాట్, కంట్రోల్, కమ్యూనికేషన్ సిస్టం) కింద వ్యవస్థల అప్‌గ్రేడ్ చేపట్టారు. దీనిని కూడా కొత్తగా ఏర్పాటయ్యే ప్రాజెక్ట్ సంజయ్‌తో అనుసంధానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి
-
విజయ్ తనయుడు హీరోగా ఉప్పెన రీమేక్!
తెలుగు చిత్రం ఉప్పెన పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి కృతి శెట్టి నైతిక ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. కాగా తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్ వారసుడు సంజయ్‌ను హీరోగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించినా, ప్రస్తుతం దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. విదేశాల్లో దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన ఈయన ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నాడు. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పెన చిత్ర రీమేక్‌లో సంజయ్‌ని హీరోగా నటింప చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఆ చిత్రంలో నటించిన కృతి శెట్టినే తమిళంలోనూ ఎంపిక చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే ది వారియర్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా టాలీవుడ్ నటుడు నాగచైతన్య నటిస్తున్న ద్విభాషా చిత్రం కస్టడీలో కూడా ఈమెనే నాయకి. ఇకపోతే ఉప్పెన చిత్ర రీమేక్‌లో నటించడానికి సంజయ్ ఊ అంటాడా? ఊహూ అంటాడా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
800 రకాల ఔషధాల 'ధరలు పెరుగుదల'
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 800 రకాల అత్యవసర మందుల ధరలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జ్వరం, బీపీ, షుగర్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ మందులన్నింటి ధరలు 12.12 శాతం పెరుగుతాయని కేంద్రం వెల్లడించింది. దీని వల్ల ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతారని, ఎక్కువ మందులు తీసుకునే వ్యక్తులపై భారం పడుతుందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ సంజయ్‌రెడ్డి అన్నారు. రక్త హీనత, మధుమేహం, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, టీబీ, వివిధ రకాల కేన్సర్లకు రోగులు ఉపయోగించే మందుల ధరలు పెరుగుతాయని చెపుతున్నారు. అలాగే మెడికల్ డివైజ్‌ల ధరలు కూడా భారీగా పెరుగుతాయని, జాతీయ ఔషధ ధరల నిర్ణాయక మండలి (ఎన్పీపీఏ) వీటి ధరలను పెంచిందని సంజయ్ పేర్కొన్నారు. అసలే కరోనా తర్వాత అనేకమంది పలు సైడ్‌ఎఫెక్ట్స్‌కు గురయ్యారు. దీంతో అనేకమంది నిత్యం పలు రకాల మందులు వాడుతున్నారు. మందుల ధరల పెంపువల్ల ఆదాయంలో కొంత భాగం వాటికి అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. డ్రగ్స్ (ప్రైస్ కంట్రోల్) ఆర్డర్, 2013 ప్రకారం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) సరళిని బట్టి ఈ ధరలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గతేడాది మందుల ధరలను 10.76 శాతం పెంచిన కేంద్రం.. ఈసారి ఏకంగా 12.12 శాతం పెంచింది. కాగా, ఏయే మందుల ధరలు పెరిగాయో వాటి జాబితాను కేంద్రం ఒకటిరెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని సంజయ్‌రెడ్డి తెలిపారు. -
Maharashtra: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ..
సాక్షి, ముంబై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది సూచనప్రాయంగా ఓ అంగీకారానికి వచ్చామని, వచ్చే ఎన్నికల్లో శిండే వర్గంతో కలిసే పోటీచేయనున్నట్లు బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ భావన్‌కుళే వెల్లడించారు. ఇరువురం కలిసి 200 స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున సీట్ల పంపకాలు, సర్దుబాట్లపై పలు చర్చలు జరుపుతామని ఆ తర్వాతే తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని భావన్ కుళే శనివారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా అందులో బీజేపీ 240, శివసేన (శిండే వర్గం) 48 స్థానాల్లో పోటీ చేస్తుందని బావన్కుళ్లే తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగనున్న నేపథ్యంలో దాదాపు ఏడాది కాలం సమయం అన్ని పారీ్టలకు ఉండగా...శిందే, బీజేపీ శిబిరంలో మాత్రం ఎన్నికల వాతావరణం అప్పుడే మొదలైనట్లు కనిపిస్తోంది. ఎంవీఏ ఒప్పందంతో మొదలైన వేడి మహా వికాస్ ఆఘాడి నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఫార్మూలా రూపొందించిన విషయం తెలిసిందే. మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో శివసేన 21, ఎన్సీపీ 19, కాంగ్రెస్ 8 స్థానాల్లో పోటీ చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిండే, ఫడ్నవీస్ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ శిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన మొదటి ప్రసంగంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మేం, బీజేపీ కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు. ఇరువురం కలిసి 200 స్థానాల్లో గెలుస్తామని ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. వైరల్ అవుతోన్న భావన్ కుళే వ్యాఖ్యలు ఇదిలాఉండగా చంద్రశేఖర్ భావన్ కుళే మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాల్లో పోటీ చేస్తుందని, దీంతో కార్యకర్తలందరూ ఇప్పటి నుంచి అప్రమత్తమై, పనుల్లో నిమగ్నం కావాలని సూచించినట్లు ఉంది. అంటే శిండే వర్గానికి కేవలం 48 స్థానాలు లభిస్తాయని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. భావన్ కుళే వ్యాఖ్యలపై శిండే వర్గానికి చెందిన సంజయ్ శిర్సాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఎంత వరకు మాట్లాడే అధికారముందో అంతే మాట్లాడాలని అంతకుమించి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ సీట్ల పంపకంపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని, ఇది కేవలం భావన్ కుళే అభిప్రాయమని స్పష్టం చేసి ఈ అంశానికి అక్కడితో తెరదించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చే అంశంపై దృష్టి కేంద్రీకరించామని శిర్సాట్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీట్ల పంపకంపై పలుమార్లు చర్చలుంటాయని, ఆ తర్వాత తుది నిర్ణయానికి రాగానే అధికారికంగా జాబితా వెల్లడిస్తామని తెలిపారు. అప్పటివరకు అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు సర్దుబాటు ఫార్మూలాపై వచ్చిన ఎలాంటి వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. -
రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో జరిగిన దారుణ ఘటనపై స్థానికులు రగిలిపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేసి.. అకారణంగా ఒకరిని పొట్టనబెట్టుకున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగలకు నేర చరిత్ర ఉన్నట్లు ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. మరోవైపు సంజయ్ మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని అతని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఏం జరిగిందంటే.. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడలోని ఓ పెట్రోల్ పంప్ వద్దకు కారులో ముగ్గురు యువకులు చేరుకున్నారు. అయితే.. సమయం దాటిపోవడం, పైగా వాళ్లు మద్యం మత్తులో ఉండడంతో పెట్రోల్ లేదని చెప్పారు కార్మికులు. అయితే.. తాము చాలా దూరం వెళ్లాలని ఆ యువకులు బతిమాలారు. దీంతో.. పెట్రోల్ పోశారు కార్మికులు. ఆపై వాళ్లు కార్డు పని చేయట్లేదని యువకులు బుకాయించారు. దీంతో.. క్యాష్ ఇవ్వమని సిబ్బంది కోరడంతో గొడవకు దిగారు. మాకే ఎదురు మాట్లాడుతారా? అంటూ ఆ మగ్గురు రెచ్చిపోయి బంక్ క్యాషియర్‌పై దాడికి దిగారు. అక్కడే పని చేసే సంజయ్ అది గమనించి.. వాళ్లను అడ్డుకోబోయాడు. దీంతో సంజయ్‌పై పిడిగుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది చూసి యువకులు పారిపోగా.. సంజయ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదు అయ్యాయి. కేసు నమోదు.. వెతుకులాట ఇదిలా ఉంటే.. సంజయ్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తపుణ్యానికే సంజయ్ ప్రాణం పోవడంతో అతని కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. మరోవైపు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూక్‌గా గుర్తించారు. ప్రస్తుతం వాళ్లను పట్టుకునే యత్నంలో ఉన్నారు. ఇక నిందితులు నిందితులు అనూప్, నరేందర్, మల్లేష్ పై నార్సింగిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారంతో పాటు దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ కంత్రీగాళ్లు. గత నెలలో స్థానికంగా ఓ విలేకరిపైనా దాడి చేశారు వీళ్లు. -
బిగ్‌బాస్ ఫేం వీజే సన్నీ హీరోగా కామెడీ చిత్రం
‘బిగ్ బాస్’ తెలుగు 5 సీజన్ విజేత వీజే సన్నీ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది.టాలెంటెడ్ రైటర్ ‘సంజయ్’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. వైవిధ్యమైన కథలను చిత్రీకరించడంలో పేరు పొందిన వి. జయశంకర్ దర్శకత్వ పర్యవేక్షణలో ఒక అద్భుతమైన వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. ‘‘చక్కని వినోదం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. శుక్రవారమే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించాం.. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. శివన్నారాయణ, శైలజ ప్రియ, సప్తగిరి, రేఖ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: మదీన్, దర్శకత్వ పర్యవేక్షణ: వి. జయశంకర్. -
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న దళపతి విజయ్ కుమారుడు! హీరోగా కాదు!
తమిళనాట దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. తమిళ హీరో అయిన విజయ్‌కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ నటించిన వారసుడు(తమిళంలో వారీసు) సంక్రాంతికి సందడి చేయనుంది. ఇదిలా ఉంటే ఆయనకు ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అతడి పేరు జాన్సన్ సంజయ్. గతంలో స్టేజ్‌పై తన డాన్స్ అందరిని ఆశ్చర్యపరిచిన సంజయ్ త్వరలోనే సినీ పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. చదవండి: ఆ ముద్దు కేసును కొట్టి వేయండి.. కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా ఈ నేపథ్యంలో సంజయ్ గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు ఆయన తాత, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. సంజయ్ త్వరలోనే ఇండస్ట్రీకి రాబోతున్నాడని ఆయన వెల్లడించాడు. అయితే హీరోగానో, నటుడిగానో కాదట. తెర వెనక ఉండి యాక్షన్ చెపుతాడట. అవును మీరు విన్నది నిజమే సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తాడట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయన తాత చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ తమిళ మీడియాతో ముచ్చటించిన ఆయన సంజయ్ ఎంట్రీపై స్పందించాడు. చదవండి: విడుదల ఇంకా కొన్ని రోజులే.. వారసుడు స్టోరీ లీక్! ప్రస్తుతం సంజయ్ విదేశాల్లో దర్శకత్వానికి సంబంధించిన పలు టెక్కికల్ కోర్సులు చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. ‘విజయ్ తనయుడు సంజయ్‌కి దర్శకత్వంపైనే ఆసక్తి ఎక్కువ. తాను డైరెక్టర్ అవుతానంటున్నాడు. అందుకే విదేశాల్లో దర్శకత్వానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటున్నాడు. అయితే తను డైరెక్టర్ అయ్యాక మొదట డైరెక్ట్ చేసేది విజయ్ సేతుపతిని. మొదట విజయ్ సేతుపతితో సినిమా తెరకెక్కిస్తానని, ఆ తర్వాత నాన్న(దళపతి విజయ్) సినిమా తీస్తాను’ అని నాతో చెప్పాడు. ఇది తెలిసి విజయ్ ఫ్యాన్స్ సంజయ్ త్వరలోనే యాక్షన్ చెప్పనున్నాడంటూ మురిసిపోతున్నారు. -
‘అనుమతిస్తే సరి.. లేదంటే కోర్టుకెళ్తాం’
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా యాత్ర కొనసాగించి తీరుతాం. అనుమతిస్తే సరి, లేదంటే కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటాం’అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, భండారి శాంతికుమార్, టి.వీరేందర్‌గౌడ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి తదితరులు సంజయ్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్‌ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘గతంలోనూ యాత్రకు రాతపూర్వక అనుమతి ఇవ్వలేదు. ఇప్పటివరకైతే అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నాం’అని అన్నారు. ఈ నెల 12న(సోమవారం) ఉదయం 10.30 గంటలకు కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని చిత్తారమ్మ ఆలయంలో సంజయ్ పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరనున్నారని తెలిపారు. అక్కడికి సమీపంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని కుత్భుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్‌తోపాటు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగే ఈ యాత్ర ఈ నెల 22న ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలోని పెద్దఅంబర్‌పేట వద్ద బహిరంగసభతో ముగియనుందని తెలిపారు. గ్రేటర్ ప్రజా సమస్యలే ఎజెండాగా.. ఆయా నియోజకవర్గాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లు, లబ్దిదారులకు అందని రాజీవ్ స్వగృహ ఇళ్లు, ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేసిన పోలీసుల తీరు, ట్రాఫిక్‌లో ప్రజల నరకయాతన, గతుకుల రోడ్లు, కాలుష్యం, చెరువుల కబ్జా వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని బీజేపీ నేతలు చెప్పారు. కాలనీల్లో దోమలబెడద, మంచినీటి సమస్య, విద్యుత్, ఆర్టీసీ చా ర్జీల పెంపు, పెట్రోల్‌పై వ్యాట్ తగ్గింపు వంటి అంశాలనూ ప్రస్తావిస్తామన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ -
మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. భారీ లక్ష్యంతో.. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న కార్లను భారత్‌లో పరిచయం చేస్తాం. బీవైడీ ఎలక్ట్రిక్ కారు ఈ6ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టాం. 450 యూనిట్లు విక్రయించాం. ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ కారు 520 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీపావళికి ప్రీమియం ఈ–ఎస్‌యూవీని ప్రకటించనున్నాం. జనవరి నుంచి డెలివరీలు ఉంటాయి. 2030 నాటికి ఈ–ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో దేశంలో 30 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకుంటాం. బీవైడీ భారత్‌లో ఇప్పటివరకు సుమారు రూ.1,185 కోట్లు వెచ్చించింది. -
Sajay Pandey: ఆటోలో ఈడీ విచారణకు మాజీ సీపీ
ఢిల్లీ: అత్యున్నత అధికారిగా ప్రభుత్వం నుంచి మన్ననలు, నిజాయితీపరుడిగా ప్రజల నుంచి పొగడ్తలు అందుకున్నారాయన. అలాంటి వ్యక్తి.. సాదాసీదాగా ఈడీ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబై మాజీ కమిషనర్ సంజయ్ పాండే మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఒంటరిగా ఆటోలో ఢిల్లీ ఈడీ కార్యాలయానికి సంజయ్ పాండే చేరుకోవడం.. ఒక్కరే విచారణను ఎదుర్కోవడం.. ఈడీ ప్రాంగణంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) కో-లొకేషన్ స్కామ్‌కు సంబంధించి విచారణ కోసం ఆయన హాజరయ్యారు. వారం కిందటే.. ఆయన ముంబై పోలీస్ కమిషనర్‌గా రిటైర్డ్ అయిన విషయం తెలిసే ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్‌లోని క్రిమినల్ సెక్షన్స్-50 ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఐసెక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల గురించి ఆయన్ని ప్రశ్నించింది ఈడీ. ఎన్ఎస్ఈ సెక్యూరిటీ అడిట్కు సంబంధించి.. కో-లొకేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఈ కంపెనీలోనూ చోటు చేసుకున్నాయి. పైగా ఈ కంపెనీని పాండేనే 2001 మార్చిలో స్థాపించారు. 2006లో దాని డైరెక్టర్‌గా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తల్లికుమారుడు.. ఆ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్‌ను 2018 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంజయ్ పాండే.. ఐఐటీ-కాన్పూర్ గ్రాడ్యుయేట్. హర్వార్డ్ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. బాంబే అల్లర్ల సమయంలో డీసీపీగా ఆయన తెగువ.. ప్రజల నుంచి మన్ననలు అందుకునేలా చేసింది. ఆర్థిక నేరాల విభాగం తరపున 1998లో కోబ్లర్ స్కామ్ ఆయన్ని వివాదంలోకి నెట్టింది. ఆపై సెంట్రల్‌డిప్యూటేషన్ మీద పీఎం సెక్యూరిటీ యూనిట్‌కు ఆయన ఎటాచ్ అయ్యారు. ముంబై కమిషనర్‌గా మాత్రమే కాదు.. మహారాష్ట్రకు తాత్కాలిక డీజీపీగానూ విధులు నిర్వహించారు కూడా. అయితే పోలీసులు విధులకు రాజీనామా చేసిన తర్వాతే ఆయన కంపెనీని స్థాపించగా.. అప్పటి ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకపోవడంతో తిరిగి విధుల్లో చేరారు. సమర్థవంతుడైన ఆఫీసర్‌గా పేరున్న సంజయ్ పాండే.. ఈడీ విచారణ ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. -
తీహార్ జైలు అధికారుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: యూనిటెక్ మాజీ ప్రమోటర్లు సంజయ్, అజయ్ చంద్రాతో కుమ్మక్కైయ్యారంటూ తీహార్ జైలు అధికారులు కొందరిని సస్పెండ్ చేయమని, వీరిపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా అందించిన నివేదిక ఆధారంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చంద్ర సోదరులు జైలు నుంచే దందా జరుపుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఈడీ విచారణ జరిపి నిర్ధారించింది. జైలు అధికారుల సస్పెన్షన్‌తో పాటు జైలు నిర్వహణపై ఆస్తానా సూచించిన సిఫార్సులను అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. విచారణ సందర్భంగా బెంచ్‌తో నిందితుల న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా వాదించారు. తన క్లయింట్‌కు ఫోరెన్సిక్ ఆడిట్ తాలుకు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఈ కేసులో తన క్లయింట్ నిర్ధోషని తేలితే కాలాన్ని వెనక్కు తిప్పలేరని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా భాషను తాము అంగీకరించమన్నారు. విచారణ మధ్యలో ఉన్నందున నివేదికలు ఇప్పుడే బహిర్గతం చేయలేమన్నారు. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. -
వరంగల్‌లో విషాదం: గొడవపడి.. కిటికీ నుంచి కిందపడి..
సాక్షి, వరంగల్/ నర్సంపేట: స్లైడ్ విండో పగులగొట్టిన ఘటనలో కాలేజీ యజమాన్యానికి జరిమానా కట్టాలన్న విషయంలో నలుగురు విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పోలీ స్‌స్టేషన్ పరిధిలోని బిట్స్ కాలేజీ క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రగాయాలైన విద్యార్థి సంజయ్ (18) ఆస్పత్రిలో అదేరోజు రాత్రి కన్నుమూశాడు. ఈ కేసులో విద్యార్థులు రాయపురపు హరి రాజు, గుండబాటు శివసాయి, ఎల్.మనోహర్, పెద్దబోయిన కృష్ణంరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూ డు రోజులక్రితం కిటికీ అద్దం పగిలినా మరమ్మతులు చేయని బిట్స్ చైర్మన్ రాజేంద్రప్రసాద్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. జరిమానా గలాటాకు దారితీసి.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన భాస్కర్, కవితలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్ నర్సంపేటలోని బిట్స్ కాలేజీలో పాలి టెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కా లేజీ తెరవడంతో ఈనెల 20న హాస్టల్‌కు వచ్చాడు. హరిరా జు, శివసాయి, మనోహర్, కృష్ణంరాజుతో కలిసి హాస్టల్ బ్లాక్‌లోని రెండో అంతస్తులోని 218 గదిలో ఉంటున్నాడు. మంగళవారం ఓ విద్యార్థి కారణంగా ఆ గదిలో స్లైడ్ విండో పగిలింది. దీంతో కాలేజీ యాజమాన్యానికి దాదాపు రూ. 15వేల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని సంబంధిత సిబ్బంది ఈ విద్యార్థులను హెచ్చరించారు. శుక్రవారం రాత్రి 7.50 గంటలకు భోజనం చేస్తున్న సమయంలో ఎవరు జరిమానా కట్టాలన్న చర్చ రావడంతో విద్యార్థుల మధ్య వాగ్వా దం జరిగింది. ఈ సమయంలోనే వారిని వారించబోయిన సంజయ్‌ని గట్టిగా తోసేశారు. దీంతో సంజయ్ 25 ఫీట్ల ఎత్తులో ఉన్న తమ గది నుంచి కింద పడ్డాడు. కింద సిమెంట్ గద్దె ఉండటం వల్ల తలతో పాటు వెన్నెముకకు బలంగా గాయాలయ్యాయి. రాత్రి 8.15కు షాక్ నుంచి తేరుకున్న విద్యార్థులు వార్డెన్‌కు సమాచారం అందించారు. వార్డెన్ వెంటనే సంజయ్‌ను నర్సంపేట సమీప ఆస్పత్రిలో ప్రాథ మిక చికిత్స అనంతరం, ములుగురోడ్డులోని అజర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సంజయ్ మృతిచెందాడు. అప్పటికే సమాచారం అందుకున్న తండ్రి భాస్కర్ ఆస్పత్రిలో విగతజీవిగా మారిన కొడుకును చూసి కన్నీరు మున్నీరయ్యారు. తన కుమారుడు మృతికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు ఆ నలుగురు విద్యార్థులు కారణమని నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంజయ్ మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించారు. కొట్టి చంపేశారు.. పదిరోజులు ఇంటినుంచే కాలేజీకి పోయి వచ్చిండు. అందులో ఉన్న నలుగురే అద్దం పగులగొట్టిండ్రు. వార్డెన్ కూడా నలుగురే జరిమానా కట్టాలన్నాడు. అయితే మా కుమారుడు కూడా జరిమానా కట్టాలని మిగిలిన విద్యార్థులు ఒత్తిడి తెచ్చిండ్రు. నేనెందుకు కడతనని సంజయ్ అనడంతోనే పిడిగుద్దులు గుద్దారు. కొట్టి చంపినంకనే కిటికీ నుంచి కిందపడేసిండ్రు. – కవిత, మృతుడు సంజయ్ తల్లి -
8 కోట్ల ఖరీదైన కారు.. మరి 35 వేలకు కక్కుర్తి ఎందుకు?!
ముంబై: శివసేన నేత, కళ్యాణ్‌కు చెందిన వ్యాపారవేత్త సంజయ్ గైక్వాడ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఖరీదైన కార్లలో తిరిగే మీకు.. ఇదేం దొంగ బుద్ధి.. సార్’’ అంటూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ హితవు పలుకుతున్నారు. అసలేం జరిగిందంటే.. సంజయ్ గైక్వాడ్ విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్) ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. తూర్పు కళ్యాణ్ ప్రాంతంలో గల కోక్సెవాడిలో ఉన్న గైక్వాడ్‌కు చెందిన కన్స్ట్రక్షన్ సైట్ వద్ద విద్యుత్ చైర్యం గురించి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రూ. 34,840 బిల్లుతో పాటు 15 వేల జరిమానా విధిస్తున్నట్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. జూన్ 30న ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం(జూలై 12)న సంజయ్ గైక్వాడ్ పెనాల్టితో కలిసి మొత్తం 49,840 రూపాయలు చెల్లించారు. ఈ మేరకు విద్యుత్ సంస్థ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన శివసేన శ్రేణులు.. సంజయ్ గైక్వాడ్‌పై వచ్చిన ఆరోపణలు సరికావని, ఆయనకు విద్యుత్ చౌర్యంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా సంజయ్ గైక్వాడ్ ఇటీవలే సుమారు 8 కోట్ల రూపాయలు వెచ్చించి రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కారు ఖరీదును ప్రస్తావిస్తూ నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. -
గొర్రెకుంట హత్యలు: కిరాతకుడికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు ఉరిశిక్ష పడింది. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో 9 మందికి మత్తు మందిచ్చి, బావిలో పడేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి ఇదే సరైన శిక్షని కోర్టు తేల్చింది. ఈ మేరకు వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి కావూరి జయకుమార్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు. ఈ హత్యలన్నీ ఉద్దేశపూర్వకంగా, పకడ్బందీ కార్యాచరణతో చేసినట్టు రుజువైంది. దీంతో బిహార్‌లోని బేగుసరాయి జిల్లా దౌలత్‌పూర్‌కు చెందిన సంజయ్ కుమార్‌కు ఉరిశిక్ష ఖరారైంది. ఇదీ జరిగిన ఘోరం.. ఈ ఉదంతంలో మృతులు పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు కాగా, నేరస్తుడు బిహార్ రాష్ట్రవాసి. సాక్షులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌తో పాటు వరంగల్‌వాసులు కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రాసిక్యూషన్ పక్షాన కేసు వాదించిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోగుళ్ల సత్యనారాయణగౌడ్ కథనం ప్రకారం.. సంజయ్‌కుమార్ (40) బతుకుదెరువుకు బిహార్ నుండి వలసవచ్చి వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలోని గోనె సంచుల తయారీ కర్మాగారంలో పని చేస్తున్నాడు. అక్కడే ఉండే వివాహిత రఫీకతో సహజీవనం చేస్తూనే ఆమె మైనర్ కూతురిపై కన్నేశాడు. దీంతో రఫీక హెచ్చరించడంతో పాటు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. కుటుంబసభ్యులతో మాట్లాడటానికి స్వరాష్ట్రానికి వెళ్దామని చెప్పి ఆమెతో కలిసి ఈ ఏడాది మార్చి 6న గరీభ్‌ర«థ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు రెండు వేర్వేరు టికెట్లు తీసుకున్నాడు. మార్గమధ్యంలో రఫీకకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగ తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయాక గొంతునులిమి నడుస్తున్న రైల్లోంచి ఏపీలోని నిడదవోలు స్టేషన్ సమీపంలో బయటకు నెట్టేశాడు. సంజయ్‌కుమార్ రాజమండ్రి స్టేషన్లో దిగి తిరిగి వరంగల్ వచ్చాడు. తిరిగొచ్చాక ఆమె మైనర్ కూతురును లొంగదీసుకొని తల్లి బతికే ఉందని నమ్మిస్తూ మోసం చేయసాగాడు. మరోపక్క రఫీక ఏదని ఆమె బంధువులైన మక్సూద్ ఆలం, నిషా ఆలం నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో తన నేరం బయటపడుతుందని భావించిన సంజయ్ మక్సూద్ కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించాడు. మే 20న మక్సూద్ ఆలం కుమారుడి పుట్టిన రోజు కాగా, మెడికల్ షాపు నుండి 60 నిద్రమాత్రలు కొని, ఆ రోజు రాత్రి భోజన సమయంలో కూరలో కలిపాడు. మక్సూద్ ఆలం, ఆయన భార్య నిషా ఆలం, కుటుంబసభ్యులైన సోహెల్ ఆలం, బూష్రా, బబ్లూ, షకీల్, షాబాజ్ అలీతో పాటు పక్క గదిలో ఉండే బిహార్‌కు చెందిన వలస కార్మికులు శ్రీరాంకుమార్, శ్యాంకుమార్ షా ఆ కూరతో భోజనం చేశారు. అందరూ స్పృహ కోల్పోయాక, ప్రాణాలతో ఉండగానే ఒక్కొక్కరిని గోనె సంచుల్లో వేసి గొర్రెకుంటలోని బావిలో పడేశాడు. మర్నాడు వీరి మృతదేహాలు బయటపడ్డాయి. మొదట ఆత్మహత్యలుగా.. ఒకపక్క కరోనా విలయతాండవం.. మరోపక్క లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఆకలికి అలమటించి, జీవితంపై విరక్తితో వీరంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడారని తొలుత భావించారు. శవాలను వెలికితీసి పోస్టుమార్టం చేయగా హత్యలుగా తేలింది. దీంతో కేసు నమోదుచేసి శరవేగంతో పరిశోధన చేసిన గీసుకొండ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నేరస్తుడు సంజయ్‌కుమార్‌ను అరెస్టుచేసి ఐపీసీ సెక్షన్లు 449, 328, 364, 380, 404, 354/సీ, 302, 201, సెక్షన్ 67 ఐటీ చట్టం కేసు నమోదు చేసి మే 26న కోర్టులో హాజరుపర్చారు. ప్రత్యేక కేసుగా భావించిన కోర్టు సత్వరమే నేరపరిశోధన చేసి చార్జిషీట్ దాఖలుచేయాలని ఆదేశించింది. దీంతో జూలై 28న చార్జిషీట్ దాఖలైంది. శరవేగంగా విచారణ..శిక్ష ఖరారు చార్జిషీట్లో వంద మంది సాక్షులను పేర్కొన్న ప్రాసిక్యూషన్ విచారణ సందర్భంగా 67 మందిని కోర్టులో హాజరుపర్చింది. సెప్టెంబర్ 21న విచారణ ప్రారంభించిన కోర్టు 40 రోజుల్లోనే.. ఈనెల 20కి విచారణ పూర్తిచేసి బుధవారం తీర్పు వెలువరించింది. సాక్ష్యాధారాలను పరిశీలించాక నేరం రుజువు కావడంతో నేరస్తుడు సంజయ్‌కుమార్‌కు చనిపోయేంత వరకు ఉరి వేయాలని జడ్జి జయకుమార్ తీర్పు వెల్లడించారు. ఐపీసీ సెక్షన్ 302 హత్యానేరం కింద ఉరిశిక్ష విధించిన జడ్జి జయకుమార్ నేరస్తుడిపై ఉన్న ఇతర అభియోగాలపై కూడా వివిధ సెక్షన్ల క్రింద జీవితఖైదు, జైలుశిక్ష, జరిమానా వి«ధిస్తూ తీర్పునిచ్చారు. కేసు సత్వర పరిశోధనలో మామునూరు ఏసీపీ జి.శ్యాంసుందర్, గీసుకొండ సీఐ జె.శివరామయ్య పాలుపంచుకోగా, లైజన్ ఆఫీసర్ దేవరకొండ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కానిస్టేబుల్ జె.లింగయ్య సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. -
సంజయ్‌కి ఉరి: కాళరాత్రి కథ!
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గొర్రెకుంట సామూహిక హత్యల కేసులో నిందితుడు సంజయ్‌కి ఉరి శిక్ష పడింది. బుధవారం వరంగల్ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. కేసు నమోదైన నాటినుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో నిందితుడికి శిక్ష పడింది. ఈ నేపథ్యంలో మరోసారి గొర్రెకుంట కేసు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వలస కార్మికులు కనబడుట లేదు కరోనా కష్టకాలంలో వలస కార్మికుల ఆకలితో అలమటిస్తున్న వేళ. గోనె సంచులు కుట్టే కర్మాగారంలో కొంతమంది బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు కనిపించకుండా పోయారు. దాని ఓనర్ సంతోష్ పిర్యాదుతో గీసుగొండ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకటం ప్రారంభించారు. వేరే రాష్ట్ర వలస కార్మికులు కదా! కరోనా వల్ల భయపడి వాళ్ల రాష్ట్రాలకు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఉంటారని అనుకుంటున్న సందర్భంలో, అదే రోజు మధ్యాహ్నం గోనె సంచుల గోడౌన్‌కు ప్రక్కన గల పాడుబడ్డ బావిలో నాలుగు శవాలు నీటిపై తేలి యాడుతున్నట్టుగా గుర్తించారు. అనుమానాస్పద మరణాల కింద కేసు నమోదు చేశారు. వారివి ఆత్మహత్యలుగా భావించారు. అయితే మిగతా వారు ఎక్కడ ఉన్నారు? వీరి ఆత్మహత్యలు చూసి భయపడి పారిపోయారా? లేక వీరినే హత్య చేసి పారిపోయారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కొద్దిరోజుల తర్వాత అదే పాడుబడ్డ బావి పాతాళం నుండి మిగతా 5 మృతదేహాలు తేలాయి. దీంతో భారతదేశం అంతా ఉలిక్కిపడింది. వరంగల్ నగర ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ( బిగ్ బ్రేకింగ్ : సంజయ్‌కు ఉరిశిక్ష) ఆత్మహత్యలా?.. హత్యలా?.. ఆ తొమ్మిది మందివి హత్యలా? లేక ఆత్మహత్యలా?.. హత్యలే అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు.. ఒకవేళ ఆత్మహత్యలు అయితే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చింది. దీని వెనుక ఉన్న బలమైన కారణాలు ఏమై ఉంటాయో? అని ప్రతి సగటు మనిషి మదిలో అనేక ప్రశ్నలు మెదిలాయి. ఈ కేసు పోలీసులకు ఒక గొప్ప సవాలుగా మారింది. వెంటనే ప్రజల భయాందోళనలను తెరదించటానికి స్వయంగా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఐపీఎస్, ఈస్ట్ జోన్ డీసీపీ కె. వెంకటలక్ష్మి రంగంలోకి దిగారు. నేర స్థలం, వారు నివసిస్తున్న ఇల్లు, పని చేస్తున్న గోడౌన్ల నుండి పలు పత్రాలు, ఐడెంటిటీ కార్డులు, వస్తువులు ద్వారా వీరి ఫోన్ నెంబర్లు సేకరించారు. చనిపోయే ముందు రాత్రి వీరు తినగా మిగిలిన ఆహార పదార్థాలను రసాయనిక పరీక్షల నిమిత్తం పంపారు. పోస్టుమార్టం చేసినప్పుడు కడుపులో నుండి తీసిన అవయవాలనూ కూడా రసాయనిక పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. చనిపోయే రాత్రి ఏం జరిగింది.. ఆరోజు మృతులు గోడౌన్లో పని చేశారా లేదా, ఆరోజు కార్మికులు ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు ఎవరెవరితో ఎవరు తిరిగారు, మృతులకు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఈ విధంగా మరణించడానికి గల కారణాలు ఏమిటి, అని అన్వేషించడం మొదలుపెట్టారు. అదుపులోకి సంజయ్ నేర స్థలానికి చుట్టుప్రక్కల బిగించిన సీసీ కెమెరాల ఆధారంగా, మృతుల సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లారు. నేర స్థలాన్ని బట్టి, మృతుల యొక్క స్థితులను బట్టి, సేకరించిన ఆధారాలను బట్టి, 9 హత్యలు చేసింది సంజయ్ కుమార్ అని నిర్ధారణకు వచ్చారు. అతడు కిరాయికి ఉంటున్న ఇంటి వద్ద అరెస్టు చేశారు. పోలీసు వారు తనదైన శైలిలో విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయట పడ్డాయి. వివాహితతో సహజీవనం.. మొదటి హత్య ఆరు సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం వరంగల్ చేరుకున్న నిందితుడు సంజయ్ కుమార్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని శాంతినగర్‌లోని గోనేసంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. ఇదే కేంద్రంలో పని చేస్తున్న మక్సూద్ ఆలం కుటుంబ సభ్యులతో నిందితుడు సంజయ్‌కి పరిచయం అయింది. ఇదే సమయంలో మక్సూద్ భార్య నిషా అక్క కూతురు పశ్చిమ బెంగాల రాష్ట్రానికి చెందిన రఫికాతో కూడా నిందితుడికి పరిచమైంది. క్రమ క్రమంగా రఫికాతో అతడి పరిచయం మరింత పెరగడంతో డబ్బు ఇచ్చి ఆమె ఇంటిలోనే భోజనం చేసేవాడు. ఇదే సమయంలో భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు నిందితుడు సంజయ్ మరింత దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గీసుగొండ మండలం జాన్ పాక్ ప్రాంతంలో నూతనంగా రెండుగదుల ఇంటిని కిరాయి తీసుకోని 4 సంవత్సరాల పాటు సహజీవనం చేశాడు. ఇదే క్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫికా కుమార్తెతో నిందితుడు చనువుగా ఉండడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన రఫీకా సంజయ్‌తో పలుమార్లు గొడవపడింది. అయిన కూడా సంజయ్ తన పద్ధతి మార్చుకోకుండా రఫీకా కుమార్తెతో మరింత సన్నిహితంగా వ్యవహరించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రఫీకా బెదిరించింది. నిందితుడు రఫీకాను అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. తమ పెళ్లి విషయాన్ని బంధువులతో ముచ్చటించేందుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్తామని రఫీకాను నమ్మించాడు. విశాఖపట్నం వైపు వెళ్లే గరీభ్ రథ్ ట్రైన్ ద్వారా వరంగల్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి వెళ్ళారు. నిందితుడు ట్రైన్లో ప్రయాణించే మార్గంలో మజ్జిగ ప్యాకేట్లను కొనుగోలు చేసి తనతో తెచ్చుకొన్న నిద్రమాత్రలను అందులో కలిపి రఫికాకు ఇచ్చాడు. నిద్ర మాత్రలు కలిపిన మజ్జిగ తాగిన రఫికాతో సంజయ్.. ట్రైన్స్ ఫుట్ బోర్డ్ వద్ద కూర్చోని ముచ్చుటించాడు. సుమారు తెలవారుజామున 3 గంటల ప్రాంతంలో నిడదవోలు వద్ద ప్రయాణికులు అందరు నిదిస్తున్న సయమంలో.. ప్రణాళిక ప్రకారం మత్తులో వున్న రఫీకాను ఆమె చున్నీతోనే గొంతు బిగించి చంపి.. నడుస్తున్న ట్రైన్ నుండి తోసేశాడు. దీనికి సంబంధించి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశాడు. సంజయ్ రఫికా చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగి తిరిగి మరో రైలులో వరంగల్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత రఫీకా పశ్చిమ బెంగాల్‌లోని తమ బంధువులు ఇంటికి వెళ్లినట్లుగా ఆమె పిల్లలను నమ్మించాడు. బెడిసికొట్టిన ఫ్లాన్: కనికరం లేకుండా మరో 9 హత్యలు కొద్ది రోజుల అనంతరం తన అక్క కుతూరు రఫీకా తమ బంధువుల ఇండ్లలో లేదని, రఫికా ప్రస్తుతం ఎక్కడ ఉందని మక్సూద్ ఆలం భార్య నిషా ఆలం సంజయ్‌ని గట్టిగా అడిగింది. పోలీసులకు సమాచారం ఇస్తానని బెదిరించ సాగింది. దీనితో కంగుతున్న నిందితుడు ఏదో విధంగా పోలీసులకు చిక్కుతానని భయపడి మాక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రఫీకాను చంపినట్లుగానే నిద్రమాత్రలతో కలిపి చంపాలని ప్రణాళికను రూపొందించుకున్నాడు. వారు పనిచేస్తూన్న గోనేసంచులు తయారీ గోదాంకు రోజు క్రమం తప్పకుండా వస్తుపోతూ గోదాం చుట్టు ప్రక్కల పరిసరాలను కూడా పరిశీలించేవాడు. చివరకు మక్సూద్ ఆలం, భార్య నిషా ఆలంను చంపి గోదాం ప్రక్కనే వున్న పాడుపడ్డ బావి పడవేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా మే నెల 20వ తారీఖు మక్సూద్ మొదటి కుమారుడైన షాబాజ్ ఆలం పుట్టిన రోజు అని తెలియడంతో ఆదే రోజు చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం మే నెల 18వ తేది వరంగల్ చౌరస్తాలోని ఓ మెడికల్ షాపులో నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. అనుకున్న పథకం ప్రకారం మే నెల 20వ తేదీన రాత్రి 7.30గంటల ప్రాంతంలో గోదాంకు చేరుకోని మృతులతో చాలా సేపు ముచ్చటించాడు. తనకు అనుకూలంగా ఉన్న సమయంలో వారికి తెలియకుండా తినే భోజనంతో పాటు, పైన గదిలో అద్దె కుంటున్న మరో ఇద్దరు శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలో కూడా నిద్రిమాత్రలు కలిపాడు. మరణించిన మక్సూద్, భార్య నిషా ఆలం, కూతురు బుధ్రా కాటూన్, కుమారులు షాబాజ్ ఆలం, సుహేల్ ఆలం, మనుమడు, ఇదే గోదాంలో నివాసం ఉంటున్న శ్యాం, శ్రీరాం, మహమ్మద్ షకీల్‌లు నిద్రమాత్రలు కలిపిన భోజనం చేయడంతో మత్తులోకి జారుకున్నాడు. సంజయ్ సాక్ష్యం లేకుండా ఉండాలనే ఆలోచనతో మత్తులో ఉన్న అందరిని చంపాలని నిర్ణయించుకోని ఆర్థరాత్రి 12.30 నుండి ఉదయం 5గంటల మధ్య సమయంలో మత్తులో ఉన్న తొమ్మిది మందిని గోదాం ప్రక్కనే ఉన్న పాడుపడ్డ బావి వద్దకు తరలించి బావిలో పడేశాడు. అందరు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం మృతుల గదుల నుండి వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసిన కిరాణ సామానుతో పాటు వారి సెల్ ఫోన్ల తీసుకుని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. -
ప్రేమించిన హీరో.. విషాదాన్ని పంచిన విలన్
దమ్మారో దమ్.. పాటను ఆస్వాదించిన వాళ్లంతా జీనత్ అమాన్ అభినయ మాయలో పడిపోయినవాళ్లే! హిందీ తారే అయినా అన్ని భాషల ప్రేక్షకులూ ఆమెను ఆరాధించారు.. అభిమాన మత్తులో తూలిపోయారు! తెర మీది ఆ వెలుగు జీనత్ జీవితాన్ని జన్నత్ (స్వర్గం)గా మార్చలేదు లవ్ లైఫ్‌ను నీడలా వెంటాడింది... అవమానాలు, చేదు అనుభవాలను మిగిల్చింది.. ఈ కథలో ఆమె ప్రేమించిన హీరో.. ఆమెకు విషాదాన్ని పంచిన విలన్ సంజయ్ ఖాన్!! జర్నలిస్ట్, మోడల్‌గా ఉన్న జీనత్ అమాన్ 1970లో ‘హల్చల్’తో నటిగా పరిచయం అయినా ‘హరే రామ హరే కృష్ణ’తోనే స్టార్డమ్ తెచ్చుకుంది. గ్లామర్‌కు గ్రామర్ నేర్పింది.. నటనను జోడించింది. 1977లో ‘అబ్దుల్లా’ సినిమా అవకాశంతో జీనత్ జీవితంలోకి ప్రవేశించాడు సంజయ్ ఖాన్. కథానాయకుడిగా సూపర్ హిట్స్ కన్నా ప్రముఖ హీరో ఫిరోజ్ ఖాన్ తమ్ముడిగానే గుర్తింపు అతనికి. ఆర్టిస్ట్‌గా కన్నా అందగాడిగానే ఫాలోయింగ్ ఎక్కువ. అతను హీరోగా నిలదొక్కుకుంటున్న నాటికే జీనత్ అత్యధిక పారితోషికం పొందుతున్న మేటి కథానాయిక. ఆమె అందం సంజయ్ఖాన్ను కలవరపెట్టింది. నిద్రలేకుండా చేసింది. చెప్పొద్దూ.. జీనత్కూ సంజయ్ ఖాన్ అంటే ఇష్టం మొదలైంది. కుర్రకారంతా ఆమె పేరు జపిస్తుంటే ఆమె సంజయ్ కోసం తపించింది. ‘అబ్దుల్లా’ లో హీరోయిన్గా చేయాలని సంజయ్ కోరగానే మారుమాట లేకుండా ఒప్పేసుకుంది. ఆ సినిమాకు పెట్టుబడీ పెట్టింది.‘అబ్దుల్లా’ షూటింగ్తోపాటే జీనత్, సంజయ్‌ల ప్రేమ కథా ప్రారంభమైంది. చిత్రీకరణ కోసం జైసల్మేర్ వెళ్లారు. అక్కడి ఇసుకతిన్నెలన్నీ వీళ్ల బాసలకు సాక్ష్యాలయ్యాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. మీడియా ద్వారా ఈ జంట అఫైర్ తెలుసుకున్న జీనత్ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆమెను హెచ్చరించారు. కారణం.. అతను అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి, ముక్కోపి కావడం. ‘కోపంలో ఉన్నప్పుడు సంజయ్ విచక్షణ కోల్పోతాడు. అతనివల్ల నీకు సమస్యలే కాని సంతోషం ఉండదు’ అని ఆమె పాత్రికేయ మిత్రులూ చెప్పారు. జీనత్ వినిపించుకోలేదు. అతని ప్రేమలో పిచ్చిదైంది. జైసల్మేర్‌లో.. వాళ్లు బస చేస్తున్న హోటల్లోనే ఆమెను నిఖా చేసుకున్నాడు సంజయ్ ఖాన్. ఆ రోజు గుండెనిండా ఊపిరి తీసుకుంది జీనత్. తన ఆప్తులకు ఫోన్ చేసి చెప్పింది.. ‘మీరు సంజయ్‌ను అనవసరంగా అనుమానించారు నన్ను నిఖా చేసుకున్నాడు’ అని. విన్న మిత్రులు ఏడ్వలేక నవ్వారు. అబ్దుల్లా షూటింగ్ అయిపోయింది. అందమైన జ్ఞాపకాలను మూటగట్టుకొని జీనత్ ముంబై వచ్చేసింది. లెక్కచేయలేదు.. పెడచెవినా పెట్టలేదు ఆ జంట ముంబైలో ల్యాండ్ అయ్యేలోపే వాళ్ల పెళ్లి వార్త బాలీవుడ్లో షికారు మొదలెట్టేసింది. సంజయ్ ఖాన్ భార్య జరీనానూ చేరింది. జీనత్‌తో తెగతెంపులు చేసుకోకపోతే పిల్లలను తీసుకొని ఇల్లు వదిలివెళ్లిపోతానని భర్తను బెదిరించింది జరీనా. ఆ మాటను అతను లెక్కచేయలేదు. అలాగని పెడచెవినా పెట్టలేదు. ఇటు జీనత్ నుంచీ ఒత్తిడి పెరిగింది. తమ నిఖాను బహిర్గతం చేయమని. జీనత్ అడిగింది చేయకపోగా ఆమెను వేధించడం మొదలుపెట్టాడు సంజయ్‌ఖాన్. ప్రతిసారి ఆమె పనిచేస్తున్న సినిమాల నిర్మాతదర్శకులు, పారిశ్రామిక వేత్తలతో సన్నిహితంగా ప్రవర్తిస్తున్నావంటూ ఆమెను దుర్భాషలాడ్డం.. జీనత్ ఎదురుతిరిగితే చేయిచేసుకోవడం.. ఆ ప్రేమలో సాధారణమైంది. ఈ సంగతి తెలిసిన జీతన్ ఫ్రెండ్స్ సంజయ్ మీద పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని చెప్పారట. ‘నేను అతణ్ణి ప్రేమిస్తున్నాను.. కాబట్టి సహిస్తాను’ అంటూ ఆమె ఘాటుగా సమాధానమివ్వడంతో మిన్నకుండిపోయారట వాళ్లు. ఒకరోజు.. షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌కి లోనావాలా వెళ్లింది జీనత్. అక్కడికి ఫోన్ చేశాడు సంజయ్ ‘అబ్దుల్లా కోసం ఓ పాటను రీషూట్ చేయాలి.. వెంటనే వచ్చేయ్’ అంటూ. హతాశురాలైన జీనత్ ‘అబ్దుల్లా పూర్తయిన తర్వాతే కదా ఈ సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు సడెన్‌గా డేట్స్ కావాలంటే ఎట్లా?’ అని ఆందోళనగానే అడిగిందట. అంతే మళ్లీ ఆమె శీలాన్ని కించపరిచేలా మాట్లాడి ఫోన్ పెట్టేసేడట అతను. తట్టుకోలేకపోయిన జీనత్ తన డేట్స్ గురించి వివరణ ఇచ్చేందుకు అప్పటికప్పుడే కారులో ముంబైకి బయలుదేరింది. తను ముంబై చేరుకునేటప్పటికి సంజయ్ హోటల్ తాజ్‌లో పార్టీలో ఉన్నాడని తెలిసేసరికి హోటల్ తాజ్‌కు వెళ్లింది జీనత్. అక్కడ జీనత్‌ను చూసిన సంజయ్ వెర్రి ఆవేశంతో ఆమె రెక్క పుచ్చుకొని పక్క గదిలోకి లాక్కెళ్లి చెంప మీద కొట్టాడట. ఆ విసురుకి జీనత్ కిందపడిపోతే ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపి మళ్లీ కొట్టాడట. ‘నేను నా డేట్స్ గురించే మాట్లాడ్డానికి వచ్చాను’ అని ఆమె చెబుతున్నా వినకుండా. ఆ దెబ్బలకు తట్టుకోలేక జీనత్ అరిచేసరికి పార్టీలోని వాళ్లంతా చుట్టూ చేరి చోద్యం చూశారట కాని ఎవరూ సంజయ్‌ను ఆపలేదట. ఆ పార్టీలో సంజయ్ భార్య కూడా ఉందని చెప్తారు. తన ఆవేశం తగ్గేవరకు జీనత్‌ను కొడ్తునే ఉన్నాడట సంజయ్. చివరకు పార్టీలో సర్వ్ చేస్తున్న ఓ బాయ్ అడ్డుపడి జీనత్‌ను పక్కకు తప్పించాడట. ఆ గాయాలకు జీనత్ దవడ ఎముక విరిగింది. కుడికన్ను చూపూ మందగించింది శాశ్వతంగా. ఆ సంఘటనతో సంజయ్ జీవితంలోంచి తప్పుకుంది జీనత్. మూడేళ్ల ఆ ప్రేమ హింసాత్మాకంగా ముగిసిపోయింది. -ఎస్సార్ ‘ది బెస్ట్ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్’ అని సంజయ్ ఖాన్ ఆత్మకథ రాసుకున్నాడు. అందులో తన దుష్ప్రవర్తన తాలూకు పశ్చాత్తాపం కాదుకదా కనీసం జీనత్ జిక్రీ కూడా లేదు. పైగా తానొక విధేయతగల భర్తనని, తండ్రినని చెప్పుకున్నాడు. ఇది చాలా వివాదాస్పదమైంది కూడా. ‘సంజయ్‌ను నా ప్రాణంకంటే ఎక్కువ ఇష్టపడ్డా. అందుకే భరించా. అప్పుడు నా మనసు నా మెదడు అధీనంలో లేదు’ అంటుంది జీనత్ జీవంలేని నవ్వుతో. -
ఏడడుగులకు రెడీ
తెలుగు, తమిళ చిత్రాల్లో హాస్య నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు విద్యుల్లేఖా రామన్. తమిళ క్యారెక్టర్ నటుడు, సినిమా జర్నలిస్ట్ మోహన్ రామన్ కుమార్తె విద్యుల్లేఖ. ఇన్నాళ్లూ కుమారి విద్యుల్లేఖగా ఉన్న ఆమె త్వరలో శ్రీమతి కానున్నారు. కొంతకాలంగా ఆమె న్యూట్రిషియనిస్ట్, ఫిట్నెస్ నిపుణులు సంజయ్‌తో ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో గత నెల 26న వీరి రోకా (ఇరు కుటుంబాలు పెళ్లి సంబంధం గురించి ఫార్మల్గా మాట్లాడి, ఫంక్షన్‌లా చేసుకోవడం) ఫంక్షన్ జరిగింది. ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియ ద్వారా తెలియజేశారు విద్యుల్లేఖా. కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి, ‘‘ఫొటోలు దిగినప్పుడు మాస్క్‌లు తీసేశాం. వేడుక జరుగుతున్నంతసేపూ మాస్క్‌లు పెట్టుకున్నాం’’ అన్నారు విద్యుల్లేఖా రామన్. -
మరో సీనియర్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సీనియర్ నాయకుడిని కాంగ్రెస్ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు సంజయ్ ఝాను సస్పెండ్ చేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర యూనిట్ చీఫ్ బాలాసాహెబ్ తోరత్ సంజయ్‌కు మంగళవారం నోటీసులు జారీ చేశారు. కాగా కాంగ్రెస్ నేత సంజయ్ ఝా.. పార్టీని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేయడంతో ఆయనను పార్టీ ప్రతినిధి పదవీ నుంచి ఇటీవల అధిష్ఠానం తొలగించిన విషయం తెలిసిందే. (పైలట్‌పై వేటు) అయితే తాజాగా గుజరాత్ రాజకీయాలపై స్పందించిన సంజయ్, సచిన్ పైలట్‌ను సమర్ధిస్తూ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. 2013 నుంచి 2018 వరకు పార్టీ కోసం సచిన్ పైలట్ తన రక్తం ధారపోసి, చెమట చిందించి పనిచేశారని, 21 సీట్లు ఉన్న కాంగ్రెస్‌ను 100 సీట్లకు పెంచిన కృషి సచిన్‌దేనని అన్నారు. దీంతో కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తూ అతనిపై వేటు వేసిన కొన్ని గంట్లోలనే సచిన్‌కు మద్దతు తెలిపిన సంజయ్ ఝాను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. (‘ప్రభుత్వాన్ని వ్యాపారంలా నడిపారు’) Shri Sanjay Jha has been suspended from the Congress Party with immediate effect for anti-party activities and breach of discipline. pic.twitter.com/TaT0gWbCc7 — Maharashtra Congress (@INCMaharashtra) July 14, 2020 -
సంజయ్ మొబైల్ సెర్చ్ హిస్టరీ అంతా అవే!
సాక్షి, వరంగల్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసుతో కదిలివచ్చిన పోలీస్ వాహనాలు, పలు విభాగాల అధికారుల హడావిడితో అట్టుడికిన గొర్రెకుంట ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని బార్దాన్ గోదాంలో పని చేసే వలస కూలీలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 9 మంది బావిలో శవాలై తేలిన కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసును త్వరగా ఛేదించడానికి ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ఎస్సై స్థాయి నుంచి ఐపీఎస్‌ల వరకు పోలీస్ అధికారులు, హైదరాబాద్ నుంచి సిటీ క్లూస్ టీం, టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైం, ఐటీ కోర్, సీసీఎస్, ఎస్బీ, ఇంటలిజెన్స్ విభాగం... ఇలా పోలీస్ శాఖలోని దాదాపు అన్ని ముఖ్య విభాగాలు పని చేశాయి. బావిలో మృత దేహాలు తేలిన ఈనెల 21 నుంచి 24 వరకు గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతం పోలీస్ వాహనాల రాకపోకలతో బిజీగా మారింది. తొమ్మిది మందిని ఎవరు హత్య చేసి ఉంటారా అనే అంశంపై ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూశారు. 6 ప్రత్యేక బృందాలు కేవలం 72 గంటల్లోనే హంతకుడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ( మొదట తల్లితో.. ఆపై కుమార్తెతో సాన్నిహిత్యం) ఓకే గూగుల్‌ను ఫుల్‌గా వాడేశాడు.. ఈ కేసులో నిందితుడు సంజయ్ కుమార్ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10 మందిని చంపిన అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. సంజయ్ 3వ తరగతి వరకు చదువుకున్నా గతంలో ఢిల్లీలోని ఓ సెల్‌ఫోన్ షాపులో పని చేసిన అనుభవంతో ఇంటర్ నెట్ ఉపయోగించడంలో దిట్ట. తనకున్న పరిజ్ఞానాన్ని నేరాలు చేయడం, తర్వాత తప్పించుకోవడం ఎలా అన్న విషయాలకే ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ టూల్లోని 'ఓకే.. గూగుల్' ఆప్షన్ ద్వారానే నేరాలకు అవసరమైన సమాచారాన్ని పొందాడు. ఓకే గూగుల్.. అంటూ ఎక్కువ కాలం మత్తునిచ్చే టాబ్లెట్ల పేరు ఏవని తెలుసుకుని తన ప్రణాళికను విజయవంతంగా అమలు చేశాడు. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు అతడి సెల్‌ఫోన్‌తో పాటు మృతుల సెల్ఫోన్ల కాల్ డేటా ఆధారంగా హంతకుడిని త్వరగా గుర్తించారు. అంతే కాకుండా హంతకుడు తన సెల్‌ఫోన్ ద్వారా యూట్యూబ్, గూగుల్ సెర్చ్ ద్వారా ఏఏ విషయాలను పరిశీలించాడనేవి పోలీసులకు క్లూస్‌గా మారాయి. ( ఖైదీ నంబర్ 4414 ) నిందితుడి వద్దనుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు అతడు వరంగల్‌లోని ఒక మెడికల్ షాపులో ఎక్కువ ధర చెల్లించి కొన్ని మాత్రలు కొనుగోలు చేసినట్టు సమాచారం. మత్తు కోసం చాలా మంది వ్యసనపరులు ఇలాంటి మందులను దొంగచాటుగా కొనుగోలు చేస్తుంటారు. సంజయ్ ఇదే కోవకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక సంజయ్ సెల్ ఫోన్ సెర్చ్ హిస్టరీ అంతా నేర పూరిత అంశాలు, అశ్లీల చిత్రాలు, వీడియోలతోనే నిండి ఉండడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. మహిళలతో బెడ్ రూమ్‌లో ఉన్న ఫోటోలు, నెట్లో డౌన్లోడ్ చేసిన అశ్లీల వీడియోలు వందల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. మనిషిని హత్య చేయడం సంజయ్‌కి టీ తాగినంత తేలిక. అతడిలో అపరాధ భావం మచ్చుకైనా కానరావడం లేదని తెలుస్తోంది. విచారణలో పోలీసులను కూడా ముప్పుతిప్పలు పెట్టినట్టు సమాచారం. ఆపస్మారక స్థితిలో ఉన్న తల్లి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల వద్ద గుక్కపట్టి ఏడుస్తున్న మూడేళ్ల బాలుడి కన్నీళ్లు కూడా సంజయ్‌ను కదిలించలేకపోయాయి. ఆ చిన్నోడి ఏడుపు తన నేరానికి అడ్డు అవుతుందని భావించి కొట్టి, గొంతు పిసికి, ప్రాణం ఉండగానే బావిలో పడేశానని పోలీసుల విచారణలో సంజయ్ ఒప్పుకున్నాడు. ( పూడ్చి పెట్టారు.. పోస్టుమార్టం నివేదికలో ఏముంది?) సంజయ్ సైకిల్ కీలకంగా మారిన సీసీ కెమెరాలు మృతులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావడం, హంతకుడు ఎవరో తెలియకపోవడంతో తొలుత పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. అయితే గొర్రెకుంట ప్రాంతంతోపాటు వరంగల్ వెంకట్రామా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఈ ఫుటేజీల్లో సంజయ్ వరుసగా ఐదు రోజులుగా సైకిల్‌పై వచ్చి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తొమ్మిది మందిని హత్య చేసిన తీరుతో పాటు వీటన్నింటికి కారణమైన రఫికా హత్య వివరాలు తెలుసుకోవడం పోలీసులకు సులువైంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే ఎంతటి క్లిష్టమైన కేసునైనా సులభంగా చేధించవచ్చునని మరోసారి నిరూపితమైందని పోలీసులు చెబుతున్నారు. -
మా అబ్బాయి వస్తానంటే యస్ అన్నాను
‘‘తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటే తమ పిల్లల్ని కూడా ఆ రంగంలో పైకి తీసుకురావాలనుకుంటారు.. నేను కూడా అలాగే అనుకున్నాను. మా అబ్బాయి సంజయ్ సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు ‘ప్రయత్నించు.. వర్కౌట్ అయితే ఉండు.. లేకపోతే నీకు నచ్చింది చేసుకో’ అన్నాను. ఒక తండ్రిగా ఎంత సహకారం అందించాలో అంత చేశా. తనని సోలో హీరోగా పరిచయం చేయొచ్చు. కానీ, ఒక మంచి పాత్ర ద్వారానే తెలుగు ప్రేక్షుకులకు దగ్గరవ్వాలని ‘ఓ పిట్టకథ’ సినిమా చేశాడు’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ– ‘‘ఓ పిట్టకథ’లో అమలాపురంలో ఉండే ఒక ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ పాత్రలో నటించాను. నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అదృశ్యం అవుతుంది.. ఎలా అదృశ్యం అయింది? అనే కోణంలో నా పాత్ర సాగుతుంది. ఈ సినిమాలో మంచి స్క్రీన్‌ప్లే ఉంది. తెలుగులో ఇంతవరకూ ఇలాంటి స్క్రీన్‌ప్లే రాలేదు. థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. నేను యంగ్‌గా కనిపించడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.. జీ¯Œ ్స ప్రభావం అంతే. ఇండస్ట్రీలో అందరి హీరోలతో మంచి బంధాల్ని కొనసాగిస్తున్నాను. హీరోలందరూ ఫ్రెండ్సే. కలిసి పార్టీలు చేసుకుంటాం.. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉంటారు. ‘ఓ పిట్టకథ’ సినిమాని దర్శకులు కృషవంశీ, అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, హను రాఘవపూడి.. వంటి వారు చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది.. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
నాన్న పొగిడారని పార్టీ చేసుకున్నాను
‘‘బ్యాక్‌గ్రౌండ్ ఉంటే అవకాశాలు వచ్చేస్తాయి అనుకోవడం సరైన అభిప్రాయం కాదు. బ్యాక్‌గ్రౌండ్ తొలి అవకాశం వరకే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవ్వరైనా కష్టపడాల్సిందే’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్. ‘ఓ పిట్ట కథ’ సినిమా ద్వారా సంజయ్ హీరోగా పరిచయం అవుతున్నారు. విశ్వంత్, సంజయ్, నిత్యా శెట్టి ముఖ్యపాత్రల్లో దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కించిన ఈ సినిమాను వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 6న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ– ‘‘చిన్న ప్పుడు ‘లిటిల్ సోల్జర్స్’ సినిమా కోసం సింగింగ్ ఆడిషన్స్ ఉంటే హాజరయ్యాను. ఆ తర్వాత చదువులో నిమగ్నమయ్యాను. ఉద్యోగం చేయడం సుఖమైన మార్గం అని అమ్మ అభిప్రాయం. అలానే మాస్టర్స్ పూర్తి చేసుకొని లండన్‌లో జాబ్ చేశాను. ఆరేళ్లు జాబ్ చేసిన తర్వాత డబ్బు సంపాదించడం తప్ప ఏం చేస్తున్నాం? అనిపించింది. ఇండస్ట్రీకి రావాలనుకున్నాను. నాన్నగారు సరే అన్నారు. బాంబేలో అలోక్ మాస్టర్ దగ్గర ఆ తర్వాత తెలుగులో దేవదాస్ కనకాలగారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ‘నక్షత్రం’ సినిమాకు కృష్ణవంశీ గారి దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను. ఆ తర్వాత దర్శకుడు చందు ‘ఓ పిట్ట కథ’ కథతో వచ్చాడు. ఈ సినిమా కోసం మూడేళ్లుగా కలసి పని చేశాం. అమలాపురంలో ఓ టూరింగ్ టాకీస్‌లో పని చేసే కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. తొలిరోజు నాన్నతో కలిసి పని చేసేటప్పుడు ఆయనేం అనుకుంటారో అని టెన్షన్ పడ్డాను. సీన్ అవ్వగానే అమ్మకి ఫోన్ చేసి చెప్పారు. నాన్న నాతో ఏదీ డైరెక్ట్‌గా చెప్పరు. నాన్న అమ్మతో చెబితే అమ్మ నా భార్యకు చెబుతుంది. తను నాకు చెబుతుంది (నవ్వుతూ). చిన్నప్పుడు కోప్పడితే కొన్నిరోజులు మా ఫ్రెండ్ ఇంట్లో దాక్కున్నాను. అందుకే అలా. సాధారణంగా ఆయన నన్ను పొగడరు. ఈ సినిమా చూసి బాగా చేశాడని చెప్పారు. ఆరోజు ఫ్రెండ్స్‌తో కలసి పార్టీ చేసుకున్నాను. ప్రస్తుతం కిశోర్ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా పూర్తి చేశాను’’ అన్నారు. -
నేను రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా: జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కోసం తాను పదవీ త్యాగం చేస్తానని చెప్పారు. జగిత్యాల నుంచి పోటీ చేయాలని కవితను కోరుతానని తెలిపారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన హుజూర్ నగర్ స్థానం నుంచి కవిత పోటీ చేయబోరని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా టీఆర్ఎస్లో అదిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుందని చెప్పారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కవిత ఘోరంగా ఓడిపోయిన సంగతి తెల్సిందే. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో 70 వేల 875 ఓట్ల తేడాతో కవిత ఓటమి చవిచూశారు. అయితే రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో కవిత నిలబెడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది. -
ముంబై మిస్సమ్మ
ఇల్లు కావాలంటే ఇల్లాలు ఉండాలిముంబైలోని గవర్నమెంట్ హౌజింగ్ స్కీమ్‌లో తప్పనిసరి నిబంధన అది!ప్రభుత్వమే తప్పనిసరి అన్నప్పుడు తప్పుతుందా? ఏడు తప్పటడుగులు వేయక తప్పుతుందా?మన మిస్సమ్మలాగే!రామారావు, సావిత్రి ఉద్యోగం కోసం మిస్టర్ అండ్ మిసెస్ అయితే అక్కడ ముంబైలో వాళ్లు ఫ్లాట్ కోసం మిస్సమ్మ, మిస్సయ్య అయ్యారు!ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘లవ్ పర్ స్క్వేర్ ఫూట్’ సినిమా! ‘‘ఇవ్వాళ్రేపు భార్యాభర్తలంతా ప్రతి రెస్పాన్స్ బులిటీని కలిసే షేర్ చేసుకుంటున్నారు తెల్సా? కలిసి గిన్నెలు కడుక్కోవడం.. బట్టలుతుక్కోవడం.. కలిసి ఆఫీస్‌కు వెళ్లడం..ఇలాఅన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ’’ కరీనా .‘‘సండేస్ చిల్‌గా.. బయటనుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం...’’ సంజయ్.‘‘బయటనుంచి ఎందుకు? భార్యాభర్త ఇద్దరూ కలిసి వంట చేసుకుంటే ఎంత రొమాంటిక్‌గా ఉంటుంది?!’’ కరీనా. ‘‘ఎన్నాళ్ల నుంచి మీ ఫ్రెండ్షిప్?’’ బ్లాసమ్.‘‘వన్ మంత్ నుంచి ఆంటీ!’’ సంజయ్.‘‘ఆ జీవన్ వాలా ఫ్లాట్ ఎప్పుడు తీసుకున్నారు?’’ బ్లాసమ్.‘‘ మొన్ననే’’ ఉత్సాహంగా సంజయ్.‘‘లవ్? ఈరోజు పొద్దునా?’’ బ్లాసమ్ వెటకారం.‘‘మమ్మీ..’’ వారించింది కరీనా.నిట్టూరుస్తూ సోఫాలోంచి లేచింది ‘‘చికెన్ పాటీస్ తెస్తా. తింటాడుగా అతను’’అని సంజయ్‌ను ఉద్దేశించి కూతురిని అడుగుతూ.‘‘లేదాంటీ.. నేను వెజిటేరియన్’’ సంజయ్. ‘‘ ఫిష్?’’ బ్లాసమ్‘‘లే.. దాంటీ’’ తల అడ్డంగా తిప్పాడు.‘‘మరి ఈమెకు చచ్చేంత ఇష్టం కదా?’’ అవాక్కయింది బ్లాసమ్. ‘‘ఓ మైగాడ్.. నువ్వు హిందువుగా కన్వర్టవుతున్నావా?’’ కంగారు పడుతూ కూతురితో. ‘‘నో..’’ , ‘‘అయ్యో లేదాంటీ’’ కరీనా, సంజయ్ ఒకేసారి.‘‘మరి పిల్లలు?’’ అడిగింది బ్లాసమ్.‘‘మమ్మీ... ఇక ఆపుతావా నువ్వు?’’ కోపంగా కరీనా.‘‘ఆపను. అతనిది వేరే మతం. వాళ్ల సంప్రదాయాలు, ఆచారాలు తెలుసా నీకు? కలిసి బతకాలి’’ విసురుగా కూతురికి సమాధానమిస్తూనే – ‘‘పిల్లలు? హిందువులవుతారా? క్రిస్టియన్సా?’’ ప్రశ్నిస్తుంది సంజయ్‌ని.‘‘మమ్మీ.. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు’’ కోపాన్ని అణచుకుంటూ కరీనా.‘‘తర్వాత ఎప్పుడు? అంతా అయిపోయాకా?’’ కూతురిని వారించి – ‘‘నువ్వు దేవుడిని నమ్ముతావా?’’ అడుగుతుంది సంజయ్‌ని.‘‘నమ్మను ఆంటీ’’ చెప్తాడు ‘‘గుడ్.. ఈమె కూడా నమ్మదు’’ కూతురిని చూపిస్తూ బ్లాసమ్. ‘‘చూడూ.. సంజయ్! కష్టపడి పెంచా ఈమెను. అదేమీ తనకు పట్టదు. కేర్ చేయదు. అయినా నా చింతల్లా ఈ పిల్ల గురించే. ఒక్కగానొక్క కూతురు. రేప్పొద్దున తనకేమన్నా అయితే..’’ బ్లాసమ్. ‘‘ఆంటీ.. నేను చతుర్వేది. తను డిసౌజా. నాకు పన్నీర్ అంటే ఇష్టం. తనకు ఫిష్ అంటే! మా ఇద్దరికి ఇవి అడ్డు కావు. కరీనా నా ప్రాణం. జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. పెళ్లయ్యాక చిన్న చిన్న స్పర్థలొచ్చినా వాటికి మతం మాత్రం రీజన్ కాదని ప్రామిస్ చేస్తున్నా ఆంటీ! ఇక మా పిల్లల గురించి అంటారా? జీసస్‌ను కొలుస్తారా.. ఆంజనేయస్వామిని తలుస్తారా? సచిన్ టెండూల్కర్‌ను పూజిస్తారా? వాళ్లిష్టం ఆంటీ! ఇప్పుడైతే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. బ్లెస్ చేయండి’’ విన్నవించుకున్నాడు సంజయ్.∙∙ ‘‘నాన్‌వెజ్ తినే అమ్మాయి ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు’’ వంటింట్లో భోజనం చేస్తూ సంజయ్ తండ్రి భాస్కర్.‘‘నాన్నా.. ’’బాధగా సంజయ్.ముందుగదిలో కొడుకు కొనబోయే ఫ్లాట్ తాలూకు నక్షా చూస్తూ ‘‘ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేసుకున్నావ్?’’ అడిగింది కొడుకును అతని తల్లి లత. మొన్ననే అన్నట్లు సైగ చేశాడు. ‘‘నీ పేరు మీదే ఉంటుందా ఇల్లు?’’ ఆమె. కాదు అన్నట్టు తలాడించాడు కొడుకు. ‘‘ఇద్దరి పేరు మీదనా?’’ ఆమె. అవునన్నట్టు తలూపాడు సంజయ్. ‘‘ఆ పిల్ల పేరు విన్నావా? డిసూజా అట డిసూజా’’ లోపలి నుంచి తండ్రి. ‘‘ఎందుకలా మాట్లాడ్తారు నాన్నా.. మీరు సంతోషపడ్తారనుకున్నా..’’ ‘‘అలా అనుకున్నవాడివి అంతా అయ్యాకే చెప్పాల్సింది?’’ తండ్రి.‘‘పెళ్లయితే చేసుకోలేదు కదా?’’ తల్లి ఆందోళనగా. లేదన్నట్టు తలూపాడు కొడుకు. ‘‘తెల్లగా ఉంటుందా?’’ తల్లి ఉత్సుకత. ‘‘రేపు నువ్వే స్వయంగా చూడు’’ తల్లితో సంజయ్. ‘‘ఇంటి కోసం కిరస్తానీ పిల్ల చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏం ఉండింది? నన్ను అడిగితే సర్దకపోయేవాడినా డబ్బు?’’ కోపగిస్తున్నాడు తండ్రి.‘‘ఆ.. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు చేతకాలేదు కానీ.. రిటైర్మెంట్ తర్వాత సర్దుతాడట సర్దుతాడు’’ అని లోలోపలే సణుక్కుంటూ కూర్చున్న చోట నుంచే వంటింట్లోకి తొంగి చూస్తూ ‘‘మీరు ప్రశాంతంగా భోంచేయండీ..’’అంది భర్తతో. ‘‘చతుర్వేది వంశం పేరు ఏం కాను?’’తండ్రి కొనసాగింపు. ‘‘అవును పాపం.. రోజూ పేపర్లలో హెడ్‌లైన్స్ అన్నీ చతుర్వేది వంశం గురించే!’’భర్తతో వెటకారమాడి కొడుకును ప్రశంసించింది. ‘‘చతుర్వేది కుటుంబం నాలుగు తరాల్లో ఓ ఇంటి యజమాని అవుతోంది నువ్వేరా’’ అంటూ! లోపల్నుంచి ఇంకేదో గొణుగుతున్న భర్తతో.. ‘‘అయిందేదో అయిపోయింది. పోనిద్దురూ! పిల్లల్ని దీవిద్దాం’’ అంది. ‘‘బ్లాసమ్గారూ... మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండీ’’ సంజయ్ తండ్రి భాస్కర్.‘‘నాక్కూడా. ఇదిగో ఈ బ్రౌనీస్ తీసుకోండి.. నేనే చేశాను’’ అంటూ కూడా తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ మూత తెరిచి పక్కనే కూర్చున్న సంజయ్ తల్లి లత ముందుకు చాపింది బ్లాసమ్. ఆమె మొహమాట పడ్తూంటే – ‘‘ఎగ్ లెస్.. ఎగ్ లేకుండా చేశాను’’ నిర్ధారించింది బ్లాసమ్. ధైర్యంగా తీసుకొని భర్తకు ఇచ్చింది లతా. అతను చిన్న ముక్క తీసుకొని ‘‘మా ఇంట్లో నాన్‌వెజ్ అస్సలు నడవదు’’ అన్నాడు. ‘‘యెస్.. మా ఇంట్లో వెజ్ ఎవరూ తినరు’’ చెప్పింది బ్లాసమ్. ‘‘ఎవరూ తినరా? ఎవ్వరూ? అలా అయితే ఈ పెళ్లి ఎలా కుదురుతుంది?’’ కంగారుగా భాస్కర్. ‘‘అదే.. నేనూ అడిగా వీళ్లను ఎలా కుదురుతుంది అని?’’ బ్లాసమ్.పిల్లలిద్దరూ ఆందోళనపడుతుంటే.. ‘‘అరే.. ఎందుకు కుదర్దు? వాళ్లిద్దరూ ఒకింటి వాళ్లయ్యాక.. వాళ్లకంటూ కొన్ని నియమాలు ఏర్పర్చుకుంటారు..’’ అని లత సర్దిచెప్పబోతుంటే ‘‘ఒకింటి వాళ్లు.. అంటే ఇల్లు లేకపోతే పెళ్లి చేసుకోరా? ఇల్లు కోసమే పెళ్లి చేసుకుంటున్నారా?’’ వ్యంగ్యంతో అడ్డుకున్నాడు భాస్కర్.‘‘అయ్యో లేదంకుల్.. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం’’ కరీనా. ‘‘ఒరేయ్.. నువ్వూ చెప్పరా?’’ మిన్నకున్న కొడుకుతో లత. ‘‘అవున్నాన్నా.. ప్రేమించుకున్నాం’’ చెప్తాడు సంజయ్. అలా ఆ ప్రేమ .. వాళ్లు కలలు కన్న సొంతింటి ప్రాంగణంలోనే పెళ్లితో సుఖాంతం అవుతుంది. అయితే ఓ ట్విస్ట్‌తో. దానికి కారణం సంజయ్ బాస్ రాశీ. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్ సంజయ్. అదే బిల్డింగ్‌లో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని కరీనా. హోమ్‌లోన్ కోసం అప్లయ్ చేసుకుంటాడు అతను. రిక్వైర్డ్ శాలరీ లేదని లోన్ రిజెక్ట్ చేస్తుంది కరీనా. అంతకుముందు రోజే ఓ కామన్ ఫ్రెండ్ పెళ్లి రిసెప్షన్లో పరిచయం అవుతుంది ఇద్దరికీ. హోమ్ లోన్ రిజెక్షన్‌తో ఒకరి వివరాలు ఒకరికి పూర్తిగా తెలుస్తాయి. సంజయ్ తండ్రి రైల్వేలో ఎనౌన్సర్. కరీనాకు తండ్రి ఉండడు. మేనమామ ఇంట్లో ఉంటుంది తల్లితో కలిసి. ఇరుకు క్వార్టర్స్‌లో పెరిగిన సంజయ్‌కి, మేనమాల దయాదాక్షిణ్యాల మీద ఉంటున్న కరీనాకు ఒకటే లక్ష్యం.. కష్టార్జితంతో ఇల్లు కొనుక్కోవాలని. అలా ఆ ఇద్దరూ కలిసి జాయింట్ హోమ్ లోన్‌కు అప్లయ్ చేస్తారు ‘జీవన్సాథీ’అనే హౌజింగ్ స్కీమ్‌లోని ఫ్లాట్ కోసం. అది పెళ్లయిన జంటలకే కాబట్టి ఇంటికోసం పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ క్రమంలో నిజంగానే ఇద్దరూ ప్రేమలో పడ్తారు. కాని అప్పటికే కరీనా జీవితంలో తల్లి చూసిన పెద్దింటి కుర్రాడు సామ్యూల్ మస్కిటా ఉంటాడు. కరీనా ఇండిపెండెంట్‌గా ఆలోచించే స్త్రీ. ఆమె ఇండిపెండెన్స్ సామ్యూల్కి నచ్చదు. ఆ స్వతంత్ర వ్యక్తిత్వాన్నే సంజయ్ ప్రేమిస్తూంటాడు, గౌరవిస్తుంటాడు. దాంతో సామ్యూల్ మ్యాచ్‌కి బ్రేక్ చెప్పి.. సంజయ్‌తో బంధాన్ని బలపర్చుకుంటుంది. సంజయ్ విషయానికి వస్తే.. అతని బాస్ రాశి ఓ వివాహితురాలు. ఆమె భర్త విదేశాల్లో బిజినెస్ చేస్తుంటాడు. ఒంటరితనం వల్ల సంజయ్‌కి దగ్గరవుతుంది. అదంతా ప్రేమ అనుకుంటాడు సంజయ్. బాస్‌ను ఇష్టపడడం మొదలుపెడ్తాడు. భర్తకు విడాకులు ఇచ్చేసి తనను పెళ్లిచేసుకోమంటాడు. ఆమె కోసం ఇల్లూ కొంటున్నట్టు చెప్తాడు. సంజయ్ స్టోరీ అక్కడిదాకా వెళ్లేసరికి ఖంగు తింటుంది రాశీ. వదిలించుకోవడానికి భర్తను ఈ దేశానికి రప్పిస్తుంది. వాళ్ల అన్యోన్యత చూపి పక్కకు తప్పుకుంటాడు సంజయ్. అప్పుడే కరీనాతో ప్రేమలో పడ్తాడు. అది తెలిసిన రాశీ .. సంజయ్‌ను మళ్లీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని.. తన బర్త్‌డే రోజు పార్టీలో బాగా తాగించి.. అతను తనతో గడిపినట్టు ఫోటోస్ తీస్తుంది. వాటితో బ్లాక్మెయిల్, ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎమోషనల్ బ్లాక్మెయిలూ చేస్తుంది. ఇదంతా తెలిసిన కరీనా హర్ట్ అయ్యి ఇంటివరకే అగ్రిమెంట్ అని చెప్పేస్తుంది సంజయ్‌తో. బాధ పడ్తాడు అతను. ఆ రాత్రి రాశీతో ఏమీ జరగలేదని ఎంత చెప్పినా కరీనా వినదు. తర్వాత రాశే చెప్తుంది తను డ్రామా ఆడానని. సంజయ్ పట్ల కరీనాకున్న అపార్థమూ తొలగిపోతుంది. ఇంటికోసం స్టార్ట్ అయిన ఆ లవ్ స్టోరీ. హండ్రెడ్ పర్సెంట్ ప్రేమగా మారి.. ఆ ఇంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బాధ్యతలను పంచుకునే కాపురంగా ఎండ్ అవుతుంది. సంజయ్ చతుర్వేదిగా విక్కీ కౌశల్, కరీనా డిసూజాగా అంగీరా ధార్ నటించారు. సొంత ఇల్లు అనే బ్యాక్‌డ్రాప్‌లో మతసామరస్యాన్ని చాటిన చక్కటి కథ. కులమతాలకతీతంగా పిల్లలు ఒక్కటైతే.. పరువు తీశారని హత్యలతో ఆవేశపడక .. అండగా నిలబడే ఆలోచన చేయాలి. కష్టానష్టాలకు ఓర్చుకునే సహనాన్ని అవర్చాలని సూచించే సినిమా లవ్ పర్ స్క్వేర్ ఫూట్! – సరస్వతి రమ -
రోజంతా హైడ్రామా
నిజామాబాద్‌అర్బన్: లైంగిక వేధింపుల కేసులో రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ విచారణకు హాజరు కావడం, ఆయనను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు తీవ్రంగా యత్నించడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. చివరకు ఫ్యామిలీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. నర్సింగ్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌పై పోలీసులు నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా, సీఆర్పీసీ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసి, విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పోలీసులు నోటీసులు జారీ చేయగా, సంజయ్ ఆదివారం ఉదయం 11 గంటలకు ఏసీపీ సుదర్శన్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సంజయ్‌ని విచారించిన పోలీసులు.. అక్కడి నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గంగాస్థాన్‌లో నివాసముండే మొదటి అదనపు జడ్జి మేరి సార దానమ్మ ఎదుట ప్రవేశపెట్టారు. ఏసీపీ సుదర్శన్ రిమాండ్ రిపోర్టు సమర్పించగా, జడ్జి పలు సందేహాలను లేవనెత్తారు. రిమాండ్‌కు తరలించేందుకు నమో దు చేసిన అభియోగాలు సక్రమంగా లేకపోవడం పై ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన రెండ్రోజులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై జడ్జి ప్రశ్నించినట్లు సంజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఏసీపీ సుదర్శన్ సీపీ కార్తికేయను కలిసి మరోసారి రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసుకొని సాయంత్రం 6 గంటల జడ్జికి సమర్పించారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ని అదుపులో ఉంచుకొని, సోమ వారం కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. దీంతో సంతృప్తి చెందని పోలీసులు.. ప్రగతినగర్‌లో నివాసముండే అదనపు జడ్జి సూర్యచంద్రకళ ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. సంజయ్‌ని రిమాండ్ చేసేందుకు అంగీకరించలేదని అతడి తరఫు న్యాయవాదులు తెలిపారు. 14 రోజుల రిమాండ్ ఎలాగైనా సంజయ్‌ను రిమాండ్‌కు తరలించాలనుకున్న పోలీసులు చివరకు వినాయక్‌నగర్‌లో ఉండే ఫ్యామిలీ కోర్టు జడ్జి సుదర్శన్ ఎదుట సంజయ్‌ని హాజరు పరిచారు. రిమాండ్ రిపోర్టు పరిశీలించిన న్యా యమూర్తి.. రాత్రి 11 గంటల వరకు విచారణ చేపట్టారు. చివరకుఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అర్ధరాత్రి వేళ సంజయ్‌ను జిల్లా జైలుకు తరలించారు. ఉదయం 11 నుంచి అర్ధరాత్రి దాకా.. సంజయ్ విచారణ, రిమాండ్ యత్నాల నేపథ్యం లో ఆదివారం రోజంతా హైడ్రామా నెలకొంది. పోలీసుల అదుపులో ఉన్న సంజయ్ జైలుకు వెళ్తారా.. లేక బెయిల్‌పై బయటకు వస్తారా? అన్న దానిపై జోరుగా చర్చ జరిగింది. సంజయ్‌ని అరెస్టు చేసి, జైలుకు పంపాలని పోలీసులు తీవ్రంగా యత్నించారు. అయితే,సీఆర్పీసీ 41–ఏ ప్రకారం విచారణ చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారి ప్రయత్నాలు తొలుత ఫలించలేదు. లైంగిక వేధింపుల కేసుకు సంబం దించి సీఆర్పీసీ 41 ఏ ప్రకారమే విచారణ జరపా లని హైకోర్టు స్పష్టం చేయడంతో పోలీసులు అతడ్ని రిమాండ్‌కు తరలించే అవకాశం లేదని అతని తరఫు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపైనే న్యాయమూర్తులు పోలీసుల ను ప్రధానంగా ప్రశ్నించినట్లు సంజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన తరువాత అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై న్యాయవాదులు గట్టిగానే వాదనలు వినిపించారు. పోలీసుల విచారణ తీరుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని వారు చెప్పారు. -
డీఎస్ కుమారుడికి హైకోర్టులో చుక్కెదురు
-
తల్లి, ముగ్గురు కుమారుల హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్యానికి బానిసైన భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ తన ముగ్గురు కుమారులతో సహా హత్యకు గురైంది. తల్లీ, కుమారుల నోళ్లకు గుడ్డ కట్టి, నడుముకు రాయి కట్టి బావిలో పడేసి హతమార్చారు. ఈ దారుణం తమిళనాడు ధర్మపురి జిల్లాలో సోమ వారం వెలుగులోకి వచ్చింది. కారిమంగళానికి చెందిన కూలీ కార్మికుడు లోకనాథన్, నిత్య(30) దంపతులకు పూవరసన్ (12), సంజయ్(8), నిర్మల్(6) అనే ముగ్గురు కుమారులున్నారు. లోకనాథన్ రోజూ తాగొచ్చి భార్యను వేధించే వాడు. దీంతో భార్యాభర్తల మధ్య ప్రతిరోజూ వాగ్వాదాలు చోటు చేసుకునేవి. అతని తల్లి సైతం నిత్యను వేధించేది. ఈ క్రమంలో లోకనా థన్ ఇల్లు రెండు రోజులుగా మూసి ఉండటంతో తల్లీపిల్లలు ఏమయ్యారని ఇరుగుపొరుగు వారు ఆరాతీ శారు. సోమవారం ఉదయం లోకనాథన్ ఇంటికి సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో స్థానికులు ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తిం చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు పిల్లల నోళ్లను గట్టిగా గుడ్డతో బిగించి ఉన్నారు. అదే బావిలో గాలించగా నీటి అడుగు భాగంలో తల్లి, మరో బిడ్డ నోళ్లకు గుడ్డ బిగించి, నడుముకు రాయి కట్టిన స్థితిలో మృతదేహాలు లభ్యమ య్యాయి. మద్యం తాగొద్దన్నందుకు ఆగ్రహిం చిన లోకనాథనే భార్య, బిడ్డలను హతమార్చి ఉంటాడని అనుమానిస్తూ అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
హత్య చేసిందెవరు?
సంజయ్, రవి బొమ్మవల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’. అనితా ఉదీప్ దర్శకత్వంలో షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించిన ఓ తమిళ చిత్రాన్ని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో అనువదించి, రంజాన్ కానుకగా ఈ నెల 15న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అనితా ఉదీప్ మాట్లాడుతూ– ‘‘ఐఏఎస్ కావాలనుకునే ఓ అమ్మాయి మార్కెట్ రౌడీని ప్రేమించి, పెళ్లి చేసుకుంటుంది. తర్వాత కొన్నాళ్లకు వీరు విడిపోతారు. ఇందుకు దారి తీసిన సంఘటనలు ఏంటి? వాళ్ల కడుపున పుట్టినందుకు సూర్య పడిన ఆవేదన అతని జీవితాన్ని ఎలా మలిచింది. ప్రాణ స్నేహితుని హత్యతో సూర్యలో వచ్చిన మార్పేంటి? ఫ్రెండ్ మరణానికి కారణమైన వారిపై తను ఎలా పగతీర్చుకున్నాడు? అన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు. -
సూర్య గ్రేట్
సంజయ్, రవిబమ్మవళ్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్య మీనన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘కులీర్ 100’. అనిత ఉదీప్ దర్శకత్వంలో సీతల్గుప్త, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి కథాంశంతో రూపొందిన చిత్రమిది. యువతను అమితంగా ఆకట్టుకునే అంశాలున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే సదుద్దేశంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేస్తాం. తెలుగు వారు మా సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: బోబో శశి, కెమెరా: ఎల్.కె. విజయ్. ∙అనిత, సంజయ్ -
సూర్య పగ
తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా అనితా ఉదీప్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య ది గ్రేట్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. సంజయ్, రవి బమ్మావల్, అనిత, తలైవాసల్ విజయ్, ఆదిత్యా మీనన్ ముఖ్య తారలుగా నటించారు. విదీషా ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై షీతల్ గుప్తా, ఎన్.జి. రాజ్‌కుమార్ నిర్మించారు. ‘‘బాధ్యత లేని యువత జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి? అన్న కథాంశంతో రూపొందిన చిత్రమిది. కాలేజీ గొడవల్లో తోటివారి కారణంగా హీరో సూర్య ప్రాణ స్నేహితులు హత్యకు గురవుతారు. శత్రువులపై సూర్య ఎలా పగ తీర్చుకున్నాడు? అన్న అంశాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటాయి. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు చిత్రబృందం. ఈ సినిమాకు సంగీతం: బోబో శశి, ఎడిటింగ్: ఎల్.కె. విజయ్. -
శభాష్... సంజయ్..
బంజారాహిల్స్: ప్రార్ధించే పెదవులకన్నా...సాయం చేసే చేతులు మిన్న అనే భావనతో ఓ ఆటోడ్రైవర్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తినిస్తున్నాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ అభాగ్యులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు మ్యాదరి సంజయ్. బోరబండ నివాసి. చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయాడు. కూలీపనిచేస్తూ జీవనం సాగించేవాడు. తరువాత పెళ్లి చేసుకొని బోరబండలో నివాసం ఉంటున్నాడు. 2010 నవంబర్‌లో ఓ రోజు అర్ధరాత్రి గర్భంతో ఉన్న తన భార్యకు నొప్పులు అధికమయ్యాయి. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటో కోసం చాలా తిరిగాడు. ఇంత రాత్రివేళ మేము ఆస్పత్రికి రాలేం అని చాలామంది చెప్పారు. చివరకు ఓ పెద్దాయన రిక్షా ఇచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లమన్నాడు. అంతరాత్రి స్వయంగా రిక్షాలో భార్యను నీలోఫర్‌కు తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఆపద నుంచి బయటపడ్డాడు. ఆ సంఘటన సంజయ్ మనసులో నాటుకుపోయింది. సకాలంలో ఆస్పత్రికి చేరలేకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనన్న ప్రశ్న అతనిని వెంటాడింది. అప్పటినుంచి సెంట్రింగ్ పనులు చేశాడు. ఎలాగైనా ఆటోకొని గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు సేవలందించాలనే సంకల్పంతో డబ్బు సంపాదించాడు. 2013 డిసెంబర్లో ఓ ఆటోను కొనుగోలు చేశాడు. అప్పటినుంచీ ఆటో నడుపుతూ గర్భిణీలకు, వృద్ధులు, వికలాంగులకు ఉచితంగా ఆస్పత్రికి చేరుస్తున్నాడు. దాదాపు 260 మందిని ఆటోలో ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్లి సేవాతత్పరతను చాటుకున్నాడు. తన ఆటో వెనుకాల గర్భిణీలకు, వృద్ధులు, వికలాంగులకు ఎమర్జెన్సీ ఫ్రీ అని కూడా రాశాడు. -
ఆమె వీడియోను పోర్న్సైట్లలో పోస్ట్ చేశాడు..
సాక్షి,హైదరాబాద్: ఓ యువతి ప్రైవేట్ వీడియోలను పోర్న్ వెబ్సైట్లలో పోస్టు చేసి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన పాటిబండ్ల సంజయ్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో సౌండ్ టెక్నీషియన్‌గా పనిచేస్తూ సికింద్రాబాద్ కార్ఖానలో నివాసముంటున్నాడు. ఎల్బీనగర్కు చెందిన బాధితురాలు మిర్యాలగూడలో ఓ టీవీ సీరియల్ షూటింగ్‌ను చూసేందుకు వచ్చిన సందర్భంలో సంజయ్‌తో పరిచయం ఏర్పడింది. మొబైల్ నంబర్లు మార్చుకొని తరచూ చాట్ చేసుకోవడం మొదలెట్టారు. కొన్నిరోజుల తర్వాత బాధితురాలిని మాటలతో కవ్వించి వీడియో చాట్ చేస్తున్న సమయంలో ప్రైవేట్ భాగాలు చూపించేలా చేశాడు. ఆమెకు తెలియకుండానే వీడియో క్యాప్చరింగ్ అప్లికేషన్‌ను ఉపయోగించి వీడియో ఫుటేజ్‌ను రికార్డు చేశాడు. ఆ తర్వాత తనతో ఉండాలని లేకపోతే ఆ వీడియోను పోర్న్ వెబ్సైట్లో పెడతానని బెదిరించాడు. అలా చేయవద్దంటూ ఆమె తీవ్రంగా మందలించింది. అయినప్పటికీ వివిధ పోర్న్ సైట్లలో సంజయ్ ఆ వీడియో పోస్టు చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు సికింద్రాబాద్ కార్ఖానలో ఉన్న సంజయ్‌ను సోమవారం అరెస్టు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆ వీడియో లింక్‌లను తొలగించాలంటూ సంబంధిత వెబ్సైట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం!
హైదరాబాద్: నగరంలో మరో కాలేజీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి సంజయ్ కిందకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన బాలాపూర్ లో చోటుచేసుకుంది. కిందకి దూకడంతో సంజయ్ తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. లెక్చరర్ల వేధింపులే తమ కుమారుడి ఆత్మహత్యాయత్నానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం!
-
నిద్రిస్తున్న బాలుడిని ఈడ్చుకెళ్లిన చిరుత
బహరైచ్: ఉత్తర ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏడేళ్ల బాలుడిని చిరుత దారుణంగా హతమార్చింది. రాంగోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకేరియ గ్రామానికి చెందిన సంజయ్(7) ఇంటి బయట నిద్రస్తున్న సమయంలో గుర్తుతెలియని జంతువు అతన్ని లాక్కెళ్లింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో బాలుడు దారుణ హత్యకు గురకావడాన్ని గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు కాలిముద్రల ఆధారంగా చిరుత దాడి వల్లే బాలుడు మృతిచెందాడని నిర్ధరించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అటవీ మృగాలు దాడులు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ రాస్తారోకో నిర్వహించారు.