భయంతో వినోదం | 'Cut Chesthe' First Copy is Ready For Release in Feb 2nd Week | Sakshi
Sakshi News home page

భయంతో వినోదం

Published Wed, Jan 22 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

భయంతో వినోదం

భయంతో వినోదం

హారర్ నేపథ్యంతో కూడా బ్రహ్మాండమైన కామెడీ పుట్టించొచ్చునని ఇటీవలి కాలంలో ‘ప్రేమకథా చిత్రం’ నిరూపించింది. అదే రీతిలో హారర్ ఎంటర్‌టైనర్‌గా ‘కట్ చేస్తే’ చిత్రం రూపొందింది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదని దర్శకుడు పడాల శివసుబ్రహ్మణ్యం నమ్మకంగా చెబుతున్నారు. సంజయ్, తనిష్క జంటగా లీలాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఎం.ఎస్.కుమార్ నిర్మించిన ఈ సినిమా వచ్చే నెల రెండోవారంలో విడుదల కానుంది. పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, ఈ సినిమా అన్ని వర్గాలకూ నచ్చుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్‌కుమార్, సంగీతం: పూర్ణచంద్, సమర్పణ: శ్రీమతి సంజీవరాణి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement