కట్ చేస్తే భయమేస్తుంది
కట్ చేస్తే భయమేస్తుంది
Published Sun, Nov 17 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
సంజయ్, తనిష్క జంటగా రూపొందుతోన్న చిత్రం ‘కట్ చేస్తే’. రచయిత పడాల శివసుబ్రమణ్యం ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.ఎస్.కుమార్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉత్కంఠను రేకెత్తించే హారర్ చిత్రమిది. బెంగళూరులోని జోగ్ ఫాల్స్‌లో హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ పూర్తయింది. అనుకున్న బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాం.
నిర్మాణానంతర కార్యక్ర మాలు శరవే గంగా జరుగుతున్నాయి. ఈ నెలలో పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నలుగురు విద్యార్థులు బ్లాక్ మ్యాజిక్ పవర్ కోసం ప్రయత్నించే ఓ ప్రొఫెసర్ బారి నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారనేది ఈ సినిమా మెయిన్ థీమ్ అని దర్శకుడు చెప్పారు. రంగనాథ్, జయప్రకాష్‌రెడ్డి, జీవా, కృష్ణభగవాన్, చిట్టిబాబు, దువ్వాసి మోహన్, విజయ్, సుభాష్, దొంగల ప్రసాద్, మధుమిత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పూర్ణచంద్, కెమెరా: అమర్‌కుమార్.
Advertisement
Advertisement