Tanishq
-
మియా బై తనిష్క్ ఫ్యాషన్ ర్యాంప్‌పై మహిళల తళుక్కులు..(ఫొటోలు)
-
ప్రాంతమేదైనా.. ఆచారమేదైనా.. ఆభరణమంటే తనిష్క్ ‘రివాహ్’
ఎక్కడైనా ‘మీ ఊరి’ డిజైన్లతో తనిష్క్ ‘రివాహ్’ భారతదేశంలో విభిన్న సంప్రదాయాలు.. ఆహారం, ఆహార్యం, ఆచార వ్యవహారాలన్నీ ప్రాంతాలనుబట్టి మారుతుంటాయి. అందుకు అనువుగానే తనిష్క్ ‘రివాహ్’ కలెక్షన్ ఉండబోతోంది. ప్రాంతాలేవైనా... ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నా అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే డిజైన్లు రివాహ్ సొంతం. కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న వధూవరుల మదిని దోచేందుకు... బంధుమిత్రుల ఇష్టాలను నెరవేర్చేందుకూ తనిష్క్ జ్యువెలరీ ‘రివాహ్’ కొత్త ఆభరణాలను పరిచయం చేస్తోంది. Rivaah by Tanishq పెళ్లి వేడుకల్లో భాగంగా, సంప్రదాయాలకు అనుగుణంగా అన్ని సందర్భాలకూ ఉపయోగపడే ఆభరణాలూ రివాహ్ శ్రేణిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్లతో పాటు దేశంలోని 259 నగరాల్లో మొత్తం 435 స్టోర్ల ద్వారా వినియోగదారులకు సేవలందిస్తోంది. వ్యాపారం, ఉద్యోగాల కారణంగా చాలామంది...వేర్వేరు ప్రాంతాలు, దేశాల్లో స్థిరపడ్డారు. చాలా సందర్భాల్లో వీరికి అవసరమైన, భారతీయత ఉట్టిపడే డిజైన్లు ఉన్న నగలు అక్కడ వారికి లభించకపోవచ్చు. అయితే ‘రివాహ్’ షోరూమ్‌లలో మాత్రం దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన డిజైన్లు అందుబాటులో ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాలతో సహా భారతదేశం అంతటా అన్ని సంస్కృతులు, సంప్రదాయాలకు సంబంధించిన వివాహ ఆభరణాలు ‘రివాహ్’లో ఉన్నాయి. వివాహ సన్నాహాల్లో భాగంగా మధ్యతరగతి కుటుంబంలో పెళ్లికూతురు కనీసం 10 తులాల బంగారు ఆభరణాలు ధరిస్తుంది. ‘తనిష్క్ రివాహ్’ వివాహానికి తగిన ఆభరణాలను ఎంచుకోవడానికి ప్రాముఖ్యతను ఇస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ రకాల డిజైన్లను అందిస్తోంది. వివాహ వేడుకలో భాగంగా మెహందీ ఫంక్షన్ నుంచి సంగీత్ వరకు అన్నింటికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందులో ఆకర్షణీయంగా కనిపించేలా ఆభరణాలు ధరించాలి. ఒక్కోవేడుకకు ఒక్కో రకమైన నగలతో వినూత్నంగా కనిపించాలి. అందుకు సరైన జ్యువెలరీని ఎంచుకోవాలి. చెవి పోగులు, బ్యాంగిల్స్, నెక్లెస్ ఇలా ప్రతిదానిలో వైవిధ్యంగా ఉండాలి. అందుకోసం ‘తనిష్క్ రివాహ్’ ప్రత్యేక ఆభరణాలతో ఆకట్టుకుంటోంది. వివాహానికి హాజరయ్యే బంధువుల సొగసును పెంచేందుకు 'రివాహ్'లో ప్రత్యేక నగల కలెక్షన్ ఉంది. ఏళ్లపాటు నిలిచిపోయే వివాహబంధాన్ని మరింత గుర్తుండేలా తనిష్క్ డిజైన్లు తయారుచేస్తోంది. భారతీయ వివాహా వేడుకలో బంగారానికి కీలకపాత్ర ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. బంగారం ధరలు భారంగా భావిస్తున్న వారికి తనిష్క్ మంచి అవకాశాన్ని అందుబాటులో ఉంచింది. తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా వినియోగదారుల పాత బంగారానికి మార్కెట్లో సరసమైన విలువను అందిస్తూ నాణ్యమైన కొత్త బంగారాన్ని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ‘తనిష్క్ రివాహ్’ వంటి ప్రముఖ, విశ్వసనీయ బ్రాండ్ ద్వారా వివిధ డిజైన్ల్లో తయారుచేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఆనందాన్ని పొందండి. కుసుమ, నవ వధువు “కస్టమ్-డిజైన్ నగల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ తన అనుభవాన్ని పంచుకుంది. వివాహం అనేది రెండు మనసుల కలయిక అని ఆమె చెప్పింది. తనిష్క్ 'రివాహ్' వారి స్థానిక డిజైన్లను ప్రతిబింబించే నగలను అందించిందని ఆనందం వ్యక్తం చేసింది. దాంతో తన వివాహం మరింత గుర్తుండిపోయేలా చేసినందుకు రివాహ్కు కృతజ్ఞతలు” అని చెప్పింది. -
తనిష్క్ బృందానికి రజతం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆదివారం భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ ప్లేయర్ కొడవలి తనిష్క్ మురళీధర్ నాయుడు, రాజ్కన్వర్ సింగ్ సంధూ, సమీర్లతో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. తనిష్క్ (569), సమీర్ (573), రాజ్కన్వర్ (579) బృందం ఓవరాల్‌గా 1721 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ జాహిద్ హుస్సేన్ రజత పతకం సొంతం చేసుకున్నాడు. జాహిద్ 624.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. మరో మూడు రోజులపాటు కొనసాగే ఈ చాంపియన్íÙప్లో ప్రస్తుతం భారత్ 8 స్వర్ణాలు, 12 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 25 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
హైదరాబాద్ లో ఘనంగా తనిష్క్ కాకతీయ కలెక్షన్స్ ప్రారంభం (ఫోటోలు)
-
ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు: హీరోయిన్
తనిష్క్ రాజన్.. రంగస్థల నటిగా కెరీర్‌ను ప్రారంభించారు. నాలుగేళ్ల ప్రాయంలోనే నటిగా బుడిబుడి అడుగులు వేశారు. దేశవ్యాప్తంగా ఎన్నో నాటకాలు వేశారు. పన్నెండేళ్ల వయసులో ఆమె తన సోదరితో కలిసి ముంబైకి వెళ్లడంతో వెండితెరపై ప్రయాణం మొదలైంది. టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగారు. 2017లో శరణం గచ్చామి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. తన నటన, అందంతో అందరినీ మెప్పించారు. దీంతో ఆమెకు దేశంలో దొంగలు పడ్డారు, ఇష్టంగా, బైలంపూడి, కమిట్మెంట్ అనే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆమె నేనెవరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 2న థియేటర్లో విడుదల కానుంది. ప్రస్తుతం తన చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులున్నాయని, హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నానని తెలిపారు. రీసెంట్గా ఆమె నటించిన దో లోగ్ అనే ప్రైవేట్ ఆల్బమ్ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. తనిష్క్ మాట్లాడుతూ.. 'చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. కష్టపడి పని చేస్తే, మనసుకు నచ్చిన పని చేస్తే.. మనల్ని ఏది ఆపలేదు. నేను దర్శకుడు ఏం చెబితే అది చేసే నటిని, ఆయన విజన్‌కు తగ్గట్టుగా నటించేందుకు ప్రయత్నిస్తాను. నా ప్రయాణం ఇంకా మొదలవ్వలేదని అనుకుంటాను.. అందుకే నేను ఇంకా కష్టపడి పని చేయాలనుకుంటున్నాను. ప్రేక్షకులందరి ప్రేమను సంపాదించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను. శాస్త్రీయ సంగీతం, నృత్య కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. నేను అనుకుంది సాధించేందుకు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాను' అని తనిష్క్ తన సినీ ప్రయాణం, లక్ష్యం గురించి వివరించారు. చదవండి: పుష్ప సినిమాలో హీరో ఎవరో తెలియదు: నటి రాజావారు రాణిగారు సినిమాకు మూడేళ్లు -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో చేతులు కలిపిన తనిష్క్
హైదరాబాద్: ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో రిటైల్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ చేతులు కలిపింది. వివాహ వేడుకల వేళ ఓటీటీ వేదికగా ‘ద గ్రేట్ ఇండియన్ బ్రైడ్’ పేరుతో సరికొత్త షోను విడుదల చేయనుంది. దేశంలో భిన్న సంస్కృతి, విభిన్న ప్రాంతాలకు చెందిన ఐదుగురు వధువులు తనిష్క్ కో-బ్రాండ్ రివా రూపొందించిన వివాహ ఆభరణాలను ధరించి తమ పెళ్లి నాటి అనుభూతులను నటి శ్రియా పిల్గాంకర్తో పంచుకోనున్నారు. (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?) ప్రతి సంప్రదాయానికి ఆభరణం రివా అనే ట్యాగ్‌లైన్‌తో కంటెంట్‌ను అత్యంత సృజనాత్మకంగా డిజైన్ చేశామని టైటాన్ మార్కెటింగ్ జీఎం రంజనీ కృష్ణస్వామి తెలిపారు. ‘‘టైటాన్ వంటి సుప్రసిద్ధ బ్రాండ్‌తో కలిసి పనిచేయడంతో పాటు వినూత్న కథనం ద్వారా సబ్స్క్రైబర్లతో మా బంధం మరింత బలపడుతుంది’’ అని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (మరో టెక్ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?) -
తనిష్క్ ‘స్వరూపం’ ఆభరణాలు
హైదరాబాద్: టాటా గ్రూపునకు చెందిన ఆభరణాల విక్రయ బ్రాండ్ తనిష్క్.. వరలక్ష్మీవ్రత పూజల సందర్భంగా ‘స్వరూపం’ పేరుతో ప్రత్యేక ఆభరణాలను విడుదల చేసింది. బంగారం, వజ్రాభరణాల తయారీ చార్జీల్లో 25 శాతం తగ్గింపునిస్తున్నట్టు ప్రకటించింది. పాత బంగారం ఆభరణాలు ఎటువంటివైనా కానీ మార్చుకుంటే నూరు శాతం విలువను కడుతున్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా తనిష్క్ స్టోర్లలో ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఆభరణాల కొనుగోలుపై ఈ ఆఫర్లు అమలవుతాయని పేర్కొంది. -
తెరుచుకున్న ‘తనిష్క్’
ముంబై: లాక్డౌన్ ఎత్తివేత నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా స్టోర్లను తెరిచినట్లు బంగారు ఆభరణాల తయారీ సంస్థ తనిష్క్ తెలిపింది. స్టోర్లలోకి పరిమిత సంఖ్యలోనే కస్టమర్లను అనుమతిస్తామని పేర్కొంది. వైరస్, బ్యాక్టీరియాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత కలిగిన ఎయిర్ ప్యూరిఫయర్స్‌ను స్టోర్లలో ఏర్పాటు చేసినట్లు వివరించింది. సిబ్బందికి టీకా సిబ్బంది మొత్తానికి ఉచితంగా టీకాను అందించామని, స్టోర్లలో డబుల్ మాస్క్ లేదా ఎన్95 మాస్కుల ధారణ తప్పనిసరి చేశామని తెలిపింది. టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ అన్‌లాక్ ప్రక్రియ తర్వాత దేశవ్యాప్తంగా ఉండే తన 356 స్టోర్లలో 294 రిటైల్ స్టోర్లను పునఃప్రారంభించింది. చదవండి : SBI: హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ? -
'మా ఊరి ప్రేమ కథ' వచ్చేది అప్పుడే
‘‘ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి.. వస్తున్నాయి. అన్ని ప్రేమకథలు ఒక్కటే.. కానీ కొత్తగా చూపిస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ‘మా ఊరి ప్రేమకథ’ ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత కేయల్ దామోదర ప్రసాద్ అన్నారు. మంజునాథ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మా ఊరి ప్రేమకథ’. తనిష్క్ హీరోయిన్. శ్రీ మల్లికార్జున స్వామి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. మంజునాథ్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో జరిగే యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రమిది. రియలిస్టిక్ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా విషయంలో నాకు సహకరిస్తున్న రామసత్యనారాయణ, సంధ్య స్టూడియో రవి గార్లకు థ్యాంక్స్’’ అన్నారు. సహనిర్మాత మహేంద్రనాథ్, సంగీత దర్శకుడు జయసూర్య, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనయుడు రవితేజ, ‘కీ’ మ్యూజిక్ అధినేత రవి కనగాల, ‘తొలిముద్దు’ సినిమా నిర్మాత ఆర్కే రెడ్డి పాల్గొన్నారు. -
నెటిజన్ల ఫైర్; యాడ్ తొలగించిన తనిష్క్!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో నటీమణులు నీనా గుప్తా, నిమ్రత్ కౌర్, సయానీ గుప్తా, అలయా ఫర్నీచర్‌వాలాలతో తనిష్క్ ఓ యాడ్ రూపొందించింది. ఇందులో సింపుల్ జువెలరీని ధరించిన వీరు.. తాము ఈసారి ఏవిధంగా పండుగ జరుపుకోబోతున్నామోనన్న వివరాల గురించి పంచుకున్నారు. ఈ దీపావళికి తాను కూడా అధిక మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేస్తానని నీనా చెప్పగా, ఈసారి కుటుంబంతో కలిసి వేడుకలు చేసుకుంటానని నిమ్రత్ చెప్పారు. ఇక ఆలయ మాట్లాడుతూ.. దీపావళి అంటే తనకు మిఠాయిలు, రుచికరమైన భోజనం, స్నేహితులు, కుటుంబమంతా ఒక్కచోట చేరడమే గుర్తుకువస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతాబాగానే ఉన్నా.. చాలా రోజుల తర్వాత దీపావళి సందర్భంగా తన తల్లిని కలవబోతున్నందుకు సంతోషంగా ఉందన్న సయానీ గుప్తా.. ఈసారి టపాసులు లేకుండానే దీపాల పండుగ చేసుకుంటానని, దివ్వెలు మాత్రమే వెలిగిస్తానని చెప్పడం నెటిజన్లకు కోపం తెప్పించింది. ‘‘అసలు పండుగ ఎలా చేసుకోవాలో చెప్పడానికి మీరెవరు? టపాకాయలు కాలిస్తే మీకేంటి? ఉచిత సలహాలు ఇవ్వడం మానేయండి. ఒకసారి చేదు అనుభం ఎదురైనా తనిష్క్ ఇలాంటి యాడ్లు ఎందుకు చిత్రీకరిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా’’ అంటూ ఓ వర్గం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. దీంతో తనిష్క్ తమ యాడ్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించింది. అయితే మరి కొంతమంది మాత్రం.. ఇందులో తప్పుపట్టాల్సిన విషయం ఏముందని, దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9 అర్ధరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని, దివ్వెల పండుగ పేరు చెప్పి, పర్యావరణ కాలుష్యానికి కారకులయ్యేవారే ఈ యాడ్‌ను తప్పుబడతారంటూ తనిష్క్‌ను సమర్థిస్తున్నారు. అయితే అదే సమయంలో యాడ్‌ను తొలగించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన సయానీ గుప్తా.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పర్యావరణ కాలుష్యాన్ని కట్టడిచేయాలని పిలుపునిస్తే దానిని కూడా మతానికి ముడిపెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయాలతో విద్వేషాన్ని చిమ్మడం సరికాదంటూ హితవు పలికారు. కాగా ఏకత్వం పేరిట కొత్త కలెక్షన్ ప్రవేశపెట్టిన తనిష్క్.. ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళ సీమంతం వేడుక థీమ్‌తో యాడ్ రూపొందించగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. లవ్ జీహాదీని ప్రోత్సహించేలా ఉన్న ఈ యాడ్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పాటుగా, #BoycottTanishq పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసి ఆగ్రహం ప్రదర్శించడంతో దానిని తొలగించారు. -
నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ రూపొందించి యాడ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళ సీమంతం వేడుక థీమ్‌తో రూపొందిన ఈ ప్రకటనపై ఓ వర్గం నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. లవ్ జీహాదీని ప్రోత్సహించేలా ఉన్న ఈ యాడ్‌ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ విమర్శల వర్షం కురిసింది. అంతేగాక దీని కారణంగా తనిష్క్ భారీ నష్టం చవిచూస్తుందని, #BoycottTanishq పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసి ఆగ్రహం ప్రదర్శించారు. (చదవండి: యాడ్ తొలగించిన తనిష్క్.. వివరణ) దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన సంస్థ..‘‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్ చేయడమే తమ ఏకత్వం(ఈ పేరుతోనే కొత్త కలెక్షన్ ప్రవేశపెట్టింది) క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం’’ అని వివరణ ఇచ్చింది. అంతేగాకుండా మనోభావాలు గాయపడినందుకు చింతిస్తున్నామని పేర్కొంటూనే, తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు దృష్ట్యా ఈ యాడ్ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. గుజరాత్లో కొంతమంది నిరసనకారులు తనిష్క్ స్టోర్‌కు వెళ్లి మరీ క్షమాపణ కోరాల్సిందిగా బెదిరింపులకు దిగారు. అంతేకాదు, ఈ వీడియో తొలగించినంత మాత్రాన, చేసిన తప్పు ఒప్పైపోదని, ఇకపై తనిష్క్ జువెలరీ కొనే ప్రసక్తే లేదంటూ మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. వీరి అభిప్రాయం ఇలా ఉంటే, ఇంకొంత మంది మాత్రం, యాడ్ తొలగించినందుకు తనిష్క్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉంటాయని, మతసామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉన్న ఈ వీడియోను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక ఈ వివాదానికి మూలకారణంగా భావిస్తున్న మతాంతర వివాహం గురించి, అటువంటి పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని జంటలు మాత్రం ఈ యాడ్ తమకు చక్కగా సరిపోతుందంటూ పాత ఫొటోలను షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో అంతగా తప్పుపట్టాల్సిన విషయం ఏముందని, కులాలు, మతాలు వేరైనంత మాత్రాన, ప్రేమానురాగాలు, ఆప్యాయతల్లో మార్పు ఉండదని, మంచి మనసు ఉంటే అంతా కలిసి సంతోషంగా ఉండవచ్చని తమ వైవాహిక జీవితంలోని ఆనందపు క్షణాలను సోషలల్ మీడియాలో పంచుకుంటున్నారు. నా ఒడి నింపే వేడుక నటి- డైరెక్టర్ రసికా అగాషే, నటుడు మహ్మద్ జీషన్ ఆయుబ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనిష్క్ యాడ్ దుమారం నేపథ్యంలో తన సీమంతం నాటి ఫొటోను షేర్ చేసిన ఆమె.. ‘‘నా ఒడి నింపే కార్యక్రమం.. లవ్ జిహాద్ అని ఏడుపు లంకించుకునే ముందు ప్రత్యేక వివాహ చట్టం అని ఒకటి ఉంటుంది. దాని గురించి తెలుసుకోండి’’అని తనదైన శైలిలో చురకలు అంటించారు. ఆమెతో పాటు నటి, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ సతీమణి మినీ మాథుర్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భిన్నసంస్కృతుల కలయికగా నిలిచిన తన వివాహం తనకెన్నో సంతోషాలను, అవధులు లేని ప్రేమను పంచిందని, ద్వేష భావాన్ని విడనాడితే అంతా బాగుంటుందని పేర్కొన్నారు. ఇక వీరితో పాటు నిఖిల్ పర్వాల్ అనే వ్యక్తిని పెళ్లాడిన జరా ఫరూఖీ అనే నెటిజన్ కూడా నాలుగేళ్ల క్రితం జరిగిన తన పెళ్లినాటి ఫొటోలను పంచుకున్నారు. ‘‘మతం మారితే ఏం మారుతుంది’’అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక మరో జంట 44 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఎన్నోకష్టాలకు ఓర్చి ఇప్పుడు ఓ ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామంటూ గోవాలోని తమ ఇద్దరి మతాచారాల మొదటి అక్షరాలు కలిసివచ్చేలా ఇంటి పేరును (హమ్- మనం)హెచ్యూఎమ్ అని పెట్టుకున్నట్లు వెల్లడించారు. -
యాడ్ దుమారం : తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు
అహ్మదాబాద్ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ తనిష్క్ వివాదాస్పద యాడ్ కలకలం రేపుతోంది. ఈ యాడ్ లవ్ జిహాదీని ప్రోత్సహిస్తోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో యాజమాన్యం దిగివచ్చి యూట్యూబ్ నుంచి ఈ యాడ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వివాదస్పద యాడ్‌పై గుజరాత్‌లోని కచ్ జిల్లాలో తనిష్క్ స్టోర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఈ ప్రకటన సరైంది కాదని తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఈ స్టోర్‌కు కొందరు బెదిరింపు కాల్స్ చేశారని పోలీసులు తెలిపారు. స్టోర్ వద్ద ఎలాంటి ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకోలేదని ఈ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి తనిష్క్ గాంధీధామ్ స్టోర్ వద్దకు నిరసనకారులు రాగా, స్టోర్ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ నోట్ రాసినట్టు సమాచారం. ఈ యాడ్ సిగ్గుచేటని, దీనికి తమను మన్నించాలంటూ స్టోర్ మేనేజర్ రాసిన క్షమాపణ నోట్‌ను ఆందోళనకారులు స్టోర్‌పై అతికించారు. గత వారం తనిష్క్ విడుదల చేసిన యాడ్‌పై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. కాగా, ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq ట్రెండ్ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. చదవండి : అందుకే ఆ యాడ్ తొలగించాం: తనిష్క్ -
అందుకే ఆ యాడ్ తొలగించాం: తనిష్క్
న్యూఢిల్లీ: ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ యాడ్‌కు సంబంధించిన వీడియోపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ వెనక్కి తగ్గింది. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ వీడియోను 24 గంటల్లోపే తొలగించింది. ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు #BoycottTanishq ట్రెండ్ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్ చేసినట్లు సంస్థ వెల్లడించింది. (చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్..) ఈ మేరకు తమ యాడ్ కారణంగా ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని పేర్కొంటూ సంస్థ అధికార ప్రతినిధి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్ చేయడమే ఏకత్వం క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. కానీ ఇందుకు భిన్నంగా పూర్తి వ్యతిరేకమైన స్పందనలు వచ్చాయి, ఇందుకు మేం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎవరి మనోభావాలను కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు. దానితో పాటు మా ఉద్యోగులు, స్టోర్ సిబ్బంది, భాగస్వాములు అందరి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ యాడ్‌ను వెనక్కి తీసుకుంటున్నాం’’అని వివరణ ఇచ్చారు. కాగా తనిష్క్ యాడ్ తొలగించగానే మరికొంత మంది నెటిజన్లు.. ‘‘మతసామరస్యాన్ని పెంపొందించేలా ఉన్న ఈ యాడ్‌లో తప్పేమీ లేదు. అయినా దీనిని ఎందుకు తొలగించారో అర్థం కావడం లేదు’’అంటూ వాపోయారు. రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ ఝా వంటి ప్రముఖులు సైతం ఈ యాడ్‌ను సమర్థిస్తూ టాటా గ్రూప్, తనిష్క్ మేనేజ్మెంట్కు అండగా నిలిచారు. కాగా ఈ యాడ్‌పై ట్రోలింగ్ కారణంగా టాటా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడినట్లు బిజినెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. యాడ్‌లో ఏముంది? ముస్లిం కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళకు సీమంతం చేసేందుకు అత్తింటి వాళ్లు సిద్ధపడతారు. దీంతో ఆశ్చర్యంలో మునిగిపోయిన కోడలు.. ‘‘ ఇలాంటి వేడుకలు మీ ఇంట్లో చేయరు కదా.. మరి ఇదేంటి?’’అని తన అత్తమ్మను అడుగుతుంది. ఇందుకు స్పందించిన ఆమె.. ‘‘కూతురిని సంతోషపెట్టేందుకు ప్రతి ఇంట్లోనూ ఇలాగే చేస్తారు. అంతే కదా’’అంటూ ప్రేమను చాటుకుంటుంది. అంతా కలిసి ఎంతో సంతోషంగా ఫంక్షన్లో పాల్గొంటారు. రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక అంటూ తనిష్క్ ఈ యాడ్‌ను రూపొందించింది. -
వైరల్ యాడ్ తొలగించిన తనిష్క్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ సోషల్‌మీడియా నుంచి తన యాడ్‌ను తొలగించింది. రెండు రోజుల నుంచి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం తనిష్క్ ఒక యాడ్‌ను క్రియేట్ చేసింది. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ పొందుపరిచింది. దీనిపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే. బాయ్‌కాట్ తనిష్క్ అంటూ నిన్నంతా ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. లవ్ జిహాద్‌ను తనిష్క్ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మంగళవారం కూడా ఇదే ట్రెండ్ కావడంతో తనిష్క్ ఆ యాడ్‌ను తొలగించింది. చదవండి: కేవలం ఆమె కోసమే; ‘తనిష్క్‌పై’ నెటిజన్ల ఫైర్.. -
కేవలం ఆమె కోసమే; సిగ్గు పడండి!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘‘ఏకత్వం’’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్ కోసం రూపొందించిన ప్రకటనే ఇందుకు కారణం. ఇందులో, హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమె సీమంతం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. ఇక నలభై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోకు, ‘‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’’అని తనిష్క్ సంస్థ డిస్క్రిప్షన్ పొందుపరిచింది. (చదవండి: సెల్యూట్‌తో అలరిస్తున్న బుడ్డోడు) ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఈ యాడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వీడియో, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా ఉందని, ఇక నుంచి తనిష్క్ ఆభరణాలను కొనే ప్రసక్తే లేదంటూ #BoycottTanishq హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ‘‘కాస్తైనా సిగ్గు ఉండాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి యాడ్లు రూపొందించడం ఇకనైనా ఆపేయండి’’ అంటూ ఓ నెటిజన్ మండిపడగా.. ‘‘అయినా ప్రతీ యాడ్లోనూ హిందూ కోడలే ఎందుకు కనిపిస్తోంది. ముస్లిం కోడలిని చూపించవచ్చు కదా. నిజాన్ని చూపించే దమ్ము ఉందా. ఊరికే అడుగుతున్నా’’ అంటూ మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఇంకొంత మంది మాత్రం సృజనాత్మకతకు ఎల్లలు ఉండవని, అయినా ఈ ప్రకటనను అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు. మతసామరస్యాన్ని పెంచే ఇలాంటి యాడ్లను ప్రశంసించకపోగా ట్రోల్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. Shame on Tanishq. Stop showing shit and propaganda disguised as advertisement. If u haven't the balls to show reality, please refrain from such moral platitudes #BoycottTanishq — মধুলিকা #Hindulivesmatter (@heartgoesboop) October 12, 2020 Why i see Hindu daughter in law everywhere....why dont you show Muslim daughter in law anywhere. Just Asking #BoycottTanishq — Ranzy Singh (@ranzysingh) October 12, 2020 -
పాటల సందడి
సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు ఇప్పుడు’. ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని ఓ పాటని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రమిది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకి హైలెట్’’ అన్నారు. ‘‘కె.విశ్వనాథ్‌గారి విడుదల చేసిన మొదటి పాటకు, కె.రాఘవేంద్రరావుగారు విడుదల చేసిన మరో పాటకి మంచి స్పందన వచ్చింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌గారు విడుదల చేసిన టీజర్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో మా సినిమా మీద బజ్ పెరిగింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు. -
దుర్గాపురం వారి నాటక ప్రదర్శన
‘మీరు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న శ్రీ దుర్గాపురం వారి నాటక ప్రదర్శన మరికాసేపట్లోనే మొదలవబోతోంది’ అంటూ విడుదలైన ‘అప్పుడు–ఇప్పుడు’ టీజర్ ఆసక్తిగా ఉంది. సుజన్, తనిష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లో నటించారు. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసి, ‘టీజర్ చాలా బాగుంది. సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అన్నారు. ‘‘పూరి జగన్నాథ్‌గారు మా టీజర్‌ను విడుదల చేయడం సంతోషం. పాటలకు మంచి స్పందన వస్తోంది. టీజర్‌తో ఇటు సినీ అభిమానుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్. -
మంచి కామెడీ
సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె. ఫిలింస్ పతాకంపై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు నిర్మించారు. ఈ చిత్రంలోని రెండవ పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ –‘‘పాట చాలా బాగుంది. తప్పకుండా ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది’’ అన్నారు. చలపతి పువ్వల మాట్లాడుతూ– ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా బాగా నటించారు. దసరాకి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి, దర్శకులు విశ్వనాథ్‌గారు రిలీజ్ చేసిన మొదటి గీతానికి మంచి స్పందన వచ్చింది. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ’’ అన్నారు. ‘‘చలపతి కొత్తవాడైనా అనుభవం ఉన్నవాడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణంరాజు. -
నేను పెద్ద స్టార్ అవుతానన్నారు
‘‘టి. కృష్ణగారి ‘దేశంలో దొంగలుపడ్డారు’ సినిమాలో వేషం కోసం వెళ్లా. ‘నీ ఫేస్ కామెడీగా ఉంటుంది.. పైగా చిన్నపిల్లాడివి.. నువ్వు చచ్చిపోయే పాత్ర చేస్తే జనాలు నవ్వుతారు.. వద్దు.. అన్నారు. ‘ఏ రోజుకైనా ఈ అబ్బాయి పెద్ద స్టార్ అవుతాడు’ అని ఆయన తన స్నేహితులతో ఆ రోజే చెప్పారట’’ అని నటుడు అలీ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకత్వంలో రమా గౌతమ్ నిర్మించిన ఈ సినిమాకి అలీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అలీ మాట్లాడుతూ– ‘‘టి.కృష్ణగారి స్నేహితుడు నాగేశ్వరరావుగారు ముత్యాల సుబ్బయ్యగారి దర్శకత్వంలో తీసిన ‘అమ్మాయి కాపురం’ సినిమాకు నాకు ఉత్తమ కథానాయకుడిగా అవార్డు వచ్చింది. ‘దేశంలో దొంగలుపడ్డారు’ కోసం కొన్నాళ్లు భోజనం కూడా సరిగా లేకుండా పని చేశానని నా తమ్ముడు ఖయ్యూమ్ చెప్పాడు. వాడి కోసమే ఈ సినిమా చూశా. గౌతమ్ రాజ్‌కుమార్ కొత్త దర్శకుడైనా తనని చూస్తే 30 ఏళ్లకు ముందు రామ్‌గోపాల్ వర్మను చూసినట్టు అనిపించింది’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కించాం. విడుదలకు ముందే మా సినిమా బ్లాక్ బెర్రీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కి వెళ్లడం సంతోషంగా ఉంది’’ అన్నారు గౌతమ్ రాజ్‌కుమార్. ఖయ్యూమ్, సహ నిర్మాత సంతోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెట్ కనెక్ట్స్. -
మంచి వినోదం
సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అప్పుడు–ఇప్పుడు’. యు.కె.ఫిలింస్ పతాకంపై ఉషారాణి కునుమూరి, విజయ రామకృష్ణ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను సమ్మర్లో రిలీజ్ చేయనున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. శివాజీ రాజా, మాధవి, శ్రీనివాస్ పేరుపురెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: కల్యాణ్ సమి, సంగీతం: పద్మానావ్ భరద్వాజ్. -
విజేత తనిష్క్
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మామిళ్లపల్లి తనిష్క్ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తనిష్క్ 17–21, 22– 20, 21–18తో భారత్‌కే చెందిన శిఖా గౌతమ్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 21–15, 17–21, 21–17తో యీ హాన్ చోంగ్ (మలేసియా)పై గెలిచాడు. సింగిల్స్ చాంపియన్స్ తనిష్క్, లక్ష్య సేన్‌లకు 600 డాలర్ల చొప్పున (రూ. 38 వేలు) ప్రైజ్‌మనీ, 2500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్ ఫైనల్లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా (భారత్) జంట 21–19, 21–15తో ఫ్రాన్సిస్ ఆల్విన్–నందగోపాల్ (భారత్) జోడీని ఓడించి టైటిల్ దక్కించుకుంది. -
మగువల మెచ్చే నగలు ‘తనిష్క్’ ప్రత్యేకం
– షోరూం ప్రారంభోత్సవంలో జీఎం గోపాలరత్నం – రాంప్వాక్తో అదరగొట్టిన టీవీ మోడల్స్ అనంతపురం కల్చరల్: ఫ్యాషన్ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న నగరం అనంతపురం.. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో మాత్రమే ఉన్న తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ బ్రాంచిను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తనిష్క్ జనరల్ మేనేజర్ గోపాలరత్నం పేర్కొన్నారు. అనంత వేదికగా గురువారం స్థానిక ఆర్ఎఫ్ రోడ్డులో 229వ తనిష్క్ జ్యువెలరీ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. గోపాలరత్నం మాట్లాడుతూ గతంలో టాటా గోల్డ్ స్టోర్‌గా ఉన్న షోరూమ్ తనిష్క్గా మారిందని, దీని ద్వారా వినియోగదారులకు ఉత్సాహపూరితమైన ఆఫ్లర్లను అందిస్తోందన్నారు. ప్రతి ఆభరణం కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలను కూడా అందిస్తామన్నారు. అత్యుత్తమ శ్రేణి డిజైన్లను స్వచ్ఛమైన బంగారు నాణ్యతను పొందే అవకాశం ఇందులో ఉందన్నారు. శుభం కలెక్షన్స్, నిలోఫర్,రివా, బంగారం వజ్రాలు, కుందన్, పోల్కీతో అలంకరించబడిన ఆభరణాలు, పద్మావతి కలెక్షన్స్..ఇలా ప్రతీది వినియోగదారుల కోరిక మేరకు తయారు చేసినట్లు తెలిపారు. ఫ్రాంచైజీ పార్టనర్ మల్లికార్జున, ఏబీఎం సీతారామరాజు, మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు తనిష్క్ అందిస్తున్న ప్రత్యేకతలను వివరించారు. ర్యాంప్ వాక్‌తో ఫిదా : తనిష్క్ జ్యువెలరీ ప్రచారంలో భాగంగా టీవీ మోడల్స్ ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు. వర్ధమాన తారలుగా ఎదుగుతున్న దివ్య, నిహారిక, హర్షిత, సుమ హొయలొలుకుతూ చేసిన ర్యాంప్ వాక్‌తో అందరూ ఫిదా అయ్యారు. -
తనిష్క్ డైమండ్ జువెలరీ డిస్కౌంట్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘తనిష్క్’ తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు విస్తృతమైన డైమండ్ జువెలరీ కలెక్షన్లపై 20 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు వారాలపాటు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో ఎంత ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిపితే అంతే అధికంగా డిస్కౌంట్‌ను పొందొచ్చని పేర్కొంది. రూ.50,000లోపు బిల్లుపై 5 శాతం, రూ.లక్షలోపు బిల్లుపై 10 శాతం, రూ.1–2 లక్షలలోపు బిల్లుపై 15 శాతం, రూ.2–10 లక్షల బిల్లుపై 20 శాతం, రూ.1 కోటిపై బిల్లుపై 30 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చని వివరించింది. ‘మహిళలు డైమండ్ ఆభరణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. డైమండ్స్ విలువైనవి. అందమైనవి. శాశ్వతమైనవి. మంచి డిజైన్లతో కూడిన ఆభరణాలను ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడానికి మేమెప్పుడూ ప్రయత్నిస్తుంటాం’ అని టైటాన్ కంపెనీ జువెలరీ విభాగపు జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) దీపిక తివారీ తెలిపారు. -
కొత్త డిజైన్లతో తనిష్క్ ఆభరణాలు
హైదరాబాద్: ప్రముఖ బంగారు, వజ్రాభరణాల తయారీ సంస్థ తనిష్క్.. కొత్త సంవత్సరంలో వినియోగదారులకు మరింత చేరువకావాలనే లక్ష్యంతో కొత్తగా పలు రకాల డిజైన్లలో ఆభరణాలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. అలాగే దోష రహితంగా రూపొందించిన చెవి రింగులు, పెండెంట్లు, చేతి ఉంగరాలపై 20 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఆభర ణాలను తనిష్క్ స్టోర్లలోనే కాకుండా, ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తనిష్క్.కో.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. -
వజ్రాభరణాలపై తనిష్క్ 20శాతం డిస్కౌంట్
హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్ సంస్థ వజ్రాల ఆభరణాలపై డిస్కౌంట్ ఇస్తోంది. 20 శాతం వరకూ తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా దోషరహితంగా రూపొందించిన చెవి రింగులు, పెండెంట్లు, చేతి ఉంగరాలను...సంప్రదాయ, నవయుగ అభరణాలు అత్యుత్తమ కలయికతో తనిష్క్ అందజేస్తోంది. ఆన్లైన్లో కూడా ఆభరణాలను కొనుగోలుచేసే సదుపాయాన్ని తనిష్క్ వినియోగదార్లకు అందుబాటులో ఉంచింది. www.tanishq.co.in కు లాగాన్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.