తనిష్క్‌ డైమండ్‌ జువెలరీ డిస్కౌంట్‌ ఆఫర్‌ | Tanishq announces exciting offers on diamond jewellery | Sakshi
Sakshi News home page

తనిష్క్‌ డైమండ్‌ జువెలరీ డిస్కౌంట్‌ ఆఫర్‌

Jan 6 2017 1:25 AM | Updated on Sep 5 2017 12:30 AM

తనిష్క్‌ డైమండ్‌ జువెలరీ డిస్కౌంట్‌ ఆఫర్‌

తనిష్క్‌ డైమండ్‌ జువెలరీ డిస్కౌంట్‌ ఆఫర్‌

ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘తనిష్క్‌’ తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది.

హైదరాబాద్‌: ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ ‘తనిష్క్‌’ తాజాగా వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు విస్తృతమైన డైమండ్‌ జువెలరీ కలెక్షన్లపై 20 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఆరు వారాలపాటు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో ఎంత ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిపితే అంతే అధికంగా డిస్కౌంట్‌ను పొందొచ్చని పేర్కొంది.

రూ.50,000లోపు బిల్లుపై 5 శాతం, రూ.లక్షలోపు బిల్లుపై 10 శాతం, రూ.1–2 లక్షలలోపు బిల్లుపై 15 శాతం, రూ.2–10 లక్షల బిల్లుపై 20 శాతం, రూ.1 కోటిపై బిల్లుపై 30 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చని వివరించింది. ‘మహిళలు డైమండ్‌ ఆభరణాలపై ఆసక్తి చూపిస్తున్నారు. డైమండ్స్‌ విలువైనవి. అందమైనవి. శాశ్వతమైనవి. మంచి డిజైన్లతో కూడిన ఆభరణాలను ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడానికి మేమెప్పుడూ ప్రయత్నిస్తుంటాం’ అని టైటాన్‌ కంపెనీ జువెలరీ విభాగపు జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) దీపిక తివారీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement