
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్' తన 16వ వార్షికోత్సవాన్ని పురుస్కరిచుకుని ఒక్క రోజు (మార్చి 30) స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌వాచెస్, ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్ వంటి వాటిమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే మొదటి 100 మంది కస్టమర్లకు.. కేవలం 16 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ (లావా అగ్ని 3), స్మార్ట్‌వాచ్ (లావా ప్రోవాచ్ V1) అందిస్తుంది.
కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ఈ రోజు (మార్చి 30) మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రం 7:00 గంటలకు ప్రోవాచ్ వీ1 సేల్ జరుగుతుంది. దీనిని కొనుగోలు చేయడానికి ప్రోవాచ్ అనే కూపన్ కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.

లావా అగ్ని 3
ఇండియన్ మార్కెట్లో లావా అగ్ని 3 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 19999. ఇది 6.78 ఇంచెస్ డిస్‌ప్లే, క్వర్డ్ స్క్రీన్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 500 mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఛార్జర్ కావాలనుకుంటే.. కస్టమర్లు కొంత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 16 రూపాయలకు ఎవరైనా సొంతం చేసుకుంటే.. వారికి ఈ ఛార్జర్ లభిస్తుందా? లేదా అనేది వెల్లడికాలేదు.
లావా ప్రోవాచ్ వీ1
ఈ ఏడాది ప్రారంభంలో 2,399 రూపాయల ధర వద్ద లాంచ్ అయిన లావా ప్రోవాచ్ వీ1.. ఈ రోజు ఆఫర్ కింద 16 రూపాయలకు లభిస్తుంది. ఈ వాచ్ 1.85 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి.. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ పొందుతుంది. ఇది జీపీఎస్ న్యావిగేషన్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.