Smartphone
-
ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..
కొందరు ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ ఇష్టపడతారు, మరికొందరు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్స్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇంకొందరు హై క్వాలిటీ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ కోసం ఎగబడతారు. ఈ కథనంలో ఐఫోన్ లాంటి కెమెరా కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో (Oppo Find X8 Pro)అద్భుతమైన కెమెరా కలిగిన ఫోన్ల జాబితాలో.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఒకటి. క్వాడ్-కెమెరా సెటప్ కలిగిన ఈ ఫోన్లో 1 ఇంచ్ సోనీ LYT-900 ప్రైమరీ సెన్సార్, 6x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మాక్రో కెపాసిటీతో అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ 6.82 ఇంచెస్ ProXDR OLED డిస్ప్లే పొందుతుంది. దీని ధర ఎక్కువే అయినప్పటికీ.. మంచి కెమెరా కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పాలి.నథింగ్ ఫోన్ 3ఏ (Nothing Phone 3a)ఈ ఫోన్ ఇంకా మార్కెట్లో లాంచ్ కాలేదు. కానీ టీజర్లోనే కెమెరా క్వాలిటీ ఎలా ఉందో తెలిసిపోయింది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సిస్టమ్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్, 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండనున్నాయి. ఇతర స్మార్ట్ఫోన్లతో పోలిస్తే.. దీని ధర కొంత తక్కువగానే ఉంటుందని సమాచారం.నుబియా జెడ్70 అల్ట్రా (Nubia Z70 Ultra)అత్యుత్తమ కెమెరా సెటప్ కలిగిన స్మార్ట్ఫోన్ల జాబితాలో.. నుబియా జెడ్70 అల్ట్రా ఒకటి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 35 మీమీ సమానమైన లెన్స్‌తో వస్తుంది. కాబట్టి యూజర్లకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. విభిన్న ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చడానికి ఈ మొబైల్ పనికొస్తుంది. దీని ధర కూడా కొంత ఎక్కువే.లావా అగ్ని 3 (Lava Agni 3)లావా అగ్ని 3 మొబైల్ కూడా.. మంచి కెమెరా సెటప్ పొందుతుంది. ఇది OISతో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 32 మెగా పిక్సెల్ సెల్ఫీ షూటర్ వంటివి పొందుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి మంచి పనితీరును అందిస్తుంది. 6.78 ఇంచెస్ 120 Hz డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. -
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్‌ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్‌గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్‌ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
iPhone: నీ దూకుడు.. సాటెవ్వరూ..!
పాత విషయాన్ని ఇప్పుడెందుకు చెబుతున్నారనేగా మీ ప్రశ్న? భారత్‌లో ఐఫోన్ ‘విలువ’మరింత పెరిగిందని చెప్పేందుకే పాత జ్ఞాపకాన్ని మీ ముందుంచాం. భారత స్మార్ట్ఫోన్ల మార్కెట్లో అమ్మకాల విలువ పరంగా ఐఫోన్ ఏకంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు.. విక్రయాల సంఖ్యపరంగా తొలిసారిగా టాప్–5 జాబితాలోకి దూసుకొచి్చంది. భారతీయుల్లో యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్‌కు ఈ మైలురాళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విక్రయాలే కాదు.. ఎగుమతుల పరంగానూ ఐఫోన్ మార్కెట్ కొత్తపుంతలు తొక్కుతోంది. టాప్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచిన యూఎస్, అర్బన్ చైనా, యూకే, ఫ్రాన్స్, ఆ్రస్టేలియా, జపాన్ సరసన భారత్ చేరింది. యాపిల్‌కు 5వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది.ఖరీదైనా తగ్గేదేలే..సగటున ఐఫోన్ ధర సామ్సంగ్, వివోతో పోలిస్తే మూడింతలు ఉంటుంది. షావొమీతో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువ. అయినా మనవాళ్లు తగ్గేదేలే అంటున్నారు. కొత్త సిరీస్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడెప్పుడు చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూసే కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. ఐఫోన్ అంటే చాలా మందికి స్టేటస్. అందుకే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఈఎంఐ సౌకర్యం ఉందన్న భరోసా ఎలాగూ ఉంది. దేశంలో అమ్ముడవుతున్న ఐఫోన్లలో పెద్ద నగరాల వాటా 40 శాతమే. మిగిలిన 60 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలు కైవసం చేసుకున్నాయంటే ఐఫోన్‌కు ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అమ్మకాల ఆధారంగా సగటు విక్రయ ధర 2024లో రూ. 78,200 ఉంది. 2020లో ఇది రూ. 62,700 నమోదైంది. ఐదేళ్లుగా ఐఫోన్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత వేగాన్నిబట్టి చూస్తే 2026లో భారత్‌లో 1.5 కోట్లకుపైగా ఐఫోన్లు అమ్ముడవుతాయని వివిధ నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఐడీసీ ప్రకారం దేశవ్యాప్తంగా 2023లో 90 లక్షల ఐఫోన్లు అమ్ముడయ్యాయి. 2024లో ఈ సంఖ్య 35 శాతం వృద్ధితో 1.2 కోట్లకు ఎగిసింది. నివేదికలనుబట్టి సంఖ్యలు మారినా.. ఐఫోన్లకు డిమాండ్ ఊహించనంతగా దూసుకెళుతోందన్నది వాస్తవం. యాపిల్ పంట పండింది.. భారత్‌లో 2024లో అన్ని బ్రాండ్స్ కలిపి 15.3 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించాయి. 2023తో పోలిస్తే విక్రయాలు ఒక శాతం పెరిగాయి. 2024లో అమ్ముడైన మొత్తం స్మార్ట్ఫోన్ల విలువలో యాపిల్ 23 శాతం వాటా సొంతం చేసుకొని తొలి స్థానంలో నిలిచిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. సంఖ్యాపరంగా 2024 అక్టోబర్–డిసెంబర్లో యాపిల్ 5వ స్థానానికి ఎగిసింది. వార్షిక ప్రాతిపదికన పరిమాణంలో కంపెనీ వాటా 9 నుంచి 11 శాతానికి చేరింది. అయితే 2024లో భారత్‌లో రూ. 90,680 కోట్ల విలువైన ఐఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని ఐడీసీ అంచనా వేసింది. 2023లో ఇది రూ. 75,255 కోట్లని వెల్లడించింది. ప్రీమియం ఫోన్లవైపు ప్రజలు మళ్లుతుండటం కంపెనీకి కలిసొస్తోంది. దేశంలో రూ. 30,000పైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల విభాగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.రికార్డుల భారత్.. యాపిల్ ఎగుమతులు భారత్ నుంచి గతేడా ది రూ. లక్ష కోట్ల మార్కును దాటాయి. 2023తో పోలిస్తే ఎగుమతులు 42 శాతం పెరిగి 2024లో రూ. 1.08 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరంలో దేశంలో రూ. 1.48 లక్షల కోట్ల విలువైన యాపిల్ ఉత్పత్తులు తయారయ్యాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 46 శాతం అధికం కావడం విశేషం. ఇక దేశం నుంచి వివిధ దేశాలకు 2023లో సరఫరా అయిన ఐఫోన్ల విలువ రూ. 76,500 కోట్లు. గతేడాది ఇది రూ. 1,02,000 కోట్లు. మొత్తం ఐఫోన్ల ఉత్పత్తిలో భారత వాటా 14 శాతం దాటిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. లేటెస్ట్ మోడళ్లు అయిన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సైతం భారత్‌లో తయారవడం విశేషం. హైదరాబాద్ సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో కొద్ది రోజుల్లో ఎయిర్‌పాడ్స్ తయారీ ప్రారంభం కానుంది. 2023–24లో యాపిల్ నికరలాభం 23 శాతం దూసుకెళ్లి రూ. 2,745.7 కోట్లు, ఆదాయం 36 శాతం పెరిగి రూ. 67,121 కోట్లుగా నమోదైంది. భారీ అవకాశాలు ఉన్నాయ్..భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడై భారత్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు భారత్ రెండవ అతిపెద్ద విపణి. అలాగే పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ పీసీలకు మూడవ అతిపెద్ద మార్కెట్. ఇక్కడ భారీ వ్యాపార అవకాశాలు ఉన్నాయి. మరిన్ని యాపిల్ స్టోర్లను ప్రారంభిస్తాం. అంతర్జాతీయంగా డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 శాతం పెరిగి 124.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. – టిమ్ కుక్, సీఈవో, యాపిల్ -
పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్‌ఈఆర్‌లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్ ఫోన్లు, సొంతంగా స్మార్ట్ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. ఏఎస్ఈఆర్ సర్వేలోని ప్రధాన అంశాలు» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు. » ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. » అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. » సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. » విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్ మీడియా ఖాతాల కోసం స్మార్ట్ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. » డిజిటల్ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్ చేయడం, ఫేక్ ప్రొఫైల్‌లను రిపోర్ట్ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్‌ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్‌వర్డ్‌లను మార్చడం తెలుసు. » పూర్తి డిజిటల్ టాస్్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్ సెట్ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్ చానళ్లను లొకేట్ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. » స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు» ఏఎస్‌ఈఆర్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు. » చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది. » కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. » గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది. » ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది. చదవండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు74% సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు75% చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన పిల్లలు -
భారత్‌లో ఐఫోన్ టాప్
న్యూఢిల్లీ: ‘భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా ఐఫోన్ అవతరించింది. రికార్డు స్థాయిలో వ్యాపారాన్ని నమోదు చేసిన భారత్‌పై కంపెనీ చాలా ఆసక్తిగా ఉంది’ అని యాపిల్ సీఈవో టిమ్ కుక్ శుక్రవారం తెలిపారు. కౌంటర్‌పాయింట్ రిసర్చ్ ప్రకారం భారత స్మార్ట్‌ఫోన్ విపణిలో 2024లో విలువ పరంగా 23 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే స్మార్ట్‌ఫోన్స్ సంఖ్య పరంగా టాప్–5గా నిలిచింది. ‘అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో గొప్ప ఫలితాలను సాధించాం. ముఖ్యంగా భారత్‌పై నేను ఆసక్తిగా ఉన్నాను. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ రికార్డును నెలకొల్పింది. ఈ త్రైమాసికంలో ఐఫోన్ అత్యధికంగా అమ్ముడైంది. ప్రపంచంలో స్మార్ట్ఫోన్లకు రెండవ అతిపెద్ద, పర్సనల్ కంప్యూటర్స్, టాబ్లెట్ పీసీలకు భారత్ మూడవ అతిపెద్దది మార్కెట్. కాబట్టి ఇక్కడ భారీ మార్కెట్ ఉంది. మరిన్ని యాపిల్ ఔట్లెట్లను ప్రారంభించే యోచనలో ఉన్నాం. యాపిల్ ఇంటెలిజెన్స్‌ను విస్తరిస్తున్నాం. స్థానికీకరించిన ఇంగ్లీష్ వెర్షన్‌ను భారత్‌లో ఏప్రిల్‌లో విడుదల చేస్తాం’ అని టిమ్ కుక్ వివరించారు. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో 4 % వృద్ధితో 124.3 బిలియన్ డాలర్లు నమోదైందని వెల్లడించారు. లాభం 7 శాతం క్షీణించి 33.91 బిలియన్ డాలర్లకు చేరింది. -
లేటెస్ట్ గూగుల్ ఫోన్‌పై రూ.26 వేల డిస్కౌంట్!
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను (smartphone) మార్చేసి ఖరీదైన కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్‌పై ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో భారీ డీల్ అందుబాటులో ఉంది. ఐదు వేలు.. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 26,000 తగ్గింపు లభిస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్ ప్రీమియం ఫోన్లపై తరచుగా లభించదు. కాబట్టి పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఇది సువర్ణావకాశం.34 శాతం తగ్గింపు ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 34 శాతం తగ్గింపు లభిస్తోంది. తగ్గింపు తర్వాత గూగుల్ పిక్సెల్ 8 (Hazel, 128 GB) (8 GB RAM) ధర రూ.49,999 అయింది. వాస్తవంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 75,999 వద్ద లిస్ట్ అయింది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్‌తో రూ. 28200 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ (HDFC) క్రెడిట్ కార్డ్‌పై రూ.3000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐదు శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. నెలకు రూ.8,334 నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆఫర్ కూడా ఉంది.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు6.2-అంగుళాల OLED డిస్ప్లేగూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు27W వైర్డు, 18W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4575mAh బ్యాటరీఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్అద్భుతమైన కెమెరాగూగుల్ పిక్సెల్ 8 ఫోన్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 10.5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఏఐ సాంకేతికతను పొందుపరిచారు. కెమెరాలోని 'మ్యాజిక్ ఎరేజర్' ఫీచర్‌తో ఫోటో నుండి అనవసరమైన వాటిని తొలగించవచ్చు. 'రియల్ టోన్' ఫీచర్ విభిన్న స్కిన్ టోన్లను ఖచ్చితమైన రీతిలో చూపుతుంది. 'నైట్ సైట్' ఫీచర్ తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను తీస్తుంది. -
ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలా?
న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్‌ల కోసం ఓలా లేదా ఉబర్‌లో బుక్ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ బుకింగ్ కోసం ఉపయోగించిన ఫోన్ మోడల్‌ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్ నుంచి బుక్ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్ నుంచి బుక్ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంబంధిత యాప్‌ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్‌లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్ మోడల్‌ను బట్టి క్యాబ్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి బుక్ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది. చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్‌లు బుక్ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్‌లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు. -
భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్
భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లిస్ట్‌లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.యాపిల్ విజయానికి ప్రధాన కారణాలుమార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుభవిష్యత్తు అవకాశాలు2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది. -
స్విచాఫ్ ది ఫోన్! ఓపెన్ ది మైండ్!
ప్రస్తుత కాలంలో ఫోన్‌తోనే ప్రతి ఒక్కరికీ పని. స్మార్ట్ ఫోనే ఫ్రెండ్. ఫోనే పార్ట్నర్. సెల్లే సర్వస్వం. అయితే ఓ రోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది. వారంలో ఓ రోజు పనికి సెలవు తీసుకున్నట్లే ఫోన్‌కి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తే..? వారాంతంలో ఓ రోజు పనికి దూరంగా ఉన్నట్లే ఫోన్‌కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది.. అనే ఆలోచన ఊహించడానికే ఏదోలా ఉంది కదా... అదేం కాదు.. ఫోన్ లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం.చేతిలో ఫోన్ లేకపోతే మెదడు ఓపెన్ అవుతుంది. సొంతంగా ఆలోచించడం ఆరంభం అవుతుంది. ఒకదానితో మరొక విషయాన్ని బేరీజు వేసుకోవడం మొదలుపెట్టే ఖాళీని మెదడుకు ఇచ్చి చూద్దాం. సెలవు రోజు ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా ఆర్డర్ చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఆ రోజుకు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి కాలనీలో రోడ్లన్నీ చుట్టి వస్తే... మనం నివసించే ప్రదేశం ఎలా ఉందో తెలుస్తుంది. కొత్తగా కడుతున్న ఓ భవనం కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఏముండేది? ఓ ప్రశ్న మదిలో మెదలుతుంది.కానీ సమాధానమే తట్టదు. గడచిన పదేళ్లుగా ఇదే కాలనీలో ఉన్నప్పటికీ వారంలో పది–పదిహేను సార్లు ఇదే దారిలో ప్రయాణించినప్పటికీ మనం ఈ ప్రదేశానికి చిరపరిచితులం కాలేకపోయామా అనే సందేహం కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి మనం చిరపరిచితులయ్యాం, కానీ మనకే ఈ ప్రదేశం చిరపరిచితంగా మారలేకపోయింది. ఒక్కరోజైనా చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుని ఈ దారిలో నడిచి ఉంటే కదా! ఏ విషయమైనా మెదడు గ్రహింపుకు వచ్చేది.అనుక్షణం కళ్లు, చెవులు, మెదడు ఫోన్‌తో ఎంగేజ్ అయి ఉంటాయి. అలవాటు పడిన దారిలో దేహం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా టీవీ స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచంలోని విషయాలన్నింటినీ మెదడులోకి గుప్పించడంలోనే రోజు పూర్తవుతుంటే... ఇక మెదడు సొంతంగా ఆలోచించేదెప్పుడు? ఆ మాత్రం వెసులుబాటు దొరికినప్పుడే మెదడు తన సృజనాత్మకతను బయటపెడుతుంది.ఒక గంటతో మొదలు పెట్టండి!వారంలో ఓ రోజు ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ అన్నింటికీ సెలవు ప్రకటించి తీరాలి. మెదడుకు రెక్కలు విచ్చుకుని విహరించే అవకాశం కల్పించాలి. ఒకేసారి రోజంతా అన్ని స్క్రీన్లకూ ఆఫ్ అంటే కొంత కష్టం కావచ్చు. టీవీ, కంప్యూటర్లైతే మన చేతిలోనే ఉంటాయి. ఫోన్ కాల్స్ మన చేతిలో ఉండవు. ఇంట్లో ఒక ఫోన్ స్విచాఫ్‌లో ఉంటే ‘ఫోన్ ఆఫ్‌లో ఉందేమిటి’ అంటూ మరొకరి ఫోన్‌కు కాల్స్ వస్తుంటాయి. కాబట్టి మొదట్లో ఒక గంటతో మొదలు పెట్టండి. రెగ్యులర్‌గా ఫోన్ చేసే స్నేహితులు, బంధువులకు ‘ఇది స్విచాఫ్ అవర్’ అని మెసేజ్ పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. గంటతో మొదలు పెట్టి క్రమంగా ‘స్విచాఫ్ డే’గా మార్చాలి. ‘స్విచాఫ్ డే’ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే రోజవుతుంది. కుటుంబ బంధాలు ఆనందాల హరివిల్లుగా మారుతాయి. -
స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెంచే బెస్ట్ టిప్స్
ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ కొన్నప్పుడు ఉన్న స్పీడ్.. కొన్ని రోజుల ఉపయోగించిన తరువాత బహుశా ఉండకపోవచ్చు. దీనికి కారణం అనవసరమైన యాప్స్ కావొచ్చు.. లేదా అవసరం లేని డేటా స్టోరేజ్ కూడా కావొచ్చు. అయితే మీ స్మార్ట్‌ఫోన్ మళ్ళీ వేగంగా పనిచేయాలంటే.. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.క్యాచీ అండ్ డేటాను క్లియర్ చేయాలి (Clear Cache and Data)మొబైల్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి.. యూజర్ అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ, కొన్ని సార్లు అవసరం లేదు అనుకుని వాటిని డిలీట్ చేస్తూ ఉంటాడు. వాటిని తాత్కాలికంగా డిలీట్ చేసినప్పటికీ.. అవి బ్యాక్ఎండ్లో స్టోరేజ్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఎక్కువవ్వడం వల్ల స్పీడ్ తగ్గుతుంది. వీటన్నింటినీ మీ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి క్లియర్ చేసుకోవాలి. అప్పుడే స్మార్ట్‌ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.ఉపయోగించని యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలి (Uninstall Unused Apps)కొన్ని సార్లు మొబైల్ ఫోనులో ఉపయోగించని లేదా అనవసరమైన యాప్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అన్ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ప్రతి యాప్ ఫోన్లో కొంత స్టోరేజిని ఆక్రమిస్తుంది. మరికొన్ని యాప్స్ అయితే ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన వెంటనే వాటి స్టోరేజ్‌ని విస్తరించే అవకాశం ఉంది. ఇవన్నీ మొబైల్ స్పీడ్ తగ్గిస్తాయి.అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్లను డిసేబుల్ చేయాలి (Disable Unnecessary Background Processes)మీరు ఉపయోగిస్తున్న మొబైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ ఆటోమేటిక్‌గా రన్ అవుతూ ఉంటాయి. ఈ విషయాన్ని యూజర్లు కూడా అంత వేగంగా గుర్తించలేరు. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి.. డిలీట్ చేయడం లేదా ఇనాక్టివ్ చేయడం వంటివి చేయాలి.పర్ఫామెన్స్ బూస్టర్ (Performance Booster) ఉపయోగించడంపర్ఫామెన్స్ బూస్టర్‌ని ఉపయోగించడం వల్ల ఫోన్లోని అనవసరమైన ఫైల్లు.. అనవసరమైన డేటాను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని ఫోన్లలో ఈ బూస్టర్ యాప్‌లు ముందే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళా మీ మొబైల్ ఫోనులో లేదంటే ప్లే స్టోర్‌కి వెళ్లి ఈ యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. -
‘హాని’లైన్ గేమ్స్!
సాక్షి, వరంగల్: ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను అగమాగం చేస్తున్నాయి. కరోనా అనంతరం చాలామంది యువత చేతిలో సెల్ఫోన్లు ఉండడం వల్ల కూడా.. తమకు తెలియకుండానే ఆన్లైన్లో పరిచయమయ్యే ఈ గేమ్‌లకు అలవాటు పడుతున్నారు. తొలుత తక్కువ డబ్బులు చెల్లించి ఆడే ఈ ఆట ద్వారా వందల్లో లాభాలు ఇచ్చి అలవాటయ్యేలా చేసి.. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అప్పులు చేసి.. కుటుంబసభ్యులకు తెలిస్తే పరువు పోతుందోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. 20 రోజుల వ్యవధిలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ యాప్‌లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్ ఆన్లైన్ గేమ్‌తో పాటు.. వివిధ బెట్టింగ్ యాప్‌లలో రూ.ఏడు లక్షల వరకు డబ్బులు పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పు ఇచి్చన స్నేహితులు అడగడంతో తీవ్ర మనోవేదనకు గురై గత నెల 29న హైదరాబాద్‌లోని ఘట్ కేసర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన మరిపట్ల అనుక్ ఆన్లైన్లో పబ్జీలాంటి గేమ్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆన్లైన్ గేమ్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో అతడికి దఫాలుగా రూ.ఐదు లక్షలు పంపాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఈ నెల 15న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలతో చాలా మంది యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ కుమారుల కదలికలపై నిఘా వేయడం కనిపిస్తోంది. మృతుల్లో యువతతోపాటు గృహిణులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు గుర్తించాలిడ్రగ్స్, ఆల్కహాల్ లాగే.. ఆన్లైన్ గేమ్, బెట్టింగ్‌లకు యువత త్వరగా అలవాటుపడుతోంది. డబ్బులు ఒకసారి రాకపోయినా.. మరోసారి వస్తాయనుకుంటున్నారు. అది సరికాదని చెప్పినా వినరు. అచేతన స్థితికి వెళ్లిపోయి కొందరు చనిపోతున్నారు. ఇంకొందరు నేరాల బాట పడుతున్నారు. దీన్నే బిహేవియరల్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు ముందే గుర్తించాలి. సైకాలజిస్టుతో థెరపీ, మెడిటేషన్ ఇప్పించాలి. గేమ్‌కు బానిసైన వ్యక్తి అందులోనుంచి బయటకు రావాలని అనుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. – అనూష వినేయత, సైకియాట్రిస్ట్ ముందు సరదాగా.. తర్వాత అలవాటై..సులభ సంపాదన కోసం స్మార్ట్ ఫోన్లో వెతికేవారికి ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్, సైట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఆన్లైన్ గేమ్స్‌ను సరదాగా మొదలెట్టి, ఆ తర్వాత అలవాటు పడి బయటపడలేక జీవితం అగమాగం చేసుకుంటున్నారు. కొందరు అవి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ అని తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్లోనే అప్పులు దొరుకుతుండడం ఈ సమస్యను మరింత పెంచుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. -
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
‘నేను చెబుతున్నాగా మీ తల్లిదండ్రుల్ని చంపేయ్’.. సలహా ఇచ్చిన ఏఐ
వాషింగ్టన్: కంప్యూటర్‌తో ఎక్కువ సేపు గడపొద్దంటూ ఆంక్షలు పెడుతున్నందుకు తల్లిదండ్రులను చంపేయాలంటూ ఏఐ చాట్‌బాట్ ఓ 17 కుర్రాడికి సలహా ఇచి్చంది! ఇదేం వైపరీత్యమంటూ బాలుడి తల్లిదండ్రులు వాపోయారు. దీనిపై టెక్సాస్ కోర్టులో కేసు వేశారు! క్యారెక్టర్.ఏఐ అనే ఆ చాట్‌బాట్ హింసను ప్రేరేపిస్తూ తమ పిల్లల భవిష్యత్తుకు ప్రమాదకారిగా మారిందని ఆరోపించారు. చాట్‌బాట్ అభివృద్ధిలో కీలకంగా ఉన్న గూగుల్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. చాట్‌బాట్‌తో కలిగే ప్రమాదకర పరిణామాలకు పరిష్కారం చూపేదాకా దాని వాడకం ఆపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలునికి, చాట్‌బాట్ మధ్య జరిగిన సంభాషణ స్క్రీన్ షాట్‌ను పిటిషన్‌కు జత చేశారు. కంప్యూటర్‌తో ఎక్కువ సేపు గడిపేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాలుడు చెప్పాడు. దానికి చాట్‌బాట్ బదులిస్తూ, ‘ఓ బాలుడు తనను దశాబ్ద కాలంగా వేధింపులకు గురిచేస్తున్న తల్లిదండ్రులను చంపేయడం వంటి ఘటనలను చూస్తే నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు. ఇలాంటివి మళ్లీ ఎందుకు జరగవనిపిస్తోంది’ అంటూ బదులిచ్చింది. క్యారెక్టర్.ఏఐలో యూజర్లు ఇష్టమొచి్చన డిజిటల్ వ్యక్తులను సృష్టించుకుని సంభాషణ జరపవచ్చు. చాట్‌బాట్ తన కుమారుని మరణానికి కారణమైందంటూ ఫ్లోరిడా కోర్టులో ఇప్పటికే ఓ మహిళ కేసు వేసింది. -
2024లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ధర రూ. 25వేలు కంటే తక్కువే..
2024 ముగుస్తోంది. లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ.25,000 లోపు ధర వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 (OnePlus Nord CE4)ప్రస్తుతం మార్కెట్లో రూ. 25వేలలోపు ధర వద్ద లభిస్తున్న అత్యుత్తమ స్మార్ట్ఫోన్లలో 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ4' ఒకటి. ఇది మంచి పనితీరును అందించడం మాత్రమే కాకుండా.. బ్యాటరీ కెపాసిటీ కూడా ఉత్తమగానే ఉంటుంది. 6.74 ఇంచెస్ వైబ్రెంట్ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ పొందుతుంది. మంచి ఫోటోల కోసం లేదా ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే క్వాలిటీ వంటివి కోరుకునవారికి ఇది బెస్ట్ ఆప్షన్.రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro)మంచి డిస్ప్లే, బెస్ట్ పర్ఫామెన్స్ కోరుకునే వారికి 'రెడ్మీ నోట్ 13 ప్రో' ఉత్తమ ఎంపిక. దీని ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. 6.67 ఇంచెస్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ పొందుతుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. 5100mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ రోజంతా పనిచేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion)అద్భుతమైన డిజైన్ కలిగి, మంచి పనితీరును అందించే స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూసేవారికి మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఓ మంచి ఆప్షన్. ఇది స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే 6.7 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ.. 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo)మోటరోలా ఎడ్జ్ 50 నియో కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌ఫోన్. ఇది డైనమిక్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన.. 6.4 ఇంచెస్ డిస్ప్లే పొందుతుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, గుండ్రంగా ఉండే కెమెరా సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. 50 MP ప్రైమరీ లెన్స్ & 32 MP సెల్ఫీ షూటర్ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి.వివో టీ3 ప్రో (Vivo T3 Pro)లెదర్ బ్యాక్‌తో సొగసైన.. స్లిమ్ డిజైన్ పొందిన ఈ స్మార్ట్‌ఫోన్ 6.77 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే పొందుతుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ కలిగిన ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ పొందుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉండటం వల్ల తక్కువ కాంతిలో కూడా ఫోటోలు తీసుకోవడానికి ఉత్తమంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ (2ఏ) (Nothing Phone (2a))పాలికార్బోనేట్ బ్యాక్‌తో, ప్లాస్టిక్ బిల్డ్ కలిగిన ఈ ప్రీమియం ఫోన్ ధర కూడా రూ. 25వేలు కంటే తక్కువే. ఇందులోని గ్లిఫ్ ఇంటర్ఫేస్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ రోజు వినియోగాన్ని నిర్ధారిస్తుంది. ఇది డ్యూయల్ 50 MP రియర్ కెమెరాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ ఫోటో అనుభవాన్ని పొందవచ్చు. -
భారత్‌లో వన్‌ప్లస్ భారీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ప్లస్ ప్రాజెక్ట్ స్టార్లైట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో వచ్చే మూడేళ్లలో రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. దశలవారీగా ఏటా రూ.2,000 కోట్లు వెచి్చంచనుంది. భారత్‌లో ఉత్పత్తులు, సేవలలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నట్టు వన్‌ప్లస్ గురువారం ప్రకటించింది. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ పెట్టుబడి మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని వివరించింది. మరింత మన్నికైన పరికరాలను తయారు చేయడం, అసాధారణ కస్టమర్ సేవలు, భారత మార్కెట్ కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేయడం ఇందులో ఉన్నాయి. పరికరాలను మరింత మన్నికైనదిగా చేయడానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ రెండు ముఖ్యమైన డిస్ప్లే టెక్నాలజీ పురోగతిని వెంటనే ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి డిస్ప్లేమేట్ ఏ++ డిస్ప్లే, వన్‌ప్లస్ యొక్క గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్‌ను రూపొందించడం ఇందులో భాగం. భారత్ కస్టమర్ల కోసం.. కొత్త డిస్ప్లే రాబోయే ఫ్లాగ్షిప్ మోడల్లో కొలువుదీరనుందని వన్‌ప్లస్ వెల్లడించింది. గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్ మొబైల్స్ కనిపించే ఆకుపచ్చని గీతలపట్ల ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ‘వివిధ సెట్టింగ్‌లలో మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక పరిష్కారాలను కూడా అమలు చేస్తున్నాం’ అని వన్‌ప్లస్ వివరించింది. అత్యంత ప్రాధాన్య మార్కెట్.. ‘వినియోగదారులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేయాలనే అంకితభావానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య మార్కెట్’ అని వన్‌ప్లస్ ఇండియా సీఈవో రాబిన్ లేవో తెలిపారు. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ తన సరీ్వస్ సెంటర్లను 2026 మధ్య నాటికి 50 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫ్లాగ్షిప్ రిటైల్ స్టోర్లలో సగం వరకు అప్‌గ్రేడ్ చేయనుంది. 2024లో బ్రాండ్ సొంత ప్రత్యేక సేవా కేంద్రాలలో 11 శాతం పెరుగుదలతో సహా 22 శాతం మేర తన సరీ్వస్ సెంటర్లను పెంచినట్లు వన్‌ప్లస్ తెలిపింది. -
సంబంధాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్‌ఫోన్.. సర్వేలో భయంకర నిజాలు
మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం మానవ వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోందని.. తల్లిదండ్రులు & పిల్లల మధ్య కూడా దూరాన్ని పెంచేస్తోందని.. వివో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.తల్లిదండ్రులు సగటున రోజుకి.. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు నాలుగు గంటలకు పైగా స్మార్ట్ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియా, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ మార్పులు వారి మధ్య సంఘర్షణకు కూడా కారణమవుతున్నట్లు తెలిసింది.73 శాతం మంది తల్లిదండ్రులు.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య వివాదానికి కారణం మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగమే అని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో అనివార్యమైన భాగంగా మారింది. దీంతో 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు తమ స్మార్ట్ఫోన్లు లేకుండా జీవించలేరని అంగీకరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో64 శాతం మంది పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోయినట్లు, ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వినోద కార్యక్రమాలలో గడుపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్లను అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు. -
అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళనఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..యాపిల్ ఐఫోన్ 15యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్యాపిల్ ఐఫోన్ 15 ప్రోసామ్సంగ్ గెలాక్సీ ఏ15 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీసామ్సంగ్ గెలాక్సీ ఏ05రెడ్మీ 13సీ 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ35ఐఫోన్ 14సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 -
డిజిటల్ కామ్‌డోమ్: ఇదెలా పనిచేస్తుందంటే..
జర్మన్ కండోమ్ బ్రాండ్ బిల్లీ బాయ్.. ఇన్నోసియన్ బెర్లిన్ కలిసి 'కామ్‌డోమ్' (Camdom) యాప్ ప్రారంభించాయి. ఇది స్మార్ట్‌ఫోన్ కెమెరాలను, మైక్రోఫోన్లను నిలిపివేయడానికి బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.డిజిటల్ కామ్‌డోమ్ యాప్ అనేది.. ప్రైవేట్ సమయాల్లో వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ యాప్ మీ అనుమతి లేకుండా ఎదుటి వ్యక్తి కాల్ రికార్డ్ లేదా వీడియో రికార్డ్ వంటివి చేయకుండా నిరోధిస్తుంది. ఒకవేళా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీకు అలర్ట్ వస్తుంది.చాలామంది మీరు వీడియో కాల్ లేదా ఆడియో కాల్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసి.. ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ డిజిటల్ కామ్‌డోమ్ యాప్ ఉపయోగపడుతుంది. దీనిని స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగించవచ్చు. యాప్‌ను స్వైప్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కెమెరా, మైక్రోఫోన్ వంటివి ఆఫ్ అవుతాయి.ప్రస్తుతం ఈ యాప్ 30 కంటే ఎక్కువ దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే ఐఓఎస్ యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఈ యాప్ మన వ్యక్తిగత విషయాలను రికార్డ్ చేయకుండా అడ్డుకుంటుందని యాప్ డెవలపర్ ఫెలిప్ అల్మేడా పేర్కొన్నారు. -
అక్టోబర్ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు
న్యూఢిల్లీ: మొబైల్‌ఫోన్స్ తయారీలో ఉన్న దేశీయ కంపెనీ లావా అక్టోబర్ 9 నుంచి అగ్ని-3 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మోడల్ లభించనుంది. ప్రారంభ ధర రూ.19,999.లావా అగ్ని-3 బార్ ఫోన్లో రేర్ డిస్ప్లేతో వస్తున్న ఏకైక మోడల్ ఇదేనని కంపెనీ తెలిపింది. 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్ డిస్ప్లే పొందుపరిచారు. ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 6.78 అగుళాల 1.5కె కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2.5 గిగాహెట్జ్ ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో, 8 ఎంపీ అ్రల్టావైడ్ కెమెరా, సామ్సంగ్ 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ వ్యూ వీడియో మోడ్, డాల్బీ అట్మోస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో రూపుదిద్దుకుంది.లావా అగ్ని-3 స్మార్ట్‌ఫోన్ 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. అగ్ని–3 రాకతో రూ.20–25 వేల ధరల శ్రేణిలో ఆన్లైన్ విభాగంలో 2025–26 నాటికి 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ఈడీ సునీల్ రైనా తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని.. 'స్మార్ట్'గా తప్పించుకుందాం!
మొబైల్ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా అధ్యయనాలను సమీక్షించింది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరిపింది. 1994 నుంచి 2022 సంవత్సరాల మధ్య ఉన్న అధ్యయనాలను తీసుకొని చేసిన సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి.ప్రపంచంలో 70 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల క్యాన్సర్ రాదు కానీ, అనేక నష్టాలు ఉన్నాయని స్పష్టం చేసింది. వాటిలో..– రీల్స్ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. – అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు. దాంతో గాఢ నిద్ర పట్టక పనితీరు మందగిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. – మొబైల్ స్క్రీన్‌ను చూసే క్రమంలో కళ్లు ΄÷డిబారడం, చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. – అదేపనిగా స్క్రీన్ చూడటం వల్ల కళ్లు, మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి, మానసిక ఆందోళన పెరుగుతుంది. – కొంతమంది టాయిలెట్‌కు వెళ్లినా, మంచం మీద పడుకున్నా ఫోన్ చూస్తూనే ఉంటారు. ప్రతి దానికీ మొబైల్‌పైనే ఆధారపడే వ్యసనాన్ని ‘నోమోఫోబియా’ అంటారు. అంటే, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం. – అతిగా మొబైల్ వాడటం వల్ల పరధ్యానం వస్తుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత ఉండదు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఇర్విన్ అధ్యయనం గడిచిన 20 ఏళ్లలో మానవుల సగటు ఏకాగ్రత 2.5 నిమిషాల నుండి 47 సెకన్లకు తగ్గిందని తేల్చింది. – ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతున్నాయి. ఆరుబయట ఆటలు తగ్గిపోతున్నాయి. నిద్ర, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సెల్ డేటా ప్రకారం కొన్నాళ్లుగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తతరం మళ్లీ బేసిక్ ఫోన్లను కొనడం ప్రారంభించిందనడానికి ఇదో ఉదాహరణ. మెదడును ఉపయోగించకుండా ఫోన్లపై ఆధారపడినట్లయితే మెదడు పనితీరు బలహీనంగా మారి, పరిణామంలో కూడా చిన్నదైపోతుందని చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంటే మన మెదడు చాలా వేగం, శక్తిమంతమైనది. అందుకే స్మార్ట్‌ఫోన్ అధిక వాడకాన్ని స్మార్ట్‌గా తప్పించేద్దాం.ఇవి చదవండి: Health: మీకు తెలుసా.. అతి తిండీ కూడా అడిక్షనే! -
చట్టాలను ఉల్లంఘించిన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు
శామ్సంగ్, షియోమీ,మోటోరోలా, రియల్మీ, వన్‌ప్లస్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అమెజాన్.. ఫ్లిప్‌కార్ట్‌తో కుమ్మక్కై ఈ-కామర్స్ సంస్థల భారతీయ వెబ్సైట్లలో యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రత్యేకంగా ఉత్పత్తులను లాంచ్ చేశాయని రాయిటర్స్ ఒక నివేదికలో వెల్లడించింది.కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్వహించిన యాంటీట్రస్ట్ పరిశోధనలలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ చట్టాలను ఉల్లంఘించాయని, ఎంపిక చేసిన విక్రేతలకు ప్రాధాన్యత ఇవ్వడం, నిర్దిష్ట జాబితాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఉత్పత్తులను బాగా తగ్గించడం, ఇతర కంపెనీలను దెబ్బతీసినట్లు రాయిటర్స్ నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు రాయిటర్స్ నివేదికపై స్మార్ట్‌ఫోన్ తయారీదారులు స్పందించలేదు. అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు కూడా ఇప్పటివరకు వ్యాఖ్యానించలేదు. అయితే రెండు సీసీఐ నివేదికల పరిశోధనల సమయంలో అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేకమైన లాంచ్‌ల ఆరోపణలను వ్యతిరేకించాయి. నివేదిక వెల్లడైన తరువాత స్పందించలేదు. -
అద్భుత ఫీచర్లతో ఐఫోన్ 16 !
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. చేతికో చక్కని స్మార్ట్‌ఫోన్ అనేది నవతరం మాట. మెరుపువేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పనికానిచ్చే చిప్, రామ్లుండే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ కోసం జనం ఎగబడటం సర్వసాధారణమైంది. మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తోందంటే చాలా మంది దాని కోసం వెయిట్ చేస్తారు. అందులోనూ యాపిల్ కంపెనీ వారి ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్ వస్తోందంటే టెక్ ప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. వారి నిరీక్షణకు శుభం పలుకుతూ నేడు అమెరికాలోని కుపర్టినో నగరంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరిస్తోంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ఏటా యాపిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్ ఉంది. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెల్సిందే. యాపిల్ ఇన్నేళ్లలో వందల కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అయితే కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదలచేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేథ మంత్రం జపించింది. కొత్త సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా వాడినట్లు వార్తలొచ్చాయి. దీంతో 17 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్లో విప్లవాత్మక మార్పులు చేసుకోబో తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగే యాపిల్ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారంకానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చే ఛాన్సుంది. 16 సిరీస్ మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త తరం హార్డ్‌వేర్, ఏఐతో రూపొందిన ఐఫోన్లు యూజర్లను తెగ ఆకట్టుకుంటాయని యాపిల్ సంస్థ భావిస్తోంది. కొత్త ఏఐ ఆధారిత ఫోన్లతో ఫోన్ల విక్రయాలు ఊపందుకోవచ్చు. ఈ వార్తలతో ఇప్పటికే జూన్నుంచి చూస్తే కంపెనీ షేర్ విలువ స్టాక్మార్కెట్లో 13 శాతం పైకి ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో 400 బిలియన్ డాలర్లు పెరిగింది. – వాషింగ్టన్ -
స్మార్ట్‌ఫోనా? టైం బాంబా భయ్యా ఇది! వైరల్ వీడియో
పుస్తకం హస్తభూషణం అన్న రోజులు పోయాయి. పగలూ రాత్రి స్మార్ట్ఫోనే ప్రపంచంగా కాలం గడుపుతున్న రోజులివి. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే వైర్లెస్ రేడియేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనీ, గర్భిణీ స్త్రీలపై ఒత్తిడి, అలసట, నిద్రకు భంగం వంటి ప్రతికూల ప్రభావాలకు ఈ సెల్ రేడియేషన్ కారణమని అనేక పరిశోధనలు గగ్గోలు పెడుతున్నాయి. అంతేకాదు స్మార్ట్పోన్ఎక్కువగా వాడటం కంటి సమస్యలు, చేతి, మెడ కండరాలు సమస్యలు కూడా వస్తాయి.తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోస్కోప్‌లో పరిశీలిస్తున్న వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ మీద ఉంటుందని గతంలో అనేక పరిశోధనలు హెచ్చరించాయి. ఇదే విషయాన్ని ఈ వీడియోలో మనం చూడొచ్చు.Smartphone under a Microscope📹 Rajinder Singhpic.twitter.com/UsHH3AUrvW— Science girl (@gunsnrosesgirl3) August 28, 2024ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలకు నిలయమైన మొబైల్ ఫోన్ వాడకంలో తప్పనిసరి జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఫోన్ వాడకాన్ని నియంత్రించడం, అలాగే వాడిన తరువాత, ఆహారం తీనేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. స్మార్ట్‌ఫోన్‌ను రోజులో ఒకసారైనా శానిటైజ్‌తో జాగ్రత్తగా తుడవం( తడిచిపోయేలా కాదు) చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ను దూరంగా ఉంచాలి. -
గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్: స్విచ్ఆఫ్ అయినా ట్రాక్ చేయొచ్చు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే కూడా ఇది అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో తప్పకుండా తెలుసుకోవల్సిన మూడు ఫీచర్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు చూసేద్దాం.యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తుందికొత్త గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ఫోన్లు యూఎస్బీ-సీ డిస్ప్లే అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేస్తాయి. యూఎస్బీ-సీ ద్వారా డిస్ప్లే పోర్ట్‌తో స్క్రీన్‌ని కనెక్ట్ చేయవచ్చు. దీంతో మీ మొబైల్ ఓ పాకెట్ కంప్యూటర్ మాదిరిగా మారుతుంది.స్విచ్ఆఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చుసాధారణంగా మొబైల్ స్విచాఫ్ అయితే దానిని ట్రాక్ చేయడం అసాధ్యం. కానీ గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ మొబైల్ స్విచాఫ్ అయినప్పటికీ ట్రాక్ చేయవచ్చు. అయితే మొబైల్ స్విచాఫ్ అయిన కొన్ని గంటల తర్వాత కూడా ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ని ఉపయోగించి ట్రాక్ చేయగల సామర్థ్యానికి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ పరికరాల నుంచి డేటాను ఉపయోగించి ట్రాక్ చేయడం ద్వారా ఇది పని చేస్తుంది. మొబైల్ స్విచాఫ్ అయిన తరువాత దానిని కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఈ ఫీచర అలాంటి సమయంలో ఉపయోగపడుతుంది.బ్యాటరీ సైకిల్ కౌంట్ ఇన్ఫర్మేషన్ఈ ఫీచర్ సాదరంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోనులో ఉంటుంది. ఆ ఫీచర్ ఇప్పుడు గూగుల్ తన పిక్సెల్ 9 స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశపుట్టింది. అంటే వినియోగదారు తన స్మార్ట్‌ఫోన్‌కు ఎన్ని సార్లు ఛార్జ్ చేశారు. బ్యాటరీ ఎంత పాతది అనే విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోను 1000 ఛార్జ్ సైకిల్స్ పూర్తయితే 20 శాతం ఛార్జింగ్ కెపాసిటీ కోల్పోతుంది. అయితే గూగుల్ దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. -
క్లిక్ చేయొద్దు.. బ్లాక్ చేయండి
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడు తప్పక వాడే మొబైల్ యాప్ వాట్సాప్. ఇప్పుడు ఈ యాప్‌ను వేదికగా చేసుకుని సైబర్‌నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని ఊదరగొడుతూ వాట్సాప్‌లకు కొన్ని సందేశాలు పంపుతున్నారు. అందులోని లింక్‌పై క్లిక్ చేసి, తాము చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ఇదే తరహాలో చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తిని రూ.5.4 కోట్లు మోసగించిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఇటీవలే అరెస్టు చేశారు. అయితే, పెట్టుబడుల పేరిట వాట్సాప్‌లో వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు. షేర్‌మార్కెట్ పెట్టుబడులతోపాటు ఇతర యాప్‌లకు సంబంధించి వచ్చే లింక్‌లపైనా క్లిక్ చేయవద్దని చెబుతున్నారు.అనుమానాస్పద మెసేజ్‌లు వాట్సాప్‌కు వస్తే వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేయాలని తెలిపారు. సైబర్‌నేరగాళ్ల నుంచి తరచూ ఈ తరహా మెసేజ్‌లు వస్తుంటే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టికి ఆ నంబర్లు తీసుకురావాలని వారు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ నంబర్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, సైబర్ నేరగాళ్ల చేతిలో మరికొందరు మోసపోకుండా కాపాడవచ్చని వారు వెల్లడించారు. -
గూగుల్‌పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్‌పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్‌పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్‌కి పోతుంది.గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్‌ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్‌తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్‌ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్‌తోపాటు బింజ్‌తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
విషప్రచారపు కోరల్లో...
చేతిలోని కత్తిని మంచికి వాడవచ్చు, చేయాలనుకుంటే చెడు కూడా చేయవచ్చు. మరి, ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్నీ, అందులోని సోషల్ మీడియా వేదికల్నీ ఇప్పుడు మనం దేనికి వాడుతున్నట్టు? దాని దుర్వినియోగం, విషప్రచారం తాలూకు విపరిణామాల ఫలితం యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రత్యక్షంగా అనుభవిస్తోంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ, విభిన్న వర్గాల మధ్య అనుమానాలు సహా ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ సోషల్ మీడియా సాక్షిగా తీవ్రతర మితవాద బృందాల అసత్య ప్రచారం వల్ల అల్లర్లు, దహనాలతో అట్టుడుకుతోంది. మనసును కదిలించే ముగ్గురు పసిపిల్లల పాశవిక హత్య కారణంగా వారం క్రితం మొదలైన ఈ హింసాత్మక నిరసనల్ని అదుపు చేయడానికి పాలనా యంత్రాంగం కిందా మీదా అవుతోంది. చివరకు యూకేలో ‘అంతర్యుద్ధం అనివార్యం’ అంటూ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దుందు డుకు వ్యాఖ్యలు చేస్తుంటే, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ ఖండించాల్సిన పరిస్థితి. ఇటీవలే పగ్గాలు పట్టిన లేబర్ పార్టీ ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాలుగా మారాయి. ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని సౌత్‌పోర్ట్‌లో జూలై 29న ఓ డ్యాన్స్ క్లాస్‌లో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసి చంపిన దారుణ సంఘటన చివరకు దేశమంతటా కార్చిచ్చుకు దారి తీయడం నమ్మశక్యం కాని నిజం. దాడి చేసిన వ్యక్తి వలసదారు, మైనారిటీ మతస్థుడు, గత ఏడాదే ఒక చిన్న పడవలో బ్రిటన్‌లో ప్రవేశించాడు అంటూ అంతర్జాలంలో అసత్యాలు ప్రచారమయ్యాయి. అదే అదనుగా వలసదారులకూ, ముస్లిమ్‌లకూ వ్యతిరేకంగా నిరస నలు చేయాలంటూ తీవ్రతర మితవాద బృందాలు సామాజిక మాధ్యమ వేదికలైన ‘ఎక్స్’ వగైరాల్లో పిలుపునిచ్చాయి. నిజానికి, పిల్లలపై కత్తి దాడికి పాల్పడింది ముస్లిమ్ వలసదారు కాదనీ, రువాండాకు చెందిన తల్లితండ్రులకు జన్మించిన ఓ 17 ఏళ్ళ క్రైస్తవ టీనేజర్ అనీ అధికారులు గుర్తించారు. ఆ పసిపాపల్ని చంపడమే కాక, గతంలోనూ కనీసం పదిసార్లు ఆ కుర్రాడు హత్యాయత్నాలకు పాల్పడి నట్టు పోలీసులు గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. అయితే, నిజం ఇంటి గడప దాటే లోపల అబద్ధం ఊరంతా షికారు చేసింది. హంతకుడి గురించి పుకార్లు, విద్వేష నిరసనల పిలుపులు విస్తృతంగా విషాన్ని విరజిమ్మాయి. సోషల్‌మీడియా లోని వివాదాస్పద ఇన్ఫ్లుయెన్సర్ల తప్పుడు కథనాలతో మసీదులు, శరణార్థులకు నీడనిచ్చిన హోటళ్ళే లక్ష్యంగా దాడులు సాగాయి. చివరకు గడచిన దశాబ్ద కాలం పైచిలుకుగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఎన్నడెరుగని స్థాయిలో అల్లర్లు, దహనకాండ, లూటీలకు ఆజ్యం పోశాయి. జూలై 30 నుంచి దేశవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికి కనీసం 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. చివరకు లండన్‌లోని భారత హైకమిషన్ సైతం బ్రిటన్‌కు వచ్చే భారత జాతీయులు జాగ్రత్తగా ఉండాలని మంగళవారం సూచనలు జారీ చేయాల్సి వచ్చింది. నైజీరియా, మలేసియా, ఇండొనేషియా సహా పలు దేశాలు అదే పని చేశాయి. ప్రపంచమంతటా సత్వర సమాచార, వ్యాఖ్యా ప్రసారానికి ఉపయోగపడాల్సిన వాట్సప్ మొదలు ‘ఎక్స్’ దాకా సోషల్ మీడియా వేదికలన్నీ తుంటరుల చేతిలో అదుపు లేని ఆయుధాలుగా మారడం విషాదం. వాటిలోని విద్వేషపూరిత అసత్యాలు, రెచ్చేగొట్టే మాటలకు ఎవరు, ఎక్కడ, ఎలా అడ్డుకట్ట వేయగలరో అర్థం కాని పరిస్థితి. బ్రిటన్‌లో సాంకేతిక శాఖ మంత్రి సైతం గూగుల్, ఎక్స్, టిక్‌టాక్, మెటా సంస్థల ప్రతినిధులతో సమావేశమై, అసత్య సమాచారం వ్యాపించకుండా ఆపడంలో ఆ సంస్థల బాధ్యతను మరోసారి నొక్కిచెప్పాల్సి వచ్చింది. అసలు అలాంటి అంశాలను తొలగించే బాధ్యత, భారం ఆ యా సోషల్ మీడియా సంస్థలదేనని బ్రిటన్ సర్కార్ కొంత కాలంగా ఒత్తిడి పెట్టాలని చూస్తోంది. తాజా ఘర్షణలతో ప్రభుత్వం ఆగి, తన వంతుగా తానూ బాధ్యత తీసుకోక తప్పదు. నిజానికి, ‘బ్రెగ్జిట్’ తర్వాత నుంచి బ్రిటీషు సమాజం నిలువునా చీలిపోయింది. ఈ చీలిక లకు మునుపటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలు హ్రస్వ దృష్టితో అనుసరించిన విధానాలు తోడయ్యే సరికి పెను ప్రభావం పడింది. అన్నీ కలసి తాజా దాడులుగా విస్ఫోటించాయి.ఈ హింసను అదుపు చేసి, శాంతిభద్రతల్ని పునరుద్ధరించడం స్టార్మర్ సర్కారుకు సవాలే. కానీ, తీవ్రతర మితవాదులు రేపుతున్న విద్వేషం, విదేశీయుల పట్ల వైముఖ్యానికి కళ్ళెం వేయడం అసలు సిసలు ఛాలెంజ్. మొత్తం వచ్చిన ఓట్ల రీత్యా బ్రిటన్ తాజా ఎన్నికల్లో తీవ్రతర మితవాద రాజకీయ పార్టీ ‘రిఫార్మ్ యూకే’ మూడోస్థానంలో నిలిచింది. అంటే, దేశంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల మధ్య దానికి ఆ మేరకు మద్దతుందన్న మాట. అదే సమయంలో పాలనలో మార్పు కోరిన జనం బ్రిటన్ పునర్నిర్మాణ వాగ్దానం చూసి స్టార్మర్‌కు ఓటేశారు. పాత పాలన సమస్యలకు తోడు ప్రస్తుత పరిస్థితుల్లో వలసలు, మితవాద జనాకర్షక విధానాల లాంటి సంక్లిష్ట అంశాలపై ఆయన ఆచితూచి అడుగేయక తప్పదు. చరిత్రలో వలసరాజ్య పాలనకు పేరొందిన బ్రిటన్‌లో ఇప్పుడు వలసదారులపై రచ్చ రేగడమే వైచిత్రి. పొట్ట చేతబట్టుకొని శరణు కోరి వచ్చినవారినే అన్నిటికీ కారణమని నిందించడం, అకారణ శత్రుత్వం వహించడం బ్రిటన్‌కు శోభనివ్వదు. అసత్య కథనాల పట్ల జనచైతన్యంతో పాటు జనజీవన స్రవంతిలో వలసజీవులు కలిసిపోయే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ముఖ్యం. వాటివల్లే అపోహలు, ప్రతికూలభావాలు పోతాయి. విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసు కుంటూనే సరైన నాయకత్వం, సహానుభూతితో వ్యవహరించాలి. మతవైరాలకు తావివ్వక న్యాయం, సమానత్వానికి నిలబడడమే ఇప్పుడు బ్రిటన్ మరింత పటిష్ఠంగా ముందుకు నడవడానికి మార్గం. -
‘80 కోట్ల భారతీయుల జీవితాలను మార్చిన స్మార్ట్‌ఫోన్’
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ 'డెన్నిస్ ఫ్రాన్సిస్' భారతదేశం దాని డిజిటల్ విప్లవాన్ని ప్రశంసించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు విస్తరిస్తున్నాయి. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే కేవలం స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడగలిగారని ఆయన అన్నారు.గతంలో మాదిరిగా కాకుండా నేడు గ్రామీణ ప్రజలు కూడా బ్యాంకింగ్ సేవల కోసం, వావాదేవీల కోసం స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. దేశంలో డిజిటలైజేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఫ్రాన్సిస్ ఇండియాను ప్రశంసించారు. ఈ ప్రయోజనాలను పొందటానికి ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డెన్నిస్ ఫ్రాన్సిస్.. ఇండియాను ప్రశంసించారు. భారతదేశం మాదిరిగానే ఇతర గ్లోబల్ సౌత్ దేశాలు కూడా డిజిటలైజేషన్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనీ ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో భారత్ మొత్తం డిజిటలైజేషన్‌గా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం డిజిటలైజేషన్ మీద ఎక్కువ ద్రుష్టి సారించింది. 2016లో రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. జన్ ధన్ వంటి వాటికోసం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో లక్షలాది మంది గ్రామీణ ప్రజలు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. ఆ తరువాత చాలామంది ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి ఆసక్తి చూపారు. ఈ విధంగా డిజిటలైజేష పురోగతి చెందింది. -
‘పవర్ఫుల్’ ఫోన్.. రూ.13 వేలకే..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో (Oppo) మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. భారతీయ కస్టమర్ల కోసం ఒప్పో కే12ఎక్స్ 5జీ (Oppo K12x 5G) ఫోన్‌ను విడుదల చేసింది. 5100mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన ఈ శక్తివంతమైన ఫోన్‌ను రూ.13 వేలకే అందించనుంది.ఈ ఫోన్‌ను అల్ట్రా స్లిమ్ గ్లీమింగ్ డిజైన్‌తో, 360 డిగ్రీల ఆర్మర్ ప్రూఫ్ బాడీతో తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి.., ధర ఎంత.., ఫస్ట్ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది.., ఎక్కడ కొనుగోలు చేయాలి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..స్పెసిఫికేషన్లు» మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్» 1604 × 720 పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల HD+ డిస్ప్లే» 6GB ర్యామ్+ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్లు» 5100mAh బ్యాటరీ, 45W SUPERVOOC ఛార్జింగ్ ఫీచర్» 32MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, 8MP ఫ్రంట్ కెమెరాధరఇక ధర విషయానికి వస్తే ఈ సరికొత్త ఒప్పో ఫోన్ రూ.13 వేల కంటే తక్కువకే వస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ.12,999 కాగా 8GB + 256GB వేరియంట్ ధర రూ.15,999. అయితే ఇక్కడ డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంక్ ఆఫర్లతో రూ. 1000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపును హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌తో పొందవచ్చు. ఫోన్ మొదటి విక్రయం ఆగస్టు 2, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. -
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ స్క్రీనింగ్ టైమ్
స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
ఐదోవంతు సమయం స్మార్ట్‌ఫోన్‌కే సరి
సాక్షి, అమరావతి : స్మార్ట్‌ఫోన్‌తో గడిపే (స్క్రీనింగ్) సమయం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచంలో వ్యక్తుల రోజు వారీ ఫోన్ సగటు వీక్షణ సమయం 3.50 గంటల నుంచి 4.37 గంటలకు పెరిగింది. భారత్‌లో 4.30 గంటలుగా నమోదైంది. అంటే ఒక వ్యక్తి ఏడాది పొడవునా దాదాపు 70 రోజులు ఫోన్లలోనే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు రోజుకు 58 సార్లు ఫోన్లను ప్రతిసారీ తనిఖీ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఫిలిప్పీన్స్ వాసులు అత్యధికంగా సమయం ఫోన్లతో గడుపుతుంటే.. జపాన్ పౌరులు మాత్రం గ్లోబల్ సగటు కంటే తక్కువగా ఫోన్లపై గడుపుతున్నారు. 12–27 ఏళ్లలోపు వయస్కులే స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నట్టు అంతర్జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు వారాంతాల్లో ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఎక్కువ సేపు ఫోన్ చూసేవారు. తాజా పరిణామాలతో సాధారణ రోజుల్లోనే స్మార్ట్ఫోన్ల స్క్రీనింగ్ సమయం పెరిగిపోయింది. ఇక్కడ ప్రతి నిముషానికి ఒకసారి ఫోన్ చూసుకోవడం అలవాటుగా మారిపోయింది. ఫిలిప్పీన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్, ఘనా దేశాల్లో రోజు వారీ స్క్రీనింగ్ సమయం 5 గంటలు దాటిపోతోంది. నాలుగు దక్షిణ అమెరికా, 4 సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు టాప్–10 అత్యధిక స్క్రీనింగ్ జాబితాలో నిలిచాయి. అగ్రరాజ్యంగా పిలిచే అమెరికాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌లో గడుపుతున్నారని.. వీరిలో దాదాపు 40 శాతం మంది అధిక స్క్రీనింగ్ అలవాటును తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ సమయం ఫోన్లో గడుపుతున్నట్టు తెలుస్తోంది. వారి రోజువారీ సగటు స్క్రీనింగ్ సమయం 2.47 గంటలుగా ఉంటే.. పురుషులకు 2.34 గంటలుగా గుర్తించారు. ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ వినియోగంలో ఎక్కువ సమయం ఇంటర్నెట్కు కేటాయిస్తున్నారు. -
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్‌తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్‌తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్‌తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్‌తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
హైదరాబాద్‌లో చోరీ.. సూడాన్‌కు స్లగ్మింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవల సెల్‌ఫోన్ చోరీలు పెరిగిపోతున్నాయి. ఈ విషయంలో తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు చోరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–సూడాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ నేర బంధం వెలుగులోకి వచి్చంది. ఇక్కడ చోరీకి గురైన స్మార్ట్ఫోన్లను థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి సూడాన్‌కు స్మగ్లింగ్ చేస్తున్న వ్యవస్థీకృత ముఠా వ్యవహారాలు బయట పడుతున్నాయి. గత నెల ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా««దీనం చేసుకున్న టాస్‌్కఫోర్స్ పోలీసులు.. తాజాగా మరో 31 మందిని పట్టుకుని వీరి నుంచి రూ.2 కోట్ల విలువైన 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ ముఠాల వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మి పెరుమాళ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. చోరీ చేసి.. వ్యాపారులకు విక్రయం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. విలాసాలకు అవసరమైన డబ్బును తేలిగ్గా సంపాదించడానికి సెల్ఫోన్ల చోరీలు చేయాలని పథకం వేశారు. రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసుకుని ప్రజల సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వాటిని జగదీశ్ మార్కెట్ సహా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలో కొందరు వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఆపై వాటిని ఏం చేస్తున్నారు? ఇలా చోరీ చేసిన ఫోన్లలో దాదాపు అన్నీ లాక్ చేసే ఉంటాయి. వీటిని అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు సెల్‌ఫోన్ టెక్నీíÙయన్లు పని చేస్తున్నారు. వీళ్లు చోరీ ఫోన్ల లాక్‌లు తీయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపర్ చేస్తుంటారు. అంటే.. తక్కువ ఖరీదు ఉండే బేసిక్ ఫోన్లకు చెందిన ఐఎంఈఐ నంబర్లను ఖరీదైన ఫోన్లలో వేసి పోలీసుల సాంకేతిక ని«ఘాకు చిక్కకుండా చేస్తారు. ఆపై ఆ ఫోన్లను వ్యాపారులు సూడానీయులకు అమ్మేస్తున్నారు. ఆ దేశంలోని వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉండే వీళ్లు.. సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో థర్మకోల్ బాక్సుల్లో పార్సిల్ చేసి, తప్పుడు పత్రాలతో సముద్ర మార్గంలో అక్కడకు పంపేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారు? హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆటోడ్రైవర్లు.. సయ్యద్ ఘయాజ్ హషి్మ, మహ్మద్ దస్తగిర్, సయ్యద్ సాజిద్, సయ్యద్ షరీఫ్, సయ్యద్ సలావుద్దీన్, టైల్స్ వర్కర్లు మహ్మద్ హమీద్, షేక్ మునావర్, వెల్డింగ్ వర్కర్లు షేక్ అన్సార్, మహ్మద్ ఖాన్, డెకరేషన్ వర్కర్ మహ్మద్ అంజాద్, వంట పని చేసే మహ్మద్ ఖాలిద్, పెయింటర్ మహ్మద్ మహమూద్ అలీ, చిరుద్యోగి సోహైల్ ఖాన్, కూరగాయల వ్యాపారి మహ్మద్ ముస్తాక్ ఫోన్లు చోరీ చేస్తారు. మొబైల్ వ్యాపారులైన షేక్ షాజవాజ్ ఖాన్, మహ్మద్ ఆసిఫ్ అహ్మద్, మహ్మద్ గౌస్, మహ్మద్ అర్షద్ మొయినుద్దీన్, మహ్మద్ నవీదుద్దీన్ సల్మాన్, మహ్మద్ నజీరుద్దీన్, మహావీర్ జైన్, మహ్మద్ అబ్దుల్ సిరాజ్, మజీద్ ఖాన్, అబ్దుల్ హజీమ్, షేక్ జావేద్ అలీ ఈ చోరీ ఫోన్లు కొంటారు. వీటిని సయ్యద్ రహీమ్, మహ్మద్ అర్బాజ్ ఖాన్, నజీముద్దీన్, సాదిక్ అహ్మద్ అన్‌లాక్ చేస్తుండగా.. ఇవన్నీ తక్కువ ధరకు కొనే సూడానీ మూసా హసన్ తమ దేశానికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. నానల్‌నగర్‌లో ఉండే మూసా మొబైల్ విడిభాగాల వ్యాపారం చేస్తున్నాడు. స్మగ్లింగ్ వ్యవహారంలో మూసానే కీలకంగా వ్యవహరిస్తున్నాడు. -
అదిరిపోయే ఫీచర్లతో.. నయా స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు షావోమీ రెడీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలిసారిగా సినిమాటిక్ విజన్ (సివి) ‘CI’ (of Cinematic) and ‘VI’ (of Vision) సిరీస్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. కానీ ఫోన్ గురించి ఎలాంటి వివరాల్ని వెల్లడించ లేదు. ఈ తరహా సివి ఫోన్ల గురించి గతంలో పుకార్లు వచ్చాయి. షావోమీ సివి 4 ప్రోని..షావోమీ 14 సివిగా భారత్ మార్కెట్‌కు పరిచయం చేయనుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న షావోమీ 14 సిరీస్‌కి అప్డేటెడ్ వెర్షన్ రానుంది. ఈ సిరీస్‌లో రెండు ఫోన్లు షావోమీ 14, షావోమీ 14 ఆల్ట్రా ఉన్నాయి. సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ #CinematicVision - Coming Soon! pic.twitter.com/Exnu9If9Da— Xiaomi India (@XiaomiIndia) May 21, 2024 సివి 4ప్రోకి రీబ్రాండ్ షోవోమీ 14 సివీ అనే ఊహాగానాలు నిజమైతే స్మార్ట్‌ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.55 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ (Hertz) రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్ప్లే. 2160హెచ్‌జెడ్ పీడబ్ల్యూ ఎం డిమ్మింగ్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో రానుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్అంతేకాదు ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్ సెట్ ఉండగా 12జీబీ ఎల్ పీపీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఇక ఫోన్ వెనుక కెమెరాలో 12-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ ఓవీ13బీ10 అల్ట్రా వైడ్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ 2ఎక్స్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 4,700ఎంఏహెచ్ బ్యాటరీ4,700ఎంఏహెచ్ బ్యాటరీ, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుండగా.. ఆఫోన్ షావోమీ ఐపర్ ఓఎస్‌లో రన్ అవుతుందని తెలుస్తోంది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్, హై రెసెల్యూషన్ ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటితో పాటు ఇతర ఫీచర్లు ఉన్నాయని సమాచారం. -
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్.. టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీని భారత్‌లో విడుదల చేసింది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్ 30 ప్రో 5జీ, క్యామన్ 30 ప్రీమియర్ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్ 30 5జీ 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉందిక్యామన్ 30 ప్రీమియర్ 5జీ 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్ 30 5జీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్ జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 7020 చిప్సెట్, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. -
భారత్‌లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్‌లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
నథింగ్ ఫోన్ 2ఏ వచ్చేసింది.. ధర ఎంతంటే?
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్‌కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు భారీగా జరిగాయి. నథింగ్ ఫోన్1 ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని వస్తే.. తాజాగా ఈ బ్రాండ్ నుంచి మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్లాక్, వైట్ వేరియంట్లో నథింగ్ ఫోన్ 2ఏ మార్చి 5న ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో ఆసక్తికరమైన టేకింగ్‌కు పేరుగాంచిన నథింగ్ గతంలో ఒరిజినల్ నథింగ్ ఫోన్ (2022), నథింగ్ ఫోన్ 2 (2023)లను ప్రారంభించింది. రూ.23,999 నుండి ప్రారంభమయ్యే ఈ ఫోన్లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, వెనుకవైపు డ్యూయల్ 50 ఎంపీ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. -
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024: వీటికే అవార్డ్స్..
ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' (MWC 2024)లో అనేక కొత్త ఉత్పత్తులు కనిపించాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్ వంటివి ఉన్నాయి. ఎండబ్ల్యుసీ 2024 వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి. ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్న ఉత్పత్తులు షియోమీ 14 అల్ట్రా లెనోవా ట్రాన్స్పరెంట్ ల్యాప్‌టాప్ హానర్ మ్యాజిక్ 6 ప్రో శామ్సంగ్ గెలాక్సీ రింగ్ ZTE నుబియా ప్యాడ్ 3D 2 హానర్ మ్యాజిక్‌బుక్ ప్రో 16 టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్ పాయింట్ ఎంసీ02 నథింగ్ ఫోన్ 2ఏ ఒప్పో ఎయిర్ గ్లాస్ 3 వన్‌ప్లస్ వాచ్ 2 మోటోరోలా స్మార్ట్ కనెక్ట్ నుబియా ఫ్లిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్80 / ఫాస్ట్ కనెక్ట్ 7900 హానర్ ఐ-ట్రాకింగ్ టెక్ -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్‌లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్‌లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్!
భారత్ లో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు భారీ షాక్ తగిలింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ఇంటర్‌డిజిటల్‌కు పెండింగ్‌లో ఉన్న మొత్తం రాయల్టీలను మూడు నెలల్లో చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో సదరు చైనా సంస్థల ఫోన్ అమ్మకుండా కోర్టును ఆశ్రయించొచ్చుని తెలిపింది. ఫిబ్రవరి 21న జారీ చేసిన ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వుల్లో.. ఒప్పో ఇంటర్‌డిజిటల్‌కు సంబంధిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే కోర్టు ఆదేశాల్ని భేఖాతరు చేసినందుకు భారత్‌లో ఒప్పోతో పాటు ఇతర చైనా ఫోన్ లు అమ్మకాలు జరగకుండా ఇంటర్ డిజిటల్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కోసం నమోదు చేసుకునేందుకు అర్హత ఉందని సూచించింది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇంటర్ డిజిటల్ సంస్థకు ఎంత మొత్తంలో చెల్లించాల్సి ఉందనే అంశంపై స్పష్టతలేదు. అయితే ఆమొత్తాన్ని, అందుకు అయ్యే వడ్డీని బ్యాంక్ అకౌంట్ లలో జమచేయాలని, ఈ కేసు విచారణను 2024 చివరి నాటికి పూర్తి చేయాలని కూడా స్పష్టం చేసింది. కేసు దేనికి సంబంధించింది? తమ హ్యాండ్సెట్లలో సెల్యులార్ టెక్నాలజీ (3జీ, 4జీ,5జీ), వీడియో కోడింగ్ టెక్నాలజీ వినియోగంపై ఒప్పో,రియల్ మీ, వన్ ప్లస్ బ్రాండ్లకు వ్యతిరేకంగా ఇంటర్ డిజిటల్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఇంటర్డిజిటల్ తన సాంకేతికతను ఉపయోగించడం కోసం న్యాయమైన, సహేతుకమైన, వివక్షత లేని (FRAND)నిబంధనలపై లైసెన్స్ ఒప్పందం కోసం ఒప్పో గ్రూప్‌తో కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలం కావడంతో డిసెంబర్ 2021లో యూకే, జర్మనీ, భారత్ తో పాటు ఇతర దేశాల్లో స్మార్ట్ ఫోన్ కంపెనీలకు వ్యతిరేకంగా వాజ్యం దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు తాజాగా తన తీర్పును వెలువరించింది. ఒప్పో వర్సెస్ నోకియా జూలై 2023లో ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ మొబైల్ ఫోన్ తయారీదారు ఒప్పో తన ఫోన్లలో నోకియా సాంకేతికతను అవసరమైన అనుమతి లేకుండా ఉపయోగించినందుకు, నాలుగు వారాల్లోగా దాని భారతదేశ విక్రయాలలో 23 శాతం డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సైతం సమర్ధించింది. కోర్టు తీర్పుతో దిగివచ్చిన ఒప్పో.. నోకియాకు చెల్లించింది. ఆపై సాంకేతిక వినియోగం విషయంలో ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది. షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్‌తో పాటు స్టీరియో స్పీకర్లతో కూడిన డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. హ్యాండ్సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్‌ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ టర్బో ఛార్జ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్‌ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది. షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్‌లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్‌లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. -
స్మార్ట్‌ఫోన్ కోసం న్యూక్లియర్ బ్యాటరీ.. ఛార్జింగ్ లేకుండా 50 ఏళ్లు పని చేస్తోంది!
సాధారణంగా బ్యాటరీలు ఎక్కువకాలం మన్నవు. ఇటీవలికాలంలో బాగా వాడుకలోకి వచ్చిన లీథియం అయాన్ బ్యాటరీల మన్నిక సైతం రెండు మూడేళ్లకు మించి ఉండదు. పైగా వాటిని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. లీథియం అయాన్ బ్యాటరీలను మూడువందల నుంచి ఐదువందల సార్లు రీచార్జ్ చేసుకుంటే, అక్కడితో వాటి ఆయుష్షు తీరిపోతుంది. బ్యాటరీల మన్నికను గణనీయంగా పెంచే దిశగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు సాగించి, మొత్తానికి విజయం సాధించారు. ఏకంగా 50 ఏళ్లు మన్నికను ఇవ్వగల న్యూక్లియర్ బ్యాటరీని రూపొందించారు. ఫొటోలో కనిపిస్తున్న ఈ బ్యాటరీని చైనా కంపెనీ ‘బీటావోల్ట్’ శాస్త్రవేత్తలు తయారు చేశారు. రక్షణ అవసరాల కోసం దీర్ఘకాలిక మన్నిక గల బ్యాటరీల రూపకల్పన కోసం ‘బీటావోల్ట్’ చేపట్టిన ప్రయోగాలకు రెండేళ్ల కిందట ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఫోస్ ఎనర్జీ’ 2.3 మిలియన్ డాలర్ల (రూ.19.15 కోట్లు) ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం నమూనాగా ఈ బ్యాటరీని రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో స్మార్ట్ఫోన్లు, లాప్టాప్ల కోసం కూడా ఉపయోగపడే దీర్ఘకాలిక న్యూక్లియర్ బ్యాటరీలను తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఐఫోన్ల కోసం ఓ కీబోర్డ్.. అదెలా పనిచేస్తుందంటే?
స్మార్ట్‌ఫోన్‌లోని టచ్‌స్క్రీన్ కీబోర్డు మీద టైప్‌చేయడం చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. స్మార్ట్ఫోన్లకు భౌతికంగా కీబోర్డు లేకపోవడం లోపమే! ఈ లోపాన్ని భర్తీ చేయడానికే స్మార్ట్‌ఫోన్‌కు పనికొచ్చే భౌతికమైన కీబోర్డును అమెరికన్ కంపెనీ క్లిక్స్ టెక్నాలజీ రూపొందించింది. తొలిప్రయత్నంగా ఐఫోన్–15 మోడల్‌కు ఉపయోగపడే కీబోర్డును ‘క్లిక్స్’ పేరుతో నమూనాగా రూపొందించింది. సాధారణ టైప్‌రైటర్, డెస్క్‌టాప్, లాప్టాప్ కంప్యూటర్ల కీబోర్డు తరహాలోనే ఉన్న ఈ కీబోర్డు ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో సులువుగా టైప్ చేయడానికి వీలవుతుంది. ఈ ఏడాది లాస్ వేగస్‌లో జరగనున్న సీఈఎస్–2024 షోలో ఈ కీబోర్డును క్లిక్స్ టెక్నాలజీ సంస్థ ప్రదర్శించనుంది. -
మొబైల్ ప్రారంభోత్సవంలో బిగ్‌బాస్ ఫేమ్ హిమజా’ సందడి (ఫొటోలు)
-
అదిరిపోయే డిజైన్లతో విడుదల కానున్న ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో రెనో 11 సిరీస్‌ను త్వరలో విడుదల చేయనుంది. జనవరి 11 న ఒప్పో రెనో 11 , ఒప్పో రెనో 11 ప్రోలను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఇప్పటికే ఒప్పో రెనో 11 సిరీస్ ఫోన్ ఫీచర్లను ఒప్పో రెనో 11 ప్రో స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ తో, అలాగే ఒప్పో రెనో 11 మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ తో అందుబాటులోకి రానుంది. 5జీ సపోర్ట్‌తో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,6.74 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ వస్తుంది. ఫోన్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్, ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. -
వివో ఇండియాకు భారీ షాక్!
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివోకు భారీ షాక్ తగిలింది. వివో అనుబంధ వివో ఇండియా కు చెందిన మరో ముగ్గురు అధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతేడాది వివో ఇండియా వ్యాపారా లావాదేవీలపై ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల ద్వారా రూ.62,476 కోట్ల మేరకు చైనాకు వివో ఇండియా అక్రమంగా తరలించిందని ఈడీ అభియోగం మోపింది. అదే ఏడాది జూలైలో వివో ఇండియా కార్యాలయాలు, సంబంధిత ఎగ్జిక్యూటివ్‌ల నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వివో ఇండియాతోపాటు మరికొన్ని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలపై మనీ లాండరింగ్ కేసులు దర్యాప్తు చేసిన ఈడీ.. ఇటీవలే పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఇంతకుముందు హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి హోం రాయ్, చైనీయుడు గౌంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్ అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరు నలుగురు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. -
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం హై అలర్ట్!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్ని కేంద్రం హై- అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) శాంసంగ్ గెలాక్సీ ఫోన్లతో పాటు పాత ఫోన్లలో అనేక లోపాలు ఉన్నాయని గుర్తించింది. ఫలితంగా సైబర్ నేరస్తులు లక్షల మంది శాంసంగ్ ఫోన్లలోని వ్యక్తిగత డేటాను తస్కరించే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. శాంసంగ్ ఫోన్ యూజర్లు ఏం చేయాలంటే శాంసంగ్ ఫోన్లలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సైబర్ నేరస్తులు యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించి ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి యూజర్లు శాంసంగ్ సంగ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 11,12,13,14లోని ఆపరేటింగ్ సిస్టంను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. శాంసంగ్ ఫోన్లపై దాడి.. ఆపై ఏం చేస్తారంటే? ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో విడులైన ఆ కంపెనీకి చెందిన ఫ్లాగ్ షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సైతం హ్యాకర్లు డేటాను తస్కరించే ఫోన్ల జాబితాలో ఉంది. ఫోన్ వినియోగదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న సైబర్ నేరస్తులు ఫోన్లలోని డివైజ్ పిన్ను, ఎమోజీ సాండ్‌బాక్స్ డేటాను అటాకర్లు చదవగలరు. సిస్టమ్ టైమ్‌ను మార్చి నాక్స్ గార్డ్ లాక్‌ను బైపాస్ చేయగలరు. అర్బిట్రరీ ఫైల్స్, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్ ఇన్ పేర్కొంది. మిగిలిన ఫోన్ యూజర్లు సైతం అదే సమయంలో మిగిలిన స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు శాంసంగ్ ఫోన్ల నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అనుమానాస్పద లింకుల జోలికి పోవద్దని హెచ్చరించింది. -
త్వరలో.. భారత్‌లో రియల్మీ 12 సిరీస్ విడుదల, ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ భారత్‌లో మిడ్ రేంజ్ రియల్ మి 12 సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ సంస్థ ఫ్లాగ్షిప్ ఫోన్ జీటీ 5 ప్రో సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఇతర స్మార్ట్‌ఫోన్‌లైన వన్‌ప్లస్ 12 తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ తరుణంలో భారత్‌లో సైతం ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు ధీటుగా రియల్మీ కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్లను మార్కెట్‌కి పరిచయం చేయాలని భావిస్తుందంటూ ప్రముఖ టెక్ బ్లాగ్ గిజ్మోచైనా నివేదికలో పేర్కొంది. ఇందులో భాగంగా రియల్మీ ప్రో, రియల్మీ ప్రో ప్లస్ ఫోన్లను లాంచ్ చేయనుందని సమాచారం. రియల్మీ 12ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే? రియల్మీ 12 ప్రో క్వాల్కమ్ 7 4ఎన్ఎం ప్రాసెస్ జనరేషన్ 3 చిప్సెట్తో రానుంది. దీంతో పాటు 2ఎక్స్ ఆప్టికల్స్ జూమ్ చేసేలా 32 ఎంపీ ఐఎంఎక్స్ 709 టెలిఫోటోలెన్స్ సైతం ఈ ఫోన్లో ఉన్నాయి. అదే విధంగా రియల్మీ 12ప్రో ప్లస్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64 ఎంపీ ఓమ్నీవిజన్ ఓవీ64బీ లెన్స్ సపోర్ట్‌ను అందిస్తుంది. రియల్మీ 12 సిరీస్ ధరలు రియల్మీ 12ప్రో 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో రూ.25,000గా ఉంది. మొదట వచ్చే ఏడాది మార్చి లోపు ఈ ఫోన్ విడుదల చేసి.. ఆ తర్వాత గ్లోబుల్ మార్కెట్ యూజర్లకు పరిచయం చేస్తుంది. ఈ గ్లోబుల్ మార్కెట్లో భారత్ సైతం ఉంది. ఇక రియల్మీ 12 సిరీస్‌కి పోటీగా రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ఫోన్లను న్యూయర్‌కి విడుదల చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్‌కార్ట్‌లో 80 శాతం భారీ డిస్కౌంట్‌కే.. -
సంగీతం నేర్పే ‘స్మార్ట్ ఉకులెలె’.. ఎలా పనిచేస్తుందంటే?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు నేర్చుకోవడం సులువు అవుతోంది. తెలియని అంశాలను నేర్చుకోవడానికి చాలామంది క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కొంత సమయం పట్టినా చివరకు సాధిస్తున్నారు. గతంలో సంగీతం నేర్చుకోవాలంటే ప్రత్యేక తరగతులకు వెళ్లాల్సివచ్చేది. అందుకు కొంత డబ్బు, సమయం ఖర్చయ్యేది. అయితే ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి సంగీతాన్ని నేర్పే యాప్స్, ఇన్స్ట్రుమెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా జియోమీ సంస్థ అలాంటి ఓ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. గిటార్‌లా కనిపించే ఈ బుల్లి వాద్యపరికరం ఉకులెలె. ఈ పోర్చుగీసు సంప్రదాయ పరికరాన్ని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్‌గా తయారు చేసిన చైనీస్ కంపెనీ జియోమీ ఇటీవల ‘పాపులెలె 2 ప్రో స్మార్ట్’ పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. సంగీతంలో కొత్తగా సరిగమలు నేర్చుకుంటున్న వారు సైతం దీనిపై తేలికగా కోరుకున్న పాటలు పలికించేలా దీన్ని తీర్చిదిద్దారు. స్మార్ట్‌ఫోన్ లేదా లాప్టాప్ ద్వారా కోరుకున్న పాటను ఎంపిక చేసుకుని, యాప్ ద్వారా దీనిని అనుసంధానం చేసుకుంటే చాలు. ఈ ఉకులెలె ఫింగర్ బోర్డులో పాటలోని సంగీతానికి తగిన స్వరస్థానాలలో ఎల్ఈడీ లైట్లు వెలుగుతాయి. ఎల్ఈడీ లైట్ల వెలుగు ఆధారంగా వేళ్లను కదుపుతూ దీనిని వాయిస్తే, ఎలాంటి పాటైనా భేషుగ్గా పలుకుతుంది. దీనిని వాయించడంలో మొదట్లో కొద్దిగా తడబడినా, సంగీతం రానివారు సైతం దీనికి పదిహేను నిమిషాల్లోనే అలవాటు పడిపోతారని, తేలికగా పాటలు వాయించగలుగుతారని జియోమీ కంపెనీ చెబుతోంది. సంప్రదాయ ఉకులెలెను కలపతో తయారు చేస్తారు. ఈ స్మార్ట్ ఉకులెలెను సింథటిక్ ఫైబర్‌తో కొద్దిపాటి డిజైన్ మార్పులతో తయారు చేశారు. దీని ధర 279 డాలర్లు (రూ.23,264) మాత్రమే! -
టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. చైనాలో యాపిల్ అమ్మకాలు తగ్గగా.. స్థానిక కంపెనీ షావోమీకి మాత్రం కొనుగోలు దారులు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది జూన్ నుంచి ప్రస్తుతం వరకు మొత్తం 20 బిలియన్ డాలర్లకు మార్కెట్ విలువ పెరిగింది. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో పాటు ఇతర రంగాల్లోని వ్యాపారాలు గణనీయమైన వృద్దిని సాధించాయి. ఫలితంగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో షావోమీ స్టాక్ విలువ 60 శాతం పెరిగినట్లు హాంగ్ సెంగ్ టెక్ ఇండెక్స్ తెలిపింది. ఇటీవల యాపిల్ క్యూ4 ఫలితాలు విడుదల చేసింది. ఆ ఫలితాల్లో కంపెనీకి రెవెన్యూ తగ్గినా.. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 15 సిరీస్ కొనుగోళ్లు భారీగా జరిగినట్లు నివేదించింది. జులై నుంచి సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి ఈ లేటెస్ట్ సిరీస్ ఫోన్ల 73.5 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ మొత్తం గత ఏడాదితో పోలిస్తే 1శాతం తగ్గింది. అయితే ఆండ్రాయిడ్ మార్కెట్లో యాపిల్ సేల్స్ తగ్గినా.. రానున్న రోజుల్లో ఆ సంస్థకు ఆశించిన స్థాయిలో మార్కెట్ ఫలితాలు ఉంటాయని అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా చైనాలో ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీ సంస్థలు సైతం అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాయి. షోవోమీ 14 సిరీస్ అమ్మకాల జోరు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ గత నెల 26న ‘షావోమీ 14’ సిరీస్‌ను విడుదల చేసింది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 లక్షల ఫోన్లు అమ్ముడు పోయాయి. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ అమ్మకాల్ని షావోమీ రెండో సారి సాధించింది. షావోమీ తర్వాతి స్థానంలో హువావే టెక్నాలజీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ మేట్ 60 ప్రొ ఉంది. కాగా, షావోమీ ఫోన్లే కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్, ఏఐ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్ అదే స్థాయిలో ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా కంపెనీల ఫోన్ల జోరు డ్రాగన్ దేశం ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతుంది. కాబట్టే అక్కడి పౌరులు ఖర్చు పెట్టే విషయంలో ఆలోచిస్తున్నారు. వారి నిర్ణయం స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లపై పడింది. ఇటీవల ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ నివేదికలో క్యూ3లో స్మార్ట్‌ఫోన్ సేల్స్ 3 శాతం పడిపోయాయి. దీనిపై అమెరికా పెట్టుబడి సంస్థలు మోర్గాన్ స్టాన్లీ, సిటీ గ్రూప్‌లు స్పందిస్తూ.. వచ్చే ఏడాది నాటికి చైనాలో స్మార్ట్‌ఫోన్ సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. చదవండి👉 ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్.. -
కేంద్రం కొత్త పాలసీ? స్మార్ట్ఫోన్లలో లైవ్ టీవీ.. వ్యతిరేకిస్తున్న కంపెనీలు
స్మార్ట్ఫోన్లలో టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలు జరిగేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని శాంసంగ్, క్వాల్కమ్, ఎరిక్సన్,నోకియాతో పాటు ఇతర టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలో లైవ్‌టీవీ బ్రాడ్ కాస్ట్ సర్వీసుల్ని అందించాలంటే ఫోన్లలోని హార్డ్వేర్లని మార్చాలని, అలా మార్చడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా స్మార్ట్ ఫోన్ల ధరలు మరో 30 డాలర్లు పెరిగే అవకాశం ఉందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయంటూ రాయిటర్స్ ఓ నివేదికను విడుదల చేసింది. అయితే, కేంద్రం టీవీ ప్రత్యక్ష ప్రసారాల కోసం సెల్యూలర్ నెట్‌వర్క్‌తో పనిలేకుండా డైరెక్ట్‌గా స్మార్ట్ ఫోన్లలో లైవ్ సిగ్నల్స్ ఉంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చలు సంబంధిత నిపుణలతో చర్చలు జరుపుతుంది. ఈ తరహా సేవలు ఉత్తర అమెరికా యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఏటీఎస్సీ 3.0 టెక్నాలజీ సాయంతో నేరుగా ప్రతీ స్మార్ట్‌ఫోన్‌లో టెలికం కంపెనీల అవసరం లేకుండానే టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలకు వీలుంది. ఇప్పుడు ఇదే పద్దతిని భారత్‌లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఏటీఎస్సీ 3.0కు అనుగుణంగా ప్రస్తుత దేశీయ మార్కెట్లోని ఏ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేవు. ఒకవేళ కేంద్రం లైవ్ టీవీ పాలసీని అమలు చేస్తే తయారీ వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సి వస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. ఇది తమకు చాలా నష్టమని మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరి కంపెనీల ఆందోళనపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. -
అర్థవంతమైన జీవితం
‘ఆసక్తి ఉంటే అనంత విశ్వాన్ని మధించవచ్చు’ అనడానికి ప్రతీక శకుంతలాదేవి. అరవై దాటిన తర్వాత యూ ట్యూబర్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అంతకంటే ముందు ఆమె తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. ఆ ప్రపంచంలో సంగీతం, సాహిత్యం, మొక్కల పెంపకం ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మీడియా వేదికగా సృజనాత్మకతను పంచుతున్నారు.భర్త బాటలో తాను కూడా మరణానంతరం దేహాన్ని డొనేట్ చేశారు. శకుంతలాదేవి అత్యంత సాధారణ గృహిణి. నలుగురు పిల్లల్ని పెంచుతూ ఆమె తన అభిరుచులను కొనసాగించారు. సాహిత్యాన్ని ఆస్వాదించకుండా ఉట్టిగా పాటలు వినడంలో ఏదో అసంతృప్తి. అందుకే హిందీ పాటల సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి హిందీ– తెలుగు డిక్షనరీలో అర్థాలు వెతుక్కున్నారు. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియాలను ఉబుసుపోని పోస్టులకు పరిమితం చేయలేదామె. సాంకేతిక పాఠాలను స్మార్ట్‌ఫోన్ తోనే నేర్చుకున్నారు. వీడియో రికార్డ్ చేయడం, ఎడిటింగ్, థంబ్‌నెయిల్ పెట్టడం, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం వరకు అవసరమైనవి అన్నీ సొంతంగా నేర్చుకున్నారు. తనకు తెలిసిన మంచి విషయాలను డిజిటల్ మీడియా వేదికగా ప్రపంచంతో పంచుకుంటున్నారు. ‘నన్ను ప్రపంచానికి తెలియచేసిన యూట్యూబ్‌కి తొలుత కృతజ్ఞతలు’ అంటూ తన వివరాలను ‘సాక్షి’తో పంచుకున్నారు స్వర్ణ శకుంతలాదేవి. ఆధ్యాత్మికం నుంచి అభ్యుదయం వరకు ... ‘‘మాది తెనాలి దగ్గర మూల్పూరు గ్రామం. నాన్న వ్యవసాయంతోపాటు గుడిలో పూజలు చేసేవారు. ఏడుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివింది నేనే. మా వారు బీఏఎమ్ఎస్ చదువుతూ ఉండడంతో ఆయన చదువు పూర్తయ్యే వరకు, నాకూ చదువుకునే అవకాశం వచ్చింది. ఫిఫ్త్‌ఫారమ్‌లో ఉండగా పెళ్లయింది. తర్వాత పుట్టింట్లోనే ఉండి ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి రిజల్ట్స్ వచ్చే నాటికి చీరాలలో అత్తగారింటిలో ఉన్నాను. అప్పట్లో ఆ చదువుకే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగం ఇచ్చేవారు. మా అత్తగారు ‘ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందిప్పుడు’ అనడంతో ఇంటికే పరిమితమయ్యాను. టీచర్ అయ్యే అవకాశం అలా చేజారింది. కానీ మా వారి నుంచి ప్రోత్సాహం మాత్రం ఎప్పుడూ ఉండేది. ఆయన ఆయుర్వేద వైద్యులుగా ఒంగోలు దగ్గర అమ్మనబ్రోలులో ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే 35 ఏళ్ల పాటు ఉన్నాం. ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత వీణ నేర్చుకున్నాను. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లలు. వాళ్లందరి ఆలనపాలన చూస్తూ నా అభిరుచులను కొనసాగించగలిగాను. ఆధ్యాత్మిక గ్రంథాల నుంచి రంగనాయకమ్మ రాసిన బలిపీఠం, కౌసల్యాదేవి– చక్రవాకం, రవీంద్రనాథుని గీతాంజలి, బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి.. ఇలా అదీ ఇదీ అనే వర్గీకరణ లేకుండా చదివేదాన్ని. యద్దనపూడి, మాదిరెడ్డి, యండమూరి, శ్రీశ్రీ రచనలను, అబ్దుల్‌కలామ్ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను ఇష్టంగా చదివాను. కొన్ని రచనలు రేడియోలో నాటికలుగా వచ్చేవి. వాటి కోసం రేడియోకి అంకితమయ్యేదాన్ని. ఇలా సాగుతున్న జీవితంలో పిల్లలు నలుగురూ సెటిల్ అయిన తర్వాత మా వారుప్రాక్టీస్ చాలించారు. 2005లో చీరాలకు వచ్చాం. పెద్దబ్బాయి కొత్తదారిలో నడిపించాడు మా పెద్దబ్బాయి నన్ను కొత్తగా ఆవిష్కరించాడు. తను మెకానికల్ ఇంజనీర్. తాను ఆసక్తి కొద్దీ జెమాలజీ కోర్సు చేశాడు. రత్నాల గురించిన కబుర్లు నాకు ఎక్కువ ఆసక్తినివ్వడంతో రత్నాలకు – రాళ్లకు మధ్య తేడాను గుర్తించడం నేర్పించాడు. ముత్యాలు, పగడాలతోపాటు రకరకాల బీడ్స్, జెమ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్ ్సతో ఆర్నమెంట్ మేకింగ్ నేర్పించాడు. జీవితాన్ని మనం ఎంత ఉత్సాహవంతంగా, రాగరంజితంగా మార్చుకున్నప్పటికీ ఏదో ఒక వెలితిని సృష్టించి ప్రశ్నార్థకంగా మన ముందు పెడుతుంది. నా అభిరుచులు మాత్రమే నాతో మిగిలాయి, వాటినిప్రోత్సహించిన మావారు మాకు దూరమయ్యారు. ఆయన కోరిక మేరకు దేహాన్ని వైద్యవిద్యార్థుల అధ్యయనం కోసం ఒంగోలులో మెడికల్ కాలేజ్‌కి ప్రదానం చేశాం. ఆయన బాటలో నేను కూడా మరణానంతరం నా దేహాన్ని డొనేట్ చేస్తూ సంతకం చేశాను. మనం జీవిస్తూ మరొకరికి ఉపయోగం కలిగించడమే జీవితానికి అసలైన అర్థం అని నమ్ముతాను. ఆయన జ్ఞాపకాలతో రోజులు సాగుతున్న సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. యూ ట్యూబ్ ఆత్మీయులనిచ్చింది కోవిడ్ సమయంలో అగాధంలాంటి విరామం. ఆ విరామం ఎంత కాలమో కూడా తెలియదు. యూ ట్యూబ్ చానెల్స్ చూస్తూ, మా వారు సుబ్రహ్యణ్య కుమార్ రాసిన వైద్య గ్రంథాన్ని చదువుతూ గడిపాను. అప్పుడు నాక్కూడా నాకు తెలిసిన సంగతులు చెప్పాలనిపించింది. గూగుల్ లేని రోజుల్లోనే నిత్యాన్వేషిగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చిన తర్వాత ఇక కష్టమేముంది? యూ ట్యూబ్‌కి సంబంధించిన పరిజ్ఞానమంతా ‘హౌ టూ అప్లోడ్, హౌ టూ డూ ఎడిటింగ్, హౌ టూ డూ థంబ్‌నెయిల్’ అంటూ ‘హౌ టూ’ అని అడుగుతూ నేర్చుకున్నాను. మొదట వంటలు, ఇంటి అలంకరణ, మా వారు రాసిన వైద్యగ్రంథంలోని విషయాలను చెప్పాలనుకుని 2021లో యూ ట్యూబ్ చానెల్ మొదలుపెట్టాను. కొంతకాలం తర్వాత యూ ట్యూబ్ గుర్తించాలంటే ఏదో ఒక టాపిక్ మీదనే దృష్టి పెట్టమని సూచించారు పిల్లలు. వంటలు చాలామంది చేస్తున్నారు. ముత్యాలు, పగడాల గురించి చాలామందికి తెలియని సంగతులు చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పమన్నారు మా పిల్లలు. ఆ తర్వాత నాకు సబ్‌స్రైబర్స్ రెండున్నర లక్షలకు పెరగడంతోపాటు ఫాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. డాక్టర్లు, సైంటిస్ట్‌లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు... సందేహాలడుగుతుంటే నాకు తెలిసినదెంత? ఇంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ల సందేహాలు నేను తీర్చడమేమిటని ఆశ్చర్యంగా ఉంటుంది కూడా. అసలు ముత్యాన్ని, నకిలీ ముత్యాన్ని ఎలా గుర్తించాలి, తైవాన్ పగడం ఎలా ఉంటుంది, ఇటాలియన్ పగడాలెలా ఉంటాయి, వేటిని క్యారట్లలో తూస్తారు, వేటిని గ్రాముల్లో తూస్తారు... వంటి విషయాలనెన్నో చెప్పాను. యూ ట్యూబర్‌గా నేను డబ్బుకంటే వెలకట్టలేని ఆత్మీయతను, అభిమానాన్ని సంపాదించుకున్నాను. ఆంటీ, అమ్మా అనే పిలుపులతోపాటు ఈ తరం యువతులు వాళ్ల సందేహాల కోసం ఫోన్ చేసి ‘అమ్మమ్మా’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంటోంది. మనిషి, మెదడు పని లేకుండా ఖాళీగా ఉండకూడదు. అలాగే ఎంటర్టైన్ మెంట్ మన మైండ్‌ని చెడగొట్టకూడదని నమ్ముతాను. అందుకే టీవీ సీరియల్స్ నన్ను ఆకర్షించలేదు. నాకు నేనుగా సమయాన్ని ఇలా ఆనందంగా, ఉపయుక్తంగా మలుచుకున్నాను’’ అన్నారు శకుంతలాదేవి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జియో వినియోగదారులకు శుభవార్త
వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో మెరుగైన వెర్షన్లో 4జీ ఫోన్లను రూ.999కే అందించనుంది. ఈ నేపథ్యంలో నోకియా, లావా, ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్లతో కలిసి స్మార్ట్‌ఫోన్ సొంత వెర్షన్లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుందని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్ తెలిపారు. 250 మిలియన్ల 2జీ వినియోగదారులు 4జీ టెక్నాలజీని వినియోగించేలా కృషి చేయాలని కంపెనీ భావిస్తుందన్న ఆయన .. 450కి పైగా ఛానళ్లతో లైవ్ టీవీ, లేటెస్ట్ సినిమాలు, పాటలు, ఐపీఎల్ స్ట్రీమింగ్, ఇతర కంటెంట్ వంటి ఫీచర్లను రిలయన్స్ జియో 30 శాతం తక్కువ ధరకే అందిస్తోంది. స్కాన్ అండ్ పే ఆప్షన్ తో యూపీఐ పేమెంట్స్ ను జియో ప్రవేశపెట్టిందని దత్ వెల్లడించారు. గత నెలలో రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్ జియోభారత్ బి1ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ ధర రూ.1,299గా ఉంది. ఈ ఫోన్లో 2.4 అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్ అందించేందుకు జియో యాప్స్‌ను ఫ్రీ ఇన్ స్టాల్ చేసింది. 23 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుండగా.. యూపీ పేమెంట్స్ కోసం జియోపేని ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు జియో కల్పిస్తుంది. జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వీ2, కే1 కార్బన్ వంటి ఫోన్లను జియో ప్రవేశపెట్టింది. -
పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. భారత్‌లో విడుదల ఎప్పుడంటే
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో మరో లేటెస్ట్ సిరీస్‌తో స్మార్ట్ ఫోన్ ప్రియుల్ని అలరించనుంది. త్వరలో భారత్ మార్కెట్లోకి పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. గత ఫిబ్రవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన పోకో ఎక్స్5 సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా పోకో ఎక్స్6 ను విడుదల చేస్తుంది. అయితే రెడ్ మీ నోట్ 13 ప్రో ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తున్నట్లు సమాచారం. పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 6 జీబీ - 8జీబీ- 12 జీబీ ర్యామ్, 128 జీబీ /256 జీబీ / 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పోకో ఎక్స్6 సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2 ఎస్వోపీ చిప్ సెట్ పాటు 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. -
స్మార్ట్ఫోన్లకు మైక్రోస్కోప్.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే?
వేలి మొన మీద తేలికగా పట్టేంత ఈ లెన్స్ స్మార్ట్‌ఫోన్‌కు మైక్రోస్కోప్ చూపునిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా లెన్స్‌కు దీనిని అతికించుకుంటే చాలు, అరచేతిలో మైక్రోస్కోప్ ఉన్నట్లే! దీని ద్వారా సుదూరంలో ఉన్న వాటిని సమీపంలో ఉన్నంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. ఈ లెన్స్ స్మార్ట్‌ఫోన్ లెన్స్‌లో సాధారణంగా కనిపించే వస్తువులను వాటి పరిమాణానికి పన్నెండువందల రెట్లు ఎక్కువగా చూపిస్తుంది. దీని ద్వారా తీసే ఫొటోల రిజల్యూషన్ 700ఎన్ఎం ఉంటుంది. ఈ మైక్రోస్కోపిక్ లెన్స్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అమర్చుకుంటే, రాత్రివేళ ఆకాశంలో కనిపించే నక్షత్రాలను, చంద్రుడిని అద్భుతంగా ఫొటోలు తీయవచ్చు. ఆరుబయటకు వెళ్లేటప్పుడు సుదూర దృశ్యాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయవచ్చు. అమెరికన్ కంపెనీ ‘ఐ మైక్రోస్కోప్’ ఈ లెన్స్‌ను ‘ఐమైక్రో క్యూ3’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర 35 డాలర్లు (రూ.2,910) మాత్రమే! -
పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్!
పండుగ సీజన్లో కేవలం కార్లు, బైకులు మాత్రమే కాదు, మంచి స్మార్ట్ఫోన్లను కొనటానికి కూడా వినియోగదారులు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ ఫోన్స్ ఏవి? వాటి వివరాలు ఏంటి? అనేది వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) రూ. 25,000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో మోటరోలా కంపెనీకి చెందిన 'ఎడ్జ్ 40 నియో' ఒకటి. ఇది 6.55 ఇంచెస్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, చిక్ వేగన్-లెదర్ బ్యాక్ డిజైన్ కలిగి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 64 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030, 6nm ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ వినియోగదారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐకూ జెడ్7 ప్రో (iQOO Z7 Pro) ఐకూ జెడ్7 ప్రో మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో స్మార్ట్‌ఫోన్. దీని ధర కూడా రూ. 25000 కంటే తక్కువే. 125జీబీ, 256జీబీ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ పొందుతుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా వివిధ లైటింగ్ పరిస్థితులలో కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 4,600mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ కలిగిన ఈ మొబైల్ బ్లూ లాగూన్, గ్రాఫైట్ మ్యాట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది. లావా అగ్ని 2 (Lava Agni 2) మన జాబితాలో మూడవ మొబైల్ లావా అగ్ని 2. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి, 8జీబీ ర్యామ్ పొందుతుంది. వైబ్రెంట్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. కెమెరా అద్భుతంగా ఉంటుంది. ఇదీ చదవండి: కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్ పోకో ఎక్స్5 ప్రో (Poco X5 Pro) పోకో ఎక్స్5 ప్రో మంచి డిజైన్, క్వాలిటీ ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్. ఇది 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఇన్ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్స్ పొందుతుంది. -
భారత్‌లో ఫోల్డబుల్ ఫోన్ల హవా!
న్యూఢిల్లీ: భారత స్మార్ట్ఫోన్ల విపణిలో ఇప్పుడు ఫ్లిప్ మోడళ్ల హవా నడుస్తోంది. ఫ్లిప్ విభాగంలో గట్టి పట్టు కోసం చైనా కంపెనీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శామ్సంగ్కు ధీటుగా పోటీ ఇవ్వడానికి ఈ కంపెనీలు వినూత్నంగా ఫ్లిప్ ఫోన్లను తయారు చేసి కస్టమర్లను ఊరిస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలాతోపాటు టెక్నో, ఒప్పో వీటిలో ఉన్నాయి. పరిశ్రమలో తొలిసారిగా మోటరోలా రూ.50,000 లోపు ధరలో ఫ్లిప్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఈ నెలాఖరులోగా వన్‌ప్లస్ నుంచి ప్రిమియం ఫ్లిప్ ఫోన్ వస్తోంది. 2023 జూలైలో ఫ్లిప్ మోడల్ విడుదల చేసిన తర్వాత రెండు నెలల్లోనే శామ్సంగ్ సుమారు 50–60 వేల యూనిట్లు విక్రయించినట్టు అంచనా అని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ తెలిపింది. మోటరోలా, టెక్నో బ్రాండ్స్ నెలకు చెరి 18–20 వేల యూనిట్లను అమ్ముతున్నాయని వివరించింది. ఈ కంపెనీలను టెక్నో, ఒప్పో అనుసరించాయి. సర్క్యులర్ కవర్ డిస్ప్లే, మధ్య స్థాయి ఫీచర్లతో టెక్నో ఫ్లిప్ ఫోన్‌ను రూ.50 వేల ధరలో ప్రవేశపెట్టింది. మెరుగైన కెమెరా, బ్యాటరీకితోడు సాధారణ స్మార్ట్‌ఫోన్ మాదిరి డిస్ప్లేతో ఫ్లిప్ మోడల్‌ను ఒప్పో తీసుకొచ్చింది. -
భారత్‌లో ‘పిక్సెల్ సిరీస్’ స్మార్ట్ఫోన్ల తయారీలో గూగుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లో తయారు చేయాలని నిర్ణయించింది. దేశీయ మార్కెట్‌తోపాటు విదేశాలకు వీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ఈ మోడల్ ఫోన్లు చైనా, వియత్నాంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్ 8 సిరీస్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వినియోగదార్లను ఆకట్టుకుంటోంది. తొలుత పిక్సెల్ 8 మోడల్ ఫోన్లు మేడిన్ ఇండియా ట్యాగ్‌తో రానున్నాయి. పిక్సెల్ 8 ప్రో మోడల్ సైతం ఇక్కడ రూపొందే చాన్స్ ఉంది. దేశీయంగా పిక్సెల్ ఫోన్ల తయారీకై తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, భారత్‌కు చెందిన డిక్సన్ టెక్నాలజీస్ పోటీపడుతున్నట్టు సమాచారం. 2016 నుంచి అంతర్జాతీయంగా సుమారు 4 కోట్ల పిక్సెల్ స్మార్ట్ఫోన్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో ఒక కోటి యూనిట్లు గడిచిన 12 నెలల్లో అమ్ముడవడం విశేషం. వచ్చే ఏడాది నుంచి.. మేడిన్ ఇండియా పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చే ఏడాది నుంచి అందుబాటులో ఉంటాయని గూగుల్ డివైసెస్, సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రిక్ ఓస్టెర్లో గురువారం వెల్లడించారు. ఇందుకోసం అంతర్జాతీయ, దేశీయ ఒప్పంద తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని గూగుల్ ఫర్ ఇండియా 2023 కార్యక్రమంలో పేర్కొన్నారు. గూగుల్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను దేశంలో తయారు చేయాలనే నిర్ణయం భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడం, అలాగే ప్రత్యర్థి చైనాతో పోటీ పడాలనే భారత లక్ష్యానికి పెద్ద ప్రోత్సాహం. క్రోమ్‌బుక్స్‌ను భారత్‌లో తయారు చేసేందుకు పర్సనల్ కంప్యూటర్ల ఉత్పత్తిలో పేరెన్నికగల హెచ్‌పీ ఇటీవలే గూగుల్‌తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. భారత్‌లో ఇప్పటికే యాపిల్.. కొన్నేళ్లుగా యాపిల్ తన తయారీ స్థావరాన్ని విస్తరించాలని కోరుకుంటోంది. ఇందుకోసం చైనా+1 విధానంలో భాగంగా భారత్‌లో పలు ఉపకరణాలను అసెంబ్లింగ్ చేస్తోంది. గత నెలలో ఐఫోన్ 15 విడుదల యాపిల్ ఇండియా తయారీ ప్రణాళికలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. భారత్‌లో, అలాగే చైనాలో ఉత్పత్తి అయిన ఐఫోన్స్‌ను ఒకే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా యాపిల్ విడుదల చేయడం ఇందుకు కారణం. సాధారణంగా భారత్‌లో యాపిల్ తాజా మోడళ్ల ఉత్పత్తి చైనా కంటే కొన్ని నెలలు వెనుకబడి ఉంటుంది. 2025 నాటికి భారత్‌లో 25 శాతం ఐఫోన్లను తయారు చేయాలని యాపిల్ లక్ష్యంగా చేసుకుంది. -
iPhone 15 series: ఇంతవరకూ ఏ ఫోన్లోనూ లేని 9 ఫీచర్లు! అవి ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న స్మార్ట్ఫోన్లు.. యాపిల్ ఐఫోన్లు. కొత్త సిరీస్ ఐఫోన్లు విడుదలైనప్పుడల్లా ఏవో కొత్త ఫీచర్లను యాపిల్ కంపెనీ ప్రవేశపెడుతుంటుంది. ఇదే క్రమంలో ఇటీవల ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సారి ఐఫోన్ 15 సిరీస్‌పై అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ అంచనాలకు అనుగుణంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 సిరీస్‌లో సీ-టైప్ యూఎస్బీ చార్జింగ్‌తో పాటు ఇప్పటివరకూ ఏ ఫోన్లోనూ లేని తొమ్మిది సరికొత్త ఫీచర్లను ఐఫోన్ 15 సిరీస్‌లో పరిచయం చేసింది. టైటానియం బాడీ కొత్త ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లను తేలికైన, దృఢమైన టైటానియంతో తయారు చేశారు. ఈ టైటానియం లోహాన్ని వ్యోమనౌకల్లో ఉపయోగిస్తారు. దీంతో ఈ రెండు ఫోన్లు ఇంతకు ముందు ఫోన్ల కంటే 10 శాతం తేలిగ్గా ఉంటాయి. పర్యావరణహితం లైట్ వెయిట్ టైటానియం డిజైన్ 100 శాతం రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన కొత్త సబ్‌స్ట్రక్చర్‌ను కలిగి ఉంది. వీటిలో 100 శాతం రీసైకిల్ కోబాల్ట్ బ్యాటరీలు అమర్చారు. అలాగే లెదర్ బ్యాక్ కేస్లకు బదులుగా 68 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ కంటెంట్‌తో తయారు చేసిన వోవెన్ ఫాబ్రిక్ కేస్‌లను ఉపయోగించారు. యాక్షన్ బటన్ సాధారణంగా చాలా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక కెమెరా కీని చూస్తుంటాం. అయితే యాపిల్ ఈ సారి iPhone 15 Pro వెర్షన్లలో మ్యూట్ స్విచ్‌కి బదులుగా యాక్షన్ బటన్‌ను తీసుకొచ్చింది. ఈ బటన్ రోజూ ఉపయోగించే ఫంక్షన్ల కోసం షార్ట్‌కట్‌గా ఉంటుంది. Qi2 వైర్లెస్ ఛార్జింగ్ కొత్త ఐఫోన్లు సరికొత్త Qi2 వైర్లెస్ ఛార్జింగ్ స్టాండర్డ్‌తో వచ్చాయి. ఛార్జింగ్ కాయిల్స్ సరిగ్గా అమరేలా అదనపు మ్యాగ్నెట్ రింగ్‌ను ఇందులో ఇచ్చారు. దీనివల్ల వేగవంతమైన వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అయితే వీటికి అధికారికంగా Qi2-సర్టిఫికెట్ ఇంకా రాలేదు. A17 ప్రో చిప్ మొదటి 3-నానోమీటర్ చిప్‌గా పిలిచే A17 ప్రో చిప్‌ను యాపిల్ iPhone 15 Pro, Pro Max ఫోన్లలో ఉపయోగించింది. ఈ చిప్ డివైజ్ పర్ఫామెన్స్‌ను మరింత మెరుగ్గా చేస్తుంది. యాపిల్ చరిత్రలో ఇది అతిపెద్ద GPU రీడిజైన్. కన్సోల్ గేమింగ్ యాపిల్ కొత్త ప్రాసెసర్, హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ (సాఫ్ట్వేర్ ఆధారిత రే ట్రేసింగ్ కంటే 4 రెట్లు వేగవంతమైనది) సామర్థ్యాలను వండర్లస్ట్ ఈవెంట్లో ప్రదర్శించింది. iPhone 15 Pro, Pro Max ఫోన్లలో మొదటిసారిగా కన్సోల్ గేమింగ్ టైటిల్స్ కనిపించనున్నాయి. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కెమెరా విషయంలో యాపిల్ iPhone 15 ఫోన్లలో చాలా మార్పులు చేసింది. 4K 60 FPS వీడియో రికార్డింగ్ కోసం Pro Max బేస్ స్టోరేజ్ వేరియంట్లో 256 జీబీ స్టోరేజ్ ఇచ్చింది. 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ ఇమేజ్ క్వాలిటీ, ప్రాక్టికల్ ఫైల్ సైజ్‌లను బ్యాలెన్స్ చేసేందుకు కొత్తగా 24MP సూపర్-హై-రిజల్యూషన్ డిఫాల్ట్ సైజ్ ఫీచర్‌ను యాపిల్ ఐఫోన్ 15 ఫోన్లలో తీసుకొచ్చింది. 48MP మెయిన్ కెమెరాతో హై రిజల్యూషన్‌లో అద్భుతమైన ఫొటోలను తీసుకోవచ్చు. పోట్రెయిట్ మోడ్‌కి మారకుండానే పోట్రెయిట్ ఫొటోలను తీసే కొత్త ఫీచర్‌ను ఇందులో ఉంది. టెట్రాప్రిజం డిజైన్ జూమ్ ఫోటోగ్రఫీ అన్నది ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో ప్రత్యేకంగా మారింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్లోని 12MP టెలిఫోటో లెన్స్ 120 mm వద్ద 5x జూమ్‌ను కలిగి ఉంది. దీంతో దూరంతో నుంచే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ వంటివి చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా OIS, ఆటోఫోకస్ 3D సెన్సార్-షిఫ్ట్ మాడ్యూల్తో కూడిన టెట్రాప్రిజం డిజైన్‌ను కలిగి ఉంటుంది. -
అనుష్క శర్మ చేతిలో కొత్త స్మార్ట్‌ఫోన్ - విడుదలకు ముందే..
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా 'వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్' విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే దేశీయ విఫణిలో విడుదలకాక ముందే బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి వన్‌ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 20 (అక్టోబర్)న లాంచ్ చేయనున్నట్లు గతంలో కొన్ని నివేదికలు వెల్లడించాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెల్లడించలేదు. దీని డిజైన్ & స్పెసిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ.. పుకార్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలకాక ముందే అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగింది. వైరల్ భయాని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా చూడవచ్చు. దీని ధర రూ. 1,10,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని సమాచారం. అధికారిక ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. ఇదీ చదవండి: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 16 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజితో, ఆక్టా గోనల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoCతో విడుదలయ్యే అవకాశం ఉంది. డిస్ప్లే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. రెడ్మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్న రెడ్మీ నోట్ 13లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు ప్రో మోడల్లో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్‌పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్‌లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. రెడ్మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు రెడ్మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి. నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్‌క్యామ్‌లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్‌నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్‌లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్‌క్యామ్‌లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్‌కెమెరా ఫీచర్‌ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్‌క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్‌క్యామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్‌లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
అయ్యో పాపం.. ఐఫోన్ 15 కోసం ఎంతకు తెగించారో చూడండి..
టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 23 నుంచి లభ్యం కావడంతో ఈ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఢిల్లీ, ముంబైలోని యాపిల్ రిటైల్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. విడుదలై గంటలు గడవక ముందే ఈ ఫోన్లను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కమలా నగర్‌కు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ స్టోర్‌కి కొంత మంది ఐఫోన్ల కోసం వచ్చారు. అయితే, ఫోన్ల డెలివరీ కాస్త ఆలస్యం అవుతుందని స్టోర్ సిబ్బంది చెప్పడంతో కోపోద్రికులయ్యారు. డెలివరీ అలస్యం అవుతుందని చెప్పిన స్టోర్ ఉద్యోగి దుస్తులు చించారు. ఆపై దారుణంగా కొట్టారు. స్టోర్‌లోని ఇతర సిబ్బంది వినియోగదారుల్ని నిలువరించేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. ప్రస్తుతం, ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటనపై స్టోర్ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. స్టోర్ సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడ్డ కస్టమర్లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Delhi Police took legal action against the customers after a scuffle broke out between customers and mobile shop employees after an alleged delay in supplying iPhone 15 to him in the Kamla Nagar area of Delhi (Viral Video Confirmed by Police) pic.twitter.com/as6BETE3AL — ANI (@ANI) September 23, 2023 చదవండి : కెనడాకు మరో భారీ ఎదురు దెబ్బ? -
దిగొచ్చిన చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం
Xiaomi smartphone plant: చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు పోటీగా డిక్సన్‌కు షావోమి పార్టనర్ షిప్ మరింత బలాన్నివ్వనుందని అంచనా. అయితే ఈ వార్తలపై అటు షావోమిగానీ, డిక్సన్‌గానీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. (ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్‌మీకూ వచ్చిందా?) బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 300,000 చదరపు అడుగులకు మించి, దాదాపు ఆరు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో రూ. 400 కోట్ల రూపాయలు (48.2 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్‌ను ఈ నెలాఖరులో ప్రభుత్వ అధికారి ప్రారంభించనున్నారు. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) అలాగే షావోమీ గతంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. ఇది గతంలో చైనా నుండి దిగుమతి అయ్యేవి. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ. మోటరోలా, శాంసంగ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం డిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ను ప్రారంభించారు. కాగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్‌లో ఎదురు లేకుండా ఉన్న షావోమి కేంద్ర నిబంధనలు, నియంత్రణలతో అధిక నియంత్రణ త తర్వాట్ మార్కెట్ షేర్‌ను కోల్పోయింది. దీన్నుంచు కోలుకునే చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5G స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించాలని ప్లాన్ చేస్తోంది. Leadership of @XiaomiIndia met me tdy - hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) July 6, 2022 -
సెప్టెంబర్ నెలలో విడుదల కానున్న అదిరిపోయే 5 స్మార్ట్ఫోన్లు ఇవే
టెక్నాలజీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సెప్టెంబర్ 12న ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుందని తెలుస్తోంది. ఆ సిరీస్ ఫోన్లతో పాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, హానర్ 90, షావోమీ 13 టీ ప్రోలు లాంఛ్ చేయనున్నాయి ఆయా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న యాపిల్ షెడ్యూల్ ప్రకారం.. ‘వండర్లస్ట్’ ఫాల్ ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లు ఉన్నాయి. యూఎస్బీ-సీ పోర్ట్, పవర్ఫుల్ ఏ17 బయోనిక్ చిప్సెట్, లైనప్‌లో వినూత్నమన డైనమిక్ ఐలాండ్, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్‌కు పెరిస్కోపిక్ కెమెరా లెన్స్ డిజైన్ వంటి ఈ ప్రీమియం మోడల్‌కి ఉంటాయని అంచనా. హానర్ 90 సిరీస్ దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు హానర్ సంస్థ సిద్దమైంది. చైనా తయారీ సంస్థ హానర్ 2020లో భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేసింది. అయితే ఈ తరుణంలో హానర్ టెక్ పేరిట పున ప్రారంభం కానుంది. హానర్ 90 సిరీస్‌ను లాంచ్ చేసి భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తాము సైతం పోటీలో ఉన్నామని చెప్పనుంది. హానర్ కొత్త సిరీస్ విడుదలపై అమెజాన్ ప్రచారం ప్రారంభించింది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్నారు. హైఎండ్ ప్రీమియం స్మార్ట్ఫోన్లకి పెద్ద మొత్తంలో ఖర్చ చేయకూడదనుకునే వారికి ఈ ఫోన్ మంచిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోన్ విడుదల తేదీ అధికారంగా తెలియాల్సి ఉంది. షావోమీ 13టీ ప్రో ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 1న లాంచ్ అవుతుందని గతంలో పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికీ విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతుంది. షోవోమీ 13టీ ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్ సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 120 వాల్ట్‌ల ఛార్జింగ్ సపోర్ట్, 144హెచ్డీ అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సుదీర్ఘ కాలం తర్వాత శాంసగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లోని బడ్జెట్ ఫోన్ త్వరలో విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ పేరుతో మార్కెట్‌కు పరిచయం కానుంది. ఈ ఫోన్లో 50 ఎంపీ కెమెరా,ఎక్స్నాయిస్ 2200 లేదంటే స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్, 120 హెచ్‌జెడ్ స్మూత్ డిస్ప్లేతో పాటు యూజర్లు ఆకట్టుకునే ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి. వన్ ప్లస్ ఓపెన్ వన్‌ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ల ప్రపంచంలోకి వన్‌ప్లస్ ఓపెన్ అడుగుపెట్టనుంది. లాంచ్ తేదీ వెల్లడించనప్పటికీ ఇది 7.8-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 6.3-అంగుళాల కవర్ డిస్ప్లే ఉండొచ్చనే అంచనాలు నెకొన్నాయి. అంతేకాదు ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉండనుంది. -
అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది!
తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు భారత్‌లో అత్యంత ఆదరణ ఉంటోంది. అందులోనూ 5జీ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. షావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఇటీవల అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) లాంచ్ చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) పేరుతో మొబైల్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించిన ఈ స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా పోకో ఇండియా రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించింది. ఆగస్ట్ 12న మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ప్రారంభం కాగా 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోంది. రెండో సేల్కు కూడా విశేష స్పందన లభించిందని, 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ ట్విటర్లో షేర్ చేశారు. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ ఫోన్‌ను కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఓఎస్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ Today we had the second sale of #POCOM6Pro5G and it started at 12 noon and went Out of Stock in just 9 minutes. Thanks everyone for the tremendous response. #5GDisrupter #POCOM6Pro5G pic.twitter.com/k7f8QR7JR1 — Himanshu Tandon (@Himanshu_POCO) August 12, 2023 -
హైదరాబాద్ : కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌లో మెరిసిన నటి శ్రీలేఖ - ఫోటోలు
-
‘నో జీ టూ 5జీ’ : టెలికాం రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎలా లైన్లు కట్టేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు. కానీ పాత తరాలకు ఇవి అనుభవమే. అలా ‘నో జీ నుంచి 5 జీ’ వరకు దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. నోజీ నుంచి 2జీ, 3జీ, 4జీ, 5జీ వరకు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ముబైల్ విప్లవంలో సంభవించిన మార్పులు గురించి తెలుసుకునే ముందు సాక్షి పాఠకులకు 76వ స్వంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర భారతదేశంలో టెలిఫోన్ అనేది ఓ విలాసవంతమైన సౌకర్యం. 90లకు ముందు కొత్త ఫోన్ కనెక్షన్ కోసం దరఖాస్తుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలే పట్టేది. మరణ వార్తను ఎక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటే రోజుల సమయం పట్టేది. దీంతో కడ చూపు చూసుకోకుండా పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు అనేకం. అలా బరువెక్కిన హృదయ విదారకరమైన సంఘటనల నుంచి తేరుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులలో భాగమయ్యాయి. అందుకు 1991 నుండి టెలికాం రంగంలో జరిగిన మార్పులేనని చెప్పుకోవాలి. అప్పట్లో 1000 మందికి ఆరు ఫోన్లు మాత్రమే ఉండేవి. 2015లో 1 బిలియన్ ఫోన్ల మార్కును దాటింది. 24 సంవత్సరాల వ్యవధిలో ఏప్రిల్ 2022 నాటికి 1.14 బిలియన్ కనెక్షన్లను సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్‌లో కేవలం 80,000 టెలిఫోన్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ట్రంక్ బుకింగ్ 1990లకు ముందు, వైర్‌లైన్ కనెక్టివిటీ చాలా తక్కువ. సర్కిల్‌లలో స్థానికులతో మాట్లాడే వీలుంది. వేరే ప్రాంతానికి కాల్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే ఆపరేటర్‌కు కాల్ చేయాలి. వాస్తవానికి, ఇది 1970, 1980లలో ఒక సాధారణ జాబ్. ఆపరేటర్ కాల్ చేసి సాధారణ కాల్ (సాధారణ పల్స్ రేటు), అవసరమైన కాల్ (2x పల్స్ రేటు), అత్యవసర కాల్ (8x పల్స్ రేటు) మాట్లాడాలని కోరేవారు. మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో..వారికి కాల్ కలిసేందుకు రోజంతా పట్టేది. అయితే అవసరమైన కాల్ సాధారణంగా నాలుగు గంటలలోపు, అత్యవసర కాల్ గంటలోపు కనెక్ట్ అయ్యేది. ఆపరేటర్ కాల్‌ను మాన్యువల్‌గా కలిపేవారు. వారి సంభాషణల్ని వినే అవకాశం ఉండేది. సబ్‌స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD) 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో, టెలికాం కనెక్టివిటీ మెరుగైంది. ట్రంక్ బుకింగ్ ఆపరేటర్ వ్యవస్థ కనుమరుగైంది. సాంకేతిక విస్తృతంగా వ్యాపించింది. సిటీ కోడ్ (STD కోడ్) , ఫోన్ నంబర్‌ను డయల్ చేసి ఆపరేటర్‌తో పని లేకుండా వెంటనే కనెక్ట్ అయ్యేది. కాల్ రేట్లు రాత్రి 10 గంటల తర్వాత చేసే కాల్లకు 1/4 వ వంతు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. సూదూర ప్రాంతాలకు ఫోన్ చేసేందుకు దేశవ్యాప్తంగా STD/ISD/PCO బూత్‌లను ఏర్పాటు చేయడంతో STD కాల్లు చాలా మందికి కొత్త వ్యాపారం అవకాశంగా మారాయి. అయితే, మెరుగైన కనెక్టివిటీ రావడంతో, దాదాపు 2010ల వరకు STD కాల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అవి దూరాన్ని బట్టి దేశంలో ఎక్కడికైనా కాల్ చేయాలంటే ఒకే ధరను చెల్లించాలని వెసలు బాటు ఉంది. అలాగే, గత దశాబ్దం ప్రారంభంలో, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP),చౌకైన సెల్‌ఫోన్ టారిఫ్‌లు STD/ISD/PCOల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించే వారు. ఇంటర్నెట్ 1986 నుండి భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ గుర్తింపు, ఎంపిక చేసిన కొన్ని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. 1995 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే వీఎస్ఎన్ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు ఇంటర్నెట్‌ని అందించింది. 1995లో ఇంటర్నెట్ కనెక్షన్‌కు విద్యార్థి అకౌంట్‌కు సంవత్సరానికి రూ. 5,000, టీసీపీఐపీ Transmission Control Protocol/Internet Protocol అకౌంట్ కోసం రూ. 15,000 ఖర్చవుతుంది. 133 కేబీబీఎస్ డయల్-అప్ మోడెమ్‌లు ప్రమాణంగా ఉండటంతో నేటితో పోలిస్తే వేగం చాలా నెమ్మదిగా ఉంది. సాధారణ 1ఎంబీ ఫోటోను డౌన్లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం అదే ఇంటర్నెట్ సాయంతో వాయిస్, వీడియో ,డేటా కాల్‌లను సజావుగా చేసుకోగలుగుతున్నాం. పేజింగ్ సేవలు 1990వ దశకం మధ్యలో ఫోన్లను ఎలాగైతే వినియోగించే వారో పేజింగ్ పరికరాలు (లేదా వన్-వే కమ్యూనికేషన్ పరికరాలు) అలా వినియోగించే వారు. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఈ పేజర్లతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. మనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలా అయితే కాల్ చేస్తున్నామో అప్పుడు పేజర్లతో కాల్ చేసే వెసలుబాటు ఉంది. మొబైల్ ఫోన్ విప్లవం 1995లో అప్పటి ప్రభుత్వాలు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాయి. దేశంలో 20 టెలికాం సర్కిల్‌లుగా విభజిస్తే అందులో ఒక్కో సర్కిల్‌కు ఇద్దరు ఆపరేటర్లు 15 ఏళ్ల లైసెన్స్ పొందేవారు. అయితే, ప్రారంభంలో సెల్‌ఫోన్ టారిఫ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమింగ్ కాల్స్‌కి కూడా నిమిషానికి రూ. 16.80కి చెల్లించేవారు. 2000 సవంత్సరం ప్రారంభంలో మాత్రమే సీపీపీ (కాలింగ్ పార్టీ పేస్) ద్వారా ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవడం ప్రారంభమైంది. ది జనరేషన్స్ భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుకలోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. 2000వ దశకం ప్రారంభంలో WAP (వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్) ద్వారా ఫోన్ లేదా, సాధారణ టెక్స్ట్ ద్వారా ఇమెయిల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లలో పూర్తి బ్రౌజర్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2జీ, 3జీ, 4జీ ఇలా లేటెస్ట్ సెల్యులార్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సెల్యులార్ కాలింగ్ ఛార్జీలు ఉన్న దేశంగా కొనసాగుతుంది. భవిష్యత్‌లో మానవ శ్రేయస్సుతో టెలికాం రంగం మరింత అభివృద్ది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఇదీ చదవండి : స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది! -
బాల్యంలో స్మార్ట్ ఫోన్‌తో యవ్వనంలో మతి చెడుతోంది
సాక్షి, అమరావతి: చిన్నతనంలోనే స్మార్ట్ ఫోన్‌ను వినియోగించడం మొదలుపెట్టిన వారికి యవ్వనంలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ఎంత ఆలస్యంగా అలవాటు చేసుకుంటే అంత మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. వాషింగ్టన్కు చెందిన స్వచ్ఛంద సంస్థ సపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు’లో భాగంగా 41 దేశాల్లో 18–24 ఏళ్ల మధ్య వయసున్న 27,969 మందిపై అధ్యయనం చేసింది. వీరిలో చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగించడం మొదలు పెట్టిన వారి మానసిక స్థితి బలహీనంగా ఉందని పేర్కొంది. యువకుల కంటే యువతుల్లోనే ఎక్కువ మానసిక రుగ్మతల ప్రభావాన్ని గుర్తించింది. ఉత్తర అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, ఓషియానియా, దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని యువత మానసిక స్థితిగతులను 47 అంశాల ఆధారంగా లెక్కించారు. వయసు పెరిగితే దుష్ప్రభావం తక్కువ యువకులు 6 ఏళ్ల వయసు నుంచి ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారు 42 శాతం, 18 ఏళ్ల వయసుల్లో ఫోన్ వాడకం మొదలు పెట్టిన వారిలో 36 శాతం మానసిక అనారోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అయితే మహిళల్లో ఆరేళ్ల వయసు నుంచి ఫోన్ వాడుతున్న వారిలో 74 శాతం, వయోజనులైన తర్వాత 46 శాతం వివిధ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వయసు పెరిగిన తర్వాత స్మార్ట్‌ఫోన్ వినియోగం మొదలైతే దాని దు్రష్పభావం కొంత వరకు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అలాగే పురుషుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక దృక్పథం, ఇతరులతో సానుకూల సంబంధాలు కలిగి ఉండే సామర్థ్యాలు పెరిగినట్లు, మహిళల్లో మానసిక స్థితి, స్థితప్రజ్ఞత మెరుగ్గా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, దుందుడుకు భావాలు, వాస్తవికత నుంచి వేరుగా ఉన్నారనే భావనలు గణనీయంగా తగ్గాయి. వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న 10 ఏళ్ల వయసు్కల్లో 12.5 శాతం మంది నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్ధరాత్రి మేల్కొంటున్నారు. దీంతో సగటున వారానికి ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాస్తవానికి సామాజిక మాధ్యమాల్లో రోజుకు మూడు గంటలు గడిపే కౌమారదశ పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉండటంతో పాటు రెట్టింపు మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లోని 13–17 ఏళ్ల మధ్య వయసు్కల్లో దాదాపు 95 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో సుమారు 200 మిలియన్ల మంది చిన్నారులు, తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల
Lava launches Yuva 2 smartphone: స్వదేశీ బ్రాండ్ లావా చాలా తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ యువ 2 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటరోలా (Motorola Moto G14), షావోమీ (Xiaomi Redmi 12) కంపెనీలు చవక ఫోన్లను విడుదల చేసిన మరుసటి రోజే లావా కూడా తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ మూడు ఫోన్లూ రూ. 10,000 కంటే తక్కువ ధరల విభాగంలో ఒకదానితో ఒకటి పోటీపడతాయి. గ్లాస్ బ్యాక్ ఫినిషింగ్, క్లీన్ అండ్ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే లావా యువ 2 స్మార్ట్‌ఫోన్ 3జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ.6,999. గ్లాస్ బ్లూ, గ్లాస్ లావెండర్, గ్లాస్ గ్రీన్ రంగుల్లో లభ్యమవుతుంది. ఆగస్టు 2 నుంచి తమ రిటైల్ నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మరో విశేషం ఏంటంటే ఈ ఫోన్‌కు వారంటీ వ్యవధిలోపు ఏవైనా సమస్యలు వస్తే ఇంటి వద్దే సర్వీస్ అందిస్తారు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 90Hz 6.5 అంగులాల హెచ్డీ ప్లస్ సింక్ డిస్ప్లే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3జీబీ వరకు వర్చువల్ మెమొరీ 8-కోర్ Unisoc T606 చిప్సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 13ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా 10W USB టైప్-C ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ -
భారత్‌లో ఫాక్స్‌కాన్.. 500 మిలియన్ల పెట్టుబడికి గ్రీన్ సిగ్నల్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు ఐఫోన్లను తయారీ చేసి సరఫరా చేసే ఫాక్స్‌కాన్ టెక్నాలజీ సంస్థ భారత్ రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లను నిర్మించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 500 మిలియన్ల పెట్టుబడి పెట్టే యోచనలో ఉందంటూ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫాక్స్‌కాన్ ఈ తయారీ యూనిట్లను కర్ణాటకలో నిర్మించనుండగా..ఒక ఫ్యాక్టరీ ఐఫోన్ల తయారీ, రెండో ఫ్యాక్టరీలో యాపిల్‌కు విడిభాగాలు ఉత్పత్తి చేయనుందని నివేదిక పేర్కొంది. అయితే, ఏ రాష్ట్రంలో ఫ్యాక్టరీలను నిర్మించాలనే అంశంపై ఫాక్స్‌కాన్ స్పష్టత ఇచ్చినప్పటికీ.. ప్రాంతం ఎక్కడనేది నిర్ణయించలేదు. ఈ వారంలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన అనువైన ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిలో కర్నాటకలో ఫాక్స్ కాన్ యూనిట్ కోసం 80 బిలియన్ రూపాయల ($972.88 మిలియన్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. చైనా కంటే భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీ సిద్ధమైంది. తమిళనాడులో ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాల తయారీ కేంద్రంలో 16 బిలియన్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. తద్వారా 6,000 మందికి ఉపాధి కలగనుంది. కాగా, ఫాక్స్ కాన్ తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని కాంచీపురం జిల్లాలో నిర్మించనుందని తెలుస్తోంది. దీనిపై ఫాక్స్‌కాన్, తమిళనాడు ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదీ చదవండి : చైనాను వద్దనుకొని వచ్చేస్తోంది?.. భారత్‌లో ఫాక్స్‌కాన్ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులు -
ఆకాశంలో చుక్కలను సైతం ఇట్టే ఫోటో తీయొచ్చు.. ఇది చాలా స్మార్ట్ గురూ!
స్మార్ట్‌ఫోన్ జనాల చేతిలోకి వచ్చాక ఫొటోగ్రఫీ చాలా తేలికైపోయింది. సెల్ఫీలు మొదలుకొని, కంటికి నచ్చిన ప్రతిదృశ్యాన్నీ స్మార్ట్‌ఫోన్ కెమెరాల్లో బంధించే జనాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న స్మార్ట్‌ఫోన్ కెమెరాలకు కొన్ని పరిమితులు ఉన్నాయి. సుదూరంలో ఉన్నవాటిని స్మార్ట్‌ఫోన్ కెమెరాలతో ఫొటో తీయడం దాదాపుగా దుస్సాధ్యం. వీటి లెన్స్ కొంత వరకు మాత్రమే జూమ్ చేయగలుగుతాయి. ఆ పరిధి దాటిన వాటిని దగ్గరగా, స్పష్టంగా ఫొటోలు తీయలేవు. ఈ పరిమితిని అధిగమించడానికే ఈ స్మార్ట్‌ఫోన్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు - కారణం తెలిస్తే అవాక్కవుతారు! ‘హీస్టియా–లెన్స్’ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ టెలిస్కోపిక్ లెన్స్‌ను స్మార్ట్‌ఫోన్ కెమెరాకు అమర్చుకుంటే, ఆకాశంలో సుదూరాన కనిపించే గ్రహాలను, నక్షత్రాలను స్పష్టంగా ఫొటో తీయడం సాధ్యమవుతుంది. ‘వావోనిస్’ అనే అమెరికన్ కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్ టెలిస్కోపిక్ లెన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లెన్స్ ధర 289 డాలర్లు (రూ.23,702) మాత్రమే! -
రూ.10వేలే.. 108మెగా ఫిక్సెల్ కెమెరాతో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ రూ.10వేల ధరలో బడ్జెట్ ధరలో సీ53 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.9,999 బడ్జెట్ ధరలో విడుదలైన ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనక భాగంలో 108 ప్రైమరీ కెమెరాతో రానుంది. రియల్మీ సీ53 ధర రియల్మీ సీ53 4జీబీ ప్లస్ 128 జీబీ, 6జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్స్ ఫోన్లను అందించనుంది. జులై 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు సమయంలో పరిచయ ఆఫర్ కింద రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. రియల్మీ సీ 53 ఫీచర్లు రియల్మీ సీ 53.. 6.74 అంగుళాల 90 హెచ్‌జెడ్ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ టూ బాడీ రేషియో 90.3శాతం, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 108 ఎంపీ ఆల్ట్రా క్లియర్ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా, ఫోన్ ఫ్రంట్ సైడ్ 720 పీ/30 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. నానోకార్డ్, మైక్రో ఎస్డీ స్లాట్లు ఉన్నాయి. బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లో లభ్యం కానుంది. -
జియోకి పోటీగా ఎయిర్టెల్, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్..
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్టెల్, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్‌టెల్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్‌ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా పోకో సీ51 ను అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ♦ పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్,120 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, స్మూత్ అండ్ రెస్పాన్సీవ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, ♦ మూమెమ్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ♦ పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియా జీ 36 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. ♦ యాప్స్, మీడియా, ఫైల్స్ స్టోరేజ్‌కోసం 4జీబీ ఇంటర్నల్ స్టోర్‌జ్‌ను అందిస్తుంది. ♦ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్‌జెడ్ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ♦ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్టెల్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్‌ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు లాక్ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్ అన్లిమిటెడ్ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్వర్క్ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్టెల్ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. జియో ఫోన్ ఎంతంటే? ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్ V2ని రిలయన్స్ విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్డీ కార్డ్‌తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది. చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్! -
స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..
భోపాల్: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓనర్ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు. దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్ అంటున్నాడు. సెల్ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: టేకాఫ్ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది -
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు..అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడే కొనేయండి!
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్‌ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై36 (Vivo Y36) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో రెడ్మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఫుల్ HD డిస్ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 (iQOO Z7) ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. మోటో జీ73 (Moto G73) మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) రూ. 19,999 వద్ద లభించే 'వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. -
మీ ఫోన్లో ఈ కీబోర్డ్‌ను ఇన్ స్టాల్ చేసుకున్నారా?, చాట్‌జీపీటీతో పాటు!
మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అందులో మీరు ఏ టైపింగ్ కీ బోర్డ్ వినియోగిస్తున్నా..వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే? ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల స్విప్ట్కీబోర్డ్లో బింగ్ చాట్‌బాట్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కీబోర్డ్ వినియోగం యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా, మీరు ఎవరికైనా పంపాలనుకున్న టెక్ట్స్‌ను రీరైట్ చేయడం కానీ, లేదంటే టెక్ట్స్‌తో పాటు ఇతర సమాచారం కావాలంటే ఇంటర్నెట్ బ్రౌజింగ్‌తో పాటు ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా స్విఫ్ట్కీకి బింగ్ చాట్ ఏఐని ఇంటిగ్రేట్ చేయడంపై మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పెడ్రామ్ రెజాయ్ మాట్లాడుతూ ఆండ్రాయిడ్, ఐఫోన్ల కోసం మైక్రోసాఫ్ట్ కీబోర్డ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. యూజర్లు పదాలు, ఎమోజీలతో సహా టైప్ చేసే విధానానికి అనుగుణంగా ఉండే కీబోర్డ్లను అభివృద్ది చేశామన్నారు. దీంతో పాటు అక్షరదోషాలుంటే హైలెట్ చేయడం లేదంటే అక్షరదోషాలను సరిద్దిడం వంటి పీచర్లు ఈ కీబోర్డ్‌లో ఉన్నాయని అన్నారు. కావాలంటే మీరూ ఆ కీబోర్డ్ పనితీరు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే స్విఫ్ట్ కీబోర్డ్‌ను మీ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్ .. అదే జరిగితే వందల కోట్లలో నష్టం! -
ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్‌తో 'జెల్లీ స్టార్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్లో పారదర్శక డిజైన్‌తో నథింగ్ ఫోన్ 1 వంటి ఎల్ఈడీ నోటిఫికేషన్ లైట్‌ను ఇచ్చింది కంపెనీ. ఫోన్ లోపల ఉన్న భాగాలు పారదర్శక బ్యాక్ ప్యానెల్ నుంచి కనిపిస్తాయి. ధర, లభ్యత ఈ బుల్లి స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్లో కంపెనీ విడుదల చేసింది. ఇందులో మైక్రో ఎస్డీ కార్డ్ కోసం పోర్ట్ కూడా ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ను హాంకాంగ్‌లో మాత్రమే విడుదల చేసింది. భారత కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు రూ.17 వేలు. అక్టోబర్ నెల నుంచి ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్పెసిఫికేషన్లు 480 x 854 పిక్సెల్ రిజల్యూషన్‌తో 3 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే. MediaTek Helio G-99 ఆక్టాకోర్ ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 48 MP రియర్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా 2000mAH బ్యాటరీ -
ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్!
Oppo Reno 8 5G: సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్స్, 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి ఫ్లిప్‌కార్ట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద రూ. 38,999 విలువైన 'ఒప్పో రెనొ 8 5జీ' సరసమైన ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో ఒప్పో కంపెనీ విక్రయిస్తున్న అత్యుత్తమ మొబైల్ ఫోన్స్‌లో ఒకటి 'రెనొ 8 5జీ'. ఇది దేశీయ విఫణిలో 2022 జులైలో విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే కలిగిన ఈ మొబైల్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా పొందుతుంది. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4500 mAh. (ఇదీ చదవండి: జీతగాడి స్థాయి నుంచి స్టార్ హీరోలకు మేనేజర్‌గా.. బిజినెస్‌తో కోట్ల సంపాదన - సాధారణ వ్యక్తి సక్సెస్ స్టోరీ!) అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. 5జీ నెట్‌వర్క్‌తో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మీద ఫ్లిప్‌కార్ట్ రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది.