Amazon Offering Huge Discounts on 5G Smartphones, Check Offers Inside - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ సేల్‌.. 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే డిస్కౌంట్‌.. సమ్మర్‌ ఆఫర్‌ గురూ!

Published Sat, May 27 2023 6:47 PM | Last Updated on Sat, May 27 2023 8:41 PM

Amazon Offering Huge Discounts on 5G Smartphones - Sakshi

ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు ప్రకటించింది. మే 27 నుంచి మే 31 వరకు జరిగే ఈ సేల్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు వన్‌ప్లస్‌, రియల్‌మీ, శాంసంగ్‌తో పాటు ఇతర బ్రాండెడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. కొనుగోలు దారులు ఈ ప్రత్యేక సేల్‌లో రూ.1,666 నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ ృపొందవచ్చని వెల్లడించింది. 

అదనంగా, అమ్మకాలు జరిగే సమయంలో ఎక్ఛేంజ్‌ ఆఫర్‌లో రూ.10,000 వేల వరకు బోనస్‌ పొందవచ్చు. ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ యూజర్లకు 24 నెలల పాటు ఎంపిక చేసుకున్న ఫోన్‌లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని ఓ ప్రకటనలో పేర్కొం‍ది. 

ఐక్యూ 11 5జీ
క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2ప్రాసెసర్‌ అందుబాటులో ఉన్న ఐక్యూ 11 5జీ స్మార్ట్‌ ఫోన్‌పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. 9 నెలల వరకు నోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్‌ 2కే ఈ6 అమోలెడ్‌ డిస్‌ప్లే, 1800 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 

రెడ్‌మీ నోట్‌15 జీ 
రెడ్‌మీ నోట్‌12 5జీ కొనుగోలు దారులకు రూ.2,000 వరకు ఎక్ఛేంజ్‌ డిస్కౌంట్‌తో పాటు పలు బ్యాంక్‌లు అందించే ఆఫర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ రెడ్‌మీ 5జీ ఫోన్‌ 120 హెచ్‌జెడ్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 4జనరేషన్‌ 1 5జీ ప్రాసెసర్‌, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్‌ రేర్‌ కెమెరాతో వస్తుంది.

షావోమీ 13 ప్రో 
షావోమీ 13 ప్రో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2, 4 ఎన్‌ఎం ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.71,999 ఖరీదైన ఈ ఫోన్‌ను అమెజాన్‌, బ్యాంక్‌లు ఇచ్చే మొత్తం ఆఫర్లను కలుపుకొని ఎక్ఛేంజ్‌ డిస్కౌంట్‌ కింద రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.73 అంగుళాల 2కే 120 హెచ్‌జెడ్‌ ఈ6 అమోలెడ్‌ డిస్‌ప్లే, 4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 

వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ
వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ ఫోన్‌ ధర రూ.55,499 కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్‌ ఆఫర్లు, ఎక్ఛేంజ్‌ బోనస్‌ కింద రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 9 నెలల పాటు నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం ఉంది.  ఈ ఫోన్‌లో 48 ఎంపీ మెయిన్‌ కెమెరా, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. 

వన్‌ ప్లస్‌ 10 ఆర్‌ 5జీ
వన్‌ ప్లస్‌ 10 ఆర్‌ 5జీ ధర రూ. 32,999గా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్‌ సేల్‌లో ఈ ఫోన్‌పై రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ లభిస్తుంది. 50ఎంపీ మెయిన్‌ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా ఫోన్‌ వెనుక భాగంలో ఉంది.  

శాంసంగ్‌ ఎం14 5జీ  
శాంసంగ్‌ ఎం14 5జీ 6.6 ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 5ఎన్‌ఎం ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ రూ. 15,490 కి కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. రూ. 500 ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్‌లు అందించే ఆఫర్‌లు ఉన్నాయి .

రియల్‌మీ నార్జో 50 5జీ
రియల్‌మీ నార్జో 50 5జీ 6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియా టెక్‌ డైమెన్‌సిటీ  810 5జీ, పవర్‌ ఫుల్‌ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్‌  బ్యాటరీతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లు, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో  3,000 డిస్కౌంట్‌ లభిస్తుండగా.. రూ.14,249 కే కొనుగోలు చేయొచ్చు.

చదవండి👉 అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర‍్లకు ఊహించని షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement