ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎలా లైన్లు కట్టేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు. కానీ పాత తరాలకు ఇవి అనుభవమే. అలా ‘నో జీ నుంచి 5 జీ’ వరకు దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. నోజీ నుంచి 2జీ, 3జీ, 4జీ, 5జీ వరకు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ముబైల్ విప్లవంలో సంభవించిన మార్పులు గురించి తెలుసుకునే ముందు సాక్షి పాఠకులకు 76వ స్వంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
స్వతంత్ర భారతదేశంలో టెలిఫోన్ అనేది ఓ విలాసవంతమైన సౌకర్యం. 90లకు ముందు కొత్త ఫోన్ కనెక్షన్ కోసం దరఖాస్తుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలే పట్టేది. మరణ వార్తను ఎక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటే రోజుల సమయం పట్టేది. దీంతో కడ చూపు చూసుకోకుండా పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు అనేకం.
అలా బరువెక్కిన హృదయ విదారకరమైన సంఘటనల నుంచి తేరుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులలో భాగమయ్యాయి. అందుకు 1991 నుండి టెలికాం రంగంలో జరిగిన మార్పులేనని చెప్పుకోవాలి. అప్పట్లో 1000 మందికి ఆరు ఫోన్లు మాత్రమే ఉండేవి. 2015లో 1 బిలియన్ ఫోన్‌ల మార్కును దాటింది. 24 సంవత్సరాల వ్యవధిలో ఏప్రిల్ 2022 నాటికి 1.14 బిలియన్ కనెక్షన్‌లను సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్‌లో కేవలం 80,000 టెలిఫోన్ కనెక్షన్‌లు మాత్రమే ఉన్నాయని చరిత్ర చెబుతోంది.
ట్రంక్ బుకింగ్
1990లకు ముందు, వైర్‌లైన్ కనెక్టివిటీ చాలా తక్కువ. సర్కిల్‌లలో స్థానికులతో మాట్లాడే వీలుంది. వేరే ప్రాంతానికి కాల్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో పనిచేసే ఆపరేటర్‌కు కాల్ చేయాలి. వాస్తవానికి, ఇది 1970, 1980లలో ఒక సాధారణ జాబ్. ఆపరేటర్ కాల్ చేసి సాధారణ కాల్ (సాధారణ పల్స్ రేటు), అవసరమైన కాల్ (2x పల్స్ రేటు), అత్యవసర కాల్ (8x పల్స్ రేటు) మాట్లాడాలని కోరేవారు. మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో..వారికి కాల్ కలిసేందుకు రోజంతా పట్టేది. అయితే అవసరమైన కాల్ సాధారణంగా నాలుగు గంటలలోపు, అత్యవసర కాల్ గంటలోపు కనెక్ట్ అయ్యేది. ఆపరేటర్ కాల్‌ను మాన్యువల్‌గా కలిపేవారు. వారి సంభాషణల్ని వినే అవకాశం ఉండేది.
సబ్‌స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD)
1980ల చివరలో, 1990ల ప్రారంభంలో, టెలికాం కనెక్టివిటీ మెరుగైంది. ట్రంక్ బుకింగ్ ఆపరేటర్ వ్యవస్థ కనుమరుగైంది. సాంకేతిక విస్తృతంగా వ్యాపించింది. సిటీ కోడ్ (STD కోడ్) , ఫోన్ నంబర్‌ను డయల్ చేసి ఆపరేటర్‌తో పని లేకుండా వెంటనే కనెక్ట్ అయ్యేది. కాల్ రేట్లు రాత్రి 10 గంటల తర్వాత చేసే కాల్‌లకు 1/4 వ వంతు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది.
సూదూర ప్రాంతాలకు ఫోన్ చేసేందుకు దేశవ్యాప్తంగా STD/ISD/PCO బూత్‌లను ఏర్పాటు చేయడంతో STD కాల్‌లు చాలా మందికి కొత్త వ్యాపారం అవకాశంగా మారాయి. అయితే, మెరుగైన కనెక్టివిటీ రావడంతో, దాదాపు 2010ల వరకు STD కాల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అవి దూరాన్ని బట్టి దేశంలో ఎక్కడికైనా కాల్ చేయాలంటే ఒకే ధరను చెల్లించాలని వెసలు బాటు ఉంది. అలాగే, గత దశాబ్దం ప్రారంభంలో, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP),చౌకైన సెల్‌ఫోన్ టారిఫ్‌లు STD/ISD/PCOల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించే వారు.
ఇంటర్నెట్
1986 నుండి భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ గుర్తింపు, ఎంపిక చేసిన కొన్ని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. 1995 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే వీఎస్‌ఎన్‌ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు ఇంటర్నెట్‌ని అందించింది. 1995లో ఇంటర్నెట్ కనెక్షన్‌కు విద్యార్థి అకౌంట్‌కు సంవత్సరానికి రూ. 5,000, టీసీపీఐపీ Transmission Control Protocol/Internet Protocol అకౌంట్ కోసం రూ. 15,000 ఖర్చవుతుంది. 133 కేబీబీఎస్ డయల్-అప్ మోడెమ్‌లు ప్రమాణంగా ఉండటంతో నేటితో పోలిస్తే వేగం చాలా నెమ్మదిగా ఉంది. సాధారణ 1ఎంబీ ఫోటోను డౌన్‌లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం అదే ఇంటర్నెట్ సాయంతో వాయిస్, వీడియో ,డేటా కాల్‌లను సజావుగా చేసుకోగలుగుతున్నాం.
పేజింగ్ సేవలు
1990వ దశకం మధ్యలో ఫోన్‌లను ఎలాగైతే వినియోగించే వారో పేజింగ్ పరికరాలు (లేదా వన్-వే కమ్యూనికేషన్ పరికరాలు) అలా వినియోగించే వారు. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఈ పేజర్‌లతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. మనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలా అయితే కాల్ చేస్తున్నామో అప్పుడు పేజర్‌లతో కాల్ చేసే వెసలుబాటు ఉంది.
మొబైల్ ఫోన్ విప్లవం
1995లో అప్పటి ప్రభుత్వాలు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాయి. దేశంలో 20 టెలికాం సర్కిల్‌లుగా విభజిస్తే అందులో ఒక్కో సర్కిల్‌కు ఇద్దరు ఆపరేటర్లు 15 ఏళ్ల లైసెన్స్ పొందేవారు. అయితే, ప్రారంభంలో సెల్‌ఫోన్ టారిఫ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్‌కమింగ్ కాల్స్‌కి కూడా నిమిషానికి రూ. 16.80కి చెల్లించేవారు. 2000 సవంత్సరం ప్రారంభంలో మాత్రమే సీపీపీ (కాలింగ్ పార్టీ పేస్) ద్వారా ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవడం ప్రారంభమైంది.
ది జనరేషన్స్
భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుకలోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. 2000వ దశకం ప్రారంభంలో WAP (వైర్‌లెస్ యాక్సెస్ ప్రోటోకాల్) ద్వారా ఫోన్ లేదా, సాధారణ టెక్స్ట్ ద్వారా ఇమెయిల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్‌లలో పూర్తి బ్రౌజర్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2జీ, 3జీ, 4జీ ఇలా లేటెస్ట్ సెల్యులార్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సెల్యులార్ కాలింగ్ ఛార్జీలు ఉన్న దేశంగా కొనసాగుతుంది. భవిష్యత్‌లో మానవ శ్రేయస్సుతో టెలికాం రంగం మరింత అభివృద్ది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
ఇదీ చదవండి : స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది!
Comments
Please login to add a commentAdd a comment