Telicom service providers
-
భారత్‌లో స్టార్‌లింక్.. ఎలాన్ మస్క్‌తో ఎయిర్టెల్ డీల్
ఢిల్లీ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. తన వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ మిట్టల్ మాట్లాడుతూ.. భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో పనిచేయడం ఓ మైలురాయి. ముఖ్యంగా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందేందుకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ పొందవచ్చు. దీంతో పాటు భారత్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడనుందని తెలిపారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా యూజర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
వ్యక్తిగత డేటా లీక్!.. కారణం వారే అంటున్న నెటిజన్స్
న్యూఢిల్లీ: తమ వ్యక్తిగత డేటా పబ్లిక్ డొమైన్‌లోకి చేరిపోయినట్టు మెజారిటీ నెటిజన్లు భావిస్తున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీక్ అయినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 87 శాతం మంది చెప్పారు. ఇందులో సగం మంది తమ ఆధార్ లేదా పాన్ వివరాలు లీక్ అయినట్టు భావిస్తున్నారు.దేశవ్యాప్తంగా 375 జిల్లాల పరిధిలో 36వేల మంది స్పందనలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ప్రధానంగా టెలికం ఆపరేటర్లు, ఈ–కామర్స్ యాప్‌లు, బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ విభాగాలు తమ డేటా లీకేజీకి కారణమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. పబ్లిక్ డొమైన్లో తమ డేటా లీకేజీకి టెలికం ఆపరేటర్లు కారణమని 65 శాతం మంది భావిస్తుంటే, 63 శాతం మంది ఈ–కామర్స్ యాప్‌లు లేదా సైట్లు, 56 శాతం మంది బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ సంస్థలు కారణమై ఉంటాయని చెప్పారు.స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది ఇందుకు కారణమని 50 మంది అనుకుంటున్నారు. 48 శాతం మంది పేమెంట్ యాప్‌ల ద్వారా తమ వ్యక్తిగత వివరాలు లీక్ అయి ఉంటాయని చెప్పగా.. 26 శాతం మంది విద్యా సంస్థలు, 37 శాతం మంది వ్యాపార సంస్థల పాత్ర ఇందులో ఉండొచ్చని భావిస్తున్నారు. -
5జీ కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్: జియోకు పోటీ!?
భారతదేశంలో జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడానికి, యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) సిద్ధమైంది.దేశంలో నాల్గవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్.. 'బీఎస్ఎన్ఎల్' దేశవ్యాప్తంగా మెరుగైన సేవలను అందించడానికి తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే 65,000 4జీ సైట్లను ఏర్పాటు చేసింది. ఇటీవల కేరళలో కూడా 5,000 కొత్త సైట్లను జోడించింది. కంపెనీ దేశం అంతటా మొత్తం ఒక లక్ష 4G సైట్లను చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.బీఎస్ఎన్ఎల్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన 4G టారిఫ్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. అయితే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కంపెనీ వివిధ ప్రాంతాలలో కొత్త సైట్ ఇన్స్టాలేషన్లను చురుకుగా ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఒక లక్ష 4జీ సైట్ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత.. 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయడానికి.. 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) సహకరిస్తోంది. కంపెనీ తన ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలను సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా 5జీగా మార్చాలని యోచిస్తోంది. ఎయిర్టెల్ మాదిరిగానే కంపెనీ భారతదేశం అంతటా 5జీ నాన్ స్టాండలోన్ (NSA) టెక్నాలజీని కూడా విడుదల చేయడానికి యోచిస్తోంది.ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోందిబీఎస్ఎన్ఎల్ 5జీ స్టాండలోన్ (SA) టెక్నాలజీని పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 5G SA టెస్టింగ్ జరుగుతోంది. ఇవన్నీ సవ్యంగా జరిగితే.. ఇంటర్నెట్ సేవలు మరింత చౌకగా లభిస్తాయి. ఇదే జరిగితే జియో, ఎయిర్టెల్ యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా వినియోగదారులకు వేగవంతమైన కనెక్టివిటీని తీసుకురావడానికి కృషి చేస్తోంది. -
రూ.4.09 లక్షల కోట్లు: అప్పుల్లో టెలికాం కంపెనీలు
2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని లోక్‌సభలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు.ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు.. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే తక్కువని తెలుస్తోంది. మార్చి 31 నాటికి వొడాఫోన్ ఐడియా రూ.2.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.1.25 లక్షల కోట్లు, జియో రూ.52,740 కోట్ల రుణాలుగా తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు రూ. 40,400 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీతో సంస్థ లోన్ రూ. 28,092 కోట్లకు తగ్గిందని పెమ్మసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. -
నెట్వర్క్ సమస్యకు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశాలు
ఏ సిమ్ కార్డు తీసుకున్నా.. దేశంలోని ఏదో ఒక మూల తప్పకుండా నెట్వర్క్ సమస్య అనేది తెలెత్తుతుంది. దీనిని నివారించడానికి టెలికాం కంపెనీలకు 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది.టెలికాం సంస్థలు తమ వెబ్సైట్లలో తప్పకుండా.. జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను చూపించాలని ట్రాయ్ ఆదేశించింది. అంటే తమ నెట్వర్క్ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందనేది ఈ మ్యాప్ ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి యూజర్ ఏ సిమ్ కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకుంటాడు. దీని వల్ల యూజర్లు నెట్వర్క్ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలకు సంబంధించిన 2జీ, 3జీ, 4జీ, 5జీ సర్వీసులు కూడా వెబ్సైట్లలో వెల్లడించాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏ సర్వీస్ ఎంచుకోవాలి.. తాను ఏ సర్వీస్ పరిధిలో ఉన్నాడు, అంతరాయం లేకుండా మొబైల్ ఉపయోగించడానికి ఉత్తమమైన నెట్వర్క్ ఏది అనే అన్ని వివరాలను సిమ్ కొనుగోలు చేయడానికి ముందే తెలుసుకోవచ్చు.ట్రాయ్ ఆదేశించిన ఈ కొత్త మార్గదర్శకాలు యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెరుగైన నెట్వర్క్ కవరేజీని అందించే ప్రొవైడర్లను వినియోగదారుడు ముందుగానే ఎంచుకోవచ్చు. నెట్వర్క్ సమస్యల వల్ల కస్టమర్ అసంతృప్తిని తగ్గించవచ్చు. టెలికాం కంపెనీలు ఈ మ్యాప్‌లను ప్రచురించే ఫార్మాట్.. ఇన్పుట్ వంటి వాటిని సమర్పించడానికి కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం. -
సిగ్నెల్ రాకుంటే యూజర్లకు పరిహారం!.. ట్రాయ్ కొత్త రూల్స్
టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రకటించింది. టెలికామ్ సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి, నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపైన క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తరువాత కొత్త రూల్స్ జారీ చేయడం జరిగిందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ఈవెంట్లో.. ట్రాయ్ చైర్మన్ 'అనిల్ కుమార్ లాహోటి' తెలిపారు.ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. సిగ్నెల్స్ రాకుంటే యూజర్లకు పరిహారం చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని అథారిటీ వెల్లడించింది. దీనికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. కొత్త అప్‌గ్రేడ్స్ ద్వారా వినియోగదారులకు సరైన క్వాలిటీ సర్వీస్ లభిస్తుంది. నిబంధలనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని అనిల్ కుమార్ లాహోటి పేర్కొన్నారు.ట్రాయ్ జారీ చేసిన కొత్త క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం, జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం సర్వీస్ ఆగిపోయినప్పుడు టెలికామ్ ఆపరేటర్లు చందాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తాన్ని రూ. 50వేలు నుంచి రూ.1 లక్షకు పెంచారు.ఇదీ చదవండి: పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీగ్రేడెడ్ పెనాల్టీ విధానం ఆధారంగా జరిమానా రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా విభజించారు. ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ యాక్సెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్‌పై టెలికామ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. -
దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రముఖ టెలికం నెట్వర్క్ జియోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూజర్లు వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, స్నాప్‌చాట్, యూట్యూబ్, గూగుల్‌ను వినియోగించుకోలేక పోతున్నామంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ మేరకు..మొబైల్ ఇంటర్నెట్లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు, 38 శాతం జియో ఫైబర్, 7 శాతం మొబైల్ నెట్‌వర్క్‌లో సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం.మరోవైపు యూజర్లకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ జియో కస్టమర్ కేర్ విభాగం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు జియో సంస్థ తీరుకు నిరసనగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. -
పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్‌స్కైబర్లు
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సబ్‌స్కైబర్లతో దూసుకుపోతుంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు. జనవరిలో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌కు 1.18 లక్షల మంది చేరారు. వోడాఐడియా 44,649 మంది, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి. జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియోలో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్‌టెల్‌లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లను కోల్పోయాయి. ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది. -
ట్రాయ్ చైర్మన్‌గా అనిల్ లాహోటీకి బాధ్యతలు
న్యూఢిల్లీ: టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్‌గా అనిల్ లాహోటీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాల్ సర్వీసుల నాణ్యత పెంచడం, కాల్ డ్రాప్‌ల నియంత్రణ, అన్ని సంస్థలకు సమాన స్థాయిలో అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్, ఇతర ట్రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. పీడీ వాఘేలా పదవీ కాలం ముగిసిన తర్వాత గత నాలుగేళ్లుగా ట్రాయ్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్‌గా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అయిన లాహోటీ పేరును సోమవారం ప్రకటించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఇంజినీర్స్ 1984 బ్యాచ్‌కి చెందిన ఆయన రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా 2023 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. -
రూ.4000 కోట్ల పెట్టుబడికి సిద్దమైన అంబానీ.. పెద్ద ప్లానే ఇది!
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఎప్పటికప్పుడు తన వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన జియో సేవలను పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అధికారులు ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీలంక టెలికాం పిఎల్‌సిలో వాటాను రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. శ్రీలంక టెలికాం పీఎల్‌సీలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న మొదటి మూడు కంపెనీలలో అంబానీ జియో ప్లాట్‌ఫామ్ కూడా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవలే పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పీఎల్సీ మార్కెట్ విలువ రూ.4000 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. శ్రీలంక టెలికాం పీఎల్సీ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీల జాబితాలో జియో మాత్రమే కాకుండా.. గోర్ట్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, పెట్టిగో కమర్సియో ఇంటర్నేషనల్ ఎల్డిఎ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ ఎవరి హస్తగతం అవుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. ఇండియాలో జియో ప్లాట్‌ఫారమ్ భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించిన జియో 2023 అక్టోబర్ నాటికి 31.59 లక్షల వినియోగదారులను కలిగి ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలిసింది. ఈ సంఖ్య దాని ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ కంటే కూడా ఎక్కువని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: భయాన్ని ఎదుర్కోండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా గత వారం గాంధీనగర్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పెట్టుబడి ప్రకటనల తర్వాత రిలయన్స్ అండ్ జియో షేర్లు స్టాక్ మార్కెట్లో భారీ లాభాలను పొందాయి. షేర్లలో పెరుగుదల ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని తిరిగి పొందేందుకు దారితీసింది. దీంతో మళ్ళీ భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా ముకేశ్ అంబానీ నిలిచారు. -
1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..
ముంబై: టెలికం రంగంలో మానవ వనరుల కొరత తగ్గించాలన్న లక్ష్యంతో టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (టీఎస్ఎస్సీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల మంది అభ్యర్థులకు టెలికం, సంబంధిత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో శిక్షణ, ఉద్యోగావకాశాలను కల్పించాలని యోచిస్తోంది. సాంకేతిక రంగం ముఖ్యంగా 5జీ ప్రారంభంతో టెలికం పరిశ్రమలో నిపుణులు, నైపుణ్యం లేని, తిరిగి నైపుణ్యం కలిగిన వారికి అధిక డిమాండ్‌ని కలిగి ఉంది. టెలికంలో పెరుగుతున్న ఈ డిమాండ్‌ను మనం చూస్తున్నందున ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు డిజిటల్, కీలక టెలికం, సాంకేతిక నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీఎస్ఎస్సీ సీఈవో అరవింద్ బాలి తెలిపారు. భారత్‌లో మూడవ అతిపెద్ద పరిశ్రమ అయిన టెలికం రంగం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహంలో దాదాపు 6.5 శాతం వాటా కలిగి ఉంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 5జీ చందాదార్లలో భారత్ 11 శాతం వాటా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నట్లు బాలి చెప్పారు. టెలికం రంగంలో నియామకాలను సులభతరం చేయడానికి ఉద్ధేశించిన టెక్కోజాబ్స్ వేదికగా 2.5 లక్షల మంది అభ్యర్థులు, 2,300 కంపెనీలు నమోదు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
దేశంలో కొత్త సిమ్ కార్డ్ రూల్స్!, నిబంధనలు అతిక్రమిస్తే 3ఏళ్ల జైలు శిక్ష
దేశంలో పెరిగే పోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డ్ పొందేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని అంగీకరిస్తూ ప్రవేశ పెట్టిన టెలికమ్యూనికేషన్ బిల్-2023ను రాజ్యసభ, లోక్ సభ సభ్యులు ఆమోదించారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయాల్సి ఉంటుంది. ఆమోద ముద్ర అనంతరం కొత్త సిమ్ కార్డ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మూడేళ్ల జైలు శిక్ష టెలికమ్యూనికేషన్ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత నకిలీ సిమ్ కార్డ్ తీసుకున్న వినియోగదారుల్ని కఠినంగా శిక్షలు విధించే అవకాశం ఉంది. మూడేళ్లు జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కేవైసీ జనవరి 1,2024 నుంచి సిమ్ కార్డ్‌ను ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారులు కేవైసీ వివరాల్ని అందించాలి. ఇక సిమ్ కార్డ్‌ను అమ్మే డిస్ట్రిబ్యూషన్ సంస్థలు వెరిఫికేషన్ తప్పని సరి. పెద్ద సంఖ్యలో సిమ్‌కార్డ్‌లు అమ్మడాన్ని కేంద్రం నిషేధం విధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. బయోమెట్రిక్ తప్పని సరి సాధారణంగా మనం ఆధార్ కార్డ్‌ను తీసుకునేందుకు ఎలా బయోమెట్రిక్ (వేలి ముద్రలు) ఇస్తామో, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అమలయ్యే సిమ్ కార్డ్ నిబంధనల్లో భాగంగా ఎవరైతే సిమ్ కార్డ్ కొనుగోలు చేస్తారో వారు తప్పని సరిగా బయోమెట్రిక్ విధానాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ విధానంలో సైబర్ నేరస్తులు ఎక్కువ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే వీలుండదు. ఆమోదం తప్పని సరి ఇకపై టెలికం ఫ్రాంచైజీ తీసుకున్నవారు, లేదంటే సిమ్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్స్, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలి. లేదని నిబంధనల్ని అతిక్రమిస్తే రూ.10 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఎట్టకేలకు .. ఎలాన్ మస్క్ నిరీక్షణ ఫలించింది?
శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ వంటి ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందించాలన్న స్టార్ లింక్ అధినేత ఎలాన్ మస్క్ నిరీక్షణ ఫలించింది. డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ వంటి అంశాల్లో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానంతో కేంద్రం సంతృప్తి చెందింది. త్వరలో స్టార్‌లింక్ సేవలందించేలా అనుమతి ఇవ్వనుందని సమాచారం. గతంలో స్టార్‌లింక్ సేవల్ని అందించాలని భావించిన మస్క్ కేంద్ర అనుమతి కోరారు. ఆ సమయంలో తమ సంస్థ డేటా బదిలీ, స్టోరేజీ పరంగా అంతర్జాతీయంగా ఉన్న చట్టాలను అనుసరిస్తామని చెప్పారు. అయితే దీనిని భారత్ వ్యతిరేకించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టంచేసింది. దీంతో చేసేది స్టార్ లింక్ సేవల కోసం మరోసారి ధరఖాస్తు చేసుకుంది. తాజాగా, స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి వ్యక్తంచేసింది. భద్రతతో పాటు పలు అంశాలను పరిశీలించిన తర్వాతే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (జిఎమ్పీసీఎస్) లైసెన్స్ ఇవ్వనుందని కేంద్ర అధికారులు తెలిపారు. జియో, ఎయిర్‌టెల్‌కి పోటీగా రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్‌కి చెందిన వన్‌వెబ్ ఇప్పటికే దేశంలో జీఎంపీపీసీఎస్ లైసెన్స్‌ను పొందాయి. స్టార్ లింక్ ఆమోదం పొందితే.. ఈ లైసెన్స్‌ని పొందిన మూడవ శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్) కంపెనీగా అవతరించనుంది. స్టార్‌లింక్‌కు జీఎంపీడీఎస్ లైసెన్స్‌పై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశం షెడ్యూల్ జరిగినట్లు సమాచారం. త్వరలో అందుబాటులోకి లైసెన్స్ కోసం ప్రభుత్వ అనుమతితో పాటు, శాట్‌కామ్ ప్లేయర్లు స్పేస్ రెగ్యులేటర్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPAce) నుండి కూడా అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ అనుమతులు లభిస్తే వెంటనే భారత్‌లో స్టార్ లింక్ అందుబాటులోకి వస్తాయి. -
‘నో జీ టూ 5జీ’ : టెలికాం రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎలా లైన్లు కట్టేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు. కానీ పాత తరాలకు ఇవి అనుభవమే. అలా ‘నో జీ నుంచి 5 జీ’ వరకు దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. నోజీ నుంచి 2జీ, 3జీ, 4జీ, 5జీ వరకు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ముబైల్ విప్లవంలో సంభవించిన మార్పులు గురించి తెలుసుకునే ముందు సాక్షి పాఠకులకు 76వ స్వంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర భారతదేశంలో టెలిఫోన్ అనేది ఓ విలాసవంతమైన సౌకర్యం. 90లకు ముందు కొత్త ఫోన్ కనెక్షన్ కోసం దరఖాస్తుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలే పట్టేది. మరణ వార్తను ఎక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటే రోజుల సమయం పట్టేది. దీంతో కడ చూపు చూసుకోకుండా పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు అనేకం. అలా బరువెక్కిన హృదయ విదారకరమైన సంఘటనల నుంచి తేరుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులలో భాగమయ్యాయి. అందుకు 1991 నుండి టెలికాం రంగంలో జరిగిన మార్పులేనని చెప్పుకోవాలి. అప్పట్లో 1000 మందికి ఆరు ఫోన్లు మాత్రమే ఉండేవి. 2015లో 1 బిలియన్ ఫోన్ల మార్కును దాటింది. 24 సంవత్సరాల వ్యవధిలో ఏప్రిల్ 2022 నాటికి 1.14 బిలియన్ కనెక్షన్లను సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్‌లో కేవలం 80,000 టెలిఫోన్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ట్రంక్ బుకింగ్ 1990లకు ముందు, వైర్‌లైన్ కనెక్టివిటీ చాలా తక్కువ. సర్కిల్‌లలో స్థానికులతో మాట్లాడే వీలుంది. వేరే ప్రాంతానికి కాల్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే ఆపరేటర్‌కు కాల్ చేయాలి. వాస్తవానికి, ఇది 1970, 1980లలో ఒక సాధారణ జాబ్. ఆపరేటర్ కాల్ చేసి సాధారణ కాల్ (సాధారణ పల్స్ రేటు), అవసరమైన కాల్ (2x పల్స్ రేటు), అత్యవసర కాల్ (8x పల్స్ రేటు) మాట్లాడాలని కోరేవారు. మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో..వారికి కాల్ కలిసేందుకు రోజంతా పట్టేది. అయితే అవసరమైన కాల్ సాధారణంగా నాలుగు గంటలలోపు, అత్యవసర కాల్ గంటలోపు కనెక్ట్ అయ్యేది. ఆపరేటర్ కాల్‌ను మాన్యువల్‌గా కలిపేవారు. వారి సంభాషణల్ని వినే అవకాశం ఉండేది. సబ్‌స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD) 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో, టెలికాం కనెక్టివిటీ మెరుగైంది. ట్రంక్ బుకింగ్ ఆపరేటర్ వ్యవస్థ కనుమరుగైంది. సాంకేతిక విస్తృతంగా వ్యాపించింది. సిటీ కోడ్ (STD కోడ్) , ఫోన్ నంబర్‌ను డయల్ చేసి ఆపరేటర్‌తో పని లేకుండా వెంటనే కనెక్ట్ అయ్యేది. కాల్ రేట్లు రాత్రి 10 గంటల తర్వాత చేసే కాల్లకు 1/4 వ వంతు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. సూదూర ప్రాంతాలకు ఫోన్ చేసేందుకు దేశవ్యాప్తంగా STD/ISD/PCO బూత్‌లను ఏర్పాటు చేయడంతో STD కాల్లు చాలా మందికి కొత్త వ్యాపారం అవకాశంగా మారాయి. అయితే, మెరుగైన కనెక్టివిటీ రావడంతో, దాదాపు 2010ల వరకు STD కాల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అవి దూరాన్ని బట్టి దేశంలో ఎక్కడికైనా కాల్ చేయాలంటే ఒకే ధరను చెల్లించాలని వెసలు బాటు ఉంది. అలాగే, గత దశాబ్దం ప్రారంభంలో, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP),చౌకైన సెల్‌ఫోన్ టారిఫ్‌లు STD/ISD/PCOల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించే వారు. ఇంటర్నెట్ 1986 నుండి భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ గుర్తింపు, ఎంపిక చేసిన కొన్ని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. 1995 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే వీఎస్ఎన్ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు ఇంటర్నెట్‌ని అందించింది. 1995లో ఇంటర్నెట్ కనెక్షన్‌కు విద్యార్థి అకౌంట్‌కు సంవత్సరానికి రూ. 5,000, టీసీపీఐపీ Transmission Control Protocol/Internet Protocol అకౌంట్ కోసం రూ. 15,000 ఖర్చవుతుంది. 133 కేబీబీఎస్ డయల్-అప్ మోడెమ్‌లు ప్రమాణంగా ఉండటంతో నేటితో పోలిస్తే వేగం చాలా నెమ్మదిగా ఉంది. సాధారణ 1ఎంబీ ఫోటోను డౌన్లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం అదే ఇంటర్నెట్ సాయంతో వాయిస్, వీడియో ,డేటా కాల్‌లను సజావుగా చేసుకోగలుగుతున్నాం. పేజింగ్ సేవలు 1990వ దశకం మధ్యలో ఫోన్లను ఎలాగైతే వినియోగించే వారో పేజింగ్ పరికరాలు (లేదా వన్-వే కమ్యూనికేషన్ పరికరాలు) అలా వినియోగించే వారు. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఈ పేజర్లతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. మనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ఎలా అయితే కాల్ చేస్తున్నామో అప్పుడు పేజర్లతో కాల్ చేసే వెసలుబాటు ఉంది. మొబైల్ ఫోన్ విప్లవం 1995లో అప్పటి ప్రభుత్వాలు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాయి. దేశంలో 20 టెలికాం సర్కిల్‌లుగా విభజిస్తే అందులో ఒక్కో సర్కిల్‌కు ఇద్దరు ఆపరేటర్లు 15 ఏళ్ల లైసెన్స్ పొందేవారు. అయితే, ప్రారంభంలో సెల్‌ఫోన్ టారిఫ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమింగ్ కాల్స్‌కి కూడా నిమిషానికి రూ. 16.80కి చెల్లించేవారు. 2000 సవంత్సరం ప్రారంభంలో మాత్రమే సీపీపీ (కాలింగ్ పార్టీ పేస్) ద్వారా ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవడం ప్రారంభమైంది. ది జనరేషన్స్ భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుకలోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. 2000వ దశకం ప్రారంభంలో WAP (వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్) ద్వారా ఫోన్ లేదా, సాధారణ టెక్స్ట్ ద్వారా ఇమెయిల్‌ను యాక్సెస్ చేయవచ్చు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లలో పూర్తి బ్రౌజర్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2జీ, 3జీ, 4జీ ఇలా లేటెస్ట్ సెల్యులార్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సెల్యులార్ కాలింగ్ ఛార్జీలు ఉన్న దేశంగా కొనసాగుతుంది. భవిష్యత్‌లో మానవ శ్రేయస్సుతో టెలికాం రంగం మరింత అభివృద్ది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఇదీ చదవండి : స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది! -
అదిరే ఫీచర్లతో జియో కొత్త ల్యాప్ టాప్..ధర ఇంత తక్కువా!
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే జులై 31న జియోబుక్ పేరుతో ల్యాప్ టాప్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. జియో తొలిసారి 2022 అక్టోబర్‌లో తొలి జియో బుక్ ల్యాప్ టాప్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ల్యాప్‌ట్యాప్ బరువు 990 గ్రాములు ఉండగా.. త్వరలో విడుదల చేయనున్న జియో బుక్ బరువు 1.2 కేజీలు ఉండడం గమనార్హం. పలు నివేదికల ప్రకారం.. కొత్త జియో బుక్ ల్యాప్ టాప్ ఆక్టోబర్ ప్రాసెరస్తో పనిచేయనుంది. 4జీ కనెక్టివిటీతో బ్యాటరీ లైమ్ టైమ్ 24 గంటలు పనిచేయనుంది. జియోఓస్తో పనిచేసే ఈ బడ్జెట్ ల్యాప్ టాప్‌లో జియోమార్ట్, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి యాప్స్ ప్రీలోడ్‌తో రానున్నాయి. ఇక కల్సర్ విషయానికొస్తే జియోబుక్ బ్లూ, గ్రే రెండు కలర్లలో లభ్యం కానుంది. దీని ధర రూ.20,000గా ఉంది. గత ఏడాది విడుదల చేసిన జియోబుక్ ఫస్ట్ జనరేషన్ ల్యాప్ టాప్ ధర రూ.15,777గా ఉంది. -
అదరగొట్టిన రిలయన్స్ జియో
Reliance Jio net profit grew 12 percent: బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అదరగొట్టింది.నికర లాభాల్లో 12.2శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాదు చందాదారులకు సంబంధించి దేశీయంగా ఇప్పటికే టాప్ లో ఉన్న జియో ప్రస్తుత చందాదారులు కూడా భారీగా పెరిగారు. ( 22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేలమందికి ఉపాధి) శుక్రవారం ప్రకటించిన క్యూ1 (ఏప్రిల్-జూన్) ఫలితాలలో జియో నికర లాభం రూ. 4,863 కోట్లకు పెరిగింది. ఇది ఏడాది క్రితం రూ. 4,335 కోట్లుగా ఉంది. జియో ఆదాయం 9.9శాతం పెరిగి రూ.24,042 కోట్లకు చేరుకుంది. గత ఏడాది క్రితం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన ఆదాయం, EBITDA, నికర లాభంలో 3శాతం పెరుగుదదల సాధించామని జియో ట నివేదించింది. కొత్తగా 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లు భారతీయ టెలికాం మార్కెట్‌పై రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023, ఏప్రిల్ తాజా టెలికాం డేటా ప్రకారం, కంపెనీ 37.9 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఏప్రిల్ 2023లో, రిలయన్స్ జియో 30.4 లక్షల మంది సబ్స్క్రైబర్లను సాధించింది. కాగా జియో ఇటీవల Jio Bharat ఫోన్లను రూ. 999కి ప్రారంభించింది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్లు , 14 GB డేటా కోసం చౌకైన రూ. 123 నెలవారీ ప్లాన్‌ను కూడా జోడించింది. '2G ముక్త్ భారత్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్లో ఫీచర్ ఫోన్లతో ఇంకా 2 జీలో ఉన్న 250 మిలియన్ల మొబైల్ సబ్స్క్రైబర్లను కొత్త టెక్నాలజీకి మార్చడమే లక్ష్యమని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత ఇంటర్నెట్ నుండి 5జీ డేటా యాక్సెస్, ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్ల వరకు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అయితే, తాజాగా ఎయిర్టెల్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించేలా కొత్త రీఛార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. మీ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లోనే మీకు కావాల్సినట్లుగా ఎయిర్టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు 15 రకాల ఇతర ఓటీటీ ఛానెల్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్టెల్ ప్లాన్లు ఇలా ఉన్నాయి. రూ. 359 ప్లాన్: ఈ ప్లాన్‌తో ఎయిర్టెల్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు. నెలరోజుల పాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు అపోలో 24/7, హలెట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే వంటి అనేక అదనపు ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సోనీ లీవ్,ఏరోస్ నౌ, లైన్స్ గేట్ప్లేతో పాటు 15 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వీక్షించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు 5జీ ఇంటర్నెట్ డేటాను వినియోగించుకోవచ్చు. రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 3జీబీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలు పొందవచ్చు. 15+ ఓటీటీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేకి ఉచిత యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 499 ప్లాన్: 5జీ ప్రయోజనాలతో రూ. 399 ప్లాన్‌తో పోలిస్తే ఎయిర్టెల్ ఈ ప్లాన్‌కు దాదాపు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. రూ. 699 ప్లాన్: మీరు ఒక నెల కంటే ఎక్కువ వ్యాలిడీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీ కోసమే. 56 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ డేటా 3జీబీ, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను సెండ్ చేసుకోవచ్చు. చదవండి👉 కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే? -
ఇబ్బంది పెట్టే కాల్స్‌కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్‌లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్‌మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్‌ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
వొడాఫోన్ ఐడియాకి భారీ షాక్!
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీ షాక్ తగిలింది. ఫిబ్రవరి నెలలో వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది వినియోగదారులను చేజార్చుకున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలను రిలీజ్ చేసింది. అదే నెలలో జియోలోకి 10 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 9,82,554 మంది చేరినట్లు తెలిపింది. ఇక సబ్స్క్రైబర్ల పరంగా జియో 37.41శాతం వాటా కలిగి ఉండగా ఎయిర్ 32.39శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. 10లక్షల మంది కస్టమర్లను కోల్పోయినప్పటికీ వొడాఫోన్ ఐడియాకు మార్కెట్లో 20శాతం ఉంది. కాగా, టెలికాం విభాగంలో వొడాఫోన్ ఐడియా వెనకంజలో ఉండటమే కారణమని సమాచారం. ముఖ్యంగా ఆ సంస్థను అప్పులు బిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ కంపెనీకి రూ.2.2లక్షల కోట్ల వరకు అప్పులు ఉండగా, ఏజీఆర్ బకాయిల కింద దాదాపు రూ.16వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకుంది. టెలికాం నెట్ వర్క్‌లైన జియో, ఎయిర్టెల్ 5జీ సేవల్ని అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియాలు మాత్రం లేటెస్ట్ నెట్‌వర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెరసీ యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కేంద్రం శుభవార్త, త్వరలో..
న్యూఢిల్లీ: 4జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ (బీఎస్ఎన్ఎల్) ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. పూర్తి దేశీ సాంకేతికతను ఉపయోగించాలని నిర్దేశించుకున్నందున ఇందుకు కాస్త సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ సంతృప్తికర స్థాయిలోనే జరుగుతోందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం 800 పైగా జిల్లాల్లో 5జీ సర్వీసులు ఉన్నాయని, ఇతరత్రా ఏ దేశంలోనూ ఇంత వేగంగా సేవల విస్తరణ జరగలేదని ఆయన పేర్కొన్నారు. లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి ఇండియా పోస్ట్, సీఏఐటీ, తృప్తా టెక్నాలజీస్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌహాన్ ఈ విషయాలు చెప్పారు. ఇండియా పోస్ట్‌కి ఉన్న విస్తృత నెట్వర్క్ సాయంతో చిన్న వ్యాపారాలకు డెలివరీ సేవలను అందించేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని వివరించారు. లాజిస్టిక్స్ సర్వీసుల ను అందించేందుకు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో కూడా చేతులు కలపాలని ఇండియా పోస్ట్ యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
కేంద్రం కొత్త రూల్స్.. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లకు భారీ ఊరట లభించినట్లైంది. ట్రాయ్ ప్రకటనతో ఫోన్ వినియోగదారులు ఫేక్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్, మెసేజ్‌ల బెడద తప్పనుంది. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు ఇక స్పామ్ కాల్స్ బెడద నుంచి యూజర్లను రక్షించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ టెల్, జియో, వివో వంటి సంస్థలు తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దీని ద్వారా, ఫోన్లలోని ప్రమోషనల్ కాల్స్ ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి బయటపడొచ్చు. ట్రాయ్ ఆదేశాలు.. ఎయిర్టెల్ , జియో అప్రమత్తం ఈ తరుణంలో ట్రాయ్ ఆదేశాలపై జియో, ఎయిర్టెల్ స్పందించాయి. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తమ నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్ ఆప్షన్‌ను ఏనేబుల్ చేస్తామని తెలిపాయి. ఇక,ఈ ఆప్షన్ మే 1 నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల్ ఐడీ ఉపయోగం ఏంటంటే? టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవగాహనా రాహిత్యం వల్ల స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వల్ల అనార్ధాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ గత కొంతకాలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరస్తులు ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్లతో అమాయకుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై దృష్టి సారించిన ట్రాయ్.. టెలికాం కంపెనీలకు కాల్ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కాల్ ఐడీ ఆప్షన్‌తో మనకు ఫోన్ చేసే వారి పేర్లు, ఫోటోలు మొబైల్ ఫోన్లపై డిస్ప్లే కానున్నాయి. ఇలా చేయడం వల్ల మనకు ఫోన్ చేసేది ఎవరనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడొచ్చని రెగ్యులేటరీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ససేమీరా అంటున్న టెలికాం కంపెనీలు కానీ, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే కాల్స్, ఎస్ఎంఎస్లను అరికట్టడానికి ఏఐ ఫిల్టర్ మాత్రమే మే 1 నుండి అమల్లోకి రానుందనేది వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే? -
శుభవార్త..దేశంలో జియో ఎయిర్‌ఫైబర్ సేవలు..ఎలా పనిచేస్తుందంటే?
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో జియో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఎయిర్‌ఫైబర్ గురించి 2022లో జరిగిన 45వ రిలయన్స్ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం) లో దీనిపై ప్రకటన చేసింది. కానీ విడుదల, ధర ఇతర విషయాల్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ప్రెసిడెంట్ కిరణ్ థామస్ జియో ఫైబర్ లాంఛింగ్‌పై స్పందించారు. మరికొద్ది నెలల్లో ఎయిర్‌ఫైబర్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఫిక్స్డ్ లైన్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందించే ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్,యాక్ట్ వంటి సంస్థలకు జియో గట్టిపోటీ ఇవ్వనుంది. జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్‌స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్‌ఫైబర్ డివైజ్‌ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్‌లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. జియో ఏం చెబుతోంది! సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు, మోడెమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్‌ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్‌ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్‌తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్‌సైట్స్‌ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్సైట్లను, యాప్స్‌ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్‌వర్క్‌తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది. Shri Akash M. Ambani introduces JioAirFiber, at the Reliance AGM 2022.#JioAirFiber #RILAGM #RILAGM2022 #JioTrue5G #WeCare #JioTogether #Jio #Jio5G #5G pic.twitter.com/tCmSatpUte — Reliance Jio (@reliancejio) August 30, 2022 జియో ఎయిర్‌ఫైబర్ ధర ఎంతంటే? జియో 2022 అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. జియో అధికారికంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ రూ.799 బ్లాక్ పేరుతో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సర్వీసులు పొందే ఈ ఒక్క ప్లాన్ కింద డీటీహెచ్‌తో పాటు ఫైబర్, మొబైల్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఎయిర్టెల్ బ్లాక్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్టెల్ బ్లాక్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో మొత్తం 3 కనెక్షన్లు పొందవచ్చు. అందులో 2 పోస్ట్ పెయిడ్ కనెక్షన్, మరోకటి డీటీహెచ్ కనెక్షన్. బేస్ రూ. 799 ప్లాన్ పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణ ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లాగానే 105 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. అదనంగా, ఎయిర్టెల్ బ్లాక్ రూ. 799 ప్లాన్ వినియోగదారులకు రూ. 260 విలువైన టీవీ ఛానెళ్లు డీటీహెచ్ కనెక్షన్ కింద లభిస్తాయి. ఓటీటీ సర్వీసులు సైతం వీటితో పాటు ఎయిర్టెల్ బ్లాక్ రూ.799లో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియా,డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ సర్వీసుల్ని ఉపయోగించుకోవచ్చు. ఎయిర్టెల్ షాప్‌లో బై నౌ- పే లేటర్ ఎయిర్టెల్ బ్లాక్ రూ.799లో కస్టమర్లు వన్ బిల్ అండ్ వన్ కాల్ సెంటర్ సర్వీసులు, 60 సెకండ్లలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అందుబాటులోకి వస్తారు. అలాగే ఫ్రీ సర్వీసు విజిట్లు, ఎయిర్టెల్ షాప్‌లో బై నౌ- పే లేటర్ సదుపాయం వంటివి లభిస్తాయి. 5జీ సేవలు సైతం ఎయిర్ టెల్ బ్లాక్ కస్టమర్లు వీవోఎల్టీఈ (VoLTE),వోవైఫై (VoWiFi) సేవలతో పాటు, అన్లిమిటెడ్ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. తద్వారా ఈ ఏడాది జూన్ నాటి 4వేల టౌన్లలో 5జీ సేవల్ని అందించే లక్ష్యంగా పెట్టుకుంది. -
జియో యూజర్లకు గుడ్ న్యూస్! ఇకపై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. కస్టమర్లు ఒక నెలపాటు ఉచితంగా ట్రయల్ చేయవచ్చు. ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభం. అదనంగా మూడు సిమ్‌లను తీసుకోవచ్చు. ఒక్కొక్క సిమ్‌కు నెలకు రూ.99 చార్జీ చేస్తారు. అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. రూ.399 ప్యాక్‌లో నలుగురు సభ్యుల కుటుంబానికి మొత్తం చార్జీ రూ.696 ఉంటుంది. నలుగురు సభ్యులు ఒక నెలలో మొత్తం 75 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.699 ప్లాన్‌లో 100 జీబీ డేటా అందుకోవచ్చు. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోటీవీ, జియో సినిమాస్ యాప్స్‌ను ఆస్వాదించవచ్చు. ఇండివిడ్యువల్ ప్లాన్స్‌లో రూ.299 ప్యాక్‌కు 30 జీబీ, రూ.599 ప్యాక్ అయితే అపరిమిత డేటా ఆఫర్ చేస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్ ప్లాన్‌నుబట్టి రూ.375–875 ఉంది. జియోఫైబర్, కార్పొరేట్ ఉద్యోగులు, జియోయేతర పోస్ట్‌పెయిడ్ యూజర్స్, క్రెడిట్ కార్డ్ కస్టమర్లు, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి ఈ సెక్యూరిటీ డిపాజిట్ లేదు. -
బంపరాఫర్.. రూ.149కే 15 ఓటీటీ ప్లాట్పామ్స్ సబ్స్క్రిప్షన్!
దేశీయ టెలికాం సంస్థ ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌కే 15 రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను వీక్షించే అవకాశం కల్పించింది. ఎయిర్టెల్ ఇటీవల ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్‌లో మార్పులు చేసింది. మార్పులకు అనుగుణంగా యూజర్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వారికి నచ్చిన ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేయొచ్చని ఎయిర్టెల్ తెలిపింది. రూ.200 లోపే ఎయిర్టెల్ రూ.149తో 1జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా ఒకే యాప్‌లో 15 రకాల ఓటీటీలను వీక్షించవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ డేటా వోచర్‌తో పాటు ఎక్స్ట్రీమ్ యాప్‌లో ఇతర అన్నీ రకాల బెన్ఫిట్స్ పొందవచ్చు. ఒక్క స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు.. టీవీ, పీసీల్లోనూ యాప్‌కు యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇవే ఎక్స్ట్రీమ్ యాప్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్‌లో సోనీలివ్, లయన్స్‌గేట్‌ప్లే, హొయ్‌చొయ్, చౌపల్, కచ్చాలంకా, ఈరోస్‌నౌ, మనోరమామ్యాక్స్, హంగామా, డాక్యూబే వంటి ఓటీటీ కంటెంట్‌ను వీక్షించవచ్చు -
సర్వీసుల నాణ్యతను పెంచాలి.. టెలికం కంపెనీలకు ట్రాయ్ చీఫ్ సలహా
న్యూఢిల్లీ: సర్వీసుల నాణ్యతను, దేశవ్యాప్తంగా కనెక్టివిటీని మరింతగా మెరుగుపర్చాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చీఫ్ పి.డి. వాఘేలా టెలికం సంస్థలకు సూచించారు. అలాగే కాల్ అంతరాయాలు, సర్వీసుల నాణ్యతకు సంబంధించిన గణాంకాలను రాష్ట్రాల స్థాయిలో కూడా వెల్లడించాలని పేర్కొన్నారు. సర్వీసుల నాణ్యతను సమీక్షించేందుకు శుక్రవారం రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర టెల్కోలతో వాఘేలా సమావేశమయ్యారు. కాల్ డ్రాప్స్‌ను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆపరేటర్లకు ఆయన సూచించారు. సర్వీస్ నాణ్యతా ప్రమాణాలను మరింతగా కఠినతరం చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి సంప్రదింపుల ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు వాఘేలా తెలిపారు. కాల్ డ్రాప్ డేటాను రాష్ట్రాల స్థాయిలో కూడా సమీక్షించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎల్ఎస్ఏ (లైసెన్స్డ్ సర్వీస్ ఏరియా)వారీగా, సగటున మూడు నెలలకోసారి ఈ డేటాను సేకరిస్తున్నారు. -
80కి పైగా నగరాల్లో ఎయిర్టెల్ 5జీ.. మీ ప్రాంతంలో సర్వీస్ ఉందా?
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశం అంతటా 5జీ నెట్ వర్క్‌ను విడుదల చేస్తోంది. ఎయిర్టెల్ 5జీ ప్లస్‌గా పిలిచే ఈ నెట్‌వర్క్‌ను ఇటీవల ఈశాన్య భారత దేశంలోని ఏడు కొత్త నగరాలకు 5జీ నెట్ వర్క్ కనెక్టివిటీని ప్రారంభించింది. కోహిమా, ఇటా నగర్, ఐజ్వాల్, గ్యాంగ్ టక్, సిల్చార్, దిబ్రూగర్, టిన్సుకియా యూజర్లకు ఈ ఫాస్టెస్ట్ నెట్ వర్క్ సర్వీసుల్ని అందించింది. ఇంతకు ముందే గౌహతి, షిల్లాంగ్, ఇంఫాల్, అగర్తల, దిమాపూర్‌తో సహా ఈశాన్య భారత దేశంలో ఇతర నగరాల్లో ప్రారంభించింది. తాజాగా ఏడు నగరాల్లో 5జీ ప్లస్‌ను ప్రారంభించడంతో ఎయిర్ టెల్‌ను వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న నగరాల సంఖ్య 80కి చేరింది. ఈ నగరాల్లో నివసించే వారు 5జీ నెట్ వర్క్ వినియోగించేందుకు వీలుగా ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఐదవ తరం నెట్‌వర్క్‌ను ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చని ఎయిర్టెల్ హామీ ఇచ్చింది.ఈ సందర్భంగా ఎయిర్ టెల్ 5జీ ప్లస్ అందుబాటులోకి ఉన్న నగరాలను విడుదల చేసింది. వాటిల్లో అస్సాం- గౌహతి, టిన్సుకియా, దిబ్రూగర్, సిల్చార్, ఆంధ్రప్రదేశలో వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, బీహార్- పాట్నా, ముజఫర్ పూర్, బోద్ గయం, భాగల్ పూర్, బెగుసరాయ్, కతిహార్,కిషన్ గంజ్, పూర్నియా, గోపాల్ గంజ్,బార్హ్, బీహార్ షరీఫ్, బిహ్తా,నవాడా, సోనేపూర్, ఢిల్లీ, గూజరాత్- అహ్మదాబాద్, సూరత్, వడోదర,రాజ్‌కోట్ హర్యానా - గురుగ్రామ్, పానిపట్, ఫరీదాబాద్, అంబాలా, కర్నాల్, సోనిపట్, యమునానగర్, బహదూర్‌ఘర్ హిమాచల్ ప్రదేశ్- సిమ్లాలు ఉన్నాయి. ఇక జమ్మూ & కాశ్మీర్- జమ్మూ, శ్రీనగర్, సాంబా, కథువా, ఉధంపూర్, అఖ్నూర్, కుప్వారా, లఖన్‌పూర్, ఖౌర్ జార్ఖండ్- రాంచీ, జంషెడ్పూర్, కర్ణాటక - బెంగళూరు కేరళ- కొచ్చి, త్రివేండ్రం, కోజికోడ్, త్రిస్సూర్,మహారాష్ట్ర- ముంబై, నాగ్‌పూర్, పూణే, మధ్యప్రదేశ్- ఇండోర్, మణిపూర్- ఇంఫాల్, ఒడిశా- భువనేశ్వర్, కటక్, రూర్కెలా, పూరి, రాజస్థాన్- జైపూర్, కోటా, ఉదయపూర్, తమిళనాడు- చెన్నై, కోయంబత్తూరు, మధురై, హోసూర్, తిరుచ్చి, తెలంగాణ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిక్కిం- గ్యాంగ్‌టక్, మిజోరాం- ఐజ్వాల్, అరుణాచల్ ప్రదేశ్- ఇటానగర్, నాగాలాండ్- కోహిమా, ఛత్తీస్‌గఢ్- రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్, త్రిపుర-అగర్తలా,ఉత్తరాఖండ్- డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్- వారణాసి, లక్నో, ఆగ్రా, మీరట్, గోరఖ్‌పూర్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా, ఘజియాబాద్, పశ్చిమ బెంగాల్ - సిలిగురిలలో అందుబాటులో ఉంది. -
‘మీకో దణ్ణం! నాకు ఫోన్ చేయొద్దు’.. జెట్ ఎయిర్ వేస్ సీఈవో అసహనం!
9 ఏళ్ల నుంచి మీ నెట్ వర్క్ వినియోగిస్తున్నా. ఇక నుంచి వేరే నెట్ వర్క్‌కు మారుతున్నా. దయచేసి నాకు ఫోన్ చేయకండి అంటూ ప్రముఖ ఏవియేషన్ సంస్థ జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ ఓ టెలికం కంపెనీ కస్టమర్ కేర్ నిర్వాహకంపై అసహననానికి గురయ్యారు. అందుకు ఓ కారణాన్ని ప్రస్తావిస్తూ ట్విటర్ వేదికగా చివాట్లు పెట్టారు. జెట్ ఎయిర్ వేస్ సీఈవో సంజీవ్ కపూర్ 9 ఏళ్ల నుంచి దేశీయ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ నెట్ వర్క్ పనితీరు మందగించడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాజాగా సంజీవ్ కపూర్‌కు సైతం ఈ తరహా ఇబ్బంది తలెత్తింది. ఆదివారం నెట్ వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం, అదే సమయంలో కస్టమర్ కేర్ నుంచి వరుస కాల్స్ రావడంతో ఇరిటేట్ అయ్యారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ట్విటర్ వేదికగా సదరు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ఫోన్ చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేశారు. ప్రియమైన @ViCustomerCare: నెట్ వర్క్ మారవద్దని నన్ను ఒప్పించేందుకు పదే పదే కాల్స్ చేస్తున్నారు. అలా కాల్ చేయడం మానేయండి. నేను 9 సంవత్సరాల తర్వాత నెట్ వర్క్ ఎందుకు మారుతున్నానో మీకు చెప్పాను. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కవరేజీ తక్కువగా. కొందరికి రోమింగ్ కాల్స్ చేసుకోవడంలో ఇబ్బందికి గురవుతున్నారు. అంతే. ధన్యవాదాలు’అని ట్వీట్లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు వీఐ కస్టమర్ కేర్ విభాగం స్పందించింది. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం అని రిప్లయి ఇచ్చింది. ఆ ట్వీట్‌కు సంజీవ్ రిప్లయి ఇచ్చారు. @ViCustomerCare దయచేసి నన్ను సంప్రదించేందుకు ప్రయత్నించకండి. నిన్నటి నుండి నాకు డజను కాల్స్ వచ్చాయి. ఫోన్ చేయడం ఆపండి, అంతే! అని అన్నారు. అయినా సరే వీఐ కస్టమర్ కేర్ విభాగం సంజీవ్ కపూర్‌కు మరోసారి ఫోన్ చేసి విసిగించింది. దీంతో ఏం చేయాలో పోక...మా నెట్ వర్క్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటూ ఫోన్ వచ్చింది. ఇది మంచి పద్దతి కాదు. ఫోన్ చేయడం ఎప్పుడు ఆపేస్తారో.. వీఐ యాజమాన్యం ఉన్నతాధికులు ట్విటర్లో ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తూ మరోసారి ట్వీట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. Dear @ViCustomerCare : please stop calling me repeatedly trying to convince me not to switch carriers. I have told you why I am switching after 9 years: 1. Poor coverage in some parts of India, and 2. Inferior international roaming plans for some countries. That's all. Thanks. — Sanjiv Kapoor (@TheSanjivKapoor) February 12, 2023 Hi Sanjiv! I can understand this has caused difficulties for you. I’ve made a note of your concern. Will get in touch with you shortly - Vandana https://t.co/fuKV0H8zIF — Vi Customer Care (@ViCustomerCare) February 12, 2023 -
ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరిగుతున్నకొద్దీ టెలికం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచే యోచనలో ఉండగా.. తాజాగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌ను భారీగా పెంచింది. కొద్దిరోజుల క్రితం ఎయిర్టెల్ సీఈవో సునిల్ మిట్టల్ మాట్లాడుతూ ప్రతి యూజర్‌పై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) నెలకు రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెలికాం కంపెనీలు ఏఆర్‌పీయూని నెలకు 300 రూపాయలకు పెంచినప్పటికీ, వినియోగదారులు తక్కువ ధరలోనే నెలకు 60జీబీ డేటాను వినియోగిస్తున్నందున ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తాజాగా అన్లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరను రూ.155కు చేర్చింది. అంతకు మునుపు అదే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.99గా ఉంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాక్ కాలపరిమితి 24 రోజులు.1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితం. రూ.99 రీచార్జ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఎయిర్టెల్ బాటలో మరికొన్ని కంపెనీలు పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం అర్ధం. ఇప్పుడు అదే ఆదాయం క్యూ2 నాటికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.190, రిలయన్స్ జియో సగటు ఆదాయం ఒక్కో వినియోగదారుకు రూ.177.2 అని చెబుతోంది. వొడాఫోన్-ఐడియా అత్యల్పంగా ఉంది. అదే త్రైమాసికంలో ఇది రూ. 131గా నివేదించబడింది. ఎయిర్‌టెల్‌తో పోల్చితే వీఐ, జియో ఏఆర్పీయూ రూ. 300కి చేరుకోవడం కొంచెం కష్టమే. ధరల పెంపు సాధారణంగా అదే శాతంలో ఉంటుంది కాబట్టి కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచితే ఎయిర్టెల్ ముందుగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగానే ఎయిర్టెల్ అన్లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
దేశంలో 5జీ టెక్నాలజీ.. కేంద్రం మరో కీలక నిర్ణయం!
గాంధీనగర్: దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ, 4జీ టెలికం సాంకేతికతలు, సాధనాలు (టెక్నాలజీ స్టాక్) ఈ ఏడాది భారత్‌లో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిని వచ్చే ఏడాది నుంచి ప్రపంచ దేశాలకు అందించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీ20 కార్యక్రమాల్లో భాగంగా వ్యాపార వర్గాలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన బిజినెస్ 20 (బీ20) ప్రారంభ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇందులో ప్రభుత్వ వర్గాలు, దిగ్గజ సంస్థల సీఈవోలు తదితరులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో కేవలం అయిదు దేశాల దగ్గర మాత్రమే 4జీ–5జీ టెలికం టెక్నాలజీ స్టాక్ ఉండగా, ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో భారత్ సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకుందని మంత్రి చెప్పారు. దీన్ని ఏకకాలంలో 1 కోటి కాల్స్‌పై ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు వివరిం చారు. దేశీ టెక్నాలజీతో 2023లో 50,000 –70,000 టవర్లు, సైట్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి వివరించారు. ఉత్పత్తి పెంపుపై యాపిల్ దృష్టి ..భారత్‌లో వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు మన దేశాన్ని తమకు కీలక కేంద్రంగా మార్చుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టెక్ దిగ్గజం యాపిల్ కూడా భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. సంస్థ విక్రయించే ఉత్పత్తుల్లో ప్రస్తుతం 5–7 శాతం భారత్‌లో తయారవుతుండగా దీన్ని 25 శాతం వరకు పెంచుకోవాలని యాపిల్ భావిస్తోన్నట్లు తెలుస్తోందని ఆయన వివరించారు. యాపిల్ ఇటీవల ప్రవేశపెట్టిన కొన్ని మోడల్స్ భారత్‌లోనే తయారైనవని మంత్రి చెప్పారు. ఎర్త్ మూవర్స్ మెషీన్ రంగానికి చెందిన ఒక విదేశీ కంపెనీ ప్రస్తుతం భారత్ నుంచి 110 దేశాలకు తమ ఉత్పత్తులను చౌకగా సరఫరా చేస్తోందని, ఇక్కడి నుంచే కొత్త ఉత్పత్తులను కూడా ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించడంలో, సామర్థ్యాలను పెంచుకోవడంలో, వ్యాపారాలకు ప్రయోజనాలు చేకూర్చడంలోనూ పీఎం గతిశక్తి కార్యక్రమం కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం(డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ చెప్పారు. అజెండా రూపకల్పనలో బీ20 కీలక పాత్ర..జీ–20 దేశాలు, అలాగే మిగతా ప్రపంచ దేశాలకు మరింత విలువ చేకూర్చే దిశగా అజెండాను రూపొందించడంలో బిజినెస్–20 కీలక పాత్ర పోషించగలదని బీ20 ఇండియా చెయిర్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. ఈ వేదికకు భారత్ అధ్యక్షత వహించే కాలంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, సృజనాత్మక నైపుణ్యాలు, డిజిటల్ పరివర్తన తదితర అంశాల్లో పురోగతికి పలు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, కర్బన ఉద్గారాలరహిత సుస్థిర భవిష్యత్ సాధన ప్రక్రియలో అందరినీ భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని ఐటీసీ సీఎండీ సంజీవ్ పురి అభిప్రాయపడ్డారు. జీ–20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో బీ20 ఇండియా సెక్రటేరియట్‌గా వ్యవహరించేం దుకు సీఐఐ గతేడాది డిసెంబర్ 1న ఎంపికైంది. సాధారణంగా బీ20 చెయిర్‌గా జీ20 ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాన్ని జీ20 నియమిస్తుంది. ఈసారి టాటా సన్స్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ ఆ బాధ్యతలు చేపట్టారు. -
తెలుగు రాష్ట్రాలకు జియో సంక్రాంతి కానుక.. మరిన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం ప్రారంభంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 5జీ సేవల్ని ప్రారంభించిన జియో.. తాజాగా మరో 16 నగరాల్లో యూజర్లు వినియోగించేలా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. జియో అందుబాటులోకి తెచ్చిన 16 నగరాల్లో కర్నూలు,కాకినాడ (ఆంధ్రప్రదేశ్), సిల్చార్ (అస్సోం), దేవనగరి, శివమొగ్గ, బీదర్, హోస్పేట్, గడగ్-బెటగేరి (కర్ణాటక),మలప్పురం,పాలక్కాడ్,కొట్టాయం, కానూర్ (కేరళ), తిరుపూర్ (తమిళనాడు), నిజామాబాద్, ఖమ్మం (తెలంగాణ), బరేలీ(ఉత్తర్ ప్రదేశ్)లు ఉన్నాయి. అధిక నగరాల్లో జియో 5జీ సేవలు దేశంలో తొలిసారి అధిక నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చిన టెలికం సంస్థగా జియో ప్రసిద్ది చెందింది. ఇక జియో 5జీ నెట్ వర్క్ వినియోగించుకునేందుకు సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా 1జీబీపీఎస్ వరకు అన్లిమిటెడ్ డేటా పొందవచ్చని జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర్ఖండ్,బీహార్,జార్ఖండ్‌లలో కనెక్టివిటీ సర్వీసుల్ని వినియోగంలోకి తెచ్చిన జియో.. విడతల వారీగా దేశ వ్యాప్తంగా ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ సేవల్ని యూజర్లకు అందిస్తామని జియో ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జియో అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. జియో 5 జీ నెట్ వర్క్ వాణిజ్యం, టూరిజం, ఎడ్యూకేషన్ హబ్స్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చాం. జియో 5జీ నెట్ వర్క్‌తో టెలికం సేవలతో పాటు ఈ-గవర్నెన్స్,ఎడ్యుకేషన్, ఆటోమెషిన్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్,గేమింగ్, అగ్రికల్చర్, ఐటీ, చిన్న మధ్యతరహా పరిశ్రమ వంటి రంగాలు గణనీయమైన వృద్ది సాధిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
దేశంలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు.. ఎప్పట్నించి ప్రారంభం అంటే
భువనేశ్వర్: ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 2024 నుంచి 5జీ సర్వీసులను ప్రారంభిస్తుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 4జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం టీసీఎస్, సీ–డీవోటీ సారథ్యంలోని కన్సార్షియంను బీఎస్ఎన్ఎల్ షార్ట్‌లిస్ట్ చేసిందని ఆయన చెప్పారు. దీన్ని ఏడాది వ్యవధిలో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఒడిషాలో జియో, ఎయిర్టెల్ 5జీ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి వివరించారు. ఒడిషాలో టెలికం కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్రం రూ. 5,600 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. మరోవైపు, రుణ సంక్షోభంలో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) నిధులు సహా వివిధ అవసరాలు ఉన్నాయని వైష్ణవ్ తెలిపారు. ఎంత మేర పెట్టుబడులు కావాలి, ఎవరు ఎన్ని నిధులను సమకూర్చాలనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. వీఐఎల్‌కు రూ. 2 లక్షల కోట్ల పైగా రుణ భారం ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 16,000 కోట్ల వడ్డీని ఈక్విటీ కింద మార్చే ఆప్షన్‌ను వినియోగించుకోవాలని వీఐఎల్ నిర్ణయించుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 33 శాతం వాటా లభిస్తుండగా, ప్రమోటర్ల హోల్డింగ్ 74.99 శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుంది. -
ఐవోసీ పెట్రోల్ బంకులకు జియో సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తమ పెట్రోల్ బంకుల అనుసంధానం కోసం రిలయన్స్ జియో మేనేజ్డ్ నెట్వర్క్ సర్వీసులను వినియోగించుకోనుంది. వచ్చే అయిదేళ్లలో 7,200 రిటైల్ అవుట్‌లెట్స్‌లో జియో ఇన్ఫోకామ్‌లో భాగమైన జియో బిజినెస్ సంస్థ తమ ఎస్డీ–డబ్ల్యూఏఎన్ (సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. ఐవోసీకి ఉన్న మొత్తం బంకుల్లో ఇది అయిదో వంతు. పేమెంట్ ప్రాసెసింగ్, రోజువారీ ధరల అప్డేషన్, రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్ (ఆర్డీపీ)సాఫ్ట్వేర్, 24 గంటల పాటు సపోర్ట్ మొదలైనవి ఈ సర్వీసులో భాగంగా ఉంటాయని ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఎస్డీ–డబ్ల్యూఎన్ సెటప్‌లోకి చేర్చినట్లు రిలయన్స్ జియో హెడ్ (ఎంటర్ప్రైజ్) ప్రతీక్ తెలిపారు. -
యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్!
మొన్నటివరకు తక్కువ టారిఫ్‌లు ఎంజాయ్ చేసిన కస్టమర్లు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చార్జీల మోతతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. బిజినెస్ ఇన్ సైడర్ విశ్లేషకుల అంచనా ప్రకారం..ఎయిర్టెల్,రిలయన్స్ జియో టారిఫ్ ధరల్ని 10 శాతం పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీల ఆదాయం,మార్జిన్లపై పెరుగుతున్న ఒత్తిళ్లు ధరల పెరుగుదలకు కారణం కావచ్చు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో అన్నీ ఒక వినియోగదారుడికి సగటు ఆదాయం (ఎఆర్ పియు) లో మితమైన లాభాలను చూశాయి. ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచడం, కొన్ని ప్లాన్లను నిలిపివేయడం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ ఇప్పటికే చౌకైన ప్లాన్ లను రద్దు చేయడం ప్రారంభించింది. కంపెనీ గ్రామీణ ప్రాంతాల యూజర్లను టార్గెట్ చేస్తూ ప్రారంభించిన రూ .99 ప్లాన్‌ను రద్దుచేసింది. క్యూ 2 లో ఎయిర్టెల్ ఇబిటా (ebitda) మార్జిన్ 43.7 శాతం నుండి 36.9 శాతానికి పడిపోయింది.ఇప్పటికే నంబర్ పోర్టబిలిటీ కోసం డిమాండ్,మొత్తం చందాదారుల సంఖ్య స్తబ్దుగా ఉందని నివేదిక తెలిపింది. 5జీ అప్డేట్స్ టెలికం కంపెనీలు దేశంలో 5జి నెట్ వర్క్ కోసం టారిఫ్ ధరల్ని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తున్నాయి. 2023 చివరి నాటికి భారతదేశంలోని అన్ని నగరాలను కవర్ చేయాలని రిలయన్స్ జియో యోచిస్తోంది.జియో ట్రూ 5జి ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై,కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథ్‌ద్వారా, గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లో జియో వెల్కమ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ప్రధాన మెట్రోలలో ఈ సేవను ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 5 జి కవరేజీ ఉంటుందని ఎయిర్ టెల్ పేర్కొంది. -
జియో యూజర్లకు బంపరాఫర్!
ప్రీమియం స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ సంస్థ దేశీయ టెలికం దిగ్గజం జియోతో చేతులు కలిపింది. దేశలో వేగంగా 5జీ నెట్ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. భారత్‌లో వన్ ప్లస్ - జియోలు లేటెస్ట్ 5జీ టెక్నాలజీ నెట్వర్క్ పై పనిచేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా జియో సంస్థ వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 9 ప్రో, వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ఆర్టీ’తో పాటు వన్ ప్లస్ 10 ప్లస్, వన్ ప్లస్ 9 ఆర్, వన్ ప్లస్ 8 సిరీస్‌లోని నార్డ్, నార్డ్ 2టీ, నార్డ్ 2, నార్డ్ సీఈ, నార్డ్ సీఈ2, నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్లలో జియో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్ 13 నుండి డిసెంబర్ 18 వరకు వన్‌ప్లస్ యానివర్సరీ సేల్ ప్రకటించింది. ఈ సేల్‌లో అర్హులైన వన్ ప్లస్, జియో 5జీ వినియోగదారులకు రూ.10,800 క్యాష్‌బ్యాక్ ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
దేశంలో 5జీ సేవలు.. ఎన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయంటే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో, 50 పట్టణాల్లో 5జీ సేవలు నవంబర్ 26 నాటికి అందుబాటులోకి వచ్చాయని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవసిన్హ చౌహాన్ రాజ్యసభకు తెలిపా రు. అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలను టెలికం కంపెనీలు ప్రారంభించినట్టు చెప్పారు. 5జీ టెలికం సేవలు వేగంగా విస్తరించేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ఒక లక్ష 4జీ సైట్ల కోసం అక్టోబర్‌లో టెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కోసం 5జీ స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాలజీని 5–7 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 1.35 లక్షల టెలికం టవర్ల ద్వారా ఈ సర్వీసులు అందుబాటులోకి రాగలవని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇతర టెలికం సంస్థలు ఇంకా పూర్తిగా కవర్ చేయని అనేక గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఎస్ఎన్ఎల్ సర్వీసులు ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న టెల్కోలకు గట్టి పోటీనివ్వడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో టెలికం సేవలకు బీఎస్ఎన్ఎల్ కీలకంగా మారగలదని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా టెలికం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్‌ను ఏటా రూ. 500 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లకు పెంచే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు. నవకల్పనలు, అంకుర సంస్థల వ్యవస్థను ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వేస్, రక్షణ శాఖ తగు తోడ్పాటు అందిస్తున్నాయని వైష్ణవ్ చెప్పారు. రైల్వేస్ ఇప్పటికే 800 స్టార్టప్‌లతో, రక్షణ శాఖ 2,000 పైచిలుకు స్టార్టప్స్‌తో కలిసి పని చేస్తున్నాయని వివరించారు. -
ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశీ ప్రయాణం చేసేవారి కోసం ఎయిర్టెల్ వరల్డ్ పాస్ పేరుతో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను పరిచయం చేసింది. ఈ ప్యాక్‌తో కస్టమర్లు 184 దేశాల్లో రోమింగ్ సేవలను పొందవచ్చు. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లోనూ ఇవి లభిస్తాయి. ఇంటర్నెట్, కాల్స్ వినియోగం, బిల్లు వంటి విషయాలను వినియోగదార్లు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో తెలుసుకోవచ్చు. ఒకరోజుతో మొదలుకుని 365 రోజుల కాలపరిమితితో ఇవి లభిస్తాయి. ఎంచుకున్న ప్యాక్‌నుబట్టి చార్జీ రూ.649 నుంచి రూ.14,999 వరకు ఉంది. -
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన జియో సేవలు!
ప్రముఖ టెలికం దిగ్గజం జియోలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇన్ కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్లడం లేదని వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జియోను కోరుతూ ట్వీట్లు పెడుతున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ సర్వీసుల్లోని లోపాల్ని గుర్తించే డౌన్ డిటెక్టర్ సంస్థ..ఇప్పటి వరకు, 600కు పైగా ఫిర్యాదుల్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే, నెట్వర్క్ సమస్యల్ని ఎదుర్కొంటున్న వినియోగదారులు తక్కువ మంది ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. డౌన్డిటెక్టర్లోని అవుట్‌టేజ్ మ్యాప్ మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్‌లలో ఈ సమస్య ఎక్కువగా ఉందని సమాచారం. కాగా, అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకునే సదుపాయం లేని ఈ సమయంలో.. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు ఇంటర్నెట్ బాగా పనిచేస్తోందని యూజర్లు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తలెత్తిన ఈ లోపాన్ని సరి చేసేందుకు జియో ప్రతినిధులు నిమగ్నమయ్యారు. Jio network down? Unable to make calls.#Jiodown — Mukul Sharma (@stufflistings) November 29, 2022 No volte sign since morning & so unable to make any calls. Is this how you are planning to provide 5g services when normal calls are having issues? @reliancejio @JioCare #Jiodown — Pratik Malviya (@Pratikmalviya36) November 29, 2022 What is the problem with JIO network. Unable to make calls #Jiodown #Jiodown #sanjiv070 @JioCare @reliancejio — sanjiv 070 (@SanjivV070) November 29, 2022 -
దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే
ఫెస్టివల్ సీజన్లో తమ సంస్థకు చెందిన ఫోన్లు భారత్‌లో భారీగా అమ్ముడు పోయినట్లు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తెలిపింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య కాలంలో రూ.14,400 కోట్ల విలువైన ఫోన్లను అమ్మినట్లు వెల్లడించింది. 2022 మొదటి మూడు త్రైమాసికాలలో ప్రీమియం కేటగిరీ స్మార్ట్ఫోన్లలో 99 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సీనియర్ అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ మాట్లాడుతూ..ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి కేవలం 60 రోజుల వ్యవధిలో రూ.14,400 కోట్లను ఆర్జించినట్లు చెప్పారు. జనవరి - సెప్టెంబర్ మధ్య కాలంలో 5జీ స్మార్ట్‌ఫోన్ విలువ పరంగా సంవత్సరానికి ప్రాతిపదికన కంపెనీ 178 శాతం అమ్మకాలు జరిపిందని అన్నారు. గతేడాది పండుగ సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సంస్థ వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకుందన్నారు. సంస్థ వృద్ధికి దోహదపడిన వాటిలో ‘శాంసంగ్ (ఫోన్లపై ఫైనాన్స్) ఫైనాన్స్ ప్లస్’ ఒకటని చెప్పారు. పండుగ సీజన్లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీలు 3 రెట్లు వృద్ధితో 10 లక్షలకు పైగా ట్రాన్సాక్షన్లు జరిగాయని పునరుద్ఘాటించారు. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ ఎక్కువగా అమ్ముడవుతున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే వినియోగదారులు ఎక్కువ 5జీ, ప్రీమియం ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. రూ.10,900 నుంచి 5జీ ప్రారంభ ధర ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సంస్థ సుమారు 20 రకాల మోడళ్లలో 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించింది. నవంబర్ 15 నాటికి కంపెనీ అన్ని 5జీ ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, చాలా స్మార్ట్ఫోన్లు ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగించేకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు బబ్బర్ తెలిపారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం..జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వాల్యూమ్ పరంగా 18 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ విక్రయదారుగా నిలిచింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌గా స్థానాన్ని దక్కించుకుంది. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
జియో జోరు..బీఎస్ఎన్ఎల్కు ఎదురుదెబ్బ
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కు ప్రైవేట్ టెలికం రంగ సంస్థ జియో భారీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జియో అతిపెద్ద ల్యాండ్‌లైన్ సర్వీసుల్ని వినియోగించే సంస్థల జాబితాలో చేరింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం జియో ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. వైర్లెస్ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల జాబితాలో జియో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల వినియోగదారులు చేరడంతో, తన మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెంచుకుంది. -
‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు
దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీని పెంచాలని, ప్రస్తుతం ఉన్న ఫోన్లను 5జీకి అప్ గ్రేడ్ అయ్యేలా సాఫ్ట్వేర్లను డిజైన్ చేయాలని స్మార్ట్ ఫోన్ సంస్థలైన యాపిల్, శాంసంగ్‌తో పాటు ఇతర కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్-2022 కార్యక్రమంలో ప్రధాని మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. ఈ ఫాస్టెస్ట్ నెట్వర్క్ సేవలు తొలుత ఎంపిక చేసిన 13 నగరాల్లో ప్రారంభం అవ్వగా.. వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఈ సేవల్ని వినియోగించుకునే సౌలభ్యం కలగనుందని టెలికం సంస్థలు తెలిపాయి. చదవండి👉 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే 5జీ సేవలు ప్రారంభమైనా..వాటి వినియోగం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల ఆశలు ఆవిరయ్యాయి. ఎందుకంటే? 4జీ స్మార్ట్ ఫోన్లలో 5జీని ఉపయోగించుకునే వెసలుబాటు లేదు కాబట్టి. ఈ తరుణంలో కేంద్రం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. 5జీ ఫోన్లు కావాలి ఈనేపథ్యంలో మంగళవారం.. కేంద్ర టెలికమ్యూనికేషన్లు, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల అధ్యతన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు యాపిల్,శాంసంగ్,వివో,షావోమీలతో పాటు దేశీయం టెలికం సంస్థలు రిలయన్స్, ఎయిర్టెల్, వొడాఫోఫోన్ ఐడియాలతో సమావేశం జరిగింది. ఇందులో ఉన్నతాధికారులు.. ఫోన్ తయారీ కంపెనీలకు.. దేశంలో వీలైనంత త్వరగా 5జీ ఫోన్లను తయారు చేయడం, లేదంటే ప్రస్తుతం ఉన్న ఫోన్లనే 5జీని వాడుకునేలా అప్‌గ్రేడ్ చేయాలని కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది. నో 5జీ ఎయిర్టెల్ తన అఫీషియల్ వెబ్సైట్లో యాపిల్ ఐఫోన్ సిరీస్ 12 నుండి 14 ఫోన్ల వరకు 5జీని వాడుకునేలా అప్‌గ్రేడ్ చేయలేదని స్పష్టం చేసింది. శాంసంగ్‌కు చెందిన ఎక్కువ శాతం ఫోన్లలో ఈ లేటెస్ట్ జనరేషన్ నెట్వర్క్ సదుపాయం లేదని పేర్కొంది. షావోమీ, వివోకు చెందిన మూడు డజన్లకు పైగా మోడల్లో ఎయిర్టెల్ 5జీ సేవల్ని ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు హైలెట్ చేసింది. చివరిగా, టెలికాం కంపెనీలు, స్మార్ట్‌ఫోన్ సంస్థల మధ్య పరస్పరం చర్చలు జరుపుతున్నప్పటికీ, భారతదేశంలోని టెలికాం కంపెనీల నిర్దిష్ట 5జీ సాంకేతికత,ఫోన్లలో సాఫ్ట్వేర్ సపోర్ట్ చేసేలా అప్‌గ్రేడ్ చేసేందుకు మరింత సమయం పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చదవండి👉 ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్ అవ్వండి’
సైబర్ నేరస్తులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మార్కెట్ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్, ఆధార్ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్ ఇలా సందర్భాన్ని టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. తాజాగా మన దేశంలో అందుబాటులోకి వచ్చిన ఫాస్టెస్ట్ 5జీ నెట్ వర్క్ సైబర్ నేరగాళ్లకు కాసులు కురిపిస్తోంది. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్ పేరుతో కేటగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలంటూ పలువురికి ఫోన్లు చేస్తూ.. ఓటీపీ చెప్పాలని కోరుతున్నారు. యూపీఐ, బ్యాంకు యాప్‌లకు అనుసంధానం అయిన మొబైల్ నంబర్ల ద్వారా ఖాతాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ అవ్వండంటూ వచ్చే ఏ మెసేజ్‌ను నమ్మొద్దు చెబుతున్నారు. ఆ తరహా మెసేజ్ లింకులు క్లిక్ చేయొద్దు. ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత టెలికం సంస్థ కార్యాలయంలో 5జీ అప్‌గ్రేడేషన్ చేసుకోవాలని, ఫేక్ లింకులను క్లిక్ చేసి ఆర్థిక మోసాలకు, డేటా చౌర్యానికి గురికావద్దని అంటున్నారు. 5జీ పేరుతో ఫేక్ లింకులు వస్తున్నాయని, అనుమానం ఉంటే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సైతం సామాన్యుల్లో చైతన్యం కల్పిస్తున్నారు. -
యూజర్లకు అదిరిపోయే శుభవార్త! అప్పటి వరకు ఫ్రీగా ‘5జీ నెట్వర్క్’ సేవలు!
న్యూఢిల్లీ: 5జీ నెట్వర్క్ లాంచ్ దశలో మొబైల్ యూజర్లు సెకనుకు 600 మెగాబిట్ వరకూ స్పీడ్‌తో సర్వీసులు అందుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇక డేటా ప్రాసెసింగ్, యాప్‌ల యాక్సెస్ చేయడం మొదలైన అంశాల్లో ప్రొఫెషనల్ కంప్యూటర్లకు సరిసమాన స్థాయిలో హ్యాండ్సెట్లు పనిచేస్తాయని పేర్కొన్నాయి. రిలయన్స్ జియో నాలుగు నగరాల్లో (ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి), భారతి ఎయిర్టెల్ హైదరాబాద్ సహా 8 నగరాల్లో 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సిమ్ మార్చుకోకుండానే 5జీ సేవలను పొందవచ్చని రెండు సంస్థలు వెల్లడించాయి. ’బీటా ట్రయల్’ నిర్వహిస్తున్న జియో సంస్థ సెకనుకు 1 గిగాబిట్ (జీబీపీఎస్) స్పీడుతో అపరిమితమైన 5జీ డేటా అందిస్తామని చెబుతోంది. మొబైల్ స్టేషన్లకు సమీపంలో ఉన్న వారికి ఈ స్థాయి స్పీడ్ లభించవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘నెట్వర్క్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంచ్ దశలో 600 ఎంబీపీఎస్ వరకూ స్పీడ్‌తో 5జీ సేవలు లభించవచ్చు. అయితే, పూర్తి స్థాయిలో సర్వీసులు అందుబాటులోకి తెచ్చాక ఇది 200–300 ఎంబీపీఎస్ శ్రేణిలో ఉండవచ్చు‘ అని ఎరిక్సన్ సంస్థ నెట్వర్క్ సొల్యూషన్స్ హెడ్ థియాసెంగ్ నిగ్ తెలిపారు. గరిష్టంగా 600 ఎంబీపీఎస్ స్పీడుతో 4కే రిజల్యూషన్ గల సినిమాను 3 నిమిషాల్లో, రెండు గంటల నిడివితో 6జీబీ సైజు గల హై డెఫినిషన్ సినిమాను 1 నిమిషం 25 సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్పటివరకూ ఉచితంగానే .. కొత్త సర్వీసుల రుచి తెలిసేంత వరకూ, కొన్ని సర్కిల్స్లోనైనా పూర్తి స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించే దాకా 5జీ సేవలను టెల్కోలు ఉచితంగానే ఆఫర్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ మాజీ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఒక సర్కిల్లో సర్వీసులను పూర్తిగా విస్తరించిన తర్వాత టెల్కోలు టారిఫ్‌లను ప్రకటించవచ్చని, రేట్లు 4జీతో పోలిస్తే కొంత అధికంగానే ఉండవచ్చని ఆయన చెప్పారు. మరోవైపు, 5జీలో హై స్పీడ్ కారణంగా దేశీయంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో ప్రతి యూజరు డేటా వినియోగం సగటున రెట్టింపు కాగలదని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ మాలిక్ తెలిపారు. 5జీ సర్వీసుల టారిఫ్‌లు దేశాన్ని బట్టి మారుతుంటాయని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో 5జీకి ప్రత్యేకంగా చార్జి చేయడం లేదని కొన్ని దేశాల్లో మాత్రం ప్రీమియం వసూలు చేస్తున్నారని చెప్పారు. భారత్‌లో పాటించే విధానమనేది వ్యాపార పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. 2024 మార్చి నాటికల్లా దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులో తేవాలని టెల్కోలు భావిస్తున్నాయి. డిజిటల్ సాధికారత.. దేశీయంగా డిజిటల్ సాధికారతను వేగవంతం చేసేందుకు 5జీ ఉపయోగపడగలదని హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సునీల్ రైనా తెలిపారు. అందుబాటు ధరల్లో పరికరాల లభ్యత దీనికి కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 5జీ విస్తరించే కొద్దీ దేశీయంగా స్మార్ట్ఫోన్లు, ఇతర పరికరాల ధరలూ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా. లావా ప్రస్తుతం అత్యంత చౌకగా రూ. 10,000కే లావాబ్లేజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఇక 5జీకి సంబంధించి హ్యాండ్సెట్స్ తదితర పరికరాల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. హై–స్పీడ్ డేటా వినియోగం వల్ల బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉన్నందున చాలా మటుకు ఫోన్ కంపెనీలు ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో పాటు 5,000 పైగా ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీలతో మొబైల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2027 నాటికి దేశీయంగా మొత్తం సబ్‌స్క్రిప్షన్స్‌లో 5జీ వాటా దాదాపు 40 శాతం వరకూ ఉంటుందని అంచనా. చదవండి👉 ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
ఫోన్ల జాబితా వచ్చేసింది, ఎయిర్టెల్ 5జీ నెట్ వర్క్ పనిచేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!
టెలికం కంపెనీ ఎయిర్టెల్ నెక్ట్స్ జనరేషన్ నెట్ వర్క్ 5జీని హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. కానీ ఈ లెటెస్ట్ టెక్నాలజీ నెట్ వర్క్ ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు మరికొన్ని ఫోన్లలో పనిచేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్లలో మాత్రమే 5జీ పనిచేస్తుంటూ ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు 5జీ పనిచేసే ఫోన్లు ఏమిటో తెలుసుకునే ముందు టారిఫ్ ధరలతో పాటు, సిమ్ కార్డ్‌లపై ఎయిర్టెల్ అందించిన వివరాల ప్రకారం.. 4జీ ఛార్జీలకే ఎయిర్టెల్ 5జీ 5జీ నెట్ వర్క్‌ను వినియోగంలోకి తెచ్చినా ఎయిర్టెల్ టారిఫ్ ధరల్ని ప్రకటించలేదు. ఈ తరుణంలో ప్రస్తుత 4జీ ప్లాన్‌లోనే 5జీ సేవల్ని కస్టమర్లు పొందవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. 5జీ స్మార్ట్ ఫోన్ ఏదైనా కస్టమర్లు వినియోగిస్తున్న ప్రస్తుత సిమ్‌లోనే 5జీ పని చేస్తుందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. అంతా మీ ఇష్టం 5జీ సిగ్నల్స్ అందుకున్న వినియోగదారులు 5జీకి మళ్లవచ్చు. డేటా వినియోగం ఎక్కువగా అవుతోందని భావిస్తే తిరిగి 4జీకి బదిలీ కావొచ్చు. 5జీ సర్వీసులను అందుకోవాలా వద్దా అన్నది కస్టమర్ల అభీష్టం మేరకేనని కంపెనీ పేర్కొంది. మార్చి 2024 లోపు దేశ వ్యాప్తంగా ఈ లేటెస్ట్ కనెక్టివిటీని అందిస్తామని, ప్రస్తుతానికి దశల వారీగా ఎంపిక చేసిన కస్టమర్లకు 5జీ సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్లలో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తుందో, లేదా అని తెలుసుకోవాలంటే కింద జాబితాను చూడండి శాంసంగ్ శాంసంగ్ గెలాక్సీ ఏ53 5జీ, శాంసంగ్ ఏ33 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎం 33, శాంసంగ్ ఫ్లిప్4, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 ప్లస్, శాంసంగ్ ఫోల్డ్4 రియల్ మీ రియల్మీ 8ఎస్ 5జీ , రియల్మీ ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ, రియల్ మీ నార్జో 30 ప్రో 56, రియల్ మీ ఎక్స్7 5జీ, రియల్మీ ఎక్స్ 7 ప్రో 50, రియల్ మీ 850, రియల్ మీ ఎక్స్ 50 ప్రో, రియల్ మీ జీటీ 5జీ, రియల్మీ జీటీ ఎంఈ, రియల్ మీ జీటీ నియో2, రియల్మీ 95జీ, రియల్ మీ 9ప్రో, రియల్ మీ 9 ప్రో ప్లస్, రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ 9 ఎస్ఈ, రియల్మీ జీటీ2, రియల్మీ జీటీ 21ప్రో, రియల్మీ జీటీ నియో3, రియల్మీ నార్జో 50 50, రియల్మీ నార్జో 50 ప్రో వన్ ప్లస్ వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ప్రో, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ 10 ప్రో 56,వన్‌ప్లస్ నార్డ్ సీఈ లైట్2, వన్‌ప్లస్ ఎక్స్‌డీఆర్, వన్‌ప్లస్ నార్డ్ 27,వన్‌ప్లస్ 10టీ షావోమీ షావోమీ ఎంఐ10, షావోమీ ఎంఐ ఎల్ఓటీ, షావోమీ ఎంఐ 10టీప్రో, షావోమీ ఎంఐ 11 ఆల్ట్రా(కే1), షావోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో, షావోమీ ఎంఐ 11ఎక్స్, షావోమీ పోకో ఎం3 ప్రో 5జీ, షావోమీ పోకో ఎఫ్3 జీటీ, షావోమీ ఎంఐ 11 లైట్ ఎన్ఈ( కే9డీ), షావోమీ కిగా రెడ్మీ నోట్ ఐఐటీఎస్జీ (Xiaomi KIGA Redmi Note IITSG), షావోమీ కే3ఎస్ షావోమీ 11టీ ప్రో, షావోమీ కే 16 షాఓమీ 111 హైపర్ ఛార్జ్, షావోమీ రెడ్మీ నోట్ 10టీ, షావోమీ కే6ఎస్ (రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్), షావోమీ పోకో ఎం4 5జీ, షావోమీ 12 ప్రో, షావోమీ 111, షావోమీ రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (ఎల్ 19), షావోమీ పోకో ఎఫ్4 5జీ, షావోమీ పోకో ఎక్స్4 ప్రో, షావోమీ రెడ్మీ కే50ఐ ఒప్పో ఒప్పో రెనో5జీ ప్రో, ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో, ఒప్పో ఎఫ్19ప్రో ప్లస్, ఒప్పో ఏ53 ఎస్, ఒప్పో ఏ53 ఎస్, ఒప్పో ఏ74, ఒప్పో రెనో 7 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్21 ప్రో 5జీ, ఒప్పో రెనో7, ఒప్పో రెనో8, ఒప్పో రెనో 8 ప్రో, ఒప్పో ఫైండ్2, ఒప్పో కే10 5జీ, ఒప్పో ఎస్21 ప్రో 5జీ వివో వివో ఎక్స్ 50 ప్రో, వీ20 ప్రో, ఎక్స్ 60 ప్రో ప్లస్, ఎక్స్60, ఎక్స్60 ప్రో ప్లస్, ఎక్స్70 ప్రో, ఎక్స్70 ప్రోప్లస్, ఎక్స్80, ఎక్స్ 80 ఫ్లాగ్షిప్ ఫోన్స్, వి20 ప్రో, వి21 5జీ, వి21ఈ, వై72 5జీ, వీ23 5జీ, వీ23 ప్రో 5జీ, వీ23ఈ 5జీ, టీ1 5జీ, టీ1 ప్రో 5జీ,వై 75 5జీ,వీ 25, వీ25ప్రో,వై55,వై55ఎస్ చదవండి👉 ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదు -
5జీ టెక్నాలజీ: హెచ్ఎఫ్సీఎల్, క్వాల్కామ్ జట్టు
న్యూఢిల్లీ: 5జీ అవుట్డోర్ స్మాల్ సెల్ ఉత్పత్తులను డిజైనింగ్, అభివృద్ధి చేసేందుకు క్వాల్కామ్ టెక్నాలజీస్‌తో జట్టు కట్టినట్లు దేశీ టెలికం పరికరాల తయారీ సంస్థ హెచ్ఎఫ్సీఎల్ వెల్లడించింది. టెల్కోలు 5జీ సేవలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిరంతరాయ 5జీ అనుభూతిని అందించేందుకు స్థూల నెట్వర్క్కి అనుబంధంగా చిన్నపాటి అవుట్డోర్ సెల్స్ కూడా అవసరమవుతాయని పేర్కొంది. పెద్ద బేస్ స్టేషన్ల కవరేజీ అంతంత మాత్రంగా ఉన్న ప్రాంతాలు లేదా అస్సలు లేని ప్రాంతాల్లోనూ స్మాల్ సెల్స్ ఏర్పాటుతో సర్వీసులను మెరుగుపర్చవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫార్చూన్ బిజినెస్ ఇన్సైట్స్ అంచనాల ప్రకారం 2020లో 740 మిలియన్ డాలర్లుగా ఉన్న 5జీ స్మాల్ సెల్ మార్కెట్ 2028 నాటికి 17.9 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఎయిర్టెల్ 5జీ టారిఫ్ ధరలు, 4జీ తో పోలిస్తే
దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ దేశంలోని 8 నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ టారిఫ్ ధరల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ మరికొన్ని రోజుల్లో 5జీ ప్లాన్స్ ధరల్ని ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఎయిర్టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..5జీ వినియోగదారులు తక్కువగా ఉండి, టారిఫ్ ధరలు ఎక్కువగా ఉంటే..ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెరగదని తెలిపారు. అదే సమయంలో థాయిల్యాండ్‌లో 5జీ నెట్ వర్క్‌ను వినియోగించే వారి సంఖ్య తక్కువగా ఉందని, అందుకు కారణం ఈ ఫాస్టెస్ట్ నెట్ వర్క్ టారిఫ్ ధరలు ఎక్కువగా ఉండడమేనని అన్నారు. కాబట్టే భారత్‌లో 4జీ తో పోలిస్తే 5జీ ధరలు ఎక్కువగా ఉండవని చెప్పారు. ‘టెలికం రంగంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ) కేవలం 7శాతం మాత్రమే ఉంది. ఆర్ఓఐ పెరిగలంటే అది ఏఆర్పీయూతోనే సాధ్యమని పేర్కొన్నారు. చదవండి👉ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఈ ఫోన్లలో 5జీ పనిచేయడం లేదంట! -
సి–డాట్ 5జీ మొబైల్ యాంటెన్నా, 6 నెలల్లో సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: మేడిన్ ఇండియా 5జీ మొబైల్ యాంటెన్నాలు వాణిజ్యపరంగా వినియోగించేందుకు వీలుగా ఆరు నెలల్లో సిద్ధం కానున్నాయని సి–డాట్ వెల్లడించింది. జియోకు చెందిన రేడిసిస్ ఇండియా, వీవీడీఎన్ టెక్నాలజీస్, వైసిగ్ నెట్వర్క్స్ సహకారంతో వీటిని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. ఈ యాంటెన్నాలు వైర్లెస్ సిగ్నల్స్‌ను పంపడంతోపాటు అందుకుంటున్నాయని సి–డాట్ ఈడీ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు. ‘5జీ కోర్, 5జీ రేడియో దేశీయంగా అభివృద్ధి జరిగింది. సొంతంగా 5జీ సాంకేతికత కలిగిన కొద్ది దేశాల జాబితాలో భారత్ నిలిచింది. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో 5జీ రేడియో పరీక్షలు జరుపుతాం. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. వాణిజ్యపరంగా ఈ యాంటెన్నాలను ఉపయోగించాలనుకునే క్లయింట్లకు సాంకేతికతను బదిలీ చేస్తాం’ అని ఉపాధ్యాయ్ చెప్పారు. -
గుడ్ న్యూస్: జియో 5జీ ట్రయల్స్,యూజర్లకు ఆహ్వానం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం జియో బుధవారం నుంచి (నేడు) 4 నగరాల్లో 5జీ సర్వీసుల ట్రయల్స్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి ఈ నగరాల్లో ఉన్నాయి. జియో ట్రూ 5జీ వెల్కమ్ ఆఫర్ కింద 5జీ సేవలను ప్రయత్నించాల్సిందిగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆహ్వానం పంపనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద సదరు సబ్స్క్రయిబర్స్కు సెకనుకు 1 గిగాబిట్ వేగంతో అపరిమిత 5జీ డేటా లభిస్తుందని పేర్కొంది. ఆహ్వానం పొందిన యూజర్లను తమ ప్రస్తుత జియో సిమ్‌ను లేదా 5జీ హ్యాండ్‌సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే జియో ట్రూ 5జీ సర్వీస్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ వివరించింది. ట్రయల్‌లో 5జీ డేటాకు అదనపు చార్జీలు ఉండబోవని పేర్కొంది. -
నవంబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నవంబర్ నుంచి తమ 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేనుంది. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి క్రమంగా దాన్ని 5జీకి అప్‌గ్రేడ్ చేసుకోనుంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. 18 నెలల్లో 1.25 లక్షలకు పైగా 4జీ మొబైల్ సైట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. దేశీ 4జీ టెక్నాలజీని వినియోగించేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికం పరిశోధన సంస్థ సీ–డాట్ సారథ్యంలోని కన్సార్షియంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 2023 ఆగస్టు 15 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ కార్యకలాపాలు ప్రారంభించాలంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్దేశించారని, తదనుగుణంగా కృషి చేస్తున్నామని పుర్వార్ పేర్కొన్నారు. -
దేశంలో 5జీ సేవలు, జియో 5జీ ప్లాన్ వివరాలు ఇవేనా?
దేశంలో 5జీ నెట్ అందుబాటులోకి వస్తే వాటి ధరలు భారీగా పెరుగుతాయా? పెరిగితే ఎంత పెరుగుతాయనే అంశాలపై వినియోగదారుల్లో చర్చ మొదలైంది. అయితే 5జీ సేవల్ని మోదీ ప్రారంభించిన అనంతరం ఆకాష్ అంబానీ మీడియాతో మాట్లాడారు. జియో సంస్థ వినియోగదారులకు ఆమోదయోగ్యంగా 5జీ ప్లాన్లను ప్రవేశ పెడుతుందని అన్నారు. ప్రతీ దేశ పౌరుడు 5జీ నెట్ వర్క్‌ను వినియోగించేలా ప్రొడక్ట్ నుంచి సర్వీసులు వరకు తక్కువ ధరకే అందిస్తామన్నారు. 5జీపై మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ..1జీబీ డేటా గతంలో రూ.300 ఉంటే..ఇప్పుడు రూ.10కే లభ్యం అవుతుంది. యావరేజ్‌గా దేశ పౌరుడు నెలకు 14జీబీ డేటాను వినియోగిస్తే..దాని ధర రూ.4200, కానీ రూ.125 నుంచి రూ.150 మధ్యలో ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో తొలిసారి 5జీ సేవలు ప్రారంభం కావడం.. జియో 5జీ ప్లాన్, సిమ్ కార్డ్‌ల గురించి చర్చ మొదలైంది. అంతేకాదు జియో 5జీ ప్లాన్ల ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయంటూ పలు నివేదికలు విడుదలయ్యాయి. జియో సిమ్ కార్డ్ ఈ ఏడాది ఆగస్ట్ 29న జరిగిన రిలయన్స్ 45వ ఏజీఎం సమావేశంలో 5జీ సేవల వినియోగంపై జియో ప్రకటన చేసింది. ఆ సందర్భంగా ఎటువంటి నెట్ వర్క్‌కు కనెక్షన్ లేకుండా స్టాండ్ అలోన్ (Standalone) అనే 5జీ సర్వసుల్ని అందిస్తామని చెప్పింది. దీంతో ఈ సేవల కోసం 4జీ సిమ్ కార్డ్‌ను వినియోగించలేమని, సిమ్ కార్డును 5జీ నెట్ వర్క్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని టెలికం నిపుణులు చెబుతున్నారు. జియో స్పీడ్ జియో సంస్థ దేశ వ్యాప్తంగా 8 నగరాల్లో 5జీ ట్రయల్స్ నిర్వహించింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..ముంబైలో 4జీ కంటే 5జీ 8ఎక్స్ స్పీడ్‌తో జియో పనిచేస్తుందని, ట్రయల్స్‌లో జియో డౌన్లోడ్ స్పీడ్ 420 ఎంబీపీఎస్, అప్లోడ్ స్పీడ్ 412 ఎంబీపీఎస్ ఉంది. జియో 5జీ ధర దేశంలో జియో 4జీ ప్లాన్ ప్రారంభ ధర నెలకు రూ.239. రోజుకు 1.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అలాగే 5జీ ప్లాన్లు సైతం అదే తరహాలో ఉంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ఇతర నెట్ వర్క్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేలా జియో 5జీ ప్రారంభ ధర నెలకు రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉండనున్నట్లు తెలుస్తోంది. -
దేశంలో 5జీ సేవలు ప్రారంభం, ఇందులో మీ నగరం ఉందో లేదో చెక్ చేసుకోండి
నేడు ప్రధాని మోదీ చేతులు మీదిగా దేశంలో 5 జీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2024 మార్చి సమయానికి దేశ వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్‌ని వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా టెలికాం సంస్థలు తెలిపాయి. తద్వారా ఆల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రానుంది. 5జీ నెట్ వర్క్ ప్రారంభంతో ముందుగా దేశీయ టెలికాం నెట్ వర్క్ ఎయిర్టెల్ యూజర్లు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకునే అవకాశం లభించింది. అయితే ఇప్పుడు 4జీని ఎలా వినియోగిస్తున్నామో.. రానున్న రోజుల్లో ఫాస్టెస్ట్ 5జీ నెట్ వర్క్ అందరు ఉపయోగించుకునే సౌలభ్యం కలగనుండగా.. ప్రస్తుతం 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో వినియోగంలోకి రానుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, చండీఘడ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీ నగర్ (గుజరాత్), జామ్ నగర్ (గుజరాత్), అహ్మదాబాద్ యూజర్లు 5జీ ని ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఢిల్లీ, ముంబై, వారణాసి మరియు బెంగళూరుతో సహా ఎనిమిది నగరాల్లో తన 5జీ సేవల్ని ఎయిర్టెల్ ప్రారంభించింది. మార్చి 2023 నాటికి దేశంలోని అనేక నగరాల్లో, మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది. -
దేశంలో డేటా విప్లవం, 6ఏళ్లు పూర్తి చేసుకున్న జియో
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ ఇంటర్నెట్ విప్లవానికి తెరతీసిన రిలయన్స్ జియో సోమవారంతో (5వ తేదీ) ఆరేళ్లు పూర్తి చేసుకుంటోంది. జియో రాక ముందు సగటున ఒక మొబైల్ కస్టమర్ ఒక నెలలో 154 ఎంబీ డేటాను మాత్రమే ఉపయోగించగా, ఇప్పుడు అది నెలకు 15.8 జీబీ స్థాయికి చేరుకుంది. డేటా వినియోగం వంద రెట్లు పెరగడంలో జియో పాత్ర కీలకమని చెప్పుకోవాలి. అంతేకాదు, గతంలో ఒక జీబీ డేటాకు రూ.200కు పైన ఖర్చు చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు రూ.7–15కే జీబీ డేటా వస్తోంది. ఇక వచ్చే దీపావళి నుంచి 5జీ సేవల ప్రారంభానికి జియో సన్నద్ధమవుతోంది. 2023 చివరికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. 4జీతో పోలిస్తే 5జీ సేవల వేగం ఎంతో ఎక్కువ. దీంతో 5జీ తర్వాత మూడేళ్ల కాలంలో డేటా వినియోగం రెండు రెట్లు పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. డేటా ఆధారిత కొత్త పరిశ్రమలు, టెక్నాలజీ రాకతో వినియోగం పెరుగుతుందని భావిస్తున్నారు. 41.30 కోట్ల కస్టమర్లతో టెలికం మార్కెట్లో జియో వాటా 36 శాతంగా ఉంది. -
షాకింగ్ రిపోర్ట్..5జీతో క్యాన్సర్ సోకుతుందా?
మనదేశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న 4జీ కంటే పదిరెట్ల వేగంతో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.ఈ నెట్ వర్క్ వినియోగంతో ఎన్ని లాభాలు ఉన్నాయో..మానవాళికి ముప్పుకూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్పెషల్ మొబైల్ అసోసియేషన్(జీఎస్ఎంఏ) నివేదిక ప్రకారం.. 50 యూరప్ దేశాల్లో 34 దేశాల్లో ఈ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తంలో సగానికి పైగా ఉన్న 173 ప్రాంతాల్లోని (రీజియన్) 92 ప్రాంతాల్లో టెలికం కంపెనీలు 5జీ నెట్ వర్క్‌లను లాంఛ్ చేశారు. ఈ నేపథ్యంలో యూరప్‌లో 5జీ కనెక్టివిటీ కారణంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే 5జీ నెట్ వర్క్ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయనే అంశంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) పరిశోధనల్ని కొనసాగిస్తుంది. ఆ పరిశోధనల ఫలితాల్ని ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయనుంది. అదే సమయంలో భారత్‌లో సైతం 5జీ నెట్ వర్క్ వినియోగంలోకి రానుంది. అప్పుడే మనదేశంలో సైతం 5జీతో ఆరోగ్యంపై ప్రమాద అంచనాలకు సంబంధించిన రిపోర్ట్ వెలువరించే అవకాశం ఉండనుంది. 2020 నుంచే డబ్ల్యూహెచ్ఓ 2020నుంచి డబ్ల్యూహెచ్ఓ 5జీ రేడియో ఫ్రీక్వెన్సీ పరిధిని కవర్ చేస్తూ..ఆ ఫ్రీక్వెన్సీల వల్ల తలెత్తే ప్రమాదాల్ని అంచనా వేయడం ప్రారంభించింది. కొత్త సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందున, 5జీ ఎక్స్పోజర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సమీక్షిస్తోంది. క్యాన్సర్, సంతానోత్పత్తి ప్రమాదాలు? 5జీ టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవాళి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే అందోళనలున్నాయి. 2021లో,5జీ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని యూరోపియన్ పార్లమెంటరీ రీసెర్చ్ సర్వీస్ యొక్క ఫ్యూచర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్యానెల్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో 450 నుండి 6000 ఎంహెచ్‌జెడ్ ఎలక్ట్రో మోటీవ్ ఫోర్స్‌తో గ్లియోమాస్, ఎకౌస్టిక్ న్యూరోమాలకు సంబంధించి మానవుల్లో క్యాన్సర్ కారకమని నిర్ధారించింది. వీటివల్ల పురుషుల సంతానోత్పత్తి, స్త్రీ సంతానోత్పత్తిపై ప్రభావం చూపనుంది. గర్భం, నవజాత శిశువుల అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండవచ్చు అని" ప్యానెల్ తెలిపింది. అప్పటి వరకు 5జీని నిలిపివేయాలి సాంకేతికత అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, ప్రజారోగ్య నిపుణులు, పర్యావరణవేత్తలు 5జీ ప్రమాదాల గురించి ఆయా దేశాల ప్రభుత్వాల్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. "యూరోపియన్ ఏజెన్సీల ద్వారా 5జీ ఎఫెక్ట్‌పై అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ, 5జీతో వందశాతం సురక్షితం అని తేలే వరకు ఆ నెట్ వర్క్‌లపై ప్రయగాలు, ప్రచారాల్ని నిలిపివేయాలని అని పర్యావరణ న్యాయవాది ఆకాష్ వశిష్ఠ చెప్పారు. చదవండి👉 5జీ పరుగులు ఒకవైపు.. ‘పాత తరం ఫోన్’ అడుగులు మరొకవైపు: ఏమిటో వింత పరిణామం! -
జియో సంచలనం..కంప్యూటర్, ల్యాప్‌టాప్ అప్ గ్రేడ్ చేసుకునే పనిలేకుండా!
ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ వార్షిక సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ సంస్థ 5జీ నెట్ వర్క్‌తో పాటు ఇతర సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఏజీఎం సమావేశంలో పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్స్‌ను అప్ గ్రేడ్ చేసుకునే అవసరం లేకుండా రిలయన్స్ జియో క్లౌడ్ పీసీ అనే కొత్త ప్రొడక్టన్‌ను లాంచ్ చేయనున్నట్లు రిలయన్స్ సంచలన ప్రకటన చేసింది.జియో 5జీ సేవల్లో ఒక భాగమైన జియో ఫైబర్‌ను ఉపయోగించి క్లౌండ్ ఉంచిన వర్చువల్ పీసీని వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. వినియోగం బట్టి ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని రిలయన్స్ సంస్థలో ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 'జియో ఎయిర్ ఫైబర్' జియో సంస్థ 'జియో ఎయిర్ ఫైబర్' అనే డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ సింగిల్ డివైజ్‌తో సులభంగా ఇంట్లో వైఫై హాట్ స్పాట్, ఆల్ట్రా హై స్పీడ్ 5జీ నెట్ వర్క్ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చని తెలిపింది. అతి తక్కువ సమయంలో గిగా బైట్ ఇంటర్నెట్ స్పీడ్‌తో వందల సంఖ్యలో ఇళ్లు, కార్యాలయాల్లో కనెక్ట్ అవుతుందని తెలిపింది. -
5జీ:తరం మారింది..సూపర్ వేగం వచ్చేసింది
శంకరాభరణం సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. ‘‘పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటానూ.. కట్టిన రాగమూనూ అది. ఇప్పుడు బస్సులు.. రైళ్లు, విమనాలు.. రాకెట్లు.. జాకెట్లు...’’ అని. ఇంకొన్ని నెలలు గడిస్తే దేశంలోనూ ఇలాంటి డైలాగులే వినిపిస్తాయి. కాకపోతే కొంత మార్పుతో.. ఎలాగంటే... ‘‘ఆపేయ్.. ఆపేయ్.. ఎప్పుడో 4జీ కాలం నాటి ఇంటర్నెట్టూ.. స్ట్రీమింగ్ సర్వీసున్నూ. ఇప్పుడు సెకనుకు 20 గిగాబైట్ల 5జీ’’ అని!! :::గిళియారు గోపాలకష్ణ మయ్యా అవును. ఇదే వాస్తవం. మొబైల్ ఫోన్లలో సరికొత్త తరం.. విప్లవం మన ముంగిట్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ను వేలం వేయడం దాదాపుగా పూర్తవడంతో మునుపెన్నడూ చూడని వేగం, సౌకర్యాలతో ఇప్పుడున్న నాలుగో తరం మొబైల్ టెక్నాలజీని తోసిరాజని వినూత్నమైన 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతా బాగానే ఉంది కానీ.. ఏమిటీ 5జీ? ఎలా పనిచేస్తుంది?ఎందుకు దీనికంత క్రేజ్? మనకొచ్చే లాభాలేమిటి? 1979లో తొలి తరం మొబైల్ ఫోన్ వచ్చిన తరువాత ఈ నలభై ఏళ్ల కాలంలో టెక్నాలజీ ఎంత మారిపోయిందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కళ్లముందు ప్రత్యక్షంగా తార్కాణాలు కనిపిస్తునే ఉన్నాయి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రంక్ కాల్ బుక్ చేసి ఆపరేటర్ కాల్ కలిపేదాకా వేచి చూడటమన్న ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్ టెక్నాలజీకి బ్రేక్ వేసి వైర్లెస్ పద్ధతిలో మొబైల్ఫోన్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు కేవలం మాటలు... అది కూడా అరకొరగా వినిపించేవి. ఇప్పుడు స్పష్టమైన హై డిఫినిషన్ వీడియోలూ అరచేతుల్లోని స్మార్ట్ఫోన్లలోకి ఇమిడిపోయాయి. వినోదం, వ్యాపారం, విద్య అన్నీ ఈ స్మార్ట్ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. అయితే.. వేగం, సౌకర్యం అన్న రెండు అంశాల విషయంలో మనిషి దాహం అంతులేనిది. సెకనుకు గిగాబైట్ వేగంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగల 4జీతో తప్తి పడలేదు. అంతకంటే వేగం, మరింత ఎక్కువ సౌకర్యాలు... వాటితోనే అనేకానేక ఇతర లాభాలను ఆశిస్తూ ఆధునిక టెక్నాలజీ మేళవింపుతో 5జీ మొబైల్ టెక్నాలజీని ఆవిష్కరించారు. మూడేళ్ల క్రితం కొన్ని దేశాల్లో ప్రయగాత్మకంగా 5జీ సేవలు మొదలయ్యాయి కూడా. ఈ ఏడాది అక్టోబరుకల్లా భారత్‌లోనూ 5జీ సేవలకు రంగం సిద్ధమైంది. 4జీ ఎల్టీఈ కంటే భిన్నం.... 5జీ మొబైల్ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్న 4జీ ఎల్టీఈ కంటే పూర్తిగా భిన్నమైంది. 4జీ ఎల్టీఈ కేవలం ఒకే శ్రేణి రేడియో తరంగాలతో పనిచేస్తే.. 5జీ ఏక కాలంలో మూడు రకాల తరంగాలతో పనిచేయగలదు. గిగాహెర్ట్›్జకంటే తక్కువ పౌనఃపున్యమున్న తరంగాలు మొబైల్ ఫోన్ సంకేతాల పరిధి ఎక్కువగా ఉండేందుకు సాయపడతాయి. భవనాల గోడల గుండా సులువుగా సంకేతాలు ప్రయాణం చేయగలవు. తక్కువ లాటెన్సీ (సంకేతాలు మొబైల్‌ఫోన్ నుంచి సెల్ టవర్‌కు చేరేందుకు పట్టే సమయం), ఎక్కువ వేగం (సెకనుకు గిగాబైట్ వరకూ) ఇవ్వగల మిడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను కూడా 5జీలో వాడతారు. చివరగా సెకనుకు పది గిగాబైట్ల వేగం ఇవ్వగల హైబ్యాండ్ స్పెక్ట్రమ్ తరంగాలూ ఈ కొత్త టెక్నాలజీలో భాగం కావడం గమనార్హం. 4జీలో లాటెన్సీ గరిష్టంగా 98 మిల్లీసెకన్లయితే 5జీలో ఇది మిల్లీ సెకను కంటే తక్కువ. డౌన్లోడింగ్ వేగాలు చూస్తే 4జీలో 1సెకనుకు 100 మెగాబైట్ల నుంచి ఒక గిగాబైట్ వరకూ ఉంటుంది. 5జీలో 1సెకనుకు కనీసం పది గిగాబైట్ల నుంచి గరిష్ఠంగా 20 గిగాబైట్ల వరకూ ఉంటుంది. అంతేకాదు.. ఇప్పటి నెట్‌వర్క్‌లో ఒక్కో మొబైల్ టవర్ ద్వారా 200 నుంచి 400 మందికి సేవలందితే.. 5జీలో వంద రెట్లు ఎక్కువ మంది సులువుగా అందుకోగలరు. లోటుపాట్లూ లేకపోలేదు... 5జీ టెక్నాలజీ అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు చాలా ఎక్కువ. ఉన్న వాటిని తొలగించి కొత్త బేస్‌స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలి. కొత్త టెక్నాలజీ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. టెక్నాలజీ ఎంత విజయవంత మవుతుందనేది ఈ లోపాలను అధిగమించడంలో ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు అత్యధికంగా మొబైల్ నెట్‌వర్క్‌లోకి చేరుతూండటం వల్ల భద్రత, వ్యక్తిగత గోప్యత వంటివి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. నెట్‌వర్క్‌లోకి చొరబడేందుకు హ్యాకర్లకు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మన దేశంలో ఎందుకాలస్యం..? అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ సౌదీ అరేబియా వంటి దాదాపుగా 72 దేశాల్లో 1950 వరకు నగరాల్లో 5జీ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. 2019లోనే దక్షిణ కొరియా 5జీ సేవల్ని ప్రారంభించింది. మన దేశంలో 2020లోనే 5జీ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో టెలికమ్యూనికేషన్ శాఖ 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయడం ఆలస్యమవుతూ వచ్చింది. అంతేకాకుండా 5జీ నెట్‌వర్క్‌కు కావాల్సిన ఫైబర్ నెట్వర్క్ లైన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గత ఏడాది నాటికి కేవలం దేశంలో 30% ప్రాంతాల్లో ఈ ఫైబర్ నెట్వర్క్ లైన్లు పూర్తయితే, మరో 70 శాతం మేరకు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. టెలికాం సంస్థలన్నీ పూర్తి స్థాయిలో ఫైబర్ నెట్వర్క్ లైన్లు వెయ్యాలంటే కనీసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని అంచనా. అందుకే ఇప్పుడు కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. టెక్నాలజీతో మన బుర్రలు మందగిస్తాయా? 5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మనుషులకు పని తగ్గిపోతుంది. అయితే దీనివల్ల మన బుర్రలు మందగిస్తాయని కొందరి వాదన. ఒకప్పుడు 30 నలభై ఫోన్ నెంబర్లను అలవోకగా గుర్తుంచుకోగలిగేవాళ్లమని... మొబైల్ ఫోన్లు వచ్చిన తరువాత అది సాధ్యం కావడం లేదని తమ వాదనకు ఆధారంగా కొందరు వ్యాఖ్యానిస్తూంటారు. ఇందులో నిజం కొంతే. ఎందుకంటే అవసరం లేని విషయాలపై దృష్టి పెట్టకపోవడం మెదడుకు ఉన్న సహజ లక్షణం. అలాగని మనం మెదడును వాడుకోవడం లేదని కూడా అనుకోనవసరం లేదు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా మునుపటి స్థాయిలో ఫోన్ నెంబర్లు గుర్తు పెట్టుకోవడం కష్టమేమీ కాదు. మునుపటితో పోలిస్తే మన పరిచయాలు.. ఫోన్ నెంబర్ల సంఖ్య ఎంత పెరిగిందో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాదు... మొబైల్ఫోన్ల వల్ల మన బుర్ర మందగిస్తుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. విమానాలకు 5జీతో ముప్పు? అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు మొదలైన సందర్భంగా కొంత గందరగోళం ఏర్పడింది. పలు దేశాలు అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నారు. 5జీ మొబైల్ సర్వీసుల కోసం ఉపయోగించే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ, విమానాల్లో ఎత్తును సూచించేందుకు వాడే రేడియో ఆల్టీ మీటర్ వాడే ఫ్రీక్వెన్సీ దాదాపు ఒకే స్థాయిలో ఉండటం వల్ల సమస్యలు వస్తాయని గుర్తించడం ఇందుకు కారణం. ఈ ఏడాది జనవరిలో వెరిజాన్, ఏటీ అండ్ టీ టెలికామ్ సంస్థలు అమెరికాలో తమ 5జీ సర్వీసులు మొదలుపెట్టిన సందర్భంలో ఈ విషయాన్ని గుర్తించారు. 5జీ సంకేతాల కారణంగా రేడియో ఆల్టీమీటర్ ఇంజిన్ తాలూకూ బ్రేకింగ్ వ్యవస్థను ప్రభావితం చేసి విమానాలు ల్యాండింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా చేస్తుందని.. దీనివల్ల విమానాలు రన్‌వే పై ఆగకపోవచ్చునని అమెరికా ప్రభుత్వ సంస్థ ఎఫ్ఏఏ కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. రేడియో తరంగాలను ఫిల్టర్ చేసే పరికరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని అంచనా. ఈ ఏడాది చివరికల్లా బోయింగ్ ఇంజిన్ కలిగిన విమానాలు ఈ రేడియో ఫిల్టర్లను అమర్చుకోవాలని ఫెడరల్ ఏవియేష¯Œ ఏజెన్సీ ఇప్పటికే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. 1జీ నుంచి 5జీ వరకు మొబైల్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ జర్నీ తొలి తరం...(1జీ) 1979 మొట్టమొదట వైర్లెస్ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టింది జపాన్‌కు చెందిన నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ (ఎన్టీటీ) టోక్యో నగరంలో ప్రారంభించింది. 1979లో మొదలు కాగా.. 1984 నాటికి జపాన్ మొత్తం 1జీ నెట్వర్క్ విస్తరణ జరిగింది. అమెరికాలో 1980లో, యునైటెడ్ కింగ్డమ్లో 1985లో 1జీ సేవలు మొదలయ్యాయి. గరిష్ట వేగం సెకనుకు కేవలం 2.4 కిలోబైట్స్ మాత్రమే. మాటలు మాత్రమే ఉన్న మొబైల్ సర్వీస్ ఇది. రెండో తరం... (2జీ) 1991 యూరోపియన్ దేశం ఫిన్లాండ్లో 1991లో మొదలైంది రెండో తరం మొబైల్ సర్వీస్. గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ (జీఎస్ఎమ్) ప్రమాణాలతో డిజిటల్ సిగ్నలింగ్ ఆధారంగా మాటలు మాత్రమే ఉన్న ఈ సర్వీస్ లాభం ఏమిటయ్యా అంటే.. సామర్థ్యం, వేగం రెండూ 1జీ కంటే ఎక్కువ అని చెప్పాలి. బ్యాండ్‌విడ్త్‌ను చూసుకుంటే 30 – 200 కిలోహెర్ట్›్జమధ్యలో ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్‌లు పంపుకునేందుకు కూడా అవకాశం లభించింది. కాకపోతే ఈ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్‌ల వేగం గణనీయంగా తక్కువ. 2జీ నెట్వర్క్ ద్వారా అత్యధిక వేగం సెకనుకు 64 కిలోబైట్స్ మాత్రమే. మాటలకు వీడియోలు తోడైన మూడో తరం... (3జీ) 2001 మాటలకు... డేటా తోడైన మూడో తరం మొబైల్ సర్వీసులు 2001లో ఎన్టీటీ డోకోమో ద్వారా ప్రారంభమయ్యాయి. వినియోగదారులందరికీ ఒకే రకమైన ప్రమాణాలతో, అత్యధిక సామర్థ్యంతో డేటాను ప్రసారం చేయడంతోపాటు ఇచ్చిపుచ్చుకోవడంలోనూ వేగం ఉండేలా ఇందులో జాగ్రత్తలు తీసుకున్నారు. మొబైల్ఫోన్ల ద్వారా వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, స్ట్రీమింగ్ సౌకర్యాలు కూడా దీంతోనే అందుబాటులోకి వచ్చాయి. 3జీ గరిష్ఠ వేగం సెకనుకు మూడు మెగాబైట్లు కావడం గమనార్హం. స్మార్ట్ఫోన్ల శకానికి నాందీ పలికిన నాలుగో తరం... (4జీ) 2009 యూరోపియన్ దేశం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్, నార్వే రాజధాని ఓస్లోలలో 2009లో తొలి 4జీ సర్వీసులు మొదలయ్యాయి. లాంగ్‌టర్మ్ ఎవల్యూషన్ (ఎల్టీఈ), 4జీ ప్రమాణాల పుణ్యమా అని మాటల్లో స్పష్టత, లాటెన్సీ (నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయ్యేందుకు ఫోన్ లేదా పరికరానికి పట్టే సమయం), ఇన్స్టంట్ మెసేజింగ్ వంటివన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఇంకోలా చెప్పాలంటే స్మార్ట్ఫోన్లు, హ్యాండ్‌హెల్డ్ పరికరాల శకం మొదలైందన్నమాట. సోషల్‌మీడియా, నాణ్యమైన స్ట్రీమింగ్ సేవల హవా మొదలైందీ ఇప్పటి నుంచే. గరిష్ఠవేగం సెకనుకు 15 నుంచి 20 మెగాబైట్లు. అన్నింటా వేగం.. 5జీ (2019) డేటా ట్రాన్స్ఫర్, అప్లోడ్/డౌన్లోడ్ వేగాలు 4జీ కంటే కనీసం పది రెట్లు ఎక్కువ వేగవంతమైన మొబైల్ సర్వీసు ఈ ఐదో తరం క్లుప్తంగా 5జీ. ’’మీరు కాల్ చేస్తున్న వినియోగదారుడు నెట్వర్క్ పరిధికి ఆవల ఉన్నాడు’’ అన్న సందేశం అస్సలు వినిపించదంటే అతిశయోక్తి కాదు. తక్కువ యాంటెన్నాలతో ఎక్కువమందికి కనెక్షన్లు ఇచ్చేందుకూ వీలు కల్పిస్తుంది ఇది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ల్యాప్‌టాప్‌లతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కోవలోకి వచ్చే పరికరాలకూ డేటా సామర్థ్యం అలవడటం వల్ల అనేకానేక లాభాలు ఉంటాయని అంచనా. 2019లో పాశ్చాత్యదేశాల్లో ప్రయోగాత్మంగా మొదలైన ఈ కొత్త మొబైల్ టెక్నాలజీ ఇప్పుడు భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. ►2024 నాటికి ప్రపంచ జనాభాలో కనీసం 65 శాతం మందికి 5జీ సేవలు అందుతాయని ఎరిక్సన్ మొబైల్ రిపోర్ట్ చెబుతోంది. ►2019లో 5జీని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశంగా దక్షిణ కొరియా రికార్డు సష్టించింది. ►10 కోట్లు... ప్రస్తుతం దేశంలో 5జీ సామర్థ్యమున్న స్మార్ట్ఫోన్లు కలిగి ఉన్నవారి సంఖ్య ►50 కోట్లు... 2027 నాటికి 5జీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ►97 కోట్ల 96 లక్షల 27 వేల కోట్ల రూపాయలు!! 2035 నాటికి 5జీ టెక్నాలజీ కారణంగా అందే వస్తు, సేవల విలువ. ►మూడు కోట్ల 58 లక్షల 42 వేల కోట్ల రూపాయలు!! రానున్న 15 ఏళ్లలో కేవలం 5జీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు అందే మొత్తం. ఆరోగ్యం.. ఆనందం... సౌకర్యం... చిటికెలో రొబోటిక్ సర్జరీలు... 5జీతో వచ్చే మెరుపు వేగం అమెరికా వైద్యుడు అనకాపల్లిలో ఉన్న రోగికీ శస్త్రచికిత్స చేయడాన్ని సుసాధ్యం చేస్తుంది. కనురెప్ప మూసి తెరిచేలోపు గిగాబైట్ల సమాచారం ఖండాలు దాటగలవు కాబట్టి... అత్యవసర పరిస్థితుల్లోనూ సులువుగా ప్రపంచంలోని ఏమూలన ఉన్న నిపుణుడినైనా సంప్రదించవచ్చు. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యాధునిక వైద్యసేవలకు శ్రీకారం చుట్టగల టెలిమెడిసిన్ విస్తృత వాడకంలోకి వచ్చేందుకు వీలు కల్పిస్తుంది ఈ టెక్నాలజీ. అతితక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చునని అంచనా. కొత్త అనుభూతుల లోకం... ఇంటర్నెట్ అంటే ఇప్పటివరకూ మనకు దృశ్య శ్రవణ అనుభూతులను మాత్రమే ఇచ్చేది. అయితే 5జీ రాకతో స్పర్శ కూడా అనుభవంలోకి వస్తుంది. హ్యాప్టిక్స్ అని పిలిచే ఈ కొత్త అనుభవం ఎన్నో లాభాలు తెచ్చిపెట్టనుంది. సమాచారం మెరుపువేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి... అమెరికాలో ఓ వైద్యుడు మెడికల్ రోబో ద్వారా ఆస్ట్రేలియాలో ఉన్న రోగికి శస్త్రచికిత్స చేయగలడు. వీడియోగేమ్‌లు, సినిమాల ద్వారా స్పర్శతోపాటు అనేక ఇతర ఇంద్రియ జ్ఞానాలను ఎక్కడికైనా ప్రసారం చేయవచ్చు. 5జీతో రేడియో ఫ్రీక్వెన్సీల్లోనూ సమాచారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్కు అనుసంధానమైన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోతుంది. డ్రైవర్ అవసరం లేని వాహనాలు... డ్రైవర్లు అవసరం లేని వాహనాలు ఇప్పటికే కొన్ని అందుబాటులో ఉన్నాయి కానీ... 5జీ విస్తత వాడకంలోకి వస్తే ఇవి సర్వవ్యాప్తమవుతాయి. వేగవంతమైన డేటా ట్రాన్స్‌మిసబిలిటీ కారణంగా వాహనాల్లోని సెన్సర్లు, కెమెరాలు, మైక్రోప్రాసెసర్లు పరిసరాల్లోని ఇతర వాహనాలతో సంభాషించగలవు. తద్వారా ప్రమాదాలు కనిష్ఠస్థాయికి చేరతాయి. వాహనాల మధ్య సంభాషణ సాధ్యమైన కారణంగా రహదారిపై ముందు వెళుతున్న వాహనం ఏదైనా ప్రమాదాన్ని శంకిస్తే లేదా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటే ఆ విషయాన్ని వెనుకన వస్తున్న వాహనాలకు ప్రసారం చేయడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించగలవు. ఫ్యాక్టరీలు నడుస్తాయి.... దేశంలో 5జీ స్పెక్ట్రమ్‌కు జరిగిన వేలంలో కొంత భాగాన్ని అదానీ గ్రూపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే అదానీ గ్రూపు టెలిఫోన్ సేవలు అందించే అవకాశం తక్కువ. బదులుగా ఇండస్ట్రియల్ అంటే ఫ్యాక్టరీలు నడిపేందుకు 5జీని వాడుకుంటున్నారు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు (ఐఓటీ)లకూ 5జీ ఉపయోగపడుతుంది కాబట్టి.. సెన్సర్లు, రోబోల ద్వారా మొత్తం ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చక్కబెడతారన్నమాట. ఫ్యాక్టరీలేం ఖర్మ... భవిష్యత్తులో ఇళ్లు, భవనాలు కట్టేందుకూ 5జీ ఆధారిత రోబోలు పనికొస్తాయంటే ఆతిశయోక్తి ఏమీ కాదు. పనిచేయాల్సిన ప్రాంతాన్ని కచ్చితంగా మ్యాప్ చేయగలడం, ఇతర రోబోలు, పరికరాలతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వేగంగా, సురక్షితంగా భవన, వాహనాలు మాత్రమే కాకుండా... ఏ వస్తువునైనా అసెంబుల్ చేయడం సాధ్యమవుతుంది. కృత్రిమ మేధకు ఊపు.... లాటెన్సీ అతితక్కువగా ఉండటం, డేటా ప్రసార వేగం చాలా ఎక్కువగా ఉండటం వల్ల కృత్రిమ మేధతో పనిచేసే అల్గారిథమ్‌లను మెరుగైన నాణ్యతతో నడిపించవచ్చు. అంటే కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ నిర్ణయాలు తీసుకోవడం మరింత వేగంగా జరుగుతుందన్నమాట. దీనివల్ల అత్యంత కీలకమైన విషయాల్లోనూ మానవ ప్రమేయం లేకుండానే నిర్ణయాలు సురక్షితంగా జరిగిపోతాయి. ప్రిసిషన్ అగ్రికల్చర్ అంటే.. మానవుల అవసరమే లేకుండా డ్రోన్లు, సెన్సర్లు, కెమెరాలు, స్వతంత్రంగా వ్యవహరించే కృత్రిమ మేధ సాఫ్ట్వేర్లు కలిసికట్టుగా మన కోసం వ్యవసాయం చేస్తాయి. ఎప్పుడు ఏ కీటకనాశినిని వాడాలి? నీరెప్పుడు అందించాలి? కలుపుతీతకు సమయమేది? వంటివన్నీ తనంతట తానే వాతావరణ, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేందుకు 5జీ వీలు కల్పిస్తుంది. 5జీ టెక్నాలజీలో ’మేకిన్ ఇండియా’కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో ప్రత్యేకమైన 5జీ ఎకోసిస్టమ్ ఏర్పడనుంది.టెక్నాలజీలు, పరికరాలు ఇండియా కేంద్రంగా రూపొందనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో సంస్కరణలు కూడా 5జీ టెక్నాలజీకి దోహదపడతాయి.– కె.జి.పురుషోత్తమన్, కేపీఎంజీ. కోవిడ్ కాలంలో ఆన్లైన్లో వైద్యులను సంప్రదించడం ఎక్కువైంది. 5జీ అందుబాటులోకి వచ్చిన వెంటనే టెలిమెడిసిన్‌తోపాటు ఆరోగ్య రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. వేగవంతమైన, సురక్షితమైన టెక్నాలజీ కారణంగా వైద్యం అందించే పద్ధతులు కొత్తపుంతలు తొక్కుతాయి. స్మార్ట్‌సిటీల నిర్మాణంలో, దేశ భద్రత, నిఘా వ్యవస్థల్లోనూ 5జీ కీలకపాత్ర పోషించనుంది. 5జీ ద్వారా కేవలం వీడియోలను చూసి విశ్లేషించడం మాత్రమే కాకుండా.. గుట్టుగా ఫేస్ రికగ్నిషన్ చేసేందుకూ ఉపయోగపడుతుంది. భారత్‌లో 5జీ ఆధారిత టెక్నాలజీలు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కషి చేస్తున్న స్టార్టప్‌లకు క్వాల్కామ్ ఇండియా తనవంతు సహకారం అందిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు 5జీ హ్యాకథాన్, స్టార్టప్ హబ్‌లలో చురుకుగా పాల్గొంటున్నాము. క్వాల్కామ్ డిజైన్ ఇన్ ఇండియా ఛాలెంజ్, ఇన్నొవేషన్ ఫెలోషిప్, యాక్సలరేటర్ సర్వీసస్, ఇన్నొవేషన్ ల్యాబ్స్ వంటి కార్యక్రమాలతో 5జీ టెక్నాలజీల వద్ధికి ప్రయత్నిస్తున్నాం. – రాజెన్ వగాడియా, వైస్ ప్రెసిడెంట్, క్వాల్కామ్ ఇండియా. -
మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!
దేశంలో 5జీ విప్లవం మొదలైంది. టెలికం దిగ్గజాలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర సంస్థలు వినియోగదారులకు 5జీ సేవల్ని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ముందుగా జియో,ఎయిర్‌టెల్‌లు మరికొద్ది రోజుల్లో ఈ ఫాస్టెస్ట్ నెట్ వర్క్‌ను అందిస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు..తాము వినియోగిస్తున్న ఫోన్ 5జీ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేస్తుందా? లేదా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మనం 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్ వర్క్‌కు ఫోన్లు సపోర్ట్ చేస్తాయో? లేదో? తెలుసుకుందాం. మీ ఫోన్ 5జీ నెట్వర్క్ని సపోర్ట్ చేస్తుందో లేదో ఇలా చెక్ చేయండి స్టెప్1: మీ ఆండ్రాయిడ్ ఫోన్లో, సెట్టింగ్‌ల యాప్‌కి వెళ్లండి స్టెప్2: 'వైఫై & నెట్వర్క్' ఆప్షన్‌పై ట్యాప్ చేయండి స్టెప్3: ఇప్పుడు 'సిమ్ & నెట్వర్క్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి స్టెప్4: సిమ్& నెట్ వర్క్ ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు మీ ఫోన్ ఏ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేస్తుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. స్టెప్5: మీ ఫోన్ 5జీకి సపోర్ట్ చేస్తే.. ఇదిగో ఇలా 2జీ/3జీ/4జీ/5జీఇలా చూపిస్తుంది. సపోర్ట్ చేయకపోతే సపోర్ట్ చేస్తే మంచిదే. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలనే ప్రశ్నకు సమాధానంగా 5జీ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రియల్మీ, షావోమీతో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు 5జీ నెట్ వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం..రానున్న రోజుల్లో 5జీకి సపోర్ట్ చేసే రూ.10వేల లోపు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయని చిప్, సాఫ్ట్ వేర్ తయారీ సంస్థ క్వాల్కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి👉 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు', 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
అదరగొడుతున్న జియో..మరి ఎయిర్టెల్!
న్యూఢిల్లీ: టెలికం చందాదారులు జూన్ చివరికి 117.29 కోట్లకు పెరిగారు. రిలయన్స్ జియో ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించింది. వైర్లెస్ చందాదారులు మే చివరికి 114.55 కోట్లుగా ఉంటే, జూన్ చివరికి 114.73 కోట్లకు పెరిగారు. రిలయన్స్ జియో కొత్తగా 41.3 లక్షల కస్టమర్లను జూన్‌లో సొంతం చేసుకుంది. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 41.3 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి 7.93 కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 36.29 కోట్లకు చేరింది. వొడాఫోన్ ఐడియా జూన్‌లో 18 లక్షల మందిని కోల్పోయింది. సంస్థ పరిధిలో 25.66 కోట్ల కస్టమర్లు మిగిలారు. బీఎస్ఎన్ఎల్ 13.27 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. -
‘బీఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా..ప్రైవేటుకు అండగా కేంద్ర ప్రభుత్వం’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపరిమిత డేటా.. అదీ ఎటువంటి స్పీడ్ నియంత్రణ లేకుండా. అదనంగా అపరిమిత కాల్స్. 30 రోజుల కాల పరిమితి గల ఈ ట్రూలీ అన్లిమిటెడ్ ప్యాక్ కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రూ.398 చార్జీ చేస్తోంది. అపరిమిత డేటాతో రూ.98 నుంచి ప్యాక్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతానికి ఈ సేవలు 3జీ సాంకేతికతపైనే. భారత టెలికం రంగంలో చవక ధరలతో సేవలు అందించడమేగాక పారదర్శక సంస్థగా పేరున్న బీఎస్ఎన్ఎల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన పునరుద్ధరణ ప్యాకేజీని ఆసరాగా చేసుకుని 4జీ, 5జీ సర్వీసుల్లోనూ ఇదే స్థాయిలో గనక చార్జీలను నిర్ణయిస్తే మార్కెట్లో సంచలనమే అని చెప్పవచ్చు. ప్రైవేట్ సంస్థలకు సవాల్ విసరడమేగాక అధిక చార్జీలకు కట్టడి పడడం ఖాయం. ఇదే జరిగితే బీఎస్ఎన్ఎల్ కొత్త వైభవాన్ని సంతరించుకోవడం ఎంతో దూరంలో లేదు. అంతేకాదు సామాన్యులకూ నూతన సాంకేతికత చేరువ అవుతుంది. వచ్చే రెండేళ్లలో బీఎస్ఎన్ఎల్ కనీసం 20 కోట్ల 4జీ, 5జీ కస్టమర్లను సొంతం చేసుకుంటుందని కేంద్రం భావిస్తోంది. 5జీ సేవలూ అందించవచ్చు.. బీఎస్ఎన్ఎల్కు ఊతమిచ్చేందుకు రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ జూలైలో ఆమోదించింది. ఇందులో రూ.43,964 కోట్లు నగదు రూపంలో, రూ.1.2 లక్షల కోట్లు నగదుయేతర రూపంలో నాలుగేళ్ల వ్యవధిలో కేంద్రం అందించనుంది. 4జీ సర్వీసులకై 900, 1800 మెగాహెట్జ్ ఫ్రీక్వెన్సీలో రూ.44,993 కోట్ల విలువైన స్పెక్ట్రంను బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం కేటాయించనుంది. 900, 1800 మెగాహెట్జ్ స్పెక్ట్రంతో 5జీ సేవలనూ అందించవచ్చు. అత్యంత మారుమూలన ఉన్న 24,680 గ్రామాలకు 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చే రూ.26,316 కోట్ల ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు బీఎస్ఎన్ఎల్కు సిబ్బంది బలమూ ఉంది. ప్రస్తుతం సంస్థలో సుమారు 62,000 మంది పనిచేస్తున్నారు. ప్రధాన పోటీ సంస్థల మొత్తం ఉద్యోగుల కంటే బీఎస్ఎన్ఎల్ సిబ్బంది సంఖ్యా బలం ఎక్కువ. ఈ స్థాయి ఉద్యోగులతో వినియోగదార్లను గణనీయంగా పెంచుకోవచ్చు. జియో వద్ద 18,000, ఎయిర్టెల్ 20,000, వొడాఫోన్ ఐడియా వద్ద 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం. ప్రైవేటుకు అండగా.. ప్రభుత్వ పోకడలే సంస్థ ప్రస్తుత పరిస్థితికి కారణమని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టం చేసింది. టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఈ మేరకు ఘాటుగా లేఖ రాసింది. ‘బీఎస్ఎన్ఎల్కు వ్యతిరేకంగా, ప్రైవేటుకు అండగా ప్రభుత్వం వ్యవహరించింది. 2019 అక్టోబర్ 23న కేంద్రం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్కు 4జీ స్పెక్ట్రం కేటాయింపు కూడా ఉంది. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల కారణంగా స్పెక్ట్రం ప్రయోజనాన్ని బీఎస్ఎన్ఎల్ అందుకోలేకపోయింది. 49,300 టవర్లను అప్‌గ్రేడ్ చేసి ఉంటే రెండేళ్ల క్రితమే 4జీ సేవలు ప్రారంభం అయ్యేది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇది బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు తీవ్ర ఆటంకం కలిగించింది. 50,000ల 4జీ టవర్ల కొనుగోలుకై 2020 మార్చిలో టెండర్లను ఆహ్వానించింది. టెలికం ఎక్విప్మెంట్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫిర్యాదుతో టెండర్ రద్దు అయింది. పైగా దేశీయ కంపెనీల నుంచే పరికరాలను కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టారు. ప్రైవేట్ కంపెనీలు విదేశీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, సామ్సంగ్ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్కు మాత్రమే ఎందుకీ నిబంధన? ఆలస్యం అయినప్పటికీ లాభా లు అందించే దక్షిణ, పశ్చిమ ప్రాంతంలో రూ.500 కోట్లతో నోకియా సహకారంతో 19,000 టవర్లను అప్‌గ్రేడ్ చేసి ఇప్పటికైనా 4జీ అందించవచ్చు’ అని ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి పి.అభిమన్యు మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇది కంపెనీ స్థానం ట్రాయ్ ప్రకారం 2022 మే 31 నాటికి 114.5 కోట్ల వైర్లెస్ సబ్స్క్రైబర్లలో జియోకు 35.69%, ఎయిర్టెల్ 31.62%, వొడాఐడియా 22.56% వాటా ఉంటే వెనుకంజలో ఉన్న బీఎస్ఎన్ఎల్ 9.85% వాటాకు పరిమితమైంది. మేలో జియో 30 లక్షలు, ఎయిర్టెల్ 10 లక్షల మంది యూజర్లను కొత్తగా సొంతం చేసుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 5.3 లక్షల మందిని కోల్పోయింది. దేశంలో వైర్‌లైన్ కస్టమర్లు 2.52 కోట్ల మంది ఉన్నారు. ఇందులో అగ్ర స్థానంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ వాటా 28.67%. జియోకు 26.7%, ఎయిర్‌టెల్‌కు 23.66% వాటా ఉంది. మొత్తం 79.4 కోట్ల బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లలో జియో 52.18% వాటాతో 41.4 కోట్లు, ఎయిర్టెల్ 27.32%తో 21.7 కోట్లు, వొడాఫోన్ ఐడియా 15.51%తో 12.3 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 3.21% వాటాతో 2.55 కోట్ల మంది ఉన్నారు. వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో జియోకు 58.9 లక్షలు, ఎయిర్టెల్ 47.4 లక్షలు, బీఎస్ఎన్ఎల్కు 47.4 లక్షల మంది యూజర్లు ఉన్నారు. -
దేశంలో 5జీ సేవలు, జాబ్ మార్కెట్లో సరికొత్త జోష్!
ముంబై: మాంద్యం, ద్రవ్యోల్బణ భయాలతో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ మందగిస్తున్నప్పటికీ .. దేశీయంగా మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. చాలా నెలల పాటు అనిశ్చితిలో కొట్టుమిట్టాడిన జాబ్ మార్కెట్ ప్రస్తుతం స్థిరపడుతోంది. నియామకాలకు డిమాండ్ పుంజుకుంటోంది. తాము నిర్వహించే ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ (ఎంఈఐ)ప్రకారం నెలవారీగా జాబ్ పోస్టింగ్‌లు జులైలో ఒక్క శాతం పెరిగినట్లు కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌డాట్‌కామ్ తెలిపింది. నామమాత్రం పెరుగుదలే అయినప్పటికీ ఉద్యోగాల మార్కెట్ కాస్త స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, బీమా (బీఎఫ్ఎస్ఐ), కెమికల్స్/ప్లాస్టిక్/రబ్బర్, పెయింట్లు, ఎరువులు/క్రిమి సంహారకాలు మొదలైన పరిశ్రమల్లో నియామకాలపై ఆసక్తి నెలకొంది. ఇక పెరుగుతున్న డిజిటైజేషన్, 5జీ సర్వీసులను ప్రవేశపెట్టనుండటం వంటి అంశాల నేపథ్యంలో టెలికం రంగంలోనూ హైరింగ్ జోరు కనిపించింది. పండుగ సీజన్ వస్తుండటంతో రిటైల్ రంగంలోనూ నియామకాలకు డిమాండ్ నెలకొన్నట్లు సంస్థ సీఈవో శేఖర్ గరిశ తెలిపారు. చదవండి👉 5జీ మాయాజాలం: ఎయిర్టెల్ వర్సెస్ జియో..వెయ్యి నగరాల్లో! -
5జీ అంటే ఏమిటి? దీని గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
అవసరాలకు అనుగణంగా టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ వస్తుంది. అందులో భాగమే ఈ ఐదవ జనరేషన్ నెట్ వర్క్. గతంలో మొబైల్ నెట్ వర్క్ కోసం 2జీ నెట్ వర్క్ ఉండేది. దానితో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చాలా సమయమే పట్టేది. ఆ తర్వాత ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతూ 3జీ వచ్చింది. ప్రస్తుతం 4జీ నెట్ వర్క్‌లను వినియోగిస్తున్నాం. ఇందులో 10 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వేగంతో డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే త్వరలో రాబోతున్న 5జీ నెట్ వర్క్ 4జీ కంటే 10రెట్ల వేగంగా పనిచేస్తుంది. దీని వేగం కనీసం 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీ వరకు ఉండనుంది. గరిష్టంగా 10 జీబీపీఎస్ ఉండొచ్చని అంచనా. ఇక 5జీ వేగానికి ఉదాహరణ చెప్పాలంటే 3 గంటల నిడివిగల సినిమాను ఒక్క నిమిషంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాంటి ఫాస్టెస్ట్ నెట్ వర్క్ 5జీ నెట్ వర్క్‌కు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్ వర్క్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ..ఇతర టెలికాం సంస్థల కంటే ముందుగానే 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ప్రకటించింది. జియో సైతం ఆగస్ట్ 15కి 5జీ సేవల్ని వినియోగంలోకి తేనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 5జీ అంటే ఏమిటి. 5జీ అంటే ఏమిటి, 4జీకి.. 5జీకి ఉన్న తేడా ఏంటి? 5జీ అంటే ఫిప్త్ జనరేషన్ నెట్వర్క్. అంతర్జాతీయ ప్రమాణలతో 4జీ కంటే 10రెట్ల వేగంతో అందుబాటులోకి రానున్న వైర్ లెస్ నెట్ వర్క్. 5జీ నెట్ వర్క్ వేగంతో పాటు అసలు నెట్ వర్క్ సరిగ్గా లేని ప్రదేశాల్లో సైతం ఉదాహరణకు గంటల డ్యూరేషన్ ఉన్న సినిమా వీడియోల్ని 1, లేదా 2 నిమిషాల్లో డౌన్ చేసుకోవడం, తక్కువ నెట్ వర్క్‌లో సైతం ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వడం, వర్క్ ఫ్రం హోం లాంటి పనుల్ని చక్కబెట్టుకోవచ్చు. వీటితో పాటు హై క్వాలిటీ వీడియో గేమ్స్‌ను ఆడే సౌకర్యం కలగనుంది. 5జీలో రెండు నెట్ వర్క్‌లు 5జీలో రెండు రకాలైన నెట్వర్క్లున్నాయి. అందులో ఒకటి 'ఎంఎంవేవ్' (mm Wave). నెట్ వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న నెట్ వర్క్‌తో ఆన్లైన్లో మనకు కావాల్సిన పనిని సులభంగా,వేగంగా పూర్తి చేసుకోవచ్చు. 5జీలో రెండో నెట్ వర్క్ 'సబ్-6జీహెచ్‌జెడ్'..ఈ నెట్ వర్క్ స్లోగా ఉంటుంది. కానీ 4జీతో పోలిస్తే కొంచెం బెటర్, ఇందుకోసం నెట్వర్క్ కవరేజీ బాగుండాలి. వినియోగించేది సబ్-6హెచ్‌జెడ్ 5జీ నెట్ వర్క్‌నే 5జీ నెట్ వర్క్‌లో ఎంఎం వేవ్ కంటే సబ్- 6హెచ్‌జెడ్ నెట్ వర్క్ స్లోగా ఉంటుంది. అయినా చాలా దేశాలు సబ్ - 6జీ హెచ్ జెడ్ నెట్ వర్క్‌నే వినియోగిస్తున్నాయి. అందుకు కారణం.. ఖర్చు తక్కువ. నెట్ వర్క్ పోల్స్‌ను దూరం దూరం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నెట్ వర్క్ 4జీ కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అంతరాయం ఏర్పడితే ఆ సమస్యని త్వరగా పరిష్కరించుకోవచ్చు. ఎంఎం వేవ్ 5జీ నెట్ వర్క్ విస్తరణ ఖర్చు చాలా ఎక్కువ. వాటి నెట్ నెట్ వర్క్ పోల్స్ దగ్గర దగ్గరగా.. ఉండాలి. లేదంటే నెట్ వర్క్ సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా నెట్ వర్క్ పోల్స్ ను ఏర్పాటు చేయడం కష్ట తరం. అందుకే చాలా దేశాలు ఎంఎం వేవ్ 5జీ నెట్ వర్క్ జోలికి వెళ్లవు. 5జీ బ్యాండ్లు అంటే ఏమిటి? గత కొన్నేళ్లుగా 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేస్తూ స్మార్ట్ఫోన్లు విడుదల అవుతున్నాయి. ఆ ఫోన్ల బ్యాండ్ నెంబర్లను ప్రకటిస్తున్నాయి.లేటెస్ట్గా విడుదలయ్యే కొత్త స్మార్ట్ఫోన్లలో వాటి తయారీ సంస్థలు సైతం 9 లేదా 12 బ్యాండ్లకు సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ బ్యాండ్లు ఏమిటి? వాటి ప్రాముఖ్య ఏమిటి? 5జీ నెట్ వర్క్ అనే రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్తో పనిచేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్‌గా పిలిచే వీటిని చిన్న చిన్న బ్యాండ్స్‌గా వర్గీకరిస్తారు. అందులో లో బ్యాండ్లు (వైడ్ కవరేజ్,స్లో స్పీడ్) - కవరేజీ ఎక్కువగా ఉండి..స్లోగా ప్రారంభమై..స్పీడ్‌గా పనిచేస్తుంది. మిడ్ రేంజ్ బ్యాండ్లు, హై రేంజ్ బ్యాండ్లు..లిమిటెడ్ కవరేజ్‌లో హై స్పీడ్‌గా కనెక్ట్ అవుతాయి. ఈ 'n78' బ్యాండ్ ఎందుకోసం అయితే ఈ బ్యాండ్ల విషయంలో స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు అయోమయానికి గురవ్వడం సర్వసాధారణంగా చూస్తుంటాం. అవగాహన లేకపోయినా సరే.. లో బ్యాండ్ ఉన్న ఫోన్ల కంటే హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేస్తే 5జీ నెట్ వర్క్ పనితీరు బాగుంటుందని అనుకుంటాం. వాస్తవానికి అందులో నిజం లేదని టెలికాం నిపుణులు చెబుతున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కంపెనీలు బ్యాండ్ ఎక్కువ చెప్పారని కాకుండా దేశంలో వినియోగంలోకే వచ్చే 'n78' బ్యాండ్ ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఎన్ని దేశాల్లో 5జీ అందుబాటులో ఉందో తెలుసా? త్వరలో భారత్‌లో 5జీ నెట్ వర్క్ సేవలు వినియోగంలోకి రానున్నాయి. కానీ ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పటికే 5జీ నెట్ వర్క్‌లను వినియోగిస్తున్నాయి. స్టాటిస్టా లెక్కల ప్రకారం.. చైనాలో 356 నగరాల్లో, అమెరికాలో 296 నగరాల్లో, పిలిపిన్స్‌లో 98 నగరాల్లో, సౌత్ కొరియా 85 నగరాల్లో, కెనడా 84నగరాల్లో, స్పెయిన్ 71 నగరాల్లో, ఇటలీ 65 నగరాల్లో, జర్మనీ 58 నగరాల్లో, యూకేలో 57 నగరాల్లో, సౌదీ అరేబియాలో 48 నగరాల్లో ఈ 5జీ సేవల్ని వినియోగిస్తున్నారు. -
దేశంలో 5జీ, జియో నెట్వర్క్ యూజర్లకు శుభవార్త!
5జీ స్పెక్ట్రం వేలం ముగిసింది. ఏడురోజుల పాటు జరిగిన బిడ్డింగ్‌లో మొత్తం రూ.1,50,173కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలుకు బిడ్లు దాఖలైనట్లు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు. ఆగస్ట్ 10కల్లా స్పెక్ట్రం కేటాయింపులు జరుపుతామని తెలిపారు. దీంతో మనిషి జీవన విధానాన్ని సమూలంగా మార్చే 5జీ సేవలు త్వరలో ప్రారంభం కానుండగా..తొలిసారి జియో 5జీ నెట్ వర్క్ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పలు నివేదికల ప్రకారం..ఈ ఏడాది అక్టోబర్‌లో 5జీ నెట్ వర్క్‌లను వినియోగదారులకు అందించేందుకు మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సదరు సంస్థలు 5జీ నెట్ వర్క్ నిర్మాణ పనుల్ని పూర్తి చేశాయని టెస్ట్‌లతో పాటు ట్రయల్స్ నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఫస్ట్ జియోనే టెలికాం రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న రియలయన్స్ జియో దేశంలో తన 5జీ సేవల్ని వినియోగదారులకు అందించనుంది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే, జామ్‌నగర్ నగరాల్లో 5జీ నెట్వర్క్ పనితీరుపై ట్రయల్స్ నిర్వహించినట్లు సంస్థ వార్షిక ఫలితాల విడుదల సందర్భంగా రియలన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు. 5జీపై టెలికాం కంపెనీలు ►రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ ఎం అంబానీ మాట్లాడుతూ పాన్ ఇండియా అంతటా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం' అని అన్నారు. ►దేశంలో పలు ప్రధాన నగరాల నుంచి దశల వారీగా 5జీ సేవల్ని అందుబాటులోకి తెస్తామని ఎయిర్టెల్ తెలిపింది ►ఇప్పుడే బిడ్డింగ్ ముగిసింది. 4జీ నెట్ వర్క్‌ను పటిష్టం చేసి 5జీని అందుబాటులోకి తెస్తామని వొడాఫోన్ ఐడియా చెప్పింది. ►మార్కెట్ మొత్తం మీద 7శాతం స్మార్ట్ ఫోన్లలో మాత్రమే 5జీ నెట్ వర్క్‌ను వినియోగించుకోవచ్చు. అందుకే టెలికాం కంపెనీలు ప్రధాన నగరాల నుంచి దశల వారీగా 5జీ నెట్ వర్క్‌లను విస్తరిస్తాయిని నోమురా తన నివేదికలో పేర్కొంది. -
'మొబైల్ డేటా చీప్‌గా దొరికే దేశాల జాబితాలో భారత్'!
అతి తక్కువ ధరకే మొబైల్ డేటా లభ్యమయ్యే దేశాల జాబితాలో భారత్ నిలిచింది. 233 దేశాల్లో సేకరించిన డేటా ఆధారంగా భారత్‌తో పాటు మరో నాలుగు దేశాల్లో వినియోగదారులకు మొబైల్ డేటాగా చీప్‌గా దొరుకుతున్నట్ల తాజాగా విడుదలైన ఓ నివేదిక తెలిపింది. యూకేకి చెందిన 'కేబుల్.కో.యూకే' అనే టెలికాం సంస్థ 233 దేశాల్లో 1జీబీ డేటా ధర ఎంత ఉందనే అంశంపై ఓ డేటాను విడుదల చేసింది. అందులో మొబైల్ డేటా తక్కువ ధరకే లభ్యమయ్యే 5 దేశాల్లో భారత్‌కు 5వ స్థానం దక్కింది. ఇక ఆ 5దేశాల్లో ఇజ్రాయిల్ దేశం 1జీబీ డేటాను 0.04 డాలర్లు (భారత్ కరెన్సీలో రూ.3.20), ఇటలీ 0.12 డాలర్లు(రూ.9.59), శాన్ మారినో 0.14 డాలర్లు (రూ.11.19), ఫిజి దేశంలో 1జీ డేటా 0.15 డాలర్ల (రూ.11.99), భారత్ 0.17 డాలర్ల (రూ.13.59)తో వరుస స్థానాల్లో నిలిచాయి. 1జీబీ మొబైల్ డేటా రూ.3,323 కేబుల్.కో.యూకే నివేదిక మొబైల్ డేటా ధర ఎక్కువగా ఉన్న 5 దేశాల జాబితాను విడుదల చేసింది. అందులో 1జీబీ డేటాను 41.06 డాలర్ల(రూ.3,323.92)కు అత్యధికంగా అమ్ముడవుతున్న దేశాల జాబితాలో సెయింట్ హెలెనా ప్రథమ స్థానలో నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఫల్క్ ల్యాండ్ దీవుల్లో 38.45 డాలర్లు (రూ.3,072.11) , సెంట్రల్ ఆఫ్రికా దేశమైన సెయింట్ థామస్ (São Tomé) ప్రిన్సిపి (principe)లో 29.49 డాలర్లు ( రూ.2,356) , టోకెలావ్ (Tokelau )లో 17.88 (రూ.1428) , యెమన్ దేశంలో 16.58 డాలర్ల (1324.72) ధరతో వరుస స్థానాల్లో నిలిచాయి. -
5జీ వచ్చేస్తుంది, ఏఏ నగరాల్లో ముందంటే? ఇదే లిస్టు!
5జీ స్ప్రెక్టం వేలం కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జులై 26న నిర్వహించే ఈ వేలంలో టెలింకా సంస్థలకు 72జీహెచ్‌జెడ్ 5జీ స్ప్రెక్టం బిడ్లను 20ఏళ్ల పాటు అప్పగించనుంది. దీంతో ఈ ఏడాదిలోపే 5జీ నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రానున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అదే జరిగితే 4జీ కంటే 5జీ సేవల్ని 10రెట్ల వేగంతో వినియోగించుకోవచ్చు. 5జీ నెట్ వర్క్ వినియోగం టెలికాం శాఖ 5జీ స్ప్రెక్టం వేలంలో లో(తక్కువ)లో (600ఎంహెచ్‌జెడ్, 800 ఎంహెచ్‌జెడ్, 900 ఎంహెచ్‌జెడ్, 1800 ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్, 2300 ఎంహెచ్ జెడ్‌లు) ఉండగా మిడ్‌లో ( 3300ఎంహెచ్‌జెడ్) హైలో (26జీహెచ్‌జెడ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటాయి. ఇక మనకు 5జీ సర్వీస్ అందుబాటులోకి రావాలంటే మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటే సరిపోతుంది. 13 నగరాల్లో 5జీ స్ప్రెక్టం వేలం జులై 26న తొలిదశలో 5జీ నెట్వర్క్ స్ప్రెక్టం వేలం 13 నగరాల్లో జరగనుంది. వీటిలో అహ్మదాబాద్, బెంగళూరు, చండీఘడ్, చెన్నై, ఢిల్లీ, గాంధీ నగర్ (గుజరాత్), గురుగ్రామ్, హైదారబాద్, జామ్ నగర్,కోల్ కతా, లక్నో, ముంబై, పూణేలు ఉన్నాయి. అంటే ముందుగా ఏ నగరంలో స్ప్రెక్టం వేలం జరిగితే ఆ ప్రాంతంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 5జీ రేసులో ఏఏ సంస్థలు ఉన్నాయంటే ఇప్పటికే 5జీ సేవల్ని వినియోగదారుల్ని అందిస్తామంటూ టెలికాం సంస్థ 5జీ ట్రయల్స్ నిర్వహించాయి. వాటిలో ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు ఉండగా.. ఏ సంస్థ 5జీ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తుందనేది తెలియాంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. చదవండి👉సంచలనం, భారత్‌లో ఎయిర్టెల్ 5జీ సేవలు..ఎప్పట్నుంచో తెలుసా! -
నేను చెప్తున్నాగా! ఎయిర్టెల్ భవిష్యత్తు బ్రహ్మాండం!
న్యూఢిల్లీ: యుద్ధాలతో రాటుదేలిన తమ సంస్థ భవిష్యత్ బాగుంటుందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ధీమా ధీమా వ్యక్తం చేశారు. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, మార్కెట్లో తీవ్ర పోటీ వంటి అనేక ఎత్తుపల్లాలను చూసిన ఎయిర్టెల్ ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉందని ఆయన చెప్పారు. ‘దేశీయంగా టెలికం రంగంలో ప్రస్తుతం రెండున్నర సంస్థలు మాత్రమే మిగిలాయి. ఇక భవిష్యత్ బాగానే ఉండేలా కనిపిస్తోంది. మరో సంక్షోభం ఏదైనా వస్తుందా రాదా అంటే ఏమో ఎవరు చెప్పగలరు? అయితే, మా కంపెనీ యుద్ధాలతో రాటుదేలి చాలా పటిష్టంగా మారింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ వివరించారు. ఈ సందర్భంగా 2002–2003 మధ్య ఎయిర్టెల్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో కంపెనీ కుప్పకూలిపోవడం ఖాయమనే భావన నెలకొందని పేర్కొన్నారు. ‘మేము దేశవ్యాప్తంగా సేవలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టిన దశలో మా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో డబ్బు వేగంగా కరిగిపోతోంది ఆదాయాలు పెరగడం లేదు. కొన్నాళ్ల క్రితమే రూ. 45 దగ్గర లిస్టయిన షేరు ధర రూ.19కి పడిపోయింది. ఓడలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఏది చేసినా కలిసి రావడం లేదు. అలాంటప్పుడు సరైన వ్యూహం, సరైన టెక్నాలజీ ఉంటే కచ్చితంగా గెలుపు మాదే అవుతుందనే నమ్మకంతో ముందుకెళ్లాం. అదే ఫలితాలనిచ్చింది. 18 నెలల్లోనే షేరు రూ.19 నుంచి ఏకంగా రూ.1,200కు ఎగిసింది‘ అని మిట్టల్ వివరించారు. 2008–09లో కొత్తగా 12 సంస్థలు టెలికం లైసెన్సులు పొందినప్పుడు కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కానీ తాము ఈసారి సిద్ధంగా ఉండి, దీటుగా ఎదుర్కొనగలిగామని మిట్టల్ పేర్కొన్నారు. -
బిగ్ షాక్: సామాన్యుడి నెత్తిన మరో పిడుగు!
ఉప్పు నుంచి పప్పుదాకా..పెట్రోల్ నుంచి వంట నూనె దాకా. ఇలా పెరుగుతున్న నిత్యవసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో సామాన్యుడిపై ధరల భారం పడనుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజాలన్నీ గతేడాది నవంబర్ నెలలో 20, 25 శాతం (కంపెనీని బట్టి) టారిఫ్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు మరోసారి యూజర్లపై ధరల భారం మోపేందు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా... ఎవరతై తక్కువ ప్లాన్ టారిఫ్ ప్లాన్లను వినియోగించడం, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల బేస్‌ను తగ్గించాలని చూస్తున్నాయి. అదే జరిగితే యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాయి. యూజర్లు తగ్గడం లేదు గతేడాది నవంబర్ నెల నుంచి ఆయా టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని పెంచాయి. అయినా సరే గత కొన్ని నెలలుగా యాక్టీవ్ యూజర్ల సంఖ్య పెరగడం, గతంలో పెంచిన టారిఫ్ ధరల గురించి యూజర్లు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయడం లేదనే భావనలో టెలికాం సంస్థలున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జియో, ఎయిర్టెల్ రిలయన్స్ జియో నెట్ వర్క్ నుంచి ఇన్ యాక్టీవ్ నెంబర్లు తగ్గారు. దీంతో యాక్టీవ్‌గా ఉన్న యూజర్ల సంఖ్య పెరిగింది. 94శాతంతో ఇది ఫిబ్రవరి చివరి నాటికి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికు చేరుకుంది. మరోవైపు ఎయిర్టెల్ సైతం తన ఏఆర్‌పీయూని పెంచడంపై దృష్టి సారించింది. గత డిసెంబర్ నెల సమాయానికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.163 ఉండగా..టారిఫ్ ధరల్ని పెంచడం ద్వారా ఈ ఏడాది ఏఆర్‌పీయూని రూ.200 ఏఆర్‌పీయూకి పెంచుకోవాలని చూస్తుంది. అదేవిధంగా వొడాఫోన్ ఐడియా సైతం ఏఆర్‌పీయూని పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కానీ ఆ సంఖ్య ఎంతనే స్పష్టం చేయలేదు. మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు ఈ సందర్భంగా టెలికాం నిపుణులు..గతంలో పెంచిన టారిఫ్ ధరలతో కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదన్నారు. అయితే మరికొన్ని నెలల్లో స్పెక్ట్రమ్ వేలం తర్వాత టెలికాం ఆపరేటర్లు లాభాల్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. అందుకే దాన్ని అధిగమించేందుకు ముందస్తుగా మనదేశ టెలికాం సంస్థలు టారిఫ్ ధరల్ని అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు 'దేశంలో 5జీ నెట్ వర్క్ విజయవంతం కావాలంటే ఏఆర్పీయూ మరింత వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉ఎగబడి మరీ కొంటున్నారు, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
టెలికాం దిగ్గజ సంస్థల విలీనం వాయిదా, అదే కారణం!
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెలికం నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్ త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4జీ టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనున్నట్టు టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు. 5జీ నెట్వర్క్ అమల్లోకి వచ్చిన తర్వాతే రైళ్లలోపల ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌లో రైళ్లు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్లో అంతరాయాలు వస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి చేసిన 4జీ నెట్వర్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు వచ్చాయి. బీఎస్ఎన్ఎల్ ముందుగా 6 వేల టవర్లకు ఆర్డర్ ఇవ్వనుంది. ఆ తర్వాత మరో 6,000. అనంతరం లక్ష 4జీ టవర్లు ఏర్పాటు చేస్తుంది’’ అని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనాన్ని ఆర్థిక కారణాల దృష్ట్యా వాయిదా వేసినట్టు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ రాజ్యసభకు తెలిపారు. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రతిపాదిత విలీనం పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. ఎంటీఎన్ఎల్కు అధిక రుణభారం ఉండ డం సహా ఆర్థిక కారణాలు ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం వాయిదాకు కారణమని చెప్పారు. -
సంచలనం, భారత్‌లో ఎయిర్టెల్ 5జీ సేవలు..ఎప్పట్నుంచో తెలుసా!
న్యూఢిల్లీ: అధునాతన 5జీ నెట్వర్క్ పూర్తిగా అందుబాటులోకి వస్తే చాలా అంశాలను సాధ్యం చేసుకునేందుకు అవకాశం ఉందని టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. ఇందులో భాగంగా 1983 క్రికెట్ వరల్డ్ కప్‌లో దిగ్గజం కపిల్‌దేవ్ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలో చూస్తున్న అనుభూతిని కలిగించేలా ప్రదర్శన నిర్వహించింది. దీని కోసం 5జీ సాంకేతికతతో కపిల్‌దేవ్ వర్చువల్ అవతార్ హోలోగ్రామ్ రూపొందించింది. రియల్ టైమ్‌లో ఆడియన్స్‌తో సంభాషిస్తున్న అనుభూతి కల్పించింది. ఈ ప్రదర్శన సందర్భంగా వర్చువల్ రూపంలో స్టేజీపైన ప్రత్యక్షమైన కపిల్‌దేవ్, ఆడియన్స్‌తో సంభా షించడంతో పాటు అప్ప ట్లో ఇన్నింగ్స్ గురించిన విశేషాలు కూడా వివరించారు. సెకనుకు 1 గిగాబిట్ స్పీడ్ ఇంటర్నెట్ వేగంతో ఏకకాలంలో 50 మంది యూజర్లు తమ 5జీ స్మార్ట్ఫోన్లలో 4కే నాణ్యతతో దీన్ని వీక్షించినట్లు ఎయిర్టెల్ తెలిపింది. 2022–23లో 5జీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. -
టీసీఎస్ సంచలనం..5జీ..6జీ!!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏ టెలికం సంస్థకైనా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఐటీ దిగ్గజం టీసీఎస్ హెడ్ (కమ్యూనికేషన్, మీడియా..ఇన్ఫర్మేషన్ సర్వీసుల విభాగం) కమల్ భదాడా తెలిపారు. ఇప్పటికే పలు దేశాల్లోని టెల్కోలకు టెక్నాలజీ ఇవ్వడంతో పాటు వాటి నెట్‌వర్క్‌లను నిర్వహించే సర్వీసులు కూడా అందిస్తున్నట్లు వివరించారు. దేశీ అవసరాలకు తగ్గట్లు నెట్‌వర్క్‌పై మరింతగా కసరత్తు చేస్తున్నామని కమల్ వివరించారు. ప్రస్తుతం చాలా దేశాల్లో 5జీ నెట్వర్క్ వినియోగం మధ్యలో ఉండగా.. భారత్‌లో ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు. 2023 లేదా 2024 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు మరో 3–4 ఏళ్లు పడుతుందని కమల్ తెలిపారు. అటు పైన 6జీ నెట్వర్క్ కోసం ప్రక్రియ ప్రారంభం కాగలదని వివరించారు. చదవండి: దిమ్మతిరిగే స్పీడ్.. చిటికెలో 27 సినిమాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు!! -
దిమ్మతిరిగే స్పీడ్.. చిటికెలో 27 సినిమాల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు!!
ప్రపంచ దేశాల్లో 5జీ (5జనరేషన్) వైర్లెస్ మొబైల్ నెట్ వర్క్ ప్రారంభం కానేకాలేదు. కానీ అప్పుడే 6జీ టెక్నాలజీ గురించి చర్చ మొదలైంది. 5జీ కంటే 6జీ ఎంత వేగంతో పనిచేస్తుంది. ఎంత తక్కువ సమయంలో డేటానుషేర్ చేయొచ్చు. ఎన్ని రోజుల్లో 6జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందనే' పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా 6జీ మొబైల్ టెక్నాలజీ వైర్లెస్ ట్రాన్స్మిషన్ స్పీడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. చైనా రీసెర్చర్లు సెకన్ వ్యవధిలో 206.25 డేటాను షేర్ చేసే కెపాసిటీ 6జీ టెక్నాలజీని బిల్డ్ చేసినట్లు చైనా మీడియా తన కథనంలో పేర్కొంది. అంతేకాదు 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 5జీ కంటే 100రెట్లు ఫాస్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించింది. ఉదాహరణకు 4కే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మొత్తం 59.5గంటలు ఉండగా..ఆ మొత్తాన్ని చిటికెలో డౌన్లోడ్ చేయొచ్చు. అంటే 206.25గిగా బైట్ల వేగంతో ఆ అన్నిగంటల సినిమాను కేవలం 16 సెకన్లలో డౌన్లోడ్ చేయొచ్చన్నమాట. కాగా, సౌత్ కొరియా మీడియా కథనాల ప్రకారం..టెలికాం సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు 6జీ టెక్నాలజీ 2030 కల్లా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 5జీకి కోవిడ్ దెబ్బ ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో కోవిడ్, సప్లయి చైన్, 5జీ ఎక్విప్మెంట్ అధిక ధరల కారణంగా 5జీ నెట్‌వర్క్‌లు సేవలకు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా మనదేశంలో 5G స్పెక్ట్రమ్ కోసం వేలం మరింత ఆలస్యం కారణంగా 5జీ సేవలు పూర్తిస్థాయిలో అందేందుకు మరింత సమయం పట్టనుంది. చదవండి: 6జీ టెక్నాలజీ..! ముందుగా భారత్‌లోనే.. -
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు భారీ జరిమానా
న్యూఢిల్లీ: ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికం శాఖ జరిమానా విధించింది. వొడాఫోన్ ఐడియాకు రూ.2,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌కు రూ.1,050 కోట్ల పెనాల్టీ పడింది. జరిమానా చెల్లించేందుకు మూడు వారాల గడువు ఉంది. ఇంటర్ కనెక్టివిటీ సౌకర్యం కల్పించడంలో విఫలమైనందుకు రిలయన్స్ జియో ఫిర్యాదు ఆధారంగా ఇరు సంస్థలపై అయిదేళ్ల క్రితం ట్రాయ్ చేసిన సిఫార్సు మేరకు టెలికం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఏకపక్ష, అన్యాయమైన డిమాండ్‌తో మేము తీవ్రంగా నిరాశ చెందాము. ఈ ఆరోపణలు పనికిమాలినవి, ప్రేరేపించబడినవి. అత్యున్నత ప్రమాణాలను మేం పాటిస్తాం. చట్టాన్ని అనుసరిస్తాం. టెలికం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం’ అని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. చదవండి: టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ -
వినియోగదారులకు షాక్, డేటా ఛార్జీలు పెరగనున్నాయా?!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న టెలికం రంగం గట్టెక్కాలంటే కనీస ధరలు (ఫ్లోర్ ప్రైస్) నిర్ణయించడం అత్యంత కీలకమని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. తాత్కాలికంగా రెండేళ్ల పాటు అయినా కేవలం డేటాకు ఫ్లోర్ ప్రైస్ నిర్ణయించాలని, వాయిస్ కాల్స్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చని తెలిపింది. సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో ఈ విషయాలు పేర్కొన్నారు. మహమ్మారి కాలంలో ఆర్థికంగా సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రజలకు నిరంతరాయంగా నెట్వర్క్ కనెక్టివిటీ అందించేందుకు టెలికం సంస్థలు గణనీయంగా పెట్టుబడులు పెట్టడం కొనసాగించాయని కొచర్ తెలిపారు. డేటా టారిఫ్‌ల తగ్గింపు ధోరణుల వల్ల టెల్కోలు భారీగా నష్టపోయిన సంగతి గుర్తించాలని, కంపెనీలు ఆర్థికంగా కోలుకోవాలంటే ఆదాయాన్ని పెంచుకోవడం అత్యంత కీలకంగా మారిందని ఆయన వివరించారు. కనీస ధరలను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌కి సీవోఏఐ పలుమార్లు విజ్ఞప్తి చేసిందని, దీనిపై చర్చలు కూడా జరిగాయని కొచర్ పేర్కొన్నారు. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలకు సీవోఏఐలో సభ్యత్వం ఉంది. పెరిగే అవకాశం? మరోవైపు, టెలికం రంగంలో తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో టారిఫ్‌లు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఇటీవలే వ్యాఖ్యానించారు. అటు వొడాఫోన్ ఐడియా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతోంది. ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, మారటోరియంపై స్పష్టతనిస్తే తప్ప ఇన్వెస్ట్ చేసేందుకు మదుపరులెవరూ ముందుకు వచ్చేలా లేరంటూ కంపెనీ జూన్ 7న కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఏజీఆర్ బాకీల కింద వొడాఫోన్ ఐడియా రూ. 58,254 కోట్ల మేర బాకీపడింది. ఇందులో రూ. 7,854 కోట్లు కట్టగా మరో రూ.50,399 కోట్లు కట్టాల్సి ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కాల్ ఛార్జీల సంగతేమోగానీ.. డేటా ఛార్జీలు మాత్రం గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
హైటెక్ "కాల్" కేయులు: అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్‌గా మార్చి..
సాక్షి,తిరుపతి క్రైం: తిరుపతి కేంద్రంగా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నెట్‌వర్క్‌ల ఆదాయానికి గండికొట్టిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్‌కుమార్ తెలిపిన వివరాలు..అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి కొందరు సంస్థకు నష్టం కలిగిస్తున్నట్లు దృష్టికి రావడంతో ఆంధ్రప్రదేశ్ టెలికం సంస్థ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేసేసరికి హైటెక్ ‘కాల్స్’ కేటుగాళ్ల బండారం బట్టబయలైంది. వీరికి టెలికాం సంస్థలో పనిచేస్తున్న కొందరు మార్కెటింగ్ అధికారులు సహకరించినట్లు తేలింది. ఎలా చేశారంటే.. ఫోన్ వినియోగదారులకు తెలియకుండా వందల సంఖ్యలో వారి ఆధార్ కార్డులతో అక్రమంగా సిమ్ కార్డులు పొందారు. ఈకేవైసీ సరిగా పడలేదని ఎన్నోసార్లు వేలిముద్రలు వేయించారు. ఆ తర్వాత ఓటీపీ ద్వారా నగరంలోని కస్టమర్ల నుంచి నాలుగు నుంచి పది వరకు అక్రమంగా సిమ్ కార్డులు పొంది అక్రమాలకు తెరలేపారు. ఇలా పొందిన సిమ్‌లతో విదేశాల నుంచి +91 ఇన్కమింగ్ లోకల్ కాల్స్ ద్వారా మళ్లించి అధిక ఆదాయం పొందేవారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇలా చేస్తుండడంతో బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వొడాఫోన్, వివిధ ప్రైవేటు సంస్థల సెల్యులర్ నెట్వర్క్ సంస్థల ఆదాయానికే కాకుండా ప్రభుత్వానికి జీఎస్టీ, టాక్స్‌ల రూపంలో తీవ్రం నష్టం వాటిల్లింది. టెలికం సంస్థ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కాల్స్ కూపీ లాగితే డొంక కదిలింది. ఏక కాలంలో వివిధ ప్రాంతాల్లో దాడిచేసి సుమారు 1000 సిమ్ కార్డులు, డిన్‌స్టార్ గేట్‌వే 64, సీపీయూ, ల్యాప్‌టాప్, మొబైల్, ఇతర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన కన్నం రవికుమార్, తిరుపతిలో నివసిస్తున్న హరిప్రకా‹Ù, నీలం కిరణ్‌కుమార్, శేషాఫణి, నారాయణ పార్థసారథి, ఓరుగొండ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. దీనికంతా వీరే సూత్రధారులని తేలింది. వీరంతా ఎంబీఎ, బీటెక్, డిగ్రీ చదివిన వారే. వీఓఐపీ టెక్నాలజీ సాయంతో వీరు అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి వినియోగదారులకు కనెక్టివిటీ ఇచ్చి పెద్దమొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు ఈ కేసులో ఉగ్రవాదుల ప్రమేయం ఉందా? అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణకు పూనుకుంటున్నారు. నిబంధనలు పాటించని సిమ్ కార్డు డీలర్లు, సంస్థలను గుర్తించి లీగల్ నోటీసులు ఇస్తామని టెలికామ్ సంస్థ సెక్యూరిటీ డైరెక్టర్ జీవీ మనోజ్‌కుమార్ తెలిపారు. ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ, అలిపిరి సీఐ దేవేంద్రకుమార్ పాల్గొన్నారు. -
కేబుల్ బిల్లు కాస్తంత తగ్గుతుందా?
హడావుడిగా కేబుల్ టీవీ డిజిటైజేషన్ పూర్తిచేసిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ క్రమంగా తప్పులు దిద్దుకుంటోంది. మొదట్లో బ్రాడ్ కాస్టర్లకు అత్యధిక మేలు చేసి, ఆ తరువాత క్రమంలో ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు లబ్ధిపొందగా నష్ట పోయింది కేబుల్ టీవీ వినియోగదారులే. డీటీహెచ్ వినియోగదారులు అప్పటికే డిజిటైజేషన్ పూర్తి చేసుకున్నారు గనుక బ్రాడ్ కాస్టర్లు పెంచిన బిల్లు తప్ప వాళ్ళ నెలవారీ బిల్లులు పెద్దగా ప్రభావితం కాలేదు. మొదట్లో ట్రాయ్ చేసిన తప్పు ఉచిత చానల్స్ సంఖ్య పరిమితం చేయటం. నెట్వర్క్ కెపాసిటీ ఫీజు రూ. 130 కింద 100 చానల్స్ ఇవ్వటం, అందులోనే దూరదర్శన్ చానల్స్ కూడా చేర్చటం. మరో ప్రధానమైన విమర్శ పే చానల్ ధరలు పెంచటం. బొకేలో పెట్టే చానల్స్ గరిష్ఠ చిల్లర ధర 19గా నిర్ణయించటమంటే, సగటున నెలకు బిల్లు 125 దాకా అదనంగా భరించాల్సి వచ్చింది. ఆ తరువాత కోర్టులో ట్రాయ్‌కి అనుకూలంగా తీర్పు వచ్చినా, మార్కెట్ శక్తుల వలన బ్రాడ్ కాస్టర్లు పోటీపడి ధరలు తగ్గిస్తారని ఆశించిన ట్రాయ్ భంగపడింది. ఎట్టకేలకు కొన్ని మార్పులతో 2020 జనవరి 1న రెండో టారిఫ్ ఆర్డర్ ప్రకటిం చింది. ఇందులో ప్రధానంగా రూ.130కి ఇచ్చే ఉచిత చానల్స్ సంఖ్యను 100 నుంచి 200కు పెంచటంతోబాటు వీటికి అద నంగా 26 ప్రసారభారతి చానల్స్ చేర్చాలని చెప్పటం. అదే సమయంలో వినియోగదారుడు తన నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న మొత్తం చానల్స్ కోరుకుంటే రూ.160 కే ఇచ్చి తీరాలి. ఇంకో ముఖ్యమైన సవరణ–అదనపు టీవీ సెట్లు ఉండేవారికి ఊరట కల్పించటం. మొదటి టీవీకి కట్టే రూ. 130 కనీస చార్జ్ కాగా, ఆ తరువాత ఎన్ని అదనపు టీవీలున్నా, 40% చొప్పున, అంటే రూ. 52 చెల్లిస్తే సరిపోతుంది. ఎలాగూ పే చానల్స్ ధరలు అదనం. ఇది కూడా ఎమ్మెస్వోలను, ముఖ్యంగా కేబుల్ ఆపరే టర్లను ఇబ్బంది పెట్టే విషయమే. అదే సమయంలో పే చానల్ చందాల విషయంలో రెండో టీవీకి తగ్గింపు ధర నిబంధన లేక పోవటం ద్వారా బ్రాడ్ కాస్టర్లను వదిలేశారని, ఇది అన్యాయమని అంటున్నారు.ఇక ట్రాయ్ చేసిన ప్రధానమైన సవరణ పే చానల్స్ ధరల నిర్ణయానికి సంబంధించినది. ఏ బ్రాడ్ కాస్టర్ అయినా, విడిగా తన చానల్ ధర నిర్ణయించుకోవాలనుకుంటే దానికి ఎలాంటి పరిమితి లేకపోయినా, ఒక బొకేలో పెట్టి తన చానల్స్‌ను తక్కువ ధరకు ఆశచూపి ఇవ్వాలనుకుంటే మాత్రం దాని గరిష్ఠ చిల్లర ధర ఇంతకుముందు 19 రూపాయలుంటే, ఇప్పుడు దాన్ని 12కు తగ్గించటం వలన కేబుల్ బిల్లులో 25 నుంచి 30 రూపాయల దాకా తప్పకుండా తగ్గే అవకాశముంది. టారిఫ్‌కు సంబంధించినంతవరకు ట్రాయ్‌కి అసలు ఆ అధికారమే లేదని బ్రాడ్కాస్టర్లు కోర్టుకెక్కారు. ఒక వస్తువు తయారీదారుడు తన వస్తువు ధరను నిర్ణయించుకునే అవకాశం ఉండటం సహజం అయినప్పుడు పే చానల్ ధరల నిర్ణయాధి కారం తమకే ఉండాలని వారు వాదించారు. అయితే, ఒక నియం త్రణా సంస్థ ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఇలాంటి చర్యలు తీసుకోవటాన్ని బొంబాయి హైకోర్ట్ సమర్థించింది. అయితే ధరల నియంత్రణ విషయంలో ట్రాయ్‌కి పూర్తి అను కూలమైన తీర్పు రాలేదనే చెప్పాలి. బొకేలో పెట్టదలచుకున్న చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ. 19 నుంచి 12కు తగ్గించినా, బ్రాడ్ కాస్టర్లు రకరకాల విన్యాసాలతో బొకేలు తయారు చేయటం ఇంతకుముందు చూశారు గనుక ఈసారి కఠిన నిబంధనలు పెట్టాలని ట్రాయ్ నిర్ణయించుకుంది. అందుకే బొకేలు రూపొం దించటంలో బ్రాడ్ కాస్టర్లకు రెండు కఠినమైన నిబంధనలు పెట్టింది. మొదటిది– బొకేల మీద మితిమీరిన డిస్కౌంట్ ఇవ్వటం ద్వారా వినియోగదారులు బొకేలే తీసుకునేట్టు చేయటం ఇప్పటి దాకా నడిచింది. అందువలన ఇకమీదట 33% మించి డిస్కౌంట్ ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. అప్పుడే బొకే ధరలు అదుపులో ఉంటాయి. అదే సమయంలో ఆ బొకేలో పెట్టే చానల్స్ చిల్లర ధరలు కూడా అదుపులో ఉంటాయి. బొకే నచ్చకపోతే అందులో కొన్ని చానల్స్ విడిగా తీసుకోవటం వినియోగదారునికి అనువుగా ఉంటుంది. ఈ షరతు సమంజసమేనని బొంబాయ్ హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇందుకు అనుగుణంగా బొకేలు తయారు చేయటానికి ఎన్ని రకాల కసరత్తు చేసినా, ఇప్పటిదాకా వస్తున్న ఆదాయంలో కనీసం 20% గండిపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఒక్కో బ్రాడ్ కాస్టర్‌కు ఒక్కో రకంగా ఉండవచ్చు. స్టార్ గ్రూప్ ఎక్కువగా నష్టపోతుం దని ఇప్పటిదాకా ఉన్న బొకేలు గమనిస్తే సులభంగా అర్థమవు తుంది. ఏమంత నష్టం జరగనిది సన్ గ్రూప్‌కి కాగా, జీ గ్రూప్‌కి నామమాత్రంగా నష్టం జరగవచ్చు.ఇక రెండో షరతు విషయానికొస్తే, బొకేలో ఉండే చానల్స్ విడి ధరలు ఆ బొకేలోని మొత్తం సగటులో మూడురెట్లకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక పెద్ద చానల్‌తో అనేక చిన్నా చితకా చానల్స్ కలిపి అంటగట్టటానికి వీల్లేదు. కానీ ఈ షరతును బొంబాయి హైకోర్ట్ తోసిపుచ్చింది. దీనివలన మరింత కట్టడికి వీలయ్యేది గానీ ఇది కొట్టివేయటం వలన బ్రాడ్ కాస్టర్లకు కొంతమేర ఊరట కలుగుతుంది. మొత్తంగా చూసినప్పుడు ట్రాయ్ సవరించిన కొత్త టారిఫ్ ఆర్డర్ వలన చందాదారులకు సగటున 30 రూపాయల లబ్ధి కలుగుతుంది. కోరుకున్న చానల్స్‌ను బొకేలో కాకుండా విడివిడిగా ఎంచుకునే సౌకర్యం మెరుగుపడుతుంది. ఒకసారి చానల్స్ బొకేలు ప్రకటిస్తే అప్పుడు చందాదారులు తమ హక్కు వినియో గించుకుంటూ లాభపడే అవకాశం కలుగుతుంది. ఇలా ధరలు ప్రకటించటానికి కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చిందిగనుక ఆ లోపు బ్రాడ్ కాస్టర్లు సాధ్యమైనంతవరకు లాభాలలో కోతపడ కుండా ఉండే బొకేలు తయారు చేస్తారు. సామాన్యులకు ఈ బొకేలు,అ– లా–కార్టే చానల్స్ ధర నుంచి తమకు ఉపయోగకరమైన విధంగా, బిల్లు తగ్గించుకునే విధంగా ఎంచుకోవటం తెలియదు కాబట్టి ఎమ్మెస్వోలు స్వయంగా స్థానిక ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బొకేలు తయారుచేసి సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటారు. కాకపోతే, బ్రాడ్కాస్టర్లు ఎప్పటిలాగే ఆ బొకేలలో తమ చానల్స్ కలిపేలా రకరకాల తాయిలాలతో ఎమ్మెస్వోలను ఆకట్టుకోరన్న గ్యారంటీ ఏమీలేదు. చందాదారుడు అంతకంటే తెలివిగా ఉంటేనే ట్రాయ్ సవరణలతో మరింత లబ్ధిపొందుతాడు. తోట భావనారాయణ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
5జీతో భారీగా కొత్త నియామకాలు
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే టెలికం రంగంలో వచ్చే రెండేళ్లలో భారీగా ఒప్పంద ఉద్యోగుల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. ఈ రంగంలో రిక్రూట్మెంట్ విషయంలో 5జీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది. నివేదిక ప్రకారం.. కోవిడ్-19 నేపథ్యంలో అస్పష్టతలు ఉన్నప్పటికీ ఒప్పంద నియామకాల దృక్పథం సానుకూలంగా ఉంది. నియామకాల రంగంలో పెద్ద మార్కెట్లలో టెలికం విభాగం ఒకటి. మహమ్మారి సమయంలోనూ ఈ రంగం వృద్ధి చెందింది. ట్రెండ్ ఈ ఏడాదీ కొనసాగనుంది. ఎకానమీ వృద్ధికి సైతం భవిష్యత్తులో 5జీ తోడుగా ఉండనుంది. టెక్నీషియన్స్ మొదలుకుని ఇన్స్టలేషన్ ఇంజనీర్స్ వరకు, సివిల్ ఇంజనీర్స్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ల దాకా నియామకాలు ఉంటాయి. మొత్తంగా ఈ ఏడాది రిక్రూట్మెంట్ 18 శాతం వృద్ధికి అవకాశం ఉంది. టెలికంను అత్యవసర సేవల కింద ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019తో పోలిస్తే గతేడాది టెలికం రంగంలో 50 శాతం అదనంగా నియామకాలు చేపట్టినట్టు టీమ్‌లీజ్ వెల్లడించింది. చదవండి: ట్యాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా..? -
ఒక్క సెకన్లో వెయ్యి హెచ్డీ సినిమాలు డౌన్లోడ్?!
మెల్బోర్న్: అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో అనేకానేక అద్భుత ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఓ నిత్యావసరంగా మారిన నేటి కాలంలో, క్షణాల్లోనే సమాచారం అరచేత వాలుతున్నా మరింత వేగంగా దానిని ఒడిసిపట్టుకునే పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని మోనాశ్, స్విన్‌బర్న్, ఆర్ఎమ్ఐటీ యూనివర్సిటీలు అద్భుతం చేశాయి. ఒకే ఒక ఆప్టికల్ చిప్ సాయంతో 44.2 టీబీపీఎస్ (టెరాబిట్స్ పర్ సెకండ్) డేటా స్పీడ్‌ను అందుకునే సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఈ డేటా స్పీడ్‌తో సెకన్ కంటే తక్కువ సమయంలో దాదాపు 1000 హెచ్డీ సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. (డిజిటల్ లక్ష్యంతో శాంసంగ్, ఫేస్బుక్ జట్టు..) కాగా డాక్టర్ బిల్ కోర్కోరన్ (మోనాశ్), ప్రొఫెసర్ డేవిడ్ మోస్ (స్విన్‌బర్న్), ఆర్ఎమ్ఐటీ ప్రొఫెసర్ ఆర్నన్ మిచెల్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ అద్భుతమైన ఫీట్ సాధించింది. తద్వారా డేటా ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది. మెల్బోర్న్ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డార్క్ ఆప్టికల్స్ నెట్వర్క్ (76.6 కి.మీ.) లోడ్ టెస్టు నిర్వహించింది. ఈ మేరకు తమ ఆవిష్కణకు సంబంధించిన వివరాలను ప్రఖ్యాత నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పొందుపరిచింది. (రీచార్జ్ చేయకుంటే కనెక్షన్ కట్: నెట్‌ఫ్లిక్స్) ఇక తమ టెక్నాలజీ ఆస్ట్రేలియన్ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను ట్రాక్ చేయడానికి మాత్రమే పరిమితం కాదని... బిలియన్ల సంఖ్యలో ఇంటర్నెట్ కనెక్షన్లు యాక్టివ్‌గా ఉన్న సమయంలోనూ ఇదే స్థాయి స్పీడ్‌ను అందుకునేందుకు వీలుగా తమ పరిశోధన ఉపయోగపడుతుందని బృందం వెల్లడించింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో తమ పరిశోధన చూచాయగా ప్రతిబింబించిందని పేర్కొంది. ఈ పరిశోధనలో తమకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక అత్యంత వేగంతో డేటాను డౌన్లోడ్ చేయడానికి వీలుగా తాము రూపొందించిన కొత్త పరికరంలో 80 లేజర్లతో పాటు మైక్రో- కోంబ్‌ను ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెలికమ్యూనికేషన్ హార్డ్వేర్లలో ఈ మైక్రో కోంబ్ అత్యంత సూక్ష్మమైన, తేలికైన పరికరం. -
ట్రాయ్ కొత్త నిబంధనలతో రూ.400కోట్ల భారం
న్యూఢిల్లీ: అనుచిత వాణిజ్య కాల్స్ (పెస్కీ కాల్స్), మెసేజ్‌లకు సంబంధించి ట్రాయ్ నూతన నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థల ఏర్పాటు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగానికి రూ.200–400 కోట్ల మేర వ్యయం చేయాల్సి వస్తుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) పెదవి విరిచింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమకు ఇది మరింత భారంగా మారుతుందని పేర్కొంది. సీవోఏఐలో ప్రధాన ప్రైవేటు టెలికం కంపెనీలన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. పెస్కీ కాల్స్‌ను, మెసేజ్‌లను కట్టడి చేసేందుకు టెలికం కంపెనీలు ట్రాయ్ కొత్త నిబంధనలను డిసెంబర్ నాటికి అమలు చేయాల్సి ఉంటుంది. ‘‘ఈ విధానం ప్రపంచంలో మరెక్కడా అమలు చేయలేదు. కచ్చితమైన పెట్టుబడులు, సమయాన్ని అంచనా వేయడం కష్టం. కానీ, సుమారు రూ.200–400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది’’ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ మీడియాకు తెలిపారు. డిసెంబర్ గడువు కూడా అచరణ సాధ్యం కానిదిగా పేర్కొన్నారు. పూర్తి వ్యవస్థ ఏర్పాటుకు కనీసం ఏడాది, ఏడాదిన్నర సమయం అవసరం అవుతుందన్నారు. నిబంధనల అమలుకు అయ్యే అదనపు వ్యయాల భారాన్ని కస్టమర్లపై అధిక చార్జీల రూపంలో మోపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డీఎన్డీ వద్ద నమోదు చేసుకున్న కస్టమర్లకు సైతం అదే పనిగా అనుచిత వాణిజ్య కాల్స్, సందేశాలు వస్తుండటంతో ట్రాయ్ గత నెలలో నూతన నిబంధనలను ప్రకటించింది. వీటి ప్రకారం ఏ వాణిజ్య సర్వీస్‌కు అయినా తానిచ్చిన అనుమతిని ఉపసంహరించుకునే వెసులుబాటు కస్టమర్‌కు ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య కాల్స్‌ను ఏఏ రోజుల్లో, ఏ సమయాల్లో స్వీకరించే ప్రాధాన్యాన్ని కూడా నిర్దేశించుకోవచ్చు. -
2జీ స్పెక్ట్రమ్ కేసుల కథాకమామిషు
సీబీఐ వర్సెస్ ఎ.రాజా (ఏ–1),సిద్ధార్ధ బెహురా (ఏ–2), ఆరేకే చందోలియా (ఏ–3),షాహిద్ ఉస్మాన్ బల్వా (ఏ–4) వినోద్ గోయెంకా (ఏ–5), కనిమొళి కరుణానిది (ఏ–17) తదితరులు చార్జిషీట్లోని ప్రధానాంశాలు ః 2008లో యూనిఫైడ్ యాక్సెస్ సర్వీసెస్( యూఏఎస్) లైసెన్స్‌ల ఎంట్రీ ఫీజును టెలికాం శాఖ రూ.1,658గా నిర్ధారించింది. 2001లో టెలికాం శాఖ సెల్యులర్ మొబైల్ టెలిఫోన్ సర్వీస్ (సీఎంటీఎస్)లైసెన్స్‌లను వేలం వేశాక ఎంత మొత్తం వచ్చిందో 2008లోనూ «అవే ధరలను నిర్ణయించారు. యూఏఎస్ లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలని 2007 సెప్టెంబర్ 25న ప్రకటన జారీచేసి, అక్టోబర్ 1 తరువాత వచ్చే వాటిని స్వీకరించమని టెలికాం శాఖ పేర్కొంది. కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించేందుకే ఈ మార్పు చేశారు. లైసెన్సుల కేటాయింపు నియమ నిబంధనల్లో మంత్రి రాజా ఆధ్వర్యంలో పలు మార్పులు జరిగాయి. కొన్ని కంపెనీలు వేలంలో పాల్గొనకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ 1) రాజా, 2) షాహిద్ ఉస్మాన్ బల్వా, 3) వినోద్ గోయెంకా, 4)ఆసిఫ్ బల్వా, 5) రాజీవ్ అగర్వాల్, 6)కరీం మెరానీ 7)శరద్ కుమార్ 8) ఎంకే దయాళు అమ్మాళ్, 9) కనిమొళి కరుణానిధి 10)పి.అమృతం, 11)మెసెర్స్ స్వాన్ టెలికాం 12)మెసెర్స్ సినీయుగ్ మీడియా తదితరులు. ఈడీ ప్రధాన అభియోగాలు ః సీబీఐ కేసుకు అదనంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ. నిందితులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు రూ.223.55 కోట్ల ఆస్తుల జప్తు సందర్భంగా స్పష్టమైనట్లు వెల్లడి. తాము నమోదుచేసిన కేసుకు సంబంధించి తగిన ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్న ఈడీ. మనీలాండరింగ్ ద్వారా సంపాదించిన సొమ్ము ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా వ్యక్తులు, సంస్థల వద్దే ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు వెల్లడి. సీబీఐ వర్సెస్ 1) రవికాంత్ రుయా, 2) అన్షుమన్ రుయా, 3) ఐపీ ఖైతాన్, 4) కిరణ్ ఖైతాన్ 5) వికాస్ షరాఫ్ తదితరులు చార్జిషీటులోని అంశాలుః లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించిన అన్ని కంపెనీల అర్హతలను పరిశీలించిన సీబీఐ. 2007 సెప్టెంబర్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న మెసెర్స్ లూప్ టెలికాం మెసెర్స్ ఎస్సార్ గ్రూపు బినామి అని తెలిసింది. యూఏఈ లైసెన్స్‌తో 2005 నుంచే ముంబయి సర్వీస్ ఏరియాలో మెసెర్స్ మొబైల్ ఇండియా కార్యకలాపాలు కొనసాగించింది. మెసర్స్ వొడాఫోన్ ఎస్సార్ లిమిటెడ్‌లో అప్పటికే మెసర్స్ గ్రూపునకు 33 శాతం వాటా ఉన్నట్లు నిర్ధారణ. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
టవర్లు తొలగించేలా ఉద్యమాలొస్తాయి
* టెలికం సర్వీస్ ప్రొవైడర్లను బెదిరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు * ‘ఓటుకు కోట్లు’లో తమకు అనుకూల అంశాలు బహిర్గతం చేయాలని ఒత్తిడి * విజయవాడలో ముగిసిన ప్రొవైడర్ల విచారణ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసుకు కౌంటర్‌గా నమోదైన కేసుల దర్యాప్తులో టెలికం సర్వీసు ప్రొవైడర్లను ఏపీ ప్రభుత్వం బెదిరిస్తోంది. సెల్ టవర్లు తొలగించేలా ప్రాంతాల వారీగా ఉద్యమాలు వస్తాయని, ఆ తరువాత మీరే నష్టపోవాల్సి వస్తుందని టెలికం సంస్థలను హెచ్చరిస్తోంది. విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్లో రెండో రోజైన మంగళవారం విచారణ కొనసాగించిన సిట్ బృందం.. సర్వీసు ప్రొవైడర్లను భయభ్రాంతులకు గురయ్యేలా బెదిరింపులకు పాల్పడినట్టు సమాచారం. సిట్ శనివారం ఇచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరయ్యారు. నోటీసుల్లో అడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యం కాదంటూ ప్రొవైడర్లు తేల్చిచెప్పడంతో.. కొందరు ‘ప్రభుత్వ పెద్దలు’ రంగంలోకి దిగి ప్రొవైడర్లను బెదిరించే ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది. ‘అనుకూల’ వివరాలివ్వండి.. సిట్ బృందం అడిగిన వివరాలతో పాటు తమకు అనుకూలంగా మారే అంశాలు ఉంటే వాటినీ బయటపెట్టాలని ప్రొవైడర్లపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. తాము చేసిన హెచ్చరికలు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, ఒక వేళ వస్తే సర్వీస్ ప్రొవైడర్లే స్వయంగా వాటిని ఖండించాలని చెప్పినట్లు సమాచారం. మరోపక్క సిట్ అధికారులు విజయవాడలో చేపట్టిన విచారణ మంగళవారంతో ముగిసింది. దాదాపు 15 మంది అధికారులతో కూడిన బృందం ఒక్కో సర్వీసు ప్రొవైడర్‌ను నాలుగు నుంచి ఐదు గంటల పాటు విచారించింది. ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ పోలీసులు రాసిన లేఖలు తమ వద్ద ఉన్నాయని, గడిచిన కొన్ని నెలలుగా తెలంగాణ అధికారులు చేపట్టిన ట్యాపింగ్స్ వివరాలు అందించాలని వారిపై సిట్ ఒత్తిడి తెచ్చిందని తెలుస్తోంది. వివరాలివ్వడం నిబంధనలకు విరుద్ధమే కాకుండా ఆ చర్య అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్ యాక్ట్) ఉల్లంఘన కిందకి వస్తుందని టెలికం కంపెనీల ప్రతినిధులు చెప్పినా సిట్ పెడచెవిన పెడుతోంది. ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేస్తూ, ఇక్కడే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ పరుష పదజాలం వాడి సర్వీస్ ప్రొవైడర్ ప్రతినిధుల్ని బెదిరించినట్లు తెలిసింది. ఇలావుండగా, టెలికం సర్వీసు ప్రొవైడర్ల విచారణ అంకం ముగియడంతో దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను సిట్ చీఫ్ డీఐజీ ఇక్బాల్‌కు అందించడానికి ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఇక్బాల్‌తో పాటు డీజీపీ రాముడికీ ఈ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు మత్తయ్య కేసులో 20 రోజుల కాల్ డేటా ఇవ్వాలని కోరుతూ సీఐడీ పోలీసులు విజయవాడలోని మూడవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. -
‘సిట్’కు చుక్కెదురు?
* విచారణకు హాజరైన టెలికం సర్వీసు ప్రొవైడర్లు * ఆ వివరాలు ఇచ్చేది లేదన్న కంపెనీల ప్రతినిధులు * భద్రపరచి ఉంచాలని ఆదేశించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు వెలుగులోకి వచ్చిన తరవాత తెలంగాణపై చేస్తున్న కౌంటర్ ఎటాక్‌లో భాగంగా నమోదైన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న ‘సిట్’కు చుక్కెదురైనట్లు తెలిసింది. వీరిచ్చిన నోటీసుల మేరకు టెలికం సర్వీసు ప్రొవైడర్లు సోమవారం విచారణకు హాజరయ్యారు. అయితే మీరడిగిన ‘ట్యాపింగ్’ సంబంధిత వివరాలను నేరుగా ఇవ్వడం సాధ్యంకాదంటూ ఆయా కంపెనీల ప్రతిని ధులు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనిపై కోర్టును ఆశ్రయించాలంటే ‘పరిధి’ పరమైన ఇబ్బందులొస్తాయని భావించిన అధికారులు ఆ వివరాలను భద్రపరచి ఉంచాల్సిందిగా ఆదేశించి సరిపెట్టారని తెలుస్తోంది. తెలంగాణపై కౌంటర్ ఎటాక్‌లో భాగంగా ఏపీలో నమోదైన 88 కేసుల దర్యాప్తును చేపట్టిన సిట్ ప్రధానంగా ‘ట్యాపింగ్’పై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన ఆధారాలు, పూర్తి వివరాలు సమర్పించాలంటూ శనివారం 12 టెలికం కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో తమ ప్రతినిధులు, నోడల్ ఆఫీసర్లను ఆయా కంపెనీలు సోమవారం విజయవాడలోని భవానీపురం పోలీసుస్టేషన్‌కు పంపాయి. సిట్ సభ్యులు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, ఏఎస్పీ దామోదర్ తదితరులు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ‘ట్యాపింగ్’పై విచారణ అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందని, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారమైనా టెలికం మంత్రిత్వ శాఖ లేదా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నియమించిన అధికారి/కమిటీకి మాత్రమే ఇస్తామని విచారణలో పాల్గొన్న ప్రతినిధులు చెప్పినట్లు సమాచారం. రహస్యమైనదిగా పరిగణించే ఓ పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలను మరో రాష్ట్ర పోలీసులకు ఇచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారని తెలిసింది. ఈ పరిణామంతో కంగుతిన్న సిట్ అధికారులు తొలుత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావించి న్యాయ నిపుణుల్ని సంప్రదించారు. ఈ కేసుల దర్యాప్తులో ప్రాథమికంగా పరిధి సమస్య ఉందని, తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్లు అనుమానిస్తున్న నేరం/నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కేసులు నమోదైన విషయం నిపుణులు గుర్తుచేశారు. దేశమంతటా ఒకే చట్టం అమలులో ఉన్నప్పటికీ ఒక ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన కేసుల్ని దర్యాప్తు చేసే అధికారం మరో ప్రాంత పోలీసులకు ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న నంబర్లకు సంబంధించిన పూర్తి సాంకేతిక సమాచారాన్ని భద్రపరచి ఉంచాలని కంపెనీల ప్రతినిధులకు చెప్పినట్లు తెలిసింది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న సీఐడీ మత్తయ్య ఫిర్యాదు మేరకు విజయవాడ సత్యనారాయణపురంలో నమోదైన కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మత్తయ్య విజయవాడ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోను సైతం ట్యాపింగ్‌కు గురైనట్లు పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై సీఐడీ అధికారులు దృష్టి పెట్టారు. నేరుగా అడిగితే సర్వీసు ప్రొవైడర్ల నుంచి ‘ట్యాపింగ్’కు సంబంధించిన వివరాలు వచ్చే అవకాశం తక్కువని భావించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో పరిధి సమస్య లేకపోవడంతో ఆయా వివరాలు తమకు ఇచ్చేలా కంపెనీలను ఆదేశించాలని కోరుతూ సోమవారం విజయవాడ కోర్టులో మెమో దాఖలు చేశారు. మరోపక్క ఏపీ డీజీపీ జేవీ రాముడు సోమవారం ‘సిట్’, సీఐడీ చీఫ్‌లతో తన కార్యాలయంలో భేటీ అయ్యారు. కేసుల దర్యాప్తు తీరుతెన్నుల్ని సమీక్షించారు.