
నేడు ప్రధాని మోదీ చేతులు మీదిగా దేశంలో 5 జీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2024 మార్చి సమయానికి దేశ వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్‌ని వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా టెలికాం సంస్థలు తెలిపాయి. తద్వారా ఆల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి రానుంది.
5జీ నెట్ వర్క్ ప్రారంభంతో ముందుగా దేశీయ టెలికాం నెట్ వర్క్ ఎయిర్‌టెల్ యూజర్లు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకునే అవకాశం లభించింది. అయితే ఇప్పుడు 4జీని ఎలా వినియోగిస్తున్నామో.. రానున్న రోజుల్లో ఫాస్టెస్ట్ 5జీ నెట్ వర్క్ అందరు ఉపయోగించుకునే సౌలభ్యం కలగనుండగా.. ప్రస్తుతం 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో వినియోగంలోకి రానుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగళూరు, చండీఘడ్, గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీ నగర్ (గుజరాత్), జామ్ నగర్ (గుజరాత్), అహ్మదాబాద్ యూజర్లు 5జీ ని ఉపయోగించుకోవచ్చు.
ఈరోజు ఢిల్లీ, ముంబై, వారణాసి మరియు బెంగళూరుతో సహా ఎనిమిది నగరాల్లో తన 5జీ సేవల్ని ఎయిర్‌టెల్ ప్రారంభించింది. మార్చి 2023 నాటికి దేశంలోని అనేక నగరాల్లో, మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా 5జీ సేవల్ని అందుబాటులోకి తీసుకురానుంది.
Comments
Please login to add a commentAdd a comment