మొన్నటివరకు తక్కువ టారిఫ్లు ఎంజాయ్ చేసిన కస్టమర్లు.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చార్జీల మోతతో ఉక్కిరిబిక్కిరి కానున్నారు. బిజినెస్ ఇన్ సైడర్ విశ్లేషకుల అంచనా ప్రకారం..ఎయిర్‌టెల్,రిలయన్స్ జియో టారిఫ్ ధరల్ని 10 శాతం పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కంపెనీల ఆదాయం,మార్జిన్లపై పెరుగుతున్న ఒత్తిళ్లు ధరల పెరుగుదలకు కారణం కావచ్చు. సెప్టెంబర్ త్రైమాసికంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో అన్నీ ఒక వినియోగదారుడికి సగటు ఆదాయం (ఎఆర్ పియు) లో మితమైన లాభాలను చూశాయి.
ఈ నేపథ్యంలో టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచడం, కొన్ని ప్లాన్‌లను నిలిపివేయడం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్ టెల్ ఇప్పటికే చౌకైన ప్లాన్ లను రద్దు చేయడం ప్రారంభించింది. కంపెనీ గ్రామీణ ప్రాంతాల యూజర్లను టార్గెట్ చేస్తూ ప్రారంభించిన రూ .99 ప్లాన్‌ను రద్దుచేసింది. క్యూ 2 లో ఎయిర్‌టెల్ ఇబిటా (ebitda) మార్జిన్ 43.7 శాతం నుండి 36.9 శాతానికి పడిపోయింది.ఇప్పటికే నంబర్ పోర్టబిలిటీ కోసం డిమాండ్,మొత్తం చందాదారుల సంఖ్య స్తబ్దుగా ఉందని నివేదిక తెలిపింది.
5జీ అప్‌డేట్స్
టెలికం కంపెనీలు దేశంలో 5జి నెట్ వర్క్ కోసం టారిఫ్ ధరల్ని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో సేవలను అందిస్తున్నాయి.
2023 చివరి నాటికి భారతదేశంలోని అన్ని నగరాలను కవర్ చేయాలని రిలయన్స్ జియో యోచిస్తోంది.జియో ట్రూ 5జి ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సిఆర్, ముంబై,కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథ్‌ద్వారా, గుజరాత్‌లోని 33 జిల్లా కేంద్రాల్లో జియో వెల్కమ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని ప్రధాన మెట్రోలలో ఈ సేవను ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 5 జి కవరేజీ ఉంటుందని ఎయిర్ టెల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment