Airtel
-
ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
మీరు ఎయిర్టెల్ వినియోగదారులా..? మెరుగైన నెలవారీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ల గురించి చూస్తున్నారా? అయితే మీ కోసమే 30 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. వీటిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాతోపాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.28 రోజుల ప్లాన్లురూ.199 ప్లాన్: అపరిమిత కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్రూ.299 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1GB డేటా, 100 SMS, ఉచిత హెలోట్యూన్స్రూ.349 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS, అపోలో 24/7 సర్కిల్రూ. 398 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్రూ.409 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.449 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ. 549 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMSలు, 3 నెలలు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్30 రోజుల ప్లాన్లురూ.121 ప్లాన్: 6GB డేటారూ.161 ప్లాన్: 12GB డేటారూ.181 ప్లాన్: 15GB డేటా, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంరూ.211 ప్లాన్: రోజుకు 1GB డేటారూ.219 ప్లాన్: అపరిమిత కాల్స్, 3GB డేటా, 300 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ. 355 ప్లాన్: అపరిమిత కాల్స్, 25GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.361 ప్లాన్: 50GB డేటారూ. 589 ప్లాన్: అపరిమిత కాల్స్, 50GB డేటా, 300 SMS, అపోలో 24/7 సర్కిల్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేనెలవారీ ప్లాన్లురూ. 379 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.429 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లేరూ.609 ప్లాన్: అపరిమిత కాల్స్, 60GB డేటా, 300 SMS, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే -
‘మొబైల్ టారిఫ్‌లు మరింత పెంచాల్సిందే’
ఇప్పటికే పలు విడతలుగా మొబైల్ టెలిఫోన్ చార్జీలను (Tariff Hike) పెంచినప్పటికీ.. మరింత పెంపు అవసరమని భారతీ ఎయిర్టెల్ (Airtel) వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం రంగ ఆర్థిక స్థిరత్వం కోసం ఇది అవసరమన్నారు. డిసెంబర్ క్వార్టర్ కంపెనీ త్రైమాసిక ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లతో ఏర్పాటు చేసిన ఎర్నింగ్స్ కాల్లో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు.నెట్‌వర్క్‌పై పెట్టుబడులు తగ్గించి, ట్రాన్స్మిషన్ సామర్థ్యం పెంపుపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. తద్వారా కస్టమర్ల అనుభవంలో అంతరాలను తొలగించి, గృహ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించనున్నట్టు తెలిపారు. ‘‘2023–24 కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలు తక్కువగా ఉంటాయి. 2025–26లోనూ మరింత తగ్గుతాయి. డిజిటల్ సామర్థ్యాల ఏర్పాటుపై మేము పెట్టిన దృష్టి ఇప్పుడు ఫలితాలనిస్తోంది’’అని చెప్పారు.భారత్‌లో సగటు టెలికం యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) ప్రపంచంలోనే తక్కువగా ఉందన్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుని, నిలకడైన రాబడుల కోసం మరో విడత టారిఫ్‌లకు చికిత్స అవసరమని వ్యాఖ్యానించారు. గతేడాది జూలైలో ఎయిర్టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు టారిఫ్‌లను సగటున 10–21 శాతం మధ్య పెంచడం గమనార్హం.మార్జిన్లు తక్కువగా ఉండే హోల్‌సేల్ వాయిస్, మెస్సేజింగ్ సేవల నుంచి ఎయిర్టెల్ తప్పుకుంటున్నట్టు విఠల్ ప్రకటించారు. కంపెనీ లాభాలపై దీని ప్రభావం ఉండదన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఎయిర్టెల్ రూ.16,134 కోట్ల లాభాలను నమోదు చేయడం గమనార్హం. ఒక్కో యూజర్ నుంచి సగటున రూ.245 ఆదాయం సమకూర్చుకుంది. ఇది కనీసం రూ.300 ఉండాలని ఎయిర్టెల్ ఎప్పటినుంచో చెబుతూ వస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్‌లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్‌వర్క్‌లపై అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్‌ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
ట్రాయ్ ఎఫెక్ట్.. ఎయిర్టెల్ కొత్త చౌక ప్లాన్లు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాలను అనుసరించి దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ (Airtel) రెండు వాయిస్-ఓన్లీ చౌక రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించాలని ట్రాయ్ ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ ప్లాన్లను ప్రారంభించిన ఏడు రోజులలోపు ట్రాయ్ సమీక్షిస్తుంది.ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఎయిర్టెల్ తన వాయిస్-ఓన్లీ ప్లాన్లను సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ తక్కువ ధరలో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. పాత ప్లాన్లను తొలగించింది. ఈమేరకు ఎయిర్టెల్ తన వెబ్సైట్లో ప్లాన్లను అప్డేట్ చేసింది. సవరించిన ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..రూ.469 ప్లాన్ఇది 84 రోజుల ప్లాన్. గతంలో ఈ ప్లాన్ ధర రూ.499 ఉండేది. దీన్ని ప్రస్తుతం రూ. 30 తగ్గించింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను ఆనందించవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 900 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. ఎటువంటి డేటా అవసరం లేకుండా కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు అవసరమయ్యే 2జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం దీన్ని తీసుకొచ్చారు.రూ. 1849 ప్లాన్ ఇది 365 రోజుల ప్లాన్. ఇంతకుముందు ఈ ప్లాన్ ధర రూ. 1,959. రూ. 110 తగ్గించి రూ. 1,849 లకు తీసుకొచ్చింది. దీంతో దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ మాట్లాడవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా దీర్ఘకాలిక వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను కోరుకునే వినియోగదారుల కోసం దీన్ని రూపొందించారు.జియో ప్లాన్లుట్రాయ్ మార్గదర్శకాలకు అనుగుణంగా వాయిస్-ఓన్లీ ప్లాన్లను ప్రారంభించిన మొదటి టెలికం కంపెనీ రిలయన్స్ జియో. 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో చౌకైన వాయిస్-ఓన్లీ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. 84 రోజుల ప్లాన్ ధర రూ. 458. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 1,000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక 365-రోజుల ప్లాన్ ధర రూ. 1,958. దేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు 3,600 ఉచిత ఎస్ఎంఎస్లు ఆనందించవచ్చు. ఈ రెండు ప్లాన్లలోనూ ఎటువంటి డేటా ప్రయోజనాలు ఉండవు. -
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్‌కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్‌కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (NCLAT) వాట్సాప్‌కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్‌లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లలో మార్పు: వివరాలివిగో..
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన 'భారతి ఎయిర్టెల్'.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తన ప్రీపెయిడ్ ప్లాన్లలో కొన్ని మార్పులు చేసింది. ఇవి వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ల కోసం ఉపయోగపడతాయి.రూ.509 ప్లాన్ఎయిర్టెల్ అందిస్తున్న రూ. 509 ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 900 ఉచిత ఎస్ఎమ్ఎస్ల మాత్రమే ఈ రీఛార్జ్ ద్వారా పొందవచ్చు. అయితే ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కి ఉచిత యాక్సెస్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్లు వంటి కొన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే డేటా లభించదు.రూ.1999 ప్లాన్ఎయిర్టెల్ తన రూ. 1,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా సవరించింది. గతంలో ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్లు, 3000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు, 24GB మొబైల్ డేటా ఉండేవి. ఇప్పుడు మొబైల్ డేటా ప్రయోజనాలను ఎయిర్టెల్ పూర్తిగా తొలగించింది. కాగా ఇప్పుడు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: ట్రాయ్ కొత్త రూల్స్.. రూ.10తో రీఛార్జ్గతంలో పైన పేర్కొన్న రెండు ప్లాన్లలో డేటా సదుపాయం కూడా లభించేది. ఇప్పుడు డేటాను పూర్తిగా తొలగించింది. అయితే ఈ రెండు ప్లాన్స్ స్పామ్ ఫైటింగ్ నెట్వర్క్ సొల్యూషన్‌తో వస్తాయి. డేటాను ఉపయోగించని కస్టమర్లకు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల కోసం విడిగా ప్లాన్‌ను ప్రవేశపెట్టాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన తరువాత ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
ఒక్క రీఛార్జ్‌తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్‌లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్‌కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు. -
మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత భారీగా ఆదాయం
టెలికం ఆపరేటర్ల (Telecom Operators) స్థూల ఆదాయం 2024 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 10.5 శాతం వృద్ధి చెంది రూ.91,426 కోట్లుగా నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్/దీనిపైనే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది) 13 శాతం పెరిగి రూ.75,310 కోట్లకు చేరింది. ఈ వివరాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసింది.గతేడాది జూలైలో ఎయిర్టెల్ (Airtel), జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ మొబైల్ టెలిఫోనీ చార్జీలను 11–25 శాతం మధ్య పెంచడం తెలిసిందే. ఈ పెంపు అనంతరం సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగింది. కానీ, అదే సమయంలో సబ్స్క్రయిబర్లను కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.టెలికం కంపెనీల నెలవారీ ఏఆర్పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.172.57కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఇది 157.45గా ఉంది. ప్రీపెయిడ్ కనెక్షన్ల ఏఆర్పీయూ రూ.171గా ఉంటే, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లకు రూ.190.67గా నమోదైంది. మొబైల్ చందాదారులు 1.68 కోట్ల మంది తగ్గి 115.37 కోట్లకు పరిమితమయ్యారు. జూన్ క్వార్టర్ చివరికి చందాదారుల సంఖ్య 117 కోట్లుగా ఉంది. కంపెనీల వారీగా ఏజీఆర్ భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 24 శాతం పెరిగి రూ.24,633 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఏజీఆర్ 14 శాతం వృద్ధితో రూ.26,652 కోట్లకు.. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ 4 శాతం పెరిగి రూ.7,837 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన లైసెన్స్ ఫీజు 13 శాతం పెరిగి రూ.6,023 కోట్లకు చేరింది. -
మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
జియో.. ఎయిర్టెల్ పోటాపోటీ
ఎయిర్టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్‌లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.ఇదీ చదవండి: పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చజులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్‌లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపుదల ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
ఎయిర్టెల్ సరికొత్త ప్లాన్: హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ
ప్రముఖ టెలికాం దిగ్గజం 'భారతి ఎయిర్టెల్' తన యూజర్ల కోసం సరికొత్త, సరసమైన ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ. 398తో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు మాత్రమే కాకుండా.. రోజుకు 2జీబీ అపరిమిత 5జీ డేటా వంటి వాటిని పొందవచ్చు.ఎయిర్టెల్ అందించిన ఈ కొత్త ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, లైవ్ స్పోర్ట్స్, సినిమాలు, పాపులర్ వెబ్ సిరీస్‌లతో సహా ప్రయాణంలో ప్రీమియం వినోదాన్ని ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది. దీనితో పాటు వింక్ మ్యూజిక్ సదుపాయం కూడా ఉంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీని కలిగి ఉంది.భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం రోజుకు 2జీబీ డేటాతో రూ. 379 ప్లాన్ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. అదే విధంగా రూ. 349 ప్లాన్ ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా కూడా అందిస్తోంది. కాగా ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త ప్లాన్ 398 రూపాయలు. దీని ద్వారా అదనపు ఖర్చు లేకుండా నెలకు ఒక ట్యూన్‌ని సెట్ చేయడానికి అనుమతిస్తుంది. -
స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలు
స్పామ్, ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల్లో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్‌తోపాటు ఆన్లైన్ మోసాలు అధికమవుతున్నాయని తెలిపింది.ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేలా ట్రాయ్ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్టెల్ పేర్కొంది. ఏకీకృత యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను సృష్టించడానికి ఓటీటీలు, టెలికాం ఆపరేటర్ల మధ్య తప్పనిసరి పాటించాల్సిన నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలతో ఈ మోసాలను కొంతవరకు కట్టడి చేయవచ్చని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే..వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు స్పామ్ కాల్స్, మెసేజ్‌ల నివారణకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. వినియోగదారులకు వచ్చే ఇబ్బందికర/ ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్స్ సమస్యను పరిష్కరించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ ముసాయిదా మార్గదర్శకాలను 2024 జూన్‌లో రూపొందించారు. తుది మార్గదర్శకాలను నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) టెలికం శాఖకు ఇటీవల లేఖ రాసింది. -
ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలు
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) ఆపరేటర్ల లైసెన్స్ ఫీజు రద్దు అంశంపై టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్ మరోసారి విభేదించాయి. డీటీహెచ్ ఆపరేటర్లను ఇతర టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్‌లతో సమానంగా పరిగణించాలని, లైసెన్స్ ఫీజును పూర్తిగా ఎత్తివేయాలని ఎయిర్టెల్ పట్టుబడుతోంది. మరోవైపు, లైసెన్స్ ఫీజు రద్దు చేస్తే కేబుల్ టీవీ, ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) ప్రొవైడర్లకు నష్టం జరుగుతుందని రిలయన్స్ జియో వాదిస్తోంది.‘టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 పరిధిలో బ్రాడ్‌కాస్టింగ్ సేవల ప్రొవిజన్ కోసం సర్వీస్ ఆథరైజేషన్స్ ఫ్రేమ్‌వర్క్’ అనే అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అందులో ఎయిర్టెల్, జియో వంటి దిగ్గజ కంపెనీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపాయి. డీటీహెచ్ లైసెన్స్ ఫీజును పూర్తిగా తొలగించాలని ఎయిర్టెల్ కోరింది. ప్రస్తుతం కంటెంట్ ఆదాయంపై విధిస్తున్న లైసెన్స్ ఫీజు, డీటీహెచ్ ఆపరేటర్లు చెల్లించే లైసెన్స్ ఫీజును బ్రాడ్కాస్టర్లు భరించాలని, అంతిమంగా అలాంటి ఆదాయంతో ప్రయోజనం పొందవచ్చని ఎయిర్టెల్ సూచించింది. గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సులను వీలైనంత త్వరగా అమలు చేయాలని, మార్కెట్లో బ్రాడ్కాస్టర్లు 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకుండా నిరోధించేలా క్రాస్ మీడియా ఆంక్షలను తొలగించాలని టాటా ప్లే ట్రాయ్‌ను కోరింది.టెలికాం రంగానికి కేబినెట్ నిర్దేశించిన స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వంటి వాటిని డీటీహెచ్ లైసెన్సులకు కూడా వర్తింపజేయాలని ఎయిర్టెల్ సూచించింది. ఎయిర్ ప్రతిపాదించిన ఫీజు రద్దు అంశాన్ని జియో వ్యతిరేకించింది. ఉచిత స్పెక్ట్రమ్ కేటాయింపులు అందిస్తే డీటీహెచ్ సంస్థలు ప్రయోజనం పొందుతాయి కానీ, ఇది జాతీయ ఖజానాకు నష్టం కలిగిస్తుందని తెలిపింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని వాదిస్తోంది. ఉచిత స్పెక్ట్రమ్ వల్ల డీటీహెచ్ సంస్థలు పొందే ప్రత్యేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతర ప్లాట్‌ఫామ్‌లతో పోల్చి లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది.ఇదీ చదవండి: వేగంగా బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలుడీటీహెచ్ లైసెన్స్ ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని 2023 ఆగస్టులో ట్రాయ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సిఫార్సు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య సమాన వాటాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రూ.4.09 లక్షల కోట్లు: అప్పుల్లో టెలికాం కంపెనీలు
2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని లోక్‌సభలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు.ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు.. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే తక్కువని తెలుస్తోంది. మార్చి 31 నాటికి వొడాఫోన్ ఐడియా రూ.2.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.1.25 లక్షల కోట్లు, జియో రూ.52,740 కోట్ల రుణాలుగా తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు రూ. 40,400 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీతో సంస్థ లోన్ రూ. 28,092 కోట్లకు తగ్గిందని పెమ్మసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. -
జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్‌లింక్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటినే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలోనే 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును మన దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తరువాత.. ఇది చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ధరలను కూడా కంపెనీ ప్రకటించలేదు.కంపెనీ మాజీ హెడ్ ప్రకారం.. స్టార్‌లింక్ మన దేశంలో ప్రారంభమైతే, మొదటి సంవత్సరంలో పన్నులతో సహా రూ. 1,58,000 ఖర్చు అవుతుంది. ఇందులో వన్‌టైమ్ ఎక్విప్మెంట్ ధర రూ. 37,400.. నెలవారీ సర్వీస్ ఫీజు రూ. 7,425గా ఉంటుంది. రెండో ఏడాది యూజర్ సుమారు రూ. 1,15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.స్టార్‌లింక్ సర్వీస్ చార్జీలతో పోలిస్తే.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ చార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్‌లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా? అనేది ప్రశ్నార్థంగా ఉంది.స్టార్‌లింక్ సర్వీస్ ధరలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఈ సేవలకు అవసరమైన లైసెన్స్‌లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ధృవీకరించారు. అయితే స్టార్‌లింక్ సక్సెస్ అనేది మొత్తం దాని చేతుల్లోనే ఉంది.భారతదేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి.. స్టార్‌లింక్ దాని ధరలను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే.. స్టార్‌లింక్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు డిసెంబర్ 15 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. -
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్‌లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్‌ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్‌ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్‌ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్స్టాల్ చేసిన 50,000 సైట్లలో 41,000 సైట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.వీటిలో దాదాపు 36,747 సైట్లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్లను విస్తరించాలనే బీఎస్ఎన్ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య పెంపు.. ఎంతంటే..
ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు నెలలో వీరి సంఖ్య అధికమైనట్లు కంపెనీ తెలిపింది. టెలికాం రంగంలో సేవలందిస్తున్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్ల కస్టమర్ల సంఖ్య మాత్రం తగ్గిపోతుండడం గమనార్హం. ఇందుకు ఇటీవల ప్రైవేట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2.5 మిలియన్ల (25 లక్షలు) వినియోగదారులను చేర్చుకుంది. దాంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 91 మిలియన్ల(9.1 కోట్లు)కు చేరింది. బీఎస్ఎన్ఎల్ ఈ నెలలో కూడా యాక్టివ్ యూజర్లను చేర్చుకుంది. రిలయన్స్ జియో 4 మిలియన్ల(40 లక్షలు), భారతీ ఎయిర్టెల్ 2.4 మిలియన్ల(24 లక్షలు), వొడాఫోన్ ఐడియా 1.9 మిలియన్ల(19 లక్షలు) వినియోగదారులను కోల్పోయాయి. గత రెండున్నరేళ్లలో అత్యధికంగా జియో ఆగస్టులో సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఆగస్టు చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 471.7 మిలియన్లు(47.17 కోట్లు), ఎయిర్టెల్ 384.9 మిలియన్లు(38.49 కోట్లు), వొడాఫోన్ ఐడియా 214 మిలియన్లు(21.4 కోట్లు)గా ఉంది. ఆగస్టు చివరి నాటికి దేశంలో మొత్తం వినియోగదారుల సంఖ్య 5.7 మిలియన్లు(57 లక్షలు) తగ్గి 116.3 కోట్లకు చేరుకుంది. ఇటీవల సంస్థలు పెంచిన టారిఫ్‌ల వల్ల చాలామంది రెండు కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నవారు తమ సర్వీసును ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల మార్కెట్లో జియో 40.5% వాటాతో అగ్రస్థానంలో ఉంది. భారతీ ఎయిర్టెల్ 33.1%, వొడాఫోన్ ఐడియా 18.4%, బీఎస్ఎన్ఎల్ 7.8% వద్ద ఉన్నాయి. ఆగస్టులో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం ట్రాయ్‌కు మొత్తం 14.6 మిలియన్(1.46 కోట్లు) అభ్యర్థనలు వచ్చాయి.ఇదీ చదవండి: వంటనూనె ధరలు మరింత ప్రియం?జియో జులై నెల ప్రారంభంలో టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా టారిఫ్ ప్లాన్ రేట్లను సుమారు 20-30 శాతం పెంచాయి. దాంతో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కొంత ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సంస్థ ప్రైవేట్ కంపెనీల్లాగా దేశం అంతటా 5జీ సర్వీసులు విస్తరించకపోయినా కస్టమర్లు ఎక్కువగా దానివైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచాయి. ఈ ధరల పెంపు చాలా మంది వినియోగదారులను బీఎస్ఎన్ఎల్కి మారడానికి ప్రేరేపించింది. పెరుగుతున్న ఈ ఆసక్తికి అనుగుణంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను కూడా మెరుగుపరుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన చవకైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై స్పీడ్ లిమిట్స్‌ను అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ తన రూ.249, రూ.299, రూ.329 ప్లాన్లలో వేగాన్ని పెంచింది.రూ. 249 ప్లాన్ఈ ప్లాన్‌లో గతంలో 10 Mbps వేగంతో నెట్ వచ్చేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 10 GB నెట్‌ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీని తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కొత్త సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్రూ. 299 ప్లాన్ఇందులోనూ నెట్ స్పీడ్ 10 Mbps నుండి 25 Mbpsకి పెరిగింది. పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ 20జీబీ నెట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే.రూ. 329 ప్లాన్ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో మామూలుగా 20 Mbps నెట్ స్పీడ్ ఉండేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఇక 1000 జీబీ గణనీయమైన ఎఫ్‌యూపీని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4 Mbpsకి తగ్గుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. -
100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్
భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన యాంటీ స్పామ్ టెక్నాలజీ (ఏఎస్టీ) సంచలనం సృష్టిస్తోందని టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఏఎస్టీ వినియోగంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా కంపెనీ 100 కోట్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి కస్టమర్లను హెచ్చరించింది. స్పామ్ కాల్, ఎస్ఎంఎస్ను విశ్లేషించి కస్టమర్‌ను అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. 2 మిల్లీ సెకన్లలో ఈ సొల్యూషన్ 150 కోట్ల సందేశాలను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12.2 కోట్ల స్పామ్ కాల్స్, 23 లక్షల స్పామ్ సందేశాలను గుర్తించినట్టు ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సర్కిల్ సీఈవో శివన్ భార్గవ తెలిపారు. కంపెనీ వినియోగిస్తున్న సాంకేతిక వల్ల స్పామ్ కాల్స్ 97 శాతం, స్పామ్ ఎస్ఎంఎస్లు 99.5 శాతం తగ్గాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఏఎస్టీ కచ్చితత్వం 97 శాతం ఉందన్నారు.ఇదీ చదవండి: కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణస్పామ్ కాల్స్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని శివన్ భార్గవ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా స్పామ్ కాల్స్ కారణంగా ఏడాదిలో 3 బిలియన్ డాలర్ల(రూ.25 వేలకోట్లు) విలువైన బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. 2024 ఏప్రిల్–జులై మధ్య భారత్‌లో రూ.1,720 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. సైబర్ మోసాలపై నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్సీఆర్పీ) రోజూ సుమారు 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దేశంలో 60 శాతం మంది మొబైల్ యూజర్లకు రోజులో కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 87 శాతం మంది అవాంచిత ఎస్ఎంఎస్లు అందుకుంటున్నారు. స్పామ్ ముప్పునకు పరిష్కారం కోసం ఏడాదిగా శ్రమించి ఏఎస్టీని సొంతంగా అభివృద్ధి చేశాం. 100 మందికిపైగా డేటా సైంటిస్టులు నిమగ్నమయ్యారు’ అని వివరించారు. -
ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్.. బీఎస్ఎన్ఎల్లో..
స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.ఈ కొత్త భద్రతా ఫీచర్‌తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. బీఎస్ఎన్ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌లో మోసపూరిత ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్‌ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఏవీ ఇలాంటి ఫీచర్‌ను అందించడం లేదు.కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి» బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్‌ను తెరవండి.» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్‌ను ఎంచుకోండి.» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.» మీ కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్‌ను సబ్మిట్ చేయండి. -
వడ్డీతో కలిపి రూ.8,465 కోట్లు చెల్లించిన ఎయిర్టెల్
ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సేవల సంస్థ భారతీ ఎయిర్టెల్ టెలికాం విభాగానికి చెల్లించాల్సిన బకాయిలను కొంత తీర్చినట్లు ప్రకటించింది. 2016లో సంస్థకు కేటాయించిన స్పెక్ట్రమ్‌కు సంబంధించిన బకాయిను 9.3 శాతం వడ్డీతో కలిపి మొత్తం రూ.8,465 కోట్లను తిరిగి చెల్లించినట్లు సంస్థ పేర్కొంది.టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో కంపెనీలు చేసేదేమిలేక బకాయిలు చెల్లిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏజీఆర్ లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ గతంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ సంస్థలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: పావుశాతం వరకు పెరిగిన అమ్మకాలుటెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. కొన్ని సంస్థల నివేదిక ప్రకారం వొడాఫోన్ఐడియా 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
ఓటీటీ యాప్‌ల మినహాయింపు.. టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్ యాప్‌లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్, బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సుల్లో సర్వీస్ ఆథరైజేషన్ నుంచి ఓటీటీ యాప్‌లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఏజీఆర్ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్టెల్ రూ. 21,500 కోట్లు ఏజీఆర్ బకాయీలు కట్టాల్సి ఉంది. -
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్‌ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్‌హౌస్ టూల్‌గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్‌లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్‌ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్‌వర్క్‌ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్‌ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్‌హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్‌ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్‌లను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిలకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపులో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ కంపెనీలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ బకాయిలపై బహిరంగ విచారణ జరపాలని కోరాయి. ఈమేరకు సుప్రీంకోర్టు విచారణ జరిపి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వానికి ఇచ్చే పూర్తి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లోని వివరాలు విచారించింది. టెలికాం కంపెనీలు లైసెన్స్ రెన్యువల్ చేయడానికి, స్పెక్రమ్ వినియోగించుకున్నందుకు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల బకాయిలు చెల్లించకపోతే తిరిగి వడ్డీతో సహా జమ చేయాలి. ఇవి ఏజీఆర్ కిందకు వస్తాయి. ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం..సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్) బకాయిలు లెక్కించడంలో లోపాలు జరిగాయి. వాటిని సవరించాలి. ఇప్పటికే పోగైన బకాయిలపై వడ్డీని ఉపసంహరించాలి. క్యూరేటివ్ పిటిషన్‌ను బహిరంగంగా విచారణ చేయాలని కంపెనీలు కోరాయి.ఇదీ చదవండి: స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడిగతంలో సెప్టెంబర్ 1, 2020లో కోర్టు విడుదల చేసిన ఆదేశాల ప్రకారం..మార్చి 31, 2021లోపు కంపెనీల బకాయిల్లో 10 శాతం చెల్లించాలి. తదుపరి ఏడాది మరో 10 శాతం చొప్పున 2031 మార్చి 31లోపు పూర్తి బకాయిలు కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం టెలికాం విభాగానికి చెల్లించాల్సిన ఏజీఆర్‌పై రీవాల్యుయేషన్ అనుమతించబడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, అన్ని టెలికాం కంపెనీలు కలిపి మొత్తం రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో లైసెన్స్ ఫీజు బకాయిలు మొత్తం రూ.92,642 కోట్లు కాగా, స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు రూ.55,054 కోట్లుగా ఉన్నాయి. వొడాఫోన్ఐడియా కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏజీఆర్ బకాయిలు రూ.70,320 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు కట్టాల్సి ఉంది. -
పేమెంట్స్ వాచ్.. చేతికుంటే చాలు!
డిజిటల్ యుగంలో పేమెంట్స్ విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్ఫోన్ల ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ఫోన్లతోపాటు స్మార్ట్ వాచ్‌ల వినియోగం కూడా పెరుగుతన్న క్రమంలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది.నాయిస్ కంపెనీ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొస్తోంది. తాజాగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో దీన్ని పరిచయం చేసింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంటిగ్రేటెడ్ రూపే చిప్ ఉంటుంది. దీన్ని ధరించి మణికట్టు నుంచే ‘మనీ’ లావాదేవీలు పూర్తి చేయొచ్చన్నమాట. పేమెంట్స్-కమ్-ఫిట్నెస్ సొల్యూషన్‌గా వస్తున్న ఈ స్మార్ట్ వాచ్‌లో హెల్త్, ఫిట్నెస్ మానిటరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.స్మార్ట్‌వాచ్ ఫీచర్లుఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్, ‘ఆన్ ద గో’ పేమెంట్స్ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ట్యాప్ అండ్ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా దీని ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్ చేయొచ్చు.ఇక హెల్త్, ఫిట్నెస్ ఫీచర్ల విషయానికి వస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, బీపీ పర్యవేక్షణ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగలదు. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్టీ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్టెల్ తెలిపింది.ఇది ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్లు, కాల్ రిమైండర్లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాంక్ ఆన్లైన్, రిటైల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి త్వరలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. -
‘అన్లిమిటెడ్’ ప్లాన్లు ఉంటాయా? కంపెనీల వైఖరి ఇదే..
టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్లిమిటెడ్ ప్యాక్‌లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్ఎంఎస్లకు విడివిడిగా ప్యాక్‌లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.ఎయిర్టెల్ ఏం చెప్పిందంటే.. ఎయిర్టెల్ ట్రాయ్‌కి ఇచ్చిన స్టేట్మెంట్లో తమ ప్రస్తుత ప్లాన్లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్‌ల మోడల్‌కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్‌గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్‌లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.జియోదీ అదే వైఖరిఎయిర్టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్లను మోస్ట్ అఫర్డబుల్‌గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్‌ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఎయిర్టెల్ కస్టమర్లకు యాపిల్ కంటెంట్
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ కంటెంట్‌ను టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందించనుంది. ఎయిర్టెల్ కస్టమర్లకు ఈ ఏడాది ఆఖరు నుంచి యాపిల్ టీవీప్లస్, యాపిల్ మ్యూజిక్ కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఎయిర్‌టెల్‌కు చెందిన వింక్ యాప్ ప్రీమియం యూజర్లకు యాపిల్ మ్యూజిక్ అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ కస్టమర్లు ప్రీమియం ఎయిర్టెల్ వైఫై, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలపై యాపిల్ టీవీప్లస్ ద్వారా హాలీవుడ్ కంటెంట్‌ను పొందవచ్చు. మరోవైపు, మ్యూజిక్ విభాగం నుంచి భారతి ఎయిర్టెల్ నిష్క్రమిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరికొద్ది నెలల్లో వింక్ మ్యూజిక్ యాప్‌ను మూసివేయనున్నట్లు, ఉద్యోగులందరినీ ఎయిర్‌టెల్‌లోకి తీసుకోనున్నట్లు వివరించాయి. వింక్ మూసివేత విషయాన్ని ఎయిర్టెల్ ప్రతినిధి ధ్రువీకరించారు. 2014లో ప్రారంభమైన వింక్ మ్యూజిక్ యాప్‌నకు దాదాపు 10 కోట్ల మంది సబ్ర్‌స్కయిబర్లు ఉన్నారని అంచనా.ఇదీ చదవండి: స్విగ్గీలో వాటా కొనుగోలు చేసిన బిగ్‌బీ కుటుంబం? -
ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ షట్‌డౌన్: కారణం ఇదే..
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ తన వింక్ మ్యూజిక్ యాప్‌ను త్వరలోనే నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇందులో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపించేది లేదని, వారందరినీ కంపెనీలోని సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఎయిర్టెల్ కంపెనీ యాపిల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వింక్ మ్యూజిక్ నిలిపివేసిన తరువాత ఎయిర్టెల్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినొచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కంపెనీ ఓ స్పెషల్ ఆఫర్ అందించే అవకాశం ఉందని సమాచారం. -
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్‌తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
టెలికాం సేవల విస్తరణకు కొత్త ప్రాజెక్టులు
భారత్‌లో టెలికాం సేవలందించే ఎయిర్టెల్, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా 180 టెరాబిట్స్ పర్ సెకండ్(టీబీపీఎస్) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్టెల్, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తారు.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!ఇండియా-ఆసియా ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో భాగంగా జియో, చైనా మొబైల్ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంబయి, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ ద్వారా జియో, చైనా మొబైల్ కంపెనీలు 200 టీబీపీఎస్ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది. -
జియోపై బీఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ ఎఫెక్ట్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత చాలామంది బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్‌వర్క్‌కు మారిపోతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2.75 మిలియన్ల యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ వైపు వచ్చిన యూజర్లలో ఎక్కువ భాగం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చార్జీలు, వ్యాలిడిటీ వంటివి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ముకేశ్ అంబానీ జియోపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోందని, స్వదేశీ 4జీ నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉందని.. దానిని 5Gకి మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీలు 4జీ నెట్‌వర్క్‌ను తీసుకువచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ ఎందుకు దీనిని ప్రవేశపెట్టలేదని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం నిర్వహించే కంపెనీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసి వస్తే.. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని.. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే పరికరాలను ఉపయోగించకూడదని ప్రధానమంత్రి తీర్మానమని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.భారత్ తన స్వంత 4జీ స్టాక్, కోర్ సిస్టమ్ లేదా రేడియేషన్ యాక్సెస్ నెట్వర్క్ అని పిలువబడే టవర్లను అభివృద్ధి చేస్తుందని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశం తన సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది, దేశప్రజలకు 4G నెట్‌వర్క్‌ను అందిస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతికతను కలిగి ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించిందని సింధియా చెప్పారు.టవర్ల ఏర్పాటుకోసం తేజస్ నెట్వర్క్, సీ-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2025 నాటికి 4G నెట్‌వర్క్‌కు చెందిన లక్ష టవర్లు ఇన్స్టాల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. -
బీఎస్ఎన్ఎల్కి వెళ్తుంటే ఇది తెలుసుకోండి..
తక్కువ ధరకు టెలికం సేవలు అందించే ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారాలనుకుంటున్నారా..? సిగ్నల్స్ ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు దగ్గరలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం..పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచడంతో అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్లు ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు చాలా మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జూలై 21న తన 4G సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించింది.ఈ నేపథ్యంలో మీరు బీఎస్ఎన్ఎల్కి మారాలని ప్లాన్ చేస్తుంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీ మొబైల్ ఫోన్లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ సిగ్నల్‌లను పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్ల నుంచి సిగ్నల్‌లను అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ ఫోన్లో సిగ్నల్స్ ఉంటాయి.సమీపంలో టవర్ ఉందో లేదో తెలుసుకోండి ఇలా..ముందుగా https://tarangsanchar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండిపేజీని కిందికి స్క్రోల్ చేసి, ‘మై లొకేషన్’పై క్లిక్ చేయండి.తదుపరి పేజీలో, మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.Send me a mail with OTP బటన్ పై క్లిక్ చేయండి.మీ ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.తర్వాతి పేజీలో, మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే మ్యాప్ మీకు కనిపిస్తుంది.ఏదైనా టవర్‌పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం (2G/3G/4G/5G), అది ఏ కంపెనీ టవర్ అనేది మీకు సమాచారం అందుతుంది. -
బీఎస్ఎన్ఎల్కు వెళ్తున్న వారికి గుడ్‌న్యూస్..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను పెంచడంతో చాలా మంది ఇపుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ 1 2వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి 2.5 లక్షల మందికిపైగా బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు. -
సెకనుకు 1.2 జీబీ స్పీడ్.. నోకియా ఘనత
న్యూఢిల్లీ: టెలికం గేర్స్ తయారీ దిగ్గజం నోకియా మరో ఘనతను సాధించింది. 5జీ సేవల్లో డౌన్లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. భారత్‌లో భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి మొదటి 5జీ నాన్ స్టాండలోన్ క్లౌడ్ రేడియా యాక్సెస్ నెట్వర్క్ పరీక్షల సమయంలో నోకియా ఈ రికార్డు నమోదు చేసింది.5జీ కోసం 3.5 గిగాహెట్జ్, 4జీ కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్–ది–ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్టెల్ వాణిజ్య నెట్వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి. -
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. -
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
కొత్త యూజర్లలో జియో, ఎయిర్టెల్ జోరు
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల విషయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ జోరు కొనసాగుతోంది. మే నెలలో రెండు సంస్థలకు కలిపి 34.4 లక్షల కనెక్షన్లు జతయ్యాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో జియోకి కొత్తగా 21.9 లక్షల మంది యూజర్లు, ఎయిర్‌టెల్‌కి 12.5 లక్షల మంది మొబైల్ కస్టమర్లు జతయ్యారు. జియో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 47.46 కోట్లకు చేరింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మరో 9.24 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మేలో 1.2 కోట్ల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఎంఎన్‌పీని అమల్లోకి తెచి్చనప్పటి నుంచి మే నెలాఖరు వరకు వచి్చన మొత్తం ఎంఎన్‌పీ అభ్యర్థ్ధనల సంఖ్య 98.56 కోట్లకు చేరినట్లు వివరించింది. అటు బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య నెలవారీగా 0.72 శాతం వృద్ధితో 93.5 కోట్లకు చేరింది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
వొడాఫోన్ ఐడియా టారిఫ్‌లు పెంపు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్‌లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.మొదటగా జియో టారిఫ్‌లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్‌లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.ప్లాన్ల కొత్త ధరలు ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్‌కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. -
ఎయిర్టెల్ కూడా పెంచేసింది! జియోను మించి..
టెలికం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ప్రత్యర్థి రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్టెల్ కూడా తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్లపై టారిఫ్‌లను 10-21 శాతం పెంచింది.దేశంలో టెల్కోలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ .300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. "ఈ స్థాయి ఏఆర్పీయూ నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రంలో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని, మూలధనంపై స్వల్ప రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం" అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.పెంచిన మొబైల్ టారిఫ్‌లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధరల పెరుగుదల (రోజుకు 70 పైసల కంటే తక్కువ) ఉండేలా చూశామని టెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే..» గతంలో రూ.179గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.199» గతంలో రూ.455గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.509» గతంలో రూ.1799గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.1999» గతంలో రూ.265గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299» గతంలో రూ.299గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.349» గతంలో రూ.359గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.409» గతంలో రూ.399గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.449» గతంలో రూ.479గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.579» గతంలో రూ.549గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.649» గతంలో రూ.719గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.859» గతంలో రూ.839గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.979» గతంలో రూ.2999గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.3599 -
ఎయిర్టెల్ డేటా సెంటర్ అరుదైన ఘనత
ఎయిర్టెల్ డేటా సెంటర్ విభాగమైన నెక్స్‌స్ట్రా అరుదైన ఘనత సాధించింది. కార్బన్ డిస్క్లోజర్ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో క్లైమేట్ గ్రూప్ నేతృత్వంలోని ఫ్లాగ్షిప్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌లో చేరింది. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తు వినియాగానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. నెక్స్‌స్ట్రా దేశవ్యాప్తంగా 12 పెద్ద, 120 ఎడ్జ్ డేటా సెంటర్లతో దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. "మాది పర్యావరణపరంగా బాధ్యతాయుతమైన బ్రాండ్. క్లీన్ ఎనర్జీ ప్రత్యామ్నాయాలను అవలంబిస్తున్నాం. 2031 నాటికి మా నెట్ జీరో లక్ష్యాలను సాధించే దిశగా మేము ఆరోగ్యకరమైన మార్గంలో ఉన్నాం. 100 శాతం పునరుత్పాదక విద్యుత్తుకు నిబద్ధతతో ఆర్ఈ 100 చొరవలో భాగం కావడం సంతోషంగా ఉంది" అని ఎయిర్టెల్ నెక్స్‌స్ట్రా సీఈవో ఆశిష్ అరోరా ఒక ప్రకటనలో తెలిపారు.భారత్‌లో ఆర్ఈ 100 ఇనిషియేటివ్‌కు హామీ ఇచ్చిన ఏకైక డేటా సెంటర్ సంస్థగా, ఈ మైలురాయిని చేరుకున్న 14 వ భారతీయ సంస్థగా నెక్స్‌స్ట్రా నిలిచింది. కంపెనీ తన పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచింది. ఇప్పటి వరకు 4,22,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి ఒప్పందాలను కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, క్యాప్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తిని సోర్సింగ్ చేయడం ద్వారా సుమారు 1,56,595 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినట్లు నెక్స్‌స్ట్రా పేర్కొంది. -
ముగిసిన స్పెక్ట్రం వేలం.. ఎయిర్టెల్ టాప్!
న్యూఢిల్లీ: ఈసారి టెలికం స్పెక్ట్రం వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. మొత్తం రూ. 96,238 కోట్ల బేస్ ధరతో 800 మెగాహెట్జ్ నుంచి 26 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్‌లో 10 గిగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. ఏడు రౌండ్లలో 141.4 మెగాహెట్జ్ మాత్రమే అమ్ముడైంది. టెల్కోలు సుమారు రూ. 11,340.78 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేశాయి. ప్రధానంగా గడువు తీరిపోతున్న స్పెక్ట్రంను రెన్యువల్ చేసుకోవడం, కవరేజీని పెంచుకునేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లోనే కొనుగోలు చేసేందుకు టెల్కోలు ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా స్పెక్ట్రం కొనుగోలు చేసింది. తొలిరోజైన జూన్ 25న (మంగళవారం) అయిదు రౌండ్లు జరగ్గా, రెండో రోజున పెద్దగా స్పందన లేకపోవడంతో వేలం ముగిసినట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.టెల్కోలు తమ సర్వీసులను కొనసాగించడంతో పాటు కార్యకలాపాలను విస్తరించేందుకు కూడా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈసారి విక్రయానికి ఉంచిన స్పెక్ట్రంలో 12 శాతానికి మాత్రమే బిడ్లు వచ్చాయి. గత వేలంలోనే టెల్కోలు గణనీయంగా స్పెక్ట్రం తీసుకోవడంతో నిర్దిష్ట బ్యాండ్లకు ఈసారి పెద్దగా డిమాండ్ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్లపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. 2022లో జరిగిన స్పెక్ట్రం వేలం బ్లాక్‌బస్టర్‌గా నిల్చింది. అప్పట్లో ఏడు రోజులు సాగిన వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను టెల్కోలు కొనుగోలు చేశాయి. జియో అత్యధికంగా రూ. 88,078 కోట్లతో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది. ఎయిర్టెల్ రూ. 6,857 కోట్ల బిడ్.. భారతీఎయిర్‌టెల్ అత్యధికంగా రూ.6,856.76 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 3,510 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 973.6 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఎయిర్టెల్ 97 మెగాహెట్జ్, వీఐఎల్ 30 మెగాహెట్జ్, జియో ఇన్ఫోకామ్ 14.4 మెగాహెట్జ్ దక్కించుకున్నాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైనంత స్పెక్ట్రంను సమకూర్చుకుంటామని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.బిహార్, పశ్చిమ బెంగాల్ సర్కిళ్లలో 1,800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం ద్వారా తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. నిర్దిష్ట మార్కెట్లలో స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. -
టెలికం యూజర్లు @120 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో మొత్తం సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్‌లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు. -
సైలెంట్‌గా వచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్! అధిక వ్యాలిడిటీతో..
అధిక వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ తో ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.279 విలువైన ఈ ప్లాన్ ను సైలెంట్‌గా వెబ్సైట్లో చేర్చేసింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.సాధారణంగా చాలా రీచార్జ్ ప్లాన్లు 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ రూ .279 ప్లాన్ 45 రోజుల వాలిడిటీతో వస్తుంది. కాబట్టి, 15 రోజులు చెల్లుబాటు అదనంగా లభిస్తుంది. అధిక వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.ఇక అధిక వ్యాలిడిటీ ఉన్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే రూ .279 ప్లాన్ కూడా చాలా తక్కువ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 2 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ డేటాను పొందాలనుకుంటే, ప్రత్యేక డేటా వోచర్లలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తన చాలా ప్లాన్లతో ఇచ్చినట్లుగా ఇందులో ఉచిత అపరిమిత 5జీ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
సూపర్ రీచార్జ్ ప్లాన్: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్?
దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్లలో అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..జియో రూ.395 ప్లాన్» 84 రోజుల వ్యాలిడిటీ» అపరిమిత 5జీ డేటా» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాలింగ్ » మొత్తం 1000 ఎస్ఎంఎస్లు» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్» 70 రోజుల వ్యాలిడిటీ » మొత్తంగా 6 జీబీ హైస్పీడ్ డేటా» 600 ఎస్ఎంఎస్లు» అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో లభ్యం -
స్లాట్లు, విదేశీ దైపాక్షిక హక్కులు కోల్పోయిన విమానసంస్థ
గోఎయిర్ విమాన సంస్థ స్లాట్లు, విదేశీ ద్వైపాక్షిక హక్కులను తాత్కాలికంగా ఇతర కంపెనీలకు కట్టబెడుతూ కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంది.గోఎయిర్‌కు చెందిన స్లాట్లు, దైపాక్షిక హక్కులను ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలకు పంపిణీ చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే వీటిని సాధారణ పూల్‌లో ఉంచి ఆపై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా, అకాసా సంస్థ గోఎయిర్ దుబాయ్ విమానయాన హక్కులను కోరినట్లు తెలిసింది. దీనిపై కేంద్రం అకాసాకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.గోఎయిర్ స్లాట్లు, దైపాక్షిక హక్కుల కోసం గతంలో బిడ్డింగ్ వేసిన ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్‌మైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి ఇటీవల తన బిడ్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ సమయంలో ఈజ్‌మైట్రిప్ స్థిరమైన వృద్ధి సాధించేందుకు వనరులను ఉపయోగించనున్నామని నిశాంత్ చెప్పారు. మళ్లీ గోఎయిర్ కోసం కొత్తగా ఎవరు బిడ్ వేయలేదు. దాంతో సంస్థకు చెందిన స్లాట్లు, ఇతర హక్కులను మంత్రిత్వశాఖ ఇతర సంస్థలకు తాత్కాలికంగా కేటాయించింది.స్లాట్లు, దైపాక్షిక హక్కులు..ఒక నిర్దిష్ట దేశానికి చెందిన విమానయాన సంస్థలు మరొక దేశానికి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకోవాలి. ఇది ఒక దేశం నుంచి వారానికి ఎన్ని విమానాలు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది. అయితే విమానయాన సంస్థ ఈ హక్కులు కలిగిఉన్నా విమాన కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎయిర్‌పోర్ట్‌ల్లో స్లాట్లను కలిగి ఉండాలి. ఒక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి అనుమతించే తేదీ, సమయాన్ని స్లాట్‌గా పేర్కొంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీబీసీఏ అధికారులు, విమానాశ్రయ ఆపరేటర్లు, విమానయాన సంస్థలతో కూడిన కమిటీ ఈ స్లాట్లను కేటాయిస్తుంది.టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రతి వారం దాదాపు ఒక కొత్త విమానాన్ని తమ ఫ్లీట్‌లో చేరుస్తున్నాయి. ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఈరంగంలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి సమయంలో గోఎయిర్‌కు ఈ స్థితి రావడంపట్ల మార్కెట్ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి.ఇదీ చదవండి: మరో ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!వాడియా గ్రూప్ యాజమాన్యంలో గో ఫస్ట్ రుణదాతలకు రూ.6,200 కోట్లకు పైగా బకాయిపడింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌లకు వరుసగా రూ.1,934 కోట్లు, రూ.1,744 కోట్లు, రూ.75 కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉంది. -
ఫుల్ వ్యాలిడిటీ.. ఈ రీచార్జ్ ప్లాన్ల గురించి తెలుసా?
దేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్టెల్ 30, 60, 90 రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లను అందిస్తోంది. నెలంతా కచ్చితమైన వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్ల కోసం వినియోగదారుల నుంచి అభ్యర్థనలు రావడంతో 30, 60, 90 రోజుల ప్లాన్లను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది.ఇంతకుముందు 28, 56 లేదా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి.30 రోజుల ప్లాన్లుఎయిర్టెల్లో మొత్తం మూడు 30 రోజుల ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్లు వరుసగా రూ.199, రూ.296, రూ.489 ధరల శ్రేణిలో లభిస్తాయి. ఈ అన్ని ప్లాన్లతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను పొందవచ్చు.రూ.199 ప్లాన్‌లో 3 జీబీ డేటా, రూ.296 ప్లాన్‌లో 25 జీబీ డేటా, రూ.489 ప్లాన్‌లో 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.296, రూ.489 ప్లాన్లలో అపరిమిత 5జీ డేటా ఆఫర్ కూడా ఉంది.60 రోజుల వాలిడిటీతో..ఎయిర్ టెల్ రూ.519 ప్లాన్ 60 రోజుల వాలిడిటీని అందిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత 5జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.90 రోజుల ప్లాన్లు90 రోజుల ప్లాన్ ధర రూ.779. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు అపరిమిత 5 జి డేటా, అపోలో 24|7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా పొందవచ్చు. -
మొబైల్ యూజర్స్‌కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది. వినియోగదారులపై ప్రభావం25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.టారిఫ్ ధరలు పెరిగితేటారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది. కంపెనీలకు లాభమేమార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్‌టెల్‌కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. -
కొత్త రీచార్జ్ ప్లాన్.. ‘28 రోజులు’ టెన్షన్ లేదిక!
Airtel 35 Days Validity Plan: దేశంలోని ప్రముఖ టెలికాం ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. నెలవారీ రీచార్జ్‌కు సంబంధించి టెలికాం కంపెనీలు సాధారణంగా 28 రోజుల వ్యాలిడిటీనే అందిస్తుంటాయి. అయితే తక్కువ వ్యాలిడిటీతో ఇబ్బందిపడే కస్టమర్ల కోసం ఎయిర్టెల్ 35 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రీఛార్జ్ ప్లాన్లలో తక్కువ వ్యాలిడిటీ పీరియడ్ల సమస్యకు ప్రతిస్పందనగా ఎయిర్టెల్ నుండి తాజా ఆఫర్ వచ్చింది. అంతరాయం లేని సేవల కోసం ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల చాలా మంది వినియోగదారులు తరచుగా అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సవాలును గుర్తించి ఎయిర్టెల్ 35 రోజుల పాటు ఎక్స్టెండెడ్ వ్యాలిడిటీని అందిస్తూ రూ.289 ధరతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ప్లాన్ ప్రయోజనాలు ఎయిర్టెల్ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధిలో అపరిమిత కాలింగ్‌తో పాటు, రోజుకు 300 ఉచిత ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అయితే అధిక డేటా అవసరాలు ఉన్న వినియోగదారులకు ఇది సరైన ఎంపిక కాకపోవచ్చు. ఎందుకంటే మొత్తం చెల్లుబాటు వ్యవధికి 4GB డేటా మాత్రమే ఈ ప్లాన్‌పై లభిస్తుంది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాలలో మార్కెట్లు.. టాప్ లూజర్స్‌లో ఎయిర్టెల్ ఇంకా..
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ బెంచ్ మార్క్ స్టాక్ సూచీలు బుధవారం నష్టాలను కాస్త పెంచుకున్నాయి. ట్రేడింగ్ సెషన్ ప్రారంభ సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 284.38 పాయింట్లు లేదా 0.38 శాతం నష్టంతో 73,619.52 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90.45 పాయింట్లు లేదా 0.40 శాతం క్షీణతతో 22,362.85 వద్ద కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న విస్తరణలో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.32,400 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించిన తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 2 శాతం లాభపడింది. మరోవైపు భారతీ ఎయిర్టెల్, నెస్లే, సన్ ఫార్మా, కొన్ని సెలెక్టెడ్ బ్యాంకులు అత్యధికంగా నష్టపోయాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్‌స్కైబర్లు
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సబ్‌స్కైబర్లతో దూసుకుపోతుంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు. జనవరిలో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్‌టెల్‌కు 1.18 లక్షల మంది చేరారు. వోడాఐడియా 44,649 మంది, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి. జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియోలో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్‌టెల్‌లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లను కోల్పోయాయి. ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది. -
ఎయిటెల్ బాస్ సునీల్ మిట్టల్‌కు నైట్ హుడ్ అవార్డ్!
భారతీ ఎంటర్ ప్రైజెస్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అరుదైన ఘనతను సాధించారు. భారత్-యూకేల మధ్య స్నేహపూర్వక వ్యాపార సంబంధాలను కొనసాగిస్తున్నందుకు గాను కింగ్ చార్లెస్ 3 నుంచి అత్యంత ప్రతిష్మాత్మక నైట్ హుడ్ అవార్డ్‌ను పొందారు. కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE) పేరుతో బ్రిటన్ ప్రభుత్వం అందించే అవార్డ్‌లలో ఇది ఒకటి. ఈ అవార్డ్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా మిట్టల్ పేరు సంపాదించారు. ఈ సందర్భంగా మిట్టల్ మాట్లాడుతూ “కింగ్ చార్లెస్ నుండి అరుదైన పురస్కారం పొందడంపై సంతోషంగా ఉంది. యూకే-భారత్‌లు చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి. భారత్-యూకేల మధ్య ఆర్థిక ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను’ అని మిట్టల్ అన్నారు. -
ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్ ప్లాన్లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు ఉంటేనే ఫ్లైట్‌లో ఉన్నంత సేపూ కాలింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్‌లో ఉన్నప్పుడు యూజర్లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. జియో రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు -
జియో, ఎయిర్టెల్ కొత్త రీచార్జ్.. ప్లాన్ ఒక్కటే! మరి బెనిఫిట్లు..
దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ( Jio ), భారతీ ఎయిర్టెల్ ( Airtel ) రెండూ ఒకే రకమైన కొత్త రీచ్చార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు ప్లాన్లతో కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జియో రూ.666 ప్లాన్ ➥ 84 రోజుల వ్యాలిడిటీ ➥ 84 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్ ➥ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులకు 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు. ➥ రోజుకు 100 SMS ➥ జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్స్క్రిప్షన్లు ఎయిర్టెల్ రూ.666 ప్లాన్ ➥ మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. ➥ 77 రోజుల వరకు వ్యాలిడిటీ ➥ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్స్క్రిప్షన్ ➥ వింక్ మ్యూజిక్‌తోపాటు హలో ట్యూన్స్‌కి ఉచిత సబ్స్క్రిప్షన్ ఈ ప్లాన్‌లో రెండు కంపెనీలు తమ కస్టమర్లకు అపరిమిత 5G డేటాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. రెండు టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రీఛార్జ్ ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. -
ఎయిర్టెల్ నెత్తిన పాలు పోసిన పేటీఎం!
గత కొద్ది రోజులు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు యూజర్ల తాకిడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లు తెరవడం, ఫాస్టాగ్ వంటి ఆఫర్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే కొత్త కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందని సీఈఓ అనుబ్రత బిస్వాస్ తెలిపారు. అయితే, మరో పేమెంట్ బ్యాంక్ పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలతోనే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు యూజర్లు క్యూకట్టారా? లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ల స్వీకరణ, ఫాస్టాగ్ కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆర్బీఐ పేటీఎంను ఆదేశించింది. అయితే, ఇది ఆర్బీఐ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెగ్యులేటరీ నిబంధనల్ని పేటీఎం పాటించకపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 5 నుంచి 7 రెట్లు పెరిగిన యూజర్లు అదే సమయంలో పేటీఎం యూజర్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఫలితంగా లావాదేవీలు సంఖ్య పెరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్స్, యూపీఐ, ఫాస్టాగ్‌తో పాటు ఇతర సర్వీసుల్ని వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య జనవరి నుంచి 5-7 రెట్లు ఎక్కువ చేరిందని సీఈఓ బిశ్వావ్ తెలిపారు. 59మిలియన్లకు పెరిగి ఇదిలా ఉండగా,ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిసెంబరు 2023 త్రైమాసికంలో రూ. 469 కోట్ల ఆదాయంలో వృద్ధిని కనబరించింది. దీంతో ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి నికర లాభం రూ.11 కోట్లకు చేరిందని పేర్కొంది. సంవత్సరం క్రితంతో పోలిస్తే ఈ మొత్తం 120 వృద్దిని నమోదు చేసింది. బ్యాంక్ నెలవారీ లావాదేవీలు జరిపే యూజర్లు 59 మిలియన్లకు పెరిగారు. భారీ స్థాయిలో డిపాజిట్లు చేశారు. ఇది త్రైమాసికంలో సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.2,339 కోట్లకు చేరుకుంది. అంతకంతకూ ఎయిర్టెల్ ఆదాయం బ్యాంక్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ రూ. 2,62,800 కోట్లకు చేరింది. ఇక డెబిట్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో సహా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇతర సేవల వల్ల.. కస్టమర్ల నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకున్నందుకు గాను ఎయిర్టెల్ ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్?
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. ఎయిర్టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్.. ఎయిర్టెల్, జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్, జియోలు యూజర్లకు శుభవార్త చెప్పాయి. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా ప్రీపెయిడ్ ప్లాన్ బండిల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.. ఈ ఏడాది ప్రారంభంలో జియో సైతం ఈ తరహా రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు అందించగా.. ఎయిర్టెల్ తాజాగా సబ్స్క్రిప్షన్ బండిల్స్‌ను ప్రారంభించింది. ఎయిర్టెల్, జియోలు దేశంలో 5జీ సేవల్ని అందిస్తున్నాయి. అయితే కస్టమర్ల కోసం ఈ రెండు సంస్థలు కలిసి నెట్‌ఫ్లిక్స్ బండిల్స్‌తో పాటు అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుండగా.. వాటిల్లో నెట్‌ఫ్లిక్స్‌ని ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించాయి. ఇక ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ల విషయానికొస్తే..84 రోజుల వ్యాలిడిటీతో రూ.1499 విలువైన ప్లాన్‌లో ప్రతి రోజు 3జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. 5జీ సేవలున్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న ప్లాన్‌ను ఉపయోగిస్తే 5జీ కంటే ఎక్కువ డేటా పొందవచ్చు. కొత్తగా విడుదల చేసిన ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ సైతం వినియోగించుకోవచ్చు. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్, టీవీ ఇలా ఏదైనా ఒక డివైజ్‌లో ఓటీటీ సేవల్ని పొందొచ్చు. ఉచితంగా ఎయిర్టెల్ హలోట్యూన్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. మరోవైపు జియో అందిస్తున్న రెండు ప్లాన్లలో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించవచ్చు. అందులో ఒక ప్లాన్ ఖరీదు రూ.1,099 ఉండగా ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. మరో ప్లాన్ రూ.1,499లో ప్రతి రోజు 3జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ రెండు జియో ప్లాన్లలో ముందుగా చర్చించిన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్టెల్ ప్లాన్ మాదిరిగానే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా ఒక్కొక్కటి 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. జియో ప్లాన్లు రోజువారీ డేటా ప్యాక్‌తో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది. -
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి. ► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది. ► జియో రూ.758 ప్లాన్‌లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్రి్కప్షన్ ఉచితం. ► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఉంటుంది. ► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్్రస్కిప్షన్తో వస్తుంది. ► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్‌లో ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా లభిస్తుంది. ► భారతీ ఎయిర్టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్‌ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ డేటా ఆప్షన్‌తో రూ.99 ప్లాన్‌ను ఆవిష్కరించింది. -
ICC పురుషుల ప్రపంచ కప్ 2023: ఫ్యాన్స్‌కు ఎయిర్టెల్ గుడ్ న్యూస్
ICC పురుషుల ప్రపంచ కప్ 2023 మెగా టోన్నీ షురూ కావడంతో క్రికెట్ ఫీవర్ ఊపందుకుంది ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం ప్రొవైడర్ ఎయిర్టెల్ రంగంలోకి దిగింది. తన కస్టమర్ల కోసం రెండు అపరిమిత డేటా ప్లాన్లను ప్రకటించింది. 2 రోజులకు డేటా అవసరాలకోసం రూ.99, ఒక రోజు చెల్లుబాటయ్యేలా రూ.49 ల ప్యాక్‌ను లాంచ్ చేసింది. (గుడ్ న్యూస్: కార్ల కొనుగోలుపై మారుతి సుజుకి ఆఫర్లు) ఈ మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అలాగే ఈ నెల 14న జరిగే భారత్-పాక్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈక్రమంలోనే ప్రీపెయిడ్ డేటా ప్యాక్ లను ప్రకటించింది. (గ్లాస్ సీలింగ్ బ్రేక్స్:ఈ మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిస్తే ఫిదా) రూ.49, రూ.99 డేటా ప్యాక్స్ ICC వరల్డ్ కప్ 2023ను ఎంజాయ్ చేయాలనుకునే క్రికెట్ ఔత్సాహికుల కోసం రెండు ప్రత్యేకమైన డేటా ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ డేటా ప్లాన్లు ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి రూ.49తో రీచార్జ్‌పై 6జీబీ డేటా లభిస్తుంది. డేటా వ్యాలిడిటీ ఒక రోజు. అలాగే రూ.99 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులు రెండు రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీంతోపాటు మొబైల్ డేటా ప్లాన్లతో పాటు, ఎయిర్టెల్ డీటీహెచ్ సైతం స్టార్ నెట్ వర్క్ సాయంతో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సెల్‌ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఫోన్ యూజర్లకు సెల్ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్‌లో భాగంగానే వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిందేమీలేదని స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ చేస్తూ స్క్రీన్‌పై మెసేజ్ డిస్ప్లే అయ్యింది. ఈ అలర్ట్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది. కాగా, ఈ మెసేజ్ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్‌లు వచ్చాయి. What is this alert all about? @airtelindia @airtelnews @Airtel_Presence It's like a real high vibration and emergency alarm. pic.twitter.com/dLdohymNxL — Aksh (@aksh2810) September 21, 2023 మొబైల్ ఫోన్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్ రావడం ఇటు హైదరాబాద్‌లోనూ కలకలం సృష్టించింది. ఒక సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ అలారం వచ్చింది. ఒక్కసారిగా వార్నింగ్ సౌండ్ రావడంతో ఏమైందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో అక్కడే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే ఇది టెస్ట్ అలారం అని తెలియడంతో సమావేశాన్ని కొనసాగించారు. -
ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన జియో.. పాపం వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్‌లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్‌టెల్‌కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. -
చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు?
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తా చాటుతోంది. దీంతో మరో సారి భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పనున్నారు. త్వరలో దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం భారత్ నుంచి అనుమతులు తీసుకోనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుంది. అయితే, గతంలో స్టార్‌లింక్ భారత్‌లో శాటిలైట్ సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యింది. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా, సెప్టెంబర్ 20న స్టార్‌లింక్ ప్రతినిధులు భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దేశీయ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్) విభాగం అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే అనుమతులు తీసుకోన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టార్‌లింక్ భారత్‌లో గ్లోబుల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాలిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. స్టార్‌లింక్‌తో పాటు ఎయిర్టెల్ ఇక, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే సంస్థల జాబితాలో స్టార్లింక్తోపాటు ఎయిర్టెల్, జియోలు పోటీ పడుతున్నాయి. ఎయిర్ టెల్ వన్ వెబ్, జియో.. జియో స్పేస్ టెక్నాలజీలు ఉపగ్రహ ఇంటర్నెట్పై పనిచేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ తీసుకున్నాయి. చదవండి👉 భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ.. ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్లలో ఎవరి మాట నెగ్గుతుందో? -
ఎయిర్టెల్ 5జీ వైర్లెస్ వైఫై ప్రారంభం.. జియో కంటే ముందుగా..
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ (Xstream AirFiber) పేరిట ఫిక్స్డ్ వైర్లెస్ 5జీ సర్వీస్‌లను ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది. నెట్వర్క్ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్లెస్ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వైర్‌లెస్‌గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్ అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో 64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్‌వేర్ పరికరాలన్నీ భారత్‌లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది. గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌తో ఫిజికల్ ఫైబర్ నెట్వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు. ఎయిర్టెల్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్ వివరాలు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్‌వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కేవలం రూ.148 చెల్లించి ఎక్స్ ట్రీమ్ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని తెలిపింది. తద్వారా యూజర్లు 15 ఓటీటీలను వీక్షించే అవకాశం కలగనుందని వెల్లడించింది. . అంతేకాదు రూ.148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ ఎంపిక చేసుకున్న కస్టమర్లు సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్ నౌ,హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే తో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభిస్తుంది. అయితే, దీంతో పాటు రూ.149 రీఛార్జ్‌తో కూడా 28 రోజులపాటు ఈ ఓటీటీల సదుపాయాన్ని వినియోగించవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో 15 కంటే ఎక్కువ ఓవర్-ది-టాప్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వీటిలో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 359, రూ. 399, రూ. 499, రూ. 699, రూ. 839, రూ. 999. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల డేటా, అపరిమిత టాక్ టైమ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. -
జియోకి పోటీగా ఎయిర్టెల్, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్..
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్టెల్, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్‌టెల్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్‌ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా పోకో సీ51 ను అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5,999కే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ♦ పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్,120 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, స్మూత్ అండ్ రెస్పాన్సీవ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, ♦ మూమెమ్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ♦ పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియా జీ 36 ఎస్‌ఓఎస్‌తో వస్తుంది. ♦ యాప్స్, మీడియా, ఫైల్స్ స్టోరేజ్‌కోసం 4జీబీ ఇంటర్నల్ స్టోర్‌జ్‌ను అందిస్తుంది. ♦ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్‌జెడ్ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ♦ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్టెల్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్‌ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు లాక్ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్ అన్లిమిటెడ్ ప్లాన్‌తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్వర్క్ సిమ్‌ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్టెల్ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. జియో ఫోన్ ఎంతంటే? ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్ V2ని రిలయన్స్ విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్డీ కార్డ్‌తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది. చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్! -
జియో దెబ్బకు నష్టాల్లోకి వోడాఫోన్! ఏకంగా..
Reliance Jio: ఏప్రిల్ 2023లో టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో తన ఆధిపత్య స్థానాన్ని నిలుపుకోవడంలో 'రిలయన్స్ జియో' (Reliance Jio) ముందు వరుసలో నిలిచినట్లు 'టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రిలయన్స్ జియో 2023 ఏప్రిల్ నెలలో కొత్తగా 3.04 మిలియన్ల సబ్స్క్రైబర్లను పొందగలిగింది. ఇదే సమయంలో భారతి ఎయిర్టెల్ (Bharti Airtel) 76,328 మంది వినియోగదారులను పొందినట్లు తెలిసింది. వోడాఫోన్ ఏకంగా 2.99 మిలియన్ల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. కాగా మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య మార్చి 2023లో 1,143.93 మిలియన్ల నుంచి ఏప్రిల్ 2023లో 1,143.13 మిలియన్లకు తగ్గింది. దీని ప్రకారం నెలవారీ క్షీణత రేటు 0.07 శాతం. ఈ విషయంలో పట్టణ ప్రాంతాల వారి కంటే గ్రామీణ ప్రాంతాల్లో సంఖ్య పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్.. మిస్ చేసుకుంటే మళ్ళీ రాదేమో!) టెలికామ్ రంగంలో ప్రైవేట్ హవా కొనసాగుతోందని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు 90 శాతం వాటా వీరిదే ఉందని తెలుస్తోంది. ఒక్క రిలయన్స్ జియో వాటా 37.9 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఎయిర్టెల్ 32.4 శాతం, వోడాఫోన్ 20.4 శాతంలో వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్ (BSNL), ఎమ్టీఎన్ఎల్ (MTNL) వాటా కేవలం 9.2 శాతం కావడం గమనార్హం. రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో మరింత తగ్గిపోయే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
ఎరిటేల్ బంపెరాఫెర్ 15 ఓటీటీ చానెల్స్ ఫ్రీ
-
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత ఇంటర్నెట్ నుండి 5జీ డేటా యాక్సెస్, ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్ల వరకు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అయితే, తాజాగా ఎయిర్టెల్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించేలా కొత్త రీఛార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. మీ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లోనే మీకు కావాల్సినట్లుగా ఎయిర్టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు 15 రకాల ఇతర ఓటీటీ ఛానెల్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్టెల్ ప్లాన్లు ఇలా ఉన్నాయి. రూ. 359 ప్లాన్: ఈ ప్లాన్‌తో ఎయిర్టెల్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు. నెలరోజుల పాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు అపోలో 24/7, హలెట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే వంటి అనేక అదనపు ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సోనీ లీవ్,ఏరోస్ నౌ, లైన్స్ గేట్ప్లేతో పాటు 15 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వీక్షించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు 5జీ ఇంటర్నెట్ డేటాను వినియోగించుకోవచ్చు. రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 3జీబీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలు పొందవచ్చు. 15+ ఓటీటీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేకి ఉచిత యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 499 ప్లాన్: 5జీ ప్రయోజనాలతో రూ. 399 ప్లాన్‌తో పోలిస్తే ఎయిర్టెల్ ఈ ప్లాన్‌కు దాదాపు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. రూ. 699 ప్లాన్: మీరు ఒక నెల కంటే ఎక్కువ వ్యాలిడీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీ కోసమే. 56 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ డేటా 3జీబీ, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను సెండ్ చేసుకోవచ్చు. చదవండి👉 కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే? -
స్పెక్ట్రం కేటాయింపులు.. వ్యతిరేకించిన ఎయిర్టెల్!
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు ఉపయోగించే స్పెక్ట్రం కేటాయింపు విషయంలో టెలికం సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వేలం మార్గంలో కేటాయించాలని రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) సూచించగా, భారతీ ఎయిర్టెల్ మాత్రం వ్యతిరేకించింది. స్పెక్ట్రం కేటాయింపులకు వేలం పారదర్శక విధానం కాగలదని జియో అభిప్రాయపడింది. దీనివల్ల ఎటువంటి టెక్నాలజీని వాడాలనేది సర్వీస్ ప్రొవైడర్లు నిర్ణయించుకునేందుకు కూడా వీలవుతుందని పేర్కొంది. 2012 నాటి సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పెక్ట్రంను పారదర్శకంగా వేలం వేయాలని వీఐఎల్ తెలిపింది. అయితే, అంతర్జాతీయ సంస్థలతో పోలిస్తే దేశీ సంస్థలకు ఈ విధానం ప్రతికూలంగా ఉంటుందని ఎయిర్టెల్ పేర్కొంది. శాట్‌కామ్ స్పెక్ట్రం కేటాయింపులపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ రూపొందించిన చర్చాపత్రంపై టెల్కోలు, పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలను తెలియజేశాయి. -
అంత సీన్ లేదు! బీఎస్ఎన్ఎల్ కూడా ఉంటుంది..
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ఒకటి, రెండు సంస్థల గుత్తాధిపత్యానికి అవకాశం లేదని ఆ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ స్థిరమైన కంపెనీగా అవతరించనుందని చెప్పారు. వొడాఫోన్ ఐడియా సంస్థ కస్టమర్లను కోల్పోతూ, ఆర్థికంగా బలహీనపడుతుండడంతో, టెలికం రంగం ఇక ద్విఛత్రాధిపత్యం (డ్యుయోపలీ) కిందకు వెళుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో మంత్రి స్పందించారు. ఈ ఆందోళలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం టెలికం మార్కెట్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతోపాటు, ప్రభుత్వరంగం నుంచి బీఎస్ఎన్ఎల్ ఉన్న విషయం తెలిసిందే. నిర్వహణ పరంగా బీఎస్ఎన్ఎల్ నిలదొక్కుకుంటున్నట్టు మంత్రి వైష్ణవ్ చెప్పారు. ‘‘బీఎస్ఎన్ఎల్ నిర్వహణ లాభాలను ప్రస్తుతం ఆర్జిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ది టర్న్అరౌండ్ స్టోరీ (పరిస్థితి మారిపోవడం). బీఎస్ఎన్ఎల్ భారత 4జీ, 5జీ టెక్నాలజీని వినియోగించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే తరహా సాంకేతిక పరిజ్ఞానాల కంటే మెరుగైనవి’’అని మంత్రి వివరించారు. నాలుగు సంస్థలు వర్ధిల్లుతాయా లేక మూడు రాణిస్తూ, ఒకటి సమస్యలను ఎదుర్కొంటుందా? అన్న ప్రశ్నకు మార్కెట్ నిర్ణయిస్తుందన్నారు. సరైన ఏర్పాట్లు, వసతులు ఉంటే వచ్చే ఐదేళ్లలో భారత్ అతిపెద్ద సెమీ కండక్టర్ తయారీ కేంద్రంగా అవతరిస్తుందంటూ, ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు రూ.76,000 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
ఇలా అయితే వొడాఫోన్ ఐడియా కథ కంచికే..
భారతదేశంలో అతి పెద్ద టెలికం సంస్థలైన రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్(Airtel) గత మార్చి నెలలో భారీ సంఖ్యలో కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రమే రోజు రోజుకి తన యూజర్లను కోల్పోతూనే ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 మార్చి నెలలో రిలయన్స్ జియోకు 30.5లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు యాడ్ అయ్యారు. దీంతో జియో యూజర్ల సంఖ్య ఏకంగా 43 కోట్లు దాటింది. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 42.71 లక్షలుగా నమోదైంది. ఎయిర్టెల్ కూడా మార్చి నెలలో 10.37లక్షల కొత్త సబ్స్క్రైబర్లను పొందింది. ఈ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్యతో మొత్తం యూజర్ల సంఖ్య 37.09 కోట్లకు చేరింది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 36.98 కోట్లుగా ఉండేది. ఈ రెండు సంస్థలు మార్చిలో మంచి వృద్ధిని నమోదు చేసుకోగలిగాయి. ఇక వొడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ సంస్థ యూజర్లు క్రమంగా తగ్గుతున్నారు. ఈ ఏడాది మార్చిలో 12.12 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియా సబ్స్కైబర్ల సంఖ్య 23.67 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరిలో ఈ సంఖ్య 23.79 కోట్లుగా ఉండేది. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి.. ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్!) మరింత మంచి వృద్ధిని పెంచుకోవడానికి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించడానికి జియో, ఎయిర్టెల్ రెండూ 5జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. అంతే కాకుండా రూ.239 అంతకన్నా ఎక్కువ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు 5జీ ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‌వర్క్‌పై ఉచితంగా అన్లిమిడెట్ డేటా అందిస్తున్నాయి. (ఇదీ చదవండి: మళ్ళీ ఇండియాకు రానున్న చైనా బ్రాండ్ ఇదే - ఇషా అంబానీ అంటే మినిమమ్ ఉంటది!) జియో, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పరుగులు పెడుతుంటే వొడాఫోన్ ఐడియా మాత్రం ఇంకా 5జీ నెట్వర్క్ లాంచ్ చేయనేలేదు. 5జీ నెట్వర్క్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. పైగా ఉన్న యూజర్లను కూడా కంపెనీ కోల్పోతోంది. ఇవన్నీ రానున్న రోజుల్లో వొడాఫోన్ ఐడియాకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. -
వొడాఫోన్ ఐడియాకి భారీ షాక్!
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా భారీ షాక్ తగిలింది. ఫిబ్రవరి నెలలో వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది వినియోగదారులను చేజార్చుకున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాలను రిలీజ్ చేసింది. అదే నెలలో జియోలోకి 10 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 9,82,554 మంది చేరినట్లు తెలిపింది. ఇక సబ్స్క్రైబర్ల పరంగా జియో 37.41శాతం వాటా కలిగి ఉండగా ఎయిర్ 32.39శాతం వాటాతో రెండవ స్థానంలో ఉంది. 10లక్షల మంది కస్టమర్లను కోల్పోయినప్పటికీ వొడాఫోన్ ఐడియాకు మార్కెట్లో 20శాతం ఉంది. కాగా, టెలికాం విభాగంలో వొడాఫోన్ ఐడియా వెనకంజలో ఉండటమే కారణమని సమాచారం. ముఖ్యంగా ఆ సంస్థను అప్పులు బిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ కంపెనీకి రూ.2.2లక్షల కోట్ల వరకు అప్పులు ఉండగా, ఏజీఆర్ బకాయిల కింద దాదాపు రూ.16వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఈక్విటీ కింద మార్చుకుంది. టెలికాం నెట్ వర్క్‌లైన జియో, ఎయిర్టెల్ 5జీ సేవల్ని అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియాలు మాత్రం లేటెస్ట్ నెట్‌వర్క్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెరసీ యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. -
ఎయిర్టెల్ నెట్వర్క్ తగ్గడానికి కారణం ఇదే.. సీఈవో గోపాల్ విఠల్
ముంబై: వేగవంతమైన టెలికం నెట్‌వర్క్‌ను సమర్ధంగా వినియోగించుకోగలిగే సర్వీసులు లేకపోవడం వల్లే 5జీ నెట్వర్క్ ప్రయోజనాలు దేశీయంగా పూర్తి స్థాయిలో లభించడం లేదని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. ఫలితంగా స్ప్రెడ్‌షీట్ లేదా వర్డ్ డాక్యుమెంటును ఉపయోగించే యూజర్లకు 4జీ, 5జీ సర్వీసుల మధ్య వ్యత్యాసం తెలియకుండా పోతోందని వ్యాఖ్యానించారు. 5జీ లాంటి ఆధునిక టెక్నాలజీ నుంచి అపరిమిత ప్రయోజనాలు పొందడానికి అవకాశమున్నా తిరోగమన నియంత్రణ విధానాల వల్ల పరిమిత స్థాయిలోనే లభ్యమవుతున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఫ్రేమ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విఠల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 1.5 లక్షల పైచిలుకు గ్రామాలు, 7,000 పట్టణాలకు తమ 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కానీ 5జీ నెట్వర్క్ విస్తరిస్తున్న స్థాయిలో దాన్ని ఉపయోగించుకునే సర్వీసులు అందుబాటులో ఉండటం లేదని పేర్కొన్నారు. ఇందుకోసం 5జీ టెక్నాలజీని ఉపయోగించుకునే వ్యవస్థ అంతా సమిష్టిగా పని చేయాల్సి ఉంటుందని విఠల్ వివరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులకు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై నడుస్తున్న అనుభూతిని అందించడం, ఓ సర్జన్‌కు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో తోడ్పాటు అందించడం వంటి మార్గాల్లో 5జీతో ఒనగూరే ప్రయోజనాలను సోదాహరణంగా తాము చూపించామని ఆయన చెప్పారు. కానీ క్షేత్ర స్థాయిలో మార్పులు జరుగుతున్నంత వేగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసులు, వినోద రంగాలు ముందుకు పరుగెత్తడం లేదని వ్యాఖ్యానించారు. -
కేంద్రం కొత్త రూల్స్.. మే 1 నుంచి అమల్లోకి రానున్న ఫోన్ కాల్స్ నిబంధనలు!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. మే నెల ప్రారంభం నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపింది. దీంతో యూజర్లకు భారీ ఊరట లభించినట్లైంది. ట్రాయ్ ప్రకటనతో ఫోన్ వినియోగదారులు ఫేక్, ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ల బారి నుంచి ఉపశమనం పొందనున్నారు. ఇందుకోసం ట్రాయ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోనుంది. తద్వారా యూజర్లను అస్తమానం చికాకు పెట్టించే కాల్స్, మెసేజ్‌ల బెడద తప్పనుంది. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు ఇక స్పామ్ కాల్స్ బెడద నుంచి యూజర్లను రక్షించేలా టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ టెల్, జియో, వివో వంటి సంస్థలు తప్పనిసరిగా ఏఐ ఫిల్టర్‌ను వినియోగించాలని ఆదేశించింది. దీని ద్వారా, ఫోన్లలోని ప్రమోషనల్ కాల్స్ ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి బయటపడొచ్చు. ట్రాయ్ ఆదేశాలు.. ఎయిర్టెల్ , జియో అప్రమత్తం ఈ తరుణంలో ట్రాయ్ ఆదేశాలపై జియో, ఎయిర్టెల్ స్పందించాయి. ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే తమ నెట్‌వర్క్‌లలో ఏఐ ఫిల్టర్ ఆప్షన్‌ను ఏనేబుల్ చేస్తామని తెలిపాయి. ఇక,ఈ ఆప్షన్ మే 1 నుంచి వినియోగించుకునే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల్ ఐడీ ఉపయోగం ఏంటంటే? టెక్నాలజీ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవగాహనా రాహిత్యం వల్ల స్పామ్ కాల్స్, మెసేజ్‌ల వల్ల అనార్ధాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాయ్ గత కొంతకాలంగా పనిచేస్తుంది. ముఖ్యంగా సైబర్ నేరస్తులు ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్లతో అమాయకుల బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఈ తరహా సైబర్ మోసాలపై దృష్టి సారించిన ట్రాయ్.. టెలికాం కంపెనీలకు కాల్ ఐడీని అందుబాటులోకి తెచ్చేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కాల్ ఐడీ ఆప్షన్‌తో మనకు ఫోన్ చేసే వారి పేర్లు, ఫోటోలు మొబైల్ ఫోన్లపై డిస్ప్లే కానున్నాయి. ఇలా చేయడం వల్ల మనకు ఫోన్ చేసేది ఎవరనేది ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడొచ్చని రెగ్యులేటరీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ససేమీరా అంటున్న టెలికాం కంపెనీలు కానీ, ప్రైవసీ సమస్య కారణంగా ఎయిర్టెల్, జియో వంటి టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీని తీసుకురావడానికి వెనుకాడుతున్నాయి. అయితే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. వినియోగదారులకు ఇబ్బంది కలిగించే కాల్స్, ఎస్ఎంఎస్లను అరికట్టడానికి ఏఐ ఫిల్టర్ మాత్రమే మే 1 నుండి అమల్లోకి రానుందనేది వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 వైరల్ అవుతున్న లలిత్ మోడీ ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లంటే? -
ఎయిర్ టెల్ 5G అంలిమిటెడ్ డేటా...అదిరిపోయి ప్లాన్
-
ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఈ ఏడాది డిసెంబర్ నెల చివరి నాటికి దేశం మొత్తం 5జీ సేవల్ని అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రణాళికల్లో భాగంగా రాబోయే వారాల్లో దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 300కి చేరుతుంది. ఈ తరుణంలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌లో యూజర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. తద్వారా 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల్లో యూజర్లు నెట్‌వర్క్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఉచితంగా అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్స్ ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో 5జీ అన్ లిమిడెట్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అంతేకాదు 3 నెలల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్, ఎక్స్ట్రీమ్యాప్స్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్ ఇలా అనేక ఆఫర్లు పొందవచ్చు. ఒకవేళ 5జీ లేకపోతే 4జీ యూజర్లు ప్రతిరోజు 3జీబీ డేటాను వినియోగించుకోవచ్చు ఎయిర్టెల్ రూ. 839 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో 5జీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంస్ఎస్లు పంపుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్, వింక్ సబ్‌స్క్రిప్షన్‌ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. 4జీ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తుంది ఎయిర్టెల్ సంస్థ. ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ : ఈ సరికొత్త ప్లాన్‌లో ఎయిర్టెల్ అన్ లిమిటెడ్ 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్లను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. వీటితో పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ బెన్ఫిట్స్ పొందవచ్చు. 4జీ యూజర్లు ప్రతి రోజు 3జీబీ డేటా పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.999ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. 84రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. 4జీ యూజర్లు 2.5 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్